‘‘సఫలతకు అయస్కాంతము – కలవటము మరియు మలుచుకోవటము’’
తమ సేవాధారి, స్నేహి పిల్లలకు రిటర్న్ ఇవ్వడానికి బాప్‌దాదా పిల్లల సభలోకి వచ్చి ఉచ్ఛరించిన మహావాక్యాలు -
అందరి స్నేహము స్నేహ సాగరములో ఇమిడిపోయింది. ఇలానే ఎల్లప్పుడు స్నేహములో ఇమిడిపోయి ఇతరులకు కూడా స్నేహ అనుభూతిని చేయిస్తూ ఉండండి. బాప్‌దాదా పిల్లలందరిలో ఉన్న ఒకే రకమైన ఆలోచనను, కలవాలన్న సమ్మేళనమును చూసి హర్షితులవుతున్నారు. ఎగుర్తూ వచ్చేవారికి సదా ఎగిరే కళయొక్క వరదానము స్వతహాగానే ప్రాప్తిస్తుంటుంది. వచ్చిన పిల్లలందరినీ చూసి బాప్‌దాదా పిల్లలందరిపై స్నేహమనే పుష్ప వర్షాన్ని కురిపిస్తున్నారు. సంకల్పాల సమానమనే మిలనము, తరువాత సంస్కారాలను బాబా సమానంగా చేసుకునే మిలనము - ఈ మిలనమే బాబా మిలనము. బాబా సమానంగా అవ్వటము అంటే ఇదే. సంకల్పాల మిలనము, సంస్కారాల మిలనము - నిర్మాణులుగా అయ్యి నిమిత్తులుగా అవ్వటమే మిలనము. సమీపంగా వస్తున్నారు, రానే వస్తారు. సేవలలో సఫలతకు గుర్తును చూసి హర్షితులవుతున్నారు, సదా స్నేహీలుగా అయ్యి స్నేహమనే అలను విశ్వములో వ్యాపింపజేసేందుకు స్నేహ మిలనమునకు వచ్చారు. కానీ ప్రతి విషయములో ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (ధర్మము ఇంటినుండే ప్రారంభమవుతుంది) ముందుగా స్వయము, ఇది అన్నింటికంటే ప్రియమైన ఇల్లు. కనుక ముందుగా స్వయములో, తరువాత బ్రాహ్మణ పరివారములో, తరువాత విశ్వములో. ప్రతి సంకల్పములో స్నేహము, నిస్వార్థమైన సత్యమైన స్నేహము, మనస్ఫూర్వకమైన స్నేహము, ప్రతి సంకల్పములో సహానుభూతి, ప్రతి సంకల్పములో దయాహృదయము, దాతాతనము సహజ స్వభావాలైపోవాలి - ఇదే స్నేహ మిలనము, సంకల్పాల మిలనము, ఆలోచనల మిలనము, సంస్కారాల మిలనము. సర్వుల సహయోగమనే కార్యమునకు ముందు సదా సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మల సహయోగము విశ్వమును సహజంగా మరియు స్వతహాగా సహయోగిగా తయారుచేస్తుంది కనుక సఫలత సమీపంగా వస్తూ ఉంది. కలవటము మరియు మరల్చుకోవటము అనగా మోల్డ్ అవ్వటము - ఇదే సఫలతకు అయస్కాంతము. ఈ అయస్కాంతము యొక్క ఆకర్షణలోకి సర్వాత్మలు చాలా సహజంగా రానే వస్తారు.
మీటింగుకు వచ్చిన పిల్లలకు కూడా బాప్‌దాదా స్నేహాభినందనలను ఇస్తున్నారు. సమీపంగా ఉన్నారు, సమీపంగా ఉంటారు. కేవలం బాబాకు సమీపంగానే కాకుండా పరస్పరములో కూడా సమీపతా దృశ్యము ఉండటమును బాప్‌దాదాకు చూపించారు. విశ్వానికి దృశ్యాన్ని చూపించే ముందు బాప్‌దాదా చూసారు. రాబోయేవారు పిల్లలైన మీ అందరి కర్మలను చూసి - వారు కూడా ఎటువంటి కర్మలను చెయ్యాలి అన్నదానిని సహజంగానే తెలుసుకుంటారు. మీ కర్మలే కార్య ప్రణాళిక (యాక్షన్ ప్లాన్). అచ్ఛా!
అందరూ మంచి ప్లాన్లను తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు వర్గీకరణను తయారుచెయ్యాలన్న విశేష సూచనను బాప్‌దాదా ఇచ్చి ఉన్నారు, ఇప్పుడు కూడా దానిని చెప్తున్నారు. ఈ మహా కార్యములో ఏ వర్గమూ మిగిలిపోకూడదు అన్న లక్ష్యమును తప్పకుండా పెట్టుకోండి. సమయానుసారంగా ఎక్కువ చెయ్యలేకపోయినాగానీ శ్యాంపుల్ తప్పకుండా తయారవ్వాలి అన్న ఈ ప్రయత్నమును లేక లక్ష్యమునైతే తప్పకుండా పెట్టుకోండి. ఇకపోతే, ముందు ముందు ఈ కార్యమును ఇంకా ఉన్నతిలోకి తీసుకు వెళ్తుంటారు. కనుక సమాయనుసారంగా చేస్తుండాలి. కానీ సమాప్తిని సమీపంగా తీసుకువచ్చేందుకు సర్వుల సహయోగము అవసరము. కానీ మొత్తము ఇంత పెద్ద ప్రపంచములోని ఆత్మలందరినీ ఒకే సమయములో సంపర్కములోకి తీసుకురాలేరు కనుక, అన్ని వర్గాల ఆధారంతో సర్వాత్మలను మేము సహయోగులుగా తయారుచేసాము అని మీరు గర్వంగా, నషాతో చెప్పగలరు. అందరి కారణాలనూ ఈ లక్ష్యము పూర్తిచేస్తుంది. ఏం చేస్తున్నారు అన్నది మాకు తెలియనే తెలియదు అని ఏ వర్గము వారి ఫిర్యాదూ ఉండదు. బీజాన్ని వెయ్యండి. సమయాన్ని బట్టి, ఎలా సేవ చేయగలరో అలా వృద్ధిని చేయండి. ఎలా చెయ్యాలి, ఎంత చెయ్యాలి అని ఆలోచిస్తూ భారీగా అవ్వకండి. ఎంత అయ్యేది ఉందో అంత అవ్వనే అవుతుంది. ఎంత చేస్తే అంతగానే సఫలతకు సమీపంగా వస్తారు. శ్యాంపుల్నైతే తయారు చెయ్యగలరు కదా?
ఇకపోతే, భారత ప్రభుత్వాన్ని సమీపంగా తీసుకురావాలన్న శ్రేష్ఠ సంకల్పాన్ని చేసారు, ఆ సమయము అందరి బుద్ధులను సమీపంగా తీసుకువస్తుంది కనుక బ్రాహ్మణ ఆత్మలందరూ ఈ విశేష కార్యము కొరకు ప్రారంభము నుండి అంతిమము వరకు ‘‘సఫలత జరగాల్సిందే’’ అన్న విశేష శుద్ధ సంకల్పమును చెయ్యాలి - ఈ శుద్ధ సంకల్పముతో, బాబా సమానంగా వైబ్రేషన్లను తయారుచేసి కలపటంలో, విజయము నిశ్చితము అన్న ఈ దృఢతతో ముందుకు వెళ్తూ ఉండండి. కానీ ఏదైనా పెద్ద కార్యమును చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తారు? స్థూలములో కూడా ఏదైనా పెద్ద బరువును ఎత్తేటప్పుడు ఏం చేస్తారు? అందరూ కలిసి సహాయము చేస్తారు, ఇతరులలో ఉల్లాసము, ఉత్సాహము పెరిగే మాటలను మాట్లాడ్తారు. చూసారు కదా! అలాగే ఎవరు నిమిత్తంగా అయినాగానీ సదా ఈ విశేష కార్యము కొరకు సర్వుల స్నేహము, సర్వుల సహయోగము, సర్వుల శక్తి, ఉల్లాస-ఉత్సాహాలతో కూడుకున్న వైబ్రేషన్లు కుంభకర్ణుడిని నిద్రనుండి మేల్కొలుపుతాయి. ఈ విశేష కార్యము కొరకు ఈ అటెన్షన్‌ను పెట్టుకోవటము తప్పనిసరి. విశేషంగా స్వయము, సర్వ బ్రాహ్మణుల మరియు విశ్వాత్మల సహయోగమును తీసుకోవటమే సఫలతకు సాధనము. మధ్యలో ఒకవేళ ఇందులో కొంచెము తేడా వచ్చినా సఫలతలో తేడా వచ్చేందుకు నిమిత్తులుగా అవుతారు కనుక బాప్‌దాదా పిల్లలందరిలో ఉన్న ధైర్యమనే ధ్వనిని విని ఆ సమయంలో హర్షితులయ్యారు. విశేషంగా సంగఠనలోని స్నేహము కారణంగా స్నేహానికి రిటర్న్ ఇచ్చేందుకు వచ్చారు. మీరు చాలా మంచివారు, అనేకసార్లు చాలా చాలా మంచివారిగా అయ్యారు మరియు అయి ఉన్నారు. ఇప్పుడూ అయ్యారు. డబల్ విదేశీ పిల్లలు ఎవరెడీగా అయ్యి ఎంతో దూరము నుండి ఎగిరి వచ్చినందుకు బాప్‌దాదా విశేషంగా పిల్లలను హృదయ హారముగా చేసి ఇముడ్చుకుంటారు. అచ్ఛా!
కుమారీలైతే ఉన్నదే కన్నయ్యకు చెందినవారుగా. కేవలము ఒక్క మాటను గుర్తుంచుకోవాలి - అన్నింటిలో ఒకటి (ఏక్) ఉండాలి, ఒకటే మతము, ఒకటే స్థితి, ఒకే బాబా (ఏక్మత్, ఏక్రస్, ఏక్ బాబా). భారతదేశములోని పిల్లలకు కూడా బాప్‌దాదా హృదయపూర్వక అభినందనలను ఇస్తున్నారు. లక్ష్యము అనుసారంగా లక్షణమును ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారు. అర్థమైందా? కొందరికి చెప్పారు, కొందరికి చెప్పలేదు అని కాదు - అందరికీ చెప్తారు. (దాదీతో) ఎవరైతే నిమిత్తులుగా అవుతారో, వారికి ఆలోచన అయితే తప్పకుండా ఉంటుంది. ఇదే సహానుభూతికి గుర్తు.
మీటింగుకు వచ్చిన సోదర సోదరీలందరినీ బాప్‌దాదా స్టేజీపైకి పిలిచారు
అందరూ బుద్ధిని మంచిగా నడిపించారు. పిల్లలు ప్రతి ఒక్కరికీ సేవపై ఉన్న స్నేహము గురించి బాప్‌దాదాకు తెలుసు. సేవలో ముందుకు వెళ్ళేటప్పుడు నలువైపుల సఫలత ఎంతవరకు లభిస్తుంది అని కాస్త ఆలోచించాలి, గమనించాలి. ఇకపోతే, అందరికీ సేవపై మంచి లగనము ఉంది. రాత్రింబవళ్ళను ఒకటిగా చేసి సేవ కొరకు పరుగెత్తుతారు. బాప్‌దాదా అయితే కష్టాన్ని కూడా ప్రేమ రూపంలో చూస్తారు. కష్టపడలేదు, మీ ప్రేమను చూపించారు. అచ్ఛా! మంచి ఉల్లాస-ఉత్సాహాలు కల సహచరులు లభించారు. విశాల కార్యము మరియు విశాలమైన మనసు. ఎక్కడ విశాలత ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. పిల్లలందరిలో ఉన్న సేవ లగనమును చూసి బాప్‌దాదా ప్రతిరోజూ సంతోషపు గీతాలను గానము చేస్తారు. ‘‘వాహ్ పిల్లలూ, వాహ్’’ అన్న గీతమును చాలాసార్లు వినిపించారు. అచ్ఛా! రావటంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. రహస్యాలను తెలుసుకునేవారు కదా! బాబాకు తెలుసు, రహస్యానికి తెలుసు. (దాదీగారు బాప్‌దాదాకు భోగ్‌ను స్వీకరింప చెయ్యాలనుకున్నారు) ఈరోజు దృష్టి ద్వారానే స్వీకరిస్తారు. అచ్ఛా!
అందరి బుద్ధి చాలా మంచిగా నడుస్తుంది మరియు ఒకరికొకరు సమీపులుగా వస్తున్నారు కదా! కనుక సఫలత అతి సమీపంగా ఉంది. సమీపత సఫలతను సమీపంగా తీసుకువస్తుంది. అలసిపోలేదు కదా? చాలా పని లభించిందా? కానీ సగం పనైతే బాబా చేస్తారు. అందరి ఉల్లాసము మంచిగా ఉంది. దృఢత కూడా ఉంది కదా! సమీపత ఎంత సమీపంగా ఉంది? అయస్కాంతాన్ని పెట్టినట్లయితే సమీపత అందరి మెడలో హారాన్ని వేస్తుంది. ఇలా అనుభవమవుతుందా? అచ్ఛా! అందరూ చాలా చాలా మంచివారు.
*** ఓంశాంతి ***
