Search for a command to run...
12 Feb 2018
"జన్మదినం రోజున ఫాస్ట్ సో ఫస్ట్ డివిజన్‌లోకి వచ్చే బహుమతిని తీసుకోవడానికి ప్రతి శ్వాస, సంకల్పము సమర్థంగా ఉండాలి. హృదయము విశాలంగా మరియు సత్యంగా ఉన్నప్పుడు ప్రతి అవసరం తీరుతుంది"
12 February 2018 · తెలుగు
82వ త్రిమూర్తి శివ జయంతికి హార్దిక శుభాకాంక్షలు
ప్రాణేశ్వరుడైన అవ్యక్త బాప్‌దాదాకు అతి గారాల పిల్లలు, సదా తమ ప్రాప్తి సంపన్నమైన శ్రేష్ఠ జీవితం ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అయిన విశ్వ కళ్యాణకారి, నిమిత్త సేవాధారీ టీచర్ అక్కయ్యలు, దేశ విదేశాలలో ఉన్న సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులైన సర్వ సోదరీసోదరులు,
ఈశ్వరీయ స్నేహసంపన్న మధుర స్మృతిని, 82వ త్రిమూర్తి శివ జయంతికి చాలా చాలా హార్దిక అభినందనలను స్వీకరించండి.
ప్రాణప్రియుడు, మనందరికీ ప్రాణదానం చేసిన స్వయంభూ నిరాకార పరమపిత శివ పరమాత్ముని దివ్య అవతరణకు గుర్తుగా నిలిచే ఈ పండుగను బ్రహ్మా వత్సలందరూ ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో ఆడంబరంగా జరుపుకుంటున్నారు. తండ్రి మరియు పిల్లల ఈ అలౌకిక జన్మ అనేక ఉత్సవాలను తనతో తీసుకు వస్తుంది. ప్రతి సంవత్సరము మనమంతా ఈ పావన పండుగనాడు అనేక నవీన సంపన్నమైన సేవా కార్యక్రమాలను “మహాశివరాత్రి మేళా, ప్రభాత సంచారము, సర్వ ధర్మ సమ్మేళనము, ప్రదర్శనలు” మొదలైనవి ఏర్పాటు చేసి పరమాత్మ అవతరణ యొక్క దివ్య సందేశాన్ని ఇస్తాము. ఈ సంవత్సరం కూడా మూలమూలలో చాలా చాలా హర్షోల్లాసాలతో ఈ పండుగను జరుపుకుంటున్నారు. అన్ని స్థానాలలో శివబాబా జెండాను ఎగురవేసి, ప్రతిజ్ఞ చేయడంతోపాటు అందరూ జన్మదిన సంతోషాలను జరుపుకుంటున్నారు.
మధుబన్ మహాయజ్ఞంలో కూడా ఈ పండుగ వారమంతా జరుగుతుంది. ఈ సంవత్సరం క్రొత్తగా శాంతివన్ ప్రాంగణంలో చాలా సుందరమైన, భవ్యమైన ‘‘మహాశివరాత్రి మేళా” ఒక వారం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 11 ఫిబ్రవరినాడు ఈ మేళాను దాదీలు, పెద్దన్నయ్యలు, పెద్దక్కయ్యల కరకమలాలతో ప్రారంభించడం జరిగింది. ఈసారి ఈ మేళాలో 12 జ్యోతిర్లింగాలతో పాటు విశాలమైన అమరనాథుని గుహ, మంచులింగ దర్శనం, యోగ గది, తపస్వీ రూపంలో విరాజమానమైన శివశక్తులు మరియు పాండవుల అద్భుత దృశ్యమును చూడటానికి ఆబూ మరియు చుట్టుప్రక్కల గ్రామాలవారు వేలాది సంఖ్యలో వస్తున్నారు.
ఈరోజు 12 ఫిబ్రవరినాడు ప్రియమైన శివబాబా అవతరణ రోజున అందరూ అమృతవేళ నుండి బాబా ప్రేమలో లీనమై తమ అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనాన్ని అనుభవం చేసుకుంటున్నారు. సాయంత్రం యోగము జరిగింది మరియు అవ్యక్త మిలనపు విధులపై క్లాసు జరిగింది. తర్వాత వీడియో ద్వారా శివ జయంతి సందర్భంగా శిక్షణాప్రదమైన మహావాక్యాలను అందరూ విన్నారు. (ఆ మహావాక్యాలను మీకు పంపిస్తున్నాము) ప్రియమైన బాబాకు భోగ్ కూడా స్వీకరింపజేసారు. తర్వాత దాదీలు, పెద్దన్నయ్యలు మరియు పెద్దక్కయ్యలు డైమండ్ హాల్ స్టేజిపైన శివబాబా జెండాను ఎగురవేసారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ నేపాల్ సోదరసోదరీలది సేవ టర్న్, దేశవిదేశాల నుండి విచ్చేసిన 21వేల మంది సోదరసోదరీలు డైమండ్ హాలులో హాజరయ్యారు.
మనందరికీ అతి స్నేహి, సదా తమ నయనాలలో బాప్‌దాదాను నిలుపుకున్నవారు, సాకార మిలనపు అనుభూతిని చేయించే మన మధురమైన దాదీ గుల్జార్‌గారు వారి ఆరోగ్యం కారణంగా ముంబయి ఆసుపత్రిలో ఉన్నారు, డాక్టర్లు వారికి మధువనానికి వచ్చేందుకు అనుమతిని ఇవ్వలేదు. మీ అందరి స్నేహభరిత సకాశ్ వారికి చేరుతూ ఉంటుంది. దాదీగారు త్వరగా ఆరోగ్యవంతులై మనందరి మధ్యకు చేరుకుంటారు. ఈ టర్న్‌లో అందరూ విశేషమైన అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనాన్ని బాగా అనుభవం చేసుకున్నారు. ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదా తమ స్నేహి పిల్లలకు అవ్యక్త వతనం నుండే విశేషమైన శక్తులను, వరదానాల సకాశ్ను ఇచ్చి సంతృప్తిపరుస్తున్నారు. జెండారోహణ తర్వాత, కేక్ కటింగ్, మధుర గీతము, మన దాదీలు, పెద్దన్నయ్యలు మరియు పెద్దక్కయ్యలు అందరికీ శివ జయంతి మహాపర్వం సందర్భంగా చాలా చాలా అభినందనలు తెలిపారు.
దాదీ జానకిగారు అందరికీ అభినందనలు తెలిపారు: ఓం శాంతి. సాకారం తర్వాత అవ్యక్త బాప్‌దాదా గుల్జార్ దాదీగారి ద్వారా ఎంతో పాలనను ఇచ్చారు. ఇప్పుడు డ్రామా జ్ఞానం ఎంతో శాంతపరుస్తుంది. దీనితో శాంతి, ప్రేమ, మధురత అన్ని గుణాలు సహజంగానే వచ్చేస్తాయి. ఇప్పుడు కలియగ రాత్రి పూర్తి కావస్తుంది, సత్యయుగ పగలు రానున్నది. అంతకు ముందే శాంతిధామానికి వెళ్ళి మనం అక్కడే కూర్చుండిపోము. త్వరగా స్వర్గంలోకి వస్తాము. సాక్షిగా అయ్యి డ్రామాను చూడండి, బాబా మనతో ఉన్నారు. పూర్తి క్లాసును చూసి చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈనాటి శుభ దినం సందర్భంగా, శివ జయంతి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
12-2-18 శివరాత్రి టర్న్ లో వీడియో ద్వారా వినిపించబడ్డ అవ్యక్త మహావాక్యాలు రివైజ్ - 22-02-09
ఈరోజు జీరో తండ్రి తమ హీరో పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. ఈ రోజు మీరందరూ బాబా మరియు బాబాతోపాటు మీ జన్మదినాన్ని కూడా జరుపుకోవడానికి వచ్చారు. బాప్‌దాదా పిల్లలందరికీ, సమ్ముఖంలో ఉన్నవారికి, దూరంగా కూర్చున్నా హృదయానికి సమీపంగా ఉన్నవారికి, నలువైపుల ఉన్న పిల్లలకు సర్వ సంబంధాలతో అభినందనలను అందిస్తున్నారు. అందులోనూ విశేషంగా మూడు అభినందనలు - తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు రూపాలలో పాలన, చదువు మరియు వరదానాలతో నలువైపుల ఉన్న పిల్లలకు మూడు అభినందనలు విశేషంగా ఇస్తున్నారు. పిల్లలందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు.
ఈరోజు ఈ విశేష జన్మను భక్తులు కూడా జరుపుకుంటున్నారు. కానీ ఈ జన్మదినం తండ్రి మరియు పిల్లల అవినాశీ స్నేహానికి జన్మదినము అని పిల్లలైన మీకు తెలుసు. ఆది నుండి తండ్రి మరియు పిల్లలు కలిసి ఉన్నారు, దీనితోపాటు విశ్వ పరివర్తనా కార్యంలో కూడా బాబా పిల్లలతో ఉన్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల మధ్య స్నేహము చాలా చాలా ఉంది. ఇప్పుడు కూడా కలిసి ఉన్నాము మరియు మన ఇంటికి కూడా కలిసి వెళ్తాము. పిల్లలు లేకుండా బాబా వెళ్ళలేరు, బాబా లేకుండా పిల్లలు వెళ్ళలేరు ఎందుకంటే హృదయపూర్వక స్నేహము తోడుగా ఉంది. ఇంటి తర్వాత రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా బ్రహ్మాబాబాతో కలిసి రాజ్యం చేస్తారు. అన్ని జన్మలలోకి ఈ జన్మ ప్రియమైనది మరియు అతీతమైనది. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పంలోని 84 జన్మలలో లేదు. ఇటువంటి స్నేహపూర్వకమైన మరియు కలిసి ఉండే విశేషమైన వజ్ర సమాస జన్మ ఇది. మరి మీరందరూ మీ జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారా లేక బాబాది జరపడానికి వచ్చారా! లేక తండ్రి పిల్లలది మరియు పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరపడానికి వచ్చారా? నలువైపుల భక్తులు కూడా శివ జయంతి లేక శివరాత్రిని జరుపుకుంటారు, ఎంతో ప్రేమతో జరుపుకుంటారు. బాప్‌దాదా భక్తులను చూసి భక్తులకు కూడా భక్తికి ఫలితాన్ని ఇస్తారు. కానీ మీరు జరుపుకునేందులో మరియు భక్తులు జరుపుకునేందులో తేడా ఉంది. వారు రాత్రి జరుపుకుంటారు, మీరు అమృతవేళ జరుపుకుంటారు. అమృతవేళ శ్రేష్ఠమైనది. అమృతవేళలోనే బాప్‌దాదా పిల్లలందరి జోలెను వరదానాలతో నింపుతారు. అందరి జోలె వరదానాలతో నిండి ఉంది కదా! ప్రతిరోజూ వరదాత అయిన తండ్రి నుండి వరదానము లభిస్తూనే ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కరికీ బాప్‌దాదా ద్వారా ఎన్నెన్ని వరదానాలు లభించాయి, ఆ వరదానాలతో జోలె నిండి ఉంది కదా. అందరూ ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో చేరుకున్నారు. బాప్‌దాదా కూడా పిల్లలను చూసి చాలా సంతోషిస్తున్నారు మరియు వాహ్ పిల్లలు వాహ్! అంటూ పాట పాడుతున్నారు. పిల్లలు, వాహ్ బాబా వాహ్! అని అంటారు మరియు బాబా, వాహ్ పిల్లలు వాహ్! అని అంటారు. ఎందుకంటే బాబా పిల్లలుగా అయినవారందరూ కోట్లలో కొద్ది మంది ఆత్మలు. విశ్వంలో ఎన్ని కోట్ల ఆత్మలు ఉన్నాయి, అందులో పిల్లలైన మిమ్మల్ని బాబా లక్కీ మరియు లవ్లీ పిల్లలు అంటారు, ఆ కోట్లాదిమందిలో మీరు కొద్ది పిల్లలు. ప్రతి కల్పములో కోట్లలో కొద్దిమంది ఆత్మలము మేము అన్న నషా ఉందా! ఎంత పెద్ద పదవిలో ఉన్నవారైనా కానీ బాబాను గుర్తించి, బాబా జన్మదినాన్ని జరుపుకునేవారు నలువైపులలో కోట్లలో కొద్దిమందిలో మీరు. మేము కోట్లలో కొద్దిమందిమి అన్న నషా ఉందా! నషా ఉందా! చేతులెత్తండి. అవినాశి నషా ఉంది కదా! అప్పుడప్పుడూ ఉండటం కాదు కదా? సదా ఉంది మరియు సదా ఉంటుంది. మాయ పేపరైతే తీసుకుంటుంది, అనుభవం ఉంది కదా. మాయకు కూడా పరమాత్ముని పిల్లలంటే చాలా ఇష్టము. పరమాత్ముని పిల్లలతో మాయకు ఆది నుండి సంబంధం ఉంది అని పిల్లలకు తెలుసు. మాయ మరియు పరమాత్మ పిల్లలు ఇద్దరికీ పరస్పరంలో సంబంధం ఉంది. మాయ పని రావడము, పిల్లలైన మీ పని ఏమిటి? మాయను దూరంనుండే పారద్రోలడము. రానివ్వకూడదా లేక రానిస్తూ ఉంటారా? లేదు. దూరం నుండే పారద్రోలండి. మీరు రానిస్తే రావడం దానికి అలవాటైపోతుంది. రానిస్తున్నారు కదా, వెళ్తాము అని అది కూడా అనుకుంటుంది. కానీ బాబా ఏమి చూసారంటే కొంతమంది పిల్లలు మాయను రానిస్తారు, అంతేకాక దానికి ఆతిథ్యం కూడా ఇస్తారు. టీ, నీళ్ళు ఇస్తారు, ఎటువంటి ఆతిథ్యాన్ని ఇస్తారో తెలుసా? మాయా ప్రభావంలోకి వచ్చి ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడైతే ఇంకా టూ లేట్ బోర్డు రాలేదు కదా, ఇప్పుడింకా సమయము ఉంది, పురుషార్థం చేస్తున్నాము, చేరుకుంటాము అని ఆలోచిస్తారు. అప్పుడు మాయ కూడా నన్ను రానివ్వడమే కాక నాకు సహాయం చేస్తున్నారు, ఆతిథ్యాన్ని ఇస్తున్నారు అని అనుకుంటుంది. కొంతమంది పిల్లలు మాయను గుర్తిస్తారు, మరికొంతమంది మాయను గుర్తించడంలో కూడా పొరపాటు చేస్తుంటారు. అది మాయ మతమా లేక బాబా మతమా అని గుర్తించలేని కారణంగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తుంటారు. కానీ బాప్‌దాదా తమ లక్కీ మహావీర మరియు విజయి పిల్లలకు చెప్తున్నారు - రానివ్వకండి, మాయ వస్తే దానిని పారద్రోలడంలో సమయాన్ని కేటాయించకండి. ఎందుకంటే సమయము తక్కువగా ఉంది. విశ్వ పరివర్తకులుగా అయి, విశ్వ సేవకులుగా అయి విశ్వాత్మలకు బాబా పరిచయాన్ని ఇచ్చి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తాము అన్న మీ ప్రతిజ్ఞ, ఆ కార్యము ఇంకా పూర్తి కాలేదు. ఆ కార్యాన్ని సమాప్తం చెయ్యడానికి సమయాన్ని కేటాయించండి, ఒకవేళ మాయను పారద్రోలడంలోనే సమయాన్ని కేటాయిస్తే విశ్వ పరివర్తకులము అన్న ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేస్తారు! తండ్రికి సహవాసులు కదా, ఇప్పుడు కూడా తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము.... అని జన్మించగానే ప్రతిజ్ఞ చేసారు. కావున ఇప్పుడు బాబానుండి ఏ శక్తులైతే లభించాయో ఆ శక్తుల ఆధారంతో మాయను దూరం నుండే పారద్రోలండి. ఇందులో సమయము ఎక్కువ తీసుకోవద్దు.
మరి ఇప్పుడు శివరాత్రి, శివ జయంతిని జరుపుకుంటున్నారు. అందులో విశేషంగా మూడు విషయాలను జరుపుకుంటాము. ఈ విధులు, ఉత్సవం జరుపుకునేవారు వీటిని కాపీ చెయ్యడం కూడా అద్భుతమే. వారికి కూడా బాప్‌దాదా అభినందనలు ఇస్తున్నారు. విశేషంగా 3 విషయాలను జరుపుకుంటున్నారు – మొదటిది వ్రతాన్ని పాటించడం. వారు మిమ్మల్ని కాపీ చేసారు, కానీ అల్పకాలికమైనదే. మీరు కూడా బాబా పిల్లలుగా అయినప్పటి నుండి రెండు వ్రతాలు ధారణ చేసారు. ఒకటి పవిత్రత, కేవలం బ్రహ్మచర్యము కాదు, బ్రహ్మాచారి కూడా. కొంతమంది పిల్లలు ఏమి చేస్తారు? ముఖ్యమైన పెద్ద పెద్ద వికారాల వ్రతమైతే పెడ్తారు కానీ చిన్న చిన్నవాటిని వదిలేస్తుంటారు. చిన్నవే మహా బలశాలిగా అయిపోతాయి. చిన్నవి తక్కువేమీ కాదు. సమయానికి మోసం చేసేది చిన్నవే. ఎలా అయితే ఎలుక ఉంది కదా, అది చిన్నదే అయినా కానీ కొరకడంలో మాత్రం నంబర్‌వన్. గాలి ఊదుతుంది అలాగే కొరుకుతుంది అయినా ఏమీ తెలియదు. కావున చిన్న చిన్న వికారాలు, కొంతమంది పిల్లలు క్రోధము గురించి అనుకుంటారు ఇదైతే జరుగుతూనే ఉంటుంది, చెయ్యాల్సి వస్తుంది అని. మరి వారిని సంపూర్ణ ఆత్మ అనచ్చా? పిల్లజల్లతో సహా చిన్న పెద్దవాటితో పాటు తీసుకుని మేము సదా పవిత్రంగా ఉంటాము అని వ్రతాన్ని తీసుకున్నారా? ప్రతిజ్ఞ చేసారు కదా? లేక కేవలం ఒక్క బ్రహ్మచర్య పాలన మాత్రమే తీసుకున్నారా? మీ టైటిల్ ఏమిటి? సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తములు, ఇదే కదా మీ టైటిల్? లేక కొద్ది కొద్దిగా మర్యాద తక్కువ ఉంది అని అంటారా? నా బాబా అని అన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో, నా బాబా అని అడిగినప్పుడు అందరూ చేతులెత్తారు, నా బాబా అన్నప్పుడు బాబా సమానంగా అయితే కావాలి కదా. కేవలం ఒక్క అక్షరం మార్చాలి - ఎక్కడ నాది అని వస్తుందో అక్కడ నీది అని గుర్తు చేసుకోండి. ఈ ఒక్క మాటను గుర్తుంచుక్నుట్లయితే మూడు సింహాసనాల నివాసులుగా అవుతారు. మరి మొదటి వ్రతము సదా కోసం పవిత్రత. మర్యాద పురుషోత్తములు అయితే మీరు సదా కోసం ధారణ చేసారు. వారు ఒక్క రోజు చేస్తారు. కాపీ అయితే చేసారు, పిండిలో ఉప్పంత చేసారు. అయినప్పటికీ చేసారు కదా. తెలివైనవారే కదా! రెండవ వ్రతము ఆహార విషయము. మరి మీరందరూ శుద్ధమైన భోజనము యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. కాపీ చేసారు కదా. మీరు పూర్తిగా చేసారా లేక ఎప్పుడైనా అలసిపోయి తినేద్దాములే అని అనుకుంటున్నారా? ఇలా అయితే లేరు కదా? అలసిపోయినా, విసుగెత్తిపోయినా, యూథ్ ఏమి చేస్తారు? కుమారులు చేతులెత్తండి. అచ్ఛా! చాలా మంచిది. కుమారీలు చేతులెత్తండి. విదేశీయులలో కుమారీలు, లైట్ పెట్టుకున్న కుమారీలు, (తలపైన చిన్నని బల్బును పెట్టుకున్నారు) కుమారులు పూర్తి వ్రతాన్ని పాటిస్తున్నారా లేక ఎప్పుడైనా అలసిపోతున్నారా? కుమారులు ఎవరైతే బాబా వద్దకు వచ్చినప్పటి నుండి, ఇప్పుడు కూడా విధిపూర్వకమైన ఆహారపానీయాల వ్రతాన్ని పాటిస్తున్నారో వారు చేతులెత్తండి. పాస్ అయ్యారు, అచ్ఛా, అభినందనలు. మీకు పదమారెట్ల అభినందనలు. కొంచెం కష్టపడవలసి వస్తుంది కానీ బాబా ప్రేమలో ఇది కష్టం కాదు. మరి చూడండి, కాపీ చేసారు కదా. వారు ఒక్క రోజు ప్రతాన్ని తీసుకుంటారు. మరి మీరు ప్రతాన్ని పూర్తి జీవితానికి తీసుకుంటారు. జీవితం యొక్క వ్రతము సదా దానంతట అదే జరుగుతుంది. తర్వాత కష్టపడవలసి ఉండదు. ఈ చిన్నని జన్మలో కష్టం తప్పకుండా ఉంటుంది, త్యాగము. త్యాగానికి భాగ్యము తయారవుతుంది. దీనితో పాటు ఇంకేమి చేస్తారు? జాగరణ. మీరు ఏ జాగరణ చేసారు? వారు నిద్రను త్యాగం చేస్తారు, మీరు కూడా అజ్ఞాన నిద్రను త్యాగం చేసారు. సమయము యొక్క నిద్రకు సంబంధం లేకుండా అజ్ఞాన నిద్రను రానివ్వము అని త్యాగం చేసారు. త్యాగము. ఇలా ఇలా కాదు. ఇలా. ఈ వ్రతాన్ని కూడా తీసుకున్నారు కదా. కొందరికి ఇలా ఇలా చేసే అలవాటు. బాప్‌దాదా అంటారు త్యాగం చేసారు, దృఢ సంకల్పం చేసారు మరి దృఢ సంకల్పాన్ని ఢీలా ఎందుకు చేస్తారు? స్క్రూ టైట్ చెయ్యడం రాదా? దీనిని టైట్ చేసేందుకు స్క్రూ డ్రైవర్ - ప్రతిజ్ఞ. ఇప్పుడు ఏ కార్యమైతే మిగిలి ఉందో, ఏది మిగిలి ఉందో చెప్పండి? చెప్పండి. ప్రత్యక్షత. దీని కోసమే పురుషార్థం చేస్తున్నారు కదా. నా బాబా వచ్చేసారు, ఈ జెండాను ఎందుకు ఎగురవేస్తారు? ఏ కార్యం చేసినా జెండాను ఎగురవేస్తారు. ఈ రోజుకూడా జెండాను ఎగురవేస్తాము కదా. ఎవరి జెండాను ఎగురవేస్తాము? బాప్‌దాదా, సేవ మరియు జన్మ దిన జెండాను ఎగురవేస్తారు. జెండాను ఎగురవేసినప్పుడు అది పూర్తిగా తెరుచుకునే వరకు తెరుస్తూ ఉంటారు. జెండా సమాప్తి పూలు కురవడంతో జరుగుతుంది. మరి మీరు కూడా ఏ ప్రత్యక్షతను ఆశిస్తున్నారు? బాబా ప్రత్యక్షత జరగాలి. మరి ఎంతగా జాగరణ చేసారో, వ్రతాన్ని తీసుకున్నారో, ప్రతిజ్ఞ పక్కా చేసుకున్నప్పుడు ప్రతిజ్ఞ ఎంతో త్వరగా అయిపోతుంది. మరి ప్రత్యక్షతను కోరుకుంటున్నారు కదా! మరి సమయాన్ని సమీపంలోకి తీసుకువచ్చేది ఎవరు? మీరందరూ కదా! సమయాన్ని సమీపంలోకి తీసుకువచ్చే సత్యమైన సేవాధారులు మీరు. విశ్వపరివర్తక పిల్లలు. మరి జన్మదిన బహుమతిని ఒప్పుకున్నట్లేనా. ఇవ్వాలి కూడా, తీసుకోవాలి కూడా. రెండూ చెప్పాము. కేవలం ఇవ్వడమే కాదు, తీసుకోవాలి కూడా. రెండూ చేస్తాము అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా. చాలా మంచిది. అచ్ఛా. మీ చిత్రం(చేతులెత్తినది) ఇందులో (టి.విలో) వస్తుంది. ఎక్కడైనా కొంచెం ఫెయిల్ అయితే వారికి ఈ చిత్రాన్ని పంపిద్దాము. మళ్ళీ చేతులెత్తండి. బాగుంది, అభినందనలు, అభినందనలు, అభినందనలు.
(డబల్ విదేశీయులు వచ్చి ఉన్నారు) డబల్ విదేశీయులు అని అనకండి, డబల్ తీవ్ర పురుషార్థులు. టైటిల్ నచ్చింది కదా. డబల్ విదేశీయులు అన్నది సాధారణము. అలా అయితే చాలా మంది డబల్ విదేశీయులు ఉన్నారు. బాప్‌దాదాకు విదేశీయుల గురించి సంతోషము కలుగుతుంది ఎందుకంటే వీరు మధువనానికి అలంకారంగా అవుతారు కాబట్టి. చూడండి, ఇండియాలో భిన్న భిన్న దేశాల నుండి(స్థానాల నుండి) వస్తూ ఉంటే విదేశీయులు తక్కువ ఎందుకు ఉండాలి, ఇందులో మంచి రేసును చేసారు. బాప్‌దాదా ఒక్క విషయం మెజారిటీలో చూసి సంతోషిస్తున్నారు - ఎవరు వచ్చినా కానీ వారందరూ ఇప్పుడు ఒకే కల్చర్ వారిగా అయిపోయారు. అందరూ ఒక్క బ్రాహ్మణ కల్చర్ వారిగా అయిపోయారు. అవును కదా! చేతులెత్తండి. ఇప్పుడు విదేశీ కల్చర్ వారు కాదు, అందరూ బ్రాహ్మణ కల్చర్ వారే, కదా! వచ్చినప్పుడు భిన్న భిన్న కల్చర్ల నుండి వచ్చారు, కానీ కల్చర్‌ను కూడా దాటివేసారు, ఇదే పెద్ద గోడ కానీ ఈ పెద్ద గోడను క్రాస్ చేసేసారు, ఇప్పుడు వీరేదో వేరు అని అనిపించదు. ఒకసారి టి.విలో బ్రాహ్మణ కల్చర్ వారిని చూడండి. ఒకే కల్చర్ వారిని చూస్తే బాగుంది కదా. అచ్ఛా.
నలువైపుల ఉన్న బాప్‌దాదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు, నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు, నలువైపుల ఉన్న బాప్‌దాదా ఇచ్చిన బహుమతిని స్వీకరించే పిల్లలకు, ఏ పిల్లలైతే బాప్‌దాదాకు బహుమతిని ఇచ్చారో, సంకల్పంతో, ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునేటువంటి దృఢ పురుషార్థీలకు, ప్రతిజ్ఞ చేసి ప్రత్యక్షతను తీసుకువచ్చే పిల్లలందరికీ బాప్‌దాదా చాలా చాలా హృదయపూర్వక ప్రేమను మరియు హృదయపూర్వక ప్రియస్మృతులను అందిస్తున్నారు. పిల్లలందరికీ మళ్ళీ మళ్ళీ అభినందనలు, అభినందనలు, అభినందనలు.
సేవ టర్న్ యు.పి మరియు పశ్చిమ నేపాల్ వారిది:- మంచిది. యు.పివారు విశేషంగా బ్రహ్మాబాబా పాలనను పొందే అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. యు.పి.లో బ్రహ్మా పేరుతో స్మృతిచిహ్నము కూడా ఉంది. యు.పి అదృష్టమేమిటంటే జగదాంబ మరియు బ్రహ్మాబాబా పాలన లభించింది. పాలన లభించిన ధరణి అది. భాగ్య సితార అయిన బ్రహ్మాబాబా మరియు జగదాంబ యు.పిని వరదానంగా ఇచ్చారు. బాగుంది. ఇప్పుడు బాబా ఏమి చూసారంటే, రోజురోజుకూ సేవాస్థానాలు, ఉపసేవాకేంద్రాలు మరియు గీతా పాఠశాలలు మునుపటికన్నా బాగా వృద్ధి చెందుతున్నాయి. కనుక బాప్‌దాదా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నారు. ఇలాగే ముందుకు సాగండి, నంబరు వృద్ది చెయ్యడంలో, సందేశమును ఇవ్వడంలో నంబర్‌వన్‌గా అవ్వండి. మంచిది, బాప్‌దాదా సంతోషిస్తున్నారు, మరింత పెంచండి. టీచర్లకు అభినందనలు. వృద్ధి చేస్తున్నారు. దీనికన్నా ఎక్కువ వృద్ధి చెయ్యండి. అచ్ఛా!