Search for a command to run...
17 Feb 2004
"సర్వులకు సహయోగాన్ని ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చెయ్యండి, సదా అఖండ భండారా నడుస్తూ ఉండాలి"
17 February 2004 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా స్వయంగా తమతోపాటు పిల్లల యొక్క వజ్రతుల్య జన్మదినమైన శివజయంతిని జరపడానికి వచ్చారు. పిల్లలైన మీరందరూ మీ పారలౌకిక, అలౌకిక తండ్రి యొక్క జన్మదినాన్ని జరపడానికి వచ్చారు, బాబా మీ జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. బాబా పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు - వాహ్ నా శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలూ, వాహ్! మీరు విశ్వములోని అంధకారాన్ని తొలగించేందుకు బాబాతోపాటుగా అవతరించినవారు. పిల్లలైన మీరు పరమాత్మ తండ్రితోపాటు జరుపుకుంటున్న ఇటువంటి జన్మదినము మొత్తం కల్పములో మరెవ్వరికీ ఉండదు. ఈ అలౌకికమైన, అతి అతీతమైన, అతి ప్రియమైన జన్మదినాన్ని భక్తాత్మలు కూడా జరుపుకుంటారు కానీ పిల్లలైన మీరు మిలనాన్ని జరుపుకుంటారు మరియు భక్తాత్మలు కేవలము మహిమను గానము చేస్తూ ఉంటారు. మహిమను కూడా గానము చేస్తారు, పిలుస్తూ కూడా ఉంటారు. బాప్‌దాదా భక్తులు చేసే మహిమను మరియు వారి పిలుపును విని వారికి కూడా నంబరువారుగా వారి భావనకు తగిన ఫలాన్ని తప్పకుండా ఇస్తారు. కానీ భక్తులు మరియు పిల్లలు, ఇరువురికీ మధ్యన చాలా వ్యత్యాసము ఉంది. మీరు చేసిన శ్రేష్ఠ కర్మలను, శ్రేష్ఠ భాగ్యము యొక్క స్మృతి చిహ్మాన్ని చాలా బాగా జరుపుకుంటారు, అందుకే బాప్‌దాదా భక్తుల యొక్క భక్తి లీలను చూసి వారికి కూడా అభినందనలు తెలియజేస్తారు ఎందుకంటే స్మృతిచిహ్నాలన్నింటినీ చాలా బాగా కాపీ చేసారు. వారు కూడా ఈ రోజే వ్రతాన్ని పెట్టుకుంటారు, వారు వ్రతాన్ని కొద్ది సమయము కొరకు పెట్టుకుంటారు, అల్పకాలికముగా ఆహార-పానీయాల శుద్ధతను పాటిస్తారు. మీరు సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపడతారు, ఇందులో ఆహార-వ్యవహారాలు, మాటలు, కర్మలు, పూర్తి జన్మ కొరకు వ్రతాన్ని తీసుకుంటారు. ఎప్పటివరకైతే సంగమయుగ జీవితములో జీవించి ఉండాలో, అప్పటివరకు మనసా, వాచ, కర్మలలో పవిత్రముగా అవ్వాల్సిందే. కేవలము తయారవ్వటము మాత్రమే కాదు, కానీ తయారుచెయ్యాలి కూడా. కనుక చూడండి, భక్తుల బుద్ధి కూడా తక్కువైనదేమీ కాదు, స్మృతిచిహ్నాలను చాలా బాగా కాపీ చేసారు. మీరందరూ అన్ని వ్యర్థాలను సమర్పణ చేసి సమర్థులుగా అయ్యారు అనగా మీ అపవిత్ర జీవితాన్ని సమర్పణ చేసారు, మీ సమర్పణకు స్మృతిచిహ్నముగా వారు బలి ఇస్తారు, కానీ స్వయాన్ని బలి ఇవ్వరు, మేకను బలి ఇస్తారు. చూడండి ఎంత బాగా కాపీ చేసారు, మేకను ఎందుకు బలి ఇస్తారు? దీనిని కూడా చాలా సుందరముగా కాపీ చేసారు. మేక ఏం చేస్తుంది? మే-మే-మే అంటుంది కదా! మరియు మీరు ఏం సమర్పణ చేసారు? మై, మై, మై (నేను, నేను, నేను). దేహ భానముతో కూడిన మైపన్ (నేను అన్న భావన)ను సమర్పణ చేసారు ఎందుకంటే ఈ నేను అన్న భావనలోనే దేహ-అభిమానము వస్తుంది. ఈ దేహ-అభిమానము అన్ని వికారాలకు బీజము.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - సర్వ సమర్పణ అవ్వటములో ఈ దేహ భానానికి చెందిన మైపన్ (నేను అన్న భావన) అనేదే ఆటంకాన్ని కలిగిస్తుంది. సాధారణ మైపన్ అనగా నేను దేహాన్ని మరియు దేహ-సంబంధాల మైపన్, దేహ పదార్థాల సమర్పణ, ఇది సహజమే. దీనినైతే చేసేసారు కదా? లేక చెయ్యలేదా, దీనిని కూడా చెయ్యలేదా! ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా మైపన్ కూడా అతి సూక్ష్మము అవుతూ ఉంటుంది. స్థూల రూపములో ఉండే, పైపైకి ఉండే మైపన్ సమాప్తమవ్వటము సహజమే. కానీ సూక్ష్మమైన మైపన్ ఏమిటంటే - పరమాత్మ జన్మ సిద్ధ అధికారము ద్వారా ఏవైతే విశేషతలు ప్రాప్తిస్తాయో, బుద్ధి యొక్క వరదానము, జ్ఞాన స్వరూపులుగా అయ్యే వరదానము, సేవా వరదానము మరియు విశేషతలు, వీటిని ప్రభువు ఇచ్చిన కానుకలు అనండి, ఒకవేళ వీటిలో మైపన్ వచ్చినట్లయితే దానిని సూక్ష్మ మైపన్ అని అంటాము. నేను ఏదైతే చేస్తానో, నేను ఏదైతే చెప్తానో, అదే కరక్ట్, అలాగే జరగాలి, ఈ రాయల్ మైపన్ ఎగిరే కళలోకి వెళ్ళేందుకు భారముగా తయారవుతుంది. కనుక బాబా అంటారు, ఈ మైపన్ను కూడా సమర్పణ చెయ్యండి. ప్రభువు ఇచ్చిన కానుకలో మైపన్ ఉండదు. నేను అనేదీ ఉండదు, నాది అనేదీ ఉండదు. అవి ప్రభువు ఇచ్చిన కానుక, ప్రభువు ఇచ్చిన వరదానము, ప్రభువు ఇచ్చిన విశేషత. మరి మీ అందరి సమర్పణత ఎంతటి సూక్ష్మమైనది. చెక్ చేసుకున్నారా? సాధారణ మైపన్ మరియు రాయల్ మైపన్, ఈ రెండింటినీ సమర్పణ చేసారా? చేసారా లేక చేస్తున్నారా? చెయ్యాల్సే ఉంటుంది. మీరు పరస్పరం నవ్వుతూ అంటుంటారు కదా, మరణించాల్సే ఉంటుంది అని. కానీ ఇలా మరణించటము అంటే భగవంతుని ఒడిలో జీవించటము. ఈ మరణించటము అనేది మరణించటము కాదు. 21 జన్మలు దేవాత్మల ఒడిలో జన్మించాలి, అందుకే చాలా సంతోషముతో సమర్పణ అవుతారు కదా! బాధతో ఆర్తనాదాలు చేస్తూ అయితే అవ్వరు కదా? లేదు. భక్తిలో కూడా బలి ఇచ్చేటప్పుడు ఆ జంతువు అరిచినట్లయితే ఆ బలి స్వీకరింపబడదు. కనుక ఎవరైతే హద్దుకు చెందిన నేను మరియు నాదిలో సంతోషముగా సమర్పితమవుతారో, వారు జన్మ-జన్మలకు వారసత్వానికి అధికారులుగా అవుతారు.
కనుక చెక్ చేసుకోండి - ఎటువంటి వ్యర్థ సంకల్పాలనైనా, వ్యర్థ మాటలనైనా, వ్యర్థ నడవడికనైనా పరివర్తన చేసుకోవటములో సంతోషముగా పరివర్తన చేసుకుంటారా లేక తప్పదు కదా అనా? ప్రేమతో పరివర్తన అవుతారా లేక కష్టముగా పరివర్తన అవుతారా? పిల్లలైన మీరందరూ జన్మ తీసుకోగానే మీ జీవితం యొక్క వృత్తిగా ఇదే చేసుకున్నారు - విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తకులు. ఇది మీ అందరి, బ్రాహ్మణ జన్మ యొక్క ఆక్యుపేషన్ (వృత్తి) కదా! ఇది పక్కా అయితే చేతులూపండి. జెండాను ఊపుతున్నారు, చాలా మంచిది. (అందరి చేతులలో శివబాబా జెండాలు ఉన్నాయి, వాటిని అందరూ ఊపుతున్నారు) ఈరోజు జెండాల రోజు కదా, చాలా మంచిది. కానీ జెండాను ఊరికే అలా ఊపవద్దు. ఊరికే అలా జెండాను ఊపటమైతే చాలా సహజము, మనసును ఊపాలి. మనసును పరివర్తన చేసుకోవాలి. ధైర్యము కలవారు కదా. ధైర్యము ఉందా? చాలా ధైర్యము ఉంది, మంచిది.
బాప్‌దాదా ఒక శుభవార్తకు సంబంధించిన విషయము చూసారు, అది ఏమిటి, తెలుసా? బాప్‌దాదా ఈ సంవత్సరము కొరకు విశేషమైన కానుకను ఇచ్చారు, అదేమిటంటే - ‘‘ఈ సంవత్సరము ఒకవేళ కొద్దిగానైనా ధైర్యము పెట్టినట్లయితే, ఏ కార్యములోనైనా, స్వ పరివర్తనలోనైనా, కార్యములోనైనా, విశ్వ సేవలోనైనా, ఒకవేళ ధైర్యముతో చేసినట్లయితే – ఎక్స్ట్రా సహాయము లభించే వరదానము ఈ సంవత్సరానికి లభించింది’’. మరి బాప్‌దాదా ఏ సంతోషకరమైన కబురును విన్నారు లేక ఏ దృశ్యాన్ని చూసారు! ఈ సారి శివజయంతి సేవలో నలువైపులా చాలా చాలా చాలా మంచి ధైర్యముతో మరియు ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు (అందరూ చప్పట్లు కొట్టారు) ఆ, చప్పట్లు కొట్టండి. సదా ఇలా చప్పట్లు కొడతారా లేక శివరాత్రి రోజేనా? సదా చప్పట్లు కొడుతూ ఉండండి. అచ్ఛా. నలువైపుల నుండైతే మధుబన్కు సమాచారము వ్రాస్తారు, బాప్‌దాదా అయితే వతనములోనే చూసేస్తారు. ఉల్లాసము బాగుంది మరియు ప్లాన్‌ను కూడా మంచిగా తయారుచేసారు. సేవలో ఇటువంటి ఉల్లాస-ఉత్సాహాలు విశ్వాత్మలలో ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతాయి. చూడండి, నిమిత్త దాదీ వేసిన అంటు అద్భుతము చేసింది కదా! మంచి రిజల్టు వచ్చింది. అందుకే బాప్‌దాదా ఇప్పుడు ఒక్కొక్క సెంటరు పేరు తీసుకోరు కానీ విశేషముగా అన్నివైపుల చేసిన సేవా రిజల్టుకు, బాప్‌దాదా ప్రతి ఒక్క సేవాధారి బిడ్డ యొక్క విశేషత మరియు పేరు తీసుకుని పదమాల రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. చూస్తున్నారు కూడా, పిల్లలు తమ-తమ స్థానాలలో ఉండి చూస్తూ సంతోషిస్తున్నారు. విదేశాలలో కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే మీరందరూ అయితే ఆ విశ్వాత్మల కొరకు ఇష్ట దేవీ-దేవతలు కదా. బాప్‌దాదా పిల్లల సభను చూసినప్పుడు మూడు రూపాలలో చూస్తారు:-
1 - వర్తమాన స్వరాజ్య అధికారులు, ఇప్పుడు కూడా రాజులే. లౌకికములో కూడా తండ్రి పిల్లలను - నా రాజా పిల్లలు, రాజా బిడ్డ అని అంటారు. పేదవారైనా కూడా రాజా బిడ్డ అనే అంటారు. కానీ బాబా వర్తమాన సంగమములో కూడా ప్రతి బిడ్డను స్వరాజ్య అధికారీ రాజా బిడ్డగా చూస్తారు. మీరు రాజులు కదా! స్వరాజ్య అధికారులు. కనుక వర్తమానములో స్వరాజ్య అధికారులు. 2 - భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారులు మరియు 3 - ద్వాపరము నుండి కలియుగ అంతిమము వరకు పూజ్యులు, పూజకు అధికారులు - పిల్లలు ప్రతి ఒక్కరినీ ఈ మూడు రూపాలలో బాప్‌దాదా చూస్తారు. సాధారణమైనవారిగా చూడరు. మీరు ఎటువంటివారైనా కానీ బాప్‌దాదా ప్రతి బిడ్డను స్వరాజ్య అధికారీ రాజా బిడ్డగా చూస్తారు. రాజయోగులు కదా! వీరిలో ఎవరైనా ప్రజాయోగులుగా ఉన్నారా? ప్రజాయోగులా? కాదు. అందరూ రాజయోగులే! మరి రాజయోగి అనగా రాజా. ఇటువంటి స్వరాజ్య అధికారీ పిల్లల జన్మదినాన్ని జరపడానికి స్వయంగా బాబా వచ్చారు. చూడండి, డబల్ విదేశీయులైన మీరైతే జన్మదినాన్ని జరుపుకునేందుకు విదేశాల నుండి వచ్చారు. డబల్ విదేశీయులు చేతులెత్తండి. మరి అన్నింటికంటే దూరముగా ఉన్న దేశమేది? అమెరికానా లేక దానికంటే దూరమైనది ఉందా? మరి బాప్‌దాదా ఎక్కడి నుండి వచ్చారు? బాప్‌దాదా అయితే పరంధామము నుండి వచ్చారు. అంటే పిల్లలపై ప్రేమ ఉంది కదా! మరి భగవంతుడికి కూడా రావలసి వచ్చే ఈ జన్మదినము ఎంతటి శ్రేష్ఠమైనది! (పుట్టినరోజుకు సంబంధించి అన్ని భాషలలో తయారుచేసిన ఒక బ్యానర్‌ను చూపిస్తున్నారు) బాగా తయారు చేసారు, అన్ని భాషలలో వ్రాసారు. బాప్‌దాదా అన్ని దేశాలలోని అన్ని భాషల పిల్లలకు పుట్టినరోజు శుభాకాంక్షలను ఇస్తున్నారు.
చూడండి, బాబా యొక్క శివ జయంతిని జరుపుతున్నారు కానీ బాబా ఎలా ఉన్నారు? బిందువు. బిందువు యొక్క జయంతిని, అవతరణను జరుపుతున్నారు. అందరికంటే వజ్రతుల్యమైన జయంతి ఎవరిది? బిందువుది, చుక్కది. మరి బిందువుకు ఎంతటి మహిమ ఉంది! అందుకే బాప్‌దాదా ఎప్పుడూ చెప్తూ ఉంటారు - మూడు బిందువులను సదా గుర్తు పెట్టుకోండి. ఎనిమిదో నంబరును, ఏడో నంబరును అయితే కొంత గడబిడతో రాయాల్సి వస్తుంది, కానీ బిందువు ఎంత సహజము. మూడు బిందువులను సదా గుర్తు పెట్టుకోండి. మూడింటి గురించి బాగా తెలుసు కదా. మీరు కూడా బిందువు, బాబా కూడా బిందువు. బిందువు పిల్లలు బిందువులు. మరియు కర్మలోకి వచ్చినప్పుడు ఈ సృష్టి రంగస్థలముపైకి కర్మలు చేయడానికి వచ్చారు. ఈ సృష్టి రంగస్థలము డ్రామా. కనుక డ్రామాలో ఏదైతే కర్మ చేసారో, జరిగిపోయిందో, దానికి ఫుల్స్టాప్ పెట్టండి. ఫుల్స్టాప్ అంటే కూడా ఏమిటి? బిందువు. అందుకే మూడు బిందువులను సదా గుర్తు పెట్టుకోండి. మొత్తం అద్భుతము చూడండి, ఈరోజుల్లోని ప్రపంచములో అన్నింటికంటే ఎక్కువ మహత్వము దేనికి ఉంది? ధనానికి. ధనానికి మహత్వము ఉంది కదా! తల్లిదండ్రులు కూడా అసలేమీ కాదు, డబ్బే సర్వస్వము. అందులో కూడా చూడండి, ఒకవేళ 1 తర్వాత ఒక బిందువు (సున్నా)ను పెడితే ఎంతవుతుంది! పది అవుతుంది కదా. రెండో బిందువును పెట్టండి, 100 అవుతుంది. మూడో బిందువును పెట్టండి, 1000 అవుతుంది. మరి ఇది బిందువు యొక్క అద్భుతము కదా. ధనములో కూడా బిందువు యొక్క అద్భుతము ఉంది మరియు శ్రేష్ఠాత్మగా అవ్వటములో కూడా బిందువు యొక్క అద్భుతము ఉంది మరియు చేసి-చేయించేవారు కూడా బిందువే. మరి అన్నివైపుల నుండి దేనికి మహత్వము ఉంది! బిందువుకే కదా. కేవలం బిందువును గుర్తు పెట్టుకోండి, చాలు, వేరే విస్తారములోకి వెళ్ళకండి, బిందువునైతే గుర్తు చేసుకోగలరు. బిందువుగా అవ్వండి, బిందువును గుర్తు చేసుకోండి మరియు బిందువు పెట్టండి, అంతే. ఇదే పురుషార్థము. కష్టమా? లేక సహజమా? ఎవరైతే సహజమని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సహజమైతే మరి బిందువు పెట్టవలసి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిందువు పెడతారా లేక ప్రశ్నార్థకాన్ని పెడతారా? ప్రశ్నార్థకాన్ని పెట్టకండి, బిందువు పెట్టండి. ప్రశ్నార్థకము ఎంత వంకరగా ఉంటుంది. చూడండి, ప్రశ్నార్థకము వ్రాయండి, ఎంత వంకరగా ఉంటుంది, కానీ బిందువు ఎంత సహజమైనది. మరి బిందువుగా అవ్వటము వస్తుందా? వస్తుందా? అందరూ తెలివైనవారు.
బాప్‌దాదా విశేషముగా సేవలలోని ఉల్లాస-ఉత్సాహాలకు శుభాకాంక్షలనైతే ఇచ్చారు, చాలా బాగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు కానీ ఇక ముందు కొరకు ప్రతి సమయము, ప్రతి రోజూ - నేను వరల్డ్ సర్వెంట్‌ను (విశ్వ సేవాధారిని) అన్నది గుర్తుంచుకోండి. మీకు గుర్తుందా - బ్రహ్మాబాబా ఏమని సంతకము చేసేవారు? వరల్డ్ సర్వెంట్ (విశ్వ సేవాధారి). మరి విశ్వ సేవాధారులైతే, కేవలం శివరాత్రి సేవతో విశ్వ సేవ సమాప్తమైపోదు. లక్ష్యము పెట్టుకోండి - నేను వరల్డ్ సర్వెంట్‌ను (విశ్వ సేవాధారిని), మరి విశ్వ సేవను ప్రతి శ్వాసలో, ప్రతి సెకండు చెయ్యాలి. ఎవరు వచ్చినా, ఎవరితో సంపర్కములో ఉన్నా, వారికి దాతగా అయ్యి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. ఖాళీ చేతులతో ఎవ్వరూ వెళ్ళకూడదు. అఖండ భండారా ప్రతి సమయము తెరిచే ఉండాలి. తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరి పట్ల శుభ భావము మరియు శుభ భావన, ఇది తప్పకుండా ఇవ్వండి. శుభ భావముతో చూడండి, వినండి, సంబంధములోకి రండి మరియు శుభ భావనతో ఆ ఆత్మకు సహయోగాన్ని ఇవ్వండి. ఇప్పుడు సర్వాత్మలకు మీ సహయోగము చాలా చాలా అవసరము. కనుక సహయోగాన్ని ఇవ్వండి మరియు సహయోగిగా తయారు చెయ్యండి. ఏదో ఒక సహయోగము, అది మనసుకు సంబంధించి అయినా, మాటల ద్వారానైనా ఏదైనా సహయోగాన్ని ఇవ్వండి, సంబంధ-సంపర్కాల ద్వారానైనా సహయోగాన్ని ఇవ్వండి, మరి ఈ శివరాత్రి జన్మోత్సవము యొక్క విశేష స్లోగన్‌ను గుర్తు పెట్టుకోండి - ‘‘సహయోగాన్ని ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చెయ్యండి.’’ కనీసం ఎవరు సంపర్క-సంబంధములోకి వచ్చినా, వారికి సహయోగాన్ని ఇవ్వండి, సహయోగిగా తయారు చెయ్యండి. ఎవరో ఒకరు సంబంధములోకి వస్తూనే ఉంటారు, వారికి వేరే ఏ పాలనను ఇవ్వకపోయినా సరే, ప్రతి ఒక్కరికీ దిల్ఖుష్ మిఠాయిని తప్పకుండా తినిపించండి. ఇక్కడ భండారాలో తయారుచేసే ఆ మిఠాయిలు కాదు. మనసును సంతోషపరచండి. మనసును సంతోషపరచటము అనగా దిల్ఖుష్ మిఠాయిని తినిపించటము. తినిపిస్తారా! ఇందులో అయితే ఎటువంటి కష్టమూ ఉండదు. ఎక్స్ట్రా సమయము ఇవ్వాల్సిన అవసరము లేదు, కష్టమూ లేదు. శుభ భావనతో దిల్ఖుష్ మిఠాయిని తినిపించండి. అప్పుడు మీకు కూడా సంతోషము, వారికి కూడా సంతోషము, ఇంకేమి కావాలి. కనుక సంతోషముగా ఉంటారు మరియు సంతోషాన్ని ఇస్తారు, ఎప్పుడూ కూడా మీ అందరి ముఖాలు ఎక్కువ గంభీరముగా ఉండకూడదు. చాలా ఎక్కువ గంభీరముగా ఉండటము కూడా బాగా అనిపించదు. చిరునవ్వు అయితే ఉండాలి కదా. గంభీరముగా ఉండటము మంచిదే, కానీ టూ మచ్ గంభీరముగా ఉంటే అది, వీరు ఎక్కడ మాయమైపోయారో ఏంటో తెలియదు అన్నట్లు అనిపిస్తుంది. చూస్తూ ఉన్నారు కూడా కానీ మాయమై ఉన్నట్లు ఉంటారు. మాట్లాడుతూ కూడా ఉన్నారు కానీ ఇక్కడ నుండి మాయమైపోయినట్లుగా మాట్లాడుతుంటారు. అందుకే ఆ ముఖము బాగుండదు. ముఖము ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. ముఖము సీరియస్‌గా పెట్టుకోకండి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అనుకుంటే సీరియస్ అయిపోతారు. చాలా కష్టము, చాలా పని ఉంది... అని సీరియస్ అయిపోతారు, కానీ ఎంత ఎక్కువ పని ఉంటే అంత ఎక్కువ చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వు వస్తుంది కదా? వస్తుందా? మీ జడ చిత్రాలను చూడండి, ఎప్పుడైనా వాటిని అలా సీరియస్‌గా చూపిస్తారా! ఒకవేళ సీరియస్‌గా చూపిస్తే ఆర్టిస్ట్ బాగోలేరు అని అంటారు. అలాగే ఒకవేళ మీరు కూడా సీరియస్‌గా ఉంటే, వీరికి జీవించే కళ రాదు అని అంటారు. అందుకే ఏం చేస్తారు? టీచర్లు ఏం చేస్తారు? అచ్ఛా, చాలామంది టీచర్లు ఉన్నారు, టీచర్లు, అభినందనలు. సేవకు అభినందనలు. అచ్ఛా.
అచ్ఛా – బాప్‌దాదా పూజ్యాత్మలైన మీ గురుంచి మరో శుభవార్త కూడా విన్నారు. పూజ్య ఆత్మలైన మీకు ఈరోజు 63 ప్రకారాల భోగ్ పెడ్తారు. ఎందుకు? మీ జడ చిత్రాలకు భోగ్ పెడ్తారు, కానీ మీరైతే వాటిని తినరు. అందుకే ఇప్పుడు చైతన్యంలో భోగ్ పెట్టించుకోండి. మంచిగా చేసారు, పిల్లలు ప్రతి ఒక్కరూ 36 రకాల భోగ్‌ను స్వీకరిస్తున్నందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. సంచి చూపిస్తున్నారు. ఎవరైతే బయట కూర్చున్నారో, విదేశాలలో కావచ్చు లేక తమ-తమ సెంటర్లలో కావచ్చు, వారు ఇక్కడ ఎప్పుడైతే టి.విలో సంచిని చూసినప్పుడు, సంచిని (టోలీ ప్యాకెట్) పంచినప్పుడు, మీరు సంచి నుండి వాసన తీసుకోండి. బాప్‌దాదా అందరికీ, సెంటరువారికి, దేశం మరియు విదేశం వారికి అందరికీ ఇక్కడున్న పిల్లలకన్నా ముందే తినిపిస్తున్నారు. తినండి, తినండి. ఇంకా ఇలా చేయండి, ఏ సెంటర్ టీచర్ అయితే వచ్చారో, ఎక్కడి వరకు పంపగలిగితే అక్కడివరకు పంపండి, ఒక్కొక్క సంచిని పంపండి. ఎక్కువ పంపకండి. ఒక్కొక్క సంచిని శాంపిల్ వలె పంపండి. కావున ఎప్పుడు మీరు భోగ్‌ను స్వీకరించినా, ఏ స్వరూపంతో స్వీకరించండి? మీ పూజ్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి మరియు పూజ్యునిగా అయ్యి భోగ్‌ను స్వీకరించండి. మంచి పని చేసారు. దాదీకి ఎక్కువ అభినందనలు. అచ్ఛా.
ఒక్క క్షణములో మీ పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోగలరా? అదే దేవీ-దేవతల స్వరూప స్మృతిలో మిమ్మల్ని మీరు చూసుకోగలరా? ఏ దేవి అయినా, దేవత అయినా సరే అలా చూసుకోగలరా? నేను పూర్వజుడిని, సంగమయుగములో పూర్వజుడిని మరియు ద్వాపరము నుండి పూజ్యుడిని. సత్య, త్రేతా యుగాలలో రాజ్య అధికారులు. కనుక ఒక్క క్షణములో అందరూ ఇతర సంకల్పాలన్నింటినీ సమాప్తము చేసి తమ పూర్వజ మరియు పూజ్య స్వరూపములో స్థితులైపోండి. అచ్ఛా!
భోపాల్ జోన్ యొక్క సేవ టర్న్:- అచ్ఛా, భోపాల్ వారు లేవండి. జెండాలు ఊపండి. సేవ యొక్క ఎక్స్ట్రా ఫలము మరియు బలము రెండిటినీ అనుభవం చేసారా? చేసారా? ఎందుకంటే యజ్ఞ సేవ యొక్క గోల్డెన్ ఛాన్స్ లభించడం తక్కువ భాగ్యమేమీ కాదు. చాలా పెద్ద భాగ్యము. ఎక్స్ట్రా బలము, శక్తిశాలి వాయుమండలం యొక్క బలం లభిస్తుంది. యజ్ఞ సేవ చేయడం వలన ఏ బ్రాహ్మణ ఆత్మలకైతే సేవ చేస్తారో వారి దీవెనల ఫలం లభిస్తుంది. మరి ఈ ఛాన్స్ లభించడం అంటే సేవ యొక్క ఎక్స్ట్రా బలము మరియు ఫలము తిన్నట్లు అర్థము. మరి అందరూ ఇలా అనుభవం చేసుకున్నారా? చేసుకున్నారా? ఎన్ని దీవెనలు జమ చేసుకున్నారు? ఎన్ని జన్మలకు ఈ ఆశీర్వాదాలు ఉంటాయి? అసలైతే సదా ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉన్నారు, ఆశీర్వాదాల నిండైన పళ్ళాలు మీకు లభిస్తున్నాయి. సంగఠన ఉంటుంది కదా. ఈ ఆశీర్వాదాలను మీరు మీ వద్ద నిలుపుకుంటే మీ పురుషార్థంలో ఇవి లిఫ్ట్ యొక్క గిఫ్ట్‌గా పని చేస్తాయి. మంచిగా చేసారు. అందరి ఆశీర్వాదాలు సంతోషాన్ని పెంచుతాయి. మరి సదా ఈ ఆశీర్వాదాల తోడును పెట్టుకోండి. అభినందనలు. సేవ కోసం అభినందనలు.
ఎడ్యుకేషన్ వింగ్ మీటింగ్ జరుగుతుంది:- ఎడ్యుకేషన్ వారు లేవండి. అచ్ఛా – ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి ఆత్మకు నేను ఎవరిని అన్న జ్ఞానాన్ని ఇచ్చే కార్యాన్ని కూడా చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇంకా సేవ మిగిలి ఉంది. కనీసం నేను ఎవరిని, నా తండ్రి ఎవరు అన్న జ్ఞానమైతే అందరికీ లభించాలి. నేను ఎవరిని అన్న విషయమే ఎవ్వరికీ తెలియదు, ఇదే ఆశ్చర్యకరమైన విషయము. పూర్తి సమయం నేను-నేను అంటుంటారు కానీ నేను ఎవరు అన్నదే తెలియదు. అందుకే ఎడ్యుకేషన్ వర్గం, ఇప్పుడు అన్ని స్థానాలకు వెళ్ళి ఈ మొదటి పాఠాన్ని పక్కా చేయించండి. పాపం వారు అవివేకులుగా ఉండిపోకూడదు, ఇంతైతే వివేకం వారికి లభించాలి. మరి మీరు దయాహృదయ ఆత్మలు కదా. ఎలా అయితే బాబా కృపాళువు, దయాళువు ఉన్నారో అలాగే మీరు కూడా మాస్టర్ కృపాళువు, దయాళువులు. ఈ వివేకము యొక్క దయను చూపండి. ప్లాన్ తయారు చేసారు కదా? క్రొత్త-క్రొత్త ప్లాన్లు తయారు చేయండి. సమయం అనుసారంగా సేవ యొక్క గతి మరింత ఫాస్ట్‌గా అవుతుంది ఎందుకంటే సమయం చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది. ఎలా అయితే సమయం ఫాస్ట్‌గా పరిగెడుతుందో అంతే వేగంగా సేవ కూడా జరగాల్సిందే. మంచిది, వర్గం-వర్గం వేరువేరుగా ఉండటం వలన విశ్వంలోని ఆల్‌రౌండ్ ఆత్మల సేవ వైపు అటెన్షన్ వెళ్తుంది. బాప్‌దాదాకు వర్గీకరణ సేవ నచ్చుతుంది. చాలా బాగుంది, వచ్చారు, మిలన్ కూడా చేసుకున్నారు, మీటింగ్ కూడా చేసుకున్నారు, ప్రాక్టికల్‌గా చేస్తారు కూడా. అచ్ఛా.
నలువైపుల నుండి కార్డులు మరియు ఉత్తరాలు బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. మీ అందరి కార్డులను బ్రాహ్మణ ఆత్మలందరూ కూడా చూసి సంతోషిస్తున్నారు. ఎవరైతే కార్డులు లేక ఉత్తరాలు పంపించారో, ఆ సికీలధే, గారాల పిల్లలకు తండ్రి జన్మ దినము మరియు పిల్లల జన్మ దినానికి విశేషంగా సమ్ముఖంగా ఉన్నవారికంటే ముందుగానే మీ అందరికీ అభినందనలు. చాలా మనస్ఫూర్తిగా పంపిస్తారు కనుక మనసు మాట మనోభిరాముడికి తెలుసు. అచ్ఛా. ఇండియా నుండి కొన్ని సెంటర్ల ఉల్లాస-ఉత్సాహాలు మరియు బాప్‌దాదాకు విశేషంగా స్మృతి పత్రాలు, సందేశాలు, ఫోన్లు వచ్చాయి. బాప్‌దాదా ఎన్ని పేర్లు తీసుకోవాలి, కానీ ఎవరైతే తమ ఉల్లాస-ఉత్సాహాల సమాచారాన్ని ఇచ్చారో, వారందరికీ కూడా బాప్‌దాదా సమ్ముఖ దృష్టిలో ఇమర్జ్ చేసుకుని ఉల్లాస-ఉత్సాహాలకు రిటర్న్‌గా చాలా-చాలా హృదయపూర్వక ప్రియస్మృతులను ఇస్తున్నారు. సేవలో ఎప్పుడూ ఇలా ఉల్లాస-ఉత్సాహాలతో ఎగురుతూ ఉండండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న అలౌకిక దివ్య అవతరణ కల పిల్లలకు, బాబా యొక్క జన్మదినము మరియు పిల్లల జన్మదినము యొక్క ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు, మనోభిరాముడైన బాబా మనసులో కుడి భుజాలైన సేవాధారి పిల్లలు సదా ఇమిడి ఉన్నారు. ఇటువంటి హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠాత్మలకు, సదా బిందువు యొక్క మహత్వాన్ని తెలుసుకునే శ్రేష్ఠ బిందు స్వరూప పిల్లలకు, సదా తమ స్వమానములో స్థితులై ఉంటూ సర్వులకు ఆత్మిక గౌరవాన్ని ఇచ్చే స్వమానధారి ఆత్మలకు, సదా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతగా అయ్యి ప్రతి ఒక్కరికీ తమ అఖండ భండారా నుండి ఏదో ఒకటి ఇచ్చే మాస్టర్ దాతలైన పిల్లలకు బాప్‌దాదా యొక్క చాలా-చాలా, పదమాల రెట్ల, కోహినూర్ వజ్రము కంటే కూడా విలువైన ప్రభు రత్నాలైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలు అందరితో, దాదీ జానకితో:- చక్రవర్తి సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. చక్రవర్తిగా అయ్యి తిరగడము మంచిగా అనిపిస్తుంది. (బాబాను అందరూ చూడాలి కదా) చూడవలసిందే. పిల్లలు కేవలం కొంచెం ఎవరెడీగా అవ్వాలి కదా. ఎవిరీ టైమ్ ఎవరెడీ, అప్పుడు అద్భుతం జరుగుతుంది. చూస్తారు, మాట్లాడుతారు కూడా. ఓహో ప్రభూ అని కూడా అంటారు. కానీ అది సంతోషంగా అనరు, పశ్చాత్తాపంతో అంటారు. కానీ తప్పకుండా అంటారు. అందరూ బాగున్నారా, మజాలో ఉన్నారా! చూడండి, మీ సంగఠనను చూసి అందరూ ఎంతో సంతోషిస్తారు. మీరు ఏమీ చెప్పినా, చెప్పకపోయినా కానీ సంతోషాన్ని ఇస్తారు. పిల్లర్లు మీరు. మీరందరూ చూడండి ఎంత పక్కా పిల్లర్లు ఉన్నారో! పిల్లర్ల (స్తంభాలు) గట్టిదనం కారణంగా ఎందరో గట్టిగా అయ్యి నడుచుకుంటున్నారు. కొంచెం కదిలినా కానీ పిల్లర్లు వారికి ఆధారంగా నిలుస్తారు. అచ్ఛా.
హైదరాబాద్ సోదరుడు కె.ఎస్ రాజు గారితో:- ఇప్పుడు త్వరత్వరగా వస్తూ ఉండండి అప్పుడు అన్ని పనులు సరిగ్గా అయిపోతాయి. ఇప్పుడు మీరు పని వెనుక పడకండి, పని మీ వెనుక వస్తుంది. ఇప్పుడు త్వరత్వరగా రావాలి. ఇంత సమయం పట్టకూడదు. పనులన్నీ సహజమైపోతాయి. (మీ ఆజ్ఞ) వస్తూ ఉంటే, శక్తి తీసుకుంటూ ఉంటే కర్మలో యోగం ఉపయోగపడుతుంది. సరేనా! కర్మయోగి. ఎక్కువ వెంటపడితే సరిగ్గా అవ్వదు. ఎలా అయితే నీడ ఉంటుంది కదా, దాని వెనుక వెళితే అది ముందు ముందుకు వెళ్తుంది, అదే మీరు దాని ముందు నడిస్తే అది మీ వెనుక వస్తుంది, ఇది కూడా ఇలాంటిదే.
కర్ణాటక హైకోర్ట్ జడ్జ్‌తో:- ఇక్కడ ఏదైతే విశ్వ పరివర్తనా కార్యం జరుగుతుందో, అందులో మీరు కూడా సహయోగి ఆత్మ ఉన్నారు. మీ కార్యం కూడా మంచిగా ఉంది. ఆత్మలకు అవగాహన లభిస్తుంది. అందరూ పరివర్తన కోరుకుంటారు. ఇక్కడ పరివర్తన యొక్క రాగం వినిపిస్తుంది. అందులో మీరు కూడా చాలా మంచి సహయోగి ఉన్నారు, సహయోగి నుండి యోగిగా అవుతారు. కేవలం సహయోగిగా ఉండిపోకండి, యోగి సహయోగిగా ఉండండి. కర్మయోగిగా అవ్వండి. కర్మను విడిచిపెట్టకండి, కర్మ మరియు యోగం బ్యాలెన్స్. ఎంతగా బ్యాలెన్స్ పెట్టుకుంటారో అంతగా బ్లెసింగ్స్ లభిస్తాయి. శ్రమ తక్కువ ప్రాప్తి ఎక్కువ లభిస్తుంది. (యుగళ్తో) వీరు కూడా మీకు తోడుగా ఉన్నారు.
విదేశాల పెద్దక్కయ్యలతో:- ఇప్పుడైతే విదేశాలకు విశేష టర్న్ లభించింది. గారాల పిల్లలు కదా. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మూల-మూలన ఉండిపోయిన పిల్లలు వంచితమవ్వకూడదు, ఈ సేవను ఉల్లాస-ఉత్సాహాలతో మీరు చేస్తున్నారు, దాని రిజల్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఏ ఫిర్యాదు ఉండదు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. (ఇప్పుడు కొన్ని దేశాలు ఉండిపోయాయి, అక్కడ కూడా అక్టోబర్ కల్లా సందేశాన్ని ఇచ్చే ప్లాన్ ఉంది) అవ్వాల్సిందే, మీ సోదరసోదరీలే, మరి మర్సీఫుల్(దయ)గా అవ్వవలసిందే. సందేశమైతే లభించాలి, ఆ తర్వాత వారి భాగ్యము.
ప్రియమైన బాప్‌దాదా తమ హస్తాలతో స్టేజీపై జెండాను ఎగురవేసారు మరియు పిల్లలందరికీ 68వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు:-
మీ అందరి మనసులలో అయితే బాబా స్మృతి అని జెండా ఎగురుతూనే ఉంటుంది. ఈ జెండాను అయితే స్మృతిచిహ్నం రూపంలో జరుపుకుంటున్నారు. మీ మనసులో బాబా యొక్క ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. ప్రతి ఒక్కరి మనసు సదా ఏమంటుంది? ప్రతి శ్వాస ఏ పాటను పాడుతుంది? నా బాబా. బాప్‌దాదా కూడా ప్రతి సెకండు ఏ పాటను పాడుతారు? నా మధురాతి మధురమైన పిల్లలు. ప్రతి ఆత్మ మనసులో ఇప్పుడు బాబా యొక్క ప్రత్యక్షత జెండా ఎగిరే రోజును సమీపంగా తీసుకురావాలి. ప్రతి మనసు నా బాబా అని అనాలి. పొందాల్సినది పొందేసాము అన్న పాటకు నాట్యం చేయాలి. ఆ రోజు దూరంలో లేదు. వాహ్! బాబా వాహ్! బాబాకు గారాల పిల్లలు వాహ్! ఈ మాటను అందరూ బాగా అంటారు. మరి ఈరోజు బాప్‌దాదా కేవలం ఈ జెండాను చూడటం లేదు, పిల్లలు ప్రతి ఒక్కరి మనసులలో బాబా యొక్క ప్రత్యక్షత జెండా ఎగురుతూ ఉండటాన్ని చూస్తున్నారు. మీ మనసులలో ఎగిరింది. ఇప్పుడు ఎగురవేయడం కాదు, ముందే ఎగిరి ఉంది. ఒక్క బాబాయే ప్రపంచం, బాబాను ప్రపంచంగా చేసుకున్నారు. ఇలాగే కదా! ఇంకేదైనా ప్రపంచం ఉందా! బాబాయే ప్రపంచం! బాబా సంస్కారాలే నా సంస్కారాలు. ప్రపంచం కూడా, సంస్కారం కూడా. కదా? దేశ-విదేశాలలోని పిల్లలందరికీ బాబా పుట్టినరోజుకు జెండా ఎగురవేసినందుకు చాలా-చాలా అభినందనలు, అభినందనలు.