"హృదయాభిరాముడైన బాబా హృదయాన్ని గెలిచే ప్రియమైన పిల్లల గుర్తులు"
శ్రేష్ఠ కర్మల గతిని వినిపించే దిలారాముడైన బాప్‌దాదా తమ ప్రియమైన పిల్లలతో ఇలా మాట్లాడారు -
ఈరోజు హృదయాభిరాముడైన బాబా తమ ప్రియమైన (దిల్రుబా) పిల్లలను కలిసేందుకు వచ్చారు. హృదయాభిరాముడైన బాబా యొక్క ప్రియమైన పిల్లలు ప్రతి ఒక్కరూ అనగా ఎవరి హృదయములో అయితే సదా హృదయాభిరాముని స్మృతి అనే మధురమైన రాగము స్వతహాగా మ్రోగుతుంటుందో, అటువంటి ప్రియులు హృదయాభిరాముడైన బాబా హృదయాన్ని తమ స్నేహ రాగంతో జయించేవారు. హృదయాభిరాముడైన బాబా కూడా అటువంటి పిల్లల గుణగానము చేస్తారు. కనుక బాబా హృదయాన్ని జయించేవారు స్వతహాగానే మాయాజీతులుగా, జగత్జీతులుగానే ఉంటారు. ఎవరైనా హద్దు రాజ్య సింహాసనాన్ని జయిస్తే, జయించటము అనగా సింహాసనాధికారులుగా అవ్వటము. అలాగే ఎవరైతే బాబా హృదయాన్ని జయిస్తారో, వారు స్వతహాగానే సదా సింహాసనాధికారులుగా ఉంటారు. వారి మనసులో సదా బాబా ఉంటారు మరియు బాబా మనసులో సదా అటువంటి విజయి పిల్లలు ఉంటారు. మనసును జయించిన ఇటువంటి పిల్లలు శ్వాస శ్వాసలో అనగా ప్రతి క్షణము బాబా మరియు సేవల గానమును తప్ప మరే ఇతర గానమును గానము చెయ్యరు. ‘బాబా నావారు మరియు నేను బాబావానిని’ అన్న ఈ ఒక్క గానమే సదా మ్రోగుతుంటుంది. ఇటువంటివారినే హృదయాభిరాముడైన బాబా హృదయ సింహాసనాన్ని జయించిన ప్రియులు అని అంటాము.
రకరకాల రాగాలు ఉన్నాయా లేక ఒకే రాగము ఉందా అని బాప్‌దాదా ప్రియమైన పిల్లల ప్రతి ఒక్కరి మధుర రాగాన్ని వింటుంటారు. ఒక్కోసారి కొందరు తమ బలహీనతలను గురించిన పాటను పాడ్తారు, కొందరు బాబా పాటకు బదులుగా తమ పాటను కూడా పాడ్తారు. బాబా మహిమతోపాటు మీరు మీ మహిమను కూడా చేస్తారు. బాబాలో మీరు ఉన్నారు అనగా బాబా మహిమలో మీ మహిమ కూడా ఉండనే ఉంది. యథార్థ రాగం, బాబా గీతాన్ని గానము చెయ్యటమే శ్రేష్ఠ రాగము. హృదయాన్ని జయించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారి ప్రతి అడుగులో, దృష్టిలో, మాటలో, సంబంధ-సంపర్కములో ఒక్క బాబానే ప్రతి ఒక్కరికీ కనిపిస్తారు. నోరు వారిదైనాగానీ, ఈ మాటలు ఈ ఆత్మవి కావు కానీ శ్రేష్ఠమైన అథారిటీ కల మాటలు అనగా సర్వ శక్తివంతుని మాటలు అని వారి శక్తిశాలీ స్నేహపూర్వకమైన మాటలు స్వతహాగానే బాబాను ప్రత్యక్షము చేస్తాయి. వారి దృష్టిలోని ఆత్మీయత ఆత్మలకు బాబా యొక్క అనుభూతిని కలిగించేదిగా ఉంటుంది, వారి అడుగులో పరమాత్మ శ్రేష్ఠ మతమనే అడుగు ఉంటుంది, వీరు సాధారణమైన వ్యక్తులు కారు కానీ అవ్యక్త ఫరిశ్తాలు - అన్న ఇటువంటి అనుభూతిని కలిగించేవారినే హృదయాన్ని జయించి జగత్తును జయించినవారు అని అంటాము.
వాణి ద్వారా అనుభవమును చేయించటము సాధారణ విధి. మాటల ద్వారా ప్రభావాన్ని వేసేవారు ప్రపంచములో అనేకమంది ఉన్నారు. కానీ మీ మాటలు బాబా స్మృతిని కలిగించాలి, ఇదే మీ మాటల విశేషత. బాబాను ప్రత్యక్షము చేసే సిద్ధి, ఆత్మలకు సద్గతికి దారిని చూపించాలి. ఇది అతీతత్వము. ఎవరైనా మిమ్మల్ని చాలా బాగుంది, మీకు మాట్లాడే కళ ఉంది, అథారిటీతో కూడిన మాటలుగా ఉన్నాయి అని పొగడవచ్చు. ఇలా ఇతరులను కూడా పొగుడ్తారు, కానీ మీ మాటలు బాబా మహిమను అనుభవము చేయించాలి. ఈ విశేషతయే ప్రత్యక్షతా పరదాను తెరిచేందుకు సాధనము. కనుక ఎవరి మనసులో అయితే సదా మనోభిరాముడు ఉంటారో, వారి నోరు కూడా, మనసులోని శబ్దము మనోభిరాముడిని స్వతహాగానే ప్రత్యక్షము చేస్తుంది. కనుక నా ప్రతి అడుగులో, ప్రతి మాటలో, నా ద్వారా బాబా ప్రత్యక్షత జరుగుతుందా, నా మాటలు బాబాతో సంబంధాన్ని జోడింపచేసే మాటలుగా ఉంటున్నాయా అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చివరి సేవా పాత్ర - ప్రత్యక్షతా జెండాను ఎగురవేయటము. నా ప్రతి కర్మ శ్రేష్ఠ కర్మల గతిని వినిపించే బాబాను ప్రత్యక్షము చేసేవిగా ఉన్నాయా? ఎవరి మనసులో అయితే సదా బాబా ఉంటారో, వారు స్వతహాగానే సన్ షోస్ ఫాదర్(కొడుకు తండ్రిని ప్రత్యక్షము) చేసే సమీపులు అనగా సమానులైన పిల్లలు.
ఇప్పుడు నలువైపుల ‘మా బాబా’ అన్న శబ్దము మారుమ్రోగాలి. బ్రహ్మాకుమారీల బాబా కాదు, మా బాబా. ఎప్పుడైతే ఈ శబ్దము మారుమ్రోగుతుందో అప్పుడు స్వీట్ హోమ్(పరంధామము) ద్వారాలు తెరుచుకుంటాయి ఎందుకంటే మా బాబా అని అన్నప్పుడు ముక్తి వారసత్వము లభిస్తుంది మరియు వారు మీతో మరియు బాబాతోపాటుగా ఊరేగింపులోనివారిగా అయ్యి నడిచినా కానీ అందరూ అయితే తిరిగి వెళ్ళాల్సిందే, తీసుకువెళ్ళాల్సిందే. కనీసం ‘మా బాబా వచ్చారు’ - అన్న ఈ శబ్దమును చెవులతో వినే, బుద్ధితో తెలుసుకునే అధికారులుగా అయితే అవ్వాలి. ఎవ్వరు కూడా వంచితులుగా ఉండిపోకూడదు. విశ్వానికి తండ్రి, కనుక విశ్వములోని ఆత్మలకు ఈమాత్రం అంచలినైతే ఇవ్వాలి కదా! మీరైతే సాగరుడినే మింగారు, కానీ వారు ఒక్క నీటిచుక్క కోసం కూడా దాహంతో ఉన్నారు, వారికి చుక్కనైతే ప్రాప్తి చేయిస్తారు కదా. ఇందుకోసం ఏమి చెయ్యాల్సి వస్తుంది? ప్రతి అడుగు, ప్రతి మాట, బాబాను ప్రత్యక్షము చేసేవిగా ఉండాలి, అప్పుడు ఈ శబ్దము మారుమ్రోగుతుంది. కనుక బాబాను ప్రత్యక్షము చేసే ఇటువంటివారినే హృదయాభిరాముని ప్రియమైన పిల్లలు అని అంటాము, వీరి మనసులో ఒక్క బాబా రాగమే మ్రోగుతుంది. మరి అటువంటి ప్రియమైనవారిగా అయ్యారు కదా?
ఒక పాటను పాడినప్పుడు వేరే పాట స్వతహాగానే సమాప్తమైపోతుంది. కేవలము రెండు అక్షరాలలో శుభవార్తను వినిపించండి - ఓ.కే. (O.K) ఆత్మిక సంభాషణను చెయ్యండి. వేరే పాటను వినిపించేందుకు సమయాన్ని ఇవ్వకండి, సమయాన్ని తీసుకోకండి. శుభవార్తను వినిపించేందుకు సమయము పట్టదు కానీ రామకథను వినిపించేందుకు సమయము పడ్తుంది. బాప్‌దాదా ఇటువంటి మాటలను రామకథ అంటారు, కృష్ట కథ అని అనరు. ఇది 14 కళలు కలవారి కథ, 16 కళలు కలవారిది కాదు. రామకథను వినిపించేవారైతే కారు కదా?
ఇప్పుడు చాలా సేవ మిగిలి ఉంది. ఇప్పటివరకు ఏం చేసారని? ఆలోచించండి, 550 కోట్ల ఆత్మలు ఉన్నారు, కనీసం ఒక్క చుక్క అయినా ఇవ్వండి, కానీ ఇవ్వాల్సిందే. మీ భక్తులుగా అయినా లేక మీ ప్రజలుగా అయినా అవ్వనివ్వండి. దేవతలుగా అయినా కూడా ఇవ్వాల్సిందే. భక్తిలో దేవతలుగా అయ్యి పూజింపబడతారు కదా. కనుక మీరు ఇచ్చినప్పుడే మిమ్మల్ని దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రాప్తి కలిగినప్పుడే ప్రజలు కూడా గౌరవిస్తారు. మీరు తల్లిదండ్రులు అని వారు ఊరికే అలా ఎలా ఒప్పుకుంటారు? రాజులు కూడా తల్లిదండ్రులే. రెండువిధాలుగా ‘దాత’ పిల్లలు దాతలుగా అయ్యి ఇవ్వాలి. కానీ ఇస్తూ దాత యొక్క స్మృతిని కలిగించాలి. ఏం చెయ్యాలో అర్థమైందా? విదేశాలలో మరియు దేశములో చాలా సెంటర్లు తెరుచుకున్నాయి, చాలా చేసాము అని ఇలా భావించకండి. దయాహృదయులైన బాబా పిల్లలు కదా. దాహార్తులై, తపిస్తున్న తమ సోదర-సోదరీలపై అందరూ దయ చూపించాలి. ఎవరి ఫిర్యాదూ ఉండకూడదు. అచ్ఛా!
విదేశాల నుండి కూడా చాలా మంది ప్రేమికులు వచ్చారు. చాలామంది వచ్చినప్పుడు పంచాల్సి వస్తుంది కదా. సమయాన్ని కూడా పంచాల్సి వస్తుంది. రాత్రిని కూడా పగలు చేస్తారు, ఇంకేమి చేస్తారు. ఇందులో కూడా మహాదానులుగా అవ్వండి. బాబా స్నేహము నంబరువారీగా ఉన్నాకూడా అందరికంటే నంబర్‌వన్‌లు. బాబాకు నాపై ప్రేమ తక్కువగా ఉంది, వేరేవారిపై ఎక్కువ ఉంది అని ఇలా ఎప్పుడూ భావించకండి. అందరిపై ఎక్కువ ప్రేమ ఉంది. నోటి నుండి వచ్చే మాటలైతే ఒక్కోసారి కొందరితో ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది, ఒక్కోసారి తక్కువ మాట్లాడాల్సి వస్తుంది. కానీ మనసులోని ప్రేమను మాటలలో పంచలేము. బాబా దృష్టిలో పిల్లలు ప్రతి ఒక్కరూ నంబర్‌వన్‌లు. ఇప్పుడు నంబర్ ఎక్కడ ఔట్ అయింది? ఔట్ అయ్యేంతవరకూ ప్రతి ఒక్కరూ నంబర్వన్లే. ఎవరైనా నంబర్‌వన్‌లు కాగలరు. వినిపించాము కదా - బ్రహ్మా అయితే ఎల్లప్పుడూ నంబర్‌వన్‌గా ఉంటారు. కానీ ఫస్ట్ డివిజన్ - బాబాతోపాటు ఫస్ట్ సంబర్లోకి రావటము అనగా ఫస్ట్ డివిజన్‌లోకి రావటము. వారిని కూడా నంబర్‌వన్ అని అంటారు. కనుక ఎప్పటివరకైతే ఫైనల్ రిజల్ట్ వెలువడదో, అప్పటివరకు బాప్‌దాదా వర్తమాన సమయ ప్రమాణంగా చివరలో ఉన్నారు అని బాబాకు తెలిసినాకూడా చివర్లో ఉన్నారు అని భావించరు. ఎప్పుడైనా లాస్ట్ సో ఫాస్ట్ (చివర్లో వచ్చినా వేగంగా వెళ్ళేవారు)గా అవ్వగలరు, మార్జిన్ ఉంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే - చాలా వేగంగా వెళ్ళేవారు సమీపానికి చేరుకునేసరికి అలసిపోయి ఆగుతారు మరియు ఎవరైతే నెమ్మది నెమ్మదిగా నడుస్తారో, వారు ఆగరు, వారు సరైన పద్ధతిలో నడుస్తారు, కనుక చేరుకుంటారు కనుక ఇప్పుడు బాబా దృష్టిలో అందరూ నంబర్‌వన్‌లు. రిజల్ట్ ఔట్ అయినప్పుడు వీరు చివర, వీరు మొదట అని అంటారు. ఇప్పుడు చెప్పలేము కనుక స్వయముపై నిశ్చయము పెట్టుకుని ఎగుర్తూ ఉండండి.
బాప్‌దాదా మనసులో అందరినీ ఎగరింపజేసేంతగా ప్రేమ ఉంది. ఎప్పుడైనా రెండు మాటలు తక్కువ మాట్లాడితే, ప్రేమ తక్కువ ఉందని కాదు. మనసులో కూడా బాబా ప్రేమకు చెందిన శ్రేష్ఠ శుభ కామనలు సదా నిండి ఉంటాయి. ‘‘ఎగురుతూ ఉండండి’’ అని రెండు మాటలు చెప్పినాకూడా, వాటిలో కూడా ప్రేమ సాగరము ఇమిడి ఉంటుంది. బాబా నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు అని ఎవ్వరూ చెప్పజాలరు. ఒకవేళ అలా ఎవరైనా అంటే - నన్ను నీకంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తారు అని చెప్పండి. నిజంగానే ప్రేమిస్తాము, ఊరికే అలా అనము. కేవలం మనసును సంతోషపరిచేందుకు అలా అనము. మీరు ఎంతో భ్రమిస్తూ, అలసిపోతూ, తికమకపడిపోతూ 5000 సంవత్సరాల తరువాత కలిసారు అన్నది బాబాకు తెలుసు. బాబా వెతికి వెతికి మిమ్మల్ని కనుక్కొన్నారు. దక్షిణం, ఉత్తరం, పడమర, తూర్పు – అన్ని దిక్కుల నుండి మిమ్మల్ని పట్టుకున్నారు. మరి ఇంతగా వెతికి వెతికి పట్టుకున్నారంటే మీపై ఎంత ప్రేమ ఉండచ్చు! లేదంటే అసలు వెతకనే వెతకరు. సాగరుని వద్ద ప్రేమకు లోటు ఉంటుందా? ప్రతి ఒక్కరికీ బాబాపై మనస్ఫూర్వకమైన ప్రేమ ఎంతగా ఉంది అన్నదైతే మనోభిరామునికి తెలుసు. ఏమి జరిగినాగానీ ప్రేమలో అయితే అందరూ పాస్ అయ్యారు. బాబాపై ఉన్న ప్రేమకు సర్టిఫికేట్‌ను బాబా ముందే ఇచ్చేసారు. అచ్ఛా!
నలువైపుల ఉన్న అతి స్నేహభరితమైన మనసు రాగాన్ని వినిపించే హృదయాభిరాముని ప్రియమైన పిల్లలకు, సదా ప్రతి కర్మలో ‘సన్ షోస్ ఫాదర్’ చేసేవారు, సదా ప్రతి మాట ద్వారా బాబాతో సంబంధాన్ని జోడించేవారు, సదా తమ ఆత్మిక దృష్టి ద్వారా ఆత్మలకు బాబా అనుభవమును చేయించేవారు, బాబాను ప్రత్యక్షము చేసేవారు, బాబా హృదయ సింహాసనాన్ని జయించి మాయాజీతులు, జగత్‌జీతులుగా అయ్యే పిల్లలకు హృదయాభిరాముడైన బాబా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో వ్యక్తిగత మిలనము
స్మృతి శక్తి ప్రతి కార్యములో సదా ముందుకు తీసుకువెళ్ళే శక్తి. స్మృతి శక్తి సదాకాలమునకు శక్తిశాలిగా తయారుచేస్తుంది. స్మృతి శక్తి యొక్క అనుభూతి సర్వ శ్రేష్ఠ అనుభూతి. ఈ శక్తి ప్రతి కార్యములో సఫలతను అనుభవము చేయిస్తుంది. ఈ శక్తి యొక్క అనుభవము ద్వారా ముందుకు వెళ్ళే ఆత్మను - ఈ స్మృతిలో ఉంటూ ఎంత ఉన్నతి చెందాలనుకుంటే అంత ఉన్నతిని పొందగలరు. ఈ శక్తి ద్వారా విశేష సహయోగము ప్రాప్తిస్తుంటుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
