‘‘సర్వ అనుభూతుల ప్రాప్తికి ఆధారము - పవిత్రత’’
ఈరోజు స్నేహసాగరుడైన బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ ఆత్మిక పిల్లల యొక్క ఆత్మిక ఫీచర్స్ (లక్షణాలను) చూస్తున్నారు. బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి ఫీచర్స్‌లో ఆత్మికత ఉంది కానీ నంబరువారుగా ఉంది ఎందుకంటే ఆత్మికతకు ఆధారం పవిత్రత. సంకల్పం, మాట మరియు కర్మలో పవిత్రత యొక్క ధారణ ఎంతెంతగా ఉంటుందో, దాని అనుసారంగానే ఆత్మికత యొక్క మెరుపు ముఖంలో కనిపిస్తుంది. బ్రాహ్మణ జీవితం యొక్క మెరుపు పవిత్రత. నిరంతర అతీంద్రియ సుఖం మరియు స్వీట్ సైలెన్స్‌కు విశేషమైన ఆధారము - పవిత్రత. పవిత్రత నంబరువారుగా ఉంది కనుక ఈ అనుభూతుల యొక్క ప్రాప్తి కూడా నంబరువారుగా ఉంది. ఒకవేళ పవిత్రత నంబర్‌వన్ అయితే తండ్రి ద్వారా అనుభూతుల ప్రాప్తి కూడా నంబర్‌వన్‌గా ఉంటుంది. పవిత్రత మెరుపు స్వతహాగానే నిరంతరం ముఖంపై కనిపిస్తుంది. పవిత్రత యొక్క ఆత్మికతతో కూడిన నయనాలు సదా నిర్మలంగా కనిపిస్తాయి. సదా నయనాలలో ఆత్మ మరియు ఆత్మిక తండ్రి యొక్క మెరుపు అనుభవమవుతుంది. ఈరోజు బాప్‌దాదా పిల్లలందరి యొక్క విశేషమైన ఈ మెరుపును మరియు ప్రకాశాన్ని చూస్తున్నారు. మీరు కూడా మీ ఆత్మిక పవిత్రత యొక్క ఫీచర్స్‌ను జ్ఞానమనే దర్పణంలో చూసుకోవచ్చు ఎందుకంటే పవిత్రత విశేషమైన ఆధారము. కేవలం బ్రహ్మచర్యాన్ని పవిత్రత అని అనము. కానీ సదా బ్రహ్మచారి మరియు సదా బ్రహ్మాచారి అనగా బ్రహ్మా తండ్రి యొక్క ఆచరణల పైన ప్రతి అడుగులో నడుచుకునేవారు. వారి సంకల్పం, మాట మరియు కర్మ రూపీ అడుగులు సహజంగానే బ్రహ్మా తండ్రి యొక్క అడుగులను అనుసరించేవిగా ఉంటాయి. దీనినే మీరు అడుగుజాడలు అని అంటారు. వారి ప్రతి అడుగులో బ్రహ్మా తండ్రి యొక్క ఆచరణ కనిపిస్తుంది. కనుక బ్రహ్మచారిగా అవ్వడము కష్టమేమీ కాదు, కానీ ఈ మనసు-వాణి-కర్మ అనే అడుగులు బ్రహ్మాచారిగా ఉండాలి - దీనిని చెక్ చేసుకునే ఆవశ్యకత ఉంది. ఎవరైతే బ్రహ్మాచారిగా ఉంటారో, వారి ముఖం మరియు నడవడిక సదా అంతర్ముఖిగా మరియు అతీంద్రియ సుఖం కలవిగా అనుభవమవుతాయి.
ఒకటేమో సైన్స్ సాధనాలు మరియు బ్రాహ్మణ జీవితంలో ఉన్నవి జ్ఞాన సాధనాలు. బ్రహ్మాచారి ఆత్మ సైన్స్ సాధనాలు లేక జ్ఞాన సాధనాల ఆధారంతో సదా సుఖమయంగా ఉండరు. కానీ సాధనాలను కూడా తమ సాధనా స్వరూపంతో కార్యంలోకి తీసుకొస్తారు. సాధనాలను ఆధారంగా చేసుకోరు కానీ తమ సాధన ఆధారంతో సాధనాలను కార్యంలోకి తీసుకొస్తారు. ఎలాగైతే చాలామంది బ్రాహ్మణాత్మలు అప్పుడప్పుడు - మాకు ఈ అవకాశం లభించలేదు, ఈ విషయంలో సహయోగం లభించలేదు, ఈ తోడు లభించలేదు, అందుకే సంతోషం తక్కువైపోయింది లేదా సేవలో, స్వయంలో ఉల్లాస-ఉత్సాహాలు తక్కువైపోయాయి, మొట్టమొదట అయితే చాలా అతీంద్రియ సుఖం ఉండేది, ఉల్లాస-ఉత్సాహాలు కూడా ఉండేవి - ‘‘నేను మరియు బాబా’’ తప్ప ఇంకేమీ కనిపించలేదు అని అంటారు. కానీ చాలామంది 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపల, స్వయంలో, ఒకసారి ఒక విధంగా, ఒకసారి ఒక విధంగా అనుభవం చేయడం ప్రారంభిస్తారు. దీనికి కారణమేమిటి? మొదటి సంవత్సరం నుండి 10 సంవత్సరాలలో ఉల్లాస-ఉత్సాహాలు 10 రెట్లు పెరగాలి కదా. కానీ తక్కువ ఎందుకు అయ్యాయి? దానికి కారణం ఏమిటంటే, సాధన యొక్క స్థితిలో ఉండి సాధనాలను కార్యంలో ఉపయోగించరు. ఏదో ఒక ఆధారాన్ని తమ ఉన్నతికి ఆధారంగా చేసుకుంటారు. మరియు ఆ ఆధారం కదిలితే ఉల్లాస-ఉత్సాహాలు కూడా కదులుతాయి. ఆధారం తీసుకోవడం చెడు విషయమేమీ కాదు కానీ ఆధారాన్నే పునాదిగా చేసుకుంటారు. తండ్రి మధ్యలో నుండి తొలగిపోతారు మరియు ఆధారాన్నే పునాదిగా చేసుకుంటారు. అందువలన ఎలాంటి అలజడి కలుగుతుంది? ఇది ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు, ఇది ఉన్నట్లయితే ఇలా జరుగుతుంది, ఇదైతే చాలా అవసరము - ఇలా అనుభవమవ్వడం మొదలవుతుంది. సాధనాలు మరియు సాధన యొక్క బ్యాలెన్స్ ఉండదు. సాధనాల వైపు బుద్ధి ఎక్కువగా వెళ్తుంది, సాధన వైపు బుద్ధి తక్కువైపోతుంది, అందువలన, ఏదైనా కార్యంలో కానీ, సేవలో కానీ తండ్రి ఆశీర్వాదాలను అనుభవం చేయరు. ఆశీర్వాదాలు అనుభవం అవ్వని కారణంగా సాధనాల ద్వారా సఫలత లభిస్తే ఉల్లాస-ఉత్సాహాలు కూడా చాలా బాగుంటాయి మరియు సఫలత తక్కువగా లభిస్తే ఉల్లాస-ఉత్సాహాలు కూడా తక్కువైపోతాయి. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం తండ్రితో హృదయపూర్వక సంబంధము. కేవలం యోగంలో కూర్చోవడాన్నే సాధన అని అనము. ఎలాగైతే శరీరంతో కూర్చుంటారో, అలా హృదయం, మనసు, బుద్ధి ఒక్క తండ్రి వైపు, తండ్రితో పాటు కూర్చోవాలి. శరీరం ఇక్కడే కూర్చున్నా కానీ, మనసు ఒకవైపు, బుద్ధి మరోవైపు వెళ్తూ, హృదయంలో మరొకటి ఏదో వస్తూ ఉంటే దీనిని సాధన అని అనము. మనసు, బుద్ధి, హృదయం మరియు శరీరం, ఈ నాలుగూ కలిసి, తండ్రితో పాటు సమాన స్థితిలో ఉండాలి - ఇదే యథార్థమైన సాధన. అర్థమయిందా? ఒకవేళ యథార్థమైన సాధన జరగలేదంటే ఆరాధన నడుస్తుంది. ఒక్కోసారి స్మృతి చేస్తారు, ఒక్కోసారి మళ్ళీ ఫిర్యాదు చేస్తారని ముందు కూడా వినిపించాము. స్మృతిలో ఫిర్యాదులు చేసే అవసరం ఉండదు. సాధన చేసేవారికి సదా తండ్రియే ఆధారము. ఎక్కడ తండ్రి ఉంటారో, అక్కడ సదా పిల్లల యొక్క ఎగిరే కళ ఉంటుంది. తక్కువ అవ్వదు కానీ అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఒకసారి పైకి, ఒకసారి కిందకు అవుతూ ఉంటే అలసట కలుగుతుంది. మీరు ఏదైనా కదిలే స్థానంలో కూర్చుంటే ఏమవుతుంది? రైలులో చాలా కదలికల వలన అలసట కలుగుతుంది కదా. అప్పుడప్పుడు చాలా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగురుతారు, అప్పుడప్పుడు మధ్యలో ఉంటారు, అప్పుడప్పుడు కిందికి వచ్చేస్తారు, మరి ఇది కదిలినట్లే కదా కనుక అలసిపోతారు లేదా విసిగిపోతారు. తర్వాత ఇలాగే నడవాలా అని ఆలోచిస్తారు. కానీ ఎవరైతే సాధన ద్వారా తండ్రితో ఉన్నారో, వారికి సంగమయుగంలో అన్నీ కొత్త-కొత్తవిగా అనుభవమవుతాయి. ప్రతి సమయం, ప్రతి సంకల్పంలో నవీనత ఎందుకంటే ప్రతి అడుగులో ఎగిరే కళ అనగా ప్రాప్తియే ప్రాప్తి అవుతూ ఉంటుంది. ప్రతి సమయంలో ప్రాప్తి ఉంది. సంగమయుగంలో ప్రతి సమయం తండ్రి, వారసత్వం మరియు వరదానం రూపంలో ప్రాప్తి చేయిస్తారు. కనుక ప్రాప్తిలో సంతోషం ఉంటుంది మరియు సంతోషంలో ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి. తక్కువ అవ్వనే అవ్వవు. మాయ కూడా వచ్చినా కానీ, విజయులుగా అయ్యే సంతోషం ఉంటుంది ఎందుకంటే మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే జ్ఞాన సంపన్నులుగా అయ్యారు. కనుక 10 సంవత్సరాల వారికి 10 రెట్లు, 20 సంవత్సరాల వారికి 20 రెట్లు ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతున్నాయా? చెప్పేందుకు ఇలా అంటున్నాము కానీ అనేక రెట్లు పెరుగుతుంది.
ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? ఉల్లాస-ఉత్సాహాలైతే తండ్రి ద్వారా లభించిన మీ స్వంత ఆస్తి. తండ్రి ఆస్తిని మీదిగా చేసుకున్నారు, మరి ఆస్తిని పెంచుకోవడం జరుగుతుందా లేక తగ్గించుకోవడం జరుగుతుందా? ఈ సంవత్సరం విశేషంగా 4 రకాల సేవలపైన అటెన్షన్‌ను అండర్లైన్ చేయాలి.
మొదటి నంబరు - స్వ సేవ. రెండవది - విశ్వ సేవ. మూడవది - మనసా సేవ. ఒకటి వాణి ద్వారా సేవ, ఇంకొకటి మనసా సేవ కూడా విశేషమైనది. నాల్గవది - యజ్ఞ సేవ.
ఎక్కడ ఉన్నా, ఏ సేవా స్థానంలో ఉన్నా ఆ సేవా స్థానాలన్నీ యజ్ఞ కుండాలు. కేవలం మధుబన్ మాత్రమే యజ్ఞము, మీ స్థానాలు యజ్ఞం కాదు, అని కాదు. కనుక యజ్ఞ సేవ అనగా కర్మణా ద్వారా ఎంతో కొంత సేవ తప్పకుండా చేయాలి. బాప్‌దాదా దగ్గర సేవ యొక్క మూడు రకాల ఖాతాలు అందరివీ జమ అవుతాయి. మనసా, వాచా మరియు కర్మణా, తనువు-మనసు మరియు ధనము. కొంతమంది బ్రాహ్మణులు ఇలా ఆలోచిస్తారు, మేము ధనం ద్వారా సహయోగులుగా అవ్వలేము, సేవ చేయలేము ఎందుకంటే మేము సమర్పణ అయ్యాము, ధనం సంపాదించడం లేనప్పుడు ధనం ద్వారా సేవ ఎలా చేస్తాము? కానీ సమర్పిత ఆత్మ ఒకవేళ యజ్ఞ కార్యంలో తన అటెన్షన్ ద్వారా పొదుపు చేస్తే ఎంత ధనం పొదుపు చేస్తారో ఆ పొదుపు చేసిన ధనం, వారి పేరుతో జమ అవుతుంది. ఇది సూక్ష్మ ఖాతా. ఒకవేళ ఎవరైనా నష్టం చేసినట్లయితే వారి ఖాతాలో భారం జమ అవుతుంది మరియు పొదుపు చేస్తే, వారి ధనం యొక్క ఖాతాలో జమ అవుతుంది. యజ్ఞం యొక్క ఒక్కొక్క కణం బంగారు నాణెంతో సమానము. ఒకవేళ యజ్ఞంలో హృదయపూర్వకంగా పొదుపు చేస్తే (చూపించేందుకు కాదు) వారికి బంగారు నాణాలు జమ అవుతూ ఉంటాయి. రెండవ విషయం - ఒకవేళ సమర్పిత ఆత్మ సేవ ద్వారా ఇతరుల ధనాన్ని సఫలం చేయిస్తే, అందులో వారికి కూడా భాగం జమ అవుతుంది. కనుక అందరిదీ మూడు రకాల ఖాతా ఉంది. మూడు ఖాతాల పర్సంటేజ్ మంచిగా ఉండాలి. కొంతమంది మేమైతే వాచా సేవలో చాలా బిజీగా ఉంటాము, మా డ్యూటీయే వాచా సేవ చేయడము, మనసా మరియు కర్మణాలో పర్సంటేజ్ తక్కువవుతుంది అని భావిస్తారు కానీ ఇలాంటి సాకులు కూడా నడవవు. వాచా సేవ సమయంలో ఒకవేళ మనసా మరియు వాచా కలిపి సేవ చేసినట్లయితే రిజల్ట్ ఏం ఉంటుంది? మనసా మరియు వాచా కలిపి సేవ జరగగలదా? కానీ వాచా సహజమైనది, మనసా సేవలో అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది, అందుకే వాచాది జమ అవుతుంది కానీ మనసా ఖాతా ఖాళీగా ఉండిపోతుంది. వాచా సేవలో అయితే తండ్రి కన్నా కూడా అందరూ తెలివైనవారు. ఈ రోజుల్లో పెద్ద దాదీల కంటే చిన్న-చిన్న వారు మంచిగా భాషణ చేస్తారు ఎందుకంటే కొత్త రక్తం కదా. ముందుకు అయితే వెళ్ళండి, బాప్‌దాదా సంతోషిస్తారు. కానీ మనసా ఖాతా ఖాళీగా ఉండిపోతుంది ఎందుకంటే ప్రతి ఖాతాకు 100 మార్కులున్నాయి. కేవలం స్థూల సేవనే కర్మణా సేవ అని అనము. కర్మణా అనగా సంగఠనలో సంబంధ-సంపర్కంలోకి రావడము. ఇది కర్మ యొక్క ఖాతాలో జమ అవుతుంది కనుక చాలామందికి మూడు ఖాతాలలో చాలా తేడా ఉంది కానీ వారు, మేము చాలా సేవ చేస్తున్నాము, చాలా బాగున్నాము అని సంతోషిస్తూ ఉంటారు. సంతోషంగా అయితే ఉండండి కానీ ఖాతా ఖాళీగా కూడా ఉండకూడదు ఎందుకంటే బాప్‌దాదా అయితే పిల్లల స్నేహీగా ఉన్నారు కదా. ఇది కూడా జరుగుతుంది అని మాకు సూచన కూడా ఇవ్వలేదు అని తర్వాత ఇలా ఫిర్యాదు చేయకండి. ఆ సమయంలో బాప్‌దాదా ఈ పాయింట్ గుర్తు చేయిస్తారు. టి.వి.లో చిత్రం ఎదురుగా వచ్చేస్తుంది. అందుకే ఈ సంవత్సరం సేవ అయితే చాలా చేయండి కానీ ఈ మూడు రకాల ఖాతాలు మరియు నాలుగు రకాల సేవ కలిపి చేయండి. వాచా వైపు భారమైపోయి, మనసా మరియు కర్మణా వైపు తేలికగా అయితే ఏమవుతుంది? బ్యాలెన్స్ ఉండదు కదా. బ్యాలెన్స్ లేని కారణంగా ఉల్లాస-ఉత్సాహాలు కూడా హెచ్చు-తగ్గులు అవుతాయి. అటెన్షన్ పెట్టండి కానీ బాప్‌దాదా పదే-పదే చెప్తారు, అటెన్షన్‌ను టెన్షన్‌లోకి మార్చకండి. చాలా సార్లు అటెన్షన్‌ను టెన్షన్‌గా చేసేస్తారు, ఇలా చేయకండి. సహజంగా మరియు స్వాభావికంగా అటెన్షన్ ఉండాలి. డబల్ లైట్ స్థితిలో న్యాచురల్ అటెన్షన్ ఉండనే ఉంటుంది. అచ్ఛా.
రెండవ విషయం - సేవ యొక్క ఏ విధిని అవలంబిస్తారు? ఇదైతే సిద్ధి గురించిన విషయం. మరి ఇప్పుడు విధి ఏమిటి చేస్తారు? ఒకటి - మీ కార్యం ఏదైతే 2 సంవత్సరాల నుండి అందరి సహయోగంతో నడుస్తోందో, ఈ కార్యాన్ని సంపన్నం చేయాలి. సమాప్తం కాదు, సంపన్నం అని అంటాము. దీని కొరకు ఫంక్షన్లు నిర్వహించినా, లేదా పుస్తకం సిద్ధం చేసి ఆ తర్వాత ప్రజలకు సందేశాన్ని ఇచ్చినా - అది తప్పక చేయండి. కానీ ఒక విషయం తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి - ‘తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం’. బాప్‌దాదా ప్రతి కార్యం కొరకు ఆది నుండి ఇప్పటివరకు ఇదే విధిని అవలంబిస్తూ వచ్చారు: మరీ ఉన్నతంగా కాదు, అలాగని మరీ సాధారణంగా కాకుండా మధ్యస్తంగా ఉండాలి; ఎందుకంటే రెండు రకాల ఆత్మలు ఉంటారు. ఒకవేళ చాలా ఖరీదైనదిగా చేస్తే - వీరి వద్ద చాలా డబ్బులు ఉన్నాయి అని ప్రజలు అంటారు. మరియు మరీ తక్కువగా చేస్తే విలువ ఉండదు; అందువలన సదా మధ్యస్తంగా ఉంచాలి. బుక్ కూడా ఇప్పటివరకు తయారుచేసినది మంచిదే. సంపన్నం చేయాల్సిందే కానీ మరీ విస్తారం చేయకూడదు. మరీ పెద్దదిగా చేయకూడదు. షార్ట్గానూ ఉండాలి, స్వీట్గానూ ఉండాలి, సారయుక్తంగానూ ఉండాలి. విస్తారంలో అక్కడక్కడ సారం దాగిపోతుంది. మరియు సారం ఉన్నప్పుడే బుద్ధికి టచ్ అవుతుంది. కార్యం బాగానే చేస్తున్నారు కానీ తమ బుద్ధి శక్తిలో కూడా తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం (కమ్ ఖర్చా బాలానశీన్) ఉండాలి. ఇకపోతే శ్రమించేవారికి అభినందనలు. ప్రోగ్రామ్‌ను వచ్చే సంవత్సరంలో ఉంచినా సరే కానీ సంపన్నం అయితే చేయాల్సిందే. ఇది చాలా సుదీర్ఘంగా నడిచింది, చాలా బిజీగా ఉండిపోయాము, చాలా ఖర్చు కూడా అయింది అని చాలామంది పిల్లలు అనుకుంటున్నారు... కానీ ఏది జరిగిందో అది మంచిదే జరిగింది మరియు ఏది జరగనుందో అది మరింత మంచిగా జరుగుతుంది. అలసిపోకూడదు. ఉల్లాస-ఉత్సాహాలను మరింత పెంచండి. ఏ ఆసక్తితోనైతే ఈ కార్యాన్ని ప్రారంభించారో, అంతకంటే అనేక రెట్లు తక్కువ ఖర్చుతో అధిక ఫలితాన్ని పొందే విధి ద్వారా సంపన్నం చేయండి. అర్థమైందా? పనిచేసే సమయం నిర్ణీతంగా ఉండాలి. రాత్రిపూట మేల్కొని పనిచేస్తే మంచి పని జరుగుతుంది అని కొందరు అనుకుంటారు. కానీ బుద్ధి అలసిపోతుంది మరియు అమృతవేళ శక్తిశాలిగా లేకపోవడం వల్ల రెండు రెట్లు జరగవలసిన కార్యం కాస్తా ఒక రెట్టే అవుతుంది. అందువలన సమయానికి కూడా ఒక పరిమితి (లిమిట్) ఉండాలి. మళ్ళీ ఉదయాన్నే లేచి తాజా బుద్ధితో చదువు చదువుకోవాలి. పనిచేయడానికి లిమిట్ ఉండాలి. పిల్లల ఉత్సాహాన్ని చూసి బాప్‌దాదా సంతోషపడతారు, అయినప్పటికీ ఒక హద్దు నిర్ణయించాలి కదా. సదా బుద్ధి ఫ్రెష్‌గా ఉండాలి మరియు ఫ్రెష్ బుద్ధితో జరిగే పని ద్వారా ఒక గంటలోనే రెండు గంటల పనిని చేయగలరు. ఒకటి సేవ యొక్క ఈ కార్యం. రెండవది - ప్రస్తుత సమయంలో ధనము మరియు సమయము దేశ-విదేశాలలో ఈ బిజీ ప్రోగ్రామ్‌లలో చాలా ఎక్కువగా వెచ్చించారు. అందువలన ఇప్పుడు సంబంధ-సంపర్కాల్లోకి వచ్చేవారైనా లేదా కొత్త ఆత్మలకు సందేశాన్ని ఇచ్చి అయినా స్నేహ-మిలనము జరపండి. చిన్న-చిన్న సేవాకేంద్రాలలో 5 గురితో స్నేహ-మిలనం జరిగినా ఏమీ నష్టం లేదు. వారు మరింత రిఫ్రెష్ అవుతారు, సమీపంగా వస్తూ ఉంటారు. చిన్న-చిన్న స్నేహ-మిలనాలు జరపండి. 5 నుండి 50 వరకు, 100 వరకు సమ్మేళనం చేయవచ్చు. పెద్ద ఫంక్షన్ కాదు; ఎంత స్థలముందో అంతలో మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం లభించేలా స్థలం కూడా మీకు సహజంగా లభిస్తుంది. ఎక్కువగా పరుగులెత్తవలసిన అవసరం లేదు. మీ వద్దకు 100 మంది ఆత్మలు రావలసి ఉంటే డ్రామానుసారం స్థలం కూడా సహజంగానే లభిస్తుంది. కానీ చిన్న సెంటర్ల వారు కూడా మేము 100 మందితో ప్రోగ్రామ్ చేయాలి అని అనుకోవద్దు. శక్తి కొద్దీ, సహకారం కొద్దీ, స్నేహం మరియు ధన శక్తి కొద్దీ 5 గురితో చేయండి, 25 మందితో చేయండి, 50 మందితో చేయండి కానీ తప్పకుండా చేయాలి. బిజీగా అయితే తప్పక ఉండాలి; మరియు ప్రతి 3 నెలల తర్వాత లేదా శక్తి కొద్దీ 3 లేదా 4 ప్రోగ్రామ్స్ చేయండి. కానీ తప్పకుండా చేయాలి; మొదట 5 గురితో స్నేహ-మిలనం చేస్తే ఆ 5 మంది ఆత్మలు మరో ఇద్దరు-ముగ్గురిని తీసుకువస్తారు, అప్పుడు రెండవసారి 10 మంది అవుతారు, ఆ తర్వాత 15 మంది అవుతారు. ఎందుకంటే డబల్ లైట్‌గా చేయాలి, భారంగా చేయకూడదు. సేవ చాలా చేసేశాము కదా అని అలసత్వంగానూ మారకూడదు. కాదు, సేవ బిజీగా ఉండేందుకు సాధనం; కానీ బరువుతో సేవ చేస్తారు కాబట్టే అలసిపోతారు. సేవ అయితే సంతోషాన్ని పెంచుతుంది. సేవ అనేక ఆత్మల ఆశీర్వాదాలను ప్రాప్తింపజేస్తుంది. సేవ చేయకపోతే 9 లక్షల వరకు ఎలా చేరుకుంటారు? సేవ చేయండి కానీ బర్డెన్ గల సేవ కాకూడదు అని అండర్లైన్ చేసుకోండి. బుద్ధి బర్డెన్ అయినా, ధనం బర్డెన్ అయినా సరే... ఈజీగా ఉండి చేస్తే సర్వీస్ కూడా ఈజీ రూపంలో పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి ఏ విధులనైతే అనుసరిస్తారో వాటిని తప్పక చేయాలి. ఎవరైనా మీకు సహకారులుగా మారి, సిద్ధంగా ఉన్న స్టేజ్‌ను మీకు పెద్ద ఫంక్షన్ కొరకు సమకూర్చి ఇస్తే అప్పుడు పెద్ద ఫంక్షన్ కూడా చేసుకుంటారు, అటు బుద్ధి బర్డెన్ గానీ, ఇటు ధనం బర్డెన్ గానీ ఉండదు. అలాంటి సంస్థలు కూడా ఎన్నో ఉంటాయి, వారిని తమ సహకారులుగా చేసుకోండి, ఆ ప్రయత్నం చేయండి. మరియు ధైర్యం ఉంటే ఒక పెద్ద ఫంక్షన్ తప్పక చేయండి. ధైర్యం లేకపోతే చేయకండి. పెద్ద ఫంక్షన్ సంస్థ పేరును ఉన్నతం చేస్తుంది. కానీ డబల్ లైట్‌గా అయి చేయండి. మరియు తమ శక్తిని వెచ్చించడానికి బదులుగా ఇతరుల ఎనర్జీని ఈ ఈశ్వరీయ కార్యంలో ఉపయోగించాలి అనే లక్ష్యాన్ని ఉంచుకోండి. లక్ష్యం ఉంచుకుంటే ఎన్నో ఆహ్వానాలు లభిస్తాయి. ఏ వర్గానికైనా చెందిన సహకార రంగాలు ప్రతి చిన్న, పెద్ద దేశంలోనూ లభిస్తాయి. ప్రస్తుత సమయం అలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి; వారి వద్ద ఎనర్జీ ఉంది కానీ దానిని ఉపయోగించే విధి తెలియదు. వారు అలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు. వారికి అలాంటివారెవరూ కనిపించట్లేదు. ఎంతో ప్రేమతో మీకు సహకారాన్ని అందిస్తారు, సమీపంగా వస్తారు. మరియు మీ 9 లక్షల ప్రజలలో కూడా వృద్ధి జరుగుతుంది. కొందరు వారసులుగానూ తయారవుతారు, కొందరు ప్రజలుగానూ తయారవుతారు. చూడండి, ఇక్కడ కూడా మొదట గ్లోబల్ కార్యానికి సహకారులుగా వచ్చారు మరియు ఇప్పుడు వారసులుగా మారిపోయారు. అతిథులుగా వచ్చి మహాన్‌గా మారిపోయారు; కాబట్టి ఇలాంటి ఎంతో మంచి-మంచి సమీప ఆత్మలు వెలువడ్డారు మరియు భవిష్యత్తులోనూ వెలువడతారు. ఏదో ఒకటి చేస్తూనే ఉండండి. కానీ డబల్ లైట్‌గా అయి ఉండండి అని బాప్‌దాదా మాటిమాటికీ స్మృతి కలిగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఈ విధి ద్వారా స్నేహ మిలనాలు చేస్తూ చేస్తూ చివర్లో ఒక పెద్ద ఫంక్షన్ తప్పక చేయండి. మరియు భారతదేశంలోనైతే ఎగ్జిబిషన్ (ప్రదర్శన) ద్వారా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. చిన్న-చిన్న స్నేహ-మిలనాల ద్వారా సమీపానికి తీసుకురండి, ఆ తర్వాత పెద్ద ఫంక్షన్లో వారిని స్టేజ్‌పైకి తీసుకురండి. వారు తమ అనుభవాలను వినిపిస్తారు. మీరు చెప్పాల్సిన అవసరమే ఉండదు. పెద్ద ప్రోగ్రామ్ ప్రభావం దానిదే. స్నేహ-మిలనం యొక్క ప్రభావము, సఫలత దానిదే. స్నేహ-మిలనం అనగా ఆత్మల భూమిని తయారుచేయడము మరియు పెద్ద ఫంక్షన్ అనగా శబ్దాన్ని బిగ్గరగా చేయడము. కానీ యథాశక్తి చేయండి. డైరెక్షన్ లభించింది కదా, చేయలేకపోతున్నా బలవంతంగా చేయాలి అని ఇలా కాదు. అర్థమైందా?
మూడవ విషయం - స్వయం ఉన్నతి కొరకు తమ మూడు ఖాతాలనూ జమ చేసుకోండి. కానీ దాంతోపాటు బాప్‌దాదా రిజల్ట్‌లో ఏమి చూస్తున్నారంటే - సేవా వృద్ధితో పాటు ఎవరైతే నిమిత్త ఆత్మలు ఉన్నారో, ఎవరినైతే మీరు నిమిత్త సేవాధారులు అంటారో... బాప్‌దాదా ‘టీచర్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించరు, ఎందుకంటే కొన్నిచోట్ల టీచర్‌గా భావించడం వల్ల నషా తలకెక్కుతుంది. అందుకే నిమిత్త సేవాధారులు అంటాము. కాబట్టి సేవతో పాటు నిమిత్త సేవాధారుల పురుషార్థ విధిలో చాలా మంచి ప్రోగ్రెస్ అనగా ఉన్నతి జరగాలి. సేవ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో, అందులో సమయానుసారంగా జరుగుతున్నదానిని బాప్‌దాదా సదా మంచిదే అంటారు; కానీ సమయపు వేగాన్ని మరియు సేవ యొక్క సంపూర్ణ సమాప్తి స్టేజ్‌ను చూసి - సేవాధారుల పురుషార్థ విధిలో వృద్ధి జరిగితే సేవలో నాలుగు రెట్ల వృద్ధి జరగగలదు అని బాప్‌దాదా భావిస్తున్నారు. అందువలన ముందుగా ఆ సేవ కూడా చాలా ఆవశ్యకమైనది. సేవ కొరకు సమయాన్ని ప్రత్యేకంగా నిర్ణయించుకోండి మరియు పురుషార్థ వృద్ధి కొరకు సమయాన్ని ప్రత్యేకంగా నిర్ణయించుకోండి. సేవకు నిమిత్తమైన ఆత్మలలో ఇప్పుడు విల్ పవర్ కావాలి. విల్ పవర్‌ను పెంచుకోవడం ద్వారా ఇతరులను కూడా తండ్రి ఎదుట సహయోగులుగా చేసి సమర్పణ (విల్) చేయించగలరు. చాలామంది ఆత్మలు మీ సహకారం కొరకు చాతక పక్షుల్లా వేచి చూస్తున్నారు, కానీ వారిలో శక్తి లేదు. మీ శక్తుల సహాయాన్ని వారికి విశేషంగా అందించాల్సి ఉంటుంది. అందువలన నిమిత్తంగా మారిన సేవాధారులలో సర్వ శక్తుల పవర్ ఉంది కానీ ఎంత ఉండాలో అంత లేదు. తమ కొరకు ఉపయోగించుకోవడం వల్ల ఇతరులకు పూర్తి శక్తులను ఇవ్వలేకపోతున్నారు. బ్రహ్మా బాబా అంతిమంలో పిల్లల పట్ల శక్తులను విల్ చేసినట్లుగా. ఆ విల్ ద్వారానే ఈ కార్యం నడుస్తోంది. ఆదిలో ధనాన్ని విల్ చేశారు, దాంతో యజ్ఞం స్థాపన అయింది; మరియు అంతిమంలో శక్తులను విల్ చేశారు, దాంతో ఈ సేవ వృద్ధిని పొందుతోంది. బ్రహ్మా అయితే చేశారు, ఫాలో చేయవలసినది పిల్లలే కదా. ఒక్క బ్రహ్మా విల్ చేయడం వల్ల ఎన్ని ఆత్మలు వచ్చాయో మరియు వస్తున్నాయో. ఒకవేళ ఇంతమంది నిమిత్త సేవాధారులు కూడా ఇలా శక్తులను ఆత్మల పట్ల విల్ చేస్తే ఇక ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు ఈ ఆవశ్యకత ఉంది. తమ పురుషార్థంలోనే ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు. తమ ఉన్నతిని చేసుకోవాల్సిందే కానీ వేస్ట్ కూడా అయిపోతోంది; అందువల్ల సమయపు వేగం ప్రకారం, సేవా సమాప్తి వేగం ప్రకారం సేవాధారుల వేగం మరింత ఎక్కువగా కావాలి. ఇప్పుడు తమను తాము నిమిత్తంగా మార్చుకోవాలి. ఇందులో ఇతరులను చూసి ‘మొదట మీరు’ అని అనకూడదు, ‘ముందుగా నేనే’ అని భావించాలి. మరియు హృదయపూర్వక ఉల్లాసంతో ‘నేను అర్జునుడిగా మారాలి’ అని అర్థం చేసుకోవాలి. అర్జునుడు అనగా మాస్టర్ బ్రహ్మా. అవ్వల్ (మొదటివాడు) అనగా అర్జునుడు. ప్రోగ్రామ్ ప్రకారం స్వయం ఉన్నతి ప్రోగ్రాములు పెట్టుకుంటూ వచ్చారు; కానీ ఈ సంవత్సరం బాప్‌దాదా ప్రతి ఒక్క స్నేహీ ఆత్మ ద్వారా స్నేహానికి ప్రత్యక్ష రూపంగా ‘హృదయపూర్వక ప్రోగ్రెస్’ను కోరుకుంటున్నారు తప్ప ప్రోగ్రామ్ ప్రకారమైనది కాదు. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సమర్పణ కావడం ప్రేమ అవుతుంది తప్ప కష్టం కాదు. అందరి హృదయంలో ఈ ఉత్సాహం ఉంటే సఫలత లభిస్తుంది. తండ్రితో ప్రేమ ఉంటే, తండ్రి ఈసారి హృదయపు ప్రేమను చూస్తారు. ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినా అది పెద్ద విషయమా ఏంటి! సేవలో సఫలత కొరకు ఏమి త్యాగం చేయాలో మీకు తెలుసు కదా? దీని కొరకు కూడా సమయం కావాలి కదా. సేవ కూడా తప్పక చేయాలి మరియు స్వయం ఉన్నతి కూడా తప్పక చేసుకోవాలి. ఈసారి బాప్‌దాదా తమను కలిసే సమయాన్ని దీని కొరకు ఇస్తున్నారు. రిజల్ట్ చూసి బాప్‌దాదా ప్రోగ్రామ్‌ను నిర్ణయిస్తారు. రారేమో అని అలా కాదు. ఈ సంవత్సరం ఎవరైతే బాప్‌దాదాను కలవడానికి రాలేకపోయారో, దేశం వారైనా, విదేశాల వారైనా వారి కొరకు వస్తారు. దాని కొరకు విధి ఏమిటో కూడా వినిపిస్తున్నారు. భారతదేశం వారి కొరకు ప్రతి గ్రూప్ 5 రోజులు రిఫ్రెష్ అవ్వాలి. మిగిలిన ఒక రోజు రావడం, ఒక రోజు వెళ్ళడం. ఈ విధి ద్వారా భారతవాసులవి 4 గ్రూపులు మరియు విదేశీయులవి 3 గ్రూపులు ఉంటాయి. విదేశీయులదైతే 15 రోజుల ప్రోగ్రామే ఉంటుంది. బాప్‌దాదా ప్రతి గ్రూప్‌ను ఒక్కసారి కలుస్తారు - మురళీ ద్వారా మరియు గ్రూప్ ద్వారా కూడా. మిగిలిన సమయం ఏదైతే మిగులుతుందో, అది విశేష సేవాధారుల కొరకు ఉంటుంది. విదేశాల వారిదైనా ఒక గ్రూప్ ఉండవచ్చు కానీ మధుబన్లోనే ఉండాలి. మిగిలిన 4 గ్రూపులు ఏ సమయంలో మధుబన్ వసతి (సాల్వేషన్) ప్రకారం అనుకూలమో అది మీరు నిర్ణయించండి. విదేశీయులు డిసెంబర్లో, మళ్ళీ మార్చిలో వస్తారు కాబట్టి రెండు గ్రూపులు ఒక నెలలో, ఒక గ్రూప్ మరొక నెలలో పెట్టుకోవచ్చు. భారతదేశానిదైతే 18 జనవరి ఉంది. విదేశీయులది శివజయంతి. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఈ నెలలు సేవ కొరకు చాలా మంచివి. ఫుల్ ఫోర్స్‌తో సేవ చేయండి. మిగిలిన సమయంలో సేవాధారుల గ్రూపులను తయారుచేయండి. కానీ బాప్‌దాదా చెప్పిన ఈ విషయాన్ని మరచిపోకండి - ప్రోగ్రామ్ ప్రకారం ప్రోగ్రెస్ అవ్వడం కాదు, హృదయపూర్వక ప్రోగ్రెస్ జరగాలి. హృదయపు ఉత్సాహంతో ప్రోగ్రెస్ భట్టీ జరగాలి. స్వయంగా దృఢ సంకల్పం చేయండి. నేను మారాలి అనే దృఢతను ఉంచుకోండి. నేను ‘హే అర్జునుడిగా’ మారాలి, మాస్టర్ బ్రహ్మాగా మారాలి.
నాలుగవ విషయం - అన్ని సేవాస్థానాలలో కనీసం 8 రోజులు, మరింత ఎక్కువగా చేయగలిగితే 15 రోజులు స్వయం ఉన్నతి రిట్రీట్ లేదా స్నేహ-మిలనం ప్రతి సేవాకేంద్రం వ్యక్తిగతంగానైనా చేయండి, లేదా చిన్న-చిన్న స్థానాలను కలిపైనా చేయండి. కానీ ప్రతి ఈశ్వరీయ విద్యార్థి, ప్రతి బ్రాహ్మణ ఆత్మ ఈ స్వయం ఉన్నతి రిట్రీట్, స్నేహ-మిలనం లేదా హృదయపూర్వక పురుషార్థ పురోగతి ప్రోగ్రామ్‌ను తప్పకుండా తయారుచేయాలి. నలువైపులా ఉన్న బ్రాహ్మణ ఆత్మలకు ఈ అవకాశాన్ని ఇవ్వాలి మరియు తీసుకోవాలి కూడాను.
బాప్‌దాదా ఈ గుప్త రహస్యాన్ని కూడా వినిపిస్తున్నారు: ఎవరైతే విశేషంగా హృదయపూర్వకంగా ప్రగతి భట్టీని చేస్తారో, వారికి బాప్‌దాదా యొక్క ఎక్స్ట్రా ఆశీర్వాదాల గిఫ్ట్ లభిస్తుంది. స్థూల బహుమతి పెద్ద విషయమేమీ కాదు, కానీ విశేషంగా ఆ ఆత్మ పట్ల... బాప్‌దాదా వద్ద ప్రతి సెకను-సెకనుకూ టీవీ ఉంది కదా! మరియు ఒకే సమయంలో అందరినీ చూడగలరు. అందువలన ఎవరైతే హృదయపూర్వకంగా పురోగతి సంకల్పం చేస్తారో, ప్రోగ్రెస్ అవుతారో వారికి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయి. అనుభవం చేసుకుంటారు; ఆ రోజును మీరు విశేష ఆశీర్వాదాల రోజని అర్థం చేసుకోండి.
మీటింగ్‌లో కూడా ఈ నవీనతను ముందుగా తీసుకురండి. ప్రోగ్రామ్‌లు కొన్ని ఆలోచనల (మెదడు) పరమైనవి, కొన్ని సేవకు సంబంధించినవి ఉండవచ్చు కానీ హృదయపూర్వకమైనవిగా రూపొందాలి. ఆలోచనల శాతం ఎక్కువగా ఉంది, ఆ తర్వాత రిజల్ట్ చూసి వచ్చే సంవత్సరపు కొత్త ప్రోగ్రామ్‌ను తెలియజేస్తారు. పాతవారి కొరకు ఏదైనా కొత్త ప్లాన్‌ను తర్వాత తయారుచేస్తారు. మంచిది!
సదా తమ ముఖం మరియు నడవడికలో పవిత్రతతో కూడిన ఆత్మికత యొక్క మెరుపు కలిగినవారు, సదా ప్రతి అడుగులో బ్రహ్మాచారి శ్రేష్ఠాత్మలు, సదా తమ సేవ యొక్క సర్వ ఖాతాలను నిండుగా ఉంచుకునేవారు, సదా హృదయపూర్వకంగా తమ ఉన్నతి కోసం దృఢ సంకల్పం చేసేవారు, సదా స్వ-ఉన్నతి పట్ల స్వయాన్ని నంబర్‌వన్ నిమిత్త ఆత్మగా చేసుకునేవారు - ఇలా తండ్రికి ప్రియమైన మరియు విశేషంగా బ్రహ్మా తల్లికి ప్రియమైనవారు, ఈ రోజు మదర్స్ డే జరుపుకున్నారు కదా, కనుక బ్రహ్మా తల్లి యొక్క అత్యంత ప్రియమైన పిల్లలకు బ్రహ్మా తల్లి యొక్క మరియు విశేషంగా తండ్రి యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
మధుబన్ నివాసులతో:- మధుబన్ నివాసులకు మంచి గోల్డెన్ ఛాన్సులు లభిస్తాయి కనుక డ్రామానుసారంగా ఎవరికైతే పదే-పదే గోల్డెన్ ఛాన్స్ లభిస్తుందో వారిని బాప్‌దాదా అతి పెద్ద ఛాన్సలర్ అని అంటారు. సేవా ఫలము మరియు బలము రెండూ ప్రాప్తిస్తాయి. బలం కూడా లభిస్తుంది, ఆ బలం సేవ చేస్తుంది మరియు ఫలం సదా శక్తిశాలిగా తయారుచేసి ముందుకు తీసుకెళ్తుంది. అందరికన్నా ఎక్కువ మురళీలు ఎవరు వింటారు? మధుబన్ వారు. వారైతే విన్న మురళీలను లెక్కపెట్టవచ్చు మరియు మీరు సదా మురళీలు వింటూనే ఉంటారు. వినడంలో కూడా నంబర్‌వన్ మరియు చేయడంలో? చేయడంలో కూడా నంబర్‌వన్‌గా ఉన్నారా లేదా అప్పుడప్పుడు రెండవ నంబరు అయిపోతుందా? ఎవరైతే సమీపంగా ఉంటారో, వారిపై విశేషమైన అధికారం ఉంటుంది కనుక బాప్‌దాదాకు కూడా విశేషమైన అధికారం ఉంది. చేయాల్సిందే మరియు నంబర్‌వన్‌గా చేయాలి. ఎందులోనూ నంబర్ వెనుక ఉండకూడదు. అన్ని జమ ఖాతాలు నంబర్‌వన్ ఫుల్‌గా ఉండాలి. ఒక్క ఖాతా కూడా కొంచెం ఖాళీగా కూడా ఉండకూడదు. ఎలాగైతే మధుబన్‌లో సర్వ ప్రాప్తులు, ఆత్మికమైనవి అయినా, శారీరకమైనవి అయినా అన్నీ నంబర్‌వన్‌గా లభిస్తాయి - అలా ఇప్పుడు చేయడంలో సదా నంబర్‌వన్. వన్‌కు గుర్తు ప్రతి విషయంలో విన్ అవ్వడము. ఒకవేళ విన్ (విజయీగా) అయినట్లయితే తప్పకుండా వన్‌గా ఉంటారు. అప్పుడప్పుడు విన్ అయితే నంబర్‌వన్ కాదు. అచ్ఛా, సేవ యొక్క శుభాకాంక్షలు, సేవ యొక్క సర్టిఫికెట్లు అయితే చాలా లభించాయి. ఇంకేం సర్టిఫికెట్లు తీసుకోవాలి? ఒకటి - స్వ పురుషార్థంలో మీ మనసుకు ఇష్టమైనవారిగా, రెండవది -ప్రభువుకు ఇష్టమైనవారిగా, మూడవది - పరివారానికి ఇష్టమైనవారిగా ఉండాలి. ఈ మూడు సర్టిఫికెట్లు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. మనసుకు ఇష్టమైనవారు అన్న సర్టిఫికెట్ ఉండి, మిగితావి లేకుండా ఉండడం కాదు. మూడూ కావాలి. బాబాకు ఇష్టమైనవారు ఎవరు? ఏదైతే తండ్రి చెప్పారో, అది చేసారు. ఇది ప్రభువుకు ఇష్టమైనవారు అన్న సర్టిఫికెట్. మరియు మీ మనసుకు ఇష్టమైనవారు అనగా మీ మనసు ఏదో, అదే తండ్రి మనసు కావాలి. తమ హద్దు యొక్క మనసుకు నచ్చినవారు కాదు కానీ తండ్రి మనసే నా మనసు. ఏదైతే తండ్రి మనసుకు ఇష్టమో, అదే నా మనసుకు ఇష్టము, దీనినే అంటాము మనసుకు ఇష్టమైనవారు అన్న సర్టిఫికెట్ మరియు పరివారం యొక్క సంతుష్టతా సర్టిఫికెట్. మరియు ఈ మూడు సర్టిఫికెట్లు తీసుకున్నారా? సర్టిఫికెట్ ఏదైతే లభిస్తుందో, దానిలో వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. పెద్దవారితో వెరిఫై కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. తండ్రి అయితే త్వరగా రాజీ అయిపోతారు కానీ ఇక్కడ అందరినీ రాజీ చేయాలి. కనుక ఎవరైతే మీతో పాటు ఉంటారో వారితో సర్టిఫికెట్‌ను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. తండ్రి అయితే ఎక్కువ దయాహృదయులు కదా కనుక హా జీ అని అనేస్తారు. అచ్ఛా, అందరి డిపార్ట్మెంట్లు నిర్విఘ్నంగా ఉన్నాయా? స్వయం కూడా నిర్విఘ్నంగా ఉన్నారా? సేవా సుగంధమైతే విశ్వంలో కూడా ఉంది, సూక్ష్మవతనం వరకు కూడా ఉంది. ఇప్పుడు కేవలం ఈ మూడు సర్టిఫికెట్లను వెరిఫై చేసుకోండి. అచ్ఛా.
భారతవాసులతో:- సుఖదాత తండ్రితో పాటు సుఖమయమైన పిల్లలుగా అయిపోయామని ఇలా అనుభవమవుతుందా? తండ్రి సుఖదాత అయినప్పుడు పిల్లలు సుఖ స్వరూపులుగా ఉంటారు కదా? ఎప్పుడైనా దుఃఖపు అల వస్తుందా? సుఖదాత పిల్లల వద్దకు దుఃఖం రాలేదు ఎందుకంటే సుఖదాత తండ్రి యొక్క ఖజానా మీ ఖజానాగా అయిపోయింది. సుఖం మీ ఆస్తి అయిపోయింది. సుఖం, శాంతి, శక్తి, సంతోషం - ఇవన్నీ మీ ఖజానా. తండ్రి ఖజానా ఏది ఉందో, అది మీ ఖజానాగా అయిపోయింది. బాలకులు సో యజమానులు కదా! అచ్ఛా! భారత్ కూడా తక్కువేమీ కాదు. ప్రతి గ్రూప్‌లోనూ చేరుకుంటారు. తండ్రి కూడా సంతోషిస్తారు. 5 వేల సంవత్సరాలు తప్పిపోయిన వారు మళ్ళీ లభిస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది! ఒకవేళ 10-12 సంవత్సరాలు తప్పిపోయినవారు ఎవరైనా, మళ్ళీ దొరికితే ఎంత సంతోషం అనిపిస్తుంది! ఇక్కడ 5 వేల సంవత్సరాలు తండ్రి మరియు పిల్లలు వేరైపోయారు, ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నారు, అందుకే, చాలా సంతోషం ఉంది కదా. అందరికన్నా ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది? అందరికీ ఉంది ఎందుకంటే ఈ సంతోషం యొక్క ఖజానా ఎంత పెద్దదంటే ఎంతమంది తీసుకున్నా కూడా తరగనిది. అందుకే ప్రతి ఒక్కరూ అధికారి ఆత్మలు. అలా ఉంది కదా? సంగమయుగాన్ని ఎటువంటి యుగమని అంటారు? సంగమయుగం సంతోషం యొక్క యుగము. ఖజానాలే ఖజానాలు, ఎంత ఖజానా కావాలనుకుంటే అంతగా నింపుకోవచ్చు. ధన్వాన్ భవ, సర్వ ఖజానా భవ అనే వరదానం లభించి ఉంది. సర్వ ఖజానాల వరదానం ప్రాప్తించింది. బ్రాహ్మణ జీవితంలో సంతోషమే సంతోషం ఉంది. ఈ సంతోషమైతే ఎప్పుడూ మాయమవ్వడం లేదు కదా? మాయ ఖజానాలను దోచుకోవడం లేదు కదా? ఎవరైతే సావధానంగా, తెలివైనవారిగా ఉంటారో, వారి ఖజానాను ఎవ్వరూ ఎప్పుడూ దోచుకోలేరు. ఎవరైతే కొంచెం అయినా నిర్లక్ష్యంగా ఉంటారో, వారి ఖజానాను దోచుకుంటారు. మీరైతే సావధానంగా ఉన్నారు కదా లేక అప్పుడప్పుడు నిద్రపోతున్నారా? ఎవరైనా నిద్రపోతే దొంగతనం జరుగుతుంది కదా. నిర్లక్ష్యులుగా అయిపోయారు. సదా తెలివైనవారిగా, సదా వెలిగే జ్యోతులుగా ఉన్నట్లయితే, ఖజానాను దోచుకుని తీసుకెళ్ళేందుకు మాయకు ధైర్యం ఉండదు. అచ్ఛా, ఎక్కడి నుండి వచ్చినా కానీ, అందరూ పదమాపదమ్ భాగ్యవంతులు! అన్నీ లభించాయి అన్న పాటను పాడుతూ ఉండండి. ఈ ఖజానాలు తోడుగా ఉంటాయి అన్నది 21 జన్మల కోసం గ్యారెంటీ ఉంది. ఇంత పెద్ద గ్యారెంటీ ఎవ్వరూ ఇవ్వలేరు. కనుక ఈ గ్యారెంటీ కార్డు తీసుకున్నారు కదా! ఈ గ్యారెంటీ కార్డును ఎవరో సాధారణమైన ఆత్మ ఇవ్వడం లేదు. దాత ఉన్నారు, అందుకే ఎటువంటి భయమూ లేదు, ఎటువంటి సంశయమూ లేదు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
