"మూడు రకాల స్నేహాలు మరియు హృదయపూర్వక స్నేహితులైన పిల్లల విశేషతలు"
సర్వ సంబంధాలను అనుభవం చేయించేవారు, దివ్యబుద్ధి, అనంతమైన బుద్ధి ప్రదాత అయిన బాప్‌దాదా తమ హృదయపూర్వక స్నేహి పిల్లలతో ఇలా మాట్లాడారు -
ఈరోజు బాప్‌దాదా తమ స్నేహీ, సహయోగీ మరియు శక్తిశాలీ - ఇటువంటి మూడు విశేషతలతో సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. ఈ మూడు విశేషతలు ఎవరిలో అయితే సమానంగా ఉంటాయో, వారే విశేష ఆత్మలలో ‘నంబర్‌వన్ ఆత్మ’. స్నేహితులు కూడా మరియు ప్రతి కార్యములో సహయోగులు కూడా, అలాగే శక్తిశాలురు కూడా. అందరూ స్నేహితులే కానీ స్నేహములో కూడా ఒకటేమో మనస్ఫూర్వకమైన స్నేహము, రెండవది సమయానుసారంగా చేసే స్నేహము, ఇది స్వార్థపూరితమైనది, మూడవది కష్టకాలంలో చేసే స్నేహము. ఎవరైతే మనస్ఫూర్వకమైన స్నేహము చేస్తారో అటువంటి వారి విశేషత - వారు సర్వ సంబంధాలు మరియు సర్వ ప్రాప్తులను సదాగా, సహజంగా, స్వతహాగా అనుభవము చేస్తారు. ఒక్క సంబంధము యొక్క అనుభూతిలో కూడా లోటు ఉండదు. ఎటువంటి సమయమో అటువంటి సంబంధముతో కూడిన స్నేహము యొక్క రకరకాల అనుభవమును చేసేవారిగా, సమయాన్ని తెలుసుకున్నవారిగా మరియు సమయప్రమాణంగా సంబంధాన్ని కూడా తెలుసుకున్నవారిగా ఉంటారు.
బాబా శిక్షకుని రూపములో చదువును చదివిస్తున్నప్పుడు, అటువంటి సమయములో ఒకవేళ ‘శిక్షకుని’ సంబంధాన్ని అనుభవము చెయ్యకుండా, ‘సఖుని’ రూపపు అనుభూతిలో, మిలనాన్ని జరుపుకోవటంలో లేక ఆత్మిక సంభాషణ చెయ్యటంలో ఉన్నట్లయితే చదువు వైపు అటెన్షన్ ఉండదు. చదువుకునే సమయములో, నేను శబ్దము నుండి దూరమైన స్థితిలో చాలా శక్తిశాలీ అనుభవమును చేస్తున్నాను అని ఒకవేళ ఎవరైనా అన్నట్లయితే, మరి చదువుకునే సమయములో ఇది సబబేనా? ఎందుకంటే బాబా శిక్షకుని రూపములో చదువు ద్వారా శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేయించేందుకు వచ్చినప్పుడు ఆ సమయములో టీచర్ ముందు ఈశ్వరీయ విద్యార్థి జీవితములో ఉండటమే సరియైనది. సమయాన్ని గుర్తించినదాని అనుసారంగా సంబంధాన్ని గుర్తించటము మరియు సంబంధము అనుసారంగా స్నేహ ప్రాప్తి యొక్క అనుభూతిని పొందటము అని దీనిని అంటాము. బుద్ధితో ఈ ఎక్సర్సైజ్ చేయించండి. ఎలా కావాలంటే, ఏ సమయములో కావాలంటే అలా స్వరూపము మరియు స్థితిలో స్థితులైపోగలగాలి.
ఎవరైనా చాలా లావుగా, భారీగా ఉంటే అటువంటివారు తమ శరీరాన్ని ఎలా కావాలంటే అలా సహజంగా త్రిప్పలేరు. అలాగే మందబుద్ధి ఉన్నట్లయితే అనగా ఎటువంటి వ్యర్థ భారముగానీ లేక వ్యర్థమైన చెత్తగానీ బుద్ధిలో నిండి ఉంటే, ఏదైనా అశుద్ధత ఉంటే అటువంటి బుద్ధి కలవారు ఏ సమయములో ఎలా కావాలంటే అలా బుద్ధిని మార్చుకోలేరు కనుక చాలా స్వచ్ఛమైన, కోమలమైన అనగా అతి సూక్ష్మ బుద్ధి, దివ్య బుద్ధి, అనంతమైన బుద్ధి, విశాల బుద్ధి కావాలి. ఇటువంటి బుద్ధి కలవారే సర్వ సంబంధాల అనుభవమును ఏ సమయములో కావాలంటే ఆ సమయములో, ఎటువంటి సంబంధము కావాలంటే అటువంటి సంబంధములో స్వయము యొక్క స్వరూపమును అనుభవము చెయ్యగలరు. కనుక అందరూ స్నేహితులే, కానీ సర్వ సంబంధాల స్నేహమును సమయ ప్రమాణంగా అనుభవము చేసేవారు ఎల్లప్పుడూ ఈ అనుభవములో ఎంత బిజీగా ఉంటారంటే, ప్రతి సంబంధములోని భిన్న-భిన్న ప్రాప్తులలో ఎంతగా లవలీనురై, మగనమైపోయి ఉంటారంటే ఏవిధమైనటువంటి విఘ్నమైనా తనవైపుకు లోబరుచుకోలేదు. కనుక స్వతహాగానే సహజ యోగి స్థితిని అనుభవము చేస్తారు. వీరినే నంబర్‌వన్ యథార్థ స్నేహీ ఆత్మ అని అంటాము. స్నేహము కారణంగా ఇటువంటి ఆత్మకు అవసరమైన సమయములో బాబా ద్వారా ప్రతి కార్యములో స్వతహాగానే సహయోగపు ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఈ కారణంగా ‘స్నేహము’ అఖండంగా, స్థిరంగా, నిశ్చలంగా, అవినాశిగా అనుభవమవుతుంది. అర్థమైందా? ఇదే నంబర్‌వన్ స్నేహము కలవారి విశేషత. రెండవదానిని గురించి, మూడవ దానిని గురించి వర్ణన చేసే అవసరమే లేదు ఎందుకంటే వాటిని గురించి అందరికీ చాలా బాగా తెలుసు. మరి బాప్‌దాదా ఇలా స్నేహీ పిల్లలను చూసారు. ఆది నుండి ఇప్పటివరకు స్నేహము ఏకరసంగా ఉందా లేక సమయప్రమాణంగా, సమస్య ప్రమాణంగా లేక బ్రాహ్మణ ఆత్మల సంపర్కము ప్రమాణంగా మారుతూ ఉందా? దీనివల్ల కూడా తేడా వస్తుంది కదా!
ఈరోజు స్నేహము గురించి వినిపించాము, సహయోగము మరియు శక్తిశాలి, మూడు విశేషతలూ కలవారి మహత్వమును గురించి తరువాత వినిపిస్తాము. మూడూ అవసరము. మీరందరూ అటువంటి స్నేహితులే కదా? ప్రాక్టీస్ ఉంది కదా? బుద్ధిని ఎప్పుడు, ఎక్కడ స్థిరంగా ఉంచుకోవాలనుకుంటే అక్కడ స్థిరంగా ఉంచాలి, ఇలా చెయ్యగలరు కదా? కంట్రోలింగ్ పవర్ ఉంది కదా? ముందుగా కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడే రూలింగ్ పవర్ (పరిపాలన శక్తి) వస్తుంది. ఎవరైతే స్వయమునే కంట్రోల్(అదుపు) చేసుకోలేరో, వారు రాజ్యమునేమి కంట్రోల్ చేస్తారు? కనుక స్వయమును కంట్రోల్లో నడిపించే శక్తి యొక్క అభ్యాసము ఇప్పటినుండే కావాలి, అప్పుడే రాజ్య అధికారిగా అవుతారు. అర్థమైందా? ఈరోజైతే కలిసేవారి కోటాను పూర్తి చెయ్యాలి. చూడండి, సంగమయుగములో సంఖ్యను బంధనములో ఎంతగా బంధించాలనుకున్నాగానీ బంధించగలరా? సంఖ్యకన్నా ఎక్కువమంది వచ్చేస్తారు, కనుక సమయాన్ని, సంఖ్యను మరియు ఏ శరీర ఆధారమునైతే తీసుకుంటారో వారినీ చూసి, ఆ విధితో నడవాల్సి ఉంటుంది. వతనములో వీటన్నింటినీ చూడవలసిన అవసరము ఉండదు ఎందుకంటే సూక్ష్మ శరీరాల గతి స్థూల శరీరము కంటే చాలా తీవ్రమైనది. ఒకవైపు సాకార శరీరధారి, మరొకవైపు ఫరిశ్తా స్వరూపము - ఇరువురూ నడవటంలో ఎంత తేడా ఉంటుంది! ఫరిశ్తాలు ఎంత సమయంలో చేరుకుంటారు మరియు శరీరధారులు ఎంత సమయంలో చేరుకుంటారు? చాలా తేడా ఉంది. బ్రహ్మా బాబా కూడా సూక్ష్మ శరీరధారిగా అయ్యి ఎంత తీవ్ర వేగముతో నలువైపుల సేవ చేస్తున్నారు! అదే బ్రహ్మా సాకార శరీరధారిగా ఉన్నారు మరియు ఇప్పుడు సూక్ష్మ శరీరధారిగా అయ్యి ఎంతటి తీవ్రగతితో ఉన్నతి చెందుతున్నారు మరియు ఇతరులను ఉన్నతి చేయిస్తున్నారు! దీనినైతే అనుభవము చేస్తున్నారు కదా!
సూక్ష్మ శరీర గతి ఈ ప్రపంచములోని వేగవంతమైన సాధనాలన్నింటికంటే కూడా చాలా తీవ్రమైనది. ఒకే ఒక్క క్షణంలో, ఒకే సమయములో అనేక ఆత్మలకు అనుభవము చేయించగలదు. ఎలా అంటే, మేము ఈ సమయములో బాబాను చూసాము లేక బాబాతో కలిసాము, నేను ఆత్మిక సంభాషణ చేసాను, నేను మిలనాన్ని జరుపుకున్నాను, నాకు సహాయము లభించింది అని ప్రతి ఒక్కరూ అంటారు ఎందుకంటే తీవ్రగతి కారణంగా, ఒకే సమయములో ప్రతి ఒక్కరికీ నేను అనుభవము చేసాను అన్నట్లుగా అనిపిస్తుంది. కనుక ఫరిశ్తా జీవితము బంధనముక్త జీవితము, సేవా బంధనము ఉన్నప్పటికీ ఎంత తీవ్రగతితో సేవ చేసినాగానీ, ఎంత సేవ చేస్తున్నా కానీ అంత సదా ఫ్రీగా ఉంటారు. ఎంతటి ప్రియమైనవారో, అంతగానే అతీతము. అందరిచేత చేయిస్తారు కానీ చేయిస్తూ కూడా అశరీరి ఫరిశ్తాగా ఉన్న కారణంగా ఎల్లప్పుడూ స్వతంత్రతా స్థితి అనుభవమవుతుంది ఎందుకంటే శరీరము మరియు కర్మల అధీనములో లేరు. మీకు ఈ అనుభవము ఉంది కదా - ఫరిస్తా స్థితిలో ఏదైనా కార్యము చేసినప్పుడు బంధనముక్తమును అనగా తేలికతనమును అనుభవము చేస్తారు కదా! మరియు ఎవరైతే ఉన్నదే ఫరిశ్తాలుగానో, లోకము కూడా అదే, శరీరము కూడా అదే అయినప్పుడు ఎటువంటి అనుభవము కలుగుతుంటుందో తెలుసుకోగలరు కదా. అచ్ఛా!
నలువైపుల ఉన్న సర్వ హృదయపూర్వక స్నేహి పిల్లలకు, సదా దివ్య, విశాల, అనంతమైన బుద్ధి కల పిల్లలకు, సదా బ్రహ్మా బాబా సమానంగా ఫరిశ్తా స్థితిని అనుభవము చేసి తీవ్రగతితో సేవలో, స్వ ఉన్నతిలో సఫలతను ప్రాప్తి చేసుకునేవారు, సదా సహయోగులుగా అయ్యి బాబా నుండి సహయోగపు అధికారమును అనుభవము చేసేటువంటి విశేష ఆత్మలకు, సమానులుగా అయ్యే మహానాత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పర్సనల్ మిలనము సమయములో వరదానము రూపములో ఉచ్ఛరించబడ్డ మహావాక్యాలు
1. సదా నిశ్చింత చక్రవర్తులు కదా! బాబాకు బాధ్యతను ఇచ్చేసినప్పుడు ఇక ఏ విషయములో చింత ఉంటుంది? తమపై బాధ్యతను పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఎలా అవుతుంది... అన్న చింత ఉంటుంది. బాబాకు అప్పగించేసినప్పుడు చింత ఎవరికుండాలి, బాబాకా లేక మీకా? బాబా అయితే సాగరుడు, వారిలో చింత ఉండనే ఉండదు. కనుక బాబా కూడా నిశ్చింతులు మరియు పిల్లలు కూడా నిశ్చింతులుగా అయిపోయారు. కనుక ఏ కర్మ చేసినా కర్మ చేసేదానికి ముందుగా నేను ట్రస్టీని అని భావించండి. ట్రస్టీ తన పనిని చాలా ప్రేమగా చేస్తాడు కానీ భారము ఉండదు. ట్రస్టీ అన్నదాని అర్థమే - అన్నీ బాబావే. కనుక మీవే అని అనుకోవటంలో ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది, తేలికగా కూడా ఉంటారు, పని కూడా మంచిగా అవుతుంది ఎందుకంటే ఎటువంటి స్మృతి ఉంటుందో, అటువంటి స్థితి ఉంటుంది. మీది అనగా బాబా స్మృతి. సాధారణ మహానాత్మ కారు, బాబా! కనుక మీదే అని అన్నప్పుడు కార్యము కూడా మంచిగా అవుతుంది మరియు స్థితి కూడా నిశ్చింతగా ఉంటుంది. మీ చింతను నాకు ఇవ్వండి అని బాబానే వచ్చి ఆఫర్ చేస్తున్నప్పుడు ఆ ఆఫర్‌ను అంగీకరించనట్లయితే దానిని ఏమంటారు? భారాన్ని వదలండి అన్నది బాబా ఇచ్చే ఆఫర్. కనుక సదా నిశ్చింతులుగా ఉండాలి మరియు నిశ్చింతులుగా అయిన అనుభవముతో ఇతరులకు నిశ్చింతగా ఉండే విధిని తెలపాలి. అప్పుడు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరి భారాన్నయినా లేక చింతనైనా తీసేసుకున్నట్లయితే వారు మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తారు. కనుక స్వయము కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు మరియు ఇతరుల నుండి శుభ భావనతో కూడిన ఆశీర్వాదాలు లభిస్తాయి. మీరు చక్రవర్తులు, అవినాశీ ధనానికి చక్రవర్తులు. చక్రవర్తికి చింతేముంటుంది! వినాశీ చక్రవర్తులకైతే చింత ఉంటుంది కానీ ఇది అవినాశి అయినది. అచ్ఛా!
2. అవినాశీ సుఖము మరియు అల్పకాలపు సుఖము - రెండింటి అనుభవము ఉంది కదా? స్థూల సాధనాల సుఖము అల్పకాలపు సుఖము, ఈశ్వరీయ సుఖము అవినాశీ సుఖము. కనుక అన్నింటికన్నా మంచి సుఖము ఏది? ఈశ్వరీయ సుఖము లభించినప్పుడు వినాశీ సుఖము దానికదే వెనక వెనకే వస్తుంది. ఎవరైనా ఎండలో నడుస్తున్నప్పుడు వారి వెనుక నీడ కూడా దానికదే వస్తుంటుంది, కానీ ఎవరైనా ఒకవేళ నీడ వెనుక పడినట్లయితే ఏమీ లభించదు. ఎవరైతే ఈశ్వరీయ సుఖము వైపుకు వెళ్తారో, వారి వెనుక అల్పకాలపు సుఖము స్వతహాగనే నీడలా వస్తుంటుంది, కష్టపడవలసిన అవసరము ఉండదు. ఎక్కడ పరమార్థము ఉంటుందో అక్కడ వ్యవహారము స్వతహాగానే ఋజువవుతుంది అని అంటారు. అలా ఈశ్వరీయ సుఖము ‘పరమార్థము’ మరియు వినాశీ సుఖము ‘వ్యవహారము’. కనుక పరమార్థము ముందు వ్యవహారము దానికదే వస్తుంది. కనుక సదా ఈ అనుభవములో ఉండాలి, దీనివలన రెండూ లభించాలి. లేదంటే ఒక్కటే లభిస్తుంది, అదికూడా వినాశీదే అవుతుంది. ఒక్కోసారి లభిస్తుంది, ఒక్కోసారి లభించదు ఎందుకంటే అదే వినాశి అయినది, ఇక దానినుండి ఏమి దొరుకుతుంది? ఈశ్వరీయ సుఖము లభించినప్పుడు సదా సుఖము కలవారిగా అవుతారు. దుఃఖము యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఈశ్వరీయ సుఖము లభించటము అనగా అన్నీ లభించటము, ఎటువంటి అప్రాప్తి ఉండదు. అవినాశీ సుఖము లభించినవారు అతీతులుగా అయ్యి వినాశీ వస్తువులను ఉపయోగిస్తారు, ఇరుక్కోరు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
