‘‘హోలీని జరుపుకోవడము అంటే సంపూర్ణ పవిత్రులుగా అయ్యి సంస్కార మిలనమును జరుపుకోవడము’’
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ హోలియెస్ట్ (అత్యంత పవిత్రమైన) మరియు హైయెస్ట్ (అత్యంత ఉన్నతమైన) పిల్లలను చూస్తున్నారు. విశ్వంలో అందరికంటే హైయెస్ట్, ఉన్నతోన్నతమైన, శ్రేష్ఠమైన ఆత్మలు పిల్లలైన మీరు తప్ప మరెవరైనా ఉన్నారా? ఎందుకంటే మీరందరూ ఉన్నతోన్నతుడైన బాబా పిల్లలు. మొత్తం కల్పమంతా తిరిగి చూస్తే అందరికంటే ఉన్నతమైన పదవి కలవారు మరెవరైనా కనిపిస్తారా? రాజ్యాధికారి స్వరూపంలో కూడా మీకంటే ఉన్నతమైన రాజ్యాధికారిగా మరెవరైనా తయారయ్యారా? అలాగే, పూజ్య మరియు గాయనము విషయంలో చూడండి, ఆత్మలైన మీకు ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుందో! అంతకంటే ఎక్కువగా మరెవరికైనా జరుగుతుందా? డ్రామాలోని అద్భుతమైన రహస్యం ఎంత శ్రేష్ఠమైనదంటే - మీరు స్వయం చైతన్య స్వరూపంలో ఉన్నారు, ఈ సమయంలో మీ పూజ్య స్వరూపాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకున్నారు కూడా మరియు చూస్తున్నారు కూడా. ఒక వైపు చైతన్య ఆత్మలైన మీరు ఉన్నారు, మరొక వైపు మీ జడచిత్రాలు పూజ్య రూపంలో ఉన్నాయి. మీ పూజ్య స్వరూపాన్ని చూస్తున్నారు కదా? మీరు ఇప్పుడు జడ రూపంలో కూడా ఉన్నారు మరియు చైతన్య రూపంలో కూడా ఉన్నారు. కనుక ఇది అద్భుతమైన ఆట కదా! మరియు రాజ్యము లెక్కలో కూడా, మొత్తం కల్పం నిర్విఘ్నమైన, అఖండమైన, స్థిరమైన రాజ్యము ఆత్మలైన మీ ఒక్కరిదే నడుస్తుంది. రాజులుగానైతే చాలామందే అవుతారు కానీ విశ్వ రాజులు మరియు విశ్వ రాజుల రాయల్ కుటుంబానికి చెందినవారైన మీరు అందరికంటే శ్రేష్ఠమైనవారు. కనుక రాజ్యములో కూడా హైయెస్ట్, పూజ్య రూపంలో కూడా హైయెస్ట్. అంతేకాక, ఇప్పుడు సంగమములో పరమాత్మ వారసత్వానికి అధికారులుగా, పరమాత్మ మిలనానికి అధికారులుగా, పరమాత్మ ప్రేమకు అధికారులుగా, పరమాత్మ పరివారానికి చెందిన ఆత్మలుగా మరెవరైనా అవుతారా? మీరే అలా అయ్యారు కదా? అలా అయ్యారా లేక అవుతూ ఉన్నారా? అలా అయ్యారు కూడా, అంతేకాక ఇప్పుడైతే వారసత్వాన్ని తీసుకుని సంపన్నంగా అయ్యి బాబాతోపాటు మీ ఇంటికి కూడా వెళ్ళబోతున్నారు. సంగమయుగ సుఖము, సంగమయుగ ప్రాప్తులు, సంగమయుగ సమయము చాలా మంచిగా అనిపిస్తాయి కదా! చాలా ప్రియంగా అనిపిస్తాయి. రాజ్యము చేసే సమయము కంటే కూడా ఈ సంగమ సమయము ప్రియంగా అనిపిస్తుంది కదా? ప్రియంగా అనిపిస్తుందా లేక త్వరగా వెళ్ళాలనుకుంటున్నారా? మరి అటువంటప్పుడు బాబా, వినాశనం ఎప్పుడు అవుతుంది అని ఎందుకు అడుగుతారు? ఆలోచిస్తుంటారు కదా - వినాశనం ఎప్పుడు అవుతుందో, ఏమవుతుందో, మేము ఎక్కడ ఉంటామో? బాప్‌దాదా అంటారు - ఎక్కడ ఉన్నా సరే స్మృతిలో ఉంటారు, బాబాతో పాటు ఉంటారు. సాకారములోనైనా లేక ఆకారములోనైనా తోడుగా ఉన్నారంటే ఏమీ అవ్వదు. సాకారములో కథను వినిపించారు కదా. పిల్లి పిల్లలు ఇటుకల బట్టీలో ఉన్నా కానీ సురక్షితంగా ఉన్నాయి కదా! లేక కాలిపోయాయా? అన్నీ సురక్షితంగా ఉన్నాయి. అలాగే పరమాత్మ పిల్లలైన మీరెవరైతే వారితో పాటు ఉంటారో, వారు సురక్షితంగా ఉంటారు. ఒకవేళ బుద్ధి ఇంకెక్కడైనా ఉంటే ఎంతో కొంత సెగ తగులుతుంది, ఏదో ఒక ప్రభావం పడుతుంది. బాబాతోపాటు కంబైండ్ గా ఉంటే, ఒక్క క్షణం కూడా ఒంటరిగా లేకుండా ఉంటే సురక్షితంగా ఉంటారు. అప్పుడప్పుడు కార్య-వ్యవహారాలలో లేక సేవలలో ఒంటరివారిగా అనుభవం చేస్తున్నారా? ఏం చెయ్యను, ఒంటరిగా ఉన్నాను, పనేమో చాలా ఉంది అని అనుకుంటారా! అలా అయితే అలసిపోతారు కూడా. మరి బాబాను ఎందుకని సహచరునిగా చేసుకోరు! రెండు భుజాలు కలవారిని సహచరులుగా చేసుకుంటారు, వేయి భుజాలు కలవారిని ఎందుకు సహచరునిగా చేసుకోరు. ఎవరు ఎక్కువ సహయోగాన్ని ఇస్తారు? వేయి భుజాలు కలవారా లేక రెండు భుజాలు కలవారా?
సంగమయుగంలో బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు ఒంటరిగా ఉండజాలరు. ఏం జరుగుతుందంటే - సేవలలో, కర్మయోగంలో చాలా బిజీ అయిపోతారు కదా, అప్పుడు తోడుగా ఉన్నవారిని కూడా మర్చిపోతారు, ఇక అలసిపోతారు. అప్పుడు - అలసిపోయాము, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటారు! బాప్‌దాదా మీకు సదా తోడును ఇవ్వటానికి వచ్చారు కావున అలసిపోకండి, పరంధామాన్ని వదిలి ఎందుకు వచ్చారు? నిద్ర పోతున్నప్పుడు, మేల్కున్నప్పుడు, కర్మలు చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు తోడును ఇవ్వడానికే కదా బాబా వచ్చారు. బ్రహ్మాబాబా కూడా మీ అందరికీ సహయోగాన్ని ఇవ్వడానికే అవ్యక్తమయ్యారు. వ్యక్త రూపంలో కంటే అవ్యక్త రూపంలో సహయోగాన్ని ఇచ్చే వేగం చాలా తీవ్రముగా ఉంటుంది, అందుకే బ్రహ్మాబాబా కూడా తమ వతనాన్ని మార్చుకున్నారు. కనుక శివబాబా మరియు బ్రహ్మాబాబా, ఇరువురూ ప్రతి సమయమూ మీ అందరికీ సహయోగాన్ని ఇవ్వడానికి సదా హాజరై ఉన్నారు. మీరు ‘బాబా’ అని అనుకోగానే సహయోగాన్ని అనుభవం చేస్తారు. ఒకవేళ సేవ, సేవ, సేవ అని అదే గుర్తుంటే, బాబాను పక్కన కూర్చుని చూడమని వేరు చేస్తే, మరి బాబా కూడా సాక్షిగా అయ్యి చూస్తారు. వీరు ఎంతవరకు ఒంటరిగా చేస్తారో చూద్దాము, ఎంతైనా రావలసిందైతే ఇక్కడికే కదా అని అనుకుంటారు. అందుకే తోడును వదలకండి. మీ అధికారము మరియు ప్రేమ అనే సూక్ష్మ బంధముతో బంధించి ఉంచుకోండి. ఢీలాగా వదిలేస్తారు. స్నేహాన్ని ఢీలా చేసేస్తారు, అధికారాన్ని స్మృతిలో నుండి కాస్త పక్కన పెట్టేస్తారు. అలా చెయ్యకండి. సర్వశక్తిమంతుడు తోడును ఆఫర్ చేస్తున్నప్పుడు, మరి అటువంటి ఆఫర్ మొత్తము కల్పములో మరెప్పుడైనా దొరుకుతుందా? దొరకదు కదా? మరి బాప్‌దాదా కూడా సాక్షిగా అయ్యి చూస్తారు - సరే, ఎంతవరకు ఒంటరిగా చేస్తారో చూద్దాము!
సంగమయుగ సుఖాలను మరియు సంబరాలను ఇమర్జ్ చేసుకోండి. బుద్ధి బిజీగా ఉంటుంది కదా, బిజీగా ఉన్న కారణంగా స్మృతి మర్జ్ అయిపోతుంది. మీరు ఆలోచించండి, మొత్తం రోజంతటిలో ఎవరినైనా - బాబా స్మృతి ఉంటుందా లేక బాబా స్మృతిని మర్చిపోతున్నారా అని అడిగితే ఏమంటారు? మర్చిపోవటం లేదు అని అంటారు. స్మృతి ఉంటుంది అన్నది కరెక్టే, కానీ అది ఇమర్జ్ రూపంలో ఉంటుందా లేక మర్జ్ అయి ఉంటుందా? స్థితి ఎలా ఉంటుంది? ఇమర్జ్ రూపం యొక్క స్థితికి మరియు మర్జ్ రూపం యొక్క స్థితికి తేడా ఏమిటి? స్మృతిని ఇమర్జ్ రూపంలో ఎందుకు ఉంచుకోరు? ఇమర్జ్ రూపములోని నషా, శక్తి, సహయోగము, సఫలత చాలా గొప్పవి. స్మృతినైతే మర్చిపోలేరు ఎందుకంటే ఇది ఒక్క జన్మ యొక్క సంబంధము కాదు కదా, శివబాబా సత్యయుగములో తోడుగా లేకపోయినా కానీ బంధం అయితే ఇదే ఉంటుంది కదా! అందుకే వారిని మర్చిపోలేరు, అది కరెక్టే. అయితే, ఒకవేళ ఏదైనా విఘ్నానికి వశమైతే మర్చిపోతారు కూడా, కానీ మామూలుగా న్యాచురల్ రూపంలో ఉన్నప్పుడైతే మర్చిపోరు కానీ స్మృతి మర్జ్ అయ్యి ఉంటుంది, అందుకే బాప్‌దాదా అంటున్నారు - పదే-పదే చెక్ చేసుకోండి, తోడు యొక్క అనుభవము మర్జ్ రూపంలో ఉందా లేక ఇమర్జ్ రూపంలో ఉందా? ప్రేమ అయితే తప్పకుండా ఉంది. ప్రేమ తెగిపోగలదా? తెగిపోలేదు కదా? మరి ప్రేమ అనేది తెగిపోలేనప్పుడు ఆ ప్రేమ యొక్క లాభాన్ని అయితే పొందండి, లాభాన్ని పొందే పద్ధతిని నేర్చుకోండి.
బాప్‌దాదా చూస్తారు - ప్రేమయే బాబావారిగా చేసింది. ప్రేమయే మధుబన్ నివాసిగా చేస్తుంది. మీ-మీ స్థానాలలో ఎలా ఉన్నా, ఎంత శ్రమ చేసినా కానీ, మధుబన్కు అయితే చేరుకుంటారు. బాప్‌దాదాకు తెలుసు మరియు చూస్తుంటారు కూడా - చాలామంది పిల్లలకు కలియుగ పరిస్థితులు ఉన్న కారణంగా టికెట్ తీసుకోవటం కూడా కష్టమవుతుంటుంది కానీ ప్రేమ అనేది వారిని ఎలాగైనా చేరుస్తుంది, అంతే కదా? ఆ ప్రేమ వలన చేరుకుంటారు, కానీ పరిస్థితులైతే రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉంటాయి. సత్యమైన హృదయంపై సాహెబ్ ఎలాగూ తప్పకుండా సంతోషిస్తారు, కానీ స్థూల సహయోగము కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా లభిస్తుంది. డబల్ విదేశీయులనైనా, భారతవాసులనైనా, అందరినీ బాబా యొక్క ఈ ప్రేమ పరిస్థితులనే గోడను దాటించేస్తుంది. అంతే కదా? మీ మీ సెంటర్లలో కూడా చూడండి - కొంతమంది పిల్లలు ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు, వచ్చే సంవత్సరం రాగలమో లేదో అని అనుకుంటారు, అయినా కానీ ఎలాగైనా చేరుకుంటారు. ఇదే ప్రేమకు నిదర్శనం. అచ్ఛా.
ఈరోజు హోలీని జరుపుకున్నారా? జరుపుకున్నారా హోలీని? బాప్‌దాదా అయితే హోలీని జరుపుకునే హోలీహంసలను చూస్తున్నారు. పిల్లలందరికీ ఉన్న ఒకే టైటిల్ హోలీయెస్ట్ (అత్యంత పవిత్రమైనవారు). ద్వాపరము నుండి తీసుకుంటే ఏ ధర్మాత్మలు గానీ లేక మహాత్ములు గానీ సర్వులనూ హోలీయెస్ట్గా తయారుచెయ్యలేదు. స్వయం పవిత్రులుగా అవుతారు కానీ తమ అనుచరులను, సహచరులను హోలీయెస్ట్గా, పవిత్రులుగా తయారుచెయ్యరు కానీ ఇక్కడ పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి ముఖ్య ఆధారము. మీ చదువు కూడా ఏమిటి? మీ స్లోగన్ కూడా ‘‘పవిత్ర భవ-యోగీ భవ’’. ఈ స్లోగన్ ఉంది కదా? పవిత్రతయే మహానత. పవిత్రతయే యోగీ జీవితానికి ఆధారము. అప్పుడప్పుడు పిల్లలకు ఇలా అనుభవమవుతుంది - నడుస్తూ-నడుస్తూ ఉండగా ఒకవేళ మనసులోనైనా కూడా అపవిత్రత అనగా వ్యర్థము లేక నెగెటివ్, పరచింతనతో కూడిన సంకల్పాలు నడుస్తుంటే యోగాన్ని ఎంత శక్తిశాలిగా చెయ్యాలనుకున్నా గానీ చెయ్యలేరు, ఎందుకంటే సంకల్పాలలో కొద్దిగానైనా అంశమాత్రమైనా ఎటువంటి అపవిత్రత ఉన్నా సరే, ఎక్కడైతే అపవిత్రత యొక్క అంశము ఉంటుందో, అక్కడ పవిత్రమైన బాబా యొక్క స్మృతి ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అలా ఉండదు. ఏ విధంగానైతే రాత్రి మరియు పగలు కలిసి ఉండవు కదా. అందుకే బాప్‌దాదా వర్తమాన సమయములో పవిత్రత విషయములో పదే-పదే అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు. కొంతకాలం ముందు బాప్‌దాదా కేవలం కర్మలలోని అపవిత్రత గురించే సూచనను ఇచ్చేవారు, కానీ ఇప్పుడు సమయము సంపూర్ణతకు సమీపంగా వస్తూ ఉంది, అందుకే మనసులో కూడా అపవిత్రత యొక్క అంశమనేది మోసం చేసేస్తుంది. కనుక మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలు అన్నింటిలోనూ పవిత్రత చాలా అవసరము. మనసాను తేలికగా వదిలేయకండి ఎందుకంటే మనసా బయటకు కనిపించదు కానీ మనసా చాలా మోసం చేస్తుంది. బ్రాహ్మణ జీవితంలో ఆంతరిక వారసత్వమైన సదా సుఖ స్వరూపము, శాంతి స్వరూపము, మనస్సు యొక్క సంతుష్టత, వీటిని అనుభవం చేసుకోవడానికి మనసా పవిత్రత కావాలి. బాహ్య సాధనాల ద్వారా లేక సేవ ద్వారా మిమ్మల్ని మీరు సంతోషపరచుకోవటమంటే - ఇది కూడా మిమ్మల్ని మీరు మోసగించుకోవటమే.
బాప్‌దాదా చూస్తుంటారు - అప్పుడప్పుడు పిల్లలు వీటి ఆధారంగా తమను తాము మంచివారిగా, సంతోషం కలవారిగా భావించి స్వయాన్ని మోసగించుకుంటారు, అలా మోసగించుకుంటున్నారు కూడా. మోసగించుకుంటారు, అలా మోసగించుకుంటున్నారు కూడా. ఇది కూడా ఒక గుహ్య రహస్యం. ఏమవుతుందంటే, బాబా దాత, మీరు దాత పిల్లలు, కనుక సేవ యుక్తియుక్తంగా లేకపోయినా కూడా, వేరే ఏదైనా మిక్స్ అయినా కూడా, కొంత స్మృతి ఆధారంగా, మరికొంత బాహ్య సాధనాలు లేక సంతోషం ఆధారంగా ఉన్నా కానీ, మనను ఆధారంపై కాకుండా బుద్ధి ఆధారంపై సేవ చేసినా, వారికి కూడా సేవ యొక్క ప్రత్యక్ష ఫలమైతే లభిస్తుంది, ఎందుకంటే బాబా దాత, కావున వాళ్ళు - ఓహో, మాకైతే ఫలం లభించేసింది, మేము చేసిన సేవ మంచిది అని పిల్లలు ఆ మాత్రానికే సంతోషపడిపోతారు, కానీ మనసులోని ఆ సంతుష్టత సదాకాలము ఉండదు, అంతేకాక ఆత్మ యోగయుక్తమైన శక్తిశాలి స్మృతిని అనుభవము చెయ్యలేకపోతుంది, ఆ అనుభవము నుండి వంచితులైపోతారు. ఏమీ లభించదు అని కాదు, ఏదో ఒకటి అయితే లభిస్తుంది, కానీ జమ అవ్వదు. సంపాదించుకున్నారు, తిన్నారు మరియు సమాప్తమైపోయింది అన్నట్లు ఉంటుంది, అందుకే ఈ అటెన్షన్‌ను కూడా పెట్టండి. సేవను చాలా మంచిగా చేస్తున్నారు, ఫలము కూడా మంచిగా లభించింది, కావున తిన్నారు మరియు సమాప్తమైపోయింది, జమ ఏమైంది? మంచి సేవ చేసారు, మంచి రిజల్టు వచ్చింది, కానీ అక్కడ సేవకు ఫలము లభించింది, అంతేకానీ జమ ఏమీ అవ్వదు. అందుకే జమ చేసుకునేందుకు విధి - మనసా-వాచా-కర్మణా పవిత్రత. పవిత్రతయే పునాది. సేవలో కూడా పునాది పవిత్రత. స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండాలి. మరే ఇతర భావాలు అందులో కలవకూడదు. భావములో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత. హోలీ అంటేనే అర్థము - పవిత్రత. అపవిత్రతను కాల్చేయటము. అందుకే ముందు కాలుస్తారు, ఆ తరువాత జరుపుకుంటారు, ఆ తరువాత పవిత్రంగా అయ్యి సంస్కారాల మిలనాన్ని జరుపుకుంటారు. కనుక హోలీకి కల అర్థమే - కాల్చటము, జరుపుకోవటము. బయటివారైతే ఆలింగనము చేసుకుంటారు కానీ ఇక్కడ సంస్కారాల మిలనం, ఇదే మంగళ మిలనం. మరి ఇటువంటి హోలీని జరుపుకున్నారా లేక కేవలం డ్యాన్స్ చేసారా? పన్నీరు చల్లుకున్నారా? అది కూడా మంచిదే, బాగా జరుపుకోండి. బాప్‌దాదా సంతోషిస్తారు, పన్నీరు చల్లుకోండి, డ్యాన్స్ చెయ్యండి కానీ సదా డ్యాన్స్ చెయ్యండి. కేవలం 5-10 నిమిషాల డ్యాన్స్ కాదు. పరస్పరంలో గుణాల వైబ్రేషన్లను వ్యాపింపజేయటము - ఇదే పన్నీరు చల్లటము. మరియు కాల్చటం విషయంలోనైతే ఏం కాల్చాలో మీకు ఎలాగూ తెలుసు! ఇప్పటివరకు కూడా కాలుస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం చెయ్యి ఎత్తి వెళ్తారు, దృఢ సంకల్పం చేసేసాం అని అనుకుంటారు. ధైర్యమైతే పెడతారు, బాప్‌దాదా సంతోషిస్తారు. ఆ ధైర్యానికి బాప్‌దాదా అభినందిస్తారు కూడా. ధైర్యం పెట్టడము కూడా మొదటి అడుగు. కానీ బాప్‌దాదా యొక్క శుభ ఆశ ఏమిటి? సమయము యొక్క డేట్‌ను చూడకండి. 2000లో అవుతుందా, 2001లో అవుతుందా, 2005లో అవుతుందా అన్నదానిని ఆలోచించకండి. సరే, ఎవరెడీగా కాకపోయినా సరే, దీనిని కూడా బాప్‌దాదా వదిలేస్తున్నారు, కానీ ఆలోచించండి, బహుకాలపు సంస్కారమైతే కావాలి కదా! బహుకాలపు పురుషార్థము బహుకాలపు రాజ్యాధికారిగా తయారుచేస్తుంది అని మీరే వినిపిస్తారు కదా. ఒకవేళ సమయము వచ్చినప్పుడు దృఢ సంకల్పము చేస్తే అది బహుకాలముదైందా లేక అల్పకాలముదైందా? ఎందులో లెక్కించబడుతుంది? అల్పకాలములో లెక్కించబడుతుంది కదా! మరి అవినాశీ తండ్రి నుండి ఏ వారసత్వాన్ని తీసుకున్నారు? అల్పకాలపు వారసత్వాన్ని తీసుకున్నారు. ఇది మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు కదా! కనుక బహుకాలపు అభ్యాసము కావాలి. ఎంత కాలము ఉంది అని దాని గురించి ఆలోచించకండి. ఎంతగా బహుకాలపు అభ్యాసము ఉంటుందో, అంతగా అంతిమంలో కూడా మోసపోరు. బహుకాలపు అభ్యాసము లేనట్లయితే ఇప్పటి బహుకాలవు సుఖము, బహుకాలపు శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవము నుండి కూడా వంచితులైపోతారు, అందుకే ఏం చెయ్యాలి? బహుకాలముది చెయ్యాలి కదా? ఒకవేళ ఎవరి బుద్ధిలోనైనా డేట్ గురించి ఎదురుచూస్తూ ఉన్నారంటే, అలా ఎదురుచూడకండి, ఏర్పాట్లను చేసుకోండి. బహుకాలపు ఏర్పాట్లను చేసుకోండి. డేట్‌ను కూడా మీరే తీసుకురావాలి. సమయమైతే ఇప్పుడు కూడా ఎవరెడీగా ఉంది, రేపు కూడా కావచ్చు, కానీ సమయము మీ కొరకు ఆగి ఉంది. మీరు సంపన్నమైనట్లయితే సమయమనే పరదా తప్పకుండా పక్కకు తొలగాల్సిందే. మీరు ఆపటం వలనే ఆగి ఉంది. రాజ్యాధికారి అయితే తయారై ఉన్నారు కదా? సింహాసనమైతే ఖాళీగా ఉండకూడదు కదా! మరి విశ్వ మహారాజు ఒక్కరే సింహాసనంపై కూర్చుంటారా! ఇలా అయితే అది శోభిస్తుందా? రాయల్ ఫ్యామిలీ కావాలి, ప్రజలు కావాలి, అందరూ కావాలి. కేవలం విశ్వమహారాజు ఒక్కరే సింహాసనంపై కూర్చుంటే, నా కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయింది అని అతను చూస్తుంటారు. అందుకే బాప్‌దాదాకు ఒకే శుభ ఆశ ఉంది - పిల్లలందరూ, వారు క్రొత్తవారైనా, పాతవారైనా, ఎవరెవరైతే తమను తాము బ్రహ్మాకుమారీ లేక బ్రహ్మాకుమార్గా పిలుచుకుంటారో, వారు మధుబన్ నివాసులైనా, విదేశీ వాసులైనా, భారతవాసులైనా సరే, పిల్లలు ప్రతి ఒక్కరూ బహుకాలపు అభ్యాసము చేసి బహుకాలపు అధికారిగా అవ్వాలి, అప్పుడప్పుడు వారిగా కాదు. ఇష్టమేనా? ఒక చేతితో చప్పట్లు కొట్టండి. వెనుక ఉన్నవారు తెలివైనవారు, అటెన్షన్‌తో వింటున్నారు. బాప్‌దాదా వెనుక ఉన్నవారిని తమ ఎదురుగా ఉన్నట్లు చూస్తున్నారు. ముందు ఉన్నవారైతే ఎలాగూ ముందు ఉన్నారు. (కొంతమంది మెడిటేషన్ హాల్లో కూర్చుని మురళిని వింటున్నారు) కింద ఉన్నవారు బాప్‌దాదా యొక్క శిరోకిరీటాలుగా అయ్యి కూర్చుని ఉన్నారు. వారు కూడా చప్పట్లు కొడుతున్నారు. కింద ఉన్నవారికైతే త్యాగమునకు భాగ్యము లభించాల్సిందే. మీకు సమ్ముఖంగా కూర్చునే భాగ్యము లభించింది మరియు వారికి త్యాగము యొక్క భాగ్యము జమ అవుతూ ఉంది. అచ్ఛా, బాప్‌దాదాకు ఉన్న ఒక ఆశ ఏమిటో విన్నారా! ఇష్టమేనా! మరి తరువాత సంవత్సరం ఏం చూస్తారు? అప్పుడు కూడా ఇలాగే మరలా చేతులు ఎత్తుతారా? చేతులు ఎత్తండి, రెండు చేతులూ ఎత్తండి, కానీ మనస్సు యొక్క చేతిని కూడా ఎత్తండి. దృఢ సంకల్పం అనే చేతిని సదా కొరకు ఎత్తండి.
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో సంపూర్ణ పవిత్రత యొక్క మెరుస్తున్న మణిని చూడాలనుకుంటున్నారు. నయనాలలో పవిత్రతా మెరుపు, పవిత్రత యొక్క రెండు కంటితారలు ఆత్మికతతో మెరుస్తూ ఉండటాన్ని చూడాలనుకుంటున్నారు. మాటలలో మధురత, విశేషత, అమూల్యమైన మాటలను వినాలనుకుంటున్నారు. కర్మలలో సంతుష్టతను, నిర్మానతను సదా చూడాలనుకుంటున్నారు. భావనలో సదా శుభభావన మరియు భావములో సదా ఆత్మిక భావము, సోదర భావము ఉండాలి. సదా మీ మస్తకము నుండి ప్రకాశముతో కూడిన ఫరిశ్తాతనపు కిరీటము కనిపించాలి. కనిపించాలి అంటే అర్థము అనుభవమవ్వాలి. ఇలా అలంకరించబడిన మూర్తిని చూడాలనుకుంటున్నారు. మరియు ఇటువంటి మూర్తియే శ్రేష్ఠంగా, పూజ్యంగా అవుతుంది. వారైతే మీ జడ చిత్రాలను తయారుచేస్తారు కానీ బాబా చైతన్య చిత్రాన్ని చూడాలనుకుంటున్నారు. అచ్ఛా!
నలువైపులా ఉన్న సదా బాప్దాదాతోపాటు ఉండేవారికి, సమీపంగా ఉండే సదా సహచరులకు, సదా బహుకాలపు పురుషార్థం ద్వారా బహుకాలపు సంగమయుగ అధికారాన్ని మరియు భవిష్య రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకునే అతి తెలివైన ఆత్మలకు, సదా స్వయాన్ని శక్తులతో, గుణాలతో అలంకరించుకుని ఉండేవారికి, బాబా యొక్క ఆశా దీపాలకు, సదా స్వయాన్ని హోలియెస్ట్ మరియు హైయెస్ట్ స్థితిలో స్థితి చేసుకునే బాబా సమానమైన అతి స్నేహీ ఆత్మలకు, బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. దేశ, విదేశాలలో దూరంగా కూర్చుని కూడా సమ్ముఖంగా అనుభవం చేసుకునే వారందరికీ బాప్‌దాదా యొక్క చాలా, చాలా, చాలా ప్రియస్మృతులు.
దాదీజీతో:- బాప్‌దాదా మీకు సదా అనేక అభినందనలను ఇస్తారు. తనువుకు కూడా ఆశీర్వాదాలు ఇస్తాము, మనసుకు కూడ తోడుగా నిలుస్తాము మరియు సేవలో కూడా సహచరుడిగా అవుతాము. ఇలా అనుభవం అవుతుంది కదా? తనువుకు కూడా అనేక ఆశీర్వాదాలు లభిస్తాయి. దువా (ఆశీర్వాదాలు) అనే దవా(మందు) బాగా లభిస్తుంది. ఇకపోతే లెక్కాచారమునైతే బ్రహ్మా బాబా కూడా తీర్చుకోవలసి వచ్చింది, అందరూ తీర్చుకోవలసిందే. అన్నీ శూలం నుండి ముల్లుగా అయిపోతాయి. ఆశీర్వాదాలు చాలా లభిస్తాయి. పరివారం ద్వారా కూడా మరియు బాప్‌దాదా ద్వారా కూడా. అమృతవేళ నుండి రాత్రి వరకు బాప్‌దాదా ఆశీర్వాదాలతో మాలిశ్ చేస్తూ ఉంటారు. ఇలా అనుభవం అవుతుంది కదా! మీరు నడవడం లేదు, నడిపించేవాడు నడిపిస్తున్నాడు, కనుక అలసట లేకుండా ఉన్నారు. అచ్ఛా.
స్పెషల్ ఆశీర్వాదాలు ఉన్నాయి. (దాదీ జానకితో) స్పెషల్ ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. నిమిత్తంగా అయిన వారందరికీ స్పెషల్ ఆశీర్వాదాలు లభిస్తాయి. మీరు విదేశీయుల నుండి ఏమి ఆశిస్తున్నారు? (అందరూ బాబా మెడలో హారంగా అవ్వాలి) ఇదైతే చాలా మంచి కోరిక, మీరు కూడా చాలా చేస్తారు కదా! ప్రేమతో పాలన చేస్తారు, ఇంతటి అటెన్షన్ వారిపై పెట్టడము – ఇది కూడా మనసు యొక్క ప్రేమకు నిదర్శనము. ఎవరిపై అయితే ప్రేమ ఉంటుందో వారి బలహీనతను చూడలేము. (బాప్‌దాదా దాదీని, దాదీ జానకి గార్లను తమ వద్ద కూర్చోబెట్టుకున్నారు)
ఈ దాదీలు ఎవరైతే ఉన్నారో – వారు బాబాకు పెద్దన్నయ్యలు. మరి సోదరులు ప్రక్కనే కూర్చుంటారు కదా? బాగా కష్టపడటం కాదు, బాగా ప్రేమ చేస్తారు. బాప్‌దాదా కూడా నిమిత్తంగా అయిన వారిని మరియు చేసేవారిని చూసి చాలా సంతోషిస్తారు. మీరు కూడా తక్కువేమీ కాదు. వీరు కూడా తక్కువ కాదు. అచ్ఛా.
(శాంతివన్కన్నా ఇక్కడ బాగుంది) కానీ అనేకులు వంచితమైపోతారు. సోదరసోదరీలందరికీ ఆలోచన ఉంటుంది కదా. ఇదైతే హోలీ అవకాశం మీకు లభించింది.
విదేశీ సోదరసోదరీలతో:- మొదటి ఛాన్స్ డబల్ విదేశీయులకు లభించింది. చూడండి, అందరికీ డబల్ విదేశీయులంటే చాలా ప్రేమ ఉంది. మొదటి ఛాన్స్‌ను మీకు ఇచ్చారు. మంచిది, బాప్‌దాదా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు. మీరు చేసుకునే మీటింగులు, ప్లాన్లు, ప్రోగ్రాములు, ఆత్మిక సంభాషణలు అన్నిటినీ బాప్‌దాదా వతనం నుండి చూస్తారు. మంచి ఛాన్స్ కూడా లభిస్తుంది. ప్రతి సంవత్సరం ఫారెన్‌లో కూడా ఇంతటి సంగఠన జరగదు. ఇక్కడైతే ఒకటి, పెద్ద పరివారం ఉంటుంది, అందరినీ చూడటం వీలవుతుంది, అందరి పరిచయం లభిస్తుంది. రెండు, శక్తిశాలి పాలన కూడా లభిస్తుంది, ప్రేమ కూడా లభిస్తుంది. మధ్య-మధ్యలో స్ట్రిక్ట్‌గా కన్నెర్ర చేయడం కూడా అవసరమే. అటెన్షన్ ఉంది కానీ అటెన్షన్‌ను అండర్లైన్ చేయండి. మధుబన్‌లో పాలన లభిస్తుంది అన్న అనుభవం జరుగుతుంది కదా అప్పుడు అండర్లైన్ అవుతుంది. సమీపంగా కూడా వస్తారు.
బాప్‌దాదాకు, డబల్ విదేశీయులలోని ఒక విశేషత, వర్తమాన సమయంలో మెజారిటీలో ఉన్న విశేషత మంచిగా అనిపిస్తుంది, ఒకటి, పదే-పేదే సమ్‌థింగ్, సమ్‌టైమ్ అంటూ ఉంటారో అది బాగా తగ్గింది. ఇంతకముందు అయితే ప్రతి చిన్న విషయానికి సమ్‌థింగ్, సమ్‌టైమ్ అనేవారు. కానీ ఇప్పుడు మంచిగా ధైర్యం కలిగి ముందుకు వెళ్తున్నారు. బాల్యతనము పూర్తయింది, కొన్ని చోట్ల పురుషార్థంలో యువకులుగా ఉన్నారు, మరి కొన్ని చోట్ల వానప్రస్థానికి సమీపంగా ఉన్నారు. యూథ్ వారిలో ఇప్పటికీ ఇంకా ఆ అల ఉంది. వయసులో యూథ్ కాదు, పురుషార్థంలో. అయినా మొదటికీ ఇప్పటికీ తేడా వచ్చింది. ఇప్పుడు నాలెజ్ఫుల్గా అయ్యారు. ఏమి చేయాలి, ఎలా నడుచుకోవాలి అని అర్థం చేసుకున్నారు, ఇందులో నాలెజ్ఫుల్గా అయ్యారు. ఇకపోతే ఏమి మిగిలి ఉంది? ఇప్పుడు పవర్‌ఫుల్‌గా అవ్వాలి, దీనిని అండర్లైన్ చేయండి. సెంటర్లు కూడా పెరుగుతున్నాయి. ధైర్యమును ఉంచి సెంటర్లను బాగా తెరుస్తున్నారు. ఎవరైతే సెంటర్లను సంభాళిస్తున్నారో, సెంటరులో ఉంటున్నారో వారందరూ చేతులు ఎత్తండి. అచ్ఛా – మరి సెంటర్లో ఉండేవారుగానీ లేక నిమిత్తంగా ఉన్నవారుగానీ ఎప్పుడైనా అలసిపోతున్నారా? కొద్దికొద్దిగా ఉంటుందా? కొంత సమయం అలసట ఉండి తర్వాత మంచిగా అయిపోతున్నారా? మంచిది, చూడండి, మీకు సేవలో ఒక విశేషమైన లిఫ్ట్ ఉంది. భారతదేశంలో అయితే ముందుగా ట్రైనింగ్ తీసుకుంటారు, తర్వాత ట్రయల్‌లో ఉంటారు ఆ తర్వాతే టీచర్ అవుతారు కానీ మీరైతే నేరుగా సెంటర్ ఇన్ఛార్జ్ అయిపోతారు. మరి ఈ ఛాన్స్ మంచిది కదా. డబల్ పని చేస్తారు. ధైర్యము కారణంగా ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. జాబ్ కూడా చేస్తారు, సెంటర్ కూడా సంభాళిస్తారు, అలసిపోయి వస్తారు అయినాగానీ కొద్ది సమయంలోనే స్వయాన్ని రిఫ్రెష్ చేసేసుకుని తర్వాత సెంటరును సంభాళిస్తారు, ఇది చూసి బాప్‌దాదాకు అప్పుడప్పుడు మనసులో విశేషమైన ప్రేమ కలుగుతుంది. డబల్ బిజీ అయిపోయారు. కానీ డబల్ కార్యాన్ని చేస్తున్నందుకు డబల్ లాభం కూడా ఉంది. సేవ చేయడము అంటే తమ పుణ్య ఖాతాను జమ చేసుకోవడము మరియు ఎంతగా నిస్వార్థంగా, యుక్తియుక్తంగా, సేవా భావంతో సేవను చేస్తారో, అంతగా పుణ్యము యొక్క రాశి జమ అవుతుంది. ఆ పుణ్య రాశిని, ఖజానాను మీతో తీసుకువెళ్తారు. ఆ పుణ్యం యొక్క సంపాదన అర్థకల్పము కోసం సంపాదన అవుతుంది. కావున మీరు మంచి పుణ్యాత్ములు. నేను నిమిత్తమైన సేవాధారిని, పుణ్య ఆత్మను, ఈ స్మృతి చిన్న-చిన్న పాపాల నుండి ముక్తి చేస్తుంది. ఈరోజు మనసా ద్వారా లేక సేవ ద్వారా ఎంత పుణ్యము జమ అయింది అని చెక్ చేసుకోండి. పుణ్యం ఆధారంగా చిన్న-చిన్న విషయాలు ఎంత సమాప్తమయ్యాయి? ఖర్చు ఎంత అయింది మరియు జమ ఎంత అయింది? ఒకవేళ పదే-పదే విఘ్నాలు వస్తున్నాయి మరియు వాటిని తొలగించుకునేందుకు గుణాలు మరియు శక్తులను ఖర్చు చేస్తుంటే అది ఎంత? యోగయుక్త స్థితితో బాబాను సహచరుడిగా చేసుకుని సేవ చేయడంలో పుణ్య ఖాతా ఎంత జమ అయింది? అందరికంటే అతి పెద్ద మల్టీ మల్టీ మిలీయనీర్ మీరు. ఒక్కరోజులో ఎంత సంపాదన చేసుకుంటారో చూడండి! ఇంత సంపాదన విదేశాలలో ఎవ్వరూ చేయలేరు, భారతదేశంలో ఎవ్వరూ చేయలేరు. కావున మల్టీ మల్టీ అని పెడుతూ ఉండండి, లెక్కలో బిందువు పెడుతూ ఉండండి, అప్పుడు పెరుగుతూ ఉంటుంది కదా. ఒకటి ముందు బిందువు పెడితే 10 (పది) అవుతుంది, రెండు బిందువులు పెడితే 100(వంద) అవుతుంది, మరొక బిందువు జత చేస్తే 1000 (వెయ్యి) అవుతుంది. బిందువు అద్భుతమైనది కదా. అలాగే మీరు కూడా బిందువును పెడుతూ ఉండండి, మల్టీ మల్టీ మిలీయనీర్ అయిపోండి.
అచ్ఛా, అంతా మంచిగా ఉందా? పాండవులు మంచిగా ఉన్నారా? చాలా మంచిది. విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా బాబా పిల్లలు ఉన్నారు, ఇందుకు బాబాకు గర్వంగా ఉంది. మీకు కూడా నషా ఉంది కదా, మీరు ఏ దేశానికి వెళ్ళినా ఏమని చెప్తారు? మన ఇల్లు. ఇలా ఎన్ని ఇళ్ళు తయారయ్యాయి? ఇన్ని ఇళ్ళు ఇంకెవరికైనా ఉంటాయా? బాబా ఇల్లు, బాబా ఇంటికి వెళ్తున్నాము అని అందరూ అంటారు. ఎంత గారాల పిల్లలుగా అయ్యారు! కావున సదా సంతోషంగా ఉండండి. స్వప్నంలో కూడా దుఃఖపు అల రాకూడదు. కలలు వచ్చినా సంతోషకరమైనవి రావాలి, ఉదాసీనత, అలసట, కలవరపరిచే కలలు రాకూడదు. సంతోషము. మరి ఇలా ఉన్నారా? మీరు ఎంత సంతోషంగా ఉండాలంటే మీ ముఖము చూసి ఏడ్చేవారు కూడా సంతోషపడాలి. ఇటువంటి సంతోషం ఉంది కదా? ఏడ్చేవారిని నవ్వించగలరా? ముఖం మారకూడదు. ఒకసారి ఒకలా, మరోసారి మరోలా ఉండకూడదు. సదా చిరునవ్వుతో ఉండాలి. అచ్ఛా, ఎంత శాతం రిఫ్రెష్ అయ్యారు? 100 శాతమా లేక 90 శాతమా? 101 శాతమా, అచ్ఛా!
అచ్ఛా, మరుసటి సంవత్సరం వచ్చినప్పుడు 101 శాతము ఇలాగే ఉంటుందా లేక తగ్గుతుందా? అందరిదీ ఇంకా పైకే వెళ్తుంది కదా! చూస్తాము, అక్కడకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అలా ఉండాలని అనుకుంటున్నాము కానీ చూద్దాము అని అనుకునేవారు చేతులెత్తండి. ఎవరైనా ఇలా ఉన్నారా? ఫస్ట్ టైమ్ వచ్చినవారు చేతులెత్తండి. అచ్ఛా.
రెండవ గ్రూపు – ఆబూ నివాసులు, సేవాధారులు, హాస్పిటల్ నివాసులు మరియు పార్టీలతో:- అందరూ తమ శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారా? సదా హర్షితము. అప్పుడప్పుడూ కాదు కదా. బాబా లభించారు అన్నీ లభించాయి అని అందరూ అంటారు కదా. అన్నీ లభించినప్పుడు, ఎక్కడ సర్వ ప్రాప్తులు ఉన్నాయో అక్కడ సదా సంతోషం ఉండనే ఉంటుంది. ఇంతే కదా? ఏదైనా అప్రాప్తి ఉంటేనే సంతోషం తగ్గుతుంది. మరి ఏదైనా అప్రాప్తి ఉందా? సంతోషం భోజనం వంటిది. భోజనాన్ని ఎవరైనా విడిచిపెడ్తారా? సదా సంతోషంగా ఉండేవారు ఇతరులకు కూడా సంతోషాన్ని పంచుతారు. ఎవరు మిమ్మల్ని చూసినా మీ ముఖములో సంతోషపు మెరుపు కనిపించాలి. మరి ఇలా అనుభవం చేసుకుంటున్నారా? బాప్‌దాదా సదా పిల్లలందరినీ ఖుష్‌నసీబ్ (అదృష్టవంతులు) మరియు ఖుష్మిజాజ్ (సంతోష ముఖము)గా చూస్తారు. ముఖము అప్పుడప్పుడూ మారడం లేదు కదా? కొద్దిగా ఆలోచనలో, కొద్దిగా కన్ఫ్యూజన్లో ముఖము ఉండటం లేదు కదా! లేక అలా కొద్దికొద్దిగా ఉంటుందా? కన్ఫ్యూజ్ అవుతారా? అవును అవును అంటున్నారా? అప్పుడప్పుడూ అవుతారా? అప్పుడప్పుడూ కూడా అలా ఉండరా? బాబా పిల్లలు సదా ఏకరసంగా ఉండాలి. ఒకసారి ఒక రసంలో, మరోసారి మరో రసంలో కాదు. ఏకరసము, సదా సంతోషము. సరేనా? ఇప్పుడు మార్చకండి. ఈరోజు దీనిని కాల్చేయండి. సమాప్తము. ఏమి జిరిగనా, బాబా మీకు తోడుగా ఉన్నారు, అలజడిలోకి వచ్చే విషయము ఏముంది! కన్ఫ్యూజ్ అయ్యే విషయము ఏముంది? బాబా తోడుతో సహయోగాన్ని పొందండి, ఒంటరిగా భావిస్తారు కనుక ఆనందంగా ఉండటానికి బదులు అలజడిలోకి వస్తారు. అలజడిలోకి రాకండి. సరేనా? ఇప్పుడు కూడా అలజడిలోకి వస్తారా? (రాము) ఇప్పుడు అలజడిలో లేరు, ఆనందంగా ఉన్నారు అందుకే అలజడిలోకి రాము అని అంటున్నారు! కానీ, ఏమి జరిగినా అలజడిలోకి రాకండి. సరేనా లేక సంతోషం మాయమవుతుందా? సంతోషము పోకూడదు. సేవా బాలము ఉంది, దానిని కార్యంలో వినియోగించండి. కేవలం సేవ చేయకండి, సేవా బలము ఏదైతే బాబాతో లభిస్తుందో దానిని కార్యంలో వినియోగించండి. కేవలం సేవ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, ఇలా ఉంటే అలసిపోతారు, అలజడిలోకి కూడా వస్తారు కానీ బాబా తోడు యొక్క అనుభూతి, ఎక్కడ బాబా ఉన్నారో అక్కడ ఆనందమే ఆనందము. కావున తోడును ఇమర్జ్ చేసుకోండి, వినిపించాము కదా – స్మృతి చేస్తున్నారు కానీ తోడును ఉపయోగించుకోవడం లేదు, అందుకనే అలజడిలోకి వస్తున్నారు. సంగమయుగము ఆనందాల యుగమా లేక కలవర యుగమా? ఆనందాల యుగము అయినప్పుడు ఎందుకు అలజడిలోకి వస్తున్నారు? ఇప్పుడు మీ జీవితమనే డిక్షనరీ నుండి అలజడి అన్న పదాన్ని తీసివేయండి. తీసివేసారా? పక్కా? లేక కొద్ది-కొద్దిగా కనిపిస్తుందా? పూర్తిగా తీసేయండి. పరమాత్మ పిల్లలు ఆనందంలో ఉండకపోతే మరి ఇంకెవరు ఉంటారు, ఇంకెవరైనా ఉంటారా? కేవలం ఆనందమే ఆనందం. అందరూ మీ మీ డ్యూటీలో సంతోషంగా ఉన్నారా? లేక కొద్ది-కొద్దిగా డ్యూటీలో అలజడి ఉందా? ఏమి జరిగినా, ఈ పేపరును పాస్ అవ్వాలి. ఇది పరిస్థితి కాదు, ఇది పరీక్ష. పేపరు (పరీక్ష)ను పాస్ అయితే సంతోషం ఉంటుంది కదా. ఒక క్లాసు ముందుకు వెళ్తారు కదా! పరిస్థితి వచ్చింది, సమస్య వచ్చింది అని ఆలోచించకండి. పేపరు వచ్చింది, పాస్ అవ్వాలి, ఆనందంగా ఉండాలి. పిల్లలు పరీక్షలో పాస్ అయ్యి వస్తే ఎంత సంతోషంగా ఉంటారు, అలజడిలోకి వస్తారా! ఈ పేపర్లు అయితే వస్తాయి. పేపర్లే అనుభవంలో ముందుకు తీసుకువెళ్తాయి. కావున సదా ఆనందంగా ఉండేవారు మీరు. సేవాధారులు కాదు ఆనందంలో ఉండేవారు. మీ ఈ టైటిల్‌ను సదా గుర్తుంచుకోండి. హాస్పిటల్ సేవాధారులు కాదు, ఆనందంగా ఉండే సేవాధారులు. అచ్ఛా.
డాక్టర్లు ఆనందంగా ఉంటున్నారు కదా? రోగులకు ఆనందాన్ని పంచేవారు. చాలా మంచిది. (బాప్‌దాదా అందరినీ చేయి ఎత్తించి కలిసారు)
అందరూ చాలా-చాలా పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నారు. వెరైటీ పుష్ప గుచ్ఛము చాలా మంచిగా అనిపిస్తుంది. వెరైటీ ఎప్పుడూ అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది, అందుకే నచ్చుతుంది. స్థానాలు అనేకము కానీ అందరూ ఒక్కరే. ఒకటే లక్ష్యము, ఒకటే మతము, ఒక్కరే తండ్రి, ఒక్కటే పరివారము, స్థితి కూడా ఏకరసము. ఏకరసముగా ఉంది కదా? ఇతర రసాలలోకి వెళ్ళకండి, మాయ తినేస్తుంది. కనుక ఏకరసంగా ఉండండి. మాయకు కూడా మీరంటే ఇష్టము కదా. 63 జన్మల ప్రేమ. కానీ మాయపై ప్రేమ పెట్టుకోవాలా లేక బాబాపై ప్రేమ పెట్టుకోవాలా అన్నది మీకు తెలుసు. ఎక్కడ బాబా ఉంటారో అక్కడకు మాయ రాలేదు. మాయ పారిపోతుంది, బాబా వద్దకు వచ్చే ధైర్యము కూడా మాయకు లేదు. ఎటువంటి పరిస్థితి వచ్చినాగానీ మనస్ఫూర్తిగా బాబా అని అన్నారంటే పరిస్థతి పారిపోతుంది. అనుభవం ఉంది కదా! మాయను పంపించడం వచ్చా లేక కూర్చోబెట్టడం వచ్చా? దానిని కూర్చోబెట్టకండి. పంపించేయండి, దూరం నుండే పంపేయండి. మీ వద్దకు మాయ వచ్చి, ఆ తర్వాత దానిని పంపించే ప్రయత్నం కూడా వద్దు, దూరం నుండే పంపేయండి. బాబా చేతిని పట్టుకోండి. వీరు బాబా చేతిని పట్టుకుని ఉన్నారు అని చూసి అది పారిపోతుంది. సదా మాయాజీత్. సరేనా! చూడండి, ఈరోజు సమీపంగా కూర్చున్నారు కదా. ఛాన్స్ లభించింది కదా. మాకైతే ఎప్పుడూ ఛాన్స్ లభించదు అని ఇక అనరు కదా. లభించింది కదా? పెద్ద పరివారం కనుక అందరికీ పంచి ఇవ్వవలసి ఉంటుంది. అచ్ఛా, అయితే అందరూ ఖుష్రాజీగా (సంతోషంగా) ఉన్నారా? బాప్‌దాదా చెప్పిన మాట గుర్తుంది కదా – సదా. అప్పుడప్పుడూ వారిగా కాదు, సదా. హాస్పిటల్ వారు కూడా బాగా కష్టపడుతున్నారు. హాస్పిటల్ కార్యము కూడా పెరుగుతుంది. అచ్ఛా.
మూడవ గ్రూపు – మధుబన్ నివాసి సోదర సోదరీలతో:- మధుబన్ నివాసులు అనగా కర్మలో మధురత మరియు వృత్తిలో అనంతమైన వైరాగ్యము. వనంలో ఏమి ఉంటుంది? అనంతమైన వైరాగ్యము ఉంటుంది కదా. కనుక మధువన్ నివాసులు అంటే ఎక్స్ట్రా గిఫ్ట్‌కు అధికారులు. గిఫ్ట్ ఉంది కదా. ఎంత నిశ్చింతగా ఉన్నారు! మీ డ్యూటీ చేయాలి, ఆనందంగా ఉండాలి. ఆదాయము రావాలి, జిజ్ఞాసువులను సంభాళించాలి, వీటన్నిటినుండి ఫ్రీగా ఉన్నారు కదా! ఎక్కువలో ఎక్కువ 8 గంటలు డ్యూటీ ఉంటుంది. అనుకోకుండా ఒక్కోసారి ఎక్కువ చేయవలసి వస్తుంది. కానీ ఇతర బాధ్యతలు ఏమీ లేవు కదా. కరెంట్ వారికి కరెంట్ బాధ్యత ఉంది, ఒకటే డ్యూటీ కదా. చాలా అయితే లేవు కదా. 8 గంటలు అయితే బాప్‌దాదా డ్యూటీ కోసం ఇచ్చారు, ఒక్కోసారి 12 గంటలు కూడా చేయవలసి వస్తుంది, అయినాగానీ 8 గంటలు విశ్రాంతి లభిస్తుంది. ఒకవేళ 12 గంటలు డ్యూటీ చేయవలసి వచ్చినాగానీ 4 గంటలు మిగులుతాయి కదా. 12 గంటల కన్నా ఎక్కువ సమయం డ్యూటీ అయితే ఉండదు. 12 గంటలలో రోజంతా వచ్చేస్తుంది. ఎప్పుడైనా రాత్రి చేయవలసి వస్తే పగలు విశ్రాంతి తీసుకుంటారు. మరి కనీసం 4 గంటలు పవర్ఫుల్ యోగం చేస్తున్నారా? నిరంతర స్మృతి అయితే ఉండనే ఉండాలి కానీ పవర్ఫుల్ స్మృతి కనీసం 4 గంటలు చేస్తున్నారా? మధుబన్ నివాసులు స్పెషల్ అటెన్షన్ పెట్టాలి, మేము నలువైపుల శక్తిశాలి స్మృతి యొక్క వైబ్రేషన్లను వ్యాప్తి చేయాలి అని భావించాలి ఎందుకంటే మీరు ఉన్నతోన్నతైన స్థానంలో ఉన్నారు. స్థానము ఉన్నతమైనది కదా. ఇంతకన్నా ఉన్నతమైనది మరొకటి లేదు. ఉన్నతమైన (ఎత్తైన) టవర్ ఏమి చేస్తుంది? సకాశ్ ఇస్తుంది. లైట్ మైట్‌ను వ్యాప్తి చేస్తుంది. మరి కనీసం 4 గంటలు, మేము ఉన్నతోన్నతమైన స్థానంలో కూర్చుని విశ్వానికి లైట్ మైట్‌ను ఇస్తున్నాము అని భావించండి. మధుబన్ యొక్క వైబ్రేషన్లు – బలహీనమైనా, శక్తిశాలి అయినా, రెండూ త్వరగా వ్యాపిస్తాయి అన్న విషయము మీకు తెలుసు. అనుభవం ఉంది కదా! మధుబన్‌లో సూది క్రింద పడినా ఆ శబ్దం అందరికీ వినిపిస్తుంది ఎందుకంటే మధుబన్ నివాసులపై అందరి అటెన్షన్ ఉంటుంది. మధుబన్ వారు విజయాన్ని పొందడానికి మరియు ఇతరులకు పొందేలా చేయడానికి నిమిత్తులు. మధుబన్ మహిమ ఎంత వింటారు! మధుబన్ గురించి పాటలు కూడా పాడుతారు కదా. మరి మధుబన్ గోడల మహిమనా లేక మధుబన్ నివాసుల మహిమనా? ఎవరి మహిమ? మీ అందరిదీ. మీపై ఇంతటి బాధ్యత ఉందని భావించండి. కేవలం మీ పనిని, బాధ్యతను పూర్తి చేయడమే మీ బాధ్యత కాదు. మధుబన్ వాయుమండలం నలువైపుల వాయుమండలాన్ని తయారు చేస్తుంది. పరస్పరం కలుసుకని సంగఠనగా అయ్యి ఉన్నతి కోసం ప్లాన్లు మరియు ఆత్మిక సంభాషణలు చేసుకుంటున్నారు, ఇందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇది చాలా బాగుంది, దీనిని విడిచిపెట్టకండి. సంగఠనలో లాభము ఉంటుంది. రోజంతా కర్మణ చేసినాగానీ కొద్ది సమయమైనా పరస్పరం ఉన్నతి గురించి సంభాషించుకుంటే ఛేంజ్ ఉంటుంది. ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి. ఇలా పురుషార్థం కోసం గ్రూపులుగా కూర్చోవడం బాప్‌దాదాకు నచ్చింది, దీనిని తగ్గించకండి మరింత పవర్‌ఫుల్‌గా చేయండి. మిస్ కూడా చేయకండి. మాలో శక్తి ఉంది, మేము అన్నీ చేసేసాము అని మాత్రం అనుకోకండి. సహయోగము ఇవ్వడము కూడా సేవయే. కూర్చునే అవసరం లేదు, కానీ కూర్చోవడము – ఇది చాలా పెద్ద సేవ. బాప్‌దాదా సమాచారమును విన్నారు – చాలా మంచిది. దీనిని ఇంకా పెంచండి. మురళి అయితే వింటారు కానీ మురళిని విన్న తర్వాత కర్మణలోకి వెళ్ళిపోతారు కనుక మధ్యమధ్యలో కర్మ కాన్సెస్ అయిపోతారు, కొంత యోగం చేస్తారు, కొంత కర్మ కాన్సెస్ అవుతారు. కానీ పరస్పరంలో ఇటువంటి ఆత్మిక సంభాషణ చేసుకోవడము – ఇది రిఫ్రెష్ చేయడము. వాయుమండలాన్ని పవర్‌ఫుల్‌గా చేయడము. ఈ శుభవార్తతో బాబా చాలా సంతోషిస్తున్నారు.
ఇప్పుడు అందరూ కనీసం 4 గంటల చార్టును దాదీకి ఇవ్వాలి. ఇష్టమేనా? 4, 6 గంటలైనా ఫర్వాలేదు కానీ తగ్గకూడదు. 6 అవ్వాలి, 8 అవ్వాలి, ఇది చాలా మంచిది. కానీ కనీసం 4 గంటలు, కలిసి చేయకపోయినా ఫర్వాలేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకోండి – మొత్తంగా 4 గంటలు కావాలి. అర్థగంట లభించినా, 5 నిమిషాలు లభించినాగానీ జమ మాత్రం 4 గంటలు కావాలి. వీలవుతుందా? వీలవుతుంది అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా, వీరంతా ఎవరెడీగా ఉన్నారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, ధైర్యము మంచిగా ఉంది. బాప్‌దాదా ఎక్స్ట్రా సహాయం చేస్తారు, ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యము ఉంచితే పరివారం నుండి సహాయం, పెద్దల నుండి మనస్ఫూర్తిగా సహయోగము లభిస్తుంది. బాప్‌దాదా అయితే ఒకటికి పదమారెట్ల సహాయాన్ని ఇస్తారు. మరి అందరికీ ఇష్టమేనా? అచ్ఛా – 4 గంటలకన్నా తక్కువ చేయకండి. ఒకరోజు ఒకవేళ 4 గంటలు అవ్వకపోతే మరుసటి రోజు 6 గంటలు చేసి 4 గంటలను పూర్తి చేయండి. చేయగలరా? చూబడండి, ఆలోచించి సరే అని చెప్పండి. ఇప్పుడు ప్రభావంలోకి వచ్చి సరే అనకండి. చేయగలరా? (దాదీతో) చూస్తున్నారు కదా. అందరూ చేతులెత్తారు. వీరికి అభినందనల కానుక. ఎడ్వాన్సుగా అభినందనలు. కానుకను విడిచిపెట్టకండి. చాలా మంచిది. బాప్‌దాదా అయితే మధుబన్ నివాసులను తమ నయనాల ఎదుట ఉన్నట్లుగానే చూస్తారు. కంటి రత్నాలుగా చూస్తారు. మధుబన్ నివాసులుగా అవ్వడము చిన్న విషయము కాదు. మధుబన్ నివాసులుగా అవ్వడము అంటే అనేక కానుకలకు అధికారులుగా అవ్వడము. చూడండి, స్థూలమైన కానుకలు కూడా మధుబన్‌లో చాలా లభిస్తాయి. పైగా ఎంతో గౌరవము కూడా లభిస్తుంది. ఎక్కడికైనా వెళితే అందరూ ఏ దృష్టితో చూస్తారు? మధుబన్ నివాసులు వచ్చారు అంటారు. మరి ఇంతగా మీ స్వమానాన్ని సదా ఇమర్జ్ చేసుకుని ఉండండి. మర్జ్ కాదు, ఇమర్జ్. సరేనా?
ఇప్పుడు బాప్‌దాదా చార్ట్ అడుగుతూ ఉంటారు, 15-15 రోజుల తర్వాత చార్ట్ యొక్క రిజల్ట్‌ను చూస్తాము. చార్టులో అవును-కాదు అని జవాబు చెప్పండి. పైన తారీఖు వ్రాయండి, క్రింద అవును లేక కాదు అని వ్రాయండి. 2 లేక 3 లేక 4 గంటలు శక్తిశాలి స్మృతి ఉండినది అని వ్రాయండి, ఎక్కువ వ్రాయకండి. చదివే సమయం ఉండదు కదా. మధుబన్ నివాసులపై అందరికీ ప్రేమ ఉంటుంది మరియు మీకు ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. ఐ.పీలు ఎవరైతే వస్తారో, యోగ శిబిరంలో ఎవరైతే వస్తారో, కాన్ఫరెన్సులో ఎవరైతే వస్తారో వారు మధుబన్ సేవను చూసి మీకు ఆశీర్వాదాలు ఇస్తారు కదా. ప్రతి ఒక్కరి మనసు నుండి – వాహ్ సేవాధారులూ వాహ్! అన్న మాట వెలువడుతుంది అంటే ఆశీర్వాదాలు జమ అవుతున్నాయనే అర్థం కదా. మరి అద్భుతాన్ని చేసి చూపించండి. మధుబన్ వారి రికార్డు తప్పనిసరిగా 4 గంటలు ఉండాలి. ఎక్కువ జరిగితే ఇంకా మంచిది. ఇదే ప్రవృత్తివారిని, సెంటరు వారిని, అందరినీ పవర్‌ఫుల్‌గా చేస్తుంది. మీరు నిమిత్తము. అచ్ఛా, సంతోషంగా ఉన్నారా? ఇది అడగవలసిన అవసరం ఉందా? సంతోషంగానే ఎప్పటికీ ఉంటున్నారా, ఇది అడిగే అవసరం లేదా? అందరూ సంతోషంగా ఉండనే ఉన్నారు. అందరి ముఖాలు చూడండి, అందరి పళ్ళు కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. మీ విశేషతను చూసుకోండి మరియు దానిని కార్యంలో పెట్టండి.
విశేషంగా మధుబన్ సోదరీలతో మాట్లాడుతున్నాము. బాప్‌దాదా అంతా చూస్తారు. బాప్‌దాదా వద్ద ఏదీ దాగదు. లోపలదీ చూస్తారు, బయటది కూడా చూస్తారు. మధుబన్ సోదరీలు విశేషంగా తమ-తమ విశేషతలను కార్యంలో పెట్టండి. ప్రతి ఒక్కరిలో విశేషతలు ఉన్నాయి, విశేషత ఏదీ లేదు అని కాదు. అందరిలో ఉన్నాయి. కేవలం వాటిని కార్యంలో పెట్టడం వలన వృద్ధిని పొందుతారు. ఇతరుల విశేషతను కూడా చూడండి మరియు మీ విశేషతను కార్యంలో పెట్టండి. మీరు తక్కువేమీ కాదు. అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మధుబన్ సోదరీలు. మధుబన్ పేరు వినగానే ఎంతో సంతోషం కలుగుతుంది. మధుబన్ సోదరీలు తక్కువేమీ కాదు. అందరి ఆశీర్వాదాలకు పాత్రులు మీరు. పుణ్య ఖాతా ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత జమ చేసుకోవచ్చు. ఛాన్స్ ఉంది. సమయాన్ని ఎంత సఫలం చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఛాన్స్ అయితే ఉంది కదా! లేక ఛాన్స్ లభించడం లేదా? ఛాన్స్ మీరే తీసుకోండి, ఛాన్స్ అలా లభించేయదు. ఇది చేయండి అని ఎవరైనా చెబితే చేయడం కాదు. ఛాన్స్ తీసుకోండి. ఛాన్స్ తీసుకుంటే ఏమవుతారు? ఛాన్సలర్. మధుబన్ వారు భాగ్యశాలురే కానీ మీ భాగ్యాన్ని కార్యంలో పెట్టండి. అర్థమయిందా! సోదరీలు గారాల పిల్లలు మరియు సోదరులు చాలా గారాల పిల్లలు కదా! చాలా బాగుంది. ఇప్పుడు 4 గంటలలో సోదరీలు ముందుండాలి. ఇది అయిపోయింది కదా, ఇలా జరగకుండా ఉండాలి అని అనకండి. చేయవలసిందే. పక్కా! వీరి ఫోటోను తీయండి. అచ్ఛా.
*** ఓంశాంతి ***
