Search for a command to run...
31 Dec 2004
"ఈ సంవత్సరము ప్రారంభం నుండి అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి, ఇదే ముక్తిధామము యొక్క గేట్‌కు తాళంచెవి"
31 December 2004 · తెలుగు
ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్‌దాదా తమ పిల్లలతో క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు, పరమాత్మ మిలనము జరిపేందుకు, పిల్లల స్నేహములో తమ దూరదేశము నుండి సాకార వతనములో మిలనము జరుపుకునేందుకు వచ్చారు. ప్రపంచములోనైతే నూతన సంవత్సర శుభాకాంక్షలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. కానీ బాప్‌దాదా పిల్లలైన మీకు నూతన యుగానికి మరియు నూతన సంవత్సరానికి, రెండింటికీ శుభాకాంక్షలను ఇస్తున్నారు. నూతన సంవత్సరమునైతే ఒక్క రోజు జరుపుకుంటారు. నూతన యుగాన్ని అయితే మీరు సంగమయుగములో సదా జరుపుకుంటూ ఉంటారు. మీరందరూ కూడా పరమాత్ముని ప్రేమ యొక్క ఆకర్షణలో ఆకర్షించబడి ఇక్కడకు చేరుకున్నారు. కానీ అందరికంటే దూరదేశము నుండి వచ్చేవారు ఎవరు? డబల్ విదేశీయులా? వారు ఎంతైనా ఈ సాకార దేశములోనే ఉన్నారు. కానీ దూరదేశి అయిన బాప్‌దాదా ఎంత దూరము నుండి వచ్చారు? ఎన్ని మైళ్ళ నుండి వచ్చారో లెక్క వెయ్యగలరా? దూరదేశి అయిన బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలకు, వారు ఎదురుగా డైమండ్ హాల్లో కూర్చుని ఉన్నా, మధుబన్‌లో కూర్చుని ఉన్నా, జ్ఞాన సరోవరములో కూర్చుని ఉన్నా, గ్యాలరీలో కూర్చుని ఉన్నా, మీ అందరితోపాటుగా దూరములో కూర్చుని దేశ, విదేశాలలో బాప్‌దాదాతో మిలనము జరుపుకుంటూ ఉన్నా, బాప్‌దాదా చూస్తున్నారు, వారందరూ ఎంత ప్రేమతో దూరము నుండి చూస్తూ కూడా ఉన్నారు, వింటూ కూడా ఉన్నారు. నలువైపులా ఉన్న పిల్లలకు నూతన యుగానికి మరియు నూతన సంవత్సరానికి పదమాల రెట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. పిల్లలకైతే నవయుగము కళ్ళ ముందే ఉంది కదా! ఈ రోజు సంగమయుగములో ఉన్నారు, రేపు తమ నవయుగములో రాజ్య అధికారులై రాజ్యము చేస్తారు, అంతే. అంత సమీపముగా ఉన్నట్లు అనుభవమవుతుందా? ఈ రోజు మరియు రేపటి విషయమే. నిన్న ఉంది, రేపు మళ్ళీ రాబోతుంది. మీ నవ యుగము యొక్క, స్వర్ణిమ యుగము యొక్క స్వర్ణిమ డ్రెస్ ఎదురుగా కనిపిస్తూ ఉందా? ఎంత సుందరముగా ఉంది! స్పష్టముగా కనిపిస్తూ ఉంది కదా! ఈ రోజు సాధారణ డ్రెస్‌లో ఉన్నారు మరియు రేపు నవ యుగము యొక్క సుందరమైన డ్రెస్‌లో మెరుస్తూ కనిపిస్తారు. నూతన సంవత్సరములోనైతే ఒక్క రోజు కోసం ఒకరికొకరు కానుకలను ఇచ్చుకుంటారు. కానీ నవయుగ రచయిత అయిన బాప్‌దాదా మీ అందరికీ స్వర్ణిమ ప్రపంచము అనే కానుకను ఇచ్చారు, ఇది అనేక జన్మలకు మీతోనే ఉంటుంది. ఇది వినాశీ కానుక కాదు. అవినాశీ కానుకను బాబా పిల్లలైన మీకు ఇచ్చారు. గుర్తుంది కదా! మర్చిపోలేదు కదా! క్షణములో వెళ్ళడం, రావడం చేయగలరు. ఇప్పుడిప్పుడే సంగమయుగములోకి, ఇప్పుడిప్పుడే మీ స్వర్ణిమ ప్రపంచములోకి చేరుకుంటారా లేక ఆలస్యము అవుతుందా? మీ రాజ్యము స్మృతిలోకి వస్తుంది కదా!
ఈ రోజును వీడ్కోలు రోజు అని అంటారు మరియు 12 గంటల తర్వాత శుభాకాంక్షల రోజు అని అంటారు. ఈ వీడ్కోలు రోజున, సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడముతోపాటు మీరందరూ సంవత్సరముతో పాటు ఇంకా వేటికి వీడ్కోలు ఇచ్చారు? సదా కొరకు వీడ్కోలు ఇచ్చారా లేక కొద్ది సమయము కొరకు వీడ్కోలు ఇచ్చారా అన్నదానిని చెక్ చేసుకున్నారా? సమయము యొక్క వేగము తీవ్రగతితో వెళ్తూ ఉంది అని బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, మరి నా పురుషార్థము యొక్క వేగము తీవ్రముగా ఉందా అని మొత్తము సంవత్సరము యొక్క రిజల్టును చెక్ చేసుకున్నారా? లేక ఒకసారి ఒక రకంగా, మరోసారి మరో రకంగా ఉందా? ప్రపంచ పరిస్థితులను చూస్తూ ఇప్పుడు విశేషముగా మీ రెండు స్వరూపాలను ఇమర్జ్ చేసుకోండి, ఆ రెండు స్వరూపాలు ఏమిటంటే - ఒకటి సర్వుల పట్ల దయార్ద్ర హృదయులుగా మరియు కళ్యాణకారులుగా ఉండటము మరియు రెండవది ప్రతి ఆత్మ పట్ల సదా దాత పిల్లలు మాస్టర్ దాతలుగా ఉండటము. విశ్వములోని ఆత్మలు పూర్తిగా శక్తిహీనులై, దుఃఖముతో, అశాంతితో ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. బాబా ఎదురుగా మరియు పూజ్య ఆత్మలైన మీ ఎదురుగా బాధతో పిలుస్తూ ఉన్నారు - కొన్ని ఘడియల కొరకైనా కూడా సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. తండ్రి అయితే పిల్లల దుఃఖాన్ని, వ్యాకులతను చూడలేరు, వినలేరు. మరి పూజ్య ఆత్మలైన మీ అందరికీ దయ కలగటం లేదా! వారు - ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి... అని అడుగుతూ ఉన్నారు. కనుక దాత పిల్లలైన మీరు వారికి కొంత దోసిలి అంత అయినా ఇవ్వండి. బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని సహచరులుగా చేసుకుని, మాస్టర్ దాతలుగా చేసి, తమ రైట్ హ్యాండ్స్‌గా చేసుకుని ఇదే సూచనను ఇస్తున్నారు - విశ్వములోని ఇంతమంది ఆత్మలందరికీ ముక్తిని ఇప్పించాలి. ముక్తిధామానికి వెళ్ళాలి. కనుక ఓ దాత పిల్లలూ, మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా, మనసా శక్తి ద్వారా, వాణి ద్వారానైనా, సంబంధ-సంపర్కాల ద్వారానైనా, శుభ భావన - శుభ కామన ద్వారానైనా, వైబ్రేషన్లు-వాయుమండలము ద్వారానైనా, ఏ యుక్తితోనైనా ముక్తిని ఇప్పించండి. ముక్తిని ఇవ్వండి అని వారు బాధతో ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. బాప్‌దాదా తమ రైట్ హ్యాండ్స్‌కు చెప్తున్నారు - వారిపై దయ చూపించండి.
ఇప్పటివరకు ఉన్న లెక్క తియ్యండి. మెగా ప్రోగ్రాములు చేసి ఉండవచ్చు, కాన్ఫరెన్సులు చేసి ఉండవచ్చు, భారత్‌లోనైనా, విదేశాలలోనైనా సెంటర్లు తెరిచి ఉండవచ్చు, కానీ మొత్తము విశ్వములో ఉన్న ఆత్మల సంఖ్యతో లెక్క చూస్తే ఎంత శాతము ఆత్మలకు ముక్తి మార్గము తెలియజేసారు? కేవలం భారత్ కళ్యాణకారులేనా లేక అయిదు ఖండాలలో ఉన్న విదేశాలలో ఎక్కడెక్కడైతే సేవాకేంద్రాలు తెరిచారో అక్కడి కళ్యాణకారులేనా లేక విశ్వ కళ్యాణకారులా? విశ్వ కళ్యాణము చేయడానికి పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాకు హ్యాండ్స్‌గా అవ్వాలి, రైట్ హ్యాండ్స్‌గా అవ్వాలి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేనితో ఇవ్వటం జరుగుతుంది? చేతులతోనే ఇవ్వటం జరుగుతుంది కదా. మరి బాప్‌దాదాకు మీరు హ్యాండ్స్ కదా, చేతులు కదా. మరి బాప్‌దాదా రైట్ హ్యాండ్స్‌ను అడుగుతున్నారు - ఎంత శాతము మందికి కళ్యాణము చేసారు? ఎంత శాతము మందికి చేసారు? వినిపించండి, లెక్క తియ్యండి. పాండవులు లెక్కలు వెయ్యటములో తెలివైనవారు కదా? అందుకే బాప్‌దాదా అంటున్నారు, ఇప్పుడు స్వ పురుషార్థము మరియు సేవల యొక్క భిన్న-భిన్న విధుల ద్వారా పురుషార్థాన్ని తీవ్రము చెయ్యండి. స్వ స్థితిలో కూడా నాలుగు విషయాలను విశేషముగా చెక్ చేసుకోండి - దీనినే తీవ్ర పురుషార్థము అని అంటాము.
మొదటి విషయము - ముందుగా చెక్ చేసుకోండి - నిమిత్త భావము ఉందా? ఎటువంటి రాయల్ రూపములోనైనా నేను అన్న భావము లేదు కదా? నాది అన్న భావము లేదు కదా? సాధారణమైనవారికి నేను మరియు నాది అనేవి కూడా సాధారణమైనవి, స్థూల రూపములో ఉంటాయి, కానీ బ్రాహ్మణ జీవితములోని నాది మరియు నేను అన్న భావాలు సూక్ష్మమైనవి మరియు రాయల్‌గా ఉంటాయి. ఆ భాష ఎలా ఉంటుందో తెలుసా? ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా అవ్వాల్సిందే, నడుస్తున్నాము, చేస్తున్నాము... కనుక ఒకటి నిమిత్త భావము, ప్రతి విషయములోనూ నిమిత్తము. సేవలోనైనా, స్థితిలోనైనా, సంబంధ-సంపర్కములో ముఖము మరియు నడవడిక నిమిత్త భావము కలవిగా ఉండాలి. అటువంటివారిలో ఉండే రెండవ విశేషత ఏమిటంటే - నిర్మాన భావము. నిమిత్త మరియు నిర్మాన భావముతో నిర్మాణము చెయ్యడము. మూడు విషయాలను విన్నారు - నిమిత్తము, నిర్మానము మరియు నిర్మాణము మరియు నాల్గవ విషయము - నిర్వాణము. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్వాణధామానికి చేరుకోవాలి. నిర్వాణ స్థితిలో స్థితులవ్వాలి ఎందుకంటే స్వయం నిర్వాణ స్థితిలో ఉన్నప్పుడే ఇతరులను నిర్వాణధామానికి చేర్చగలరు. ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు, విముక్తులుగా చెయ్యండి, విముక్తులుగా చెయ్యండి అని బాధతో ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ నాలుగు విషయాలు మంచి శాతములో ప్రాక్టికల్ జీవితములో ఉండటము అనగా తీవ్ర పురుషార్థీ. అప్పుడు బాప్‌దాదా - వాహ్! వాహ్ పిల్లలూ వాహ్! అని అంటారు. మీరు కూడా వాహ్ బాబా వాహ్! వాహ్ డ్రామా వాహ్! వాహ్ పురుషార్థము వాహ్! అని అంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? తెలుసా? ఒక్కోసారి వాహ్ అని అంటే ఒక్కోసారి వై (ఎందుకు) అని అంటారు. వాహ్కు బదులుగా వై (ఎందుకు) అని అంటారు మరియు ఆ ఎందుకు అనేది అయ్యోగా మారిపోతుంది. కనుక ఎందుకు అని అనకండి, వాహ్ అని అనండి. మీకు కూడా ఏది బాగా అనిపిస్తుంది, వాహ్ బాగా అనిపిస్తుందా లేక ఎందుకు అనేది బాగా అనిపిస్తుందా? ఏది బాగా అనిపిస్తుంది? వాహ్! ఎప్పుడూ వై (ఎందుకు) అని అనరు కదా? పొరపాటున వచ్చేస్తుంది. డబల్ విదేశీయులు వై-వై (ఎందుకు, ఎందుకు) అని అంటారా? అప్పుడప్పుడు అంటారా? డబల్ విదేశీయులు ఎవరైతే ఎప్పుడూ కూడా ‘ఎందుకు’ అని అనరో వారు చేతులెత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు. అచ్ఛా - భారతవాసులు ఎవరైతే వాహ్-వాహ్ అనేందుకు బదులుగా ‘ఎందుకు, ఏమిటి’ అని అంటారో, వారు చేతులెత్తండి. ‘ఎందుకు, ఏమిటి’ అని అంటారా? మీకు అలా అనడానికి ఎవరు అనుమతినిచ్చారు? సంస్కారాలా? పాత సంస్కారాలు మీకు ‘ఎందుకు’ అని అనేందుకు అనుమతినిచ్చాయి. కానీ బాబా అంటారు, వాహ్ వాహ్! అని అనండి, వై-వై (ఎందుకు-ఎందుకు) అని అనకండి. మరి ఇప్పుడు నూతన సంవత్సరములో ఏం చేస్తారు? వాహ్! వాహ్! అంటారా? లేదా అప్పుడప్పుడు ‘ఎందుకు’ అనేదానికి అనుమతి ఇవ్వమంటారా? ‘ఎందుకు’ అనేది మంచిది కాదు. కడుపులో గ్యాస్ ఏర్పడినప్పుడు ఆరోగ్యము పాడవుతుంది కదా. మరి ‘ఎందుకు’ అనేది కడుపులో గ్యాస్ లాంటిది, అలా అనకండి. వాహ్! వాహ్! ఇది ఎంత బాగా అనిపిస్తుంది. ఆ, మరి చెప్పండి - వాహ్! వాహ్! వాహ్!
అచ్ఛా - దూరదేశము నుండి వింటున్నారు, చూస్తున్నారు, భారత్ నుండి కూడా, విదేశాల నుండి కూడా, మరి ఆ పిల్లలను కూడా అడుగుతున్నారు - వాహ్! వాహ్! అని అంటారా లేక వై వై (ఎందుకు, ఎందుకు) అని అంటారా? ఇప్పుడు ఇది వీడ్కోలు ఇచ్చే రోజు కదా! ఈ రోజు వీడ్కోలు ఇచ్చేందుకు ఇది సంవత్సరములోని చివరి రోజు. కనుక అందరూ సంకల్పము చెయ్యండి - ‘ఎందుకు’ అని అనము, దాని గురించి ఆలోచించను కూడా ఆలోచించము. ప్రశ్నార్థకము వద్దు, ఆశ్చర్యార్థకము వద్దు, బిందువు మాత్రమే. ప్రశ్నార్థకము వ్రాయండి, ఎంత వంకరగా ఉంటుంది కానీ బిందువు ఎంత సహజమైనది. కేవలము నయనాలలో బిందువైన బాబాను ఇముడ్చుకోండి. నయనాలలో చూడటము కోసమని బిందువు ఉంది కదా! అలాగే సదా నయనాలలో బిందువైన బాబాను ఇముడ్చుకోండి. ఇముడ్చుకోవటము వస్తుందా? వస్తుందా లేక సరిగ్గా ఫిట్ అవ్వటము లేదా? కింద మీద అయిపోతుందా? మరి ఏం చేస్తారు? దేనికి వీడ్కోలు ఇస్తారు? ‘ఎందుకు’ అనేదానికి వీడ్కోలు ఇస్తారా? ఎప్పుడూ ఆశ్చర్యార్థకము కూడా రాకూడదు - ఇది ఎలా అవుతుంది! ఇలా కూడా జరుగుతుందా! అసలు ఇలా జరగకూడదు, ఎందుకు జరిగింది! ఇలా ప్రశ్నార్థకము కూడా ఉండకూడదు, ఆశ్చర్యార్థకము కూడా ఉండకూడదు. కేవలము బాబా మరియు నేను, అంతే. కొంతమంది పిల్లలు ఏమంటారంటే - ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది కదా! బాప్‌దాదాకు ఆత్మిక సంభాషణలో చాలా రమణీయమైన విషయాలను వినిపిస్తారు, ఎదురుగా చెప్పలేరు కదా, అందుకని ఆత్మిక సంభాషణలో అన్నీ చెప్పేస్తారు. అచ్ఛా, ఏది ఎలా నడిచినా కానీ, మీరు నడవకూడదు. మీరు ఎగరాలి అన్నప్పుడు నడిచే విషయాలను ఎందుకు చూస్తారు? ఎగరండి మరియు ఎగిరేలా చెయ్యండి. శుభ భావన, శుభ కామన అనేవి ఎంతో శక్తిశాలిగా అయినవి. కేవలం శుభ భావన, శుభ కామన తప్ప మధ్యలో ‘ఎందుకు’ అనేది రాకూడదు. అవి ఎంతటి శక్తిశాలి అయినవి అంటే, ఎటువంటి అశుభ భావన కలవారినైనా కూడా శుభ భావనలోకి మార్చగలరు. రెండవ నెంబరు - ఒకవేళ వారిని మార్చలేకపోయినా కానీ మీ శుభ భావన, శుభ కామన అవినాశీ అయినవి కదా, అప్పుడప్పుడు ఉండేవి కావు కదా, కావున మీపై అశుభ భావన యొక్క ప్రభావము పడదు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? ఇలా ఎంతవరకు నడుస్తుంది? ఎలా నడుస్తుంది? అనే ప్రశ్నలలోకి వెళ్ళిపోతారు. వీటి వలన శుభ భావన యొక్క శక్తి తగ్గిపోతుంది. లేదంటే శుభ భావన, శుభ కామనల యొక్క సంకల్ప శక్తిలో చాలా శక్తి ఉంది. చూడండి, మీరందరూ బాప్‌దాదా వద్దకు వచ్చారు. మొదటి రోజును గుర్తు చేసుకోండి, బాప్‌దాదా ఏం చేసారు? పతితులు వచ్చినా, పాపులు వచ్చినా, సాధారణమైనవారు వచ్చినా, రకరకాల వృత్తుల వారు, రకరకాల భావనల వారు వచ్చినా, బాప్‌దాదా ఏం చేసారు? శుభ భావన ఉంచారు కదా! వీరు నా వారు, మాస్టర్ సర్వశక్తిమంతులు, హృదయ సింహాసనాధికారులు, అన్న ఇటువంటి శుభ భావనను ఉంచారు కదా, శుభ కామనను ఉంచారు కదా, దాని వలనే బాబాకు చెందినవారిగా అయ్యారు కదా. బాబా ఏమైనా - ఓ పాపి, ఎందుకు వచ్చావు అని అన్నారా? నా పిల్లలు, మాస్టర్ సర్వశక్తిమంతులైన పిల్లలు అని శుభ భావనను ఉంచారు. మరి బాబా మీ అందరిపై శుభ భావనను ఉంచినప్పుడు, శుభ కామనను ఉంచినప్పుడు, మీ మనసు ఏమన్నది? మేరా బాబా (నా బాబా). బాబా ఏమన్నారు? మేరే బచ్చే (నా పిల్లలు). అలాగే మీరు కూడా ఒకవేళ శుభ భావనను, శుభ కామనను పెట్టుకున్నట్లయితే అందరూ ఎలా కనిపిస్తారు? నా కల్పపూర్వపు మధురమైన సోదరుడు, చాలా కాలము దూరమైన తర్వాత కలిసిన నా సోదరి. ఇక పరివర్తన అయిపోతుంది.
మరి ఈ సంవత్సరములో ఏదైనా చేసి చూపించండి. కేవలం చెయ్యి ఎత్తటము కాదు. చెయ్యి ఎత్తటమైతే చాలా సహజము. మనసు యొక్క చేతిని ఎత్తండి ఎందుకంటే చాలా పని ఇంకా మిగిలిపోయి ఉంది. బాప్‌దాదా చుట్టూ చూసినప్పుడు విశ్వాత్మలపై చాలా దయ కలుగుతుంది. ఇప్పుడు ప్రకృతి కూడా విసిగిపోయింది. ప్రకృతి స్వయమే విసిగిపోతే అది ఏం చేయగలదు? ఆత్మలను విసిగిస్తుంది. బాబాకు పిల్లలను చూసి దయ కలుగుతుంది. మీ అందరికీ దయ కలగటం లేదా? ఇంతమంది ఆత్మలు పోయారు అని కేవలము ఆ వార్త విని మౌనంగా ఉండిపోతారా! ఆ ఆత్మలు సందేశము నుండైతే వంచితులు అయిపోయారు. ఇప్పుడు ఇక దాతగా అవ్వండి, దయార్ద్ర హృదయులుగా అవ్వండి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, దయ ఎప్పుడు కలుగుతుందంటే, ఈ సంవత్సరము ప్రారంభము నుండీ మీలో అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. అనంతమైన వైరాగ్య వృత్తి. ఈ దేహ స్మృతి, దేహ భానపు స్మృతి ఉందంటే అది కూడా అనంతమైన వైరాగ్యములో లోపము ఉన్నట్లు. చిన్న-చిన్న హద్దులోని విషయాలు స్థితిని అలజడిలోకి తీసుకువస్తాయి. కారణమేమిటి? అనంతమైన వైరాగ్య వృత్తి తక్కువగా ఉంది, ఇంకా ఆకర్షణ ఉంది. వైరాగ్యము లేదు, ఆకర్షణ ఉంది. ఎప్పుడైతే పూర్తిగా అనంతమైన వైరాగిగా అవుతారో, వృత్తిలో కూడా వైరాగి, దృష్టిలో కూడా అనంతమైన వైరాగి, సంబంధ-సంపర్కాలలో, సేవలో అన్నింటిలోనూ అనంతమైన వైరాగి... అప్పుడే ముక్తిధామము యొక్క ద్వారము తెరుచుకుంటుంది. ఇప్పుడు ఏ ఆత్మలైతే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో, వారు మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ దుఃఖితులు అవుతారు. ఇప్పుడు ముక్తిధామము యొక్క గేటును తెరిచేందుకు నిమిత్తులు మీరే కదా? మీరు బ్రాహ్మాబాబాకు సహచరులు కదా! కనుక అనంతమైన వైరాగ్య వృత్తియే గేటును తెరిచేందుకు తాళంచెవి. ఇప్పుడు ఇంకా తాళంచెవి పెట్టలేదు, అసలు తాళంచెవిని తయారే చెయ్యలేదు. బ్రహ్మాబాబా కూడా ఎదురు చూస్తున్నారు, అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురు చూస్తుంది, ప్రకృతి కూడా ఎదురు చూస్తుంది. చాలా విసిగిపోయి ఉంది. మాయ కూడా తన రోజులను లెక్కపెట్టుకుంటూ ఉంది. మరి ఇప్పుడు చెప్పండి - ఓ మాస్టర్ సర్వశక్తిమంతులారా, ఏం చెయ్యాలో చెప్పండి?
ఈ సంవత్సరములో ఏదైనా నవీనతను చేస్తారు కదా! నూతన సంవత్సరము అని అన్నప్పుడు నవీనతనైతే చేస్తారు కదా! ఇప్పుడు అనంతమైన వైరాగ్యానికి, ముక్తిధామానికి వెళ్ళేందుకు తాళంచెవిని తయారుచెయ్యండి. మీరందరూ కూడా ముందు ముక్తిధామానికి వెళ్ళాలి కదా. బ్రహ్మాబాబాతో ప్రతిజ్ఞ చేసారు - కలిసి నడుస్తాము, కలిసి వస్తాము, కలిసి రాజ్యము చేస్తాము, కలిసి భక్తి చేస్తాము... అని. మరి ఇప్పుడు ఏర్పాట్లు చెయ్యండి. ఈ సంవత్సరములో చేస్తారా లేక మరో సంవత్సరము కావాలా? ఈ సంవత్సరములో అటెన్షన్ ప్లీజ్ అన్నది పదే-పదే పెట్టుకుంటాము అనేవారు చేతులెత్తండి. చేస్తారా? అప్పుడు ఇక అడ్వాన్స్ పార్టీవారు మీకు చాలా అభినందనలను ఇస్తారు. వారు కూడా అలసిపోయారు. అచ్ఛా - టీచర్లు ఏమంటారు? మొదటి లైనులో ఉన్నవారు ఏమంటారు? ముందైతే, మొదటి లైనులో ఉన్న పాండవులు మరియు మొదటి లైనులో ఉన్న శక్తులు ఎవరైతే చేస్తారో, వారు చేతులెత్తండి. చేతిని సగం పైకి ఎత్తటము కాదు, సగం పైకి ఎత్తారంటే సగమే చేస్తారని అంటాము. చేతిని బాగా పైకి ఎత్తండి. అచ్ఛా. అభినందనలు, అభినందనలు. అచ్ఛా - డబల్ విదేశీయులు చేతులెత్తండి. ఎవరు చేతులెత్తలేదో పరస్పరం చూసుకోండి. అచ్ఛా, ఈ సింధీ గ్రూపువారు కూడా చేతులెత్తుతున్నారు, అద్భుతము. మీరు కూడా చేస్తారా? సింధీ గ్రూపువారు చేస్తారా? అలా అయితే డబల్ అభినందనలు. చాలా మంచిది. ఒకరికొకరు తోడుగా ఉంటూ, శుభ భావనలతో సూచనలను ఇచ్చుకుంటూ, చేయి చేయి కలుపుకుని చెయ్యాల్సిందే. అచ్ఛా. (సభలో ఎవరో గట్టిగా శబ్దము చేసారు). అందరూ కూర్చోండి, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు).
అచ్ఛా- మధుబన్ వారు చేతులెత్తండి, అచ్ఛా, పైన కూడా ఎవరైతే వింటున్నారో వారు చేతులెత్తండి. దేశవిదేశాలవారు చేతులెత్తండి. మంచిది. సంగఠనలో శక్తి ఉంది. ఒకరికొకరు శుభ భావనల సంకేతం, మాట్లాడటం లేదు, మాట్లాడితే గొడవ జరిగిపోతుంది. శుభ భావన యొక్క సంకేతాన్ని ఇవ్వండి. శుభ భావన యొక్క సంకేతాన్ని ఇవ్వడం తెలుసు కదా, శుభ భావన యొక్క సంకేతాన్ని ఇవ్వగలరా?
అచ్ఛా – బాప్‌దాదా సంతోషిస్తున్నారు ఎందుకంటే బాప్‌దాదా ఏదైతే డైమండ్ హాల్‌ను తయారు చేయించారో, దానిని సఫలం చేస్తున్నారు అందుకని సఫలత భవ. ప్రతి సెకండును, ప్రతి సంకల్పమును, ప్రతి మాటను, ప్రతి అడుగును, ప్రతి వస్తువును సఫలం చేయండి మరియు సఫలం చేయించండి. 12 గంటల తర్వాత ఈ నూతన సంవత్సరంలో బాప్‌దాదా వైపు నుండి మొదటి వరదానమును మీకు మీరు ఇచ్చుకోండి – సఫలత భవ. సంకల్పము కూడా అసఫలం కాకూడదు ఎందుకంటే మీ ఒక్క శుభ సంకల్పం విశ్వ కళ్యాణం చేసేది. అంతటి అమూల్యమైనది. ఒక్కొక్క సెకండు విశ్వ కళ్యాణానికి ఆధారము. అందుకే సఫలం చేయండి మరియు సఫలతామూర్తులుగా అవ్వండి. కేవలం ఇది చెక్ చేసుకోండి – ఏ సెకండు అయితే గడిచిందో, ఏ సంకల్పం అయితే వచ్చిందో, అది సఫలమయిందా? ఈరోజు మెజారిటీ నేలపై కూర్చున్నారు, పటరాణులు(నేలపై కూర్చున్నవారు) మీరు, వీరు కోచ్ రాణులు(సోఫాపై కూర్చున్నవారు), కోచ్ రాజులు, కుర్చీ రాజులు మరియు కుర్చీ రాణులు మరియు మీరు పటరాణులు. మజాగా ఉంది కదా. అలసిపోలేదు కదా? ఎందుకంటే ఈరోజు ఎక్కువ సమయం ఉంటుంది కదా! మూడు గంటలకే వచ్చి స్థానాన్ని పెట్టుకుంటారు. బాప్‌దాదా అంతా చూస్తూ ఉంటారు. ఎవరైతే 3-4 గంటలకే హాల్లోకి వచ్చారో వారు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారో టి.వీలో చూడండి. అందరూ చేతులెత్తుతున్నారు. కొందరు 3 గంటలకు వస్తే మరి కొందరు 4 గంటలకు వచ్చారు. మూడు గంటలకు వచ్చినవారికి త్రిలోకనాథుడి వరదానము ఉంది. భక్తిలో ఎంతో చేసారు కదా, అలాగే సంవత్సరంలో ఒక్కసారి ఇక్కడ కూడా చేస్తారు. మీ రాజ్యంలో ఇదంతా ఉండదు. కానీ అక్కడ బాబా రారు, మీరూ ఇలా ఉండరు. ఎక్కడ కూర్చుంటారు? ఈరోజు మజా తీసుకోండి. నేల మీద కూర్చోలేదు, బాప్‌దాదా అయితే మిమ్మల్ని తమ హృదయ సింహాసనంపై చూస్తున్నారు. కానీ దృశ్యం చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ బిందువుగా అయి కూర్చున్నారు. చలిగా ఉందా? చలి పారిపోయింది కదా! అచ్ఛా (ఈరోజు హాల్లో 15-16 వేలమంది సోదరసోదరీలు ఉన్నారు).
ఇప్పుడు ఒక్క సెకండులో బిందువుగా అయ్యి బిందువైన బాబాను గుర్తు చేయండి మరియు ఏవైనా విషయాలు ఉంటే వాటికి బిందువు పెట్టేయండి. పెట్టగలరా? కేవలం ఒక్క సెకండులో ‘‘నేను బాబా వాడిని, బాబా నావారు’’. అచ్ఛా.
సేవ టర్న్ మహారాష్ట్ర వారిది:- అచ్ఛా – ప్రతి జోన్‌కు సేవ యొక్క బంగారు అవకాశం లభిస్తుంది. ఈ 15-20 రోజులలో సత్యమైన బ్రాహ్మణుల సేవ చేసి మీ పుణ్య ఖాతాను నింపుకుంటున్నారు ఎందుకంటే సేవ చేసినప్పుడు అందరి మనసుల నుండి ఏమని వెలువడుతుంది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ ఆశీర్వాదాలు పుణ్య ఖాతాలో జమ అవుతాయి. కనుక ఎవరికైనా పుణ్య ఖాతాను జమ చేసుకోవడము సహజము, యోగబలంతో అయితే జరుగుతుంది కానీ కర్మ చేస్తూ కూడా పుణ్య ఖాతాను జమ చేసుకోవాలంటే కర్మయోగి స్థితిలో ఉండి యజ్ఞ సేవను చేయండి అప్పుడు మీ ఖాతా నిండుగా అయిపోతుంది. ఇదే సహజమైన విధి. మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర సంఖ్య కూడా మహాన్‌గా ఉంది. సెంటర్లు కూడా ఎక్కువ ఉన్నాయి, గీతా పాఠశాలలైతే అనేకం ఉన్నాయి. బాగుంది. ఎవరైతే తమ స్వ ఇష్టంతో స్వయాన్ని సేవలో తమ జీవితం సహితంగా సమర్పితం చేసారో, ఆ సమర్పిత పిల్లలందరి శరీర నిర్వహణ కోసం అవసరమైన సాధనాలు తప్పకుండా సహజంగా ప్రాప్తిస్తాయి. తినండి, త్రాగండి, ప్రభువు గుణాన్ని గానం చేయండి. సేవ చేస్తారు, భాషణ ఇస్తారు, కోర్సు చేయిస్తారు, ఇదంతా ఏమిటి? ప్రభువు గుణాన్ని గానం చేయడమే కదా. అన్నం, పప్పు ఇవ్వడానికైతే బాప్‌దాదా బంధింపబడి ఉన్నారు. 36 రకాల భోజనాన్ని తినిపించరు, అది కూడా అప్పుడప్పుడూ తినిపిస్తారు. చాలా బాగుంది – ట్రస్టీగా అయ్యి కూడా సేవ చేస్తుండవచ్చు, ఒకవేళ ట్రస్టీ అయితే, సత్యమైన ట్రస్టీ, అవసరానికి ట్రస్టీ కాదు, సత్యమైన ట్రస్టీగా ఉంటే బాప్‌దాదా ఎప్పుడూ ఆకలితో ఉంచరు. అన్నం, పప్పు తప్పకుండా తినిపిస్తారు ఎందుకంటే బాప్‌దాదా ఆకలితో ఉంటారా? బాప్‌దాదా ఆకలితో ఉండనప్పుడు, అందరూ భోగ్ పెడ్తారు కదా, మీరందరూ భోగ్ పెడ్తారు కదా, ఇందులో చతురత చేయరు కదా, ఒక ముద్ద తినిపించి, మిగతా సమయమంతా మర్చిపోతున్నారా, అలా వద్దు. ఒకవేళ ట్రస్టీ అయితే కూడా బాప్‌దాదా బంధింపబడి ఉన్నారు. మరి మహారాష్ట్ర ఎంత మహాన్‌గా ఉందో అంతే మహాన్‌గా వారసులు కూడా ఉన్నారా? ఉన్నారు కదా!
ఇప్పుడు ఈ సంవత్సరంలో బాప్‌దాదా అన్ని జోన్లలో వారసుల క్వాలిటీ వారు ఎంతమంది ఉన్నారు అన్న లిస్టును అడిగారు, ఆ వారసులకు వేడుక చేద్దాము. టీచర్లకైతే తెలుసు కదా! ఇందులో ఏ జోన్ నంబర్‌వన్ వస్తుందో చూద్దాము! మహారాష్ట్ర ఉంటుంది కదా! చాలా మంచిది. పక్కా వారసులు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఈ సంవత్సరంలో ఈ మెగా ప్రోగ్రాములు ఏవైతే చేసారో అది చాలా బాగా చేసారు. ఎన్ని ప్రోగ్రాములు జరిగాయి? (15-16 జరిగాయి) కొన్ని ప్రోగ్రాములనైతే జోన్‌తో కలిసి చేసారు, కానీ కొన్ని ప్రోగ్రాములు ఒక్క సెంటరు లేక చుట్టూ ఉన్న కనెక్షన్ వారితో కలిసి చేసారు, ఏవి? (మంగళూరు, సంబల్పూర్, బిలాస్పూర్, పూణె, మెహసానా) మరి వారు అద్భుతం చేసారు కదా. వారు వచ్చారా? ఎవరు వచ్చారు? పుణె వారు లేవండి. పుణె టీచరు లేవండి. పుణె కూడా అద్భుతం చేసింది. మంచిది. మంచి సర్టిఫికేట్‌ను తీసుకున్నారు. అచ్ఛా, మెహసానా చేసారా? అభినందనలు. బిలాస్పూర్ సోదరులు వచ్చారు, వారికి కూడా అభినందనలు. సంబల్పూర్ వారు ఎవరైనా ఉన్నారా? కొద్దిమంది వచ్చారు. వారికి కూడా అభినందనలు, ధైర్యముతో చేసారు మరియు సఫలతను పొందారు. సఫలతకు అభినందనలు. అచ్ఛా. ఇదైతే అయింది, ఇప్పుడు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారు? అన్ని వర్గాల సేవ కూడా జరిగింది కానీ ఇప్పుడు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారంటే ప్రతి వర్గంవారు ఏదైతే ఆది నుండి అంతిమం వరకు సేవను చేసారో, ఎలా అయితే బాప్‌దాదా మైక్‌లకు పిలిచారు, మైక్‌లు కూడా నంబరువారుగా ఉన్నారు, అందరూ పవర్‌ఫుల్‌గా లేరు, కొందరు మధ్యమంలో ఉన్నారు. కానీ ఇప్పుడు బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు – ఇంత సమయం జరిగిన వర్గ సేవలో ప్రతి జోన్ నుండి, మేము ఈ జ్ఞానాన్ని సమ్మతిస్తున్నాను అని చెప్పే వి.ఐ.పీలు మరియు ఐ.పీలు ఎంతమంది వెలువడ్డారు? ఈ కార్యం చాలా బాగుంది, ఇంకెవ్వరూ చేయలేరు మీరు చేస్తున్నారు అని కేవలం ఇంతమాత్రం అంటే సరిపోదు, వారు జ్ఞానాన్ని నమ్మాలి. ఇటువంటి నాలెజ్ఫుల్ గ్రూప్‌ను బాప్‌దాదా చూడాలని ఆశిస్తున్నారు. క్లియర్ అయిందా! ఈ సంవత్సరంలో లాస్ట్ టర్న్ వస్తుంది కదా, అందులో ప్రతి వర్గం వారు, ఐ.పి లేక వి.ఐ.పీలు ఎవరైతే జ్ఞానాన్ని నమ్ముతున్నారో, అటువంటి గ్రూపును బాప్‌దాదా ముందుకు తీసుకురండి. వారు సేవను చేయాలి. వారిని సేవకు నిమిత్తంగా చేద్దాము. సరేనా! వర్గంవారికి, వచ్చే సంవత్సరానికి ఇది హోమ్‌వర్కు, ఎందుకంటే ఏదో ఒక వర్గం వారు వస్తూనే ఉంటారు.
కల్చరల్ వింగ్:- అచ్ఛా – కల్చరల్ వారు ఎప్పుడైతే కల్చరల్ చూపిస్తారో అందులో ఏమి నిరూపిస్తారు? ఎవరైతే కల్చరల్ చేస్తారో, మీ నడవడిక, ముఖము మరియు కర్మలతో మీ క్యారెక్టర్ కనిపిస్తుందా, వీరు శ్రేష్ఠమైన క్యారెక్టర్ కలిగినవారు అన్నది కనిపిస్తుందా? అవును లేక కాదు అని చెప్పండి. అవును అని అంటే చేతులు ఊపండి. అచ్ఛా, రెండు లక్ష్యాలను పెట్టుకుంటున్నారు. ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రాము అయితే అందరూ చేస్తారు కానీ మీరు ఏదైతే కల్చరల్ చూపిస్తారో లేక ప్రోగ్రాము చేస్తారో అందులో కేవలం కల్చరల్ కాదు, నైతిక విలువలు కూడా ఇమిడి ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. దాని వలన ఏమి జరుగుతుంది? చూసేవారు కూడా, మేమూ క్యారెక్టర్‌ను ధారణ చేయాలన్న ఆకర్షణ సహజంగా జరుగుతుంది. ఈ విధితో, ఎందుకంటే కొందరు జ్ఞానాన్ని వినాలని అనుకోరు, నేరుగా జ్ఞానం చెబితే వారు వినరు, కానీ మీరిచ్చే కల్చరల్‌తో వారు క్యారెక్టర్‌ను నేర్చుకుంటారు. ఇలా చేస్తున్నారు కూడా, మరింతగా లక్ష్యాన్ని పెట్టుకోండి. కనీసం చూసేవారికి నైతిక విలువల గురించి సంకేతం లభించాలి, మేమూ చేయాలి అన్న ఆకర్షణ కలగాలి. ఇకపోతే అంతా బాగా చేస్తున్నారు. ఏ వర్గం వారు చేస్తున్నా, బాప్‌దాదా ప్రతి వర్గం యొక్క పురుషార్థము మరియు రిజల్ట్‌ను చూసి సంతోషిస్తున్నారు. ఈ వర్గీకరణ సేవ తర్వాత చాలామంది సోదరసోదరీలకు సేవా అవకాశం లభించింది, సేవా క్షేత్రంలోకి ముందుకు వస్తున్నారు, సేవలో బిజీగా ఉంటున్నారు. అందుకే బాప్‌దాదాకు వర్గాల సేవ మంచిగా అనిపిస్తుంది. అందరూ చేస్తున్నారు. ఒకసారి ఒక వర్గం వస్తారు, మరోసారి మరో వర్గం వారు వస్తారు, మరి అందరూ మంచిగా ఉన్నారా? చాలా బాగున్నారా లేక బాగున్నారా? చాలా బాగున్నారా? తీవ్ర పురుషార్థీలా లేక పురుషార్థీలా? మంచిగా నడుస్తున్నారా లేక ఎగురుతున్నారా? ఏమంటారు? ఇప్పుడు ఎగరాలి మరియు ఎగిరించాలి. నడిచే సమయం పూర్తయిపోయింది. ఎలా అయితే ఎద్దులబండి కాలం పోయిందో, కార్లు వచ్చాయి కదా. మునుపు అయితే ఎద్దులబండిలోనే వెళ్ళేవారు. అలాగే ఇప్పుడు నడిచే సమయం పూర్తయింది, ఇప్పుడు ఎగరాలి. అచ్ఛా.
జ్యూరిస్ట్ వింగ్:- అచ్ఛా – మంచి-మంచివారు వచ్చారు, అభినందనలు. జడ్జీలు మరియు వకీళ్ళు అంటే ధ్వని మారుమ్రోగేలా చేసేవారు, మరి ఇప్పుడు ఏదైనా ప్రాక్టికల్ ప్లాన్ ఆలోచించండి, ఆ ప్లాన్ ద్వారా మీరు కూడా స్పిరిచువాలిటీ యొక్క ధ్వనిని మారుమ్రోగేలా చేయండి. సాధారణ వకీలు, సాధారణ జడ్జికి స్పిరిచువల్ వకీలు మరియు జడ్జీకి ఎంత తేడా ఉందో అందరికీ కనిపించాలి. అయిపోతుంది, బాప్‌దాదా విన్నారు – గీతా భగవంతుడు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించండి. ఇందులో ఎవరినైనా నిమిత్తంగా చేయవలసి ఉంటుంది. జడ్జి ఉండాలి, ధర్మాత్మ ఉండాలి, రెండు గ్రూపుల నుండి ఇద్దరు-నలుగురిని తయారు చేయండి, సేవలోకి, మైదానంలోకి రావలసి ఉంటుంది. పరస్పరం మీటింగ్ చేసుకోండి, జడ్జీలు మరియు రిలీజస్ వారందరూ కలిసి మీటింగ్ చేసుకుని ప్లాన్ ఆలోచించండి. ఇరువురూ కలిసి చర్చ చేయండి. అప్పుడే ఏమైనా చేయగలరు. అయిపోతుంది, అవ్వవలసిందే. అభినందనలు. ఎవరైతే వచ్చారో, వారికి కూడా విశేషమైన అభినందనలు. అచ్ఛా.
డబల్ విదేశీయులు చాలామంది వచ్చారు:- డబల్ విదేశీయులు శాంతివన్ మరియు మధుబన్కు అలంకారము. పిల్లలు ఒక్కొక్కరూ విశేషంగా డబల్ వజ్రాలు(హీరా) అని బాప్‌దాదా చూసారు. రత్నము కూడా మరియు హీరో పాత్రను పోషించేవారు కూడా. మరి ప్రతి ఒక్క విదేశీయుడు డబల్ వజ్రము. చూడండి, ఎన్ని దేశాలలో, అక్కడే తయారై అక్కడే సేవ చేస్తున్నారు. ఎన్ని దేశాల నుండి వచ్చారు? (45 దేశాల నుండి వచ్చారు) అచ్ఛా, 45 దేశాల వారు చేతులెత్తండి. ఎవరైతే భిన్న-భిన్న దేశాల నుండి వచ్చారో, వారి నుండి ఒక్కొక్కరు చేతులెత్తండి. చిన్న పిల్లవాడు కూడా చేయి ఊపుతున్నాడు. అభినందనలు. అచ్ఛా. 45 దేశాల వారికి పదమాపదమ్ అభినందనలు. (చిన్న పిల్లల రిట్రీట్ జరుగుతుంది) ఈ పిల్లల గ్రూప్ ఎంత బాగుందో అందరూ చూడండి. ఎన్ని దేశాల నుండి పిల్లలు వచ్చారు? (15 దేశాల నుండి 28మంది పిల్లలు వచ్చారు) పాట వినిపించండి. (మై బాబాకా, బాబా మేరా అన్న పాటను పిల్లలు పాడారు) అచ్ఛా – పిల్లలందరూ అమృతవేళ చేస్తారా? ఏ పిల్లలైతే అమృతవేళ చేస్తారో వారు చేతులెత్తండి. అచ్ఛా, ఎవరైతే అప్పుడప్పుడూ అమృతవేళ లేస్తారో వారు చేతులెత్తండి. అప్పుడప్పుడూ వారు చాలామంది ఉన్నారు. అచ్ఛా – గొడవలు కొట్లాటలు చేస్తారా? గొడవ చేయము అనేవారు చేతులెత్తండి. మరి ఇప్పుడు ఇక్కడినుండి వెళ్ళిన తర్వాత గొడవ పడకండి ఎందుకంటే మీరు బ్రహ్మాకుమారులు కదా. మీరు బ్రహ్మాకుమారులు, నేను బాబా వాడిని, బాబా నా వారు అని అన్నప్పుడు గొడవ పడకూడదు, గొడవ పడితే బాబా నా వారు అవ్వరు. ఇప్పుడు గొడవ పడతారా? (లేదు) ఇప్పుడు పరివర్తన అవుతారు. ఇప్పుడు పిల్లలు గొడవ పడ్డారా లేదా అన్న రిపోర్టును టీచర్లు ఇవ్వండి. ఇకపోతే అభినందనలు. మంచిది, పురుషార్థం మంచిగా చేసారు కావున పదమారెట్ల అభినందనలు. (విదేశాల యూథ్ గ్రూప్ కూడా వచ్చింది) (మేరా బాబా అన్న సైన్ బోర్డును చూపిస్తున్నారు) చాలా బాగుంది, చప్పట్లు కొట్టండి. యూథ్ గ్రూపు పురుషార్థంలో చాలా గుహ్యతను తీసుకు వచ్చిందన్న విషయాన్ని రిజల్టులో బాప్‌దాదా విన్నారు. ఈ పురుషార్థంలో ఎవరైతే సూక్ష్మంలోకి వెళ్ళారో, ఇలాగే సదా పురుషార్థంలో మున్ముందుకు వెళ్తూ ఉండండి, వెనుక ఉండకండి, ముందుకు వెళ్తూ ఉండండి మరియు ఎగురుతూ ఉండండి. అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
(దాదీ జానకి బాప్‌దాదాను ఇలా అడిగారు – విశ్వంలోని కోట్లాదిమంది ఆత్మలకు ఈ సంవత్సరంలో సందేశం ఎలా అందాలి, నా బాబా అన్న అనుభవం ఎలా జరగాలి, దీనికోసం ఏదైనా ప్లాన్ చెప్పండి?)
ఇందుకోసం ఒక గ్రూప్‌ను తయారు చేయండి, ఒక చిన్న గ్రూప్‌ను తయారు చేయండి, వారు దీని గురించి చింతన చేయాలి ఎందుకంటే విధులనైతే వినిపించాము, ప్రతి ఒక్కరూ మనసా సంకల్పాల ద్వారా కావచ్చు, వృత్తి వైబ్రేషన్ల ద్వారా కావచ్చు, వాణి ద్వారా కావచ్చు, సంబంధ సంపర్కం ద్వారా కావచ్చు – ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకోవాలి - రోజంతటిలో ఎంతమంది ఆత్మలకు సేవ చేసాను అని చూసుకోవాలి. మనసు ద్వారా కావచ్చు, వృత్తి వైబ్రేషన్ల ద్వారా చేయచ్చు, వాణి ద్వారా, ప్రోగ్రాము ద్వారా లేక సంబంధ సంపర్కముల ద్వారా లేక ముఖము నడవడిక ద్వారా కావచ్చు, రోజంతటిలో నా సేవ యొక్క రిజల్ట్ ఎలా ఉంది అని ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోవాలి. ఎవరైతే ఆలోచిస్తూ, సేవ లేకుండా ఉండలేరో అటువంటి వారిని ఒక గ్రూపుగా చేయండి. వారిని చూసి అందరూ ఫాలో అవ్వాలి. కానీ స్వ స్థితి మరియు సేవా స్థితి రెండింటిలో బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడు సేవ చాలా వృద్ధి అవుతుంది మరియు బ్యాలెన్సులో ఉండాలన్న ఉత్సాహము ఇతరులకు కూడా వస్తుంది. కేవలం సేవ చేస్తూ ఉంటే, వీరైతే మాట్లాడే వారే కదా అని అనేస్తారు. కానీ, మేము స్వ స్థితి మరియు సేవా విధులతో సేవను చేస్తాము అన్న బాధ్యతను తీసుకునే చిన్న గ్రూప్ కూడా తయారు కావాలి. ఇలా ఒక గ్రూప్ ఉదాహరణగా నిలవాలి, అప్పుడు, ఒక్క దీపంతో దీపావళి వస్తుంది అని అంటారు కదా, అలా ఈ ఒక్క గ్రూపుతో వృద్ధి జరుగుతూ ఉంటుంది. అచ్ఛా.
అందరికీ సంవత్సరం యొక్క హోమ్‌వర్కు అయితే గుర్తుంది కదా, ఈ సంవత్సరంలో దేనికి వీడ్కోలు చెప్పాలి మరియు దేనికి అభినందనలు జరుపుకోవాలి అని బాప్‌దాదా ఏదైతే చెప్పారో అదైతే గుర్తుంది కదా? ఇప్పుడు బాప్‌దాదా కూడా చూస్తారు, ఒక్క నెల యొక్క రిజల్ట్‌ను వ్రాయండి, కేవలం శాతం వ్రాయండి, 40 శాతం చేసాను, 80 శాతం, 20 శాతం, 10 శాతం... కేవలం శాతం వ్రాయండి, పెద్ద ఉత్తరం వ్రాయకండి, తర్వాత బాప్‌దాదా ఫస్ట్ నంబర్ వారికి కానుకను ఇస్తారు. కానీ బ్యాలెన్స్ – స్వ మరియు సేవ యొక్క బ్యాలెన్స్, సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క బ్యాలెన్స్. సరేనా! అందరూ రిజల్ట్ వ్రాయండి, కేవలం శాతం వ్రాయండి, మధురమైన దాదీ, యోగయుక్తమైన దాదీ... అంటూ పెద్ద ఉత్తరం వ్రాయకండి, కేవలం శాతం వ్రాయండి ఎందుకంటే చదివే సమయం ఉండదు. తర్వాత పూర్తి బ్రాహ్మణ పరివారంలో ఎవరైతే ఒక నెల యొక్క పూర్తి రిజల్ట్‌ను పంపుతారో మరియు నంబర్‌వన్ ఎవరైతే వస్తారో వారికి బాప్‌దాదా బహుమతిని ఇస్తారు. సరేనా? ఇష్టమేనా? అర్థమయిందా? మాతలకు అర్థమయిందా? టీచర్లకు అర్థమయిందా? వెనుక ఉన్నవారికి అర్థమయిందా? వెనుక ఉన్నవారు చేతులెత్తండి. అచ్ఛా!
ఇప్పుడు నలువైపులా ఉన్న నవయుగ యజమానులైన పిల్లలందరికీ, నలువైపులా క్రొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలనే ఉల్లాస-ఉత్సాహాలు ఉన్న పిల్లలకు, సదా ఎగురుతూ ఉండే మరియు ఎగిరేలా చేస్తూ ఉండే ఎగిరే కళ కల పిల్లలకు, సదా తీవ్ర పురుషార్థము ద్వారా విజయమాలలో మణులుగా అయ్యే విజయి రత్నాలకు, నూతన సంవత్సరానికి మరియు నవ యుగానికి బాప్‌దాదా యొక్క ఆశీర్వాదాలతోపాటు పదమా రెట్ల శుభాకాంక్షలను పళ్ళాలతో నింపి-నింపి ఇస్తున్నాము, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. అచ్ఛా!
దాదీజీతో:- ఆరోగ్యం ఎలా ఉన్నాగానీ సంభాళిస్తున్నారు, చాలా బాగుంది. మంచిగా సంభాళిస్తున్నారు. దాదీలైన మీ ఐకమత్యము, ముఖము మరియు నడవడికను చూసి అందరూ పాలన పొందుతున్నారు. బాబాదైతే మొదటి రోజు నుండే వారి చేయి, తోడు (హాథ్, సాథ్) ఉండనే ఉన్నాయి. అచ్ఛా – (దాదీ జానకితో) విదేశము బాగుందా? రాజస్థాన్ నుండి టీచర్లు ఎవరైతే వచ్చారో వారు లేవండి.
ముగ్గురు సోదరీలు స్టేజీ మీదకు వచ్చారు:- త్రిమూర్తులు వచ్చారు. సహజంగా జరిగిపోయింది కదా! సహజంగా అయిందా, ధైర్యము పెరిగిందా? చాలా కష్టము అనైతే ఇప్పుడిక అనరు కదా! ఇప్పుడు ఇంతకు పది రెట్లు చేసి చూపించండి. రాజస్థాన్‌ను పరిస్తాన్గా చేయవలసిందే. కనుక ధైర్యమును ఉంచి ముందుకు వెళ్తూ ఉండండి. ఇప్పుడు ధ్వనిని వ్యాప్తి చేయండి. ఇప్పుడు ధ్వనిని వ్యాప్తి చేసారు. ఇప్పుడు ఏ వి.ఐ.పీల అడ్రెసులు ఉన్నాయో వారిని స్నేహ మిలనానికి పిలవండి, ఇప్పుడు ఇనుము వేడిగా ఉంది, ఆ వేడిలో ఏది చేయాలనుకుంటే అది చేయవచ్చు. ప్రతి స్థానములో కావచ్చు లేక జైపూర్ సమీపంగా ఉంది కనుక అక్కడకు పిలవండి. మామూలుగా కూడా రాజస్థాన్‌లో మధ్య-మధ్యలో స్నేహ మిలనములు పెడుతూ ఉండండి, బ్రహ్మా భోజనాన్ని తినిపిస్తూ ఉండండి. బ్రాహ్మణులకైతే పెడుతూ ఉండవలసిందే, కానీ వి.ఐ.పీలకు కూడా పెట్టండి. ఐ.పీలను నిల్చోబెట్టండి అప్పుడు రాజస్థాన్ ముందుకు వెళ్తుంది. ఇకపోతే మంచిగా చేసేసారు, అభినందనలు, సహజంగా అయిపోయింది. అభినందనలు. (బాబాకు అభినందనలు) దాదీలకు అభినందనలు. మంచిగా చేసారు. ఇలాగే కలిసి చేయండి, ఈ సంవత్సరంలో రెండు మూడు ప్రోగ్రాములు చేయండి, ఒకసారి వీరు చేయండి, ఒకసారి వీరు చేయండి... అచ్ఛా.
దాదీ నిర్మల్శాంతతో:- మీ ముఖము సుందరంగా కనిపిస్తుంది. అనారోగ్యంగా ఉన్నట్లుగా లేరు. (అనారోగ్యం నాకేమీ లేదు) మంచిది. చాలా మంచిది.
రుక్మిణి దీదీతో:- వీరు కూడా చాలా బాగా కష్టపడతారు. అలసిపోలేదు కదా! చాలా మంచిగా మనస్ఫూర్తిగా సేవ చేసారు, అందుకు అభినందనలు, అభినందనలు.
రాత్రి 12 గంటల తర్వాత బాప్‌దాదా పిల్లలందరికీ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు:
నలువైపుల ఉన్న సర్వ సికీలథే, గారాల పిల్లలు, హృదయ సింహాసనాధికారులు, స్వరాజ్య అధికారి పిల్లలకు నూతన సంవత్సరానికి మరియు నూతన యుగానికి అభినందనలు, అభినందనలు. సదా ఈ సంవత్సరం అందరికీ శుభాకంక్షలను ఇస్తూ ఉండండి, శుభాకాంక్షలను తీసుకుంటూ ఉండండి – ఈ లక్ష్యంతో లక్షణాలను ధారణ చేసి ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా!