‘‘ప్రతి కర్మలో ఆనెస్టీని (నిజాయితీని) ప్రయోగించడమే తపస్య’’
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న సర్వ తపస్వీ కుమారులు మరియు తపస్వీ కుమారీలలో తపస్య యొక్క విశేషమైన గుర్తులను చూస్తున్నారు. తపస్వీ ఆత్మల విశేషతలను ఇంతకుముందు కూడా వినిపించాము. ఈ రోజు మరికొన్ని విశేషతలను వినిపిస్తున్నాము. తపస్వీ ఆత్మ అనగా సదా ఆనెస్ట్ (నిజాయితీ కల) ఆత్మ. ఆనెస్టీనే తపస్వీ యొక్క విశేషత. ఆనెస్ట్ ఆత్మ అనగా ప్రతి కర్మలో శ్రీమతముపై నడవడంలో ఆనెస్ట్‌గా ఉంటారు. ఆనెస్ట్ అనగా నమ్మకస్తులు మరియు నిజాయితీపరులు. శ్రీమతాన్ని అనుసరించడంలో ఆనెస్ట్ అనగా నమ్మకస్తులు. ఆనెస్ట్ ఆత్మ స్వతహాగానే ప్రతి అడుగు శ్రీమతము యొక్క సూచనల అనుసారంగా వేస్తుంది. వారి ప్రతి అడుగు ఆటోమేటిక్ శ్రీమతము యొక్క సూచనల అనుసారంగానే వేయబడుతుంది. ఏ విధంగానైతే సైన్స్ యొక్క శక్తితో చాలా వస్తువులు సూచనలతో ఆటోమేటిక్‌గా నడుస్తాయో, నడిపించాల్సిన అవసరం ఉండదో, లైట్ ద్వారా కావచ్చు, వైబ్రేషన్ల ద్వారా కావచ్చు, స్విచ్ ఆన్ చేసారంటే నడుస్తూ ఉంటాయి. కానీ సైన్స్ యొక్క శక్తి వినాశీ అయిన కారణంగా అల్పకాలము కోసం నడుస్తుంది. అవినాశీ తండ్రి యొక్క సైలెన్స్ శక్తి ద్వారా ఈ బ్రాహ్మణ జీవితంలో సదా మరియు స్వతహాగానే సహజంగా నడుస్తూ ఉంటారు. బ్రాహ్మణ జన్మ లభిస్తూనే బాప్‌దాదా దివ్య బుద్ధిలో శ్రీమతాన్ని నింపారు. ఆనెస్ట్ ఆత్మ ఆ శ్రీమతము యొక్క సూచనలతో సహజంగా సులభంగా నడుస్తూ ఉంటుంది. కనుక ఆనెస్టీ యొక్క మొదటి గుర్తు - ప్రతి క్షణము, ప్రతి అడుగులో శ్రీమతముపై ఏక్యురేట్గా నడవడము. నడవడమైతే అందరూ నడుస్తారు కానీ నడవడములో కూడా అనేక రకాల భిన్నత వస్తుంది. కొంతమంది సహజంగా మరియు తీవ్ర గతితో నడుస్తారు ఎందుకంటే ఆ ఆత్మకు శ్రీమతము స్పష్టంగా సదా స్మృతిలో ఉన్న కారణంగా సమర్థంగా ఉంటుంది. ఇది నంబర్‌వన్ ఆనెస్టీ. నంబర్‌వన్ ఆత్మకు, ఇది శ్రీమతమా కాదా, ఇది రైటా రాంగా అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వారికి శ్రీమతం స్పష్టంగా తెలుసు. ఇతర ఆత్మలకు శ్రీమతం యొక్క స్పష్టత లేని కారణంగా చాలా సార్లు ఆలోచించాల్సి వస్తుంది, అందుకే తీవ్ర గతి నుండి మధ్యమ గతి అవుతుంది. దానితో పాటు కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది అలసిపోతారు. నడవడం అందరూ నడుస్తారు కానీ ఆలోచించేవారు మరియు అలసిపోయేవారు రెండవ నంబరువారిగా అవుతారు. ఎందుకు అలసిపోతారు? నడుస్తూ-నడుస్తూ శ్రీమతము యొక్క సూచనలలో మన్మతాన్ని, పరమతాన్ని మిక్స్ చేస్తారు, అందుకే స్పష్టముగా మరియు నేరుగా ఉన్న దారి నుండి భ్రమించి వంకర దారిలోకి వెళ్ళిపోతారు. అయినా రిజల్ట్‌లో మళ్ళీ తిరిగి రావాల్సే ఉంటుంది ఎందుకంటే గమ్యానికి దారి ఒక్కటే, అది స్పష్టంగా, నేరుగా మరియు సహజంగా ఉంది. వారు నేరుగా ఉన్న దారిని వంకరగా చేసుకుంటారు. కావున మీరు ఆలోచించండి, వంకరగా నడిచేవారు ఎంతవరకు నడుస్తారు, ఏ వేగంతో నడుస్తారు? మరియు ఫలితం ఏమవుతుంది? అలసిపోవడము మరియు నిరాశ చెంది వెనుకకు తిరిగి రావడము, అందుకే రెండవ నంబరువారిగా అవుతారు. అనేక క్షణాలు పోగొట్టుకున్నారు, అనేక శ్వాసలు పోగొట్టుకున్నారు, సర్వ శక్తులు పోగొట్టుకున్నారు, అందుకే రెండవ నంబరువారిగా అయ్యారు. మేమైతే నడుస్తున్నాము అని కేవలం ఇందులోనే సంతోషపడకండి. కానీ మీ నడవడికను మరియు వేగాన్ని, రెండింటినీ చెక్ చేసుకోండి. కావున ఆనెస్టీ అని దేనినంటామో అర్థమయిందా?
ఆనెస్ట్ ఆత్మకు కల మరొక గుర్తు - వారు ఎప్పుడూ ఏ ఖజానాను వృధా చేయరు. కేవలం స్థూల ధనము లేక స్థూల ఖజానాల విషయం కాదు కానీ ఇంకా ఎన్నో ఖజానాలు మీకు లభించాయి. ఆనెస్ట్ ఆత్మ సంగమయుగ సమయం యొక్క ఖజానాను ఒక్క క్షణం కూడా వృధా చేయరు ఎందుకంటే సంగమయుగం యొక్క ఒక్క క్షణం, సంవత్సరం కన్నా కూడా ఎక్కువ. ఎలాగైతే నిరుపేద ఆత్మ యొక్క ఎనిమిది అణాల స్థూల ధనము ఎనిమిది వందలతో సమానము ఎందుకంటే ఎనిమిది అణాలలో ఉన్న సత్యమైన హృదయం యొక్క భావన ఎనిమిది వందల కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే సంగమయుగం యొక్క సమయములో ఒక్క క్షణం ఎంతో గొప్పది ఎందుకంటే ఒక్క క్షణంలో పదమాలు అంత జమ అవుతుంది. క్షణాన్ని పోగొట్టుకోవడము అనగా పదమాలు అంత సంపాదన యొక్క సమయాన్ని పోగొట్టుకోవడము. అలాగే సంకల్పాల ఖజానాను, జ్ఞాన ధనం యొక్క ఖజానాను, సర్వ శక్తులను, సర్వ గుణాల ఖజానాను వృధా చేయరు. ఒకవేళ సర్వ శక్తులను, సర్వ గుణాలను మరియు జ్ఞానాన్ని స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యంలో వినియోగించకపోతే, దీనిని కూడా వృధా అని అంటాము. దాత అయితే ఇచ్చారు కానీ తీసుకునేవారు ధారణ చేయలేదంటే వృధా అయినట్లే కదా! ఎవరైతే ఆనెస్ట్‌గా ఉంటారో, వారు ధనాన్ని ప్రాప్తి చేసుకున్న తర్వాత కేవలం అలా పక్కనపెట్టి ఉంచుకోరు. ఆనెస్ట్‌గా ఉండేవారి గుర్తు ఏమిటంటే ఖజానాలను పెంచుకోవడము. పెంచుకునేందుకు సాధనము కార్యంలో వినియోగించడము. ఒకవేళ జ్ఞాన ధనాన్ని కూడా సమయమనుసారంగా సర్వ ఆత్మల పట్ల లేక స్వ-ఉన్నతి పట్ల ఉపయోగించకపోతే ఆ ఖజానా ఎప్పటికీ పెరగదు. ఎవరైతే ఏ కార్యంలోనైనా లాభాన్ని చూపిస్తారో, ప్రగతిని సాధించి చూపిస్తారో, వారినే ఆనెస్ట్ మేనేజర్ లేక డైరెక్టర్ అని అంటారు. మరి అదే విధంగా మీరు కూడా సంకల్పాల ఖజానాను, గుణాలను, శక్తులను కార్యంలో వినియోగించి లాభాన్ని పొందేవారా లేక వృధా చేసేవారా? ఆనెస్ట్‌గా ఉండేవారి గుర్తు - వృధా చేయకుండా ఉండడము, లాభాన్ని చేకూర్చడము. మీ తనువు, మనసు మరియు స్థూల ధనము - ఈ మూడూ తండ్రి ఇచ్చినటువంటి ఖజానాలు. మీరందరూ తనువు, మనసు, ధనము లేక వస్తువులను, ఏవేవి అయితే ఉండేవో, వాటిని అర్పించారు. అంతా నీదే అని సంకల్పం చేసారు, అంతేకానీ కొంత ధనం నాది, కొంత తండ్రిది, కొంత ధనం పక్కన పెట్టుకోవడము, జేబు ఖర్చుకు ఉంచుకోవడము, అవసరమయ్యే సమయం కోసం కొద్ది-కొద్దిగా పక్కన పెట్టుకోవడము అన్నట్లు ఉండకూడదు. అవసరమయ్యే సమయం కోసం పక్కన పెట్టుకోవడము, ఇది తెలివా! ఎంతగా నాది అన్నది ఉంటుందో, ఎక్కడైతే నాది-నాది అన్నది ఉంటుందో, అక్కడ చాలా విషయాలు తారుమారు అవుతాయి ఎందుకంటే వాటిని దాచిపెట్టాల్సి వస్తుంది కదా! భక్తి మార్గం వారు కూడా ఏమని భావిస్తారంటే - ఈ నాది-నాది అనేది మోసం వంటిది, అందుకే అంతా నీదే అని అన్నప్పుడు తనువు, మనసు, ధనము, వస్తువులు ఏవైనా కావచ్చు, కేవలం ధనమే కాదు, వస్తువులు కూడా ధనమే. వస్తువు దేనితో తయారవుతుంది? ధనముతోనే తయారవుతుంది కదా, కనుక ఏ వస్తువుతో గాని, ఎటువంటి స్థూల ధనంతో గాని, మనసులోని ఏ సంకల్పంతో గాని మరియు తనువుతో వ్యర్థ కర్మలు చేయడము లేక తనువుతో వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడము, ఇది కూడా వ్యర్థం కింద లెక్కించబడుతుంది. కనుక ఆనెస్ట్‌గా ఉండేవారు తనువును కూడా వ్యర్థం వైపు వినియోగించరు. సంకల్పాలను కూడా వ్యర్థం వైపు వినియోగించరు. ఎక్కడ ఉంటున్నా కూడా, ప్రవృత్తిలోని వారు కావచ్చు, సెంటరులో ఉండేవారు కావచ్చు, మధుబన్ వారు కావచ్చు, అందరి తనువు, మనసు, ధనము తండ్రికి చెందినవి. లేదా ప్రవృత్తిలోని వారు, మేమైతే సమర్పణ అవ్వలేదు కనుక నాదే అని భావిస్తున్నారా! అలా కాదు. ఇది తండ్రి ద్వారా అప్పగించబడిన సంపద. కనుక ఆనెస్ట్ అనగా అప్పగించబడిన సంపదలో ఎప్పుడూ మోసం చేయకూడదు. వృధా చేయడము అనగా అప్పగించబడిన సంపదలో మోసం చేయడము. ఆనెస్ట్‌గా ఉండేవారి గుర్తు ఏమిటంటే వారు ఎప్పుడూ అప్పగించబడిన సంపదలో మోసం చేయరు (అమానతులో ఖయానత్ చేయరు). చిన్న వస్తువును కూడా వృధా చేయరు. చాలా సార్లు తమ బుద్ధి యొక్క నిర్లక్ష్యం కారణంగా లేక శరీరం ద్వారా చేసే కార్యములో నిర్లక్ష్యం కారణంగా చిన్న-చిన్న వస్తువులు వృధా కూడా అవుతాయి. తర్వాత ఎలా ఆలోచిస్తారంటే, నేను ఇది కావాలని చేయలేదు కానీ జరిగిపోయింది, ఇది నిర్లక్ష్యము. బుద్ధి యొక్క నిర్లక్ష్యం కావచ్చు, శరీరంతో శ్రమించడంలో నిర్లక్ష్యం కావచ్చు, రెండు రకాల నిర్లక్ష్యము వృధా చేస్తాయి. కనుక వృధా చేయకూడదు. ఒకటికి పది రెట్లు పెంచాలి, అంతేకానీ వృధా చేయకూడదు. దీనినే బాప్‌దాదా సదా ఒక స్లోగన్ రూపంలో చెప్తూ ఉంటారు - కమ్ ఖర్చా బాలానషీన్ (తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం). ఇది పెంచుకోవడము మరియు అది పోగొట్టుకోవడము. ఆనెస్ట్ అనగా తనువు, మనసు మరియు ధనాన్ని సదా సఫలం చేసేవారు. ఇది ఆనెస్ట్ ఆత్మ యొక్క గుర్తు. కనుక తపస్వీ అనగా ఆనెస్టీకి చెందిన ఈ విశేషతలన్నీ ప్రతి కర్మలో ప్రయోగంలోకి రావాలి. అంతేకానీ, అన్నీ ఇమిడి ఉన్నాయి, అన్నీ తెలుసు అని కాదు. అలా కాదు, తపస్యకు, యోగముకు అర్థమే ప్రయోగంలోకి తీసుకురావడము. ఒకవేళ ఈ విశేషతలను ప్రయోగంలోకి తీసుకురాకపోతే ప్రయోగీ కూడా కాదు, యోగీ కూడా కాదు. ఈ ఖజానాలన్నింటినీ బాప్‌దాదా ప్రయోగం చేసేందుకు ఇచ్చారు. ఎంతగా ప్రయోగిగా అవుతారో, ప్రయోగికి గుర్తు ప్రగతి. ఒకవేళ ప్రగతి జరగలేదంటే ప్రయోగీ కాదు. చాలామంది ఆత్మలు తమ లోపల ఈ విధంగా భావిస్తారు కూడా, ముందుకూ వెళ్ళడము లేదు, వెనుకకూ వెళ్ళడము లేదు, ఎలా ఉన్నవారము అలాగే ఉన్నాము. మరికొంతమంది ఇలా కూడా అంటారు, ప్రారంభంలో చాలా బాగా ఉండేవారము, చాలా నషా ఉండేది, ఇప్పుడు నషా తగ్గిపోయింది. కనుక ప్రగతి జరిగిందా లేక ఏం జరిగింది? ఇది ఎగిరే కళ అయినట్లా లేక ఆగిపోయే కళ అయినట్లా, అందుకే ప్రయోగిగా అవ్వండి. ఆనెస్టీకి అర్థమే ప్రగతిని సాధించే ప్రయోగీలు. ఇటువంటి ప్రయోగిగా అయ్యారా లేక ఖజానాలు లోలోపలే ఉండనీ అని లోపల ఇముడ్చుకుని ఉంచుకుంటున్నారా? ఇటువంటి ఆనెస్టీ కలవారిగా ఉన్నారా?
ఎవరైతే ఆనెస్ట్‌గా ఉంటారో, వారి పట్ల తండ్రికి, పరివారానికి స్వతహాగానే హృదయపూర్వకమైన ప్రేమ మరియు విశ్వాసము ఉంటుంది. విశ్వాసం కారణంగా వారికి పూర్తి అధికారాన్ని ఇస్తారు. ఆనెస్ట్ ఆత్మకు స్వతహాగానే తండ్రి మరియు పరివారము యొక్క ప్రేమ అనుభవమవుతుంది. పెద్దవారికి కావచ్చు, చిన్నవారికి కావచ్చు, సమానమైన వారికి కావచ్చు, వారు విశ్వాసపాత్రులుగా అనుభవమవుతారు. ఈ విధంగా ప్రేమకు పాత్రులుగా మరియు విశ్వాసానికి పాత్రులుగా ఎంతవరకు అయ్యారు? ఇది కూడా చెక్ చేసుకోండి. ఫలానావారి కారణంగా నా పట్ల విశ్వాసం లేదు, మరి నేను విశ్వాసపాత్రునిగా ఎలా అవ్వాలి అని అలా అంటూ నడిపించేయకండి. స్వయాన్ని పాత్రునిగా తయారుచేసుకోండి. చాలాసార్లు ఏమంటారంటే, నేనైతే మంచిగానే ఉన్నాను కానీ నా పట్ల విశ్వాసం లేదు. ఇక తర్వాత దానికి ఎన్నో కారణాలు వినిపిస్తారు. వారు చాలా కారణాలు చెప్తారు కూడా మరియు చాలా విషయాలు కారణాలుగా అవుతాయి కూడా. కానీ ఆనెస్టీ అనగా మనసు పరంగా, బుద్ధి పరంగా కూడా ఆనెస్టీ కావాలి. లేదంటే బుద్ధితో చాలా కిందా-మీదా చేస్తారు. కనుక మనసు పరంగా కూడా ఆనెస్టీ, బుద్ధి పరంగా కూడా ఆనెస్టీ. ఒకవేళ అన్ని రకాల ఆనెస్టీ ఉన్నట్లయితే, ఆనెస్టీ అనేది విశ్వాసం లేనివారిని కూడా ఈ రోజు కాకపోతే రేపు విశ్వాసంలోకి తప్పకుండా తీసుకువస్తుంది. ఎలాగైతే సత్యత యొక్క నావ మునగదు కానీ ఊగిసలాడుతుంది అన్న సామెత ఉందో అలా విశ్వాసము యొక్క నావ సత్యత. ఆనెస్టీ ఉన్నట్లయితే ఊగిసలాడుతుంది కానీ అవిశ్వాసపాత్రునిగా అవ్వరు అనగా మునగదు, అందుకే సత్యత యొక్క ధైర్యంతో విశ్వాసపాత్రులుగా అవ్వగలరు. సత్యతను నిరూపించడం జరగదు అని ఇంతకుముందు కూడా వినిపించాము కదా. సత్యత స్వయం దానంతట అదే నిరూపించబడి ఉంది. నిరూపించకండి కానీ సిద్ధి స్వరూపులుగా అవ్వండి. కనుక సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడు తపస్య యొక్క అడుగులను సహజంగా మరియు తీవ్ర వేగంతో ముందుకు వేయండి. తపస్యా సంవత్సరంలో ఏం చేయాలో అర్థమయిందా? ఇప్పటికీ కొంత సమయమైతే మిగిలి ఉంది. ఈ అన్ని విధులను స్వయంలో ధారణ చేసి సిద్ధి స్వరూపులుగా అవ్వండి. అచ్ఛా!
సర్వ ఆనెస్ట్ ఆత్మలకు, సదా సర్వ ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళే ఆత్మలకు, సదా తనువు-మనసు-ధనములను యథార్థ విధి ద్వారా కార్యంలో ఉపయోగించే ఆత్మలకు, సదా స్వయాన్ని విశ్వాసానికి మరియు ప్రేమకు పాత్రులుగా చేసుకునే ఆత్మలకు, సదా వేస్ట్‌ను బెస్ట్లోకి పరివర్తన చేసే శ్రేష్ఠ ఆత్మలకు, దేశ-విదేశాలలో దూరంగా కూర్చుని ఉన్నా కూడా సమీపంగా, సమ్ముఖంగా కూర్చుని ఉన్న ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా మిలనము
గ్రూప్ నంబర్ 1 :- తమను తాము సదా మాస్టర్ సర్వశక్తిమాన్ శ్రేష్ఠ ఆత్మలము అని అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే సర్వ శక్తులు తండ్రి యొక్క ఖజానా మరియు ఖజానా పిల్లల అధికారము, జన్మ సిద్ధ అధికారము (బర్త్ రైట్). మరి జన్మ సిద్ధ అధికారమును కార్యంలో ఉపయోగించడం - ఇది పిల్లల కర్తవ్యము. అయినా ఖజానా ఉండేదే దేని కొరకు? మీ వద్ద స్థూల ఖజానా ఉన్నా అది దేని కొరకు? ఖర్చు పెట్టడానికా లేక బ్యాంకులో దాచుకోవడానికా? బ్యాంకులో కూడా ఇలాంటి సమయానికి కార్యంలో ఉపయోగించుకోవడానికే కదా దాచుకుంటారు. పనిలో ఉపయోగించడమే లక్ష్యం కదా. మరి సర్వ శక్తులు కూడా జన్మ సిద్ధ అధికారమే కదా. ఏ వస్తువుపై అధికారం ఉంటుందో దానిని స్నేహ సంబంధంతో, అధికారంతో నడిపిస్తారు. ఒకటి ఆర్డర్ చేసే అధికారం మరియు రెండవది స్నేహపూర్వకమైనది. అధికారంలో ఉన్నదానిని ఎలా నడిపించినా అది అలాగే నడుస్తుంది. సర్వ శక్తులు అధికారంలో ఉండాలి. నాలుగు ఉన్నాయి రెండు లేవు, ఏడు ఉన్నాయి ఒకటి లేదు - అని ఇలా ఉండకూడదు. ఒక్క శక్తి తక్కువగా ఉన్నా సమయానికి మోసం జరిగిపోతుంది. సర్వ శక్తులు అధికారంలో ఉన్నప్పుడే విజయిగా అయి నంబర్‌వన్‌లోకి రాగలరు. కాబట్టి సర్వ శక్తులు ఎంతవరకు అధికారంలో నడుస్తున్నాయి అని చెక్ చేసుకోండి. ప్రతి శక్తీ సమయానికి ఉపయోగపడుతుందా లేక అర సెకను తర్వాత పనికి వస్తుందా? సెకను తర్వాత జరిగినా సెకనులో ఫెయిల్ అయినట్లే కదా. పరీక్షలో ఫైనల్ మార్కులలో రెండు మార్కులు తగ్గినా ఫెయిల్ అనే అంటారు కదా. మరి ఫెయిల్ అయినవారు ఫుల్ కాలేరు కదా? కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ అధికారంతో శక్తిని యూజ్ చేసుకోండి, ప్రతి గుణాన్ని యూజ్ చేసుకోండి. ఏ పరిస్థితిలో సహనశీలత కావాలో అక్కడ సహనశీలత గుణాన్ని యూజ్ చేసుకోండి. కాస్త సహనశీలత తగ్గిపోయింది అని ఇలా ఉండకూడదు. లేదు. శత్రువు దాడి చేసినప్పుడు ఒక్క సెకను వెనకబడినా ఇక విజయం ఎవరిదవుతుంది? అందుకనే ఈ రెండింటినీ చెక్ చేసుకోండి. సర్వ శక్తులు అయితే ఉన్నాయి కానీ సమయానికి యూజ్ చేయలేకపోతున్నాము అని ఇలా ఉండకూడదు. ఎవరైనా మంచి వస్తువును ఇచ్చినా దానిని కార్యంలో ఉపయోగించడం రాకపోతే వారి కొరకు ఆ మంచి వస్తువు వల్ల ఉపయోగం ఏముంటుంది? పనికిరానిదే అవుతుంది కదా. కాబట్టి సర్వ శక్తులను యూజ్ చేసే బహు కాలం యొక్క అభ్యాసం కావాలి. చాలా కాలం నుండి ఏ బిడ్డ అయినా మీ ఆజ్ఞ ప్రకారం నడవకపోతే సమయానికి ఏమి చేస్తాడు? మోసమే చేస్తాడు కదా. మరి ఈ సర్వ శక్తులు కూడా మీ రచనే. రచనను బహు కాలం నుండి కార్యంలో ఉపయోగించే అభ్యాసం చేయండి. ప్రతి పరిస్థితి ద్వారానూ అనుభవజ్ఞులుగా అయ్యారు కదా. అనుభవజ్ఞులు మళ్ళీ ఎన్నడూ మోసపోరు. కాబట్టి ప్రతి సమయమూ స్మృతితో తీవ్ర గతితో ముందుకు సాగుతూ వెళ్ళండి. అందరూ తపస్సు రేసులో చక్కగా సాగుతున్నారు కదా. అందరూ ప్రైజ్ తీసుకుంటారు కదా. సదా చాలా సంతోషంగా సహజంగా ఎగురుతూ సాగండి. కష్టమైనది కాదు, కష్టంగా మార్చుకోకండి. బలహీనతే కష్టంగా మారుస్తుంది. సదా కష్టాన్ని సహజం చేసుకుంటూ ఎగురుతూ ఉండండి. అచ్ఛా.
గ్రూప్ నం. 2 :- అందరూ తమను తాము స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ ఆత్మలము అని అనుభవం చేసుకుంటున్నారా? కేవలం స్వయం దర్శనం చేసుకున్నా సృష్టి చక్రం స్వతహాగానే స్పష్టమవుతుంది. ఆత్మను తెలుసుకుంటే ఆత్మ యొక్క చక్రాన్ని సహజంగానే తెలుసుకుంటారు. నిజానికి 5000 సంవత్సరాల విస్తారము ఉంది. కానీ మీ అందరి బుద్ధిలోకి ఆ విస్తారపు సారం వచ్చేసింది. సారం ఏమిటి? నిన్న మరియు నేడు - నిన్న ఎలా ఉండేవారు, నేడు ఎలా ఉన్నారు మరియు రేపు ఏమి కానున్నారు. ఇందులో పూర్తి చక్రం వచ్చేసింది కదా. నిన్నటికీ నేటికీ మధ్య తేడా ఎంత పెద్దదో చూడండి! నిన్న ఎక్కడ ఉన్నారు, నేడు ఎక్కడ ఉన్నారు - రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మరి విస్తారపు సారం వచ్చినప్పుడు ఆ సారాన్ని స్మృతిలో ఉంచుకోవడం సహజం కదా. నిన్నటికీ నేటికీ తేడా చూసుకుంటే ఎంత సంతోషం కలుగుతుంది! అనంతమైన సంతోషం ఉందా? నేడు కాస్త సంతోషం తగ్గింది, కొద్దిగా ఉదాసీనంగా అయిపోయాము అని ఇలా ఉండకూడదు. ఉదాసీనంగా ఎవరు అవుతారు? మాయకు దాసులయ్యేవారే. ఏం చేస్తాం, ఎలా చేయాలి అనే ఈ ప్రశ్నలు రావడం అంటేనే ఉదాసీనంగా మారడము. ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా - ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు అంటే దీనిని బట్టి చక్రం యొక్క పూర్తి జ్ఞానం లేదని రుజువవుతుంది. డ్రామా రహస్యాన్ని తెలుసుకుంటే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తనే లేవు. స్వయంగానూ కళ్యాణకారి మరియు సమయం కూడా కళ్యాణకారి అయినప్పుడు ఇక ‘ఇదేమిటి...’ అనే ప్రశ్న తలెత్తగలదా? కాబట్టి డ్రామా జ్ఞానం మరియు డ్రామాలోనూ సమయం జ్ఞానం లోపించినప్పుడే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. మరి ఎప్పుడైనా ఇది నాదేనా ఈ లెక్కాచారము... నాదే కఠినమైన లెక్కాచారము, వేరొకరిది కాదు... అని అనిపిస్తుందా? ఎంత కఠినమైనదైనా కానీ యోగాగ్ని ఎదుట ఎంతటి కఠినమైన లెక్కాచారమైనా ఏపాటిది! ఇనుము ఎంత కఠినమైనదైనా తీవ్రమైన అగ్ని ఎదుట మైనంలా కరిగిపోతుంది. ఎంత కఠినమైన పరీక్ష అయినా, లెక్కాచారమైనా, కఠిన బంధనమైనా సరే యోగాగ్ని ఎదుట ఏ విషయమూ కఠినమైనది కాదు, అంతా సహజమే. చాలామంది ఆత్మలు - నా శరీరానికే ఇలాంటి లెక్కాచారం ఉంది, ఇంకెవరికీ లేదు... నాకే ఇలాంటి కుటుంబం దొరికింది... నాకే ఇలాంటి పని దొరికింది... ఇలాంటి సహచరులు దొరికారు... అని అంటూ ఉంటారు. కానీ ఏది జరుగుతుందో అది చాలా మంచిది. ఈ కఠినమైన లెక్కాచారమే శక్తిశాలిగా తయారుచేస్తుంది. సహనశక్తిని పెంచుతుంది. తీవ్రమైన అగ్ని ఎదుట ఏ వస్తువైనా పరివర్తన చెందకుండా ఉండటం అనేది అసంభవం. కాబట్టి కఠినమైన లెక్కాచారం అని ఎన్నడూ అనకూడదు. బలహీనతే సహజాన్ని కష్టంగా మార్చేస్తుంది. ఈశ్వరీయ శక్తికి చాలా పెద్ద మహత్వం ఉంది. కాబట్టి సదా స్వయాన్ని చూడండి, స్వదర్శన చక్రధారిగా అవ్వండి. ఇతర విషయాలలోకి వెళ్ళడం, ఇతరులను చూడటం అనగా కింద పడటం; మరియు తండ్రిని చూడటం, తండ్రి మాట వినడం అనగా ఎగరడం. స్వదర్శన చక్రధారులా లేక పరదర్శన చక్రధారులా? ఈ ప్రకృతి కూడా పరమే, స్వయం కాదు. ప్రకృతి వైపు చూసినా పరదర్శనధారులు అయినట్లే. బాడీ కాన్షియస్‌నెస్‌లో ఉండటం అనగా పరదర్శనం మరియు ఆత్మాభిమానిగా ఉండటం అనగా స్వదర్శనం. పరదర్శన చక్రంలో అర్థ కల్పం తిరుగుతూనే ఉన్నారు కదా. సంగమయుగం స్వదర్శనం చేసుకునే యుగం. సదా స్వయం వైపు చూసేవారు సహజంగా ముందుకు సాగుతారు. అచ్ఛా.
బాప్‌దాదా పిల్లలందరికీ క్రిస్మస్ రోజుకు అడ్వాన్స్‌లో అభినందనలు తెలిపారు
ప్రపంచంలోనివారు క్రిస్మస్ రోజును జరుపుకుంటారు, దానిని పెద్ద రోజు (బడా దిన్) అంటారు. అది హద్దు కాలచక్రపు లెక్క ప్రకారం, కానీ మీ అందరిది పెద్ద యుగమైన సంగమయుగం నడుస్తుంది. ఆయుష్షు పరంగా చూస్తే అతి చిన్న యుగం, కానీ ప్రాప్తుల పరంగా చూస్తే అత్యంత పెద్ద యుగం సంగమయుగం. కాబట్టి సంగమయుగం అనగా అత్యంత పెద్ద యుగం యొక్క అభినందనలు. వారికైతే ఒక్క రోజు కొరకు క్రిస్మస్ ఫాదర్ వచ్చి గిఫ్ట్ ఇస్తారు, కానీ మీకు సదాకాలం కొరకు గాడ్ ఫాదర్ గోల్డెన్ వరల్డ్ గిఫ్ట్‌ను ఇస్తున్నారు. అది ఒక్క రోజు కొరకు కాదు, స్వల్ప కాలపు గిఫ్ట్ కాదు, అనేక జన్మజన్మల గిఫ్ట్. మరి ఎంత పెద్ద రోజు అయిపోయింది! లేదా ఎంత పెద్ద యుగం అయిపోయింది! అత్యంత పెద్ద యుగంలోని ప్రతి రోజూ పెద్ద రోజే. మరియు ఎవరు జరుపుకుంటారు? అత్యంత పెద్ద తండ్రి యొక్క అత్యంత పెద్ద పిల్లలు, పెద్ద హృదయంతో, పెద్ద యుగం యొక్క పెద్ద రోజును సదా జరుపుకుంటూనే ఉన్నారు. సంవత్సరం లెక్క ప్రకారం ఒక్క రోజు ఉత్సవం జరుపుకునే రోజు. కల్పం లెక్క ప్రకారం మీ అందరికీ పెద్ద యుగాన్ని జరుపుకునే భాగ్యం లభించింది. ఇది అన్నింటికంటే పెద్ద ఉత్సవం. ప్రతి రోజూ ఉత్సవపు రోజే. మరి పెద్ద యుగం అయింది కదా! క్రిస్మస్ రోజున వారు నాట్యం చేస్తారు-పాడుతారు-తింటారు. కానీ వారి నాట్యం, వారి గానం, వారి వేడుక మరియు మీరందరూ జరుపుకునే విధానం - ఎంత రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది! అందువల్ల పెద్ద యుగంలో పెద్ద రోజు యొక్క అభినందనలు మరియు సంవత్సరం లెక్కన క్రిస్మస్ రోజు యొక్క అభినందనలు. డబల్ విదేశీయులందరూ తమ తమ క్రిస్మస్ లేదా నూతన సంవత్సరపు అభినందనలను తండ్రి ద్వారా స్వీకరించండి. పిల్లలు గ్రీటింగ్ కార్డులను పంపుతారు మరియు బాప్‌దాదా గ్రీటింగ్ కార్డులకు రిటర్న్‌గా శ్రేష్ఠ భాగ్యపు రికార్డును నమోదు చేస్తున్నారు. అందువలన కార్డులు పంపినవారందరికీ పదమా రెట్ల రిటర్న్ అభినందనలు. అందరూ తమ తమ పేర్లతో ప్రియస్మృతులను స్వీకరించండి. భారతదేశం వారు మరియు విదేశాల వారు ఇద్దరికీ అభినందనలు. మంచిది.
దాదీజీతో - తండ్రి యొక్క సృష్టిలో కూడా మీరు ఉన్నారు మరియు దృష్టిలో కూడా మీరు ఉన్నారు. మీ సఖి అయిన జనక్కు ప్రియస్మృతులను పంపించండి. శరీరము మరియు సేవ, రెండింటినీ సంభాళించుకునే బ్యాలెన్స్ పెట్టుకోవాలని వారికి చెప్పండి. అటెన్షన్ పెట్టండి ఎందుకంటే మున్ముందు కూడా సమయం నాజూకైనది వస్తుంది. శరీరాలు నాజూకుగా అవుతూ ఉంటాయి మరియు సేవ అధికంగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు శరీరంతో చాలా పని చేయాలి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
