‘‘వర్తమాన సమయము అనుసారముగా వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకుని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చెయ్యండి’’
ఈరోజు స్నేహ సాగరుడైన బాప్‌దాదా తమ అతి స్నేహి పిల్లలను కలుసుకుంటున్నారు. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. అమృతవేళ నుండే నలువైపులా ఉన్న పిల్లలు స్నేహ అలలలో తేలియాడుతున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మనసులోని స్నేహము మనోభిరాముడైన బాబా వద్దకు చేరుకుంది. బాప్‌దాదా కూడా పిల్లలందరికీ స్నేహానికి రిటర్న్‌లో స్నేహం మరియు సమర్థత యొక్క వరదానాన్ని ఇస్తున్నారు. ఈరోజును బాప్‌దాదా యజ్ఞ స్థాపనలో విశేషమైన పరివర్తన యొక్క రోజు అని అంటారు. ఈరోజున బ్రహ్మా బాబా గుప్త రూపములో బ్యాక్ బోన్‌గా (వెన్నెముకగా) అయ్యి తమ పిల్లలను సాకార రూపములో విశ్వ వేదికపై ప్రత్యక్షం చేసారు, అందుకే ఈరోజును పిల్లల ప్రత్యక్షతా రోజు అని అంటాము. సమర్థ రోజు అని అంటాము. విల్ పవర్ఇచ్చిన రోజు అని అంటాము. బ్రహ్మా బాబా గుప్త రూపంలో కార్యం చేయిస్తున్నారు. వారు వేరుగా లేరు, కలిసే ఉన్నారు, కేవలం గుప్త రూపములో చేయిస్తున్నారు. ఈ అవ్యక్త రోజు పిల్లల కార్యాన్ని తీవ్రగతిలోకి తీసుకువచ్చే రోజు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరికీ ఛత్రఛాయగా అయ్యి పాలనా కర్తవ్యాన్ని చేస్తున్నారు. తల్లి ఏ విధంగా పిల్లల కొరకు ఛత్రఛాయగా అవుతుందో అలాగే అమృతవేళ నుండి బ్రహ్మా తల్లి నలువైపులలో ఉన్న పిల్లల బాగోగులను చూసుకుంటుంటారు. సాకారములో పిల్లలు నిమిత్తులుగా ఉన్నారు కానీ భాగ్యవిధాత అయిన బ్రహ్మా తల్లి పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి పిల్లలకు విశేషంగా శక్తిని, ధైర్యాన్ని, ఉల్లాస-ఉత్సాహాలను ఇస్తూ పాలన చేస్తారు. శివబాబా అయితే ఎప్పుడూ తోడుగానే ఉంటారు కానీ విశేషంగా బ్రహ్మాకు పాలన యొక్క పాత్ర ఉంది.
ఈరోజున భాగ్యవిధాత అయిన బ్రహ్మా పిల్లలు ప్రతి ఒక్కరికీ విశేషంగా స్నేహానికి బదులుగా వరదానాల భాండాగారాన్ని భండారీగా అయ్యి పంచుతారు. పిల్లలు ఎవరైతే ఎంతగానో అవ్యక్త స్థితిలో స్థితులై మిలనాన్ని జరుపుకుంటారో, అటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికీ ఏ వరదానము కావాలంటే అది సహజంగా ప్రాప్తిస్తుంది. వరదానాల భాండాగారము తెరిచి ఉన్న భాండాగారము, ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ప్రాప్తించే శ్రేష్ఠమైన రోజు ఇది. స్నేహానికి రిటర్న్ ఏమిటంటే - సహజ వరదానాల కానుక. కానుక కోసం శ్రమ చెయ్యాల్సిన అవసరం ఉండదు, అది సహజంగా ప్రాప్తిస్తుంది. కానుకను అడగడం జరుగదు, అది స్వతహాగా ప్రాప్తిస్తుంది. పురుషార్థము చెయ్యటం ద్వారా వరదానాల అనుభూతి యొక్క ప్రాప్తి కలగటము వేరే విషయము కానీ ఈరోజున బ్రహ్మా తల్లి స్నేహానికి రిటర్న్‌లో వరదానాలను ఇస్తారు. మరి ఈరోజున అందరూ సహజ వరదానాన్ని ప్రాప్తి చేసుకున్న అనుభూతిని చేసారా? ఇప్పుడు కూడా సత్యమైన హృదయపూర్వకమైన స్నేహానికి రిటర్న్‌లో వరదానాన్ని ప్రాప్తి చేసుకోగలరు. వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సాధనము - హృదయపూర్వకమైన స్నేహము. ఎక్కడైతే హృదయపూర్వకమైన స్నేహము ఉంటుందో, ఆ స్నేహమనేది ఎటువంటి ఖజానా అంటే ఆ ఖజానా ద్వారా, బాప్‌దాదా నుండి ఏ అవినాశీ వరదానము కావాలంటే అది ప్రాప్తి చేసుకోగలరు. ఆ స్నేహ ఖజానా పిల్లలు ప్రతి ఒక్కరి వద్దా ఉందా? స్నేహ ఖజానా ఉంది కనుకనే చేరుకున్నారు కదా! స్నేహము లాక్కొని తీసుకువచ్చింది మరియు స్నేహములో ఉండటము చాలా సహజము. పురుషార్థపు శ్రమ చెయ్యాల్సిన అవసరము ఉండదు ఎందుకంటే స్నేహ అనుభవము ప్రతి ఆత్మకూ తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు స్నేహము చెల్లాచెదురైపోయి ఉంది, కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ ఇలా చెల్లాచెదురైపోయిన స్నేహాన్ని ఒక్కరితోనే జోడించారు ఎందుకంటే మొదట వేరు-వేరు సంబంధాలు ఉండేవి, ఇప్పుడు ఒక్కరిలోనే సర్వ సంబంధాలు ఉన్నాయి. కనుక సహజంగా స్నేహమంతా ఒక్కరితోనే ఉంది, అందుకే ప్రతి ఒక్కరూ నా బాబా అని అంటారు. స్నేహమనేది ఎవరితో ఉంటుంది? నా అనుకున్నవారితో. అందరూ నా బాబా అనే అంటారు కదా, లేక దాదీల బాబానా? మహారథుల బాబానా? అందరి బాబా కదా! ఈరోజున పిల్లలు ప్రతి ఒక్కరూ ఎన్ని సార్లు మనస్ఫూర్తిగా నా బాబా, నా బాబా అని అన్నారు. అందరూ నా బాబా, నా బాబా అని అంటూ ఆత్మిక సంభాషణ చేసారు కదా! మొత్తము రోజంతా ఏం చేసారు? స్నేహ పుష్పాలను బాప్‌దాదాకు అర్పించారు. బాప్‌దాదా వద్దకు చాలా మంచి-మంచి స్నేహ పుష్పాలు చేరుకుంటున్నాయి. స్నేహమైతే చాలా బాగా ఉంది, ఇప్పుడు బాబా అంటున్నారు - స్నేహ స్వరూపాన్ని సాకారములో ఇమర్జ్ చెయ్యండి. అదే సమానంగా అవ్వటము అంటే. ఇప్పుడు సమానంగా అవ్వాలన్న ఈ లక్ష్యమైతే అందరి వద్దా ఉంది, ఇప్పుడు సాకారములో లక్షణాలు కనిపించాలి. ఏ పిల్లలను చూసినా, ఎవరు కలిసినా, సంబంధ-సంపర్కములోకి ఎవరు వచ్చినా వారికి ఏ లక్షణాలు కనిపించాలంటే - పరమాత్మ తండ్రి యొక్క, బ్రహ్మా తండ్రి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, అవి పిల్లల ముఖం మరియు మూర్తి ద్వారా కనిపించాలి. వీరి నయనాలు, వీరి మాటలు, వీరి వృత్తి మరియు వైబ్రేషన్లు అన్నీ అతీతముగా ఉన్నాయని అనుభవం చేయాలి. మధుబన్కు వస్తే ఇక్కడ బ్రహ్మా బాబా యొక్క కర్మలు సాకారములో ఉండిన కారణంగా ఈ భూమిలో తపస్య, కర్మ మరియు త్యాగము యొక్క వైబ్రేషన్లు నిండి ఉన్న కారణంగా - ఈ ప్రపంచము అతీతమైనది అని ఇక్కడ సహజ అనుభవమును చేస్తారు ఎందుకంటే బ్రహ్మా బాబా మరియు విశేషమైన పిల్లల యొక్క వైబ్రేషన్లతో వాయుమండలము అలౌకికమైనదిగా తయారైంది. అలాగే పిల్లలు ఎవరు ఎక్కడ ఉంటున్నా కానీ, కర్మక్షేత్రము ఏదైనా కానీ, పిల్లలు ప్రతి ఒక్కరి ద్వారా బాబా సమానమైన గుణాలు, కర్మలు మరియు శ్రేష్ఠ వృత్తి యొక్క వాయుమండలము అనుభవంలోకి రావాలి, దీనినే బాప్‌దాదా - బాబా సమానంగా అవ్వటము అని అంటారు. బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న సంకల్పము ఏదైతే ఇప్పటివరకూ ఉందో, ఆ సంకల్పము ఇప్పుడు ముఖము మరియు నడవడిక ద్వారా కనిపించాలి. సంబంధ-సంపర్కములోకి ఎవరు వచ్చినా కానీ, వారి మనసులో నుండి - ఈ ఆత్మలు బాబా సమానమైనవారు అని రావాలి. (మధ్య మధ్యలో దగ్గు వస్తూ ఉంది). ఈరోజు మైక్ సరిగా లేదు, కానీ కలుసుకోవాలి కదా. ఇది కూడా మైక్యే కదా, ఈ మైక్ పని చెయ్యకపోతే ఈ స్థూలమైన మైక్ కూడా పనికిరాదు. ఏం ఫరవాలేదు, ఇది కూడా ఈ సీజన్ యొక్క ఫ్రూట్.
బాప్‌దాదా ఇప్పుడు పిల్లలందరి నుండి ఈ ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. ఏ విధంగా వాణి ద్వారా ప్రత్యక్షతను చేసినప్పుడు వాణి యొక్క ప్రభావము పడుతుందో, దాని కంటే కూడా గుణాలు మరియు కర్మల యొక్క ప్రభావము ఎక్కువగా పడుతుంది. వీరి నయనాలలో ఏదో విశేషత ఉంది అని పిల్లలు ప్రతి ఒక్కరి నయనాల ద్వారా అనుభవమవ్వాలి. అవి సాధారణమైనవిగా అనుభవం అవ్వకూడదు. అలౌకికమైనవి అని అనిపించాలి. వారి మనసులో ప్రశ్న తలెత్తాలి - వీరు ఇలా ఎలా తయారయ్యారు, ఎక్కడి నుండి తయారయ్యారు. వీరిని తయారుచేసినవారు ఎవరు అని వారంతట వారే ఆలోచించాలి మరియు అడగాలి. ఏ విధంగానైతే ఈరోజుల్లో ఏదైనా గొప్ప వస్తువుని చూస్తే - దీనిని తయారుచేసినవారు ఎవరు అని మనసులో అనిపిస్తుందో, అదే విధంగా బాబా సమానముగా తయారయ్యే మీ స్థితి ద్వారా బాబాను ప్రత్యక్షం చెయ్యండి. ఈరోజుల్లో మెజారిటీ ఆత్మలు ఎలా ఆలోచిస్తారంటే - ఈ సాకార సృష్టిలో, ఈ వాతావరణములో ఉంటూ ఇలా కూడా ఎవరైనా తయారవ్వగలరా! కనుక మీరు వారికి - అలా తయారవ్వగలరు మరియు మేము తయారయ్యాము అని ప్రత్యక్షంగా చూపించండి. ఈరోజుల్లో ప్రత్యక్ష ఋజువును ఎక్కువ నమ్ముతారు. వినేదానికన్నా ఎక్కువగా చూడాలనుకుంటారు, కనుక నలువైపులా ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో, ఆ పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా తయారైతే, ఇక అంగీకరించటానికి మరియు తెలుసుకోవటానికి ఎక్కువ శ్రమ అనిపించదు. అప్పుడు మీ ప్రజలు చాలా త్వరత్వరగా తయారైపోతారు. శ్రమ, సమయము తక్కువ పడ్తాయి మరియు ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుభవము చెయ్యటం వలన ప్రజ అనే స్టాంప్ పడుతుంది. రాజు-రాణిగా తయారయ్యేవారైతే మీరే కదా!
బాప్‌దాదా ఒక విషయంలో మళ్ళీ అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు - వర్తమాన వాయుమండలము అనుసారంగా మనసులో, హృదయంతో ఇప్పుడు వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ, వారు ప్రవృత్తిలో ఉన్నా లేక సేవాకేంద్రాలలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా సరే, స్థూల సాధనాలను ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. తినడానికి, త్రాగడానికి, ఉండటానికి కావలసిన సాధనాలు లేని పిల్లలు ఎవ్వరూ లేరు. అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటూ అవసరమైన సాధనాలు ఏవైతే ఉన్నాయో, అవి అందరి వద్దా ఉన్నాయి. ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే అందుకు కారణము వారి నిర్లక్ష్యము మరియు సోమరితనమే. ఇకపోతే డ్రామానుసారంగానైతే అవసరమైన సాధనాలు అందరి వద్ద ఉన్నాయన్న విషయము బాప్‌దాదాకు తెలుసు. అవసరమైన సాధనాలు ఏవైతే ఉన్నాయో, అవి అవసరమే కానీ అక్కడక్కడ అవసరాలకు మించిన సాధనాలు ఉన్నాయి. సాధన తక్కువగా ఉంది మరియు సాధనాలను ఉపయోగించటము లేక ఉపయోగించేలా చెయ్యటము ఎక్కువగా ఉంది, అందుకే బాప్‌దాదా బాబా సమానంగా అయ్యే ఈరోజున విశేషంగా అండర్ లైన్ చేయిస్తున్నారు - సాధనాల ప్రయోగం యొక్క అనుభవాన్ని చాలానే చేసారు, ఏదైతే చేసారో అది చాలా బాగా చేసారు, ఇప్పుడు సాధనను పెంచండి అనగా అనంతమైన వైరాగ్య వృత్తిని తీసుకురండి. బ్రహ్మా బాబాను చూసారు కదా, చివరి క్షణం వరకు పిల్లలకు ఎన్నో సాధనాలను ఇచ్చారు కానీ స్వయం సాధనాల ప్రయోగానికి దూరంగా ఉన్నారు. అన్నీ ఉంటూ కూడా వాటికి దూరంగా ఉండటము - దీనినే వైరాగ్యము అని అంటాము. కానీ అసలు తమ వద్ద ఏమీ లేనప్పుడు, మాకైతే వైరాగ్యము ఉంది, మేము ఉన్నదే వైరాగులుగా అని అంటే, అది ఎలా కుదురుతుంది. ఆ విషయం వేరు. అన్నీ ఉంటూ కూడా, జ్ఞానం మరియు విశ్వ కళ్యాణ భావనతో, బాబాను మరియు స్వయాన్ని ప్రత్యక్షము చేసే భావనతో, ఇప్పుడు సాధనాలకు బదులుగా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండాలి. ఏ విధంగా స్థాపన ఆదిలో సాధనాలు తక్కువేమీ లేవు, కానీ అనంతమైన వైరాగ్య వృత్తి అనే భట్టీలో ఉన్నారు. 14 సంవత్సరాలు ఏదైతే తపస్య చేసారో, అప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండేది. బాప్‌దాదా ఇప్పుడు సాధనాలు ఎన్నో ఇచ్చారు, ఇప్పుడు సాధనాలకు ఏ లోటూ లేదు, కానీ అన్నీ ఉంటూ కూడా అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి. విశ్వాత్మల కళ్యాణము కొరకు కూడా ఈ సమయములో ఈ విధి యొక్క అవసరం ఉంది ఎందుకంటే నలువైపులా కోరికలు పెరిగిపోతున్నాయి, కోరికలకు వశమై ఆత్మలు చింతలో ఉన్నారు, వారు పదమపతులైనా సరే, కోరికల కారణంగా వారు కూడా చింతలో ఉన్నారు. వాయుమండలంలో ఆత్మల చింతకు విశేష కారణము ఈ హద్దు కోరికలు. ఇప్పుడు మీరు మీ అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా ఆ ఆత్మలలో కూడా వైరాగ్య వృత్తిని వ్యాపింపజేయండి. మీ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలు సుఖంగా, శాంతిగా అవ్వలేరు, చింత నుండి విముక్తి చెందలేరు. మీరు వృక్షము యొక్క వేర్లు. వృక్షంలో బ్రాహ్మణుల స్థానాన్ని ఎక్కడ చూపించారు? వేర్లలో చూపించారు కదా! కనుక మీరు పునాదివంటివారు, మీ అల విశ్వములో వ్యాపిస్తుంది, అందుకే బాప్‌దాదా విశేషంగా సాకారంలో బ్రహ్మా బాబా సమానంగా అయ్యే విధి అయిన వైరాగ్య వృత్తి వైపుకు విశేష అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు. వీరు సాధనాలకు వశమైనవారు కారు, సాధనలో ఉండేవారు అని ప్రతి ఒక్కరి ద్వారా అనుభవమవ్వాలి. అన్నీ ఉంటూ కూడా వైరాగ్య వృత్తి ఉండాలి. అవసరమైన సాధనాలను ఉపయోగించుకోండి కానీ ఎంత వీలైతే అంత హృదయపూర్వకమైన వైరాగ్య వృత్తితో ఉపయోగించండి, అంతేకానీ సాధనాలకు వశీభూతులై కాదు. ఇప్పుడు సాధన యొక్క వాయుమండలాన్ని నలువైపులా తయారుచెయ్యండి. సమయ సమీపత ప్రమాణంగా ఇప్పుడు సత్యమైన తపస్య లేక సాధన అంటేనే అనంతమైన వైరాగ్యము. ఈ సంవత్సరము సేవ విస్తారము చాలానే చేసారు. ఈ సంవత్సరము నలువైపులా పెద్ద-పెద్ద ప్రోగ్రాములను చేసారు మరియు ఆ సేవ ద్వారా సహయోగి ఆత్మలు కూడా చాలామంది తయారయ్యారు, సమీపంగా వచ్చారు, సంపర్కములోకి వచ్చారు, కానీ కేవలము సహయోగులుగా మాత్రమే తయారుచేయాలా? అంతవరకే ఉంచాలా? సహయోగి ఆత్మలు చాలా మంచి మంచివారు ఉన్నారు, ఇప్పుడు ఆ సహయోగి క్వాలిటీ ఆత్మలను మరింత సంబంధములోకి తీసుకురండి. అనుభవము చేయించండి, దాని ద్వారా వారు సహయోగుల నుండి సహజయోగులుగా అయిపోవాలి. దీని కొరకు ఒకటేమో సాధన యొక్క వాయుమండలము ఉండాలి మరియు రెండవది, అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలము ఉండాలి, వీటి ద్వారా సహయోగులు సహజంగా సహజయోగులుగా అయిపోతారు. వారి సేవ చేస్తూ ఉండండి కానీ దానితోపాటు సాధన మరియు తపస్య యొక్క వాయుమండలం ఉండటము అవసరము.
ఇప్పుడు నలువైపులా శక్తిశాలీ తపస్య చెయ్యాలి, ఆ తపస్య మనసా సేవకు నిమిత్తంగా అవ్వాలి, అటువంటి శక్తిశాలీ సేవను ఇప్పుడు తపస్య ద్వారా చెయ్యాలి. ఇప్పుడు మనసా సేవ ద్వారా అనగా సంకల్పాల ద్వారా సేవ యొక్క టచింగ్ లభించాలి, ఇప్పుడు దాని అవసరము ఉంది. సమయము సమీపంగా వస్తూ ఉంది, నిరంతర స్థితులు మరియు నిరంతర శక్తిశాలీ వాయుమండలం యొక్క అవసరము ఉంది. బాబా సమానంగా అవ్వాలంటే ముందు అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చెయ్యండి. బ్రహ్మా బాబాలో అంతిమము వరకు ఇదే విశేషతను చూసారు. వైభవాల పట్లా ఆకర్షణ లేదు, పిల్లల పట్లా మోహము లేదు... అన్నింటి నుండి వైరాగ్య వృత్తి ఉండేది. కనుక ఈరోజున బాబా సమానంగా అయ్యే పాఠాన్ని పక్కా చేసుకోండి. బ్రహ్మా బాబా సమానంగా తయారవ్వాల్సిందే, అంతే. ఇటువంటి దృఢ నిశ్చయము తప్పకుండా ముందుకు తీసుకువెళ్తుంది.
ఇకపోతే పిల్లలందరూ ఈరోజు ప్రైజ్ లభించాలి కదా అని ఆలోచిస్తుండవచ్చు. ఇప్పుడు చూడండి, నలువైపులలోని పిల్లలు ఇక్కడ లేరు కదా, మరి ఇక్కడకు వచ్చిన మీకు మాత్రమే ప్రైజ్ ఇవ్వమంటారా! ప్రైజ్ అయితే ఉండనే ఉంది, కానీ బాప్‌దాదా అంటారు – ప్రతి ఒక్కరూ పూర్తి సంవత్సరంలో సర్వ బంధనాల నుండి ముక్తులై ఉండాలి. లిస్ట్ తయారు చేసారు కదా. చేతినైతే చాలా సహజంగా ఎత్తుతారు. చేతిని ఎత్తమంటే చాలా రకాలుగా చేతిని ఎత్తుతారు అని బాప్‌దాదాకు తెలుసు అయినాగానీ బాప్‌దాదా అంటారు, ఏ చెకింగ్‌తో అయితే మీరు చేతులెత్తడానికి తయారయ్యారో, ఎంత తయారయ్యారు, ఎవరు తయారయ్యారు అన్నది బాప్‌దాదాకు తెలుసు. ఇప్పుడు కూడా మరింత అంతర్ముఖిగా అయ్యి సూక్ష్మ చెకింగ్ చేసుకోండి. సరే, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు, కానీ ఎంతగా అయితే సుఖము యొక్క ఖాతా జమ అవ్వాలో అంత అయిందా? నారాజ్ (కోపం) తెప్పించలేదు, కానీ రాజీ చేసారా? వ్యర్థము ఆలోచించలేదు కానీ వ్యర్థానికి బదులు శ్రేష్ఠ సంకల్పాలు జమ అయ్యాయా? అందరిపట్ల శుభ భావనను పెట్టారు కానీ శుభ భావనకు రెస్పాన్స్ లభించిందా? వారు మారినా మారకపోయినా గానీ, మీరు వారితో సంతుష్టంగా ఉన్నారా? ఇటువంటి సూక్ష్మ చెకింగ్ మీ గురించి మీరు చేసుకోండి. ఇటువంటి సూక్ష్మ చెకింగ్‌లో పాస్ అయితే చాలా మంచిది. ఈ విధంగా పాస్ అయిన ఆత్మలు తమ-తమ సేవాకేంద్రములో తమ పేరును, అన్ని విషయాలలో రిజల్ట్ ఎంత శాతం ఉంది? ఎంత సుఖాన్ని ఇచ్చారు? ఎంత రాజీగా ఉన్నారు? నారాజ్‌గా ఉన్నవారిని రాజీ చేసారా? లేక రాజీగా ఉన్నవారినే రాజీ చేసారా? వీటన్నింటినీ చెకింగ్ చేసుకుని, రిజల్ట్ పాస్ విత్ ఆనర్ అయితే మీ పేరును మీ టీచర్‌కు వ్రాసి ఇవ్వండి. చిన్న-చిన్న సెంటర్ల టీచర్లు వారిపైనున్న పెద్దక్కయ్యలకు ఈ వివరాలు ఇవ్వండి, తర్వాత జోన్ వద్దకు అన్ని పేర్లు రావాలి. జోన్ వద్ద అన్ని పేర్లను జమ చేసిన తర్వాత ఆ పాస్ అయిన వారి పేర్లను మధుబన్కు పంపండి, అప్పుడు కానుక లభిస్తుంది. అప్పుడు చప్పట్లు మ్రోగుతాయి. ఎవరైతే ఈ విధంగా పాస్ విత్ ఆనర్ అయ్యారో వారికి కానుక లభించవలసిందే, అదైతే లభిస్తుంది, కానీ సత్యమైన మనసుతో, సత్యమైమ తండ్రికి మీ సత్యమైన చార్టును వినిపించండి మరియు ప్రైజ్ తీసుకోండి ఎందుకంటే బాప్‌దాదా వద్దకు అందరి సంకల్పాలు చేరుకుంటాయి. కనుక, ఎవరైతే చేతులు ఎత్తుతున్నారో వారిలో మిక్స్ వారు ఉండటాన్ని బాప్‌దాదా చూసారు మరియు అర్థం తెలుసుకోకుండా చేతులెత్తుతున్నారు. మరి మిక్స్ వారు చేతులెత్తి బాప్‌దాదా ప్రైజ్ ఇవ్వకపోతే బాగుండదు. కనుక పద్ధతి ప్రకారంగా పాస్ విత్ ఆనర్‌గా ఉంటే వారి యొక్క మహిమ చాలా-చాలా ఉంటుంది. అటువంటి వారి పేరు బ్రాహ్మణులందరిలో ప్రసిద్ధి అవ్వాలి. మంచిది, మెజారిటీ వారు చాలా మంచి శ్రమ చేసారు, అటెన్షన్ ఉంచారు కానీ విషయము సంపూర్ణత గురించినది. ఎవరైతే కష్టపడ్డారో వారికి ఈరోజు ప్రైజ్ బదులు అభినందనలు ఇస్తాము. తర్వాత కానుకను ఇస్తాము. సరేనా!
అచ్ఛా – రెండవ విషయము – అన్ని జోన్ వారు మార్చి నెలకల్లా మైక్‌లను తీసుకురావాలి, అందరికీ ఈ విషయం గుర్తుంది కదా! ముందుగా మార్చిలో బాప్‌దాదా జోన్ వారి నుండి రిజల్ట్ తీసుకుంటారు, ఎవరు, ఏ క్వాలిటీ మైక్‌లను తయారు చేసారు! మీరు వారిని మైక్ అని అంటారు కానీ వారు చిన్న మైక్ అవ్వచ్చు. ఉదాహరణకు, వారు నగరానికి మైక్ అయ్యి ఉండవచ్చు కానీ జోన్ స్థాయిలో మైక్ కాకపోవచ్చు, అప్పుడు వారిని చిన్న మైక్ అంటాము కదా. ఈ విధంగా ఎటువంటి మైక్‌లను తయారు చేసారు అని బాప్‌దాదా అడుగుతారు. ఒకవేళ ఏదైనా జోన్ వారు చివరి టర్న్‌లో రాలేకపోతే వారి చిట్టీని పంపినా సరిపోతుంది. అప్పుడు బాప్‌దాదా ఆ మైక్లందరి సంగఠన తయారు చేసి ప్రోగ్రాము పెడతారు, అందులో అన్ని వైపుల నుండి ఉన్న మైక్‌లు స్టేజీ మీదకు వస్తారు. వారికి విశేషంగా ప్రోగ్రాము పెడదాము. మార్చిలో మైక్‌లను కూడా తీసుకురాకండి, మైక్‌లను అక్కడే ఉండనివ్వండి, మీరు రండి. మైక్ ఎవరైతే ఉంటారో వారిని ఎంతో ఆర్భాటంగా ఆహ్వానించాలి కదా. వారి స్వాగతం కూడా మంచిగా జరగలి కదా. కనుక వారికోసం స్పెషల్ ప్రోగ్రాము పెడదాము, తర్వాత ప్రైజ్ ఇద్దాము, నంబరువన్, టూ, థ్రీ. సరేనా! జోన్ వారికి స్పష్టమయిందా? మర్చికల్లా రిజల్ట్‌ను తీసుకురావాలి. అచ్ఛా.
ఇప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి? ఏ విషయాన్ని అండర్ లైన్ చేసారు? అనంతమైన వైరాగ్యము. ఇప్పుడు ఆత్మలను కోరికల నుండి రక్షించండి. పాపం, వారు చాలా దుఃఖితులుగా ఉన్నారు. చాలా చింతలో ఉన్నారు. కనుక ఇప్పుడు దయార్ద్ర హృదయులుగా అవ్వండి. దయ అనే అలను అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా వ్యాపింపజేయండి. ఇప్పుడు అందరూ ఉన్నతోన్నతమైన పరంధామములో బాబాతో పాటు కూర్చుని సర్వాత్మలకు దయా దృష్టిని ఇవ్వండి, వైబ్రేషన్లను వ్యాపింపజేయండి. వ్యాపింపజేయగలరు కదా? కనుక ఇప్పుడు ఇక పరంధామములో బాబాతోపాటు కూర్చుండిపోండి. అక్కడి నుండి ఈ అనంతమైన దయ యొక్క వాయుమండలాన్ని వ్యాపింపజేయండి. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా!
నలువైపుల ఉన్న అతి స్నేహీ పిల్లలందరికీ, నలువైపులా సాధన చేసే శ్రేష్ఠ ఆత్మలందరికీ, బాప్‌దాదాకు మొత్తం రోజంతా చాలా ప్రియాతి-ప్రియమైన, మధురాతి-మధురమైన హృదయపూర్వకమైన పాటలను వినిపించేవారికి, ఆత్మిక సంభాషణ చేసే శక్తులకు, గుణాల వరదానాలతో జోలెను నింపుకునేవారికి, బాప్‌దాదాకు అందరి పాటలు, సంతోషంతో కూడిన పాటలు, స్నేహంతో కూడిన పాటలు, ఆత్మిక నషాతో కూడిన పాటలు, మధురాతి మధురమైన విషయాలు, మనసును చాలా-చాలా మురిపించే పాటలు వినిపించాయి మరియు బాప్‌దాదా కూడా వాటిని వినటంలో మరియు కలుసుకోవటంలో లవలీనులై ఉన్నారు. ఇలా సత్యమైన మనసుతో, మనసులోని మాటలను వినిపించే పిల్లలు చాలా మహానులు మరియు సదా మహానులుగా ఉంటారు, ఇలాంటి మధురాతి-మధురమైన పిల్లలకు, సదా అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేసేవారికి, దృఢ నిశ్చయబుద్ధి కల పిల్లలకు, బాప్‌దాదా ఒకటికి బదులుగా పదమా రెట్ల స్నేహాన్ని రిటర్న్ ఇస్తున్నారు. మనోభిరాముని మనసులో ఉండే పిల్లలందరికీ చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఎవరైతే బయట ఉండి వింటున్నారో, వారిని కూడా బాబా చూస్తున్నారు మరియు బాప్‌దాదా వారిని దూరంలో ఉన్నవారిగా చూడరు, అన్నివైపులా ఉన్న పిల్లలను సమ్ముఖంగా చూస్తూ ప్రియస్మృతులను మరియు శుభాకాంక్షలను ఇస్తున్నారు. సదా ఎగిరే కళలో ఎగిరే పిల్లలూ, ఎల్లప్పుడూ సంపన్నంగా ఉన్నారు మరియు ఎల్లప్పుడూ సంపన్నంగానే ఉంటారు అని అంటూ స్మృతి కానుకలకు మరియు స్మృతి పత్రాలకు రిటర్న్ ఇస్తున్నారు. అచ్ఛా!
దాదీజీతో:- ఈరోజును స్మృతి దివసము అంటారు, మరి ఏమి స్మృతిలో ఉంది? సమర్థత అన్న వరదానము గుర్తుందా? మీకైతే డైరెక్టుగా విల్ చేసారు కదా! మీ పాత్రను మంచిగా చేస్తున్నారు. బాప్‌దాదా చూస్తున్నారు, వృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఈ వృద్ధి సేవకు నిదర్శనం. పిల్లల సేవను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. బాబా గుప్తమైపోయారు, ఇప్పుడు నోటిలో ఏముంది? అందరి నోటిలో, ఎదురుగా పిల్లలే ఉన్నారు, బ్రహ్మా కుమారీలు చాలా మంచి పని చేస్తున్నారు అంటున్నారు అంటే పిల్లలు ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు బాబా ప్రత్యక్షమవ్వాలి. బాబా ముందు పిల్లలను ప్రత్యక్షం చేసారు. ఇప్పుడు బాబా ప్రత్యక్షం అయితే ఇక సమాప్తి జరిగిపోతుంది కదా. అందుకే ముందు పిల్లలు ప్రత్యక్షమవుతున్నారు తర్వాత బాబా ప్రత్యక్షమవుతారు. చాలా బాగా చేస్తున్నారు, సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి, ఇప్పుడు నిర్విఘ్నంగా అయ్యే అలను ఎక్కువ వ్యాప్తి చేయండి. ఈ అల కూడా వ్యాపిస్తే సహజమైపోతుంది.
ఇప్పుడు అన్ని వైపుల వాతావరణం మంచిగా ఉండింది (అందరూ స్నేహంలో మునిగిపోయారు) రోజు యొక్క మహత్వం ఉంటుంది. ఈరోజు యొక్క మహత్వం ఉంది. (దాదీ జానకిగారు ప్రత్యేకమైన స్మృతిని అందించారు). అచ్ఛా
*** ఓంశాంతి ***
