Search for a command to run...
18 Jan 2010
బ్రహ్మా బాబా సమానంగా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వడం కోసం మనసుకు టైమ్ టేబుల్‌ను తయారు చేసుకుని కర్మలను చేస్తూ కర్మయోగి అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని చెయ్యండి
18 January 2010 · తెలుగు
ఈరోజు నలువైపుల ఉన్న పిల్లల్లో విశేషంగా స్నేహం నిండి ఉంది. ఈరోజును స్మృతి దివసము అని అంటాము. బాప్‌దాదా అమృతవేళ నుండి నలువైపుల చూసారు, దేశంలో కానీ, విదేశాలలో కానీ పిల్లలందరి హృదయంలో తండ్రిపై ఉన్న స్నేహ చిత్రము కనిపిస్తుంది మరియు బాబా హృదయంలో కూడా పిల్లలందరిపై ఉన్న స్నేహ చిత్రము దాగి ఉంది. ఈరోజును విశేషంగా స్నేహ, స్మృతి దివసము అని అంటాము. బాప్‌దాదా అమృతవేళకన్నా కూడా ముందునుండే పిల్లల నుండి అనేకమైన స్నేహమనే ముత్యాల మాలలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయం నుండి స్వతహాగా నా బాబా, బ్రహ్మా బాబా, మధురమైన బాబా అన్న పాట మ్రోగుతుంది. బాప్‌దాదా హృదయంలో మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ అన్న పాట వినిపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరిలో ఇతర శక్తులకన్నా స్నేహ శక్తి ఎక్కువగా నిండి ఉంది. ఈ పరమాత్మ స్నేహము, ఈశ్వరీయ స్నేహము కేవలం సంగమయుగంలోనే అనుభవం అవుతుంది. అనుభవం కలిగిన వారికి తెలిసిన ఈ పరమాత్మ స్నేహము పిల్లలు ప్రతి ఒక్కరినీ సహజయోగిగా చేస్తుంది. పిల్లలందరిలో స్నేహ అనుభవం చాలా-చాలా నిండి ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. మీ అందరి జన్మ అధికారము స్నేహము. ఇతర శక్తులు తక్కువగా ఉన్నాకానీ తండ్రిపై స్నేహము లేక నిమిత్తమైన విశేష ఆత్మలపై స్నేహము యొక్క అనుభవము మెజారిటీ అందరి హృదయాలలో, ముఖంలో కనిపిస్తుంది. ఇది లేని పిల్లలు ఎవ్వరూ కనిపించలేదు. ఇప్పుడు మీ అందర్నీ ఇక్కడ విశేషంగా ఏది తీసుకు వచ్చింది? ఏ విమానంలో వచ్చారు? ట్రైనులో వచ్చారా లేక విమానంలో వచ్చారా? అందరి ముఖాలలో స్నేహము కనిపిస్తుంది, అంటే స్నేహమనే విమానంలో వచ్చారు కదా! ఏమి చెయ్యాల్సి వచ్చినాకానీ స్నేహమనే విమానంలో అందరూ చేరుకున్నారు.
ఈరోజును స్మృతి దివసము అని అంటాము కానీ స్మృతి దివసముతో పాటు సమర్థి దివసము అని కూడా అనబడుతుంది. ఈరోజును పట్టాభిషేకము రోజు అని కూడా అంటాము ఎందుకంటే ఈరోజు బాప్‌దాదా విశేషంగా బ్రహ్మా బాబా నిమిత్తమై ఉన్న మహావీర పిల్లలకు విశ్వ సేవ అనే కిరీటాన్ని పెట్టారు. బ్రహ్మా బాబా తాను అన్నోన్ అయ్యారు మరియు పిల్లలకు విశ్వ సేవకై స్మృతి తిలకాన్ని దిద్దారు. పిల్లలను చేసేవారిగా తయారు చేసారు మరియు స్వయం చేయించేవారిగా అయ్యారు. తమ సమానంగా ఫరిశ్తా స్వరూపులుగా అవ్వండి అని వరదానాన్ని ఇచ్చి ప్రకాశ కిరీటాన్ని పెట్టారు. బాప్‌దాదా పెట్టిన కిరీటము, తిలకము మరియు వరదానము అనుసారంగానే ఉన్న పిల్లల కర్తవ్యాలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు సేవా వరదానాన్ని కార్యంలోకి తీసుకువచ్చారు, ఇది చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే పాత్రను వహించారో, ఇక మీదట ఏ పాత్రనైతే వహించబోతున్నారో అందుకు పదమారెట్ల అభినందనలను బ్రహ్మా బాబా తెలుపుతున్నారు. వాహ్ పిల్లలు వాహ్! విదేశాలలో కూడా తిరిగివచ్చాము, అక్కడ ఏమి చూసాము? పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో మునిగి ఉన్నారు. బాబా ద్వారా సమర్థతలు లభించాయి, ఎందుకంటే ఈరోజు విశేషంగా స్నేహంతో సమర్థతల వరదానాలను ప్రాప్తి చేసుకునే రోజు. కొంత మంది పిల్లలు ఎంతో మంచి తపనతో స్మృతిలో, సేవలో ఉండటం బాప్‌దాదా చూసారు. అమృతవేళ చాలా బాగా అనుభవం చేసుకుంటున్నారు. అశరీరి స్థితిని కూడా అనుభవం చేస్తున్నారు కానీ కర్మయోగిగా అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు రెండు పనులు - యోగి కూడా మరియు కర్మ కూడా, రెండు పనులు కలిపి చేయడంలో తేడా కనిపిస్తుంది. కర్మ మరియు యోగంలో బ్యాలెన్సు ఉండాలి అని పురుషార్థం చేస్తున్నారు కానీ ఎలా అయితే అమృతవేళ శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటున్నారో అలా కర్మలోకి వచ్చేసరికి తేడా కనిపిస్తుంది. శ్రమ పడాల్సి వస్తుంది. విశ్వ వినాశనము అకస్మాత్తుగా జరుగనుంది అని బాప్‌దాదా ముందే చెప్పి ఉన్నారు. ఒకవేళ రోజంతా అటెన్షన్‌కు బదులుగా, ఏదైనా ఒక ధారణలో లోపం ఉన్న కారణంగా కర్మయోగి స్టేజిలో తేడా వస్తుంది. విశ్వ వినాశం యొక్క డేట్‌ను అయితే బాప్‌దాదా ప్రకటించరు కానీ మీ జీవిత కాలం ఎప్పుడు సమాప్తమవుతుందో మీకు తెలుసా? నా మృత్యువు ఫలానా తారీఖున జరుగుతుంది అని తెలిసినవారు ఉన్నారా, తెలుసా? వారు చేతులెత్తండి. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. అందుకు ప్రకృతి కారణమైతే ఎందరి మృత్యువును అది తనతో తీసుకు వెళ్తుంది! కనుక, విశ్వ డేట్‌ను ఆలోచిస్తూ నిర్లక్ష్యంగా ఉండద్దు. మీ జగదంబ స్లోగన్ ఉంది కదా - ఎప్పుడు కూడా ‘అప్పుడు’ అని అనవద్దు, ‘ఇప్పుడు’. రేపు ఏమి జరిగినా కానీ నేను ఎవరెడీగా ఉండాలి. మరి ఇంత తయారీ అందరి అటెన్షన్లో ఉందా? మీ కర్మల లెక్కాచారాలను పూర్తి చేసుకున్నారా? నాలుగు సబ్జెక్టులు- జ్ఞానము, యోగము, సేవ మరియు ధారణ, నాలుగు వైపుల, నాలుగింటిలో ఇటువంటి తయారీ ఉందా? పూర్తి అనంతమైన వైరాగ్యపు అనుభవాన్ని పరిశీలించుకున్నారా? నేను ఎవరెడీగా ఉన్నానా అని తమ హృదయాన్ని పరిశీలించుకున్నారా? నష్టోమోహ స్మృతి స్వరూపము, ఎందుకంటే బ్రహ్మా బాబా కూడా స్వయంగా పురుషార్థం చేసి ఇలా అయ్యారు. అనుభవీ పిల్లలు చూసినట్లుగా ఏ వైపు కూడా లెక్కాచారాల వాతావరణం లేదు, అశరీరిగా అయ్యే అభ్యాసము అకస్మాత్తుగా అశరీరిగా చేసి ఎగిరిపోయింది. బ్రహ్మా బాబా వెళ్ళనున్నారు అని ఎవరైనా అనుకున్నారా! కానీ నష్టోమోహ, పిల్లల చేతిలో చేయి ఉన్నప్పటికీ ఆకర్షణ ఉన్నదా? ఫరిశ్తా అయిపోయారు. పిల్లలకు ఫరిశ్తాలుగా అయ్యే తిలకాన్ని ఇచ్చి వెళ్ళారు. బహుకాలపు అశరీరి అభ్యాసమే ఇందుకు కారణము. తోడుగా ఉన్న కొందరి అనుభవీ పిల్లలు, వారు కర్మలను చేస్తూ కూడా ఎలా అశరీరులుగా అయ్యేవారో అనుభవం చేసారు. పిల్లల్లోని కర్మయోగంలో కనిపించిన తేడాకు కారణం - కర్మ చేస్తూ కూడా నేను ఆత్మను అన్న స్మృతి ఇమర్జ్ కాకపోవడము. నేను ఆత్మను అని అందరికీ తెలుసు, కానీ నేను ఎటువంటి ఆత్మను? నేను ఆత్మను చేయించేవాడను, ఈ కర్మేంద్రియాలు చేసేవి. చేసేవాడిని అన్న స్వమానము కర్మ చేస్తూ స్మృతి స్వరూపంలో ఉండాలి. కర్మేంద్రియాలతో కర్మను చేయించాల్సి వచ్చినాకానీ నేను చేయించేవాడను, యజమానిని, ఈ సీట్‌పై ఒకవేళ సెట్ అయి ఉంటే ఏ కర్మేంద్రియమైనా ఆర్డర్లో ఉంటుంది. సీట్‌పై సెట్ కానంతవరకు ఎవ్వరూ ఏ మాటను వినరు. నేనే చేయించే ఆత్మను, చేసేవి ఈ కర్మేంద్రియాలు, చేయించేవి కావు. బ్రహ్మా బాబా అనుభవాన్ని విన్నారు కదా, ఆరంభంలో బాబా ప్రతి రోజు సమాప్తి సమయంలో ఈ కర్మేంద్రియాల రాజ దర్బారును ఏర్పాటు చేసేవారు. పాత పిల్లలు ఆ డైరీని చూసి ఉంటారు. రోజూ దర్బారును పెట్టి, చేయించే యజమానిగా అయ్యి ప్రతి కర్మేంద్రియం నుండి సమాచారాన్ని తీసుకునేవారు, ఇచ్చేవారు. ఇంతటి అటెన్షన్‌ను బ్రహ్మా బాబా కూడా ఆరంభంలోనే ఉంచారు. మీరు కూడా చేయించేవాడిని, యజమానిని అని భావించాలి ఎందుకంటే ఆత్మ రాజు, ఈ కర్మేంద్రియాలు దానికి తోడు. మరి రోజంతా విశేషంగా మనసు-బుద్ధి సంస్కారము, స్వభావము అనండి లేక సంస్కారము అనండి - వీటి పరిస్థితి ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే, మా రాజు మా స్థితిగతులను చెక్ చేస్తున్నారు అని కర్మేంద్రియాలు అటెన్షన్లో ఉంటాయి. ఆత్మ రాజును, చేసే కర్మేంద్రియాలతో చేయించే ఆత్మగా అయ్యి చెక్ చేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే, కొంతమంది పిల్లలు ఏమంటారంటే, మేము కర్మేంద్రియాలను ఆర్డర్ చేస్తున్నాము, అయినాకానీ జరిగిపోతుంది, పురుషార్థము చేస్తున్నాము కానీ ఏదో ఒక సంస్కారము లేక స్వభావము మా ఆర్డర్లో ఉండటం లేదు అంటారు. ఇందుకు కారణం తమ స్వమానము అన్న సీట్‌పై సెట్ కాకపోవడం. సీట్‌పై కూర్చోకుండా ఎన్ని ఆర్డర్లు చేసినా కానీ అవి ఆర్డర్లను పాటించేవిగా ఉండవు. కనుక కర్మలను చేస్తూ చేయించేవాడను, యజమానిని అన్న సీట్‌పై సెట్ అయ్యి ఉండండి. కొంతమంది పిల్లలు బాప్‌దాదాతో ఈ విధంగా ఆత్మిక సంభాషణ చేస్తారు - బాబా, మీరు మమ్మల్ని సర్వశక్తిమంతునిగా తయారు చేసారు, శక్తిమంతులుగా కూడా కాదు. సర్వశక్తిమంతుడు అన్న వరదానము ప్రతి ఒక్కరికీ బ్రాహ్మణ జన్మను తీసుకోగానే కలుగుతుంది. స్మృతి అనేది మీ జన్మ వరదానము! పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా మాస్టర్ సర్వశక్తిమాన్ భవ అన్న వరదానాన్ని ఇచ్చారు. వరదానమును ఎవరు ఇచ్చారు? ఆల్మైటీ అథారిటీ. కానీ ఏ సమయంలో ఏ శక్తి కావాలో అది సమయానికి రావడం లేదు అని కంప్లెయింట్ చేస్తారు. ఆజ్ఞను పాటించడం లేదు. ఇలా ఎందుకు? ఆల్మైటీ అథారిటీ వరదానం ఉన్నప్పుడు అంతకు మించినది మరొకటి లేదు. కనుక వరదానం యొక్క స్థితిలో స్థితులయ్యి ఒకవేళ ఆర్డర్ చేస్తే మీరు ఆర్డర్ చేస్తే శక్తులు ఒప్పుకోకపోవడం అన్నది జరగదు. ఒకటి ఆత్మ యజమాని, సర్వశక్తిమంతుని వరదానం లభించి ఉంది. ఆ స్వరూపంలో స్థితి అయ్యి యజమానిని, వరదానాలు ఉన్నాయి - రెండింటి స్వరూప స్మృతిలో ఉండి ఆర్డర్ చెయ్యండి. శక్తి మీ మాట వినకపోవడము అన్నది అసంభవము ఎందుకంటే వరదానము మరియు తండ్రి ఆస్తికి అధికారము. సంగమయుగంలో మీ అందరికీ సర్వశక్తిమంతులు అన్న టైటిల్ లభించింది. కేవలం ఆ స్థితిలో స్థితులై ఉండటం లేదు. సదా ఉండటం లేదు. అప్పుడప్పుడూ వస్తుంది. ఈ ‘అప్పుడప్పుడు’ అన్న మాటను బ్రాహ్మణ డిక్షనరీ నుండి తీసివెయ్యండి. ఇప్పుడిప్పుడే హాజరు. బాబా, మేము మిమ్మల్ని తల్చుకున్న వెంటనే మీరు హాజరైపోతారు అని అంటారు కదా. అనుభవం ఉంది కదా? చేతులెత్తండి. అనుభవం ఉందా? ఇప్పుడు చూడండి, చేతులైతే ఎత్తుతున్నారు. బాబా హాజరవుతారు. హజూరు హాజరు అవుతారు, మరి ఈ శక్తి ఏమిటి? ఈ శక్తులు కూడా మీకు బాబా ద్వారా ప్రాపర్టీగా లభించినవి. కనుక, యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి. యజమానిగా అయి ఆర్డర్ ఇవ్వరు, శక్తి తగ్గిపోతుంది కదా. కనుక ఆ స్థితిలో ఉంటూ ఆర్డర్ చేస్తే , యజమానే లేని కారణంగా అవి ఆజ్ఞను పాటించవు.
బాప్‌దాదా ఇప్పుడు ఏమి ఆశిస్తున్నారు? తెలుసు కదా! ఇప్పుడు బాప్‌దాదా కోరుకునేదేమిటంటే నా పిల్లలు ప్రతి ఒక్కరూ కర్మలను చేస్తూ కూడా రాజా పిల్లలుగా అయి, స్వరాజ్య అధికారులుగా అయ్యి స్వరాజ్యమనే సీట్‌ను ఎప్పుడూ వదిలి పెట్టకండి. రాజు రోజంతా రాజుగానే ఉంటాడు కదా! లేక ఒకసారి రాజుగా, మరోసారి రాజుగా కాకుండా ఉంటాడా? సింహాసనంపై కూర్చుంటాడా, కూర్చోడా అన్నది వేరే విషయము, ఇంట్లో ఉన్నాగానీ నేను రాజును అని మర్చిపోడు కదా. కనుక, కర్మయోగి మరియు అమృతవేళలోని యథార్థ యోగంలో ఉండాల్సిన శక్తిశాలి స్థితిలో తేడా కనిపించకూడదు. డబల్ పని ఉంది కానీ మీరు ఎవరు? మీరైతే విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారులు. అందుకే బాప్‌దాదా కోరుకునేదేమిటంటే నడుస్తూ, తిరుగుతూ రాజును అన్న స్మృతిని మర్చిపోకండి. సీట్‌ను వదలకండి. సీట్ లేకపోతే ఎవ్వరూ ఆర్డర్‌ను వినరు. ఈరోజుల్లో సీట్ కోసం ఏమేమి చేసుకుంటున్నారు? తమ హక్కును తీసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తారు! తమ హక్కును ఎవ్వరూ వదుల్కోవాలని అనుకోరు. మరి మీరు మీ పరమాత్మ హక్కు, నేను ఎవరిని అని గుర్తుంచుకోండి. ప్రతి సమయము ఏ పని చేస్తున్నా కర్మలను చేస్తూ కూడా తమ మనసు యొక్క టైమ్ టేబుల్‌ను తయారు చేసి పెట్టుకోండి. ఈ కర్మను చేస్తూ మనసు యొక్క స్వమానము ఏది ఉండాలి? ఈరోజు ఏ లక్ష్యం ఉండాలి? ప్రతి కర్మను చేసే సమయంలో, మీకున్న స్వమానాల లిస్టును చూసుకోండి. భిన్న భిన్న టైమ్టేబుళ్ళను తయారు చేసుకోండి. స్థూలకర్మల కోసం ఎలా అయితే టైమ్‌టేబుల్‌ను ఫిక్స్ చేసుకుంటారో అలాగే మనసుకు టైమ్ టేబుల్‌ను ఫిక్స్ చెయ్యండి. ఈ సమయంలో ఈ పనిని చెయ్యాలి అని అయితే తెలుసు కదా, ఈ కర్మతోపాటు ఏ స్వమానాన్ని పెట్టుకోవాలి? యజమానిని అన్న అధికారాన్ని ఏ స్వమాన రూపంలో పెట్టుకోవాలి, ఈ విధంగా మనసుకు టైమ్‌టేబుల్‌ను తయారు చేసుకోండి. టైమ్‌టేబుల్‌ను తయారు చెయ్యడం వచ్చు కదా? మాతలకు వచ్చా? మాతలు మీ అంతట మీరే ప్రోగ్రామును తయారు చేసుకోండి. మంచి భోజనాన్ని తయారు చెయ్యాలి, ఆ సమయంలో ఏ స్వమానాన్ని మీ బుద్ధిలో ఇమర్జ్ చేసుకోవాలి? స్వమానాలది పెద్ద మాలనే ఉంది. ఎంత పెద్ద మాల అంటే స్వమానాలను లెక్కిస్తూ లెక్కిస్తూ మాలలో ఇమిడిపోవాలి. ఇప్పుడు బహుకాలపు అభ్యాసం కావాలి. కొంతమంది పిల్లలు, ఇప్పటి వరకు కూడా వినాశనమేమీ కనిపించడం లేదు అని అంటారు. ఇప్పుడైతే డేట్ ఫిక్స్ అవ్వలేదు, చేస్తాము, అయిపోతుంది, ఇది నిర్లక్ష్యము. సందేశం ఇవ్వడంలో కూడా విశ్వ కళ్యాణకారిగా కావచ్చు. ఇప్పుడింకా సమయము ఉంది, ముందు ముందు సందేశాన్ని ఇస్తారు అని అనకండి. ఎవరికైతే మీరు సందేశాన్ని ఆలస్యంగా ఇస్తారో, వారు కూడా మీపై ఫిర్యాదు చేస్తారు, ఏ ఫిర్యాదు చేస్తారు? మీరు మాకు ముందుగానే చెప్పి ఉంటే మేము కూడా ఏదైనా చేసేవారము, ఇప్పుడైతే మీరు లాస్ట్‌లో చెప్పారు. మేమైతే కనీసం గుర్తించి అహో ప్రభూ, మీ లీలలు అని అనుకునేవారము. కానీ వారు పదవిని పొందలేరు. ఎందుకని? బహుకాలపు అభ్యాసం యొక్క సహయోగం కావాలి. మీరందరూ వారసులు కూర్చున్నారు కదా! నేను వారసుడను అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అచ్ఛా, వారసులైతే మీరు ఫుల్ వారసత్వాన్ని పొందుతారా లేక కొంచెమా? అందరూ ఫుల్ వారసత్వాన్ని తీసుకుంటాము అనే అంటారు. పూర్తి వారసత్వము అనగా పూర్తిగా 21 జన్మలు, ఆది నుండి అంతిమం వరకు రాయల్ ప్రజలలోకి కూడా కాదు, రాయల్ ఫ్యామిలీలోకి రావాలి. రాజ్య ఫ్యామిలీలోకి రావాలి. సింహాసనంపై అయితే ఒక్కరే కూర్చుంటారు కదా. యుగళ్ కూర్చుంటారు. అక్కడ సభ ఎప్పుడు ఏర్పాటు అయినా కానీ రాయల్ ఫ్యామిలీలోని విశేషమైన నిమిత్తమైనవారు ఈ కిరీటాలను ధరించి కూర్చుంటారు. కిరీటం లేకుండా కూర్చోరు మరియు ప్రతి కార్యంలో సలహాను ఇచ్చేవారు కేవలం ఆర్డర్ ఇచ్చేవారుగా కాక సలహాలతోనే జరుగుతుంది. అందుకే ఒకవేళ సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే మొదటి జన్మ నుండి అంతిమం వరకు 21 జన్మలు, పూర్తిగా, సగం కూడా కాదు, మధ్యలో అయితే వెళ్ళకూడదు, అకాల మృత్యువులు ఉండవు. మరి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలా లేక కొద్దిలోనే సంతోషించాలా? మీ మాతేశ్వరి జగదంబ సదా ఈ లక్ష్యాన్ని పెట్టుకునేవారు – బాప్‌దాదా ఏ శ్రీమతాన్ని అయితే ఇచ్చారో, మనసా, వాచ లేక కర్మణ, ఏ శ్రీమతం లభించినా కానీ అది మనం చేయవలసిందే. ఇలా పూర్తిగా వారసత్వాన్ని తీసుకునేవారు ఈ లక్ష్యాన్నే బుద్ధిలో పెట్టుకోండి - అకస్మాత్తు, ఎవరెడీ మరియు బహుకాలము, మూడు మాటలను కలిపి గుర్తు పెట్టుకోండి. అందుకే బాప్‌దాదాకు ఆశా దీపాలైన పిల్లల పట్ల ఇదే వరదానము వస్తుంది - సదా ఈ మూడు మాటలను గుర్తుంచుకొని అందరూ ఆశాదీపాలుగా అయ్యేందులో ప్రత్యక్ష రుజువుగా నిలవండి.
పిల్లలు భిన్న భిన్న ప్రకారాల కోర్సులను తయారు చెయ్యడం బాప్‌దాదా చూసారు. బాగుంది. బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు కానీ ఇప్పుడు సమయం అనుసారంగా కోర్సుకు బదులుగా ఫోర్సు అనే కోర్సును చేయించండి. ఎంతగా ఫోర్సు అనే కోర్సును చేయిస్తారో వారు బాబాకు స్నేహి- సహయోగిగా మాత్రమే కాక శ్రీమతాన్ని పాటించే ఫోర్సు, సర్వ ఫోర్సులను నింపుకునే ఆత్మలుగా అవుతారు. సమీప రత్నాలుగా అవుతారు. ఇది వీలవుతుందా? ఇప్పుడు ఫోర్సు యొక్క కోర్సును చేయించండి. ఎందుకంటే బాప్‌దాదా ఏమి చూస్తున్నారంటే ఇప్పుడు ప్రకృతి అలజడిలోకి వచ్చేసింది అందుకే ఏదో ఒక కారణంతో ప్రకృతి అలజడి తన ప్రభావాన్ని చూపిస్తుంది, చూపిస్తూ ఉంటుంది. ఆలోచనలో, స్వప్నంలో కూడా లేని విషయాలను ప్రాక్టికల్‌గా చూస్తూ ఉంటారు. మరి ప్రకృతిని కూడా సతోప్రధానంగా చెయ్యాలి. ఇప్పుడైతే తమ తమ ప్రభావాలను వేస్తున్నాయి, అందుకే సమయాన్ని బట్టి అన్నీ క్రొత్తగా జరుగుతుంటాయి. కానీ మీరైతే వారసులు కదా! కేవలం స్నేహి సహయోగి కాదు వారసులు, ఫుల్ అధికారులు. అవునా? వారసులే కదా? డబల్ విదేశీయులు కూడా వారసులే. వారసులేనా? ఫుల్ వారత్వాన్ని తీసుకునేవారు. సగం కాదు. పాండవులు ఫుల్ వారసత్వాన్ని తీసుకునేవారే కదా?
బాప్‌దాదా ఆశలదీపాన్ని నేను. ఇదే గుర్తుంచుకోండి - స్మృతి దివసం నాడు పిల్లలు ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చిన వారైనా, ఇక్కడకు రానివారైనా, దూరంగా కూర్చుని హృదయంలో ఇమిడి ఉన్నవారైనా, ప్రతి ఒక్కరికీ బాబా ఆజ్ఞ ఏమిటంటే - నేను ‘అప్పుడు’ అన్న మాటను ఉపయోగించకూడదు, ఈ విషయంలో ఇలా అవ్వాలి మరియు ఒప్పుకోవాలి. ఇప్పుడే, రేపు కూడా ఎవరు చూసారు, ఈరోజు. ఏదైతే చెయ్యాలో అది చెయ్యాల్సిందే, ఆలోచించకూడదు. ఆలోచిస్తాము, చేస్తాము, అయిపోతుంది అంటూ బాబాను కూడా ఓదారుస్తూ ఉంటారు. బాబా, మీరు ఆలోచించకండి, మేము సమయానికి సరిగ్గా అయిపోతాము. కానీ ఇప్పుడే ఏదైనా పేపరు వస్తే పిల్లలు అందరూ ఫుల్ పాస్ అయిపోవాలన్నది బాప్‌దాదా కోరుకుంటున్నారు. వీలవుతుందా? వీలవుతుందా? ఫుల్ పాస్ అవ్వగలరా? అచ్ఛా.
ఈరోజు మొదటిసారి వచ్చినవారు లేవండి. మొదటిసారి వచ్చినవారికి వచ్చినందుకు బాప్‌దాదా చాలా-చాలా అభినందనలు ఇస్తున్నారు మరియు వరదానమును ఇస్తున్నారు - తీవ్ర పురుషార్థిగా అయి, మీరు కావాలనుకుంటే ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. ఈ వరదానాన్ని ప్రాక్టికల్‌లో తీసుకు రావాలనుకుంటే బాప్‌దాదా వరదానము ఉంది. ఇందుకోసం మొదటిసారి వచ్చినవారికి బాప్‌దాదా ఏ శుభవార్త వినిపిస్తున్నారంటే లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్, ఈ దిల్ఖుష్ మిఠాయిని తీసుకోండి.
టూ లేట్ బోర్డుకన్నా ముందే వచ్చినందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయము. మీరు ఒకవేళ ముందుకు వేళ్తే మేమందరం సంతోషిస్తాము. మీరెందుకు, మేమెందుకు వెళ్ళకూడదు అని అనము. ముందు మీరు. అచ్ఛా - కూర్చోండి. దిల్ఖుష్ మిఠాయి తిన్నారా!
సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది:- ఇండోర్ అంటే అర్థం, గీత లోపల ఉండేవారు. బాప్‌దాదాకు ప్రతి జోన్వారికి సేవపట్ల ఉన్న ఉల్లాస ఉత్సాహాలను చూసి సంతోషంగా అనిపిస్తుంది. అవకాశం కూడా అందరూ మంచిగా తీసుకుంటున్నారు ఎందుకంటే సేవకు మేవా(ప్రతిఫలం) లభిస్తుంది అని మీకు తెలుసు. ఎటువంటి మేవా లభిస్తుంది? అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. లోకులైతే ఒక్క బ్రాహ్మణుడికి తినిపించి చాలా పుణ్య కార్యం చేసాము అని అనుకుంటారు. కానీ మీరు ఎంతమంది బ్రాహ్మణులకు తినిపిస్తున్నారు! ఎంత పుణ్యం! అందులోనూ అందరూ సత్యమైన బ్రాహ్మణులు. మరి మీ అందరూ సేవ యొక్క మేవాను తిన్నారా? తిన్నారా? అయితే ఆరోగ్యంగా ఉన్నారు కదా! మేవా తినడంవలన ఆరోగ్యంగా అవుతారు. బాగుంది. ప్రతి జోనులో సంఖ్య పెరుగుతూ ఉండటాన్ని చూసాము కానీ బాప్‌దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు - సంఖ్య పెరుగుతుంది, ఇది మంచిదే. సందేశం లభించింది, బాబాకు పిల్లలుగా అయ్యారు ఇందుకు చాలా-చాలా అభినందనలు కానీ ఇప్పుడు సమయం అనుసారంగా వారసులను తయారు చెయ్యండి అని ముందు కూడా బాబా అన్నారు. ఇండోర్ పక్కా వారసులను తయారు చేస్తుంది. ఎందుకంటే బాప్‌దాదా ఆ వారసుల పరీక్ష తీసుకుంటారు. ముందుగా వారి పేర్లని పంపండి తర్వాత వారస క్వాలిటీ ఎంతగా తమ వారసత్వాన్ని నిభాయిస్తున్నారు అని బాప్‌దాదా చూస్తారు. రెండవది, బాప్‌దాదా అన్నారు, అనుభవీలు, ప్రసిద్ధి చెందినవారు, వారి అనుభవాన్ని విని నేను కూడా అవ్వాలి అన్నంతగా ఇతరులకు ఉల్లాసం రావాలి, అటువంటి మైక్ క్వాలిటీని కూడా తయారు చెయ్యాలి. మరి చేసారా, ఆ పని చేసారా? ఇండోర్ చేసిందా? ఇప్పటివరకు బాప్‌దాదా వద్దకు లిస్ట్ రాలేదు. అచ్ఛా (ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వమంతా ఇక్కడకు వచ్చింది, వారు ఇప్పుడు మైక్‌గా అయి మంచి సేవను చేస్తున్నారు) బాగుంది. వీరంతా ఇండోర్వారు. పెద్ద సంఖ్య ఉంది. బాగుంది. అచ్ఛా. బాప్‌దాదాకు ఇండోర్‌పై విశేషమైన ఆశ ఉంది ఎందుకంటే ఈ బ్రహ్మా బాబా యొక్క అంతిమ సమయంలో స్వయంగా బాప్‌దాదా ఇండోర్ సెంటరును తెరిపించారు, అందుకే ఈరోజు స్మృతి దివసమును జరుపుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఏదైనా అతీతమైనది, ప్రియమైనది చెయ్యాలి. అన్ని జోన్లు పురుషార్థం చేస్తున్నాయి, బాగుంది. బాప్‌దాదా వద్దకైతే అందరి సమాచారము ఉంది. కానీ బాప్‌దాదా ఇప్పుడు ఫాస్ట్‌గా, ముందుకు వెళ్ళాలన్న కోరిక ఏదైతే పెట్టుకుంటారో, నిర్విఘ్న జోన్. ప్రతి జోనులో ఎన్ని సేవాకేంద్రాలున్నాయో, ఎన్ని ఉప సేవాకేంద్రాలున్నా కానీ ప్రతి ఏరియా నిర్విఘ్న సేవాకేంద్రం కావాలి. ప్రతి ఒక్కరిలో తీవ్ర పురుషార్థపు అల రావాలి. మరి నంబర్ ఇండోర్ తీసుకోవాలి. ఇందులో నంబర్‌వన్‌గా ఏ జోను కూడా, మా జోనంతా నిర్విఘ్నంగా ఉంది అని రిపోర్టును ఇవ్వలేదు. పురుషార్థం చేస్తున్నారు కానీ నలువైపుల గీతా పాఠశాలలు కావచ్చు కానీ అన్నీ నిర్విఘ్నంగా ఉండాలి. ఈ రిపోర్టును బాప్‌దాదా ఆశిస్తున్నారు. అచ్ఛా.
మెడికల్ వింగ్:- ఈ వింగ్‌లో ప్రాక్టికల్ డాక్టర్లు ఎంతమంది? డాక్టర్లు చేతులెత్తండి. అచ్ఛా, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఎందుకంటే బాప్‌దాదా ఏమి చూసారంటే సమయానుసారంగా డాక్టర్ల సేవ ఎంతో ముందుకు వెళ్ళనుంది ఎందుకంటే ఈరోజుల్లో చింత, భయము వ్యాపించి ఉన్నాయి. మరి డాక్టర్లు, మీరైతే డబల్ డాక్టర్లు కదా. డబల్ డాక్టర్ అయిన డాక్టర్లు చేతులెత్తండి. మనసుకు మరియు శరీరానికి కూడా. ఈరోజుల్లో మనసు యొక్క రోగం పెరుగుతూ ఉంది. అందుకే డబల్ డాక్టర్ల సేవ మరింత పెరుగుతుంది. ప్రకృతి అలజడుల కారణంగా కొత్త కొత్త రోగాలు వస్తాయి. ఇటువంటి సమయంలో డబల్ డాక్టర్ల అవసరం ఉంటుంది. మరి మీరందరూ ఎవరెడీ కదా, ఎక్కడకు పిలుపు వచ్చినా కానీ అక్కడ మీ సేవలను అందిస్తారు కదా? ఎవరైతే సేవను ఇవ్వగలరో వారు చేతులెత్తండి. చాలా మంచిది. పేర్లను నోట్ చేసుకొని ఇవ్వండి ఎందుకంటే ఆహ్వానం వచ్చినప్పుడు సమయాన్ని కేటాయించగలరా? కేటాయించగలరా? ఎవరైతే సమయానికి తయారుగా ఉంటారో వారు చేతులెత్తండి. అచ్ఛా. అక్కయ్యలు తక్కువగా చేతులెత్తుతున్నారు. సేవాకేంద్రాలను నడపాలి. వీరి పేరును నోట్ చేసుకుని ఇవ్వండి. బాప్‌దాదా డాక్టర్లను మహిమ చేస్తారు, ఎందుకని మహిమ చేస్తారు? ఎందుకంటే డాక్టర్లు కూడా బాప్‌దాదా సమానంగా దుఃఖాన్ని తీసుకుని సుఖాన్ని ఇచ్చేవారు. కానీ మీరు అల్పకాలానికి ఇస్తారు. బాబా సదాకాలం కోసం ఇస్తారు అందుకే డబల్ డాక్టరుగా అయి సమయాన్ని కేటాయించగలిగితే మీకు ఇక మీదట డబల్ డాక్టర్ల విలువ పెరుగుతుంది. డాక్టర్లకు ఖాళీ ఉండదు అని బాప్‌దాదా విన్నారు. కానీ డాక్టర్లు బిజీగా ఉన్నాకానీ ఎంతో పెద్ద సేవను చెయ్యవచ్చు. డాక్టర్లు ప్రతి ఒక్కరూ కార్డును అచ్చు వేయించుకుంటారు. కార్డును వేయించుకుంటారు కదా? ఒకవైపు మీ పరిచయం ఉంటుంది, మరో వైపు ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్న వైపున మనసు కోసం మందు కావాలంటే ఫలానా అడ్రసుకు రండి అని వేయించమని బాప్‌దాదా ముందు కూడా వినిపించారు. ఈ కార్డులను ఎంతమంది పేషంట్లు ఉంటారో వారందరికీ ఇస్తే మీరు ఇంట్లో కూర్చునే సేవ చేసేస్తారు ఎందుకంటే డాక్టర్లు చెప్పేది అందరూ వింటారు. ఇది తినద్దు అని ఎవరు ఎంత చెప్పినా కానీ తింటారు కానీ ఒకవేళ డాక్టరు ఇది అవుతుంది, అది అవుతుంది అని అంటే చేస్తారు. తప్పనిసరి అయి చేస్తున్నా లేక ప్రేమగా చేస్తున్నా కానీ మొత్తానికైతే చేస్తారు. అందుకే డాక్టర్లు చాలా సేవను చెయ్యవచ్చు అని బాప్‌దాదా వినిపిస్తున్నారు. చూసి ఉంటే ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు కానీ కొంచెం మరింత వేగంగా చెయ్యండి. మీ వద్ద భిన్న భిన్న జోన్ల డాక్టర్లు తమ జోన్లో ఎటువంటి ప్రోగ్రామ్‌ను తయారు చెయ్యాలంటే అక్కడే ప్రోగ్రాము కలిసి చెయ్యండి, ఇలా మీరు చాలా సేవను చెయ్యగలరు. డాక్టర్ల సేవ అవసరమని బాప్‌దాదాకు అనిపిస్తుంది ఎందుకంటే అనారోగ్యాలు పెరగనున్నాయి. మనసు రోగమైతే నలువైపుల వ్యాప్తి చెంది ఉంది, మీ వృత్తిని చూసి భయంతోనైనా ఒప్పుకుంటారు. బాగుంది. బాప్‌దాదాకు ఈ వర్గం యొక్క సేవ నచ్చింది, మరింతగా పెంచండి. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- (40 దేశాల నుండి వచ్చారు): ఈరోజు విశేషంగా సెరిమనీ (పండుగ)ను జరుపుకోవడానికి వచ్చారు. మధుబన్‌లో సెరిమనీ జరుపుకుంటున్నందుకు అందరికీ ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయని బాప్‌దాదాకు తెలుసు. సెరిమనీ జరుపుకోవడానికి వచ్చినవారు చేతులెత్తండి. అచ్ఛా. ఎవరి సెరిమనీ ఉందో వారు చేతులెత్తండి. రెండు చేతులు ఎత్తండి. చాలా మంచిగా చేసారు. ఆహ్వానము ఇవ్వడము, ఆబూ యాత్రను చేయించే ఈ అవకాశాన్ని మంచిగా తీసుకున్నారు. ఎందుకంటే బాప్‌దాదా పథారమణి(ప్రవేశం) సింధ్‌లో జరిగింది. పునాది సింధ్. మరి సింధ్వారు మేము సింధీలము అన్న హక్కును కలిగి ఉంటారు కదా. అందరితో యాత్ర చేయించడానికి ఇది కూడా మంచి విధి. ఇందుకు బాప్‌దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. మంచిగా అనిపిస్తుంది కదా మీ ఇల్లు. మంచిగా అనిపించిందా? ఎందుకంటే ఇక్కడ చూసి ఉంటారు, ఎక్కడ కూడా ఏ గదిపైనా ఎవ్వరి పేరు లేదు. ఎందుకంటే ఇది తండ్రి ఇల్లు. మరి తండ్రి పిల్లలు మీరు ఎక్కడకు వచ్చారు? మీ ఇంటికి.
(హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎదురుగా కూర్చుని ఉన్నారు)
వీరు కూడా ఇప్పుడు వచ్చారు కదా? ఎక్కడకు వచ్చారు? తమ ఇంటికి వచ్చారు. తమ పరివారంలోకి వచ్చారు. రాజ్యము మరియు ఆధ్యాత్మికత ఒకవేళ రెండూ కలిసి విశేషంగా బాపూ గాంధీ సంకల్పాన్ని పూర్తి చెయ్యాలనుకుంటే చెయ్యవచ్చు. సహజంగా చెయ్యవచ్చు మరియు చేస్తూనే వెళ్తున్నారు. ఇప్పుడు నేతల పేర్లు ఏదో ఒక సాంగత్యంతో కలిసి పేరు వ్యాప్తి చెందుతుంది. మూడు శక్తులు - సైన్సు, ఆధ్యాత్మికత మరియు రాజ్యసత్తా, మూడు సత్తాలు కలిసి ఒకే సంకల్పం చెయ్యాలి, సహయోగిగా కావాలి, అప్పుడు మనం బాపూ గాంధీజీ మరియు బాపూకు కూడా బాపు అయిన పరమాత్మ ఇద్దరు తండ్రుల ఆశలను పూర్తి చెయ్యగలము, అప్పుడు చాలా సహజమైపోతుంది. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- విదేశాలలో కూడా భిన్న భిన్న ప్రకారాల సేవలు జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారుచేస్తూ ఉంటారు, ప్రాక్టికల్‌లో కూడా చేస్తూ ఉంటారు. ఫారెన్వారు ఇండియావారికి తమ అనుభవాన్ని వినిపించి సేవ చేస్తున్నారు. ఇండియావారు ఫారెన్ వారికి తమ అనుభవాన్ని వినిపించి దేశ విదేశాలలో సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రోగ్రామును చేస్తున్నారు కదా. బాగుంది. ఇప్పుడు రెండవ నంబరు. (ముందు సర్వ్ ఇండియా ప్రోగ్రాము హైదరాబాదులో జరిగింది, ఇప్పుడు చెన్నైలో ఉంది) బాప్‌దాదా వద్దకు అందరి ఉల్లాస ఉత్సాహాల ఉత్తరాలు మరియు ప్రియస్మృతులు ముందుగానే చేరుకున్నాయి. ఏది చేసినా, ఆరంభంలో చిన్నగానే ఉంటుంది తర్వాత పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈరోజుల్లో అందరికీ అవసరమని అనిపిస్తుంది. మూడు సత్తాలు ఉన్నప్పటికీ - ధర్మ సత్తా కూడా ఉంది, ఆధ్యాత్మికత వేరు, ధర్మ సత్తా వేరు కానీ సత్తానే కదా. కానీ ఏది కావాలనుకుంటున్నారో అది జరగడం లేదు. లోపం ఎవరిది అని అందరూ ఆలోచిస్తున్నారు. మూడూ పని చేస్తున్నాయి కానీ ఏది అనుకుంటున్నారో అది జరగడం లేదు. అందరూ కోరుకుంటున్నారు కానీ సమయం సాకుగా చెప్తున్నారు. సమయం లేదు. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు... కానీ ఇలా ఒకట్రెండు గ్రూపులను తమకు సహయోగులుగా చేసుకుంటే బాప్‌దాదా వరదానం అనుసారంగా భారతదేశం స్వర్గంగా అవ్వాల్సిందే. ఇద్దరు బాపూల ఆశ నెరవేరవలసిందే.
ఫారెన్వారు కూడా మనసా సేవతో సహయోగులే కదా! అన్ని ధర్మాలలో వృద్ధి జరుగుతుండటం బాప్‌దాదా చూసారు. ఒక్క ధర్మం కాదు, కేవలం హిందూ ధర్మం కాదు, ముస్లిం, బౌద్ధ మతం, క్రిస్టియన్ మతం, అన్నీ నెమ్మది నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపుకు అభిరుచి చూపిస్తున్నాయి. ముందు చూడండి, బ్రహ్మా కుమారీల పేరు వినగానే భయపడేవారు, వినాశనం-వినాశనం అని ఏమి చెప్తూ ఉంటారు అని. మరి ఇప్పుడేమంటారు? ఇప్పుడంటారు, వినాశనం ఎప్పుడవుతుందో చెప్పండి అని అడుగుతారు. అందుకే ఎలాగూ జరుగనుంది, ఇదైతే గ్యారంటీ. మీ అందరికీ అయితే గ్యారంటీ ఉంది కదా, విదేశాల వారు కావచ్చు, దేశం వారుకావచ్చు, మీ సహయోగం ఉండనే ఉంది. జరిగేదే ఉంది. చప్పట్లు కొట్టండి. అందరి ఉత్సాహము మంచిగా ఉంది. నిమిత్తంగా ఉన్న ఆత్మలు పాండవులు కావచ్చు, శక్తులు కావచ్చు ఇద్దరిలో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం బాప్‌దాదా ఇచ్చిన సూచనను అనగా పురుషార్థాన్ని తీవ్రం చెయ్యండి. పురుషార్థం కాదు, పురుషార్థానికి సమయం అయిపోయింది, ఇప్పుడు తీవ్ర పురుషార్థానికి సమయము. తర్వాత, తర్వాత అని అనవద్దు, ఇప్పుడే. ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడే అవ్వాలి. అవ్వాల్సిందే. అచ్ఛా.
కలకత్తావారు ఈరోజు పూలతో అలంకరించారు:- మనసుతో చేస్తుండటం బాప్‌దాదా చూసారు. అలంకరించడం పెద్ద విషయం కాదు, మీకన్నా ఇంకా బాగా చేసేవారు కూడా ఉన్నారు కానీ మీకు బాబాపై ప్రేమ ఉంది. తండ్రి గురించి కొంచెం తెలుసు. అందుకే ఏ అలంకారం చేసినా కానీ, అందులో కేవలం పని మాత్రమే కాదు ప్రేమ కూడా ఉంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడి ప్రేమ సుగంధం అందరికీ నచ్చుతుంది. ప్రతిసారి వస్తారు. తమ బాధ్యత అని కాదు, ఇది నా పని అని అనుకుని చేస్తున్నారు. మరి మీ అందరికీ అభినందనలు. నిమిత్తమై ఉన్నవారు ఉల్లాస ఉత్సాహాలను ఇప్పిస్తారు. చాలా బాగా చేస్తారు. స్మృతి దివసము వచ్చిందంటే కలకత్తాను గుర్తు చేసుకుంటారు, విశేషత అది. అభినందనలు. అచ్ఛా.
నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థి, సదా ఉల్లాస ఉత్సాహాలతో అడుగులు ముందుకు వేసేవారికి, ఎవరైతే సత్యమైన హృదయంతో చేస్తారో వారి మస్తకంపై ఉన్న విజయి తిలకాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అందరికీ నిశ్చయము ఉంది. నషా ఉంటే మేము విజయులము అని అర్థం. విజయులుగా ఉండేవారము, విజయులుగా ఉన్నాము మరియు విజయులుగా ఉంటాము. అందుకే ప్రతి ఒక్కరి మస్తకంలో బాప్‌దాదా విజయి తిలకాన్ని చూస్తున్నారు. నలువైపుల స్నేహితులు కూడా ఉన్నారు. ఈరోజు అమృతవేళ నుండి చాలా-చాలా స్నేహ మాలలు బాప్‌దాదా వద్దకు వచ్చాయి మరియు బాప్‌దాదా పిల్లలందరికీ రిటర్నులో సదా విజయులుగా అయ్యే మాలను వేస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలు కూడా చూస్తున్నారు ఎందుకంటే సైన్సు ఈ సాధనాలన్నిటినీ మీ కోసం కూడా తయారు చేసింది. ఎవరు ఎక్కడైనా కూర్చుని చూడవచ్చు, వినవచ్చు. ప్రతి చోటా ఎలాగోలాగా చూస్తున్నారు కూడా మరియు వింటున్నారు కూడా, ఇది బాప్‌దాదా చూస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలకు స్మృతి దివసం సందర్భంగా బాప్‌దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. బాప్‌దాదా హృదయంలో పిల్లలందరూ ఇమిడి ఉన్నారు మరియు పిల్లల హృదయంలో బాబా ఇమిడి ఉన్నారు. తండ్రి హృదయంలో పిల్లలు ఇమిడి ఉన్నారు, ఇందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు మరియు నమస్తే కూడా.
దాదీలతో:- ప్రియమైన సంతానం పాత్ర వహిస్తున్నారు, వీరిని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు (మోహిని అక్కయ్యతో) ధైర్యం కలవారు మరియు ధైర్యమే మీకు విశేషమైన మందు.
దాదీ రతన్మోహిని:- వీరు కూడా మంచిగా ఉన్నారు, ప్రతి కార్యంలో హా జీ, హా జీ అంటూ కలుపుకు పోతున్నారు, కలుపుకు పోతూ ఉంటారు.
చెన్నైలో సర్వ్ ఇండియా కార్యక్రమం జరుగనుంది, అందరూ విశేష స్మృతిని అందించారు:- ముఖ్యమైన విషయమేమిటంటే గవర్నర్ హౌస్ లభించింది. అక్కడివారు కూడా ఇందులో చాలా ఇంటరెస్ట్ కలవారు. ఇది సేవకు ఋజువు. అందుకే బాప్‌దాదా పిల్లలందరికీ, బీనా అక్కయ్యతో పాటు నిమిత్తంగా ఉన్న పిల్లలందరికీ లక్ష రెట్లు అభినందనలు తెలుపుతున్నారు. నిజార్ బచ్చా కూడా ఉత్సాహం కలిగినవాడు. ఇంకా ఏమేమి చెయ్యగలను అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్లాన్ తయారు చేస్తూ ఉంటాడు, అతనికి కూడా విశేషమైన స్మృతిని ఇవ్వండి. గవర్నర్ సహయోగిగా అయితే ఉన్నారు కానీ పాదం ముందుకు పెట్టాలి అంటే ముందుగా ఒక పాదం ముందు పెట్టి ఆ తర్వాత మరో పాదం పెడ్తారు అలాగే వారు స్నేహి మరియు సహయోగి, కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రిజల్టులో అడుగులు మరింత ముందుకు వేసి మీకు తోడుగా నిలవాలి. ఇప్పుడు స్నేహి, సహయోగి, సేవా మహత్వం తెలుసు. ఇప్పుడు మహత్వం వరకు తెలుసు, ఇప్పుడు మరో అడుగు ముందుకు వెయ్యాలి.
గౌరవనీయులు ముఖ్యమంత్రి సోదరుడు ప్రొ. ప్రేమ్‌కుమార్ ధూమల్, హిమాచల్ ప్రదేశ్:- సంకల్పాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి మంచి పని చేసారు. మీ ఇల్లుగా భావిస్తున్నారు కదా! ఎందుకంటే తండ్రి ఇల్లు అంటే మీ ఇల్లు అని అర్థం. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మీ ఇంటికి వచ్చేయండి. (పర్సనల్ సెక్రెటరీ మొదలైన వారందరూ ఉన్నారు) మీరు కూడా సంతోషంగా ఉన్నారు కదా. మీరు కూడా వస్తూ ఉండండి. ఇప్పుడు కేవలం వీరితో వచ్చారు అని కాదు! వస్తూ ఉండండి. అచ్ఛా!
ఓంశాంతి