“సదా ప్రసన్నంగా ఎలా ఉండాలి?”
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తున్నారు. ఏం చూసారు? పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతి సమయం స్వయం ఎంత ప్రసన్నంగా ఉంటున్నారు, దానితో పాటు ఇతరులను స్వయం ద్వారా ఎంత ప్రసన్నంగా చేస్తున్నారు. ఎందుకంటే పరమాత్మ సర్వ ప్రాప్తుల యొక్క ప్రత్యక్ష స్వరూపంగా ప్రసన్నతయే ముఖంపై కనిపిస్తుంది. “ప్రసన్నత” బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారము. అల్పకాలిక ప్రసన్నతకు మరియు సదాకాలిక సంపన్నత యొక్క ప్రసన్నతకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అల్పకాలిక ప్రసన్నత అల్పకాలిక ప్రాప్తి పొందినవారి ముఖంపై కొంత సమయానికి తప్పకుండా కనిపిస్తుంది, కానీ ఆత్మిక ప్రసన్నత స్వయాన్ని అయితే తప్పకుండా ప్రసన్నంగా చేస్తుంది, అంతేకాక ఆత్మిక ప్రసన్నత యొక్క వైబ్రేషన్లు ఇతర ఆత్మల వరకు చేరుకుంటాయి, ఇతర ఆత్మలు కూడా శాంతి మరియు శక్తిని అనుభవం చేస్తారు. ఎలాగైతే, ఫలాలతో ఉన్న వృక్షం తన శీతలమైన నీడలో కొంత సమయం కోసం మానవులకు శీతలతను అనుభవం చేయిస్తుంది మరియు మానవులు ప్రసన్నంగా అవుతారు. అలాగే, పరమాత్మ ప్రాప్తులనే ఫలాలతో సంపన్నమై, ఆత్మిక ప్రసన్నత కలిగిన ఆత్మ, ఇతరులకు కూడా తన ప్రాప్తులనే నీడతో వారి తనువు-మనసుకు శాంతి మరియు శక్తిని అనుభవం చేయిస్తుంది. ప్రసన్నతా వైబ్రేషన్లు సూర్య కిరణాల సమానంగా వాయుమండలానికి, వ్యక్తులకు, ఇతర అన్ని విషయాలను మరపింపజేసి సత్యమైన ఆత్మిక శాంతి యొక్క, సంతోషం యొక్క అనుభూతిలోకి పరివర్తన చేసేస్తాయి. వర్తమాన సమయంలోని అజ్ఞానీ ఆత్మలు తమ జీవితంలో చాలా ఖర్చు చేసైనా సరే, ప్రసన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఏం ఖర్చు చేసారు? పైసా ఖర్చు చేయకుండానే సదా ప్రసన్నంగా ఉంటారు కదా! లేదా ఇతరుల సహాయంతో ప్రసన్నంగా ఉంటారా? బాప్‌దాదా పిల్లల చార్టును చెక్ చేసారు. ఏం చూసారు? ఒకరేమో - సదా ప్రసన్నంగా ఉండేవారు, రెండవవారు- ప్రసన్నంగా ఉండేవారు. ‘సదా’ అనే పదం లేదు. ప్రసన్నత కూడా మూడు రకాలైనవి చూసారు. 1. స్వయంతో ప్రసన్నము 2. ఇతరుల ద్వారా ప్రసన్నము 3. సేవ ద్వారా ప్రసన్నము. ఒకవేళ మూడింటిలోనూ ప్రసన్నంగా ఉన్నట్లయితే బాప్‌దాదాను స్వతహాగానే ప్రసన్నం చేస్తారు. మరియు ఏ ఆత్మపైన అయితే తండ్రి ప్రసన్నంగా ఉంటారో, వారు సదా సఫలతామూర్తులుగా ఉండనే ఉంటారు.
బాప్‌దాదా చూసారు - చాలామంది పిల్లలు తమతో తాము కూడా అప్రసన్నంగా ఉంటారు. చిన్న విషయం కారణంగా అప్రసన్నంగా ఉంటారు. మొట్టమొదటి పాఠం – ‘నేను ఎవరు’ దీనిని తెలుసుకుని కూడా మర్చిపోతారు. ఏదైతే తండ్రి తయారుచేసారో, ఇచ్చారో దానిని మర్చిపోతారు. బాబా ప్రతి ఒక్క బిడ్డను పూర్తి వారసత్వానికి అధికారిగా తయారుచేసారు. కొందరికి పూర్తిగా, కొందరికి సగం వారసత్వం ఇవ్వలేదు. ఎవరికైనా సగం లేక పావు భాగం లభించిందా? సగం లభించిందా లేక సగం తీసుకున్నారా? బాబా అయితే అందరికీ మాస్టర్ సర్వశక్తిమంతులు అనే వరదానం లేక వారసత్వం ఇచ్చారు. పిల్లలకు కొన్ని శక్తులే ఇచ్చి, కొన్ని ఇవ్వలేదు అని కాదు. తమ కోసం ఏమీ ఉంచుకోలేదు. సర్వగుణ సంపన్నులుగా తయారుచేసారు, సర్వ ప్రాప్తి స్వరూపులుగా తయారుచేసారు. కానీ తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో, వాటిని స్వయంలో ఇముడ్చుకోరు. ఎలాగైతే, స్థూల ధనం లేక సాధనాలు ప్రాప్తించినా కూడా, ఖర్చు చేయడం రాకపోయినా లేదా సాధనాలను ఉపయోగించడం రాకపోయినా, ప్రాప్తి ఉన్నా కూడా వాటి నుండి వంచితులవుతారు. అలాగే, అన్ని ప్రాప్తులు లేక ఖజానాలు అందరి వద్దా ఉన్నాయి, కానీ కార్యంలో ఉపయోగించే విధి రాదు మరియు సమయానికి ఉపయోగించడం కూడా రాదు. తర్వాత అంటారు - నేను అర్థం చేసుకున్నాను ఇది చేయాలి, ఇది చేయకూడదు అని కానీ ఆ సమయంలో మర్చిపోయాను. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను ఆ విధంగా జరిగి ఉండకూడదు అని. ఆ సమయంలో ఒక్క సెకండు గడిచిపోయినా కూడా, సఫలత యొక్క గమ్యానికి చేరుకోలేరు ఎందుకంటే సమయం అనే బండి వెళ్ళిపోయింది. ఒక సెకండు ఆలస్యం చేసినా, ఒక గంట ఆలస్యం చేసినా సమయమైతే వెళ్ళిపోయింది కదా. మరియు ఎప్పుడైతే సమయం అనే బండి వెళ్ళిపోతుందో, అప్పుడు స్వయంతో నిరాశ పడిపోతారు. మరియు అప్రసన్నత యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి - నా భాగ్యమే ఇలా ఉంది, డ్రామాలో నా పాత్రే ఇలా ఉంది అని అంటారు. ఇంతకుముందు కూడా వినిపించడం జరిగింది - స్వయంతో అప్రసన్నంగా ఉండటానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి. మొదటిది - నిరాశ పడడం, రెండవ కారణం - ఇతరుల విశేషత, భాగ్యం లేదా పాత్రను చూసి ఈర్ష్య ఉత్పన్నమవ్వడము. ధైర్యం తక్కువ ఉంటుంది, ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. నిరాశ పడేవారు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు మరియు ఈర్ష్య పడేవారు కూడా ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు. ఎందుకంటే ఈ రెండు విషయాలలోనూ అటువంటి ఆత్మల కోరిక ఎప్పుడూ పూర్తి అవ్వదు. కోరికలు మంచిగా అవ్వనివ్వవు, అందుకే ప్రసన్నంగా ఉండరు. ప్రసన్నంగా ఉండేందుకు సదా ఒక విషయాన్ని బుద్ధిలో ఉంచుకోండి - డ్రామా నియమానుసారంగా సంగమయుగంలో ప్రతి బ్రాహ్మణాత్మకు ఏదో ఒక విశేషత లభించి ఉంది. మాలలో చివరి 16,000 వ పూస అయినా కానీ, వారికి కూడా ఏదో ఒక విశేషత లభించి ఉంది. దాని కన్నా ఇంకా ముందుకు వెళ్ళండి, 9 లక్షలు అని ఏదైతే అంటూ ఉంటారో, వారికి కూడా ఏదో ఒక విశేషత లభించి ఉంది. మీ విశేషతను మొదట గుర్తించండి. ఇప్పుడింకా 9 లక్షల వరకు చేరుకోనే లేదు. కనుక బ్రాహ్మణ జన్మకు గల భాగ్యం యొక్క విశేషతను గుర్తించండి మరియు కార్యంలో పెట్టండి. కేవలం ఇతరుల విశేషతలను చూసి నిరాశలోకి లేక ఈర్ష్యలోకి రాకండి. కానీ తమ విశేషతను కార్యంలో పెట్టినట్లయితే, ఒక్క విశేషత ఇతర విశేషతలను తీసుకొస్తుంది. ఒకటి పక్కన బిందువు పెడుతూ వెళ్తే దాని విలువ ఎంత అవుతుంది? ఒకటి పక్కన ఒక బిందువు పెట్టినట్లయితే 10 అవుతుంది, రెండవ బిందువు పెట్టినట్లయితే 100 అయిపోతుంది, మూడవది పెట్టినట్లయితే... ఈ లెక్క అయితే వస్తుంది కదా. కార్యంలో పెట్టడం అనగా పెంచడము. ఇతరులను చూడకండి. మీ విశేషతను కార్యంలో పెట్టండి. ఎలా అయితే, చూడండి, బాప్‌దాదా ఎప్పుడూ భోలీ భండారీ (భోలీ దాదీ) ఉదాహరణను ఇస్తారు. మహారథుల పేర్లు అప్పుడప్పుడు వస్తాయి, కానీ వీరి పేరు ఎక్కువగా వస్తుంది. ఏ విశేషత అయితే ఉందో, దానిని కార్యంలో పెట్టారు. వారు భండారానే సంభాళించారు, కానీ విశేషతను కార్యంలో పెట్టిన కారణంగా విశేషాత్మగా మహిమ చేయబడ్డారు. అందరూ మధుబన్ను వర్ణించేటప్పుడు దాదీల విషయాలను వినిపిస్తారు మరియు భోలీ దాదీ గురించి కూడా వినిపిస్తారు. భాషణ అయితే చేయరు కానీ విశేషతను కార్యంలో పెట్టడం ద్వారా స్వయం విశేషంగా అయిపోయారు. ఇతరులు కూడా విశేషమైన దృష్టితో చూస్తారు. కనుక ప్రసన్నంగా ఉండటానికి ఏం చేస్తారు? విశేషతను కార్యంలో పెట్టండి. అప్పుడు వృద్ధి చెందుతుంది మరియు ఎప్పుడైతే అన్ని విశేషతలు వచ్చేస్తాయో, అప్పుడు సంపన్నంగా అయిపోతారు. మరియు ప్రసన్నతకు ఆధారం - సంపన్నత. ఎవరైతే స్వయంతో ప్రసన్నంగా ఉంటారో, వారు ఇతరులతో కూడా ప్రసన్నంగా ఉంటారు, సేవతో కూడా ప్రసన్నంగా ఉంటారు. ఏ సేవ లభించినా, అందులో ఇతరులను ప్రసన్నం చేసి సేవలో ముందు నంబరు తీసుకుంటారు. అన్నింటికంటే అతి గొప్ప సేవ - మీ ప్రసన్నమూర్తి చేస్తుంది. కనుక విన్నారు కదా, ఏ చార్టును చూసారో! అచ్ఛా.
టీచర్లకు ముందు కూర్చొనే భాగ్యం లభించింది ఎందుకంటే పండాలుగా (మార్గదర్శకులుగా) అయి వచ్చారు కనుక చాలా శ్రమ చేస్తారు. ఒకరిని సుఖధామ్ నుండి పిలుస్తారు, మరొకరిని విశాల భవన్ నుండి పిలుస్తారు. వ్యాయామం మంచిగా అవుతుంది కదా. సెంటర్లోనైతే నడవడం చేయరు కదా. మొదట్లో సేవను ఆరంభించినప్పుడు నడుచుకొని వెళ్ళేవారు కదా. మీ పెద్ద దాదీలు కూడా నడిచి వెళ్ళేవారు. సామాన్ల సంచి చేతితో పట్టుకొని నడిచి వెళ్ళేవారు. ఈ రోజుల్లో అయితే మీరందరూ అంతా తయారైపోయిన తర్వాత వచ్చారు, కనుక అదృష్టవంతులు కదా. తయారై ఉన్న సెంటర్లు లభించాయి. మన ఇళ్ళు అయిపోయాయి. మొదట్లో అయితే, యమునా నది తీరంలో ఉండేవారు. రాత్రి నిద్రించడానికి, పగలు సేవ చేయడానికి ఒకటే గది ఉండేది. కానీ సంతోషంతో ఏదైతే త్యాగం చేసారో, దాని భాగ్యం యొక్క ఫలాన్ని ఇప్పుడు తింటున్నారు. మీరు ఫలాన్ని తినే సమయంలో వచ్చారు. నాటింది వారు, మీరు తింటున్నారు. ఫలం తినడమైతే చాలా సహజం కదా. ఇప్పుడు అలాంటి ఫల స్వరూపమైన క్వాలిటీని తయారుచేయండి. అర్థమయిందా? క్వాంటిటీ (సంఖ్య) అయితే ఉండనే ఉంది మరియు క్వాలిటీ కూడా కావాలి. 9 లక్షల వరకు వెళ్ళాలంటే క్వాంటిటీ మరియు క్వాలిటీ రెండూ కావాలి. కానీ 16 వేల పక్కా మాలనైతే తయారుచేయండి. ఇప్పుడు క్వాలిటీ యొక్క సేవపైన విశేష గమనం ఉంచండి.
ప్రతి గ్రూపులో టీచర్లు కూడా వస్తారు, కుమారీలు కూడా వస్తారు కానీ వెలువడరు. మధుబన్ మంచిగా అనిపిస్తుంది, బాబా పట్ల ప్రేమ కూడా ఉంది కానీ సమర్పణ అవ్వటానికి ఆలోచిస్తారు. ఎవరైతే స్వయాన్ని ఆఫర్ చేసుకుంటారో, వారు నిర్విఘ్నంగా నడుస్తారు మరియు ఎవరైతే చెప్పడం వలన నడుస్తారో వారు ఆగుతారు మళ్ళీ నడుస్తూ ఉంటారు. వారైతే పదే-పదే మిమ్మల్నే అంటూ ఉంటారు - మేమైతే ముందే చెప్పాము కదా, మేము సరెండర్ అయి ఉండాల్సింది కాదు. కొంతమంది ఆలోచిస్తారు - దీనికంటే బయట ఉండి సేవ చేయడం మంచిది అని. కానీ బయట ఉండి సేవ చేయడం మరియు త్యాగం చేసి సేవ చేయడం - దీనిలో తప్పకుండా వ్యత్యాసముంటుంది. ఎవరైతే సమర్పణ యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారో, వారు ఎల్లప్పుడూ స్వయాన్ని అనేక విషయాల నుండి దూరం చేసుకొని విశ్రాంతిగా వచ్చేసారు, అనేక శ్రమల నుండి విడిపించబడ్డారు. కనుక టీచర్లు తమ మహత్వాన్ని మంచి రీతిగా తెలుసుకున్నారు కదా? ఉద్యోగం మరియు ఈ సేవ - రెండు పనులు చేసేవారు మంచివారా లేక ఒక పని చేసేవారు మంచివారా? అయినా కూడా, వారికైతే డబల్ పాత్రను పోషించాల్సి ఉంటుంది. నిర్బంధనంగా ఉన్నారు, కానీ డబల్ పాత్ర అయితే ఉంది కదా. మీదైతే ఒకటే పాత్ర ఉంది. ప్రవృత్తి వారైతే మూడు పాత్రలు పోషించాల్సి ఉంటుంది - ఒకటేమో చదువు, రెండవది సేవ మరియు దానితో పాటు ప్రవృత్తిని పాలన చేసే పాత్ర. మీరైతే అన్ని విషయాల నుండి విడిపించబడ్డారు. అచ్ఛా.
సర్వ సదా ప్రసన్నత యొక్క విశేషత సంపన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా తమ విశేషతను గుర్తించి కార్యంలో పెట్టేటువంటి తెలివైన మరియు సారయుక్తమైన ఆత్మలకు, సదా ప్రసన్నంగా ఉండేటువంటి, ప్రసన్నంగా చేసేటువంటి శ్రేష్ఠత కలిగిన మహాన్ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఆగ్రా - రాజస్థాన్ జోన్‌తో అవ్యక్త బాప్‌దాదా మిలనము:- సదా స్వయాన్ని అకాల సింహాసనాధికారి శ్రేష్ఠాత్మలుగా అర్థం చేసుకుంటున్నారా? ఆత్మ అకాల్ అయినప్పుడు, దాని సింహాసనం కూడా అకాల సింహాసనం అయిపోయింది కదా. ఆత్మ ఈ సింహాసనంపై కూర్చుని ఎన్ని పనులు చేస్తుంది. సింహాసనాధికారి ఆత్మను, ఈ స్మృతి ద్వారా స్వరాజ్యం యొక్క స్మృతి స్వతహాగానే వస్తుంది. రాజు కూడా ఎప్పుడైతే సింహాసనంపై కూర్చుంటారో, అప్పుడు రాజ్యం యొక్క నషా, రాజ్యం యొక్క సంతోషం స్వతహాగానే ఉంటాయి. సింహాసనాధికారి అనగా స్వరాజ్యాధికారి రాజును - ఈ స్మృతి ద్వారా అన్ని కర్మేంద్రియాలు స్వతహాగానే ఆర్డర్ అనుసారంగా నడుస్తాయి. ఎవరైతే, అకాల సింహాసనాధికారి అని అర్థం చేసుకుని నడుచుకుంటారో, వారి కోసం తండ్రి హృదయ సింహాసనం కూడా ఉంటుంది ఎందుకంటే ఆత్మ అని అర్థం చేసుకుంటే తండ్రి మాత్రమే గుర్తుకొస్తారు. మరి అప్పుడు దేహమూ లేదు, దేహ సంబంధాలూ లేవు, పదార్థాలు లేవు, ఒక్క బాబాయే సంసారము. అందుకే అకాల సింహాసనాధికారి తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారిగా కూడా అవుతారు. తండ్రి హృదయంలో ఏ పిల్లలు ఉంటారంటే - ‘‘ఎవరైతే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు’’ అని అనుకుంటారో. కనుక డబల్ సింహాసనం అయిపోయింది. ఎవరైతే చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలుగా ఉంటారో, ప్రియంగా ఉంటారో, వారిని ఎల్లప్పుడూ ఒడిలో కూర్చోబెట్టుకుంటారు, పైన కూర్చోబెడతారు, కింద కాదు. కనుక బాబా కూడా అంటారు - సింహాసనంపై కూర్చోండి, కిందకు రాకండి. ఎవరికైతే సింహాసనం లభిస్తుందో, వారు వేరే స్థానంలో కూర్చొంటారా ఏమిటి? కనుక అకాల సింహాసనాన్ని లేదా హృదయ సింహాసనాన్ని మర్చిపోయి దేహమనే నేలపైకి, మట్టిలోకి రాకండి. దేహాన్ని మట్టి అని అంటారు కదా. మట్టి, మట్టిలో కలిసిపోతుంది - ఇలా అంటారు కదా! కనుక దేహంలోకి రావడం అనగా మట్టిలోకి రావడము. ఎవరైతే రాయల్ పిల్లలు ఉంటారో, వారెప్పుడూ మట్టిలో ఆడరు. పరమాత్మ పిల్లలు అంటే అందరికంటే రాయల్ అయినట్లు. కనుక సింహాసనంపై కూర్చోవడం మంచిగా అనిపిస్తుందా లేక మట్టిలోకి కూడా వెళ్ళి చూడాలి అని కొద్ది-కొద్దిగా మనసులో అనిపిస్తుందా. చాలామంది పిల్లలకు మట్టిని తినే లేదా మట్టిలో ఆడుకునే అలవాటు ఉంటుంది. మరి అలా అయితే లేరు కదా. 63 జన్మలు మట్టితో ఆడుకున్నారు. ఇప్పుడు తండ్రి సింహాసనాధికారిగా చేస్తున్నారు, కనుక మట్టితో ఎలా ఆడుకుంటారు? ఎవరైతే మట్టిలో ఆడుకుంటారో, వారు మలినంగా అవుతారు. మీరు కూడా ఎంత మలినంగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి స్వచ్ఛంగా తయారుచేసారు - సదా ఈ స్మృతి ద్వారా సమర్థంగా అవ్వండి. శక్తిశాలిగా ఉన్నవారు ఎప్పుడూ బలహీనంగా అవ్వరు. బలహీనంగా అవ్వడం అనగా మాయ యొక్క వ్యాధి రావడము. ఇప్పుడైతే సదా ఆరోగ్యవంతులుగా అయిపోయారు. ఆత్మ శక్తిశాలిగా అయిపోయింది. శరీరం యొక్క లెక్కాచారాలు వేరే విషయం, కానీ మనసు శక్తిశాలిగా అయిపోయింది కదా. శరీరం బలహీనంగా ఉంది, నడవడం లేదు, ఇది చివరి శరీరం, ఇలా అయితే జరిగేదే ఉంది, కానీ ఆత్మ శక్తిశాలిగా ఉండాలి. శరీరంతో పాటు ఆత్మ బలహీనమవ్వకూడదు. కనుక సదా గుర్తుంచుకోండి - డబల్ సింహాసనాధికారి నుండి డబల్ కిరీటధారిగా అయ్యేవారము. అచ్ఛా.
అందరూ సంతుష్టంగా ఉన్నారు కదా! సంతుష్టత అనగా ప్రసన్నత. సదా ప్రసన్నంగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? అప్పుడప్పుడు అప్రసన్నంగా, అప్పుడప్పుడు ప్రసన్నంగా - ఇలా అయితే కాదు కదా? ఎప్పుడైనా ఏదైనా విషయంలో అప్రసన్నంగా అవ్వడం లేదు కదా? ఈ రోజు ఇది చేసేసాము, ఈరోజు ఇలా అయిపోయింది, నిన్న అలా అయిపోయింది - ఇలాంటి ఉత్తరాలైతే రాయరు కదా? సదా ప్రసన్నచిత్తులుగా ఉండేవారు తమ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా ఇతరులను కూడా ప్రసన్నులుగా చేస్తారు. నేనైతే ప్రసన్నంగానే ఉంటాను అని కాదు, కానీ ప్రసన్నతా శక్తి తప్పకుండా వ్యాపిస్తుంది. ఇతరులు ఎవరినైనా కూడా ప్రసన్నంగా చేయగలిగే విధంగా ఉన్నారా లేక మీ వరకు మాత్రమే ప్రసన్నంగా ఉన్నారా? ఇతరులను కూడా ప్రసన్నంగా చేసినట్లయితే, అప్పుడిక ఉత్తరాలేవీ రావు. ఒకవేళ ఏదైనా అప్రసన్నతను తెలిపే ఉత్తరం వచ్చినట్లయితే, దానిని తిరిగి వారికే పంపించేయండి కదా! ఈ సమయాన్ని మరియు ఈ తారీఖును గుర్తు పెట్టుకోండి. ఈ ఉత్తరం రాయండి - నేను ఓ.కే గా ఉన్నాను మరియు అందరూ నాతో కూడా ఓ.కే గా ఉన్నారు. ఈ రెండు లైన్లు వ్రాయండి, చాలు. నేను కూడా ఓ.కే, ఇతరులు కూడా నాతో ఓ.కే గా ఉన్నారు. ఇంత ఖర్చు ఎందుకు చేస్తారు? ఈ రెండు లైన్లు అయితే కార్డు పైన కూడా వచ్చేస్తాయి మరియు పదే-పదే కూడా రాయకండి. చాలామంది రోజూ కార్డు పంపిస్తారు, రోజూ పంపించకండి. నెలలో రెండు సార్లు, 15 రోజులకు ఒకసారి ఓ.కే యొక్క కార్డు వ్రాయండి, వేరే కథలేవీ వ్రాయకండి. తమ ప్రసన్నత ద్వారా ఇతరులను కూడా ప్రసన్నంగా తయారుచేయండి. అచ్ఛా.
గుజరాత్ గ్రూప్ :- సదా మిమ్మల్ని మీరు బాబా యొక్క సికిలధేలుగా భావిస్తున్నారా? సికిలధే అనగా ఎంతో ప్రేమతో బాబా మనల్ని వెతికారు. బాబా ఎంతో ప్రేమతో మిమ్మల్ని వెతికారు. మీరు వెతికారు కానీ దొరకలేదు. పరిచయమే లేనప్పుడు ఎలా లభిస్తారు? కానీ బాబాయే మిమ్మల్ని వెతికారు, అందుకే సికిలధే అంటారు. మరి ఎవరినైతే తండ్రి స్వయంగా వెతికారో వారు ఎంతటి భాగ్యవంతులో కదా! ప్రపంచం వారు బాబాను వెతుకుతున్నారు, మీరైతే మిలనం జరుపుకుంటున్నారు. మీరెంత కొద్దిమందో, చాలామందికి ఈ పాత్రే లేదు. కొద్దిమందికే ఈ పాత్ర ఉంది, అందుకే ‘కోట్లలో కొందరే’ అని గానం చేయబడింది. అక్షౌహిణి సేన అని గానం చేయబడలేదు, ‘కోట్లలో కొందరే’ అని గానం చేయబడింది. కాబట్టి ఈ సంతోషం లేదా స్మృతి సదా ఇమర్జ్ అయి ఉండాలి. ప్రతి అడుగులోనూ సంతోషం అనుభవమవ్వాలి. అల్పకాలిక ప్రాప్తి పొందేవారి ముఖంలోనే ఆ ప్రాప్తి యొక్క రేఖ మెరుస్తూ ఉంటుంది. మీకు లభించినది సదాకాలిక ప్రాప్తి. మరి ముఖం సదా సంతోషంతో కనిపించాలి, ఉదాసీనంగా ఉండకూడదు. మాయకు దాసుడిగా మారేవాడే ఉదాసీనంగా (దిగులుగా) ఉంటాడు. మీరు ఎవరు? మాయకు దాసులా లేక యజమానులా? మాయను తమ అథారిటీతో తరిమికొట్టేవారు; అలాంటి ఆత్మలు ఎన్నడూ దిగులుగా ఉండలేరు. ఎలాంటి బెంగా లేదు కదా. ఏదైనా బెంగ లేదా చింత ఉంటేనే దిగులు వస్తుంది. మీకు ఏ చింత ఉంది? పాండవులకు చింత ఉందా? సంపాదించాలనే చింత, కుటుంబాన్ని పోషించడానికి డబ్బుల చింత ఉందా? కానీ చింతించడం వల్ల ధనం ఎన్నడూ రాదు. శ్రమించండి, సంపాదించండి. కానీ చింతతో సంపాదనలో ఎన్నడూ సఫలం కాలేరు. చింతను విడిచి కర్మయోగిగా మారి పనిచేయండి; ఎక్కడైతే యోగం ఉంటుందో అక్కడ కార్యకుశలత ఉంటుంది మరియు సఫలత లభిస్తుంది. చింత ద్వారా ఎన్నడూ ధనం రాదు. ఒకవేళ చింతతో సంపాదించిన ధనం వచ్చినా అది చింతలనే సృష్టిస్తుంది. విత్తనం ఎలా ఉంటుందో ఫలం కూడా అలాగే వస్తుంది; అదే సంతోషంగా పనిచేస్తూ సంపాదిస్తే ఆ ధనం కూడా సంతోషాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ రెండు రూపాయలు కూడా రెండు వేల రూపాయల పనిని చేస్తాయి, మరియు ఆ రెండు లక్షలు కేవలం రెండు రూపాయల పనే చేస్తాయి. ఇంత వ్యత్యాసం ఉంది, అందుకే చింత ఎందుకు చేస్తారు? నిజమైన హృదయం కలవారికి సత్యమైన సంపాదన లభిస్తుంది. బాబా కూడా పప్పు-రొట్టెను తప్పక ఇస్తారు. బద్ధకస్తులకు ఇవ్వరు. పని అయితే తప్పక చేయాల్సిందే, ఎందుకంటే మునుపటి లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి కదా. కానీ చింతతో కాదు, సంతోషంతో చేయాలి. ఏ పని చేసినా - యోగయుక్తంగా ఉండి చేయండి. యోగి యొక్క కార్యం సహజంగానూ మరియు సఫలంగానూ అవుతుంది, ఇలాంటి అనుభవం ఉంది కదా! స్మృతిలో ఉంటూ ఏ పని చేసినా అలసట ఉండదు. సంతోషంగా చేస్తే అలసిపోరు. బలవంతంగా చేస్తే అలసిపోతారు. యోగంతో లెక్కాచారాలను తీర్చుకోండి అని బాబా డైరెక్షన్ ఇచ్చారు. కాబట్టి బాబా డైరెక్షన్ అనుసారంగా సంతోషంగా ఆ పనిని కూడా చేయండి తప్ప బలవంతంగా కాదు. అదొక బంధనమని తెలుసు, కానీ మాటిమాటికీ ఆ మాట అనడం వల్ల అది ఇంకా పెద్ద కఠిన బంధనంగా మారిపోతుంది. మాతలు చాలావరకు - మా బంధనం ఎప్పటికి తీరుతుంది? ఇది కూడా ఎలాంటి బంధనంగా మారిపోయింది? అని అంటుంటారు. ఇది బంధనమని తెలుసు, కానీ యోగం ద్వారా బంధనముక్తులుగా ఎలా అవ్వాలి అని ఆలోచించండి; అలాగని దీని గురించి కూడా మరీ ఎక్కువగా ఆలోచించకండి. ఆలోచించడం వల్ల ఏమీ జరగదు, చేయడం వల్ల జరుగుతుంది. ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగానే అదే సమయానికి అంతిమ ఘడియ వచ్చేస్తే ఇక ఏమవుతుంది? బంధనం ఉంది, బంధనం ఉంది అని ఇదే ఆలోచిస్తూ వెళ్తే ఎక్కడికి వెళ్తారు? పంజరంలోకే వెళ్తారు! అంతిమంలో బంధనం గుర్తుంటే గర్భ-జైలుకు వెళ్ళాల్సి వస్తుంది; అదే సంతోషంగా వెళ్తే అడ్వాన్స్ పార్టీలోకి సేవల కొరకు వెళ్తారు. అందువలన ఎన్నడూ మీతో మీరు విసుగు చెందకండి. సంతోషంగా ఉండండి. ఏమి చేయాలి, ఎలా చేయాలి... అనే ఈ పాటను పాడకండి. సంతోషపు పాటలను పాడండి.
ప్రవృత్తి మార్గంలో ఉండేవారు అలసిపోవట్లేదు కదా! సేవ అని భావించి చేయండి, బంధనం అని భావించి చేయకండి. సెంటర్‌కు వచ్చినా కానీ అక్కడ కూడా సేవ లేకుండా అయితే ఉండరు కదా. కాబట్టి దానిని కూడా సేవగా భావించే చేయండి. మీ మనస్సుతో బంధించబడకండి, బాబా డైరెక్షన్ అనుసారంగా పూర్వపు లెక్కాచారాలను సమాప్తం చేసుకుంటున్నాము అని భావించండి. బలవంతంగా కాదు, ప్రేమతో చేయండి. చిక్కుకుపోనూ కూడదు మరియు నిస్సహాయంగానూ అవ్వకూడదు. ఆట ఆడుకుంటున్నట్లుగా నవ్వుతూ నవ్వుతూ పనిచేయండి. బిజినెస్ చేయండి, ఆఫీస్ పని చేయండి కానీ ఆడుతూ ఆడుతూ చేయండి. ఆటలో ఎంతో ఆనందం ఉంటుంది కదా. ఆటలో అలసిపోరు. కాబట్టి ఇదొక ఆట ఆడుతున్నాము - అనే ఇలాంటి అవస్థ సదా ఉండాలి. స్వయంగా బాబాయే కోట్లలో కొందరిగా మనల్ని ఎన్నుకున్నారు అనే విషయాన్ని సదా గుర్తుంచుకోండి. బాబా వెతికారు మరియు తమవారిగా చేసుకున్నారు - ఈ నషాతో లేదా సంతోషంతో ప్రతి కార్యం చేస్తూ సఫలతామూర్తులుగా అవుతూ సాగండి. ఈ స్మృతియే వరదాన రూపంగా మారి శక్తిశాలిగా తయారుచేస్తుంది.
సదా అతీంద్రియ సుఖంలో ఉంటున్నారా? అతీంద్రియ సుఖం అనగా ఆత్మిక సుఖం. ఇంద్రియాల సుఖం కాదు, ఆత్మిక సుఖం. ఆత్మ అవినాశి, కాబట్టి ఆత్మిక సుఖం కూడా అవినాశిగా ఉంటుంది. ఇంద్రియాలే వినాశి అయినప్పుడు వాటి ద్వారా లభించే సుఖం కూడా వినాశిగానే ఉంటుంది. ఎవరూ కూడా వినాశి అయిన, అల్పకాలిక సుఖాన్ని కోరుకోరు. 2 గంటల సుఖం తీసుకోండి, 22 గంటల దుఃఖాన్ని తీసుకోండి అని ఎవరికైనా చెబితే ఎవరు అంగీకరిస్తారు? సదా సుఖమే ఉండాలి, దుఃఖం నామరూపాలు కూడా ఉండకూడదు అనే అనుకుంటారు. కాబట్టి అతీంద్రియ సుఖం అవినాశి అయినది. ఇంద్రియ సుఖాల అనుభవమూ ఉంది మరియు అతీంద్రియ సుఖపు అనుభవమూ ఉంది. మరి ఏది మంచిదిగా అనిపిస్తుంది? అతీంద్రియ సుఖం మంచిదా లేక ఇంద్రియాల సుఖం మంచిదా? కాబట్టి మంచి వస్తువును ఎన్నడూ వదిలిపెట్టరు, మరచిపోరు; మరచిపోవాలని అనుకున్నా మరచిపోలేరు. కాబట్టి సదా అతీంద్రియ సుఖంలో ఉండేవారి వద్దకు దుఃఖం నామరూపాలు కూడా రాలేవు, అసంభవం. నాకు దుఃఖం కలగదు కానీ ఇతరులు దుఃఖాన్ని ఇస్తే ఏమి చేయాలి అని కొందరు అంటుంటారు. ఇతరులు ఇస్తే మీరు ఎందుకు తీసుకుంటారు? ఎవరైనా ఏదైనా వస్తువును మీకు ఇచ్చినప్పుడు మీరు దానిని తీసుకోకపోతే అది ఎవరి వద్ద ఉండిపోతుంది? వారి వద్దే ఉండిపోతుంది కదా. ఇచ్చేవారైతే ఇస్తారు, వారి వద్ద ఉన్నదే దుఃఖం; కానీ మీరైతే తీసుకోకండి. మీ స్లోగన్ ఏమిటి - ‘సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి.’ కానీ పొరపాటు చేసేస్తారు. అందుకే కాస్త దుఃఖపు అల వచ్చేస్తుంది. ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా దానిని పరివర్తన చేసి వారికి సుఖాన్ని ఇవ్వండి, వారిని కూడా సుఖవంతులుగా చేయండి. సుఖదాత పిల్లలు మీరు, సుఖాన్ని ఇవ్వడం మరియు సుఖంగా ఉండటం - ఇదే మీ పని. అచ్ఛా!
అహ్మదాబాద్ హాస్టల్ కుమారీలతో:- కుమారీల లక్ష్యం ఏమిటి? బ్రహ్మాకుమారిగా అవుతారా లేక ఇంజనీర్, డాక్టర్ అవుతారా? గంప మోయాలా లేక కిరీటాన్ని ధరించాలా? తలపైకి గంపైనా వస్తుంది లేదా కిరీటమైనా వస్తుంది. కిరీటం అనేది విశ్వ సేవ లేదా అనంతమైన సేవది. మరి కాలేజీలో చదువుకుంటున్న వారి లక్ష్యం ఏమిటి? అనంతమైన సేవ చేస్తారా లేక ఇతరులను చూసి ఒకటి-రెండు సంవత్సరాలు ఉద్యోగం కూడా చేసి చూద్దాము, ఆ తర్వాత వదిలేద్దాములే అని మనసుకు అనిపిస్తుందా? అసలు ఉద్యోగం అంటే ఏమిటో కాస్త చూద్దాము, ఆ తర్వాత గంప దించేసి కిరీటం ధరిద్దాములే - అని ఇలా అయితే ఆలోచించట్లేదు కదా? కిరీటధారులు సదా శ్రేష్ఠమైనవారు, గంప మోసేవారిని శ్రేష్ఠులని అనరు. వారైతే తప్పక గంపను ఎత్తుకుంటారు. ఉద్యోగం చేస్తున్నారంటే తప్పక ఏదో ఒక బలహీనత లేదా నిస్సహాయత ఉండే ఉంటుంది - మనస్సు యొక్క నిస్సహాయత అయినా లేదా బంధువుల నిస్సహాయత అయినా అయి ఉంటుంది. ఒకటి ఆనందం (మౌజ్), లేదా నిస్సహాయత (మజ్బూరీ) - రెండింటిలో ఏదో ఒకటి అయితే ఉంటుంది. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మరియు సమయం అకస్మాత్తుగానే రావాల్సి ఉంది, చెప్పి రాదు. అందుకే అంటారు - ఏది చేయాలో అది ఇప్పుడే చేయండి; రేపు కాదు, ఎల్లుండి కాదు, సంవత్సరం తర్వాత కాదు. చేయాల్సింది ఇప్పుడే. అవును, ఏదైనా పరిస్థితులు ఎదురై నిమిత్తంగా ఉన్నవారి డైరెక్షన్ అనుసారంగా చేస్తే అప్పుడు మీ బాధ్యత ఉండదు. మరి కుమారీలు ఏమి ఆలోచిస్తున్నారు? హాస్టల్లో ఎందుకు ఉంటున్నారు? ఇంట్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు కదా, సెంటర్‌కు కూడా రావచ్చు కదా, మరి హాస్టల్లో ఎందుకు ఉంటున్నారు? తల్లిదండ్రులు గుర్తుకురారా? అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటారు. ఏదైనా పెద్ద పండుగ రోజుల్లో గుర్తుకొస్తుంటారు కాబోలు. అచ్ఛా!
అనారోగ్యం సమయంలో తల్లిదండ్రులు గుర్తుకొస్తారా? పక్కాగా ఉన్నారా? మీ హృదయపూర్వక ఇష్టంతో వెళ్ళారా, ఎవరి మాటనో విని అయితే వెళ్ళలేదు కదా. మంచిది, డ్రామాలో వీరు కూడా లక్కీ కుమారీలే; ఎందుకంటే చిన్నప్పటి నుండే శ్రేష్ఠమైన సాంగత్యం లభించింది. అయినప్పటికీ ధైర్యం ఉంచారు కాబట్టి ధైర్యం కలవారికి ఫలం కూడా లభిస్తుంది. కుమారీలను చూసి మాతలు కూడా సంతోషిస్తారు కదా! మేము కూడా ఇంత చిన్న వయస్సులోనే జ్ఞాన జీవితంలోకి వచ్చి ఉంటే బాగుండేది అని మాతలు అనుకుంటారు. కానీ అందరి పాత్ర ఒకేలా ఉండలేదు కదా. రకరకాల వైవిధ్యం (వెరైటీ) కావాలి. సర్వుల తండ్రి అయినప్పుడు కుమారులు కావాలి, కుమారీలు కావాలి, అధర్ కుమారులు, అధర్ కుమారీలు కావాలి; అన్ని రకాల శాంపిల్స్ కావాలి. పాండవులు - మేము కుమారీలుగా ఉండి ఉంటే టీచర్ అయిపోయేవాళ్ళము, సెంటర్ దొరికేది అని ఇలా ఆలోచించట్లేదు కదా? ప్రతి ఒక్కరి పాత్రకూ తమ తమ విశేషత ఉంటుంది, ప్రతి ఒక్కరి విశేషత విభిన్నమైనది మరియు మహానైనది. పరస్పరం పాత్రలను చూసి సంతోషంగా ఉండండి. మీ పాత్రను తక్కువగా భావించకండి. అందరి పాత్రా ఉన్నతోన్నతమైనదే. అచ్ఛా!
పంజాబ్ గ్రూప్ :- సదా మిమ్మల్ని మీరు సంగమయుగపు నిశ్చింత చక్రవర్తులుగా భావిస్తున్నారా? పాత ప్రపంచం యొక్క ఎలాంటి చింతా లేదు. సదా హృదయంలో బ్రహ్మా బాబా సమానంగా ఏ పాట పాడుతున్నారు? పరబ్రహ్మంలో నివసించేవారికోసమే కదా వెదుకులాట ఉండేది, ఆయనే దొరికిపోయారు, ఇక చింత దేనికి! కాబట్టి నిశ్చింత చక్రవర్తి మీరు, బానిసలు కారు. ఈ రాజ్యాధికారం వంటి రాజరికం మరేదీ ఉండదు. ఎందుకంటే ఈ రాజ్యాధికారంని సాక్షాత్తూ తండ్రే ఇచ్చారు. ఇతర ఏ రాజ్యాధికారం లభించినా అది ధన దానం వల్ల లభిస్తుంది లేదా ఈ రోజుల్లో ఓట్ల ద్వారా లభిస్తుంది; కానీ మీకు స్వయంగా బాబాయే రాజతిలకాన్ని ఇచ్చేశారు. ఈ రాజతిలకం ముందు సత్యయుగపు రాజతిలకం కూడా పెద్ద విషయమేమీ కాదు. మరి ఈ రాజతిలకం పక్కాగా ఉందా లేక చెరిగిపోతుందా? ఇప్పుడే రాజుగా, ఇప్పుడే బానిసగా - ఇలాంటి ఆటలేమీ ఆడట్లేదు కదా? నిశ్చింత చక్రవర్తి - ఇది ఎంతో శ్రేష్ఠమైన స్థితి! సర్వస్వాన్నీ తండ్రి పరం చేసినప్పుడు ఇక పర్వా (చింత) ఎవరికి ఉంటుంది - తండ్రికా లేక మీకా? బాబా చూసుకుంటారు. తమ జీవితపు బాధ్యతను తండ్రి పరం చేసినప్పుడు ఇక బాబాకే తెలుసు. ఎక్కడో ఒకచోట మీ అధికారాన్ని కొద్దిగా దాచి ఉంచడం, మన్మతాన్ని దాచి ఉంచడం ఇలా అయితే లేదు కదా. శ్రీమతంపై నడుస్తుంటే తండ్రికి సమర్పణ అయినట్లే. నిజమైన హృదయంతో సర్వస్వాన్నీ తండ్రి పరం చేస్తే దానికి గుర్తు - సదా డబల్ లైట్‌గా ఉంటారు, ఎలాంటి భారమూ ఉండదు. ఎలాంటి భారమున్నా సర్వస్వాన్నీ తండ్రి పరం చేయలేదని రుజువవుతుంది. సర్వ భారాలనూ నాకిచ్చేసి మీరు తేలికగా (లైట్‌గా) కండి అని బాబా ఆఫర్ చేస్తున్నప్పుడు ఇక ఏమి చేయాలి? ఇలాంటి సేవకుడు (సర్వెంట్) మళ్ళీ దొరకరు. అనేక జన్మలు భారాన్ని పెట్టుకుని చూసేశారు, భారం వల్ల ఏమైంది? కిందకే దిగజారిపోతూ వచ్చారు. ఇప్పుడు డబల్ లైట్‌గా మారి ఎగురుతూ ఉండండి. తనువు-మనస్సు-ధనము సర్వస్వాన్నీ బదిలీ (ట్రాన్స్ఫర్) చేసేయండి. ఇతర భారాలేమీ లేవు కానీ సంబంధాల భారం కాస్త ఉందని కొందరు అంటుంటారు. సర్వ సంబంధాలనూ తండ్రితో జోడించనప్పుడే భారం ఉంటుంది. ప్రతిజ్ఞ ఉన్నది ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలు అని. అప్పుడు ఎలాంటి భారమూ ఉండదు. ప్రశాంతంగా పప్పు-రొట్టె తినండి మరియు ఎగిరే కళలో ఎగరండి. ఎక్కడ ఉన్నా తండ్రికి భోగ్ పెట్టి తింటే బ్రహ్మా భోజనం తిన్నట్లే. బ్రహ్మా భోజనం తినండి, చక్కగా నాట్యం చేయండి, ఆనందాన్ని అనుభవించండి. ఇప్పుడు ఆనందంలో ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటారు! అచ్ఛా!
బాంబే గ్రూప్‌తో :- అందరికీ తమ పురుషార్థపు వేగం తెలుసా? నేను ఎవరిని మరియు ఏమిటి అనే ఈ రెండూ తెలుసు కదా! మరి సమయపు వేగం ప్రకారం మీ పురుషార్థపు వేగం ఎలా ఉందని భావిస్తున్నారు? సమయపు వేగం తీవ్రంగా ఉందా లేక మీదా? సమయం రచన, మీరేమో రచయిత. మరి రచన వేగం వేగంగా ఉండి, రచయిత వేగం మందకొడిగా ఉంటే దానిని ఏమంటారు? సమయాన్ని తెలుసుకున్నవారూ మీరే, సమయాన్ని తెలుసుకుని వర్ణించేవారూ మీరే. అదైతే నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కలియుగాన్ని మార్చి సత్యయుగాన్ని తీసుకువస్తాము అని మీరే చెప్తారు; మరి నడిపించేవారేమో మందకొడిగా, నడిచేదేమో వేగంగానా! కాబట్టి ‘నేను మాస్టర్ రచయితను’ అనే ఈ స్మృతిలో సదా ఉండండి, దీనితో వేగం తీవ్రమవుతుంది. నడుస్తున్నాములే, సమయం ఎలా ఉంటే అలా చేస్తున్నాములే అని ఇలా కాదు. దీనిని సమయానికి దాసులు అని అంటారు. మేమే సమయాన్ని నడిపిస్తున్నాము అని మీరు చెప్పాలి. సమయాన్ని మార్చడానికి నిమిత్తమైనది మీరే కదా, ఈ కాంట్రాక్ట్‌ను తీసుకున్నది మీరే కదా? మరి పురుషార్థంలో తీవ్రగతికి ఆధారం ఏమిటి? డబల్ లైట్‌గా మారడము. డబల్ లైట్‌గా అవ్వకుండా తీవ్రగతి ఉండజాలదు; మరియు డబల్ లైట్‌గా కావడానికి ఒక్క పదాన్ని గుర్తుంచుకోండి - ‘నా బాబా’, అంతే. హిమాలయ పర్వతం కంటే పెద్ద విషయమే ఎదురైనా కానీ ‘బాబా’ అనగానే ఆ పర్వతం దూది పింజలా మారిపోతుంది. ఆవగింజ కూడా కాదు, దూది. ఆవగింజ అయినా కాస్త గట్టిగా ఉంటుంది, కానీ దూది ఎంతో మెత్తగా, తేలికగా ఉంటుంది. కాబట్టి ఎంతటి పెద్ద పర్వతమైనా దూదిలా అయిపోతుంది. ప్రపంచం వారు చూస్తే - ఇది ఎలా సాధ్యం అంటారు; మీరైతే ఇది ఇలా అయిపోతుంది అని చెప్తారు. బుద్ధిలో ‘బాబా’ అనగానే ఇది ఇలా జరుగుతుంది అని టచ్ అవుతుంది. ప్రతి విషయమూ సహజంగా అనిపిస్తుంది, ఎందుకంటే మీది సహజ యోగి జీవితం. ఎవరి జీవితమైతే సహజమో వారి ఎదుట ఏ పరిస్థితి వచ్చినా అది సహజమైపోతుంది. కష్టాల రోజులు సమాప్తమైపోయాయి. బ్రాహ్మణ జీవితంలోనూ ‘కష్టం’ అనే పదం లేదు, దేవతా జీవితంలోనూ లేదు. అందుకే తండ్రి మహిమలో ‘కష్టాన్ని సహజం చేసేవారు’ అని అంటారు; తండ్రి మహిమ ఏదైతే ఉందో అది మీ మహిమ కూడా. అచ్ఛా! ధులియా వారు ఇప్పుడే చేరుకున్నారు. (బస్సు పాడైపోవడం వల్ల ఆలస్యంగా వచ్చారు) అచ్ఛా! ధులియా వారి పాపాలు కడిగివేయబడ్డాయి (ధుల్ గయే). ఎంత సమయం ఆలస్యమైందో అంత సమయమూ బాబా-బాబా అనే స్మృతిలోనే ఉన్నారు కదా! కాబట్టి పాపాలు కడిగివేయబడ్డాయి, గతానికి సంబంధించి మిగిలినదంతా తుడిచిపెట్టుకుపోయింది. మీరైతే సంతోషంగానే ఉన్నారు కదా. దుఃఖపు అల ఏదీ రాలేదు కదా? ఇలాంటి సమయంలోనూ అచలంగా ఉన్నారు, అందుకే పాపాలు కడిగివేయబడ్డాయి. ఇకపై సదా ఆనందంలో నడుస్తూ, ఎగురుతూ ఉంటారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
