‘‘ఈశ్వరీయ జన్మదిన స్వర్ణిమ కానుక - దివ్యబుద్ధి’’
ఈరోజు విశ్వ రచయిత అయిన తండ్రి ప్రపంచానికి ప్రకాశమునిచ్చే పిల్లలు, తమ కంటి పాపలైన పిల్లలను చూస్తున్నారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు, ప్రపంచానికి వెలుగు అనగా ప్రపంచానికి ప్రకాశం ఇచ్చేవారు. స్థూల ప్రకాశం లేకపోతే ప్రపంచం లేదు. ఎందుకంటే నూర్ అనగా ప్రకాశం. ప్రకాశం లేకపోతే అంధకారం కారణంగా ప్రపంచమే లేదు. ప్రకాశమైన మీరు లేకపోతే ప్రపంచానికి వెలుగే లేదు. మీరు ఉన్నారు కనుక ప్రకాశం కారణంగా ప్రపంచం ఉంది. కావున బాప్‌దాదా ఇటువంటి ప్రపంచానికి వెలుగు అయిన పిల్లలను చూస్తున్నారు. ఇలాంటి పిల్లల మహిమను సదా గానం చేస్తారు, పూజిస్తారు. ఇలాంటి పిల్లలే విశ్వరాజ్య భాగ్యానికి అధికారులుగా అవుతారు. బాప్‌దాదా ప్రతి బ్రాహ్మణ పిల్లలకు జన్మ తీసుకుంటూనే, విశేష జన్మదినోత్సవానికి దివ్యమైన రెండు కానుకలు ఇస్తున్నారు. ప్రపంచంలో మనుష్యాత్మలు మనుష్యాత్మలకు కానుకలు ఇచ్చుకుంటారు. కానీ బ్రాహ్మణ పిల్లలకు ఈ సంగమ యుగంలో స్వయంగా తండ్రియే దివ్యకానుకలను ఇస్తారు. ఏమిస్తారు? ఒకటి దివ్యబుద్ధి, రెండవది దివ్య నేత్రము అనగా ఆత్మిక ప్రకాశము. ఈ రెండు కానుకలు ప్రతి బ్రాహ్మణ పిల్లలకు జన్మదిన కానుకలు. ఈ రెండు కానుకలను సదా తోడుగా ఉంచుకొని వీటి ద్వారా సదా సఫలతా స్వరూపులుగా ఉంటున్నారా? దివ్యబుద్ధియే ప్రతి ఒక్కరినీ దివ్యజ్ఞానం, దివ్య స్మృతి, దివ్య ధారణా స్వరూపంగా తయారు చేస్తుంది. దివ్య బుద్ధియే ధారణ చేసేందుకు విశేషమైన కానుక. కనుక దివ్య బుద్ధి సదా ఉంది అంటే ధారణా స్వరూపంగా ఉన్నారు. దివ్యబుద్ధిలో అనగా సతోప్రధాన బంగారు బుద్ధిలో కొంచెం రజో, తమో గుణం యొక్క ప్రభావం పడినట్లయితే ధారణా స్వరూపానికి బదులు మాయ ప్రభావంలోకి వచ్చేస్తారు. అందువలన సహజంగా ఉన్న ప్రతి విషయాన్ని కష్టంగా అనుభవం చేస్తారు. సహజ కానుక రూపంలో ప్రాప్తించిన దివ్యబుద్ధి బలహీనంగా ఉన్న కారణంగా శ్రమను అనుభవం చేస్తారు. ఎప్పుడైనా శ్రమ లేక కష్టం అనుభవం అవుతున్నట్లయితే దివ్యబుద్ధి తప్పకుండా ఏదో ఒక మాయ రూపంతో ప్రభావితమై ఉండటం వలన ఇలాంటి అనుభవం అవుతుంది. దివ్యబుద్ధి ద్వారా సెకండ్లో బాప్‌దాదా శ్రీమతాన్ని ధారణ చేసి సదా సమర్థంగా, సదా అచలంగా సదా మాస్టర్ సర్వశక్తివంతుని స్థితిని అనుభవం చేస్తారు. శ్రీమతం అనగా శ్రేష్ఠంగా తయారు చేసే మతము. వారు ఎప్పుడూ కష్టంగా అనుభవం చేయజాలరు. శ్రీమతము సదా సహజంగా ఎగిరింపజేసే మతము. కానీ ధారణ చేసే దివ్యబుద్ధి తప్పకుండా కావాలి. కావున తమ జన్మదిన కానుక సదా తోడుగా ఉందా అని పరిశీలించుకోండి. ఎప్పుడైనా మాయ తనదానిగా చేసుకొని కానుక అయిన దివ్యబుద్ధిని ఎప్పుడూ లాక్కోవడం లేదు కదా? పరమాత్మ ఇచ్చిన కానుకను కూడా పోగొట్టుకునే విధంగా మాయ ప్రభావంతో అప్పుడప్పుడు అమాయకులుగా అవ్వడం లేదు కదా? మాయకు కూడా ఈశ్వరీయ కానుకను తనదిగా చేసుకునే నేర్పరితనం వస్తుంది. కావున స్వయం నేర్పరిగా(చతురంగా) అవుతుంది, మిమ్ములను అమాయకులుగా చేసేస్తుంది. అందువలన భోలానాథ్ తండ్రికి భోలా పిల్లలుగా (అమాయక పిల్లలుగా) అవ్వండి కానీ మాయకు అమాయకులుగా అవ్వకండి. మాయ విషయంలో అమాయకులుగా అవ్వడం అనగా మర్చిపోయేవారిగా అవ్వడం. కానుక అయిన ఈశ్వరీయ దివ్యబుద్ధి సదా ఛత్రఛాయగా ఉంటుంది, మాయ తన నీడను వేస్తుంది. ఛత్రము ఎగిరిపోతుంది, నీడ ఉండిపోతుంది. అందువలన తండ్రి ఇచ్చిన కానుక స్థిరంగా ఉందా అని సదా పరిశీలించుకోండి. దివ్య బుద్ధికి గుర్తు ఏమంటే ఈ కానుక(గిప్ట్) లిఫ్ట్‌గా పని చేస్తుంది. ఎవరైతే శ్రేష్ఠ సంకల్పమనే స్విచ్ ఆన్ చేస్తారో వారు ఆ స్థితిలో సెకండ్లో స్థితులవుతారు. దివ్యబుద్ధి మధ్యలో మాయ నీడ ఉన్నట్లయితే ఈ గిఫ్ట్ అనే లిఫ్ట్ పని చేయదు. ఉదాహరణకు, స్థూలమైన లిఫ్ట్ కూడా చెడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? పైకి పోరు, క్రిందికి రారు, మధ్యలో వ్రేలాడ్తారు. షాన్‌లో (గౌరవంలో) ఉండేందుకు బదులు పరేషాన్ అవుతారు, వ్యాకులపడ్తారు. స్విచ్ ఎంతగా ఆన్ చేసినా గమ్యానికి చేరుకునే ప్రాప్తి లభించదు. కావున ఈ గిఫ్ట్ అనే లిఫ్ట్‌ను పాడు చేసుకుంటారు. అందువలన శ్రమ అనే మెట్లు ఎక్కవలసి ఉంటుంది. తర్వాత ఏమంటారు? ధైర్యం అనే కాలు నడవడం లేదు. కావున సహజాన్ని కష్టంగా ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు? మిమ్ములను మీరు నిర్లక్ష్యంగా చేసుకుని మాయ ఛాయలోకి వచ్చారు. అందువలన సెకండ్ యొక్క సహజ విషయాన్ని చాలా సమయం యొక్క శ్రమగా అనుభవం చేస్తారు. దివ్యబుద్ధి అనే కానుక అలౌకిక విమానము. ఈ దివ్య విమానం ద్వారా, సెకండ్లో స్విచ్ ఆన్ చేయగానే ఎక్కడకు కావాలంటే అక్కడకు చేరుకోగలరు. స్విచ్ అనగా సంకల్పము. సైన్సు వారైతే ఒక లోకంలో విహరించగలరు. మీరు మూడు లోకాలలో విహారం చెయ్యగలరు. సెకండ్లో విశ్వకళ్యాణకారి స్వరూపంగా అయ్యి మొత్తం విశ్వానికి లైట్-మైట్ (ప్రకాశం - శక్తి ) ఇవ్వగలరు, కేవలం దివ్యబుద్ధి విమానం ద్వారా ఉన్నత స్థితిలో స్థితులవ్వండి. వారు విమానం ద్వారా హిమాలయ పర్వతంపై బూడిద వేశారు, నదిలో బూడిద వేశారు ఎందుకు? నలువైపులా వ్యాపింప చేసేందుకు కదా! వారైతే బూడిద వేశారు మీరు దివ్యబుద్ధి అనే విమానం ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖర స్థితిలో స్థితమై విశ్వంలోని సర్వాత్మల పట్ల లైట్ మరియు మైట్ల శుభ భావన మరియు శ్రేష్ఠ కామనలనే సహయోగపు అలను వ్యాపింప చెయ్యండి. విమానం అయితే శక్తిశాలిగా ఉంది కదా? కేవలం ఉపయోగించడం రావాలి.
ఈ విమానానికి బాప్‌దాదా ఇచ్చే రిఫైన్ శ్రేష్ఠ మతం అనే సాధనం కావాలి. ఉదాహరణకు, ఈ రోజులలో రిఫైన్కన్నా డబల్ రిఫైన్ నడుస్తుంది కదా! కావున ఇది బాప్‌దాదా ఇచ్చే డబల్ రిఫైన్ సాధనము. కొంచెం మన్మతం, పరమతం అనే చెత్త ఉన్నా ఏమవుతుంది? పైకి వెళ్తారా లేక క్రిందకు వెళ్తారా? కావున ఇది పరిశీలించుకోండి - దివ్య బుద్ధి అనే విమానంలో సదా డబల్ రిఫైన్ సాధనం ఉందా? మధ్యలో ఏదైనా చెత్త అయితే రావడం లేదు కదా? రాకుంటే ఈ విమానం సదా సుఖదాయిగా ఉంటుంది. సత్యయుగంలో ఎప్పుడూ ఏ ప్రమాదాంలు జరగవు ఎందుకంటే అది మీ శ్రేష్ఠ కర్మలకు శ్రేష్ఠమైన ప్రాలబ్ధము. అక్కడ కర్మభోగం లెక్కతో దు:ఖం అనుభవించాల్సి వచ్చే విధంగా ఏ కర్మలు జరగవు. సంగమయుగీ ఈశ్వరీయ కానుక అయిన దివ్యబుద్ధి సదా అన్ని రకాల దు:ఖం మరియు మోసాల నుండి ముక్తంగా ఉంటుంది. దివ్యబుద్ధి కలవారు ఎప్పుడూ మోసపోరు. దు:ఖాన్ని అనుభవించరు. సదా సురక్షితంగా ఉంటారు. ఆపదల నుండి ముక్తులుగా ఉంటారు. అందువలన ఈ ఈశ్వరీయ కానుకకు గల మహత్వాన్ని తెలుసుకొని ఈ కానుకను సదా తోడుగా ఉంచుకోండి. ఈ కానుక యొక్క మహత్వం అర్థమయిందా? కానుక అందరికీ లభించిందా? లేక ఎవరికైనా లభించలేదా? అందరికీ లభించింది కదా! కేవలం సంభాళించడం వస్తుందా లేదా అనేది మీపై ఉంది. సదా అమృతవేళ పరిశీలించుకోండి, కొంచెం లోపం ఉన్నా అమృతవేళలో సరిచేసుకుంటే మొత్తం రోజంతా శక్తిశాలిగా ఉంటుంది. మీరు సరిగ్గా చేసుకోలేకుంటే ఇతరులతో సరిగ్గా చేయించుకోండి. కానీ అమృతవేళలోనే సరి చేసుకోండి. మంచిది. దివ్యదృష్టి గురించి తర్వాత వినిపిస్తాము. దివ్యదృష్టి అనండి దివ్య నేత్రం అనండి ఆత్మిక ప్రకాశం అనండి విషయం ఒక్కటే. ఈ సమయంలో దివ్యబుద్ధి అనే ఈ కానుక అందరి వద్ద ఉంది కదా! బంగారు పాత్రలాగా ఉన్నారు కదా! ఇదే దివ్యబుద్ధి. మధువనానికి అందరూ దివ్యబుద్ధి అనే సంపూర్ణ బంగారు పాత్రను తీసుకొచ్చారు కదా! సత్యమైన బంగారంలో వెండి లేక రాగి మిక్స్ అవ్వలేదు కదా! సతోప్రధానము అనగా సంపూర్ణ బంగారం. దీనినే దివ్యబుద్ధి అని అంటాము. మంచిది - ఎటువైపు నుండి వచ్చినా అన్నివైపుల నుండి జ్ఞాన నదులు వచ్చి సముద్రంలో ఇమిడిపోయాయి. ఇది నది మరియు సముద్రాల కలయిక. ఈ మహాన్ మేళా జరుపుకునేందుకు వచ్చారు కదా! మిలన మేళా జరుపుకునేందుకు వచ్చారు. బాప్‌దాదా కూడా సర్వ జ్ఞాన నదులను చూసి ఎక్కడెక్కడ నుండి ఎంత ఉత్సాహ-ఉల్లాసాలతో ఈ మిలన మేళాకు చేరుకున్నారు అని చూసి సంతోషిస్తున్నారు. అచ్ఛా.
సదా దివ్యబుద్ధి అనే బంగారు కానుకను కార్యములోకి తీసుకొచ్చేవారు, సదా తండ్రి సమానంగా నేర్పరిగా అయ్యి మాయ నేర్పరితనాన్ని తెలుసుకునేవారు, సదా తండ్రి ఛత్రఛాయలో ఉంటూ మాయ ఛాయ (నీడ) నుండి దూరంగా ఉండేవారు, సదా జ్ఞాన సాగరునితో మధుర మిలనం జరుపుకునేవారు, ప్రతి కష్టాన్ని సహజంగా చేసుకునేవారు, విశ్వకళ్యాణకారులకు, శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉండే శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగత మిలనము:-
1. దృష్టి మారడం వలన సృష్టి మారిపోయింది కదా! దృష్టి శ్రేష్ఠంగా అయినందున సృష్టి కూడా శ్రేష్ఠంగా అయ్యింది. ఇప్పుడు సృష్టియే తండ్రి. తండ్రిలో సృష్టి ఇమిడిపోయి ఉందని అనుభవం అవుతుంది కదా! ఎక్కడ చూసినా, విన్నా తండ్రి కూడా తమతో ఉన్న అనుభవం అవుతుంది కదా! ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో తోడు నిభాయించే స్నేహితుడు మొత్తం విశ్వంలో ఎవ్వరూ ఉండరు. లౌకికంలో ఎవరు ఎంత స్నేహితులైనా సదా కలిసి ఉండరు. బాబా అయితే స్వప్నంలో కూడా తోడు ఇస్తారు. ఇలాంటి తోడు నిభాయించే స్నేహితుడు లభించాడు కావున సృష్టి మారిపోయింది. ఇప్పుడు లౌకికంలో కూడా అలౌకికాన్ని అనుభవం చేస్తున్నారు కదా! లౌకికంలో ఏ సంబంధాన్ని చూస్తున్నా సత్యమైన సంబంధం స్వతహాగా స్మృతిలోకి వస్తుంది. దీనితో ఆ ఆత్మలకు కూడా శక్తి లభిస్తుంది. తండ్రి సదా తోడుగా ఉన్నప్పుడు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. బాగవుతుందా లేదా అని ఆలోచించే అవసరం లేదు. తండ్రి తోడుగా ఉంటే అన్నీ మంచిగానే ఉంటాయి కనుక తోడును అనుభవం చేస్తూ ఎగురుతూ వెళ్లండి. ఆలోచించడం కూడా తండ్రి పనే. మన పని తండ్రి జతలో మగ్నమై ఉండడం. అందువలన బలహీన ఆలోచన కూడా సమాప్తి, సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉండండి. ఇప్పుడూ చక్రవర్తులే, సదాకాలం కొరకూ చక్రవర్తులే.
2. సదా స్వయాన్ని సఫలతా నక్షత్రాలుగా భావించండి. ఇతర ఆత్మలకు కూడా సఫలత పొందే తాళంచెవి ఇస్తూ ఉండండి. ఈ సేవతో ఆత్మలందరూ సంతోషించి మీకు హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తారు. తండ్రి ఆశీర్వాదాలు, సర్వుల ఆశీర్వాదాలే మిమ్ములను ముందుకు తీసుకెళ్తాయి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
