‘‘యథార్థమైన చార్టుకు అర్థము - ప్రగతి మరియు పరివర్తన’’
ఈరోజు బాప్‌దాదా తమ విశ్వ నవ-నిర్మాతలైన పిల్లలను చూస్తున్నారు. ఈరోజు కొత్త సంవత్సరం యొక్క ఆరంభాన్ని ప్రపంచంలో నలువైపులా జరుపుకుంటారు. కానీ వారు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు మరియు బ్రాహ్మణ ఆత్మలైన మీరు కొత్త సంగమయుగంలో ప్రతి రోజును కొత్తగా భావిస్తూ జరుపుకుంటూ ఉంటారు. వారు ఒక్క రోజును జరుపుకుంటారు మరియు మీరు ప్రతి రోజును కొత్తగా అనుభవం చేస్తారు. అది హద్దు సంవత్సరం యొక్క చక్రము మరియు ఇది అనంతమైన సృష్టి చక్రం యొక్క కొత్త సంగమయుగము. సంగమయుగము అన్ని యుగాలలోనూ అన్ని రకాల నవీనతను తీసుకొచ్చేటువంటి యుగము. సంగమయుగీ బ్రాహ్మణ జీవితము కొత్త జీవితమని మీరందరూ అనుభవం చేస్తారు. కొత్త జ్ఞానం ద్వారా కొత్త వృత్తి, కొత్త దృష్టి మరియు కొత్త సృష్టిలోకి వచ్చేసారు. రాత్రి పగలు, ప్రతి సమయము, ప్రతి క్షణము కొత్తగా అనిపిస్తుంది. సంబంధాలు కూడా ఎంత కొత్తవిగా అయ్యాయి! పాత సంబంధాలకు మరియు బ్రాహ్మణ సంబంధాలకు ఎంత వ్యత్యాసముంది! పాత సంబంధాల లిస్టును స్మృతిలోకి తీసుకురండి, అది ఎంత పెద్దది! కానీ కొత్త యుగమైన సంగమయుగం యొక్క కొత్త సంబంధాలు ఎన్ని ఉన్నాయి? లిస్టు ఏమైనా పెద్దగా ఉందా? బాప్‌దాదా మరియు సోదరీ-సోదరులు మరియు ఎంత నిస్వార్థమైన ప్రేమతో కూడిన సంబంధాలు ఉన్నాయి! అవి అనేక స్వార్థపూరిత సంబంధాలు. కనుక కొత్త యుగము, చిన్నని కొత్త బ్రాహ్మణ ప్రపంచమే అతి ప్రియమైనవి.
ప్రపంచంవారు ఒక్క రోజు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు మరియు మీరేమి చేస్తారు? బాప్‌దాదా ఏం చేస్తారు? ప్రతి క్షణము, ప్రతి సమయము, ప్రతి ఆత్మకు శుభ భావన, శుభ కామనల శుభాకాంక్షలను ఇస్తారు. ఎప్పుడైనా ఎవరికైనా, ఏదైనా ఉత్సవం రోజుకు సంబంధించిన శుభాకాంక్షలను తెలిపేటప్పుడు ఏమంటారు? సంతోషంగా ఉండండి, సుఖమయంగా ఉండండి, శక్తిశాలిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మరి మీరు ప్రతి సమయం ఏం సేవ చేస్తారు? ఆత్మలకు కొత్త జీవితాన్ని ఇస్తారు. మీ అందరికీ కూడా బాప్‌దాదా కొత్త జీవితాన్ని ఇచ్చారు కదా! మరియు ఈ కొత్త జీవితంలో ఈ శుభాకాంక్షలన్నీ సదా కోసం తప్పకుండా లభిస్తాయి. మీవంటి అదృష్టవంతులు, సంతోషం యొక్క ఖజానాలతో సంపన్నులు, సదా సుఖవంతులు వేరే ఎవరైనా ఉండగలరా! ఈ నవీనత యొక్క విశేషత మీ దేవతా జీవితంలో కూడా ఉండదు. కనుక ప్రతి సమయం స్వతహాగానే బాప్‌దాదా ద్వారా శుభాకాంక్షలు, అభినందనలు మరియు గ్రీటింగ్స్ లభిస్తూనే ఉంటాయి. ప్రపంచం వారు నాట్యం చేస్తారు, పాడుతారు మరియు ఏదైనా తింటారు. మరియు మీరేమి చేస్తారు? ప్రతి క్షణం నాట్యం చేస్తూ ఉంటారు మరియు పాడుతూ ఉంటారు మరియు ప్రతి రోజూ బ్రహ్మా భోజనం తింటూ ఉంటారు. మనుష్యులైతే ప్రత్యేకంగా పార్టీలను ఏర్పాటు చేసుకుంటారు మరియు మీకు సదా సంగఠన యొక్క పార్టీలు జరుగుతూనే ఉంటాయి. పార్టీలలో కలుసుకుంటారు కదా. బ్రాహ్మణులైన మీకు అమృతవేళ నుండి పార్టీ మొదలవుతుంది. మొదట బాప్‌దాదాతో జరుపుకుంటారు, ఒక్కరితోనే అనేక సంబంధాలతో మరియు అనేక స్వరూపాలతో జరుపుకుంటారు. ఆ తర్వాత బ్రాహ్మణులు పరస్పరంలో క్లాసు చేసుకునేటప్పుడు సంగఠనలో మిలనం జరుపుకుంటారు కదా, మరియు మురళీ వింటూ-వింటూ నాట్యం చేస్తారు, పాడుతారు. మరియు ప్రతి సమయం ఉత్సాహభరితమైన జీవితంలో ఎగురుతూ ఉంటారు. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే ఉత్సాహము. ఒకవేళ ఉత్సాహం తగ్గితే బ్రాహ్మణ జీవితాన్ని జీవించే మజా ఉండదు. ఎలాగైతే శరీరంలో కూడా శ్వాస యొక్క గతి సరిగ్గా నడిస్తే, మంచి ఆరోగ్యముగా భావించడం జరుగుతుంది. ఒకవేళ అప్పుడప్పుడు చాలా వేగంగా నడుస్తూ, అప్పుడప్పుడు నెమ్మదిగా అవుతూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించరు కదా. బ్రాహ్మణ జీవితము అనగా ఉత్సాహము, నిరాశ కాదు. సర్వ ఆశలను పూర్తి చేసే తండ్రికి చెందినవారిగా అయినప్పుడు, ఇక నిరాశ ఎక్కడి నుండి వచ్చింది? మీ కర్తవ్యమే నిరాశావాదులను ఆశావాదులుగా చేయడము. ఇదే మీ సేవ కదా! ప్రపంచం యొక్క హద్దు చక్రం అనుసారంగా మీరు కూడా ఈ రోజుకు మహత్వాన్నిస్తారు కానీ వాస్తవానికి బ్రాహ్మణాత్మలైన మీ అందరికీ సంగమయుగమే నవీనత యొక్క యుగము. కొత్త ప్రపంచాన్ని కూడా ఈ సమయంలో తయారుచేస్తారు. ఆత్మలైన మీకు ఈ సమయంలోనే కొత్త ప్రపంచం యొక్క జ్ఞానం ఉంది. అక్కడ కొత్త ప్రపంచంలో కొత్త-పాత యొక్క జ్ఞానం ఉండదు. కొత్త యుగంలో కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు.
అందరూ తపస్యా సంవత్సరంలో తపస్య ద్వారా స్వయంలో అలౌకిక నవీనతను తీసుకువచ్చారా లేక అదే పాత నడవడిక ఉందా? పాత నడవడిక అనగా ఏమిటి? యోగం బాగుంది, అనుభవాలు కూడా బాగా అవుతున్నాయి, ముందుకు కూడా వెళ్తున్నారు, ధారణలో కూడా చాలా మార్పు వచ్చింది, అటెన్షన్ కూడా చాలా బాగుంది, సేవలో కూడా వృద్ధి బాగుంది... కానీ, ‘కానీ’ అనే తోక వస్తుంది. అప్పుడప్పుడు ఇలా జరిగిపోతుంది అని అంటారు. ఈ ‘అప్పుడప్పుడు’ అనే తోకను ఎప్పటికల్లా సమాప్తం చేస్తారు? తపస్యా సంవత్సరంలో ఈ నవీనతనే తీసుకురండి. పురుషార్థంలో లేక సేవలో సఫలత యొక్క పర్సెంటేజ్, సంతుష్టత యొక్క పర్సెంటేజ్ అప్పుడప్పుడు చాలా ఎక్కువగా, అప్పుడప్పుడు తక్కువగా - ఇందులో సదా శ్రేష్ఠమైన పర్సెంటేజ్ యొక్క నవీనతను తీసుకురండి. ఎలాగైతే ఈ రోజుల్లోని డాక్టర్లు ఎక్కువగా ఏం చెక్ చేస్తారు? ఈ రోజుల్లో అన్నింటికన్నా ఎక్కువగా బ్లడ్ ప్రెషర్‌ను చెక్ చేస్తారు. ఒకవేళ బ్లడ్ యొక్క ప్రెషర్ ఒక్కోసారి చాలా ఎక్కువగా, ఒక్కోసారి తక్కువగా అయితే ఏమవుతుంది? అలా బాప్‌దాదా పురుషార్థం యొక్క ప్రెషర్‌ను చూస్తారు, చాలా బాగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు జంప్ చేస్తుంది. ఈ అప్పుడప్పుడు అనే పదాన్ని సమాప్తం చేయండి. ఇప్పుడైతే అందరూ బహుమతిని తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా? ఈ మొత్తం సభలో మేము బహుమతిని తీసుకునేందుకు పాత్రులుగా అయ్యాము అని భావించేవారు ఎవరు ఉన్నారు? అప్పుడప్పుడు అని అనేవారు బహుమతిని తీసుకుంటారా?
బహుమతి తీసుకునే ముందు ఈ విశేషతను చూసుకోండి, ఈ 6 మాసాలలో మూడు రకాల సంతుష్టతలను ప్రాప్తి చేసుకున్నానా? మొదటిది - మీకు మీరు సాక్షీగా అయి చెక్ చేసుకోండి - స్వయం యొక్క చార్టుతో స్వయం సత్యమైన మనసుతో, సత్యమైన హృదయంతో సంతుష్టంగా ఉన్నానా?
రెండవది - ఏ విధి పూర్వకంగానైతే బాప్‌దాదా స్మృతి యొక్క పర్సెంటేజ్‌ను కోరుకుంటున్నారో, ఆ విధి పూర్వకంగా మనసా, వాచా, కర్మలు మరియు సంపర్కంలో సంపూర్ణ చార్టు ఉందా? అనగా తండ్రి కూడా సంతుష్టమవ్వాలి.
మూడవది - బ్రాహ్మణ పరివారము మన శ్రేష్ఠ యోగీ జీవితంతో సంతుష్టంగా ఉన్నారా? కావున మూడు రకాల సంతుష్టతలను అనుభవం చేయడము అనగా ప్రైజ్‌కు యోగ్యులుగా అవ్వడము. విధి పూర్వకంగా ఆజ్ఞాకారిగా అయి చార్టును పెట్టే ఆజ్ఞను పాటించారా? అటువంటి ఆజ్ఞాకారికి కూడా మార్కులు లభిస్తాయి. కానీ ఎవరైతే ఆజ్ఞాకారిగా అయి చార్టు పెట్టడంతో పాటు పురుషార్థం యొక్క విధి మరియు వృద్ధి యొక్క మార్కులను కూడా తీసుకుంటారో, వారికే సంపూర్ణ పాస్ మార్కులు లభిస్తాయి. ఎవరైతే ఈ నియమాన్ని పాలన చేసారో, ఎవరైతే ఎక్యురేట్ పద్ధతితో చార్టు రాసారో, వారు కూడా బాప్‌దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా అభినందనలు తీసుకునేందుకు పాత్రులు. కానీ ఎవరైతే సర్వుల నుండి సంతుష్టత యొక్క అభినందనలు తీసుకునేందుకు పాత్రులుగా ఉన్నారో, వారే బహుమతిని తీసుకునేందుకు యోగ్యులు. యథార్థ తపస్యకు గుర్తు - కర్మ, సంబంధము మరియు సంస్కారము - మూడింటిలోనూ నవీనత యొక్క విశేషత స్వయానికి కూడా అనుభవమవ్వాలి మరియు ఇతరులకు కూడా అనుభవమవ్వాలి. యథార్థమైన చార్టుకు అర్థము - ప్రతి సబ్జెక్టులో ప్రగతి అనుభవమవ్వాలి, పరివర్తన అనుభవమవ్వాలి. పరిస్థితులు అనేవి వ్యక్తుల ద్వారా లేక ప్రకృతి ద్వారా లేక మాయ ద్వారా రావడమనేది ఈ బ్రాహ్మణ జీవితంలో వచ్చేదే ఉంది. కానీ స్వ-స్థితి యొక్క శక్తి పరిస్థితి ప్రభావాన్ని - ఒక మనోరంజన దృశ్యము ఎదురుగా వచ్చింది మరియు వెళ్ళింది అన్నట్లుగా సమాప్తం చేస్తుంది. సంకల్పంలో పరిస్థితి యొక్క అలజడి అనుభవమవ్వకూడదు. స్మృతి యాత్ర సహజంగా కూడా ఉండాలి మరియు శక్తిశాలిగా కూడా ఉండాలి. శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో డబల్ అనుభవాన్ని చేయిస్తుంది. ఒకవైపు స్మృతి అగ్ని వలె అయి భస్మం చేసే పని చేస్తుంది, పరివర్తన చేసే పని చేస్తుంది మరియు రెండవ వైపు సంతోషాన్ని మరియు తేలికదనాన్ని అనుభవం చేయిస్తుంది. ఇటువంటి విధి పూర్వకమైన శక్తిశాలి స్మృతినే యథార్థమైన స్మృతి అని అంటాము. అయినా బాప్‌దాదా పిల్లల ఉత్సాహాన్ని మరియు లగనాన్ని చూసి సంతోషిస్తారు. మెజారిటీకి లక్ష్యము బాగా గుర్తుంది. స్మృతిలో మంచి నంబరు తీసుకున్నారు. స్మృతితో పాటు సమర్థత, ఇందులో నంబరువారుగా ఉన్నారు. స్మృతి మరియు సమర్థత, రెండూ కలిసి ఉండడము - ఇటువంటివారినే నంబర్‌వన్ ప్రైజ్‌కు యోగ్యులు అని అంటాము. స్మృతి సదా ఉండడము మరియు సమర్థత అప్పుడప్పుడు లేక పర్సెంటేజ్లో ఉండడము - ఇటువంటివారిని నంబరువారు యొక్క లిస్టులో ఉన్నారని అంటారు. అర్థమయిందా! ఎక్యురేట్ చార్టు పెట్టేవారి పేర్లతో కూడిన మాల కూడా తయారవుతుంది. ఇప్పుడు కూడా చాలా సమయం కాదు కానీ కొద్ది సమయమైతే ఉంది, ఈ కొద్ది సమయంలో కూడా విధి పూర్వకంగా పురుషార్థాన్ని వృద్ధి చేసుకుని మీ మనసు, బుద్ధి, కర్మ మరియు సంబంధాన్ని సదా అచలంగా-స్థిరంగా చేసుకుంటే ఈ కొద్ది సమయంలోని అచలమైన-స్థిరమైన స్థితి యొక్క పురుషార్థం మున్ముందు చాలా ఉపయోగపడుతుంది మరియు సఫలత యొక్క సంతోషాన్ని స్వయం కూడా అనుభవం చేస్తారు మరియు ఇతరుల ద్వారా కూడా సంతుష్టత యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు, అందుకే సమయం గడిచిపోయింది అని భావించకండి, కానీ ఇప్పటికీ కూడా వర్తమానాన్ని మరియు భవిష్యత్తును శ్రేష్ఠంగా తయారుచేసుకోగలరు.
ఇప్పుడు కూడా ఈ విశేషమైన స్మృతి మాసము, ఎక్స్ట్రా వరదానాలను ప్రాప్తి చేసుకునే మాసము. ఎలాగైతే తపస్యా సంవత్సరం యొక్క అవకాశం లభించిందో, అలాగే స్మృతి మాసము యొక్క విశేషమైన అవకాశముంది. ఈ మాసంలోని 30 రోజులు కూడా ఒకవేళ సహజంగా, స్వతహాగా, శక్తిశాలిగా, విజయీ ఆత్మగా అనుభవం చేస్తే, ఇది కూడా సదా కొరకు న్యాచురల్ సంస్కారంగా చేసుకునే గిఫ్ట్‌ను ప్రాప్తి చేసుకోగలరు. ఏం వచ్చినా కూడా, ఏం జరిగినా కూడా, పరిస్థితి రూపీ అతి పెద్ద పర్వతం వచ్చినా కూడా, సంస్కారాల ఘర్షణ జరిగే మేఘాలు వచ్చినా కూడా, ప్రకృతి కూడా పేపరు తీసుకున్నా కానీ అంగదుని సమానంగా మనసు-బుద్ధి రూపీ పాదాన్ని కదిలించకూడదు, స్థిరంగా ఉండాలి. గతంలో ఒకవేళ ఏదైనా అలజడి జరిగినా కూడా, దానిని సంకల్పంలో కూడా స్మృతిలోకి తీసుకురాకండి. ఫుల్స్టాప్ పెట్టండి. వర్తమానాన్ని తండ్రి సమానంగా శ్రేష్ఠంగా, సహజంగా చేసుకోవాలి మరియు భవిష్యత్తును సదా సఫలత యొక్క అధికారంతో చూడాలి. ఈ విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకోండి. రేపటి నుండి కాదు, ఇప్పటి నుండే చేయండి. స్మృతి మాసం యొక్క కొద్దిపాటి సమయాన్ని బహుకాలపు సంస్కారంగా చేసుకోండి. ఈ విశేషమైన వరదానాన్ని విధి పూర్వకంగా ప్రాప్తి చేసుకోండి. వరదానం అంటే అర్థము నిర్లక్ష్యులుగా అవ్వమని కాదు. నిర్లక్ష్యులుగా అవ్వకండి, కానీ సహజ పురుషార్థులుగా అవ్వండి. అచ్ఛా.
కుమారీల సంగఠన కూర్చుంది. ముందు కూర్చునే అవకాశము ఎందుకు దొరికింది? సదా ముందు ఉండాలి, అందుకే ముందు కూర్చునే అవకాశం లభించింది. అర్థమయిందా! పరిపక్వమైన ఫలం వలె తయారవ్వండి, కచ్చాగా (అపరిపక్వంగా) రాలిపోవద్దు. అందరూ చదువు పూర్తి చేసుకుని సెంటరుకు వెళ్తారా లేక ఇంటికి వెళ్తారా? ఒకవేళ తల్లిదండ్రులు రండి అని అంటే ఏం చేస్తారు? ఒకవేళ స్వయంలో ధైర్యముంటే ఎవ్వరూ ఎవ్వరినీ ఆపలేరు. కొద్ది కొద్దిగా ఆకర్షణ ఉంటే ఆపేవారు ఆపుతారు.
కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడము అనగా ప్రతి సమయాన్ని కొత్తగా తయారుచేసుకోవడము. ప్రతి సమయము స్వయంలో ఆత్మిక నవీనతను తీసుకురావాలి.
నలువైపులా ఉన్న స్నేహీ మరియు సహయోగీ పిల్లలందరూ కూడా ఈ రోజు యొక్క మహత్వాన్ని తెలుసుకుని విశేషంగా హృదయపూర్వకంగా లేక ఉత్తరాల ద్వారా లేక కార్డుల ద్వారా విశేషంగా స్మృతి చేస్తున్నారు మరియు బాప్‌దాదా వద్దకు పోస్ట్ చేయడానికి ముందే చేరుకుంటాయి. రాసేకంటే ముందే చేరుకుంటాయి. సంకల్పం చేసారు మరియు చేరుకున్నాయి, అందుకే చాలామంది పిల్లల యొక్క, సహయోగుల యొక్క కార్డులు తర్వాత చేరుకుంటాయి కానీ బాప్‌దాదా అంతకన్నా ముందే అందరికీ కొత్త యుగంలో కొత్త రోజును జరుపుకునే శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎలాగైతే ఏదైనా విశేషమైన ప్రోగ్రాం ఉంటుంది కదా, అప్పుడు ఈ రోజుల్లోని మనుష్యులు ఏం చేస్తారు? తమ టి.వి. పెట్టుకుని కూర్చుంటారు. అలా ఆత్మిక పిల్లలందరూ తమ బుద్ధి యొక్క దూరదర్శన్ స్విచ్‌ను ఆన్ చేసుకుని కూర్చున్నారు. బాప్‌దాదా నలువైపులా ఉన్న శుభాకాంక్షలకు పాత్రులైన పిల్లలకు ప్రతి క్షణముకు శుభాకాంక్షలనే ఆశీర్వాదాలను బదులుగా ఇస్తున్నారు. ప్రతి సమయం యొక్క స్మృతి మరియు ప్రేమ, ఈ ఆశీర్వాదాలే పిల్లల మనసులో ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతూ ఉంటాయి. కనుక సదా స్వయాన్ని సహజ పురుషార్థులుగా మరియు సదా పురుషార్థులుగా, సదా విధి ద్వారా వృద్ధిని ప్రాప్తి చేసుకునే యోగ్య ఆత్మలుగా చేసుకుని ఎగురుతూ ఉండండి.
ఇటువంటి సదా వర్తమానాన్ని తండ్రి సమానంగా చేసుకునే మరియు భవిష్యత్తును సఫలతా స్వరూపంగా చేసుకునే శ్రేష్ఠ అభినందనలకు పాత్రులైన ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో మిలనము
గ్రూప్ నం. 1 :- భారతదేశపు మహానత ఎవరి కారణంగా ఉంది? మీ కారణంగానే ఉంది. ఎందుకంటే దేశం మహాన్‌గా మారేది మహానాత్మల ద్వారానే. మరి భారతదేశపు సర్వ మహానాత్మలలో మహాన్ ఎవరు? మీరా లేక ఇతరులా? మీరు ఎంతటి మహానాత్మలంటే ఈ కాలచక్ర సమాప్తి సమయంలో కూడా భారతదేశం మహానైనది అని మీ మహానాత్మల కారణం చేతనే గానం చేయబడుతుంది. మరే ఇతర దేశంలోనూ ఇంతటి మహానాత్మల గానము లేదా పూజ జరగదు. ఎంతటి పేరుప్రఖ్యాతులు గల ధర్మాత్ములు అయిపోయినా, రాజకీయ నాయకులు అయిపోయినా లేదా నేటి కాలం లెక్క ప్రకారం సైంటిస్టులు (శాస్త్రవేత్తలు) ప్రసిద్ధి చెందినవారైనా సరే - ఏ దేశంలోనూ ఆ దేశపు ఇంతటి మహానాత్మల మందిరాలు, స్మృతిచిహ్నాలు, పూజలు, గానాలు ఉండవు; అది ఎక్కడా ఉండదు. విజ్ఞానంలో విదేశాలు ఎంతో ముందుకు సాగి ఉండవచ్చు కానీ గాయనంలో మరియు పూజలో లేవు. శాస్త్రవేత్తల లేదా రాజకీయ నాయకుల గాయనమూ జరుగుతుంది, కానీ ఆ గాయనానికి మరియు దేవాత్మల గాయనానికి ఎంత తేడా ఉంది! అలాంటి గాయనం అక్కడ జరగదు. కాబట్టి భారతదేశం యొక్క ఇంతటి మహానతను పెంచే మహానాత్మలము మేము - అనే ఈ నషా ఎంత శ్రేష్ఠమైనదో! ఇక్కడ వీధి-వీధిలో మందిరాలు కనిపిస్తాయి. కాబట్టి ఇంతటి నషాను సదా స్మృతిలో ఉంచుకోండి. ఈరోజు వినిపించాము కదా, ‘అప్పుడప్పుడు’ అనే పదాన్ని కూడా సమాప్తం చేయండి అని. ఒకవేళ అప్పుడప్పుడు చాలా బాగుండి, అప్పుడప్పుడు అలజడి జరిగితే, మీ స్మృతిచిహ్నపు పూజ కూడా అప్పుడప్పుడే జరుగుతుంది. కొన్ని మందిరాలలో ప్రతి సమయమూ పూజ జరుగుతుంది, ప్రతి రోజూ జరుగుతుంది; కొన్నిచోట్ల ఏదైనా తిథి-తేదీ వచ్చినప్పుడు జరుగుతుంది. అంటే అప్పుడప్పుడు అయిపోయింది కదా. కానీ ఎవరికి సదా జరుగుతుంది, ఎవరికి అప్పుడప్పుడు, ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈ సమయపు పురుషార్థంలో ఎవరైతే ‘అప్పుడప్పుడు’ అనేదానిని తీసుకువస్తారో వారి పూజ కూడా అప్పుడప్పుడే జరుగుతుంది. ఇక్కడ ఎంత విధిపూర్వకంగా తమ శ్రేష్ఠ జీవితాన్ని తయారుచేసుకుంటారో అంతే విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. మరి ‘నేను ఎవరిని?’ అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. వేరొకరు ఎవరైనా మీతో మీ పురుషార్థం వేగంగా అనిపించట్లేదు అంటే అంగీకరిస్తారా? లేదా వారిని ఆ మాట అనకుండా ఆపేందుకు ప్రయత్నిస్తారా. కానీ మిమ్మల్ని మీరు ఏమై ఉన్నారో, ఎలా ఉన్నారో అలాగే తెలుసుకోగలరు. అందువలన సదా మీ విధిపూర్వక పురుషార్థంలో నిమగ్నమై ఉండండి. పురుషార్థం అయితే ఎలాగూ ఉంది కదా అని అలా అనకండి. పురుషార్థపు ప్రత్యక్ష స్వరూపం అనుభవమవ్వాలి, కనిపించాలి. అంతటి మహాన్ మీరు! భారతదేశపు మహిమను వింటూ ఏమి ఆలోచిస్తారు? ఇది ఎవరి మహిమ జరుగుతోంది? ఇలా మహాన్‌గా అనేకసార్లు అయ్యారు కనుకే గాయనం జరుగుతుంది. ఇప్పుడు దానిని రిపీట్ చేస్తున్నారు. అయ్యారు మరియు అవ్వాల్సిందే. కేవలం రిపీట్ చేయడమే. మరి సహజమే కదా. సంబంధంలోకి వచ్చినా, తమ కొరకు కర్మలు చేసినా రెండింటిలోనూ సహజంగా ఉండాలి. భారీతనము ఉండకూడదు. కష్టమైన పని ఏదైతే ఉంటుందో అది భారంగా ఉంటుంది. భారం కారణంగానే కష్టమవుతుంది, ఎక్కడైతే సహజం ఉంటుందో అక్కడ తేలికదనం ఉంటుంది. మరి డబల్ లైటా లేక సింగిల్ లైటా? వ్యవహారమైనా, పరమార్థమైనా, వ్యవహారంలోనూ సహజము; పరమార్థము అనగా తమ పురుషార్థము, అందులోనూ సహజము. లౌకికంలోనూ సహజము, అలౌకికంలోనూ సహజము, భారం ఉండకూడదు. ఇలా ఉన్నారా లేక ప్రవృత్తి యొక్క కొద్దిపాటి భారం ఉందా? నా ప్రవృత్తి అని భావిస్తే భారం ఉంటుంది. నాది-నాది అనగా భారము మరియు నీది-నీది అనగా తేలిక. సంగమయుగం అసలే సంతోషాల యుగం. కాబట్టి ఎవరైనా సంతోషంలో ఉన్నప్పుడు మనస్సు తేలికగా ఉంటుంది. ఎవరైనా అల్పకాలిక సంతోషంలో ఉన్నా ఆ సమయంలో తేలికదనం ఉంటుంది. ఒకవేళ భారీతనము ఉంటే సంతోషంలో ఉండలేరు. కృత్రిమ (ఆర్టిఫిషియల్) సంతోషం వేరే విషయం. మరి సదా సంతోషంలో ఉండేవారే కదా. మనలాంటి మహాన్‌గా మరెవరూ కాలేదు, కారని ఈ స్మృతి ఉంచుకోండి! వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము!
గ్రూప్ నం. 2 :- తమను తాము సదా సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మలము అని అనుభవం చేసుకుంటున్నారా? ఎన్ని ఖజానాలు లభించాయి? ఖజానాలను చక్కగా సంభాళించడం వచ్చా లేక అప్పుడప్పుడు లోపలి నుండి జారిపోతుంటాయా? ఎందుకంటే ఆత్మలైన మీరు కూడా బాబా ద్వారా నాలెడ్జ్‌ఫుల్‌గా మారడం వలన చాలా నిపుణులు, కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. అది కూడా శక్తిశాలిగా మారి ఎదుర్కొంటుంది. కాబట్టి సర్వ ఖజానాలూ సదా నిండుగా ఉండాలి మరియు రెండవది ఏ సమయంలో ఏ ఖజానా అవసరమో ఆ సమయంలో ఆ ఖజానాను కార్యంలో ఉపయోగించగలగాలి. ఖజానా అయితే ఉంది కానీ సమయానికి కార్యంలో ఉపయోగించలేకపోతే ఉండి కూడా ఏమి చేస్తారు? సమయానికి ప్రతి ఖజానాను పనిలో ఉపయోగించేవారి ఖజానా సదా మరింతగా పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి ఖజానా పెరుగుతూ పోతుందా లేక చాలా ఖజానాలు ఉన్నాయి అని కేవలం ఆలోచించే సంతోషపడుతున్నారా అని చెక్ చేసుకోండి. అనుకోలేదు కానీ జరిగిపోయింది అని ఆ తర్వాత ఎన్నడూ అనకూడదు. జ్ఞాని విశేషత - మొదట ఆలోచించి, ఆ తర్వాత కర్మ చేయడము. జ్ఞానీ-యోగి ఆత్మకు సమయానుకూలంగా టచ్ అవుతుంది మరియు ఆత్మ దానిని క్యాచ్ చేసి ప్రాక్టికల్లోకి తీసుకువస్తుంది. ఒక్క సెకను ఆలస్యంగా ఆలోచించినా జ్ఞానీ ఆత్మ అని అనరు.
గ్రూప్ నం. 3 :- సదా బాబా బ్లెస్సింగ్స్ స్వతహాగానే లభిస్తూ ఉండాలి - దానికి విధి ఏమిటి? బ్లెస్సింగ్స్ పొందడానికి ప్రతి సమయమూ, ప్రతి కర్మలోనూ బ్యాలెన్స్ ఉంచుకోండి. ఏ సమయంలోనైతే కర్మ మరియు యోగం రెండింటి బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు ఏమి అనుభవమవుతుంది? బ్లెస్సింగ్స్ లభిస్తాయి కదా. అలాగే స్మృతి మరియు సేవల రెండింటి బ్యాలెన్స్ ఉంటే సేవలో సఫలత అనే బ్లెస్సింగ్స్ లభిస్తాయి. ఒకవేళ స్మృతి సాధారణంగా ఉండి, సేవ చాలా ఎక్కువగా చేస్తే బ్లెస్సింగ్స్ తక్కువ కావడం వలన సఫలత తక్కువగా లభిస్తుంది. కాబట్టి ప్రతి సమయం తమ కర్మ-యోగాల బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోండి. కర్మయే సర్వస్వం అని ప్రపంచంలోనివారు భావిస్తారు, కానీ బాప్‌దాదా కర్మ వేరు కాదు, కర్మ మరియు యోగం రెండూ కలిసి ఉన్నాయని చెప్తారు. అలాంటి కర్మయోగి ఎలాంటి కర్మ అయినా సరే అందులో సహజ సఫలతను పొందుతారు. స్థూల కర్మ చేసినా, అలౌకికమైనది చేసినా సరే. ఎందుకంటే యోగం అనగానే మనస్సు-బుద్ధుల ఏకాగ్రత. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ కార్య సఫలత నిశ్చయమై ఉంటుంది. మనస్సు మరియు బుద్ధి ఏకాగ్రంగా లేకపోతే, అనగా కర్మలో యోగం లేకపోతే కర్మ చేయడంలో శ్రమ కూడా ఎక్కువే, సమయమూ ఎక్కువే మరియు సఫలత చాలా తక్కువ. కర్మయోగి ఆత్మకు సర్వ రకాల సహాయమూ స్వతహాగానే బాబా ద్వారా లభిస్తుంది. ఈ పనిలో చాలా బిజీగా ఉన్నాము అందుకే యోగం మరచిపోయాము అని ఎన్నడూ ఆలోచించకండి. అలాంటి టైమ్‌లోనే యోగం అత్యంత ఆవశ్యకమైనది. జబ్బు చాలా పెద్దదిగా ఉంది అందుకే మందు తీసుకోలేకపోతున్నాను అని రోగి అంటే ఏమంటారు? జబ్బు ఉన్నప్పుడే కదా మందు కావాల్సింది. కాబట్టి కర్మలో అంత బిజీగా ఉన్నప్పుడు, కష్టమైన పని ఎదురైన ఆ సమయంలో యోగమే కష్టమైన కర్మను సహజం చేస్తుంది. కాబట్టి ఈ పని పూర్తి చేశాక అప్పుడు యోగం చేస్తాము అని అనుకోకూడదు. కర్మతో పాటుగా యోగాన్ని సదా తోడుంచుకోండి. రోజురోజుకూ సమస్యలు, పరిస్థితులు మరింత టైట్ కానున్నాయి; అలాంటి సమయంలో కర్మ మరియు యోగాల బ్యాలెన్స్ లేకపోతే బుద్ధి జడ్జిమెంట్‌ను సరిగ్గా చేయలేదు. అందువలన యోగము మరియు కర్మల బ్యాలెన్స్ ద్వారా తమ నిర్ణయ శక్తిని పెంచుకోండి. అర్థమైందా. ఇది తెలియనే తెలియదు - ఇలా కూడా జరుగుతుందా అని ఆ తర్వాత అనకూడదు. ఇది ముందే తెలిసి ఉంటే నేను యోగం ఎక్కువగా చేసుకునేవాడిని అని అనకండి. ఇప్పటి నుండే ఈ అభ్యాసం చేయండి. ఏ ఆత్మకైతే బ్యాలెన్స్ కారణంగా బాప్‌దాదా బ్లెస్సింగ్స్ లభిస్తాయో ఆ ఆత్మ గుర్తు ఏమిటి? ఎవరైతే సదా బాబా బ్లెస్సింగ్స్‌ను అనుభవం చేసుకుంటూ ఉంటారో వారి సంకల్పంలో కూడా ఎన్నడూ - ఇదేమి జరిగింది, ఎందుకు జరిగింది అనే ఆశ్చర్యపు గుర్తు ఉండదు. ఏమి జరుగుతుంది అనే ప్రశ్న కూడా తలెత్తదు. ఏది జరుగుతుందో అందులో కళ్యాణమే దాగి ఉంది అనే నిశ్చయంలో సదా పక్కాగా ఉంటారు. ఎందుకంటే కళ్యాణకారి యుగము, కళ్యాణకారి తండ్రి మరియు మీ అందరి పనీ విశ్వ కళ్యాణమే, అంతటా కళ్యాణమే ఇమిడి ఉంది. బయటకు ఏ కర్మ ఎంత అలజడితో కూడినదిగా కనిపించినా ఆ అలజడిలో కూడా ఏదో గుప్త కళ్యాణం ఇమిడి ఉంటుంది మరియు బాబా శ్రీమతం వైపుకు, బాబా సంబంధం వైపుకు అటెన్షన్ ఆకర్షింపజేసే కళ్యాణం ఉంటుంది. బ్రాహ్మణ జీవితంలో ఏది జరగజాలదు? అకళ్యాణము జరగజాలదు. ఇంతటి నిశ్చయం ఉందా లేక కాస్త అటూఇటూ రాగానే కదిలిపోతారా? సమస్యలు వస్తే మిక్కీ మౌస్ ఆట అయితే ఆడరు కదా? మిక్కీ మౌస్ ఆటను చూడండి కానీ స్వయంగా అలా చేయకండి.
కాబట్టి నూతన సంవత్సరపు ఈ వరదానాన్నే గుర్తుంచుకోవాలి - సదా బ్యాలెన్స్‌తో ప్రతి ఘడియా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఎగురుతూ ఉండాలి మరియు ఎగరిస్తూ ఉండాలి. ఎగిరే కళ కలవారు తప్ప కిందకు పైకి వచ్చేవారు కారు. సైడ్ సీన్స్ చూడటానికి కిందకు రాకూడదు. కిందకు వస్తే చిక్కుకుపోతారు. అందువలన సదా ఎగురుతూ ఉండండి. అచ్ఛా.
నూతన సంవత్సరం ప్రారంభం కాగానే రాత్రి 12 గంటలు దాటిన వెంటనే బాప్‌దాదా సర్వ పిల్లలకు అభినందనలు తెలిపారు:
నూతన సంవత్సరం అనగా సదా అభినందనలు తీసుకునే మరియు ఇచ్చే సంవత్సరం. మాస్టర్ దాతగా అయి ప్రతి ఆత్మకూ ఏదో ఒక శక్తి, గుణము, శుభ భావన, శుభ కామనలను ఇచ్చే దాతగా మారండి. తీసుకునే సంకల్పం చేయకండి. తీసుకుని ఆ తర్వాత ఇస్తే దానిని ఆశీర్వాదాలు అనరు, బిజినెస్ అంటారు. మీరైతే దాత పిల్లలైన మాస్టర్ దాతలు, ఎవరైనా ఇవ్వనీ, ఇవ్వకపోనీ మీరైతే ఇవ్వాల్సిందే. మీకు నచ్చని వస్తువును ఎవరైనా ఇచ్చినా అప్పుడు ఏమి చేస్తారు? దానిని స్వీకరించకండి అనగా మీ వద్ద ఉంచుకోకండి. కానీ వారికి తప్పక ఇవ్వండి. వారు గులకరాళ్ళు ఇచ్చారు కదా మరి నేనేమి ఇవ్వాలి అని అలా అనకూడదు. గులకరాళ్ళను వదిలేయండి కానీ మీరు రత్నాలను ఇవ్వండి. ఎందుకంటే మీరు రత్నాకరుడైన తండ్రి పిల్లలు. కాబట్టి ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు ఆశీర్వాదాలు తీసుకోవడం - ఈ విశేష లక్ష్యాన్నే ఈ నూతన సంవత్సరంలో ప్రతి సమయమూ జీవితంలోకి తీసుకురావాలి. పాట పాడారు కదా - పాత సంస్కారాలకు వీడ్కోలు పలికాము అని, మరి మీరందరూ వీడ్కోలు పలికేశారా? వాటికి చక్కగా టాటా చెప్పేశారా లేక మళ్ళీ వచ్చేస్తాయా? మంచిది - వీడ్కోలు యొక్క శుభాకాంక్షలు. ఏ విషయం వచ్చినా ఈ ప్రతిజ్ఞను గుర్తుచేసుకోండి. నేను బై బై చెప్పేశాను కదా, ఇక మళ్ళీ చేతులు ఎలా కలపగలను? దానికి దూరం నుండే శుభ భావన, శుభ కామనా దృష్టిని ఇచ్చేయండి.
గ్రూప్ నం. 4 :- అందరూ ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్ వచ్చే వారే కదా? నంబర్‌వన్‌గా వెళ్ళే ఆత్మల విశేషత ఏమిటి? వ్యర్థాన్ని చూస్తూ కూడా చూడకండి, వ్యర్థ విషయాలను వింటూ కూడా వినకండి అనే బాబా విశేష శ్రీమతాన్ని పాటించే విధి కలవారు ఫాస్ట్ మరియు ఫస్ట్ సిద్ధిని పొందుతారు. మరి ఇలాంటి ప్రాక్టికల్ ధారణ అనుభవమవుతుందా లేక అప్పుడప్పుడు కొద్దికొద్దిగా వినేస్తుంటారా? అప్పుడప్పుడు చూసేస్తుంటారా? తీవ్ర పురుషార్థి ఎదుట సదా గమ్యమే ఉంటుంది. ఆ ఆత్మ అటూఇటూ ఎన్నడూ చూడదు. సదా గమ్యం వైపే చూస్తుంది. ఎవరిని ఫాలో చేయాలి? బ్రహ్మా బాబాను. ఎందుకంటే బ్రహ్మా బాబా సాకార కర్మయోగికి ప్రతీక (సింబల్). ఎవరెంత బిజీగా ఉన్నా బ్రహ్మా బాబా కంటే ఎక్కువ బిజీగా ఇంకెవరూ ఉండలేరు. ఎన్ని బాధ్యతలు ఉన్నా బ్రహ్మా బాబాకున్నన్ని బాధ్యతలు ఎవరిపైనా లేవు. అందువల్ల ఎవరెంత బిజీగా ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా కానీ బ్రహ్మా బాబా అంతగా ఉండవు. మరి బ్రహ్మా బాబా కర్మయోగిగా ఎలా మారారు? బ్రహ్మా బాబా తనను కరన్‌హార్ (చేసేవానిగా) భావించి కర్మ చేశారు తప్ప కరావన్‌హార్‌గా (చేయించే యజమానిగా) భావించలేదు. బాబాను కరావన్‌హార్‌గా భావించడం వల్ల బాధ్యత బాబాది అవుతుంది మరియు స్వయంగా ఎన్ని కార్యాలు చేసినా, ఎలాంటి కార్యం చేసినా తేలికగా ఉంటారు. మరి మీరందరూ తమ బుద్ధి తీగను బాప్‌దాదాకు ఇచ్చేశారా లేక అప్పుడప్పుడు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారా? నడిపించేవారు నడిపిస్తున్నారు, చేయించేవారు చేయిస్తున్నారు మరియు మీరు నిమిత్తంగా చేసే కర్మ ఏమిటి? డ్యాన్స్ చేస్తున్నారు. ఎంత పెద్ద కార్యమైనా నాట్యం చేయించేవారు ఆడిస్తున్నారు మరియు మనం నర్తిస్తున్నాము అని అర్థం చేసుకుంటే అలసిపోరు. కన్ఫ్యూజ్ కారు. ఎవర్హ్యాపీగా ఉంటారు. అందుకే సదా నృత్యం చేయండి, పాడుకోండి అని బాప్‌దాదా సదా చెప్తారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో ఎలాంటి భారమూ లేదు. బ్రాహ్మణ జీవితం అత్యంత శ్రేష్ఠమైనది. లౌకిక జాబ్ చేస్తున్నా డైరెక్షన్ ప్రకారమే చేస్తున్నారు, భారం ఏమీ లేదు. ఎందుకంటే బాబా డైరెక్షన్‌తో పాటుగా ఎక్స్ట్రా సహాయాన్ని కూడా ఇస్తారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
