Search for a command to run...
31 Dec 2003
‘‘ఈ సంవత్సరము నిమిత్తముగా మరియు నిర్మానముగా అయ్యి జమా ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానులుగా అవ్వండి’’
31 December 2003 · తెలుగు
ఈరోజు అనేక భుజధారుడైన బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ భుజాలను చూస్తున్నారు. కొన్ని భుజాలు సాకారములో సమ్ముఖముగా ఉన్నాయి మరియు కొన్ని భుజాలు సూక్ష్మరూపములో కనిపిస్తున్నాయి. బాప్‌దాదా తమ అనేక భుజాలను చూసి హర్షిస్తున్నారు. అన్ని భుజాలు నంబరువారుగా చాలా ఆల్‌రౌండర్, ఎవరెడీ, ఆజ్ఞాకారి భుజాలు. బాప్‌దాదా కేవలం సూచనను ఇవ్వగానే ఆ కుడి భుజాలు - సరే బాబా, హాజరుగా ఉన్నాము బాబా, ఇప్పుడే చేస్తాము బాబా అని అంటారు. ఇటువంటి అతి ప్రియమైన పిల్లలను చూస్తుంటే ఎంత సంతోషము కలుగుతుంది! బాప్‌దాదాకు ఆత్మిక నషా ఉంది, ఏ విషయములో అంటే - కేవలం బాప్‌దాదాకు తప్ప మరే ఇతర ధర్మాత్మలకు గానీ, మహానాత్మలకు గానీ ఇటువంటి భుజాలు మరియు ఇంతటి సహయోగి భుజాలు దొరకరు. చూడండి, మొత్తము కల్పమంతా తిరిగి రండి, ఇటువంటి భుజాలు ఎవరికైనా లభించాయా? కనుక బాప్‌దాదా ప్రతి భుజము యొక్క విశేషతను చూస్తున్నారు. మీరు మొత్తము విశ్వము నుండి ఎన్నుకోబడిన విశేషమైన భుజాలు, పరమాత్ముని సహయోగి భుజాలు. చూడండి, ఈ రోజు ఈ హాల్లోకి కూడా ఎంతమంది చేరుకున్నారు! (ఈ రోజు హాల్లో 18000 మంది కంటే కూడా ఎక్కువమంది సోదరీసోదరులు కూర్చుని ఉన్నారు) అందరూ తమను తాము, మేము పరమాత్ముని భుజాలము అని అనుభవం చేస్తున్నారా? ఆ నషా ఉంది కదా!
నలువైపుల నుండి క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ చేరుకున్నారు అని బాప్‌దాదాకు సంతోషముగా ఉంది. కానీ క్రొత్త సంవత్సరము ఏం గుర్తుకు తెప్పిస్తుంది? క్రొత్త యుగాన్ని, క్రొత్త జన్మను. ఎంతగా ఇది అతి పాత చివరి జన్మనో, అంతగానే క్రొత్త మొదటి జన్మ ఎంత సుందరమైనది! ఇది శ్యామము మరియు అది సుందరము. అది ఎంత స్పష్టముగా ఉందంటే - ఎలాగైతే ఈ రోజు పాత సంవత్సరము కూడా స్పష్టముగా ఉంది మరియు క్రొత్త సంవత్సరము కూడా ఎదురుగా స్పష్టముగా ఉంది. ఇలా మీ క్రొత్త యుగము, క్రొత్త జన్మ స్పష్టముగా ఎదురుగా వస్తున్నాయా? ఈ రోజు చివరి జన్మలో ఉన్నారు, రేపు మొదటి జన్మలో ఉంటారు. స్పష్టముగా ఉందా? ఎదురుగా వస్తుందా? ఆది పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మా బాబా విషయములో ఇది అనుభవం చేసారు. బ్రహ్మా బాబాకు తమ క్రొత్త జన్మ, క్రొత్త జన్మలోని రాజ్య శరీరము రూపి వస్త్రము సదా ఎదురుగా గోడ మీద మేకుకు తగిలించి ఉన్నట్లుగా కనిపించేది. పిల్లలు ఎవరు కలవడానికి వెళ్ళినా వారూ అనుభవం చేసేవారు, బ్రహ్మా బాబా స్వయమూ అనుభవం చేసారు - ఈరోజు వృద్ధుడిని, రేపు చిన్న బాలుడిలా అవుతాను అని. గుర్తుంది కదా! పాతవారికి గుర్తుందా? ఇదంతా ఈరోజు మరియు రేపు యొక్క ఆట. ఇంత స్పష్టముగా భవిష్యత్తు అనుభవమవ్వాలి. ఈరోజు స్వరాజ్య అధికారులు, రేపు విశ్వ రాజ్య అధికారులు. ఉందా నషా? చూడండి, ఈరోజు చిన్న పిల్లలు కిరీటము ధరించి కూర్చున్నారు. (రిట్రీట్‌లో వచ్చిన డబుల్ విదేశీ చిన్న పిల్లలు కిరీటము ధరించి కూర్చున్నారు) మరి ఏ నషా ఉంది? కిరీటము ధరించి ఏ నషా కలిగింది? వీరు ఫరిశ్తా నషాలో ఉన్నారు. మేము నషాలో ఉన్నామంటూ చేతులు ఊపుతున్నారు.
మరి ఈ సంవత్సరము ఏమి చేస్తారు? క్రొత్త సంవత్సరములో ఏ నవీనత చేస్తారు? ఏదైనా ప్లాన్ తయారు చేసారా? ఏ నవీనత చేస్తారు? ప్రోగ్రామ్‌లు అయితే చేస్తూ ఉంటారు, లక్షమందిది కూడా చేసారు, రెండు లక్షలమందిది కూడా చేసారు, నవీనత ఏం చేస్తారు? ఈ రోజుల్లోని వారు ఒకవైపు స్వ ప్రాప్తిని కోరుకుంటున్నారు కానీ ధైర్యహీనులుగా ఉన్నారు. ధైర్యము లేదు. వినాలని అనుకుంటున్నారు కూడా, కానీ అలా తయారయ్యే ధైర్యము లేదు. ఇటువంటి ఆత్మలను పరివర్తన చేయడానికి ముందుగా ఆత్మలకు ధైర్యమనే రెక్కలను ఇవ్వండి. ధైర్యము అనే రెక్కలకు ఆధారము అనుభవం. అనుభవం చేయించండి. అనుభవం ఎటువంటిదంటే అది కొద్దిగా దోసిలి అంత లభించిన తర్వాత అనుభవం జరిగితే ఇక అనుభవం అనే రెక్కలు అనండి లేక అనుభవం అనే పాదాలు అనండి, వాటితో ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుతారు. దీని కోసం విశేషముగా ఈ సంవత్సరము నిరంతర అఖండ మహాదానిగా అవ్వాలి, అఖండము. మనసా ద్వారా శక్తి స్వరూపులుగా తయారుచేయండి. మహాదానిగా అయి మనసా ద్వారా, వైబ్రేషన్ల ద్వారా నిరంతరం శక్తుల అనుభవాన్ని చేయించండి. వాచ ద్వారా జ్ఞాన దానాన్ని ఇవ్వండి, కర్మల ద్వారా గుణాల దానాన్ని ఇవ్వండి. మొత్తం రోజంతా మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మల ద్వారానైనా, మూడింటి ద్వారా అఖండ మహాదానిగా అవ్వండి. సమయమనుసారముగా ఇప్పుడు మాత్రమే దానిగా కాదు, అప్పుడప్పుడు దానము చేసారు అన్నట్లు కాదు, అఖండ దాని, ఎందుకంటే ఆత్మలకు అవసరము ఉంది. మరి మహాదానిగా అవ్వడానికి ముందుగా మీ జమా ఖాతాను చెక్ చేసుకోండి. నాలుగు సబ్జెక్టులలోనూ జమా ఖాతా ఎంత శాతములో ఉంది? ఒకవేళ స్వయములో జమా ఖాతా లేకపోతే మహాదానిగా ఎలా అవుతారు! మరియు జమా ఖాతాను చెక్ చేసుకునేందుకు గుర్తు ఏమిటి? మనసా, వాచా, కర్మల ద్వారా సేవనైతే చేసారు కానీ జమా అయ్యింది అన్నదానికి గుర్తు ఏమిటంటే - సేవ చేస్తూ ముందుగా స్వయం యొక్క సంతుష్టత. దానితోపాటు ఎవరి సేవ అయితే చేస్తారో, ఆ ఆత్మలలో సంతోషముతో కూడిన సంతుష్టత వచ్చిందా? ఒకవేళ రెండు వైపులా సంతుష్టత లేకపోతే సేవ ఖాతాలో మీ సేవ యొక్క ఫలము జమా అవ్వలేదు అని అర్థం చేసుకోండి.
బాప్‌దాదా అప్పుడప్పుడూ పిల్లల జమా ఖాతాను చూస్తారు. అందులో అక్కడక్కడ శ్రమ ఎక్కువగా ఉంది కానీ జమా యొక్క ఫలము తక్కువగా ఉంది. కారణము? రెండు వైపులా సంతుష్టత యొక్క లోటు. ఒకవేళ సంతుష్టతను అనుభవం చేయలేదు అంటే, అది స్వయం కావచ్చు, ఇతరులు కావచ్చు, అప్పుడు జమా ఖాతా తక్కువ అవుతుంది. బాప్‌దాదా జమా ఖాతాను చాలా సహజముగా పెంచుకునేందుకు గోల్డెన్ తాళంచెవిని పిల్లలకు ఇచ్చారు. ఆ తాళంచెవి ఏమిటో తెలుసా? లభించడమైతే లభించింది కదా! సహజముగా జమా ఖాతాను నిండుగా చేసుకోవడానికి గోల్డెన్ తాళంచెవి ఏమిటంటే - మనసా, వాచా, కర్మణా, ఏ రకమైన సేవ చేస్తున్నా కానీ ఒకటేమో స్వయములో నిమిత్త భావము యొక్క స్మృతి. నిమిత్త భావము, నిర్మాన భావము, శుభ భావము, ఆత్మిక స్నేహ భావము, ఒకవేళ ఈ భావాల యొక్క స్థితిలో స్థితి అయ్యి సేవ చేస్తే సహజముగానే మీ ఈ భావాలతో ఆత్మల భావన పూర్తవుతుంది. ఈ రోజుల్లోనివారు ప్రతి ఒక్కరిలోని భావము ఏముంది అనేది నోట్ చేస్తున్నారు. నిమిత్త భావముతో చేస్తున్నారా లేక అభిమాన భావముతో చేస్తున్నారా! ఎక్కడైతే నిమిత్త భావము ఉంటుందో అక్కడ నిర్మాన భావము ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మరి చెక్ చేసుకోండి - ఏమి జమా అయ్యింది? ఎంత జమా అయ్యింది? ఎందుకంటే ఈ సమయములో సంగమయుగమే జమా చేసుకునే యుగము. ఇక ఆ తర్వాత, కల్పమంతా జమా చేసుకున్నదానికి ప్రారబ్ధము ఉంటుంది.
మరి ఈ సంవత్సరము ఏ విశేష అటెన్షన్ పెట్టాలి? మీ, మీ జమా ఖాతాలను చెక్ చేసుకోండి. చెకర్‌గా కూడా అవ్వండి, మేకర్‌గా కూడా అవ్వండి ఎందుకంటే సమయ సమీపత యొక్క దృశ్యాలను చూస్తున్నారు. అందరూ బాప్‌దాదాతో - మేము సమానంగా అవుతాము అని ప్రతిజ్ఞ చేసారు. ప్రతిజ్ఞ చేసారు కదా? ఎవరైతే ప్రతిజ్ఞ చేసారో వారు చేతులెత్తండి. పక్కాగా చేసారా? లేక పర్సెంటేజ్లో చేసారా? పక్కాగా చేసారు కదా? మరి బ్రహ్మా బాబా సమానమైన ఖాతా జమా అయ్యి ఉండాలి కదా! బ్రహ్మా బాబా సమానముగా అవ్వాలంటే బ్రహ్మా బాబా యొక్క విశేష చరిత్ర ఏమి చూసారు? ఆది నుండి అంతిమము వరకు, ప్రతి విషయములో, నేను అన్నారా లేక బాబా అన్నారా? నేను చేస్తున్నాను అని అనలేదు, బాబా చేయిస్తున్నారు. ఎవరిని కలవడానికి వచ్చారు? బాబాను కలవడానికి వచ్చారు. నేను అనేది లేకుండా ఉండటాన్ని, అది అవిద్యగా ఉండటాన్ని చూసారు కదా! చూసారా? ప్రతి మురళిలో బాబా, బాబా అంటూ ఎన్ని సార్లు గుర్తు చేయిస్తారు? మరి సమానముగా అవ్వడము అంటే అర్థము ముందుగా నేను అన్నది లేకుండా ఉండాలి. బ్రాహ్మణులలో నేను అన్న భావన కూడా చాలా రాయల్‌గా ఉంటుంది అని ఇంతకుముందు వినిపించాము. గుర్తుంది కదా? వినిపించాము కదా! బాప్‌దాదా ప్రత్యక్షత జరగాలి, బాప్‌దాదాను ప్రత్యక్షము చేయాలి అని అందరూ కోరుకుంటారు. ప్లాన్లు చాలా తయారుచేస్తారు. మంచి ప్లాన్లు తయారుచేస్తారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. కానీ ఈ రాయల్ రూపములో ఉండే నేను అన్న భావన ప్లాన్‌లో, సఫలతలో కొంత పర్సెంటేజ్‌ను తగ్గించేస్తుంది. నేచురల్‌గా సంకల్పాలలో, మాటలలో, కర్మలలో, ప్రతి సంకల్పములో బాబా, బాబా అన్నది స్మృతిలో ఉండాలి. నేను అన్న భావన కాదు. బాప్‌దాదా చేయించేవారు చేయిస్తున్నారు. జగదాంబ యొక్క విశేష ధారణ ఇదే. జగదాంబ యొక్క స్లోగన్ గుర్తుందా, పాతవారికి గుర్తుండి ఉంటుంది. గుర్తుందా? చెప్పండి (హుక్మీ హుకుమ్ చలాయే రహా - ఏది జరుగుతున్నా అది ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు) ఇదే జగదాంబ యొక్క విశేష ధారణ. మరి నంబరు తీసుకోవాలి, సమానముగా అవ్వాలి అంటే నేను అన్న భావన సమాప్తమవ్వాలి. నోటి నుండి ఆటోమేటిక్‌గా బాబా-బాబా అన్న పదమే వెలువడాలి. కర్మలలో, మీ ముఖములో బాబా యొక్క మూర్తి కనిపించాలి, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది.
బాప్‌దాదా ఈ రాయల్ రూపము యొక్క నేను-నేను అనే పాటను చాలా వింటుంటారు. నేను ఏదైతే చేసానో అదే రైట్, నేను ఏదైతే ఆలోచించానో అదే రైట్, అదే జరగాలి, ఈ నేను అనేది మోసం చేస్తుంది. ఆలోచించండి, చెప్పండి కానీ నిమిత్త మరియు నిర్మాన భావముతో. బాప్‌దాదా ఇంతకుముందు కూడా ఒక ఆత్మిక డ్రిల్‌ను నేర్పించారు, ఏ డ్రిల్అది? ఇప్పుడిప్పుడే మాలిక్ (యజమాని), ఇప్పుడిప్పుడే బాలక్. ఆలోచన అందించేటప్పుడు యజమాని స్థితి, మెజారిటీ వారు చెప్పినది ఫైనల్అయిన తర్వాత బాలక స్థితి. ఈ విధంగా యజమాని మరియు బాలకుడు... ఈ ఆత్మిక డ్రిల్ చాలా-చాలా అవసరము. కేవలం బాప్‌దాదా శిక్షణ రూపములో ఇచ్చిన మూడు పదాలను గుర్తుంచుకోండి - అందరికీ గుర్తున్నాయా! మనసాలో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మలో నిర్వికారి. ఎప్పుడు సంకల్పము చేసినా నిరాకారి స్థితిలో స్థితి అయ్యి సంకల్పము చేయండి, మిగిలినవన్నీ మర్చిపోయినా కానీ ఈ మూడు పదాలను మర్చిపోకండి. సాకార రూపములో వారు ఇచ్చిన ఈ మూడు పదాల శిక్షణే కానుక. మరి బ్రహ్మా బాబాపై సాకార రూపములో కూడా ప్రేమ ఉండినది... ఇప్పుడు కూడా డబల్ విదేశీయులు ఎన్నో అనుభవాలు వినిపిస్తుంటారు, బ్రహ్మా బాబాపై ఎంతో ప్రేమ ఉంది అని. చూడకపోయినా కానీ ప్రేమ అయితే ఉంది. ఉందా? మరి డబల్ విదేశీయులు, బ్రహ్మా బాబాపై ప్రేమ ఎక్కువ ఉంది కదా? ఉంది కదా? మరి ఎవరిపై ప్రేమ ఉంటుందో వారు ఇచ్చిన కానుకను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. కానుక చిన్నదైనా కానీ ఎవరి పట్లనైతే అత్యంత ప్రేమ ఉంటుందో, వారు ఇచ్చిన కానుకను దాచి పెట్టుకుంటారు, జాగ్రత్తగా పెట్టుకుంటారు. మరి బ్రహ్మా బాబాపై ప్రేమ ఉంటే ఈ మూడు పదాల శిక్షణ పట్ల ప్రేమ ఉంటుంది. వీటి ఆధారముగా సంపన్నముగా అవ్వడము లేక సమానముగా అవ్వడము చాలా సహజమైపోతుంది. బ్రహ్మా బాబా ఏమి చెప్పారో గుర్తు తెచ్చుకోండి!
కనుక క్రొత్త సంవత్సరములో వాచా సేవ చేయండి, బాగా చేయండి కానీ అనుభవం చేయించే సేవను సదా అటెన్షన్లో పెట్టుకోండి. ఈ సోదరి ద్వారా లేక ఈ సోదరుని ద్వారా మాకు శక్తి యొక్క అనుభవం కలిగింది, శాంతి యొక్క అనుభవం కలిగింది అని అందరూ అనుభవం చేయాలి ఎందుకంటే అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోరు. విన్నవాటిని మర్చిపోతారు. మంచిగా అనిపిస్తుంది కానీ మర్చిపోతారు. అనుభవమనేది ఎటువంటిదంటే అది వారిని లాక్కుని మీ దగ్గరకు తీసుకువస్తుంది. సంపర్కములోనివారు సంబంధములోకి వస్తూ ఉంటారు ఎందుకంటే సంబంధము లేకుండా వారసత్వానికి అధికారిగా అవ్వలేరు. కనుక అనుభవం సంబంధములోకి తీసుకొచ్చేటువంటిది. అచ్ఛా.
అర్థమయిందా, ఏమి చేస్తారు? చెక్ చేసుకోండి, చెకర్‌గా కూడా అవ్వండి, మేకర్‌గా కూడా అవ్వండి. అనుభవం చేయించే మేకర్‌గా అవ్వండి, జమా ఖాతాను చెక్ చేసుకునే చెకర్‌గా అవ్వండి. అచ్ఛా.
అందరూ చేరుకున్నారు, బాప్‌దాదా అందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదాల సహితంగా పదమారెట్ల అభినందనలు ఇస్తున్నారు. చూడండి, పటరాణి, పటరాజులుగా అయ్యారు కదా? కుర్చీ రాణి అని అనము, పటరాణి అంటాము. ఈరోజు మెజారిటీ పూర్తి సభ పటరాణి, పటరాజులుగా అయ్యారు (క్రింద కూర్చున్నవారు). కూర్చుని-కూర్చుని అలసిపోలేదు కదా. కుర్చీలో కూర్చునేవారికి నేల దొరికింది, మరి అలసిపోలేదు కదా, నొప్పిగా లేదు కదా? సంతోషంలో అన్నీ మర్చిపోతారు. అచ్ఛా – ఈ సమాచారము విన్నాము – ఒకటైతే ఈరోజు పిల్లల గ్రూప్ వచ్చింది, పిల్లలు అందరూ లేవండి. అందరికీ వీరు ధరించిన కిరీటము కనిపిస్తుందా? మరి కిరీటధారి పిల్లలు మీరు. చూడండి, జెండాలు ఊపుతున్నారు. మంచిది. పిల్లలను చూస్తే సంతోషంగా ఉంటుంది కదా! ఈ పిల్లలు రిట్రీట్ చేసారు అని కూడా విన్నాము. అచ్ఛా, ఎంతమంది పిల్లలు వచ్చారు? (రిట్రీట్ కోసం 11 దేశాల నుండి 26 మంది పిల్లలు వచ్చారు) మరి ఎవరైతే రిట్రీట్‌లో పాల్గొన్నారో ఆ పిల్లలంతా తమ-తమ దేశాలకు వెళ్ళి ఇతరులకు కూడా రిట్రీట్ చేయిస్తారా? హా జీ అన్న జెండాను ఊపుతున్నారు. మర్చిపోకండి. అందరూ వాహ్! పిల్లలూ వాహ్! అనే విధంగా మీరు ఉదాహరణగా అవ్వాలి. అన్ని దేశాల నుండి రిజల్ట్ వస్తుంది కదా. ఏ పాఠమైతే చదివారో దానిని కర్మలోకి తీసుకురండి. కేవలం చెవుల వరకే ఉంచకండి, కర్మ వరకు తీసుకురండి. మంచిది. పిల్లలకు ఏ సాంగత్యం లభిస్తుందో ఆ రంగు అంటుకుంటుంది. పిల్లలను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. ముందైతే కిరీటానికి అభినందనలు, చక్కగా అలంకరించుకుని వచ్చారు. చూడండి, మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ అన్ని దేశాలవారు మిమ్మల్ని చూస్తున్నారు. అమెరికా కూడా చూస్తుంది, లండన్ కూడా చూస్తుంది, ఆస్ట్రేలియా కూడా చూస్తుంది, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఎంతటి భాగ్యశాలురు మీరు! రెండవ గ్రూప్ – యూథ్ గ్రూప్. డబల్ విదేశీయులు ఇది బాగా చేస్తారు -గ్రూపు-గ్రూపుకు రిట్రీట్ చేస్తారు. డబల్ లాభాన్ని పొందుతారు. బాప్‌దాదాను కూడా కలుస్తారు మరియు దానితో పాటు రిట్రీట్ కూడా చేస్తారు. (26 దేశాల నుండి 160 మంది యూథ్ వచ్చారు). మీరైతే సేవ చాలా చేసి చూపించాలి. ఇంటర్నేషనల్ యూథ్ గ్రూపును తయారు చేసారు. ఇందులో ఇంటర్నేషనల్ ఉన్నారు కదా. అచ్ఛా, ఈ ముగ్గురు టీచర్లు లభించారు మీకు, త్రిమూర్తి. మంచిది. బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు మరియు యూథ్ గ్రూప్ యొక్క రిజల్ట్‌ను కూడా విన్నారు. బాప్‌దాదాకు ఒక విషయం చాలా మంచిగా అనిపించింది, అది అందరికీ చాలా మంచిది. మేము సోల్ కాన్షస్, ఆత్మ అభిమానిగా ఎక్కువ సమయం ఉంటాము అని యూథ్ గ్రూప్ లక్ష్యం పెట్టుకున్నారు. ఆత్మ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. పక్కా చేసుకున్నారా? చేతులు ఊపండి. ఇది మధుబన్ వరకే ఉంటుందా లేక అక్కడ కూడా ఉంటుందా? బచ్చీ వినిపించారు, అప్పుడు బాప్‌దాదాకు ఆరంభంలో చిన్న పిల్లల కోసం బోర్డింగ్ స్కూలులో కూడా ఆత్మ పాఠాన్ని పక్కా చేయించిన విషయం గుర్తుకు వచ్చింది, వీరు కూడా బాడీ కాన్షన్గా ఉండము, సోల్-కాన్షస్‌లో ఉంటాము అని లక్ష్యం పెట్టుకున్నారు. పక్కా కదా? ఇది పక్కాగా ఉందా లేక కచ్చాగా ఉందా అని ఎలా తెలుస్తుంది? టీచర్లు రిపోర్ట్ వ్రాసి పంపిస్తారా? ప్రతి నెల నలువైపుల రిపోర్ట్‌ను మీ వద్దకు తెప్పించుకోండి, ఆ తర్వాత ఆ రిపోర్ట్‌ను మధుబన్కు పంపండి. దాదీ, దీదీల పేరు మీద పంపకండి, వారికి చాలా పని ఉంటుంది. ఆఫీస్‌కు పంపండి. ఎప్పుడైనా ఏదైనా సమాచారాన్ని లెటర్ ద్వారా పంపితే అందులో దానిపైన వ్రాయండి – ఇది ఈ డిపార్టుమెంట్ కోసం సమాచారం. యూథ్ రిజల్ట్. ఎంతవరకు ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారో అప్పుడు తెలుస్తుంది. మీరు చేస్తే అందరికీ ఉల్లాసము వస్తుంది, ఉత్సాహము పెరుగుతుంది. మంచి టాపిక్‌ను పెట్టారు. ఏమి జరిగినాగానీ బాడీ-కాన్షస్లోకి రాకూడదు. బాప్‌దాదాకు నచ్చింది. రిపోర్ట్ బాగుంది. ఇప్పుడు ఇలాగే తమ సంగఠనను తమ-తమ దేశాలలో పెంచండి. వారిని కూడా ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురండి. ఒకవేళ యూథ్ ఆత్మ-అభిమాని స్టేజీలో పక్కాగా పాస్ అయితే గవర్నమెంట్ కూడా కానుక ఇస్తుంది, ఈ ప్రెజిడెంట్ ఉన్నారు కదా, వారు కానుకను ఇస్తారు. వారు మంచిగా ఉన్నారు, వారికి తెలుసు. మీకైతే కానుక అవసరమే లేదు కానీ దీనితో సేవ జరుగుతుంది. టి.వి.లో, రేడియోలో శబ్దం వ్యాపిస్తుంది. బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారీలు ఈ ప్రతిజ్ఞను చేసి ప్రాక్టికల్‌గా అందులో నడుచుకుంటున్నారు. చేస్తారు కదా, ఇటువంటి షో చేస్తారు కదా? చేస్తారా? అచ్ఛా – పెద్దవారు పెద్దవారే కానీ యూథ్ నంబర్‌వన్ అవ్వాలి. బాప్‌దాదా చాలా-చాలా ఇన్‌అడ్వాన్స్ యూథ్ ప్రతి ఒక్కరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. బాబా ఆశీర్వాదాలు మీతో పెట్టుకోండి. మంచిది, డబల్ లాభాన్ని తీసుకుంటారు, ఇది చాలా బాగుంది.
సేవ టర్న్ గుజరాత్ వారిది:- గుజరాత్ టీచర్లందరూ లేచి నిల్చోండి. టీచర్లే చాలామంది ఉన్నారు. టీచర్ల సంఖ్య అన్ని జోన్లకన్నా ఎక్కువగా నంబర్‌వన్ ఏ జోన్ వారిది ఉంది? (ముందు మహారాష్ట్ర, తర్వాత గుజరాత్) ఫస్ట్ నంబర్ మహారాష్ట్ర! మహారాష్ట్రలో వేరేవారు కూడా ఉన్నారు కదా, ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ చిన్నదేమీ కాదు, చాలా పెద్దది, మరి ఇరువురూ కలిసి నంబర్‌వన్ అయ్యారు, మీరైతే ఒక్క గుజరాత్. అభినందనలు. ఇంతటి నిర్విఘ్న సేవ ఉంది కదా! ఎంతమంది టీచర్లు ఉన్నారో, అంతగా సేవలో నంబర్‌వన్, వన్ అయ్యారు కదా. అంతగా నిర్విఘ్నములో నంబర్‌వన్. ఈ సంవత్సరం సేవ యొక్క గోల్డెన్ ఛాన్స్ లభించింది, మీ సేవతో క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఈ నవీతను గుజరాత్ చేసి చూపించండి. పూర్తి సంవత్సరం గుజరాత్ నిర్విఘ్నము, నంబర్‌వన్. వీలవుతుందా? అప్పుడు బాప్‌దాదా అన్ని జోన్లకు మీ ఉదాహరణను ఇస్తారు. పెద్ద జోన్ కూడా మరియు నిర్విఘ్న జోన్ కూడా. రెండింటిలో నంబర్‌వన్. టీచర్లు అందరూ చేతులెత్తారా? మళ్ళీ ఎత్తండి. కేవలం చేయి ఎత్తకండి, మనసును ఎత్తండి. చేయి మనసు సహితంగా ఉంది కదా! సరేనా? అయితే అభినందనలు. ఇన్‌అడ్వాన్స్ అభినందనలు మరియు ఆశీర్వాదాలు. దాదీల ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. చూడండి, జనక్ బచ్చీ కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. బెడ్‌పై ఉన్నప్పటికీ ఆశీర్వాదాలను ఇస్తున్నారు. అద్భుతాన్ని చూపించండి. ఏ విషయం వచ్చినాగానీ ఇముడ్చుకోండి. లోపల మనసులో బాప్‌దాదాకు ఇచ్చేసి ఇముడ్చుకోండి. ఒకటి – సహన శక్తి, రెండు – ఇముడ్చుకునే శక్తి, ఒకవేళ ఈ రెండు విశేష శక్తులు మీలో ఉంటే పాస్ విత్ ఆనర్ అయిపోతారు. వీటిని ఇమర్జ్ చేసి పెట్టుకోండి. సహన శక్తిని కూడా మరియు ఇముడ్చుకునే శక్తిని కూడా. అంతేకానీ అనారోగ్యం వచ్చేలా ఇముడ్చుకోవడం కాదు. కొందరు లోపల పెట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ రోగం తెచ్చుకుంటారు, బుద్ధి పాడైపోతుంది. ఇలా ఇముడ్చుకోకండి. ఇముడ్చుకనే శక్తితో ఇముడ్చుకోండి. మంచిది. గుజరాత్ వారు చేయగలరు. చేయవలసిందే. సరేనా! ఏమిటి, చేయవలసిందే అని చెప్పండి. బాప్‌దాదా కూడా, జరిగే ఉంది అంటున్నారు.
గుజరాత్ సేవాధారులైతే చాలామంది ఉన్నారు, అందుకని లేవమని చెప్పడం లేదు, చాలా సంఖ్య ఉంది. అచ్ఛా, చాలామంది ఉన్నారు (3000 మంది సేవాధారులు ఉన్నారు). చూడండి, గుజరాత్‌కు అన్ని జోన్లకన్నా ఒక వరదానము ఎక్కువగా ఉంది. ఏమిటది? (సమీపంగా ఉండటము) అందరికన్నా ఎక్కువ వరదానము ఎక్స్ట్రాగా గుజరాత్ ధరణికి ఉన్నదేమిటంటే భాగ్యవిధాత బ్రహ్మా బాబా దృష్టి పడింది. ఈ గుజరాత్ భాగ్య విధాత బ్రహ్మా బాబా దృష్టితో పుట్టింది. మరి విశేషమైన వరదానము కదా. గుజరాత్ తామంతట తామే సెంటరును తెరవలేదు, బాప్‌దాదా తెరిపించారు. అందుకే గుజరాత్‌కు లిఫ్ట్ ఉంది. ఇప్పుడు ఈ లిఫ్ట్ యొక్క గిఫ్ట్‌తో సహజంగా నిర్విఘ్నంగా అయిపోండి. అచ్ఛా. చాలా మంచి సేవను చేసారు. గుజరాత్ మనసు పెద్దది అందుకే చూడండి, సంగఠన కూడా పెద్దగా ఉంది. అచ్ఛా.
జ్యూరిస్ట్ వింగ్:- అందరూ చూసారా, మీ బ్రాహ్మణ పరివారంలో ఒకే గ్రూపులో ఎంతమంది వకీళ్ళు మరియు జడ్జీలు ఉన్నారో? చాలామంది వకీళ్ళు, జడ్జీలు ఉన్నారు. ఇప్పుడు మీరింకా బాప్‌దాదాకు ఉన్న ఒక ఆశను పూర్తి చేయలేదు. చేసారా? వకీళ్ళు మరియు జడ్జీలు చేతులూపండి. జనులకు కొద్దిగా ఊపి చూపించండి. గీతా భగవంతుడి గురించి ఊపి చూపించంచిడ. అటువంటి ప్లాన్ ఏమీ తయారు చేయలేదు. సరే, కొద్ది-కొద్దిగా శబ్దాన్ని అయితే వ్యాప్తి చేసారు. ఊపడానికి ఇండివిడ్యువల్ ట్రయల్ అయితే చేయండి. పాపం, ఈ ఒక్క పొరపాటు కారణంగా పరమాత్ముడి వారసత్వం నుండి వంచితమవుతున్నారు. ఇటువంటి వంచిత ఆత్మలకు వారసత్వము ఇచ్చేందుదు నిమిత్తంగా అవ్వండి. సరేనా! ఏదైనా ప్లాన్ తయారు చేయండి. కొద్ది-కొద్దిగా అయినా రిహార్సల్ చేయండి. ఏమంటారో కాస్త ఊపి చూడండి! ఎలా అయితే చూడండి, సైన్స్ మరియు సైలెన్స్ యొక్క కలయిక ఈరోజు అవసరము అని ఇప్పుడు ప్రపంచం భావిస్తుంది కదా. అలాగే మెడిటేషన్ మరియు మెడిసన్ దీని కలయిక అవసరము అని భావిస్తుంది. అలా జ్యూరస్టులు ఏమి రుజువు చేస్తారు? ప్రతి వర్గం వారు ఇలాంటి ఏదైనా ఒక స్లోగన్‌ను తయారు చేయాలి అని బాప్‌దాదా ముందే చెప్పి ఉన్నారు. సైన్స్ సైలెన్స్ – ఇలాంటి ఏదైనా ప్రాక్టికల్ స్లోగన్‌ను తయారు చేయండి. గుర్తుందా – ఆరంభంలో ఎప్పుడైతే ప్రదర్శిని ఆరంభించారో అప్పుడు ప్రోబ్ (ప్రశ్నలు) పెట్టేవారు), ప్రోబ్ రూపంలో ఇటువంటి పాయింట్లను పెట్టేవారు, ఇప్పుడు పెట్టడం లేదు, కానీ ఆరంభంలో ప్రోబ్ పెట్టేవారు. ఇప్పుడు ప్రదర్శనిలో పెట్టకపోయినాగానీ ఇండివిడ్యువల్‌గా అయినా పెట్టండి. కేస్ కోసం బాప్‌దాదా చెప్పడం లేదు, ముందుగా తయారీ అయితే జరగాలి కదా. ముందుగా కాస్త కలిదిలంచి చూడండి, జనాలను కొంత కలుపుకోండి. వారు మీ తరఫున తయారవ్వాలి. అచ్ఛా. మీరు సెల్ఫ్ జడ్జి అన్ బాపందాదా అంటారు, ‘‘జడ్జ్ యూర్ సెల్ఫ్’’ ఈ టాపిక్‌ను కొంచెం ముందుకు తీసుకువెళ్ళండి. జడ్జీలకు చెప్పండి – సెల్ఫ్ యూర్ జడ్జిగా అయ్యి సృష్టిని పరివర్తన చేయండి. కేస్ వేసే జడ్జి కూడా మరియు జడ్జ్ యూర్ సెల్ఫ్ కూడా. రెండూ. ఇలాంటి ఏదైనా ఇన్వెన్షన్‌ను తయారు చేయండి, స్రోగన్ను తయారు చేయండి. రెండు-రెండు పదాలు కలవాలి. ఇలాంటి ఏదైనా టాపిక్‌ను తయారు చేయండి. మంచిది, ఇండిపెండెంట్‌గా కొద్దిగా ట్రయల్ వేయండి. ముందుగా చిన్న గ్రూప్‌ను తయారు చేయండి, తర్వాత ఆలోచించండి. రిట్రీట్ చేస్తారు, కలుస్తారు, కొంచెం ఆలోచిస్తారు, ఇందుకు అభినందనలు. (కాన్ఫరెన్సుల చాలా చేస్తాము) చేయండి, చాలా మంచిది. ఏ మైక్‌ను తయారు చేసారు, వారిని బాబా ముందుకు తీసుకురాలేదు. మైక్ అంటే వారి మాటలో శక్తి ఉంటుంది, మైక్ అని వారిని అంటాము. ప్రెజిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు కానీ మాటలో శక్తి లేకపోతే మైక్ కాదు. ఎవరి మాటకు శక్తి ఉంటుందో వారు మైక్, అటువంటి మైక్‌ను తయారు చేయండి. ఏ రీతిలోనైనా నిస్సంకోచంగా మైక్‌గా అయ్యి శబ్దం చేయాలి, ఇటువంటి మైక్ కావాలి. కేవలం తమ సమాజంలోనే చేసే మైక్ కాదు. మైక్ అంటే పెద్ద శబ్దం చేసేవారు కావాలి. అచ్ఛా.
కల్చరల్ వింగ్:- కల్చరల్ వింగ్ వారు ఏ ఏ క్రొత్త ప్లాన్లను తయారు చేసారు? ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేసారా? (యాత్ర చేయాలని మరియు కాన్ఫరెన్సు చేయాలని ప్లాన్ చేసాము) ప్రతి వింగ్ ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేయాలని బాప్‌దాదా కోరుకుంటారు, ఎప్పటి నుండి కాన్ఫరెన్సులు చేస్తున్నారు? ఎంత సమయం అయింది కాన్ఫరెన్సులు చేస్తూ, చాలా సంవత్సరాలు అయింది, ప్రదర్శనిలు, కాన్ఫరెన్సులు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేయండి. (కల్చరల్ కార్నివల్ చేయాలన్న ఆలోచన ఉంది) ప్లాన్ ఆలోచించండి. అచ్ఛా. ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేయమని బాప్‌దాదా అన్ని వింగ్స్ వారికి చెప్తున్నారు. బ్రహ్మాకుమారీలు కాన్ఫరెన్సులు చేస్తారు, యాత్రలు చేస్తారు అని అందరికీ తెలుసు. అందరికీ ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేయండి, అది విని ఇది తప్పకుండా చూడాలని వారికి అనిపించాలి ఎందుకంటే ఈరోజుల్లో నవీనతను ఇష్టపడుతున్నారు. మరి ఆలోచించండి, టచ్ అవుతుంది, ఏమంత పెద్ద విషయము కాదు. ఏ వర్గం వారు నవీనత చేస్తారో చూస్తాము. నంబర్‌వన్ అయితే ఒక్కరే అవుతారు కదా. మరి చేయండి. అమృతవేళ యోగం తర్వాత, యోగం సమయంలో కాదు, యోగం తర్వాత బుద్ధిలో శక్తి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆలోచించండి, అప్పుడు టచింగ్ జరుగుతుంది. ఇకపోతే ఏదైతే చేసారో, అందుకు అభినందనలు, ఏ ప్లాన్ అయితే తయారు చేసారో అది కూడా చేయండి కానీ కొంత క్రొత్తగా చేసి చూపించండి. చాలా మంచిది.
(యు.పి మరియు రాజస్థాన్‌లో పెద్ద మేళా చేయాలన్న ఉత్సాహము దాదీజీకి వస్తుంది) చేయాలి ఎందుకంటే రాజస్థాన్ మరియు యు.పిలో ఇలా పెద్ద ప్రోగ్రామ్ జరిగి చాలా కాలం అయింది. ఇటువంటి పెద్ద ప్రోగ్రామ్ జరగలేదు. ఇప్పుడు రాజస్థాన్ మైక్ ఉత్సాహంలో ఉన్నారు. (వైస్ ప్రెజిడెంట్ గురించి) వారి శబ్దము సహాయం చేస్తుంది ఎందుకంటే సీట్‌పై ఉన్నారు కాబట్టి లాభాన్ని తీసుకోండి. సీట్‌పై ఉన్న ఆత్మ యొక్క మాట ఎక్కువగా వ్యాపిస్తుంది, ఎడ్వర్టైజ్ అవుతుంది. చేయాలి, ఈ సంకల్పం బాగుంది. సహాయం కావాలి, ఇతరుల సహాయాన్ని తీసుకోండి కానీ చేయాలి.
కలకత్తాలో చాలా పెద్ద ప్రోగ్రామ్ జరిగింది, భోపాల్‌లో పెద్ద మేళా జరుగనున్నది
ప్రతి స్థానంలో, ఎక్కడైతే పెద్ద ప్రోగ్రాములు జరిగాయో, ప్రతి స్థానానికి దాని-దాని విశేషత ఉంది. ఒకచోట సంఖ్య, ఒకచోట ప్రోపగాండా ఆల్‌రౌండ్ జరిగింది (ప్రచారం), ఎలా అయితే ఢిల్లీలో జరిగిన కార్యక్రమం యొక్క శబ్దం విదేశం వరకు వెళ్ళింది, కలకత్తాలో 2 లక్షలమంది కార్యక్రమం జరిగింది. వేరు వేరు విశేషతలు ఉన్నాయి కదా. అలాగే గుజరాత్ మొదటి నంబరు తీసుకుంది, ఇన్వెన్షన్ చేసారు కదా. బాంబే కూడా మంచిగా శబ్దాన్ని వ్యాప్తి చేసారు. మద్రాసులో అయితే ముగ్గురు దాదీల చిత్రాన్ని తయారు చేసారు, ఆ చిత్రం అన్ని వైపులకు వెళ్ళింది. (ముందు గుజరాత్ తయారు చేసింది). మద్రాసువారు కొంచెం మంచిగా తయారు చేసారు, అందంగా ఉండినది. అన్నిచోట్ల మంచిగా జరిగింది. బాప్‌దాదా అయితే పిల్లల యునిటి, ఐకమత్యము మరియు ఏకాగ్రతకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. సంఖ్య ఎంత వచ్చినాగానీ పేరు అయితే వచ్చింది కదా. బ్రహ్మాకుమారీలు మైదానంలోకైతే వచ్చారు కదా. కావున అన్ని స్థానాలకు తమ-తమ విశేషత ఉంది మరియు అందరూ కలిసి సంగఠిత రూపంలో చేసారు, ఇందుకు మొదటగా అభినందనలు. అచ్ఛా. భోపాల్ కూడా ఫంక్షన్లు చేయడంలో తెలివైనవారే. చేస్తారు, వారు కూడా అద్భుతాన్ని చేస్తారు ఎందుకంటే భోపాల్‌లో ఐ.పీల కనెక్షన్ చాలా బాగుంది. చాలామంచి ఐ.పీలు వీరి కనెక్షన్లో ఉన్నారు, ఇప్పుడు వారిని కార్యంలో ఎంత వినియోగించాలి అన్న ప్రోగ్రామ్‌ను కూడా తయారు చేసి ఉండవచ్చు. ఇకపోతే వారు కూడా తెలివైనవారే, చేసేస్తారు. మంచిగా అవుతుంది.
అచ్ఛా. ఇప్పుడు అందరూ ఏమి చేస్తారు? బాప్‌దాదాకు క్రొత్త సంవత్సరానికి ఏదైనా కానుకను ఇస్తారా లేదా? క్రొత్త సంవత్సరములో ఏమి చేస్తారు? ఒకరికొకరు కానుకలను ఇచ్చుకుంటారు కదా. ఒక కార్డు ఇస్తారు, ఒక కానుకను ఇస్తారు. మరి బాప్‌దాదాకు కార్డు వద్దు, రికార్డు కావాలి. పిల్లలందరి రికార్డు నంబర్‌వన్‌గా ఉండాలి, ఈ రికార్డు కావాలి. నిర్విఘ్నముగా ఉండాలి. ఇప్పుడు కొన్ని-కొన్ని విఘ్నాల గురించి వింటుంటాము కదా, అప్పుడు బాప్‌దాదాకు నవ్వు తెప్పించే ఒక ఆట గుర్తుకొస్తుంది. ఆ నవ్వు తెప్పించే ఆట ఏమిటో తెలుసా? ఆ ఆట ఏమిటంటే – వృద్ధులు బొమ్మలతో అడుకుంటున్నారు. ఉన్నదేమో వృద్ధులుగా కానీ బొమ్మలతో ఆడుతున్నారు. మరి ఇది నవ్వు తెప్పించే ఆట కదా. ఇప్పుడు ఏవైతే చిన్న-చిన్న విషయాలను వింటున్నారో, చూస్తున్నారో, అవి చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే - ఉన్నదేమో వానప్రస్థ అవస్థలో కానీ ఈ విషయాలు ఎంత చిన్నవిగా ఉన్నాయి! ఈ రికార్డు బాబాకు నచ్చడం లేదు. దీనికి బదులు, కార్డుకు బదులు రికార్డు ఇవ్వండి, అదేమిటంటే - నిర్విఘ్నము, చిన్న విషయాలు సమాప్తము. పెద్దవాటిని చిన్నగా చేయడము నేర్చుకోండి మరియు చిన్నవాటిని సమాప్తం చేయడం నేర్చుకోండి. బాప్‌దాదా పిల్లలు ఒక్కొక్కరి ముఖాన్ని, బాప్‌దాదా ముఖము కనిపించే దర్పణములా తయారుచేయాలని కోరుకుంటున్నారు. మీ దర్పణములో బాప్‌దాదా కనిపించాలి. మరి ఇటువంటి విచిత్రమైన దర్పణాన్ని బాప్‌దాదాకు కానుకగా ఇవ్వండి. ప్రపంచములోనైతే పరమాత్మ కనిపించే దర్పణము లేనే లేదు. మరి మీరు ఈ క్రొత్త సంవత్సరములో ఎటువంటి కానుకను ఇవ్వండి అంటే - మీరు విచిత్ర దర్పణములా తయారవ్వండి. ఎవరు చూసినా, ఎవరు విన్నా వారికి బాప్దాదాయే కనిపించాలి, వినిపించాలి. బాబా యొక్క వాయిస్ వినిపించాలి. మరి కానుకను ఇస్తారా? ఇస్తారా? ఎవరైతే ఇవ్వాలి అనే దృఢ సంకల్పము చేస్తున్నారో వారు చేతులెత్తండి. దృఢ సంకల్పమనే చేతిని ఎత్తండి. డబల్ విదేశీయులు కూడా ఎత్తుతున్నారు. సింధీ గ్రూప్ కూడా ఎత్తుతుంది. ఆలోచించి ఎత్తుతున్నారు. సింధీ గ్రూప్ ఆలోచించి ఎత్తుతున్నారా?
సింధీ గ్రూప్ లేవండి. మరి బాప్‌దాదాకు గిఫ్ట్ ఇస్తారా? ఒకవేళ ఇస్తాము అని అంటే చేయి పెద్దగా ఎత్తండి. అచ్ఛా. అందరూ ఎత్తారు. చూడండి, రిపోర్ట్ లభిస్తుంది. రిపోర్ట్ లభిస్తుంది కదా! మీరే రిపోర్ట్‌ను వ్రాయండి. ప్రతి నెల రెండు అక్షరాలు వ్రాయండి – ఓ.కే. కార్డులోనే వ్రాయండి, ఎక్కువ ఉత్తరాలు పంపకండి, ఖర్చు చేయకండి, కార్డులోనే వ్రాయండి. తల అయితే ఊపండి. మంచిది. బాప్‌దాదాకు సింధీ గ్రూపుపై ఆశ ఉంది, ఏ ఆశ ఉందో చెప్పమంటారా? ఏ ఆశ ఉందంటే, సింధీ గ్రూప్ నుండి ఒకరు ఎటువంటి మైక్ తయారవ్వాలంటే, వారు - ఎలా ఉండేవారము మరియు ఇప్పుడు ఎలా తయారయ్యాము అని ఛాలెంజ్ చెయ్యగలగాలి. వారు సింధీలను మేల్కొలపాలి. పాపం వారు, గుర్తించడమే లేదు. వారి దేశములోని అవతారమునే గుర్తించడం లేదు. కనుక సింధీ గ్రూప్‌లో ఎటువంటి మైక్ వెలువడాలంటే - వారు, యథార్థమేమిటో మేము వినిపిస్తాము అని ఛాలెంజ్ చేసి చెప్పాలి. సరేనా? ఆశను పూర్తి చేస్తారా? అచ్ఛా.
అచ్ఛా, ఇప్పుడు ఏమి ఇవ్వాలో అందరికీ గుర్తుందా? గిఫ్ట్ మరియు రికార్డ్. అసలైతే దర్పణముగా తయారైతే రికార్డ్ వచ్చేసినట్లే. ఇప్పుడు బాప్‌దాదా కష్టపడే పురుషార్థాన్ని చూడాలనుకోవడం లేదు. ఇప్పుడు చిన్న-చిన్న విషయాలలో కష్టం వద్దు, ఇప్పుడు ఎగరండి. పైననే ఉంటే మిగతా అన్ని విషయాలు క్రిందనే ఉండిపోతాయి.
అచ్ఛా, మధుబన్ వారందరూ మంచిగా ఉన్నారా? నాలుగు, ఐదు భుజాలు, అందరూ ఉన్నారా? పాండవ భవన్, జ్ఞాన సరోవర్ నుండి కొద్ది మంది వచ్చారు. అచ్ఛా – అందరికీ, శాంతివన్, జ్ఞాన సరోవర్, పాండవ భవన్, హాస్పిటల్ కావచ్చు అందరికీ బాప్‌దాదా మనస్ఫూర్తిగా చాలా-చాలా అభినందనలు. ఎవరు వచ్చినా వారి సేవను మంచిగా చేస్తారు. సేవ చేయడంలో నంబర్ బాగుంది. మిగతా విషయాన్ని తర్వాత వినిపిస్తాము, కానీ సేవలో అయితే నంబర్ బాగుంది. అలసట లేకుండా సేవ చేయడం నేచురల్ అలవాటుగా అయిపోయింది. ఎంత సంఖ్య ఉన్నారో చూడండి. ఇప్పుడు ఉన్న సంఖ్య ఎంత? (15-16 వేలమంది వచ్చారు, అందరూ కలిపి 18 వేలమంది హాల్లో ఉన్నారు) ఇంతమందిని సంభాళిస్తున్నారు కదా. వచ్చిన డబల్ విదేశీయులు కావచ్చు భారతవాసులు కావచ్చు, అందరూ బాగున్నారా? భోజనం సరిగ్గా లభిస్తుందా? మంచిగా ఉంటున్నారా? చలిగా లేదు కదా? కంబళి లభించిందా? మాతలూ, మాతలు సంతోషంగా ఉంటున్నారా? మాతలు మంచిగా ఉంటున్నారా?
అచ్ఛా – మరి గుర్తుంచుకోండి, నూతన సంవత్సరానికి నవీనత కావాలి. బయట కూడా ఎవరైతే కూర్చున్నారో, వారు కూడా విని-విని సంతోషిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఎక్కువమంది వింటున్నారు, చూసేవారైతే కొద్దిమందే ఉండవచ్చు, కానీ వినేవారు ఎక్కువమంది ఉన్నారు. దూరంగా కూర్చుని ఉన్నాకూడా సమ్ముఖంలో కూర్చున్నంత భావనతో కూర్చుంటారు మరియు సమయం యొక్క తేడా ఉన్నప్పటికీ ధైర్యము మరియు ఉత్సాహంతో కూర్చుంటారు, ఇందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
ఇకపోతే అన్ని వైపుల నుండి కార్డులు అయితే చాలా వచ్చాయి. ఇక్కడ పెట్టారు కదా! బాప్‌దాదా చూసారు. మరి కార్డు పంపినవారికి బాప్‌దాదా రెస్పాండ్లో, ప్రియస్మృతులను, ఆశీర్వాదాలను కార్డుకు బదులు రికార్డును చూపించండి, ఇది చేస్తున్నారు. కార్డును పంపినందుకు అభినందనలు కానీ రికార్డును చూపిస్తే చాలా-చాలా-చాలా-చాలా అభినందనలు లభిస్తాయి. బొమ్మలు కూడా పంపుతారు, ఉత్తరాలు కూడా పంపుతారు. డబల్ విదేశీయులలో మెజారిటీ ఒక విశేషత ఉంది, అది బాప్‌దాదాకు చాలా నచ్చుతుంది. జనక్ బచ్చీ కూడా ఫారెన్ రిజల్ట్‌ను వింటున్నారు, సంతోషిస్తున్నారు. ఒక విశేషత ఏమిటంటే సత్యం చెప్తారు. సత్యమైన మనసుపై సాహెబ్ రాజీ అవుతారు. కదులుతారు కూడా, ఊగుతారు కూడా కానీ సత్యమే చెప్తారు. ఎవరైతే సత్యము చెప్తారో వారి సగం తప్పు క్షమించబడుతుంది. అందుకే బాప్‌దాదాకు ఈ విశేషత మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే అసత్యం చెప్తారో, అసత్యం ఎటువంటిదంటే అది లోలోపలే తింటూ ఉంటుంది. ఎలా అయితే ముల్లు కాలుకు గుచ్చుకుంటే ఏమవుతుంది? లోలోపలే గుచ్చుకుంటూ ఉంటుంది కదా. అలాగే అసత్యం చెప్పేవారి లోపల ఎప్పుడూ సంతోషం ఉండదు. ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండనే ఉంటుంది. కావున స్పష్టమైన ఆత్మగా అయినట్లయితే స్పష్టత శ్రేష్ఠంగా చేస్తుంది. సహాయం లభిస్తుంది, లిఫ్ట్ లభిస్తుంది. కావున మీ విశేషతను ఎప్పుడూ తగ్గించుకోకండి. ఈ విశేషతయే మీకు చాలా సహాయం చేస్తుంది. అచ్ఛా.
నలువైపులా ఉన్న సదా అఖండ మహాదాని పిల్లలకు, నలువైపులా ఉన్న బాబా యొక్క కుడి భుజాలకు, ఆజ్ఞాకారి భుజాలకు, నలువైపులా ఉన్న సదా సర్వ ఆత్మలకు ధైర్యమనే రెక్కలను ఇచ్చే ధైర్యశాలి ఆత్మలకు, నలువైపులా ఉన్న సదా బాబా సమానముగా ప్రతి కర్మలో ఫాలో చేసేవారికి, బ్రహ్మా బాబా మరియు జగదాంబ శిక్షణలను సదా ప్రాక్టికల్ జీవితములోకి తీసుకువచ్చే పిల్లలందరికీ చాలా చాలా ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే.
రాత్రి 12 గంటల తర్వాత ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా నూతన సంవత్సరము 2004కు శుభాకాంక్షలు పిల్లలందరికీ తెలిపారు:-
ఇది సంగమ సమయము, పాత సంవత్సరము మరియు క్రొత్త సంవత్సరము యొక్క సంగమము. ఈ నూతన సంవత్సరము మరియు పాత సంవత్సరము యొక్క సంగమ సమయంలో బాప్‌దాదా సర్వ విశ్వంలోని అతి ప్రియమైన, అతి గారాల, అతి సికీలధే పిల్లలకు చాలా-చాలా-చాలా మనసు యొక్క ఆశీర్వాదాలు సహితంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. శుభాకాంక్షలను పళ్ళాలు నిండుగా ఇస్తున్నాము. పూర్తి సంవత్సరము సంతోషంగా ఉండండి, మీ అదృష్ట భాగ్యాన్ని సదా గుర్తుంచుకొని మాస్టర్ భాగ్యవిధాతలుగా అవ్వండి. ఇప్పుడు సంగమయుగానికి ప్రియస్మృతులు.
డబల్ విదేశీయులకు మరియు భారత్ పిల్లలకు డబల్ గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్, రెండూ చెప్తున్నాము. ఎలా అయితే ఇప్పుడు సంతోషిస్తున్నారో అలాగే ఎప్పుడైనా ఏదైనా విషయము వస్తే ఈ రోజును గుర్తు తెచ్చుకుని సంతోషములో ఊగండి. సంతోషమనే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దుఃఖము యొక్క అల రాకూడదు. దుఃఖాన్ని ఇచ్చేవారైతే ప్రపంచములో అనేకమంది ఆత్మలు ఉన్నారు, మీరు సుఖాన్ని ఇచ్చేవారు, సుఖాన్ని తీసుకునేవారు, సుఖదాత పిల్లలు సుఖ స్వరూపులు. ఒక్కోసారి సుఖము అనే ఊయలలో ఊగండి, ఒక్కోసారి ప్రేమ అనే ఊయలలో ఊగండి, ఒక్కోసారి శాంతి అనే ఊయలలో ఊగండి. ఊగుతూనే ఉండండి. కింద మట్టిలో పాదము పెట్టకండి. ఊగుతూనే ఉండండి. సంతోషముగా ఉండండి మరియు అందరినీ సంతోషపరచండి మరియు అందరికీ సంతోషాన్ని పంచండి. అచ్ఛా!