Search for a command to run...
2 Mar 2011
ఈ పుట్టినరోజు నాడు అందరూ ఒకరికొకరు ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చుకుంటూ, సహయోగిగా అయ్యి వ్యర్థ సంకల్పాలు అనే జిల్లేడు పూలను అర్పించండి. మాస్టర్ సర్వశక్తిమంతుని సీట్‌పై సెట్ అయ్యి ఇందులో నంబర్‌వన్ బహుమతిని పొందండి
2 March 2011 · తెలుగు
ఈరోజు మీరందరూ మరియు నలువైపుల ఉన్న పిల్లలందరూ అమృతవేళ నుండే ఎంతో స్నేహము నిండిన అభినందనలను ప్రేమతో, సంతోషంతో ఇస్తున్నారు. అలాగే బాబా కూడా గారాల పిల్లలైన మీ అందరికీ ఈ జయంతినాడు అభినందనలను ఇవ్వడానికి వచ్చారు. పిల్లలు ఒక్కొక్కరు బాబాకు అతి ప్రియమైనవారు, మనసుకు ఇష్టమైనవారు. బాప్‌దాదా తమ బాహువుల మాలతో మీ అందరికీ అభినందనలను ఇస్తున్నారు.
బాప్‌దాదా ఏమి చూస్తున్నారంటే మీరైతే ఎదురుగా ఉండి అభినందనలు ఇస్తున్నారు కూడా మరియు తీసుకుంటున్నారు కూడా. నలువైపుల ఉన్న అనేక స్థానాలలోని పిల్లలు కూడా అభినందనలు తెలుపుతున్నారు. బాబా కూడా దేశవిదేశాలలో, అన్ని వైపుల ఉన్న పిల్లలకు అతి స్నేహపూర్వక అభినందనలు తెలుపుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ సంతోషకర ముఖముతో ప్రేమ సాగరంలో మునిగి ఉండటాన్ని బాప్‌దాదా చూస్తున్నారు. బాబా ఒంటరిగా రారు, పిల్లలతోటే వస్తారు, ఇందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే బాబా వచ్చేది యజ్ఞాన్ని రచించడానికి. మరి యజ్ఞంలో ఎవరు ఉంటారు? బ్రాహ్మణులు. అందుకే బాబా ఒంటరిగా రారు, పిల్లలతో కలిసి వస్తారు. ఈ జయంతి అన్ని జయంతులలోకల్లా అద్భుతమైన జయంతి. పూర్తి కల్పంలో ఈ ఒక్క జయంతిలోనే తండ్రి మరియు పిల్లల జయంతి కలిసి ఉంటుంది. అందుకే ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అని అనడం జరుగుతుంది. బాబా కూడా విశేషంగా ఆదిరత్న పిల్లలకు విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. మరి మీరందరూ ఈరోజు అభినందనలు తెలపడానికి వచ్చారా లేక అభినందనలు తీసుకోవడానికి కూడా వచ్చారా! బాబా అంటారు కలిసి ఉంటాము, కలిసి ఎగురుతాము, కలిసి వస్తాము మరియు బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యం చేస్తాము. కలిసి ఉంటాము అన్న ప్రతిజ్ఞ ఉంది కదా. మీరు కూడా ఏమంటారు? మేము కూడా ఎక్కడ బాబా ఉంటే అక్కడ కలిసి ఉంటాము అని అంటారు కదా. ఇదే బాబా పిల్లలకు, పిల్లలు బాబాకు చేసే ప్రతిజ్ఞ. శరీరం ద్వారా ఎక్కడ ఉన్నాకానీ హృదయంలో సదా బాబా తోడుగా ఉన్నారు అందుకే బాబాను దిలారామ్ అని అంటారు. ఇక్కడ స్మృతిచిహ్నంగా కూడా దిల్వాలా మందిరం ఉంది. మరి అందరి హృదయాలలో, అందరికీ తోడుగా దిలారామ్ ఉన్నారు కదా! బాబా సదా పిల్లలకు ఏమని చెప్తారంటే ఎప్పుడూ ఒంటరిగా అవ్వకండి. సదా కలిసి ఉంటాము, కలిసి ఉండవలసిందే. ఒంటరిగా ఉంటే మాయ తన అవకాశాన్ని తీసుకుంటుంది. కలిసి ఉంటే స్వయంగా లైట్ హౌస్ తోడుగా ఉంటారు. వారి ఎదురుగా మాయ దూరం నుండే పారిపోతుంది, దగ్గరకు కూడా రాలేదు కావున పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో కలిసి ఉంటాము అన్నది ప్రతిజ్ఞ. మీ అందరి ప్రతిజ్ఞ కూడా ఉంది కదా! కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము. కలిసి ఉండటంలో మంచిగా అనిపిస్తుంది కదా. చేతులెత్తండి.
బాప్‌దాదా ఏమి చూసారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ అమృతవేళ బాబాతో ఎంతో మనస్ఫూర్తిగా మాట్లాడుతారు. మామూలుగా సమయం లభించదు కానీ అమృతవేళ ప్రతి ఒక్కరూ మధురాతి మధురంగా మనసులోని విషయాలను మాట్లాడుతారు. బాబా కూడా పిల్లల మనసులోని విషయాలను విని వాటికి జవాబు కూడా ఇస్తారు. మేము మనస్ఫూర్తిగా నా బాబా అని అంటాము అని అందరికీ ఈ ఒక్క విషయంలో అయితే చాలా సంతోషంగా ఉంది. అప్పుడు బాబా హాజరైపోతారు. హజూర్ హాజరైపోతారు. ఇందులో కేవలం మనసుతో అనడం కావాలి. మరింకేదీ చేయనవసరం లేదు. మనస్ఫూర్తిగా నా బాబా అన్న వెంటనే హజూర్ హాజరు.
ఈరోజు నలువైపుల నుండి బాప్‌దాదా చెవులలో ఒక మధురమైన పాట వినిపిస్తుంది. ఏ పాట? నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా. బాప్‌దాదా కూడా పిల్లల స్నేహంలో మునిగి ఉన్నారు, మునిగి ఉంటారు. ఇప్పుడు బాప్‌దాదా మీ స్నేహము యొక్క దివ్య కర్తవ్యాన్ని చూసి, మీ భక్తులు కూడా తక్కువ బుద్ధి కలిగినవారు కాదు. వారు కూడా మీ స్మృతిచిహ్నమును బాగా కాపీ చేసారు. ద్వాపరంలో వచ్చారు, మొట్టమొదటి జన్మ ఎలాగూ సతోప్రధానంగా ఉంటుంది ఎందుకంటే పరంధామం నుండి ఆత్మ వస్తుంది. ఈరోజు భక్తులవైపు కూడా దృష్టి వెళ్ళింది. కానీ మీది ప్రాక్టికల్, వారిది స్మృతిచిహ్నము. ఎలాగైతే మీరు వ్రతం తీసుకున్నారు కదా, ఏ వ్రతాన్ని తీసుకున్నారు? పవిత్రత యొక్క వ్రతము. అలాగే వారు కూడా వ్రతాన్ని తీసుకుంటారు. వ్రతాన్ని కాపీ చేసారు కానీ మీరు వ్రతము ఒక్క జన్మ తీసుకుంటే అనేక జన్మలు ఆ వ్రతము కొనసాగుతుంది. వారు ఒక్క రోజు కోసం పవిత్రంగా కూడా ఉంటారు మరియు ఆహార పానీయాలు కూడా శుద్ధంగా ఉంటాయి. మీది 21 జన్మల వ్రతము, వారిది అల్పకాలికమైనది. అలాగే జాగరణ, మీరు వెలుతురులోకి వచ్చినప్పుడు పూర్తి విశ్వంలో ఉన్న అంధకారం తొలగిపోయింది. అర్థకల్పం అంధకారం రాజాలదు. మనసులోని అంధకారాన్ని తొలగించారు మరియు బయట ప్రకృతిలోని దుఃఖపు అంధకారాన్ని కూడా తొలగించారు. ఇది కూడా కాపీ చేసారు, జాగరణ చేస్తున్నారు. మరో విషయము, మీరు బాబాపై బలిహారమయ్యారు, బలి అయ్యారు. పూర్తిగా సమర్పణ అయ్యారు. వారు కూడా దీనిని కాపీ చేసారు కానీ తమను తాము బలిహారం చేసుకోవడం లేదు, తమను తాము బలి ఇవ్వడం లేదు, దేనిని బలి ఇస్తారు? తెలుసు కదా! మేకను బలి ఇస్తారు. మేకనే ఎందుకు బలి ఇస్తారు, మరో దానిని ఎందుకు తీసుకోలేదు? అందరూ నవ్వుతున్నారు, తెలుసు కదా. బాబా ఏదైతే పిల్లలకు సూచన ఇస్తూ ఉన్నారో, నేను అన్నదానిని వదిలి నిమిత్త భావాన్ని ధారణ చేయండి అని, దానికి వారు మేకను వెతికి పట్టుకున్నారు. ఎందుకంటే అది కూడా మే, మే అని అంటుంది కదా. మరి భక్తుల బుద్ధి అద్భుతంగా ఉంది కదా! మీ భక్తులు కదా! బాబా మరియు మీ భక్తులు. అందుకే బాబా మీ భక్తులకు కూడా, ఎవరైతే సత్యమైన మనసుతో చేస్తారో వారికి ఏదో ఒక ఫలితాన్ని ఇస్తారు. భక్తి యొక్క ఫలితాన్ని ఇస్తారు, వారు కూడా సదా సత్యంగా, సాత్వికంగా మరియు సంతోషంగా ఉంటారు. దుఃఖంలో దుఃఖితులవ్వరు ఎందుకంటే భక్తిని సత్యమైన హృదయంతో చేస్తారు. బాబా కూడా ఈ మధ్య కాలంలో పిల్లలైన మీకు ఇదే సూచనను ఇస్తున్నారు - నేను అన్నదానిని తీసుకురాకండి. నేను ఏమి చెప్తానో అదే జరగాలి, నేనే సరిగ్గా చెప్తాను, అదే జరగాలి. ఈ నేను, నేను అన్నది ఒకటి సాధారణ నేను - నేను శరీరధారిని, దేహధారిని. రెండవది సూక్ష్మమైన నేను. అందులో బాబా ఇచ్చినవాటిని కూడా నేను చేసాను, నేను మాట్లాడాను, నేను చేస్తున్నాను, బాబా విశేషతలలో కూడా నేను అన్నది వచ్చేస్తుంది. కావున బాబా సూచన ఇస్తూ ఉంటారు. నేను, నాది. సదా నా బాబా, ఈ వైపుకే సదా మనసు యొక్క ఆకర్షణ ఉండాలి. హద్దు యొక్క నేను, నాది, నా పేరు, నా ప్రతిష్ఠ, దీనిని సమాప్తం చేసి నేను బాబాకు చెందినవాడను, బాబా నావారు అని అనుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. భగవంతుడు నావారయ్యారు, ఇంకేమి కావాలి! కావున ఒకటి సాధారణ నాది, ఇంకొకటి సూక్ష్మమైన నాది. ఈ సూక్ష్మమైన నాది అన్నది మైలా(మురికిగా) చేసేస్తుంది. నా బాబా అంటే మాలామాల్ చేసేస్తుంది.
మరి ఈరోజు బర్త్‌డే జరుపుకోవడానికి వచ్చారు. మీ బర్త్‌డేను కూడా జరుపుకోవడానికి వచ్చారు కదా! పిల్లలు లేనిదే బాబా ఏమీ చెయ్యరు. అందుకే ఈరోజు బాబా పిల్లల జన్మ ఉత్సవానికి అభినందనలు తెలియజేస్తున్నారు, వాహ్ నా పిల్లలు వాహ్! ఇప్పుడు ఒక విషయము చెప్పమంటారా, తయారుగా ఉన్నారా? చెప్పమంటారా? మరి చెయ్యవలసి ఉంటుంది. చేస్తాము అనేవారు చేతులెత్తండి. డబల్ విదేశీయులు చేస్తారా? టీచర్లు చేస్తారా? అచ్ఛా. మరి ఈరోజు బాప్‌దాదా ఎలా అయితే స్మృతిచిహ్నంలో, శివ పరమాత్ముని స్మృతిచిహ్నంలో జిల్లేడు పూలను వేస్తారో, గులాబీ పూలను వేయరు, మరే ఇతర పూలను వేయరు. జిల్లేడు పూలను వేస్తారు. ఈరోజు బాప్‌దాదా మీరు ఏ విషయాన్ని అర్పించాలో ఆ హోమ్‌వర్కును ఇవ్వాలనుకుంటున్నారు. తయారుగా ఉన్నారు కదా! అచ్ఛా.
పిల్లలు హా జీ అనడం బాబాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఈరోజు బర్త్‌డే సందర్భంగా బాబా సంకల్పమేమిటంటే అందరూ ఒకరికొకరు ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చుకుంటూ, ఒకరికొకరు సహయోగిగా అవుతూ వ్యర్థ సంకల్పాలు అనే జిల్లేడు పూలను అర్పించండి. వ్యర్థ సంకల్పాలు చెయ్యకూడదు, వినకూడదు మరియు సాంగత్యంలోకి వచ్చి వ్యర్థ సంకల్పాల సాంగత్యపు రంగును అంటించుకోకూడదు. ఎందుకంటే ఎక్కడ వ్యర్థ సంకల్పాలు ఉంటాయో అక్కడ స్మృతి యొక్క సంకల్పాలు, జ్ఞానము యొక్క మధురమైన మాటలు, దేనినైతే మురళి అని అంటామో, ఆ శుద్ధ సంకల్పాలు స్మృతిలో ఉండవు. మురళి విన్నప్పటికీ, చదువుకున్నప్పటికీ, అది ఆవశ్యకము. అది బ్రాహ్మణుల నియమము. కానీ వినడం వరకే అవుతుంది. మనసులో మననము జరగడం లేదు. ఆలోచిస్తారు, ఈరోజు మురళి చాలా బాగుంది అని అంటారు, ఏముందో ఆలోచిస్తున్నాను అని అంటారు. వరదానము కూడా చాలా బాగుంది, కానీ గుర్తుకు తెచ్చుకుంటున్నాను అంటారు. వ్యర్థ సంకల్పాలు మనసు, బుద్ధిని తమ వైపుకు ఆకర్షిస్తాయి. బాబాతో ఏమంటారో మీకు తెలుసా? బాబా, ఇంట్రెస్టెడ్ సమాచారము వినాలి కదా, నాలెజ్ఫుల్గా అవ్వాలి కదా అంటారు. కానీ వ్యర్థ విషయాలు పదవీ ప్రాప్తిలో నష్టాన్ని తీసుకువస్తాయి. మరి మీరందరూ వ్యర్థ సంకల్పాల గురించి బాబాకు ప్రతిజ్ఞ చేస్తారా? మేము కోరుకోము కానీ అవే వచ్చేస్తూ ఉంటాయి అని మీరంటారు. అనుకోవడంలేదు కానీ వచ్చేస్తున్నాయి. బాబాకు దృఢ సంకల్పంతో ఇవ్వడం ద్వారా, ముందు అసలు ఇవ్వడం వచ్చా? బాబాకు ఇచ్చేసారు. ఇచ్చిన వస్తువు ఒకవేళ మీవద్దకు తిరిగి వచ్చినా కానీ ఇచ్చిన వస్తువును మీ వద్ద పెట్టుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా? తిరిగి ఇచ్చిన వస్తువును మీ వద్ద మళ్ళీ పెట్టుకుంటే మీ టైటిల్ ఏమవుతుంది? కావున బాబాకు ఒకసారి మీరు ఇంట్రెస్టుతో, దృఢత్వంతో ఇవ్వండి. అలాగే ఇచ్చిన వస్తువు మళ్ళీ నా వద్దకు రాలేదు కదా అని పదే పదే పరిశీలించుకుంటూ ఉండండి. ఇతరుల వస్తువును తమదిగా చేసుకోవడము మంచిది కాదు. మరి రోజూ విశ్రాంతి తీసుకునే ముందు, విశ్రాంతి తర్వాత తీసుకోవచ్చు, ముందు పరిశీలించుకోండి - ఈరోజు రోజంతటిలో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రాలేదు కదా? చేయలేదు కదా? ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోలేదు కదా? మరి ఈరోజు పుట్టినరోజు బహుమతిగా దీనిని ఇచ్చే ధైర్యముందా? ధైర్యముందా? చేతులెత్తండి, ధైర్యముందా? ఎక్కడ ధైర్యము ఉంటుందో బాప్‌దాదా కూడా మీకు బహుమతిని ఇస్తారు. మీరు మనస్ఫూర్తిగా నా బాబా, దయాళు కృపాళు బాబా, ఇది మీరు తీసేసుకోండి అని అనండి. ఒకవేళ హృదయంతో అన్నట్లయితే బాబా ఎక్స్ట్రా బహుమతిని అందిస్తారు. ఎందుకంటే ధైర్యము మీది, ఎక్స్ట్రా సహాయము బాబా ఇస్తారు. ఎక్కడ ధైర్యము ఉంటుందో అక్కడ బాబా సహాయము తప్పక ఉంటుంది, ఇదైతే అనుభవం చేసారు కదా. ఎందుకంటే బాబా ఎంతో కాలం నుండి ఈ సూచన ఇస్తున్నారు - ఇప్పుడు తీవ్ర పురుషార్థానికి మార్గము మూడు బిందువులను పెట్టడము. నేను బిందువును, బాబా బిందువు మరియు గడిచినదానికి బిందువును పెట్టాలి. ఫుల్స్టాప్, బిందువు. బాప్‌దాదా మననము చేయడము అని దేనినైతే అంటారో, బిందువుగా అవ్వాలి, బిందువును చూడాలి మరియు బిందువును పెట్టాలి. అందుకే బిందువుకు అంత మహత్వము ఉంది. ఈ కాలంలో కూడా బిందువుకు మహత్వము ఉంది. చూడండి, డబ్బులు లెక్కపెడ్తారు కదా. ఈరోజుల్లో అందరి ప్రేమ దేనిపై ఉంది? డబ్బులు. మరి డబ్బులు ఎలా పెరుగుతాయి? బిందువు పెట్టుకుంటూ వెళ్లండి. 10 తర్వాత బిందువు పెడితే 100 అవుతుంది. 100 తర్వాత బిందువు పెడితే 1000 అవుతుంది. కావున బిందువుకు మహత్వము ఉంది. కానీ అసలైన బిందువు గురించి మర్చిపోయారు. మరి ఈరోజు బాబాకు జన్మదిన బహుమతిని ఇచ్చారా? ఇచ్చారా? మనస్ఫూర్తిగా ఇచ్చారా? ఎందుకు, ఏమిటి అని అనరు కదా? ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఈ కై, కై భాష మంచిది కాదు. మరి బహుమతి ఇవ్వడానికి సంతోషంగా చేతులెత్తారా లేక సంఘటనలో తప్పదని ఎత్తారా? ఎందుకంటే తప్పదని ఎత్తేవారిది సదా ఉండదు. అప్పుడప్పుడూ ఉంటుంది. మనస్ఫూర్తిగా చేసేవారు చేయవలసిందే, అవ్వవలసిందే అని అంటారు. బహుమతి ఇచ్చేసారు కదా లేక ఇంకా ఇవ్వాలా? ఇలా సంతోషంగా సంకల్పం చేసినట్లయితే సర్వశక్తిమంతుడైన బాబా పిల్లలుగా, మాస్టర్ సర్వశక్తిమంతులకు పెద్ద విషయము ఏమైనా ఉన్నదా? సీటుపై ఉండండి, మాస్టర్ సర్వశక్తిమంతుని సీటుపై సదా సెట్ అయ్యి ఉండండి. మర్చిపోవద్దు. ఇది స్వమానం కదా. తమ స్వమానాన్ని వదలడం జరుగదు. స్వమానం కోసం ఒకరికొకరు గొడవ పడ్తూ ఉంటారు. చిన్న విషయాలలో తమ స్వమానాన్ని, పరమాత్మ ద్వారా లభించిన స్వమానాన్ని పోగొట్టుకోవద్దు. మనుష్యుల ద్వారా లభించే స్వమానంలోనే ఎంత నషాతో ఉంటారు, ఇది పరమాత్మ ద్వారా లభించిన స్వమానము - మాస్టర్ సర్వశక్తిమాన్. ఏది కావాలంటే అది చెయ్యగలరు. ధైర్యముంది కదా? తల ఊపండి. చేయి ఊపకండి, తల ఊపండి. ధైర్యముందా? టీచర్లు. మీరు చేయించవలసి ఉంటుంది. , అటెన్షన్ ఇప్పించవలసి ఉంటుంది. మీరు చేయాలి, అటెన్షన్ ఇప్పించి చేయించవలసి కూడా ఉంటుంది. నిమిత్తంగా ఉన్నారు కదా. ఏ క్లాసు, ఎవరి క్లాసు నంబరు తీసుకుంటుందో చూస్తాము! అప్పుడు మంచి బహుమతిని ఇస్తాము. ఏ బహుమతిని ఇస్తామన్నది చెప్పము. మంచి బహుమతిని ఇస్తాము. పూర్తి క్లాసు ప్రయత్నించాలి. ఒక్కరు చేస్తే సరిపోదు, మెజారిటీ చేయాలి.
ఈరోజు బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ కలుగుతుంది, పిల్లలు నంబర్‌వన్‌గా రావాలి. టూ(రెండు)లో కూడా కాదు. మొదటి రాజ్య సింహాసనంపై కూర్చోరు, సింహాసనంపై అయితే ఇద్దరే కూర్చుంటారు కదా. కానీ మొదటి రాజధానిలో, మొదటి రాజ్య వంశం యొక్క సంబంధంలోకి వస్తారు. రెండవ నంబరుగా అయితే అయ్యారు కానీ మొదటి రాజధాని, రాజ్యాధికారులుగా అవ్వడము. పిల్లలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విశేషతలో నంబర్‌వన్ రావాలి అని బాబా పిల్లలపైన ప్రేమ చూపుతున్నారు. నంబరువారీగా కాదు, నంబర్‌వన్ రావాలి. ఉల్లాసము ఉన్నదా? నంబర్ వన్‌లోకి రావాలా లేక ఏది లభించినా మంచిదే అని అనుకుంటున్నారా? మంచిది, మంచిది అని అనకండి. పిల్లలు ఒక్కొక్కరు ఏదో ఒక అద్భుతంలో నంబర్‌వన్‌లో రావాలని బాబా ఆశిస్తున్నారు. నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి, ఎదో ఒక సబ్జెక్టులో నంబర్‌వన్‌గా అవ్వవలసిందే. అవ్వవలసిందే, దీనిని అండర్లైన్ చేయండి. ఎక్కువ కష్టాన్ని మీకు ఇవ్వడం లేదు. ఏదో ఒక సబ్జెక్టులో నంబర్‌వన్. ఇదైతే సహజమే కదా. ఇకపోతే ఈరోజు అమృతవేళ నుండి మిలనము జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా, సంతోషంతో నవ్వుతూ, సంతోషంగా కనిపించారు. బాబా కూడా పిల్లలందరికీ సదా ఎగిరే కళను వరదానంగా ఇచ్చారు. నడిచే కళ కాదు, ఎగిరే కళ. మరి బాప్‌దాదా ఈరోజు ఇస్తున్న ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి. బాప్‌దాదా తమ మరియు పిల్లల జయంతి సందర్భంగా ఏ వరదానమును ఇచ్చారు? ఎగిరే కళ భవ. మీరు కూడా రోజంతా ఉత్సవము, శివరాత్రి ఉత్సవాన్ని మనసులో జరుపుకున్నారు కదా! మరి అందరూ మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు, ఎంతో మంచి రాజ్య పదవిని పొందుతారు. అందరూ మంచిగా ఉన్నారు కదా! బాబా అయితే అంతా మంచినే చూస్తారు. అచ్ఛా.
నలువైపుల సమ్ముఖంలో కూర్చుని ఉన్నవారైనా, తమ తమ స్థానాలలో కూర్చుని జరుపుకుంటున్నవారైనా, అందరినీ చూసి బాప్‌దాదా హర్షితమవుతున్నారు. పిల్లలు కూడా బాబా మిలనాన్ని చూసి సంతోషిస్తున్నారు. కానీ ఈనాటి సంకల్పాన్ని గుర్తుంచుకోండి - సదా సంతోషము. అప్పుడప్పుడూ కాదు, సదా సంతోషము. ఎవరు మీ ముఖాన్ని చూసినాకానీ వీరు చాలా భాగ్యశాలి ఆత్మ అని అనుకోవాలి. మీ భాగ్యము ముఖము మరియు నడవడికతో కనిపిస్తుంది. కేవలం మనసులోనే చాలా ఉంది అంటే కాదు. మీ భాగ్యశాలి ముఖము, సంతోషకర ముఖము ఇతరులకు పరిచయాన్ని ఇస్తుంది. ఏదో ఉంది అని ముఖము చెప్తుంది. బాబా వరకు తీసుకురావాలి. సంతోషంగా ఉండాలి, ఇది కూడా సేవా సాధనమే. మరి నలువైపుల ఉన్న పిల్లలకు, మీకు కూడా బర్త్ డే యొక్క పదమారెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
సేవ టర్ను ఇండోర్ జోన్ వారిది:- అచ్ఛా. వీరందరూ ఇండోర్ జోన్ వారు. ఇండోర్ వారు ఊపుతున్నారు. (5 స్వరూపాల గుర్తు చేతిలో ఉంది). ఇది మంచిగా చేసారు. ప్రతి ఒక్కరినీ విడిగా చూడటం వలన తమ టర్నులో యజ్ఞంపై ప్రేమ ఉంది అని అర్థమవుతుంది. ఎందుకంటే బాబా కూడా వచ్చిన వెంటనే యజ్ఞాన్ని రచించారు. యజ్ఞాన్ని సదా ముందుకు తీసుకువెళ్ళడము, నిండుగా ఉంచడము ఇదే యజ్ఞంలోని ప్రియమైన పిల్లల పని. ఎలా అయితే సెంటరు గురించి నలువైపుల అటెన్షన్ ఉంచుతారో అలాగే యజ్ఞాన్ని కూడా చూడటం పిల్లలు ప్రతి ఒక్కరి కర్తవ్యము. బాప్‌దాదా ఇప్పటి వరకు ఏమి చూసారంటే ఈ టర్ను తీసుకోవడంలో అందరూ పాస్ అయ్యారు. ఇందులో ఎవ్వరిలోనూ లోటు లేదు. మరి ఎలా అయితే టర్ను సమయంలో యజ్ఞాన్ని చూసుకున్నారో, అనుభవం చేసారో, అలాగే ఇప్పుడు సెంటరులో ఉంటూ కూడా ప్రతి ఒక్కరూ యజ్ఞ రక్షకులు. యజ్ఞ నివాసులు అంటే కేవలం ఇక్కడ ఉండేవారే కాదు, ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డ యజ్ఞ ప్రియులు, యజ్ఞ రక్షకులు. ఇలా స్వయాన్ని బాధ్యులుగా భావిస్తూ సదా నడవండి. ఈ టర్ను పూర్తయింది కానీ అక్కడ ఉంటూ శ్రద్ధ వహించాలి, అడుగుతూ ఉండండి. ఎలా అయితే ఇప్పుటి టర్నులో కొన్ని కొనవలసి కూడా వచ్చింది కదా. ఇటువంటి యజ్ఞానికి, బ్రాహ్మణులు అనగా యజ్ఞ రక్షకులు. మరి ఇంతగా ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఉంచవలసి ఉంటుంది. ముందు యజ్ఞము తర్వాత సెంటరు. అటెన్షన్ అయితే ఇస్తున్నారు. ఎవరెవరు ఏ విధంగా అటెన్షన్ ఇస్తున్నారు, ఎంత పెంచుతున్నారు అన్నది బాప్‌దాదాకు తెలుసు. బాప్‌దాదా కేవలం సూచన ఇస్తున్నారు, చేస్తున్నారు కూడా, ఇకముందు చేస్తూ కూడా ఉంటారు. మీ ఈ యజ్ఞ స్థాపన ఆత్మలందరికీ యజ్ఞ ప్రసాదాన్ని ఇప్పిస్తుంది. మరి మీరందరూ ఎవరు? యజ్ఞ రక్షకులా లేక సెంటరు రక్షకులా? యజ్ఞ రక్షకులు. బాబాకు తోడుగా ఉన్నారు కదా. బాప్‌దాదా యజ్ఞ రక్షకులు కదా. మీ టైటిల్ ఏమిటి? యజ్ఞ రక్షకులు కదా. మంచిగా చేస్తున్నారు, మరింత మంచిగా చేస్తూ ఉంటారు. తనువు, మనసు, ధనము, సేవ - ఇవి నాలుగు విషయాలు. ఎలా అయితే నాలుగు సబ్జెక్టులు ఉన్నాయో, జ్ఞానము, యోగము, ధారణ, సేవ - అలాగే ఇవి కూడా నాలుగు సబ్జెక్టులు. ఇకపోతే బాబా వద్దకు రిజల్టు వస్తూ ఉంటుంది. బాప్‌దాదా అన్ని రిజల్టులను చూస్తారు, ఇంటరెస్టుతో చూస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఏమేమి చేస్తున్నారు! మంచిది. బాప్‌దాదా వద్ద ఇప్పటివరకు రిపోర్టు(ఫిర్యాదు) లేదు కానీ భవిష్యత్తు కోసం సూచన ఇస్తున్నాము. అచ్ఛా.
వీరు ఏమి అద్భుతాన్ని చేసి చూపిస్తున్నారు? ఏదో ఒక అద్భుతాన్ని అయితే చేస్తారు కదా! సేవలో భిన్న భిన్న ప్రోగ్రాములు, భిన్న భిన్న విధులు తయారు చేయడాన్ని బాప్‌దాదా విన్నారు. వాటిని ప్రాక్టికల్లోకి కూడా తీసుకువస్తున్నారు. ఈ రిజల్టు అయితే విన్నాము. ఇందులో పాస్ కదా, పాస్ అయ్యారా? చేతులెత్తండి. క్రొత్త క్రొత్త ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు, వాటిని ప్రాక్టికల్లోకి తెస్తూ ఉంటారు. మంచిది. ఇటువంటి ప్రాక్టీస్ చేస్తూ అందరూ ఆ పద్ధతిని అనుభవం చేసే విధంగా ఏదైనా సాధనమును తయారు చేయండి. అచ్ఛా. బాప్‌దాదా అభినందనలు ఇస్తున్నారు, అభినందనలు, అభినందనలు.
డబల్ విదేశీ సోదరీసోదరులు 60 దేశాల నుండి 1100 మంది వచ్చారు:- విదేశీ పిల్లలను చూసి భారతవాసులు చాలా సంతోషిస్తారు ఎందుకంటే బాబా టైటిల్ విశ్వ కళ్యాణకారి అని ఉంది. కేవలం భారత కళ్యాణకారి కాదు. విదేశీయులు కూడా ఇప్పుడు ఇండియన్ కల్చర్ వారిగా అయిపోవడాన్ని చూస్తారు ఎందుకంటే సత్యయుగంలో రాజ్యం చేసేవారు కదా. అధికారులుగా అయ్యేవారు. మరి ఏదైతే బాబా యొక్క పరమాత్మ కల్చర్ ఉన్నదో అది మీదిగా అయిపోయింది. మన సోదరులే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, సేవ కోసం భారతము నుండి వెళ్ళిపోయారు, కానీ ఉన్నది భారతవాసి బీజమే. మీ బీజము ఫారెన్ కాదు. మొదటిది, అసలైన బీజము భారతముది. అందుకే ఎక్కడెక్కడి నుండో వచ్చి భారత దేశము యొక్క ఒకే కల్చర్ అయ్యారు. ఇండియన్ కల్చర్ కాదు, పరమాత్మ కల్చర్. అది కూడా సంతోషంగా. బాప్‌దాదా ఏమి చూసారంటే ఇక్కడ ఇండియాకు వచ్చి ఇండియన్ వంటలు కూడా నేర్చుకున్నారు. సామాన్లు తీసుకువెళ్తారు. మరి మీ బీజము ఇదే, కేవలం సేవ కోసం ఇన్ని భాషలు ఎవరు నేర్చుకుంటారు! ఒక్కసారికి ఎన్ని దేశాల నుండి వస్తున్నారు. ఇప్పుడు ఇన్ని భాషలు ఎలా నేర్చుకోవాలి? అందుకే మిమ్మల్ని సేవ కోసం పంపడం జరిగింది. నిజానికి భారత దేశానికి చెందినవారు, భారత కల్చర్‌కు అలవాటు పడ్డారు ఎందుకంటే భారతములో ఇక్కడ పరమాత్మ కల్చర్ జరుగుతుంది. ఇండియన్ కల్చర్ కాదు, పరమాత్మ కల్చర్. కానీ ఎంతో సంతోషంగా నేర్చుకుంటారు కూడా మరియు నడిపిస్తారు కూడా. పరివర్తన చేసుకోవడంలో స్వయాన్ని మంచిగా నిమిత్తంగా చేసుకున్నారు. ఇందుకు అభినందనలు. మావారిగా ఉండేవారు, మావారిగా అయ్యారు. గుర్తుంది కదా! భానము కలుగుతుంది కదా. మేము ఇండియన్ కాదు, పరమాత్మ కల్చర్ ఉండేవాళ్ళము, ఇప్పుడు మళ్ళీ లాస్టులో వచ్చి అయ్యాము. నాలుగు-ఐదు జన్మలు సేవ కోసం అక్కడ జన్మ తీసుకున్నారు. ఎవరైతే ఇక్కడకు వస్తారో, వారు బాబాకు చెంది ఉన్నారు, బాబాకు చెందినవారిగా అయ్యారు. యజ్ఞానికి చెందిన వారిగా ఉండేవారు, అయిపోయారు. మేము ఉన్నామా లేమా అని కొందరు అడుగుతారు. బాబా అంటారు అందరూ ఉన్నారు అని. మంచి మంచి సేవాధారీ పిల్లలు తయారయ్యారు. మధువనంలో సంఘటన చేసుకునే పద్ధతి బాబాకు చాలా బాగా నచ్చింది. పరివారం చూడండి ఎంత ఉన్నదో! పెద్ద పరివారము సుఖీ పరివారము. నిజానికి పెద్ద పరివారమైతే దుఃఖము ఉంటుంది అని అంటారు కానీ సుఖి పరివారము పెద్ద పరివారము మంచిగా అనిపిస్తుంది. పరివారము మంచిగా అనిపిస్తుంది కదా. పరివారాన్ని చూసి సంతోషమేస్తుంది కదా? ఇక్కడి వారే కదా. ఈరోజు పుట్టినరోజును కూడా జరుపుకుంటారు కదా ఎందుకంటే అవతరణ
దినం కదా.
దాదీలతో: - (దాదీ జానకి 4 రోజుల కోసం గుజరాత్ టూర్‌కు వెళ్తున్నారు) ధైర్యముంది కదా. సంకల్పం చేసారు, జరిగే ఉంది. (బాబా వేళ్ళపై నడిపిస్తున్నారు) అందుకే నడుస్తున్నారు కదా. అచ్ఛా.
మోహినీ అక్కయ్యతో:- వీరైతే నడవవలసిందే. తోడును నిభాయించవలసిందే. నిశ్చింత. ఆలోచించవద్దు. మంచిగా ఉన్నారు, మంచిగా జరుగనుంది. అంతా మంచిగా అవుతుంది. అంతే.
ఈషూ దాదీ:- వీరు కూడా తోడుగా ఉన్నారు.
(బాప్‌దాదా అందరికీ తమ వేలితో మస్తకంపై తిలకాన్ని పెట్టారు) అభినందనల తిలకము అందరికీ లభించింది కదా. (టి.విలో చూస్తున్నారు) వారు కూడా సంతోషిస్తున్నారు.
(అంకుల్ - అంటీ చాలా చాలా అభినందనలు తెలిపారు) మీరు బాబా తరఫున తిలకాన్ని ఇవ్వండి. బాబా ఇస్తున్నారు. వారు తిలకాన్ని అనుభవం చేయాలి.
(ప్రీతమ్ బెహన్ భోగ్ నిమిత్తంగా కులదీప్ బెహన్ మరియు వారి పరివారం వచ్చింది) వారు కూడా మంచి పాత్రను వహించారు మరియు అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసారు. పరివారము లక్కీ పరివారము. నిమిత్తమైన తండ్రి మొదటి నుండి పరివారానికి హితకారిగా ఉన్నారు. ఒక్క సైకిలుపై నలుగురిని కూర్చోబెట్టుకుని మురళి వినేందుకు వచ్చేవారు. ఇంతగా లౌకిక పరివారాన్ని మరెవ్వరూ ప్రేమించరు, వారి మంచి వరదానము కూడా పరివారానికి ఉంది.
కుంజ్ దాదీ స్మృతిని పంపారు, అహ్మదాబాద్ హాస్పిటల్లో ఉన్నారు:- వారికి ఏమీ అనిపించదు, పదే పదే వస్తుంది అంటే అందుకు కారణం ఏమిటి? పెద్ద వయస్సు అయితే చాలామందికి ఉంది. వారికి వైద్యం జరుగుతుందా? ఎందుకంటే సేవాధారి కదా. కొద్దిగా వారిని చూసుకుంటా వారిని ఉత్సాహపరచండి. ఇప్పుడు చాలా సమయం బెడ్ పైన ఉన్నారు. అచ్ఛా.
బాప్‌దాదా యొక్క గారాల పిల్లలందరికీ, సర్వీసబుల్ విశ్వంలో మెరుస్తూ ఉన్న సితారలు ఈరోజు మీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాబాతో కలిసి ఉన్నారు, కలిసి ఉంటారు, కలిసి రాజ్యం చేస్తారు. బ్రహ్మాబాబాకు ఎంతో ప్రేమ ఉంది కదా. ఒంటరిగా చెయ్యరు. మరి అందరికీ పర్సనల్‌గా అభినందనలు. అచ్ఛా.
బాప్‌దాదా తమ హస్తాలతో జెండాను ఎగురవేసారు మరియు అందరికీ శివజయంతి అభినందనలు తెలిపారు
మీ అందరి హృదయాలలో అయితే బాప్‌దాదా ఉన్నారు. కానీ ఇతరులకు తెలియడానికి, మీ తండ్రి వచ్చారు, ముక్తి లేక జీవన్ముక్తి యొక్క వారసత్వము ఏది కావాలంటే అది తీసుకోండి అన్న సమాచారము ఇవ్వడానికి ఈ జెండాను ఎగురవేయడం జరుగుతుంది. ఈ జెండాను ఎగురవేయడం కూడా విశ్వ సేవయే. ఆకర్షణ ఉండాలి కదా, అందరూ పాట పాడాలి. కేవలం మీరు పాడటమే కాదు. మా బాబా వచ్చేసారు అన్న పాట అందరూ పాడాలి. ఇప్పుడు సేవ త్వరత్వరగా చేయండి. సమయం తక్కువగా ఉంది, సేవ ఇంకా మిగిలిపోయి ఉంది. మీ ప్రక్కవారికి కూడా తెలీదు, వారు భాగ్యము తయారు చేసుకోలేదు. కావున మీ ప్రక్కవారికి అందరికీ మీ తండ్రి వచ్చారు అన్న సందేశాన్ని అందించండి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చూడండి, చుట్టుప్రక్కల ఎంతమంది ఉంటున్నారు. ఎంతమందికి బాబా గురించి తెలీదు. ఏదో ఒక పద్ధతి ఆలోచించండి. మీవద్దకు రాకపోతే, చేతిలోకి కరపత్రము తీసుకోకపోతే పోస్టుబాక్సులో వేయండి, సందేశాన్ని ఇవ్వండి. మాకు ఎందుకు చెప్పలేదు అన్న ఫిర్యాదు రాకూడదు. ఎలా అయినా ఎవరి ద్వారా అయినా సందేశాన్ని తప్పకుండా చేర్చండి. అందరూ చేయాల్సిన సేవ ఇంకా మిగిలిపోయింది. మీ వీధిలో అందరికీ సందేశాన్ని ఇవ్వండి. సందేశం లభించకపోతే ఇవ్వండి. అకస్మాత్తుగా అంతా జరిగిపోతుంది, అప్పుడు గుర్తుకువస్తుంది మేము చెయ్యలేదు అని. చేయండి. అర్థమయిందా. తప్పకుండా చేయండి. అచ్ఛా.
ఓంశాంతి