‘‘దీపరాజు మరియు దీపరాణుల కథ’’
ఈరోజు సర్వ చైతన్య అవినాశి దీపాలకు యజమాని అయిన దీపరాజు తమ దీపరాణులందరినీ కలిసేందుకు వచ్చారు; ఎందుకంటే మీరందరూ సంగమయుగపు రాణులు, ఒక్క దీపరాజుతో ప్రేమను జోడించినవారు. దీపపు విశేషత దీపం యొక్క జ్యోతిపై ఆధారపడి ఉంటుంది. మీ దీపరాణులందరూ దీపాల రాజుతో లగ్నం జోడించిన శ్రేష్ఠ ఆత్మలు లేదా సీతలందరూ ఒక్క రాముడైన తండ్రికి సదా తోడుగా ఉండే సత్యమైన సీతలు. అందుకే దీపాల యజమాని అయిన దీపరాజుతో పాటుగా, దీపాలైన మీ మహిమ కూడా మాల రూపంలో గాయనం చేయబడుతోంది. కానీ దీపమాల కంటే ముందు, ఒక దీపరాజును పెద్ద దీపంలో వెలిగిస్తారు. ఒక్క దీపం ద్వారా మీరు అనేక దీపాలుగా దేదీప్యమానంగా వెలుగుతారు. కాబట్టి మీ అందరి ఈ స్మృతిచిహ్నమే నేటి వరకు కూడా జరుపుకోబడుతోంది.
దీపమాలను చూసినప్పుడు హృదయంలో ఏమనిపిస్తుంది? దీపమైన నా స్మృతిచిహ్నమే ఇది అనే ఉల్లాసం కలుగుతుందా? కేవలం కాంతిని చూసి సంతోషిస్తున్నారా లేక ఇది నా స్మృతిచిహ్నమే అని భావించి సంతోషం కలుగుతుందా? అందులో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? ఈ మాలలో నేను కూడా ఒక దీపాన్ని అని తెలుసా? ఈ దీపమాలను ‘మాల’ రూపంలో ఎందుకు చూపిస్తారో తెలుసా? ‘దీప దినోత్సవం’ అనరు, ‘దీపమాల దినోత్సవం’ అంటారు; ఎందుకంటే మీ విశేష ఆత్మలందరి సంగఠనకు ఇది స్మృతిచిహ్నం. అనేక దీపాలు సంగఠిత రూపంలో ఉన్నప్పుడే మాల శోభిల్లుతుంది. ఒకటో రెండో దీపాలు వెలిగిస్తే దానిని మాల అనరు కదా. కాబట్టి దీపమాల అనేది అవినాశిగా, అనేకంగా వెలిగిన దీపాల స్మృతిచిహ్నం. కనుక మీ దివసమును మీరు జరుపుకుంటున్నారు. ఒకవైపు చైతన్య దీప రూపంలో ప్రకాశిస్తూ విశ్వానికి దివ్య కాంతిని ప్రసాదిస్తున్నారు, మరొకవైపు మీ స్మృతిచిహ్నాన్ని కూడా చూస్తున్నారు. చూసి చూసి హర్షిస్తున్నారు కదా? దీనిని దీపాల రూపంలో ఎందుకు చూపించారు? ఎందుకంటే ప్రకాశించే ఆత్మలైన మీరు దీపపు జ్యోతిలా కనిపిస్తారు; అందుకే ప్రకాశించే ఆత్మలు, దివ్య జ్యోతికి స్మృతి రూపంగా ఉన్నారు. ఒకవైపు నిరాకార ఆత్మ రూపపు స్మృతిచిహ్నమైతే, మరొకవైపు మీ భవిష్య సాకార దివ్య స్వరూపమైన లక్ష్మీ రూపపు స్మృతిచిహ్నం. ఈ దీపమాలయే దేవతా పదవిని పొందుతుంది. అందుకే నిరాకార మరియు సాకార రెండు రూపాలకూ ఏకకాలపు స్మృతిచిహ్నంగా ఉంది.
కాబట్టి దీపమాల అనేది డబల్ రూపపు స్మృతిచిహ్నం. లక్ష్మి యొక్క స్మృతిచిహ్నం కూడా డబల్ రూపంలో ఉంది: ఒకవైపు ధనదేవత అనగా దాత రూపం సంగమయుగానికి స్మృతిచిహ్నం, వీరు సదా ధనాన్ని ఇస్తూనే ఉంటారు. ఇది సంగమయుగంలో అవినాశి ధనదేవత రూపంలో చిత్రంగా చూపించబడుతుంది. సత్యయుగంలోనైతే తీసుకునేవారే ఉండరు, ఇక ఎవరికి ఇస్తారు? ఇది సంగమయుగపు శ్రేష్ఠ కర్తవ్యానికి గుర్తు. మరియు రెండవవైపు పట్టాభిషేక దినోత్సవ రూపంలో జరుపుకుంటారు. పట్టాభిషేకం అనేది భవిష్యత్తుకు గుర్తు, ధనదేవత అనేది సంగమయుగపు దాత రూపానికి గుర్తు. ఈ రెండు యుగాలనూ కలిపేశారు; ఎందుకంటే సంగమయుగం చాలా చిన్న యుగం. కానీ ఎంత చిన్నదో అంత మహానైనది. సర్వ మహాన్ కర్తవ్యాలు, మహాన్ స్థితి, మహాన్ ప్రాప్తి, మహాన్ అనుభవాలు ఈ చిన్న యుగంలోనే జరుగుతాయి. ఎన్నో ప్రాప్తులు, ఎన్నో అనుభవాలు కలుగుతాయి మరియు సంగమయుగం తర్వాత సత్యయుగం చాలా త్వరగా వచ్చేస్తుంది; అందుకే సంగమయుగం మరియు సత్యయుగాల చిత్రాలను, చరిత్రలను కలిపేశారు. చిత్రం సత్యయుగానిది చూపిస్తే, చరిత్ర సంగమయుగానిది ఇచ్చేస్తారు. ఇదే విధంగా ఈ దీపమాల కూడా డబల్ రూపానికి, డబల్ సమయానికి స్మృతిచిహ్నంగా మారింది. దీపమాలలో ఏ విధులను పాటిస్తారో, ఆ విభిన్న విధులనూ మిక్స్ చేసేశారు. ఒకవైపు తమ పాత ఖాతాలను సమాప్తం చేసి కొత్తవి తయారు చేసుకుంటారు, మరొకవైపు దీపమాలలో కొత్త వస్త్రాలను కూడా విధిపూర్వకంగా ధరిస్తారు. పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవడం మరియు కొత్త ఖాతాను ప్రారంభించడం - ఇది సంగమయుగానికి స్మృతిచిహ్నం. పాతదంతా మరచిపోతారు; కొత్త జన్మ, కొత్త సంబంధం, కొత్త కర్మ - సర్వమూ పరివర్తన చేసుకుంటారు. కొత్త వస్త్రం అనగా కొత్త శరీరం సత్యయుగానికి గుర్తు. సంగమయుగంలో కొత్త శరీరం లభించదు, పాత వస్త్రంలోనే ఉంటారు. కాబట్టి రెండు సమయాల విధులనూ మిక్స్ చేసేశారు. గోల్డెన్ వస్త్రాలు అనగా సతోప్రధాన శరీరాన్ని భవిష్యత్తులో ధరిస్తారు. ఇప్పుడైతే అతుకులు పడిన శరీరాలు. ఆపరేషన్ చేసి కుట్లు వేస్తారు కదా. పెద్ద పెద్ద ఆపరేషన్లలో ఒకవైపు కండను తీసి మరొకవైపు వేస్తారు, అంటే అతుకు వేశారు కదా. కుట్లు పడటం పాతదానికి గుర్తు. కాబట్టి ఇవి అతుకులు పడిన వస్త్రాలు, భవిష్యత్తులో గోల్డెన్ కొత్త వస్త్రం లభిస్తుంది. కనుక ఇది మీరు కొత్త వస్త్రాలు ధరించడానికి స్మృతిచిహ్నం. దేవతా ఆత్మలుగా మారి కొత్త వస్త్రం అనగా బంగారంతో సమానమైన కొత్త శరీరం ధరిస్తారు. నేటి ప్రపంచంలోనైతే ప్రజలు అలా మారలేరు. అందుకే స్మృతి రూపంలో స్థూలమైన కొత్త బట్టలు ధరించి సంతోషిస్తారు. వారైతే ఒక రోజు కొరకు సంతోషాన్ని జరుపుకుంటారు, మరీ ఎక్కువైతే 3 రోజులు జరుపుకుంటారు; కానీ మీరైతే అవినాశిగా జరుపుకుంటున్నారు కదా. ఈ సంగమయుగపు వేడుకను అనేక జన్మలు జరుపుకుంటూనే ఉండేలా జరుపుకుంటారు. సదా ప్రకాశించే దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఇంతకుముందైతే విధిపూర్వకంగా దీపాలు వెలిగించేవారు; తద్వారా సదా దీపం వెలుగుతూనే ఉండాలని, ఆరిపోకూడదని శ్రద్ధ వహించేవారు. నెయ్యి పోసేవారు, విధిపూర్వకంగా ఆహ్వానించే సాధనలో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులుగా బల్బులు వెలిగించేస్తున్నారు. దీపమాల చేయడం లేదు, ఇప్పుడదొక వినోదంగా మారిపోయింది. ఆ ఆహ్వాన విధి లేదా సాధన సమాప్తమైపోయింది. స్నేహం సమసిపోయి ఇప్పుడు కేవలం స్వార్థం మాత్రమే మిగిలింది. ధనం పెరగాలి అనే స్వార్థంతోనే చేస్తారు. భావనతో కాదు, కామనతో చేస్తారు. ఇంతకుముందైనా భావన ఉండేది, ఇప్పుడా భావన కామన రూపంలోకి మారిపోయింది. రహస్యం సమాప్తమైపోయి కేవలం ఆచారాలు మాత్రమే మిగిలాయి. అందుకే యథార్థమైన దాత రూపధారిణి అయిన లక్ష్మి ఎవరి వద్దకూ రావడం లేదు. ధనం వచ్చినా నల్లధనం వస్తోంది. దైవీ ధనం రావట్లేదు, ఆసురీ ధనం వస్తోంది. కానీ మీరందరూ యథార్థ విధి ద్వారా మీ దైవీ తత్వాన్ని ఆహ్వానిస్తూ స్వయంగా దేవతగా మారిపోతున్నారు. కాబట్టి దీపమాల జరుపుకోవడానికి వచ్చారు కదా.
బొంబాయికి అవకాశం లభించింది. బాప్‌దాదా బొంబాయిని సహజంగానే నర్దేసావర్ అంటారు. దీపావళి కూడా ధనదేవతకు స్మృతిచిహ్నమే కదా. జరుపుకోవడం అంటే దేనిని అంటారు, ఏమి చేస్తారు? కేవలం కొవ్వొత్తులు వెలిగించి, కేక్ కట్ చేసి, రాసలీల చేసి, పాటలు పాడటమేనా? ఇది బ్రాహ్మణ జీవితపు జన్మహక్కు - సదా నాట్యం చేయడం-పాడటం, సదా జ్యోతితో జ్యోతిని వెలిగించడం. కానీ సంగమయుగంలో జరుపుకోవడం అనగా బాబా సమానంగా మారడము. అప్పుడే కదా మాలకు సమీపంగా వస్తారు. ఇవి కూడా సంగమయుగపు వినోదాలే. ఎంతైనా జరుపుకోండి, కానీ తండ్రితో మిలనం జరుపుకుంటూ ఈ వేడుకను చేసుకోండి. కేవలం లౌకిక వినోద రూపంలో కాకుండా ‘మన్మనాభవ’ అయి వినోదాన్ని జరుపుకోండి. ఎందుకంటే మీరు అలౌకికులు కదా? కాబట్టి అలౌకిక విధి ద్వారా అలౌకికత యొక్క వినోదం అవినాశిగా మారుతుంది. మీరందరూ సంగమయుగపు దీపమాల విధిని - పాత ఖాతాను సమాప్తం చేయడం, ప్రతి సంకల్పం, ప్రతి క్షణం, ప్రతి కర్మ, ప్రతి పలుకు కొత్తదిగా అనగా అలౌకికంగా ఉండాలి అనే ఈ విధిని ధారణ చేశారు కదా? కొద్దిగా కూడా పాత ఖాతా మిగిలి ఉండకూడదు. అప్పుడప్పుడు బలహీనత వచ్చినప్పుడు ఏమంటారు? కోరుకోవట్లేదు కానీ పాత సంస్కారాలు, పాత స్వభావం లేదా అలవాటు ఉన్నాయి, నెమ్మది నెమ్మదిగా సమాప్తమైపోతాయి - అని ఇలా అంటారు కదా? మరి పాత ఖాతా మళ్ళీ ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పటికీ దాచిపెట్టుకుని భద్రపరిచారా ఏంటి? మూట కట్టి దాచి ఉంచితే దొంగ పడతాడు. పాత ఖాతా అనగా రావణుడి ఖాతా. కొత్త ఖాతా బ్రహ్మా బాబాది లేదా బ్రాహ్మణుల ఖాతా. కొద్దిగా పాత ఖాతా మిగిలి ఉన్నా అది రావణుడి స్వంత వస్తువు. తన వస్తువును అధికారంతో లాక్కుంటాడు. అందుకే మాయా రావణుడు చక్కర్లు కొడుతూ ఉంటాడు. వస్తువే లేకపోతే రావణుడు రానే రాడు.
ఎవరి వద్దనైనా అప్పు ఉంటే ఏమి చేస్తారు? మాటిమాటికీ చక్కర్లు కొడుతూ ఉంటారు, వదిలిపెట్టరు. ఎంత దాటవేయాలని చూసినా అప్పిచ్చినవారు తమ అప్పును తప్పక వసూలు చేసుకుంటారు. ఒకవేళ పాత ఖాతాలోని పాత సంస్కారాలను ఇప్పటికీ సమాప్తం చేసుకోకపోతే అది రావణుడి అప్పు. ఈ అప్పు(కర్జ్)నే జబ్బు (మర్జ్) అంటాము. ‘అప్పులాంటి జబ్బు మరొకటి లేదు’ అని అంటారు కదా. కాబట్టి ఈ రావణుడి అప్పు - పాత సంకల్పాలు, సంస్కార-స్వభావాలు, పాత నడవడికలు - ఈ అప్పు బలహీనులుగా మార్చేస్తుంది. ఆ బలహీనతే జబ్బుగా అనగా వ్యాధిగా మారిపోతుంది. అందుకే ‘ఇది పాతది, పరాయిది’ అనే ఒక్క దృఢ సంకల్పంతో ఈ అప్పును ఒక్క సెకనులో సమాప్తం చేయండి. దీనిని కాల్చేయండి. బాణసంచా కాల్చుతారు కదా. ఈ రోజుల్లో బాణసంచాలో బాంబులు తయారుచేస్తారు కదా. అలాగే మీరు దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు బాణసంచాను కాల్చండి; తద్వారా ఈ పాతదంతా సమాప్తమైపోతుంది. లోకం వారు పోగొట్టుకుంటారు, మీరు సంపాదిస్తారు. వారు బాణసంచాలో డబ్బులను పోగొట్టుకుంటారు, మీరు బాణసంచాపై సంపాదిస్తారు. సంపాదించే పందెం (బాజీ) వచ్చు కదా? వారిది బాణసంచా (ఆతిశ్బాజీ), మీది ఎగిరే కళ యొక్క బాజీ. ఇందులో మీరు విజయులవుతున్నారు. కాబట్టి డబల్ లాభాన్ని పొందండి. కాల్చండి, సంపాదించండి కూడా - ఈ విధిని అనుసరించండి. అర్థమైందా!
విధి ద్వారానే సిద్ధి లభిస్తుంది కదా. ఇదొక విధి, రెండవ విధి - దీపమాలలో మూలమూలలా శుభ్రం చేస్తారు. నాలుగు మూలలా శుభ్రపరుస్తారు తప్ప రెండు లేదా మూడు మూలల్లో చేసి వదిలేయరు. ఎందుకంటే స్వచ్ఛతే మహానత. దేవతా పదవిని ఆహ్వానించేందుకు నాలుగు మూలల స్వచ్ఛత ఏమిటి? వారు స్థూలమైన నాలుగు మూలలను శుభ్రపరుస్తారు, మరి మీ స్వచ్ఛత ఏది? ‘పవిత్రత’. నాలుగు రకాల స్వచ్ఛతా (పవిత్రతా) ఉండాలి. ఆ రోజు వినిపించాము కదా. ఈ విధి ద్వారానే దైవీ పదవి ప్రాప్తిస్తుంది. ఒక్క రకమైన స్వచ్ఛత లేకపోయినా శ్రేష్ఠమైన దైవీ పదవి లభించదు; అనగా ఉన్నతోన్నతంగా మారాలనే కోరిక ఏదైతే ఉందో, అది నెరవేరదు. కాబట్టి నాలుగు రకాల స్వచ్ఛత - ఇది రెండవ విధి. ఈ విధిని అనుసరించారా? వినిపించాము కదా - జరుపుకోవడం అనగా బాబా సమానంగా మారడము. బ్రహ్మా బాబాను చూశారు, పాత ఖాతాను సమాప్తం చేశారు కదా; నాలుగు రకాల స్వచ్ఛతనూ ప్రతి కర్మలోనూ చూశారు కదా. బ్రహ్మా బాబా రుజువుగా అయి చూపించారు, అందుకే నంబర్‌వన్ సుపుత్రునిగా మారారు మరియు నంబర్‌వన్ పదవిని పొందారు. కాబట్టి ‘ఫాలో ఫాదర్’ కదా. బ్రహ్మా బాబా సెకనులో సంకల్పం చేశారు, పాత ఖాతా సమాప్తమైపోయింది. అందుకొరకే దీపమాలలో ఈ విధిని అనుసరిస్తారు. దీపమాల రోజున పాత ఖాతాను సమాప్తం చేశారా, సమర్పితమయ్యారా, పాతదంతటినీ స్వాహా చేశారా? దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఏ బాణసంచాను కాల్చారు? ఎగిరే కళ పందెం వేశారా? అందుకే ఈ రోజుకు ఆ స్మృతిచిహ్నం కొనసాగుతూ వస్తోంది. ఈ విధులను అనుసరించడమే దీపావళి జరుపుకోవడము.
మరి దీపావళి జరుపుకున్నారా లేక జరుపుకునేవారిని చూసి సంతోషపడ్డారా? జరుపుకోవడం అనగా ఆ స్వరూపంగా మారడము. బ్రహ్మా బాబా సమానంగా మారడమే దీపావళి జరుపుకోవడము. చూడండి - ఒకవైపు మందుగుండు కాల్చడము, రెండవవైపు దీపాలు వెలిగించడము, మూడవవైపు వేడుక చేసుకోవడం, మిఠాయిలు తినడం, కొత్త బట్టలు ధరించడము మరియు నాల్గవవైపు శుభ్రపరచడము. కాబట్టి కాల్చనూ కావాలి, జరుపుకోనూ కావాలి మరియు శుభ్రపరచనూ కావాలి. నాలుగు వైపులా చేయాలి. చేయడము అనగా కర్మలో చేసి చూపించడము. నాలుగు రకాల దీపమాల అయింది కదా. అంతేతప్ప - చేయడం వచ్చు, జరుపుకోవడం వచ్చు కానీ కాల్చడం రాదు, శుభ్రం చేయడం రాదు అని ఇలా ఉండకూడదు. లేదు. నాలుగు విషయాలలోనూ బాబా సమానంగా మారాలి. దీపావళి అర్థం ఏమిటో తెలిసిందా? అనంతమైన రాజులకే రాజు యొక్క రాణులు మీరు. సత్యయుగంలోనైతే దేవరాణులుగా ఉంటారు, కానీ మీరందరూ పరమాత్మ రాణులు. అందుకే పట్టపురాణులుగా చూపించారు. కేవలం కృష్ణుడనే చిన్న పిల్లవాడికి రాణులను చూపించేశారు. కృష్ణుడిని చిన్నపిల్లవాడి రూపంలో చూపిస్తూ, మళ్ళీ రాణులనూ చూపిస్తూ అంతా మిక్స్ చేసేశారు. మీరు రాజులకే రాజుగా తయారుచేసే తండ్రికి చెందిన రాణులు. రాణులు కూడా మీరే, సీతలు కూడా మీరే; ఇదే ఇక్కడి మాయాజాలం (జాదూ). ఇప్పుడేమో భాయీ-భాయీ అంటారు, కాబట్టి తప్పకుండా తమను భాయీ అనే అంటారు. మళ్ళీ రెండవవైపు అందరూ సీతలే, రాముడు ఎవరూ లేరు అంటారు. ఇదే విశేషం. ఇందులోనే ఆనందం ఉంది. ఇప్పుడే సోదర-సోదరీలుగా మారిపోండి, ఇప్పుడే సీతగా మారిపోండి, ఇప్పుడే ఫరిశ్తాగా మారిపోండి. ఈ ఆత్మిక జాదూ ఎంతో రమణీయమైనది. ఈ జాదూను చూసి కంగారుపడట్లేదు కదా. మీరే స్వయంగా జాదూగర్‌గా మారిపోయారు.
దీపావళి లేదా దీపమాలకు అవినాశి అభినందనలు. లోకం వారైతే ఒక్క రోజు కొరకు ‘హ్యాపీ దివాలీ’ అంటారు; కానీ బాప్‌దాదా అవినాశి హోలీ, హ్యాపీ, హెల్దీ దీపావళి అంటున్నారు. అన్నీ కావాలి కదా. మీరైతే సదా వెలిగిన దీపాలు. ముఖం సదా తీపిగా ఉంటుంది. అన్నింటికంటే పెద్ద మిఠాయి లభిస్తుంది, దానితో సదా ముఖం తీపిగా ఉంటుంది. ఆ మిఠాయి ఏది? ‘బాబా’ అనేదే దిల్ఖుష్ మిఠాయి. ఈ మిఠాయిని సదా తింటూనే ఉంటారు. చాలా సహజమైన మిఠాయి, తయారుచేయడం కష్టమేమీ కాదు. మిఠాయీ తిన్నారు, మిలనమూ జరుపుకున్నారు. దేశ-విదేశాల పిల్లలందరూ నేడు ఆకారీ ఫరిశ్తా రూపంలో మధుబన్కు చేరుకున్నారు. అందరి మనస్సు ఇక్కడే ఉంది, శరీరాలు సేవలో ఉన్నాయి. బాప్‌దాదా కేవలం ఈ సభను మాత్రమే చూడటం లేదు; నలువైపులా ఉన్న ఫరిశ్తా రూపధారులైన పిల్లలతో కూడా మిలనం జరుపుకుంటున్నారు. అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అందరి మనస్సులో ఒక్కటే స్మృతి ఇమిడి ఉంది. అందరి ముఖంలోనూ ఈ అవినాశి మిఠాయే ఉంది. దీపాల మాల ఎంత పెద్దదో! నలువైపులా ప్రకాశించే దీపాలు మాల రూపంలో తండ్రి ఎదుట ఉన్నాయి; ప్రతి దీపాన్నీ చూసి బాప్‌దాదా హర్షిస్తూ శుభాకాంక్షలు ఇస్తున్నారు. అర్థమైందా!
నలువైపులా ఉన్న దీపరాణులకు, నలువైపులా ప్రకాశిస్తూ విశ్వానికి అవినాశి కాంతిని అందించే విశేష ఆత్మలకు, నలువైపులా బాప్‌దాదా సమానంగా మారే అనగా దీపమాలను జరుపుకునే సర్వ మహానాత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక అభినందనలు.
మధుబన్ నివాసి సోదర-సోదరీలతో అవ్యక్త బాప్‌దాదా మిలనము:- పాండవుల విశేషత ఏమిటి? పాండవులు యజ్ఞ సేవకు సహయోగులు. యజ్ఞ సేవకు సహయోగులు అనగా సదా సహకారాన్ని పొందేందుకు పాత్రులు. ఎవరు ఎంతగా సత్యమైన హృదయంతో, స్నేహంతో సహకరిస్తారో, అంతగా తండ్రి నుండి పదమా రెట్లు సహకారాన్ని పొందే అధికారిగా మారతారు. తండ్రి సహకారపు లెక్కను సంపూర్ణంగా సమాప్తం చేస్తారు. పెద్ద కార్యాన్ని కూడా సహజం చేయడానికి పర్వతం చిత్రాన్ని చూపిస్తారు కదా (పర్వతానికి వేలుతో ఎత్తడం). పాండవులు విశేష సేవా సహయోగులుగా మారి ఎలాంటి కార్యాన్నయినా సహజంగా చేసేస్తారు. లోకం వారు ఏ కార్యాన్ని కష్టమని భావిస్తారో, దానిని మీరు చాలా సహజంగా ఆటలాగా చేసేస్తారు కదా? సేవగా భావించరు, డ్యూటీగా భావించరు; ఒక ఆత్మిక ఆటగా అనుభవం చేసుకుంటారు. ఆట కొరకు ఎవరిని పిలిచినా కాదనరు మరియు ఎన్నడూ అలసిపోరు కూడా. మరి మీరందరూ కూడా యజ్ఞ సేవలో అలసిపోరు కదా. ఇది ఆత్మిక ఆట, అందుకే అలసట కూడా రాదు. ఒకవేళ చేయకూడదు అనుకున్నా చేయకుండా ఉండలేరు; ఎందుకంటే ఈశ్వరీయ బంధనంలో బంధించబడి ఉన్నారు. ఈ బంధనమే సమీప సంబంధంలోకి తీసుకువచ్చేది. ఎవరు ఎంతగా సేవ చేస్తారో అంతగా సేవకు ఫలితం - సమీప సంబంధంలోకి వస్తారు. ఇక్కడి సేవాధారులు అక్కడ రాజ్య పరివారానికి అధికారులుగా మారతారు. ఇక్కడ ఎంతగా కష్టమైన సేవ చేస్తారో, అక్కడ అంతగా హాయిగా సింహాసనంపై కూర్చుంటారు. ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు అక్కడ పనిచేస్తారు, లెక్క ఉంది కదా. ఒక్కొక్క సెకను, ఒక్కొక్క పనికి లెక్క తండ్రి వద్ద ఉంది. అందుకే ఒక్కొక్క సెకను లెక్క చూసి మరీ సమాప్తం చేస్తారు. లెక్కించి మరీ ఫలితాన్ని ఇస్తారు, అలానే ఇవ్వరు. కానీ పదమా రెట్లు ఇస్తారు. కాబట్టి నేటి సేవాధారులు రేపటి రాజ్యాధికారులుగా మారతారు, మరియు నేటి రాజ్య పాలకులు రేపటి సేవాధారులుగా మారతారు. సేవాభావం సదా ఉన్నతంగా నిలబెడుతుంది. పేరు సేవ, కానీ సేవ చేసేవారు తినేది సదా మేవా (శ్రేష్ఠ ఫలం)! కాబట్టి మేవా తినే సేవాధారులు మీరు, సాధారణ సేవాధారులు కారు. ఒకటి ఇవ్వండి, పదమాలు తీసుకోండి. మరి పాండవుల గాయనం ఉంది! సేవ చేయడంలో చాలా దృఢంగా ఉన్నారు, అందుకే దృఢమైన శరీరాలను చూపిస్తారు. కానీ వాస్తవానికి దృఢమైన హృదయం గలవారు, దృఢమైన మనస్సు కలవారు. ఆ మనస్సును లేదా హృదయాన్ని ఎలా చూపించాలో తెలియక శరీరాన్ని బలంగా చూపించేశారు. సంతోషం అనే ఆహారాన్ని బాగా తింటారు, అందుకే లావుగా చూపిస్తారు.
అక్కయ్యలతో:- మధుబన్ నివాసులు ప్రతి కర్మనూ తండ్రితో కలిసి చేసేవారే కదా? ప్రతి కర్మా మధుబన్‌లో మధుబన్ బాబాతో కలిసి జరిగేంతటి శ్రేష్ఠ భాగ్యం ఇంకెవరికైనా ఉంటుందా? మధుబన్‌లో నలువైపులా తండ్రియే తండ్రి కదా. కాబట్టి మధుబన్ నివాసుల విశేషత - సదా ప్రతి కర్మనూ బాబాతో కలిసి అనుభవం చేసుకునేవారు. ప్రతి కర్మనూ బాబాతో కలిసి చేసేవారి ప్రతి కర్మా శ్రేష్ఠమైనదిగానే ఉంటుంది కదా. కాబట్టి మీరు శ్రేష్ఠ కర్మలు చేసే శ్రేష్ఠ ఆత్మలు. సదా ఇదే అనుభవంలో నడిచేవారిని మధుబన్ నివాసులు అంటారు. ఏ సమయంలోనైతే ఈ అనుభవం ఉండదో అప్పుడు మధుబన్ నివాసిగా లేనట్లే. ఆ సమయంలో మధుబన్‌లో నివసిస్తున్నప్పటికీ మధుబన్ నివాసి కారు; మరియు దూరంగా ఉన్నప్పటికీ ప్రతి కర్మనూ తండ్రితో కలిసి చేసేవారు దూరంగా ఉన్నా మధుబన్ నివాసులే. మధుబన్ వాసులు ప్రతి దివ్య లీల (చరిత్ర) లోనూ తోడుగా నడిచేవారు. భాగవతం మధుబన్ యొక్క స్మృతిచిహ్నం; మధుబన్‌లో తండ్రితో కలిసి ప్రతి చరిత్రలోనూ నడిచినవారి కథయే అది. ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలను చూసి అందరూ సంతోషిస్తారు.
దీపావళి శుభాకాంక్షలు - వీడ్కోలు సమయంలో:- బాప్‌దాదా పిల్లల ఆనందంలో (మౌజ్‌లో) ఆనందాన్ని జరుపుకుంటారు. అందుకే కొవ్వొత్తులు వెలిగించినా లేదా కేక్ కట్ చేసినా, ఏది చేయాలనిపిస్తే అది చేయండి. బ్రాహ్మణుల వంటి ఉత్సవాన్ని దేవతలు కూడా జరుపుకోలేరు; ఎందుకంటే మీరు తండ్రితో కలిసి జరుపుకుంటున్నారు. వారైతే ఆత్మలు ఆత్మలతో కలిసి జరుపుకుంటారు. మరి ఎందుకు ఆనందాన్ని జరుపుకోకూడదు! కేవలం అయోమయంతో (మూంజ్ అయి) వేడుక చేసుకోకండి; ఎలాంటి అయోమయం లేకుండా ఆనందంగా జరుపుకోండి. ఈ సృష్టి రచనే ఆనందం కొరకు ఏర్పడింది. తినండి-తాగండి, ఆనందంగా ఉండండి. ఆనందాల కోసమే వచ్చారు. పుట్టడమే ఆనందం ద్వారా పుట్టారు. జ్ఞానం విన్నారు, జన్మ తీసుకున్నారు. కాబట్టి ఎంతో ఆనందంగా జన్మించారు మరియు ఆనందం కొరకే జన్మించారు. వెళ్ళడం కూడా ఎంతో ఆనందంగా, తండ్రితో కలిసి వెళ్తారు. అందుకే పిల్లలు జరుపుకుంటున్నప్పుడు బాప్‌దాదా ఎంతో సంతోషిస్తారు. మనుషులైతే ఆనందపు రచనలో కూడా అయోమయాన్ని నింపేశారు. ఈ ప్రకృతి ఆనందించేందుకు ఉంది, కానీ మనుష్యాత్మల వైబ్రేషన్లు వాతావరణాన్ని పాడుచేస్తున్నాయి. ఆ వాతావరణ ప్రభావం ప్రకృతిపై పడుతోంది. మరియు ప్రకృతి కూడా అయోమయపరిచే పని చేస్తోంది. వర్షం కూడా కార్యక్రమాన్ని అయోమయంలో పడేసింది కదా. కానీ మీరు అయోమయం చెందలేదు, ఆనందంలోనే ఉన్నారు. మిలనపు ఆనందాన్ని జరుపుకున్నారు కదా. ప్రకృతి తన పట్టుదలలో ఉంది, మీరేమో జరుపుకోవాలనే పట్టుదలలో ఉన్నారు. మీరు జరుపుకుంటున్నారు, అది అయోమయపరచాలని చూస్తోంది. అయోమయపరచనీయండి, అంతమాత్రాన మీరు వెనక్కి తగ్గేవాళ్ళా ఏంటి? కాదు. అంగదుడి వంటివారు. వర్షపు నీరు లేకపోతేనేం, ప్రేమ అనే అమృత ధార ఉంది కదా. అందుకే ఈ భగవంతుని పిల్లలు కూడా తక్కువేమీ కాదు అని ప్రకృతి కూడా గమనిస్తోంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
