Search for a command to run...
20 Mar 2017
మీ సాధారణ స్వరూపాన్ని మార్చి కొద్ది సమయమైనా సంగమయుగ ఫరిశ్తా స్వరూపాన్ని అనుభవం చేసి చూడండి, ఇది చక్కని చిరునవ్వు కలిగిన మీ ప్రకాశమయ రూపము
20 March 2017 · తెలుగు
ఓం శాంతి. ఈరోజు బాప్దాదా విశేషంగా యోగయుక్త పిల్లలను, అందరి మధ్యన యోగయుక్తులుగా అయ్యి ఇతరులను కూడా యోగయుక్తులుగా తయారు చేసే వారిని చూసి హర్షితులవుతున్నారు. మనసులోనే చాలా చాలా ప్రేమ నిండిన హృదయపూర్వక ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఇంతమంది పిల్లలు కలిసి యోగంలో కూర్చోవాలి మరియు యోగంలో కూడా ఇటువంటి యోగ స్థితి ప్రాక్టికల్]లో ఉండాలన్నదే బాప్దాదా కోరుకుంటున్నారు, మరి ఇది చూసి బాప్దాదా చాలా సంతోషిస్తున్నారు. ఎలా అయితే బాబా చూసి చూసి సంతోషిస్తున్నారో అలాగే పిల్లలు కూడా బాబాను చిరునవ్వుతో చూసి మనసులో ఎంతో సంతోషిస్తూ రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటి ఈ సభ యొక్క శోభ చిరునవ్వుతో ఉన్నవారితో చాలా బాగా కనిపిస్తుంది, ఇది చూసి, బాబా కూడా ఈ రోజు పిల్లల ముఖంలో ప్రేమను చూసి చిరునవ్వు చిందిస్తున్నారు. మరి పిల్లలు ఏమి చేస్తున్నారు? పిల్లలు కూడా చిరునవ్వుతో ఉన్నారు కదా! బాబా కూడా వాహ్ పిల్లలూ వాహ్! అంటున్నారు. పిల్లల చిరునవ్వు మరియు బాబా చిరునవ్వు చాలా సుందరంగా కనిపిస్తుంది. బాప్దాదా దేనినైతే చూడాలనుకున్నారో దానిని నలువైపుల చూసి బాబా కూడా చిరునవ్వు చిందిస్తున్నారు. పూర్తి సభలో ఉన్న పిల్లలు చిరునవ్వుతో ఉండటాన్ని చూసి బాబా ఇప్పటివరకు మనసులో చిరునవ్వు కలిగి ఉన్నారు. వాహ్ పిల్లలూ వాహ్! గుప్తమైన శక్తి అద్భుతమైనది మరియు దాని ప్రభావాన్ని కూడా కనబరుస్తుంది. బాబా పిల్లలు ప్రతి ఒక్కరూ ఎలా చిరునవ్వుతో ఉన్నారంటే ప్రతి ఒక్కరి ముఖంపై చాలా మంచి సంతోషపు ప్రకాశము ఉంది. చిరునవ్వుతో ఉన్న ప్రతి ఒక్కరి ముఖమును చూసి బాబా కూడా ఎంతో మధురంగా చిరునవ్వును చిందిస్తున్నారు.
ఈనాటి సభ మెజారిటీ చిరునవ్వు కలిగిన నిశ్చింత చక్రవర్తులది, చిరునవ్వు కలిగిన ముఖాలు దూరం నుండే చాలా సుందరంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఒకరినొకరు ఇదే రూపంలో చూసుకుంటున్నారు కదా! ఒకరినొకరు బాగా గుర్తుపట్టి చిరునవ్వు నవ్వినట్లుగా అనిపిస్తుంది. ఈనాటి సభలో విశేషంగా చిరునవ్వు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకని? అందరి మనసులలో ఒకటే పాట, మీఠా బాబా, ప్యారా బాబా (మధురమైన బాబా, ప్రియమైన బాబా). అందరి నోటి నుండి ఓ మీఠా బాబా, ప్యారా బాబా... అని వస్తున్నట్లుగానే అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇటువంటి పిల్లల సభ చూస్తున్నట్లుగా బాబాకు అనిపిస్తుంది, ఈ సభలో ప్రతి ఒక్కరి నుండి మీఠా బాబా, ప్యారా బాబా అని వెలువడుతుంది. చివరలో ఉన్న ముఖం కూడా ఇదే విధిలో ఉంది.
ఈరోజు రాత్రి ఎప్పటివరకు మేలుకుని ఉంటారో, అప్పటివరకు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ మధురమైన చిరునవ్వుతో ఉండండి. బాబా మరియు సభలోని చిరునవ్వుతో కూడిన ముఖాన్ని చూడండి. ఈ వైపున ఉన్న మీ చిరునవ్వుతో కూడిన ముఖం యొక్క ప్రభావము పూర్తి సభలో పడుతుంది. స్థితి ఎలా ఉన్నాకానీ ఇప్పుడు అందరి ముఖాలు చిరునవ్వుతో కనిపిస్తున్నాయి. అందరి ముఖాలు ఎంత చిరునవ్వుతో ఉన్నాయంటే ఒక్క సెకండులో పూర్తి సభయే మారిపోయింది. ఎవరు ఎలా ఉన్నా కానీ బాబా వారిని మార్చి అందరికీ అదే ముఖాలను చూపిస్తున్నారు. అందరి ముఖాలు ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయి. వతనంలో అందరి ముఖాలు ఎలా ఉంటాయో అలా ఇక్కడ , ఈ రోజు మీరు కూడా అటువంటి ప్రకాశిస్తున్న దీపాలుగా కనిపిస్తున్నారు. బాబా చాలా నెమ్మది నెమ్మదిగా మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడుతున్నారు? పిల్లలు ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రకాశిస్తున్న ముఖము మరియు మూర్తితో ఇప్పుడు ఎలా అయితే చిత్రంలో కనిపిస్తున్నారో అలాగే ప్రకాశిస్తున్న సితారలుగా చాలా బాగా మెరుస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఈ మెరుస్తున్న సితార యొక్క ప్రకాశము చాలా సుందరంగా ఉంది, ఎందుకు? పిల్లలు ప్రతి ఒక్కరూ తమ చమత్కారి ముఖంతో కనిపిస్తున్నారు. ఈ చిత్రం మీదే కానీ ఇటువంటి మెరుస్తున్న సితార, ఇప్పటివరకు కనిపించిన విధంగా, ఇటువంటి తెల్లని మెరుస్తున్న, సాధారణ రూపం కాదు, మెరుస్తున్న ముఖము, ఇటువంటి సభ చాలా బాగా అనిపిస్తుంది. అందరూ మెరుస్తున్నారు. ప్రకాశము లేకుండా ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాబాను ప్రకాశిస్తూ చూస్తున్నారు. అలాగే బాబా సమానంగా పూర్తి సభ ప్రకాశిస్తుంది. బాప్దాదా వినిపించినట్లుగా, పై నుండి ఫరిశ్తాలు ఈ భూమి మీదకు వచ్చాయా అన్నట్లుగా ఉంది. మీ ఈ రూపం చాలా ప్రియమైనది ఎందుకంటే ఇప్పుడిక మరింకేదీ లేదు, అందరూ సంపూర్ణ మూర్తులుగా అయ్యారు మరియు పిల్లల ఈ రూపము కొందరికి కనిపిస్తుంది. అందరూ చాలా సంతోషిస్తున్నారు. అందరూ తమను ఫరిశ్తా రూపంలో చూసుకుని చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడైతే ఎక్కువ సమయం కూర్చోలేరు ఎందుకంటే అందరికీ సంగమయుగ తమ స్వరూపం బాగా మెరుస్తూ కనిపిస్తుంది. మరి ఈ ఫరిశ్తా రూపంలోనే ఇంతకుముందు ఇమర్జ్ అయినట్లుగా ఇప్పుడిప్పుడే ఫరిశ్తా రూపంలో కనిపిస్తున్నారు. ఇక్కడకు వచ్చి చూడండి, పూర్తి సభ ఇంతలో ఎలా మారిపోయిందో! ఇంతమంది కిరీటధారులు ఎక్కడికి వెళ్తారు! ఇప్పుడు గుప్తంగా, మర్జ్ రూపంలో ఉన్నారు, తర్వాత ఇమర్జ్ రూపంలో చూస్తారు. పూర్తి సభ అంతా ఎంత మెరుస్తూ కనిపిస్తుందో చూడండి. కొందరు వంకరగా ఉన్నా, టింకరగా ఉన్నా కానీ అందరూ మెరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకుని సంతోషిస్తున్నారు. ఏది ఇష్టము? మెరుస్తున్న తమ ఫరిశ్తా రూపము ఇష్టమే కదా! సెకండులో మెరుస్తున్న వారిగా అయిపోయారు. పూర్తి సభ మెరుస్తూ ఉంది. మీ మెరుస్తున్న రూపాన్ని బాగా చూసుకోండి. మీ మెరుస్తున్న స్వరూపాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. మీ ఈ మెరుస్తున్న రూపాన్ని బాబా కొద్ది సమయం కోసం ఇమర్జ్ చేసి చూపించారు. ఇలా మీరు ఫరిశ్తాలుగా ఉన్నారని చెప్తున్నారు. ఆ ఫరిశ్తా రూపంలో బాబా మీకు మీ అందరినీ చూపించారు. సెకండులో మారిపోయారు. పూర్తి సభ మెరుస్తున్న వస్త్రాలతో ఎంతో సుందరంగా కనిపిస్తుంది. మీ ముఖాన్ని మీరే చూసుకోండి, ఎంత ప్రియంగా ఉన్నారో! ఎందుకంటే సంపూర్ణంగా ఉన్నారు కదా. ఎంత సుందరంగా ఉన్నారో చూడండి. ఇప్పుడు సాధారణ రూపాన్ని మార్చి ఫరిశ్తా రూపాన్ని చూస్తున్నారు కదా! ముందు వెనక ఏమి కనిపిస్తుంది? ఫరిశ్తా. పూర్తి సభ ఎంత ప్రకాశమయంగా ఉంది! ఎవ్వరిదీ సాధారణ రూపం లేదు. అందరిదీ ఫరిశ్తా రూపం కనిపిస్తుంది. లోపల ఎవరు ఎంత తేడా కలిగి ఉన్నా కానీ, అది స్వయానికి తెలుసు, అందులోకి మనమెందుకు వెళ్ళడము! మనకైతే మన ఫరిశ్తా రూపము ప్రత్యేకముగా కనిపించాలి, కేవలం పూర్తిగా ఫరిశ్తా. ఫరిశ్తా రూపంలోకి మారినప్పుడు పూర్తి సభ ఎలా మారిపోయిందో చూడండి. స్వయంగానే మీ ఫరిశ్తా రూపం ఇమర్జ్ అయింది. మీదైనటువంటి మెరుస్తున్న స్వరూపము కొంత సమయము మీతోనే ఉంటుంది. మరి మీ ఫరిశ్తా స్వరూపము పక్కా అయిందా! నేను ఫరిశ్తా స్వరూపధారిని, కొంత సమయం దీనిని అనుభవం చేసి చూడండి, ఎంతో మధురంగా ఉంటుంది.
ఇప్పుడు బాబా ఫరిశ్తా భవ అన్న వరదానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్క సెకండులో ఫరిశ్తా, ఒక్క సెకండులో సాధారణము, ఈ అభ్యాసము చేస్తూ చేస్తూ ఫరిశ్తాగా అయిపోతారు. ఇప్పుడు ఫరిశ్తా స్వరూపంలో ఉండండి, ఎక్కువ సమయం ఫరిశ్తా స్వరూపంలో, ఈ ప్రపంచంలో ఈ సంగమయుగ ఫరిశ్తా రూపం కొద్ది సమయం ఉంటుంది. ఈ ఫరిశ్తా రూపం కొంత సమయం మీతో ఉంటుంది. ఈ ఫరిశ్తా రూపం ఎంత మంచిదో మీరు కూడా అనుభవం చేసుకుంటారు. ఎంత సమయం ఫరిశ్తా రూపంలో ఉండాలనుకుంటే అంత సమయం ఉండగలగాలి కానీ ఆ(సూక్ష్మవతనపు) ఫరిశ్తా రూపము ఇప్పుడు మన చేతులలో లేదు. ఇది ఫరిశ్తా జీవితంలో ఉంది. అచ్ఛా!
సేవ టర్న్ గుజరాత్ మరియు భోపాల్ వారిది. మొత్తం 24 వేల మంది వచ్చారు, అందులో ఒక వెయ్యి మంది విదేశీయులు 75 దేశాల నుండి వచ్చారు. - (13 వేల మంది గుజరాత్ నుండి, 4 వేల మంది భోపాల్ నుండి వచ్చారు):- చాలా మంచిది.
(మున్ని అక్కయ్య బాబాతో ఇలా అన్నారు, బాబా ఈ రోజు మీరు చాలా బాగా అందరితో కలిసారు, చాలా మంచి మురళిని వినిపించారు)
కొందరు తమకు చివరలో లభించింది అని అనుకుంటారు, ఆలస్యమయిందేమో అనుకుంటారు అందుకని త్వరత్వరగా కలిపిస్తుంటారు. కానీ అలా కాదు, సమయం గురించి ఇక్కడ చూడము. కానీ ఎవరైనా ఆలస్యంగా వస్తే వారి కోసం వేచి ఉండటం జరగదు అని బాబా కూడా చూపిస్తారు, దాదీలు తప్ప. దాదీలు అయితే పునాది. అచ్ఛా!
(ఇండియా వన్ సోలార్ ప్లాంట్ యొక్క ఉద్ఘాటన బాప్ దాదా ద్వారా చేయించారు):- ఏది చేసినా కానీ యజ్ఞంలో చేసారు మరియు ఇదే విధంగా నడిపిస్తూ ఉంటారు. అంతా బాగుంది.
ఓంశాంతి