Search for a command to run...
30 Nov 2009
తండ్రికి మరియు సర్వులకు ప్రియులుగా అవ్వాలంటే సంతుష్టమణిగా అయ్యి ప్రతి పరిస్థితి యొక్క ప్రభావం నుండి ముక్తులై ఉండండి
30 November 2009 · తెలుగు
ఈరోజు నలువైపుల ఉన్న సంతుష్ట ఆత్మలను చూస్తున్నాము. సంతుష్టమణులు తమ మణి యొక్క మెరుపును నలువైపుల వ్యాప్తి చేస్తున్నారు. సంతుష్టతయే అన్నిటికన్నా పెద్ద స్థితి. సదా సంతుష్టత సర్వులకు ప్రియంగా ఉంటుంది. బాబాకూ ప్రియమే. ఎవరి వద్ద అయితే సర్వ ప్రాప్తులు ఉంటాయో వారే సదా సంతుష్టంగా ఉండగలరు. ప్రాప్తులకు ఆధారము సంతుష్టత అందుకే ఇటువంటి ఆత్మలు సర్వ బ్రాహ్మణాత్మలకు ప్రియమైనవారు. సర్వ ప్రాప్తులు అనగా సదా సంతుష్టత. సంతుష్ట ఆత్మ ప్రభావము వాయుమండలంలో కూడా పడుతుంది. సర్వ ప్రాప్తులు పరమాత్ముని ప్రసాదము. పరమాత్మ తండ్రి ద్వారా సర్వ శక్తులు, సర్వ గుణాలు, సర్వ ఖజానాలను పొంది ఉన్న ఆత్మ సదా సంతుష్టంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ యొక్క స్థితి సదా ప్రగతిశీలంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మపై పరిస్థితి ప్రభావం చూపలేదు ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడకు సర్వ శక్తులు, సర్వ గుణాలు స్వతహాగానే వస్తాయి. ఒక్క సంతుష్టత అనేక గుణాలను తన సొంతం చేసుకుంటుంది. కావున ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను సదా సంతుష్టంగా ఉంటున్నానా! సంతుష్ట ఆత్మ సదా సర్వులకు, తండ్రికి సమీపంగా మరియు సమాన స్థితిలో ఉంటుంది. కానీ ఈ స్థితిలో ఉండటానికి ఎంతో సాక్షి దృష్టి స్థితి కావాలి, త్రికాలదర్శి అవస్థ కావాలి. ప్రతి కర్మను త్రికాలదర్శి అనగా ప్రతి విషయాన్ని మూడు కాలాలలో పరిశీలించిన తర్వాత కర్మను చేయాలి. ఇందుకోసం రెండు విషయాలు అవసరము. ఆ రెండు విషయాలు సంబంధము మరియు సంపద. సంబంధము కూడా అవినాశీ మరియు సంపద కూడా అవినాశీ - ఇవి అవినాశీ తండ్రి ద్వారా ప్రాప్తి అవుతాయి. అవినాశీ సంపద మరియు అవినాశీ సంబంధము ప్రాప్తి అయినప్పుడు ఆత్మ సదా సంతుష్టంగా మరియు తండ్రికి, సర్వాత్మలకు అతి ప్రియంగా అవుతుంది. మాయా రూపంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ గాబరా పడరు. అనంతమైన తెరపైన మిక్కీ మౌస్ ఆట జరుగుతున్నట్లుగా అనుభవమవుతుంది. కలత చెందరు, మిక్కీ మౌస్ ఆటను చూసి మనోరంజనాన్ని పొందుతారు. మాయ యొక్క భిన్న భిన్న రూపాలు, భిన్న భిన్న మిక్కీ మౌస్ రూపాలుగా అనిపిస్తాయి. ఇటువంటి స్థితి యొక్క అనుభూతిని బాబా ద్వారా అందరూ చేసుకోవలసిందే మరియు చేసుకున్నారు కూడా.
నిర్భయులు, ఏకాగ్ర బుద్ధి కలవారు, విజయి ఆత్మలు ఎటువంటి పరిస్థితిలోనూ అలజడిలోకి రాకపోవడాన్ని బాప్‌దాదా చూసారు. ఇటువంటి విజయి ఆత్మలు - సదా బాబాకు పిల్లలందరి పట్ల ఉన్న శుభ ఆశ ఏమిటంటే ప్రతి ఒక్కరూ సదా విజయులుగా అయ్యి బాబాకు తమ విజయి స్వరూపాన్ని చూపించాలి. మరి ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి నేను ఎవరిని? అప్పుడప్పుడూ అన్న పదము సమయానుసారంగా ఇప్పుడు బ్రాహ్మణ డిక్షనరీ నుండి సమాప్తం చేసెయ్యండి అని బాప్‌దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు. బాబా నుండి వారసత్వాన్ని సదా కోసం తీసుకోవాలన్నప్పుడు ప్రతి ప్రాప్తి సదా ప్రాప్తి అయి ఉండాలి ఎందుకంటే బాబా హృదయ ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలు మీరు. వారి సంకల్పంలో కూడా అప్పుడప్పుడూ అన్న పదము రాదు, ఎందుకని? సదా తండ్రి తోడుగా మరియు తండ్రి సహచరునిగా ఉన్నారు. తోడుగా ఉండేవారు కూడా మరియు సహచరునిగా అయి విశ్వ పరివర్తన కార్యాన్ని చేసేవారు.
మరి చెప్పండి, సదా అన్న ఈ వరదానాన్ని బాప్‌దాదా ద్వారా ప్రాప్తి చేసుకున్నారు కదా! జన్మ తీసుకోగానే బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ సదా యోగి భవ, పవిత్ర భవ అన్న వరదానాన్నే ఇస్తారు. ఆ వరదానాల ద్వారా ఏవైతే ప్రాప్తిస్తాయో అవి సదా ఉంటాయి. అప్పుడప్పుడూ కాదు. మరి పిల్లలందరూ సదా అధికారులు ఎందుకంటే బాబాకు పిల్లలైన ప్రతి ఒక్కరిపై, చివరన ఉన్న పిల్లవాడిపై కూడా, ప్రతి ఒక్కరిపై బాబా మనసులో ప్రేమ ఉంది ఎందుకంటే ఎవరైతే పెద్ద-పెద్ద వారున్నారో, తమను తెలివైనవారిగా భావిస్తున్నారో వారు కూడా బాబాను గుర్తించలేకపోయారు, కానీ బాప్‌దాదా యొక్క చివరి పిల్లవాడు కూడా బాబాను గుర్తించాడు. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటాడు. అందుకే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై అవినాశీ ప్రేమ ఉంది అందుకే పిల్లలందరికీ బాబా వరదానమూ ఉంది. నంబరువారీగా ఉన్నా కానీ బాప్‌దాదా రోజూ ఒకే సమయంలో, ఒకే వరదానాన్ని పిల్లలందరికీ కలిపి ఇస్తారు. పిల్లలు నంబరువారీగా ఉన్నాకానీ నా బాబా అన్నారంటే వరదానానికి అధికారులుగా అయిపోయినట్లే. పిల్లలు ఎక్కడ ఉన్నా కానీ, ఇండియాలో ఉన్నా లేక విదేశాలలో ఉన్నా కానీ పిల్లలందరికీ వరదానమైతే బాప్‌దాదా నుండి ఒక్కటిగా లభిస్తుంది. వరదానాన్ని పొంది సంతోషిస్తారు కూడా. కానీ రెండు ప్రకారాల పిల్లలు ఉన్నారు. ఒకరు - వరదానాన్ని చూసి తప్పకుండా సంతోషిస్తారు కానీ ఇది నా వరదానము అని వరదానాన్ని చూసి కేవలం సంతోషపడేవారు, వర్ణించేవారు కాక వరదానాన్ని ఫలవంతం చేసేవారు ముందు నంబర్‌ను తీసుకుంటారు. వరదానం నుండి లాభం తీసుకుని వరదానం నుండి ఫలాన్ని పొందుతారు. బీజము ఉంది కానీ బీజాన్ని ఫలవంతం చేయకపోతే, ఫలాలను తీసుకురాకపోతే కేవలం సంతోషము ఉంటుంది. వరదానము నుండి ఫలాన్ని తీసుకురావడానికి - బీజము నుండి ఫలాన్ని తీసుకురావాలంటే దానికి నీరు మరియు ఎండ కావాలి, అప్పుడే ఫలాలు వస్తాయి. అలాగే ఇక్కడ కూడా పిల్లలు వరదానము నుండి ఫలాన్ని తీసుకోవాలి, ఆ ఫలం ద్వారా విస్తారం జరగాలి, తమ మనసులోనే వరదానం నుండి వచ్చిన ఫలం ద్వారా వృద్ధి జరగాలి. ఇక్కడ కూడా బాబా అంటారు వరదానం నుండి ఫలాన్ని తీసుకోవడానికి పదే-పదే వరదానాన్ని స్మృతిలోకి తీసుకురండి. స్మృతి స్వరూప స్థితిలో ఉండండి. పదే-పదే స్మరణ కాదు, స్మృతి, ఇది నీరు ఇవ్వడము మరియు స్వరూపంలో స్థితి అవ్వడము అంటే ఎండను అందించడము. ఇలా ఇది ఫలవంతం అయినప్పుడు స్వయంలో కూడా ఎంతో శక్తి నిండుతుంది మరియు ఇతరులకు కూడా ఆ ఫలం ద్వారా శక్తి యొక్క అనుభవాన్ని చేయించగలరు.
ఇప్పుడు బాప్‌దాదా ఏమి కోరుకుంటున్నారు? ఎందుకంటే బాప్‌దాదా కొద్ది సమయము నుండి సమయము గురించి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. పిల్లల చదువు యొక్క రిజల్ట్ అకస్మాత్తుగా రానుంది. ఇందుకోసం సదా ఎవరెడీ. దీనితోపాటు బాప్‌దాదా ఈ సూచనను కూడా ఇస్తున్నారు - ఇప్పుడు ఎగిరే కళ మరియు తీవ్ర పురుషార్థం చేసే సమయము. నడుస్తున్నాము కాదు, ఎగురుతున్నాము. సాధారణ రీతిగా తమ దినచర్యను గడపడము, ఇప్పుడు ఈ విధంగా సాధారణంగా పురుషార్థం చేసే సమయము గడిచిపోయింది. అందుకే బాప్‌దాదా సూచన ఇస్తున్నారు - ప్రతి క్షణము, ప్రతి సంకల్పమును పరిశీలించుకోండి. ఉదాహరణకు తీవ్ర పురుషార్థం చెయ్యకుండా ఒక గంట సాధారణ పురుషార్థంలో ఉన్నట్లయితే ఆ ఒక్క గంటలోనే అకస్మాత్తుగా ఒకవేళ ఫైనల్ పేపర్‌కు సమయము వస్తే అప్పుడు అంతిమ మతి సో గతి అవుతుంది, ఆ ఒక్క గంట సాధారణ పురుషార్థం ఎంత నష్టపరుస్తుంది! అందుకే బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ, ప్రతి సంకల్పము, ప్రతి క్షణము సమయ మహత్వాన్ని గురించి సమయానుసారంగా సూచనను ఇస్తూనే ఉన్నారు. అలజడి సమయంలో అచలంగా ఉండే పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థీలే చెయ్యగలరు. సాధారణ పురుషార్థము ఉంటే ఎవరెడీగా అవ్వడంలో ఎక్కువ సమయం పడుతుంది. మరి బాప్‌దాదా అయితే ఒక్క క్షణంలో బిందువు అనగా ఫుల్స్టాప్ పెట్టాలి అని చెప్పారు. ఒకవేళ తీవ్ర పురుషార్థిగా లేకపోతే ఏమవుతుంది? అనుభవీలే కదా. ఫుల్‌స్టాప్‌కు బదులుగా ప్రశ్న చిహ్నం రావడం లేదు కదా! బిందువు ఎంత సహజమైనది, ప్రశ్న చిహ్నము ఎంత వంకరగా ఉంటుంది. ఫుల్స్టాప్ అనగానే ఫుల్స్టాప్ పడిపోవాలి. కామా చిహ్నం కూడా రాకూడదు, ఆశ్చర్య చిహ్నం కూడా రాకూడదు. ఏమి చెయ్యను అని ఆలోచించడానికి కూడా సమయం లభించదు. ఇంత ఫాస్ట్‌గా పురుషార్థం చేస్తేనే పేపర్లో పాస్ అవుతాము అని పిల్లలెవ్వరూ ఊహించి ఉండరు.
ఇప్పటికీ కొన్ని కారణాల వలన ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా... ఇవి కొంతమంది పిల్లల చార్ట్‌లో రోజూ కనిపిస్తూ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. ఎంతోమంది పిల్లల చార్ట్‌లో వ్యర్థ సంకల్పాల అల ఎక్కువ సమయాన్ని తీసుకోవడం బాప్‌దాదా చూసారు. వ్యర్థం యొక్క వేగం ఎంత తీవ్రంగా ఉందంటే సాధారణ సంకల్పాల ఒక్క గంట ఫాస్ట్ సంకల్పాల ఒక్క నిమిషముతో సమానము. అందుకే ఈరోజు సర్వులకు ప్రియులు, బాప్‌దాదాకు ప్రియమైన సంతుష్ట ఆత్మలు ఎవరెవరు అని చూస్తున్నాము. సంతుష్ట ఆత్మల సంకల్పంలో కూడా ఇది ఎందుకు, ఏమిటి అన్న భాష స్వప్నంలో కూడా రాదు ఎందుకంటే ఆ ఆత్మకు మూడు విశేషమైన విషయాలు, మూడు బిందువులు గుర్తుంటాయి, ఆత్మ, పరమాత్మ మరియు డ్రామా, మూడింటినీ సమయానికి వినియోగించగలరు ఎందుకంటే అటువంటి సమయంలో సర్వ శక్తుల ఖజానా అవసరము. ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే అది హాజరైతే వారిని మాస్టర్ సర్వశక్తిమంతులు అని అంటాము. సహనశక్తి అవసరమున్నప్పుడు ఎదుర్కునే శక్తి వస్తే - ఇది కూడా శక్తియే కానీ ఆ సమయంలో పనికిరాదు. కనుక సర్వ ఖజానాలకు తాళం చెవి మూడు బిందువులు - మీరు, బాబా మరియు డ్రామా.
బాప్‌దాదాకు ఒక సంకల్పం ఉంది, చెప్పమంటారా? చెయ్యాల్సి ఉంటుంది. ఎవరైతే చెయ్యడానికి తయారుగా ఉన్నారో వారు చేతులెత్తండి. చెయ్యాల్సి ఉంటుంది. చేతులెత్తుతున్నారు. మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారా లేక శరీర చేతిని ఎత్తుతున్నారా? మనసు యొక్క చేయి పక్కాగా ఉంది కదా. బాప్‌దాదా సమయానుసారంగా పిల్లలు ప్రతి ఒక్కరి నుండి ఈ శుభ ఆశను ఉంచుతున్నారు - 15 రోజుల తర్వాత తిరిగి బాబా మిలనం జరుగుతుంది, ఈ 15 రోజులలో విశేషంగా ఈ అభ్యాసం చెయ్యండి, ట్రయల్ చెయ్యండి, సదా ఉండాలి కానీ 15 రోజుల ట్రయల్ చెయ్యండి మరియు తమ తమ కనెక్షన్లో ఉన్న సెంటర్లతో కూడా చేయించండి, అక్కడకు వెళ్ళి అయినా, ఫోన్ల ద్వారా అయినాగానీ హోమ్‌వర్క్ చేస్తున్నారా అని వారికి గుర్తు చేయండి. హోమ్‌వర్క్ ఏమిటి? ఈజీయే, ప్రతి ఒక్కరూ భిన్న భిన్న పరిస్థితులు, విషయాలను ఎదుర్కుంటూనే ఉంటారు కానీ ఈ 15 రోజులు ప్రతి ఒక్కరూ సంకల్పం, వాణి మరియు కర్మలో కనీసం 80 శాతం మార్కులు తీసుకోవాలి. బాప్‌దాదా 20 శాతం వదిలేస్తున్నారు. ఇష్టమేనా? ఇష్టమేనా? ఇవ్వమంటారా ఈ హోమ్‌వర్క్‌ను? అచ్ఛా, 15 రోజులు, మాయ కూడా వింటుంది. పరిస్థితులు అయితే వస్తాయి, వాటిని చూడకండి, పాస్ కావాలి అని గుర్తుంచుకోండి. 15 రోజులు పెద్ద విషయమేమీ కాదు కానీ బాప్‌దాదా వద్దకు ప్రతి ఒక్కరూ సత్యమైన మనసు, స్వచ్ఛమైన హృదయము, స్వప్నంలో కూడా, సంకల్పము, వాణి మరియు కర్మలో పాస్ అయి చూపించండి. వీలవుతుందా? వీలవుతుందా? టీచర్లు చెప్పండి, వీలవుతుందా? 15 రోజులు పెద్ద విషయము కాదు కానీ బాప్‌దాదా ట్రయల్ కోసం చెప్తున్నారు, సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు, యుద్ధం జరుగకూడదు, విజయి. 15 రోజుల పూర్తి విజయులు. కష్టమా, సహజమా? సహజమేనా, చేతులెత్తండి. సహజమేనా? మరి బాప్‌దాదా ఈ 15 రోజుల రిజల్ట్‌ను చూస్తారు. తర్వాత ఇంకా పెంచుతారు. 15 రోజులైతే ఎవ్వరైనా చెయ్యగలరు! చెయ్యగలరు కదా! మధువనం వారు, మధువనం వారు చేతులెత్తండి. మధువనం వారు ముందు కూర్చున్నారు. చాలా మంచిది. విదేశీయులు, ఇండియా వారు అందరూ చెయ్యాలి. గ్రామంలోని వారు, పెద్ద పట్టణాలలోని వారు అందరూ 15 రోజుల రికార్డ్‌ను పెట్టాలి. ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నలు రాకూడదు. ఏమి చెయ్యను పరిస్థితి అటువంటిది అని చెప్పకండి. 80 శాతం తీసుకోవలసిందే. బాప్‌దాదా అయితే ఇంకా సులువుగా చెయ్యడానికి 20 శాతాన్ని వదిలిపెట్టేసారు. ఎందుకంటే నడుస్తూ నడుస్తూ ఉండగా అక్కడక్కడ మాయ నిర్లక్ష్యము, సోమరితనములోకి తీసుకు వస్తుంది. రాయల్ సోమరితనము అనగా ఇది జరిగింది, ఇది జరిగింది, ఈ రాయల్ సోమరితనము, నిర్లక్ష్యము, ఇది తీవ్ర పురుషార్థంలో లోటును తెస్తుంది ఎందుకంటే విద్యార్థులందరితో, ప్రతి ఒక్కరితో ఇప్పుడు ముందు ఈ 15 రోజుల రిహార్సల్ చేయించి, ఇలాగే కొంత సమయము వరకు అభ్యాసం చేయించాలనుకుంటున్నారు బాప్‌దాదా. అప్పుడు ఎవరెడీగా ఉన్నాము అని అందరూ చేతులెత్తగలగాలి. ఇందు కోసం సమయము గురించి అభ్యాసం ఉండాలి. అందుకే ముందుగా ఈ కొద్దిపాటి అభ్యాసాన్ని చేయిస్తున్నాము. అచ్ఛా. ఇప్పుడు ఏమి చెయ్యాలి?
సేవ టర్న్ పంజాబ్ జోన్ వారిది:- బాగుంది, పంజాబ్ - ఎక్కడ 5 నదులు ప్రవహిస్తాయో, నదుల ప్రభావం కూడా ప్రసిద్ధి చెందింది, బాగుంది. అలాగే జ్ఞాన గంగలు కూడా ప్రసిద్ధులే! పంజాబ్ చాలా మంచి సేవను చేస్తుంది. పంజాబ్ విశేషత ఏమిటంటే పంజాబ్ కుమారీలు చాలా మంచిగా సేవాయోగ్యులైన వారు ఒకేసారి తయారయ్యారు. చప్పట్లు కొట్టండి. పంజాబ్‌లో మొదట్లో నిర్భయంగా సన్యాసుల సమ్మేళనంలో భాషణ ఇచ్చారు. సన్యాసులు కూడా వీరిది చాలా మంచి కార్యము అని స్టేజ్ మీదనే చెప్పారు. అప్పుడు అది ప్రారంభ సమయము. పంజాబ్ కనెక్షన్ నుండి మధ్య మధ్యలో పెద్ద పెద్ద సన్యాసులు, మఠాలకు చెందిన వారు ఆబూలో జరిగే సమ్మేళనంలో పాల్గొన్నారు మరియు ఎక్కువ సంఖ్యలోనే వచ్చారు. ఇతర దేశాల నుండి కూడా వచ్చారు కానీ విశేషమైన సంగఠన హరిద్వారము నుండి వచ్చేది. కనెక్షన్ కూడా ఉంది. పంజాబ్‌కు డ్రామానుసారంగా ఈ సన్యాసులు, మహాత్ముల సేవా అవకాశం మంచిగా లభించింది మరియు చేస్తూ కూడా ఉన్నారు. పంజాబ్‌లో స్థాపన సమయంలో సేవ ఆరంభమయిన వెంటనే సహయోగులు మరియు వారస క్వాలిటీ వారు నిమిత్తంగా అయ్యారు. ఎంత హంగామా చేసేవారో అంతే సింహం క్వాలిటీ వారు తయారయ్యారు. ఇప్పుడు పంజాబ్ ఏమి చెయ్యాలి? ఈ విశేషత అయితే ఉంది, కానీ ఇప్పుడు పంజాబ్ వారు ఎటువంటి సింహాన్ని తయారు చెయ్యండంటే ప్రసిద్ధమైన వారు అయి ఉండాలి, సభలో మైక్‌గా అయి తమ అనుభవాన్ని వినిపించాలి. మైక్ పెద్దగా ఉండాలి, చిన్నగా కాదు. ప్రభుత్వ వి.ఐ.పి.లు వేరుగా ఉంటారు, కానీ మహాత్ములలో కూడా వి.ఐ.పి.లు ఉంటారు, ఇటువంటి పెద్ద మైక్‌ను ఎవరినైనా తయారు చెయ్యండి. వారు తమ అనుభవంతో ఇతరులను ఉత్సాహంలోకి తీసుకురావాలి. ఇటువంటివారిని తయారు చెయ్యండి. వీలవుతుంది. ఎందుకంటే ఈరోజుల్లో సాధు సన్యాసుల సేవ ద్వాపరంలో ప్రారంభం అయిందనుకుంటున్నారు కానీ ఒక పెద్ద గురువు మరొకరిని, తమ శిష్యుడిని తమ సమానంగా తయారు చెయ్యడం, ఇటువంటి ఉదాహరణ జరగలేదు. బాప్‌దాదా అయితే పిల్లలను తమకన్నా కూడా ఎక్కువ తెలివైనవారిగా చేసారు, పిల్లలు పబ్లిక్‌లోకి వస్తారు. కావున పంజాబ్ ఏదైనా నవీనతను చేసి చూపించండి. వి.ఐ.పిలు అయితే అన్ని వైపుల నుండి వస్తారు కానీ మీరు ఎటువంటివారిని తీసుకురండి అంటే అది విని అందరూ మేల్కోవాలి, సందేశం లభించాలి. వీలవుతుందా? చూస్తాము. కొద్ది సమయమైతే పడుతుంది కానీ ఇటువంటి వారినెవరినైనా తయారు చేసి చూపించండి. ఇకపోతే వృద్ధి అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, సగం సభ పంజాబ్వారే నిల్చున్నారు. సేవలో వృద్ధి జరుగుతుంది, ఇందుకు అభినందనలు (హరిద్వారలో కుంభమేళాకు తయారీ జరుగుతుంది) ఈ అవకాశం బాగుంది. అయిపోతుంది. అచ్ఛా.
సేవా ఛాన్సును తీసుకునేవారు మరియు ఇక్కడకు వచ్చే ఛాన్సును తీసుకునేవారు, ఎందుకంటే ఎవరి టర్న్ ఉంటుందో వారి సంఖ్యకు మంచి ఛాన్స్ లభిస్తుంది. ఇది కూడా మంచి సాధనము తయారై ఉంది. పంజాబ్ సోదరసోదరీలకు, మాతలకు, కుమారీలకు, కుమారులకు, వృద్ధులకు అందరికీ బాప్‌దాదా మరియు సభలో కూర్చున్నవారందరి నుండి చాలా-చాలా అభినందనలు, అభినందనలు.
మీడియా వింగ్:- బాగుంది, మీడియా అయితే సేవను బాగా చేసింది. బాబా సూచన అనుసారంగా అందరూ ఈసారి సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి, సందేశాన్ని ఇవ్వడానికి ఎంతో కృషి చేసారు. బ్రాహ్మణులందరి నోటి నుండి కూడా బాప్‌దాదా చెప్పారు, బాప్‌దాదా చెప్పారు, దానిని ప్రాక్టికల్ రూపంలోకి తీసుకురావడానికి అందరూ మంచి పురుషార్థాన్ని చేసారు. మీడియా వారు కూడా నలువైపుల ఉన్న అన్ని చోట్ల ఏమేమి జరుగుతుంది అని చూపించడానికి మంచి కృషిని చేసారు. చేసేవారు ఉల్లాసంతో చేసారు, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, చిన్నవారు కూడా తక్కువేమీ చెయ్యలేదు. చిన్న సెంటర్ కావచ్చు, పెద్ద సెంటర్ కావచ్చు ఎవరైతే ప్రోగ్రామ్‌ను చేసారో, సందేశాన్ని ఇచ్చారో, ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌లో సేవ చేసారో, నిమిత్తమయ్యారో, పెద్ద ప్రోగ్రామ్ అని అంటారు కదా, వారు లేవండి. ఎవరైతే పని చేసారో వారు లేవండి. సెంటర్‌వారు కూడా లేవవచ్చు. ఏ ఏ సెంటర్లయితే ప్రోగ్రామ్ చేసాయో వారందరూ లేవండి. బాప్‌దాదాకు మంచిగా అనిపించింది. బాప్‌దాదా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇలాగే మధ్య-మధ్యలో కొద్ది సమయం తర్వాత కూడా ఉల్లాస ఉత్సాహాలతో పలు చోట్ల సందేశమునిచ్చే ప్రోగ్రామ్‌ను తయారు చేస్తూ ఉండండి. ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకము లేదు. కనీసం మా బాబా వచ్చారు అని అనాలి. మేము గుర్తించలేదు, బాబా వచ్చారు కానీ నేను గుర్తించలేదు అని అన్నా అనాలి. అందరికీ సేవ ద్వారా సూచన ఇవ్వడము మీ కర్తవ్యము. మరి మీరందరూ తనువుతో, మనసుతో, ధనముతో సేవను చేసారు, ఇందుకోసం మీ అందరికీ పదమా పదమారెట్లు రిటర్న్ జమ అయిపోయింది. మరియు సేవా ఫలం కూడా లభించింది. సెంటర్లకు వస్తున్నారు. ఇకముందు కూడా ఇది చెయ్యడానికి బలము కూడా లభించింది. ఫలము కూడా లభించింది, బలము కూడా లభించింది. బాగుంది. అందరూ ఎంతో అభిరుచితో చేసారు. బాప్‌దాదా అందరి ఉల్లాస ఉత్సాహాలను చూసి, బాబాపై ఉన్న ప్రేమను చూసి అభినందనలు తెలుపుతున్నారు. ఇలాగే ఏదో ఒక ప్రోగ్రామ్‌ను తయారు చేస్తూ ఉండండి. చిన్న చిన్న సెంటర్లలో అన్ని సౌకర్యాలు వచ్చేసాయి కదా. లేకపోతే ప్రోగ్రామ్ చెయ్యమంటే ముందు సౌకర్యాలు ఉండాలి అని అనుకునేవారు. కానీ అకస్మాత్తుగా అన్ని చోట్ల తనువు, మనసు, ధనము సంతోషంగా ఏర్పాటైపోయాయి. ఎవ్వరు కూడా ఎలా చేయాలి అని అనలేదు, చెయ్యాలి. అలాగే పరస్పరంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరికొకరు ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళండి. సరేనా. బాగుంది, అభినందనలు, అభినందనలు. ఇక్కడకు రాని వారికి కూడా అభినందనలు లభిస్తాయి. అచ్ఛా.
మీడియా వారితో:- బాగుంది, ఇప్పుడు అటెన్షన్ ఇచ్చారు, మీడియా ద్వారా సేవ బాగా జరుగుతుంది. రెగ్యులర్ స్టూడెంట్లు కూడా తయారయ్యారు. వీరికి కూడా అభినందనలు (రవి అన్నయ్య, శివాని అక్కయ్య మరియు కనుప్రియ అక్కయ్యతో) బాగుంది, ఎవరు ఎంతగా సేవ చేస్తారో అందుకు ఫలము సదా సంతోషము ఉంటుంది. సేవా ఫలము సంతోషము, నిర్విఘ్నము. అప్పుడప్పుడూ కాదు, సదా. మంచిగా చేస్తున్నారు. సలహా తీసుకుని దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దేశంలో కావచ్చు, విదేశంలో కావచ్చు, అందరూ పరస్పరంలో సలహా తీసుకుని అందరి సలహాతో ఏ కార్యమైతే జరుగుతుందో అందులో సఫలత సహజంగా ఉంటుంది. కనుక సలహాలను ఇస్తూ రాయ్ బహాదూర్గా అయి ఒకరికొకరు వినండి మరియు చెయ్యండి. అయిపోతుంది, ఇప్పుడు సమయము కూడా ఏముంది! కావున మీడియా వారు తమ తమ ప్రాంతాలలో సందేశాన్ని ఇచ్చే ప్రోగ్రామును చెయ్యండి. ఇదైతే మధువనం లేక నిమిత్తమైన వారు చేసారు కానీ ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతంలో, మీడియా వారు ఏదో ఒక విధంగా సందేశాన్ని తమ ప్రాంతంలో వ్యాప్తి చేయాలి. బాగా చేస్తున్నారు, అభినందనలు.
ట్రాన్స్పోర్ట్ వింగ్:- రెండు విభాగాల కార్యము ఈ రోజుల్లో అవసరము ఎందుకంటే రోజురోజుకీ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ప్రమాదాలు తగ్గాలి, అకాల మృత్యువులు ఉండకూడదు, మొరపెట్టుకుంటూ బాధ పడుతూ వెళ్ళిపోకూడదు అన్న దానికోసం రెండు విభాగాల వారు ప్లాన్‌ను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా తయారు చేసారు. బాప్‌దాదా స్థాపన చేసినప్పుడు, ఆరంభంలో పిల్లలు చదువుకోవడానికి వచ్చినప్పుడు, మొదట్లోనే ఇది మృత్యులోకము అని బాప్‌దాదా చెప్పేవారు. అప్పుడు వారు పిల్లలు కదా, ఇది మృత్యులోకం ఎలా అవుతుంది అని అడిగేవారు! ఎందుకంటే మృత్యువును చూడలేదు కదా, పిల్లలు కదా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ సమయంలో మృత్యువు అధికంగా ఉండటాన్ని చూస్తున్నారు. ఒకట్రెండు అకాల మృత్యువులు జరగని రోజు లేదు. మంచిది, ఇద్దరూ ఎంతో వేగంగా తమ కార్యాన్ని పెంచాలి. అందరూ మీకు అభినందనలు తెలుపుతారు ఎందుకంటే లోకులు కూడా అకాల మృత్యువులు ఉండకూడదనే కోరుకుంటున్నారు. చాలా మంచిది, పరస్పరంలో మీటింగ్ చేసుకుంటారు. ఎప్పటినుండైతే ఈ వర్గాల సేవ ప్రారంభమయిందో అప్పటినుండి అనేక సెంటర్ల వారికి సేవా ఛాన్స్ లభించింది. కానీ బాప్‌దాదా యొక్క ఒక్క విషయము ఇప్పటి వరకు పూర్తి కాలేదు, గుర్తుందా? ప్రతి వర్గం నుండి ఒక ప్రసిద్ధి చెందిన స్వీకర్‌ను తయారు చెయ్యండి, మైక్‌ను తయారు చెయ్యండి మరియు ఒకే స్టేజ్ పైన మూడు నాలుగు వర్గాలలోని విశేష వ్యక్తులు తమ అనుభవాన్ని వినిపించాలి అని బాప్‌దాదా చెప్పారు. పరస్పరంలో ఒక గ్రూప్‌ను తయారు చెయ్యండి, అందులో ప్రతి వర్గంనుండి ఒకరు విశేషమైనవారు ఉండాలి. ఎలా అయితే బ్రాహ్మణ పరివారానికి భాషణ కోసం నిమంత్రణ ఇచ్చి పిలుస్తారు కదా, అలాగే ఆ పార్టీకి కూడా అక్కడక్కడ నిమంత్రణ ఇచ్చి భాషణకు ఛాన్స్ ఇవ్వాలి. మరి ప్రతి వర్గం వారు కమల పుష్ప సమానంగా ఉంటూ ఎలా ముందుకు వెళ్తారో చూద్దాము. బాగుంది.
సమాజ సేవ వింగ్:- సమాజ సేవ, వీరు ఏమి సేవ చేస్తున్నారు అని సమాజంలో వ్యాపించిపోవాలి. సమాజ సేవ అయితే వాస్తవానికి అన్ని వర్గాలవారికి చెయ్యవచ్చు. బాప్‌దాదా ఏమి చూసారంటే పరస్పరంలో ప్రతి వర్గము ఉల్లాస ఉత్సాహాలతో సంగఠనలోకి వస్తున్నారు మరియు సేవను కూడా చేస్తున్నారు. ఒకరికొకరు సహయోగాన్ని కూడా అందించుకుంటున్నారు. ఇప్పుడు సమాజంలో సందేశం వ్యాపించాలి. ఒకవేళ సమాజాన్ని సరి చెయ్యాలంటే బ్రాహ్మా కుమారీల వద్దకు వెళ్ళి చూడండి, ఎలా వారు సమాజ సేవ చేస్తున్నారు అని వారు అనాలి. ప్రతి ఒక్కరూ మంచిగా చేస్తున్నారు, ఛాన్స్‌ను కూడా తీసుకుంటున్నారు. ముందుకు సాగండి మరియు ఇతరులను తీసుకెళ్ళండి. వీరు ఏమి చేస్తున్నారు అన్నదానిని సమాజంలో సందేశాన్ని వ్యాపింపజేయండి.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు చాలా మంచి ఛాన్స్‌ను తీసుకున్నారు. ప్రతి గ్రూప్‌లో డబల్ విదేశీయులు వస్తున్నారు. తెలివైనవారు. మీరు విడిగా కూడా ఛాన్స్‌ను తీసుకుంటారు మరియు ప్రతి గ్రూప్‌లో కూడా వస్తారు. పేరు డబల్ అని ఉంది కదా కనుక డబల్ లాభాన్ని పొందుతున్నారు. భారతవాసులు కూడా మీరందరూ ఛాన్స్‌ను తీసుకోవడం చూసి సంతోషిస్తున్నారు. ఈ పెద్ద ప్రోగ్రామ్‌ను ఫారెన్‌లో కూడా బాగా చేసారు. కేవలం ఒక్క పేరులో తేడా ఉంది కావచ్చు కానీ సేవ మంచిగా చేసారు. బాప్‌దాదా అయితే ఫారెన్ సేవా రిజల్ట్‌ను విన్నారు మరియు చూసారు కూడా. దేశము లేక విదేశములోని పిల్లలు అందరూ ఇప్పుడు సదా ఎవరెడీగా ఉండాలన్నది బాప్‌దాదా కోరుకుంటున్నారు. ఒక మంచి విద్యార్థి చదువులో ఎప్పుడూ పరీక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, అలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతగా ఎవరెడీగా ఉండాలంటే రేపే ఏమైనా జరిగినా కానీ ఎవరెడీ. అన్ని సబ్జెక్ట్‌లలో, నాలుగు సబ్జెక్ట్‌లలో ఎవరెడీ. సమయము రాగానే పాస్ విత్ హానర్‌గా అయిపోవాలి. పిల్లలందరి పట్ల బాప్‌దాదాకు ఉన్న శుభ ఆశ ఇదే. డబల్ విదేశీయులకైతే బాప్‌దాదా డబల్ పురుషార్థీలు అని టైటిల్‌ను ఇచ్చారు. డబల్ ఛాన్స్‌ను తీసుకునేవారు, చాలా బాగుంది. అచ్ఛా.
వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ ఆస్ట్రేలియాలో జరుగనుంది, అందుకు దాదీ జానకి వెళ్ళనున్నారు:- బాగుంది, వారికి కూడా సమయము యొక్క అవగాహన మరియు బాబా గురించిన అవగాహనను ఇవ్వండి. సమయము మరియు బాబాపై అవగాహన. మా బాబా వచ్చారు కానీ మాకు తెలియలేదు అన్న ఫిర్యాదైతే రాకూడదు. సందేశమివ్వడంలో అయితే మీరు తెలివైనవారే. అవును, చేయించేది బాబాయే, కానీ చేసేవారు యోగ్యులైతేనే బాబా కూడా చేయిస్తారు కదా. బాగుంది. మీరు చేరుకుంటున్నారు అంటే చాలా మంచిది. బాప్‌దాదా అయితే తోడుగా ఉన్నారు. తోడుగా కూడా ఉన్నారు, సహచరుడిగా కూడా ఉన్నారు. అచ్ఛా.
మొదటిసారి ఎంతమంది వచ్చారు, వారు లేవండి:- బాగుంది, ఈరోజు మీరు బాప్‌దాదా ముందుకు వచ్చినందుకు అభినందనలు, అభినందనలు. బాబా దృష్టి పిల్లలపై పడింది మరియు పిల్లల దృష్టి బాబాపై పడింది. చాలా-చాలా అభినందనలు. అచ్ఛా. కేక్ అయితే లేదు కానీ సంతోషమనే కేక్‌ను తినండి. బాగుంది, ఇప్పుడు ఆలస్యంగా వచ్చారు కానీ ఫాస్ట్‌గా వెళ్ళి ముందు నంబర్‌ను తీసుకోవచ్చు. అందుకే బాప్‌దాదా తరఫున మరియు మీతోటి సోదరసోదరీలందరి తరఫున అందరికీ అభినందనలు, అభినందనలు. ఎటువంటి ఉదాహరణ జరుగుతుందంటే లాస్ట్ వచ్చేవారు కూడా ఫాస్ట్‌గా వెళ్ళి ఫస్ట్ లైన్లోకి రాగలరు. అచ్ఛా.
నలువైపుల బాప్‌దాదా ఆశలను పూర్తిచేసే ఆశాదీపాలు, ఎందుకు, ఏమిటి అన్న భాషనుండి అతీతంగా సదా ఏకరసంగా, సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు, బాబాలోనే జీవితం యొక్క విశేషమైన మూడు సంబంధాలు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువును అనుభవం చేసేవారు, బాబా నుండి వారసత్వము, టీచర్ నుండి చదువు యొక్క వారసత్వము మరియు సద్గురువు నుండి వరదానాల వారసత్వాన్ని పొందే పదమారెట్ల భాగ్యశాలి పిల్లలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (ఈసారి నలువైపుల సేవా కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి) అందరూ అందరికీ సహయోగాన్ని ఇచ్చారు. ఎలా చెయ్యాలి అన్న ఆలోచన ఎవ్వరూ చెయ్యాల్సిన అవసరం రాలేదు, చెయ్యాల్సిందే. ఒకరికొకరి సహయోగంతో అన్ని ప్రోగ్రామ్‌లు మంచిగా అయ్యాయి. సందేశమైతే వ్యాపించింది. సందేశమైతే లభించింది ఇప్పుడు ముందుకు సాగండి. (యోగంలో అందరూ చాలా మంచి అనుభూతిని చేసుకున్నారు) ఎందుకంటే వరదానాలు తీసుకోవడము అన్నదే కదా టాపిక్. యోగ ప్రోగ్రామ్‌తో అనుభవం చేసారు.
సంతోష్ అక్కయ్య(సాయన్) స్మృతిని పంపారు:- వారికి స్మృతిని ఇవ్వండి. చాలా-చాలా ప్రియస్మృతులను స్వీకరించండి.
దాదీ నిర్మలశాంతతో:- ధైర్యముంచితే తండ్రి సహాయమైతే ఉండనే ఉంది. బాగుంది, కర్మభోగాన్ని కూడా కర్మయోగంలోకి మార్చేసారు. చాలా మంచిది.
రమేష్ అన్నయ్య, ఉష అక్కయ్య, అనీల అక్కయ్య:- ఇప్పుడు ముగ్గురి ఆరోగ్యం బాగుంది. ఇక్కడ అందరి శక్తి లభిస్తుంది. వాయుమండల సహకారం కూడా లభిస్తుంది. బాగుంది, ఇక్కడ బాగుంటే బాగున్నట్లే. ఎప్పటి వరకు ఉండగలరో అప్పటి వరకు ఉండండి. (రమేష్ అన్నయ్యతో) మీరు మీ పని చేసుకోండి, వీరు తమ పని చేసుకుంటారు. (ఉష అక్కయ్యతో) మీరు ఇక్కడ కూర్చునే సెంటర్లకు ఫోన్లు చేసి క్షేమ సమాచారాలను అడుగుతూ ఉండండి. వీరి పని వీరిది, మీ పని మీది. (వీరి 50 సంవత్సరాలను జరుపుకున్నాము) 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా గడిచాయి, ముందుకు సాగుతూ ఉండండి, వెనుక ఉండకండి, ఇందుకు అభినందనలు. ఒకరికొకరు సహయోగులయ్యారు మరియు సేవలో కూడా సహయోగులు. వీరు కూడా సంతోషిస్తున్నారు. బాప్‌దాదాకు శాంతమాత చాలా గుర్తుకు వస్తారు. పునాది కదా. గుప్తమైన రత్నము వారు.
బృజ్‌మోహన్ అన్నయ్యతో:- ప్రోగ్రామ్ తయారు చేస్తూ ఉండండి, ఇది పూర్తయిపోయింది కదా అని అనుకోకండి. టాపిక్ మరో విధంగా మార్చి కొద్ది మార్పుతో చెయ్యండి.
(వి.ఐ.పి. లు బాప్‌దాదాతో కలుస్తున్నారు):- ఎవరైతే ధైర్యాన్ని ఉంచుతారో వారికి 100 రెట్ల సహాయం లభిస్తుంది. లభిస్తూ ఉంటుంది. ఆ డ్యూటీని కూడా చెయ్యండి. ఉన్నంతవరకు డ్యూటీని చెయ్యండి కానీ డబల్ పని, సింగల్ కాదు.
2. శక్తిని నింపుకుని కనెక్షన్‌ను పూర్తిగా పెట్టుకోండి. ఎవరి కన్క్షన్ అయితే ఉంటుందో వారి రిలేషన్ పక్కా అవుతూ ఉంటుంది. ఒకవేళ సమయం లభించకపోయినా కానీ రోజూ ఫోన్ ద్వారా తమ హాజరును వేసుకోండి అప్పుడు పక్కాగా స్టూడెంట్ నంబర్‌వన్ అవుతారు.
ఏ ఆత్మ అయితే వెళ్ళిందో, వారు కూడా కనెక్షన్లో వెళ్ళారు. కొడుకులను ఏదో ఒక కారణంతో సంబంధంలోకి తీసుకురండి. రెగ్యులర్‌గా కాకపోయినా ఏదో ఒక ఫంక్షన్‌కు తీసుకురండి, వారి సేవను చెయ్యండి, అలా కూడా బాగుంటుంది. ఈ సంపర్కం ద్వారా తోడు కూడా లభిస్తుంది, భవిష్యత్తు కూడా తయారవుతుంది. కనెక్షన్‌ను తెంచద్దు. పక్కా. బాప్‌దాదా ఇప్పుడు కూడా శక్తిని ఇస్తున్నారు, ముందుకు కూడా తీసుకువెళ్తారు. ఏమీ చింత చెయ్యవద్దు. నిశ్చింతగా అయి సేవను చెయ్యండి. బాప్‌దాదా తోడుగా ఉన్నారు. ఓంశాంతి.
ఓంశాంతి