‘‘ఈ క్రొత్త సంవత్సరంలో ధైర్యము ఆధారంగా స్వయాన్ని శ్రమ నుండి ముక్తులుగా, సదా విజయులుగా అనుభవము చెయ్యండి’’
ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్‌దాదా తమ అతి స్నేహీ, సదా సహయోగీ మరియు అతి సమీపమైన పిల్లలకు నవ యుగము, క్రొత్త జీవితము మరియు క్రొత్త సంవత్సరము కొరకు అభినందనలను తెలిపేందుకు వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు అతి స్నేహముతో బాప్‌దాదాను మనసులో సమ్ముఖంగా ఉంచుకుని అభినందనలను స్వీకరిస్తున్నారు. బాప్‌దాదా పిల్లలలో క్రొత్త సంవత్సరము యొక్క ఉల్లాస-ఉత్సాహాలను చూసి హర్షిస్తున్నారు. మెజారిటీ పిల్లలలో, దూరంగా కూర్చున్నవారిలోనైనా, సమీపంగా కూర్చున్నవారిలోనైనా, అందరి మనసులలో - ఈ సంవత్సరములో నవీనతను చేసే చూపిస్తాము అన్న ఉల్లాస-ఉత్సాహాలే ఉన్నాయి. స్వ పరివర్తనలోనైనా, సేవా సఫలతలోనైనా, ప్రతి ఆత్మను శుభ భావన, శుభ కామనలతో పరివర్తన చెయ్యటంలోనైనా ఉల్లాసమూ బాగుంది, ఉత్సాహము కూడా చాలా బాగుంది. వాటితోపాటు ధైర్యము కూడా యథాశక్తిగా ఉంది. బాప్‌దాదా ధైర్యము కల ఇటువంటి పిల్లలకు ఒక్క సంకల్పానికి పదమా రెట్ల సహాయాన్ని తప్పకుండా అందిస్తారు. అందుకే ధైర్యముతో సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ కూడా స్వయం పట్ల గానీ లేక ఇతర ఆత్మల పట్ల గానీ ధైర్యాన్ని తగ్గనివ్వకండి ఎందుకంటే ఈ నవ యుగము ఉన్నదే ధైర్యాన్ని ఉంచడం ద్వారా ఎగిరే యుగము, వరదానీ యుగము, పురుషోత్తమ యుగము, డైరెక్టుగా విధాత ద్వారా సర్వ శక్తులు వారసత్వముగా సహజముగా ప్రాప్తించే యుగము, అందుకే ఈ యుగము యొక్క మహత్వాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఏ కార్యాన్ని ప్రారంభిస్తున్నా సరే, అది స్వ పురుషార్థమైనా, విశ్వ సేవ అయినా, సదా ధైర్యము మరియు బాప్‌దాదా సహాయముతో ఈ నిశ్చయము తప్పకుండా ఉంటుంది, అదేమిటంటే - స్వ పురుషార్థంలో మరియు సేవలో సఫలత ఉండనే ఉంది, ఇది అవ్వాల్సిందే, అసంభవము సంభవము అవ్వాల్సిందే ఎందుకంటే ఈ యుగము సఫలతా యుగము, అసంభవము సంభవమయ్యే యుగము. అందుకే అవుతుందా, అవ్వదా, ఎలా అవుతుంది అన్న ఇలాంటి ప్రశ్నలు ఈ యుగములో బ్రాహ్మణ ఆత్మలైన మీ కొరకు లేనే లేవు. బ్రాహ్మణుల జన్మపత్రికలో - సఫలత మీ జన్మ సిద్ధ అధికారము అని ఉంది. అధికారీ ఆత్మలు ఇలా ఆలోచించాల్సిన అవసరమే లేదు. వారసత్వము లభించాల్సిందే.
కనుక క్రొత్త సంవత్సరములో ఈ విశేష స్మృతిని ఇమర్జ్ చేసుకోండి - అన్ని వైపుల నుండి సఫలత అనేది శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మనైన నా అధికారముగా ఉండనే ఉంది. ఈ నిశ్చయముతో, ఆత్మిక నషాతో ఎగురుతూ వెళ్ళండి (అభిమానముతో కూడిన నషా కాదు, ఆత్మిక నషా). నిశ్చయ బుద్ధి కలవారు సదా ప్రతి కార్యములో విజయులుగా ఉండనే ఉంటారు. ఇటువంటి నిశ్చయబుద్ధి కల బ్రాహ్మణ ఆత్మల మస్తకముపై విజయానికి చెందిన భాగ్యరేఖ సదా ఉండనే ఉంది. విజయి తిలకము సదా మస్తకముపై మెరుస్తూ ఉంది. అందుకే ఈ సంవత్సరాన్ని సదా విజయి సంవత్సరముగా అనుభవం చేస్తూ వెళ్ళండి. ఇటువంటి నిశ్చయము మరియు నషా ఉన్నాయా? డబల్ విదేశీయులకు ఉన్నాయా? డబల్ విదేశీయులు తెలివైనవారు (అందరూ చేతులు ఊపారు) చాలా మంచిది. తిలకము కనిపిస్తూ ఉంది. భారతవాసులైతే ఉన్నదే భాగ్యవంతులుగా, ఎందుకని? భారత్ యొక్క భూమియే భాగ్యవంతమైనది. అందుకే విదేశీయులైనా, భారతవాసులైనా ఇరువురూ భాగ్యవిధాత పిల్లలే, కనుకనే బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ విజయులు. కేవలం ధైర్యాన్ని ఇమర్జ్ చేయండి. మీలో ధైర్యము ఇమిడి ఉంది ఎందుకంటే మీరు మాస్టర్ సర్వశక్తిమంతులు. అలానే ఉన్నారు కదా? (అందరూ చేతులూపుతున్నారు) చేతులైతే చాలా బాగా ఊపుతారు. ఇప్పుడు మనసు ద్వారా కూడా సదా ధైర్యమనే చేతిని ఊపుతూ ఉండండి. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది - నా ఒక్కొక్క బిడ్డ అనేక సార్ల యొక్క విజయులు అని. ఒక్కసారి కాదు, మీరు అనేక సార్లు యొక్క విజయీ ఆత్మలు. కావున, ఏమవుతుందో తెలియదు అని ఎప్పుడూ ఆలోచించకండి. ఏమవుతుందో ఏమో అన్న ఈ మాటను ఎప్పుడూ తీసుకురాకండి. విజయము ఉంది మరియు సదా ఉంటుంది. అందరూ పక్కాగా ఉన్నారా? చాలా మంచిది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి – దాదీలూ, బాబా, మాయ వచ్చేసింది అని ఇటువంటి బలహీన సమాచారాన్ని వ్రాయకండి, ఇలా వ్రాయకండి. మీరు మాయాజీతులు. మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు, ఈ ఆత్మిక నషాను ఇమర్జ్ చేసుకోండి. వేరే-వేరే కార్యాలలో మనసు మరియు బుద్ధి బిజీ అయిపోతాయి కదా, అప్పుడు నషా మర్జ్ అయిపోతుంది. కానీ మధ్యమధ్యలో చెక్ చేసుకోండి - కర్మలు చేస్తున్నప్పుడు కూడా ఈ విజయము యొక్క ఆత్మిక నషా ఉంటుందా? నిశ్చయము ఉన్నట్లయితే నషా కూడా తప్పకుండా ఉంటుంది. నిశ్చయానికి గుర్తు నషా మరియు నషా ఉన్నట్లయితే తప్పకుండా నిశ్చయము ఉంటుంది. రెండింటికీ సంబంధము ఉంది. అందుకే ఇప్పుడు ఈ 99 సంవత్సరంలో మీ నషాను సదా ఇమర్జ్ రూపంలో ఉంచుకోండి, అప్పుడు పొరపాట్లు లేనివారిగా అయిపోతారు. పొరపాట్లూ ఉండవు, శ్రమ ఉండదు. బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - పిల్లలు శ్రమ పడడాన్ని చూస్తే, యుద్ధము చెయ్యడాన్ని చూస్తే, పిల్లలు ఆ విధంగా శ్రమించడం బాబాకు మంచిగా అనిపించదు, అందుకే ఈ క్రొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటారు? ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారు. నెగెటివ్‌ను, వ్యర్థాన్ని సమాప్తము చేసినట్లయితే ఈ సంవత్సరము ఆటోమేటిక్‌గా శ్రమ నుండి ముక్తులుగా అయ్యే సంవత్సరంగా అవుతుంది. అందరూ ఆనందంలో ఉండేవారు, అంతేకానీ శ్రమించేవారు కారు. ఆనందం మంచిగా అనిపిస్తుందా లేక శ్రమ మంచిగా అనిపిస్తుందా? ఆనందం మంచిగా అనిపిస్తుంది కదా? కనుక ఈ సంవత్సరము మనసులో, సంకల్పాలలో కూడా శ్రమ నుండి ముక్తులుగా ఉండాలి.
మేము ఇప్పటి నుండి 108 మాలలోకి తప్పకుండా వస్తాము అని బాప్‌దాదా వద్దకు పిల్లల నుండి ధైర్యంతో కూడిన మంచి-మంచి ఉత్తరాలు, చీటీలు వచ్చాయి. చాలామంది నుండి ఉల్లాసముతో కూడిన మంచి-మంచి ఉత్తరాలు కూడా వచ్చాయి మరియు ఆత్మిక సంభాషణలో కూడా చాలామంది బాప్‌దాదాకు తమ నిశ్చయము మరియు ధైర్యము గురించి మంచి సమాచారాన్ని ఇచ్చారు. బాప్‌దాదా ఇటువంటి పిల్లలకు చెప్తున్నారు - బాబా మీ అందరి గతానికి బిందువు పెట్టేసారు, అందుకే గతం గురించి ఆలోచించకండి, ఇప్పుడు ఏ ధైర్యాన్ని అయితే ఉంచారో, ఆ ధైర్యము మరియు సహాయముతో ముందుకు వెళ్తూ ఉండండి. విదేశీయులైనా, భారతవాసులైనా క్రొత్త సంవత్సరములోని క్రొత్త ఉల్లాసము గురించి కూడా చాలా మంచి-మంచిగా వ్రాసారు, బాప్‌దాదా ఇటువంటి పిల్లలకు ఇదే వరదానాన్ని ఇస్తున్నారు - ఈ ధైర్యములో, నిశ్చయములో, నషాలో అమర భవ. అమరులుగా ఉంటారు కదా! డబల్ విదేశీయులు అమరులుగా ఉంటారా? భారతవాసులు కూడా ఉంటారు కదా? భారత్ అయితే నంబరు తీసుకోవాల్సిందే.
క్రొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటారు? ఒకటేమో కానుకలను ఇస్తారు మరియు రెండు గ్రీటింగ్స్ (అభినందనలు) ఇస్తారు. మిఠాయిలు బాగా తింటారు, తినిపిస్తారు. చాలా బాగా ఆడుతారు-పాడుతారు. కనుక మీరు కేవలం 12 గంటల తరువాత వచ్చే ఒక్క రోజును మాత్రమే క్రొత్త సంవత్సరముగా జరుపుకోవటం కాదు, బ్రాహ్మణ పిల్లల కొరకు ఈ క్రొత్త యుగములో ప్రతి ఘడియ క్రొత్తదే, ప్రతి శ్వాస క్రొత్తదే, ప్రతి సంకల్పము క్రొత్తదే, అందుకే సదా పూర్తి సంవత్సరమంతా, ఒక రోజు కాదు, ఒక వారము కాదు, ఒక నెల కాదు, నాలుగు నెలలు కాదు, ఎనిమిది నెలలు కాదు, మొత్తం పన్నెండు నెలలూ సదా ఒకరికొకరు దిల్ఖుష్ మిఠాయిని పంచుకుంటూ ఉండాలి. పంచుతారు కదా? దిల్ఖుష్ మిఠాయిని పంచడం వస్తుందా? అందరూ తెలివైనవారు. అయితే దిల్ఖుష్ మిఠాయిని పంచండి. ఒకవేళ ఎవరైనా మీ దిల్ఖుష్ మిఠాయిని వారి స్వభావం కారణంగానో, సంస్కారం కారణంగానో, సమస్య కారణంగానో స్వీకరించకపోయినా కానీ మీరు బాధపడకండి. మీరు పంచారు, మీరు అజ్ఞాకారులుగా అయిన చార్టు బాప్‌దాదా వద్ద జమ అయ్యింది. నేనైతే దిల్ఖుష్ మిఠాయిని తినిపించాను కానీ వారైతే కోప్పడ్డారు కదా అన్నదానిని చూడకండి. ఏమీ ఫర్వాలేదు, వారికి రహస్యం తెలియదు కదా, అందుకే కోప్పడ్డారు. మీకైతే రహస్యం తెలుసు కదా! కనుక వారు కర్మల ఖాతాకు లేదా సమస్యకు వశమై ఉన్నారు అనే రహస్యం కూడా తెలుసుకోండి. మీరు అజ్ఞాకారులుగా అవ్వండి. సరేనా! ఆజ్ఞాకారులుగా అవ్వాలి కదా! ఇక్కడైతే ‘అలాగే’ అని చాలా బాగా అంటారు. మీరు ఇక్కడ చూసినట్లయితే - చేతులు కూడా చాలా బాగా ఊపుతారు, సంతోషపరుస్తారు, తల కూడా ఊపుతారు, చేతులు కూడా ఊపుతారు. కానీ బాప్‌దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరి విషయంలోనూ సదా సంతోషంగా ఉంటారు. ‘నా బిడ్డ’ అని అన్నప్పుడు, వారు ఎవరైనా సరే, ఎలా ఉన్నా సరే, తండ్రి అయితే చూసి తప్పకుండా సంతోషిస్తారు. బాబా ప్రతిజ్ఞ చేసారు - ఎలాగైనా సరే యోగ్యముగా తయారుచేసి నాతో పాటు తప్పకుండా తీసుకువెళ్ళాల్సిందే. నాతో పాటు రావాలి కదా? నాతో పాటు రావటానికి సిద్ధంగా ఉన్నారా? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎవరెడీనేనా? అచ్ఛా, ఎవరెడీగా కూడా ఉన్నారు, చాలా మంచిది. ఎవర్ హ్యాపీగా కూడా ఉన్నారా? మరి మాయ వచ్చినప్పుడు? అప్పుడు మనసులో - బాబా, మాయ వచ్చింది, మాయ వచ్చింది అని కొద్దికొద్దిగా ఆర్తనాదాలు చేస్తారా? ఆర్తనాదాలు చేయకండి, స్వయాన్ని ఎగిరేలా చేసుకోండి. మాయ కింద ఉండిపోయి మీరు పైకి ఎగిరిపోతే మాయ చూస్తూ ఉండిపోతుంది. అచ్ఛా. కావున సంతోషంలో నాట్యం చేస్తూ కూడా ఉండండి మరియు దిల్ఖుష్ మిఠాయిని పంచుతూ కూడా ఉండండి. అలాగే మీ సంబంధ-సంపర్కములోకి ఎవరు వచ్చినా వారికి ఏదో ఒక కానుకను ఇవ్వండి, ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏ కానుకను ఇస్తారు? మీ వద్ద కానుకలైతే చాలానే ఉన్నాయి. కానుకల స్టాక్ ఉందా? కనుక ఇవ్వటములో పిసినారులుగా అవ్వకండి, ఇస్తూ వెళ్ళండి. విశాల హృదయులుగా అవ్వండి. కొందరికి శక్తి యొక్క సహయోగాన్ని ఇవ్వండి, శక్తి యొక్క వైబ్రేషన్లను ఇవ్వండి, కొందరికి ఏదైనా గుణం యొక్క కానుకను ఇవ్వండి. నోటితో చెప్పి ఇవ్వటం కాదు కానీ మీ ముఖము మరియు నడవడిక ద్వారా ఇవ్వండి. ఒకవేళ ఏదైనా గుణము లేక శక్తి ఇమర్జ్ అవ్వకపోయినా సరే, కనీసం తక్కువలో తక్కువ చిన్న కానుకనైనా ఇవ్వండి, అది ఏ కానుక? శుభ భావన మరియు శుభ కామన యొక్క కానుక. వీరు నా చాలా కాలం తర్వాత కలిసిన సోదరుడు లేక సోదరి అన్న శుభ కామనను పెట్టుకోండి. చాలా కాలం తర్వాత కలిసినవారు అని అనుకున్నట్లయితే అశుభ భావన నుండి శుభ భావనగా మారిపోతుంది. ఈ సోదరుడు లేక సోదరిది కూడా ఎగిరే కళ పాత్రగా అయిపోవాలి. దీని కొరకు సహయోగాన్ని లేక శుభ భావనను అందించండి. చాలామంది పిల్లలు అంటారు - మేము ఇస్తాము కానీ వారు తీసుకోరు. సరే అయితే, శుభ భావనను తీసుకోరు, వారు అయితే ఏదో ఒకటి ఇస్తారు కదా. వారు అశుభమైన మాటలను మాట్లాడుతారు, అశుభమైన వైబ్రేషన్లను ఇస్తారు, అశుభమైన నడవడికను నడుస్తారు కానీ మీరు ఎవరు? మీ కర్తవ్యము ఏమిటి? విశ్వ పరివర్తకులేనా? మీ పని ఏమిటి? విశ్వ పరివర్తకులు కదా! మరి విశ్వాన్ని పరివర్తన చెయ్యగలరు కానీ ఒకవేళ వారు తప్పుడు మాటలను మాట్లాడితే, తప్పుడు నడవడికను చూపిస్తే, దానిని పరివర్తన చెయ్యలేరా? దానిని పాజిటివ్ రూపములోకి పరివర్తన చెయ్యలేరా? నెగెటివ్‌ను నెగెటివ్‌గానే తీసుకుంటారా, నెగెటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసి మీరు ప్రతి ఒక్కరికీ శుభ భావన, శుభ కామనలనే కానుకను ఇస్తారా? శుభ భావనల స్టాక్‌ను సదా జమ చేసి పెట్టుకోండి. మీరు ఇవ్వండి. పరివర్తన చెయ్యండి. అప్పుడు విశ్వ పరివర్తకులు అన్న మీ టైటిల్ ప్రాక్టికల్‌గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది పక్కాగా అర్థం చేసుకోండి - ఎవరైతే సదా ప్రతి ఒక్కరినీ పరివర్తన చేసి తమ విశ్వ పరివర్తక కార్యాన్ని సాకారములోకి తీసుకువస్తారో, వారే సాకార రూపములో 21 జన్మలు గ్యారంటీగా రాజ్యాధికారులుగా అవుతారు. సింహాసనంపై ఒక్కసారే కూర్చున్నా కానీ, ప్రతి జన్మలోనూ రాజ్య పరివారములో, రాజ్యాధికారీ ఆత్మల సమీప సంబంధములో ఉంటారు. కనుక విశ్వ పరివర్తకులే విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. అందుకే సదా మీ ఈ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి - నా కర్తవ్యమే పరివర్తన చెయ్యటము. దాత యొక్క పిల్లలు కావున దాతగా అయ్యి ఇస్తూ వెళ్ళండి, అప్పుడే భవిష్యత్తులో చేతితో ఎవరికీ ఇవ్వరు కానీ సదా మీ రాజ్యములో ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది, ఇది ఈ సమయములోని దాత అయినందుకు ప్రారబ్ధము. అందుకే - వీరు ఇది చేసారు, వీరు ఇన్ని సార్లు చేసారు అని లెక్క పెట్టుకోకండి, మాస్టర్ దాతగా అయ్యి కానుకలను ఇస్తూ వెళ్ళండి. మరియు ఏ గ్రీటింగ్స్‌ను ఇస్తారు? చూడండి, ఎవరికైనా ఎవరి ద్వారానైనా ఏదైనా ప్రాప్తి లభిస్తుంది కదా, అప్పుడు వారి నోటి నుండి, మనసు నుండి మీకు అభినందనలు అని అంటారు, అలాగే ఒకరికొకరు సంతోషాన్ని పంచుకున్నప్పుడు కూడా అభినందనలు అని అంటారు. ఉత్సవాలను జరుపుకున్నప్పుడు శుభాకాంక్షలను తెలియజేసుకుంటారు. అలా మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ - మీ నోటితో ఎటువంటి మాటలను మాట్లాడాలంటే, సంకల్పాలలో ఎటువంటి శ్రేష్ఠ సంకల్పాలు ఉండాలంటే, ఎవరు మిమ్మల్ని కలిసినా కానీ వారు అన్ని వేళలా మనస్ఫూర్తిగా అభినందనలను మరియు ఆశీర్వాదాలను తప్పకుండా ఇవ్వాలి. కనుక సదా - వారి మనసు నుండి, నోటి నుండి అభినందనలు మరియు ఆశీర్వాదాలు వెలువడేటట్లుగా మీరు అటువంటి మాటలను మాట్లాడండి. అభినందనలకు యోగ్యముగా లేని మాటలను మాట్లాడకండి. ఒక్కొక్క మాట రత్నములా ఉండాలి. సాధారణ మాటలు ఉండకూడదు. బాప్‌దాదా ఇప్పటివరకు రిజల్టులో దీనిని చూసారు, రేపైతే మారిపోతుంది కానీ ఇప్పటివరకు చూసినదానిలో, మాటలలో ఏదైతే మర్యాద మరియు స్నేహము ఉండాలో, ఆ స్నేహము కూడా తగ్గిపోతుంది మరియు మర్యాద కూడా తగ్గిపోతుంది. అందుకే రత్నాల వంటి మాటలను మాట్లాడండి. మీరు స్వయం వజ్రతుల్యమైనవారు కావున మీ ప్రతి మాట రత్న సమానంగా ఉండాలి. అంతటి విలువైనదిగా ఉండాలి. సాధారణంగానూ ఉండకూడదు, వ్యర్థంగానూ ఉండకూడదు. అప్పుడప్పుడు బాప్‌దాదా చూస్తూ ఉంటారు, రిజల్టును వినిపించమంటారా, ఎందుకంటే 12 గంటల తరువాత అన్నింటినీ సమాప్తం చేయాలి కదా! బాప్‌దాదా ఇది కూడా చూసారు - కొంతమంది పిల్లలు చిన్న విషయాన్ని చాలా విస్తారము చేస్తారు. దీని వలన ఏమవుతుందంటే - ఎక్కువగా మాట్లాడినప్పుడు, ఎలా అయితే వృక్షము బాగా విస్తారమైనప్పుడు అందులో బీజము దాగిపోతుంది కదా, అలా అర్థం చేయించేందుకు మేము విస్తారము చేస్తున్నాము అని వారు అనుకుంటారు కానీ విస్తారములో మీరు ఒక విషయాన్ని అర్థం చేయించాలనుకుంటారు కదా, దాని సారము దాగిపోతుంది. అంతేకాక మాటలకు అనగా వాణికి కూడా శక్తి ఉంటుంది. వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు వాణి యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎక్కువగా మాట్లాడేవారికి బుద్ధి యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. ‘షార్ట్ మరియు స్వీట్’ (క్లుప్తంగా మరియు మధురంగా) - ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి. ఇతరులు ఎవరైనా వినిపిస్తారు కదా, అప్పుడు నాకు అంత వినే సమయము లేదు అని వారితో అంటారు కానీ ఎప్పుడైతే స్వయం వినిపిస్తారో, అప్పుడు సమయాన్నే మర్చిపోతారు. అందుకే మీ ఖజానాల స్టాక్‌ను జమ చేసుకోండి. సంకల్పాల ఖజానాను జమ చేసుకోండి, మాటల ఖజానాను జమ చేసుకోండి, శక్తుల ఖజానాను జమ చేసుకోండి, సమయపు ఖజానాను జమ చేసుకోండి, గుణాల ఖజానాను జమ చేసుకోండి. ప్రతిరోజూ రాత్రి మీ ఈ ఖజానాల పొదుపు ఖాతాను చెక్ చేసుకోండి. ఎన్ని సంకల్పాలను వేస్ట్ (వ్యర్థము) కు బదులుగా బెస్ట్ (సమర్థ) ఖాతాలో జమ చేసుకున్నాను? ఎంత సమయాన్ని బెస్ట్ ఖాతాలో జమ చేసుకున్నాను? గుణాలు మరియు శక్తుల ద్వారా శ్రేష్ఠ కార్యాలను చేసానా? గుణాలను కార్యంలో ఉపయోగించానా? శక్తులను కార్యంలో ఉపయోగించానా? జమ చేసుకోవటము అంటే ఇదే. కనుక అందరూ సంకల్పాలు, సమయము, గుణాలు, శక్తులు, వీటి ఖాతాను ప్రతిరోజూ రాత్రి చెక్ చేసుకోండి. ఆ తర్వాత టోటల్ చేయండి, పొదుపు ఖాతాలో ఎంత జమ అయ్యింది? ఈ పొదుపే స్వయానికి కూడా సహయోగాన్ని ఇస్తూ ఉంటుంది మరియు ఇతరులకు కూడా ఇస్తుంది. మరి ఏం చెయ్యాలో అర్థమైందా? అందరూ అడుగుతారు కదా ఏం చెయ్యాలి అని. మరి ఇప్పుడు ఇది చెయ్యాలి. గ్రీటింగ్స్ కూడా తీసుకోవాలి, కానుకలను కూడా ఇవ్వాలి, జమ కూడా చేసుకోవాలి మరియు శ్రమించడాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే పొదుపుపై అటెన్షన్ పెడతారో, అప్పుడు శ్రమించాల్సిన అవసరము ఉండదు. శ్రమ నుండి ముక్తులయ్యే సంవత్సరాన్ని ఘనంగా జరుపుకోండి. వ్యర్థము మరియు నెగెటివ్ నుండి ముక్తులయ్యే సంవత్సరాన్ని జరుపుకోండి. బాప్‌దాదా ముక్తి సంవత్సరము యొక్క రిజల్టును ఇప్పుడు అడగటం లేదు, బాప్‌దాదాకు గుర్తుంది. తర్వాత రిజల్టు అడుగుతారు - ఎంతమంది ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారు లేక ఎన్ని నెలలు జరుపుకున్నారు? 6 నెలలు జరుపుకున్నారా, సగం జరుపుకున్నారా, పూర్తిగా జరుపుకున్నారా - ఈ లెక్కనంతటినీ 18 తారీఖున తీసుకుంటాము. అచ్ఛా.
అచ్ఛా - డబల్ విదేశీయులు బాగా జరుపుకున్నారు కదా! భారత్వారు కూడా జరుపుకున్నారు. కానీ ఫలితాన్ని 18వ తేదీన చూస్తాము. సంవత్సరం మొత్తం ముక్తి సంవత్సరంగా ఆచరించిన వారికి ఏమి ఇస్తాము? దాదీలు చెప్పండి - సంవత్సరం మొత్తం ముక్తి సంవత్సరంగా ఆచరించిన వారికి ఏమి ఇవ్వాలి? అభినందనలు, ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి. కానీ జ్ఞాపకార్థంగా ఏమి ఇస్తారు? బహుమానం సిద్ధంగా ఉంచండి. ఎంతమంది బహుమానం తీసుకుంటారో చూద్దాం. కాబట్టి క్రొత్త సంవత్సరం, క్రొత్త ఉల్లాస-ఉత్సాహాలు, క్రొత్త ధైర్యం - అన్నీ క్రొత్తవే. ఈ క్షణంలో ఉన్న స్టేజ్, తదుపరి క్షణంలో దానికంటే శ్రేష్ఠమైన స్టేజ్‌గా ఉండాలి. సరేనా?
అచ్ఛా, ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూర్చోవాలి. అందుకే అందరూ క్రొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి అన్ని చోట్ల నుంచి పరుగెత్తుకుంటూ వచ్చారు. చాలా బాగుంది. క్రొత్తవారైనా, పాతవారైనా వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ఆశీర్వాదాలతో కూడిన అభినందనలు. స్వాగతం, స్వాగతం. శాంతివనానికి అలంకారంగా వచ్చారు. చూడండి, ఈ హాలు ఎంత అందంగా అలంకరించబడింది! అలంకరించినవారు ఎవరు? మీరే కదా!
అచ్ఛా - ఈరోజు బాప్‌దాదా ప్రతి గ్రూపుతో వారు కూర్చున్న చోటే నిలబెట్టి మిలన్ చేస్తారు. డబల్ విదేశీయులైనా, భారతదేశంలోని ఏ జోన్ వారైనా, ప్రతి జోన్‌తో బాప్‌దాదా కలుస్తారు. కానీ స్టేజ్‌పైకి రావద్దు. అక్కడే నిలబడి మిలన్ చేసుకోండి. ఇది కూడా క్రొత్త విషయమే కదా! క్రొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు కాబట్టి ఇది కూడా క్రొత్త విషయమే. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- యువ గ్రూపుతో (అందరూ పాట పాడారు) ఉల్లాస-ఉత్సాహాల పాట చాలా బాగా పాడారు. యువత చాలా పని చేయాలి. అందరూ మిమ్మల్ని తమ వేదికపైకి ఆహ్వానించేలా ఒక యువ గ్రూపు సిద్ధం కావాలి. చాలా బాగుంది. శిక్షణ ఇచ్చేవారు కూడా చాలా బాగా శ్రమించారు. కాబట్టి బాప్‌దాదా ఈ సంవత్సరానికి ఇచ్చిన కార్యంలో యువ గ్రూపు మొదటి స్థానం సాధిస్తుంది కదా! శిక్షణ ఇచ్చినవారు కూడా మంచి శ్రమ చేశారు.
వాల్యూస్ కోర్సులో పాల్గొన్న సోదరసోదరీలతో:- బాప్‌దాదా మాత్రమే కాదు, ప్రపంచమంతా మీకు ధన్యవాదాలు చెప్పేంత తెలివైనవారిగా తయారవ్వండి. ప్రతి ఒక్కరి జీవితంలో విలువలను ప్రత్యక్షంగా వెలికితీసి చూపించండి. ఎక్కడైనా చాలా కఠిన స్వభావం గలవారు ఉంటే, ఈ గ్రూపులోనుండి ఎవరో ఒకరు అక్కడి వాతావరణాన్ని మార్చగలిగేలా తయారవ్వాలి. పంజాబ్‌లో ఒకప్పుడు తీవ్రవాదం ఎక్కువగా ఉండేది కదా! పంజాబ్వారు యోగ వైబ్రేషన్స్, ప్రేమతో సేవ చేసి ఎంతో మార్పు తీసుకువచ్చారు. అలాగే ఈ వాల్యూస్ గ్రూపు కూడా ప్రత్యక్ష సేవ ద్వారా అలాంటి మార్పు తీసుకురావాలి. విలువలు పూర్తిగా తగ్గిపోయిన చోట విలువల వైబ్రేషన్స్‌తో పరివర్తన చేసి చూపించాలి. అభినందనలు.
ఆస్ట్రేలియా, ఫిజీ, న్యూజీలాండ్:- ఆస్ట్రేలియా వారు ధైర్యంగా ఒక రిట్రీట్ హౌస్ తీసుకున్నారు. అందుకు అభినందనలు. అందులో మీ బదులుగా మాట్లాడి తన అనుభవాన్ని పంచుకునే ఒక మైక్‌ను తయారుచేయండి. ఆస్ట్రేలియా మొదటి నుంచీ ఎప్పుడూ ముందంజలోనే ఉంది. ఇప్పుడు ఆ రిట్రీట్ హౌస్ ద్వారా అలాంటి మైక్‌లను తయారుచేసి బాప్‌దాదా ముందుకు తీసుకురావాలి.
యూరప్, యు.కె., దుబాయ్, మారిషస్:- యూరప్‌కు ఒక వరం లభించింది. యూరప్ అనేక ఆత్మలను మేల్కొల్పేందుకు నిమిత్తమైంది, భవిష్యత్తులో కూడా అవుతుంది. యూరప్‌తో పాటు యు.కె. కూడా ఉంది కాబట్టి చాలా బాగుంది. యూరప్వారికి గుర్తుండే ఉంటుంది. ప్రారంభంలో బాప్‌దాదా యూరప్వారిని యాదవులు అని సంబోధించేవారు. బ్రహ్మా బాబా కూడా యూరప్‌ను ఎన్నోసార్లు గుర్తు చేసారు. ఇప్పుడు యు.కె. మరియు యూరప్‌వారు సైన్స్‌కు చెందిన ఒక మైక్‌ను తయారుచేయాలి. అతను మీ తరఫున మాట్లాడి, సైన్స్ ద్వారా సైలెన్స్ శక్తిని నిరూపించాలి. సైలెన్స్‌లో ఉన్నవారు సైలెన్స్‌ను నిరూపించడం గొప్ప విషయం కాదు. కానీ సైన్స్‌కు చెందినవారు సైలెన్స్ శక్తిని నిరూపించాలి. ఇప్పుడు అలాంటి అద్భుతం చేసి చూపించండి. విన్నారా - యూరప్, యు.కె. వారూ! అలాంటి వారిని తయారుచేయండి. చాలా బాగుంది. అద్భుతం చేయాలి. తప్పకుండా జరుగుతుంది. అచ్ఛా.
అమెరికా:- అమెరికా ఏమి చేస్తుంది? అమెరికావారు యు.ఎన్.లో ఎటువంటి మైక్‌ను తయారుచేయాలంటే, అతను యు.ఎన్. సభ్యుడై, ‘‘మేము చేయలేని కార్యాన్ని ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం చేయగలదు, చేస్తున్నారు, ఇంకా చేసి చూపిస్తారు’’ అని చెప్పాలి. అలాంటి వారిని తయారుచేయండి. రిట్రీట్ హౌస్ తీసుకుంటున్నారు కదా! అందులో ఏమి చేస్తారు? యు.ఎన్.లోని ఒక సభ్యుడిని అలాంటి మైక్‌గా తయారుచేయండి. అతను వేదికపై నిలబడి, వీరే, వీరే ఈ కార్యాన్ని చేయగలవారు అని ప్రకటించాలి. ధైర్యం ఉందా? తప్పకుండా చేయాలా? ఇదంతా ఇప్పటికే డ్రామాలో ఉంది. కేవలం నిమిత్తం కావడమే మిగిలింది. అద్భుతం మాత్రం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా యు.ఎన్తో సంబంధం ఉంది కదా! ఏదో ఒక అద్భుతం తప్పకుండా చేస్తారు. రిట్రీట్ హౌస్‌కు అభినందనలు.
ఆసియా గ్రూపు:- అచ్ఛా, ఆసియా ఏమి చేస్తుంది? ఆసియాలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అనేక అమూల్య రత్నాలు ఉన్నారు. కానీ ఇప్పటికీ వారు మర్జ్ అయి ఉన్నారు. క్రొత్త ప్రపంచంలో ఆసియాలోని అనేక ప్రాంతాలు కలుస్తాయి. కాబట్టి మీ భూమి భాగ్యవంతమైనది. అందులోనుండి అలాంటి విశేష రత్నాలను వెలికితీయండి. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలు మైట్‌గా ఉండాలి. అలాగే మరిన్ని మైక్‌లు కూడా తయారవ్వాలి అని బాప్‌దాదా కోరుకుంటున్నారు. మీరు మైట్‌గా ఉండి వెలుగును ఇవ్వండి. వారు మైక్లుగా మారి ప్రసంగించాలి, పరిచయం ఇవ్వాలి, అనుభవాలు చెప్పాలి. ఆసియాలో అలాంటి వారు ఉన్నారు. వారిని వెతికి నిమిత్తంగా చేయండి. మీరు మైట్లు, వారు మైక్‌లు. సరేనా? ఆసియావారు ఇది చేయాలి కదా! చాలా బాగుంది. అప్పుడు మొదటి పెద్ద మైక్‌ను ఎవరు తయారుచేసారో వారికి బహుమానం ఇస్తాము. ఆసియా మొదటి స్థానం సాధిస్తుందా? ప్రతి ఒక్కరూ మొదటి స్థానాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలి. అతి పెద్ద మైక్‌ను ఎవరు సిద్ధం చేస్తారో బాప్‌దాదా చూస్తారు. చిన్నచిన్నవారు ఇప్పటికే సంబంధంలో ఉన్నారు. కానీ వేదికపైకి రావాలి. మైక్ అంటే వేదికపై నిర్భయంగా నిలబడి మాట్లాడగలవారు. అలాంటి మైక్‌లను తయారుచేయండి. సరేనా? అయితే ఏ స్థానం సాధించాలి? మొదటి స్థానం. చిన్నపిల్లలు కూడా ధైర్యవంతులే. చాలా బాగుంది.
ఆఫ్రికా, దక్షిణాఫ్రికా:- ఆఫ్రికాలో చాలా మంచి రత్నాలు ఉన్నాయి. సేవ చేయడంలో చాలా తెలివైనవారు కదా! ఇప్పుడు ఏమి చేస్తారు? ఆఫ్రికాలో బంగారం ఎక్కువ కదా! అలాగే బాప్‌దాదా వద్దకు బంగారు స్టేజ్‌కు తగిన రత్నాలను తీసుకురండి. స్థూల బంగారం ప్రసిద్ధి చెందినట్లే, ఆఫ్రికాలోని ఆత్మలు కూడా వజ్రాలవంటివారు, బంగారంలాంటి వారు. అలాంటి రత్నాలను ముందుకు తీసుకురండి. ఎప్పుడు తీసుకువస్తారు? తేదీ చెప్పండి. అచ్ఛా, మార్చిలో తీసుకువస్తారా? అవును, ఆఫ్రికావారు అద్భుతం చేసి చూపించండి. చేస్తారా? చాలా బాగుంది. చాలా మంచి రత్నాలు ఉన్నాయి. మార్చి వరకు చూస్తాం. తర్వాత బహుమానం ఇస్తాం. సరేనా? నచ్చిందా?
రష్యా:- రష్యావారు ఏమి అద్భుతం చేస్తారు? ఇప్పుడు రష్యాలో స్వాతంత్ర్యం వచ్చింది కదా! కమ్యూనిస్టు పాలన లేదు. స్వతంత్ర దేశం. అలాగే రష్యాలో కూడా నిజమైన స్వాతంత్ర్య ధ్వనిని వ్యాప్తి చేయండి. నిజమైన స్వాతంత్ర్యం ఇక్కడి నుంచే లభిస్తుంది అనే ధ్వని నాలుగు దిక్కులా వ్యాపించాలి. ఇది మతపరంగా కాదు, నిజమైన స్వాతంత్ర్య పరంగా కావాలి. ఈ ధ్వనిని వ్యాప్తి చేస్తారా? రష్యావారు అందరికీ ఎంతో ప్రియమైనవారు. ఎందుకో తెలుసా? బాబా కూడా భోలానాథ్ కదా! అలాగే రష్యావారు కూడా అమాయకులు. లోపల చాలా తెలివైనవారు, కానీ బయటకు చాలా అమాయకంగా, మధురంగా కనిపిస్తారు. అందుకే అందరికీ రష్యావారిపై ప్రత్యేక ప్రేమ ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు స్వాతంత్ర్య ధ్వనిని వ్యాప్తి చేయండి. అచ్ఛా.
ఇజ్రాయెల్:- ఇప్పుడే క్రొత్తగా ప్రారంభమైంది కాబట్టి మీరు గారాల పిల్లలు. గారాల పిల్లలే తల్లిదండ్రులకు ఎంతో దగ్గరగా ఉంటారు. వారి మీద ఎల్లప్పుడూ తల్లిదండ్రుల దృష్టి ఉంటుంది. కాబట్టి అద్భుతం చేసి చూపించాల్సిందే. మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. విజయం కూడా లభిస్తుంది. సంఖ్య తక్కువే అయినా ఎంతో మంచివారు. ధైర్యం చాలా బాగుంది. వచ్చే సంవత్సరం అద్భుతం చేసి ఒక గ్రూపుతో రండి. సరేనా? అచ్ఛా.
చిల్డ్రన్ గ్రూపును సంభాళిస్తున్న టీచర్లతో:- చాలా బాగా సిద్ధం చేశారు. హృదయపూర్వకంగా ఉల్లాస-ఉత్సాహాలతో ఈ కార్యాన్ని నిర్వహించారు. అందువల్ల చేసిన కార్యానికి విజయం తప్పకుండా లభిస్తుంది. గ్రూపు చాలా బాగుంది.
జ్యూరిస్ట్ మీటింగ్‌కు వచ్చిన సోదరసోదరీలతో:- జ్యూరిస్టులు ఏమి చేస్తారు? (లా మరియు లవ్‌లో సమతుల్యతను ఉంచుతాము, భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాము.) ఏమైనా జ్యూరిస్టులు మాట్లాడడంలో తెలివైనవారే. చాలా బాగా చెప్పారు. ధైర్యవంతమైన మాటలు చెప్పారు. జ్యూరిస్టుల పని కూడా అదే - బలహీనమైన కేసును ధైర్యవంతంగా చేయడం. కాబట్టి మీరు మంచి ధైర్యాన్ని చూపించారు. ఎల్లప్పుడూ మర్యాదలు, చట్టమును పాటిస్తూ, ఇతరులతో కూడా పాటింపజేసే వాతావరణాన్ని సృష్టిస్తూ ఉండండి. మిగిలిన విషయాల్లో మీ నాణ్యత చాలా బాగుంది. ఒక్కొక్కరు ఎంతో పెద్ద కార్యం చేయగలరు. ఎందుకంటే మీ వద్దకు క్లయింట్లుగా వచ్చే వారు ఆ సమయంలో మిమ్మల్ని భగవంతుని రూపంగా భావిస్తారు. మీపై వారికి విశ్వాసం ఉంటుంది. అలాంటి క్లయింట్లను మీరు బాబా పిల్లలుగా చేయగలరు. అప్పుడు న్యాయవాదులు కూడా పెరుగుతారు, న్యాయమూర్తులు కూడా పెరుగుతారు. ఇప్పుడు అలాంటి ఒక న్యాయమూర్తిని సిద్ధం చేయండి, అతను సమీప సంబంధం కలిగినవాడై ఉండాలి. తన అనుభవం ఆధారంగా, భారతదేశానికి శ్రేయస్సు కలగాలంటే, సత్యం స్థాపించబడాలంటే ఇదే మార్గం, ఇదే మార్గం, ఇదే మార్గం అని చెప్పాలి. అలాంటి గ్రూపును సిద్ధం చేయండి. ఒక గొప్ప న్యాయమూర్తిని సిద్ధం చేయండి. అతను నిర్భయంగా వేదికపై మాట్లాడి, ఇది ఎందుకు సత్యమో నిరూపించి చెప్పాలి. అంతటి ధైర్యం ఉందా? మీ మాటల ద్వారానే ఆ ధైర్యం కనిపిస్తోంది. కాబట్టి అలా చేయండి. ఎవరికి ఏ పని చెప్పామో, వారు ఈ సంవత్సరపు చివరి సీజన్ అయిన మార్చి చివరికి సిద్ధం చేసి తీసుకురావాలి. నచ్చిందా? విదేశీయులకు కూడా పని ఇచ్చాం. యువతకు కూడా పని ఇచ్చాం. జడ్జీలకు కూడా పని ఇచ్చాం. ఇప్పుడు ఎవరు చేసి తీసుకువస్తారో చూస్తాం. అయితే మీది మొదటి స్థానం కదా! కానీ అలాంటి వారిని సిద్ధం చేయండి. కాన్ఫరెన్స్‌లో మాట్లాడటం ఒకటి, కానీ ప్రజల వేదికపై నిలబడి చెప్పడం మరొకటి. అలాంటి వారిని సిద్ధం చేయండి. (మధుబన్కు చెందిన లత అక్కయ్యతో, న్యాయవాది) ఈ న్యాయవాది కూడా చాలా తెలివైనవారు. మంచి పని చేస్తున్నారు. శక్తులు ముందుకు రావడం చాలా మంచిది. అభినందనలు, అభినందనలు. చాలా బాగుంది.
టీచర్ అక్కయ్యలతో:- గ్రూపు చాలా పెద్దది. (5-6 వందల మంది టీచర్లు ఉన్నారు.) టీచర్లు ఏమి చేస్తారు? ఈ సంవత్సరం టీచర్లు బహుమానం పొందాలి. దేనిలో? స్వయంగా, సెంటర్ నివాసులు, అలాగే స్టూడెంట్స్ - సంవత్సరం మొత్తం నిర్విఘ్నంగా ఉండాలి. తనలోగానీ, సహచరులలోగానీ, స్టూడెంట్స్లోగానీ ఎలాంటి విఘ్నం రాకూడదు. అలాంటి ధైర్యం ఉన్నవారు చేతులు ఎత్తండి. మీరు గ్రూపుతో వచ్చారు కాబట్టి పేర్లు నమోదు అయ్యాయి. బహుమతులు సిద్ధంగా ఉంచండి. బహుమానం సిద్ధంగా ఉంచండి. ఎంతమంది బహుమానం పొందడానికి పాత్రులవుతారో చూస్తాం. మూడు సర్టిఫికెట్లు తీసుకోవాలి. మూడు సర్టిఫికెట్లు - ఒకటి తన స్వంత సర్టిఫికెట్, రెండోది సహచరుల సర్టిఫికెట్, మూడోది స్టూడెంట్స్ సర్టిఫికెట్. అవునా కాదా? కారణాలు చెప్పి తప్పించుకోలేరు. కేవలం ‘‘నిర్విఘ్నంగా ఉన్నాము’’ లేదా ‘‘లేము’’ అంతే. న్యాయస్థానం పెట్టము, వివరణలు అడగము. ఈ మూడు సర్టిఫికెట్లు తీసుకున్నవారికి బహుమానం లభిస్తుంది. అందరూ చేతులు ఎత్తారు. ప్రయత్నం చేస్తాం, జరుగుతుందో లేదో తెలియదు అని భావించినవారు చేతులు ఎత్తండి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడవద్దు. ధైర్యం లేకపోయినా ధైర్యాన్ని ఉంచండి. ధైర్యం ఉంటే సహాయం తప్పకుండా లభిస్తుంది. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందా? టీచర్లందరూ విన్నారా? చాలా బాగుంది. టీచర్లను చూసి బాప్‌దాదా సంతోషిస్తారు. టీచర్లు సేవలో సహచరులు. అందుకే బాప్‌దాదాకు టీచర్లను చూసి ఆనందం కలుగుతుంది. బాప్‌దాదా వారికి గౌరవం కూడా ఇస్తారు. ఎందుకంటే వారు పిల్లలు కూడా, సహచరులు కూడా. అందుకే వారికి ప్రత్యేక సహాయం కూడా ఉంటుంది. సరేనా?
మధుబన్ నివాసులు - ఆబూ నివాసులు:- చాలా మంచి గ్రూపు. చూడండి, మధుబన్వారు సేవలో ముందుండకపోతే ఇన్ని ఆత్మలకు బాబాతో మిలన భాగ్యం ఎలా లభించేది? అందుకే మధుబన్వారికి అందరి ఆశీర్వాదాల రూపంలో అత్యంత గొప్ప కానుక లభిస్తుంది. ఆశీర్వాదాలు లభిస్తున్నాయా? వాటిని అనుభవిస్తున్నారా? మీరు నేర్పుతున్నారు, నిమిత్తం కూడా అవుతున్నారు. అందుకే బ్రాహ్మణుల సేవకు మధుబన్వారు ఒక రక్షణ ఛత్రంలాంటివారని బాప్‌దాదా అంటారు. మధుబన్ నివాసుల సేవా ఛత్రఛాయలో అనేక ఆత్మలకు ప్రయోజనం కలుగుతోంది. వారు పురుషార్థంలో ముందుకు సాగుతున్నారు. అందరి పుణ్యం మధుబన్వారికి వాటాగా లభిస్తూనే ఉంటుంది. మధుబన్వారు షేర్హోల్డర్లు. శ్రమ చేయకపోయినా అది లభిస్తూనే ఉంటుంది. అందరి హృదయపూర్వక ఆశీర్వాదాలు అమూల్యమైన సంపద. ఎవరికెంత హృదయపూర్వక ఆశీర్వాదాలు లభిస్తాయో, అవి జమ అవుతాయి. అప్పుడు పురుషార్థం చాలా సహజమవుతుంది. సేవ ద్వారా మంచి పుణ్యం లభించింది. ఈ సేవా పుణ్యాన్ని ఎల్లప్పుడూ పెంచుకుంటూ ఉండండి. తగ్గించకండి. ఎలా అయితే బాబా జీ హాజిర్ అంటారో, అలాగే మధుబన్ నివాసులు బాబాకు అత్యంత సమీపంలో ఉన్నారు. కాబట్టి మధుబన్ నివాసులకు ‘‘జీ హజూర్’’ మరియు ‘‘జీ హాజిర్’’ రెండూ ఎల్లప్పుడూ గుర్తుండాలి, అలాగే ఉంటాయి.
రెండూ గుర్తున్నాయా? హజూర్ కూడా, జీ హాజిర్ కూడా. ఎవరైనా పిలిస్తే హా జీ, హాజిర్ అనాలి. అలానే ఉన్నారా? హాజిర్గానే ఉన్నారు కదా! లేదు, లేదు అనేవారు కాదుగా. హా జీ, హా జీ అనేవారే. హా జీ, హా జీ అంటూ హజూర్కు సమీపమయ్యారు. అందరికీ ఎంతో ప్రియమైన వారిగా అయ్యారు. మధుబన్వారిని అందరూ ఎంత శ్రేష్ఠ దృష్టితో చూస్తారో తెలుసా? చాలా ప్రియమైన వారిగా అయ్యారు కదా! ఎక్కడికి వెళ్లినా మధుబన్వారు వచ్చారు, మధుబన్వారు వచ్చారు అని అంటారు. ఇదే సేవా ఫలం. కాబట్టి ఏమి గుర్తుంచుకోవాలి? జీ హజూర్ మరియు జీ హాజిర్. పక్కా కదా! ఎప్పుడూ లేదు, లేదు అనకూడదు. హా జీ, హా జీ... అనాలి. చాలా బాగుంది. బాప్‌దాదాకు మధుబన్ నివాసులపై ఎల్లప్పుడూ ప్రేమ ఉంది. వారు ఎల్లప్పుడూ ప్రియమైనవారే. అచ్ఛా.
భారతదేశానికి చెందిన సోదరసోదరీలతో అవ్యక్త బాప్‌దాదా వ్యక్తిగత కలయిక
రాజస్థాన్:- (సేవా బాధ్యతను చాలా బాగా సంభాళించారు.) రాజస్థాన్ సేవా అవకాశాన్ని చాలా బాగా వినియోగించుకొని, సేవను కూడా ఎంతో బాగా చేసా. అందుకే సేవకు అభినందనలు. గ్రూపు చాలా బాగుంది. ఇక ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ ముందుకు సాగండి. సరేనా? అచ్ఛా.
మహారాష్ట్ర జోన్:- మహా అనే పదమే మహారాష్ట్ర పేరులో ఉంది. మరి మహారాష్ట్ర ఏ గొప్ప కార్యాన్ని చేసి చూపిస్తుంది? బాప్‌దాదా ఇంతకుముందే చెప్పారు. సంఖ్య చాలా బాగుంది. ఇప్పుడు మహారాష్ట్ర అలాంటి నాణ్యమైన వ్యక్తులను సిద్ధం చేయాలి, వారు ధ్వనిని వ్యాప్తి చేయడంలో సహాయకులవ్వాలి. మహారాష్ట్ర అంతటా ప్రభావం చూపగల ఒక విశేష ఆత్మను సిద్ధం చేయండి. మహారాష్ట్రవారు శ్రమ చేయడంలో ముందుంటారు. మంచి ధైర్యం కూడా ఉంది. కాబట్టి అలాంటి సేవ ద్వారా వారు సులభంగా సిద్ధమవుతారు. ఈ సంవత్సరం ప్రతి జోన్ మార్చి నాటికి అలాంటి వారిని సిద్ధం చేసి తీసుకురావాలి. అంగీకరిస్తే చేతులు ఊపండి. మార్చిలో మైక్‌ల సెరిమనీ జరుపుకుంటాం. ఇది లండన్ మైక్, ఇది అమెరికా మైక్, ఇది భారతదేశ మైక్, ఇది ప్రతి జోన్ మైక్, ఇది మహారాష్ట్ర మైక్, ఇది ఆంధ్ర మైక్... అన్ని జోన్లవి ఉంటాయి. అప్పుడు ఎంత అద్భుతం జరుగుతుందో చూడండి.
బొంబాయి:- బ్రహ్మా బాబా బొంబాయిని ‘‘నరదేశావర్’’ అని పిలిచేవారు. దాని అర్థం ఎల్లప్పుడూ సంపన్నంగా ఉండేవారు. మరి బొంబాయివారు ఏమి సిద్ధం చేయాలి? అనేక చిన్న సెంటర్లను కూడా పెద్దవిగా తీర్చిదిద్దగల సేవా నిమిత్తాన్ని సిద్ధం చేయండి. బొంబాయిలో మీరు చేస్తూనే ఉన్నారు. కానీ ఇతరులకు కూడా సహయోగిగా అయ్యే ఒక ‘‘నరదేశావర్’’ను సిద్ధం చేయండి. అప్పుడు మాత్రమే బొంబాయి నిజమైన నరదేశావర్ అవుతుంది. ‘‘నిజమైన ధనం బ్రహ్మాకుమారీల వద్దే ఉంది’’ అని ప్రపంచానికి తెలియజేసే ఒక వ్యక్తిని సిద్ధం చేయండి. నిజమైన ధనం అంటే ఏమిటి? అవినాశి ధనం అంటే ఏమిటి? అనే విషయంపై సవాల్ విసురుతూ నిరూపించాలి. సహయోగిగా ఉండాలి, సవాలు చేసి చూపించాలి. అప్పుడు అందరి కళ్లు తెరుచుకుంటాయి. మార్చి నాటికి అలాంటి వారిని సిద్ధం చేస్తారా? అయితే చేతులు ఎత్తండి. ధైర్యం లేకపోతే ‘‘లేదు’’ అని చెప్పండి. ధైర్యం ఉంటే అసాధ్యం ఏదీ లేదు. ఎవరికి అయినా బాబా టచ్ అయితే ఒక క్షణమే సరిపోతుంది. ఇంకా మూడు నెలల సమయం ఉంది. మొదటి బహుమానం ఎవరు పొందుతారో చూస్తాం. ఈసారి ఒక స్థూల బహుమానం ఇస్తాం. అది జ్ఞాపకంగా ఉంటుంది. అచ్ఛా.
ఆంధ్రప్రదేశ్:- అందరూ ఫంక్షన్లలో బిజీగా ఉన్నారు. కొద్దిమంది మాత్రమే వచ్చారు. కానీ కొద్దిమందైనా అద్భుతం చేయగలరు. ఆంధ్రప్రదేశ్ కూడా అద్భుతం చేయగలదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యాశాఖతో చాలా సులభంగా సంబంధాలు ఏర్పడగలవు. ఆంధ్రప్రదేశ్ వారు విద్యాశాఖలో విశేష సేవ చేస్తే విజయం చాలా సులభంగా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్య వ్యక్తులు కూడా సులభంగా సంబంధంలోకి రావచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు వరం. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగితే విజయం సులభంగా లభిస్తుంది. అచ్ఛా.
ఢిల్లీ మరియు ఆగ్రా:- ఢిల్లీ వారి కార్యం మొదటి నుంచే ప్రారంభమైంది. సేవ ప్రారంభమైంది కూడా ఢిల్లీ నుంచే. అందుకే బాప్‌దాదా ఎల్లప్పుడూ ఢిల్లీ పేరును ప్రస్తావిస్తుంటారు. ఢిల్లీ వారు కాలానుగుణంగా ఎన్నో క్రొత్త ఆవిష్కరణలు చేశారు. ఇప్పుడు మరిన్ని క్రొత్త ఆవిష్కరణలు చేసి, క్రొత్త సేవా రూపరేఖను రూపొందించడంలో నిమిత్తం కావాలి. ఢిల్లీ యొక్క ధ్వని ప్రపంచమంతా చేరుతుంది. అందుకే ఢిల్లీ సేవకు ప్రత్యేక పేరు వస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఒక క్రొత్త ప్రణాళికను ఆచరణలో పెట్టి చూపించాలి. ఢిల్లీలో మైక్‌లు చాలామంది ఉన్నారు. సహాయకులూ ఉన్నారు. అవసరమైనప్పుడు సహాయం కూడా చేస్తారు. కానీ ధ్వనిని మరింత బలంగా వినిపించాలంటే ఆ సహాయక ఆత్మలను మరింత సమీపానికి తీసుకురావాలి. అవసరమైనప్పుడు కార్యానికి నిమిత్తమవుతున్నారు. కానీ ధ్వనిని బలంగా వినిపించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా వారిని తీర్చిదిద్దాలి. క్రొత్త ఆవిష్కరణ ద్వారా వారిని తాత్కాలిక సహయోగుల నుండి శాశ్వత సహయోగులుగా మార్చాలి. ఢిల్లీకి అలాంటి ధైర్యం ఉందా?
జగదీష్ అన్నయ్యతో:- మొదటి నుంచీ చాలా సేవ చేశారు. సేవకు నిమిత్తమయ్యారు. మంచి మంచి ఆవిష్కరణలు కూడా చేశారు. ఇప్పుడు చూడండి, వర్గీకరణ ఫలితం ఎంత బాగా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్లీ ఒక క్రొత్త ఆవిష్కరణ చేయాలి. అందరికీ మీపై ప్రేమ ఉంది. మురళీలో మీ పేరు వస్తే అందరి దృష్టి అక్కడికే వెళ్తుంది. ఇప్పుడు శరీరాన్ని బలవంతంగా నడపకండి. ప్రశాంతంగా కొనసాగించండి. ‘‘ఇది నేనే చేయాలి’’ అని అనుకోకండి. ఇతరులను కూడా మీ సమానంగా తయారుచేయండి. మేళా కూడా ఢిల్లీ నుంచే ప్రారంభమైంది. కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఇప్పుడు క్రొత్త ఆవిష్కరణ కూడా ఢిల్లీ నుంచే ప్రారంభం కావాలి. అచ్ఛా.
యు.పి.:- లక్నోలో చాలా మంచి మేళా జరుగుతోంది. ఇప్పుడెలా యు.పి. మొత్తాన్ని కలుపుకొని ఈ కార్యం చేశారో, అలాగే ఇప్పుడు ప్రభుత్వ సేవ కూడా బాగా చేయవచ్చు. అందరూ కలిసి ప్రభుత్వ సేవ చేస్తే అక్కడి ధ్వని నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. సేవలో సహాయకులయ్యే నాణ్యమైన వ్యక్తులు యు.పి.లో ఉన్నారు. ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నారు. మంచి పని చేశారు. బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. అభినందనలు తెలియజేస్తున్నారు. అనేక ఆత్మలకు ధ్వని చేరింది. ఇలాగే సంఘటితంగా ముందుకు సాగుతూ ఉండండి. ఆ భూమి చాలా మంచిది, సహజమైనది. కాబట్టి ముందుకు సాగండి. అచ్ఛా.
ఈస్టర్న్:- చాలా మంచి గ్రూపు వచ్చింది. సేవకు సంబంధించిన అభినందనలు బాప్‌దాదా ముందే ఇచ్చారు. ఇప్పుడు ధ్వనిని వ్యాప్తి చేయడంలో అందరి సహకారాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇది బ్రహ్మా బాబా ప్రత్యక్షతకు సంబంధించిన స్థలం. అందుకే బ్రహ్మా బాబా తొలి స్థలమైనట్లే, ఇప్పుడు అందరూ ఈ స్థలానికి పేరు తీసుకురావడానికి పురుషార్థం చేయాలి. అందరి సహకారంతో పేరు వచ్చింది. మంచి శ్రమ చేశారు. మంచి సహకారం అందించారు. ఇప్పుడు ఇలాగే సహాయకులై, ఈ తొలి స్థలాన్ని మరింత ప్రసిద్ధి చేయండి. కలకత్తాలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు సిద్ధమవ్వగలరు. అలాంటి సేవ చేసి, అనేకమందికి సేవలో నిమిత్తమయ్యే వ్యక్తిని సిద్ధం చేయండి. చాలా బాగుంది. ఇప్పుడు ధైర్యం కూడా బాగుంది. ఉల్లాస-ఉత్సాహాలు కూడా బాగున్నాయి. ఫలితాలు కూడా బాగున్నాయి. ముందుకు సాగుతూ ఉండండి. సాగుతూ సాగుతూ గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటారు. అచ్ఛా.
పంజాబ్:- అచ్ఛా. పంజాబ్వారు కూడా అన్ని ప్రాంతాలలో మంచి పేరు ప్రతిష్ఠలను తీసుకొచ్చారు. ప్రస్తుతం పంజాబ్ సేవలో చాలా బాగా ముందుకు సాగుతోంది. అందుకే పంజాబ్వారికి అలాగే హర్యానా, హిమాచల్ వారందరికీ సేవలో ముందుకు సాగుతున్నందుకు అభినందనలు. ఏ కార్యక్రమాలు చేసినా, మంచి సహకారంతో, విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం సేవలో వేగంగా ముందుకు వెళ్తున్నట్లే, ఇకముందు కూడా అలాగే వేగంగా ముందుకు సాగుతూ విజయాన్ని తప్పకుండా పొందాలి. ఫలితం చాలా బాగుంది. పంజాబ్వారికి అభినందనలు.
ఇందోర్-భోపాల్:- ఇందోర్ అయినా, భోపాల్ అయినా, ప్రతి ఒక్కరూ తమ తమ విధంగా సేవలో ముందుకు సాగుతున్నారు. బాప్‌దాదా చూశారు - సేవ పట్ల ఉల్లాస-ఉత్సాహాలు చాలా బాగున్నాయి. వృద్ధి కూడా నిరంతరం జరుగుతోంది. ఇప్పటివరకు ఎలా వృద్ధి చెందుతూ వచ్చారో, అలాగే భోపాల్‌లోనూ, ఇందోర్లోనూ ఎల్లప్పుడూ సేవలోను, స్వ-ఉన్నతిలోను ఆదర్శంగా నిలిచే శక్తివంతమైన ఒక గ్రూపును తయారుచేయండి. ఇరువైపులా అలాంటి ఒక గ్రూపు తయారవ్వాలి. వారు ఆదర్శంగా నిలిచి, తమ అనుభవాలను ఇతరులకు కూడా వినిపించగలగాలి. కాబట్టి మధ్యప్రదేశ్ అనుభవాలను వినిపించే ఒక గ్రూపును తయారుచేయాలి. సేవలో అయితే మంచిగానే ఉన్నారు, ఇకముందు కూడా చేస్తారు. కానీ బ్రాహ్మణుల సేవకు సంబంధించిన ఏ సందర్భంలోనైనా ఉదాహరణగా చూపించగలిగే ఒక గ్రూపును తయారుచేయండి. రెండూ మధ్యప్రదేశ్యే కదా! కాబట్టి ఇద్దరూ అలాంటి వారిని సిద్ధం చేయాలి. సేవా ప్రణాళికలను అయితే బాగానే తయారుచేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక గ్రూపు తయారవుతుందా? అయితే మార్చి నెలలో ఇరువైపుల నుండి అలాంటి గ్రూపును బాబా ఎదుటకు తీసుకురావాలి. సరేనా? అందరూ తమ తమ ప్రాంతాలలో గ్రూపులను తయారుచేయాలి. కానీ మొదట మీరు చేయండి. అన్ని జోన్లలోనూ గ్రూపులు తయారవ్వాలి. నిమిత్తంగా మొదటి స్థానంలో మీరు ఉండండి. సేవలో మీరు తెలివైనవారే. ప్రణాళికలను కూడా చాలా బాగా రూపొందిస్తారు. అచ్ఛా.
గుజరాత్:- గుజరాత్ సేవలో విహంగ మార్గాన్ని చూపించింది. చాలా బాగా చేసింది. ఇప్పుడు గుజరాత్ చేయవలసిన కొత్తదనం ఏమిటి? సేవను చేశారు, బాగా చేశారు. గుజరాత్లో అనేక ప్రాంతాలలో వారసుల క్వాలిటీ కలిగినవారు ఉన్నారు. ఇప్పుడు వారసుల క్వాలిటీ కలిగిన ఒక గ్రూపును తయారుచేసి తీసుకురావాలి. గుజరాత్ నుండి అలాంటి వారసుల క్వాలిటీ బయటకు రావచ్చని బాప్‌దాదాకు ఆశ ఉంది. అలాంటి వారు ఉన్నారు కూడా. కానీ వారిని సంఘటిత రూపంలో పెద్దల ఎదుటకు తీసుకురండి. అలాంటివారే కదా! వారసులే కదా! అయితే ఇప్పుడు అలాంటి ఒక గ్రూపును తీసుకురండి. వారసుల క్వాలిటీలో గుజరాత్ ఒక ఆదర్శంగా నిలవాలి. వారసులంటే ఏమిటో తెలుసు కదా - తనువు, మనస్సు, సహకారం - అన్నింటిలోనూ మొదటి స్థానంలో ఉండి, ప్రతి కార్యంలో, ప్రతి సమయంలో ఎవరెడీగా ఉండేవారిని వారసులు అంటాము. పిలుపు వచ్చిన వెంటనే హాజరయ్యేవారిని వారసుల క్వాలిటీ కలవారు అంటారు. ఎల్లప్పుడూ జీ హజూర్, హాజిర్ అని సిద్ధంగా ఉండి, ప్రతి కార్యంలో ముందుండేవారినే వారసులు అంటాము. కాబట్టి గుజరాత్ నుండి అలాంటి వారసులను తయారుచేయాలి. అచ్ఛా.
కర్ణాటక:- అచ్ఛా. మంచి గ్రూపు ఉంది. కర్ణాటకవారు ఎంత భావనాస్వరూపులో, అంతే ప్రతి కార్యంలో మంచి సహయోగులు కూడా. ఏ పని వచ్చినా, సంఖ్యాపరంగా కూడా సహకరించడానికి ముందుకొస్తారు. అందుకే కర్ణాటక భూమి సేవాధారుల పరంగా చాలా గొప్పది. కర్ణాటకలోని వి.ఐ.పి.లు కూడా మంచి భావన కలిగినవారు కావడంతో చక్కని సహకారాన్ని అందిస్తారు. అందువల్ల కర్ణాటకవారు కూడా అన్ని వైపులా ఉన్న వి.ఐ.పి.ల గ్రూపును తయారుచేయాలి. అలాంటి వి.ఐ.పి.లు మైక్లుగా కూడా మారగలరు. అయితే వారిని సంఘటిత రూపంలో పాలన ఇవ్వాలి. కాబట్టి కర్ణాటకలో ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో, వారు అలాంటి వి.ఐ.పి.ల సంఘటిత గ్రూపును తయారుచేయాలి. వారు ఎక్కడైనా సేవకు నిమిత్తమవ్వగలగాలి. వి.ఐ.పి. సేవ చేస్తున్నారు. కానీ వారిని సంఘటిత రూపంలో కార్యరంగంలోకి తీసుకురావాలి. అది మీరు చేయగలరు. కాబట్టి ఇప్పుడు సంఘటిత రూపంలో చేయండి. అచ్ఛా.
తమిళనాడు-కేరళ:- తమిళనాడు యొక్క విశేషత ఏమిటంటే, అక్కడి నిమిత్తమైన (రోజీ అక్కయ్య) వారి ధైర్యం చాలా మంచిది. నిమిత్తమైనవారిలో ధైర్యం ఉన్న కారణంగా నలువైపులా ఉన్న విద్యార్థులలో కూడా ధైర్యం చాలా బాగుంది. అందుకే హిమ్మతే బచ్చే మదదే బాబా(పిల్లల ధైర్యము బాబా సహాయము) అనేది సదా ఉంది. బాప్‌దాదా తమిళనాడు సేవాధారులకు ఎన్నో-ఎన్నో అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ముందు కూడా సేవలో కొత్త-కొత్త ఆవిష్కరణలు చేస్తూ, స్వయంగా ముందుకు సాగుతూ, ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. అచ్ఛా. ఓం శాంతి.
(1-1-99 నూతన సంవత్సర శుభప్రభాత సమయంలో రాత్రి 12 గంటల తర్వాత బాప్‌దాదా పిల్లలందరికీ నూతన సంవత్సర అభినందనలు తెలియజేశారు)
నలువైపులా ఉన్న అతి స్నేహీ సమీప బ్రాహ్మణ ఆత్మలకు నవ యుగ రచయిత యొక్క అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఇది వీడ్కోలు మరియు అభినందనల క్షణము. ఇది సంగమము. పాత సంవత్సరానికి వీడ్కోలు, పాత సంవత్సరముతోపాటు పాత విషయాలు, పాత సమస్యలు, పాత సంస్కారాలు అన్నింటికీ వీడ్కోలు మరియు క్రొత్త ఉల్లాస-ఉత్సాహాలతో సంపన్నమైన సంవత్సరానికి శుభాకాంక్షలతో పాటు అభినందనలు కూడా. ఈ సంవత్సరాన్ని సదా శ్రమ నుండి ముక్తులయ్యే సంవత్సరముగా జరుపుకోవాలి. ఈ సంవత్సరాన్ని సదా స్వయానికి మరియు సర్వులకు నిర్విఘ్న భవ వరదానముతో జరుపుకోవాలి. సదా విజయము మా జన్మసిద్ధ అధికారము అన్న ఈ నిశ్చయము మరియు నషాను సదా ప్రతి కర్మ చేస్తూ కూడా ఇమర్జ్ రూపంలో పెట్టుకునే సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని జరుపుకోవాలి. ఈ సంవత్సరములో ప్రతి ఒక్కరూ బాప్‌దాదా మరియు దాదీల నుండి నంబరువన్ లోకి వెళ్ళే బహుమతిని లేక కానుకను తీసుకోవాలి, దీని కొరకు విదేశీయులు మరియు భారతవాసులు అందరూ నంబరువన్ యొక్క నిశ్చయాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళాలి మరియు ఇతరులను తీసుకువెళ్ళాలి. మరి అందరికీ చాలా చాలా ప్రియస్మృతుల సహితంగా అన్ని రకాలుగా, మనసా, వాచా, అన్ని రూపాలతో బాప్‌దాదా పదమాల రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్క క్షణము అందరూ శక్తిశాలీ సంకల్పముతో, దృఢతతో పాత వస్తువులకు, పాత సంవత్సరానికి, పాత విషయాలకు సదా కాలము కొరకు వీడ్కోలు ఇవ్వండి. ఒక్క క్షణము కొరకు అందరూ దృఢతయే సఫలత అన్న ఈ ధృఢ సంకల్పములో స్థితులైపోండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
