Search for a command to run...
5 Mar 2004
"బలహీన సంస్కారాల అంతిమ సంస్కారము చేసి సత్యమైన హోలీని జరుపుకోండి, అప్పుడు ప్రపంచము పరివర్తన అవుతుంది"
5 March 2004 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపులా ఉన్న అత్యంత ప్రియమైన రాకుమారుల వంటి పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్ముని అనురాగము కోట్లలో కొందరైన శ్రేష్ఠ ఆత్మలైన మీకే ప్రాప్తించింది. ప్రతి బిడ్డ యొక్క మూడు రాజ్య సింహాసనాలను చూస్తున్నారు. ఈ మూడు సింహాసనాలు మొత్తము కల్పములో ఈ సంగమయుగములోనే పిల్లలైన మీకు ప్రాప్తిస్తాయి. ఆ మూడు సింహాసనాలు కనిపిస్తున్నాయా? ఒకటి - ఈ భృకుటి సింహాసనము, దానిపై ఆత్మ మెరుస్తూ ఉంది. రెండవ సింహాసనము - పరమాత్ముని హృదయ సింహాసనము. హృదయ సింహాసనాధికారులు కదా! మరియు మూడవది - భవిష్య విశ్వ సింహాసనము. హృదయ సింహాసనాధికారులుగా అయినందువలన అందరికంటే భాగ్యవంతులుగా అయ్యారు. ఈ పరమాత్మ హృదయ సింహాసనము భాగ్యశాలి పిల్లలైన మీకే ప్రాప్తించింది. భవిష్య విశ్వ రాజ్య సింహాసనమైతే ఎలాగూ ప్రాప్తించేదే ఉంది. కానీ అధికారిగా ఎవరు అవుతారు? ఎవరైతే ఈ సమయములో స్వరాజ్య అధికారిగా అవుతారో వారు. స్వరాజ్యము లేకపోతే విశ్వ రాజ్యము కూడా ఉండదు ఎందుకంటే ఈ సమయములోని స్వరాజ్య అధికారము ద్వారానే విశ్వ రాజ్యము ప్రాప్తిస్తుంది. విశ్వ రాజ్యానికి చెందిన అన్ని సంస్కారాలు ఈ సమయములోనే తయారవుతాయి. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని సదా స్వరాజ్య అధికారిగా అనుభవము చేస్తున్నారా? భవిష్య రాజ్యము యొక్క గాయనమేదైతే ఉందో, అది తెలుసు కదా! ఒకే ధర్మము, ఒకే రాజ్యము, లా అండ్ ఆర్డర్, సుఖ-శాంతులు, సంపదలతో నిండుగా ఉన్న రాజ్యము, ఎన్ని సార్లు ఈ స్వరాజ్యాన్ని మరియు విశ్వ రాజ్యాన్ని పాలించారో గుర్తుకొస్తుందా? ఎన్ని సార్లు పాలించారో గుర్తుందా? స్పష్టముగా గుర్తుకొస్తుందా? లేక గుర్తు తెచ్చుకుంటే గుర్తుకొస్తుందా? నిన్నే రాజ్యము చేసాము మరియు రేపు రాజ్యము చెయ్యాలి అనేంత స్పష్టమైన స్మృతి ఉందా? ఈ స్పష్టమైన స్మృతి ఎవరికి ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు సదా స్వరాజ్య అధికారిగా ఉంటారో వారికి. మరి స్వరాజ్య అధికారులేనా? సదానా లేక అప్పుడప్పుడూనా? ఏమంటారు? సదా స్వరాజ్య అధికారులేనా? డబల్ విదేశీయుల టర్న్ కదా. మరి స్వరాజ్య అధికారులుగా సదా ఉంటున్నారా? పాండవులు, సదా ఉంటున్నారా? సదానా అన్నదానిని అడుగుతున్నారు? ఎందుకు? ఈ ఒక్క జన్మలో, ఇది చిన్న జన్మ కదా, మరి ఈ చిన్న జన్మలో ఒకవేళ సదా స్వరాజ్య అధికారిగా లేనట్లయితే ఇక 21 జన్మల కొరకు సదా స్వరాజ్యము ఎలా ప్రాప్తిస్తుంది! 21 జన్మల కొరకు రాజ్య అధికారిగా అవ్వాలా లేక అప్పుడప్పుడూ అవ్వాలా? మీకు ఏది సమ్మతము? సదా అవ్వాలా? సదానా? తల అయితే ఊపండి. అచ్ఛా, 21 జన్మలూ రాజ్య అధికారిగా అవ్వాలా? రాజ్య అధికారి అనగా రాయల్ ఫ్యామిలీలో కూడా రాజ్య అధికారి. సింహాసనముపైనైతే కొద్దిమందే కూర్చుంటారు కదా, కానీ అక్కడ సింహాసనాధికారులకు ఎంతటి స్వమానము ఉంటుందో అంతగానే రాయల్ ఫ్యామిలీ వారికి కూడా ఉంటుంది. వారిని కూడా రాజ్య అధికారులు అనే అంటారు. కానీ లెక్క ఇప్పటి కనెక్షన్‌తో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అప్పుడప్పుడు అయితే అక్కడ కూడా అప్పుడప్పుడూనే. ఇప్పుడు సదా అయితే అక్కడ కూడా సదా. కనుక బాప్‌దాదా నుండి సంపూర్ణ అధికారాన్ని తీసుకోవటము అనగా వర్తమానము మరియు భవిష్యత్తులో పూర్తిగా 21 జన్మల కొరకు రాజ్య అధికారిగా అవ్వటము. మరి డబల్ విదేశీయులు పూర్తి అధికారాన్ని తీసుకునేవారా లేక సగమా లేక కొద్దిగానా? ఏమంటారు? పూర్తి అధికారము తీసుకోవాలా? పూర్తిగా. ఒక్క జన్మ కూడా తక్కువవ్వకూడదు. మరి ఏం చెయ్యాల్సి ఉంటుంది?
బాప్‌దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరినీ సంపూర్ణ అధికారులుగా తయారు చేస్తారు. తయారయ్యారు కదా? పక్కానా? లేదా అవుతామో, అవ్వమో అన్న ప్రశ్న ఉందా? అవుతామో లేదో తెలియదు అన్న ప్రశ్న అప్పుడప్పుడు ఉత్పన్నమవుతుందా? తయారవ్వాల్సిందే. పక్కానా? తయారవ్వాల్సిందే అనుకునేవారు చేతులెత్తండి. తయారవ్వాల్సిందేనా? అచ్ఛా, వీరంతా ఏ మాలలోని మణులుగా అవుతారు? 108 మాలలోని మణులుగా అవుతారా? ఇక్కడికి ఎంతమంది వచ్చి ఉన్నారు? అందరూ 108 మాలలోకి వచ్చేది ఉందా? ఇక్కడైతే 1800 మంది ఉన్నారు. మరి 108 మాలను పెంచమంటారా? అచ్ఛా. 16000 అయితే మంచిగా అనిపించదు. 16000 లోకి వెళ్తారా ఏమిటి? వెళ్ళరు కదా! ఈ నిశ్చయముంది మరియు ఇది నిశ్చితము అన్న అనుభవము ఉండాలి. మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? ఉందా నషా? మీరు తయారవ్వకపోతే మరెవ్వరూ తయారవ్వరు కదా. మీరే అలా తయారయ్యేవారు కదా! చెప్పండి, మీరే కదా! పాండవులూ, మీరే అలా తయారయ్యేవారా? అచ్ఛా. మీ దర్పణములో స్వయాన్ని సాక్షాత్కారము చేసుకున్నారా? బాప్‌దాదా అయితే పిల్లల ప్రతి ఒక్కరి నిశ్చయాన్ని చూసి బలిహారమైపోతారు. వాహ్! వాహ్! పిల్లలు ప్రతి ఒక్కరూ వాహ్! వాహ్ వాహ్ వారే కదా! వాహ్ వాహ్ అంటారా లేక వై వై అంటారా? వై (ఎందుకు) అని అనరు కదా? అప్పుడప్పుడు ఎందుకు అన్నది వస్తుందా? అయితే వై(ఎందుకు) అనేది ఉంటుంది మరియు హాయ్ (అయ్యో) అనేది ఉంటుంది మరియు మూడవది క్రై (ఏడవటము). కానీ మీరైతే వాహ్! వాహ్! వారు కదా!
బాప్‌దాదాకు డబల్ విదేశీయులపై విశేషమైన శుద్ధ గర్వము ఉంది. ఎందుకని? భారతవాసులైతే బాబాను భారత్‌లోకి పిలిచేసారు. కానీ డబల్ విదేశీయులపై ఎందుకని శుద్ధ గర్వము ఉందంటే, డబల్ విదేశీయులు బాప్‌దాదాను తమ సత్యమైన ప్రేమ యొక్క బంధనములో బంధించారు. వారు మెజారిటీ సత్యమైనవారు. కొందరు దాచిపెడతారు కూడా కానీ మెజారిటీ తమలోని బలహీనతలను సత్యతతో బాబా ముందు పెడతారు. బాబాకు అన్నింటికంటే గొప్ప విషయముగా ఏమనిపిస్తుందంటే - సత్యత. అందుకే భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు. అన్నింటికంటే ప్రియమైనది సత్యత ఎందుకంటే ఎవరిలోనైతే సత్యత ఉంటుందో వారిలో స్వచ్ఛత ఉంటుంది. క్లీన్ మరియు క్లియర్‌గా (స్వచ్ఛముగా మరియు స్పష్టముగా) ఉంటారు, అందుకే బాప్‌దాదాను డబల్ విదేశీయుల సత్యతతో కూడిన ప్రేమ అనే తాడు లాగుతుంది. ఎవరో కొందరు కొద్దో-గొప్పో మిక్స్ చేస్తారు. కానీ డబల్ విదేశీయులు, మీ ఈ సత్యత అనే విశేషతను ఎప్పుడూ వదలకండి. సత్యత శక్తి ఒక లిఫ్ట్ వలె పని చేస్తుంది. అందరికీ సత్యత మంచిగా అనిపిస్తుంది కదా! పాండవులూ, మంచిగా అనిపిస్తుందా? ఆ మాటకొస్తే మధుబన్ వారికి కూడా ఇష్టమనిపిస్తుంది. నలువైపుల నుండి వచ్చిన మధుబన్ వారు చేతులెత్తండి. దాదీ మిమ్మల్ని భుజాలు అని అంటారు కదా. కనుక మధుబన్ వారు, శాంతివన్ వారు, అందరూ చేతులెత్తండి. చేతులు పైకి ఎత్తండి. మధుబన్ వారికి సత్యత మంచిగా అనిపిస్తుందా? ఎవరిలోనైతే సత్యత ఉంటుందో, వారికి బాబాను గుర్తు చెయ్యటము చాలా సహజమవుతుంది. ఎందుకని? బాబా కూడా సత్యము కదా! కనుక ఎవరైతే సత్యముగా ఉంటారో వారికి సత్యమైన తండ్రి యొక్క స్మృతి త్వరగా కలుగుతుంది. కష్టపడాల్సిన అవసరము ఉండదు. ఒకవేళ ఇప్పుడు కూడా స్మృతిలో కష్టమనిపిస్తుందంటే అర్థం చేసుకోండి - సూక్ష్మముగా సంకల్పమాత్రముగానైనా, స్వప్నమాత్రముగానైనా ఎక్కడో సత్యత తక్కువగా ఉంది. ఎక్కడైతే సత్యత ఉంటుందో, అక్కడ - ‘బాబా’ అని సంకల్పము చేయగానే, హజూర్ హాజరైపోతారు, అందుకే బాప్‌దాదాకు సత్యత చాలా ప్రియమనిపిస్తుంది.
బాప్‌దాదా పిల్లలందరికీ ఇదే సూచనను ఇస్తున్నారు - 21 జన్మల యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే ఇప్పుడు స్వరాజ్యాన్ని చెక్ చేసుకోండి. ఇప్పటి స్వరాజ్య అధికారిగా అవ్వండి. ఎవరు ఎంతగా అవుతారో అంతగానే అధికారము ప్రాప్తిస్తుంది. కనుక చెక్ చేసుకోండి - ఒకే రాజ్యము... అన్న గాయనము ఉంది కదా, అలా ఒకే రాజ్యము ఉంటుంది, రెండు ఉండవు. మరి వర్తమాన స్వరాజ్య స్థితిలో సదా ఒకే రాజ్యము ఉందా? స్వ రాజ్యము ఉందా లేక అప్పుడప్పుడు పర రాజ్యముగా కూడా అయిపోతుందా? అప్పుడప్పుడు ఒకవేళ మాయ రాజ్యము ఉన్నట్లయితే దానిని పర రాజ్యము అని అంటారా లేక స్వ రాజ్యము అని అంటారా? సదా ఒకే రాజ్యము ఉంటుందా, పరాధీనులుగా అయితే అవ్వటము లేదు కదా? ఒక్కోసారి మాయా రాజ్యము, ఒక్కోసారి స్వ రాజ్యము ఉంటుందా? మరి దీని ద్వారా అర్థం చేసుకోండి - సంపూర్ణ వారసత్వము ఇప్పుడింకా ప్రాప్తిస్తూ ఉంది, అది ఇంకా ప్రాప్తించలేదు, ప్రాప్తిస్తూ ఉంది. కనుక చెక్ చేసుకోండి - సదా ఒకే రాజ్యము ఉందా? అలాగే ఒకే ధర్మము - ధర్మము అనగా ధారణ. మరి విశేష ధారణ ఏమిటి? పవిత్రత. మరి ఒకే ధర్మము ఉందా అనగా సంకల్పము, స్వప్నములో కూడా పవిత్రత ఉందా? సంకల్పములోనైనా లేక స్వప్నములోనైనా కూడా ఒకవేళ అపవిత్రత యొక్క నీడ ఉన్నట్లయితే దానిని ఏమంటారు? ఒకే ధర్మము ఉన్నట్లా? పవిత్రత సంపూర్ణముగా ఉన్నట్లా? కనుక చెక్ చేసుకోండి, ఎందుకు? సమయము వేగముగా వెళ్తూ ఉంది. మరి సమయము వేగము వెళ్తూ ఉన్నప్పుడు స్వయం ఒకవేళ మెల్లగా వెళ్తున్నట్లయితే సమయానికి గమ్యాన్ని చేరుకోలేరు కదా! అందుకే పదే-పదే చెక్ చేసుకోండి - ఒకే రాజ్యము ఉందా? ఒకే ధర్మము ఉందా? లా అండ్ ఆర్డర్ ఉన్నాయా? లేదా మాయ తన ఆర్డర్‌ను నడిపిస్తుందా? పరమాత్మ పిల్లలు శ్రీమతము యొక్క లా అండ్ ఆర్డర్‌పై నడిచేవారు, అంతేకానీ మాయ యొక్క లా అండ్ ఆర్డర్‌పై కాదు. కనుక చెక్ చేసుకోండి - అందరి భవిష్య సంస్కారాలు ఇప్పుడే కనిపించాలి ఎందుకంటే సంస్కారాలను ఇప్పుడే నింపుకోవాలి. అక్కడ నింపుకోవటము కాదు, ఇక్కడే నింపుకోవాలి. సుఖము ఉందా? శాంతి ఉందా? సంపదవంతులుగా ఉన్నారా? సుఖము ఇప్పుడు సాధనాల ఆధారముపైనైతే లేదు కదా? అతీంద్రియ సుఖము ఉందా? సాధనాలు, ఇంద్రియాలకు ఆధారము. అతీంద్రియ సుఖము సాధనాల ఆధారముపై ఉండదు. అఖండ శాంతి ఉందా? ఖండితమైతే అవ్వటము లేదు కదా? ఎందుకంటే సత్యయుగ రాజ్యము యొక్క మహిమ ఏమిటి? అఖండ శాంతి, స్థిరమైన శాంతి. సంపన్నత ఉందా? సంపద ఉంటే ఏమవుతుంది? సంపన్నత ఉంటుంది. సర్వ సంపదలు ఉన్నాయా? గుణాలు, శక్తులు, జ్ఞానము, ఇవి సంపదలు. దానికి గుర్తు ఏమిటి? ఒకవేళ నేను సంపదలో సంపన్నముగా ఉన్నట్లయితే దానికి గుర్తు ఏమిటి? సంతుష్టత. సర్వ ప్రాప్తులకు ఆధారము సంతుష్టత, అసంతుష్టత అప్రాప్తికి సాధనము. కనుక చెక్ చేసుకోండి - ఒక్క విశేషత కూడా లోపించకూడదు. మరి ఇంతగా చెక్ చేసుకుంటున్నారా? మొత్తము ప్రపంచాన్ని మీరు ఇప్పటి సంస్కారాల ద్వారానే తయారుచేయబోతున్నారు. ఇప్పటి సంస్కారాల అనుసారముగా భవిష్య ప్రపంచము తయారవుతుంది. మరి మీరందరూ ఏమంటారు? మీరు ఎవరు? విశ్వ పరివర్తకులు కదా! విశ్వ పరివర్తకులేనా? మరి విశ్వ పరివర్తకులు అన్నదానికి ముందు స్వ పరివర్తకులు అన్నది ఉండాలి. కనుక ఈ అన్ని సంస్కారాలు మీలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి. దీని ద్వారా నేను 108 మాలలో ఉన్నానా లేక వెనక-ముందు ఉన్నానా అన్నది అర్థం చేసుకోండి. ఈ చెకింగ్ అనేది ఒక దర్పణము వంటిది, ఈ దర్పణములో మీ వర్తమానమును మరియు భవిష్యత్తును చూసుకోండి. చూసుకోగలరా?
ఇప్పుడైతే హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా! హోలీని జరుపుకునేందుకు వచ్చారు, మంచిది. హోలీ యొక్క అర్థాన్ని వర్ణన చేసాము కదా! మరి బాప్‌దాదా ఈరోజు విశేషముగా డబల్ విదేశీయులకు చెప్తున్నారు, మధుబన్ వారు తోడుగా ఉన్నారు, ఇది చాలా బాగుంది. మధుబన్ వారికి కూడా కలిపి చెప్తున్నాము. ఎవరు వచ్చినా సరే, బొంబాయి నుండి వచ్చినా లేక ఢిల్లీ నుండి వచ్చినా, ఈ సమయములోనైతే మధుబన్ నివాసులు. డబల్ విదేశీయులు కూడా ఈ సమయములో ఎక్కడివారు? మధుబన్ నివాసులు కదా! మధుబన్ నివాసులుగా అవ్వటము మంచిది కదా! కనుక పిల్లలందరికీ, ఇక్కడ ఎదురుగా కూర్చుని ఉన్నా లేక నలువైపులా తమ-తమ స్థానాలలో కూర్చుని ఉన్నా, బాప్‌దాదా అందరిలోనూ ఒక పరివర్తనను కోరుకుంటున్నారు - ఒకవేళ ధైర్యము ఉంటే బాప్‌దాదా చెప్తారు. ధైర్యము ఉందా? ధైర్యము ఉందా? ధైర్యము ఉందా? చెయ్యాల్సి ఉంటుంది. చేతులెత్తాము కదా, అయిపోయిందిలే అని అనుకోవటము కాదు, అలా కాదు. చేతులెత్తటమైతే చాలా మంచిది కానీ మనసు యొక్క చేతిని ఎత్తండి. ఈరోజు కేవలము ఈ చేతిని ఎత్తటము కాదు, మనసు యొక్క చేతిని ఎత్తండి.
డబల్ విదేశీయులు దగ్గరగా కూర్చున్నారు కదా, దగ్గరివారికి మనసులోని విషయాలను వినిపించటము జరుగుతుంది. చాలావరకు ఏం కనిపిస్తుందంటే - అందరికీ బాప్దాదాపై, సేవపై చాలా మంచి ప్రేమ ఉంది. బాబా ప్రేమ లేకుండా కూడా ఉండలేరు మరియు సేవ లేకుండా కూడా ఉండలేరు. మెజారిటీ విషయములో ఈ సర్టిఫికేట్ బాగుంది. బాప్‌దాదా నలువైపులా చూస్తుంటారు, కానీ... కానీ అనేది వచ్చేసింది. మెజారిటీ నుండి ఇదే మాట వినిపిస్తుంది - ఏదో ఒక సంస్కారము, పాత సంస్కారము, దానిని వద్దనుకుంటున్నా సరే ఆ పాత సంస్కారము ఇప్పటికీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. మరి హోలీని జరుపుకోవటానికి వచ్చారు, హోలీ అంటే అర్థము గడిచిపోయిందేదో గడిచిపోయింది. అయిపోయింది, జరిగిపోయింది. కనుక కొద్దిగానైనా ఏ సంస్కారమైనా 5 శాతము ఉన్నా, 10 శాతము ఉన్నా, 50 శాతము ఉన్నా, ఎంతైనా ఉండనివ్వండి, తక్కువలో తక్కువ 5 శాతము ఉన్నా సరే ఈరోజు సంస్కారాల హోలీని కాల్చండి. ఏ సంస్కారమునైతే అందరూ - ఫలానా సంస్కారము నన్ను మధ్యమధ్యలో డిస్టర్బ్ చేస్తుంది అని భావిస్తున్నారో, ప్రతి ఒక్కరూ అలా భావిస్తారు, భావిస్తున్నారు కదా? హోలీ అంటే ఒకటి కాల్చటము ఉంటుంది, రెండు రంగులు చల్లుకోవటము ఉంటుంది. రెండు రకాల హోలీ ఉంటుంది మరియు హోలీ అంటే అర్థము కూడా జరిగిపోయినదేదో జరిగిపోయింది అని. కనుక బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారంటే - అటువంటి సంస్కారము ఏదైనా మిగిలి ఉంటే, దాని కారణముగా ప్రపంచ పరివర్తన అవ్వటము లేదు అంటే, ఈరోజు ఆ బలహీన సంస్కారాన్ని కాల్చివేయండి అనగా అంతిమ సంస్కారము చేయండి. కాల్చడాన్ని కూడా అంతిమ సంస్కారము అని అంటారు కదా. మనుష్యులు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారము చెయ్యాలి అని అంటారు అనగా సదా కొరకు అంతము చెయ్యటము. మరి ఈరోజు సంస్కారానికి కూడా అంతిమ సంస్కారము చెయ్యగలరా? ఆ సంస్కారము రావాలి అని మేము కోరుకోవటము లేదు కానీ అది వచ్చేస్తుంది, ఏం చేయాలి అని మీరు అంటారు. ఇలా అనుకుంటారా? అచ్ఛా. పొరపాటున వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఇచ్చేసిన వస్తువు పొరపాటున మీ వద్దకు వస్తే ఏం చేస్తారు? జాగ్రత్తగా అలమారీలో పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? కావున ఒకవేళ అది వచ్చినా కానీ మనసులో పెట్టుకోకండి ఎందుకంటే మనసులో బాబా కూర్చుని ఉన్నారు కదా! మరి బాబాతోపాటు ఒకవేళ ఆ సంస్కారాన్ని కూడా మనసులో పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుందా? అనిపించదు కదా! అందుకే ఒకవేళ పొరపాటున వచ్చేసినా కానీ మనస్ఫూర్తిగా బాబా, బాబా, బాబా... అని అనండి, అంతే, సమాప్తమైపోతుంది. బిందువు పడిపోతుంది. బాబా ఎవరు? బిందువు. కనుక బిందువు పడిపోతుంది. మనస్ఫూర్తిగా అంటేనే. అలా కాకుండా ఏదో పని ఉంది కాబట్టి - బాబా తీసేసుకోండి కదా, తీసేసుకోండి కదా అంటూ గుర్తు చేసినట్లయితే... పెట్టుకునేదేమో మీ వద్ద, కానీ తీసేసుకోండి కదా, తీసేసుకోండి అని అంటారు. మరి ఎలా తీసుకుంటాను? మీ వస్తువును ఎలా తీసుకుంటాను? ముందు మీరు అది మీ వస్తువు కాదు అని అనుకోండి, అప్పుడు తీసుకుంటాను. ఎవరైనా ఊరికే అలా ఇతరుల వస్తువును తీసేసుకుంటారా. మరి ఏం చేస్తారు? హోలీ జరుపుకుంటారా? అయిపోయింది, అయిపోయింది. అచ్ఛా, ఎవరైతే దృఢ సంకల్పము చేస్తున్నాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మీరు ఘడియ, ఘడియ దానిని తీసేస్తూ ఉంటే అది పోతుంది. లోపల ఉంచుకోకండి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అది పోవటం లేదు అని అనుకోకండి. తీసేసెయ్యాల్సిందే. మరి దృఢ సంకల్పము చేస్తారా? ఎవరైతే చేస్తారో వారు మనస్ఫూర్తిగా చేతులెత్తండి, బాహ్యముగా ఎత్తటము కాదు. మనసుతో ఎత్తండి. (కొందరు ఎత్తటము లేదు) వీరు ఎత్తటము లేదు. (అందరూ చేతులెత్తారు). చాలా మంచిది, అభినందనలు, అభినందనలు. ఏమవుతుందంటే, ఒకవైపేమో అడ్వాన్స్ పార్టీవారు బాప్‌దాదాను పదే-పదే అడుగుతున్నారు - ఎప్పటి వరకు, ఎప్పటి వరకు, ఎప్పటి వరకు అని. మరోవైపు ప్రకృతి కూడా బాబా ముందు అర్జీ పెడుతుంది - ఇప్పుడు పరివర్తన చెయ్యండి అని. బ్రహ్మా బాబా కూడా అడుగుతున్నారు - ఇప్పుడిక ఎప్పుడు పరంధామము యొక్క ద్వారాన్ని తెరుస్తారు అని. కలిసి వెళ్ళాలి కదా, ఇక్కడే ఉండిపోకూడదు కదా! కలిసి వస్తారు కదా! కలిసే గేటు తెరుస్తారు! తాళముచెవిని బ్రహ్మాబాబా పెట్టినా కానీ తోడుగా అయితే ఉంటారు కదా! కనుక ఇప్పుడు ఈ పరివర్తన చెయ్యండి. ఇక దానిని తీసుకురానే తీసుకురావద్దు. అది నా వస్తువే కాదు, అది ఇతరులది, రావణుని వస్తువును ఎందుకు పెట్టుకున్నారు! ఇతరుల వస్తువును పెట్టుకుంటారా ఏమిటి? మరి ఇది ఎవరిది? రావణునిది కదా? అతని వస్తువును మీరు ఎందుకు పెట్టుకున్నారు? పెట్టుకోవాలా? పెట్టుకోవద్దు కదా, పక్కానా? అచ్ఛా. కనుక రంగుల హోలీని జరుపుకుంటే జరుపుకోండి కానీ ముందుగా ఈ హోలీని జరుపుకోండి. మీరు చూస్తున్నారు కదా, దయా స్వరూపులు అని మీ మహిమ ఉంది. మీరు దయా స్వరూప దేవీలు మరియు దేవతలు కదా! మరి దయ కలగదా? మీ సోదరీ-సోదరులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు, వారి దుఃఖాన్ని చూస్తుంటే దయ కలగటం లేదా? దయ కలుగుతుందా? కనుక సంస్కారాలను మార్చుకోండి, అప్పుడు ప్రపంచము మారిపోతుంది. ఎప్పటివరకైతే సంస్కారాలను మార్చుకోరో అప్పటివరకు ప్రపంచము మారలేదు. మరి ఏం చేస్తారు?
ఈరోజు సంతోషకరమైన వార్తను విన్నాము - అందరూ దృష్టి తీసుకోవాలి అని. మంచి విషయము. బాప్‌దాదా అయితే పిల్లలకు ఆజ్ఞాకారి కానీ... కానీ అన్న మాటను విని నవ్వుతున్నారు. నవ్వండి, మంచిదే. దృష్టి ద్వారా సృష్టి మారుతుంది అని దృష్టి గురించి అంటారు. కావున నేటి దృష్టి ద్వారా సృష్టి పరివర్తనను చెయ్యాల్సిందే, ఎందుకంటే సంపన్నత మరియు ఏయే ప్రాప్తులు అయితే లభించాయో, వాటి అభ్యాసము చాలా సమయము నుండి ఉండాలి. సమయానికి అయిపోతుందిలే అని అనుకోకండి, అలా అవ్వదు. చాలా సమయము యొక్క రాజ్య భాగ్యము తీసుకోవాలనుకుంటే సంపన్నత కూడా చాలా సమయము నుండి ఉండాలి. మరి సరేనా? డబల్ విదేశీయులు సంతోషముగా ఉన్నారా? అచ్ఛా!
ఈసారి శాంతివన్ అనంతమైన ఇంటిలో ఉన్నారు కదా. చూడండి, ప్రతి స్థానానికి వేరువేరు లాభాలు ఉంటాయి. పైన ఉండటంలో ఆ లాభం వేరు, శాంతివన్లో ఉండటంలోని లాభం వేరు. ఇక్కడ పరివారానికి సమీపంగా ఉంటారు, దాదీలకు సమీపంగా ఉంటారు, అక్కడ బాప్‌దాదా యొక్క కర్మభూమికి సమీపంగా ఉంటారు. కానీ మంచిగా అనిపిస్తుందా లేదా? కొద్ది-కొద్దిగా గుర్తొస్తుందా? డబల్ విదేశీయుల సంఖ్య ఒకే సమయానికి సంఖ్య పెరగడాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. సంఖ్య కారణంగా పైన ఉండలేకపోతున్నారు కదా. మరి సంఖ్య పెరగడం మంచి విషయమే కదా! ఒకే సమయంలో పరస్పరంలో కలిసి ఉండటం, ఇది కూడా అనుభవమే కదా! మధుబన్ వారైతే డబల్ విదేశీయులకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే డబల్ విదేశీయులు తమ సమయంలో విశేషంగా మధుబన్ నివాసులకు ఛాన్స్ ఇచ్చారు. మధుబన్ వారు చప్పట్లు కొట్టండి. చూడండి, మధుబన్ వారు ఎంతో సంతోషిస్తున్నారు! లేకపోతే మధుబన్ వారికి సీజన్ మొత్తంలో ఛాన్స్ ఎక్కడ లభిస్తుంది! డబల్ విదేశీయులు ఛాన్స్ ఇచ్చారు, ఇందుకు బాప్‌దాదా కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. అచ్ఛా.
డబల్ విదేశీయుల సేవా ప్రోగ్రాముల గురించి కూడా విన్నాము. మంచి ప్రోగ్రాములు తయారు చేసారు. ఎవరెవరైతే సేవల గురించి సందేశాన్ని పంపారో అవి బాప్‌దాదా విన్నారు, అవి బాగున్నాయి కూడా ఎందుకంటే ఫారెన్‌లో ఒకవేళ పెద్ద-పెద్ద ప్రోగ్రాములు చేస్తే ఫారెన్ యొక్క ధ్వని ఇప్పుడు మీడియా ద్వారా భారత్‌కు కూడా చేరుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు భారత్ ధ్వని మీడియా ద్వారా ఫారెన్‌కు చేరుకోవాలని ట్రయల్ చేసారు కదా. అలాగే ఫారెన్ వారు కూడా మీడియా ద్వారా భారత్‌లో ధ్వనిని వ్యాప్తి చేయాలి. మీడియా సాధనము బాగుంది. కావున ఏ ప్రోగ్రాములనైతే తయారు చేసారో అవి బాప్‌దాదాకు నచ్చాయి. ప్రాక్టికల్లోకి తీసుకురండి. ప్రాక్టికల్లోకి తీసుకువస్తే ధ్వని వ్యాపిస్తుంది. సరేనా! మంచిది. మరో విషయాన్ని చూసాము – ఫారెన్ యొక్క లిస్ట్ బాప్‌దాదాకు చేరింది. ఏ విషయం యొక్క లిస్ట్? సేవ ద్వారా ఎవరైతే స్నేహి, సహయోగిగా అయ్యారో, అది వర్గీకరణ సేవ ద్వారా కావచ్చు, కాన్ఫెరెన్స్ సేవ ద్వారా కావచ్చు, ఎవరెవరు స్నేహి సహయోగిగా అయ్యారో ఆ లిస్ట్ ఇవ్వండి అని బాప్‌దాదా చెప్పారు. ఈరోజు బాప్‌దాదా వద్దకు నంబర్‌వన్ లిస్ట్ ఫారెన్ నుండి లభించింది, ఇందుకు అభినందనలు. బాగా కష్టపడ్డారు. యు.కె నుండి, యూరప్ నుండి, ఇంకెక్కడి నుండి లిస్ట్ వచ్చింది? బాగుంది. భారత్ వారు కూడా లిస్ట్ తయారు చేయాలి. ఎప్పుడైనా ఒకసారి ఇంటర్నేషనల్ స్నేహి సహయోగుల సంగఠనను చేద్దాము. పరస్పరం అనుభవాలు విని కూడా ఉల్లాసంలోకి వస్తారు. మొదటగా ఫారెన్ నుండి లిస్ట్ వచ్చింది, అందుకని బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇకపోతే అందరి కార్డులు, ఉత్తరాలు వస్తుంటాయి. ఈరోజుల్లో ఈమెయిళ్ళు చాలా వస్తున్నాయి. ఏ పిల్లలైతే సమచారాన్ని ఇచ్చారో, భారత్ కావచ్చు విదేశం కావచ్చు. భారత్‌లో కూడా శివరాత్రి ప్రోగ్రాములు చాలా వైభవంగా చేసారు మరియు సమాచారాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు సమయం యొక్క వేగం కన్నా ముందు వెళ్ళండి. అచ్ఛా.
చాలా దేశాల నుండి వచ్చి ఉన్నారని బాప్‌దాదా విన్నారు. అన్ని దేశాల నుండి ముఖ్యంగా డబల్ ఫారెన్ నుండి ఎవరైతే వచ్చారో, ప్రతి దేశం నుండి ఒక్కొక్క ముఖ్యమైన నిమిత్త టీచర్ లేవండి. 77 దేశాల నుండి వచ్చి ఉన్నారు. పాండవులు కూడా ఉన్నారు, సోదరీలు కూడా ఉన్నారు. అందరినీ టి.వీలో చూపించండి. బాగా చేసారు, అభినందనలు. మీ-మీ గ్రూపును తీసుకు వచ్చారు. ఇక్కడి వరకు తయారు చేసి తీసుకువచ్చారు. ఇందుకోసం బాప్‌దాదా మీ ఒక్కొక్కరికీ పర్సనల్‌గా అభినందనలు తెలుపుతున్నారు. మంచి సేవను చేసారు. అచ్ఛా. (అందరిదీ గ్రూపులవారీగా భట్టీ జరిగింది). ఇది మంచిగా చేసారు. స్పెషల్‌గా ఒక్కొక్క సంగఠనకు ఏదైతే భట్టీ పెట్టారో, అందులో ప్రతి ఒక్కరూ తమ-తమ డిపార్టుమెంటులో ఉంటూ, సంగఠనలో ఉంటూ మజా కూడా వస్తుంది. ఈ విధి ఏదైతే పెట్టారో, ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. మంచిగా అనిపించింది కదా! (మొదటిసారి యుగళులకు, కుమారులకు వేరుగా భట్టీ జరిగింది) కుమారులు లేవండి. మంచిగా అనిపించిందా? విడిగా భట్టీ చేస్తే మంచిగా అనిపించిందా? కుమారులకైతే జరుగుతూనే ఉంటుంది. మంచిది. కుమారులందరూ అమర భవ యొక్క వరదానీలే కదా! అమర భవ అనే వరదానం అయితే లభించింది కదా! అమరులుగానే ఉండండి. (యుగళులు లేవండి) చాలా బాగుంది. (విష్ణువు సింబల్ ఉన్న జెండా అందరి చేతిలో ఉంది) చాలా మంచిది. బాప్‌దాదాకు నచ్చింది. ఇప్పుడు సదా ప్రవృత్తిని ప్రవృత్తిగా కాక, పర వృత్తి, పర వృత్తి అంటే అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. కావున ప్రవృత్తి వారు కాదు, పర వృత్తిలో ఉండే యుగళులు. చాలా మంచిది, అభినందనలు. (అధర్ కుమారులు లేవండి) అధర్ కుమారులందరికీ ఏ నషా ఉంటుంది? మా సహచరుడు ఆల్మైటీ అథారిటీ. సహచరుడు (కంపానియన్) కూడా బాబాయే, తోడు(కంపెనీ) కూడా బాబాదే. మరి అధర్ కుమారులందరూ సదా ఈ నషాలోనే ఉండండి. బాబాతో కలిసి కంబైండ్‌గా ఉన్నారు. స్వయాన్ని సింగల్‌గా భావించకండి. కంబైండ్. బాబా మరియు మీరు కంబైండ్. చాలా మంచిది. (కుమారీలు లేవండి) కుమారీలు కూడా ఉన్నారు, బ్రహ్మా కుమారీలు కూడా ఉన్నారు. అసలైతే కుమారి కూడా బ్రహ్మా కుమారియే. మరి కుమారీలు ఏమి చేస్తారు? అద్భుతాన్ని చేసి చూపిస్తారా? ఇప్పుడు బాప్‌దాదా సేవకు కుడి భుజాలు మీరు. రైట్ హ్యాండ్స్ కదా? బాగుంది, వీరు ఎన్నో ఆత్మల కళ్యాణానికి నిమిత్తం అవుతారు అని కుమారీలను చూసి బాప్‌దాదా చాలా సంతోషిస్తారు. విశ్వ కళ్యాణకారులుగా అవుతారు. చాలా బాగుంది.
(మాతలు లేవండి) మాతలు చాలా తెలివైనవారు. చూడండి, బాప్‌దాదా అయితే మాతలకే విశేషంగా ముందుకు వెళ్ళేందుకు ఛాన్స్‌ను ఇచ్చారు. మరి ఛాన్స్‌ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారు, ఇందుకు చాలా-చాలా అభినందనలు. చాలా మంచి శక్తి అవతారములు, మీ సంగఠనను మరింత ముందుకు తీసుకు వెళ్ళండి. అనేక చోట్ల మాతల సంఖ్య ఎక్కువగా ఉంది. డబల్ ఫారెన్‌లో కూడా మాతల సంఖ్య ఇప్పుడు కూడా ఎక్కువ ఉంది, భారత్‌లో మాతల సంఖ్య ఎక్కువగా ఉంది. పూర్తి కల్పంలో ఇప్పుడు ఛాన్స్ లభించింది, మరి మీ ఛాన్స్‌ను తీసుకున్నారు. (సెంటర్ నివాసులు మరియు ఎన్.సి.ఓ మీటింగ్‌కు వచ్చిన సోదరసోదరీలు లేవండి) చాలా మంచిది – సెంటర్ నివాసులు అంటే పుణ్య ఖాతాను పెంచుకునేవారు. ఎవరు వచ్చినాగానీ వారికి బాబా పరిచయాన్ని ఇచ్చి బాబాకు చెందినవారిగా తయారు చేస్తారు, ఈ పుణ్యం జమ అవుతుంది. మరి సెంటర్ నివాసులు సదా స్వయాన్ని, నేను పుణ్య ఆత్మను, పుణ్యం జమ చేసుకునేందుకు ఛాన్స్ లభించింది అని భావించండి. ఎంతెంతగా పుణ్యం జమ అవుతూ ఉంటుందో, కొద్దిగా కూడా స్వప్నమాత్రంగా కూడా, కొద్దిగా అయినా పాపపు రేఖలు ఉండిపోతే, అవి సమాప్తమైపోతాయి. మరి ఇది పుణ్య ఆత్మల గ్రూప్. బాగుంది. కుమారులు, పాండువులు కూడా సేవకు నిమిత్తంగా అయ్యారు, ఇది కూడా చాలా మంచి ఛాన్స్ లభించింది. సదా సేవను ముందుకు తీసుకువెళ్ళేందుకు నిమిత్తమైన ఆత్మలు. పాండవులు కావచ్చు, శక్తులు కావచ్చు ఇరువురికీ బాప్‌దాదా సేవ కోసం అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా. (చిన్న పిల్లలకు రిట్రీట్ జరిగింది, పిల్లలు లేవండి) మంచిగా అనిపించిందా, పిల్లలకు చాలా బాగా అనిపించింది. బాగుంది. పిల్లలు అద్భుతం చేసి చూపిస్తారు. పెద్దలు కూడా చేయలేని సేవను పిల్లలు చేస్తారు ఎందుకంటే పిల్లలంటే అందరికీ ప్రేమ ఉంటుంది. మరి చాలా బాగా చేసారు, చాలా మంచిది. అచ్ఛా.
స్పార్క్ గ్రూప్ కూడా వచ్చింది:- చాలా మంచిది. అనుభవీమూర్తులుగా అయ్యి, అనుభవాన్ని చేయించేందుకు ప్రాక్టికల్‌గా రిసర్చ్ చేస్తున్నారు. దీనిని, అనుభూతి చేయించే రిసర్చ్ను మరింత పెంచండి. ప్రాక్టికల్‌గా రుజువును తీసుకురండి అప్పుడు ప్రపంచం ఎగ్జాంపుల్‌ను చూసి సహజంగా ఒప్పుకుంటుంది. బాగుంది. ముందుకు వెళ్తూ ఉండండి మరియు ఎగ్జాంపుల్‌గా అయ్యి ఇతరులను కూడా ఎగ్జాంపుల్‌గా తయారు చేయండి. చాలా మంచిది.
మధుబన్ నివాసులు లేవండి:- (అందరూ బాగా చప్పట్లు కొట్టారు) చూడండి, అందరికీ మధుబన్ నివాసులపై ఎంత ప్రేమ ఉందో! మధుబన్ నివాసుల సేవ చూసి అందరూ చాలా సంతోషిస్తారు. దీనిని ఎవరు నడిపిస్తున్నారో, ఎవరు డైరెక్షన్లు ఇస్తున్నారో తెలియనే తెలియదు అని అందరూ అంటారు కదా. ఒక మషీన్ లాగా నడుస్తుంది. మరి మధుబన్ నివాసులకు లభించిన ఈ సేవా భాగ్యము చాలా పెద్దది. ఏ గ్రూప్ వచ్చినా, ఆ గ్రూప్ ఎదుట ఉదాహరణగా మధుబన్ నివాసులు ఉంటారు. భాషణ చేయకపోయినా, సెంటరులో కూర్చుని మురళి వినిపించకపోయినాగానీ ఎగ్జాంపుల్‌గా అవ్వడము, ఇది చాలా పెద్ద సేవ. అందరికీ సంతుష్టతను అనుభవం చేయించడము, ఇది చాలా పెద్ద సేవ. అందుకే మధుబన్ వారంటే విదేశీయులకు, భారత్ వారికి అందరికీ ప్రేమ ఉంటుంది. మధుబన్ వారు ఎక్కడకు వెళ్ళినా, మధుబన్ యొక్క ప్రతి ఆత్మను ఎంతో గౌరవంతో చూస్తారు. మధుబన్ నుండి వచ్చారు అని అందరి నోటి నుండి వస్తుంది. మధుబన్ వారు తక్కువేమీ కాదు. సాకార బ్రహ్మా అనేవారు – ‘‘పొయ్యి దగ్గర ఉండేవారు మనసులో ఉంటారు’’(జో చుల్ పర్ సో దిల్ పర్). మరి మధుబన్ నివాసులు పొయ్యి దగ్గర కూడా ఉన్నారు, మనసులో కూడా ఉన్నారు. బాప్‌దాదాకు మధుబన్ నివాసులు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉంది. ప్రేమకు పాత్రులు ఎందుకంటే సేవలో సంతుష్టరపరచాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మంచిది. సంగఠన కూడా చూడండి, ఎంత పెద్దగా ఉందో! మరి సేవ మరియు సంగఠనకు అభినందనలు. డబల్ విదేశీయులకు సంతోషం కలుగుతుంది. మధుబన్ వారిని చూసి సంతోషం కలుగుతుంది.
అచ్ఛా – బాప్‌దాదా చెప్పిన మాటను గుర్తుంచుకోండి – మర్చిపోకండి. ఇప్పుడు పాత సంస్కారాల సమాప్తి సెరిమనీ(వేడుక)ను జరుపుకుందాం, ఇష్టమే కదా! ఆ వేడుకలో మిమ్మల్ని పిలుస్తాము. ఎవరు చేస్తారో, వారిని పిలుస్తాము. అచ్ఛా.
నలువైపులా ఉన్న మూడు సింహాసనాధికారులైన విశేష ఆత్మలందరికీ, సదా స్వరాజ్య అధికారి విశేషాత్మలకు, సదా దయాహృదయులుగా అయ్యి ఆత్మలకు సుఖ-శాంతుల అంచలిని ఇచ్చే మహాదాని ఆత్మలకు, సదా దృఢతను మరియు సఫలతను అనుభవము చేసే బాబా సమానమైన ఆత్మలకు, బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- నిశ్చింత చక్రవర్తులు. బాప్‌దాదా సదా నిశ్చింత చక్రవర్తుల రూపంలో చూస్తారు. కారణం ఏమిటి? ఎందుకు నిశ్చింతగా ఉన్నారు? ఎందుకంటే హృదయము పెద్దది. ఎక్కడ హృదయం పెద్దగా ఉంటుందో, అక్కడ ఏది జరగాలో అది జరిగిపోతుంది. ఏది రావాలో అది వచ్చేస్తుంది. (పెద్ద బాబా, పెద్ద పరివారము, పెద్ద హృదయము)
పర్దాదీతో:- చాలా బాగుంది, సంగఠనలోకి వచ్చేసారు, చాలా మంచి పని చేసారు. అందరూ గుర్తు చేస్తారు కదా! మనసులో చాలా మాట్లాడుకుంటారు. అన్నీ మనసుతో చెప్తారు. ఆత్మిక సంభాషణ చాలా చేస్తారు. చాలా మంచిది. ఆరోగ్యాన్ని నడిపిస్తున్నారు కదా! ఇది బాగుంది. బాగున్నారు కదా! పాత శరీరము, కానీ పాత శరీరంలో కూడా మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు. ఆది రత్నం కదా, అందుకే అందరూ సంతోషిస్తారు. అందరి పేర్లు తీసుకుంటారు, మిమ్మల్ని గుర్తు చేస్తుంటారు. మంచిది.
మనోహర్ దాదీతో:- అందరికీ తమ-తమ పాత్ర మంచిగా లభించింది. ఎక్కడ ఉంటున్నా స్థానము వైభవోపేతంగా అయిపోతుంది. ఒక దాదీ అయితే కూర్చున్నారు అని అందరికీ సంతోషం కలుగుతుంది. మధుబన్కు అలంకారము. కదా! అచ్ఛా.
విదేశాల పెద్దక్కయ్యలతో:- ఈ గ్రూప్ కూడా చాలా మంచిగా వెలువడింది. బాగుంది, అందరూ ఆల్‌రౌండ్ సేవాధారులు. సేవలో మజా వస్తుంది కదా! మంచిది, విశ్వంలోని నలుమూలల ధ్వనిని అయితే వ్యాప్తి చేసారు. బాగున్నారు కదా, అందరి ఆరోగ్యం బాగుందా? చాలా మంచి గ్రూప్. బాప్‌దాదాకు సేవపై ప్రేమ ఉంది, పిల్లలపై ప్రేమ ఉంది. చాలా మంచిది, ఎవరైతే వచ్చారో, వారు సేవా ప్లాన్లు కూడా చాలా బాగా తయారు చేసారు, అభినందనలు. అందరూ కలిసి చాలా మంచిగా తయారు చేసారు. అచ్ఛా!