Search for a command to run...
31 Dec 2009
నూతన సంవత్సరంలో సర్వాత్మలకు సందేశాన్ని ఇచ్చి బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి, తండ్రి సమానంగా అవ్వడానికి దేహీ-అభిమానిగా ఉండే నేచర్‌ను నేచురల్‌గా చేసుకోండి
31 December 2009 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా పిల్లలందరినీ స్నేహములో మరియు బాప్‌దాదా ప్రేమలో లవలీనమై ఉన్న స్వరూపంలో చూస్తున్నారు. ఒక్కొక్కరూ పరమాత్మ ప్రేమలో మెరుస్తున్నారు. పిల్లలందరూ ప్రేమ అనే విమానంలో చేరుకున్నారు. నిజానికైతే క్రొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు కానీ అందరి నయనాలలో ఏమి కనిపిస్తుంది? న్యూ ఇయర్, క్రొత్త సంవత్సరము అన్నది నిమిత్తమాత్రమే, కానీ మీ అందరి నయనాలలో ఎటువంటి ఉత్సాహము ఉంది? మూడు అభినందనలు చెప్తున్నాము. ఒకటి-మీ క్రొత్త జీవితానికి అభినందనలు, రెండు-క్రొత్త యుగానికి అభినందనలు మరియు మూడు-పరివారము మరియు బాబాతో ఉన్న మిలనానికి అభినందనలు. మీ నయనాలలో ఏమి తిరుగుతుంది? మీ నవ యుగం మీ ముందుకు వస్తుంది కదా! క్రొత్త యుగం వచ్చేసినట్లే అని మీ మనసులలో ఉత్సాహంగా ఉంది కదా! క్రొత్త యుగపు మెరిసే డ్రెస్ ఎదురుగా ఎంత స్పష్టంగా ఉందంటే ఈ రోజు సంగమయుగంలో ఉన్నాము, త్వరగా ఈ మెరిసే డ్రెస్‌ను ధరించాలి అన్న ఉత్సాహంతో ఉన్నారు. దానిని మీ ఎదురుగా చూసి సంతోషిస్తున్నారు. వీడ్కోలు కూడా చెప్తున్నారు మరియు అభినందనలను కూడా తీసుకుంటున్నారు. ఎలా అయితే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పినప్పుడు ఆ సంవత్సరాన్ని కూడా మర్చిపోతారో, క్రొత్త సంవత్సరమే గుర్తుంటుందో అలాగే పాత సంవత్సరానికి కాదు, క్రొత్త సంవత్సరానికి అభినందనలు చెప్తున్నారు. పాత ప్రపంచానికి వీడ్కోలు చెప్తున్నారు. మరి ఈరోజు అందరికీ క్రొత్త యుగం కోసం ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. లోకులు క్రొత్త సంవత్సరానికి అభినందనలను తెలుపుతారు మరియు బహుమతులను కూడా ఇస్తారు. బాప్‌దాదా కూడా పిల్లలైన మీకు పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలు పలికి క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళే బహుమతిని ఇస్తున్నారు. ఆ క్రొత్త ప్రపంచంలో అంతా ప్రాప్తియే ప్రాప్తి. సారంలో చెప్పాలంటే క్రొత్త ప్రపంచంలో అప్రాప్తి అంటూ ఏదీ ఉండదు. ఇటువంటి బంగారు యుగాన్ని బాప్‌దాదా పిల్లలైన మీ అందరికీ బహుమతిగా ఇచ్చేసారు. మేము బంగారు ప్రపంచానికి అధికారులుగా అవుతున్నాము అని మీకు కూడా నషా ఉంది కదా. ఇటువంటి బహుమతిని మరెవ్వరూ ఇవ్వలేరు. బాబా పిల్లలందరికీ ఈ డైరెక్షన్‌ను ఇచ్చారు - సర్వాత్మలకు బాబా వారసత్వంగా ఇచ్చే ఈ బంగారు ప్రపంచం గురించిన సందేశాన్ని ఇచ్చి వారికి కూడా మీరు బహుమతిని ఇవ్వండి. మీవద్ద ఏ బహుమతి ఉంది? ఒకటి, క్రొత్త ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి మరియు రెండవది, మీ వద్ద అనేక ఖజానాలున్నాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల ఖజానా, ఎన్ని ఖజానాలున్నాయి! అందరికీ ఏదో ఒక గుణాన్ని, ఏదో ఒక శక్తిని బహుమతిగా ఇవ్వండి. ఈ బహుమతితో వారి జీవితాలు మారిపోవాలి, బంగారు ప్రపంచానికి అధికారులైపోవాలి ఎందుకంటే ఈరోజుల్లో నలువైపుల దుఃఖము, అశాంతి పెరిగిపోవడాన్ని మీరు చూస్తున్నారు. నలువైపులలోని ప్రతి ఒక్కరిలో భయము, చింత ఉన్నాయి. ఇటువంటి దుఃఖి, అశాంతి ఆత్మలకు కనీసం బాబా వచ్చారు, ఇప్పటి నుండైనా అవినాశీ వారసత్వానికి అధికారులుగా అవ్వండి అన్న సందేశాన్నయినా తప్పక అందించండి. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ బాబా పిల్లలు కొంతమంది సందేశం నుండి వంచితమై ఉన్నారు. ఏది ఏమైనా అందరూ ఒక్క తండ్రి పిల్లలే కదా, మీ సోదరసోదరీలకు ఈ సందేశము అనే బహుమతిని తప్పక అందించండి. ఎవ్వరూ ఉండిపోకూడదు. సేవ చేస్తున్నారు, బాప్‌దాదా పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు కానీ బాప్‌దాదా ఆశ ఏమిటంటే నా పిల్లలెవ్వరూ సందేశం నుండి వంచితులవ్వకూడదు అని. మీకైతే బంగారు ప్రపంచం బహుమతిగా లభించింది కానీ మాకు తెలీనే తెలియదు అని ఫిర్యాదు చెయ్యకూడదు. మా తండ్రి వచ్చారు కానీ మాకు సందేశమే లేదు అని అనకూడదు అందుకే ఈ క్రొత్త సంవత్సరంలో ఈ ప్రయత్నమే చెయ్యండి, పరస్పరంలో ప్లాన్ తయారుచెయ్యండి. ఏ మూల కూడా మిగలకూడదు. ఫిర్యాదు రాకూడదు కానీ సంతోషంగా ఉండాలి. మా తండ్రి వచ్చారు అన్న విషయమైతే తెలియాలి. వంచితమవ్వకూడదు. మరి ఈ క్రొత్త సంవత్సరంలో ఏమి చేస్తారు? పరస్పరం కలిసి ప్లాన్ తయారు చెయ్యండి. బాప్‌దాదాకు పిల్లలందరిపై దయ కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా మీ సోదర సోదరీల పట్ల విశేషమైన దయాహృదయము, కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశాన్ని ఇవ్వండి. కనీసం ఈ ఫిర్యాదునైతే ఇవ్వకూడదు.
ఈ రోజు పిల్లలందరూ క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునే ఉల్లాస ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్‌దాదా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి ఏ పాటను పాడుతారు? తెలుసు కదా! వాహ్ పిల్లలు వాహ్! ఇక్కడకు మొదటిసారి వచ్చినవారితో కూడా మీరు లక్కీ పిల్లలు అని బాబా అంటారు, ఎందుకంటే సమయ సమాప్తికంటే ముందుగానే వచ్చారు. క్రొత్త పిల్లలకు బాప్‌దాదా పదమా పదమరెట్లు లక్కీగా అయినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరిలో ఒక్క విషయాన్ని చూడాలనుకుంటున్నారు, అదేమిటో తెలుసా? ఎలా అయితే ప్రతి ఒక్కరి మనసులలో ఉల్లాసముందో, మేము తండ్రి సమానంగా అయ్యే వారము అన్న లక్ష్యము ఉంది. అవుతాము కాదు, అయ్యే వారము. మరి ఎటువంటి లక్ష్యము ఉందో, అలా ఇప్పుడు బాప్‌దాదా లక్ష్యంతోపాటు లక్షణాలను కూడా చూడాలనుకుంటున్నారు. సమానంగా అవ్వాలన్న లక్ష్యమున్నట్లుగా సమానంగా అయ్యే లక్షణాలు కూడా ఉండాలి. లక్ష్యమైతే చాలా ఉన్నతంగా ఉంది కానీ లక్షణాలపై విశేషమైన అటెన్షన్‌ను ఇవ్వాలి. సమానము, ఎంత పెద్ద లక్ష్యమో అంత పెద్ద లక్షణాలు ఉండాలి. కొంతమంది పిల్లలు లక్షణాలను ధారణ చెయ్యాలనుకుంటారు కానీ మధ్య-మధ్యలో ‘అయినప్పటికీ’ అని అంటూ ఉంటారు. చాలా అనుకుంటాము కానీ... ఇప్పుడు కానీ అన్నది తొలగిపోవాలి. లక్ష్యమెంత పెద్దగా ఉందో అంతగా లక్షణాలు ముఖం ద్వారా, నడవడిక ద్వారా కనిపిస్తాయి. ఎలా అయితే మీరు మొదట్లో దేహాభిమానంలో ఉండేవారో, దేహాభిమానంలో ఉన్నప్పుడు దేహాభిమానపు నేచర్ నేచురల్‌గా కనిపించేది. దేహాభిమానం రావాలి అని ఎప్పుడైనా పురుషార్థం చేసారా, నేచురల్ నేచర్‌గా దేహాభిమానం ఉండేది. అర్థకల్పం పురుషార్థం చెయ్యలేదు, అలాగే ఇప్పుడు కూడా దేహీ అభిమానిగా అయ్యే నేచర్ నేచురల్‌గా ఉందా! దేహ-అభిమానపు నేచర్ సహజంగా ఉండింది. దేహాభిమానంలోకి రావాలి అని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? దేహాభిమానంలోకి రావాలి అని ఎప్పుడైనా పురుషార్థం చేసారా? దేహ అభిమానము మరియు దేహీ అభిమానము, మరి దేహీ అభిమానిగా అవ్వడంలో శ్రమ ఎందుకు! ఎందుకంటే దేహ అభిమానాన్ని తొలగించుకునేందుకు పిల్లలు శ్రమ పడుతున్నారని బాప్‌దాదా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. దేహ అభిమానము సహజంగా ఉన్నప్పుడు దేహీ అభిమానంలో ఉండటంలో శ్రమ ఎందుకు? పిల్లల శ్రమ బాప్‌దాదాకు మంచిగా అనిపించదు. శ్రమ ముక్తులవ్వండి మరియు నేచురల్ నేచర్‌గా చేసుకోండి, దీనినే లక్ష్యము మరియు లక్షణాలు సమానము అని అంటారు. అప్పుడు చూడండి, తండ్రి సమానంగా అవ్వడం ఎంతో సహజంగా మరియు నేచరల్‌గా అనిపిస్తుంది. బ్రహ్మా బాబాను చూసాము కదా, ఇంత పెద్ద పరివారపు బాధ్యత ఉన్నప్పటికీ నేచురల్ నేచర్‌గా దేహీ అభిమానము ఉండేది. పిల్లలపై కూడా బాధ్యత ఉంది కానీ బ్రహ్మా బాబా ముందు ఆ బాధ్యత ఎంతటిది! ఏ బాధ్యత అయినా కానీ, ఉదాహరణకు జోన్ బాధ్యతలు కావచ్చు, లేక అఫిషియల్ యజ్ఞ వ్యవహారాల బాధ్యత కావచ్చు కానీ ఆ బాధ్యత బ్రహ్మా బాబా ముందు ఎంత! బ్రహ్మా బాబా శివబాబా సహాయంతో ప్రాక్టికల్‌లో చేసి చూపించారు. చేయించేవారు చేయిస్తున్నారు, మనం చేసేవారిగా అయి తండ్రి సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. బాబా సమానంగా కావాలనుకుంటే దీనిని పరిశీలించుకోండి. ఏదైనా కావచ్చు, మనసా, వాచ లేక కర్మణ బాధ్యతలు కావచ్చు కానీ నేను చేసేవాడను, ట్రస్టీను, చేయించేవారు యజమాని శివబాబా ఉన్నారు. చేయించేవారు అనే ఈ పాఠాన్ని నడుస్తూ నడుస్తూ మర్చిపోతూ ఉంటారు. కావున లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు పాత ప్రపంచానికి వీడ్కోలు ఇవ్వడంతోపాటు ఈ లక్ష్యాన్ని లక్షణంలోకి తీసుకురావాలి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త విషయాలు. ఏమి చెయ్యను, మాయ వచ్చేస్తుంది, అనుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది - ఇటువంటి మాటలు లేక సంకల్పాలకు పాత సంవత్సరంతోపాటు వీడ్కోలు చెప్పండి. కేవలం సంవత్సరానికి వీడ్కోలును ఇవ్వకండి. మాయ కూడా బాప్‌దాదా వద్దకు వస్తుంది అని బాప్‌దాదా ముందుగానే వినిపించి ఉన్నారు. వచ్చి ఏమని అంటుంది? నేను వెళ్ళే సమయము దగ్గర పడ్డది అని నేను అనుకుంటున్నాను కానీ కొంతమంది పిల్లలు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు, నేనేమి చెయ్యను? మరి ఈ రోజు వీడ్కోలుతోపాటు మాయ యొక్క భిన్న భిన్న రూపాలకు కూడా వీడ్కోలును ఇవ్వండి. ధైర్యముందా? ధైర్యముందా? చేతులెత్తండి. వీడ్కోలు చెప్పే ధైర్యముందా? వెనక ఉన్నవారికి ధైర్యముందా? ధైర్యమున్నవారు చేతులెత్తండి. ఈ ధైర్యానికి బాబా పదమా పదమ రెట్లు అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకని? ఎందుకని బాప్‌దాదా దీని గురించి ఇంతగా చెప్తున్నారు? ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు చాలా త్వరగా పాడవుతున్నాయి అని మీరు చూస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా జరుగుతుంది అని కొద్ది సమయంనుండి బాప్‌దాదా చెప్పడం విన్నారు. కనుక అకస్మాత్తుగా అవుతాయి, అప్పుడు బహుకాలపు అభ్యాసం లేనట్లయితే మరి మీరే చెప్పండి, అకస్మాత్తు సమయంలో బహుకాలపు అభ్యాసము అవసరము కదా! ఇప్పుడు చూడండి, బాప్‌దాదా హోమ్‌వర్క్‌ను ఇచ్చారు. 10 నిమిషాలు, టోటల్ 24 సార్లు 10-10 నిమిషాలు చెయ్యమని హోమ్‌వర్క్‌ను ఇచ్చారు. కొంతమందికి ఇది కష్టంగా ఉంది. మరి ఆలోచించండి, ఒకవేళ 10 నిమిషాల అభ్యాసము లేకపోతే అకస్మాత్తు సమయంలో ఏమి చేస్తారు? 24 సార్లు చెయ్యడానికి కొంతమందికి సమయము కష్టంగా లభిస్తుందని బాప్‌దాదాకు తెలుసు. కానీ 10 నిమిషాలు ఒకే స్మృతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చెయ్యగలరా అని బాప్‌దాదా ట్రయల్ వేసారు. ఇప్పుడు కూడా 10 నిమిషాలే చెయ్యండి అని చెప్పడం లేదు. 10 నిమిషాలు వీలు కాకపోతే, ఎవరికి వీలవుతుందో వారు చెయ్యండి, ఒకవేళ వీలు కాకపోతే 5 నిమిషాలు చెయ్యండి, 7 నిమిషాలు, 6 నిమిషాలు. ఎంతగా పెంచగలరో అంతగా ట్రయల్ వెయ్యండి. స్వయంగా బాప్దాదాయే ఈ విషయాన్ని చెప్తున్నారు, ఇందులో అటువంటిదేమీ లేదు. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువ సమయము అని అనుకుంటే 8 నిమిషాలు, 9 నిమిషాలు, ఎంత ఎక్కువ చెయ్యగలరో అంతగా అభ్యాసం చెయ్యండి. ఎందుకంటే బహుకాలపు వరదానాన్ని ఇప్పుడు ప్రాక్టికల్లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు కూడా బహుకాలపు అభ్యాసము లేకపోతే బహుకాలపు వర్తమాన పురుషార్థ ప్రాప్తిలో, అర్థకల్పపు ఆ బహుకాలంలోను తేడా వస్తుంది. ఒకవేళ అందరూ తక్కువ సమయం ఇచ్చినట్లయితే, ఎంత వీలయితే అంతనే చెయ్యండి అని బాప్దాదాయే చెప్తున్నారు. 5 నిమిషాలకన్నా ఎక్కువ చేసారు కానీ 10 నిమిషాలు వీలు కావడం లేదంటే 7 నిమిషాలు చెయ్యండి, 8 నిమిషాలు చెయ్యండి, 5 నిమిషాలు కూడా చెయ్యవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా 10 నిమిషాలు చెయ్యగలిగితే మంచిది. ఎటువంటి సమయం వస్తుందంటే మీరు స్వయానికి మరియు విశ్వానికి కూడా కిరణాలను ఇవ్వవలసి ఉంటుంది. అందుకే బాప్‌దాదా అనుమతిని ఇస్తున్నారు. ఎంత ఎక్కువ సమయం చెయ్యగలిగితే, అంత ప్రాక్టీస్ చెయ్యండి ఎందుకంటే ఇప్పుటి బహుకాలము భవిష్యత్తుకు ఆధారము. సరేనా? కష్టంగా ఉందా, ఏమీ ఫర్వాలేదు, ఇప్పుడిక ఏమీ కాదు, బాబాకు వినిపించి మంచి పని చేసారు ఎందుకంటే 10 నిమిషాలు కూర్చోలేకపోతే, ఆలోచనలోనే గడిచిపోతే, 5 నిమిషాలు పోయినట్లే కదా. అందుకే బాప్‌దాదా అంటారు 5 నిమిషాల కన్నా తక్కువ చెయ్యకండి. ఎంతగా పెంచగలుగుతారో అంతగా పెంచుతూ ఉండండి. సరేనా, స్పష్టమయిందా? ఎందుకంటే బాప్‌దాదా ప్రతి ఒక్కరినీ ఎంతో శ్రేష్ఠ స్వరూపంలో చూస్తారు. ఇందుకు గుర్తుగా బాప్‌దాదా అందరికీ ఎన్ని స్వమానాలను ఇచ్చారు! స్వమానాల లిస్ట్‌ను తయారు చేసినట్లయితే ఎంత పెద్దది తయారవుతుంది?
ఈరోజు బాప్‌దాదా అమృతవేళ పరిక్రమణ చేసారు. ఏం చూడటానికి వెళ్ళారు? బాప్‌దాదా స్వమానాల పెద్ద లిస్ట్‌నే ఇచ్చారు. ఒకవేళ ఒక్కొక్క స్వమానంలో స్థితులై ఆ స్థితిలో కూర్చోండి. స్వమానాలను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి మరియు మాలను త్రిప్పుతూ ఉండండి అప్పుడు చాలా మజా వస్తుంది. స్వమానాల లిస్ట్ ఉంది కానీ ఒక్కొక్క స్వమానం ఎంత గొప్పది మరియు ఎవరు ఇచ్చారు! వరల్డ్ ఆల్మైటీ అథారిటీ పిల్లలు ఒక్కొక్కరికీ అనేక స్వమానాల లిస్ట్‌ను ఇచ్చారు. వాటిని ఉపయోగించండి ఎందుకంటే మీ స్వమానాన్ని తగ్గించగల అథారిటీ మరేదీ లేదు. మరెవ్వరికీ ఇంత పెద్ద స్వమానాల మాల లభించలేదు. సత్యయుగంలో అయితే రాజ్య భాగ్యం లభిస్తుంది కానీ ఈ స్వమానాల లిస్ట్ సంగమయుగ ప్రసాదము. బాప్‌దాదా పిల్లలను చూసినప్పుడల్లా పిల్లలందరినీ వారి స్వమాన స్థితితో చూస్తారు - వాహ్ పిల్లలు వాహ్! కావున స్వమాన అథారిటీలో ఉండండి, నేను ఎవరిని! ఒకసారి ఒక స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి, మరోసారి మరో స్వమానాన్ని మీ ఎదుటకు తెచ్చుకోండి మరియు పరిశీలించుకోండి. ఈరోజు అమృతవేళ ఏ విశేష స్వమానాన్ని బుద్ధిలో పెట్టుకున్నారో ఆ స్వమానము ఖజానా వంటిది కదా, దీనిని ఉపయోగించండి. ఎందుకంటే ఖజానాలు పెరగడానికి సాధనము వాటిని కార్యంలో ఎంతగా ఉపయోగిస్తామో అంతగా పెరుగుతాయి. పిల్లలు, ఎవరి వద్ద స్వమానాల స్మృతి అనే మాల పెద్దగా ఉంది, ఎవరి వద్ద చిన్నదిగా ఉంది అని బాప్‌దాదా చూసారు. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహభానం తొలగిపోతుంది. మరి ఈ రోజు బాప్‌దాదా పరిక్రమణ చేసారు మరియు చూసారు. ఎలా అయితే స్వమాన ఖజానా ఉన్నదో అలాగే ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క గుణాన్ని ఉపయోగించండి, కార్యంలో పెట్టండి. మాయ వచ్చింది అని ఏ ప్రాబ్లమ్నైతే వినిపిస్తారో, నిజానికి మాయ రాదు కానీ మాయ గురించి బాబా వినిపించి ఉన్నారు - మాయ అంటుంది నన్ను ఆహ్వానిస్తారు అందుకే వెళ్తున్నాను, ఊరికే వెళ్ళడం లేదు. ఏ విధమైన తేలికపాటి సంకల్పాన్ని అయినా చెయ్యడమంటే మాయను ఆహ్వానించినట్లే. శక్తులను వదిలితే మాయను ఆహ్వానించినట్లే. కోరుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది. ఎవరు బలశాలి ఇక్కడ? అనుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది, అప్పుడు మాయ బలశాలి అయినట్లా లేక మీరా? ఈ రోజు పాత సంవత్సరం సమాప్తం కావస్తుంది, క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఉల్సాసము, క్రొత్త ఉత్సాహము, ఎందుకంటే సంగమయుగపు ఒక్కొక్క రోజు ఉత్సాహాలు నిండిన రోజు అంటే ఉత్సవము అన్న గాయనము ఉంది. ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయంటే ప్రతి రోజూ ఉత్సవమే. అందుకే పక్కాగా ఉంచుకోండి. రోజూ నడుస్తూ తిరుగుతూ కూడా చార్ట్‌ను పెట్టుకోండి. చెక్ చేసుకోండి, చెక్ చేసుకుంటే కదా ఛేంజ్ అవ్వగలిగేది. చెక్ చేసుకోకపోతే ఛేంజ్ ఎలా అవుతారు!
ఈ రోజు క్రొత్త సంవత్సరానికి బాప్‌దాదాకు ఉన్న విశేష సంకల్పమేమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ఎలా పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తారో అలాగే మాయకు వీడ్కోలు చెప్పాలి. వ్యర్థ సంకల్పాలకు వీడ్కోలు చెప్పండి ఎందుకంటే మెజారిటీలో వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా ఉండటాన్ని చూసాము. వికారీ సంకల్పాలు తక్కువగానే ఉన్నాయి, ఉన్నాయి కానీ తక్కువగా ఉన్నాయి. వ్యర్థం యొక్క నామరూపాలు సమాప్తమైపోవాలి. ప్రతి సంకల్పము సమర్థవంతంగా ఉండాలి. వ్యర్థంగా పోకూడదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలలో కేవలం సంకల్పాలు మాత్రమే నడవడంలేదు అందులో సమయం కూడా వ్యర్థంగా పోతుంది మరియు తండ్రి సమానంగా అయ్యేందులో దూరం ఏర్పడుతుంది. సమానంగా అవ్వాలన్న కోరిక అయితే ఉంది, ఇందులో చేతులైతే ఎత్తారు. కానీ బాప్‌దాదా సదా మనసు యొక్క చేతిని ఎత్తమని అంటూ ఉంటారు. ఈ చేతిని ఎత్తడం చాలా ఈజీ. మరి వీడ్కోలు చెప్పే ధైర్యముందా? ఉందా ధైర్యం? చేతులెత్తండి. అచ్ఛా, ధైర్యవంతులు. ధైర్యాన్ని స్థిరంగా మీ వద్ద ఉంచుకోండి. ధైర్యముంటే పెట్టుకున్న లక్ష్యాన్ని తప్పక చేరుకుంటారు ఎందుకంటే బాప్‌దాదా తోడు ఉంటుంది కనుక. నా పిల్లలెవ్వరూ వెనుక ఉండిపోకూడదు అని బాప్‌దాదా అనుకుంటారు. చేతిలో చేయి వేసి నడవాలి. శివబాబా నిరాకారుడు, చేయి లేదు కానీ శ్రీమతమే వారి చేయి. అడుగు-అడుగులో శ్రీమతంపై నడవడము అంటే చేతిలో చేయి వేసి నడిచినట్లే. అందరికీ క్రొత్త సంవత్సరానికి, క్రొత్త జీవితానికి మరియు క్రొత్త యుగానికి మూడింటికీ పదమా పదమ రెట్లు అభినందనలు.
అచ్ఛా, ఈసారి క్రొత్తగా వచ్చినవారు లేచి నిల్చోండి. అచ్ఛా. చాలామంది వచ్చారు. సగం సంగఠన క్రొత్త వారున్నారు. క్రొత్తగా వచ్చిన మీ అందరికీ పూర్తి బ్రాహ్మణ పరివారం తరఫున, బాప్‌దాదా తరఫున మధువనానికి వచ్చినందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. అభినందనలతో పాటు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - ఇప్పుడు సాధారణ పురుషార్థానికి సమయం అయిపోయింది. ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసే సమయము. మీ అందరూ లేట్‌గా వచ్చారు కానీ బాప్‌దాదాకు ప్రియులు. టూ లేట్‌కు బదులుగా లేట్‌గా వచ్చారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. లక్ సమయంలో చేరుకున్నారు అందుకే ఎవరైతే వచ్చారో, అందరూ బాప్‌దాదాకు ప్రియులే అందుకే నడవకండి, ఎగరండి. ఇప్పుడు నడిస్తే ముందు నంబర్‌ను తీసుకోలేరు అందుకే ఎగిరే కళలో నడవండి. నడవడం కాదు ఎగరాలి. ఎగరడం ఫాస్ట్‌గా అవుతుంది కదా. ఎగిరే కళతో ముందుకు వెళ్ళగలరు. ఇది మార్జిన్. దీనినే తీవ్ర పురుషార్థము అని అంటారు. మరి ఏమి చేస్తారు? ఎగురుతారా? ఎగురుతారా? అచ్ఛా. అనవసరమైన విషయాలు ఏవైతే వస్తాయో, నిజానికి రాకూడదు కానీ వచ్చేస్తాయి ఎందుకంటే పేపర్ అయితే రావాలి కదా! మరి ఏమి చేస్తారు? ఇటువంటివేవైనా వస్తే బాప్‌దాదాకు ఇచ్చేయండి. ఇవ్వడమైతే వచ్చు కదా! తీసుకోవడమైతే వచ్చు కానీ ఇవ్వడం కూడా వచ్చు కదా? చిన్నవారిగా అయిపోండి. చిన్న పిల్లలు ఏమి చేస్తారు? వారికి నచ్చని వస్తువును ఏమి చేస్తారు? మమ్మీ ఇది మీరు సంభాళించండి. అలాగే చిన్నవారిగా అయిపోయి బాబాకు ఇచ్చేయండి. అయినా మళ్ళీ వస్తే, వస్తుంది, చాలా సమయం పెట్టుకున్నారు కదా, వదిలి పెట్టినా కానీ మళ్ళీ వస్తుంది. ఒకవేళ వచ్చినాకానీ ఇచ్చేసిన వస్తువును మళ్ళీ ఉపయోగించవచ్చా! ఇవ్వడము అంటే మీ వద్దకు వచ్చిందంటే అది మీ సొత్తు అయినట్లు. మీరైతే ఇచ్చేసారు కదా! తండ్రి సొత్తులో మీరు తీసుకోవద్దు. మీకు సహకారం లభిస్తుంది. కానీ ఇది నాది కాదు, ఇది తండ్రి సొత్తు. నేనైతే ఇచ్చేసాను, ఇందులో లాభముంది. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మరియు మీరు పురుషార్థం తీవ్రంగా చెయ్యాలి. ఎవరైతే క్రొత్తగా వచ్చారో వారిని బాప్‌దాదా లక్కీ మరియు లవ్లీ అని అంటున్నారు, ఎందుకంటే వచ్చారు, నా బాబా అని అనైతే అన్నారు. నా బాబా అనేవారు చేతులెత్తండి. వచ్చిన వారంతా నా బాబా అని అనేవారే. నా బాబా అన్నప్పుడు మరింకేదైనా నాది ఉందా? బాబాయే నా వారు కదా. బాబాపై అధికారాన్ని పెట్టి తండ్రి సొత్తుగా భావించి తండ్రికి ఇచ్చేయండి. దానిని మళ్ళీ మీ వద్దకు రానివ్వకండి. బాగుంది. బాబాను గుర్తించినందుకు బాబాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎగరాలి, నడవడం కాదు, ఎగరాలి అని పక్కా పక్కా గుర్తుంచుకోండి. అచ్ఛా, చాలా బాగుంది. బ్రాహ్మణీలు, క్లాస్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు తమ వద్దకు వచ్చే క్రొత్త సోదరసదోరీలపై దయ చూపాలి. ప్రతి వారం వారిని క్షేమ సమాచారాలను కనుక్కోండి, ఏ ప్రాబ్లమ్ లేదు కదా! ఏదైనా సమస్య ఉంటే వినిపించండి, దాని నివారణను పొందండి. అలా వదిలెయ్యకండి. పరిస్థితి వచ్చింది, వెళ్ళింది. మనసులో పెట్టుకోకండి. అచ్ఛా. పూర్తి పరివారం నుండి కూడా అభినందనలు.
సేవ టర్న్ గుజరాత్ వారిది:- (8 వేల మంది గుజరాత్ వారున్నారు) బాప్‌దాదా ముందుకూడా వినిపించి ఉన్నారు గుజరాత్ అనగా గతించిపోయిన రాత్రి. గుజరాత్లో సదా ముందుకు వెళ్తూ అందరినీ ముందుకు తీసుకువెళ్ళే ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి, ఉండాలి కూడా ఎందుకంటే గుజరాత్లో కూడా, మహారాష్ట్రలో కూడా ఉంది కానీ గుజరాత్ సంఖ్యగానీ, టీచర్లుకానీ తక్కువ సంఖ్యలో లేరు. గుజరాత్లో అయితే నలువైపుల సేవ అయితే ఉంది, గీతా పాఠశాలలు కూడా చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు మిగిలిపోయిన పని ఏమిటి? ఇప్పుడు గుజరాత్, ప్రతి సెంటర్, గీతా పాఠశాలను విడిచిపెట్టండి, తమ తమ సెంటర్లోని వారసుల లిస్ట్‌ను తయారు చెయ్యండి. వారసులు, విద్యార్థులు కాదు వారసులు, వారి లిస్ట్ గుజరాత్లో పెద్దగా ఉండి ఉండాలి ఎందుకంటే బాప్‌దాదా అయితే సమయ సూచనను ఇస్తున్నారు. ఇప్పుడు సమయానుసారంగా క్రొత్త సంవత్సరంలో ఈ విషయంపై కూడా అటెన్షన్ పెట్టాలి. ప్రతి జోన్వారికి కూడా చెప్పడం జరుగుతుంది, ప్రతి జోన్‌వారు లిస్ట్‌ను తయారు చెయ్యండి. అన్ని జోన్లలోని వారసుల లిస్ట్‌లో ముందు నంబర్లో ఉన్నదెవరు? ఎందుకంటే ఇప్పుడు బంగారు ప్రపంచం కోసం రాజ్యాన్ని కూడా తయారు చేసుకోవాలి కదా! సింహాసనంపై అయితే లక్ష్మీనారాయణులే కూర్చుంటారు కానీ అక్కడి రాజ్య అధికారి సభను కూడా తయారు చేసుకోవాలి. రాయల్ ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, సాధారణ ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ఎటువంటి వారసులను తయారు చేసుకోండంటే సంబంధ - సంపర్కాలలో ఇప్పటి నుండే సమీపంగా ఉండాలి మరియు అక్కడ కూడా సమీపంగా ఉండాలి. వారసుల గుర్తు ఏమిటి? ఒకటి, వారసులు అనగా ప్రతి శ్రీమతంపై నడిచేవారు. బాబా చెప్పారు పిల్లలు చేసారు. ప్రతి కార్యంలో మనసా కావచ్చు, వాచ కావచ్చు, కర్మణ కావచ్చు, సంబంధ సంపర్కంలో పరివార జీవితంలో కావచ్చు, వచ్చేవారు విద్యార్థి కాక పరివార నేచర్ కలిగిన వారై ఉండాలి. ఫ్యామిలీ అంటే ఒకరినొకరు తెలుసుకోవడము, అర్థం చేసుకోవడము, పరివారంలో కూడా చక్కగా ఉండాలి. 4 నిశ్చయాలేవైతే వినిపించి ఉన్నామో, వారసులలో 4 నిశ్చయాలు ప్రాక్టికల్ లైఫ్‌లో ఉంటాయి. పూర్తి పరివార ప్రేమ ఉంటుంది, కొందరికి ప్రియంగా మరికొందరికి ప్రియంగా ఉండకుండా ఉండరు. పూర్తి పరివారానికి ప్రియంగా ఉంటారు. ఇటువంటి వారస క్వాలిటీ ఇప్పుడు కావాలి. ప్రజలైతే తయారవుతూ ఉంటారు, సాధారణ ప్రజలు. కానీ ఇప్పుడు సమీపంగా ఉండే వారసులను తయారు చెయ్యండి. రాజధాని అయితే ఇక్కడే తయారు చెయ్యాలి కదా. అందుకే ఈ విషయంలో ఏ జోన్ నంబర్‌వన్‌గా ఉంది అని ఈ సంవత్సరం చూసుకోండి. వర్గాల వారికి మరో సేవను ఇచ్చి ఉన్నాము. ఒకటి-వారసులను తయారు చెయ్యడము, రెండు-సంబంధ సంపర్కంలో ఉండేవారిని మైక్‌గా తయారు చెయడము. మైక్ మరియు వారసులను ఇద్దరినీ తయారు చెయ్యండి. ఇంకా సమయము ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ వారిలో బహుకాలపు పురుషార్థము తగ్గిపోతూ ఉంటుంది. అందుకే గుజరాత్ అద్భుతం చేస్తుంది కదా. బాగుంది. గుజరాత్లో టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. టీచర్లు చేతులెత్తండి. చూడండి, ఎంతమంది టీచర్లు ఉన్నారో, ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క వారసుడిని తయారు చేయండి. పాత సెంటర్లు ఉన్నాయి. బాప్‌దాదా ఇచ్చిన డైరెక్టు సూచనతో గుజరాత్ సేవ ఆరంభమయింది అంటే బాప్‌దాదా దృష్టితో గుజరాత్ తయారైంది. అది కూడా పని చేస్తుంది కదా. మంచి హ్యాండ్స్ ఉన్నారు. చెయ్యగలరు. చేసేవారు మరియు చెయ్యగలరు. సెంటర్లు ఎన్నో ప్రోగ్రామ్‌లను చేసాయి, మంచిగా చేస్తారు. ప్రోగ్రామ్‌లు మంచిగా చేసారు, ఇప్పుడు వారసులలో నంబర్‌వన్‌గా అవ్వండి. సరేనా? చేస్తారా? టీచర్లు చేతులెత్తండి. మరి ఈ సంవత్సరంలో, సంవత్సరంలోపు ఎంతమంది టీచర్లు ఉన్నారో అంతమంది వారసులను మధువనానికి తీసుకురావాలి. తెస్తారా? ఇప్పుడైతే గుజరాత్ టర్న్, అందుకే వారికి చెప్తున్నాము కానీ బాప్‌దాదా అన్ని జోన్లవారికి చెప్తున్నారు. ఎవరైతే నంబర్‌వన్ వస్తారో వారికి మంచి బహుమతి ఉంటుంది. జోన్ వారు ఎవరైతే కూర్చున్నారో వారు చేతులెత్తండి. ఇంకెవరు ఉన్నారు? సోదరులు కూడా చేతులెత్తండి. సరేనా. బాగుంది. మొదటి నంబర్‌లోకి ఎవరు వస్తారో చూస్తాము. క్వాలిటీ కూడా చూస్తాము. వారసులైతే చేసారు కానీ దాని క్వాలిటీ ఎలా ఉంది! ఎందుకంటే బాప్‌దాదా ఇప్పుడు సమయం యొక్క సూచనను పదే పదే ఇస్తున్నారు. ఇంకా సమయం ఉందనుకున్నాము మేము అని మళ్ళీ అనకండి ఎందుకంటే ఇప్పుడు స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోవాలి, సేవలో కూడా ముందుకెళ్ళాలి, రెండు పనులు ఉన్నాయి. ఒకటి పురుషార్థము. పురుషార్థంలో ఒకటి స్మృతి మరియు రెండవది సేవ, రెండింటిలో నంబర్‌వన్ రావాలి. మూడవది, స్వభావ సంస్కారాలలో పరివర్తన. వీరైతే మంచివారు కానీ... అని ఇప్పుడు అనకండి. వీరు మంచివారు. దీనిని చాలా మంచిది అని అంటారు ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి. మీరు చెయ్యాలనుకున్నా సేవను చెయ్యలేరు. విషయాలు ఎలా ఉంటాయంటే వ్యర్థ సంకల్పాలు తీసుకువచ్చేస్తాయి. అందుకే తీవ్ర పురుషార్థము. భూమిపై పాదాలు ఉండకూడదు. ఎగురుతూ ఉండండి. ఫరిశ్తా పాదాలు భూమిపై ఉన్నట్లుగా చూపించరు. ఈ స్థూల పాదాలు కాదు, స్థితి అనే పాదాలు. గుజరాత్ వారు బాప్‌దాదాకు, మధువనానికి ఎంతో సహయోగులుగా ఉన్నారు. దగ్గరలో ఉన్నారు కదా. ఎప్పుడు ఏ విషయమున్నా కానీ ఎవర్ని పిలుస్తారు? ఫోన్లు వస్తూ ఉంటాయి కదా, గుజరాత్ నుండి ఇంతమందిని పంపండి అని. బాగుంది, దగ్గరగా ఉండటంలో లాభము ఉంది, ప్రాప్తి కూడా ఉంది. అందుకే గుజరాత్ లోని రెగ్యులర్ విద్యార్థులు అందరూ బాప్‌దాదా చెప్పే ఒక్కొక్క శ్రీమతంపై నడిచే సాంపుల్‌గా అవ్వాలి. ఎవ్వరు సెంటర్ వెళ్ళినా ఎలా కనిపించాలంటే వీరందరూ బాప్‌దాదాకు సమీప రత్నాలుగా ఉన్నారు అని అనిపించాలి. సరేనా! ఇలా భావించే విద్యార్థులు చేతులెత్తండి. ఏ శ్రీమతమూ తగ్గకూడదు. సరేనా, ధైర్యవంతులే కదా. మంచి ధైర్యముంది.
జ్యూరిస్ట్, కల్చరల్ మరియు సెక్యూరిటి వింగ్:- బాగుంది, మూడు వింగ్‌ల వారు తమ తమ సేవలను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికీ మేము చెయ్యాలి అన్న ఉత్సాహము ఉంది కానీ ఇప్పుడు బాప్‌దాదా ఏదైతే పని ఇచ్చారో, ఎటువంటి మైక్‌లను తయారు చెయ్యండంటే సభలో వారు ఒక ఉదాహరణగా కనిపించాలి. బ్రహ్మా కుమారులుగా అయ్యాక కార్య వ్యవహారాలు చూసుకోలేరు అన్న వాతావరణం ఏదైతే తయారై ఉన్నదో ఆ అనుభవం వినడంకన్నా ప్రాక్టికల్‌గా చూడాలి. ఇక్కడ ఇటువంటి వారు ఒక్కరు కాదు, ఒక్క వర్గానికి అనేకులు ఉన్నారు అని తెలియాలి. ప్రాక్టికల్ అనుభవీగా చూడటం వలన ఉత్సాహం వస్తుంది, సహజంగా కూడా అనిపిస్తుంది. మేము కూడా ఇలా చెయ్యగలము అని అనిపిస్తుంది. మరి వింగ్‌లో రెగ్యులర్ విద్యార్థిగా చేసే సేవ చాలా మంచిగా అవ్వగలదు. మీరు ఎంత సేవ అయితే చేసారో దాని ద్వారా రెగ్యులర్ విద్యార్థులు ఎంతమంది తయారయ్యారు? వర్గాల సేవ ఆరంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు రిజల్ట్‌ను తీసినట్లయితే ప్రతి వర్గం నుండి రెగ్యులర్ విద్యార్థులు ఎంతమంది తయారయ్యారు? ఎటువంటి క్వాలిటీ వారు తయారయ్యారు? ఎందుకంటే చాలా సమయంనుండి వర్గాల సేవ జరుగుతుంది. అందరూ కూడా ఎంతో ప్రేమతో చేస్తారు. వేర్వేరు సేవలను చేసే ఛాన్స్ లభించింది కదా. కనుక ఇప్పుడు ఈ రిజల్ట్‌ను తయారు చెయ్యండి. కనెక్షన్ వారు ఎంతమంది ఉన్నారు? రెగ్యులర్ వారు ఎంతమంది ఉన్నారు? రెగ్యులర్‌గా ఉండేవారి చార్ట్ మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ప్రతి వర్గంవారు ఈ రిజల్టును తయారు చెయ్యండి. అప్పుడప్పుడూ వచ్చేవారు కూడా ఉంటారు. ఏదైనా ఫంక్షన్లో వస్తారు, ఏదైనా ప్రోగ్రామ్‌లో వస్తారు, కానీ బాబా పిల్లలుగా అవ్వాలి. ఎందుకంటే ఈ కార్యమైతే జరుగుతూనే ఉంటుంది, మరి రిజల్ట్ కూడా రావాలి కదా. మంచిది. బాప్‌దాదా ఏమి చూసారంటే ఈ మూడు వర్గాలు ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో పరస్పరంలో మీటింగ్ చేసుకుంటున్నారు. మధ్యమధ్యలో ఉత్సాహాన్ని పెంచుకునేందుకు పత్ర వ్యవహారాలను కూడా చేస్తున్నారు. రిజల్ట్ అయితే తప్పక ఉండే ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరము ప్రతి సారి, బాప్‌దాదా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, సేవా అవకాశాన్ని తీసుకుంటున్నారు, మంచిది. అందరూ సంతుష్టంగా ఉన్నారా? మూడింటి హెడ్స్ చేతులెత్తండి. అచ్ఛా. మీ వింగ్‌లో ఎవరైతే వస్తారో, మీటింగ్ చేస్తారో, ప్రోగ్రామ్ చేస్తారో, పరస్పరంలో కలుసుకుంటూ ఉంటారు. మరి అందరూ ఉల్లాసంగా ఉన్నారా? ఏ ప్లాన్ అయితే తయారవుతుందో, ఉదాహరణకు మీటింగ్‌లో ప్రోగ్రామ్ తయారైంది. అన్ని జోన్లు ఉన్నాయి, అందులో మీ ప్లాన్ ఏదైతే ఉందో దానిని మీ వింగ్ మెంబర్ తన ఏరియాలో మాత్రమే ప్రాక్టికల్‌గా చేస్తూ ఉంటారు, ఈ సమాచారాన్ని మీరు తీసుకుంటూ ఉంటారా? ఎందుకంటే వింగ్ యొక్క పెద్ద ఆఫీసైతే ఒక చోట సెంటరులో ఉంటుంది కానీ సేవ పూర్తి జోన్లో జరగాలి, కేవలం ఒకరిద్దరితో కాదు. మెంబర్లు తమ తమ స్థానాలలో చేస్తూనే ఉండవచ్చు కానీ ఏ సెంటర్లో అయితే మెంబర్లు లేరో అక్కడ కూడా మీ ప్లాన్ జరగాలి ఎందుకంటే ఇది ప్రపంచానికి సంబంధించిన విషయము కదా. దీనిపై అటెన్షన్ పెట్టండి, రిజల్ట్‌ను తీసుకోండి. ఒక్కొక్క సెంటర్ ప్రాక్టికల్లోకి తీసుకు వచ్చింది, ఎక్కడ కష్టంగా అనిపించింది? ప్రాక్టికల్లోకి తీసుకురాకపోతే కష్టమేమిటి? దానికోసం వింగ్ వారు సాల్వేషన్ ఇవ్వండి. ఎలా అయితే ప్రోగ్రామ్‌ను తయారు చేసారు, ఒకేసారి చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. కనుక వింగ్ యొక్క ఒకే ప్రోగ్రామ్ అన్ని చోట్ల జరగాలి, అప్పుడు పేరు ప్రసిద్ధమవుతుంది. ఇటువంటి రిపోర్ట్‌ను తీసుకోండి, ప్రతి పట్టణంలో అన్ని వర్గాల సేవ జరగాలి. అప్పుడే పేరు ప్రసిద్ధమవుతుంది. ఇకపోతే బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. కృషి చేస్తున్నారు. ముగ్గురూ తమ తమ వింగ్ పేర్లను అర్థం చేసుకోండి. కార్యం చేస్తున్నారు కానీ విస్తరింపజేయండి. ప్రతి స్థానం నుండి ప్రసిద్ధమైనవారు తయారు కావాలి. వారికి ఉత్సాహాన్ని ఇవ్వవలసి ఉంటుంది. సరేనా. అచ్ఛా.
60 దేశాల నుండి 650 మంది డబల్ విదేశీ సోదరసోదరీలు వచ్చారు:- ముందుగా ఫారెన్ యూత్ గ్రూప్ లేవండి. బాగుంది. ఫారెన్‌లో యూత్ గ్రూప్ సేవ చేస్తుంది. బాప్‌దాదా ఈ సమాచారాన్ని కూడా విన్నారు మరియు బాప్‌దాదాకు మంచిగా కూడా అనిపించింది. విశేషమైన ఫారెన్ యూత్ ఎలా తయారవ్వాలంటే ఒకరోజు యూత్ అందరూ కాకపోయినా, కొందరు ఫారెన్ యూత్ మరికొందరు ఇక్కడి యూత్ కలిసి ఢిల్లీలో ప్రధాన మంత్రి లేక మరో పెద్ద మంత్రిని కలవడానికి వెళ్ళాలి, ప్రత్యక్షంగా ఫారెన్ యూత్ కూడా మారుతుంది అని వారికి కనిపించాలి. ఇండియా వారు కూడా మారుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇప్పుడు యూత్‌తో చాలా సమస్యగా ఉంది. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రాక్టికల్‌గా చూసినట్లయితే, ఎగ్జాంపుల్ చూస్తే వారు అర్థం చేసుకుంటారు. అంతేకాక ప్రభుత్వంలోని ఆ వర్గానికి చెందిన మంత్రి వద్దకు విశేషంగా వెళ్ళి కలవాలి. కలిసినప్పుడు వారు అర్థం చేసుకుంటారు, ఇటువంటి దుఃఖము, అశాంతి వాతావరణంలో ఒకవైపు ఇవి, మరోవైపు తమోగుణి వైబ్రేషన్లు, రెండింటి మధ్యలో యూత్ పరివర్తన చెంది ముందుకు వెళ్తున్నారు అప్పుడు బయట వారికి సంస్థపై అటెన్షన్ వెళ్తుంది. ప్రతి వర్గంవారు ప్రధాన మంత్రిని కాక, ఆ వర్గానికి చెందిన మంత్రి దగ్గరకు కనీసం చిన్న గ్రూప్ అయినా తయారై వెళ్ళి సమాచారాన్ని వినిపించాలి. అప్పుడు, వీరు అన్ని వర్గాల సేవను చేస్తారు అని పూర్తి మినిస్ట్రీలో ఈ విషయం తెలిస్తుంది. బాప్‌దాదా కూడా యూత్ గ్రూప్‌లో వచ్చిన మార్పును చూసి సంతోషిస్తున్నారు. కానీ ఏ యూత్ అయితే స్వయంతో సంతుష్టంగా ఉన్నారో వారు వెళ్ళండి. ప్రాక్టికల్ లైఫ్‌లో ఉండాలి. ఎవరు వినిపించినా వినిపించకపోయినా కానీ ఎవరైతే ముందు స్వయంతో తృప్తిగా ఉంటారో వారు ఉదాహరణగా కావాలన్నది బాబా నియమము. యూత్ సమస్యలను పరిష్కరించడానికి ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారి సహాయాన్ని తీసుకోండి. ఏది ఏమైనా తమలోని బలహీనతలను తొలగించుకోవలసిందే. ఇటువంటి యూత్ వైబ్రేషన్లను వ్యాపింపజెయ్యగలరు. సందేశాన్ని వ్యాపింపజేయగలరు. ఎలా ఎలా అయితే సందేశం విస్తరిస్తూ ఉంటుందో అంతంతగా ఈ కార్యం యొక్క ప్రభావం పడుతుంది. మరి ఎవరైతే గ్రూప్‌వారు నిమిత్తమై ఉన్నారో వారు స్వయాన్ని ఎంతో సంభాళించుకోవలసి వస్తుంది, పూర్తి ఉదాహరణగా కావాలి. సరేనా. యూత్ అందరూ మంచిగా ఉన్నారు కదా! బాప్‌దాదా మీ అందరినీ చూసి చాలా-చాలా సంతోషిస్తున్నారు. ఇటువంటి ఉదాహరణమూర్తులు చాలా కార్యాన్ని చేస్తారు. ఇప్పుడైతే మీరు వెళ్తున్నారు, తర్వాత మీకే స్వయంగా ఆహ్వానం లభిస్తుంది. బాగుంది. ముందుకు వెళ్తూ ఉండండి, అందరినీ తీసుకువెళ్ళండి. ఫారెన్ యూత్ కానీ ఇండియా యూత్ కానీ అందరిపై బాప్‌దాదా ఆశ ఇదే. చాలా చాలా శుభ ఆశలు ఉన్నాయి. అభినందనలు కూడా ఉన్నాయి, ఆశలు కూడా ఉన్నాయి. అచ్ఛా.
డబల్ విదేశీ చిన్న పిల్లలు:- (పిల్లలు పాట పాడారు - ఛోటే ఛోటే ఫూల్ హై హమ్, హమ్ కిసీసే కమ్ నహీ) పిల్లలందరూ పువ్వుల్లాగే ఉంటున్నారు కదా. బాబా శ్రీమతం అనుసారంగా నడుచుకుంటున్నారా? నడిచేవారు చేతులెత్తండి. అచ్ఛా. మీరు లక్కీ పిల్లలు ఎందుకంటే చిన్నతనంలోనే బాప్‌దాదా మిలనం చేసుకుంటున్నారు. అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు. పెద్ద పెద్దవారు, పెద్ద పెద్ద కంపెనీలవారు పిల్లలైన మిమ్మల్ని పిలిచే రోజు కూడా వస్తుంది. ఈ విధంగా ఇటువంటి అదృష్టవంతులైన పిల్లలుగా తయారైన వారు ఎవరు? అందుకే పిల్లలందరూ తమ ధారణలను పక్కాగా పెట్టుకోండి. ఎప్పుడూ ఏ ధారణనూ విడిచిపెట్టకండి. ఎందుకంటే బాప్‌దాదా మరియు లౌకిక తండ్రికి ముగ్గురికీ పిల్లలు మీరు. మరి అద్భుతాన్ని చూపిస్తారు కదా. అందరూ మంచి అద్భుతాన్ని చేసి చూపించాలి. అచ్ఛా.
డబల్ విదేశీ సోదరసోదరీలందరితో:- అచ్ఛా, సింధీ గ్రూప్ కూడా వచ్చింది. చాలా మంచిది. బాబాపై ప్రేమ ఉంది కదా. బాబాపై ఎంతో ప్రేమ ఉంది కదా. బాబా కూడా మిమ్మల్ని ఎందుకు గుర్తు చేస్తారు? ఎందుకు గుర్తు చేస్తారు? సింధ్‌లోనే బాబా వచ్చారు కదా. ఏ దేశంలో వచ్చారో అక్కడి నుండి బహుమతి కావాలి కదా. అందుకని బాబా అంటారు, సింధీవారు ఎటువంటి కార్యాన్ని చేసి చూపించాలంటే అనేక సింధీ ఆత్మల సేవకు వారు నిమిత్తమవ్వాలి.
ప్రతి సీజన్లో ఫారెనర్లు మధువనానికి అందం తెచ్చి పెడ్తారు- ఈ విషయం బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది. మంచి ఉల్లాస ఉత్సాహము ఉంది, 60 దేశాలనుండి వచ్చారంటే అంత సేవ జరిగిందని అర్థం కదా. ఎవరు ఎక్కడ ఉన్నాకానీ సేవ లేనిదే బ్రతకలేరు. ఎవరు కలిసినా కానీ వారికి ఏమని చెప్పాలి? మిగతా విషయాలలోకి అయితే వెళ్ళలేము అయినా ఇన్ని దేశాలలో ఇంత సేవ జరిగుతుంది కదా. ఇప్పుడైతే ఇతరులకు సందేశాన్ని ఇవ్వడానికి ఫారెనర్స్ యొక్క మంచి మంచి గ్రూపులు తయారయ్యాయి. రకరకాల కోర్సులు కూడా చేయిస్తారు. ఎలా అయితే భారతదేశం వారు సేవను విస్తరిస్తున్నారో అలాగే విదేశీయులు కూడా వ్యాపింపజేయడాన్ని బాప్‌దాదా చూసారు. మరి పూర్తి విశ్వంలో బాబా సందేశమైతే చేరుకుంటుంది. ఫారెన్వారు కూడా తమ తమ ఏరియాలలో ప్రయత్నం చేస్తున్నారు. చేసారు కూడా. మీ చుట్టుప్రక్కల ఏదో ఒక ప్రోగ్రామును తయారు చేసి సందేశాన్ని ఇవ్వండి, బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఎవరైతే సేవలో భిన్న భిన్న ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారో, సందేశమును ఇస్తున్నారో వారు చేతులెత్తండి. సేవ చేస్తూ ఉంటారు, చేస్తున్నారు కదా! ఎందుకు? బాబా అంటారు, నా పిల్లలు ప్రతి ఒక్కరూ సందేశాన్ని అందించే సందేశకులు అని. సందేశమునైతే ఇస్తున్నారు కదా! అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ సందేశకులు. సందేశాన్ని ఇచ్చేవారు! ఎవరిని కలిసినా ఏమి మాట్లాడుకోవాలి? కనీసం అనుభవాలైతే వినిపించాలి కదా. అంటే సందేశమైతే ఇచ్చారు కదా. బాప్‌దాదాకు కూడా మంచిగా అనిపిస్తుంది. విశేషంగా విదేశీయులను బాప్‌దాదా ఎందుకు గుర్తు చేస్తారు? పిల్లలందరినీ గుర్తు చేస్తారు కానీ విదేశీయులను ప్రత్యేకంగా గుర్తు చేస్తారు , ఎందుకు గుర్తు చేస్తారు? ఒక్క ఈ బ్రహ్మా కుమారీల స్టేజ్ మీదనే భిన్న భిన్న ధర్మాలవారు, ఒకే డ్రస్సు వారిగా అయ్యి స్టేజ్ మీద కూర్చుంటారు. ఇప్పుడు మీరు ఏ డ్రస్‌లో కూర్చుంటారు? తెల్లని వస్త్రాలలో కూర్చుంటారు కదా! ముస్లిం కూడా, క్రిస్టియన్ కూడా, బౌద్ధులు కూడా అందరూ ఒకే స్టేజ్‌పై కూర్చుని ఉంటారు. ఇలా అందరూ ఒక పరివారమైపోయారు. ఈ విశేషత చాలా బాగుంది. అందరూ సేవను చేస్తున్నారు! ఇప్పుడు క్రొత్త సంవత్సరం వస్తుంది కదా. మరి దీని నుండి లాభాన్ని తీసుకోవాలి. తమ తమ కనెక్షన్ వారికి ఈ విషయాన్ని వినిపించండి, బహుమతిని ఇవ్వండి, మా బహుమతి అతీతమైనది అని చెప్పండి. ప్రతి సంబంధీకునికి, కనెక్షన్ వారికి, అభినందనలు తెలుపుతూ వెళ్ళండి. బహుమతిని ఇవ్వండి - ఏదో ఒక గుణాన్ని, శక్తిని ఇవ్వండి. మేము మీ అందరికీ ఒక విశేషమైన, అతీతమైన బహుమతిని తీసుకువచ్చాము అని చెప్పండి. ఈ బహుమతితో తమ వర్తమానము మరియు భవిష్యత్తు ఎంతో మంచిగా అవుతుంది. వారికి ఇటువంటి మంచి మంచి మాటలను వినిపించాలి. ఎందుకంటే సేవ చేసేందుకు క్రొత్త సంవత్సరం ఒక ఛాన్స్. అచ్ఛా. బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు, ఫారెన్ సేవలపై సంతోషంగా ఉన్నారు. సంగఠన కూడా మంచిగా చేసుకుంటారు. ప్రతి కార్యంలో ముందుకు వెళ్తూ ఉండండి. ఇప్పుడు మరింత ముందుకు వెళ్తూ ఉండండి. ప్రతి కార్యంలో మరింత ముందుకు వెళ్ళండి. అచ్ఛా.
వెనుక కూర్చున్నవారికి బాప్‌దాదా వరదానం ఇస్తున్నారు, మధువనం మేళాకు వచ్చారు కదా. మధువన మేళాలో వచ్చినవారికి వెనుక కూర్చునే అవకాశం లభించింది. మేము వెనుక ఉన్నాము అని భావించకండి. వెనుక కూర్చున్నవారు బాప్‌దాదా మనసులో ఉన్నారు. (వచ్చినవారు 22 వేలకన్నా ఎక్కువ మంది ఉన్నారు, టోటల్ 25వేల గ్రూప్, బయట కూడా కూర్చుని ఉన్నారు). తప్పక రండి, వాతావరణాన్ని చూడలేదు, స్థానాన్ని చూడలేదు, టెంట్లో కూడా పడుకున్నారు. బాప్‌దాదా ముఖ్యంగా అన్ని టెంట్లలో పరిక్రమణ చెయ్యడానికి వచ్చారు. వెనుక కూర్చున్నవారిని బాప్‌దాదా తమ హృదయంలో ఇముడ్చుకుంటున్నారు. అందుకే ఎవరు ఎక్కడ కూర్చున్నాకానీ అందరినీ బాప్‌దాదా ఎదురుగా నయనాలలో ఇముడ్చుకుని ప్రియస్మృతులను కూడా తెలుపుతున్నారు, అభినందనలను కూడా ఇస్తున్నారు. ఇప్పుడైతే ఇక బ్రాహ్మణ పరివారం రోజురోజుకీ పెరగవలసిందే. బాప్‌దాదా కూడా పరివారాన్ని చూసి సంతోషిస్తున్నారు. వాహ్ ఈశ్వరీయ పరమాత్మ పరివారము వాహ్! అచ్ఛా.
ఈరోజు 12 గంటల వరకు కూర్చోవాలి. కలిసి కూర్చునే అవకాశము.
ఇప్పుడు నలువైపుల దేశ విదేశాలలో ఉన్న తండ్రికి ప్రియమైనవారు, తండ్రికి గారాల పిల్లలు, తండ్రిని చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు వీడ్కోలు మరియు అభినందనలు. పాత సంవత్సరంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు చెప్పేవారు, పాత స్వభావానికి కూడా వీడ్కోలు చెప్పే మహావీర్ పిల్లలకు, ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే వారికి, బాప్‌దాదా ఇచ్చే స్వమానాల స్థితిలో ఉండి అనుభవం చేసుకునే వారు, ప్రతి ఒక్కరినీ బాబా ఎలా చూస్తున్నారంటే పిల్లలు ఒక్కొక్కరూ 21 జన్మల వారసత్వానికి అధికారులు, పూర్తి కల్పంలో 21 జన్మలకు అధికారులుగా అయ్యే వారసత్వం మీకు మాత్రమే లభిస్తుంది. నలు వైపుల ఉన్న ఇటువంటి శ్రేష్ఠ అధికారి పిల్లలకు బాప్‌దాదా, తండ్రి శిక్షకుడు మరియు గురువు రూపంలో మూడు రూపాలలో ప్రియస్మృతులు మరియు నమస్తే ఇస్తున్నారు.
దాదీ రుక్మిణితో:- బాగుంది, శరీరాన్ని నడిపించడం వచ్చింది. మనసుతో యవ్వనంగా ఉన్నారు. మనసు యవ్వనంగా ఉంది. బాగుంది. సేవలో ఎప్పుడూ తోడుగా నిలిచారు కదా. అచ్ఛా.
పర్దాదీతో:- బాగుంది, వీరికి కూడా నడిపించడం బాగా వచ్చు. నడిపించేవారు కూడా బాగున్నారు, నడవడం కూడా వచ్చు.
ముగ్గురు పెద్ద అన్నయ్యలతో:- క్రొత్త సంవత్సరంలో ఏదైనా క్రొత్తగా చేసి చూపిస్తారు కదా. (క్రొత్త సంవత్సరంలో ఏ నవీనతను చెయ్యాలి?) ఒకటి, పరివారాన్ని స్థితిలో శక్తిశాలిగా నిలిపే ప్లాన్ మరియు రెండు, సేవలో క్రొత్త క్రొత్త విధాలుగా, ఎలా అయితే ఫంక్షన్ చేసారు, ఇది కూడా ఒక పద్ధతి కానీ ఇప్పుడు మరో విధంగా ఏదైనా గ్రూప్‌ను, గ్రూపులవారీగా పెద్ద సంగఠనను చేసి, ఉదాహరణకు వకీలు, జడ్జ్, ఇలా అన్ని జోన్లలోని ఈ గ్రూప్వారిని ఒక చోటకు చేర్చి ఒక పెద్ద స్థానంలో జరగాలి. వేర్వేరు వర్గాల కార్యక్రమాలు జరగాలి. వేర్వేరు వర్గాలవారైనా కానీ జోన్లలో అన్ని వర్గాలు ఉండాలి. ఇటువంటి పెద్ద సంగఠన, అవసరమైతే టెంట్ వెయ్యండి పెద్ద స్థానంలో ఈ విధంగా ఒక్కొక్క గ్రూప్ యొక్క రిజల్ట్‌ను తయారు చెయ్యండి మరియు దీని తర్వాత మీరు ఏమి చెయ్యాలి అని వారి కనెక్షన్‌ను జోడించండి. భాషణ విని వెళ్ళిపోవడం కాదు, భాషణ తర్వాత మీరు ఎంతమంది కావాలనుకుంటే అంతమంది దీనిని ఇలా చెయ్యవచ్చు. వారు కనెక్షన్లో ఉండేందుకు ఫోన్లు చెయ్యండి, ఉత్తరాల ద్వారా కావచ్చు, కనెక్షన్‌ను పెంచుతూ వెళ్ళాలి. ఒక్కొక్క ప్రోగ్రామ్ పెద్ద పెద్ద స్థానాలలో జరగాలి. ఒక చోట వకీళ్ళకు పెట్టండి, మరో చోట నేతలకు పెట్టండి. ఇలా పెద్ద పెద్ద స్థానాలలో గ్రూప్‌ను సమీపంలోకి తీసుకురండి, మిక్స్ గ్రూప్ కూడా ఉండవచ్చు. రెండు విధాలుగా చెయ్యవచ్చు. ఒక్క వర్గంవారే ఉంటే అందరి అటెన్షన్ ఆ గ్రూప్‌పై ఉంటుంది. మిక్స్ చేస్తే అటెన్షన్ తగ్గుతుంది. రెండిటినీ చేసి చూడండి. ఒక చోట అది చెయ్యండి, మరో చోట ఇలా చేసి చూడండి, రెండిటి రిజల్ట్‌ను చూడండి తర్వాత భవిష్య కార్యక్రమాన్ని తయారు చెయ్యండి.
ఓమెక్స్ కంపెనీ ఛైర్మన్ సోదరుడు రోహతాస్ గోయల్ మరియు అతని పరివారము:- ఎలా అయితే బిల్డింగ్ పని సఫలమవుతుందో, అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని కూడా సఫలం చెయ్యండి. ఎక్కడకు వెళ్ళినా కానీ అక్కడ సందేశాన్ని ఇవ్వండి. వెళ్ళాల్సిందే అన్నప్పుడు అక్కడ సందేశాన్ని ఇస్తూ ఉండండి. సెంటర్ అక్కయ్యలు కోర్స్ చేయిస్తారు కానీ మీరు సందేశాన్ని ఇవ్వండి. మీకు కలిగిన అనుభవాన్ని వినిపించండి. మీరు కనెక్షన్లో ఉండండి, ఇతరుల కనెక్షన్‌నూ జోడించండి. అచ్ఛా. అందరూ కలిసి సందేశవాహకులుగా అవ్వండి, అందరూ సెంటర్‌కు వెళ్తారు. అడ్రస్ ఇవ్వండి, ఫోన్ల ద్వారా కనెక్షన్ పెట్టుకోండి, చాలు. సందేశకులుగా అవ్వండి, సందేశాన్ని ఇవ్వండి. అందరూ మంచిగా ఉన్నారు. అందరూ సేవను చెయ్యగలరు.
అందరూ మంచిగా ఉన్నారు, ఉల్లాస ఉత్సాహాలతో ఉన్నారు, వారికి సందేశాన్ని ఇచ్చి ఉత్సాహంలోకి తీసుకురండి. దుఃఖంతో ఉన్నవారికి సుఖము యొక్క సందేశాన్ని అందించండి. చూడండి, వీరు వయస్సులో కూడా అనుభవీలు కనుక చాలా సేవను చెయ్యగలరు. అచ్ఛా.
2009 వీడ్కోలు 2010 అభినందనలు - రాత్రి 12 గంటల తర్వాత:-
అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు, కానీ మేము మీ అందరికీ సదా హ్యాపీ అని అంటాము. ప్రపంచం అనుసారంగా ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ కానీ సంగమయుగంలోని ప్రతిరోజూ మనకు ఉత్సవమే. ఉత్సాహము ఉంటుంది కాబట్టి సదా ఉత్సవము. సంగమయుగము హ్యాపీ సంగమయుగము. మీ అందరికీ పరివర్తనకు చాలా-చాలా-చాలా అభినందనలు, అభినందనలు, అభినందనలు. క్రొత్త సంవత్సరంలో క్రొత్త సంస్కారాలు, పాత సంస్కారాలకు వీడ్కోలు మరియు క్రొత్త సంస్కారాలకు ఆగమనము అందుకే సదా హర్షితంగా ఉన్నారు, సదా హర్షితంగా ఉంటారు, మీకు మాకు అందరికీ ప్రతి సంవత్సరము కళ్యాణకారియే, ముందుకు వెళ్తూ, ముందుకు తీసుకు వెళ్ళేది అందుకే సదా హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ. అచ్ఛా!
ఓంశాంతి