Search for a command to run...
3 Mar 2000
‘‘జన్మ దినం యొక్క విశేష కానుక - శుభ భావము మరియు ప్రేమ భావమును ఇమర్జ్ చేసుకుని క్రోధమనే మహాశత్రువుపై విజయులుగా అవ్వండి’’
3 March 2000 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా తమ జన్మ సహచరులను, అలాగే సేవా సహచరులను చూసి హర్షిస్తున్నారు. ఈరోజు మీ అందరికీ బాప్‌దాదా యొక్క అలౌకిక జన్మ, అలాగే జన్మ సహచరుల యొక్క జన్మదివసము గురించి సంతోషము ఉంది, ఎందుకు? ఇటువంటి అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక జన్మ ఇతరులెవ్వరికీ ఉండదు. తండ్రి జన్మదినం కూడా అదే మరియు పిల్లల జన్మదినం కూడా అదే అని ఎప్పుడూ విని ఉండరు. అటువంటి అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్య జన్మదినాన్ని ఈరోజు మీరు జరుపుకుంటున్నారు. దీనితో పాటు అందరికీ ఒక అతీతమైన మరియు ప్రియమైన స్థితి స్మృతిలో ఉంది, అదేమిటంటే - ఈ అలౌకిక జన్మ ఎటువంటి విచిత్రమైనదంటే, ఇక్కడ స్వయంగా భగవంతుడైన తండ్రి తన పిల్లల జన్మదినాన్ని జరుపుతున్నారు. పరమాత్మ పిల్లల యొక్క, శ్రేష్ఠ ఆత్మల యొక్క జన్మదినాన్ని జరుపుతున్నారు. ప్రపంచములో అనేకమంది - మమ్మల్ని పుట్టించినవారు భగవంతుడు, పరమాత్మ అని నామమాత్రంగా అంటారు కానీ దాని గురించి వారికి తెలియదు కూడా, అలాగే ఆ స్మృతిలో నడుచుకోరు కూడా. మేము పరమాత్మ వంశీయులము, బ్రహ్మా వంశీయులము అని మీరందరూ అనుభవముతో అంటారు. పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతారు. మనము పరమాత్ముని జన్మదినాన్ని జరుపుతాము.
ఈరోజు అన్ని వైపుల నుండి ఇక్కడకు చేరుకున్నారు, ఎందుకు? శుభాకాంక్షలను ఇవ్వడానికి మరియు శుభాకాంక్షలను తీసుకోవడానికి. బాప్‌దాదా విశేషంగా తమ జన్మ సహచరులకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. సేవా సహచరులకు కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలతోపాటు పరమ ప్రేమ యొక్క ముత్యాల, వజ్రాల, రత్నాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రేమ ముత్యాలను చూసారు కదా. ప్రేమ ముత్యాల గురించి తెలుసు కదా? పూల వర్షాన్ని, బంగారు వర్షాన్ని అయితే అందరూ కురిపిస్తారు, కానీ బాప్‌దాదా మీ అందరిపైన పరమ ప్రేమ, అలౌకిక స్నేహం యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఒకసారి కాదు, పదమాల, పదమాల, పదమాల రెట్ల హృదయపూర్వక శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీరందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను ఇస్తున్నారు, అవి కూడా బాప్‌దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈరోజు జరుపుకునే మరియు శుభాకాంక్షలను అందించే రోజు. జరుపుకునే సమయంలో ఏం చేస్తారు? బ్యాండు మేళం మ్రోగిస్తారు. బాప్‌దాదా పిల్లలందరి మనసులోని సంతోషము అనే బ్యాండ్ అనండి, మేళ వాయిద్యాలు అనండి, వాటిని వింటున్నారు. భక్తులేమో పిలుస్తూ ఉన్నారు కానీ పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో ఇమిడిపోతారు. ఇమిడిపోవటము వస్తుంది కదా? ఇలా ఇమిడిపోవటమే సమానులుగా తయారుచేస్తుంది.
బాప్‌దాదా పిల్లలను తమ నుండి వేరు చెయ్యలేరు. పిల్లలు కూడా వేరు అవ్వాలని అనుకోరు కానీ అప్పుడప్పుడు మాయతో ఆటలాడుతూ, ఆటలాడుతూ కొద్దిగా పక్కకు వెళ్ళిపోతారు. నేను పిల్లలైన మీకు ఆధారాన్ని అని బాప్‌దాదా అంటారు, కానీ పిల్లలు అల్లరివారిగా ఉంటారు కదా. మాయ అల్లరివారిగా చేసేస్తుంది, వాస్తవానికి అటువంటివారు కారు, కానీ మాయ అలా తయారుచేస్తుంది. అప్పుడు ఆధారంగా ఉన్నవారి నుండి పక్కకు వచ్చేసేలా చేస్తుంది. అయినా కూడా బాప్‌దాదా ఆధారముగా అయ్యి మళ్ళీ సమీపముగా తీసుకువస్తారు. బాప్‌దాదా పిల్లలందరినీ అడుగుతారు - ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కోరుకుంటారు? విదేశీయులు రెండు విషయాలను చాలా ఇష్టపడతారు. డబల్ విదేశీయులకు చాలా ఇష్టమైన రెండు పదాలు ఏమిటి? (కంపానియన్ మరియు కంపెనీ అనగా సహచరుడు మరియు సాంగత్యము). ఈ రెండూ ఇష్టము. ఒకవేళ ఇష్టమైతే ఒక చేతిని ఎత్తండి. భారతవాసులకు ఇష్టమా? సహచరుడు కూడా అవసరము మరియు సాంగత్యము కూడా అవసరము. సాంగత్యము లేకుండా కూడా ఉండలేరు మరియు సహచరుడు లేకుండా కూడా ఉండలేరు. మరి మీ అందరికీ ఏమి లభించింది? సహచరుడు లభించారా? చెప్పండి, లభించారా లేదా? (హా జీ) సాంగత్యము లభించిందా? (హా జీ) ఇటువంటి సాంగత్యము మరియు ఇటువంటి సహచరుడు మొత్తము కల్పములో లభించారా? కల్పపూర్వము లభించారా? వీరు ఎటువంటి సహచరుడు అంటే వీరు ఎప్పుడూ పక్కకు వెళ్ళిపోరు, పిల్లలు ఎంత అల్లరివారిగా ఉన్నా సరే వారు ఆధారంగానే ఉంటారు. అంతేకాక మీ మనసులోని ప్రాప్తులన్నింటినీ పూర్తి చేస్తారు. ఏదైనా అప్రాప్తి ఉందా? ఈ మాట అందరి మనసులో నుండి వస్తుందా లేక మర్యాదపూర్వకంగా అప్రాప్తి లేదు అని చెప్తున్నారా? పొందాల్సిందేదో పొందేసాము అని పాటనైతే పాడుతారు, మరి పొందేసారా లేక పొందాలా? పొందేసారా? ఇప్పుడిక పొందడానికి ఏమీ లేదు కదా లేక కొన్ని-కొన్ని ఆశలు ఉండిపోయాయా? అన్ని అశలూ పూర్తయిపోయాయా లేక ఏమైనా ఉండిపోయాయా? బాప్‌దాదా అంటున్నారు - ఉండిపోయాయి. (బాబాను ప్రత్యక్షము చెయ్యాలనే ఆశ మిగిలిపోయి ఉంది) పిల్లలందరికీ సందేశము తెలియాలి అన్నది బాబా యొక్క ఆశ. బాబా వచ్చారు కానీ కొంతమంది ఇది తెలియకుండా ఉండిపోయారు... అన్నట్లు ఉండకూడదు. అందుకే బాప్‌దాదా యొక్క విశేషమైన ఆశ ఏమిటంటే - మా సదా యొక్క తండ్రి వచ్చారు అన్నది అందరికీ కనీసం తెలియనైనా తెలియాలి. పిల్లల యొక్క హద్దు ఆశలన్నీ పూర్తయిపోయాయి, ప్రేమతో కూడిన ఆశలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్టేజ్‌పైకి రావాలని కోరుకుంటారు, ఈ ఆశ ఉందా? (ఇప్పుడైతే బాబా స్వయంగా అందరి వద్దకు వస్తున్నారు) మరి ఈ ఆశ కూడా పూర్తయిపోయిందా? మీరు సంతుష్ట ఆత్మలు, అభినందనలు ఎందుకంటే పిల్లలందరూ తెలివైనవారు. ఎటువంటి సమయమో అటువంటి స్వరూపాన్ని తయారుచేసుకోవాల్సిందే అని అర్థం చేసుకుంటారు, అందుకే బాప్‌దాదా కూడా డ్రామా యొక్క బంధనములోనైతే ఉన్నారు కదా. పిల్లలందరూ ప్రతి సమయమనుసారంగా సంతుష్టంగా ఉంటారు మరియు సదా సంతుష్టమణులుగా అయ్యి మెరుస్తూ ఉంటారు. ఎందుకని? పొందవలసినదేదో పొందేసాము అని మీరు స్వయమే అంటారు. బ్రహ్మాబాబా యొక్క ఆది అనుభవము యొక్క మాట ఇది, మరి బ్రహ్మాబాబా మాటే బ్రాహ్మణులందరి మాట. కనుక బాప్‌దాదా పిల్లలందరికీ ఎల్లప్పుడూ ఇదే రివైజ్ చేయిస్తున్నారు - సదా బాబా సాంగత్యములో ఉండండి. బాబా సర్వ సంబంధాల అనుభవాన్ని చేయించారు. బాబాయే సర్వ సంబంధీకుడు అని అంటారు కూడా. మరి సర్వ సంబంధీకుడైనప్పుడు, ఎటువంటి సమయమో అటువంటి సంబంధాన్ని కార్యములో ఎందుకు అనుభవం చెయ్యరు! ఒకవేళ ఈ సర్వ సంబంధాలను ఎప్పటికప్పుడు అనుభవం చేస్తూ ఉన్నట్లయితే సహచరుడు కూడా ఉంటారు, సాంగత్యము కూడా ఉంటుంది. అప్పుడిక వేరే సహచరుల వైపుకు మనసు మరియు బుద్ధి వెళ్ళలేవు. బాప్‌దాదా ఆఫర్ చేస్తున్నారు - సర్వ సంబంధాలను ఆఫర్ చేస్తున్నప్పుడు సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకోండి. సంబంధాలను కార్యములో అనుభవం చెయ్యండి.
బాప్‌దాదా పిల్లలను గమనించినప్పుడు - కొంతమంది పిల్లలు కొన్ని-కొన్ని సమయాలలో స్వయాన్ని ఒంటరిగా లేక కాస్త నీరసంగా అనుభవం చేస్తూ ఉంటారు, అప్పుడు వారిపై బాప్‌దాదాకు దయ కలుగుతుంది, ఇంతటి శ్రేష్ఠ సాంగత్యము ఉన్నా కానీ సాంగత్యాన్ని కార్యంలోకి ఎందుకు తీసుకురారు? అప్పుడిక ఏమంటారు? వై, వై (ఎందుకు, ఎందుకు). బాప్‌దాదా అన్నారు - వై (ఎందుకు) అని అనకండి, వై అన్న మాట వచ్చినప్పుడు ఈ వై అనేది నెగిటివ్ మాట మరియు ఫ్లై (ఎగరటము) అనేది పాజిటివ్ మాట. కావున వై-వై అని ఎప్పుడూ అనకండి, ఫ్లై అన్న మాటను గుర్తుంచుకోండి. బాబాను సహచరునిగా చేసుకుని ఫ్లై చేసినట్లయితే చాలా ఆనందము కలుగుతుంది. ఆ సాంగత్యము మరియు ఆ సహచరుడు - ఈ రెండు రూపాలను మొత్తము రోజంతటిలో కార్యములోకి తీసుకురండి. ఇటువంటి సహచరుడు మళ్ళీ ఎప్పుడైనా లభిస్తారా? బాప్‌దాదా ఎంతవరకు చెప్తున్నారంటే - ఒకవేళ బుద్ధిపరంగా మరియు శరీరం పరంగా, రెండు రకాలుగా అలసిపోయినా సరే, ఆ సహచరుడు మీకు రెండు రకాలుగానూ మాలిష్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీకు మనోరంజనాన్ని అందించడానికి కూడా ఎవరెడీగా ఉన్నారు. అప్పుడిక హద్దు మనోరంజనము యొక్క అవసరమే ఉండదు. ఇలా బాబాను ఉపయోగించుకోవటము వస్తుందా లేక చాలా-చాలా పెద్ద తండ్రి, టీచరు, సద్గురువు... అని ఇలానే అనుకుంటారా? కానీ వారితో సర్వ సంబంధాలు ఉన్నాయి. అర్థమైందా! డబల్ విదేశీయులు?
అచ్ఛా - అందరూ పుట్టినరోజును జరుపుకోవటానికి వచ్చారు కదా! జరుపుకోవాలి కదా! అచ్ఛా, పుట్టినరోజు జరిపినప్పుడు, ఎవరి పుట్టినరోజునైతే జరుపుతారో వారికి ఏదైనా కానుకను ఇస్తారా లేక ఇవ్వరా? (ఇస్తారు). మరి ఈరోజు మీరందరూ బాబా పుట్టినరోజును జరపడానికి వచ్చారు. పేరు శివరాత్రి కదా, కావున విశేషంగా బాబా పుట్టినరోజును జరపడానికి వచ్చారు. ఇది జరపటానికే వచ్చారు కదా? మరి ఈరోజు పుట్టినరోజు కానుకగా ఏమి ఇచ్చారు? లేదా కేవలం కొవ్వొత్తులు వెలిగించటము, కేక్ కట్ చెయ్యటము.. ఇంతే జరుపుతారా? ఈరోజు ఏ కానుకను ఇచ్చారు? లేక రేపు ఇస్తారా? చిన్నదైనా లేక పెద్దదైనా కానీ, కానుకనైతే ఇస్తారు కదా! మరి ఏం ఇచ్చారు? ఆలోచిస్తున్నారు. అచ్ఛా, ఇవ్వాలా? ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? బాప్‌దాదా ఏది చెప్తే అది ఇస్తారా లేక మీరు మీ ఇష్టప్రకారంగా ఇస్తారా? ఏం చేస్తారు? బాప్‌దాదా ఏది చెప్తే అది ఇస్తారా లేక మీ ఇష్ట ప్రకారంగా ఇస్తారా? (బాప్‌దాదా ఏది చెప్తే అది ఇస్తాము). చూడండి, కాస్త ధైర్యం పెట్టాల్సి ఉంటుంది. ధైర్యము ఉందా? మధుబన్ వారు ధైర్యము ఉందా? డబల్ విదేశీయులలో ధైర్యము ఉందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. అచ్ఛా - శక్తులలో, పాండవులలో ధైర్యము ఉందా? భారతవాసులలో ధైర్యము ఉందా? చాలా మంచిది. ఇవే బాబాకు శుభాకాంక్షలుగా లభించాయి. అచ్ఛా, మరి వినిపించాలా! ఈ విషయంలో కాస్త ఆలోచించాల్సి ఉంటుంది అనైతే అనరు కదా? చేస్తాములే, చూస్తాములే అని ఇలా లే, లే అని అనకండి. ఒక విషయాన్ని బాప్‌దాదా మెజారిటీలో చూసారు. మైనారిటీలో కాదు, మెజారిటీలో చూసారు. ఏం చూసారు? ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి ఎదురుగా వస్తే మెజారిటీలో ఒకటి, రెండు, మూడవ నంబరులలో క్రోధము యొక్క అంశము వద్దనుకున్నా కానీ ఇమర్జ్ అవుతుంది. కొందరిలో మహా క్రోధము రూపములో ఉంటుంది, కొందరిలో ఆవేశము రూపములో ఉంటుంది, కొందరిలో మూడవ నంబర్‌గా చికాకు రూపంలో ఉంటుంది. చికాకు అంటే ఏమిటో తెలుసా? అది కూడా క్రోధము యొక్క అంశమే, కాస్త తేలికపాటిది. మూడవ నంబరులో ఉంది కదా, అందుకని అది కాస్త తేలికపాటిది. మొదటిది తీవ్రంగా ఉంటుంది, రెండవది మొదటిదానికంటే కాస్త తక్కువగా ఉంటుంది. ఈరోజుల్లో భాష అయితే అందరిదీ చాలా రాయల్‌గా ఉంది. రాయల్ రూపములో ఏమంటారు? విషయమే అటువంటిది కదా, కనుక ఆవేశమైతే తప్పకుండా వస్తుంది అని అంటారు. ఈరోజు బాప్‌దాదా అందరి నుండి ఈ కానుకను తీసుకోవాలని కోరుకుంటున్నారు - క్రోధము కాదు కదా, క్రోధము యొక్క అంశమాత్రము కూడా ఉండకూడదు. ఎందుకని? క్రోధములోకి వచ్చి డిస్‌సర్వీస్ చేస్తారు ఎందుకంటే క్రోధమనేది ఇద్దరి మధ్యలో వస్తుంది. ఒక్కరిలోనే ఉండదు, ఇద్దరి మధ్యలో ఉంటుంది కావున అది కనిపిస్తుంది. మనసులోనైనా ఎవరి పట్లనైనా అంశమాత్రమైనా ద్వేష భావము ఉంటే, అప్పుడు మనసులో కూడా ఆ ఆత్మ పట్ల ఆవేశము తప్పకుండా వస్తుంది. బాప్‌దాదాకు డిస్సర్వీస్కు కారణమైన ఈ విషయము మంచిగా అనిపించటం లేదు. కనుక క్రోధ భావము అంశమాత్రము కూడా ఉత్పన్నమవ్వకూడదు. ఏ విధంగా బ్రహ్మచర్యముపై అటెన్షన్ పెడతారో, అలాగే కామము మహాశత్రువని, క్రోధము మహాశత్రువని అంటూ ఉంటారు. క్రోధము వల్ల శుభ భావము, ప్రేమ భావము ఇమర్జ్ అవ్వవు. ఇక మూడ్ ఆఫ్ అవుతారు, ఆ ఆత్మ నుండి పక్కకు తప్పుకుంటారు, వారికి ఎదురుగా రారు, వారితో మాట్లాడరు, వారి మాటలను తిరస్కరిస్తారు, ముందుకు వెళ్ళనివ్వరు. ఇవన్నీ బయటివారికి కూడా తెలిసిపోతుంటాయి. ఈరోజు వీరి ఆరోగ్యం బాగోలేదు, అంతే, ఇంకేం లేదు అని కప్పిపుచ్చుతూ ఉంటారు. మరి పుట్టినరోజుకు ఈ కానుకను ఇవ్వగలరా? ప్రయత్నిస్తాము అని ఎవరైతే అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. కానుకను ఇవ్వటానికి ఆలోచిస్తాము, ప్రయత్నిస్తాము అనేవారు చేతులెత్తండి. సత్యమైన మనసుపై కూడా సాహెబు రాజీ అవుతారు. (చాలామంది సోదర-సోదరీలు లేచి నిలబడ్డారు) నెమ్మది-నెమ్మదిగా లేస్తున్నారు. సత్యము చెప్పినందుకు అభినందనలు. అచ్ఛా, ప్రయత్నిస్తాము అని ఎవరైతే అన్నారో అది మంచిదే, ప్రయత్నమైతే చెయ్యండి, కానీ ప్రయత్నించటానికి ఎంత సమయము కావాలి? ఒక నెల కావాలా, 6 నెలలు కావాలా, ఎంత సమయము కావాలి? వదులుతారా లేక వదిలే లక్ష్యమే లేదా? ప్రయత్నిస్తాము అని ఎవరైతే అన్నారో, వారు మళ్ళీ లేచి నిలబడండి. మేము రెండు, మూడు నెలల్లో ప్రయత్నించి వదులుతాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు కూర్చోండి. 6 నెలలు కావాలి అని ఎవరైతే భావిస్తున్నారో, ఒకవేళ 6 నెలలు పూర్తిగా పట్టినా కానీ దానిని తగ్గించుకోవలసిందే. ఈ విషయాన్ని వదలెయ్యకూడదు ఎందుకంటే క్రోధాన్ని వదలటమనేది చాలా అవసరము. దాని ద్వారా డిస్‌సర్వీస్ కనిపిస్తుంది. నోటితో మాట్లాడకపోయినా, ముఖమైతే చెప్పేస్తుంది, అందుకే ఎవరైతే ధైర్యాన్ని పెట్టారో వారందరిపైనా బాప్‌దాదా జ్ఞానము, ప్రేమ, సుఖము, శాంతి యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. అచ్ఛా!
బాప్‌దాదా రిటర్న్ గిఫ్ట్‌గా అందరికీ ఏ విశేష వరదానాన్ని ఇస్తున్నారంటే - పొరపాటుగానైనా, అనుకోకుండానైనా ఎప్పుడైనా క్రోధము వచ్చినా కానీ కేవలము మనస్ఫూర్తిగా ‘‘మీఠా బాబా (మధురమైన బాబా)’’ అని అనండి, అప్పుడు బాబా ఇచ్చే అదనపు సహాయము ధైర్యము కలవారికి తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మీఠా బాబా అని అనండి, కేవలం బాబా అని అనకండి. ‘‘మీఠా బాబా (మధురమైన బాబా)’’ అని అంటే సహాయము లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే లక్ష్యము పెట్టుకున్నారు కదా, కావున లక్ష్యము ద్వారా లక్షణాలు వచ్చేదే ఉంటుంది. మధుబన్ వారు చేతులెత్తండి. అచ్ఛా - చెయ్యాల్సిందే కదా! (హా జీ) అభినందనలు. చాలా మంచిది. ఈరోజు ప్రత్యేకంగా మధుబన్ వారికి టోలీ ఇస్తాము. చాలా శ్రమ చేస్తారు. క్రోధం గురించి ఇవ్వటం లేదు, శ్రమ చేసినందుకు ఇస్తాము. క్రోధం విషయములో చేతులెత్తాము కాబట్టి టోలీ ఇస్తున్నారేమో అని అందరూ అనుకుంటారు. వీరు చాలా బాగా శ్రమిస్తున్నారు. అందరినీ సేవ ద్వారా సంతుష్టపరచటములో మధుబన్ ఒక ఉదాహరణ, అందుకే ఈరోజు నోటిని తీపి చేస్తాము. మీరందరూ వీరి నోటిని తీపి చేయటాన్ని చూసి మీరూ నోటిని తీపి చేసుకోండి, సంతోషము కలుగుతుంది కదా. ఇది కూడా బ్రాహ్మణ పరివారము యొక్క ఒక కల్చర్. ఈరోజుల్లో మీరు కల్చర్ ఆఫ్ పీస్ అన్న ఒక ప్రోగ్రామ్‌ను తయారుచేస్తున్నారు కదా. ఇది కూడా మొదటి నంబరు కల్చర్ - ‘‘బ్రాహ్మణ కులము యొక్క సభ్యత’’. బాప్‌దాదా చూసారు, దాదీ కానుకను ఇస్తారు కదా, అందులో ఒక చిన్న సంచి ఉంటుంది, దానిపై ఇలా వ్రాసి ఉంటుంది - ‘‘తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి.’’ కనుక ఈరోజు బాప్‌దాదా ఈ కానుకను ఇస్తున్నారు. సంచిని ఇవ్వటం లేదు, వరదానముగా ఈ మాటలను ఇస్తున్నారు. బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి ముఖములో, నడవడికలో ఈ బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షమవ్వాలి. ప్రోగ్రామ్నైతే తయారుచేస్తారు, భాషణ కూడా చేస్తారు, కానీ ముందుగా స్వయములో ఈ సభ్యత ఉండటము అవసరము. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ నవ్వుతూ ప్రతి ఒక్కరితో సంపర్కములోకి రావాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉండకూడదు. ఎవరినో చూసి మీ కల్చర్‌ను వదలకండి. గడిచిపోయిన విషయాలను మర్చిపోండి. కొత్త సంస్కారాలను సభ్యత కల జీవితంలో చూపించండి. ఇప్పుడు చూపించాలి, సరేనా! (అందరూ హా జీ అన్నారు)
చాలా మంచిది, డబల్ విదేశీయులు మెజారిటీ హా జీ అనటంలో చాలా మంచిగా ఉన్నారు. మంచిది. భారతవాసులకైతే ‘‘హాజీ అని అనటం’’ ఒక మర్యాదగా ఉండనే ఉంది. కేవలం మాయకు మాత్రమే ‘‘నాజీ (కాదు)’’ అని చెప్పండి, అంతే, ఇతర ఆత్మలకు హాజీ, హాజీ అనే చెప్పండి. మాయకు నాజీ, నాజీ (కాదు, కాదు) అని చెప్పండి. అచ్ఛా. అందరూ పుట్టినరోజును జరుపుకున్నారా? జరుపుకున్నారు, కానుకను ఇచ్చారు, కానుకను తీసుకున్నారు.
అచ్ఛా - మీతో పాటు వేరు వేరు స్థానాలలో కూడా సభలు ఏర్పాటు అయ్యాయి. కొన్నిచోట్ల చిన్న సభలు ఉన్నాయి, కొన్నిచోట్ల పెద్ద సభలు ఉన్నాయి, అందరూ వింటున్నారు, చూస్తున్నారు. వారికి కూడా బాప్‌దాదా ఇదే చెప్తున్నారు - ఈరోజున మీరందరూ కూడా కానుకను ఇచ్చారా, లేదా? హాజీ బాబా, ఇచ్చాము అని అందరూ అంటున్నారు. మంచిది, దూరంలో కూర్చుని ఉన్నా కూడా ఎదురుగా ఉండి వింటున్నట్లుగా ఉంది ఎందుకంటే సైన్స్ వారు ఎంతో శ్రమిస్తున్నారు, చాలా శ్రమ చేస్తారు కదా. కనుక అందరికంటే ఎక్కువ లాభం బ్రాహ్మణులకు కలగాలి కదా! అందుకే ఎప్పటి నుండైతే సంగమయుగము ప్రారంభమైందో, అప్పటి నుండి ఈ సైన్స్ సాధనాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సత్యయుగములోనైతే దేవతా రూపములో ఉన్న మీకు ఈ సైన్స్ సేవ చేస్తుంది, కానీ సంగమయుగములో కూడా సైన్స్ సాధనాలు బ్రాహ్మణులైన మీకు లభిస్తున్నాయి మరియు సేవలో కూడా, ప్రత్యక్షతలో కూడా ఈ సైన్స్ సాధనాలు చాలా విశాల రూపములో సహయోగిగా అవుతాయి, అందుకే సైన్స్‌కు నిమిత్తులుగా అయ్యే పిల్లలను కూడా బాప్‌దాదా వారి శ్రమకు అభినందనలు చెప్తారు.
ఇకపోతే బాప్‌దాదా చూసారు – మధుబన్కు కూడా దేశ-విదేశాల నుండి చాలా మంచి-మంచి సుందరమైన కార్డులు, ఉత్తరాలు వచ్చాయి మరియు కొందరి ద్వారా ప్రియస్మృతులను పంపించారు. బాప్‌దాదా వారికి కూడా విశేష ప్రియస్మృతులు మరియు జన్మదినము సందర్భంగా పదమా, పదమా, పదమా, పదమా, పదమా రెట్ల అభినందనలను ఇస్తున్నారు. పిల్లలందరూ బాప్‌దాదా నయనాల ఎదురుగా వస్తున్నారు. మీరైతే కేవలం కార్డులు చూసారు, కానీ బాప్‌దాదా పిల్లలను కూడా నయనాలతో చూస్తున్నారు. చాలా స్నేహముతో పంపిస్తారు మరియు ఆ స్నేహముతోనే బాప్‌దాదా వాటిని స్వీకరించారు. చాలామంది వారి స్థితులు గురించి కూడా వ్రాసారు. బాప్‌దాదా అంటున్నారు, ఎగరండి మరియు ఎగిరించండి. ఎగరటం వలన అన్ని విషయాలు కిందే ఉండిపోతాయి మరియు మీరు సదా ఉన్నతోన్నతమైన బాబాతోపాటు ఉన్నతంగా ఉంటారు. క్షణములో స్టాప్ చెయ్యండి మరియు శక్తుల, గుణాల స్టాక్‌ను ఇమర్జ్ చెయ్యండి. అచ్ఛా!
నలువైపుల ఉన్న సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, సదా బాబా సాంగత్యములో ఉండేవారికి, బాబాను సహచరునిగా చేసుకునే స్నేహీ ఆత్మలకు, సదా బాబా యొక్క గుణాల సాగరములో ఇమిడిపోయే బాప్‌దాదా సమానులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా క్షణములో బిందువు పెట్టే మాస్టర్ సింధు స్వరూప ఆత్మలకు, బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు చాలా-చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నమస్తే అని అయితే బాప్‌దాదా ప్రతి సమయము, పిల్లలు ప్రతి ఒక్కరికీ చెప్తుంటారు, ఈరోజు కూడా నమస్తే.
ఎడ్యుకేషన్ వింగ్:- ఎడ్యుకేషన్ వారు చేతులెత్తండి. ఎడ్యుకేషన్ వారు తమ శ్రేష్ఠ ఎడ్యుకేషన్‌ను ఎప్పటికప్పుడు ప్రత్యక్షం చేస్తున్నారు మరియు చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ మానవుడిని ఎంత శ్రేష్ఠంగా తయారు చేస్తుందంటే ఒక్క జన్మ కాదు, అనేక జన్మలు ఆత్మకు అప్రాప్తి ఉండదు. ఈరోజుల్లో ఉన్న ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్గా వ్యక్తినైతే తయారు చేస్తుంది కానీ జీవితానికి కావలసిన సర్వ ప్రాప్తులను కూడా ఇవ్వలేకపోతుంది. చదువు తర్వాత భవిష్యత్తు ఏమిటి అన్న గ్యారంటీ ఏ విద్యార్థికి కూడా లేదు. కానీ, ఈ ఎడ్యుకేషన్‌తో ఏ గ్యారంటీ ఉంది, ఏ ప్రాప్తులు లభిస్తాయి అని మీరు స్పష్టం చేయండి. ఒక్క జన్మకు కాదు, జన్మజన్నలకు. కనుక విద్యార్థులకు ఉత్సాహాన్ని మరియు ధైర్యాన్ని కలిగించే విషయాలను వినిపించి ఈ ఎడ్యుకేషన్ యొక్క మహత్వాన్ని స్పష్టం చేయండి. వర్తమానంలో ఏమి లభిస్తుంది మరియు భవిష్యత్తులో ఏమి లభిస్తుంది – రెండిటినీ మీరు స్పష్టం చేయవచ్చు. ఇది చాలా సరళమైన ఎడ్యుకేషన్. తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతిని కలిగించే ఎడ్యుకేషన్. ఇటువంటి సంతోషము మరియు ధైర్యమును కలిగించే విషయాలను చెప్పండి. అర్థమయిందా! అచ్ఛా.
యూథ్ వింగ్:- యూథ్ వింగ్ వారు చేతులెత్తండి. యూథ్కు ఉన్న బాధ్యతలు ఏమిటో మీరు పాటలో వినిపిస్తారు కదా. పాట తయారై ఉంది కదా! యూథ్కు విశేషంగా విశ్వ పరివర్తనలో విశేషమైన పాత్ర ఉంది ఎందుకంటే ఆల్మైటీ గవర్నమెంట్ మరియు ఈనాటి గవర్నమెంట్ ఇద్దరికీ యూథ్పై చాలా ఆశలు ఉన్నాయి. అందుకే యూథ్ పరివర్తనకు స్తంభాలుగా అవ్వగలరు. చాలావరకు యూథ్ ఏదైనా కార్యం చేస్తే కాగడను ముందుకు తీసుకువచ్చి ఆరంభిస్తారు. బ్రాహ్మణ యూథ్ అయిన మీరు మీ నడవడిక మరియు ముఖంలో ఎటువంటి కాగడను చూపించాలంటే అందరి దృష్టి వద్దన్నా మీపైకి రావాలి. ఎక్కడెక్కడైతే యూథ్ సేవను చేసారో, అక్కడి సహయోగులను లేక సంపర్కంలో ఉన్న గ్రూప్‌ను పిలవండి. ముందుగా ఒక్కొక్క పట్టణంలో చేయండి, తర్వాత జోన్లో చేయండి. తర్వాత అటువంటి గ్రూప్‌ను మధుబన్కు తీసుకురండి. సేవ యొక్క ప్రత్యక్ష స్వరూపము సంగఠనలో కనిపించాలి. అర్థమయిందా! అచ్ఛా.
పంజాబ్ సేవాధారులతో:- బాగుంది, ఈ సేవా అవకాశము బేహద్దు కార్య వ్యవహారాలను నేర్పిస్తుంది. సత్యయుగంలో రాజధానిని సంభాళిస్తారు కదా, మరి సంభాళించే అభ్యాసము ఇక్కడి నుండే ఉండాలి కదా. ప్రతి జోన్‌కు ఇది మంచి అవకాశము లభిస్తుంది. బ్రాహ్మణులను సేవతో సంతుష్టపరచాలి మరియు సంతుష్టతతో ఆశీర్వాదాలను జమ చేసుకోవాలి. మరి పంజాబ్ వారు ఇది అనుభవం చేసారా? సంభాళించే అనుభవం వస్తూ ఉంది కదా! బేహద్దును సంభాళించడము. సెంటరులో అయితే హద్దు ఉంటుంది కదా. బేహద్దు రాజ్యాన్ని సంభాళించాలి, ఆ సంస్కారాలు నిండుతూ ఉంటాయి. సేవతో పాటు రాజ్యాన్ని నడిపించే ట్రైనింగ్ కూడా లభిస్తూ ఉంటుంది. సమీపంగా కూడా వస్తారు. సేవతో సమీపత స్వతహాగా వస్తుంది. చాలా బాగా చేసారు మరియు సదా చాలా చాలా మంచిగా ఉండవలసిందే. సరేనా – పంజాబ్ వారు. టీచర్లు చేతులెత్తండి. మంచిగా అనిపించింది కదా. పంజాబ్ సేవాధారులు చేతులెత్తండి. సేవాధారి మాతలు చేతులెత్తండి. చాలా మంచిది.
డబల్ విదేశీయులు:- ఈనాటి సభలో డబల్ విదేశీయుల గ్రూప్ కూడా పెద్దగా ఉంది మరియు ఎదురుగా కూడా కూర్చుని ఉన్నారు. పేరే ఉంది డబల్ విదేశీయులు. డబల్ విదేశీయులు అనగానే ఒరిజినల్ విదేశము గుర్తుకు వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని డబల్ విదేశీయులు అని పిలిస్తే వారికీ గుర్తుకు వస్తుంది మరియు మీకు కూడా గుర్తుకు వస్తుంది. డబల్ విదేశీయులను బాప్‌దాదా సదా మెజారిటీ ధైర్యంలో మరియు స్వచ్ఛమైన హృదయంలో ముందుంచుతారు. ఏమి జరిగినాగానీ ధైర్యంగా ఉండి ముందుకు నడుస్తున్నారు మరియు ముందుకు నడుస్తూ ఉంటారు. ఎవరిలో అయితే సత్యత మరియు స్వచ్ఛత ఉంటాయో వారే బాప్‌దాదాకు అందరికన్నా సమీప రత్నముగా అనిపిస్తారు. హృదయము స్వచ్ఛముగా మరియు సత్యముగా ఉంటే ఆ పిల్లలు ఎంత దూరంలో ఉన్నాగానీ వారు బాప్‌దాదాకు అందరికన్నా ఎక్కువ సమీపంగా మరియు హృదయంలో ఉంటారు. కావున ఈ విశేషతను సదా ముందుంచుకుని మీ విశేషతలను ముందుకు తీసుకు వెళ్తూ ఉండండి. ఇది సమీపంగా వచ్చేందుకు చాలా సహజమైన సాధనము. అసలైతే ఇది అందరికీ వర్తిస్తుంది, భారతవాసులకు కూడా. కానీ డబల్ విదేశీయులలో విశేషంగా ఈ విశేషత మెజారిటీ వారిలో ఉంది, ఇప్పుడు ఈ విశేషతను స్వయంలో కూడా పెంచండి, పెంచుతూ-పెంచుతూ సమీపంగా వస్తూ-వస్తూ సమానంగా అయిపోతారు. సరేనా! బాప్‌దాదా సదా అమృతవేళ వరదానాల జోలెను పట్టుకుని నలువైపుల తిరుగుతారు. అచ్ఛా. డబల్ విదేశీ పిల్లలకు విశేషంగా ధైర్యంగా ముందుకు నడుస్తున్నందుకు, జన్మ దినం యొక్క డబల్ శుభాకాంక్షలు.
బాప్‌దాదా తమ హస్తాలతో జెండాను ఎగురవేసారు, 64వ శివ జయంతి నిమిత్తంగా 64 క్రొవ్వొత్తులను వెలిగించారు మరియు పిల్లలందరికీ శివ జయంతికి శుభాకాంక్షలు తెలిపారు:-
అందరూ తమ పుట్టిన రోజును కూడా జరుపుకున్నారు, జెండాను కూడా ఎగురవేసారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులలో ఈ జెండాను ఎగురవేయాలి. మీ అందరి హృదయాలలో అయితే బాబా జెండా ఎగురుతూనే ఉంది, ఇప్పుడు ‘‘నా బాబా’’ అని విశ్వము అనాలి. ఈ ధ్వని, నగారా మ్రోగినట్లుగా ఎక్కువ ధ్వనితో మ్రోగుతుంది. అలాగే ‘‘నా బాబా’’ అన్న నగారా ఎంతో గట్టిగా మ్రోగాలి. ఇది పిల్లలందరి మనసు యొక్క ఆశ. అనేక సార్లు జరిగింది, ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వవలసిందే. ఆరోజు అందరూ కలిసి ఏ పాటను పాడుతారు? వాహ్ బాబా వాహ్! వాహ్ డ్రామా వాహ్! అందరి మనసులలో బాబా, బాబా మరియు బాబాయే ఉంటారు. ఆ రోజు కనిపిస్తుంది కదా! కనిపిస్తుందా? ఆ రోజు రానే వచ్చేసింది. అందరికీ అభినందనలు లభించాయి. మీ అందరికీ అభినందనలు మరియు అందరికీ ఈ రోజుకు అభినందనలు ఇప్పించాలి. అవతరణ-దివసము, జన్మ-దివసము, పరివర్తన-దివసము, ప్రత్యక్షత-దివసము వచ్చేదే ఉంది. అచ్ఛా. అందరికీ ఈ రోజుకు గోల్డెన్ నైట్, డైమండ్ నైట్. అచ్ఛా.
*** ఓంశాంతి ***