Search for a command to run...
15 Dec 2004
"బాప్‌దాదా యొక్క విశేష ఆశ - పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి"
15 December 2004 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు. ఈ రాజ సభ మొత్తము కల్పములో ఈ సమయములోనే ఉంది. ఆత్మిక శుద్ధ గర్వము, నషాలో ఉంటారు, అందుకే నిశ్చింత చక్రవర్తులు. ఉదయము మేల్కోవటం నిశ్చింతగా మేల్కొంటారు, నడుస్తూ-తిరుగుతూ, కర్మలు చేస్తూ కూడా నిశ్చింతగా ఉంటారు మరియు నిద్రపోయినా కూడా నిశ్చింతగా నిద్రపోతారు. ఇలా అనుభవము చేస్తారు కదా! నిశ్చింతగా ఉన్నారా? అలా అయ్యారా లేక అవుతూ ఉన్నారా? నిశ్చింతులుగా అయిపోయారు కదా! నిశ్చింతులు మరియు చక్రవర్తులు, స్వరాజ్య అధికారులు, ఈ కర్మేంద్రియాలపై రాజ్యము చేసే నిశ్చింత చక్రవర్తులు అనగా స్వరాజ్య అధికారులు. పిల్లలైన మీ సభయే ఈ విధంగా ఉంటుంది. ఏదైనా చింత ఉందా? ఉందా ఏదైనా చింత? ఎందుకంటే మీ చింతలన్నిటినీ బాబాకు ఇచ్చేసారు. కనుక భారము దిగిపోయింది కదా! చింతలు సమాప్తమైపోయాయి మరియు నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి అమూల్య జీవితాన్ని అనుభవము చేస్తున్నారు. అందరి తలపై పవిత్రత అనే ప్రకాశ కిరీటము స్వతహాగానే మెరుస్తుంది. నిశ్చింతగా ఉన్నవారిపై ప్రకాశ కిరీటము ఉంది. ఒకవేళ ఏదైనా చింత చేస్తే, ఏదైనా భారాన్ని మీ తలపైకి ఎత్తుకుంటే అప్పుడు మీ తలపైకి ఏమి వస్తుందో తెలుసా? బరువైన గంపలు వస్తాయి. మరి ఆలోచించండి, కిరీటము మరియు గంప, ఈ రెండింటినీ ఎదురుగా తీసుకురండి, ఏది బాగా అనిపిస్తుంది? గంపలు బాగా అనిపిస్తాయా లేక ప్రకాశ కిరీటము బాగా అనిపిస్తుందా? టీచర్లు చెప్పండి, ఏది బాగా అనిపిస్తుంది? కిరీటము బాగా అనిపిస్తుంది కదా! అన్ని కర్మేంద్రియాలపై రాజ్యము చేసే చక్రవర్తులు. పవిత్రత అనేది ప్రకాశ కిరీటధారులుగా తయారుచేస్తుంది, అందుకే మీ స్మృతిచిహ్నాలైన జడ చిత్రాలలో రెండు కిరీటాలను చూపించారు. ద్వాపరము నుండి చక్రవర్తులుగానూ ఎంతోమంది అయ్యారు, రాజులుగానూ ఎంతోమంది అయ్యారు కానీ డబల్ కిరీటధారులుగా ఎవ్వరూ అవ్వలేదు. నిశ్చింత చక్రవర్తులైన స్వరాజ్య అధికారులుగా కూడా ఎవ్వరూ అవ్వలేదు ఎందుకంటే పవిత్రతా శక్తి మాయాజీతులుగా, కర్మేంద్రియజీతులుగా, విజయులుగా చేస్తుంది. నిశ్చింత చక్రవర్తుల లక్షణము ఏమిటంటే - వారు సదా స్వయము కూడా సంతుష్టముగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టము చేస్తారు. వారు అసంతుష్టులుగా అయ్యేందుకు వారికి అసలు ఎటువంటి అప్రాప్తి అనేదే ఉండదు. ఎక్కడైతే అప్రాప్తి ఉంటుందో అక్కడ అసంతుష్టత ఉంటుంది. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. మరి అలా తయారయ్యారా? చెక్ చేసుకోండి - సదా సర్వ ప్రాప్తి స్వరూపులుగా, సంతుష్టులుగా ఉన్నారా? బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు అన్న గాయనము ఉందే కానీ దేవతల ఖజానాలో అని అనరు. సంతుష్టత జీవితానికి శ్రేష్ఠ అలంకారము, శ్రేష్ఠమైన విలువ. మరి సంతుష్ట ఆత్మలే కదా!
బాప్‌దాదా ఇటువంటి నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూసి సంతోషిస్తారు. వాహ్ నా నిశ్చింత చక్రవర్తులూ వాహ్! వాహ్! వాహ్! వంటివారే కదా! ఎవరైతే నిశ్చింతులో వారు చేతులెత్తండి. నిశ్చింతులేనా? చింత కలగదా? ఎప్పుడైనా వస్తుందా? రాదా? మంచిది. నిశ్చింతులుగా అయ్యేందుకు విధి చాలా సహజమైనది, అది కష్టమేమీ కాదు. కేవలము ఒక్క అక్షరములో కొద్దిపాటి తేడా ఉంటుంది. ఆ పదము ఏమిటంటే - నాది అన్నదానిని నీదిలోకి పరివర్తన చెయ్యండి. నాది కాదు, నీది. హిందీ భాషలో మేరా (నాది) అని కూడా వ్రాయండి మరియు తేరా (నీది) అని కూడా వ్రాయండి, తేడా ఏమి వస్తుంది. మే (నా) మరియు తే (నీ). ఇంతే. కానీ ఇదే చాలా తేడాను తీసుకువస్తుంది. మరి మీరందరూ నా, నా అని అనేవారా లేక నీ, నీ అని అనేవారా? నాదిని నీదిలోకి పరివర్తన చేసారా? చెయ్యకపోతే చెయ్యండి. నాది-నాది అని అనటము అనగా దాసులుగా అయ్యేవారు, ఉదాసీనులుగా అయ్యేవారు. మాయకు దాసులుగా అయిపోతారు కావున ఉదాసీనులుగా అవుతారు కదా. ఉదాసీనులు అనగా మాయకు దాసులుగా అయ్యేవారు. కానీ మీరు మాయాజీతులు, మాయకు దాసులు కారు. మరి ఉదాసీనత వస్తుందా? అప్పుడప్పుడు అది రుచి చూస్తారు ఎందుకంటే 63 జన్మలు ఉదాసీనులుగా ఉండే అభ్యాసము ఉంది కదా! అందుకే అప్పుడప్పుడు అది ప్రత్యక్షమవుతుంటుంది, అందుకే బాప్‌దాదా ఏమి చెప్పారు? పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చింత చక్రవర్తులు. ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కడైనా, ఏ మూలలోనైనా ఏదైనా చింతను పెట్టుకుని ఉన్నట్లయితే దానిని ఇచ్చెయ్యండి. భారాన్ని మీ వద్ద ఎందుకు పెట్టుకుంటారు? భారాన్ని పెట్టుకోవటం అలవాటు అయిపోయిందా? భారాన్ని నాకు ఇచ్చెయ్యండి, మీరు లైట్‌గా అవ్వండి, డబల్ లైట్‌గా అవ్వండి అని బాబా అంటున్నారు. డబల్ లైట్‌గా ఉండటం మంచిదా లేక భారము ఉండటం మంచిదా? కనుక బాగా చెక్ చేసుకోండి. అమృతవేళ నిద్ర లేచినప్పుడు చెక్ చేసుకోండి - విశేషముగా వర్తమాన సమయములో సబ్ కాన్షస్‌లో అయినా కూడా ఎటువంటి భారమూ లేదు కదా? సబ్ కాన్షస్‌లో కాదు కదా, స్వప్నమాత్రముగా కూడా భారము అనుభవమవ్వకూడదు. డబల్ లైట్‌గా ఉండటమే ఇష్టము కదా! కనుక విశేషముగా ఈ హోమ్‌వర్కు ఇస్తున్నాము, అమృతవేళ చెక్ చేసుకోండి, చెక్ చేసుకోవటమైతే వస్తుంది కదా, కానీ చెక్ చేసుకోవటముతోపాటు, కేవలము చెక్ చేసుకోవటము మాత్రమే కాకుండా ఛేంజ్ కూడా చేసుకోవాలి. నాది అన్నదానిని నీదిలోకి మార్చేయండి. నాది, నీది. కనుక చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి ఎందుకంటే బాప్‌దాదా పదే-పదే వినిపిస్తున్నారు - సమయము మరియు స్వయము, ఈ రెండింటినీ చూడండి. సమయము యొక్క వేగాన్ని కూడా చూడండి మరియు స్వయము యొక్క వేగాన్ని కూడా చూడండి. మళ్ళీ తర్వాత - సమయము ఇంత వేగముగా వెళ్ళిపోయిందని మాకు తెలియనే తెలియలేదు అని అనకండి. కొంతమంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ ఇప్పుడు కాస్త ఢీలా పురుషార్థము ఉన్నా సరే అంతిమములో దానిని వేగవంతము చేసేద్దాములే అని. కానీ బహుకాలపు అభ్యాసమే అంతిమములో సహయోగిగా అవుతుంది. చక్రవర్తులుగా అయ్యి చూడండి. అయ్యారు కానీ కొంతమంది అయ్యారు, కొంతమంది అవ్వలేదు. నడుస్తున్నాము, చేస్తున్నాము, సంపన్నముగా అయిపోతాము... అని అనడం కాదు. ఇప్పుడు నడవటము కాదు, చెయ్యటము కాదు, ఎగరాలి. ఇప్పుడే ఎగిరే వేగము కావాలి. రెక్కలైతే లభించాయి కదా! ఉల్లాస-ఉత్సాహాలు మరియు ధైర్యము అనే రెక్కలు అందరికీ లభించాయి మరియు బాబా వరదానము కూడా ఉంది, వరదానము గుర్తుందా? ధైర్యమనే ఒక్క అడుగు మీది మరియు వెయ్యి అడుగుల సహాయము బాబాది, ఎందుకంటే బాబాకు పిల్లలపై హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. కనుక ప్రియమైన పిల్లలు శ్రమ పడుతుంటే బాబా చూడలేరు. ప్రేమలో ఉన్నట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది. శ్రమ మంచిగా అనిపిస్తుందా ఏమిటి? అలసిపోయి ఉన్నారు. 63 జన్మలు భ్రమిస్తూ, భ్రమిస్తూ, శ్రమపడుతూ అలసిపోయారు. ఇప్పుడు బాబా తమ ప్రేమతో పిల్లలను భ్రమించేందుకు బదులుగా మూడు సింహాసనాలకు అధికారులుగా తయారుచేసారు. మూడు సింహాసనాలు ఏమిటో తెలుసా? తెలియడమేమిటి, ఆ సింహాసన నివాసులుగా అయిపోయారు. భృకుటి సింహాసన నివాసులు కూడా, బాప్‌దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు కూడా మరియు భవిష్య విశ్వ రాజ్య సింహాసనాధికారులు కూడా. బాప్‌దాదా పిల్లలందరినీ సింహాసనాధికారులుగా చూస్తున్నారు. ఇటువంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని మొత్తము కల్పములో మరెప్పుడూ అనుభవము చేయలేరు. పాండవులు ఏమనుకుంటున్నారు? చక్రవర్తులేనా? చేతులెత్తుతున్నారు. సింహాసనాన్ని వదలకండి. దేహ భానములోకి వచ్చారు అనగా మట్టిలోకి వచ్చినట్లు. ఈ దేహము మట్టితో సమానమైనది. సింహాసనాధికారులుగా అయ్యారు అంటే చక్రవర్తులుగా అయినట్లు.
బాప్‌దాదా పిల్లలందరి పురుషార్థపు చార్టును చెక్ చేస్తున్నారు, నాలుగు సబ్జెక్టులలో ఎవరెవరు ఎంతవరకు చేరుకున్నారు అని? బాప్‌దాదా పిల్లల ప్రతి ఒక్కరి చార్టును ఏ విషయములో చెక్ చేసారంటే - బాప్‌దాదా ఏయే ఖజానాలనైతే ఇచ్చారో ఆ అన్ని ఖజానాలను ఎంతవరకు జమ చేసుకున్నారు? జమ ఖాతాను చెక్ చేసారు. ఎందుకంటే ఖజానాలనైతే బాబా అందరికీ ఒకే విధంగా, ఒకే పరిమాణములో ఇచ్చారు, కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఖజానాలు జమ అయ్యాయి అన్నదానికి గుర్తు ఏమిటి? ఖజానాల గురించైతే తెలుసు కదా. అన్నింటికంటే పెద్ద ఖజానా - శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంకల్పము కూడా ఖజానాయే. అలాగే వర్తమానములోని సమయము కూడా చాలా పెద్ద ఖజానా ఎందుకంటే వర్తమాన సమయములో ఏది ప్రాప్తి చేసుకోవాలనుకున్నా, ఏ వరదానాన్ని తీసుకోవాలనుకున్నా, ఎంతగా స్వయాన్ని శ్రేష్ఠముగా తయారు చేసుకోవాలనుకున్నా, అంతగా ఇప్పుడు తయారుచేసుకోగలరు. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ అవ్వదు. సంకల్పాల ఖజానాను వ్యర్థముగా పోగొట్టడము అనగా తమ ప్రాప్తులను పోగొట్టుకోవటము. అలాగే సమయములో ఒక్క క్షణమునైనా వ్యర్థముగా పోగొట్టుకుంటే, సఫలము చేసుకోకపోతే చాలా పోగొట్టుకున్నట్లు. అలాగే దానితో పాటు జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా మరియు ప్రతి ఆత్మ ద్వారా మరియు పరమాత్మ ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా. పురుషార్థములో అన్నింటికంటే సహజము ఏమిటంటే - ‘‘ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి.’’ సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి, దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అని కాదు, కానీ దుఃఖాన్ని తీసుకున్నా కూడా దుఃఖితులుగా అవుతారు కదా! కనుక ఆశీర్వాదాలను ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. ఆశీర్వాదాలను ఇవ్వటము వస్తుందా? వస్తుందా? తీసుకోవటము కూడా వస్తుందా? ఎవరికైతే ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు తీసుకోవటము వస్తుందో వారు చేతులెత్తండి. అచ్ఛా - అందరికీ వస్తుందా? అచ్ఛా - డబల్ విదేశీయులకు కూడా వస్తుందా? అభినందనలు. ఇవ్వటము కూడా వస్తుంది మరియు తీసుకోవటము కూడా వస్తుంది అంటే అభినందనలు. అందరికీ అభినందనలు. ఒకవేళ తీసుకోవటము కూడా వస్తే మరియు ఇవ్వటము కూడా వస్తే, మరి ఇంకేమి కావాలి. ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి, ఆశీర్వాదాలను ఇస్తూ వెళ్ళండి, సంపన్నము అయిపోతారు. ఒకవేళ ఎవరైనా శాపనార్థాలు ఇస్తే ఏం చేస్తారు? తీసుకుంటారా? ఎవరైనా మీకు శాపనార్థాలు ఇస్తే ఏం చేస్తారు? తీసుకుంటారా? ఒకవేళ ఆ శాపనార్థాలను తీసుకున్నారు అంటే మరి మీలో స్వచ్ఛత ఉన్నట్లా? శాపనార్థాలైతే చెడు కదా! మీరు వాటిని తీసుకున్నారంటే, మీ లోపలికి వాటిని స్వీకరించినట్లయితే మీలో స్వచ్ఛత లేనట్లు కదా! ఒకవేళ ఏ కాస్త అయినా డిఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ అవ్వలేరు. ఒకవేళ ఎవరైనా పాడైపోయిన వస్తువును ఇస్తే మీరు తీసుకుంటారా? చాలా సుందరమైన ఫలమైనా, ఒకవేళ పాడైపోయినది మీకు ఇస్తే, ఆ ఫలము అందముగా ఉన్నా మీరు దానిని తీసుకుంటారా? తీసుకోరు కదా! లేదా బాగుంది కదా, సరేలే, ఇచ్చారు కదా, తీసుకుందాము అని అంటారా? ఎప్పుడైనా ఎవరైనా శాపనార్థాలు ఇస్తే మీరు మనసులో లోపల ధారణ చెయ్యకండి. ఇవి శాపనార్థాలు అని అర్థమవుతుంది కానీ వాటిని లోపల ధారణ చెయ్యకండి లేదంటే డిఫెక్ట్ ఏర్పడుతుంది. కనుక ఇప్పుడు ఈ సంవత్సరములో, ఇప్పుడు పాత సంవత్సరములో ఇంకా కొద్ది రోజులు మిగిలి ఉన్నాయి. మీ మనసులో దృఢ సంకల్పము చెయ్యండి, ఇప్పుడు కూడా ఎవరి శాపనార్థాలైనా మనసులో ఉన్నట్లయితే వాటిని తొలగించి వేయండి మరియు రేపటి నుండి ఆశీర్వాదాలను ఇస్తారు, ఆశీర్వాదాలను తీసుకుంటారు. అంగీకారమేనా? ఇష్టమేనా? కేవలం ఇష్టమేనా లేక చెయ్యాల్సిందేనా? ఇష్టమైతే ఉంది, కానీ ఎవరైతే - చెయ్యాల్సిందే, ఏం జరిగినా కానీ చెయ్యాల్సిందే అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చెయ్యాల్సిందే.
స్నేహి సహయోగులు ఎవరైతే ఈ రోజు వచ్చారో వారు చేతులెత్తండి. స్నేహీ సహయోగులు ఎవరైతే వచ్చారో, బాప్‌దాదా వారికి అభినందనలు ఇస్తున్నారు ఎందుకంటే సహయోగులు కూడా, స్నేహీలు కూడా కానీ ఈ రోజు మరొక అడుగును వేసి బాబా ఇంటికి అనగా మీ ఇంటికి వచ్చారు, కనుక మీ ఇంటికి వచ్చినందుకు అభినందనలు. అచ్ఛా, స్నేహీ సహయోగులెవరైతే వచ్చారో వారు కూడా ఆశీర్వాదాలను ఇస్తాము మరియు తీసుకుంటాము అని భావిస్తున్నారా? అలా అనుకుంటున్నారా? ధైర్యము పెడుతున్నారా? స్నేహీ సహయోగులెవరైతే ధైర్యాన్ని పెడతారో వారికి సహాయము లభిస్తుంది. చేతిని బాగా పైకి ఎత్తండి. అచ్ఛా. అప్పుడిక మీరు కూడా సంపన్నులైపోతారు, అభినందనలు. అచ్ఛా, ఎవరైతే రెగ్యులర్ ఈశ్వరీయ విద్యార్థులో, బ్రాహ్మణ జీవితములో బాప్‌దాదాను కలుసుకునేందుకు మొదటిసారి వచ్చినా కానీ స్వయాన్ని ఎవరైతే బ్రాహ్మణులుగా భావిస్తున్నారో, రెగ్యులర్ విద్యార్థులుగా భావిస్తున్నారో, వారు ఒకవేళ ‘చెయ్యాల్సిందే’ అని భావిస్తున్నట్లయితే చేతులెత్తండి. ఆశీర్వాదాలను ఇస్తారా, ఆశీర్వాదాలను తీసుకుంటారా? చేస్తారా? టీచర్లు చేతులెత్తుతున్నారా? క్యాబిన్లో ఉండేవారు ఎత్తటం లేదు. మేమైతే ఇస్తూనే ఉన్నాము అని వీళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు చెయ్యాల్సిందే. ఏమి జరిగినా సరే, ధైర్యము పెట్టండి, దృఢ సంకల్పము పెట్టండి. ఒకవేళ ఎప్పుడైనా ఆ శాపనార్థాల ప్రభావము పడింది అనుకోండి, అప్పుడు దానికి 10 రెట్లు ఎక్కువ ఆశీర్వాదాలను ఇచ్చి దానిని సమాప్తము చెయ్యాలి. ఒక్క శాపనార్థము యొక్క ప్రభావాన్ని 10 రెట్లు ఆశీర్వాదాలను ఇచ్చి తేలిక చేసేయండి, అప్పుడు ధైర్యము వచ్చేస్తుంది. నష్టమైతే మీకే జరుగుతుంది కదా, ఇతరులైతే శాపనార్థాలు ఇచ్చి వెళ్ళిపోతారు, కానీ ఎవరు ఆ శాపనార్థాలను లోపల పెట్టుకున్నారు? దుఃఖితులుగా ఎవరు అవుతారు? తీసుకునేవారా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు కూడా దుఃఖితులుగా అవుతారు కానీ తీసుకునేవారు ఎక్కువ దుఃఖితులుగా అవుతారు. ఇచ్చేవారైతే నిర్లక్ష్యులుగా ఉంటారు.
ఈరోజు బాప్‌దాదా తమ హృదయములోని విశేషమైన ఆశను వినిపిస్తున్నారు. బాప్‌దాదాకు పిల్లలందరి పట్ల, ప్రతి ఒక్క బిడ్డ పట్ల, వారు దేశములో ఉన్నా లేక విదేశాలలో ఉన్నా, వారు సహయోగులైనా సరే ఎందుకంటే సహయోగులకు కూడా పరిచయమైతే లభించింది కదా, మరి పరిచయము లభించినప్పుడు పరిచయము ద్వారా ప్రాప్తినైతే అందుకోవాలి కదా. కనుక బాప్‌దాదా ఆశ ఇదే - పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఇస్తూ ఉండాలి. ఆశీర్వాదాల ఖాజానాను ఎంతగా జమ చేసుకోగలరో అంతగా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ సమయములో ఎన్ని ఆశీర్వాదాలను పోగు చేసుకుంటారో, జమ చేసుకుంటారో, అంతగానే మీరు పూజ్యులుగా అయినప్పుడు ఆత్మలకు ఆశీర్వాదాలను ఇవ్వగలరు. ఇప్పుడు ఆశీర్వాదాలను కేవలము మీకు మీరు ఇచ్చుకోవటము కాదు, ద్వాపరము నుండి భక్తులకు కూడా ఆశీర్వాదాలను ఇవ్వాలి. కనుక అంతగా ఆశీర్వాదాల స్టాక్‌ను జమ చేసుకోవాలి. రాజా పిల్లలు కదా! బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ రాజా పిల్లలుగా చూస్తారు. తక్కువగా చూడరు. అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ జోన్‌ది:- అచ్ఛా, ఢిల్లీవారందరూ లేవండి. ఢిల్లీ పేరు విని అందరూ సంతోషపడతారు కదా! ఎందుకంటే కల్ప-కల్పము అది మీ రాజధాని. చూడండి, డ్రామాలో రాజధానిగా ఢిల్లీ ఉండనే ఉంది అలాగే సేవా ఆరంభం కూడా ఢిల్లీ నుండే జరిగింది. ఆది నుండి భిన్న-భిన్నసేవల యొక్క క్రొత్త-క్రొత్త ఇన్వెన్షన్లు కూడా ఢిల్లీవారు తయారు చేసారు. ఇతరులు కూడా చేసారు కానీ ఢిల్లీ వారు కూడా తయారు చేసారు. ఇది యజ్ఞ సేవ చేయడానికి ఛాన్స్ లభించింది. యజ్ఞ సేవ యొక్క ఫలము చాలా పెద్దది ఎందుకంటే యజ్ఞ సేవ అంటే బ్రాహ్మణ ఆత్మల సేవ. భక్తిలో అయితే 8-10 మందికి భోజనం తినిపిస్తారు, ఏదైనా కొంత చేస్తే ఎంతో పుణ్యం లభించింది అని భావిస్తారు కానీ ఇక్కడ 10 వేలు, 12 వేలు, 8 వేల బ్రాహ్మణులకు సేవ చేసే ఛాన్స్ లభిస్తుంది. యజ్ఞ పిత యొక్క యజ్ఞ సేవ ఇది. బ్రహ్మా భోజనం, యజ్ఞంలోని కణ-కణము ఎంతో విలువైనది. బ్రాహ్మణులైన మీకు ఆ బ్రహ్మా భోజనము ఎంతో ప్రేమగా లభిస్తుంది. ఈ బ్రహ్మా భోజనము తక్కువైనదేమీ కాదు. ఎవరి భాగ్యములో అయితే బ్రహ్మా భోజనము ఉంటుందో, వారికి కూడా దీని భాగ్యం ఎంత లభిస్తుందో తెలియదు, కానీ తప్పకుండా లభిస్తుంది. మంచిది, ఢిల్లీలో అయితే సేవా ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు కానీ ఒక విశేషత గురించి బాప్‌దాదా విన్నారు, ఢిల్లీవారు నిమిత్తమైన తమ ప్రెజిడెంట్ యొక్క సేవను చాలా బాగా చేసారు, వారు నిమిత్తంగా అయ్యి ఇతరులకు కూడా మెసేజ్‌ను ఇస్తూ ఉంటారు – ఇది చాలా బాగా అనిపించింది. మరి మంచి మైక్‌ను తయారు చేసారు, పవర్ఫుల్. ఇప్పుడు ఢిల్లీవారు సేవ కోసం ఇంకేదైనా కొత్త ప్లాన్‌ను తయారు చేయాలి. దానిని ఏ జోన్ అయినా, బాంబే కూడా చేయగలదు, ప్రతి జోన్లో ఏదో ఒక ప్లాన్ యొక్క ఇన్వెన్షన్ చేసేవారు ఉన్నారు. ఇప్పుడు మెగా ప్రోగ్రాములు కూడా అయిపోయాయి, అవి కూడా కామన్ అయ్యాయి, చూడండి, ఇది విశేషంగా మీ దాదీ యొక్క ఇన్వెన్షన్. ఎంతో సహజంగా జరుగుతుంది. మొదట్లో లక్షమందిని ప్రోగు చేయడం చాలా కష్టమనుకున్నారు, ఇప్పుడు ఎక్కడ చేసినా, మనస్పూర్తిగా చేసారు మరియు పెద్ద సఫలత లభించింది. బాప్‌దాదా పేరు తీసుకోరు కానీ ఎంత పెద్ద మనసుతో చేసారో అంత సఫలత లభించింది. సఫలత లభించవలసిందే. సఫలత అయితే బ్రాహ్మణ ఆత్మల కంఠ హారము. జన్మ సిద్ధ అధికారము. మరైతే ఇప్పుడు ఢిల్లీవారు ఏదైనా క్రొత్తగా చేయాలి. ఢిల్లీవారు, సరేనా! ఇన్వెన్షన్ చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. మంచిది. ప్రతి వర్గంవారు ఇప్పుటివరకు ఏ సేవనైతే చేసారో, మంచిగా చేసారు. ఇప్పుడు మరింత మంచిగా చేయాలి. మంచిగా చేసారు, మరింత మంచిగా జరుగుతూ ఉంటుంది. చివరకు సైలెన్స్ శక్తి సైన్స్ శక్తిపై విజయాన్ని పొందవలసిందే. ఇప్పుడు సైన్స్వారు కూడా సంపర్కంలోకి వస్తారు. ఎవరైతే సంబంధ-సంపర్కంలోకి వస్తారో, పరిచయం లభించిందో, వారు కార్యం బాగుంది అని భావిస్తారు. జ్ఞానాన్ని అణువంతైనా బుద్ధిలోకి స్వీకరిస్తే దాని ఫలితం తప్పకుండా వారికి లభిస్తుంది. జ్ఞానం యొక్క చిన్న గింజ కూడా వినాశనం కాదు, అవినాశి ఫలము. ఇప్పుడు ఢిల్లీవారికి అర్థమయింది కదా – ఏమి చేయాలి అని? మరిన్ని మైక్‌లను తయారు చేయండి. నలుగురు ఐదుగురుని తయారు చేసారు, బాప్‌దాదా వద్దకు లిస్టు చేరింది కానీ మరింతమందిని తయారు చేయండి. అన్ని జోన్లు ఇప్పుడు ఏవైతే వచ్చాయో సేవకు రుజువును తీసుకు వచ్చారు కదా.
స్నేహి సహయోగులు ఎవరైతే వచ్చారో వారు లేవండి, కొద్దిగా నిల్చోండి. కూర్చుని-కూర్చుని అలసిపోయి ఉంటారు, ఇప్పుడు కొంచెం నిల్చోండి. అచ్ఛా – చాలా మంచి-మంచివారు వచ్చారు. మీరు ఎవరికి మెసెంజర్‌గా అయ్యారో మీకు తెలుసా? గాడ్లీ మెసెంజర్ అయ్యారు. గాడ్ యొక్క పరిచయాన్ని ఇస్తారు కదా! మరి గాడ్లీ మెసెంజర్లు అయ్యారు. ఇంత సేవ చేసినాగానీ దాని ఫలము మీకు నిశ్చితముగా లభిస్తుంది, ఎవ్వరూ తప్పించలేరు. శుభవార్త ఏమిటంటే మీరు ఏదైతే గాడ్లీ మెసంజర్గా అయ్యి ఇతరులకు సందేశాన్ని ఇస్తున్నారో వారికి తమ కొత్త ప్రపంచానికి గేట్ పాస్ లభించినట్లే. కేవలం గేట్ పాస్ లభిస్తుంది, ఇప్పుడు సీట్ కోసం పాస్ తీసుకోవాలి. బాగుంది, ఎవరు లభించినా వారికి మీరు దారిని చూపిస్తున్నారు కదా! పుణ్య కార్యాన్ని చేస్తున్నారు. పుణ్య ఖాతా ఎప్పుడూ సమాప్తమవ్వదు. మరి పుణ్యాత్మలుగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు కేవలం పుణ్య ఆత్మగా అవ్వడం కాదు, కొద్దిలో తృప్తి పడేవారా మీరు! కొద్దిలోనే సంతోషపడేవారా లేక పూర్తిగా తీసుకునేవారా? మొత్తం తీసుకోవాలి. మరి పుణ్య ఆత్మగా అయితే అయ్యారు, పుణ్య కార్యము చేసారు కదా, చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు కానీ బాబా ఏదైతే తన పిల్లలు రాజా పిల్లలుగా అవ్వాలి, స్వరాజ్య అధికారులుగా అవ్వాలి అని కోరుకుంటారో, అలా అవుతారు కదా? అవ్వాలి కదా? అవ్వాలా? తల అయితే ఊపండి. చాలా బాగా చేసారు. మీరు అతిథి కాదు, గెస్ట్ కాదు, హోస్ట్ మీరు (ఆతిథ్యం ఇచ్చేవారు మీరు). మీ ఇంటికి వచ్చారు. మీదైన ఇంత పెద్ద ఇల్లు మంచిగా అనిపించింది కదా! మీ ఇల్లు మంచిగా అనిపించింది కనుక ఇక వస్తూ ఉండండి. ఇక్కడ ఒక ఆచారము ఉంది, వచ్చినవారు వెళ్ళవలసిందే, వెళ్ళేటప్పుడు వారికి దాదీగారు గో సూన్, కమ్ సూన్ టోలీని తినిపిస్తారు. మీకు కూడా లభిస్తుంది. మరి గో సూన్ కమ్ సూన్ (త్వరగా వెళ్ళండి, త్వరగా రండి), మీ ఇంటికి వస్తూ ఉండండి, ఎందుకంటే రావలసిందే. చాలా బాగుంది. పిల్లలందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు ఎందుకంటే సేవకు ప్రత్యక్ష రుజువును తీసుకు వచ్చారు, అందుకు అందరూ సంతోషిస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని తీసుకువచ్చారో వారు కూడా సంతోషిస్తున్నారు. 10 వేల బ్రాహ్మణ ఆత్మల ద్వారా మీకు అభినందనలు, అభినందనలు. అందరూ బాగున్నారా? సౌకర్యంగా ఉందా? తప్పకుండా రండి. ఫస్ట్ గ్రూప్ యొక్క మహత్యం కూడా ఉంటుంది కదా. అచ్ఛా- కూర్చోండి, అలసిపోయి ఉంటారు.
బిజినెస్ వింగ్:- బిజినెస్ వింగ్ వారు లేవండి. బిజినెస్ వింగ్ వారు ఏ మైక్‌ను తయారు చేసారు? చేసారా? తయారు చేసారు కదా? ఎందుకంటే బిజినెస్ వారికి బిజినెస్ చేయడము, చేయించడము అలవాటు ఉంది కదా. మరి బాబాతో బిజినెస్ చేయించడం కూడా బిజినెస్ వింగ్ వారికి సహజమే. బాగుంది. బాప్‌దాదా ఏమి చూసారంటే, ఎప్పటి నుండైతే వర్గాల సేవ కోసం వర్గాలు తయారయ్యాయో, అప్పటినుండి ప్రతి ఒక్కరిలో సేవను విస్తరించాలన్న ఉల్లాస-ఉత్సాహాలు పెరిగాయి. ఇప్పుడు, ఇంకా బాప్‌దాదా ఏమంటారంటే, ప్రతి విషయంలో బాప్‌దాదాకు తీవ్రత కావాలి. పురుషార్థంలో కూడా మరియు తీవ్రతలో కూడా. పరిగెడుతున్నారు, సమాచారం లభిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు సమయం యొక్క వేగం ప్రకారంగా కొంచెం మరింత వేగాన్ని పెంచండి ఎందుకంటే అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు. ఫిర్యాదు ఉండకూడదు. మాకు తెలియనే తెలియదు అని ఏ ఆత్మ కూడా ఫిర్యాదు చేయకూడదు అన్నది బాప్‌దాదాకు ఉంటుంది. ఇకపోతే బాప్‌దాదాకు సేవా సమాచారములు లభిస్తూ ఉంటాయి. మంచిగా చేస్తున్నారు. తమ-తమ ఏరియాలలో ఏదో ఒక ప్రోగ్రామును చేస్తూనే ఉండవచ్చు కదా! నలువైపుల ఆర్భాటాన్ని చేయండి. అచ్ఛా.
సోషల్ వింగ్:- సోషల్ వింగ్ వారు, ఎవరైతే సోషల్ వర్కర్లు ఉన్నారో వారందరికీ, ఏ స్థానమైతే తయారై ఉందో, వారికి సందేశాన్ని ఇచ్చేసారా? ఎవరు ఏ రాష్ట్రం నుండి వస్తారో, ఆ రాష్ట్రంలో మీ వర్గానికి చెందిన వారు ఎవ్వరూ సందేశం లభించకుండా ఉండిపోకుండా చూసుకోవడం మీ బాధ్యత. చేస్తున్నారు, బాప్‌దాదాకు తెలుసు, నలువైపుల ప్రోగ్రాములు కూడా తయారై ఉన్నాయి, కానీ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గంవారు కనీసం తమ రాష్ట్రంలో ఎవ్వరూ మిగలిపోకుండా ఉండేలా సేవ చేయండి. ప్రతి స్థానంలో చేస్తూనే ఉన్నారు, సేవలు జరుగుతూ ఉన్నాయి. బాప్‌దాదా అంటున్నారు, రిపోర్ట్ చేరుతుంది, చేస్తున్నారు, మరింత వేగం పెంచండి ఎందుకంటే బాప్‌దాదా సమయం యొక్క వేగాన్ని చూసి ఈ సూచనను ఇస్తున్నారు. ఇకపోతే సేవను మంచిగా చేస్తున్నారు, అభినందనలు. ఇంకా చాలా మంచిగా చేస్తూ ఉంటారు.
ట్రాన్స్పోర్ట్ వింగ్:- ఎంతమంది ఆత్మలను గమ్యానికి చేర్చారు? ఎందుకంటే ట్రాన్స్‌పోర్టు యొక్క బాధ్యత గమ్యానికి చేర్చడము. బాప్‌దాదా సంతోషిస్తున్నారు, సేవ యొక్క ఉత్సాహము బాగుంది. అందరికీ మంచి ఛాన్స్ లభిస్తుంది, సేవ యొక్క మీటింగ్ కూడా జరుగుతుంది, మిలనము కూడా జరుగుతుంది, డబల్ సంపాదన జరుగుతుంది. అన్ని వర్గాలవారు తెలివైనవారు, డబల్ ఛాన్స్‌ను తీసుకునేవారు. ఇప్పుడు మనసా సేవను కూడా మరింత తీవ్రము చేయండి ఎందుకంటే వాణి యొక్క సేవతో పూర్తి విశ్వం వరకు చేరుకోవడానికి సమయం పడుతుంది కానీ మనసా సేవ ఫాస్ట్ సేవ మరియు పవర్ఫుల్ కూడా, శ్రమ కూడా తక్కువ, అందుకోసం కేవలం పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకోవాలి. కావున సదా మనసా, వాచ, కర్మణ మూడు సేవలను కలిపి చేయవచ్చు, ఒకే సమయంలో. కర్మణ అనగా సంబంధ-సంపర్కంలోకి ఎవరైతే వస్తారో వారి సంబంధంలోకి రావడం కూడా కర్మణయే అవుతుంది. సంబంధాల ద్వారా కూడా చాలా సేవ జరుగుతుంది. కనుక, అన్ని వర్గాల వారికి, ఎలా అయితే ఇతర ప్లాన్లు తయారు చేస్తారో, సేవా సాధనాలను తయారు చేస్తారో, అలా తమ-తమ వర్గాలలో మనసా సేవ కోసం కూడా ఏదైనా విధిని తయారు చేయండి. మనసా సేవ విశేషంగా ఆత్మలకు జరగాలి. అచ్ఛా, అభినందనలు, సేవ మంచిగా చేసారు. అన్ని వర్గాల రిజల్ట్ బాగుంది అని బాప్‌దాదా చెప్పి ఉన్నారు.
యూథ్ గ్రూప్:- యూథ్ గ్రూప్‌కు అభినందనలు. చూడండి, కొద్ది సమయంలోనే ఆర్డరు లభించగానే చేరుకున్నారు. ఇందుకు విశేషంగా అభినందనలు. అచ్ఛా, ఇక్కడికైతే వచ్చారు కానీ మనసా సేవ చేసారా? ఏ విశేష ఆత్మలైతే రావలసి ఉందో, వారి కోసం మనసా సేవను చేసారా? కొన్ని కారణాల వలన వారు రాలేకపోయారు కానీ మనసా సేవతో ఆ ఆత్మలకు ఏదైనా చేర్చారా లేక కేవలం మీటింగ్ చేసారా? ఆ ఆత్మలు కూడా గుర్తు చేసుకుంటారు, రావాల్సింది, చేరుకోవాల్సింది! మంచిది, యూథ్ గ్రూప్ మరింతగా పెరుగుతూ ఉండాలి, అప్పుడు భారత దేశం యొక్క సమస్య సమాప్తమవుతుంది. యూథ్ యొక్క కర్తవ్యం – తమ-తమ స్థానాలలోని యూథ్ను బ్రాహ్మణ యూథ్గా చేయడము, భ్రష్టాచారము నుండి కాపాడటము, శ్రేష్ఠాచారిగా తయారు చేయడము. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం వరకు కూడా రిజల్ట్ చేరుకుంది కానీ స్పష్టమైన రిజల్ట్ వారి బుద్ధిలో క్లియర్ అవ్వాలి, అందుకోసం వారిని మరింత సమీపంగా తీసుకురావాలి. ప్రతి పట్టణంలో, స్థానములో భ్రష్టాచారము, గొడవ చేసే యూథ్ గ్రూప్ ఉన్నారు, వారి సేవను చేయడానికి ఏదో ఒక పద్ధతిని తయారు చేయండి. అటువంటి ఎవరైనా యూథ్ను పరివర్తన చేసి చూపించండి. ప్రతి పట్టణంలో యూథ్ గ్రూపులైతే ఉంటాయి కదా, కావున ప్రతి పట్టణం వారు ఏదైనా రెండు మూడు యూథ్ గ్రూపులను పరివర్తన చేసి చూపించండి, అప్పుడు అందరి దృష్టిలోకి వస్తారు. ఎలా అయితే జైలులో సేవ చేస్తే కొందరు పరివర్తన అయ్యారు కదా, దాని గురించి అక్కడ ఇక్కడ అనుభవాన్ని వినిపిస్తారు కదా, అలాగే ఏదైనా యూథ్ గ్రూపు యొక్క అసోసియేషన్ యొక్క పరివర్తనను చేసి చూపించండి. ఆ యూథ్, ఇతర యూథ్కు తమ అనుభవాన్ని వినిపించాలి. చేస్తున్నారు, బాగుంది. కానీ ఇటువంటి ఏదైనా ఎగ్జాంపుల్‌ను తయారు చేయండి, అతి సమస్యాత్మకంగా ఉన్నవారిని మీరు సరి చేసి చూపించండి, ప్రసిద్ధి చెంది ఉండాలి. ధైర్యము ఉంది కదా? ఇటువంటి పరివర్తనను ఏదైనా చేసి చూపించండి. ఎలా అయితే బాప్‌దాదా అంటారు కదా, మైక్‌ను తయారు చేయండి, అలాగే మీరు పోట్లాడేవారిని శాంతపరచి ఎగ్జాంపుల్‌గా తయారు చేయండి, అటువంటి గ్రూప్‌ను తయారు చేసి ఇక్కడకు తీసుకురండి. చూడండి, ఎంతమంది యూథ్ వచ్చారో, చాలామంది ఉన్నారు. మంచి-మంచి వారున్నారు, అన్ని వైపుల నుండి వచ్చారు. విదేశీయులు కూడా ఉన్నారు. మంచిది. ఇప్పుడు ఏదైనా ధ్వనిని వ్యాప్తి చేయండి. కొద్ది-కొద్దిగా అయితే సేవను చేస్తున్నారు, ఖాళీగా కూర్చోలేదు, కానీ, ఎలా అయితే బాంబు వేస్తే పెద్ద శబ్దం వస్తుంది కదా, అలా ఏదైనా ఆత్మిక బాంబును వేయండి. ఏటమ్ బాంబు కాదు, ఆతమ్ బాంబు. అచ్ఛా – చాలా అభినందనలు. సమయానికి చేరుకున్నందుకు అభినందనలు. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- చేతులు ఊపండి. అందరూ చూసారు. డబల్ విదేశీయులకు బాప్‌దాదా సదా డబల్ అభినందనలు తెలుపుతారు ఎందుకంటే మెజారిటీ డబల్ విదేశీయుల విశేషత ఏమిటంటే వారు డబల్ కార్యాన్ని చేస్తారు. లౌకికం కూడా చేస్తున్నారు మరియు సెంటరును కూడా నడిపిస్తున్నారు. సెంటర్ నడిపిస్తుండవచ్చు లేక సెంటరులో సహయోగిగా ఉండవచ్చు కానీ మెజారిటీ డబల్ పనిని చేస్తున్నారు. అలా చేసేవారు భారత దేశంలో కూడా ఉన్నారు కానీ ఇక్కడ మెజారిటీ ఉన్నారు. బాప్‌దాదా అప్పుడప్పుడూ కావాలని దృశ్యాన్ని చూస్తారు, బాప్‌దాదా వద్ద నేచురల్ టి.వీ ఉంది కదా, ఈ టి.వి కాదు. ఎలా పరిగెడతారు, టిఫిన్ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, పరిగెడతారు. మంచిగా అనిపిస్తుంది. ఇలాగే పురుషార్థంలో కూడా డబల్ మార్కులను తీసుకోండి. తీసుకుంటున్నారు మరియు పరివర్తనను కూడా తీసుకువచ్చారు, ఇంకా కూడా చేయాలన్న ఉత్సాహము కూడా ఉంది. బాప్‌దాదాకు డబల్ విదేశీయుల నేచురల్ నేచర్ ఒకటి బాగా నచ్చుతుంది – వారు స్వచ్ఛమైన హృదయం కలిగినవారు. ఏది జరిగినా దాచిపెట్టరు, స్పష్టంగా ఉంటారు. క్రిందపడినా స్పష్టము, ఎక్కినా స్పష్టము. స్వచ్ఛమైన హృదయము బాబాకు ఇష్టము. మంచిది. డబల్ అభినందనలు. మిమ్మల్ని చూసి కూడా అందరూ సంతోషిస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ దర్బారుకు అలంకారము. కావున ఎగురుతూ ఉండండి, నడవకండి, పరిగెత్తకండి, హై జంప్ కూడా వద్దు, ఎగరండి. ఎగిరేవారు. చూడండి, డబల్ విదేశీయులు స్థూలంలో కూడా ఎగరకుండా ఇక్కడకు చేరుకోలేరు, ఎగిరే ఇక్కడకు రావలసి ఉంటుంది. సంపన్నంగా అయ్యే గమ్యానికి చేరుకోవడంలో కూడా ఎగిరే కళలో ఉండండి. అచ్ఛా – అభినందనలు.
ఎవరైతే ఏ వర్గంలోనూ లేవలేదో వారికి అభినందనలు లేవు అని అనుకోకండి. వారికి పదమారెట్ల అభినందనలు. దూరంగా ఉండి వింటున్నవారు, చూస్తున్నవారు, కొందరు వినేవారు ఉన్నారు, కొందరూ చూస్తూ వింటూ ఉన్నవారు ఉన్నారు, ఇద్దరికీ, నలువైపుల ఉన్న పిల్లలకు చాలా-చాలా-చాలా-చాలా అభినందనలు మరియు స్మృతి ఎందుకంటే ప్రతి సీజన్లో, ప్రతి టర్న్‌లో అందరూ ఉత్తరాలు చాలా పంపుతారు. బాప్‌దాదా వద్దకు ఆ ఉత్తరాలు చేరుతాయి, అలాగే ఏమీ ఉండిపోవు, బాబా వద్దకు చేరుతాయి. కొందరు ప్రేమ పత్రాలను వ్రాస్తారు, కొందరు తమ పురుషార్థం గురించి పత్రాన్ని వ్రాస్తారు, కొందరు సేవ గురించి ఉత్తరం వ్రాస్తారు, కొందరు ప్రతిజ్ఞా పత్రాన్ని వ్రాస్తారు, ప్రతిజ్ఞలు కూడా చాలా మంచి-మంచిగా చేస్తారు. బాప్‌దాదా వద్దకు అన్ని రకాల, అన్ని వైపుల నుండి ఉత్తరాలు చేరుకుంటాయి. మీలాగా బాప్‌దాదా ఉత్తరాలను కూర్చుని చదవరు, అవి హృదయంలోకి చేరిపోతాయి. ఉత్తరాల పోస్టాఫీసు బాప్‌దాదా హృదయము, అక్కడికి చేరుతాయి.
బాప్‌దాదా యొక్క ఆశను అండర్లైన్ చేసుకున్నారా? ఎవరైతే చేసుకున్నారో వారు చేతులెత్తండి. చేసుకున్నారా? అచ్ఛా. బాప్‌దాదా 6 నెలల హోమ్‌వర్కును కూడా ఇచ్చారు, గుర్తుందా? టీచర్లకు గుర్తుందా? కానీ ఈ దృఢ సంకల్పము యొక్క రిజల్టును ఒక్క నెల కోసం చూస్తాము ఎందుకంటే కొత్త సంవత్సరమైతే త్వరలోనే ప్రారంభమవ్వబోతుంది. మీది 6 నెలల హోమ్‌వర్క్, కానీ ఈ ఒక్క నెల కోసము దృఢ సంకల్పము యొక్క రిజల్టును చూస్తాము. సరేనా? టీచర్లు, ఒక నెల సరేనా? పాండవులూ, సరేనా? అచ్ఛా - ఎవరైతే మొదటిసారి మధుబన్కు వచ్చారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. చూడండి, బాప్‌దాదాకు సదా కొత్త పిల్లలు చాలా ఇష్టమనిపిస్తారు. కానీ కొత్త పిల్లలు ఎలాంటి వారంటే, వృక్షములో చిన్న-చిన్న ఆకులు రావటం మొదలవుతుంది కదా, అవి పక్షులకు చాలా ఇష్టమనిపిస్తాయి, అలాగే కొత్త-కొత్తగా వచ్చే పిల్లలెవరైతే ఉంటారో వారు మాయకు కూడా చాలా ఇష్టమనిపిస్తారు. అందుకే కొత్త పిల్లలెవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ మీ నవీనతను చెక్ చేసుకోండి - ఈ రోజు మాలో ఏ నవీనతను తీసుకువచ్చాము? ఏ విశేష గుణాన్ని, ఏ శక్తిని స్వయములో విశేషముగా ధారణ చేసాము? కనుక చెక్ చేసుకుంటూ ఉంటే, స్వయాన్ని పరిపక్వముగా చేసుకుంటూ ఉంటే సురక్షితముగా ఉంటారు, అమరులుగా ఉంటారు. కనుక అమరులుగా ఉండండి, అమర పదవిని పొందాల్సిందే. అచ్ఛా!
నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తులకు, సదా ఆత్మిక శుద్ధ గర్వములో, నషాలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, ప్రాప్తించిన ఖజానాలను సదా జమ ఖాతాలో పెంచుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా ఒకే సమయములో మూడు రకాల సేవలను చేసే శ్రేష్ఠ సేవాధారి పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు, పదమా పదమా పదమాల రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.
జైపూర్‌లో 19వ తారీఖున మెగా ప్రోగ్రాము ఉంది, దాని సమాచారాన్ని బాప్‌దాదాకు వినిపించారు:-
బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు – రాజస్థాన్ రాజధానిలో మెగా ప్రోగ్రాము జరగబోతుంది. పుణెలో కూడా చాలా బాగా జరిగింది. మంగళూరులో కూడా చాలా బాగా జరిగింది. అన్ని స్థానాలలో బాగా జరిగింది అని చెప్తున్నాము. ఇప్పుడు ఏదైతే జరుగనున్నదో, అది కూడా మంచిగా జరుగుతుంది. అచ్ఛా – జైపూర్ మేళా రాజస్థాన్‌లో ధ్వనిని మరింతగా వ్యాప్తి చేస్తుంది ఎందుకంటే హెడ్ క్వార్టర్ కదా, మరి హెడ్ క్వార్టర్ యొక్క ధ్వని హెడ్‌గా (పెద్దగా) ఉండాలి. బాగుంది, పరస్పరంలో మీటింగ్ చేసుకుంటున్నారు, అందరూ కలిసి చేస్తున్నారు, సఫలత మీ మెడలోని హారముగా ఉండనే ఉంది. మరి ధైర్యము ఉంది మరియు విశేషంగా మధుబన్ యొక్క సహాయం ఉంది. బాప్‌దాదా సహాయం అయితే ఉండనే ఉంది. అందుకని సదా సఫలత ఉంది, ఈ నిశ్చితమైన నిశ్చయముతో ముందుకు వెళ్ళండి. సరేనా! పుణె వారికి కూడా చాలా-చాలా అభినందనలు మరియు మంగళూరులో అయితే చిన్న-చిన్నవారు అద్భుతాన్ని చేసి చూపించారు. చిన్నవారు సుభానల్లా అన్న మాటకు ఈ చిన్నవారు రుజువుగా అయ్యి చూపించారు. అందుకని అందరికీ అభినందనలు, అభినందనలు. అచ్ఛా!