‘‘శివ అవతరణ మరియు ఎకానమీ (పొదుపు) యొక్క అవతారమూర్తులు’’
ఈరోజు త్రిమూర్తి శివబాబా తమ అతి ప్రియాతి ప్రియమైన, మధురాతి మధురమైన సాలిగ్రామాలైన పిల్లలను కలవడానికి వచ్చారు. నేటి ఈరోజు శివుడు మరియు సాలిగ్రామాలకు విశేషమైన రోజు. పిల్లల పుట్టినరోజును జరపడానికి బాబా వచ్చారు అని బాబాకు పిల్లలను కలుసుకుని సంతోషమనిపిస్తుంది మరియు మేము బాబా పుట్టినరోజును జరపడానికి వచ్చాము అని పిల్లలు అంటారు. బాబాకు కూడా సంతోషంగా ఉంది మరియు పిల్లలకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకని? ఎందుకంటే ఈ పుట్టినరోజు మొత్తము కల్పములో అతీతమైనది మరియు ప్రియమైనది. మొత్తము కల్పములో ఇటువంటి పుట్టినరోజు ఎవ్వరికీ జరపడం జరగదు. తండ్రి మరియు పిల్లల పుట్టినరోజు కలిసి ఒకే సమయములో ఉండటము - ఇలా మరే సమయంలోనూ మరియు మరెవ్వరికీ జరగనే జరగదు. కనుక ముందుగా బాప్‌దాదా పిల్లలకు పదమారెట్ల శుభాకాంక్షలను తెలుపుతున్నారు. పిల్లల శుభాకాంక్షలైతే అమృతవేళ నుండి చాలా-చాలా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా చెప్పే శుభాకాంక్షలు బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. బాప్‌దాదా ఇంతమంది పిల్లలను, సాలిగ్రామాలను చూసి హృదయంలో ఈ సంతోషకరమైన పాటలను పాడుతున్నారు - వాహ్ చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలూ వాహ్! వాహ్ ప్రియమైన పిల్లలూ వాహ్! వాహ్ అలౌకిక జన్మను, అలౌకిక పుట్టినరోజును జరుపుకునే పిల్లలూ వాహ్! బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి కోసం వాహ్-వాహ్ అనే పాటను పాడుతున్నారు ఎందుకంటే మొత్తము విశ్వంలోని ఆత్మలకల్లా ఎంత కొద్దిమంది పిల్లలైన మీరు ఇంతటి పదమాపదమ భాగ్యవంతులుగా అయ్యారు మరియు ఇక ముందు కూడా భాగ్యవంతులుగా ఉంటారు. అర్థకల్పము అమర భాగ్యవంతులుగా ఉంటారు. ఇది ఒక్క జన్మకు వరదానము కాదు, అనేక జన్మలకు అమర వరదానీలుగా అయ్యారు. ఇటువంటి పిల్లలకు తమ స్వమానము ఎంతవరకు స్మృతిలో ఉంటుంది? ఈ అలౌకిక పుట్టినరోజు మరియు అలౌకిక జన్మ యొక్క తరగని వారసత్వాన్ని బాబా తన పిల్లలు జన్మ తీసుకున్న వెంటనే ఇస్తారు. జన్మ తీసుకున్న వెంటనే స్మృతి అనే శ్రేష్ఠ తిలకాన్ని పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా దిద్దారు. తిలకం దిద్దబడి ఉంది కదా? ఇది బ్రాహ్మణ జీవితము కనుక తిలకము కూడా అవినాశిగా ఉంటుంది. బ్రాహ్మణుల మస్తకములో తిలకము ఉండటము, ఇది శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు.
మీరందరూ మరియు నలువైపులా ఉన్న పిల్లలు దూరంలో కూర్చుని ఉన్నా కూడా చాలా ఉల్లాస-ఉత్సాహాలతో ఈ అతీతమైన మరియు ప్రియమైన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. జరుపుకుంటున్నారు కదా? బాబా మా పుట్టినరోజును జరుపుతున్నారు మరియు మేము బాబా పుట్టినరోజును జరుపుతున్నాము అని అందరూ సంతోషిస్తున్నారు. ఎంత సంతోషముంది! ఈ సంతోషాన్ని కొలవగలరా? ఏదైనా కొలత ఉందా? ఈ ప్రపంచంలో ఈ అలౌకిక సంతోషాన్ని కొలిచే సాధనమేదీ వెలువడనే లేదు. సాగరమంత సంతోషం ఉందా అని మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? సాగరమైతే అసలేమీ కాదు అని అంటారు. అచ్ఛా, మరి ఆకాశమంత ఉందా? ఆకాశము కంటే కూడా పైన మీ ఇల్లు ఉంది, మీ సూక్ష్మవతనము ఉంది కనుక కొలిచేందుకు, తూచేందుకు ఏదీ వెలువడలేదు, ఇకపై వెలువడదు కూడా. ఇంతగా సంతోషము ఉన్నట్లయితే ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి (అందరూ చప్పట్లు కొట్టారు). సంతోషం ఉంది, ఇందులో అయితే అందరూ చేతులు ఎత్తారు, అభినందనలు. ఇప్పుడు రెండవ ప్రశ్న (అదేమిటో అర్థమయ్యింది కనుక నవ్వుతున్నారు) బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ సదా వికసించి ఉన్న ఆత్మిక గులాబీ పుష్పములా చూడాలనుకుంటారు. సగం వికసించి ఉండటం కాదు, సదా మరియు పూర్తిగా వికసించి ఉండాలి. వికసించి ఉన్న పుష్పము ఎంత ప్రియంగా అనిపిస్తుంది. దానిని చూస్తేనే ఎంతో ఆనందం కలుగుతుంది. కొంచెం వాడిపోయినా దానిని ఏం చేస్తారు? పక్కకు పెట్టేస్తారు. బాప్‌దాదా పక్కన పెట్టరు కానీ వారికి వారే పక్కకు వెళ్ళిపోతారు.
ఈరోజు జరుపుకునే రోజు కదా! మురళినైతే సదా వింటూనే ఉంటారు. ఈరోజు బాగా సంతోషంతో మనసుతో నాట్యము చెయ్యండి మరియు పాటలు పాడండి. మనసుతో నాట్యం చెయ్యండి, పాదాలతో కాదు. పాదాలతో నాట్యం చెయ్యటం మొదలుపెడితే గందరగోళం అయిపోతుంది. బాప్‌దాదా చూస్తున్నారు - పిల్లలు నాట్యము కూడా చేస్తున్నారు మరియు మధురాతి-మధురమైన తండ్రి మహిమ మరియు తమ అలౌకిక మహిమ యొక్క పాటలను కూడా చాలా పాడుతున్నారు. బాబా వద్దకు మీ మనసులోని ధ్వని చేరుకుంటూ ఉంది. అన్ని దేశాల నుండి ధ్వని వస్తూ ఉంది. బాబా ధ్వనిని వారు వింటున్నారు కూడా మరియు బాబా కూడా వారి ధ్వనిని వింటున్నారు. బాబా కూడా అంటున్నారు, విశ్వానికి చాలా-చాలా స్నేహీ పిల్లలూ - బాగా నాట్యం చెయ్యండి, బాగా పాడండి, ఇక వేరే పనేముంది? బ్రాహ్మణుల పనేమిటి? యోగాన్ని జోడించటము అంటే కూడా ఏమిటి? ఇదేమైనా కష్టమా? యోగము అంటే అర్థమే ఆత్మ మరియు పరమాత్మల మిలనము. మరి మిలనములో ఏం జరుగుతుంది? సంతోషములో నాట్యము చేస్తారు. బాబా మహిమ యొక్క మధురాతి మధురమైన పాటలను హృదయం ఆటోమెటిక్‌గా పాడుతుంది. బ్రాహ్మణుల పనే ఇది, పాడుతూ ఉండండి మరియు నాట్యం చేస్తూ ఉండండి. ఇది కష్టమా? నాట్యం చెయ్యటం, పాటలు పాడటం కష్టమా? కాదు కదా. ఎవరికైతే కష్టమనిపిస్తుందో వారు చేతులెత్తండి. ఈరోజుల్లోనైతే ఇది నాట్యం చేసే, పాటలు పాడే సీజన్, కనుక మీరు కూడా ఏం చెయ్యాలి? నాట్యం చెయ్యండి, పాడండి. సహజమే కదా? సహజమైతే తల ఊపండి. కష్టమైతే కాదు కదా? కావాల్సుకుని సహజం నుండి పక్కకు వచ్చి కష్టము వైపుకు వెళ్ళిపోతారు. వాస్తవానికి అది కష్టము కాదు, అది చాలా సహజము ఎందుకంటే బాబాకు తెలుసు - అర్థకల్పము కష్టతరమైన జీవితాన్ని గడిపారు కనుక ఈ సమయములో సహజమవుతుంది. కష్టమనిపిస్తుంది అన్నవారు ఎవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు కష్టమనిపిస్తుందా? ఎలా అయితే ఎవరైనా నడుస్తూ-నడుస్తూ దారి మర్చిపోయి వేరే దారిలోకి వెళ్ళిపోతే కష్టమనిపిస్తుంది కదా. జ్ఞాన మార్గము కష్టమైనది కాదు. బ్రాహ్మణ జీవితము కష్టమైనది కాదు. బ్రాహ్మణులకు బదులుగా క్షత్రియులుగా అయిపోతారు, క్షత్రియుల పనే కొట్లాడటం, గొడవ పడటం... మరి ఇదైతే కష్టంగానే ఉంటుంది కదా! యుద్ధము చెయ్యటమైతే కష్టంగా ఉంటుంది, సంబరాలను జరుపుకోవటము సహజంగా ఉంటుంది.
డబల్ విదేశీయులు ఆనందంలో ఉండేవారే కదా! ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. ఆనందంగా ఉన్నారా? అక్కడకు వెళ్ళి తికమకలోకి రారు కదా? చూడండి, నేటి శివజయంతి యొక్క మహత్వము రెండు విషయాలకు సంబంధించినది. ఒకటేమో - ఈరోజున వ్రతము పెట్టుకుంటారు. డబల్ విదేశీయులకైతే ఈ విధంగా జరుపుకోవాల్సిన అవసరమే రాలేదు. దీనిని భారత్‌లోనే జరుపుకుంటారు. ఈరోజు యొక్క మహత్వము ఏమిటంటే - వ్రతాన్ని ఆచరించడము మరియు రెండవది జాగరణ చేయడము. మరి మీరందరూ వ్రతాన్ని కూడా చేపట్టారు కదా? పక్కా వ్రతాన్ని చేపట్టారా? లేక ఒక్కోసారి కచ్చాగా, ఒక్కోసారి పక్కాగా ఉన్నారా? కచ్చాగా (పచ్చిగా) ఉన్న వస్తువు మంచిగా అనిపిస్తుందా? పండినవి మంచిగా అనిపిస్తాయి కదా! ఏ వ్రతాన్ని చేపట్టారు? బాప్‌దాదా అన్నింటికన్నా మొదటి వ్రతంగా దేనిని ఇచ్చారు? స్మృతి తిలకాన్ని పెట్టుకున్న తరువాత మొట్టమొదటి వ్రతంగా దేనిని తీసుకున్నారు? గుర్తుంది కదా? సంపూర్ణ పవిత్ర భవ. బాబా చెప్పారు మరియు పిల్లలు ధారణ చేసారు. పవిత్రతా వ్రతము అనగా కేవలము బ్రహ్మచర్య వ్రతమే కాదు, బ్రహ్మాబాబా సమానంగా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో పవిత్రత ఉండటము - వీరినే బ్రహ్మచారి మరియు బ్రహ్మాచారి అని అంటాము. ప్రతి మాటలో పవిత్రతా వైబ్రేషన్లు ఇమిడి ఉండాలి. ప్రతి సంకల్పములో పవిత్రత యొక్క మహత్వము ఉండాలి. ప్రతి కర్మలో, కర్మ మరియు యోగము ఉండాలి అనగా కర్మయోగి అనుభవము ఉండాలి - వీరినే బ్రహ్మాచారి అని అంటారు. బ్రహ్మాబాబాను చూసారు కదా, వారి ప్రతి మాటా మహావాక్యంగా ఉండేది, సాధారణ వాక్యంగా ఉండేది కాదు ఎందుకంటే మీ జన్మయే సాధారణమైన జన్మ కాదు, అలౌకికమైనది. అలౌకికతకు కల అర్థమే పవిత్రత. కనుక ప్రతిరోజూ రాత్రి మీకు మీరు టీచరుగా అయ్యి చెక్ చేసుకోండి మరియు ఆ పర్సంటేజ్ అనుసారంగా మీకు మీరే మార్కులను ఇచ్చుకోండి. తయారవ్వడమైతే 100 శాతము అలా తయారవ్వాల్సిందే. కనుక ప్రతి రోజూ మిమ్మల్ని మీరు చూసుకోండి, ఇతరులను చూడకండి. కానీ బాప్‌దాదా చూసారు - స్వయానికి బదులుగా ఇతరులను చూడటంలో నిమగ్నమైపోతారు. అది సహజం అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు చూసుకోండి - ఈరోజు సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో ఎంత పర్సంటేజ్ పవిత్రత ఉంది?
మీరు ఈ సంవత్సరము నలువైపులా ఏ సందేశాన్ని ఇచ్చారు? పరివర్తన గురించి అన్ని ఫంక్షన్లలో వినిపించారు. ఎక్కడెక్కడైతే భాషణలు ఇచ్చారో ఆ అన్నిచోట్లా పరివర్తన అన్న టాపిక్ పై చాలా మంచి-మంచి భాషణలు ఇచ్చారు. ఈ సంవత్సరము నలువైపులా సేవలలో ఇతరులకు కూడా పరివర్తన లక్ష్యమును చాలా మంచి ఆర్భాటంగా ఇచ్చారు, అందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మరి మీకు మీరు కూడా ప్రతి రోజు ఎంత శాతము పరివర్తన జరిగింది అన్నదానిని పరిశీలించుకోండి. పరివర్తన ఎక్కే కళదిగా ఉండాలి, పడిపోయే కళదిగా ఉండకూడదు. బాప్‌దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి చార్టును చూస్తారు. బాబా పిల్లలందరి చార్టును చూస్తారా లేక ఎవరైనా విశేషమైనవారిదే చూస్తారా అని మీరు ఆలోచిస్తుండవచ్చు. బాప్‌దాదా పిల్లలందరి చార్టును అప్పుడప్పుడు చూస్తారు, ప్రతి రోజూ చూడరు కానీ అప్పుడప్పుడు చూస్తారు, చివరిలో ఉన్నవారిదైనా, వేగంతో వెళ్ళేవారిదైనా అందరి చార్టును చూస్తారు. అందరూ నవ్వుతున్నారు, మరి చార్టు ఎలా ఉంది అన్నదానిని బాప్దాదానే వినిపించమంటారా? ఈరోజు జరుపుకునే రోజు కదా, అందుకని వినిపించము. కానీ ఇకముందు కొరకు సూచననిస్తున్నాము - ఈరోజు యొక్క మహత్వము వ్రతాన్ని ఆచరించటము అనగా దృఢ సంకల్పమును తీసుకోవటము. సత్యమైన భక్తులు ఎప్పుడూ వ్రతాన్ని భంగపరచరు. బాప్‌దాదా పిల్లలకు ఇక ముందు కొరకు మళ్ళీ సూచనను ఇస్తున్నారు, అదేమిటంటే - ఇప్పటికీ కూడా మొదటి పునాది అయిన సంకల్ప శక్తిలో అప్పుడప్పుడు వ్యర్థము ఎక్కువగా ఉంటుంది మరియు నెగెటివ్ అనేది వ్యర్థం కన్నా కాస్త తక్కువ ఉంది. ఈ సంకల్ప శక్తిని స్వయం పట్ల మరియు విశ్వం పట్ల ఎంతైతే ఉపయోగించాలో, దానిని ఇంకా పెంచండి ఎందుకంటే సంకల్పాల ఆధారంగానే మాటలు మరియు కర్మలు ఉంటాయి, కావున సంకల్ప శక్తిని పరివర్తన చేయండి. ఏదైతే వ్యర్థము మరియు నెగెటివ్‌లో పోతుందో, దానిని పరివర్తన చేసి విశ్వ కళ్యాణము కొరకు కార్యములో ఉపయోగించండి. బాప్‌దాదా సంకల్పాల ఖజానాను సర్వ శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. అందుకే ఈ సంకల్పాల ఖజానా విషయంలో ఎకానమీ (పొదుపు) యొక్క అవతారమూర్తులుగా అవ్వండి. నేటి ఈరోజును అవతరణ రోజు అని అంటారు, కావున బాప్‌దాదాకు పిల్లలందరి పట్ల ఇదే శుభమైన ఆశ ఉంది - ఈరోజున శివుని అవతరణతో పాటు మీరందరూ ఎకానమీ (పొదుపు) యొక్క అవతారమూర్తులుగా అవ్వండి. సంకల్పాలలో పొదుపు చేసినట్లయితే అనగా వ్యర్థము నుండి రక్షించుకున్నట్లయితే, ఇక మిగిలిన అన్ని ఖజానాలూ స్వతహాగానే రక్షింపబడతాయి. మరి 99వ సంవత్సరంలో ఏమవుతుంది? 99 మొదలైపోయింది. 99లో ఏం జరుగుతుందో అని ఇంతకుముందు ఆలోచించేవారు. ఏమైనా జరిగిందా? ఫిబ్రవరి నెల కూడా వచ్చేసింది. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మీకేమిటి? మీకేమైనా నష్టమా? భయమా? ఏమవుతుందో అనే భయం ఉందా? మీ కొరకైతే మంచే జరుగుతుంది. ప్రపంచం విషయంలో ఏం జరిగినా కానీ మీరైతే నిర్భయులుగా, హర్షితముఖులుగా అయ్యి ఆటను చూడాలి. ఆటలో రక్తాన్ని కూడా చూపిస్తారు, అలాగే ప్రేమను కూడా చూపిస్తారు. యుద్ధాన్ని కూడా చూపిస్తారు, అలాగే మంచి విషయాలను కూడా చూపిస్తారు. మరి ఆటను చూస్తుంటే భయమనిపిస్తుందా? ఏమవుతుందో, ఏమైంది, ఏమైంది అని ఆలోచిస్తారా ఏమిటి? చాలా ఆనందంగా కూర్చుని చూస్తారు. మరి ఇది కూడా అనంతమైన ఆట. ఏం జరిగింది, ఏం జరిగింది... ఇలా అయితే జరిగి ఉండకూడదు, ఎందుకు అయ్యింది అని కొంచెం అయినా భయం కానీ, గాభరా కానీ ఉన్నట్లయితే ఇటువంటి స్థితి ఉన్నవారిపై ప్రభావం పడుతుంది. మంచిగా ఉన్నప్పుడు మంచి స్థితి, గడబిడ స్థితిలో స్వయము కూడా గడబిడలోకి వచ్చేస్తారు, అలజడిలోకి వచ్చేస్తారు, అందుకే 99వ సంవత్సరమైనా, 2000 సంవత్సరమైనా మీకేమిటి? ఆటను జరగనివ్వండి. మీరు ఆనందంతో చూడండి. అయ్యో, ఇలా అయ్యిందేమిటి అని గాభరా పడకండి! ఇది సంకల్పములోకి కూడా రాకూడదు. 99వ సంవత్సరంలో ఏమవుతుంది, ఏదైనా అవుతుందా? అవ్వదా? అని అందరూ అడుగుతున్నారు. బాప్‌దాదా అంటారు - బాగా శుభ్రపరచమని మీరే ప్రకృతికి సేవ ఇచ్చారు. శుభ్రం చెయ్యమని పెద్ద-పెద్ద చీపుర్లను ఇచ్చారు, మరి ఎందుకు గాభరాపడతారు. మీ ఆజ్ఞ అనుసారంగానే అది శుభ్రం చేయిస్తున్నప్పుడు మరి మీరెందుకు అలజడిలోకి వస్తారు? మీరే కదా ఆజ్ఞాపించింది కనుక అచలంగా, స్థిరంగా అయ్యి మనసు, బుద్ధిని పూర్తిగా శక్తిశాలిగా చేసుకుని అచలమైన, స్థిరమైన స్థితిలో స్థితులవ్వండి. ప్రకృతి ఆటను చూస్తూ వెళ్ళండి. గాభరాపడకండి. మీరు అలౌకికమైనవారు, అంతేకానీ సాధారణమైనవారు కారు. సాధారణమైనవారు అలజడిలోకి వస్తారు, గాభరాపడతారు. అలౌకికమైనవారు, మాస్టర్ సర్వ శక్తిమంతులైనవారు ఆటను చూస్తూ తమ విశ్వ కళ్యాణ కార్యములో బిజీగా ఉంటారు. ఒకవేళ మనసు-బుద్ధిని ఫ్రీగా ఉంచుకుంటే గాభరాపడతారు. మనసు-బుద్ధి ద్వారా లైట్ హౌస్‌గా అయ్యి, లైట్‌ను వ్యాపింపజేయాలి. ఈ కార్యములో బిజీగా ఉంటే బిజీగా ఉన్న ఆత్మకు భయం ఉండదు, సాక్షీతనము ఉంటుంది. ఏదైనా అలజడి వచ్చినా కానీ మీ బుద్ధిని సదా క్లియర్‌గా ఉంచుకోండి, ఎందుకు-ఏమిటి అన్నవాటిలో బుద్ధిని బిజీగా లేక భారంగా ఉంచుకోకండి, ఖాళీగా ఉంచండి. ఒక్క బాబా మరియు నేను... ఎప్పుడైతే సమయం అనుసారంగా ఉత్తరాలు, టెలిఫోన్, టి. వి. లేక ఇతర సాధనాలు ఏవైతే ఉన్నాయో, అవి చేరుకోకపోయినా సరే బాప్‌దాదా డైరెక్షన్ క్లియర్‌గా అందుతుంది. ఈ సైన్స్ సాధనాలను ఎప్పుడూ ఆధారంగా చేసుకోకండి. వాటిని ఉపయోగించండి కానీ ఆ సాధనాల ఆధారంగా మీ జీవితాన్ని తయారుచేసుకోకండి. ఒక్కోసారి సైన్స్ సాధనాలు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించలేకపోతారు, అందుకే సైలెన్స్ సాధనము అనేది ఎక్కడ ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, చాలా స్పష్టంగా మరియు చాలా త్వరగా ఉపయోగపడుతుంది. కానీ ఇందుకొరకు మీ బుద్ధి లైన్‌ను క్లియర్‌గా ఉంచుకోవాలి. అర్థమైందా! త్వరత్వరగా స్వర్ణిమ యుగము రావాలి అని మీరే ఆహ్వానిస్తున్నారు. మరి స్వర్ణిమ యుగములో ఈ శుభ్రత కావాలి కదా. ప్రకృతి చాలా మంచిగా శుభ్రపరుస్తుంది.
మరి ఈరోజున మామూలు సంకల్పం కాకుండా ఏ దృఢ సంకల్పాన్ని తీసుకున్నారు? ఎకానమీ యొక్క అవతారమూర్తులుగా అవ్వాల్సిందే. సంకల్పాలలోనైనా, మాటలలోనైనా, సాధారణ కర్మలలోనైనా ఎకానమీ (పొదుపు) ఉండాలి. మరియు రెండవ విషయము - సదా బుద్ధిని క్లియర్‌గా ఉంచుకోండి. దీనినే బాప్‌దాదా మరో మాటలో - సత్యమైన హృదయముపై బాబా రాజీ అవ్వటము అని అంటారు. సత్యమైన హృదయము, స్వచ్ఛమైన హృదయము. వర్తమాన సమయములో సత్యత మరియు స్వచ్ఛతల అవసరము ఉంది. హృదయములో కూడా సత్యత, పరివారములో కూడా సత్యత మరియు బాబాతో కూడా సత్యత. అర్థమైందా. ఈరోజు చెప్పాలనుకోలేదు, కానీ చెప్పేసాము. బాప్‌దాదాకు ప్రేమ ఉంది కదా, అందుకని ఏ కొంచెము బలహీనతనైనా కూడా బాప్‌దాదా చూడలేరు. బాప్‌దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరినీ తమ వలె సంపూర్ణంగా చూడాలని కోరుకుంటారు.
నలువైపులా అలజడి ఉంది, ప్రకృతిలోని అన్ని తత్వాలూ చాలా ఎక్కువగా అలజడి చేస్తున్నాయి, ఒక్కవైపు కూడా అలజడి లేకుండా లేదు, వ్యక్తుల అలజడి కూడా ఉంది, ప్రకృతి అలజడి కూడా ఉంది, ఈ సృష్టిలో నలువైపులా అలజడి ఉన్న ఈ సమయంలో మీరేం చేస్తారు? రక్షణా సాధనం ఏమిటి? క్షణములో మిమ్మల్ని మీరు విదేహులుగా, అశరీరులుగా లేక ఆత్మాభిమానులుగా చేసుకోండి, అప్పుడు అలజడిలో కూడా అచలంగా ఉండగలుగుతారు. దీనికి సమయం అయితే పట్టదు కదా? ఏమవుతుంది? ఇప్పుడు ప్రయత్నం చెయ్యండి - ఒక్క క్షణములో మనసు-బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ స్థిరపర్చగలరా? (డ్రిల్) దీనినే సాధన అని అంటాము. అచ్ఛా!
దేశ-విదేశాలలో నలువైపులా బాబా ప్రేమలో లవలీనులై ఉన్న ఆత్మలకు, సదా స్వయాన్ని బ్రహ్మాచారీ స్థితిలో ఉంచుకునే స్నేహీ, సహయోగీ పిల్లలకు, సదా ఏకనామీ మరియు ఎకానమీలను కార్యములో పెట్టే ధైర్యవంతులైన పిల్లలకు, సదా అలజడిలో కూడా అచలంగా ఉండే నిర్భయ ఆత్మలకు, సదా ఆనందాన్ని అనుభవిస్తూ బాబా సమీపంగా ఉండే పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పిల్లల కార్డులన్నీ అందాయి. బాప్‌దాదా చూస్తున్నారు, అందరూ పుట్టినరోజు శుభాకాంక్షల కార్డులు పంపారు, విదేశీయులు ప్రేమికుల రోజు కార్డులను పంపారు, ప్రేమ సాగరుడైన బాబా పిల్లలందరికీ శివరాత్రికి, అలాగే ప్రేమలో లవలీనమయ్యే రోజుకు కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
దాదీలతో:- ఫారెన్ కూడా బాగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు బాల్యం పూర్తయింది. ఇప్పుడు మంచిగా అనుభవిగా అయ్యారు. మొదట్లో ఉండే చిన్నతనం ఇప్పుడు మెజారిటీ సమాప్తం అయ్యింది. భారత దేశంలో కూడా వృద్ధి బాగుంది. 9 లక్షలు కావాలి, వారైతే తయారవుతున్నారు కదా. మాల కూడా తయారవుతుంది మరియు 9 లక్షల మంది కూడా తయారవుతున్నారు. ఇద్దరూ తయారవుతున్నారు. లాస్ట్ సో ఫాస్ట్ కూడా కొందరు తయారవుతున్నారు. బాగుంది. బాప్‌దాదా అయితే లాస్ట్ నంబర్ వారిపై కూడా సంతోషంగా ఉన్నారు. బాబానైతే గుర్తించారు కదా.
జెండా ఎగురవేసిన తర్వాత బాప్‌దాదా ద్వారా ఉచ్ఛరింపబడ్డ మధుర మహావాక్యాలు:-
ఈరోజు బాబా మరియు పిల్లలు ఇరువురి పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఎలా అయితే ఇప్పుడు అందరూ చాలా సంతోషంతో నాట్యం చేస్తున్నారో, అలాగే అమర భవ. ఈ జెండాను ఎగురవేయడం జరిగింది మరియు పుష్పాల వర్షం కురిసింది, అలాగే సదా మీ హృదయంలో బాబా స్మృతి అనే జెండా ఎగురుతూ ఉండాలి. క్రింద మీద అవ్వకూడదు. ఎప్పుడు కూడా స్మృతి అనే జెండా క్రిందకు రాకూడదు, పైకే ఉండాలి. అప్పుడు ప్రపంచం వారు అహో భాగ్యము, అహో బాబా అన్న పుష్పాల వర్షాన్ని ఆశీర్వాదాలతో కలపి మీ అందరిపై వేస్తారు. కనుక ఒకవైపు స్మృతి జెండాను ఎగురవేయండి, మరో వైపు, ఈరోజు బాబా నుండి ఈరోజు ఏ సందేశమైతే లభించిందో – ఎకానమీ అవతారమూర్తులుగా అవ్వాలి - ఈ దృఢ సంకల్పం యొక్క జెండా మీ హృదయంలో ఎగురుతూ ఉండాలి. అలాగే సేవల పట్ల సదా నలువైపుల సర్వాత్మల ఎదుట బాబాను ప్రత్యక్షం చేయాలన్న జెండాను ఎగురవేయండి. ఇది జెండా యొక్క మహత్వము. అందరూ బాబా మహిమను చేసే రోజు, ప్రత్యక్షత జెండా క్రిందకు వచ్చే రోజు తప్పకుండా వస్తుంది, ఆ రోజు రానే వచ్చింది. ఆధారాన్ని తీసుకుంటారు, సహారాదాత అయిన తండ్రి పిల్లలు మీరు, మాస్టర్ సహారాదాతలు. ఆ రోజు రానే వచ్చింది. అచ్ఛా!
నలువైపులా ఉన్న దేశాలు, పట్టణాలు, గ్రామాలలో నలువైపులా ఉన్న పిల్లలకు, అందులోనూ మొట్టమొదట చిన్న-చిన్న గ్రామాలలో ఉన్న పిల్లలకు ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎన్ని శుభాకాంక్షలను ఇవ్వాలి! మీరు ఎంత స్వీకరించగలరో, అంతకన్నా ఎక్కువ శుభాకాంక్షలు.
*** ఓంశాంతి ***
