‘‘మనసును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకుని డబల్ లైట్ ఫరిశ్తా స్థితిని అనుభవము చెయ్యండి’’
ఈరోజు బాప్‌దాదా తమ స్వరాజ్య అధికారీ పిల్లలను చూస్తున్నారు. స్వరాజ్యము బ్రాహ్మణ జీవితము యొక్క జన్మసిద్ధ అధికారము. బాప్‌దాదా బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరినీ స్వరాజ్యానికి సింహాసనాధికారులుగా తయారుచేసారు. స్వరాజ్య అధికారము జన్మించినప్పటి నుండే ప్రతి బ్రాహ్మణ ఆత్మకు ప్రాప్తించింది. ఎంతగా స్వరాజ్యములో స్థితి అయి ఉంటారో, అంతగానే స్వయములో లైట్ (ప్రకాశము) మరియు మైట్ (శక్తి) అనుభవం చేస్తారు.
బాప్‌దాదా ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకముపై ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. స్వయములో ఎంతగా శక్తిని ధారణ చేస్తారో, అంతగానే నంబరువారుగా ప్రకాశ కిరీటము మెరుస్తుంది. బాప్‌దాదా పిల్లలందరికీ సర్వ శక్తులను అధికార రూపములో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులే, కానీ ధారణ చెయ్యటంలో నంబరువారుగా అయిపోయారు. బాప్‌దాదా చూసారు - సర్వ శక్తుల జ్ఞానము కూడా అందరిలో ఉంది, ధారణ కూడా ఉంది, కానీ ఒక విషయములో తేడా వస్తుంది. బ్రాహ్మణ ఆత్మలెవరిని అడిగినా కానీ ప్రతి శక్తి గురించి వర్ణన కూడా చాలా బాగా చేస్తారు, ప్రాప్తుల గురించిన వర్ణనను కూడా చాలా బాగా చేస్తారు. కానీ అంతరము ఏమిటంటే ఏ సమయములో ఏ శక్తి యొక్క అవసరముంటుందో, ఆ సమయములో ఆ శక్తిని కార్యములో పెట్టలేకపోతారు. ఈ శక్తి యొక్క అవసరము కలిగింది కదా అని సమయము గడిచిపోయిన తరువాత రియలైజ్ అవుతారు. బాప్‌దాదా పిల్లలతో అంటారు - సర్వ శక్తుల వారసత్వమనేది ఎంతటి శక్తిశాలి అయినదంటే ఏ సమస్య కూడా మీ ముందు నిలబడలేదు. సమస్యాముక్తులుగా అవ్వగలుగుతారు. దీని కొరకు కేవలం సర్వ శక్తులను ఇమర్జ్ రూపములో, స్మృతి రూపములో ఉంచుకోండి మరియు సమయానికి కార్యంలో ఉపయోగించండి. దీని కొరకు మీ బుద్ధి లైన్‌ను క్లియర్‌గా (స్పష్టంగా) ఉంచుకోండి. ఎంతగా బుద్ధి లైన్ క్లియర్ మరియు క్లీన్‌గా (స్పష్టంగా మరియు స్వచ్ఛంగా) ఉంటుందో, అంతగా నిర్ణయ శక్తి తీవ్రతరం అయిన కారణంగా ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరముంటుందో, ఆ శక్తిని కార్యములో ఉపయోగించగలుగుతారు ఎందుకంటే సమయ ప్రమాణంగా బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా, శ్రమతో కూడిన పురుషార్థము నుండి ముక్తులుగా చూడాలనుకుంటారు. అందరూ అయితే తప్పకుండా తయారవ్వవలసిందే కానీ బహుకాలపు ఈ అభ్యాసము అవసరము. బ్రహ్మాబాబా యొక్క విశేష సంస్కారాన్ని చూసారు ‘‘తక్షణ దానం మహా పుణ్యం’’. జీవిత ఆరంభము నుండీ ప్రతి కార్యములో దానము కూడా తక్షణమే చేసేవారు, పని కూడా తక్షణమే చేసేవారు. బ్రహ్మాబాబా విశేషత ఏమిటంటే వారి నిర్ణయ శక్తి సదా ఫాస్ట్‌గా ఉండేది. మరి బాప్‌దాదా రిజల్టును చూసారు. అందరినీ తనతోపాటు తోడుగా తీసుకునే వెళ్ళాలి. బాప్‌దాదాతో పాటు వచ్చేవారే కదా! లేక వెనుక-వెనుక వచ్చేవారా? కలిసే వెళ్ళాలి అన్నప్పుడు బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యండి. కర్మలలో బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యండి మరియు స్థితిలో నిరాకారీ శివబాబాను ఫాలో చెయ్యాలి. ఫాలో చెయ్యటం వస్తుంది కదా?
డబల్ విదేశీయులకు ఫాలో చెయ్యటం వస్తుందా? ఫాలో చెయ్యటమైతే సహజమే కదా! ఫాలో చెయ్యాల్సి వచ్చినప్పుడు ఇక ఎందుకు, ఏమిటి, ఎలా... ఇవన్నీ సమాప్తమైపోతాయి. మరియు అందరికీ అనుభవముంది, వ్యర్థ సంకల్పాలకు ఈ ఎందుకు, ఏమిటి, ఎలా... అనే పదాలే నిమిత్తమవుతాయి, ఇవే ఆధారమవుతాయి. ఫాలో ఫాదర్ అన్నప్పుడు ఈ పదాలు సమాప్తమైపోతాయి. ఎలా అని కాదు, ఇలా. ఇలా నడుచుకో, ఇలా చెయ్యి అని బుద్ధి వెంటనే నిర్ణయిస్తుంది. కావున బాప్‌దాదా ఈరోజు విశేషంగా పిల్లలందరికీ, వారు మొదటిసారి వచ్చినవారైనా, లేక పాతవారైనా కానీ, అందరికీ ఇదే సూచనను ఇస్తున్నారు - మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి. చాలామంది మనసులలో ఇప్పటికీ వ్యర్థము మరియు నెగెటివ్ అనే చిన్న, పెద్ద మచ్చలు ఉన్నాయి. ఈ కారణంగా పురుషార్థము యొక్క శ్రేష్ఠ స్పీడ్‌లో, తీవ్రగతిలో ఆటంకము వస్తుంది. బాప్‌దాదా సదా ఏ శ్రీమతాన్ని ఇస్తారంటే - మనసులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనను మరియు శుభ కామనను ఉంచుకోండి - ఇదే స్వచ్ఛమైన మనసు. అపకారుల పట్ల కూడా ఉపకార వృత్తిని పెట్టుకోవటము - ఇదే స్వచ్ఛమైన మనసు. స్వయము గురించైనా లేక ఇతరుల గురించైనా వ్యర్థ సంకల్పాలు రావటము - ఇది స్వచ్ఛమైన మనసు కాదు. కనుక స్వచ్ఛమైన మనసు మరియు క్లీన్ అండ్ క్లియర్ (స్వచ్ఛమైన మరియు స్పష్టమైన) బుద్ధి. మీరే నిర్ణయించండి, మిమ్మల్ని మీరు అటెన్షన్‌తో చూసుకోండి. బాగానే ఉన్నాను, బాగానే ఉన్నాను అని పైపైన చూసుకోవటము కాదు. ఆలోచించి చూసుకోండి - మనసు-బుద్ధి స్పష్టంగా ఉన్నాయా, శ్రేష్ఠంగా ఉన్నాయా? అప్పుడే డబల్ లైట్ స్థితి తయారవ్వగలదు. బాబా సమానమైన స్థితిని తయారుచేసుకునేందుకు ఇదే సహజమైన సాధనము. అంతేకాక ఈ అభ్యాసము అంతిమములో చెయ్యటము కాదు, బహుకాలపు అభ్యాసము అవసరము. మరి చెక్ చేసుకోవటము వస్తుందా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఇతరులను చెక్ చెయ్యకండి. బాప్‌దాదా ఇంతకుముందు కూడా ఒక నవ్వొచ్చే విషయాన్ని చెప్పారు, అదేమిటంటే, చాలామంది పిల్లల యొక్క దూరపు చూపు చాలా బాగుంది, దగ్గరి చూపు బలహీనంగా ఉంది, అందుకే ఇతరులను జడ్జ్ చెయ్యటంలో చాలా తెలివైనవారిగా ఉంటారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవటంలో బలహీనంగా అవ్వకండి.
బాప్‌దాదా ఇంతక ముందు కూడా చెప్పారు, నేను బ్రహ్మాకుమారిని లేక బ్రహ్మాకుమార్ను అన్నది ఇప్పుడు పక్కా అయిపోయింది కదా. నడుస్తూ, తిరుగుతూ మేము బ్రహ్మాకుమారీలము, మేము బ్రహ్మాకుమార్ బ్రాహ్మణ ఆత్మలము అని అనుకుంటారు. అలాగే ఇప్పుడు ‘‘నేను ఫరిశ్తాను’’ అన్న న్యాచురల్ స్మృతిని మరియు నేచర్‌ను తయారుచేసుకోండి. అమృతవేళ లేవగానే దీనిని పక్కా చేసుకోండి - నేను ఫరిశ్తాను, పరమాత్ముని శ్రీమతమనుసారంగా అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి మరియు శ్రేష్ఠ కర్మలను చేయడానికి కిందకు, ఈ సాకార తనువులోకి వచ్చాను. కార్యము పూర్తవ్వగానే మీ శాంతి స్థితిలో స్థితులైపోండి. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోండి. ఒకరినొకరు కూడా ఫరిశ్తా స్వరూపములో చూడండి. మీ వృత్తి ఇతరులను కూడా నెమ్మది-నెమ్మదిగా ఫరిశ్తాగా చేస్తుంది. మీ దృష్టి ఇతరులపై కూడా ప్రభావము చూపిస్తుంది. మేము ఫరిశ్తాలము అన్నదైతే పక్కానే కదా? ఫరిశ్తా భవ యొక్క వరదానము అందరికీ లభించి ఉందా? ఒక్క క్షణములో ఫరిశ్తాగా అనగా డబల్ లైట్‌గా అవ్వగలరా? ఒక్క క్షణములో అవ్వాలి, ఒక్క నిమిషములో కాదు, 10 క్షణాలలో కాదు, ఒక్క క్షణములో ఆలోచించారు మరియు అలా అయిపోయారు అన్నట్లు అటువంటి అభ్యాసము ఉందా? అచ్ఛా, ఎవరైతే ఒక్క క్షణములో అలా అవ్వగలరో, రెండు క్షణాలలో కాదు, ఒక్క క్షణములో అలా అవ్వగలరో, వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అవ్వగలరా? ఊరికే అలా చెయ్యి ఎత్తటం కాదు. డబల్ విదేశీయులు చెయ్యి ఎత్తడం లేదు! సమయం పడుతుందా? అచ్ఛా, ఎవరైతే - కొద్ది సమయము పడుతుంది, ఒక్క క్షణములో కాదు, కొద్ది సమయం పడుతుంది అని అనుకుంటున్నారో, వారు చేతులెత్తండి. (చాలామంది చేతులెత్తారు) మంచిది, కానీ చివరి ఘడియలోని పరీక్ష ఒక్క క్షణములో వస్తుంది, అప్పుడేం చేస్తారు? అకస్మాత్తుగా వస్తుంది మరియు క్షణములో వస్తుంది. చెయ్యి ఎత్తారు, ఏం ఫర్వాలేదు. అనుభూతి చెందారు, ఇది కూడా చాలా మంచిది. కానీ ఈ అభ్యాసము చెయ్యాల్సిందే. చెయ్యాల్సే ఉంటుంది అని కాదు, చెయ్యాల్సిందే. ఈ అభ్యాసము చాలా-చాలా-చాలా అవసరము. అయినప్పటికీ బాప్‌దాదా కొంచెం సమయాన్ని ఇస్తున్నారు. ఎంత సమయం కావాలి? 2000 సంవత్సరం వరకు కావాలా. 21వ శతాబ్దానికి మీరందరూ ఛాలెంజ్ చేసారు, దండోరా వేసారు, గుర్తుందా? స్వర్ణిమయుగ ప్రపంచము వస్తుంది, లేక అటువంటి వాతావరణాన్ని తయారుచేస్తాము అని ఛాలెంజ్ చేసారు. ఛాలెంజ్ చేసారు కదా! మరి అప్పటివరకైతే చాలా సమయము ఉంది. ఎంతగా స్వయం పట్ల అటెన్షన్ పెట్టగలిగితే... అటెన్షన్ పెట్టగలిగితే అని కూడా కాదు, పెట్టాల్సిందే. దేహ భానములోకి రావటానికి ఎంత సమయము పడుతుంది? రెండు క్షణాలా? అనుకోకపోయినా కూడా దేహ భానములోకి వచ్చేస్తారు, దానికి ఎంత సమయము పడుతుంది? ఒక్క క్షణమా లేక అంతకంటే కూడా తక్కువ సమయమా? అక్కడ దేహ భానములోకి వచ్చేసాము అన్నది తెలియను కూడా తెలియదు. అలాగే ఈ అభ్యాసము చెయ్యండి - ఏమైనాగానీ, ఏం చేస్తున్నాగానీ నేను ఆత్మాభిమాని స్థితిలో, శక్తిశాలి స్థితిలో న్యాచురల్‌గా స్థితైపోయాను అన్నది కూడా మీకు తెలియకూడదు. ఫరిశ్తా స్థితి కూడా న్యాచురల్‌గా ఉండాలి. ఎంతగా మీ స్వభావాన్ని ఫరిశ్తాతనపు స్వభావముగా తయారుచేసుకుంటారో, అంతగా ఆ స్వభావము స్థితిని న్యాచురల్‌గా చేస్తుంది. మరి బాప్‌దాదా ఎంత సమయం తర్వాత అడగాలి? ఎంత సమయం కావాలి? జయంతి, చెప్పండి, ఎంత సమయం కావాలి? విదేశీయుల తరఫు నుండి మీరు చెప్పండి, విదేశీయులకు ఎంత సమయం కావాలి? జనక్ చెప్పండి, (ఈరోజుది ఈ రోజే అయిపోతుంది. రేపటివరకు కాదు అని దాదీజీ చెప్పారు). ఈరోజుకు ఈ రోజే అంటే ఇప్పుడే అందరూ ఫరిశ్తాలుగా అయిపోయారా? అయిపోతాము అని అనకండి, ఒకవేళ అయిపోతాము అని అంటే, సరే, కానీ ఎప్పటికల్లా? బాప్‌దాదా ఈరోజు బ్రహ్మాబాబా యొక్క ఏ సంస్కారము గురించి చెప్పారు? తక్షణ దానము మహా పుణ్యము.
బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉంది. పిల్లలలో ఒక్కరు కూడా తక్కువగా ఉండకూడదు అని అనుకుంటారు. నంబరువారుగా ఎందుకు ఉండాలి, అందరూ నంబరువన్‌గా అయితే ఎంత బాగుంటుంది. అచ్ఛా! అచ్ఛా, ఇప్పుడు చాలా గ్రూపులు వచ్చి ఉన్నాయి.
ప్రశాసక వర్గము (అడ్మినిస్ట్రేషన్ వింగ్) కు చెందిన సోదర-సోదరీలతో:- అందరూ పరస్పరములో కలుసుకుని ఏ ప్రోగ్రామ్ తయారుచేసారు? శ్రేష్ఠ ఆత్మలైన మీ చేతిలోకి ఈ కార్యము త్వరత్వరగా వచ్చేయాలి అని ఇలా తీవ్ర పురుషార్థానికి చెందిన ప్లాన్‌ను తయారుచేసారా? విశ్వ పరివర్తన చెయ్యాలంటే మొత్తము అడ్మినిస్ట్రేషన్ అంతా మారాల్సి ఉంటుంది కదా! ఈ కార్యము ఎలా సహజంగా పెరుగుతూ వెళ్ళాలి, ఎలా వ్యాపించాలి అన్నదాని గురించి ఆలోచించారా? కనీసం పెద్ద-పెద్ద పట్టణాలలో ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో, వారికి పర్సనల్‌గా సందేశాన్ని ఇచ్చే ప్లాన్‌ను తయారుచేసారా? ఇప్పుడు ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన అవ్వగలదు మరియు అవ్వాలి అని కనీసం ఇదైతే అర్థం చేసుకోవాలి. కావున మీ వర్గాన్ని మేల్కొలపండి, అందుకే ఈ వర్గాలు తయారు చేయబడ్డాయి. బాప్‌దాదా వర్గమువారి సేవను చూసి సంతోషిస్తున్నారు కానీ ఈ రిజల్టును చూడాలి - ప్రతి వర్గమువారూ తమ-తమ వర్గములోనివారికి ఎంతవరకు సందేశాన్ని ఇచ్చారు! కొద్దో-గొప్పో మేల్కొలిపారా లేక సహచరులుగా తయారుచేసారా? సహయోగులుగా, సహచరులుగా తయారుచేసారా? బ్రహ్మాకుమారులుగా తయారుచెయ్యలేదు కానీ సహయోగులుగా, సహచరులుగా తయారుచేసారా?
అన్ని వర్గాలవారికీ బాప్‌దాదా చెప్తున్నారు - ఎలా అయితే ఇప్పుడు ధర్మనేతలు వచ్చారో, వారు నంబరువన్ వారు కాదు, అయినప్పటికీ ఒకే స్టేజ్‌పై అందరూ కలిసారు మరియు వారందరి నోటి నుండి - మనమందరము కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపజేయాలి అని వెలువడింది. అలాగే ప్రతి వర్గమువారు ఎవరైతే వచ్చారో, ఆ వచ్చిన ప్రతి వర్గమువారు ఏ రిజల్టును చూపించాలంటే - మా వర్గములోని వారికి సందేశం ఎంతవరకు చేరుకుంది? ఇంకొకటి - ఆధ్యాత్మికత యొక్క అవసరము ఉంది మరియు మేము కూడా సహయోగులుగా అవుతాము అన్న రిజల్టు రావాలి. రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వరు కానీ సహయోగులుగా అవ్వగలరు. మరి ఇప్పటివరకు ప్రతి వర్గము వారు ఏయే సేవలనైతే చేసారో, ఏ విధంగానైతే ఇప్పుడు ధర్మనేతలను పిలిచారో, అలా ప్రతి దేశము నుండి ప్రతి వర్గమువారి సేవను చెయ్యండి. ముందుగా ఇండియాలోనే చెయ్యండి, ఆ తరువాత అంతర్జాతీయ స్థాయిలో చెయ్యాలి. ప్రతి వర్గము నుండి ఇలా రకరకాల స్థాయిలలో ఉన్నవారిని ఒకచోట కలపాలి మరియు మేము అందరికీ సహయోగులుగా అవ్వాలి అని వారు అనుభవము చెయ్యాలి. ప్రతి వర్గములో ఇటువంటి రిజల్టు ఎంతవరకు వెలువడింది? మరియు ఇక ముందు కోసం ఏ ప్లాన్ ను తయారుచేసారు? ఎందుకంటే ఒక వర్గమువారు ఒకవేళ వర్గములోని ఒక్కొక్కరినీ లక్ష్యముగా పెట్టుకుని సమీపంగా తీసుకువచ్చినట్లయితే అప్పుడు అన్ని వర్గాలలోని సమీప సహయోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక చోట సమావేశం చేసి పెద్ద సంగఠనను తయారుచేయవచ్చు. అంతేకాక, ఒకరినొకరు చూసుకుని ఉల్లాస-ఉత్సాహాలు కూడా వస్తాయి. ఇప్పుడు వేరు-వేరుగా ఉన్నారు. ఒక పట్టణంలో కొంతమంది ఉన్నారు, మరో పట్టణంలో మరికొంతమంది ఉన్నారు. మంచి-మంచివారు ఉన్నారు కూడా, కానీ ముందుగా అందరి సంగఠనను ఏర్పాటు చెయ్యండి, ఆ తరువాత అందరినీ కలిపి ఒక పెద్ద సంగఠనను మధుబన్‌లో చేస్తాము. మరి అటువంటి ప్లాన్ ఏదైనా తయారుచేసారా? తప్పకుండా తయారయ్యే ఉంటుంది. చెల్లాచెదురై ఉన్నవారు చాలామంది ఉన్నారు అని విదేశములోని వారికి కూడా సందేశాన్ని పంపారు. భారత్‌లో చూసుకున్నా కూడా మంచి-మంచి సహయోగి ఆత్మలు అన్ని చోట్లా ఉన్నారు, కానీ గుప్తంగా ఉండిపోతారు. వారందరినీ కలిపి ఏదైనా విశేష ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసి అనుభవాలను పంచుకున్నట్లయితే దాని ద్వారా మార్పు వస్తుంది, సమీపముగా వస్తారు. ఒక వర్గములో 5 మంది ఉంటే, ఇంకో వర్గములో 8 మంది ఉంటే, మరో వర్గములో 25-30 మంది కూడా ఉంటారు. సంగఠనలోకి రావటం ద్వారా ఉన్నతి చెందుతారు. ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి. ఇప్పటివరకు అన్ని వర్గాల సేవ ఏదైతే జరిగిందో, దాని రిజల్టు తీయాలి. విన్నారా, అన్ని వర్గాలవారు వింటున్నారు కదా! అన్ని వర్గాలవారు, ఎవరైతే ఈరోజు విశేషంగా వచ్చారో, వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు - ఎంతెంతమంది, ఎవరెవరు మరియు ఎంత శాతములో సమీప, సహయోగులుగా ఉన్నారు అన్న రిజల్టును ఇవ్వాలి. అప్పుడు వారి కొరకు ఒక రమణీకమైన ప్రోగ్రామ్‌ను తయారుచేస్తాము. సరేనా!
మధుబన్ వారు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండాలనుకుంటున్నారా? బిజీగా ఉండాలనుకుంటున్నారు కదా! లేక అలసిపోతున్నారా? మధ్యమధ్యలో 15 రోజులు సెలవు కూడా ఉంటుంది మరియు ఉండాలి కూడా. కానీ లిస్ట్‌లో ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ ఉండాలి, అప్పుడు ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి, లేదంటే సేవ లేని సమయంలో దాదీ ఒక కంప్లయింట్ చేస్తుంటారు. ఆ కంప్లయింట్ చెప్పాలా? అందరూ మా-మా ఊర్లకు వెళ్తాము అని అంటుంటారు అని దాదీ చెప్తూ ఉంటారు. ఊరికి వెళ్ళి వస్తాము, మామూలుగా అలా తిరిగి రావటానికి వెళ్తాము, అంతేకాక అక్కడ సేవ చేయటానికి కూడా వెళ్తాము అని అంటుంటారు. అందుకే బిజీగా ఉండటము మంచిది. బిజీగా ఉంటే గొడవలు కూడా ఉండవు. ఇంకా చూడండి, మధుబన్ వారిలోని ఒక విశేషతకు బాప్‌దాదా పదమాల రెట్లు అభినందనలను ఇస్తారు. 100 రెట్లు కూడా కాదు, పదమాల రెట్లు, ఏ విషయములో? ఎప్పుడైనా ఎవరైనా వస్తే, మధుబన్ వారిలో ఎంతగా సేవ యొక్క లగనము ఏర్పడుతుందంటే, ఇక లోపల ఏమున్నా గానీ, అది దాగిపోతుంది, అవ్యక్త స్థితి కనిపిస్తుంది, అలసిపోనివారిగా కనిపిస్తారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ ఫరిశ్తాగానే అనిపిస్తున్నారు అని రిమార్క్ వ్రాసి వెళ్తారు. ఇది చాలా మంచి విశేషత, ఆ సమయములో విశేషంగా విల్ పవర్ వస్తుంది. సేవ యొక్క మెరుపు వస్తుంది. ఈ సర్టిఫికేట్నైతే బాప్‌దాదా ఇస్తారు. అభినందనలు తెలపాలి కదా? మరి మధుబన్ వారు చప్పట్లు కొట్టండి. చాలా మంచిది. బాప్‌దాదా కూడా ఆ సమయములో అంతా తిరిగి వస్తారు. అది మీకు తెలియదు కానీ బాప్‌దాదా అంతటా తిరిగి చూడటానికి వస్తారు. మధుబన్ యొక్క ఈ విశేషత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. అచ్ఛా!
మీడియా వింగ్:- విదేశాలలో కూడా మీడియా వర్గము ప్రారంభమైంది కదా! మీడియాలో ఇప్పుడు చాలా మంచి శ్రమ చేసారు అన్నదానిని బాప్‌దాదా చూసారు. ఇప్పుడు వార్తాపత్రికలలో రావటము ప్రారంభమైంది, అది కూడా ఎంతో ప్రేమతో ఇస్తున్నారు. కనుక శ్రమకు తగ్గ ఫలితము కూడా లభిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా విశేషముగా వార్తాపత్రికలలో రావాలి. టి.వి.లలో, కొందరైతే పర్మనెంట్‌గా కొంత సమయాన్ని కూడా కేటాయించారు కదా! ప్రతి రోజూ వస్తుంది కదా! ఈ ఉన్నతి బాగుంది. వినటం వలన అందరికీ మంచి అనుభవము కలుగుతుంది. అదే విధంగా వార్తాపత్రికలలో విశేషంగా వారానికి అయినా, లేక ప్రతిరోజు అయినా, లేక రోజు విడిచి రోజు అయినా, ఒక స్థానము మీ కోసం ఫిక్స్ అయిపోవాలి. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే అవకాశము అనే అంశము ఉండాలి. ఇటువంటి పురుషార్థము చెయ్యండి. మామూలుగా కూడా సఫలత ఉంది, కనెక్షన్లు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వార్తాపత్రికలకు సంబంధించి ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి. చెయ్యగలరా? ఈ గ్రూప్ చెయ్యగలరా? చెయ్యి ఎత్తండి. సరే అంటారా! ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నట్లయితే సఫలత ఉండనే ఉంటుంది. ఎందుకు అవ్వదు! చివరికి ఎటువంటి సమయము వస్తుందంటే అన్ని సాధనాలు మీకు ఉపయోగములోకి వస్తాయి. అందరూ మీకు ఆఫర్ చేస్తారు. ఏదైనా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి అని ఆఫర్ చేస్తారు. మా సహాయాన్ని తీసుకోండి అని అంటారు. ప్రస్తుతమైతే - మీరు సహయోగులుగా అవ్వండి అని మీరు చెప్పాల్సి వస్తుంది, కానీ తరువాత, మమ్మల్ని సహయోగులుగా చేసుకోండి అని వారే అంటారు. కేవలం ఈ విషయాన్ని పక్కాగా చేసుకోండి - ఫరిశ్తా, ఫరిశ్తా, ఫరిశ్తా. అప్పుడిక చూడండి, మీ పని ఎంత త్వరగా అయిపోతుందో. వారి వెనుక పడాల్సిన అవసరము ఉండదు, నీడలా వారే మీ వెనుక వస్తారు. కేవలం మీ అవస్థలు ఆగి ఉన్నందువలన అంతా ఆగి ఉంది. ఎవరెడీగా అయినట్లయితే కేవలం స్విచ్‌ను ఆన్ చేసే పనే మిగిలి ఉంటుంది, అంతే. మంచిగా చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు.
స్పార్క్ గ్రూప్:- ఇది చాలా పెద్ద గ్రూప్. స్పార్క్ వారు రీసెర్చ్ చేస్తారు కదా! ఏ విధంగా సైన్స్ ప్రత్యక్ష అనుభవమును కలిగిస్తుందో, వేడిగా ఉంటే సైన్స్ యొక్క సాధనాలు శీతలతను ప్రత్యక్షముగా అనుభవం చేయిస్తాయి. అలాగే రీసెర్చ్ వారు కూడా బాబా యొక్క లేక ఆత్మ యొక్క విశేషతలైన జ్ఞాన స్వరూపము, శాంతి స్వరూపము, ఆనంద స్వరూపము, శక్తి స్వరూపము... మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఆ విశేషతల యొక్క ప్రత్యక్ష అనుభవం ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటుందో అనుభవము కలిగించే విధంగా అటువంటి విశేషమైన ప్లాన్‌ను తయారుచేయాలి. ఎవరైనా అనుభవము చేసుకోవాలనుకుంటే కొద్ది సమయంలో శాంతి అని దేనిని అంటారో అనుభవం చేసుకోగలిగేలా అటువంటి సహజ సాధనమును ఏదైనా కనుగొనండి. ఒక్క క్షణము లేక రెండు క్షణాలైనా అనుభవము చేసుకోగలిగే విధిని కనుగొనండి. ఒక్క క్షణమైనా ఎవరికైనా అనుభవం అయినట్లయితే ఆ అనుభవము ఆకర్షిస్తూ ఉంటుంది. ఇటువంటి ఇన్వెన్షన్‌ను ఏదైనా కనుగొనండి. మీ ముందుకు రావాలి మరియు ఏ విశేషతను అనుభవం చేసుకోవాలనుకుంటే ఆ విశేషతను అనుభవం చేసుకోగలగాలి. భిన్న, భిన్న స్థితులు ఎలా ఉంటాయో, సాధన చేసే సాధువులు వారికి ఏ విధంగా అనుభవం చేయిస్తారో - చక్రము నాభి నుండి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పైకి వెళుతుంది. ఆ తర్వాత పైకి వెళ్ళాక ఏ అనుభూతి కలుగుతుంది... అనేవి వారు ఏ విధంగా ప్రత్యక్షముగా అనుభవం చేయిస్తారో అలా మీరూ విధిపూర్వకముగా మనస్సు మరియు బుద్ధి ద్వారా వారికి అనుభవం కలిగించండి. కూర్చోబెట్టి లైట్‌ను చూపించడం కాదు, లైట్ యొక్క అనుభవాన్ని కలిగించండి. రీసెర్చ్ యొక్క అర్థమే ప్రత్యక్ష విధి ద్వారా అనుభవం కలిగించడం మరియు అనుభవం పొందడం. కావున ఇటువంటి ప్లాన్‌ను తయారుచేసి ప్రత్యక్షముగా దీని యొక్క విధిని తయారుచేయండి. యోగ శిబిరము యొక్క విధి వెలువడినట్లుగా, అల్పకాలికముగా యోగ శిబిరములోకి ఎవరు వచ్చినా వారు ఆ సమయంలో అనుభవమైతే పొందుతారు కదా! మరియు వారికి ఆ అనుభవం గుర్తు కూడా ఉంటుంది. అలా ఏదో ఒక గుణము, ఏదో ఒక శక్తి, ఏదో ఒక అనాది సంస్కారము, వాటి యొక్క అనుభూతిని కలిగించండి. కావున రీసెర్చ్ వారు ఇటువంటి అనుభూతిని మొదట వారు స్వయం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత విధిని తయారుచేయండి మరియు ఇతరులకు అనుభూతి చేయించండి. ఈ రోజుల్లో మనుష్యులకు భక్తిలో ఏ విధంగా చమత్కారాలు కావాలో శ్రమ లేకుండా చమత్కారాలు కావాలో అలా ఆధ్యాత్మిక రూపంలో వారికి అనుభూతి కావాలి. అనుభవజ్ఞులు ఎప్పుడూ మారరు. త్వరత్వరగా అనుభవం యొక్క ఆధారముతో ముందుకు వెళుతూ ఉంటారు. విన్నారా? ఇప్పుడు కొత్త, కొత్త విధులను కనుగొనండి. మీరు చెబుతూ ఉంటే వారు అనుభవం చేసుకుంటూ ఉండాలి. అందుకొరకు చాలా శక్తిశాలి అభ్యాసమును చేయవలసి ఉంటుంది.
సమాజ సేవా విభాగము(సోషల్ వింగ్):- పాడైన దానిని ప్రాక్టికల్‌గా బాగు చేయడం వీరి యొక్క కార్యము. వారు ఊళ్ళను మారుస్తారు. పరివారాలను మారుస్తారు. పరివారంలోని సమస్యలను సమాప్తం చేసి చూపిస్తారు... కానీ వారివి అల్పకాలికమైనవి. ఇంతకుముందు దు:ఖితమైన పరివారాలుగా ఉన్నవారు పరివర్తన చెంది సుఖవంతులుగా అయిపోయిన ఇటువంటి ఉదాహరణలను సోషల్ వింగ్ వారు చూపించాలి. అటువంటి పరివారాలైతే ఇక్కడకు ఎందరో వస్తారు. కావున గవర్నమెంట్ వారి ముందు ప్రత్యక్ష ఉదాహరణలను చూపించాలి. ఇన్ని పరివారాలు మారి ఏమి అనుభవం చేసుకుంటున్నాయి అన్నది ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి. ఇటువంటి పరివర్తన యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని ఏదైనా స్టేజి పైకి తీసుకురండి. సందేశాలు అయితే ఇస్తున్నారు. కార్యాలైతే చేస్తున్నారు కానీ ఆధ్యాత్మిక శక్తి ద్వారా సామాజికవర్గం ఏమేమి చేయగలదో, ఏమేమి చేస్తోందో గవర్నమెంట్ వారి కనుల ముందుకు రావాలి. పార్కులను గురించి వినిపించారు కదా! (బాంబేలోని పార్కులు) ఎంతటి సేవ జరుగుతోంది! ఎంతమంది పిల్లలకు విశ్రాంతి లభిస్తోంది! ఈ రిజల్టు గవర్నమెంట్ వారి ముందుకు రావాలి. కావున సామాజిక వర్గం వారి నేతలు ఎవరైతే ఉన్నారో వారి ముందుకు ఈ రిజల్టు రావాలి. లిస్టు వ్రాసినట్లయితే ముఖ్య ముఖ్య పరివారాల యొక్క లిస్టు ఎన్నో వెలువడగలవు. ఇక్కడ అంతా ప్రాక్టికల్‌గా ఉంది. ఆ సమాజ సేవకులు ఏమి చేస్తారు? వస్త్రాలు పంచుతారు, డబ్బు సహాయం చేస్తారు... కానీ మీరు పరివారాలలో ఏ సంతుష్టతనైతే తీసుకువస్తారో దాని ద్వారా వారి యొక్క ఎకానమీ కూడా బాగా జరుగుతుంది. వస్త్రాల కోసం, అన్నపానాదుల కోసం ఏ కష్టాలైతే ఉన్నాయో అవి సమాప్తమైపోతాయి. ఎంతో విశ్రాంతిగా ఉంటారు. కొద్దిలో కూడా ఎంతో సుఖంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కావున వారు ఏదైతే చేస్తారో దానిని పోల్చి అలౌకిక రూపంలో మీరు ఏమి చేస్తున్నారో అది తెలియజేయండి మరియు ఇలా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి, మేము ఏమి చేస్తున్నామో చూడండి అని చెప్పండి. అప్పుడు గవర్నమెంట్ యొక్క దృష్టిలోకి రావడంతో గవర్నమెంట్ వారు ఎవరైనా వస్తే దాని ప్రచారం కూడా సహజమైపోతుంది. మీరు ప్రెస్ వారిని పిలిస్తే కొద్దిమందే వస్తారు కానీ వారు పిలిస్తే వారి వెనుక వచ్చేస్తారు... కావున ఈ విధంగా అందరికీ మీరు ఏమి చేస్తున్నారో ప్రత్యక్షమైన ఉదాహరణలను చూపించండి. నిజానికి మీరు ఎంతో చేస్తున్నారు కానీ గుప్తముగా ఉన్నారు, అచ్ఛా!
రాజకీయవేత్తల సేవా విభాగం:- పొలిటీషియన్ వింగ్ వారు కూడా తమ, తమ స్థానాల వారి యొక్క సేవను చేస్తూనే ఉన్నారు. సేవ చేస్తున్నారు మరియు అది జరుగుతూనే ఉంటుంది. పోలిటీషియన్ వారు విశేషంగా విశేష ధ్యానమును ఉంచాలి. హైదరాబాద్‌లో చీఫ్ మినిస్టర్ ప్రభావితమైన కారణముగా అక్కడి గవర్నమెంట్ యొక్క సేవ సహజముగా అవుతోంది అన్న సమాచారాన్ని విన్నారు కదా! అలాగే ప్రతి స్థానములోనూ ఇలా సంపర్కములోనివారు ఎవరో ఒకరు ఉన్నారు, వారిని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకురావచ్చు. ప్రతి ఒక్క నగరములోనూ తమ, తమ ప్రభుత్వాలలో ఎంతో కొంతమంది మంచివారు ఉన్నారు. కావున బాప్‌దాదా హైదరాబాద్(ముఖ్య మంత్రి) ఏ విధంగా విశేషముగా ఉన్నారో, వారి ద్వారా భిన్న భిన్న స్థానాలలో ఇటువంటి క్వాలిటీ ఏదైతే ముందుకు రాగలదో కాస్త వారి వెంట శ్రమించినట్లయితే అటువంటి క్వాలిటీ వెలువడగలదు అని బాప్‌దాదా భావిస్తున్నారు. ఇటువంటి గ్రూపు ఒక దానిని తయారుచేయండి. వారు భిన్న, భిన్న నగరాలలో ఉన్నా వీరు సమీపముగా రాగలరు అని భావించే క్వాలిటీ వారందరినీ పిలవండి, ఆ తర్వాత ఆ హైదరాబాద్ వారిని (చీఫ్ మినిస్టర్‌ను) ఆ కార్యక్రమానికి పిలిచి ఇతరుల సేవను చేయించండి. వారు ప్రత్యక్షముగా అతని అనుభవాన్ని వినడం ద్వారా తామూ చేయవచ్చు అన్న ధైర్యాన్ని పొందుతారు. కావున ఇటువంటి గుంపును ముందు పోగు చేయండి. రిపోర్ట్ అయితే వస్తూ ఉంటుంది కదా! కావున ఇటువంటి గ్రూప్‌ను తయారుచేసి ఆ తర్వాత వివిధ స్థానాలలో కొద్దిగా గవర్నమెంట్‌లోకి వెళుతూ ఉన్నట్లయితే ఇక పెద్దవారి వద్దకు కూడా చేరుకుంటారు. ఎందుకంటే పెద్దవారికి ఖాళీ తక్కువగా ఉంటుంది. కానీ మధ్యలోనివారు రాగలరు. ఏ విధంగా ధర్మనేతలలో మధ్యలోనివారే వచ్చారు కదా! మొదటి నెంబర్ వారు రాలేదు కానీ ఈ మధ్యలోని వారిద్వారా వారి వరకూ చేరుకోగలరు. ఇది దారి, కావున ఆ విధంగా మీరు కూడా అటువంటి గ్రూపును తయారుచేసి కొద్దిగా ముందుకు వెళుతూ ఉండండి. మీరు ఈ సమయంలో రాజ్యము మరియు ధర్మము రెండింటినీ స్థాపన చేస్తున్నారు. కావున రాజధాని వారు వంచితులుగా ఉండకూడదు కదా! ఎంతైనా వారు తోటివారే కదా! కావున ఇలా చేసి చూడండి, అచ్ఛా!
ధార్మిక సేవా విభాగం: - ధార్మికవర్గం వారు ఒక కార్యమునైతే చేసి చూపించారు. కానీ అది రిహార్సలే. రిహార్సల్లో సఫలత లభించింది. అది బాగుంది. ఇప్పుడు ముఖ్యమైనవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కేవలం ఆధ్యాత్మిక శక్తి యొక్క మహత్వాన్ని తెలిపి ఆధ్యాత్మిక శక్తి ద్వారా తాము ఏమి చేయవచ్చో తెలియజేయండి. వాదనలోకి వెళ్ళకండి కానీ మొదట సమీపముగా రావాలి మరియు ఆధ్యాత్మిక శక్తి కలిసి ఏమి చేయగలదు అన్న విషయము పైనే చర్చ జరగాలి. ఆధ్యాత్మిక శక్తిగల వారి యొక్క బాధ్యత ఎంతగా ఉందో ఆ అంశాన్ని తీసుకొని వారిని సమీపముగా తీసుకురండి మరియు సమీపముగా తీసుకువచ్చి మళ్ళీ సంపర్కములోకి తీసుకురండి, ఇక్కడకు ఆబూ వరకూ తీసుకురండి. అప్పుడు ఆబూ యొక్క ప్రవాహము, ప్రభావము తనకు తానుగానే వారిని ఆకర్షిస్తుంది. యాత్ర జరిపాము, నేతల సమ్మేళనము జరిగింది, చాలా బాగుంది అని భావించకండి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళుతూనే ఉండాలి.
రథ యాత్రికులతో:- రథ యాత్రికుల యొక్క స్వాగతం ఎంతో జరిగింది. ఇప్పుడు కూడా చూడండి, రథయాత్రికుల కోసం అందరూ ఎంతగా చప్పట్లు కొట్టారు! అంతగా మళ్ళీ ఇతర గ్రూపుల్లో కొట్టలేదు. కావున చాలా బాగుంది, ఈ యాత్రకు వరదానం ఉంది. బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. రథయాత్రికులకు విశేషంగా బాప్‌దాదా ద్వారా వరదానాలు లభించాయి. ఒకటేమో నిర్విఘ్నముగా జరిగింది, ఎటువంటి విఘ్నమూ రాలేదు, రెండవది అందరూ ఆరోగ్యముగా ఉన్నారు. అనారోగ్యము యొక్క విఘ్నము కూడా రాలేదు. మూడవది విశేషముగా అందరిలో ఉల్లాస, ఉత్సాహాలు ఉన్న కారణముగా అలసట లేని వారిగా ఉన్నారు. కావున ఈ వరదానాన్ని ప్రత్యక్ష రూపములో అందరూ చూసారు మరియు అనుభవం చేసుకున్నారు. ఎక్కడైతే ఉల్లాస, ఉత్సాహాలు ఉంటాయో అక్కడ ఈ విషయాలన్నీ స్వతహాగానే ప్రాప్తిస్తాయి. కావున సఫలతా పూర్వకముగా అందరూ చేరుకున్నారు మరియు ఇప్పుడు కూడా శివరాత్రి యొక్క ఉత్సవములో ఈ రథాలు అటూ, ఇటూ వెళ్ళలేవు కానీ వీటి వీడియో ఫిల్మ్ ఏదైతే వెలువడిందో ఆ స్థానములో ఈ వీడియో ఫిల్మ్ ద్వారా సేవ బాగా జరుగుతుంది. కావున మీ యాత్ర వీడియోలోకి వచ్చేసింది అనగా అమరమైపోయింది, నడుస్తూనే ఉంటుంది. బాగుంది. ఈ ఇన్వెన్షన్ చేయడానికి జగదీష్ నిమిత్తము అయ్యారు. అలాగే మొదటి నుండి ఇన్వెన్షన్ చేసే వరదానము ఉంది. ఇప్పుడు కూడా ఈ వరదానాన్ని ఇంకా పెంచుతూ ఉండాలి. బాగుంది, ఒక్కరి ఇన్వెన్షన్ ద్వారా అన్నివైపులా ఉల్లాస, ఉత్సాహాలు వచ్చేసాయి కావున ఇన్వెన్షన్ యొక్క అభినందనలు, అచ్ఛా!
విదేశీయుల ఇంటర్నేషనల్ సర్వీస్ గ్రూప్: - డబల్ విదేశీయులు డబల్ లాభాన్ని పొందడంలో తెలివైనవారు. మధువనము యొక్క రిఫ్రెష్మెంట్ను పొందారు మరియు సేవా ప్లాన్లు కూడా తయారయ్యాయి. కావున మంచి అవకాశాన్ని తీసుకుంటూ ఉంటారు. బాప్‌దాదాకు కూడా సంఘటిత రూపంలో కలిసి సేవ యొక్క ప్లాన్లను తయారుచేస్తే ఎంతో సంతోషము కలుగుతుంది. ఆ ప్లాన్‌లో అన్ని వైపుల నుండి నిమిత్తమైయున్న ఆత్మల యొక్క దృష్టి పడుతుంది, వైబ్రేషన్లు లభిస్తాయి. కావున ఆ ప్లాన్‌లో దీవెనలు నిండుతాయి మరియు నలువైపులా ఒకే విధమైన సేవా ప్లాన్ జరగడం ద్వారా నలువైపులా వ్యాపించిన శబ్దము ఎంతో పెద్దగా ప్రత్యక్షము చేస్తుంది. కావున ఇప్పుడు కూడా ‘‘కల్చర్ ఆఫ్ పీస్’’ యొక్క ప్లాన్‌ను తయారుచేస్తారు కదా! టాపిక్ బాగుంది. చూడండి! రెండు విధాలుగా ఈ టాపిక్‌పై సేవ చేయవచ్చు. కల్చర్‌పైనా చేయవచ్చు, పీస్ పైనా చేయవచ్చు. రెండింటినీ కలిపి కూడా చేయవచ్చు. శాంతి యొక్క అనుభూతినైతే ఈ రోజుల్లో అందరూ కోరుకుంటారు. అలాగే తమ కల్చర్‌ను కూడా బాగు చేసుకోవాలనుకుంటూనే ఉంటారు. తమ కల్చర్ చాలా బాగా మరియు ఉన్నతోన్నతముగా అవ్వడానికి అందులో ఇంకేదో కలవాలి అని భావిస్తూ ఉంటారు. కావున టాపిక్ బాగుంది మరియు ఏ విధముగా అయితే భారతదేశం వారైనా లేక విదేశం వారైనా ఉల్లాస, ఉత్సాహాలతో ఏ ప్లాన్లనైతే తయారుచేస్తున్నారో అందులో సఫలత అయితే ఉండనే ఉంది మరియు బాగుంది కూడా! ఈ టాపిక్ వారిది మరియు ప్రాక్టికల్‌లో మీరు ఉన్నారు. టాపిక్ మరియు ప్రాక్టికల్ కలిసిపోతే బాగుంటుంది. ఇది బాగుంది, యు.ఎన్.ఒ యొక్క సేవ కూడా బాగా జరుగుతోంది. ఆ కారణముగా వేరే సేవలు కూడా జరుగుతున్నాయి. మెల్లమెల్లగా నాన్ గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ వరకూ కూడా చేరుకుంటారు. బాగా నడుస్తోంది కదా! కనెక్షన్ కూడా బాగా పెరుగుతూనే ఉంటుంది. సహయోగాన్ని కూడా ఇస్తూ ఉంటారు. కావున సహయోగులుగా చేయండి, సంపర్కములోకి తీసుకురండి. ఎంతెంతగా సంపర్కములోకి వస్తూ ఉంటారో అంతగానే స్వతహాగా సహయోగులుగా అవుతూ ఉంటారు మరియు ఎంతగా అయితే సేవ వ్యాపిస్తూ ఉంటుందో అంతగా వ్యతిరేకత ఉన్న వాయుమండలం అందులో అణిగిపోతుంది. కావున ఇది మంచి విషయం. బాప్‌దాదా ప్రాజెక్ట్ గురించి ముందే అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్ఛా!
డబల్ విదేశీయులు మీటింగ్ వారైనా లేక గ్రూపులో వచ్చిన వారైనా అందరికీ బాప్‌దాదా ఎంతో స్నేహ సంపన్నమైన అభినందనలు తెలియజేస్తున్నారు. మంచి ధైర్యాన్ని ఉంచుతున్నారు. బాప్‌దాదా సేవ యొక్క ఉల్లాస, ఉత్సాహాలలో మరియు ధైర్యములో మంచి రిజల్టును చూసారు. సేవ మరియు స్వ ఉన్నతి యొక్క బ్యాలెన్స్‌ను అందులో కలపాలి. సేవ బాగా జరుగుతోంది మరియు సేవ విఘ్న వినాశకముగా రచింపబడి ఉంది. కావున డబల్ విదేశీయులందరికీ బాప్‌దాదా సదా ప్రియస్మృతులను తెలియజేస్తారు మరియు సదా ప్రియస్మృతులు మీ తోడుగా ఉంటాయి. అచ్చా!
మహారాష్ట్ర జోన్ వారు సేవ చేసేందుకు వచ్చారు:- అచ్ఛా, సగం హాల్ మహారాష్ట్ర వారే ఉన్నారు. మహారాష్ట్రలో సేవ యొక్క వృద్ధి బాగా జరుగుతోంది. కావున మహారాష్ట్ర 9 లక్షలను త్వరగా తయారు చేయగలుగుతుంది. అవును కదా! 9 లక్షలను తయారుచేయడంలో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకుంటారు కదా! బాగుంది, మీ అందరికీ కూడా సంతోషము కలుగుతుంది కదా! మీ పరివారములో వృద్ధి జరుగుతోందంటే మీరూ సంతోషిస్తారు కదా! త్వరత్వరగా వృద్ధి జరగాలి అనే అందరూ కోరుకుంటారు. కావున మహారాష్ట్ర వృద్ధి చెందుతుంది మరియు ఇతర జోన్లు కూడా అలాగే వృద్ధినొంది త్వరత్వరగా సంపన్నమై, సంపూర్ణముగా అయి బాబాతో పాటు వెళ్ళగలుగుతారు. కలిసి వెళ్ళాలి అన్నది మరచిపోకూడదు. ప్రేమగా రాకపోతే బలవంతంగా కూడా తీసుకువెళతాను అని బాప్‌దాదా ఇంతకుముందు కూడా అన్నారు. కలిసి రాకపోతే వెనుక కూడా తీసుకు వెళతారు కానీ అందులో అంత ఆనందం ఉండదు. అచ్ఛా!
నలువైపులా ఉన్న దేశ-విదేశాలలో సాకార స్వరూపములో లేక సూక్ష్మ స్వరూపములో మిలనాన్ని చేసుకునే సర్వ స్వరాజ్య అధికారీ ఆత్మలకు, సదా ఈ శ్రేష్ఠ అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖము ద్వారా ప్రత్యక్షము చేసే విశేష ఆత్మలకు, సదా బాప్‌దాదాను ప్రతి అడుగులో ఫాలో చేసేవారికి, సదా మనసును స్వచ్ఛంగా మరియు బుద్ధిని స్పష్టంగా ఉంచుకునే అటువంటి స్వతహా తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా తోడుగా ఉండే మరియు తోడుగా వెళ్ళే డబల్ లైట్ పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
*** ఓంశాంతి ***
