Search for a command to run...
15 Nov 2009
స్వరాజ్యం యొక్క రిజల్ట్‌ను చెక్ చేసుకుని స్వయాన్ని ఛేంజ్ చేసుకోండి మరియు అఖండ రాజ్యానికి అధికారులుగా అవ్వండి
15 November 2009 · తెలుగు
ఈరోజు దిలారామ్ బాబా తమ రాజ్ దులారే (ప్రియమైన) పిల్లలను కలవడానికి వచ్చారు. ఎందుకు ప్రియమైనవారు? పిల్లలు ప్రతి ఒక్కరూ మూడు సింహాసనాలకు యజమానులు అని తెలుసా? ఒకటి, స్వరాజ్య సింహాసనము, రెండు బాప్‌దాదా హృదయ సింహాసనము, మూడు భవిష్య సింహాసనము. మూడు సింహాసనాలకు అధికారులు. తమ భవిష్య సింహాసనం కోసం కూడా ఇక్కడే అభ్యాసం చేస్తున్నారు. భవిష్యత్తు కోసం తయారీలు మరియు పురుషార్థాన్ని ఇక్కడే చేస్తున్నారు. ఇప్పటి పురుషార్థము అనేక జన్మలకు రాజ్య భాగ్యాన్ని ఇప్పించేది. ఈ సమయంలోనే తమ రాజ్య భాగ్య సంస్కారాన్ని ధారణ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి పురుషార్థము భవిష్య రాజ్యానికి అధికారిగా చేస్తుంది. మరి ఈ సమయంలో ఉన్న తమ పురుషార్థము యథార్థంగా ఉన్నదా అని పరిశీలించుకోండి. భవిష్యత్తులో ఒక్క రాజ్యమున్నట్లుగా ఇప్పుడు మా మనసులలో ఒకే రాజ్యం నడుస్తుందా అని పరిశీలించుకోండి. పురుషార్థంలో ఒక్క రాజ్యం ఉందా? లేక మీ రాజ్యంలో మాయ విఘ్నాలను వేస్తుందా? ఒక్క రాజ్యానికి బదులుగా మాయ ప్రభావం పడటం లేదు కదా? రెండు రాజ్యాలైతే లేవు కదా? ఒకే రాజ్యము అన్నది భవిష్యత్తుకు ఉన్న విశేషత. ఇప్పటి అభ్యాసమే భవిష్యత్తులో జరుగుతుంది. మరి పరిశీలించుకోండి - ఇప్పుడు స్వరాజ్యము ఉంది, స్వరాజ్యంలో మాయ తల దూర్చడం లేదు కదా? రెండు రాజ్యాలైతే లేవు కదా? ఒకవేళ రెండు రాజ్యాలు ఉన్నట్లయితే ఒక్క రాజ్యపు సంస్కారాన్ని ఎప్పుడు నింపుకుంటారు? ఒకే రాజ్యము, ఒకే ధర్మము అన్నది భవిష్యత్తుకు ఉన్న విశేషత. అక్కడ ఏ ధర్మము ఉంటుంది? మీ విశేష ధారణ ఏమిటి? సంపూర్ణ పవిత్రత. ఒకే ధర్మము ఉందా అని పరిశీలించుకోండి. మధ్యలో అపవిత్రత అను రెండవ ధర్మము దూరడం లేదు కదా? దీనితో పాటు లా అండ్ ఆర్డర్ ఒక్కరిదే ఉందా లేక మాయ అందులో కూడా ప్రవేశిస్తుందా అని పరిశీలించుకోండి. ఒక్కరి రాజ్యము నిర్విఘ్నంగా జరుగుతుందా? మరో విషయమేమిటంటే రాజ్యంలో సదా సుఖము మరియు శాంతి సహజంగా ఉంటాయి, మరి ఇప్పుడు చూసుకోండి మీ రాజ్యంలో సదా సుఖశాంతులు ఉన్నాయా? ఎవ్వరూ మధ్యలో ప్రవేశించడం లేదు కదా? స్వరాజ్యంలో మాయ కలుగజేసుకుని అశాంతిని వ్యాప్తి చెయ్యడం లేదు కదా? స్వరాజ్యంలో ఏదో ఒక సాల్వేషన్ లేక ప్రశంసల ప్రభావాన్ని మాయ తీసుకురావడం లేదు కదా? సదా సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, అతీంద్రియ సుఖము స్థిరంగా ఉంటున్నాయా? ఎందుకంటే భవిష్య రాజ్యంలో సర్వ ప్రాప్తులు, సంపన్నత ఉంటాయి అని మీకు తెలుసు. దీని కారణంగా సంతుష్టత కూడా ఉంటుంది. మరి ఇప్పుడు కూడా స్వరాజ్యము సంపన్నంగా ఉన్నదా లేక ఏదైనా లోటు ఉందా? ఎందుకంటే ఇప్పటి పురుషార్థంలో ఒకవేళ లోపం ఉండిపోయినట్లయితే భవిష్య అఖండ రాజ్యానికి అధికారులుగా ఎలా అవ్వగలరు! ఆధారమంతా ఇప్పటి పురుషార్థం పైననే ఉంది. ఇప్పుడు ఉన్న ఏ లోపము భవిష్యత్తులో సంపూర్ణ రాజ్యానికి అధికారిగా కానివ్వదు. బహుకాలపు ఈ స్వరాజ్య అభ్యాసము భవిష్య రాజ్యానికి అధికారిగా చేస్తుంది. కావున తమ ఈ చెకింగ్ సదా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బహుకాలపు పురుషార్థము లేనట్లయితే ప్రాలబ్ధము కూడా తక్కువ లభిస్తుంది. అందుకే బాప్‌దాదా సమయానుసారంగా ఈ అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు - ఇందుకోసం ఇప్పుడు స్వయాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారు చేసుకోండి. పురుషార్థం జరుగుతుంది అని అప్పుడప్పుడూ అంటూ ఉంటారు కానీ పురుషార్థం చేస్తూ మధ్యలో ‘అయితే’ అని అనడం లేదు కదా! ఇది అయితే అయిపోతుందిలే, ఇది అయితే చేస్తాములే, ఈ సంస్కారము 21 జన్మల అవినాశీ, అఖండ రాజ్యానికి అధికారిగా అవ్వనివ్వదు.
బాప్‌దాదా సదా కోసం అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు, పరిశీలించుకోండి. ఒకవేళ ఏదైనా విఘ్నము వచ్చినా కానీ, తుఫాను వచ్చినా తుఫాను తోఫా(బహుమతిగా)గా మారుతుందా? తుఫాను తుఫానుగా కాక తోఫాగా మారిపోవాలి. ఏ విధమైన మాయా దాడి జరిగినా, మాయ అలా అనుభవం చేయిస్తుంది, ఆ అనుభవం కూడా మనకు ఎలా అనుభవం అవ్వాలంటే ఆ అనుభవం అనే మెట్లు మనల్ని ముందుకు తీసుకు వెళ్తాయి. దీనికోసం బాప్‌దాదా అంటారు సదా తమ చార్ట్‌ను తామే పరిశీలించుకోండి. ఎంతగా తమ చార్ట్‌ను పరిశీలించుకుంటారో అంతగా చెక్ చేసుకుని ఛేంజ్ అవుతారు. మరి ప్రతి ఒక్కరూ తమ చార్ట్‌ను పరిశీలించుకుంటున్నారా? చేసుకుంటున్నారా? రోజూ పరిశీలించుకునేవారు చేతులెత్తండి. రోజూ చేసేవారు, అప్పుడప్పుడూ చేసేవారు కాదు. రోజూ చార్ట్‌ను చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ అవ్వండి ఎందుకంటే సమయపు సూచనను బాప్‌దాదా చాలాకాలం నుండి ఇస్తున్నారు. సమయాన్ని కూడా చూస్తున్నారు. మనుష్యుల మనసులలో చింత కూడా పెరిగిపోతుంది కానీ మీ మనసులో చింత కాదు, ప్రభు చింతన ఉంది. ప్రభు చింతన ఉన్న కారణంగా మేము నిమిత్తులము, నిర్మాణులము ఎందుకంటే చేయించేవారు బాబా అని మీకు తెలుసు. దీని కారణంగా మీ మనసులో చింత లేదు, చేయించేవారు చేయిస్తున్నారు అన్న స్మృతి సదా ముందుకు తీసుకువెళ్తుంది.
ఈ సంగమయుగంలో ఒక్కొక్క సెకండు, సమయము మరియు సంకల్పము శుభంగా జరుగుతున్నాయా అని ఇప్పుడు విశేషంగా పరిశీలించుకోవాలి. ఈ సమయానికి ఉన్న మహత్వాన్ని తెలుసుకుని, ఇక్కడి ఒక్క సెకండు సెకండు కాదు, ఒక్క సెకండ్‌కు కూడా విలువ ఉంది, మహత్వము ఉంది. అప్పుడుప్పుడు పిల్లలు అంటారు, సంకల్పాలు అయితే వచ్చాయి కానీ రెండు నాలుగు సెకండ్లు మాత్రమే అని. కానీ సంగమ సమయానికి విలువ ఉంది, ఇప్పటి ఒక్క సెకండ్ ఒక్క గంటతో సమానము. ఈ సమయానికి ఇంతటి మహత్వము ఉంది. ఎందుకంటే అకస్మాత్తుగా ఏ సమయంలో అయినా మీ ఫైనల్ పేపర్ రావచ్చు అని బాప్‌దాదా చెప్పి ఉన్నారు. బాప్‌దాదా కూడా చెప్పరు కనుక ఈ సమయపు అటెన్షన్ స్వయాన్ని సంపూర్ణంగా మరియు సంపన్నంగా చేస్తుంది. బాప్‌దాదా ఏవైతే సర్వ ఖజానాలను ఇచ్చారో ఆ ఒక్కొక్క ఖజానాను సమయానికి కార్యంలో వినియోగించండి. ఖజానాలకు యజమానులు మీరు, యజమాని విశేషత ఏమిటంటే ఏ సమయంలో ఏ ఖజానా అవసరముంటుందో ఆ సమయంలో ఆ ఖజానాను కార్యంలో పెడ్తాడు. మీరు ఇముడ్చుకునే శక్తిని ఆజ్ఞాపిస్తే ఇముడ్చుకునే శక్తి కార్యంలోకి వస్తుందా? ఎందుకంటే ఎవరైతే సమయానికి తమ ఖజానాలను కార్యంలో వినియోగిస్తారో వారినే యజమాని అని అంటాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయంపై ఇంతటి అటెన్షన్‌ను ఇవ్వాలి. అందరిలో ఉన్న సంతోష ఖజానా సదా ముఖంలో మరియు నడవడికలో కనిపించాలి. అవినాశీ తండ్రి ప్రసాదము ఈ సంతోషము. మరి అవినాశీ తండ్రి ఇచ్చినదానిని అవినాశీగా నిలుపుకోండి. సంతోషం గురించి ఇలా అంటారు - సంతోషమువంటి ఔషధం లేదు, సంతోషమువంటి ఖజానా మరొకటి లేదు. ఎవరిలో అయితే సదా సంతోషము ఉంటుందో వారి నయనాలలో, ముఖంలో, నడవడికలో ఆటోమేటిక్‌గా అది కనిపిస్తుంది. సదా సంతోషంగా ఉండండి మరియు సదా సంతోషాన్ని పంచండి అన్నది బాప్‌దాదా ఇచ్చిన వరదానము. ఎందుకంటే సంతోషాన్ని పంచడం వలన సంతోషం పెరుగుతుంది. మిగతా ఖజానాలైతే పంచడం వలన తరిగిపోతాయి. కానీ సంతోష ఖజానాను ఎంతగా పంచుతారో అంతగా అది పెరుగుతుంది. కావున సంతోష ఖజానా స్థిరంగా ఉందా అని పరిశీలించుకోండి.
ఇప్పుడు పిల్లలందరికీ దేశంవారు కావచ్చు, విదేశం వారు కావచ్చు, పిల్లలందరికీ బాప్‌దాదా ఒక విషయంలో విశేష అభినందనలను తెలియజేస్తున్నారు. ఏ విషయము? దేశంలోకానీ, విదేశంలోకానీ తమ ఉల్లాస-ఉత్సాహాలతో ఆత్మలకు బాబా సందేశాన్ని ఇచ్చారు. అందరూ సంతోషంతో ఏదైతే కార్యాన్ని చేసారో ఆ కార్యంలో ప్రోగ్రామ్ ఒకటి చేసారు, ప్రతి చోట ఒకే కార్యక్రమాన్ని చేసారు కానీ అందుకు ఫలితం వేయి రెట్లను పొందారు. ఇప్పటి సమయ ప్రమాణంగా ఏవైతే పరిస్థితులున్నాయో అవి ముందు ముందు మరింత నాజూకుగా అవ్వనున్నాయి. అందుకే గ్రామంలోకానీ, ఏ మూలన ఉన్నాకానీ మా తండ్రి వచ్చారు కానీ మాకు సందేశం ఇవ్వలేదు అన్న ఫిర్యాదు రాకూడదు అన్నది బాప్‌దాదా సంకల్పము. అందుకే అందరూ ఉల్లాస ఉత్సాహాలతో ఈ కార్యాన్ని చేసారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇలాగే పరస్పరంలో కలుసుకుని ఇటువంటి ప్రోగ్రాములను తయారు చెయ్యండి. తమ ఉల్లాస ఉత్సాహాలను, ధైర్యమును ప్రతి ఒక్కరూ తమ తమ విధి అనుసారంగా కార్యంలో వినియోగించారు కానీ ఇప్పుడైతే అందరూ చాలా బాగా చేసారు. భవిష్యత్తులో కూడా సమయ ప్రమాణంగా ఎవ్వరూ, ఏ మూలన సందేశం మిగిలిపోకూడదు అని గుర్తుంచుకోండి. ఇందులో తమ స్వ పురుషార్థం కూడా మంచిగా అవుతుంది మరియు ఆత్మల కళ్యాణం కూడా జరుగుతుంది. అందరికీ ఈ ప్రోగ్రామ్‌లు మంచిగా అనిపించాయి కదా! మంచిగా అనిపించాయా! బాప్‌దాదా పిల్లలందరికీ పదే పదే ఇదే చెప్తున్నారు - ఆత్మల పట్ల దయాహృదయులుగా అవ్వండి. ఈరోజుల్లో దుఃఖం, అశాంతి కారణంగా అందరూ దయ చూపండి, కృప చూపండి అని మనసుతో అంటున్నారు. మరి బాబాకు సహచరులు పిల్లలైన మీరే కదా. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరి దయా హృదయ పాత్రను చూడాలని బాబా ఆశిస్తున్నారు. ఈ దుఃఖమయ ప్రపంచం మారి సుఖమయ ప్రపంచం రావాలన్నది మీ అందరి ఉత్సాహము. మరి సుఖమయ ప్రపంచం రావడానికి ఈ దుఃఖ అశాంతులు వినాశనం కావడానికి పరిస్థితులు మారుతున్నాయి. కావున ఈరోజు బాబా ఇచ్చే ఈ సందేశాన్ని గుర్తుంచుకోండి - ఇప్పుడు మనసా కావచ్చు, వాచ కావచ్చు, ముఖం మరియు నడవడికతో కావచ్చు సేవా గతిని పెంచుతూ వెళ్ళండి. మీ రాజ్యాన్ని సమీపంలోకి తెచ్చుకోండి. అచ్ఛా.
ఈసారి మొదటి సారి బాప్‌దాదాను కలవడానికి వచ్చినవారు చేతులెత్తండి. అచ్ఛా, చాలా మంది ఉన్నారు. అందరూ లేవండి. అభినందనలు. అయినా సమాప్తి ముందే చేరుకున్నారు. క్రొత్త జన్మను తీసుకున్నారు. ఇందుకు అందరి తరఫున ఇప్పుడు రాబోయే పిల్లలకు బాప్‌దాదా మరియు నలువైపుల ఉన్న పిల్లల ద్వారా అభినందనలు, అభినందనలు. బ్రాహ్మణ పరివారాన్ని చూసి సంతోషంగా ఉంటుంది కదా! కానీ ఎవరైతే ఇప్పుడు వచ్చారో వారికి బాప్‌దాదా ఇదే చెప్తారు - ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది, చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. అందుకే పురుషార్థాన్ని తీవ్రం చేయండి. తీవ్ర పురుషార్థీలు ముందుకు వెళ్తారు, నడవడం కాదు ఎగురుతారు. ఎగిరే కళ యొక్క పురుషార్థాన్ని చేస్తారు. కనుక ఆలస్యంగా వచ్చినా కానీ బాబా వారసత్వంపై తమ పూర్తి హక్కును తీసుకోవచ్చు. ప్రతి సెకండ్ సంతోషంగా ఉండాలి మరియు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. అచ్ఛా.
సేవ టర్న్ యు.పి, బనారస్ మరియు పశ్చిమ నేపాల్ వారిది:- సేవ కోసమై వచ్చినవారు లేవండి. మంచి అవకాశాన్ని తీసుకున్నారు. యు.పి.లో మీ సేవకు స్మృతిచిహ్నాలు చాలా ఉన్నాయి. భక్తి మార్గపు మందిరాలు కూడా చాలా ఉన్నాయి, నదులు కూడా చాలా ఉన్నాయి. మరి యు.పి. వారు నలువైపుల సేవను పెంచుతూ కూడా ఉన్నారు, ఇకపై కూడా పెంచుతూ ఉంటారు. ఇప్పుడు బాప్‌దాదా అన్ని జోన్లకు ఈ విధంగా చెప్తున్నారు - ప్రతి ఒక్కరూ తమ జోన్లో ఎటువంటి గ్రూప్‌ను తయారు చెయ్యండంటే ఆ గ్రూప్‌లో అన్ని వర్గాలవారు ఉండాలి. మీకు వర్గాలు ఉన్నాయి కదా, సేవ కోసం ప్రతి జోన్‌వారు తమ ప్రదేశాలలో ప్రతి వర్గపు సేవను చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కానీ ప్రతి జోన్లో ఎటువంటి సేవా గ్రూప్ ఉండాలంటే అందులో ప్రతి వర్గానికి చెందినవారు ఒకరు ఉండాలి. ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కానీ అక్కడ ఆ గ్రూప్ వారు తమ వర్గానికి విశేష నిమంత్రణను ఇవ్వండి. ఏ వర్గంవారు కూడా మాకు సందేశం అందలేదు అన్న ఫిర్యాదును చెయ్యకూడదు. అంతే కాక వెరైటీ గ్రూపులుగా ఏదైతే అయ్యారో దాని నుండి కూడా సేవను పెంచండి. తమ వర్గము మరియు దానితో పాటు ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానంతో మాకు ఏమి లభించింది మరియు ఏమి అనుభూతి జరిగింది అని తమ తమ అనుభవాన్ని వినిపించండి. ప్రతి జోన్లో ఇటువంటి సేవా గ్రూప్‌ను తయారు చెయ్యండి. భాషణ చెయ్యడానికి అంతగా సమయము లభించకపోయినా కానీ వారిని ఫంక్షన్ సమయంలో వెనుక కూర్చోపెట్టి వారి పరిచయాన్ని స్టేజ్ సెక్రటరీ ఇవ్వాలి. ఒకరిద్దరి అనుభవాన్ని కూడా పెట్టవచ్చు. పరివారంలో ఉంటూ తమ పనులను చేసుకుంటూ మీ జీవితం ఎలా గడిచింది, ఎలా మారింది అన్న అనుభవాన్ని అవకాశం తీసుకుని సమయం ఉంటే వినిపించండి.
బాప్‌దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు – గ్రూప్ సేవను చేసే విశేష మైక్‌లు కావాలి అని. బాగుంది, యు.పి విశేషంగా బ్రహ్మా బాబా పాలనను తీసుకునేందులో అధికారాన్ని పొందింది. యు.పి.లో బ్రహ్మా పేరుతో స్మృతిచిహ్నం కూడా ఉంది. జగదాంబ మరియు బ్రహ్మా బాబాల పాలనను తీసుకున్న యు.పి.కు భాగ్యము. పాలన లభించిన ధరణి. భాగ్య సితార బ్రహ్మా బాబా మరియు జగదాంబ యు.పి.ను వరదానంగా ఇచ్చారు. బాగుంది. ఇప్పుడు రోజురోజుకూ సేవా స్థానాలు, ఉప సేవా కేంద్రాలు మరియు గీతా పాఠశాలలు ముందుకన్నా బాగా పెరుగుతున్నాయి. ఇందుకు బాప్‌దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. ముందుకు వెళ్తూ ఉండండి మరియు నంబరును వృద్ధి చెయ్యడంలో, సందేశం ఇవ్వడంలో నంబర్‌వన్‌ను తీసుకోండి. బాగుంది, బాప్‌దాదా సంతోషిస్తున్నారు, ఇంకా పెంచుతూ వెళ్ళండి. టీచర్లకు అభినందనలు. వృద్ధి చేస్తున్నారు. ఇంతకన్నా కూడా ఎక్కువగా వృద్ధి చేస్తూ ఉండండి. అచ్ఛా.
మహిళ వర్గం మీటింగ్ ఉంది:- మంచిది, ఎప్పటి నుండైతే బాప్‌దాదా కార్యానికి నిమిత్తమయ్యారో అప్పటి నుండి మాతల కళ్యాణము జరుగుతుంది. బాబా ముందుగానే మాతలపై కలశాన్ని పెట్టారు. పాండవులు తోడుగా ఉన్నా కానీ విశేషంగా మాతలు సేవకోసమై ముందు ఉండే విశేషత ప్రారంభమయింది. ఎప్పటి నుండైతే బాప్‌దాదా మాతలకు హోదాను ఇచ్చారో అప్పటి నుండి ప్రభుత్వంలో కూడా ఈ మధ్య మాతలు అన్నిటిలో, ప్రతి కార్యంలో సహయోగాన్ని అందించి అద్భుతం చేస్తున్నారు. సంగమయుగము మరియు బాప్‌దాదా కార్యానికి విశేషత మరియు నవీనత మాతలు. ఎలా అయితే మాతల విశేషత ఇప్పుడు బాప్‌దాదా ఎదుట పెరుగుతూ ఉందో అలాగే ప్రభుత్వంలో లేక ఈనాటి ప్రపంచంలో మాతల వైపు అందరి దృష్టి ఉంది. కనుక ఈ ప్రోగ్రామ్‌ను వైభవంగా చెయ్యండి. మాతలను ఎంతగా ముందుంచండి అంటే మాతల శక్తి, మాతల పాలన ఎంత ఉన్నతమైనవి అని అందరూ చూడాలి. ఇప్పుడు మాతలు పరివారంలో ఉంటూ తమ పిల్లలను ఎటువంటి ఉదాహరణగా తయారు చెయ్యండంటే ఇంటిని ఆశ్రమంగా ఎలా తయారు చేసుకోవాలి, పిల్లలు ఎలా తమ మర్యాదలలో ఉంటున్నారు అని బాప్‌దాదా చెప్పడానికి మీ ఇల్లు సాంపుల్‌గా కావాలి. పిల్లలు మారాలి అన్న అభిప్రాయం ప్రభుత్వ సమస్య. దానిని మాతలు ప్రాక్టికల్‌గా ఎలా చూపించాలంటే ఈ మాతలు పిల్లల కళ్యాణం కూడా చేస్తున్నారు అని ప్రభుత్వం ఆలోచించాలి. ఎవరైతే స్వయం తయారయ్యారో వారు పిల్లలను ఎలా తయారు చెయ్యాలంటే వీరు ఎంతటి అద్భుతాన్ని చేస్తున్నారు అని ప్రభుత్వానికి కనిపించాలి. బాగుంది. మాతల ప్రోగ్రామ్ పెట్టడం వలన మాతలకు ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి, అప్పుడు వారు ఇతరుల సేవనూ చెయ్యగలరు. బాగుంది, సఫలత ఉండనే ఉంది. అచ్ఛా.
ఇండోర్ హాస్టల్ కుమారీలతో:- బాగుంది, కుమారీలు స్వయాన్ని శక్తి రూపాలుగా భావించండి. మేము కుమారీలము కాదు, శివ శక్తులము. ఈ పరివర్తనతో ఎంతటి అద్భుతాన్ని చేసి చూపించండంటే మీలోని పరివర్తన యొక్క ప్రత్యక్ష రూపమును మీ ముఖము మరియు నడవడికతో సేవలో సాక్షాత్కారం చేయించండి. ఎలా అయితే మీరు పెద్దక్కయ్యలను, దాదీలను చూస్తారు కదా, వారి ప్రభావమును ప్రజలు చూడవలసిందే, వైబ్రేషన్ ఉంటుంది. అలాగే మీరు ఒక్కొక్క కుమారి మీలో ఎంతగా శక్తిని నింపుకోవాలంటే మీరు ఎక్కడకు వెళ్ళినా, ఎవరి సేవను చేసినా వీరు సాధారణ కుమారీలు కాదు, శక్తులు, దేవతలు అని అనుభవం కావాలి. మీ ముఖంలో తండ్రి ముఖము, బ్రహ్మా బాబా పాలనా ప్రభావము కనిపించాలి. చివరలో ఇటువంటి సేవా పాత్రయే జరుగనుంది. కనుక ప్రతి ఒక్క కుమారి ఇంతటి శక్తిని స్వయంలో నింపుకోవాలి. బాగుంది, మంచిగా నడుస్తున్నారు, ముందుకు కూడా వెళ్తున్నారు కానీ ఇప్పుడు మీ ముఖము, నడవడిక అతీతంగా మరియు ప్రియంగా కనిపించాలి. ఇకపోతే అంతా మంచిగా ఉంది, బాప్‌దాదా సమాచారాన్ని వింటూ ఉంటారు. ఒక్కొక్కరు సెంటర్‌ను సంభాళించే యోగ్యమైన హ్యాండ్‌గా అవ్వండి అప్పుడు ఎన్ని సెంటర్లు తెరుచుకుంటాయి! ప్రతి ఒక్క కుమారి సెంటరును సంభాళిస్తుంది అన్న రిజల్టును బాప్‌దాదా చూస్తారు. ప్రతి కుమారి ఒక సెంటర్‌ను సంభాళించే యోగ్యతను నింపుకోండి. ఇంతటి యోగ్యులుగా అవ్వండి. ఈరోజుల్లో టీచర్లు సేవకు అవసరము. కానీ నిర్విఘ్న టీచర్‌గా కావాలి. నిర్విఘ్న టీచర్‌గా అయి ఉల్లాస ఉత్సాహాలతో ఎంత ఎగురుతున్నారు అని వ్రాసి పంపండి. మీ జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు, చాలా మంచిది. వీరు భవిష్యత్తులో నిర్విఘ్న నంబర్‌వన్ టీచర్‌గా అవ్వాలని కుమారీలకు అందరూ ఆశీర్వాదాలను ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి. హ్యాండ్స్ యొక్క అవసరము ఉంది కదా. విదేశాలలో కూడా కావాలి. నిర్విఘ్న టీచర్, నిర్విఘ్న టీచర్ అన్నదానిని ముఖ్యంగా అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు బాప్‌దాదా వద్దకు రిజల్ట్ వస్తుంది, సరేనా. ఇటువంటి లక్ష్యమే ఉంది కదా! అచ్ఛా.
ఈ గ్రూప్‌లో క్యాడ్వారు(దిల్వాలే) కూడా వచ్చారు:- బాగుంది, ప్రతి ఒక్కరూ పరస్పరంలో సలహా తీసుకుని మీ సేవను ముందుకు తీసుకు వెళ్తున్నారు, ఉల్లాస-ఉత్సాహాలను ఇచ్చుకుంటూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. స్వయాన్ని ఈ కార్యంలోనే బిజీగా ఉంచుకుంటున్నారు కనుక అందుకు రిజల్ట్‌గా పురుషార్థం యొక్క బలము కూడా లభిస్తుంది మరియు ఫలము కూడా లభిస్తుంది. ఎన్ని ప్లాన్లు అయితే చేస్తున్నారో, ఎన్నిటిని ప్రాక్టికల్లోకి తీసుకు వస్తున్నారో వాటన్నిటికీ బాప్‌దాదా తరఫున ప్రతి గ్రూప్‌కు విశేషమైన సకాశ్ ద్వారా కూడా బాప్‌దాదా సహయోగాన్ని ఇస్తారు. బాగుంది. ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు నడిపిస్తూ ఉండండి. అచ్ఛా.
కాల్ ఆఫ్ టైమ్ అతిథులతో:- లక్కీ మీరు, మీ భాగ్యమే మీ అందరినీ ఇక్కడకు తీసుకు వచ్చింది. ఇప్పుడు ఈ భాగ్యాన్ని పెంచుతూ ఉండండి. పెంచడానికి సాధనము ఏమిటి? ఒకటి కనెక్షన్ తప్పకుండా పెట్టుకోవాలి. కనెక్షన్కన్నా ముందు ఈ బ్రాహ్మణ పరివారంతో, బాప్‌దాదాతో రిలేషన్‌ను ముందుకు తీసుకు వెళ్తూ ఉండండి. ఎంతగా కనెక్షన్ రిలేషన్ పెట్టుకుంటారో అంతగా తరగని ఖజానాలు జమ అవుతూ ఉంటాయి. ఖజానాలకు యజమానిగా అయిపోతారు. ఏ సమయంలో ఏ శక్తి కావాలో, ఏ గుణం కావాలో దానిని అనుభవం చేస్తూ ఉంటారు. బాగుంది. ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేసారో, చేస్తూ ఉంటారు, బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది. మధువనంలోకి, ఇండియాకు రావడం ఇష్టమే కదా! నచ్చుతుందా? చూడండి, మిమ్మల్ని చూసి ఇండియాలోని మీ సోదరసోదరీలు కూడా సంతోషిస్తారు. అందరి మనసులలో మా సోదరసోదరీలు వచ్చేసారు, వచ్చేసారు అని ఉంది. సంతోషమేస్తుంది. చూడండి, మీరు కూడా సంతోషిస్తారు. ఇంత పెద్ద పరివారాన్ని ఎక్కడైనా విన్నారా, చూసారా! ఇప్పుడు చూడండి, మీ పరివారము ఎంత పెద్దదో! కావున పిల్లలు ప్రతి ఒక్కరూ బాప్‌దాదా యొక్క పదమారెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. అచ్ఛా.
40 దేశాల నుండి 300 మంది డబల్ విదేశీ సోదరసోదరీలు వచ్చారు:- బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ సంగఠన ఇక్కడి భారతదేశ సోదరసోదరీలకు కూడా నచ్చుతుంది. బాప్దాదాకైతే ఎలాగూ నచ్చింది. ప్రతి సంవత్సరము రాబోవు సేవల గురించి మరియు స్వ చార్ట్ రెండింటి గురించి పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోవడం చేసి ఇతరుల ఉల్లాస ఉత్సాహాలను పెంచుతారు, ఇది చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మీ అందరినీ కూడా ఇంతమంది సోదరసోదరీలు కలుస్తారు, చూస్తారు, సంతోషిస్తారు. అది చూసి మీరు కూడా సంతోషిస్తారు కదా! బాగుంది, బాప్‌దాదా డైరెక్షన్లను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే ఉల్లాస ఉత్సాహంతో ఒకరికొకరు అటెన్షన్‌ను ఇప్పించుకుంటారు. పురుషార్థాన్ని చల్లబర్చే సమస్యను ఇతరులకు వినిపించడం వలన, స్పష్టం చేయడం వలన పురుషార్థంలో తీవ్రగతి వస్తుంది. ఇతర సోదరసోదరీలను కలిసి ఒక్కొక్కరి పురుషార్థాన్ని చూసి ముందుకు కూడా వెళ్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ బాప్‌దాదాకు నచ్చింది. మీకు కూడా ఇష్టమే కదా! ఇష్టమేనా? పాండవులకు ఇష్టమేనా? మంచిది. ఇప్పుడైతే బాప్‌దాదా డబల్ పురుషార్థీ పిల్లలందరికీ నంబర్‌వన్‌గా అయ్యే సూచనను ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సెంటర్ మరియు దాని కనెక్షన్‌లోకి వచ్చే సెంటర్ నిర్విఘ్నంగా మరియు తీవ్ర పురుషార్థి గతితో నంబర్‌వన్‌గా కావాలి. ఎవరైతే నంబర్‌వన్‌గా అవుతారో వారికి బాప్‌దాదా బహుమతిని ఇస్తారు. స్వయమైతే అయ్యారు కానీ అందరినీ కూడా తోడుగా తీసుకువెళ్ళాలి కదా. సంగఠనను కూడా గట్టిగా చెయ్యాలి. మరి నంబర్‌వన్ ఎవరు తీసుకుంటారో చూస్తాము! ఎవరు తీసుకున్నా, ఎంత తీసుకున్నా బాప్‌దాదాకు సంతోషమే. సరేనా! మేము ఎగరాలి మరియు ఎగిరించాలి అన్న లక్ష్యాన్ని ఇప్పటి నుండి పెట్టుకోండి. నడిచేవారు కాదు, ఎగిరేవారు, ఎగిరే కళ యొక్క సర్టిఫికేట్‌ను తీసుకోవాలి. అప్పుడప్పుడూ కాదు, సదా ఎగిరే కళ. తీసుకుంటారు కదా! సర్టిఫికేట్ తీసుకుంటారా? ఇప్పుడు ప్రతి రోజూ ఏదో ఒక విషయంలో ఉన్నతిని తీసుకురండి. నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి, నాలుగు సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్ట్‌ను లక్ష్యంగా పెట్టుకుని దానిని ప్రాక్టికల్లోకి తీసుకువచ్చి తమ చార్ట్‌ను ముందుకు తీసుకు వెళ్ళండి. అచ్ఛా. బాబా ఏదైతే ఆశిస్తున్నారో దానిని ప్రాక్టికల్లోకి తీసుకువస్తూ తమ చార్ట్‌ను రోజూ బాప్‌దాదాకు ఇచ్చే పిల్లలను విదేశాలలో బాప్‌దాదా చూసారు. పురుషార్థం మంచిగా ఉంది కావున ఇటువంటి గుప్త పురుషార్థీలకు అమృతవేళ రోజూ విశేషమైన అభినందనలను తెలుపుతున్నాము. ముందుకు వెళ్తూ ఉండండి, తీవ్ర పురుషార్థీలై ఎగురుతూ ఉండండి. అచ్ఛా.
సర్వ్ ఇండియా ప్రోగ్రామ్ ఆరంభ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది:- (నిజార్ అన్నయ్యతో) వీరు కూడా కార్యం చేస్తున్నారు, సేవా ప్లాన్‌ను చూసి, ఉల్లాస ఉత్సాహాలను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. సఫలత పిల్లలు ప్రతి ఒక్కరి జన్మ సిద్ధ అధికారము అని బాప్‌దాదా వరదానము ఉంది. కావున సఫలత ఉంటుంది, అందర్నీ తోడుగా చేసుకుని సహయోగిగా చేసుకుని నడుస్తున్నారు మరియు నడుస్తూ ఉంటారు. అభినందనలు. శ్రమించారు, ఎంతో మంచి కృషిని చేసారు. ఉల్లాసం మంచిగా ఉంది. ఎక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. హైదరాబాద్ వారు లేవండి, టీచర్ ఎక్కడ ఉన్నారు? చూడండి, మొదటి నంబర్ హైదరాబాద్‌కు అవకాశం లభించింది. ప్రతి ఒక్కరూ తమ యథాశక్తి సహయోగాన్ని ఇచ్చారు మరియు సేవా పాత్రను ఎంతో మనస్ఫూర్తిగా, పెద్ద మనసుతో చేయడం బాప్‌దాదాకు మంచిగా అనిపించింది. ఏదైతే చేసారో అది చాలా బాగా చేసారు, మంచి ధైర్యాన్ని ఉంచారు. ధైర్యమున్న వారికి బాబా సహాయము ఉండనే ఉంటుంది. అచ్ఛా.
మరి ఈరోజు బాప్‌దాదా ఏదైతే చెప్పారో, స్వరాజ్య అధికారిగా అయి స్వరాజ్యపు రిజల్ట్‌ను పరిశీలించుకోండి. దానిని చెక్ చేసుకోవడం వలన ఎటువంటి లోపమునైనా చాలా సమయంనుండి ఛేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతోకాలము అఖండ రాజ్యము ఉండాలి. ఇందుకు బహుకాలపు పురుషార్థము అవసరము. బహుకాలపు ప్రాలబ్ధంతో స్వతహాగనే అధికారులుగా అవుతారు అందుకే బహుకాలపు పురుషార్థము అన్న పదము అండర్లైన్ చెయ్యండి. చెకింగ్ చేసుకోండి, ఛేంజ్ అవ్వండి.
నలువైపుల ఉన్న బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులైన ప్రతి ఒక్కరికీ బాప్‌దాదా రోజూ అమృతవేళ విశేషంగా శక్తిని పంచుతారు. అమృతవేళ విశేషంగా వరదానాలు, శక్తులను పంచుతారు. ఎవరైతే అమృతవేళలోని శక్తిని, విశేష వరదానాన్ని స్వీకరిస్తారో వారు విశేషంగా తీవ్ర పురుషార్థీలవుతారు. అమృతవేళకు మహత్వాన్ని ఇవ్వడము అంటే బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులుగా సదా ఉండటము. కనుక, కొంతమంది పిల్లలకు అటెన్షన్ ఉంది, బాప్‌దాదా వారికి ప్రత్యేకంగా రోజూ సర్టిఫికేట్‌ను ఇస్తారు మరియు వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు.
నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థీలకు, ప్రతి సమయము బాప్‌దాదాను తమ సహచరునిగా చేసుకుని కంబైన్డ్‌గా ఉండే అలవాటున్న పిల్లలకు విశేషంగా వరదానాన్ని ఇస్తున్నాము - సదా ఎగురుతూ ఉండండి మరియు ఇతరులకు కూడా ఎగిరే సహకారాన్ని అందించి ఎగిరిస్తూ ఉండండి. అందరూ విజయులే మరియు విజయానికి ఫలితంగా బాప్‌దాదా దీవెనలు ప్రతి క్షణము మనకు లభిస్తాయి. అమరులుగా అయి అందరికీ అమృతాన్ని త్రాగిస్తూ ఉండండి. నలువైపుల ఉన్న పిల్లలు బాప్‌దాదా ఎదుట కూర్చుని ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిపై బాప్‌దాదాకు హృదయపూర్వక ప్రేమ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది. ఇప్పుడు సర్వ విశేషతలతో స్వయాన్ని విశేష ఆత్మగా చేసుకుని ముందుకు సాగుతూ వెళ్ళండి. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ పర్సనల్‌గా ఇచ్చే పదమారెట్లు ప్రియస్మృతిని స్వీకరించండి. అచ్ఛా - ఇప్పుడైతే ఇక కలుస్తూనే ఉంటాము. నమస్తే.
దాదీలతో:- అందరూ బాగా తిరిగి వచ్చారు. ఈరోజుల్లో అశాంతి పెరుగుతూ ఉంది కనుక రోజంతా అలజడిలోకి వచ్చేస్తున్నారు. ఎవరైనా బాగా అలసిపోతే వారికి అర్థగంట విశ్రాంతి లభించినా సంతోషిస్తారు అలాగే శాంతి వైబ్రేషన్లు శాంతిని తీసుకువస్తాయి, అప్పుడు సంతోషిస్తారు. మంచిగా చేసారు. అన్ని చోట్ల, చిన్నదైనా పెద్దదైనా అందరూ బాగా చేసారు. ఎక్కడ ఉల్లాసం ఉంటుందో అక్కడ ఖర్చు గురించిన మాటే ఉండదు. ఇన్ని ఆత్మలకు సందేశమైతే లభించింది కదా! మీ ఫిర్యాదైతే సమాప్తమైపోయింది. బాగుంది. ఇలా మధ్య మధ్యలో ప్రోగ్రామ్‌లు చేస్తూ ఉండండి. ప్రతి పట్టణము తమ అనుసారంగా ఎలా చేసినా అది మంచిదే.
పర్దాదీతో:- వీరు ధైర్యం ఉన్నవారు, పిల్లలు ధైర్యముంచితే తండ్రి సహాయం చేస్తారు.
రమేష్ అన్నయ్య, ఉష అక్కయ్యతో:- ఏది జరిగినా కానీ దానిని అవాయిడ్ చేసి సంతోషంగా ఉంటారు. సంతోషం నిశ్చింతగా చేసి ముందుకు తీసుకువెళ్తుంది, ఇదే మందు. త్రిమూర్తులు ఉన్నారు(అనిలా సోదరి కూడా ఉన్నారు) మరియు నాల్గవవారు వారిని సంభాళించేవారు. మీది కూడా అద్భుతమే. అందర్నీ ఎంతో మనస్ఫూర్తిగా సంభాళిస్తున్నారు, మంచిగా చేసారు. సేవ యొక్క ఫలము మరియు బలము లభిస్తున్నాయి. నా ఖాతాలో ఎంతో భాగ్యం జమ అవుతుంది అని సంతోషిస్తున్నారా! అచ్ఛా (రమేష్ అన్నయ్యతో) ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు ఆలోచించద్దు, ఆలోచించడాన్ని వదిలిపెట్టండి. బాబాపై వదలెయ్యండి. తేలికగా ఉండండి మరియు తేలికగా చేసుకుని నడవండి.
ఉష అక్కయ్యగారి లౌకిక సోదరితో:- వీరిని చూసి సంతోషపడ్తారు కదా. వీరు తమ జీవితాన్ని ఎంత మంచిగా చేసుకున్నారు. మీరు కూడా చేసుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు కదా. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. సంతోషము వంటి ఔషధం మరొకటి లేదు. సంతోషంగా ఉండండి మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని పంచండి.
అంకుల్-ఆంటీ తరఫున బృజ్‌మోహన్ అన్నయ్య, గాయత్రి అక్కయ్య బాప్‌దాదాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు:- మంచి పుష్పగుఛ్ఛాన్ని తయారు చేసారు. పునాది పక్కాగా ఉంది. కష్టమొచ్చినా, ఏమొచ్చినా కానీ వారు మస్తీలో మస్త్ అయి ఉంటారు. దాని ప్రభావం పరివారంపై పడుతుంది. డాక్టర్ కూడా ఈ పేషంట్ అద్భుతంగా ఉన్నారని భావిస్తాడు, అందుకే సేవ చేస్తున్నారు. వారి ముఖము సేవ చేస్తుంది. వారికి పదమ్ పదమ్ పదమారెట్ల ప్రియస్మృతులు. ఆంటీ కూడా గుప్తంగా ఉన్నారు. పూర్తి పరివారం లక్కీ. (గాయత్రి అక్కయ్యతో) వీరైతే ఎదురుగానే నిల్చుని ఉన్నారు. వీరిలో ఒక విశేషత ఉంది, అది ఏమిటో తెలుసా? ఏమి జరిగినా, బాబాను గుర్తు చేసి బాబా నుండి శక్తిని తీసుకుంటారు. డోంట్‌కేర్ చేసేస్తారు. (విశేష ఆత్మలను కూడా చేస్తారు) వారి వెనుకపడి వారి పాలనను చేస్తూ ఉన్నారు. పరివారము లక్కీ.
ముగ్గురు పెద్ద అన్నయ్యలతో:- ఇప్పుడు ముగ్గురూ అద్భుతాన్ని చేసి చూపించండి. ఒకరు చెప్పారు, మరొకరు తమ ఆలోచనను వినిపించాలి. కానీ ఆలోచన ఇచ్చిన వెంటనే అతీతము మరియు ప్రియంగా అయిపోవాలి. ఇప్పుడు అందరి దృష్టి ఉంది. (ఈ మెగా ప్రోగ్రామ్‌లను ముందు కూడా చెయ్యమంటారా) ఇప్పుడు మెగా అని అనకండి. ఎవరు చెయ్యాలనుకుంటే వారు తమ యథాశక్తి చెయ్యనివ్వండి, అభ్యంతరం లేదు. అచ్ఛా.
డబల్ విదేశీ పెద్దక్కయ్యలతో:- గ్రూప్ గ్రూప్‌ను పిలిచి రిఫ్రెష్ చెయ్యడము బాప్‌దాదాకు నచ్చుతుంది ఎందుకంటే అక్కడ చాలా దూరదూరాలలో ఉంటారు. దగ్గరకు వచ్చినప్పుడు ఇతరుల గుణాలు కనిపిస్తాయి. దూరదూరాలలో ఉన్నప్పుడు తెలియదు. ఒకరిని చూసి మరొకరికి కూడా ఉత్సాహం వస్తుంది. ఆబూలో ఈ ప్రోగ్రామ్ బాగుంది. ఇతరులలో ఉత్సాహాన్ని నింపి సంగఠనను పక్కా చేస్తున్నారు, ఇది బాగుంది. సరేనా. అంతా మంచిగా ఉంది కదా.
ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకోవడం ద్వారా ముందుకు వెళ్తారు. సమయాన్ని కేటాయిస్తారు కదా. తమ సేవను వదిలిపెట్టి సమయాన్ని మనస్ఫూర్తిగా ఇస్తారు. తమ కార్యం పూర్తయింది, సఫలత లభించింది, ఇప్పుడు ఇక వెళ్ళండి. అందరూ మంచిగా సహకరించారు. ఫారెన్‌కు కూడా చేసారు, ఇండియాకు కూడా చేసారు.
(లండన్వారు విశేషంగా ప్రియస్మృతులు తెలిపారు. పిల్లలు అమాయకులు అని బాబా మురళిలో చెప్పారు. మరి మేము అమాయకులమా అని అడిగారు) వారికి చెప్పండి, అమాయకులు కాదు హృదయ సింహాసనాధికారులు అని)
(టాటానగర్ సమాచారం బాప్‌దాదాకు వినిపించారు) ఈసారి అందరూ మనస్ఫూర్తిగా చేసారు మరియు రిజల్ట్ కూడా బాగా ఉంది. అన్ని చోట్లది మంచిగా ఉంది.
ఓంశాంతి