Search for a command to run...
31 Dec 2017
నూతన సంవత్సరాన్ని సమాప్తి సంవత్సరము, శ్రేష్ఠ సంవత్సరము మరియు ప్రపంచాన్ని మేలుకొలిపే సంవత్సరము - ఈ రూపంగా జరుపుకోండి
31 December 2017 · తెలుగు
ఇక్కడ కూర్చున్నవారంతా ఒకే పరివారానికి చెందినవారు. ఇటువంటి పరివారం గురించి ఎప్పుడైనా విన్నారా, చూసారా! ఇటువంటి అలౌకిక పరివారాన్ని ఇప్పుడే చూసారు. ఇప్పుడు అందరూ భవిష్యత్తు కోసం తయారవుతున్నారు. అందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు మీ ఆ కొత్త ప్రపంచం రానుంది, ఎంత బాగుంటుంది, మీరందరూ కూడా భవిష్య పరివారానికి పాత్రులుగా తయారై ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా ఏదైనా చూపించవవలసిందే కానీ ఎలా చూపించాలంటే జన్మజన్మల వరకు దాని ప్రాలబ్ధం తోడుగా ఉండాలి.
(నిర్వైర్ అన్నయ్య మరియు బృజ్ మోహన్ అన్నయ్యలు బాప్‌దాదాను విశేషంగా క్రొత్త సంవత్సరం కోసం ప్రేరణలను అడిగారు - క్రొత్త సంవత్సరానికి ఏ పేరును ఇవ్వాలి, ఏ అటెన్షన్ ఉంచాలి, చేయవలసిన పురుషార్థం ఏమిటి) నూతన సంవత్సరాన్ని సమాప్తి సంవత్సరం, శ్రేష్ఠ సంవత్సరం మరియు ప్రపంచాన్ని మేలుకొలిపే సంవత్సరంగా చూడండి. ఈ సంవత్సరం కూడా ఎలా అద్భుతం చెయ్యనున్నదో చూడండి. ఇక ముందు ఏమి జరుగనున్నదో అని బ్రాహ్మణులంతా ఎంతో ఉల్లాసంతో ఎదురు చూస్తున్నారు. ఏమి జరుగనున్నదో తెలుసు కూడా! ఇప్పుడైతే అందరూ క్రొత్త ప్రపంచాన్ని కలగా చూస్తున్నారు. ఇప్పుడిక నూతన సంవత్సరం, నూతన రీతి, నూతన ప్రీతి అన్నీ క్రొత్త క్రొత్తగా మారుతున్నాయి. యుగం మారుతున్నట్లుగా యుగంతో పాటు రీతి-ఆచారము, పద్ధతులు అన్నీ అదే విధంగా జరుగనున్నాయి. మరి ఈ రోజు మీ క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇదే సంకల్పం చెయ్యండి - మేము పాస్ అవ్వవలసిందే. రెండు పాస్‌లు - ఒకటి పరీక్షలో పాస్ అవ్వడము, రెండవ పాస్ దగ్గరగా ఉండటము, అది కూడా పాస్ లభించనుంది. పాస్ అయితే అవుతారు. దగ్గరగా ఉండటంతో పాటు పిల్లలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా పాస్ తప్పకుండా అవ్వాలి అని బాప్‌దాదా కోరుకుంటున్నారు. ఈ సమయాన్నే పాస్ చెయ్యాలి, ఇందుకోసం స్వయాన్ని చెక్ చేసుకోండి మరియు భవిష్యత్తుపై అటెన్షన్ పెట్టండి. ఈ సమయంలోనే పాస్ అవ్వవలసి ఉంది. పాస్ అవ్వడము అంటే అన్నీ ఉన్నప్పటికీ భవిష్యత్తును సమీపంగా చూడాలంటే ఎంతగా పురుషార్థం చెయ్యాలంటే ఈ భవిష్యత్తే తోడుగా ఉండాలి మరియు అందరినుండి ఇదే మాట రావాలి - పాస్ పాస్ పాస్. అందరి ముఖాలు ఏమని చెబుతున్నాయంటే ఇప్పటి వరకు చేసిన పురుషార్థం, ముందు చేసారో లేదో వేరే విషయము, కానీ ఇప్పుడు ఈ సమయంలో మాత్రం ఫుల్ పాస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్రాహ్మణులే పాస్ అవుతారు. బ్రాహ్మణులు కదా, కనుక బ్రాహ్మణులకు మొదటగా బహుమతిగా ఇదే ఇస్తున్నాము. పూర్తి సభలో ఇప్పుడు ఉన్న ఉల్లాసము ఇదే - ఇప్పుడు త్వరత్వరగా మేము పాస్ అయిపోవాలి అప్పుడు ఎంతగా అందరికీ సంతోషం ఉంటుంది! ఇప్పుడు మేము పరివర్తన అవ్వబోతున్నాము అన్న సంతోషం అందరికీ ఉంది.
(నూతన సంవత్సరం కోసం మీరివ్వబోయే ప్రేరణలను దేశవిదేశాల సోదరసోదరీలు వినాలనుకుంటున్నారు) అందరూ స్వయాన్ని ఎలా భావిస్తున్నారు! మా అధికారమైతే ఉండనే ఉంది అని అనుకుంటున్నారా లేక ఏమో తెలియదు, ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారా! ఈ ఆలోచన వచ్చినా కానీ నిలవకూడదు. ఇది నిలిచి ఉండటం మంచిది కాదు. ఇప్పుడైతే మనం రాజ్యభాగ్యాన్ని తీసుకోవలసి ఉంది. ముందుగా స్వయంపైన రాజ్యం, ఇతరులపై అయితే ఎలాగూ ఉండనుంది. స్వ రాజ్యం చాలా పెద్దది అనైతే ప్రసిద్ధి అవుతుంది. అన్ని ప్రశ్నలు ఈ విషయం పైననే ఉన్నాయా లేక ఇంకే ప్రశ్నలైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ రాజ్యం ఉన్నట్లుగా భవిష్యత్తులో దీనికన్నా పటిష్టమైన మీ రాజ్యం రానుంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు మరియు ప్రేరణ కూడా తీసుకుంటున్నారు. బాప్‌దాదా కూడా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. చాలా లభించింది, ఇంకా లభించనుంది అని కూడా అనుకుంటున్నారు.
సేవ టర్న్ మహారాష్ట్ర, ముంబయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారిది, 15 వేలమంది సేవాధారులు వచ్చారు, మొత్తం 25 వేల మంది ఉన్నారు, 600 మంది డబల్ విదేశీయులు ఉన్నారు:- అందరూ ఉల్లాస ఉత్సాహాలలో ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పురుషార్థం చేసి స్వయం మరియు తండ్రి పేరును ప్రసిద్ధం చేస్తున్నారని బాప్‌దాదా కూడా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఎవరెవరు ఎక్కడివరకు చేరుకున్నారని బాప్‌దాదా చూస్తున్నారు! చేరుకున్నారు, పురుషార్థం బాగా చేసారు. మీ ఎదుట విజయం మీకోసం ఉంది. అందరూ ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దానిని ప్రాక్టికల్‌గా చేసి చూపించడాన్ని బాప్‌దాదా చూస్తున్నారు. ఈ ఉత్సాహమే అందరిలో ఉంది. ఈ ఉత్సాహంతోటే ఈ గ్రూపు ముందుకు వెళ్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరి విజయము నిశ్చితము. విజయమైతే ఉన్నది. ఈ విజయము స్వయంలో ఆత్మ విశ్వాసాన్ని మరియు పరివారంపై నిశ్చయాన్ని పెంచుతుంది. ఈ రెండు విషయాలు మీ రాజ్యంలో పనికొస్తాయి.
(సంస్కార మిలనం కోసం చాలా పురుషార్థం చేస్తుంటాము, అయినా ఇంకా సఫలమవ్వలేదు, ఆ సఫలత ఎలా వస్తుంది, బుద్ధిని బేహద్ వైపుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఈ విషయాలన్నిటి నుండి అతీతంగా వెళ్ళడం ఎలా) అందరి వద్ద లక్ష్యం ఉంది, ప్లాన్ ఉంది, ఇప్పుడు ఆ ప్లాన్‌పై అటెన్షన్ పెంచండి, ఎంతగా అంటే అందరికీ ఆ భావన రావాలి. ఆ భావన రావాలంటే మీ లోపల ఉన్న పరివారపు ప్రేమపై మరింత అటెన్షన్ పెట్టండి, పరివార ప్రేమను సంగమయుగంలోనే ఎక్కువగా అనుభవం చేసుకోగలరు. అప్పుడు ఆ భావన నేచురల్‌గా వచ్చేస్తుంది. అవ్వవలసిందే అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. వీరు ఈ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని అందరూ ఆలోచిస్తున్నారు. మన చదువు సరైనది, చదివించేవారు కూడా సరైనవారు, ఇక ఈ ప్రశ్నయే ఉండదు కదా. మేము తయారవ్వవలసిందే అన్న లక్ష్యాన్ని ఇప్పుడు పెట్టుకోండి. అందులో మీ పాత్ర కేవలం సహయోగిగా అవ్వడమే కాదు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోవడము. స్వయంపై అటెన్షన్ ఉంచండి, ఇదే అవసరము. తయారవ్వవలసిందే అన్న విషయంపై అందరి ఆలోచన ఉండటాన్ని బాబా చూసారు. అవుతున్నారు, పురుషార్థం అనుసారంగా నంబరు తీసుకుంటారు, కానీ ఈ విషయంపై శ్రద్ధ పెట్టండి. ఎలా అయితే బాబా అడుగుతారో అలాగే మీరు కూడా పరస్పరంలో సంభాషించుకుని రాజధాని సీట్‌ను తప్పక తీసుకోండి. రాజధానిలో ఏ సీట్ తీసుకోవాలి అని ఇప్పుడు ఆలోచించండి.
బృజ్ మోహన్ అన్నయ్యను చూస్తూ బాబా ఇలా అన్నారు:- ఇప్పుడు ఢిల్లీ రాజధానిలో అయితే కూర్చున్నారు కానీ ఢిల్లీ రాజధానితో పాటు భవిష్య రాజధాని గురించి కూడా ఆలోచించండి. (బాబా, ఇందులో అక్కయ్యలు ముందు నంబరు తీసేసుకుంటారు) పోటీ జరిగినప్పుడు కూడా మాతలు, కన్యలే నంబరు తీసుకోవడం చూస్తుంటాము. ఫైనల్ వచ్చినప్పుడు రిజల్ట్ రానుంది కానీ మేము కూడా నంబరు తీసుకోవాలి, పాస్ అవ్వాలి అని మీ వద్ద కూడా లక్ష్యం ఉంది కదా. బాప్‌దాదా మరియు డ్రామా రెండింటిపై శ్రద్ధ ఉంచండి.
(ఫాలో ఫాదర్ చెయ్యడం ఎలా) ఫాలో ఫాదర్‌పై అటెన్షన్ ఉంటే ప్రాక్టికల్ లైఫ్‌లో అన్నీ ప్రాక్టికల్‌గా కనిపించాలి. బాబా కోరుకుంటున్నట్లుగానే ఇప్పుడు జరుగుతుంది. సమయానికి అన్నీ చక్కబడిపోతాయి కానీ ఈ విషయం సదా ఉండాలి. అది కూడా జరుగుతుంది, ఇకమీదట కూడా జరుగుతుంది, అందుకని కూడా చింతించకండి. అందరూ పురుషార్థం చేస్తున్నారు. మేము నంబరు తప్పకుండా తీసుకుంటాము అని కూడా అందరి బుద్ధిలో ఉంది. అయిపోతుంది. తయారీ జరుగుతుంది. ఇదైతే జరిగేదే ఉంది, కేవలం మధ్యమధ్యలో రూపం కొంచెం మారుతూ ఉంటుంది, ఆ మారుతున్న రూపం కారణంగా ఏదో ఒక రీతితో ఏదో ఒక విషయం జరుగుతుంది, మళ్ళీ సర్దుకుపోతుంది, అందుకే బాప్‌దాదా కూడా ఎక్కువ చెప్పడం లేదు ఎందుకంటే పురుషార్థ స్వరూపం కనిపిస్తుంది. కనిపించడం లేదని కాదు. కనిపిస్తుంది కానీ సదా కనిపించడం లేదు. ఒకసారి ఒకలా, మరోసారి మరోలా ఉంటుంది. ఇప్పుడు దీనిని స్థిరం చేయండి. మేము పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నామన్న ఉత్సాహాన్ని చూపించండి. అందరూ పరీక్ష రాయడానికి తయారుగా ఉన్నారా, అందరినీ అడగంది! పరీక్ష కోసం సిద్ధంగా ఉండి నమ్మకం కూడా ఉంటే ప్రాప్తి కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఆ నషా సదా ఉండటం లేదు, మధ్య మధ్యలో కొద్ది సమయమే ఉంటుంది. పురుషార్థం చేస్తున్నారు కానీ ఈ నషా సదా ఉండేందుకు ఇప్పుడు అభ్యాసం కావాలి. అటెన్షన్ ఇంకాస్త పెట్టాల్సి ఉంది. చదువు కదా. చదువుపై అటెన్షన్ పెట్టడం జరుగుతుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మరియు ఈ క్రొత్త సంవత్సరంలో ముందుకు అడుగులు వేసే వరదానం ఉంది.
స్వయాన్ని బాబా సమానంగా నిండుగా చేసుకోండి మరియు సదా తయారుగా ఉండండి. ఎటువంటి సమయం నడుస్తున్నాగానీ ఆ సమయంలో స్వయాన్ని బాబా ఆశిస్తున్న విధంగా తయారు చేసుకోండి. ఎలా అయితే బాబా సర్వ గుణసంపన్నులు, కిరీటధారి మరియు సింహాసనాధికారిగా ఉన్నారో, అలాగే ఈ విశేషతలన్నీ పిల్లలందరూ తమలో అనుభవం చేసుకోవాలి. ఇంకా సమయం ఉంది, మిగిలి ఉన్నదంతా స్వయంలో ధారణ చేసుకోండి, ధారణ రూపాన్ని సాక్షాత్కారం చేయించండి. ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఎలా అవుతుంది... వద్దు. ఈ ప్రశ్న అడిగే విషయమే కాదు. ఇప్పుడు బాబా అందరికీ ధైర్యాన్ని ఇచ్చారు, ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ ధైర్యము మరియు ఉత్సాహాలతో అందరూ త్వరత్వరగా ముందుకు సాగండి. అచ్ఛా!
(ఈ మురళి తర్వాత అవ్యక్త బాప్‌దాదా తమ పాత్రను ముగించారు. తర్వాత గుల్జార్ దాదీగారు గామ్దేవి, ముంబయి సెంటరులో మెరుగైన ఆరోగ్యం కోసం ఉంటూ, ఏకాగ్రచిత్తులై పూర్తి విశ్వానికి సకాశ్ను ఇస్తున్నారు)
ఓంశాంతి