‘‘చదువు యొక్క సారము - రావడము మరియు వెళ్ళడము’’
ఈరోజు మురళీధరుడైన తండ్రి తమ మాస్టర్ మురళీధరులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ మురళీ మరియు మిలనం యొక్క చాతకులు. ఇటువంటి చాతకులుగా కేవలం బ్రాహ్మణాత్మలు తప్ప ఇంకెవ్వరూ ఉండలేరు. ఈ జ్ఞాన-మురళీ మరియు పరమాత్మ మిలనము అతీతమైనవి మరియు ప్రియమైనవి. ప్రపంచంలోని అనేక ఆత్మలు పరమాత్మ మిలనం కోసం దాహంతో ఉన్నారు, ఎదురుచూస్తున్నారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు ప్రపంచంలోని ఒక మూలలో గుప్త రూపంలో తమ శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు ఎందుకంటే దివ్యమైన తండ్రిని తెలుసుకునేందుకు లేక చూసేందుకు దివ్య బుద్ధి మరియు దివ్య దృష్టి కావాలి, వీటిని తండ్రి విశేష ఆత్మలైన మీకు ఇచ్చారు, కనుక బ్రాహ్మణులైన మీరే తెలుసుకోగలరు మరియు మిలనం జరుపుకోగలరు. ప్రపంచంలోని వారైతే పిలుస్తూ ఉంటారు - ‘‘మేము ఒక్క బిందువు కోసం దాహంతో ఉన్నాము’’ అని, మరి మీరేమి అంటారు? మేము వారసత్వానికి అధికారులము, ఎంత తేడా ఉంది - దాహంతో ఉన్నవారు ఎక్కడ మరియు అధికారులు ఎక్కడ! ఇప్పుడు కూడా అందరూ అధికారులుగా అయి అధికారంతో వచ్చి చేరుకున్నారు. మేము మా తండ్రి ఇంటికి అనగా మా ఇంటికి వచ్చాము అని మనసులో నషా ఉంది. మేము ఆశ్రమానికి వచ్చాము అని అనరు. మా ఇంటికి వచ్చాము - ఇలా భావిస్తారు కదా? అధికారానికి గుర్తు నాది అన్న భావన. తమ తండ్రి వద్దకు వచ్చారు, తమ పరివారంలోకి వచ్చారు. అతిథులుగా అయి రారు కానీ పిల్లలు తమ ఇంటికి వచ్చారు. నాలుగు రోజుల కోసమే వచ్చినా సరే, మా స్థానమైన మధుబన్కు చేరుకున్నాము అని భావిస్తారు. కనుక ఇది రావడము మరియు వెళ్ళడము. బ్రాహ్మణులైన మీ చదువు ఏదైతే ఉందో లేక మురళీధరుని మురళీ ఏదైతే ఉందో, దాని సారం ఈ రెండు పదాలే - ‘‘రావడము మరియు వెళ్ళడము’’. స్మృతి యాత్ర యొక్క అభ్యాసము ఏం చేస్తారు? కర్మయోగి యొక్క అర్థమే - అశరీరి ఆత్మనైన నేను శరీరం యొక్క బంధనం నుండి అతీతంగా ఉన్నాను, కర్మ చేసేందుకు కర్మలోకి వస్తాను మరియు కర్మను సమాప్తం చేసి కర్మ సంబంధం నుండి అతీతంగా అయిపోతాను, సంబంధంలో ఉంటారు, బంధనంలో ఉండరు. మరి ఇది ఏమైనట్లు? కర్మ కోసం ‘‘రావడము’’ మరియు మళ్ళీ అతీతంగా అయిపోవడము. కర్మ యొక్క బంధనానికి వశమై కర్మలోకి రారు, కానీ కర్మేంద్రియాలను ఆధీనం చేసుకొని అధికారంతో కర్మ చేసేందుకు కర్మయోగిగా అవుతారు. ఇంద్రియాల యొక్క కర్మలకు వశీభూతులుగా లేరు. ఎవరైనా ఎవరికైనా వశమైతే, వశమైన ఆత్మ వివశమైపోతుంది. యజమానిగా అయ్యే ఆత్మ ఎప్పుడూ ఎవరి వలన వివశమవ్వదు, తన స్వమానంలో దృఢంగా ఉంటుంది. చాలామంది పిల్లలు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఏదో ఒక కర్మేంద్రియానికి వశమైపోతారు, అప్పుడు అంటారు - ఈ రోజు కళ్ళు మోసం చేసేసాయి, ఈ రోజు నోరు మోసం చేసేసింది, దృష్టి మోసం చేసేసింది అని. పరవశం అవ్వడం అనగా మోసపోవడము మరియు మోసపోవడానికి గుర్తు దుఃఖం యొక్క అనుభూతి కలగడము. అయితే, మోసపోవాలని అనుకోరు కానీ వద్దనుకున్నా చేసేస్తారు, దీనినే వశీభూతమవ్వడము అని అంటారు. ప్రపంచంలోని వారు అంటారు - మేము చిక్కులలోకి వచ్చేసాము... అనుకోలేదు కానీ ఎలా ఈ చిక్కులలోకి వచ్చేసామో తెలియదు అని. స్వదర్శన చక్రధారి ఆత్మ అయిన మీరు ఎటువంటి మోసం యొక్క చిక్కులలోకి రాలేరు ఎందుకంటే స్వదర్శన చక్రము అనేక చిక్కుల నుండి విడిపించేది. కేవలం స్వయాన్నే కాదు, కానీ ఇతరులను కూడా విడిపించేందుకు నిమిత్తులుగా అవుతారు. అనేక రకాల దుఃఖపు చిక్కుల నుండి రక్షించబడేందుకు - ఈ సృష్టి చక్రం నుండి బయటపడాలి... అని ఆలోచిస్తారు. కానీ సృష్టి చక్రంలో పాత్రను అభినయిస్తూ అనేక దుఃఖపు చిక్కుల నుండి ముక్తులుగా అయి జీవన్ముక్త స్థితిని ప్రాప్తి చేసుకోవచ్చు అనేది ఎవ్వరికీ తెలియదు. మేము మీకు జీవితంలో డబల్ ముక్తిని ఇప్పించగలము అని మీరు ఛాలెంజ్ చేస్తారు - జీవితం కూడా ఉంటుంది, ముక్తి కూడా ఉంటుంది, ఇటువంటి ఛాలెంజ్ చేసారు కదా? జీవన్ముక్తి అనేది మీకు మరియు మాకు జన్మ సిద్ధ అధికారము అని నషాతో చెప్తారు. కనుక స్వదర్శన చక్రధారి అనగా దుఃఖపు చిక్కుల నుండి ముక్తులుగా ఉండేవారు మరియు ముక్తులుగా చేసేవారు. వశీభూతులయ్యేవారు కాదు, కానీ అధికారులుగా అయి, యజమానులుగా అయి సర్వ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించేవారు. మోసపోయేవారు కాదు, కానీ ఇతరులను కూడా మోసం నుండి విడిపించేవారు. కర్మలోకి రావడము మరియు మళ్ళీ అతీతంగా అయిపోవడము - ఈ అభ్యాసమే చేస్తారు కదా. కనుక స్మృతి యొక్క అభ్యాసము ఏముంది? రావడము మరియు వెళ్ళడము. మరియు చదువు అనగా జ్ఞానం యొక్క సారం ఏమిటి? కర్మాతీతంగా అయి ఇంటికి వెళ్ళా్లి మరియు మళ్ళీ రాజ్యం చేసే పాత్రను అభినయించేందుకు తమ రాజ్యంలోకి రావాలి. ఇదే జ్ఞానం యొక్క సారం కదా. కనుక ‘‘వెళ్ళడము’’ మరియు ‘‘రావడము’’ - ఇదే జ్ఞానము మరియు యోగము, ఈ అభ్యాసంలోనే రాత్రింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు. బుద్ధిలో ఇంటికి వెళ్ళేటువంటి మరియు మళ్ళీ రాజ్యంలోకి వచ్చేటువంటి సంతోషం ఉంది. ఎలాగైతే తమ ఇల్లు అయిన మధుబన్కు వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. టికెట్ బుక్ చేయించుకున్నప్పటి నుండీ వెళ్ళా్లి, వెళ్ళా్లి అని ఇది బుద్ధిలో గుర్తుంటుంది కదా! కనుక మధుబన్ ఇంటి గురించిన సంతోషం ఉంది, అలానే ఆత్మ యొక్క ఇంటికి వెళ్ళే సంతోషం కూడా ఉంది. కానీ సంతోషంతో ఎవరు వెళ్తారు? ఎంతగా సదా ఈ ‘‘రావడము’’ మరియు ‘‘వెళ్ళడము’’ యొక్క అభ్యాసం ఉంటుందో, వారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అశరీరి స్థితిలో స్థితులైపోండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కర్మాతీతంగా అయిపోండి - ఈ అభ్యాసము చాలా పక్కాగా కావాలి. అంతేకానీ, మీరు అశరీరిగా అవ్వాలని అనుకోవడము మరియు శరీర బంధనము, కర్మ బంధనము, వ్యక్తుల బంధనము, వైభవాల బంధనము, స్వభావ-సంస్కారాల బంధనము తమ వైపుకు ఆకర్షించడం అనేది జరగకూడదు. ఏ బంధనము అశరీరిగా అవ్వనివ్వదు. ఎలాగైతే ఎవరైనా టైట్ డ్రెస్సు వేసుకుంటే, దానిని సమయానికి సెకండులో తీయాలనుకుంటే తీయలేకపోతారు, పెనుగులాట జరుగుతుంది ఎందుకంటే శరీరానికి అతుక్కుని ఉంది. అలాగే ఏ విధమైన బంధనం యొక్క ఆకర్షణ అయినా తన వైపుకు లాగుతుంది. బంధనము ఆత్మను టైట్ చేస్తుంది, అందుకే బాప్‌దాదా సదా ఈ పాఠాన్ని చదివిస్తారు - నిర్లిప్తము అనగా అతీతము మరియు అతి ప్రియము. ఈ బహుకాలపు అభ్యాసం కావాలి.
జ్ఞానం వినడము-వినిపించడము, సేవ చేయడము, ఇది వేరే విషయము కానీ ఈ అభ్యాసము చాలా అవసరము. పాస్ విత్ ఆనర్‌గా (గౌరవప్రదంగా ఉత్తీర్ణులు) అవ్వాలంటే ఈ అభ్యాసంలో పాస్ అవ్వడము చాలా అవసరము. మరియు ఈ అభ్యాసం పట్ల అటెన్షన్ ఇచ్చేదానికి డబల్ అండర్లైన్ చేయండి. అప్పుడే డబల్ లైట్‌గా అయి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని డబల్ కిరీటధారులుగా అవుతారు. బ్రాహ్మణులుగా అయ్యారు, తండ్రి వారసత్వానికి యజమానులుగా అయ్యారు, ఈశ్వరీయ విద్యార్థులుగా అయ్యారు, జ్ఞానయుక్త ఆత్మలుగా అయ్యారు, విశ్వ సేవాధారులుగా అయ్యారు - ఈ భాగ్యాన్ని అయితే పొందారు కానీ ఇప్పుడు పాస్ విత్ ఆనర్‌గా (గౌరవప్రదంగా ఉత్తీర్ణులు) అయ్యేందుకు, కర్మాతీత స్థితికి సమీపంగా వెళ్ళేందుకు బ్రహ్మా తండ్రి సమానంగా అతీతంగా, అశరీరిగా అయ్యే అభ్యాసం పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టాలి. బ్రహ్మా బాబా సాకార జీవితంలో కర్మాతీతంగా అయ్యేందుకు ముందే అతీతంగా మరియు ప్రియంగా ఉండేటువంటి అభ్యాసం యొక్క ప్రత్యక్ష అనుభూతిని చేయించారు. దీని గురించి పిల్లలందరూ అనుభవాన్ని వినిపిస్తారు - వింటూ అతీతంగా, కార్యం చేస్తూ అతీతంగా, మాట్లాడుతూ అతీతంగా ఉండేవారు అని. సేవను గానీ లేక ఏ కర్మను గానీ వదలలేదు, కానీ అతీతంగా ఉంటూ చివరి రోజు కూడా పిల్లల సేవను పూర్తి చేసారు. అతీతత్వము ప్రతి కర్మలో సఫలతను సహజంగా అనుభవం చేయిస్తుంది. చేసి చూడండి. ఒక గంటసేపు ఎవరికైనా అర్థం చేయించే శ్రమ చేసి చూడండి, దానికి బదులు 15 నిముషాలలో వింటూ, మాట్లాడుతూ, అతీతమైన స్థితిలో స్థితులై, అవతలి ఆత్మకు కూడా అతీతత్వపు స్థితి యొక్క వైబ్రేషన్లు ఇచ్చి చూడండి. 15 నిముషాలలో ఏ సఫలత అయితే లభిస్తుందో, అది ఒక గంటలో లభించదు. ఈ అభ్యాసాన్నే బ్రహ్మా బాబా చేసి చూపించారు. మరి ఏం చేయాలో అర్థమయిందా!
మొదటి నిమిత్తులైతే టీచర్లు. ఫాలో ఫాదర్ చేస్తారు కదా. సేవా విస్తారాన్ని ఎంతగానైనా పెంచండి కానీ విస్తారంలోకి వెళ్తూ సార స్థితి యొక్క అభ్యాసం తక్కువ అవ్వకూడదు, విస్తారంలో సారాన్ని మర్చిపోకూడదు. తినండి, తాగండి, సేవ చేయండి కానీ అతీతత్వాన్ని మర్చిపోవద్దు. వాణి ద్వారానైనా ఎంతవరకు సేవ చేస్తారు, ఎంతమందికి చేస్తారు! ఇప్పుడిక ఆత్మిక వైబ్రేషన్లను, అశరీరితనపు స్థితి యొక్క వైబ్రేషన్లను, అతీతత్వము మరియు ప్రియత్వము యొక్క శక్తిశాలీ వైబ్రేషన్లను వాయుమండలంలో వ్యాపింపజేయండి. సేవలో తీవ్ర గతి యొక్క సాధనము కూడా ఇదే. ఇతరుల సేవ చేసేకన్నా ముందు స్వయం ఈ విధిలో సంపన్నులుగా అయినట్లయితే సేవలో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. ఇప్పుడు వాణిలోకి రావడం సహజమైపోయింది మరియు హృదయపూర్వకంగా కూడా చేస్తారు ఎందుకంటే అభ్యాసం పక్కా అయిపోయింది. అలాగే ఈ అభ్యాసం కూడా న్యాచురల్ (సహజం) అయిపోతుంది. ఈ న్యాచురల్ అభ్యాసంతోనే నేచర్ పరివర్తన అవుతుంది. మనుష్యాత్మల నేచర్ (స్వభావం) అయినా లేక ప్రకృతి (నేచర్) అయినా. అర్థమయిందా? కష్టమనిపించడం లేదు కదా! అత్యంత పెద్ద తండ్రికి పిల్లలు మరియు అత్యంత పెద్ద ప్రాప్తికి అధికారులు కనుక అటువంటివారికి ఇది పెద్ద విషయమేమీ కాదు. అటెన్షన్ పెట్టడమైతే వచ్చు కదా లేక టెన్షన్ పెట్టుకోవడం వచ్చా. అసలైన సంస్కారాలు అటెన్షన్‌కు చెందినవి. టెన్షన్ పెట్టుకోవడం వచ్చినప్పుడు, మరి అటెన్షన్ పెట్టడం ఏమంత పెద్ద విషయము? టెన్షన్ పెట్టుకోవడంలోనైతే అలవాటు పడిపోయారు కదా. అటెన్షన్ యొక్క టెన్షన్ కూడా పెట్టుకోకండి, కానీ న్యాచురల్ అటెన్షన్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే, అటెన్షన్‌ను టెన్షన్‌లోకి మార్చేస్తారు. కానీ అటెన్షన్‌ను అటెన్షన్ రూపంలోనే పెట్టుకోండి, మార్చకండి. ఆత్మకు అతీతంగా అయ్యేటువంటి ఒరిజినల్ అభ్యాసము ఉంది. అతీతంగా ఉండేది, అతీతంగా ఉంది, మళ్ళీ అతీతంగా అవుతుంది. కేవలం మోహము అతీతంగా అవ్వనివ్వదు. వాస్తవానికి ఆత్మ యొక్క ఒరిజినల్ నేచర్ (నిజ స్వభావం) శరీరానికి అతీతంగా ఉండడము. వేరుగా ఉంటాయి. శరీరము ఆత్మ కాదు, ఆత్మ శరీరము కాదు. కనుక అతీతంగా ఉన్నట్లు కదా. కేవలం 63 జన్మల నుండి మోహం యొక్క అలవాటు అయిపోయింది. ఒరిజినల్ అయితే ఒరిజినల్‌గానే ఉంటుంది. అచ్ఛా.
కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి డబల్ విదేశీయులు కూడా చాలామంది చేరుకున్నారు. అతిథులుగా అయి వచ్చారా లేక పిల్లలుగా అయి వచ్చారా? మాది అన్న భావన కలుగుతుంది కదా. బాప్‌దాదా కూడా పిల్లలను తమ ఇంట్లో చూసి హర్షితులవుతారు. పిల్లలు సదా ఇంటికి అలంకారంగా ఉంటారు. పిల్లలతో మధుబన్ అలంకరించబడుతుంది, అందుకే బాప్‌దాదా తమ ఇంటి యొక్క అలంకారమైనవారిని చూసి సంతోషిస్తున్నారు. భారతవాసులు అయినా, విదేశీయులు అయినా, ఇరువురూ ఇంటికి అలంకారము. బాప్‌దాదా వచ్చినందుకు కూడా అభినందనలు ఇస్తారు, వెళ్ళడానికి కూడా అభినందనలు ఇస్తారు. ఇక్కడికి రావడం కూడా మంచిది, వెళ్ళడం కూడా మంచిది. వీడ్కోలు కాదు, అభినందనలే అభినందనలు. వెళ్ళినట్లయితే సేవ యొక్క అభినందనలు, ఇక్కడికి వచ్చినట్లయితే కలుసుకున్నందుకు అభినందనలు. రెండూ శుభాకాంక్షలే కదా. అచ్ఛా.
దేశ-విదేశాలలోని సదా అధికారీ పిల్లలందరికీ, సదా జ్ఞానము మరియు స్మృతి యొక్క సారంలో ఉండేటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, సదా రావడము మరియు వెళ్ళడము అన్న స్మృతితో సంపన్నంగా అయ్యే ఆత్మలకు, సదా బ్రహ్మా బాబాను ఫాలో చేసేవారికి, కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకునే యోగీ ఆత్మలకు, సదా నాది అనే భావన యొక్క అనుభవంలో మరియు అధికారం యొక్క సంతోషంలో ఉండేటువంటి ప్రసన్నచిత్తులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
*** ఓంశాంతి ***
