‘‘మాత-పిత అయిన బ్రహ్మాకు తన బ్రాహ్మణ పిల్లల పట్ల ఉన్న రెండు శుభమైన ఆశలు’’
ఈరోజు విశ్వంలోని సర్వాత్మల సర్వ ఆశలను పూర్తి చేసే బాప్‌దాదా తమ శుభమైన ఆశలను పూర్తి చేసే ఆత్మిక దీపాలను చూస్తున్నారు. ఎలాగైతే బాబా అందరి శుభమైన ఆశలను పూర్తి చేసేవారో, అలా పిల్లలు కూడా బాబా యొక్క శుభమైన ఆశలను పూర్తి చేసేవారు. తండ్రి పిల్లల ఆశలను పూర్తి చేస్తారు, పిల్లలు తండ్రి ఆశలను పూర్తి చేస్తారు. బాబాకు పిల్లల పట్ల ఉన్నటువంటి శుభమైన ఆశలు ఏమిటో తెలుసు కదా? ప్రతి బ్రాహ్మణాత్మ బాబా ఆశల దీపము వంటివారు. దీపము అనగా సదా వెలిగే జ్యోతి. సదా వెలుగుతూ ఉండే దీపము ప్రియమనిపిస్తుంది. ఒకవేళ మాటిమాటికి రెపరెపలాడే దీపం ఉంటే, అది ఎలా అనిపిస్తుంది? బాబా యొక్క సర్వ ఆశలను పూర్తి చేసేవారిని అనగా సదా వెలుగుతూ ఉండే దీపాలను చూసి బాప్‌దాదా కూడా హర్షిస్తారు.
ఈరోజు బాప్దాదాలు పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నారు. బాప్‌దాదా ఎదురుగా సదా ఎవరు ఉంటారు? పిల్లలే ఉంటారు కదా. కనుక ఆత్మిక సంభాషణ కూడా పిల్లల గురించే చేస్తారు కదా. శివబాబా బ్రహ్మా బాబాను అడిగారు - ‘మీకు పిల్లల పట్ల ఇప్పుడింకా ఏమైనా శుభమైన ఆశలు ఉన్నాయా?’ బ్రహ్మా బాబా అన్నారు - పిల్లలు నంబరువారుగా, తమ శక్తి అనుసారంగా, స్నేహం అనుసారంగా, అటెన్షన్ అనుసారంగా సదా బాబా యొక్క శుభమైన ఆశలను పూర్తి చేయడంలో తప్పకుండా నిమగ్నమై ఉన్నారు. బాబా మా సర్వ ఆశలను పూర్తి చేసినప్పుడు మేము కూడా బాబా యొక్క సర్వ ఆశలను పూర్తి చేసి చూపించాలి అనే ఉల్లాస-ఉత్సాహాలు ప్రతి ఒక్కరి మనసులో తప్పకుండా ఉన్నాయి కానీ చేసి చూపించటంలో నంబరువారుగా ఉంటారు. ఆలోచించడం మరియు చేసి చూపించడంలో తేడా వచ్చేస్తుంది. ఆలోచించడం మరియు చేసి చూపించడంలో సమానంగా ఉన్న పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు కానీ అందరూ అలా లేరు. బాబా ఎలా తయారుచేసారు, బాబా ఏమి ఇచ్చారు అని బాబా స్నేహాన్ని, బాబా ద్వారా లభించిన ప్రాప్తులను, ఏ సమయంలోనైతే స్మృతిలోకి తీసుకొస్తారో, ఆ సమయంలో స్నేహస్వరూపులుగా ఉన్న కారణంగా ‘బాబా ఏదైతే చెప్పారో, అది నేనే చేసి చూపిస్తాను’ అని చాలా ఉల్లాస-ఉత్సాహాలతో ఎగురుతారు కానీ సేవలో లేక సంగఠన యొక్క సంపర్కంలోకి వచ్చినప్పుడు అనగా ప్రాక్టికల్‌గా చేసేందుకు కర్మలోకి వచ్చినప్పుడు, ఒక్కోసారి సంకల్పం మరియు కర్మ సమానమవుతాయి అనగా అవే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి కానీ అప్పుడప్పుడు కర్మలోకి వచ్చినప్పుడు సంగఠనలో సంస్కారాలు, మాయ లేక ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితుల రూపీ పరీక్షలు కష్టాన్ని అనుభవం చేయిస్తాయి. అందుకే, స్నేహం కారణంగా ఉల్లాస-ఉత్సాహాల సంకల్పమేదైతే ఉందో, పరిస్థితుల కారణంగా లేక సంస్కారాల కారణంగా ఆ సంకల్పానికి సంబంధించిన కర్మ చేయడంలో తేడా వచ్చేస్తుంది. ఇక తర్వాత ‘ఒకవేళ ఇలా జరగకుండా ఉండుంటే చాలా బాగుండేది’ అని ఆలోచిస్తారు. ‘అగర్, మగర్ (ఒకవేళ, కానీ)’ అనే చక్రంలోకి వచ్చేస్తారు. ఇలా జరిగి ఉండాల్సింది కానీ అలా జరిగింది, కనుక ఇది జరిగింది - ఈ విధంగా ‘ఒకవేళ, కానీ’ అనే చక్రంలోకి వస్తారు, అందుకే ఉల్లాస-ఉత్సాహాల సంకల్పము మరియు ప్రాక్టికల్ కర్మలో తేడా వస్తుంది.
బ్రహ్మా బాబా విశేషంగా పిల్లల పట్ల ఉన్న రెండు ఆశలను వినిపించారు, ఎందుకంటే బ్రహ్మా బాబా అందరినీ తమతోపాటు తీసుకువెళ్ళాలి కూడా మరియు అందరితోపాటు ఉండాలి కూడా. శివబాబా అయితే తమతోపాటు తీసుకువెళ్తారు కానీ రాజ్యంలో లేక పూర్తి కల్పంలో తోడుగా ఉండరు. వారు (బ్రహ్మా బాబా) సదా తోడుగా ఉండేవారు మరియు వారు (శివబాబా) సాక్షీగా ఉంటూ చూసేవారు. వ్యత్యాసముంది కదా. బ్రహ్మా బాబాకు పిల్లల పట్ల సదా వారిని సమానంగా తయరుచేయాలనే శుభమైన ఆశ ఇమర్జ్ అయి ఉంటుంది. వాస్తవానికి బాప్దాదాలు, ఇరువురికీ బాధ్యత ఉంది కానీ ఎంతైనా సాకారంలో బ్రహ్మా రచయిత కనుక సాకార రచయితకు సాకార రచన పట్ల స్వతహాగానే స్నేహముంటుంది. ఇంతకుముందు కూడా వినిపించాము కదా - పిల్లలు తలిదండ్రులిరువురికి చెందినవారిగా ఉంటారు కానీ తల్లికి పిల్లల పట్ల విశేషమైన స్నేహముంటుంది ఎందుకంటే పాలనకు నిమిత్తంగా తల్లియే అవుతుంది. తండ్రి సమానంగా తయారుచేసేందుకు తల్లి నిమిత్తమవుతుంది, అందుకే తల్లి మమకారం గాయనం చేయబడింది. ఇది శుద్ధమైన మమకారం, మోహంతో లేక వికారాలతో కూడిన మమకారం కాదు. ఎక్కడైతే మోహం ఉంటుందో, అక్కడ ఆందోళన చెందుతారు మరియు ఎక్కడైతే ఆత్మిక మమకారం లేక స్నేహముంటుందో అక్కడ తల్లికి పిల్లల పట్ల నషా ఉంటుంది, ఆందోళన ఉండదు. కనుక బ్రహ్మాను తల్లి అనండి లేక తండ్రి అనండి - రెండు రూపాలలోనూ పిల్లల పట్ల విశేషంగా ఏ ఆశలు పెట్టుకున్నారు? మొదటి ఆశ తండ్రికి సంబంధించి ఉంది, రెండవది బ్రాహ్మణ పరివారానికి సంబంధించిన శుభమైన ఆశ. తండ్రికి సంబంధించిన శుభమైన ఆశ ఏమిటంటే - ఎలాగైతే బాప్‌దాదా సాక్షీగా మరియు సాథీగా (సహచరుడు) కూడా ఉన్నారో, అలా బాప్‌దాదా సమానంగా ‘సాక్షీ మరియు సాథీ’ - ఈ రెండు పాత్రలను సమయమనుసారంగా సదా అభినయించే మహాన్ ఆత్మలుగా అవ్వాలి. కనుక పిల్లల పట్ల ఉన్న శుభమైన ఆశ - బాప్‌దాదా సమానంగా సాక్షీ మరియు సాథీగా అవ్వాలి.
ఒక విషయంలో బాప్దాదాలు ఇరువురు, పిల్లలతో పూర్తిగా సంతుష్టంగా ఉన్నారు, అదేమిటి? పిలల్లు ప్రతి ఒక్కరికీ బాప్‌దాదా పట్ల మంచి స్నేహముంది, బాప్‌దాదా పట్ల ఉన్న స్నేహం ఎప్పుడూ తెగిపోదు మరియు స్నేహమున్న కారణంగానే శక్తిశాలిగా ఉంటూనో లేక యథాశక్తితోనో నడుస్తున్నారు. బ్రాహ్మణాత్మలు ముత్యాల వలె స్నేహమనే దారంలో తప్పకుండా కూర్చబడి ఉన్నారు. స్నేహమనే దారం దృఢంగా ఉంది, దాని నుండి తెగిపోలేరు. స్నేహ మాల అయితే పొడవుగా ఉంది, విజయ మాల చిన్నదిగా ఉంది. బాప్‌దాదా స్నేహానికి పిల్లలు సమర్పితము అయ్యారు కూడా. ఆ స్నేహంపై ఎంతగా బలిహారమయ్యారంటే, ఇక ఎవరెంతగా బాబా స్నేహం నుండి విడదీయాలని అనుకున్నా సరే, దూరమవ్వనే అవ్వలేరు. అందరి హృదయం నుండి స్నేహంతో ‘మేరా బాబా (నా బాబా)’ అనే మాట వెలువడుతుంది. కనుక స్నేహ మాలతోనైతే సంతుష్టంగా ఉన్నారు కానీ బాబా సమానంగా శక్తిశాలిగా ఉండడంలో, ‘ఒకవేళ-కానీ’ అనే చక్రం నుండి అతీతంగా ఉండడంలో సదా శక్తిశాలికి బదులుగా యథాశక్తితో ఉన్నారు. ఈ విషయంలో బాప్‌దాదా, పిల్లలందరినీ బాబా సమానంగా సదా శక్తిశాలిగా తయారుచేయాలనే శుభమైన ఆశ పెట్టుకుంటారు. ఎక్కడైతే సాక్షీగా అవ్వాలో, అక్కడ అప్పుడప్పుడు సాథీగా అవుతారు మరియు ఎక్కడైతే సాథీగా అవ్వాలో, అక్కడ సాక్షీగా అవుతారు. ఈ రెండు రూపాలను సమయమనుసారంగా నిర్వర్తించాలి - దీనిని బాబా సమానంగా అవ్వడమని అంటాము. స్నేహ మాల అయితే తయారుగా ఉంది కానీ విజయమాల కూడా ఇంత పొడవుగా తయారవ్వాలనే శుభమైన ఆశ బాప్‌దాదాకు ఉంది. 108 మందే కాదు, బాప్‌దాదా పూర్తిగా అనుమతినిస్తున్నారు - ఎంతమంది విజయులుగా అవ్వాలనుకున్నా సరే అంత పెద్ద విజయమాల తయారవ్వగలదు. 108 అనే హద్దులోకి కూడా రాకండి. ఉన్నదే 108 మంది కదా, మేమైతే అందులోకి రాలేము అనేమీ కాదు. తయారవ్వండి.
విజయులుగా అయ్యేందుకు ఒక బ్యాలెన్స్ పెట్టాల్సిన అవసరముంది. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ గురించి అయితే సదా వింటూనే ఉంటారు కానీ స్మృతి మరియు సేవలో బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటున్నా సరే ఎందుకుండదు? అర్థమవుతున్నా సరే అది కర్మలోకి ఎందుకు రాదు? దీని కోసం మరొక బ్యాలెన్స్ యొక్క అవసరముంది, ఆ బ్యాలెన్సే బ్రహ్మా బాబాకు గల రెండవ ఆశ. మొదటిది తండ్రికి సంబంధించినది - తండ్రి సమానంగా అవ్వాలనే ఆశ. రెండవ ఆశ పరివారానికి సంబంధించినది - ప్రతి బ్రాహ్మణాత్మ పట్ల కర్మలో సదా శుభభావన, శుభకామనలు ఉండాలి. కేవలం సంకల్పం వరకో లేక కోరుకోవడం వరకో కాదు. చాలామంది ఏమంటారంటే - శుభభావన పెట్టుకోవాలనే కోరిక అయితే ఉంది కానీ అది కర్మలోకి వచ్చేటప్పటికి మారిపోతుంది అని. దీని విస్తారాన్ని ఇంతకుముందు కూడా వినిపించాము. పరివారం పట్ల సదా శుభభావన-శుభకామనలు ఎందుకు ఉండవు, దీనికి కారణమేమిటి? మీకు తండ్రి పట్ల హృదయపూర్వకమైన స్నేహం, గాఢమైన స్నేహం ఉంది. ఆ హృదయపూర్వకమైన స్నేహానికి గుర్తు ఏమిటంటే - అది ఎప్పుడూ తెగిపోదు. బాబా పట్ల అపార్థం కలిగించే మాటలను ఎవరెంతగా మాట్లాడినా సరే లేక ఎవరైనా వచ్చి అలాంటి-ఇలాంటి విషయాలను వినిపించినా సరే లేక సాకారంలో స్వయంగా తండ్రి కూడా పిల్లలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ఏవైనా సూచనలు లేక శిక్షణలు ఇచ్చినా సరే, ఎక్కడైతే స్నేహముంటుందో అక్కడ శిక్షణలు లేక పరివర్తన కోసం ఇచ్చే సూచనలు అపార్థాన్ని కలిగించవు. బాబా ఏమి చెప్తే, అందులో కళ్యాణముంది అనే భావనయే సదా ఉండేది మరియు ఉంటుంది కూడా. దీని వలన స్నేహం ఎప్పుడూ తగ్గిపోలేదు, స్వయాన్ని బాబా హృదయానికి ఇంకా సమీపంగా ఉన్నామని భావించారు. దీనినే హృదయపూర్వకమైన, గాఢమైన స్నేహమని అంటాము. ఈ స్నేహం భావనను పరివర్తన చేసేస్తుంది. బాబా పట్ల స్నేహానికి గుర్తు - సదా బాబా చెప్పారు, మీరు ‘హా జీ (సరేనండీ)’ అని అన్నారు. అలాగే బ్రాహ్మణ పరివారం పట్ల కూడా సదా ఇటువంటి హృదయపూర్వకమైన స్నేహముండాలి, భావనను పరివర్తన చేసే విధి ఉండాలి, అప్పుడే తండ్రి మరియు పరివారం పట్ల స్నేహం యొక్క బ్యాలెన్స్, స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ స్వతహాగానే ప్రాక్టికల్‌గా కనిపిస్తుంది. కనుక తండ్రి పట్ల స్నేహమనే తక్కెడ బరువుగా ఉంది కానీ సర్వ బ్రాహ్మణ పరివారం పట్ల స్నేహం యొక్క తక్కెడ మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బరువుగా, అప్పుడప్పుడు తేలికగా ఉంటుంది. కొందరి పట్ల బరువుగా, కొందరి పట్ల తేలికగా ఉంటుంది. కనుక తండ్రి మరియు పిల్లల పట్ల స్నేహంలో బ్యాలెన్స్ ఉండాలి - ఇదే బ్రహ్మబాబాకు గల రెండవ శుభమైన ఆశ. అర్థమయిందా? ఇందులో బాబా సమానంగా అవ్వండి.
స్నేహం యొక్క శ్రేష్ఠత ఎటువంటిదంటే, ఆ స్నేహాన్ని మీరు ఉంచినా లేక ఇతరులు ఉంచినా, అందులో ఇరువురికి సమానమైన సంతోషం అనుభవమవుతుంది. ఉదాహరణకు బాప్‌దాదా స్థాపన కార్యార్థం నిమిత్తమయ్యారు కానీ పిల్లలను సేవలో సాథీలుగా (సహచరులుగా) చేసారు. అయితే ప్రాక్టికల్‌లో తండ్రి కంటే పిల్లలు ఎక్కువ సేవ చేస్తారు, చేస్తూ ఉన్నారు, కానీ బాప్‌దాదా సదా పిల్లలను సేవలో ముందుకు వెళ్ళడం చూసి ఆ స్నేహం కారణంగా సంతోషంగా ఉన్నారు. సేవలో పిల్లలు ఎందుకు ముందుకు వెళ్ళాలి, నిమిత్తంగా అయితే నేను ఉన్నాను, నేనే వీరిని నిమిత్తం చేసాను అనే సంకల్పం కూడా ఎప్పుడూ హృదయపూర్వకమైన స్నేహంలో ఉత్పన్నమవ్వదు. ఎప్పుడూ స్వప్నమాత్రంగా కూడా ఈ భావన ఉత్పన్నమవ్వలేదు. దీనినే సత్యమైన స్నేహం, నిస్వార్థ స్నేహం, ఆత్మిక స్నేహమని అంటాము. సదా పిల్లలను నిమిత్తం చేసి ముందు ఉంచడంలో హర్షితంగా ఉన్నారు. పిల్లలు చేసినా లేక తండ్రి చేసినా ‘మై పన్ (నేను-నాది)’ అనే భావన ఉండేది కాదు. నా పని, నా డ్యూటీ, నా అధికారము, నా బుద్ధి, నా ప్లాను అనే భావన లేదు. స్నేహము ఈ ‘నేను-నాది’ అనే భావనను తొలగిస్తుంది. మీరు చేసినా నేను చేసినట్లే, నేను చేసినా మీరు చేసినట్లే - ఈ శుభ భావన మరియు శుభ కామనలను హృదయపూర్వకమైన స్నేహమని అంటాము. స్నేహంలో ఎప్పుడూ నాది లేక పరాయిది అని అనిపించదు. స్నేహంలో ఎప్పుడూ స్నేహంతో కూడిన సాధారణ మాటలైనా, అధికారంతో కూడిన మాటలైనా, అవి ఫీలింగ్‌లోకి రానివ్వవు. వీరెందుకిలా అన్నారు అనే ఫీలింగ్ రాదు. స్నేహీలు, స్నేహీ ఆత్మ పట్ల - ‘ఇలా అవుతుందా, ఇది అవుతుందా’ అనే అనుమానాన్ని కలగనివ్వరు. స్నేహీల పట్ల సదా విశ్వాసమున్న కారణంగా వారు మాట వరుసకు అన్నా సరే, వీరు తప్పకుండా ఏదో అర్థంతోనే అన్నారని అనిపిస్తుంది. అర్థం లేనివిగా, వ్యర్థ మాటలుగా అనిపించవు. ఎక్కడైతే స్నేహముంటుందో, అక్కడ విశ్వాసం తప్పకుండా ఉంటుంది. స్నేహం లేకపోతే విశ్వాసం కూడా ఉండదు. కనుక బ్రాహ్మణ పరివారం పట్ల స్నేహం మరియు విశ్వాసం కలిగి ఉండాలి - దీనినే బ్రహ్మా బాబాకు గల రెండవ ఆశను పూర్తి చేయడమని అంటాము. ఎలాగైతే తండ్రి పట్ల ఉన్న స్నేహం కోసం బాప్‌దాదా సర్టిఫికెట్ ఇచ్చారో, అలా బ్రాహ్మణ పరివారం విషయంలో ఏదైతే స్నేహానికి నిర్వచనం వినిపించామో, ఆ విధితో ప్రత్యక్ష కర్మలోకి రావాలి, ఈ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్ ఉండాలి. బాబా పట్ల ఎంత స్నేహం ఉందో, అంత పిల్లల పట్ల కూడా ఉండాలి. ఈ బ్యాలెన్స్ లేని కారణంగా సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు మీరే స్వయంగా ‘సేవలో మాయ వస్తుంది’ అని అంటారు. అంతేకాక, ఎప్పుడైనా వాయుమండలాన్ని చూసి ‘ఇలాంటి సేవ చేసే బదులు స్మృతిలో ఉండడమే మంచిది, అందరినీ సేవ నుండి విడుదల చేసి భట్టీలో కూర్చోబెట్టండి’ అని కూడా అంటారు. మీ వద్ద ఇలాంటి సంకల్పాలు సమయమనుసారంగా ఉంటాయి.
వాస్తవానికి సేవ మాయాజీతులుగా చేసేటువంటిది, మాయను తీసుకువచ్చేది కాదు కానీ సేవలో మాయ ఎందుకు వస్తుంది? దీనికి మూల కారణమేమిటంటే - హృదయపూర్వకమైన స్నేహం లేదు కానీ పరివారమనుసారంగా స్నేహముంది. హృదయపూర్వకమైన స్నేహం త్యాగ భావనను ఉత్పన్నం చేస్తుంది. అది లేని కారణంగా అప్పుడప్పుడు సేవ మాయా రూపంగా అవుతుంది మరియు ఇటువంటి సేవను సేవా ఖాతాలో జమ చెయ్యలేరు. ఎవరైనా 50-60 సెంటర్లు తెరిచేందుకు నిమిత్తమైనా కానీ, ఎంతగా మాయ నుండి ముక్తులుగా, యోగయుక్తులుగా అయి సేవ చేస్తారో, అంతగా సేవా ఖాతాలో లేక బాప్‌దాదా హృదయంలో జమ అవుతుంది. కొందరి వద్ద రెండు సెంటర్లున్నాయి, వారు చూడడానికి రెండు సెంటర్ల ఇంఛార్జ్‌గా కనిపిస్తారు, మరి కొందరు 50 సెంటర్ల ఇంఛార్జ్‌గా కనిపిస్తారు. కానీ ఒకవేళ రెండు సెంటర్లు అయినా సరే, అవి నిర్విఘ్నంగా ఉంటే, మాయ నుండి, అలజడుల నుండి, స్వభావ-సంస్కారాల ఘర్షణ నుండి ముక్తిగా ఉంటే, ఆ రెండు సెంటర్లు కలవారికి, 50 సెంటర్లు ఉన్నవారి కంటే ఎక్కువ సేవా ఖాతా జమ అవుతుంది. నాకు 30 సెంటర్లున్నాయి, 40 సెంటర్లున్నాయి అని సంతోషపడకండి, మాయ నుండి ముక్తిగా ఎన్ని సెంటర్లు ఉన్నాయి? ఒకవైపు సెంటర్లను పెంచుకుంటూ వెళ్తూ, మరోవైపు మాయను కూడా పెంచుకుంటూ వెళ్తే, అటువంటి సేవ బాబా రిజిస్టర్లో జమ అవ్వదు. మేమైతే చాలా సేవ చేస్తున్నాము, రాత్రింబవళ్ళు నిద్ర పోవడం లేదు కూడా, భోజనం కూడా ఒకేసారి తయారుచేసుకొని రాత్రికి కూడా అదే తినేస్తాము - అంత బిజీగా ఉన్నామని మీరు అనుకుంటారు. కానీ సేవతో పాటు మాయలో కూడా బిజీగా ఉండడం లేదు కదా? ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది, వీరెందుకు చేసారు, నేనెందుకు చేయలేదు, నా హక్కు నీ హక్కు..... కానీ బాబా హక్కు ఎక్కడికి వెళ్ళింది? అర్థమయిందా? దేనిలోనైతే స్వయం మరియు సర్వుల సహయోగం, అలాగే సంతుష్టత అనే ఫలం ప్రత్యక్షంగా కనిపిస్తుందో అది సేవ. ఒకవేళ సర్వుల శుభ భావన-శుభ కామనల సహయోగం లేక సంతుష్టత ప్రత్యక్ష ఫల రూపంలో ప్రాప్తించకపోతే, దానికి కారణమేమిటి, ఫలం ఎందుకు లభించలేదు అని చెక్ చేసుకోండి. విధిని చెక్ చేసుకొని ఛేంజ్ చేసుకోండి.
ఇలాంటి సత్యమైన సేవను పెంచడమే సేవను పెంచడము. నేను చాలా బాగా సేవ చేస్తున్నాను అని అనుకుంటూ కేవలం మీ మనసును సంతోషపెట్టుకోవడం కాదు, బాబా హృదయాన్ని సంతోషపరచండి మరియు బ్రాహ్మణ పరివారం నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు తీసుకోండి. దీనినే సత్యమైన సేవ అని అంటాము. చూపించుకునేందుకు చేసే సేవ అయితే చాలా పెద్దదిగానే ఉంటుంది కానీ ఎక్కడైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో, అక్కడ హృదయపూర్వక స్నేహం యొక్క సేవ తప్పకుండా జరుగుతుంది. దీనినే పరివారం పట్ల బ్రహ్మా బాబాకు ఉన్న ఆశను పూర్తి చేయడమని అంటాము. ఇదే ఈ రోజు జరిగిన ఆత్మిక సంభాషణ. మిగిలినది తర్వాత వినిపిస్తాము. ఈ రోజు భారతవాసి పిల్లలకు ఈ సీజన్‌లోని చివరి ఛాన్స్ కనుక బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారనేది వినిపించాము. ఒక విషయంలో పాస్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇప్పుడు రెండవ సర్టిఫికెట్ తీసుకోవాలి. అచ్ఛా. ఇప్పుడు బాబా ఆశల దీపాలు సదా వెలుగుతూ ఉండాలి.
నలువైపులా ఉన్న సర్వ బ్రాహ్మణ కుల దీపకులు, సదా బాప్‌దాదాకు ఉన్న శుభ ఆశలను పూర్తి చేసేవారు, సదా బాబా మరియు పరివారం పట్ల హృదయపూర్వకమైన స్నేహంలో బ్యాలెన్స్ పెట్టేవారు, సదా హృదయపూర్వకమైన సేవ ద్వారా సేవా ఖాతాను ఎక్కువగా జమ చేసుకునేవారు - ఇలాంటి బాబా యొక్క శుభ ఆశల దీపాలకు, సత్యమైన హృదయంతో సేవ చేసే సేవాధారులకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో మిలనము:-
1. సదా మిమ్మల్ని మీరు కల్పం క్రితం నాటి విజయి పాండవులుగా భావిస్తున్నారా? ఎప్పుడు పాండవుల స్మృతి చిత్రాలను చూసినా ఇది మా స్మృతి చిహ్నమే అని అనిపిస్తుందా? పాండవులు అనగా సదా దృఢంగా ఉండేవారు. అందుకనే పాండవుల శరీరాలను పొడవుగా, బలంగా చూపిస్తారు తప్ప ఎన్నడూ బలహీనంగా చూపించరు. ఆత్మలు ధైర్యవంతులు, శక్తిశాలురు; దానికి ప్రతీకగా శరీరాలను శక్తిమంతంగా చూపించారు. పాండవుల విజయం ఎంతో ప్రసిద్ధి చెందినది. కౌరవులు అక్షౌహిణి సేనలు ఉన్నప్పటికీ ఓడిపోయారు, పాండవులు ఐదుగురే ఉన్నప్పటికీ గెలిచారు. ఎందుకు విజయులయ్యారు? ఎందుకంటే పాండవులతో పాటు తండ్రి ఉన్నారు, పాండవులు శక్తిశాలురు, వారి వద్ద ఆధ్యాత్మిక శక్తి ఉంది. అందువల్ల అక్షౌహిణి కౌరవుల శక్తి వారి ముందు ఏపాటిదీ కాదు! ఇలాగే ఉన్నారు కదా? ఎదురుగా ఎవరు వచ్చినా, మాయ ఏ రూపంలో వచ్చినా సరే అది ఓటమి పాలై వెళ్ళిపోవాలి తప్ప గెలవకూడదు. వీరినే విజయి పాండవులు అంటాము. మాతలు కూడా పాండవ సేనలోనే ఉన్నారు కదా? లేక ఇంట్లోనే ఉండేవారా? బలహీనంగా ఉండేవారు ఇంట్లో దాక్కుంటారు, ధైర్యవంతులు మైదానంలోకి వస్తారు. మరి ఎక్కడ ఉంటున్నారు, మైదానంలోనా లేక ఇంట్లోనా? కాబట్టి సదా మేము పాండవ సేనకు చెందిన విజయి పాండవులము అనే ఈ నషాలో ముందుకు సాగుతూ ఉండండి.
2. మిమ్మల్ని మీరు అనంతమైన నిమిత్త సేవాధారులుగా భావిస్తున్నారా? అనంతమైన సేవాధారులు అనగా ఎలాంటి నేను అనే భావము(మైపన్) లేదా నాది అనే భావపు(మేరాపన్) హద్దుల్లోకి వచ్చేవారు కారు. అనంతంలో ‘నేను’ లేదు, ‘నాది’ లేదు. అంతా బాబాదే; నేను కూడా బాబా వాడినే అయినప్పుడు సేవ కూడా బాబాదే. దీనినే అనంతమైన సేవ అంటాము. ఇలాంటి అనంతమైన సేవాధారులేనా లేక హద్దుల్లోకి వచ్చేస్తున్నారా? అనంతమైన సేవాధారులు అనంతమైన రాజ్యాన్ని పొందుతారు. సదా అనంతమైన బాబా, అనంతమైన సేవ మరియు అనంతమైన రాజ్యభాగ్యము - వీటినే స్మృతిలో ఉంచుకుంటే అనంతమైన సంతోషం ఉంటుంది. హద్దు సంతోషం మాయమైపోతుంది, అనంతంలో సదా సంతోషం నిలిచి ఉంటుంది. అచ్ఛా!
వీడ్కోలు సమయంలో:-
ప్రస్తుతం సేవా ప్రణాళికలు (ప్లాన్స్) చాలా మంచివి తయారుచేశారు. వాస్తవానికి సేవ కూడా ఉన్నతికి సాధనమే. సేవను సేవ రీతిలో చేస్తే, ఆ సేవ ముందుకు తీసుకువెళ్ళడానికి లిఫ్ట్ లాగా పనిచేస్తుంది. కేవలం ప్లేన్ బుద్ధి కలవారిగా మారి ప్లాన్స్ తయారుచేయాలి, ఏమాత్రం ఇటు-అటు విషయాలు ఇందులో మిక్స్ కాకూడదు. ఏదైనా ఒక శ్రేష్ఠమైన వస్తువును తయారుచేసి ఉంచినప్పుడు, అటూ-ఇటూ వీచే గాలి వల్ల అందులో కాస్త చెత్త పడితే ఏమైపోతుంది? అందుకే చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు కదా. అలాగే ఇటు-అటు విషయాలేవీ మిక్స్ కాకూడదు. ఇలా సేవా ప్లాన్స్ చాలా మంచివి తయారుచేస్తున్నారు. సేవలో శ్రమ, శ్రమగా అనిపించదు, సంతోషం కలుగుతుంది. ఎందుకంటే లగ్నంతో చేస్తారు, ఉల్లాస-ఉత్సాహాలను కూడా చక్కగా ఉంచుకుంటారు. సేవా ఉత్సాహాన్ని చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు. వ్యర్థాలు మిక్స్ కాకుండా ఉంటే ఇప్పటివరకు ఎంత సమయంలో సేవ జరిగిందో, అంతకు 4 రెట్లు జరగగలదు. ప్లేన్ బుద్ధి అనేది తీవ్రగతితో సేవను ప్రత్యక్షంగా చూపిస్తుంది. ప్రస్తుతం ఇంకా ఆలోచించాల్సి వస్తోంది కదా - ఇది చేద్దామా, ఇక్కడ చేద్దామా, ఇది జరగదేమో, అది జరగదేమో అని? కానీ అందరూ ఏకబుద్ధి కలవారిగా మారిపోవాలి - ఎవరు చేసినా మంచిదే, ఏమి చేసినా మంచిదే. ఈ పాఠం పక్కా అయిపోతే తీవ్రగతి సేవ ప్రారంభమైపోతుంది. నిజానికి ఇంతకుముందు కంటే సేవా వేగం తీవ్రమవుతోంది, పెరుగుతోంది, సఫలత కూడా లభిస్తోంది. కానీ ప్రస్తుత లెక్క ప్రకారం, ప్రపంచంలోని ఆత్మలకు సందేశం అందించే లెక్క ప్రకారం చూస్తే ఇంకా మూలల వరకే చేరుకున్నారు. ఎక్కడ ఐదున్నర వందల కోట్ల ఆత్మలు, ఎక్కడ సందేశం చేరిన కోటి, రెండు కోట్ల ఆత్మలు! ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు? అవును, రాజధానికి సమీపంగా ఉండేవారైతే చేరుకున్నారు, కానీ కావాల్సింది అందరూ కదా. ఆస్తి అయితే అందరికీ ఇవ్వాలి - ముక్తినివ్వండి లేదా జీవన్ముక్తినివ్వండి. కానీ ఇవ్వడం అందరికీ ఇవ్వాలి, బాబా బిడ్డ ఒక్కరు కూడా వంచితులుగా మిగిలిపోకూడదు. ఎలాగైనా బాబా ఆస్తికి అధికారులుగా కావాల్సిందే, ఏ విధి ద్వారా సందేశం విన్నా సరే. దీని కొరకు ‘తీవ్రగతి’ కావాలి. ఆ సమయం కూడా వస్తోంది, జరుగుతూ వెళ్తుంది.
ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సర్వ ధర్మాల వారూ తమ విషయాలలో సరళంగా మారుతున్నారు (మోల్డ్ అవుతున్నారు). పూర్వం చాలా కఠినంగా (కట్టర్‌గా) ఉండేవారు, ఇప్పుడు మారుతున్నారు. క్రైస్తవులైనా, ముస్లింలైనా సరే లోలోపల భారతదేశ తత్వశాస్త్రానికి (ఫిలాసఫీకి) గౌరవాన్ని ఇస్తున్నారు; ఎందుకంటే భారతదేశ ఫిలాసఫీలో అన్ని రకాల రమణీకత ఉంది. ఇలాంటిది ఇతర ధర్మాలలో లేదు. కథల రీతిలో, డ్రామా రీతిలో భారతదేశ ఫిలాసఫీకి ఉన్నంత ప్రసిద్ధి ఇతర ధర్మాలలో ఎక్కడా లేదు. అందుకే, ఎవరైతే లోలోపల చాలా కఠినంగా ఉంటూ వచ్చారో, వారు అంతరంగంలో భారతదేశ ఫిలాసఫీ, అందులోనూ ఆది సనాతన ఫిలాసఫీ ఏమాత్రం తక్కువది కాదు అని అర్థం చేసుకుంటున్నారు. ఫిలాసఫీ అంటూ ఉంటే అది ఒక్క ఆది సనాతన ధర్మానిదే అని అందరూ చెప్పే ఆ రోజులు కూడా వచ్చేస్తాయి. హిందూ అనే శబ్దం పట్ల విభేదించినప్పటికీ ఆది సనాతన ధర్మానికి గౌరవాన్ని ఇస్తారు. గాడ్ ఒక్కరే అయినప్పుడు ధర్మం కూడా ఒక్కటే, మనందరి ధర్మమూ ఒక్కటే - అని నెమ్మది నెమ్మదిగా ఆత్మ ధర్మం వైపుకు ఆకర్షితులవుతూ ఉంటారు. అచ్ఛా!
ప్రశ్న:- సదా సహజయోగిగా ఉండటానికి అత్యంత సహజమైన విధి ఏది?
సమాధానం:- తండ్రియే ప్రపంచం - అనే ఈ స్మృతిలో ఉంటే సహజయోగిగా మారిపోతారు. ఎందుకంటే రోజంతా బుద్ధి ప్రపంచం వైపే వెళ్తుంది. బాబాయే ప్రపంచమైనప్పుడు ఇక బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచంలోకే వెళ్తుంది కదా, అడవిలోకి అయితే వెళ్ళదు కదా. కాబట్టి బాబాయే ప్రపంచంగా మారినప్పుడు సహజయోగిగా మారిపోతారు. లేకపోతే శ్రమపడాల్సి వస్తుంది - ఇక్కడి నుండి బుద్ధిని తొలగించు, అక్కడితో జోడించు అని. సదా బాబా స్నేహంలో లీనమై ఉంటే ఇక వారిని మరచిపోవడం సాధ్యం కాదు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
