‘‘వాచ మరియు కర్మణ - రెండు శక్తులనూ జమ చేసుకునే ఈశ్వరీయ పథకము’’
తమ హృదయపూర్వక స్నేహి పిల్లలకు బాబా సమానంగా అయ్యేందుకు సూచనలు ఇస్తూ ఆత్మిక దీపమైన బాప్‌దాదా ఇలా ఉచ్ఛరించారు -
ఆత్మిక దీపము ఈరోజు తమ ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు. నలువైపుల ఉన్న దీపపు పురుగులు దీపముపై బలిహారమయ్యాయి. బలిహారమయ్యే లేక అర్పితమయ్యే దీపపు పురుగులు అనేకం ఉన్నాయి. కానీ బలిహారమైన తరువాత దీపము యొక్క స్నేహములో ‘దీపము సమానంగా’ అవ్వటంలో, బలిహారము చెయ్యటంలో నంబరువారీగా ఉన్నారు. వాస్తవానికి మనసులోని స్నేహము కారణంగానే బలిహారమవుతారు. ‘మనస్ఫూర్వకమైన స్నేహము’ మరియు ‘స్నేహము’ - ఈ రెండింటిలో కూడా తేడా ఉంది. అందరికీ స్నేహము ఉంది, స్నేహము కారణంగానే బలిహారమయ్యారు. ‘మనస్ఫూర్తిగా స్నేహము చేసేవారు’ బాబా మనసులోని విషయాలను లేక మనసులోని ఆశలను తెలుసుకుంటారు కూడా మరియు వాటిని పూర్తి చేస్తారు కూడా. మనసు స్నేహీలు మనసులోని ఆశలను పూర్తి చేసేవారు. మనసు స్నేహీలు అనగా బాబా మనసు ఏదైతే చెప్పిందో అది పిల్లల మనసులో ఇమిడిపోవటము. మనసులో ఏదైతే ఇమిడిపోతుందో అది స్వతహాగానే కర్మలలో ఉంటుంది. స్నేహీ ఆత్మలకు కొన్ని మనసులో ఇమిడిపోతాయి, కొన్ని బుద్ధిలో ఇమిడిపోతాయి. ఏవైతే మనసులో ఇముడ్తాయో వాటిని కర్మలలోకి తీసుకువస్తారు, ఏవైతే బుద్ధిలో ఇముడ్తాయో వాటిని గురించి చెయ్యగలమా-లేదా, చెయ్యాలి, సమయము వచ్చినప్పుడు అయిపోతుందిలే అన్న ఆలోచనలు నడుస్తాయి. ఇలా ఆలోచించిన కారణంగా అవి ఆలోచనల వరకే ఉండిపోతాయి, కర్మల వరకు రావు.
ఈరోజు బాప్‌దాదా చూసారు, అందరూ అయితే బలిహారమయ్యేవారే అని. ఒకవేళ బలిహారమవ్వకపోతే బ్రాహ్మణులు అని పిలువబడరు. కానీ బాబాపై స్నేహము ఉన్నందువలన బాబా ఏదైతే చెప్పారో దానిని చేసేందుకు బలిహారము చెయ్యాల్సి ఉంటుంది అనగా నాది అన్న భావన – నాది అన్న భావనలో అభిమానమున్నా లేక బలహీనత ఉన్నా - రెండింటినీ త్యాగము చెయ్యాల్సి ఉంటుంది, దీనినే బలిహారమవ్వటము అని అంటారు. బలిహారమయ్యేవారు చాలామంది ఉన్నారు కానీ బలిహారమయ్యేందుకు కావాల్సిన ధైర్యము కలవారు నంబరువారీగా ఉన్నారు.
ఈరోజు బాప్‌దాదా కేవలము ఒక్క నెల రిజల్టును చూసారు. ఈ సీజన్లో విశేషంగా బాప్‌దాదా ‘బాబా సమానము’గా అయ్యేందుకు రకరకాలుగా ఎన్నోసార్లు సూచనలనిచ్చారు. ఇదే బాప్‌దాదాకు విశేషంగా మనసులో ఉన్న శ్రేష్ఠ ఆశ. ఎన్ని ఖజానాలు లభించాయి, ఎన్ని వరదానాలు లభించాయి! వరదానాల కొరకు పరుగు పరుగున వచ్చారు. పిల్లలు స్నేహముతో కలిసేందుకు వస్తారు, వరదానాలను తీసుకుని సంతోషిస్తారు అని బాబాకు కూడా సంతోషము ఉంటుంది. కానీ బాబా మనసులోని ఆశను పూర్తి చేసేవారు ఎవరు? బాబా వినిపించినదానిని కర్మలలోకి ఎంతవరకు తీసుకువచ్చారు? మనసా-వాచ-కర్మణ - ఈ మూడింటి రిజల్టు ఎంత ఉందని భావిస్తారు? సంబంధ-సంపర్కాలలో మీ మనసు ఎంతవరకు శక్తిశాలిగా ఉంది? కేవలము మీరు మాత్రమే కూర్చుని మననము చెయ్యటము - ఇది స్వ ఉన్నతి కొరకు చాలా మంచిది మరియు చెయ్యాల్సిందే కానీ ఏ శ్రేష్ఠ ఆత్మల యొక్క శ్రేష్ఠ మనసైతే అనగా సంకల్పాలు శక్తిశాలిగా ఉంటాయో, శుభ భావన-శుభ కామనలు కలిగి ఉంటాయో, మనసా శక్తికి దర్పణము ఏంటి? మాటలు మరియు కర్మలు దర్పణము. అజ్ఞానీ ఆత్మలైనా, జ్ఞానీ ఆత్మలైనా - ఇరువురి సంబంధ సంపర్కాలలో మాటలు మరియు కర్మలే దర్పణము. ఒకవేళ మాటలు మరియు కర్మలు శుభ భావన, శుభ కామనలు కలిగినవి కానట్లయితే మనసా శక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపము ఎలా తెలుస్తుంది? ఎవరి మనసైతే శక్తిశాలిగా, శుభమైనదిగా ఉంటుందో వారి మాటలు మరియు కర్మలు స్వతహాగానే శక్తిశాలిగా, శుద్ధమైనవిగా ఉంటాయి, శుభ భావనలు కలిగినవిగా ఉంటాయి. మనసు శక్తిశాలిగా ఉండటము అనగా స్మృతి యొక్క శక్తి కూడా శ్రేష్ఠమైనదిగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, సహజయోగము కలదిగా ఉంటుంది. కేవలము సహజ యోగులుగా కాకుండా సహజ కర్మయోగులుగా కూడా ఉంటారు.
బాప్‌దాదా చూసారు - స్మృతిని శక్తిశాలిగా చేసుకోవటంపై చాలామంది పిల్లలకు అటెన్షన్ ఉంది, స్మృతిని సహజంగా మరియు నిరంతరంగా తయారుచేసుకునే ఉల్లాస-ఉత్సాహాలు కూడా ఉన్నాయి. ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూ ఉంటారు కూడా ఎందుకంటే బాబాపై చాలా మంచి స్నేహము ఉంది, కనుక స్మృతిపై చాలా మంచి అటెన్షన్ ఉంది, స్మృతికి ఆధారమే ‘స్నేహము’. బాబాతో ఆత్మిక సంభాషణను చెయ్యటంలో కూడా అందరూ చాలా మంచిగా ఉన్నారు. అప్పుడప్పుడు కాస్త కన్నెర్రజేస్తారు కూడా, అదికూడా ఎప్పుడంటే పరస్పరంలో కాస్త మనస్పర్థలు వచ్చినప్పుడు. బాబా, మీరెందుకు సరిచెయ్యరు అని బాబాపై ఫిర్యాదు చేస్తారు. అయినా అది కూడా స్నేహభరితమైన ప్రేమపూర్వక కంటితో చేస్తారు. కానీ సంగఠనలోకి వచ్చినప్పుడు, కార్యవ్యవహారములలోకి వచ్చినప్పుడు, పరివారములోకి వచ్చినప్పుడు సంగఠనలో మాటలు అనగా వాచా శక్తి ఎక్కువ వ్యర్థమవ్వటము కనిపిస్తుంది.
వాణి శక్తి వ్యర్థమవ్వటం కారణంగా వాణి ద్వారా బాబాను ప్రత్యక్షము చేసే పదునును లేక శక్తిని ఏదైతే అనుభవము చేయించాలో అది తక్కువవుతుంది. బాబా విషయాలు మంచిగా అనిపిస్తాయి, అది వేరే సంగతి. బాబా విషయాలు రిపీట్ చేసినప్పుడు అవి తప్పకుండా మంచిగా ఉంటాయి. కానీ వాచా శక్తి వ్యర్థంగా పోయిన కారణంగా శక్తి జమ అవ్వదు, కనుక బాబాను ప్రత్యక్షము చేసే శబ్దము ప్రసిద్ధమవ్వటంలో ఇప్పుడు ఆలస్యమవుతుంది. సాధారణమైన మాటలు ఎక్కువగా ఉన్నాయి. ‘అలౌకిక మాటలు ఉండాలి, ఫరిశ్తాల మాటలు ఉండాలి’ ఈ సంవత్సరములో ఇప్పుడు దీనికి అండర్లైన్ చెయ్యాలి. బ్రహ్మా బాబాను చూసారు కదా! ఫరిశ్తాల మాటలుగా ఉండేవి, తక్కువ మాటలు మరియు మధురమైన మాటలు. ఏ మాటల వలన ఫలము లభిస్తుందో అవి యథార్థమైన మాటలు మరియు ఏ మాటల వలన ఫలము వెలువడదో అవి వ్యర్థమైన మాటలు. అది కార్యవ్యవహారములకు చెందిన ఫలమైనా కావచ్చు, కార్యవ్యవహారముల కొరకు కూడా మాట్లాడవలసి వస్తుంది కదా, వాటిని కూడా ఎక్కువగా మాట్లాడకండి. ఇప్పుడు శక్తిని జమ చేసుకోవాలి. ఏవిధంగా ‘స్మృతి’ ద్వారా మనసా శక్తిని జమ చేసుకుంటారో, అలా సైలెన్స్‌లో కూర్చున్నప్పుడు ‘సంకల్ప శక్తి’ని జమ చేసుకుంటారు. అలాగే వాణి శక్తిని కూడా జమ చేసుకోండి.
వినోదకరమైన విషయాన్ని వినిపిస్తాము - బాప్‌దాదా యొక్క వతనములో అందరి జమ భండారీలు ఉన్నాయి. మీ సేవాకేంద్రాలలో కూడా భండారీలు ఉన్నాయి కదా. బాబా వతనములో పిల్లల భండారీ ఉంది. ప్రతి ఒక్కరూ మొత్తము రోజంతటిలో మనసా, వాచ, కర్మణ - ఈ మూడు శక్తులను పొదుపు చేసుకుని జమ చేసుకుంటారు, అదే భండారీ. మనసా శక్తిని ఎంత జమ చేసుకున్నారు, వాచా శక్తి, కర్మణల శక్తిని ఎంత జమ చేసుకున్నారు – ఈ మొత్తం లెక్క ఉంది. మీరు కూడా జమా ఖర్చుల లెక్కను పంపిస్తారు కదా. మరి బాప్‌దాదా ఈ జమ భండారీలను చూసారు. మరి ఏమి వెలువడి ఉండవచ్చు? జమ ఖాతా ఎంత వెలువడి ఉండవచ్చు? ప్రతి ఒక్కరి రిజల్టు అయితే వారివారిది. నిండుగా ఉన్న భండారీలైతే చాలానే ఉన్నాయి కానీ చిల్లర ఎక్కువగా ఉండింది. చిన్నపిల్లలు తమ భండారీలో చిల్లరను జమ చేస్తారు, అప్పుడు భండారి ఎంత బరువుగా అయిపోతుంది! మరి వాచా రిజల్టులో విశేషంగా దీనిని ఎక్కువగా చూసాము. స్మృతిపై ఎలా అయితే అటెన్షన్ ఉందో, అలా వాచపై అంతటి అటెన్షన్ లేదు. కనుక ఈ సంవత్సరము వాచ మరియు కర్మణ - ఈ రెండు శక్తులను జమ చేసుకునే స్కీమ్(పథకము)ను తయారుచెయ్యండి. గవర్నమెంట్ కూడా రకరకాల విధులతో పొదుపు పథకాలను తయారుచేస్తుంది కదా. అలా, ఇందులో ముఖ్యమైనది మనసు - ఇదైతే అందరికీ తెలుసు. కానీ మనసుతోపాటు విశేషంగా వాచ మరియు కర్మణలు - ఇవి సంబంధ సంపర్కములలో స్పష్టంగా కనిపిస్తాయి. మనసైతే గుప్తము, కానీ ఇవి ప్రత్యక్షంగా కనిపించేవి. మాటలలో జమ చేసుకునేందుకు సాధనము – ‘తక్కువగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, స్వమానముతో మాట్లాడండి’. బ్రహ్మా బాబా చిన్న-పెద్ద అందరినీ స్వమానభరిత మాటలతో తమవారిగా చేసుకున్నారు. ఈ విధితో ఎంతగా ముందుకు వెళ్తారో, అంతగా విజయమాల త్వరగా తయారవుతుంది. మరి ఈ సంవత్సరము ఏం చెయ్యాలి? సేవతోపాటు విశేషంగా ఈ శక్తులను జమ చేసుకుంటూ సేవ చెయ్యాలి.
సేవ ప్లాన్లయితే అందరూ చాలా మంచిమంచివి తయారుచేసారు మరియు ఇప్పటివరకు ప్లాన్ ప్రమాణంగా ఏదైతే సేవ చేస్తున్నారో, నలువైపుల - అది భారతదేశములోనైనా లేక విదేశములలోనైనా దానిని మంచిగా కూడా చేస్తున్నారు మరియు చేస్తారు కూడా. ఏవిధంగా సేవలో ఒకరికంటే మరొకరు మంచి రిజల్టును తీసుకువచ్చే శుభ భావనతో ముందుకు వెళ్తున్నారో, అలా సేవలో సంగఠిత రూపములో సదా సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టంగా చేసే విశేష సంకల్పము కూడా కలిసి ఉండాలి ఎందుకంటే ఒకే సమయములో మూడురకాల సేవలు జరుగుతాయి. 1. మీ సంతుష్టత, ఇది స్వ సేవ. 2. సంగఠనలో సంతుష్టత, ఇది పరివారపు సేవ. 3. భాష ద్వారాగానీ లేక మరే విధి ద్వారానైనా విశ్వాత్మల సేవ. ఒకే సమయములో మూడు సేవలు జరుగుతాయి. ఏ ప్రోగ్రామును తయారుచేసినా అందులో మూడు సేవలూ ఉంటాయి. ఏవిధంగా విశ్వ సేవ రిజల్టును మరియు విధిని అటెన్షన్లో పెట్టుకుంటారో, అలా రెండు సేవలు ‘స్వ’ మరియు ‘సంగఠన’లు - మూడూ నిర్విఘ్నంగా ఉండాలి, సేవ యొక్క నంబర్‌వన్ సఫలత అని అప్పుడు అంటాము. మూడు సఫలతలూ కలిసి ఉండటమే నంబరును తీసుకోవటము. ఈ సంవత్సరము మూడు సేవలలో సఫలత కలిసి ఉండాలి - ఈ ఢంకా మ్రోగాలి. కేవలము ఒక్క మూలలో ఢంకా మ్రోగితే అది కుంభకర్ణుల చెవుల వరకు చేరుకోదు. ఎప్పుడైతే నలువైపుల ఈ ఢంకా మ్రోగుతుందో, అప్పుడు కుంభకర్ణులందరూ మేలుకుంటారు. ఇప్పుడు ఒకరు మేల్కుంటే, రెండోవాళ్ళు నిద్రపోతుంటారు, రెండోవాళ్ళు మేల్కుంటే మూడోవాళ్ళు నిద్రపోతుంటారు. ఏదో కాస్త లేచినాగానీ ‘బాగుంది-బాగుంది’ అని చెప్పి మరల నిద్రపోతారు. కానీ, లేచి నోటితో, మనసుతో ‘అహో, ప్రభూ!’ అని అనాలి మరియు ముక్తి వారసత్వమును తీసుకోవాలి, అప్పుడే సమాప్తి అవుతుంది. లేస్తేనే కదా ముక్తి వారసత్వమును తీసుకుంటారు, కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. ఇతరుల సంరక్షణలో మీ రక్షణ కూడా అయిపోతుంది అనగా పొదుపు అయిపోతుంది.
సేవ ప్లానులో భాగంగా సంపర్కములోకి ఎంత సమీపంగా తీసుకువస్తారో, అంతగా సేవలో ప్రత్యక్ష రిజల్ట్ కనిపిస్తుంది. సందేశాన్ని ఇచ్చే సేవనైతే చేస్తూ వచ్చారు, చేస్తుండాలి కానీ విశేషంగా ఈ సంవత్సరములో కేవలము సందేశాన్ని ఇవ్వటమే కాకుండా సహయోగులుగా తయారుచెయ్యాలి అనగా సంపర్కములో సమీపంగా తీసుకురావాలి. కేవలము ఫార్మ్‌ను నింపించారు - ఇదైతే జరుగుతూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరము ఇంకా ముందుకు వెళ్ళండి. ఫార్మ్‌ను నింపించండి కానీ ఫార్మ్ నింపటంతోనే వదిలెయ్యకండి, సంబంధములోకి తీసుకురావాలి. వ్యక్తిని బట్టి సంపర్కములోకి తీసుకువచ్చే ప్లాన్లను తయారుచెయ్యండి. చిన్న-చిన్న ప్రోగ్రాములను చేసినాగానీ ఈ లక్ష్యమునైతే పెట్టుకోండి. కేవలము ఒక గంట కొరకో లేక ఫార్మ్ నింపేవరకో సహయోగిగా తయారుచేసుకోవటం కాదు, సహయోగము ద్వారా వారిని సమీపంగా తీసుకురావాలి. మీ తరఫున సంబంధములోకి వచ్చేవారు మాట్లాడ్తారు, మీరు కేవలము ఆశీర్వాదాలు మరియు దృష్టిని ఇవ్వవలసివస్తుంది. ఈరోజుల్లో ఏవిధంగానైతే శంకరాచార్యులను కుర్చీపై కూర్చోబెడ్తారో అలా మిమ్మల్ని పూజ్యనీయమైన కుర్చీపై కూర్చోబెడ్తారు, వెండి కుర్చీపై కాదు. ధరణిని తయారుచేసేవారు నిమిత్తులుగా అవుతారు, మీరు కేవలము దృష్టి ద్వారా బీజాన్ని వెయ్యవలసి ఉంటుంది. రెండు ఆశీర్వచనాలను మాట్లాడాలి, అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. మీలో బాబా కనిపిస్తారు మరియు బాబా దృష్టి, బాబా స్నేహములను తీసుకోగానే ప్రత్యక్షతా నినాదము మ్రోగటము ప్రారంభమవుతుంది.
ఇప్పుడు సేవలో గోల్డెన్ జుబ్లీనైతే పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ సేవ చేస్తారు మరియు మీరు దాన్ని చూస్తూ-చూస్తూ హర్షితులవుతూ ఉంటారు. పోప్ ఏం చేస్తారు? అంత పెద్ద సభలో దృష్టిని ఇచ్చి ఆశీర్వాదపు మాటలను మాట్లాడ్తారు. పెద్ద ఉపన్యాసాన్ని ఇవ్వటానికి ఇతరులు నిమిత్తంగా అవుతారు. మాకు బాబా వినిపించారు అని మీరు అంటే, మరొకరు - వీరు ఏదైతే వినిపించారో అవి బాబా మాటలు, ఇతరులెవరివీ కావు అని అంటారు. ఇలా నెమ్మది నెమ్మదిగా హ్యాండ్స్ తయారవుతారు. సేవాకేంద్రాలను సంభాళించేందుకు హ్యాండ్స్ తయారయ్యారు కదా, అలా స్టేజ్‌పై మీ తరఫున మాట్లాడేవారు, అనుభవము చేసి మాట్లాడేవారు తయారవుతారు. కేవలము మహిమ చేసేవారు కాదు, జ్ఞానములోని గుహ్యమైన పాయింట్లను స్పష్టము చేసేవారు, పరమాత్మ జ్ఞానమును నిరూపించేవారు - ఇటువంటివారు నిమిత్తులుగా అవుతారు. కానీ అందుకొరకు తగినవారిని స్నేహీ, సహయోగులుగా చేసుకుంటూ సంపర్కములోకి తీసుకువస్తూ సంబంధములోకి తీసుకురండి. ఈ మొత్తము కార్యక్రమము యొక్క లక్ష్యమే ఇది - ఎటువంటి సహయోగులుగా తయారుచెయ్యాలంటే మీరు స్వయం ‘మైట్’లుగా అవ్వండి మరియు వారు ‘మైక్’లుగా అవ్వాలి. ఈ సంవత్సరము సహయోగపు సేవ యొక్క లక్ష్యము ‘మైక్’లను తయారుచెయ్యటము, వారు అనుభవముయొక్క ఆధారముతో మీయొక్క మరియు బాబా యొక్క జ్ఞానమును ప్రత్యక్షము చెయ్యాలి. ఎవరి ప్రభావమైతే ఇతరులపై స్వతహాగా మరియు సహజంగా పడుతుందో అటువంటి మైకులను తయారుచెయ్యండి. సేవ ఉద్దేశ్యమేమిటో అర్థమైందా? ఇన్ని ప్రోగ్రాములు వేటినైతే తయారుచేసారో, వాటినుండి ఏ వెన్న వెలువడుతుంది? సేవ చాలా బాగా చెయ్యండి కానీ ఈ సంవత్సరము సందేశముతోపాటు దీనిని చేర్చండి. ఎవరెవరు ఇటువంటిదానికి పాత్రులో వారిని దృష్టిలో పెట్టుకోండి, వారిని ఎప్పటికప్పుడు రకరకాల పద్ధతులతో సంపర్కములోకి తీసుకురండి. ఒక ప్రోగ్రాం చేసారు, తరువాత మరొక ప్రోగ్రాం చేసారు, మూడో ప్రోగ్రాం చేసారు కానీ మొదటివారు అక్కడే ఉండిపోవటము, మూడోవారు రావటము అని ఇలా ఉండకూడదు. ఈ జమ శక్తిని కూడా ప్రయోగములోకి తీసుకురావలసి వస్తుంది. ప్రతి ప్రోగ్రాం ద్వారా జమ చేసుకుంటూ వెళ్ళండి. చివర్లో సంబంధ-సంపర్కములో ఉన్న ఇటువంటివారి మాల తయారవ్వాలి. అర్థమైందా? ఇంకేమి మిగిలి ఉంది? బాబాతో మిలనము చేసే ప్రోగ్రామ్ ఉంది.
ఈ సంవత్సరము బాప్‌దాదా 6 నెలల సేవ రిజల్ట్‌ను చూడాలనుకుంటున్నారు. సేవలో ఎవరైతే ప్లాన్లను తయారుచేసారో, వారు నలువైపుల ఒకరికొకరు సహయోగులుగా అయ్యి బాగా ప్రయాణం చేసి తిరగండి. చిన్న-పెద్ద అందరినీ ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకువచ్చి మూడు రకాల సేవలలో ముందుకు తీసుకు వెళ్ళండి, కనుకనే బాప్‌దాదా ఈ సంవత్సరములో పూర్తిగా రాత్రిని పగలుగా చేసి సేవను ఇచ్చారు. ఇప్పుడు మూడురకాల సేవల ఫలాన్ని తినే సంవత్సరము ఇది. వచ్చేందుకు కాదు ఈ సంవత్సరము, ఫలాన్ని తినేందుకు. ఈ సంవత్సరము ఇక్కడకు వచ్చేది నిశ్చయింపబడలేదు. బాబా ఇచ్చే సకాష్ అయితే ఎల్లప్పుడు తోడుగా ఉంటుంది. డ్రామా విధిని తెలిపాము. డ్రామా దేనినైతే ఆమోదిస్తుందో దానిని మనమూ ఆమోదించవలసిందే. బాగా సేవ చెయ్యండి. 6 నెలలలోనే రిజల్ట్ తెలిసిపోతుంది. బాబా ఆశలను పూర్తి చేసే ప్లాన్లను తయారుచెయ్యండి. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా - ప్రతి ఒక్కరి సంకల్పాలు, మాటలు మరియు కర్మలు బాబా ఆశల దీపాలను వెలిగించేవిగా ఉండాలి. ముందుగా మధువనములో ఈ ఉదాహరణను చూపించండి. పొదుపు పథకం మోడల్‌ను ముందుగా మధువనములో తయారుచెయ్యండి. ఈ బ్యాంకులో ముందుగా జమ చెయ్యండి. మధువనము వారికి కూడా వరదానమైతే లభించేసింది. ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని కూడా ఈ సంవత్సరములో త్వరగా పూర్తి చేస్తారు ఎందుకంటే బాబా స్నేహమైతే పిల్లలందరిపై ఉంది. మామూలుగా కూడా, పిల్లలు ప్రతి ఒక్కరి కొరకు ప్రతి అడుగులో వరదానము ఉంది. ఎవరైతే మనస్ఫూర్వకమైన స్నేహము కల ఆత్మలో, వారు ప్రతి అడుగును వరదానముతోనే వేస్తారు. బాబా ఇచ్చే వరదానము కేవలము నోటితో ఇచ్చేది కాదు కానీ మనసుతో కూడా ఇస్తారు. మనస్ఫూర్తిగా ఇచ్చే వరదానము ఎల్లప్పుడూ మనసులో సంతోషము, ఉల్లాసము, ఉత్సాహముల అనుభవాన్ని చేయిస్తుంది. మనసు నుండి వచ్చే వరదానమునకు గుర్తు ఇది. మనసు నుండి వచ్చే వరదానమును ఎవరైతే మనస్ఫూర్తిగా ధారణ చేస్తారో, దానికి గుర్తు ఏమిటంటే వారు సదా సంతోషము మరియు ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తుంటారు. ఎప్పుడుకూడా ఏ విషయాలలోనూ చిక్కుకోరు, ఆగిపోరు, వరదానముతో ఎగురుతూ ఉంటారు. ఇతర అన్ని విషయాలు కిందనే ఉండిపోతాయి. ఎగిరేవాళ్ళను సైడ్సీన్స్ కూడా ఆపలేవు.
ఈరోజు బాప్‌దాదా ఎవరైతే మనస్ఫూర్తిగా, అలసిపోనివారుగా అయ్యి సేవ చేసారో ఆ సేవాధారీ పిల్లలందరికీ ఈ సీజన్లో సేవ యొక్క అభినందనలను ఇస్తున్నారు. మధువనానికి వచ్చి మధువనానికి అలంకరణగా అయ్యారు, అలంకరణగా అయ్యే ఇటువంటి పిల్లలకు కూడా బాప్‌దాదా అభినందనలను ఇస్తున్నారు మరియు నిమిత్తులైన శ్రేష్ఠ ఆత్మలను కూడా, సదా అలసిపోనివారిగా అయ్యి బాబా సమానంగా తమ సేవల ద్వారా సర్వులను రిఫ్రెష్ చేసినందుకు అభినందిస్తున్నారు మరియు రథానికి కూడా అభినందనలు. నలువైపుల ఉన్న సేవాధారీ పిల్లలకు అభినందనలు. నిర్విఘ్నులుగా అయ్యి ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉండాలి. దేశ విదేశములలోని పిల్లలందరికీ వచ్చినందుకు కూడా అభినందనలు, రిఫ్రెష్ అయినందుకు కూడా అభినందనలు. కేవలము 6 మాసాలే రిఫ్రెష్ అవ్వటము కాదు, సదా రిఫ్రెష్‌గా ఉండాలి. బాగా రిఫ్రెష్ అయ్యేందుకు రండి, మంచిది, ఎందుకంటే బాబా ఖజానాలపై పిల్లలందరికీ ఎల్లప్పుడు అధికారము ఉంటుంది. బాబా మరియు ఖజానాలు సదా తోడుగా ఉన్నాయి మరియు ఎల్లప్పుడూ తోడు ఉంటాయి. కానీ కేవలము దేనికైతే అండర్లైన్ చేయించామో అందులో విశేషంగా స్వయమును ఉదాహరణగా తయారుచేసుకుని పరీక్షలో అదనపు మార్కులను తీసుకోవాలి. ఇతరులను చూడకూడదు, స్వయమును ఉదాహరణగా తయారుచేసుకోవాలి. ఇందులో ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో, వారే అర్జునులు(విజయులు) అనగా నంబర్‌వన్‌లు. తరువాత మళ్ళీ బాప్‌దాదా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ఫరిశ్తాల కర్మలు, ఫరిశ్తాల మాటలు, ఫరిశ్తాల సంకల్పాలను ధారణ చేసినవారిగా కనిపించాలి. సంగఠనలో ఇటువంటి పరివర్తన కనిపించాలి. ఈ ఫరిశ్తాల మాటలు, ఫరిశ్తాల కర్మలు ఎంతటి అలౌకికంగా ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ అనుభవము చెయ్యాలి. ఈ పరివర్తన ఉత్సవాన్ని బాప్‌దాదా చూడాలనుకుంటారు. ఒకవేళ ప్రతి ఒక్కరూ మొత్తము రోజులో వారు మాట్లాడే మాటలను రికార్డు చేసినట్లయితే చాలా బాగా తెలిసిపోతుంది. ఎంత వ్యర్థంగా పోతుంది అన్నదానిని చెక్ చేసుకున్నట్లయితే తెలిసిపోతుంది. మనసు టేప్‌లో చెక్ చేసుకోండి, స్థూలమైన టేప్‌లో కాదు. సాధారణమైన మాటలు కూడా వ్యర్థములోకే జమ అవుతాయి. ఒకవేళ 4 మాటలకు బదులుగా 24 మాటలు మాట్లాడితే ఆ 20 మాటలు ఎందులోకి పోయినట్లు? ఎనర్జీ(శక్తి)ని జమ చేసుకోండి, అప్పుడు మీ రెండు మాటలు కూడా ఆశీర్వాదమునకు చెందినవిగా, ఒక గంట భాషణ చేసినదానికి సమానంగా పని చేస్తాయి. అచ్ఛా!
నలువైపుల కల బలిహారమయ్యే ఆత్మిక దీపపు పురుగులకు, బాబా సమానంగా అవ్వాలన్న దృఢ సంకల్పముతో ముందుకు వెళ్ళే విశేష ఆత్మలకు, సదా ఎగిరే కళ ద్వారా ఎటువంటి సైడ్సీనులనైనా దాటేసే డబల్ లైట్ పిల్లలకు ఆత్మిక దీపమైన శివబాబా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలు బాప్‌దాదాకు కూడా అభినందనలు తెలిపారు, ధన్యవాదాలు చెప్పారు
తండ్రి పిల్లలకు ధన్యవాదాలు చెప్తారు, పిల్లలు తండ్రికి చెప్తారు. ఒకరికొకరు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందుకు సాగారు, ముందుకు సాగేందుకు ఇదే విధి. ఈ విధి వలనే మీ సంగఠన బాగుంది. ఒకరికొకరు ‘హా జీ’ (సరేనండీ) అంటూ, ‘ధన్యవాదాలు’ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళారు, ఈ విధినే అందరూ ఫాలో చేయాలి అప్పుడే ఫరిశ్తాగా అవుతారు. బాప్‌దాదా చిన్న మాలను చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడు కంకణమే తయారయింది, కంఠ మాల తయారవుతుంది. కంఠ మాలను తయారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు అటెన్షన్ ఉండాలి. సేవలోకి ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు అప్పుడప్పుడు స్వయంపై అటెన్షన్ తగ్గుతుంది. ‘విస్తారము’లో ‘సారము’ ఒక్కోసారి మర్జ్ అయిపోతుంది, ఇమర్జ్ (ప్రత్యక్షం) రూపంలో ఉండటం లేదు. ఇప్పుడు ఇది అవ్వవలసిందే అని మీరు అంటారు కదా. ఏది జరగాలో అదే జరుగుతుంది అని అనే రోజు కూడా వస్తుంది. ముందుగా దీపాల మాల అయితే ఇక్కడే తయారవుతుంది. బాప్‌దాదా మిమ్మల్ని, ప్రతి ఒక్కరినీ ఉల్లాస ఉత్సాహాలను పెంచడంలో ఉదాహరణగా చూస్తున్నారు. మీ ఐకమత్యమే యజ్ఞం యొక్క కోట. 10మంది ఉన్నా, 12మంది ఉన్నాకానీ మీరు కోట గోడలవంటి వారు. మరి బాప్‌దాదా ఎంతో సంతోషిస్తున్నారు. బాప్‌దాదా అయితే ఉన్నారు, కానీ మీరు నిమిత్తంగా ఉన్నారు. ఇటువంటి సంగఠనతో రెండవ, మూడవ గ్రూపు తయారైతే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి గ్రూపును తయారు చేయండి. ఈ మొదటి గ్రూపులోని వారికి పరస్పరంలో స్నేహం ఉందని అందరూ అంటారు. స్వభావాలు భిన్నంగా ఉన్నాయి, అవి భిన్నంగా ఉంటాయి కూడా, కానీ గౌరవం ఉంది, ప్రేమ ఉంది, హా జీ అంటారు, సమయానికి స్వయాన్ని మల్చుకోగలరు – కనుక ఈ కోట గోడలు బలంగా ఉన్నాయి, అందుకే ముందుకు వెళ్తున్నారు. పునాదిని చూసి సంతోషంగా అనిపిస్తుంది కదా. ఈ మొదటి గ్రూపు ఉన్నట్లుగా, ఇటువంటి శక్తిశాలి గ్రూపులను తయారు చేయండి, అప్పుడు సేవ మీ వెనుకే వస్తుంది. డ్రామాలో విజయమాల నిశ్చితమై ఉంది. తప్పకుండా పరస్పరం సమీపంగా ఉంటారు కాబట్టే మాల తయారవుతుంది. ఒక పూస ఒక వైపు, మరో పూస మరో వైపు దూరంగా ఉంటే మాల తయారవ్వదు. పూసలు కలుస్తూ ఉండాలి, సమీపంగా ఉండాలి అప్పుడే మాల తయారవుతుంది. మీరు మంచి ఉదాహరణగా ఉన్నారు. అచ్ఛా!
ఇప్పుడు కలిసే కోటాను పూర్తి చేయాలి. వినిపించాము కదా – రథాన్ని కూడా ఎక్స్ట్రా సకాశ్ ఇచ్చి నడిపిస్తున్నాము. నిజానికి ఇది సాధారణ విషయము కాదు. అన్నిటినీ చూసుకోవాలి కదా. అయినా అన్ని శక్తుల ఎనర్జీ జమ అయి ఉంది, అందుకే రథం కూడా ఇంత సహకారాన్ని ఇస్తుంది. శక్తులు జమ అయ్యి లేకపోతే ఇంతటి సేవ జరగడం కష్టమయ్యేది. ఇది కూడా డ్రామాలో ప్రతి ఆత్మ యొక్క పాత్ర ఉంది. జమ అయిన శ్రేష్ఠ కర్మల రాశి సమయానికి ఉపయోగపడుతుంది. ఏదో ఒక విశేషమైన పుణ్య రాశి జమ అయి ఉన్నందువలన విశేషమైన పాత్ర లభించింది. రథం నిర్విఘ్నంగా నడవాలి – ఇది కూడా డ్రామాలో పాత్ర. 6 నెలలు తక్కువేమీ కాదు. అచ్ఛా! అందరినీ సంతోషపరుస్తాము. అచ్ఛా!
*** ఓంశాంతి ***
