Brahma Kumaris
Brahma KumarisMurli
  • Home
  • Murli Search
  • Murli Topics
  • Murli Chintan
  • AI Murli Chintan (ChatGPT)
Languages
  • EEnglish
  • हहिंदी
  • ગગુજરાતી
  • తతెలుగు
Library
  • Overview
    • Favorites
    • Notes & Highlights
    • Collections
    • Tracker
  • Settings
  • BKOne

22 March 2026 | తెలుగు22 March 2026 | తెలుగు · “ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవాల అథారిటీగా కండి, లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి.”

HomeSearchBKOneLibrarySettings
8 Mar 2026Prev15 Oct 2026Next

“ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవాల అథారిటీగా కండి, లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి.”

22-03-2026 ఓం శాంతి అవ్యక్త బాప్‌దాదా మధుబన్

ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అత్యంత ప్రీతిపాత్రులైన, తమ స్వ-స్థితితో ప్రతి పరిస్థితినీ దాటి సదా ప్రసన్నచిత్తంగా, సంతుష్టంగా ఉంటూ మరియు సంతుష్టతా వైబ్రేషన్లను వ్యాపింపజేసే నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు దేశ-విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణ సోదర-సోదరీలారా,

ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి.

తదుపరి సమాచారం - మధురమైన బాప్‌దాదాతో ఈ అలౌకిక మిలన మేళా సీజన్‌కు ఇది ఆఖరి టర్న్. పంజాబ్ జోన్ సేవల టర్న్ నడుస్తోంది; వారితో పాటు దేశ-విదేశాలలోని ఇతర ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో బాబా పిల్లలు మధుబన్ గృహానికి చేరుకున్నారు. నలువైపులా దివ్య ఫరిశ్తాలు అతీంద్రియ సుఖమయ జీవితాన్ని అనుభవం చేసుకుంటూ, వాతావరణంలోనూ సంతోషపు తరంగాలను వ్యాపింపజేస్తున్నారు. ఒకవైపు ప్రపంచంలో రకరకాల అలజడులు ఉంటే, మరొకవైపు బాబా తమ పిల్లలను ప్రతి పరిస్థితిలోనూ సదా అచలంగా, స్థిరంగా ఉంటూ సంతుష్టత అనే వరదానాన్ని ప్రసాదిస్తూ వినోదాన్ని అనుభవం చేయిస్తున్నారు. స్వయం యొక్క శ్రేష్ఠ స్థితే అనేక పరిస్థితులను సహజంగా దాటించేస్తుంది. వారికి ఎంత పెద్ద పరిస్థితులైనా సరే ఒక కార్టూన్ షో మాదిరిగా వినోదభరితంగా కనిపిస్తాయి. ఎలాంటి పరిస్థితీ వారిపై దాడి చేయజాలదు. వారు తమను తాము సదా విజయులుగా, శ్రమలేనివారిగా అనుభవం చేసుకుంటారు; ఎందుకంటే వారి వద్ద జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ సదా ఉంటాయి. వారు నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవ స్వరూపులుగా ఉంటారు, అందువల్ల వారి ప్రతి కర్మ సహజంగానే శ్రేష్ఠంగా మరియు సఫలంగా మారుతుంది.

బాబా అంటున్నారు - పిల్లలూ, ఇప్పుడు అనుభవాల అథారిటీగా అవ్వండి, ఇదే అన్నింటికంటే శ్రేష్ఠమైన అథారిటీ. మరి చెప్పండి, ఇలాంటి అనుభవమూర్తులుగా మారి బాప్‌దాదా సర్వ ఆశలనూ పూర్తి చేసేవారే కదా!

ఇప్పుడు బాప్‌దాదాకు ఉన్నది ఒక్కటే ఆశ - నా పిల్లలు సమానంగా మారాలి మరియు ముక్తి ద్వారాలు తెరుచుకోవాలి; ఎందుకంటే బ్రహ్మా బాబా మరియు అడ్వాన్స్ పార్టీ ఇప్పుడు దీని కొరకే ఎదురుచూస్తున్నారు. దీని కొరకు ప్రతి బిడ్డా తమ లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం బాప్‌దాదా ద్వారా లభించిన ఇంతటి శక్తిశాలి పాలనకు రిటర్న్‌గా సమానంగా మారి చూపించాలి.

మంచిది - ఏప్రిల్ మాసం నుండి మధుబన్ ఇంటిలో వివిధ రకాల సేవలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ మొదటి వారంలో పూర్తి సంవత్సరానికి సంబంధించి స్వయం ఉన్నతి మరియు సేవల నిమిత్తం వార్షిక మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత రాజయోగ శిబిరాలు, వివిధ రంగాల సమ్మేళనాలు మరియు యోగ భట్టీల కార్యక్రమాలు కొనసాగుతాయి. మంచిది - అందరికీ ఎంతో ప్రేమపూర్వక స్మృతులు... ఓం శాంతి.

22-03-26 ఓం శాంతి “అవ్యక్త-బాప్‌దాదా” రివైజ్ 02-04-08 మధుబన్

“ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవాల అథారిటీగా కండి, లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి.”

ఈరోజు బాప్‌దాదా నలువైపులా సదా సంతుష్టంగా ఉండే సంతుష్ట మణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలోనూ సంతుష్టత యొక్క మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది. సంతుష్ట మణులు తమకు తామూ ప్రియమైనవారు, తండ్రికీ ప్రియమైనవారు మరియు పరివారానికీ ప్రియమైనవారు; ఎందుకంటే సంతుష్టత అనేది ఒక మహాన్ శక్తి. సర్వ ప్రాప్తులూ లభించినప్పుడే సంతుష్టత ధారణ అవుతుంది. ఒకవేళ ప్రాప్తులు తక్కువైతే సంతుష్టత కూడా తగ్గిపోతుంది. సంతుష్టత ఇతర శక్తులను కూడా ఆహ్వానిస్తుంది. సంతుష్టత యొక్క వాతావరణం ఇతరులకు కూడా వారి శక్తి కొద్దీ సంతుష్టతా వైబ్రేషన్లను ప్రసాదిస్తుంది. సదా సంతుష్టంగా ఉండేవారి గుర్తు - వారు సదా ప్రసన్నచిత్తంగా కనిపిస్తారు. ముఖం సదా స్వతహాగానే హర్షితముఖంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ ఎదుట ఎలాంటి పరిస్థితి వచ్చినా అది స్వ-స్థితిని కదిలించలేదు. ఎంత పెద్ద పరిస్థితి ఎదురైనా కానీ సంతుష్ట ఆత్మకు అది కార్టూన్ షో మాదిరిగా వినోదంగా కనిపిస్తుంది. అందువల్ల ఆ ఆత్మ పరిస్థితిలో కంగారుపడదు మరియు పరిస్థితి ఆ ఆత్మపై దాడి చేయలేదు, తానే ఓడిపోతుంది. అందుచేతనే అతీంద్రియ సుఖమయ వినోదభరిత జీవితాన్ని ఆ ఆత్మ అనుభవం చేస్తుంది. శ్రమపడాల్సిన పని ఉండదు, అంతా వినోదంగానే అనుభవమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమను తాము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం వచ్చు కదా! వచ్చా? ఇతరులను కాదు, తమను తాము చెక్ చేసుకోవడం వచ్చినవారు చేతులెత్తండి. చెక్ చేసుకోవడం వచ్చా? మంచిది, అభినందనలు.

బాప్‌దాదా ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూస్తూ ఎంతో హర్షిస్తున్నారు; కానీ బాప్‌దాదా హృదయపు ఆశను గతంలోనూ వినిపించారు. అందరూ చేతులు ఎత్తారు, గుర్తుందా - మేము కారణాలను సమాప్తం చేసి సమాధాన స్వరూపులుగా అవుతాము అని. బాప్‌దాదాతో ప్రేమ ఎవరికుంది మరియు ఎంతగా ఉంది అని బాప్‌దాదా అడిగినప్పుడు ఏమి సమాధానం ఇస్తారు? బాబా, మాటల్లో చెప్పలేనంత ఉంది అని చెప్తారు. సమాధానమైతే చాలా బాగా ఇస్తారు. బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. కానీ ఆ ప్రేమకు రుజువు ఏమిటి? ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో - నేటి లోకంలో దేహాభిమానపు ప్రేమలో ప్రాణాలను కూడా త్యాగం చేసేస్తారు; మరి పరమాత్మ ప్రేమ కొరకు తండ్రి చెప్పినదానిని ఆచరించడం పిల్లలకు కష్టమెందుకు కావాలి? పాటలైతే చాలా మంచివి పాడుతుంటారు - బాబా, మేము సమర్పణ అయ్యే దీపపు పురుగులము, దీపంపై ఆహుతయ్యేవారము అని. మరి ఈ ‘కారణము’ అనే పదాన్ని ఆహుతి (స్వాహా) చేయలేరా?

ఇప్పుడు ఈ సంవత్సరపు ఆఖరి టర్న్ వచ్చేసింది. వచ్చే సంవత్సరంలో ఏమి జరుగుతుందో అది మీరు మరియు తండ్రి చూస్తున్నారు, చూస్తారు; కానీ సమయాన్ని చూసి - మీరు అంటుంటారు కదా, సమయపు పిలుపు అని. భక్తుల పిలుపు, సమయపు పిలుపు, దుఃఖీ ఆత్మల పిలుపు, మీ స్నేహీ, సహయోగి ఆత్మల పిలుపును మీరే కదా పూర్తి చేయాల్సింది! మీ టైటిల్ ఏమిటి? మీ కర్తవ్యం ఏమిటి? ఏ కర్తవ్యం కొరకు బ్రాహ్మణులుగా అయ్యారు? విశ్వ పరివర్తకులు అన్నది మీ టైటిల్. విశ్వ పరివర్తన మీ కార్యం, మరియు తోడుగా ఉన్నదెవరు? బాప్‌దాదాతో పాటుగా ఈ కార్యంలో నిమిత్తంగా మారారు. మరి ఏమి చేయాలి? ఇప్పుడు కూడా చేతులెత్తమంటే అందరూ చేతులెత్తేస్తారు. లక్ష్యమైతే ఉంచుకున్నారు, మొత్తం ఈ సీజన్‌లో అందరూ సంకల్పం చేశారని బాప్‌దాదా చూశారు; కానీ సఫలతకు తాళంచెవి దృఢత - చేసి తీరాల్సిందే అనేదానికి బదులుగా అప్పుడప్పుడు చేస్తున్నాము, నడుస్తున్నాము, ఎప్పటికైనా చేసేస్తాములే అని అనుకుంటున్నారు. ఈ సంకల్పం దృఢతను సాధారణంగా మార్చేస్తుంది. దృఢత ఉన్నచోట ‘కారణము’ అనే పదమే రాదు. నివారణ అయిపోతుంది. కారణాలు వచ్చినా కానీ సరిగ్గా చెకింగ్ ఉండటం వల్ల ఆ కారణం కాస్తా నివారణగా మారిపోతుంది.

బాప్‌దాదా రిజల్ట్‌ను చెక్ చేసినప్పుడు ఏమి కనిపించింది? జ్ఞాని, యోగి, ధారణా స్వరూపం, సేవాధారి - ఈ నాలుగు సబ్జెక్టులలోనూ ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి కొద్దీ జ్ఞానిగా ఉన్నారు, యోగిగా ఉన్నారు, ధారణ చేస్తున్నారు, సేవ కూడా చేస్తున్నారు. కానీ నాలుగు సబ్జెక్టులలోనూ ‘అనుభవ స్వరూపము’, ‘అనుభవాల అథారిటీ’గా అవ్వడంలో లోటు కనిపించింది. అనుభవ స్వరూపము, జ్ఞాన స్వరూపంలోనూ అనుభవ స్వరూపం అనగా - జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటారు; కాబట్టి అనుభవమూర్తి ఆత్మలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే స్పష్టమైన అవగాహన (నాలెడ్జ్) ఉంటుంది. నాలెడ్జ్ యొక్క లైట్ మరియు మైట్; అనుభవ స్వరూపం అనగానే జ్ఞానీ ఆత్మ యొక్క ప్రతి కర్మలోనూ లైట్ మరియు మైట్ సహజంగానే ఉండాలి. జ్ఞాని అనగా జ్ఞానాన్ని, నాలెడ్జ్‌ను తెలుసుకోవడం, వర్ణించడం మాత్రమే కాదు, దాంతోపాటు ప్రతి కర్మలోనూ లైట్ మరియు మైట్ ఉండాలి. అనుభవ స్వరూపం వల్ల ప్రతి కర్మ సహజంగానే శ్రేష్ఠంగా మరియు సఫలంగా మారుతుంది. శ్రమపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే జ్ఞానానికి అనుభవమూర్తులుగా ఉన్నారు. అనుభవపు అథారిటీ అన్ని అథారిటీల కంటే శ్రేష్ఠమైనది. జ్ఞానాన్ని తెలుసుకోవడం వేరు, జ్ఞానపు అనుభవ స్వరూపపు అథారిటీతో ప్రతి కర్మ చేయడం వేరు - రెండింటికీ తేడా ఉంది. మరి అనుభవ స్వరూపులుగా ఉన్నారా? చెక్ చేసుకోండి. నాలుగు సబ్జెక్టులలోనూ - నేను ఆత్మను అని కేవలం అనుకోవడమే కాకుండా అనుభవ స్వరూపులై ప్రతి కర్మ చేస్తున్నారా? అనుభవాల అథారిటీ అనే సీటుపై సెట్ అయి ఉంటే శ్రేష్ఠ కర్మ, సఫలతా స్వరూప కర్మలు ఆ అథారిటీ ఎదుట సహజ స్వభావంగా (నేచురల్ నేచర్‌గా) కనిపిస్తాయి. ఆలోచిస్తున్నారు, కానీ అనుభవ స్వరూపులుగా మారడం, యోగయుక్త-రాజ్‌యుక్త స్థితి అనేది అలవాటుగా (నేచర్‌గా), నేచురల్‌గా అయిపోవాలి. ధారణలోనూ సర్వ గుణాలు స్వతహాగానే ప్రతి కర్మలోనూ కనిపించాలి. ఇలాంటి అనుభవ స్వరూపంలో సదా ఉండటం, అనుభవపు సీటుపై సెట్ అవ్వడం అనే ఈ ఆవశ్యకతపై అటెన్షన్ ఉంచుకోవడం ఎంతో అవసరం. అనుభవపు అథారిటీ అనే సీటు చాలా మహానైనది. అనుభవజ్ఞుడిని మాయ కూడా తుడిచిపెట్టలేదు; ఎందుకంటే మాయ అథారిటీ కంటే అనుభవపు అథారిటీ పదమా రెట్లు ఉన్నతమైనది. ఆలోచించడం వేరు, మననం చేయడం వేరు, అనుభవ స్వరూపులై నడవడం వేరు - ఇప్పుడు దీని ఆవశ్యకత ఉంది. మరి ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు? సమయానుసారంగా ఇప్పుడు ఆకస్మికపు (అచానక్) సీజన్ నడుస్తోంది. ఈ సంవత్సరంలో ఎంతమంది బ్రాహ్మణులు ఆకస్మికంగా శరీరాలు వదిలి వెళ్ళారో చూశారు, విన్నారు కదా. కాబట్టి ఆకస్మికం అనే గంట ఇప్పుడు మరింత వేగంగా మోగుతోంది. దానికి తగినట్లుగా ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులలోనూ నేను అనుభవ స్వరూపంగా ఎంతవరకు మారాను అని చూసుకోవాలి, ఎందుకంటే నాలుగు సబ్జెక్టులలోనూ మంచి మార్కులు కావాలి. ఒక్క సబ్జెక్టులో పాస్ మార్కుల కంటే తక్కువ వచ్చినా పాస్ విత్ ఆనర్ మాలలోని పూసగా, బాప్‌దాదా మెడలోని హారంగా ఎలా కాగలరు! ఏ రూపంలోనైనా ఓటమి(హార్) పాలయ్యేవారు బాబా మెడలో విజయ హారంగా (హార్‌గా) మారలేరు.

తండ్రి హృదయపు ఆశలను పూర్తి చేసే ఆశల దీపాలుగా తప్పక మారాలి. తండ్రి ఆశలేమిటో మీకు తెలుసు కదా. అవ్వాల్సిందేనా లేక అవుతాములే, చూద్దాములే అంటారా...! ఖచ్చితంగా అయ్యితీరాలి అని భావించేవారు చేతులెత్తండి. చూడండి, కెమెరాలో రికార్డవుతోంది. బాప్‌దాదాను సంతోషపెట్టడం అయితే చాలా బాగా వచ్చు. బాప్‌దాదా కూడా పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్ళలేరు. చూడండి, బ్రహ్మా బాబా కూడా మీ కోసమే ముక్తి ద్వారాలను తెరిచేందుకు వేచి చూస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురుచూస్తోంది. మీరు ఏర్పాట్లు (ఇంతజామ్) చేసేవారు. మీరు ఎదురుచూసేవారు (ఇంతజార్) కారు, ఏర్పాట్లు చేసేవారు. కాబట్టి ఈ సంవత్సరం లక్ష్యాన్ని ఉంచుకోండి, కానీ లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా ఉంచుకోండి. లక్ష్యమేమో చాలా ఉన్నతంగా ఉండి, లక్షణాలలో బలహీనత ఉండటం అలా కాకూడదు. లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలి. బాబా సమానంగా కావాలనే మీ హృదయపు ఆశ లక్ష్యము-లక్షణాలు సమానమైనప్పుడే నెరవేరుతుంది. ప్రస్తుతం లక్ష్యానికి, లక్షణాలకు మధ్య కాస్త తేడా వచ్చేస్తోంది. ప్లాన్స్ చాలా బాగా వేస్తారు, పరస్పరం ఆత్మిక సంభాషణలు కూడా చాలా చక్కగా చేసుకుంటారు. ఒకరికొకరు అటెన్షన్ కూడా ఇప్పించుకుంటారు. ఇప్పుడు దృఢత మన జన్మసిద్ధ అధికారం అనే ఈ సంకల్పాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకురండి. చెక్ చేసుకోండి - ఏది చెప్తున్నారో దానిని అనుభవం కూడా చేసుకుంటున్నారా? మొదటి పదం ‘నేను ఆత్మను’ అనేదానినే చెక్ చేసుకోండి. ఈ ఆత్మ స్వరూపపు అనుభవాల అథారిటీగా ఉన్నానా? ఎందుకంటే అనుభవాల అథారిటీ నంబర్‌వన్.

కాబట్టి ఆలోచించండి, ప్రతి విషయాన్నీ ఎదురుగా తీసుకురండి. ఆత్మ అయినా, పరమాత్మ అయినా, చక్రమైనా - అన్నింటిలోనూ అనుభవమూర్తులుగా ఎంతవరకు మారారు? మంచిది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా స్వ-స్థితిలో స్థిరంగా ఉండగలరా?

మనస్సు యొక్క ఏకాగ్రత (డ్రిల్) - మూడు బిందువుల స్మృతి స్వరూపంగా స్థితి కాగలరు కదా! అంతే, ఫుల్‌స్టాప్. అచ్ఛా.

సేవా టర్న్ పంజాబ్ జోన్‌ది (పంజాబ్, హిమాచల్, హర్యానా, జమ్ము కాశ్మీర్, ఉత్తరాంచల్) :- మంచిది, పంజాబ్ సింహం అని ఏదైతే అంటారో, వారు సంఖ్యను కూడా చాలా చక్కగా తీసుకువచ్చారు. పంజాబ్ సింహమని అందరికీ తెలిసిపోయింది, అందుకే అందరూ ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో చేరుకున్నారు.

ఇప్పుడు ఏమి చేయాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేసిన సంకల్పం - తండ్రిని ప్రత్యక్షం చేసి తీరాల్సిందే. ఆ ప్రత్యక్షత తేదీని మీ పరివర్తన అనే కలంతో సెట్ చేయండి. పెన్సిల్‌తో సెట్ చేయలేరు, మీ పరివర్తన అనే తీవ్ర పురుషార్థపు కలంతో ప్రత్యక్షత తేదీ సహజంగానే ఫిక్స్ అయిపోతుంది. మరి మొత్తం జోన్ మనసా-వాచా-కర్మణాలలో, సంబంధ-సంపర్కాలలో నిర్విఘ్నంగా ఉంది మరియు దృఢంగానే ఉంటుంది అని ఏ జోన్ నుండి మొదటి నంబర్ రిపోర్ట్ వస్తుందో బాప్‌దాదా చూస్తారు. ఇందులో నంబర్‌వన్‌గా ఎవరు నిలుస్తారు? కేవలం సెంటర్ మాత్రమే కాదు; ముందుగా సెంటర్‌ను బలంగా చేయండి, ఆ తర్వాత కనెక్షన్‌లో ఉన్న సెంటర్లను బలంగా చేయండి, ఆపై పూర్తి జోన్‌ను దృఢంగా చేయండి. ఇది సాధ్యమే కదా! మొత్తం జోన్ అంతా నిర్విఘ్నంగా మారడం సాధ్యమేనా? సాధ్యమేనా? చెప్పండి, మొదటి వరుసవారు చెప్పండి. సాధ్యమేనా? జయంతి, చెప్పండి, సాధ్యమేనా? మంచిది - టీచర్లు లేచి నిలబడండి. బాప్‌దాదా ఇంతమంది టీచర్లను చూసి సంతోషిస్తున్నారు. ఎందుకు? టీచర్లు గురుభాయ్‌లు. మంచిది, నిర్విఘ్నంగా మారి నిర్విఘ్న వాతావరణాన్ని తయారుచేసేందుకు టీచర్లే నిమిత్తం. కాబట్టి టీచర్లు లక్ష్యాన్ని ఉంచుకుంటారు. లక్ష్యం ఉంచుకుని తేదీని మీరే ఫిక్స్ చేయండి, బాబా చేయరు. ప్రతి జోన్ పరస్పరం ప్లాన్ చేసుకోండి మరియు ఒకరికొకరు ప్రేరణనిచ్చుకోండి. ఏ జోన్‌లోనైనా ఏదైనా కొత్త ఉల్లాస-ఉత్సాహాల ప్లాన్ తయారైతే, పరస్పరం ఉల్లాస-ఉత్సాహాలను నింపుతూ అందరినీ నిర్విఘ్నంగా తయారుచేయాలి. చేతులెత్తారు, ఇప్పుడైతే పురుషార్థం కొరకు చేతులెత్తుతున్నారు; ప్రత్యక్షతకు ముందే - మేము సదాకాలం కొరకు నిర్విఘ్నంగా ఉన్నాము, నిర్విఘ్నంగా ఉంటాము అని అందరి చేతులూ లేవాలి. సభలో అందరి చేతులూ అలా లేచినప్పుడు ఇక ఎంతగా వాహ్! వాహ్! జరుగుతుందో. మీ భక్తులు కూడా ఎంతో సంతోషిస్తారు, వారు కూడా తమ తమ స్థానాలలో చప్పట్లు కొడతారు - వాహ్ నా ఇష్ట దైవమా వాహ్! అని. మరి చేయాల్సిందే కదా! చేయాల్సిందేనా? మధుబన్ వాసులు... మధుబన్ వాసులు మొదటి నంబర్‌లో రావాలి. రావడం కాదు, చేసి చూపించాలి; ఎందుకంటే మధుబన్ వైపే అందరి ఆకర్షణా ఉంటుంది. మధుబన్ అనగానే మధుబన్ బాబా గుర్తుకొస్తారు. మధుబన్ విశేషత ఇది. కాబట్టి బాబా సమానంగా నంబర్‌వన్‌గా మారాలి. మధుబన్ నివాసి ఒక్కొక్కరూ - నేను బాబా సమానంగా మారి తీరాలి అనే బాధ్యతను తమకు తాము ఇచ్చుకోవాలి. ఎవరైనా మారనీ, మారకపోనీ, నేనైతే మారాల్సిందే. తమ బాధ్యతను తాము తీసుకోగలరు కదా. ఇతరుల సంగతి వదిలేయండి, నేను మారాలి, నేను చేసి చూపించాలి అనే బాధ్యతను స్వయం తీసుకోవాలి. అప్పుడు మీ అందరి వాతావరణం అనేక ఆత్మలకు సహకారాన్ని అందిస్తుంది. వీరు చేయట్లేదు కదా, వీరు మారట్లేదు కదా అని ఇతరుల వైపు చూడకండి; నేను మారాలి. ఇతరులు వారంతట వారే మారుతారు, నా బాధ్యతను నేను తీసుకుంటాను. సరేనా టీచర్స్. టీచర్లే నిమిత్తం, చిన్నవారైనా పెద్దవారైనా టీచర్లందరూ ఇందులో చిన్నవారు కారు, అందరూ పెద్దవారే. చేస్తాము అనేవారు చేతులెత్తండి. పరిస్థితులు ఎదురవుతాయి, నేను ప్రయత్నించాను అని అనకూడదు. ప్రయత్నం (కోశిష్) కాదు, బాబా ప్రేమ యొక్క ఆకర్షణ (కశిష్) ఉండాలి తప్ప కోశిష్ కాదు. సరేనా టీచర్స్! టీచర్లు చేతులెత్తండి, రెండు చేతులూ ఎత్తండి. అందరూ చూస్తున్నారు. చేతులెత్తారు. అభినందనలు. టీచర్లు మరియు మధుబన్ నివాసులు నంబర్‌వన్. బాధ్యతను స్వీకరించేవారే అర్జునుడు. అర్జునుడు అనగా బాబా సమానుడు. కారణాలు చెప్పకూడదు, కారణాలైతే వస్తాయి, కొండల వంటి కారణాలు ఎదురవుతాయి, ధైర్యాన్ని కోల్పోకూడదు. వెల్‌కమ్. కారణాలకు వెల్‌కమ్ చెప్పి ఒక్క సెకనులో వీడ్కోలు పలికేయండి. మూడు బిందువుల తాళంచెవి, సఫలతకు తాళంచెవి మూడు బిందువులు. దీనిని సదా తోడుంచుకోండి. మంచిది.

డబల్ విదేశీయులు :- మంచిది - డబల్ విదేశీయులు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు; కానీ సంతోషంతో పాటు మరొక విషయంలోనూ సంతోషాన్ని తీసుకురావాలి - ఎన్నడూ మిమ్మల్ని మీరు కంబైన్డ్ రూపం నుండి ఒంటరిగా చేసుకోకండి. ఒంటరిగా చేసుకోవడం అనగా మాయకు వెల్‌కమ్ చెప్పడమే; అందువలన కంబైన్డ్‌గా ఉంటూ సర్వశక్తిమంతుని తోడు వల్ల లాభాన్ని పొందండి, సమయం చూసుకునే మాయ ఒంటరిగా చేస్తుంది అనే ఈ అటెన్షన్ ఉంచుకోండి. సదా కంబైన్డ్; బాప్‌దాదా గతంలోనూ చెప్పారు - డబల్ విదేశీయులకు కంపెనీ అంటే ఇష్టం, కంపానియన్ అంటే ఇష్టం. కాబట్టి ఎన్నడూ ఒంటరిగా కావద్దు. తోడుండేందుకు నేను సదా మీతోనే ఉన్నాను అని తండ్రి స్వయంగా ఆఫర్ చేస్తున్నారు. రిజల్ట్ చాలా బాగుంది. రిజల్ట్ బాగుంది కానీ మరింత అత్యుత్తమంగా చేసి చూపించాల్సిందే. మంచిది.

అచ్ఛా - ఇప్పుడు ఒక్క సెకనులో తమ శ్రేష్ఠ స్వమానమైన బాప్‌దాదా హృదయ సింహాసనాధికారిగా, ఈ ఆత్మిక స్వమాన నషాలో స్థితులు కండి. నేను సింహాసనాధికారి ఆత్మను అనే ఈ అనుభవంలో లీనమైపోండి. మంచిది.

నలువైపులా ఉన్న అతి లవ్లీ, సదా తండ్రి ప్రేమలో లీనమై ఉండేవారు, సదా స్వమానధారులు, స్వరాజ్యధారులైన విశేష ఆత్మలకు, నలువైపులా ఉల్లాస-ఉత్సాహాల రెక్కలతో ఎగిరేవారు మరియు తమ మనస్సు యొక్క వైబ్రేషన్ల ద్వారా వాతావరణాన్ని శాంతంగా, శ్రేష్ఠంగా తీర్చిదిద్దేవారు, అందరికీ తండ్రి సందేశాన్ని అందించి దుఃఖాల నుండి విముక్తి కలిగించి ముక్తి ఆస్తిని ఇప్పించేవారు; సదా దృఢత ద్వారా సఫలతను పొందే ఇలాంటి నలువైపుల హృదయానికి సమీపంగా ఉండేవారు మరియు సమ్ముఖంలోకి వచ్చిన సర్వ పిల్లలకూ హృదయపూర్వక ప్రేమ మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు, ప్రియస్మృతులు మరియు నమస్తే.

*** ఓంశాంతి ***

Read in Other Languages

हहिंदी