‘‘ఆత్మిక నషాలో ఉంటూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి (క్రిస్మస్ డే)’’
ఈరోజు అత్యంత పెద్ద తండ్రి పిల్లలకు అలౌకిక దివ్య సంగమయుగంలోని ప్రతి రోజుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ప్రపంచం వారి కోసం విశేషంగా ఒక్క పెద్ద రోజు ఉంటుంది మరియు ఆ పెద్ద రోజున ఏం చేస్తారు? వారు పెద్ద మనసుతో జరుపుకుంటున్నాము అని భావిస్తారు కానీ వారు జరుపుకోవడం అంటే ఏమిటి అనేది మీకు తెలుసు! వారు జరుపుకోవడము మరియు అత్యంత పెద్ద తండ్రి యొక్క పెద్ద మనసు కల పిల్లలైన మీరు జరుపుకోవడము - ఎంత అతీతముగా మరియు ప్రియముగా ఉంది! ఎలాగైతే ప్రపంచంలోని వారు పెద్ద రోజున సంతోషంతో నాట్యం చేస్తారు, పాడుతారు, ఒకరికొకరు ఆ రోజు యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకుంటారు. అలా పిల్లలైన మీ కోసం సంగమయుగమే పెద్ద యుగము. ఆయువులో చిన్నది కానీ విశేషతలలో మరియు ప్రాప్తిని అందించడంలో అన్నింటికంటే పెద్ద యుగము. కనుక సంగమయుగం యొక్క ప్రతి రోజూ మీ కొరకు పెద్ద రోజు ఎందుకంటే అత్యంత పెద్ద తండ్రి పెద్ద యుగమైన ‘‘సంగమయుగము’’ లోనే లభిస్తారు. వీటితో పాటు తండ్రి ద్వారా అత్యంత పెద్ద ప్రాప్తి కూడా ఇప్పుడే కలుగుతుంది. బాప్‌దాదా పిల్లలందరినీ అత్యంత పెద్ద ‘‘పురుషోత్తములు’’ గా ఇప్పుడు తయారుచేస్తారు. ఈ రోజు యొక్క విశేషత ఏమిటంటే, సంతోషాలు జరుపుకోవడము మరియు ఒకరికొకరు కానుకలు ఇచ్చుకోవడము, శుభాకాంక్షలు ఇచ్చుకోవడము మరియు తండ్రి ద్వారానే కానుక లభించే రోజును జరుపుకుంటారు. మీ అందరికీ తండ్రి సంగమయుగంలోనే అత్యంత పెద్ద కానుక ఏమిచ్చారు? బాప్‌దాదా సదా అంటారు, నేను పిల్లలైన మీ కోసం అరచేతిలో స్వర్గం యొక్క రాజ్య భాగ్యాన్ని తీసుకొచ్చాను. మరి అందరి అరచేతిలో స్వర్గం యొక్క రాజ్య భాగ్యం ఉంది కదా. దీనినే అరచేతిలో స్వర్గము అని అంటారు. దీని కన్నా పెద్ద కానుకను ఇంకెవరైనా ఇవ్వగలరా? ఎంత పెద్ద వ్యక్తి, పెద్ద కానుకను ఇచ్చినా కానీ తండ్రి కానుక ముందు అది ఏపాటిది? సూర్యుని ముందు దీపం వంటిది. అలా, సంగమయుగం యొక్క స్మృతిచిహ్న గుర్తులు ఇతర ధర్మాలలో కూడా ఉండిపోయాయి. మీ పెద్ద యుగంలో పెద్ద తండ్రి అత్యంత పెద్ద కానుకనిచ్చారు. అందుకే నేటి ఈ పెద్ద రోజున ఈ విధితో జరుపుకుంటారు. వారు క్రిస్మస్ ఫాదర్ అని అంటారు. ఫాదర్ అనేవారు సదా పిల్లలకు ఇచ్చేటువంటి ‘‘దాత’’. లౌకిక రీతిలో కూడా చూడండి - ఫాదర్ పిల్లలకు దాతగా ఉంటారు. వీరు అనంతమైన ఫాదర్. అనంతమైన ఫాదర్ కానుకను కూడా అనంతమైనది ఇస్తారు. వేరే ఏ కానుక అయినా ఎంత కాలం ఉంటుంది? శుభాకాంక్షల యొక్క ఎన్ని మంచి-మంచి కార్డులు కానుకగా ఇస్తారు! కానీ ఈ రోజు గడిచిపోయిన తర్వాత ఆ కార్డును ఏం చేస్తారు? కొంత కాలమే నడుస్తుంది కదా! తినేందుకు, తాగేందుకు మధురమైన పదార్థాలు కూడా ఇస్తారు, అవి కూడా ఎంత సమయం నడుస్తాయి! ఎంత సమయం సంతోషం జరుపుకుంటారు! ఒక రాత్రి కోసం నాట్యం చేస్తారు, పాడుతారు. కానీ ఆత్మలైన మీకు తండ్రి ఎలాంటి కానుకను ఇస్తారంటే - అది ఈ జన్మలో మీతో పాటు ఉండనే ఉంటుంది, అంతేకాక జన్మ-జన్మలు మీతో పాటు ఉంటుంది. ప్రపంచంవారు అంటారు, ఖాళీ చేతులతో వచ్చాము మరియు ఖాళీ చేతులతో వెళ్ళాలి అని. కానీ మీరు ఏమంటారు? మీరు నషాతో అంటారు, ఆత్మలమైన మేము తండ్రి ద్వారా లభించిన ఖజానాలతో నిండుగా అయి వెళ్తాము మరియు అనేక జన్మలు నిండుగా ఉంటాము. 21 జన్మల వరకు ఈ కానుక తోడుగా ఉంటుంది. ఇటువంటి కానుకను ఎప్పుడైనా చూసారా? ఏ ఫారెన్ దేశం యొక్క రాజు లేక రాణి అయినా సరే, ఇటువంటి కానుకను ఇవ్వగలరా? మొత్తం సింహాసనం ఇచ్చినా, ఈ సింహాసనాన్ని మీరు తీసేసుకోండి అని ఆఫర్ చేసినా, మీరు ఏం చేస్తారు, ఎవరైనా తీసుకుంటారా? తండ్రి హృదయ సింహాసనం ముందు ఈ సింహాసనం కూడా ఏపాటిది! అందుకే మీరందరూ నషాలో ఉంటారు, నషా అనగా ఆత్మిక నషా. ఈ ఆత్మిక నషాలో ఉండేటువంటివారు ఏ విషయం యొక్క చింత చేయరు, నిశ్చింత చక్రవర్తులుగా అయిపోతారు. ఇప్పుడు కూడా చక్రవర్తులే మరియు భవిష్యత్తులో కూడా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు, అందుకే అన్నింటికన్నా పెద్దది మరియు అన్నింటికన్నా మంచిది ఈ నిశ్చింత రాజ్యము. ఏదైనా చింత ఉందా? మరియు ప్రవృత్తిలో ఉండేవారికి పిల్లల యొక్క చింత ఉందా? కుమారులకు భోజనం తయారుచేసుకునే చింత ఎక్కువ ఉంది, కుమారీలకు ఏం చింత ఉంటుంది? మంచి ఉద్యోగం లభించాలి అని ఉద్యోగం యొక్క చింత ఉందా?. చింత ఉందా? నిశ్చింతులు కదా! ఎవరికైతే చింత ఉంటుందో, వారు నిశ్చింత రాజ్యం యొక్క ఆనందాన్ని తీసుకోలేరు. విశ్వం యొక్క రాజ్యమైతే 20 జన్మలుంటుంది, కానీ ఈ నిశ్చింత రాజ్యము మరియు హృదయ సింహాసనము - ఇవి కేవలం ఈ ఒక్క జన్మ కోసమే ఈ యుగంలోనే లభిస్తాయి. కావున ఒకటి అనేదానికి మహత్వముంది కదా!
బాప్‌దాదా సదా పిల్లలకు ఇదే చెప్తారు - ‘‘బ్రాహ్మణ జీవితం అనగా నిశ్చింత చక్రవర్తి’’. బ్రహ్మాబాబా నిశ్చింత చక్రవర్తిగా అయ్యారు, అప్పుడు ఏ పాట పాడారు - పొందాల్సినదంతా పొందేసాను, ఇంకేమి మిగిలి ఉంది. మీరు ఏమంటారు? సేవ యొక్క పని ఇంకా మిగిలి ఉంది, కానీ అది కూడా, చేయించేటువంటి తండ్రి చేయిస్తూ ఉన్నారు మరియు చేయిస్తూ ఉంటారు. మేము చెయ్యాలి - దీని వలన భారమైపోతుంది. తండ్రి మా ద్వారా చేయిస్తున్నారు - అప్పుడు నిశ్చింతులుగా అయిపోతారు. ఈ శ్రేష్ఠ కార్యం జరగాల్సిందే మరియు జరిగే ఉంది అనే నిశ్చయముంది, అందుకే నిశ్చయ బుద్ధి కలవారిగా, నిశ్చింతులుగా, చింతలేని వారిగా ఉంటారు. కేవలం పిల్లలు బిజీగా ఉండేందుకు సేవ యొక్క ఒక ఆటను ఆడిస్తున్నాము. నిమిత్తులుగా చేసి వర్తమానం మరియు భవిష్య సేవల ఫలానికి అధికారులుగా తయారుచేస్తున్నాము. పని తండ్రిది, పేరు పిల్లలది. ఫలాన్ని పిల్లలకు తినిపిస్తారు, స్వయం తినరు. మరి నిశ్చింతులుగా అయ్యారు కదా. సేవలో సఫలత యొక్క సహజ సాధనమే ఇది, చేయించేవారు చేయిస్తున్నారు. ఒకవేళ ‘‘నేను చేస్తున్నాను’’ అని అనుకున్నట్లయితే ఆత్మ శక్తి అనుసారంగా సేవ యొక్క ఫలం లభిస్తుంది. తండ్రి చేయిస్తున్నారు అంటే తండ్రి సర్వశక్తిమంతుడు, కర్మ యొక్క ఫలం కూడా అంతే శ్రేష్ఠమైనది లభిస్తుంది. కావున సదా తండ్రి ద్వారా ప్రాప్తించిన నిశ్చింత రాజ్యం లేక అరచేతిలో స్వర్గ రాజ్య భాగ్యం యొక్క ఈశ్వరీయ కానుకను స్మృతిలో ఉంచుకోండి. తండ్రి మరియు కానుక, ఈ రెండింటి స్మృతితో ప్రతి రోజే కాదు, ప్రతి ఘడియ అత్యంత పెద్ద ఘడియ, పెద్ద రోజు అనేటువంటి అనుభూతిని చేస్తారు. ప్రపంచంలోని వారైతే కేవలం శుభాకాంక్షలు ఇస్తారు. ఏమంటారు? సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా ఉండాలి... అని అంటారు. కానీ అలా అయిపోరు కదా! తండ్రి అయితే ఎటువంటి శుభాకాంక్షలను ఇస్తారంటే, సదా కోసం ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము - వరదానాల రూపంలో తోడుగా ఉంటాయి. కేవలం నోటి ద్వారా చెప్పి సంతోషపరచరు, అలా తయారు చేస్తారు మరియు అలా తయారవ్వడమే జరుపుకోవడము ఎందుకంటే అవినాశీ తండ్రి యొక్క శుభాకాంక్షలు కూడా అవినాశీగా ఉంటాయి కదా. కనుక శుభాకాంక్షలు వరదానంగా అవుతాయి.
మీరు కాండం నుండి వెలువడ్డారు. ఇవన్నీ శాఖలు. ఈ ధర్మాలన్నీ మీ శాఖలు కదా! కల్పవృక్షం యొక్క శాఖలు. అందుకే వృక్షం యొక్క గుర్తుగా క్రిస్మస్ ట్రీ ని చూపిస్తారు. అలంకరించి ఉన్న క్రిస్మస్ ట్రీ ని ఎప్పుడైనా చూసారా? అందులో ఏం చేస్తారు? (స్టేజిపైన రెండు అలంకరించిన క్రిస్మస్ ట్రీ లను పెట్టారు) ఇందులో ఏం చూపించారు? విశేషంగా మెరుస్తూ ఉన్న, వెలుగుతున్న బల్బులను చూపిస్తారు. చిన్న-చిన్న బల్బులతోనే అలంకరిస్తారు. దీని అర్థమేమిటి? కల్పవృక్షంలో మీరు మెరుస్తూ ఉన్న ఆత్మలు మరియు ఏ-ఏ ధర్మ పితలైతే వస్తారో, వారు కూడా తమ లెక్కలో సతోప్రధానంగా ఉంటారు, అందుకే బంగారు యుగపు ఆత్మ మెరుస్తూ ఉంటుంది. అందుకే ఈ కల్పవృక్షం యొక్క గుర్తును ఇతర ధర్మాల శాఖలు కూడా ప్రతి సంవత్సరం గుర్తుగా జరుపుకుంటూ ఉంటారు. మొత్తం వృక్షం యొక్క గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కదా. ఏ తండ్రి గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్? తండ్రి బ్రహ్మాను ముందుంచారు. సాకార సృష్టి యొక్క ఆత్మలకు ఆదిపిత, ఆదినాథుడు బ్రహ్మా, అందుకే గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఆదిదేవ్తో పాటు మీరు కూడా ఉన్నారు, అంతేకానీ ఆదిదేవ్ ఒక్కరే లేరు. ఆది ఆత్మలైన మీరు ఇప్పుడు ఆదిదేవ్తో పాటు ఉన్నారు మరియు మున్ముందు కూడా వారితో పాటు ఉంటారు, ఇంతటి నషా ఉందా? సంతోషం యొక్క పాటలను సదా పాడుతూ ఉంటారా లేక కేవలం ఈ రోజే పాడుతారా?
ఈ రోజు విశేషంగా డబల్ విదేశీయుల రోజు. మీ కొరకు ప్రతి రోజూ పెద్ద రోజా లేక ఈ రోజేనా? నలువైపులా దేశ విదేశాలలోని పిల్లలు కల్పవృక్షంలో మెరుస్తున్న సితారులుగా కనిపిస్తున్నారు. సూక్ష్మ రూపంలోనైతే అందరూ మధుబన్కు చేరుకుని ఉన్నారు. వారందరూ కూడా ఆకారీ రూపంలో జరుపుకుంటున్నారు. మీరు సాకారీ రూపంలో జరుపుకుంటున్నారు. అందరి మనసు తండ్రి యొక్క ఈశ్వరీయ కానుకను చూసి సంతోషంలో నాట్యం చేస్తుంది. బాప్‌దాదా కూడా సర్వ సాకార రూపంలోని వారికి మరియు ఆకార రూపధారీ పిల్లలకు, సదా హర్షిత భవ అనే శుభాకాంక్షలు ఇస్తున్నారు. సదా దిల్ఖుష్ మిఠాయి తింటూ ఉండండి మరియు ప్రాప్తి యొక్క పాటలను పాడుతూ ఉండండి. డ్రామానుసారంగా భారత్ వారికి విశేష భాగ్యము లభించి ఉంది. అచ్ఛా.
టీచర్లు అందరూ పెద్ద రోజును జరుపుకున్నారా లేక ప్రతి రోజూ జరుపుకుంటారా? పెద్ద తండ్రి మరియు మీరు కూడా పెద్దవారు, అందుకే ప్రపంచంవారి పెద్ద రోజులు ఏవైతే ఉన్నాయో, వాటికి మహత్వమిస్తారు. ఇందులో కూడా పెద్దవారైన మీరు చిన్న సోదరులకు ఉత్సాహాన్ని కలిగిస్తారు. టీచర్లు అందరూ నిశ్చింత చక్రవర్తులా? చక్రవర్తి అనగా సదా నిశ్చయం మరియు నషాలో స్థితులై ఉండేవారు ఎందుకంటే నిశ్చయం విజయులుగా చేస్తుంది మరియు నషా సంతోషంలో సదా పైకి ఎగిరేలా చేస్తుంది. కనుక నిశ్చింత చక్రవర్తులుగానే ఉంటారు కదా! ఏదైనా చింత ఉందా? సేవ ఎలా పెరుగుతుంది, మంచి-మంచి జిజ్ఞాసువులు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పటి వరకు సేవ చేయవలసి ఉంటుంది - ఇలా అయితే ఆలోచించడం లేదు కదా? ఆలోచన రహితంగా అవ్వడం ద్వారానే సేవ పెరుగుతుంది, ఆలోచించడంతో పెరగదు. ఆలోచన రహితంగా అయి బుద్ధిని ఫ్రీ గా పెట్టుకున్నట్లయితే, అప్పుడు తండ్రి యొక్క శక్తిని సహాయం రూపంలో అనుభవం చేస్తారు. ఆలోచించడంలోనే బుద్ధిని బిజీగా పెట్టుకున్నట్లయితే, తండ్రి టచింగ్ను, తండ్రి శక్తిని గ్రహించలేకపోతారు. బాబా మరియు మేము - కంబైండుగా ఉన్నాము. వారు చేయించేవారు మరియు చేసేందుకు నిమిత్తము నేను ఆత్మను. దీనినే ఆలోచనా రహితము అని అంటాము అనగా ఒక్కరి స్మృతి. శుభచింతనలో ఉండేవారికి ఎప్పుడూ చింత ఉండదు. ఎక్కడైతే చింత ఉంటుందో, అక్కడ శుభచింతన ఉండదు మరియు ఎక్కడ శుభచింతన ఉంటుందో అక్కడ చింత ఉండదు. అచ్ఛా!
నలువైపులా కల ఈశ్వరీయ కానుక యొక్క అధికారులకు, అత్యంత పెద్ద తండ్రి యొక్క అత్యంత పెద్ద భాగ్యవాన్ ఆత్మలకు, ఆది పితకు సదా సహచరులైన ఆది ఆత్మలకు, సదా అత్యంత పెద్ద తండ్రి ద్వారా ప్రేమ యొక్క శుభాకాంక్షలను, అవినాశీ వరదానాలను ప్రాప్తి చేసుకునే సర్వ సాకారీ రూపధారులు మరియు ఆకారీ రూపధారులు - పిల్లలందరికీ దిల్ఖుష్ మిఠాయితో పాటు ప్రియస్మృతులు మరియు నమస్తే.
పూణే-బీదర్ గ్రూప్:- రోజూ అమృతవేళ దిల్ఖుష్ మిఠాయి తింటున్నారా? ఎవరైతే రోజూ అమృతవేళ దిల్ఖుష్ మిఠాయి తింటారో, వారు స్వయం కూడా మొత్తం రోజంతా సంతోషంగా ఉంటారు మరియు ఇతరులు కూడా వారిని చూసి సంతోషిస్తారు. ఇది ఎటువంటి ఔషధమంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఈ దిల్ఖుష్ ఔషధం పరిస్థితిని చిన్నదిగా చేసేస్తుంది, పర్వతాన్ని దూదిలా చేసేస్తుంది. ఇంతటి శక్తి ఉంది ఈ ఔషధంలో! ఎలాగైతే శరీరం లెక్కలో కూడా, ఎవరైతే ఆరోగ్యంగా లేక శక్తిశాలిగా ఉంటారో, వారు ప్రతి పరిస్థితిని సహజంగా దాటేస్తారు మరియు ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు చిన్న విషయంలో కూడా గాబరా పడిపోతారు. బలహీనంగా ఉన్నవారి ముందు పరిస్థితి పెద్దదిగా అయిపోతుంది మరియు శక్తిశాలిగా ఉన్నవారి ముందు పరిస్థితి పర్వతం నుండి దూదిలా అయిపోతుంది. కావున రోజూ దిల్ఖుష్ మిఠాయి తినడం అనగా సదా హృదయం సంతోషంగా ఉండడము. ఈ అలౌకిక సంతోషం యొక్క రోజులు ఎంత తక్కువగా ఉన్నాయి! దేవతల సంతోషం మరియు బ్రాహ్మణుల సంతోషంలో కూడా తేడా ఉంది. ఈ బ్రాహ్మణ జీవితంలోని పరమాత్మ-సంతోషము, అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి దేవతల జీవితంలో కూడా ఉండదు, అందుకే ఈ సంతోషాన్ని ఎంత కావాలంటే అంత జరుపుకోండి. రోజూ అనుకోండి - ఈరోజు సంతోషాన్ని జరుపుకునే రోజు అని. ఇక్కడికి రావడంతో సంతోషం పెరిగిపోయింది కదా! ఇక్కడి నుండి కిందకు వెళ్ళినట్లయితే తగ్గిపోదు కదా? ఎగిరే కళ ఇప్పుడు ఉంది, ఇక తర్వాత ఎవరు ఎంత పొందారో, అంత తింటూ ఉంటారు. కనుక సదా ఇది స్మృతిలో ఉంచుకోండి, మేము దిల్ఖుష్ మిఠాయిని తినేవారము మరియు ఇతరులకు తినిపించేవారము ఎందుకంటే ఎంతగా ఇస్తారో, అంతగా ఇంకా పెరుగుతూ ఉంటుంది. చూడండి, సంతోషం యొక్క ముఖం అందరికీ బాగా అనిపిస్తుంది మరియు ఎవరికైనా దుఃఖం, అశాంతితో గాబరా పడిన ముఖం ఉంటే అది బాగా అనిపించదు కదా! మరి ఇతరులది బాగా అనిపించదు అన్నప్పుడు, స్వయానిది కూడా బాగా అనిపించకూడదు. కావున సదా సంతోషం యొక్క ముఖంతో సేవ చేస్తూ ఉండండి. మాతలు ఇటువంటి సేవను చేస్తున్నారా? ఇంట్లో వారు మిమ్మల్ని చూసి సంతోషించాలి. ఎవరికైనా జ్ఞానం చెడుగా అనిపించినా కానీ సంతోషకరమైన జీవితాన్ని చూసి మనసుతో తప్పకుండా అనుభవం చేస్తారు, వీరు సంతోషంగా ఉన్నారు అంటే ఏదో లభించింది అని. అభిమానం వలన బయటకు చెప్పకపోయినా కానీ లోపల అనుభవం చేస్తారు మరియు చివరికి వారు వంగాల్సిందే. ఈ రోజు నిందిస్తారు, రేపు చరణాలపై వంగుతారు. ఎక్కడ వంగుతారు? ‘‘అహో ప్రభూ’’ అని అంటూ తప్పకుండా వంగేది ఉంది. మరి అటువంటి స్థితి ఉన్నప్పుడే వంగుతారు కదా! ఎవరైనా, ఎవరి ముందు అయినా వంగారు అంటే, వారిలో ఏదో పెద్దతనం ఉంటుంది, ఏదో విశేషత ఉంటుంది. ఆ విశేషతకు వంగుతారు. ఊరికే ఎవరూ వంగరు కదా! వీరి వంటి జీవితం ఎవరికీ లేనే లేదు, సదా సంతోషంగా ఉంటారు అనేది కనిపించాలి. ఏడ్చే పరిస్థితిలో కూడా సంతోషంగా ఉండాలి, మనసు సంతోషంగా ఉండాలి. అలాగని కేవలం నవ్వుతూ ఉండడం కాదు, కానీ మనసు సంతోషంగా ఉండాలి. పాండవులు ఏమనుకుంటున్నారు? ఇటువంటి అనుభూతి ఇతరులకు కలుగుతుందా లేక ఇప్పుడింకా తక్కువగా అవుతుందా?
ప్రసన్నచిత్తులుగా ఉండేవారు తమ ముఖం ద్వారా చాలా సేవ చేస్తారు. నోటితో మాట్లాడినా, మాట్లాడకపోయినా కానీ, మీ ముఖం, జ్ఞానం యొక్క గుణాన్ని స్వతహాగా ప్రత్యక్షం చేస్తుంది. కనుక ఇదే గుర్తుంచుకోవాలి, దిల్ఖుష్ మిఠాయిని తినాలి మరియు ఇతరులకు కూడా తినిపించాలి. ఎవరైతే స్వయం తింటారో, వారు తినిపించకుండా ఉండలేరు. అచ్ఛా!
బెల్గామ్, షోలాపూర్ గ్రూప్:- మీ ఈ శ్రేష్ఠ జీవితాన్ని చూసి హర్షిస్తున్నారా? ఎందుకంటే ఈ జీవితం వజ్ర తుల్యమైన జీవితము. వజ్రానికి విలువ ఉంటుంది కదా! కనుక ఈ జీవితాన్ని ఇంత అమూల్యమైనదిగా భావించి ప్రతి కర్మ చేయండి. బ్రాహ్మణ జీవితము అనగా అలౌకిక జీవితము. అలౌకిక జీవితంలో సాధారణ నడవడిక ఉండజాలదు. ఏ కర్మ చేసినా అది అలౌకికంగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు. ఎప్పుడైతే అలౌకిక స్వరూపం యొక్క స్మృతి ఉంటుందో, అప్పుడు అలౌకిక కర్మ జరుగుతుంది ఎందుకంటే ఎటువంటి స్మృతి ఉంటుందో, అటువంటి స్థితి ఉంటుంది. స్మృతిలో ఉండాలి - ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. కావున తండ్రి స్మృతి సదా సమర్థంగా చేస్తుంది, అందుకే కర్మ కూడా శ్రేష్ఠంగా, అలౌకికంగా ఉంటుంది. ఎలాగైతే అజ్ఞానీ జీవితంలో రోజంతా నాది-నాది అని అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ నాది అనేదానిని తండ్రి వైపు పెట్టేసారు కదా! ఇప్పుడు ఇతర నాది-నాది అనేవన్నీ సమాప్తమైపోయాయి. బ్రాహ్మణులుగా అవ్వడము అనగా అంతా నీదిగా చేసేసారు. ఈ పొరపాటు అయితే చేయరు కదా - నాదిని నీదిగా, నీదిని నాదిగా అయితే చేయరు కదా? ఏదైనా అవసరముంటే నాది అని అంటారు మరియు అవసరం ఏదీ లేకపోతే నీది అని అంటారు. నాది అని అంటే అనండి కానీ ఇప్పుడు ‘‘నా బాబా’’ అని అనండి. మిగిలిన అన్ని నాది-నాది అనే వాటిని వదిలి, ఒక్కరే నా వారు. ఒక్కరే నా వారు అని అనడంతో శ్రమ నుండి విడుదల అయిపోతారు, బరువు దిగిపోతుంది. లేదంటే గృహస్థ జీవితంలో ఎంత బరువు ఉంది! ఇప్పుడు తేలికగా, డబల్ లైట్‌గా అయిపోయారు, అందుకే సదా ఎగిరే కళ కలవారిగా ఉన్నారు. ఎగిరే కళ ఉండాలే తప్ప ఆగే కళలో ఆగిపోవద్దు. సదా ఎగురుతూనే వెళ్ళండి. తండ్రి తమ వారిగా చేసుకున్నారు - సదా ఇదే సంతోషంలో ఉండండి.
వెరైటీ గ్రూప్ :- సదా తమను తాము భగవంతుని తోటలోని ఆత్మిక గులాబీలుగా భావిస్తున్నారా? అత్యంత సువాసన గల పుష్పం రూహే గులాబ్ (ఆత్మిక గులాబీ). మీరే ఆ ఆత్మిక గులాబీలు, నలువైపులా ఆత్మిక సువాసనను వ్యాపింపజేస్తారు. సువాసన స్వతహాగానే తన వైపుకు ఆకర్షిస్తుంది. ఎక్కడైనా దుర్వాసన ఉంటే అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తారు; కానీ సువాసన ఉంటే సమీపానికి వచ్చేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఆత్మిక సువాసన అందరినీ ఆకర్షిస్తుంది. ఇలాంటి ఆత్మిక గులాబీలే కదా! గులాబీతో పాటు ముల్లు ఏమైనా అంటుకుని ఉందా? పుష్పగుచ్ఛమును తయారుచేసేటప్పుడు ముందుగా ముళ్ళను తీసేస్తారు కదా! ముళ్ళున్న పుష్పగుచ్ఛమును తయారుచేయరు, ముళ్ళను తొలగించి శుభ్రం చేసి ఆ తర్వాత పుష్పగుచ్ఛమును చేస్తారు. ఏ దేవత ఎదుటైనా పుష్పాలు సమర్పించాలన్నా ముందుగా శుభ్రం చేసి, ఆ తర్వాత సమర్పిస్తారు. మీరు కూడా ఆత్మిక గులాబీలుగా తండ్రి ఎదుట రకరకాల రూపాలలో, ఒక పుష్పగుచ్ఛము రూపంలో ఉన్నారు. భక్తి మార్గంలో కూడా ఇక్కడి ఆచారమే కొనసాగుతూ వస్తోంది. మీరు ఆత్మిక గులాబీలుగా తండ్రి ఎదుట అర్పణమయ్యారు, అందుకే దేవతలకు కూడా పుష్పాలనే అర్పిస్తారు. ఆత్మిక గులాబీ అనగా ఎన్నడూ ఆత్మికత నుండి దూరం కానిది. పుష్పాలలో సువాసన ఇమిడిపోయి ఉంటుందో, వేరుగా ఉండదు కదా. అలాగే మీలో ఆత్మికత అనే సువాసన ఇమిడిపోయి ఉంది. కృత్రిమమైనది (ఆర్టిఫిషియల్) బయటిది కాదు. ఇమిడిపోయి ఉందా లేక అప్పుడప్పుడు సువాసనను అద్దుకుంటున్నారా? మీరు సువాసనాభరితంగా మారతారు, అందుకే మందిరాలలో మీ జడ చిత్రాల ఎదుట కూడా సదా సువాసనను వెలిగిస్తారు. ఏ మందిరంలోనైనా అగర్బత్తీలను ఎంతో ప్రేమతో వెలిగిస్తారు! ఒకవేళ మందిరంలో సువాసన లేకపోతే - ఇక్కడ పూజారి మంచివాడు కాడు, మందిర వాతావరణం బాగోలేదు అని అంటారు. మరి ఈ సువాసనను ఎందుకు ఉంచుతారు? అగర్బత్తీలు ఎందుకు వెలిగిస్తారు? ఎందుకంటే మీరు సువాసనాభరితులుగా తయారవుతారు. మరి ఇవన్నీ మా చిత్రాలే అనే నషా ఉందా? ఇవి నా చిత్రాలే అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఒక్కటి కాదు, అన్ని చిత్రాలూ మీవే! పాండవులు ఏమనుకుంటున్నారు? హనుమంతుడు, గణేశుడు మీ చిత్రాలేనా? మీలో హనుమంతుడు లేదా గణేశుడు ఎవరు? అందరూ గణేశులేనా? గణేశుడు అనగా విద్యాపతి. ఎవరైతే నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారో వారే విద్యాపతి అనగా గణేశుడు, మరియు హనుమంతుడు అనగా హృదయంలో తండ్రి తప్ప మరెవరూ లేనివారు. సేవాధారులు కూడా మరియు హృదయంలో తండ్రి ఇమిడిపోయి ఉన్నారు. మరి ఇలాగే ఉన్నారా లేక హృదయంలో అప్పుడప్పుడు వేరే ఎవరైనా వస్తున్నారా? మాతల హృదయంలో ఏముంది? వేరే ఎవరైనా మనవళ్ళు-మునిమనవళ్ళు ఉన్నారా? మనవళ్ళు-మునిమనవళ్ళు ప్రియంగా అనిపిస్తున్నారా లేక మనవడూ తండ్రియే, మునిమనవడూ తండ్రియేనా? సర్వస్వమూ తండ్రినే చేసుకుంటే ఇక ఎవరూ గుర్తుకురారు; ఒకవేళ చేసుకోకపోతే గుర్తుకొస్తారు, అందుకే తండ్రి అంటారు - సర్వ సంబంధాలతో స్మృతి చేయండి అని. అచ్ఛా.
డాక్టర్ల పట్ల అవ్యక్త మహావాక్యాలు :- డాక్టర్లందరి హృదయంలో ఏముంది? హాస్పిటల్ అయితే లేదు కదా? తండ్రిని హృదయంలో కూర్చుండబెట్టుకోవడం అనగా సదాకాలం కొరకు అనేకులకు స్వస్థతను ప్రసాదించడమే. ఈ రోజుల్లోనైతే డాక్టర్లు కూడా - ఔషధం పనిచేసేదానికంటే ఆశీర్వాదాలు పనిచేసేదే ఎక్కువ అని అంటున్నారు. వారు కూడా మందుల పట్ల నిరుత్సాహపడిపోయారు; ఎందుకంటే దీని ఫలితం ఏమిటో, ఏమి రానుందో వారికి తెలుసు కదా! అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఆశీర్వాదాల వైపు వెళ్తోంది. ప్రస్తుతం యోగం ఎక్సర్సైజ్ రూపంలో నలువైపులా విస్తరిస్తోంది. ఇప్పుడు యోగం వరకు వచ్చారు, సహజయోగం వరకు వచ్చేస్తారు. ఔషధాలకు బదులుగా ఇప్పుడు వేరే వైపుకు బుద్ధి అయితే మళ్ళింది కదా. చివరకు గమ్యానికి వచ్చేస్తారు; మరి డాక్టర్లు చేసే పని ఇదే కదా. అందరి బుద్ధినీ స్థిరపరిచేవారే కదా? మంచిది, ధైర్యం ఉంచడం వల్ల తండ్రి సహాయం స్వతహాగానే లభిస్తోంది, లభిస్తూనే ఉంటుంది. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ అసంభవమైనది కూడా సంభవమైపోతుంది. మీరందరూ అసంభవాన్ని సంభవం చేసేవారు. ప్రపంచం వారు మనస్సును ఏకాగ్రం చేయడం చాలా కష్టం, అసంభవం అని కూడా అంటారు; మరి మీరేమంటారు? మీకైతే ఇది ఒక్క సెకను విషయం కదా. అంతే, బాబా అనగానే మనస్సు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మీకైతే సెకను పని, వారికైతే అసంభవం. ఎంత వ్యత్యాసం వచ్చేసింది! సమయం పట్టట్లేదు కదా? పాట మోగాలి, ఎర్ర లైట్ వెలగాలి, అప్పుడే మనస్సు కుదుటపడుతుంది అని ఇలా అయితే లేదు కదా? శ్రమ పడాల్సి రావట్లేదు కదా? మన స్వంత బాబా కదా. ఎవరో వేరొకరి బాబా అయితే కాదు కదా. స్వయానికి తండ్రి కాకుండా ఎవరైనా వచ్చి - ఈయన మీ నాన్న, ఈయన్ని గుర్తుంచుకోండి అంటే గుర్తుంచుకోలేరు కదా! కానీ ఈయనైతే మనవారు. తమ వస్తువును స్మృతి చేసుకోవడం ఎన్నడూ కష్టం కాదు. పరాయివారిని స్మృతి చేసుకోవడం కష్టం. మీరైతే అధికారంతో స్మృతి చేస్తున్నారా లేక భగవంతుడు చాలా గొప్పవాడు, సూర్యుని వంటివాడు అని ఇలా స్మృతి చేస్తున్నారా? సర్వస్వమూ నాది - అనే ఈ అధికారంతో స్మృతి చేయండి.
ఆత్మిక గులాబీగా మారి రోజంతా సువాసనను వ్యాపింపజేస్తూ ఉండండి. సువాసన ఎలాంటి వస్తువంటే అది దూరంగా ఉండేవారిని కూడా ఆకర్షిస్తుంది. దూరం నుండే ఆలోచిస్తారు - ఈ సువాసన ఎక్కడి నుండి వస్తోంది అని. కాబట్టి మీ ఆత్మికత విశ్వాన్ని ఆకర్షిస్తుంది. చూడండి, ఆత్మికత అనే సువాసన దేశం నుండి విదేశాలనూ ఆకర్షించింది కదా! విదేశాల వరకు సువాసన చేరింది! ఏ పని చేస్తున్నా శుభ సంకల్పాలతో ఈ సువాసనను వ్యాపింపజేస్తూ ఉండండి. ఏ పని చేస్తున్నా బుద్ధి ఎన్ని వైపులకు వెళ్తుందో చెక్ చేసుకోండి. కోరుకోకపోయినా అనేక వైపులకు వెళ్తుంది, ఒక్క వైపే ఉండదు. మరి ఇతర వైపులకు వెళ్ళగలిగినప్పుడు సేవ కూడా చేయవచ్చు కదా, స్మృతి కూడా చేయవచ్చు కదా. బుద్ధి పూర్తిగా ఆ పనిలోనే ఉండే సమయం చాలా తక్కువగా ఉంటుంది. డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు, అత్యవసరమైన ఆపరేషన్ అయినప్పుడు పూర్తి బుద్ధి అందులో ఉంటుంది. మిగిలిన సమయాలలో మందులు ఇచ్చేటప్పుడు, రోగులను చూసేటప్పుడు బుద్ధి ఇతర పనులూ చేస్తుంది. అది చేయగలిగినప్పుడు ఇది ఎందుకు చేయలేదు? మనస్సు మరియు బుద్ధికి చక్కర్లు కొట్టే అలవాటు ఉంది. జ్ఞానపు చక్రమైనా తిప్పండి లేదా వ్యర్థమైన చక్రమైనా తిప్పండి, కానీ చక్కర్లు తప్పక తిరుగుతుంది. మీరు స్వదర్శన చక్రం తిప్పితే ఇతర చక్కర్లు సమాప్తమైపోతాయి.
మరి అందరూ సేవలో సహయోగులేనా? సమయం దొరకనివారు, పరిస్థితులు అడ్డంకిగా ఉన్నవారు చేతులెత్తండి. మనసా సేవ అయితే అందరూ చేయగలరు కదా? బిజీగా ఉండటానికి సేవ చాలా మంచి సాధనం. తమను తాము ఎంత బిజీగా ఉంచుకుంటే అంత సురక్షితంగా ఉంటారు. మనసా చేయండి, వాచా చేయండి, కర్మణా చేయండి కానీ బుద్ధితో మాత్రం తప్పక బిజీగా ఉండండి. చేతులు-కాళ్ళతో అయితే ఎలాగూ ఉంటారు, కానీ బుద్ధితో బిజీగా ఉండండి. మీ టైమ్-టేబుల్ తయారుచేసుకోండి. ఎంత పెద్ద వ్యక్తి అయితే అంతగా టైమ్-టేబుల్ ఫిక్స్ అయి ఉంటుంది. మరి మీరు అందరికంటే పెద్ద వ్యక్తులు కదా! పూర్తి కల్పమంతా వెతికి రండి, బ్రాహ్మణుల కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా? దేవతలు కూడా కారు. మీరే దేవతలుగా మారినప్పటికీ ఈ జీవితం ముందు అది కూడా ఏపాటిదీ కాదు. జీవితమంటూ ఉంటే బ్రాహ్మణ జీవితం అత్యంత శ్రేష్ఠమైనది. అచ్ఛా.
తమను తాము అందరికంటే పెద్ద అదృష్టవంతులుగా అనుభవం చేసుకుంటున్నారా? మీలాంటి అదృష్టవంతులు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరి నసీబ్ (భాగ్యము) అనగా భాగ్యం ఇంత శ్రేష్ఠమైనదో వారి గుర్తు ఏమిటి? సదా సంతోషంగా ఉంటారు. భాగ్యవంతుడు సదా సంపన్నుడిగా ఉంటాడు. ఎవరైనా విద్యలో, చదువులో తెలివిగలవారైతే వీరి భాగ్యము చాలా మంచిది అంటారు. మంచి భాగ్యము యొక్క గుర్తు - వారు ప్రతి విషయంలోనూ సంపన్నులుగా ఉంటారు, బలహీనంగా ఉండరు, ధైర్యవంతులుగా ఉంటారు. మరి మీరందరూ అదృష్టవంతులే కదా! సదా సంతోషపు పాటలు మోగుతూనే ఉంటాయి. భక్తి మార్గంలో అంటారు కదా - అనహద్ నాదం మోగుతూ ఉండాలని; ఆ అనహద్ నాదాన్ని వినడానికి, నడపడానికి ఎంత శ్రమపడతారో! మీరు పడిన శ్రమేమిటి? సదా సంతోషపు పాటలు స్వతహాగానే మోగుతూ ఉంటాయి, ఇవి ఎన్నడూ ఆగవు. లౌకికంలో ఎంత పెద్ద పాటను తయారుచేసినా అది ఆగిపోతుంది. ఆటోమేటిక్ అయినా సరే బ్యాటరీ అయిపోతుంది. ఎక్కువ సమయం నడిపిస్తే బ్యాటరీ అయిపోతుంది లేదా వేడెక్కిపోతుంది; మరి మీ బ్యాటరీ ఎప్పుడైనా అయిపోతుందా? అవినాశి గీతం, అందుకే అనహద్ అనగా హద్దు లేనిది. మరి అనహద్ గీతం మోగుతోందా లేక మోగించాల్సి వస్తోందా? అసలు వేరే పనేముంది! పాడండి మరియు నాట్యం చేయండి. యోగం చేయడం అంటే మాత్రం ఏమిటి! సంతోషంలో నాట్యం చేయడమే కదా. తండ్రి మహిమను గానం చేస్తారు, సంతోషంలో నాట్యం చేస్తారు, ఇంకేమి చేస్తారు! ఇందులోనే సేవ ఉంది, ఇందులోనే యోగం ఉంది, ఇందులోనే జ్ఞానము లేదా ధారణ ఉన్నాయి. నాట్యం చేయండి, పాడండి, బ్రహ్మా భోజనం తినండి. భోగ్ పెట్టినప్పుడు బ్రహ్మా భోజనం అయిపోయింది కదా. ఒకవేళ భోగ్ పెట్టకుండా, స్మృతి లేకుండా తింటే అది సాధారణ ఆహారమైపోతుంది; దాని ద్వారా బలం రాదు, కేవలం కడుపు నిండుతుంది కానీ ఆత్మలో శక్తి రాదు. మరి ఏమి చేయాలి? తినండి, నాట్యం చేయండి మరియు పాడండి. శ్రమ నుండి విడిపించేశారు కదా! లేకపోతే ఎంత శ్రమపడేవారు - ప్రాణాయామం చేయండి, ఒకే విగ్రహాన్ని చూస్తూ ఉండండి, మనస్సును నిగ్రహించండి అని ఎన్ని శ్రమలు చేయిస్తారో! మీరైతే మనస్సును తండ్రి వైపు లగ్నం చేశారు, అంతే, బిజీ చేసేశారు. మనస్సును సుమనస్సుగా మార్చేశారు తప్ప అణచివేయలేదు (దమనం చేయలేదు). ఇప్పుడు మీ మనస్సు శ్రేష్ఠ సంకల్పాలు చేస్తోంది, అందుకే సుమనస్సు. మనస్సు యొక్క తిరుగుడు ఆగిపోయింది. గమ్యస్థానం (ఠికానా) తెలియనంతవరకే తిరుగుడు ఉంటుంది. గమ్యం తెలిసిన తర్వాత ఎవరు మాత్రం తిరుగుతారు! ఒకవేళ ఇప్పటికీ తిరుగుతూ ఉంటే - వీరి బుర్ర సరిగ్గా లేదు అంటారు. మీ మనస్సు, బుద్ధి అయితే విశాలమైపోయాయి. దూరదృష్టి కలవారు, విశాలబుద్ధి కలవారిగా మారారు. ఆది-మధ్యాంతాలు, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ - మూడు కాలాలనూ ఎరిగినంత విశాల బుద్ధి మీది. కాబట్టి అదృష్టవంతులము అనే ఈ విషయాన్ని సదా గుర్తుంచుకోండి, ఎన్నడూ బలహీనంగా కావద్దు, అద్భుతాలు చేసేవారిగా మారాలి. అర్థకల్పం బలహీనంగానే ఉన్నారు. ఇప్పుడు బలహీనంగా ఎందుకుండాలి? కాబట్టి ఏ సంకల్పం నడిచినా, మాట వెలువడినా లేదా ఏ కర్మ జరిగినా చెక్ చేసుకోండి - ఇది కమాలా లేక బలహీనతా? ప్రతి సంకల్పంలో, మాటలో కమాల్ అనుభవమవ్వాలి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
