"నూతన ప్రపంచ చిత్రమునకు ఆధారము వర్తమాన శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితము"
తమ చిరునవ్వుతో ఉన్న ముఖముతో అందరికీ నవ్వడమును నేర్పించేవారు, తమ శ్రేష్ఠ అదృష్టము యొక్క చిత్రముతో క్రొత్త ప్రపంచ చిత్రాన్ని తయారు చేసేవారు – ఇటువంటి తెలివైన ఆర్టిస్టు పిల్లలను ఉద్దేశించి విశ్వ ఉద్ధారమూర్తి అయిన బాప్‌దాదా ఉచ్ఛరించిన మహావాక్యాలు -
ఈరోజు విశ్వ రచయిత, విశ్వము యొక్క శ్రేష్ఠ భాగ్యమును తయారుచేసే బాప్‌దాదా శ్రేష్ఠ భాగ్య చిత్రానికి స్వరూపులైన తమ పిల్లలను చూస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ విశ్వము యొక్క శ్రేష్ఠ భాగ్యమునకు చిత్రములు. బ్రాహ్మణ జీవితము యొక్క చిత్రము ద్వారా భవిష్య శ్రేష్ఠ భాగ్యము స్పష్టంగా కనిపిస్తుంది. బ్రాహ్మణ జీవితములోని ప్రతి శ్రేష్ఠ కర్మ భవిష్య శ్రేష్ఠ ఫలమును అనుభవము చేయిస్తుంది. బ్రాహ్మణ జీవితములోని శ్రేష్ఠ సంకల్పము భవిష్యత్తు యొక్క శ్రేష్ఠ సంస్కారమును స్పష్టము చేస్తుంది. కనుక వర్తమాన బ్రాహ్మణ జీవిత చిత్రము - భవిష్య అదృష్టవంతుల ప్రపంచముది. భవిష్యత్తులో ఇటువంటి చిత్రము కల పిల్లలను చూసి బాప్‌దాదా హర్షితులవుతారు. చిత్రము కూడా మీరే, భవిష్య అదృష్టమునకు ఆధారమూర్తులు కూడా మీరే. మీరు శ్రేష్ఠులుగా అవుతారు, అప్పుడే ప్రపంచము కూడా శ్రేష్ఠముగా అవుతుంది. ఎగిరే కళ గల మీ స్థితి విశ్వమునకు కూడా ఎగిరే కళ వంటిది. బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఎప్పటికప్పుడు ఏ స్థితులనైతే దాటుతుంటారో అలాగే విశ్వము యొక్క స్టేజెస్ కూడా పరివర్తన అవుతుంటాయి. మీది సతోప్రధాన స్థితి అయితే విశ్వము కూడా సతోప్రధానంగా ఉంటుంది, బంగారు యుగంగా ఉంటుంది. మీరు మారితే ప్రపంచము కూడా మారుతుంది. ఇంతటి ఆధారమూర్తులు మీరు!
వర్తమాన సమయములో బాబాతో కలిసి ఎంతటి శ్రేష్ఠమైన పాత్రను పోషిస్తున్నారు! మొత్తము కల్పములో అతి పెద్ద విశేషమైన పాత్రను ఈ సమయులో పోషిస్తున్నారు. బాబాతోపాటు సహయోగులుగా అయ్యి విశ్వములోని ప్రతి ఆత్మ యొక్క అనేక జన్మల ఆశలను పూర్తి చేస్తున్నారు. బాబా ద్వారా ప్రతి ఆత్మకు ముక్తి మరియు జీవన్ముక్తుల అధికారమును ప్రాప్తి చేయించేందుకు నిమిత్తులుగా అయ్యారు. అందరి కోరికలను పూర్తి చేసేవారు, బాబా సమానంగా ‘కామధేనువులు’, అభీష్టాలను పూర్తి చేసేవారు. ఇలా ప్రతి ఆత్మకు ఇచ్ఛా మాత్రమ్ అవిద్య (కోరికలంటే ఏమిటో తెలియని) స్థితిని అనుభవము చేయించేవారు, అర్థకల్పములోని అనేక జన్మలు, భక్త ఆత్మలకుగానీ, జీవన్ముక్త స్థితి కల ఆత్మలకుగానీ ఎటువంటి కోరికా ఉండదు. ఒక్క జన్మలోని కోరికలను పూర్తి చేసేవారు కారు కానీ అనేక జన్మల కొరకు ఇచ్ఛా మాత్రమ్ అవిద్య యొక్క అనుభూతిని చేయించేవారు. బాబా యొక్క సర్వ భండారాలు, సర్వ ఖజానాలు ఏవిధంగా ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయో, అప్రాప్తి అన్న నామరూపాలు కూడా ఉండవో అలా బాబా సమానంగా సదా మరియు సర్వ ఖజానాలతో నిండుగా ఉంటారు.
బ్రాహ్మణ ఆత్మ అనగా ప్రాప్తి స్వరూప ఆత్మ, సంపన్న ఆత్మ. బాబా ఎలా సదా లైట్-హౌస్, మైట్-హౌస్, అలా బ్రాహ్మణ ఆత్మలు కూడా బాబా సమానమైనవారు, లైట్-హౌస్‌లు కనుక ప్రతి ఆత్మనూ వారి గమ్యమునకు చేర్చేందుకు నిమిత్తులు. బాబా ఏవిధంగా ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ ద్వారా ప్రతి సమయము దాత, వరదాతనో అలా బ్రాహ్మణ ఆత్మలైన మీరు కూడా దాతలు, మాస్టర్ వరదాతలు. అటువంటి బ్రాహ్మణ జీవితమునకు చిత్రమేనా మీరు? ఏ చిత్రమునైనా తయారు చేసేటప్పుడు అందులో అన్ని విశేషతలను చూపిస్తారు కదా. అలాగే వర్తమాన సమయములోని బ్రాహ్మణ జీవిత చిత్రములోని విశేషతలను మీలో నింపుకున్నారా? మీ చిత్రమును కూడా తయారుచేసుకుంటున్న అతి పెద్ద చిత్రకారులు మీరు. మీ చిత్రము తయారవుతుంటే విశ్వ చిత్రము తయారవుతుంటుంది. అలా అనుభవము చేస్తారు కదా!
చాలామంది, నూతన ప్రపంచములో ఏముంటాయి అని అడుగుతుంటారు కదా! మరి నూతన ప్రపంచము యొక్క చిత్రమే మీరు. మీ జీవితము ద్వారా భవిష్యత్తు స్పష్టమవుతుంది. ఆ చిత్రాన్ని ఎవరు చూసినాకూడా సదాకాలమునకు ప్రసన్నచిత్తులైపోయేంతగా అటువంటి చిత్రము ఎల్లప్పుడు తయారైందా అని ఈ సమయములో కూడా మీ చిత్రమును చూసుకోండి. కొంచెము అశాంతి అల ఉన్నవారు కూడా మీ చిత్రాన్ని చూసి అశాంతిని మర్చిపోవాలి, శాంతి అలలలో తేలియాడాలి. అప్రాప్తి స్వరూపులు ప్రాప్తి అనుభూతిని స్వతహాగనే అనుభవము చెయ్యాలి. బికారులుగా అయ్యి వచ్చారు, నిండుగా అయ్యి వెళ్ళారు. చిరునవ్వుతో ఉన్న మిమ్మల్ని చూసి మనసు నుండి మరియు కళ్ళ నుండి ఏడవటమును మర్చిపోవాలి, నవ్వటమును నేర్చుకోవాలి. నవ్వటమును నేర్పించారు... అని మీరు కూడా బాబాను అంటారు కదా, ఏడవటమును పోగొట్టడము మరియు నవ్వటమును నేర్పించటము - మీ పనే ఇది. కనుక బ్రాహ్మణ జీవితము ఇటువంటి చిత్రము కలది. మేము ఇటువంటి ఆధారమూర్తులము, పునాదివంటివారము అని ఎల్లప్పుడు స్మృతిలో పెట్టుకోండి. వృక్షము చిత్రములో చూసారా - బ్రాహ్మణులు ఎక్కడ కూర్చున్నారు? పునాదిలో కూర్చున్నారు కదా. బ్రాహ్మణుల పునాది దృఢమైనది, అప్పుడే అర్థకల్పము స్థిరంగా-దృఢంగా ఉంటారు. సాధారణ ఆత్మలు కారు, ఆధారమూర్తులు, పునాది మీరు.
ఈ సమయములోని మీ సంపూర్ణ స్థితి సత్యయుగములోని 16 కళల సంపూర్ణ స్థితికి ఆధారము. ఇప్పటి ఒకటే మతము అక్కడి ఒకటే రాజ్యమునకు ఆధారము. ఇక్కడి సర్వ ఖజానాల సంపన్నత - జ్ఞానము, గుణాలు, శక్తులు, సర్వ ఖజానాలు అక్కడి సంపన్నతకు ఆధారము. ఇక్కడి దేహ ఆకర్షణ నుండి అతీతత్వము అక్కడి తనువు ఆరోగ్య ప్రాప్తికి ఆధారము. అశరీరితనము యొక్క స్థితి నిరోగీతనము మరియు దీర్ఘ ఆయుష్షుకు ఆధార స్వరూపము. ఇక్కడి నిశ్చింత చక్రవర్తిత్వ జీవితము అక్కడ ప్రతి క్షణములో మానసిక ఉల్లాసము, ఆనందము కల జీవన స్థితిని ప్రాప్తి చేసుకోవటానికి ఆధారంగా అవుతుంది. ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు - అన్న ఇక్కడి ఈ అఖండ-అచంచల సాధన అక్కడి అఖండ, అచంచల, తరగని, నిర్విఘ్న సాధనాల ప్రాప్తికి ఆధారంగా అవుతుంది. బాప్‌దాదా లేక తల్లిదండ్రి, సోదర సోదరీలు కల ఇక్కడి ఈ చిన్న ప్రపంచము అక్కడి చిన్న ప్రపంచమునకు ఆధారంగా అవుతుంది. ఒక్క మాతాపితతోనే సంబంధాన్ని జోడించే ఇక్కడి ఈ సంస్కారము వలన అక్కడ కూడా ఒకటే విశ్వమునకు విశ్వ మహారాజు లేక విశ్వ మహారాణిగా అయినవారిని మాతా-పితల రూపములో అనుభవము చేస్తారు. స్నేహభరిత పరివారముతో కూడిన ఇక్కడి ఈ సంబంధము అక్కడ కూడా, రాజులుగా అయినా లేక ప్రజలుగా అయినాకానీ ప్రజలు కూడా తమను పరివారముగా భావిస్తారు, పరివారములో స్నేహ సమీపత ఉంటుంది. పదవులు ఉంటాయి కానీ అవి స్నేహముతో కూడిన పదవులుగా ఉంటాయి, సంకోచము, భయముతో కూడుకున్నవిగా ఉండవు. మరి భవిష్య చిత్రము మీరే కదా. ఈ అన్ని విషయాలను మీ చిత్రములో పరిశీలించుకోండి - ఎంతవరకు శ్రేష్ఠ చిత్రముగా తయారయ్యాను అన్నది పరిశీలించుకోండి. లేక ఇప్పటివరకు రేఖలను గీస్తున్నారా? తెలివైన ఆర్టిస్ట్‌లు కదా!
ప్రతి ఒక్కరూ ఎంతవరకు తమ చిత్రాన్ని తయారుచేసుకున్నారు అన్నదానినే బాప్‌దాదా చూస్తుంటారు. వీరు దీనిని సరిగ్గా చెయ్యలేదు అందుకే ఇలా అయింది అని ఇతరులపై ఫిర్యాదును వెయ్యలేరు, ఎందుకంటే మీ చిత్రాన్ని మీరే తయారు చేసుకుంటారు. అన్ని వస్తువులు బాప్‌దాదా నుండి లభిస్తున్నాయి, అందులో అయితే తక్కువేమీ లేదు కదా. ఇక్కడ కూడా ఆట నేర్పిస్తారు కదా, ఆ ఆటలో వస్తువులను కొని వాటితో తయారుచేస్తారు. ఎంత కావాలంటే అంత తీసుకోండి, అది తయారుచేసేవారిపై ఉంటుంది. కేవలము తీసుకునేవారు తీసుకోగలగాలి. ఇక బజారు అయితే అది తెరిచియున్న బజారు వంటిది. రెండు తీసుకోవాలి, నాలుగు తీసుకోవాలి అని బాప్‌దాదా అయితే ఈ లెక్కను పెట్టరు. చాలా అందమైన చిత్రాన్ని తయారుచేసారు కదా. మేమే భవిష్య అదృష్టమునకు చిత్రము అని ఎల్లప్పుడు స్వయమును ఇలా భావించండి. ఇలా భావించి ప్రతి అడుగును వెయ్యండి. స్నేహితులైన కారణంగా సహయోగులు కూడా మరియు సహయోగులైన కారణంగా బాబా యొక్క సహయోగము ప్రతి ఆత్మకూ ఉంది. కొందరికి ఎక్కువ సహయోగము, కొందరికి తక్కువ సహయోగము అని ఇలా ఉండదు. ప్రతి ఆత్మ కొరకు ఒకటికి రిటర్న్‌గా పదమాగుణాలు బాబా సహయోగము తప్పకుండా ఉంటుంది. సహయోగీ ఆత్మలుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ బాబా సహయోగము ఎల్లప్పుడు ప్రాప్తిస్తుంది మరియు ఎప్పటివరకు ఉంటారో అప్పటివరకు లభిస్తూనే ఉంటుంది. బాబా సహయోగము ఉన్నప్పుడు ప్రతి కార్యమూ జరిగే ఉంటుంది. ఇటువంటి అనుభవమును చేస్తారు కూడా మరియు చేస్తూ ఉండండి. ఇందులో ఎటువంటి కష్టము లేదు ఎందుకంటే భాగ్యవిధాత ద్వారా భాగ్య ప్రాప్తి యొక్క ఆధారము ఉంది. ఎక్కడ భాగ్యము ఉంటుందో, వరదానము ఉంటుందో అక్కడ కష్టమన్నదే ఉండదు.
ఎవరిదైతే చాలా మంచి చిత్రముగా ఉంటుందో, వారికి తప్పకుండా మొదటి నంబర్ వస్తుంది. మరి అందరూ ఫస్ట్ డివిజన్‌లోకి వచ్చేవారే కదా. ఫస్ట్ నంబర్ అయితే ఒక్కరే వస్తారు కానీ ఫస్ట్ డివిజన్ అయితే ఉంది కదా! కనుక ఎందులోకి రావాలి? ఫస్ట్ డివిజన్ అందరి కొరకు ఉంది. కనుక ఏదైనా చెయ్యటము మంచిది. వారు భారతదేశవాసులైనా లేక డబల్ విదేశీయులైనా, బాప్‌దాదా అయితే అందరికీ అవకాశాన్ని ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రిజల్టు వెలువడలేదు. ఒక్కోసారి మంచి మంచివి రిజల్టు వెలువడేదానికి ముందే తెలిసిపోతుంటాయి, ఆ స్థానము లభిస్తుంది కదా కనుక ఎవరు తీసుకోవాలనుకుంటే వారు తీసుకోండి, ఇప్పుడు అవకాశం ఉంది. మళ్ళీ తరువాత ఇక్కడ స్థానము లేదు అని బోర్డు పెట్టబడుతుంది కదా. ఈ సీట్ ఫుల్ అయిపోతుంది, కనుక బాగా పైకి ఎగరండి. పరుగెత్తద్దు, కానీ ఎగరండి. పరుగెత్తేవారు కిందనే ఉండిపోతారు, ఎగిరేవారు ఎగుర్తారు, ఎగుర్తూ ఉండండి మరియు ఇతరులను ఎగరింపజేస్తూ ఉండండి. అచ్ఛా!
నలువైపుల కల సర్వ శ్రేష్ఠ అదృష్టము యొక్క శ్రేష్ఠ చిత్ర స్వరూపులైన మహానాత్మలకు, సదా స్వయమును విశ్వమునకు ఆధారమూర్తులుగా అనుభవము చేసే ఆత్మలకు, సదా స్వయములోని ప్రాప్తి స్వరూప అనుభూతుల ద్వారా ఇతరులకు కూడా ప్రాప్తి స్వరూప అనుభవమును చేయించే శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా స్నేహము మరియు సహయోగములను పదమాగుణాలుగా అధికారముగా ప్రాప్తి చేసుకునే పూజ్య బ్రాహ్మణుల నుండి దేవ ఆత్మలుగా అయ్యేవారికి బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగత మిలనము - పార్టీలతో
బాబా హస్తము ఎల్లప్పుడు తలపైనే ఉంది - ఇలా అనుభవము చేస్తారా? శ్రేష్ఠ మతమే శ్రేష్ఠ హస్తము. కనుక ఎక్కడైతే ప్రతి అడుగులో బాబా యొక్క హస్తము(చెయ్యి) అనగా శ్రేష్ఠ మతము ఉంటుందో అక్కడ శ్రేష్ఠ మతము ద్వారా శ్రేష్ఠ కార్యము స్వతహాగానే అయిపోతుంది. సదా హస్తము యొక్క స్మృతి ద్వారా సమర్థులుగా అయ్యి ఉన్నతి చెందుతూ ఉండండి. బాబా హస్తము ఎల్లప్పుడూ ఉన్నతి చెందే అనుభవమును సహజంగా చేయిస్తుంది కనుక ఈ శ్రేష్ఠ భాగ్యమును ప్రతి కార్యములో స్మృతిలో ఉంచుకుని ఉన్నతి చెందుతూ ఉండండి. సదా హస్తము ఉంది, సదా విజయము ఉంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
