Brahma Kumaris
Brahma KumarisMurli
  • Home
  • Murli Search
  • Murli Topics
  • Murli Chintan
  • AI Murli Chintan (ChatGPT)
Languages
  • EEnglish
  • हहिंदी
  • ગગુજરાતી
  • తతెలుగు
Library
  • Overview
    • Favorites
    • Notes & Highlights
    • Collections
    • Tracker
  • Settings
  • BKOne

11 December 1985 | తెలుగు11 December 1985 | తెలుగు · "సత్యమైన సేవాధారి యొక్క నిదర్శనం"

HomeSearchBKOneLibrarySettings
9 Dec 1985Prev14 Dec 1985Next

"సత్యమైన సేవాధారి యొక్క నిదర్శనం"

ఈరోజు స్నేహ సాగరుడైన బాప్‌దాదా స్నేహీ పిల్లలందరినీ చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డలో మూడు విశేషతలను చూస్తున్నారు – ప్రతి ఒక్క బిడ్డ మూడు విశేషతలలో ఎంతవరకు సంపన్నులుగా మారారు అని చూసాము. ఆ మూడు విశేషతలు ఏమిటంటే - స్నేహం, సహయోగం అనగా సహజ యోగం మరియు శక్తి స్వరూపం అనగా నడిచే తిరిగే చైతన్య లైట్ హౌస్ మరియు మైట్ హౌస్. ప్రతి సంకల్పం, మాట లేదా కర్మ ద్వారా ఈ మూడు స్వరూపాలు ప్రత్యక్ష రూపంలో ఎవరికైనా అనుభవమవ్వాలి; కేవలం స్వయం పట్ల మాత్రమే కాదు, ఇతరులకు కూడా ఈ మూడు విశేషతలు అనుభవమవ్వాలి. తండ్రి స్నేహ సాగరుడైనట్లుగానే, మాస్టర్ సాగరుల ఎదురుగా జ్ఞాని లేదా అజ్ఞాని ఆత్మ ఎవరు వచ్చినా సరే, మాస్టర్ స్నేహ సాగరుని అలలు స్నేహానుభూతిని కలిగిస్తున్నాయని అనుభవం చేసుకోవాలి. లౌకిక లేదా ప్రాకృతిక సాగర తీరానికి ఎవరు వెళ్ళినా చల్లదనం, శాంతి యొక్క అనుభూతిని స్వతహాగానే పొందుతారు. అలాగే మాస్టర్ స్నేహ సాగరుల ద్వారా ఆత్మిక స్నేహపు అనుభూతి కలగాలి – సత్యమైన స్నేహ ప్రాప్తి స్థానానికి చేరుకున్నాను అని. ఆత్మిక స్నేహపు అనుభూతి, ఆత్మిక సువాసన వాతావరణంలో అనుభవమవ్వాలి. తండ్రికి స్నేహితులము అని అందరూ అంటారు మరియు తండ్రికి కూడా అందరికీ తండ్రి పట్ల స్నేహం ఉందని తెలుసు. కానీ ఇప్పుడు స్నేహపు సువాసనను విశ్వంలో వ్యాపింపజేయాలి. ప్రతి ఆత్మకు ఈ సువాసన యొక్క అనుభవం చేయించాలి. ప్రతి ఒక్క ఆత్మ ‘వీరు శ్రేష్ఠ ఆత్మ, కేవలం తండ్రికి మాత్రమే స్నేహీ కాదు కానీ సర్వులకు సదా స్నేహీ’ అని వర్ణించాలి. ఈ రెండు అనుభూతులు ఎప్పుడైతే సర్వులకు సదా కలుగుతాయో, అప్పుడు మాస్టర్ స్నేహ సాగరులు అని అంటారు. నేటి ప్రపంచం సత్యమైన ఆత్మిక స్నేహం కోసం ఆకలితో ఉంది. స్వార్థపూరిత స్నేహాన్ని చూసి-చూసి ఆ స్నేహం పట్ల హృదయం విరక్తి చెందింది. అందుకే కొద్దిపాటి ఘడియల ఆత్మిక స్నేహానుభూతిని కూడా జీవితానికి ఆసరాగా భావిస్తారు.

బాప్‌దాదా చూస్తూ ఉన్నారు - స్నేహపు విశేషతను ఇతర ఆత్మల పట్ల కర్మలో లేదా సేవలో పెట్టడంలో ఎంతవరకు సఫలతను పొందారు? కేవలం మీ మనస్సులో మీతో మీరే సంతోషపడిపోవడం లేదు కదా - ‘నేనైతే చాలా స్నేహీని, స్నేహం లేకపోతే తండ్రికి చెందినవారిగా ఎలా మారేవాళ్ళము లేదా బ్రాహ్మణ జీవితంలో ఎలా ముందుకు సాగేవాళ్ళము!’ అని. మీ మనస్సులో సంతుష్టత ఉందని బాప్‌దాదాకు కూడా తెలుసు. మరియు మీ వరకు ఉండటం కూడా మంచిదే, కానీ మీరందరూ పిల్లలు తండ్రితో పాటు సేవాధారులు. సేవ కోసమే ఈ తనువు-మనసు-ధనమును మీ అందరికీ తండ్రి ట్రస్టీగా చేసి ఇచ్చారు. సేవాధారి యొక్క కర్తవ్యం ఏమిటి? ప్రతి విశేషతను సేవలో పెట్టడం. ఒకవేళ మీ విశేషత సేవలో పెట్టబడకపోతే ఎన్నడూ ఆ విశేషత వృద్ధిని పొందదు, ఆ పరిమితిలోనే ఉండిపోతుంది. అందుకే కొందరు పిల్లలు ఇలా కూడా అనుభవం చేసుకుంటారు - తండ్రికి చెందినవారిగా అయ్యాము, రోజూ వస్తున్నాము, పురుషార్థంలో కూడా నడుస్తున్నాము, నియమాలు కూడా పాటిస్తున్నాము, కానీ పురుషార్థంలో ఉండాల్సిన వృద్ధి అనుభవం కావడం లేదు. నడుస్తున్నాము కానీ ఎదగడం లేదు అని. దీనికి కారణం ఏమిటి? విశేషతలను సేవలో పెట్టడం లేదు. కేవలం జ్ఞానం ఇవ్వడం లేదా సప్తాహ కోర్సు చేయించడం వరకు మాత్రమే సేవ కాదు. వినిపించడం అనేది ద్వాపరం నుండి పరంపరగా నడుస్తూ వస్తుంది. కానీ ఈ బ్రాహ్మణ జీవితపు విశేషత - వినిపించడం అనగా ఏదో ఒకటి ఇవ్వడం. భక్తి మార్గంలో వినిపించడం అనగా తీసుకోవడం అవుతుంది, మరియు ఇప్పుడు వినిపించడం అనగా ఏదో ఒకటి ఇవ్వడం. దాత పిల్లలు మీరు, సాగరుని పిల్లలు. ఎవరైతే సంపర్కంలోకి వస్తారో వారు ‘ఏదో ఒకటి తీసుకుని వెళ్తున్నాము, కేవలం విని వెళ్ళడం లేదు’ అని అనుభవం చేసుకోవాలి. జ్ఞానంతో అయినా, స్నేహపు ధనంతో అయినా, లేదా స్మృతి బలపు ధనంతో, శక్తుల ధనంతో, సహయోగపు ధనంతో చేతులు అనగా బుద్ధిని నింపుకుని వెళ్తున్నారని అనుభవం చేసుకోవాలి. దీనినే సత్యమైన సేవ అంటాము. సెకను దృష్టి లేదా రెండు మాటల ద్వారా, తమ శక్తివంతమైన వృత్తి యొక్క వైబ్రేషన్స్ ద్వారా, సంపర్కం ద్వారా దాతగా మారి ఇవ్వాలి. ఇలాంటి సేవాధారులే సత్యమైన సేవాధారులు. ఇలా ఇచ్చేవారు సదా ‘ప్రతి సమయం వృద్ధిని లేదా ఉన్నతిని పొందుతున్నాము’ అని అనుభవం చేసుకుంటారు. లేకపోతే – వెనుకకు తగ్గడం లేదు కానీ ముందుకు సాగాల్సినంతగా సాగడం లేదు అని భావిస్తారు. అందుకే దాతగా మారండి, అనుభవం చేయించండి. అలాగే సహయోగులు లేదా సహజయోగులు కేవలం స్వయం పట్ల మాత్రమే ఉన్నారా లేక ఇతరులను కూడా మీ సహయోగపు ఉల్లాస, ఉత్సాహాల అల సహయోగులుగా తయారుచేస్తుందా! మీ సహయోగపు విశేషతను సర్వ ఆత్మలు – ‘వీరు మా సహయోగులు, ఎలాంటి బలహీన స్థితి లేదా పరిస్థితి సమయంలోనైనా సహయోగం ద్వారా ముందుకు సాగే సాధనాన్ని ఇచ్చేవారు’ అని భావించాలి. సహయోగపు విశేషత యొక్క అనుభవం మీ ఆత్మ పట్ల సర్వులకు కలగాలి. దీనినే విశేషతను సేవలో పెట్టడం అంటాము. తండ్రికి సహయోగులైతే ఉండనే ఉన్నారు, కానీ తండ్రి విశ్వ సహయోగి. పిల్లల పట్ల కూడా ప్రతి ఆత్మ అంతరంగం నుండి ఈ అనుభవపు మాటలు వెలువడాలి - ‘వీరు కూడా తండ్రి సమానంగా సర్వులకు సహయోగులు’ అని. పర్సనల్‌గా ఒకరికొకరు సహయోగులుగా కాకూడదు, అవి స్వార్థపు సహయోగాలు అవుతాయి, హద్దు సహయోగాలు అవుతాయి. సత్యమైన సహయోగులు అనంతమైన సహయోగులు. మీ అందరి టైటిల్ ఏమిటి? విశ్వ కళ్యాణకారులా లేక కేవలం సెంటర్ కళ్యాణకారులా? దేశ కళ్యాణకారులా లేక కేవలం క్లాస్ స్టూడెంట్స్ కళ్యాణకారులా? అలాంటి టైటిల్ అయితే లేదు కదా. విశ్వ కళ్యాణకారులు, విశ్వ యజమానులుగా కాబోతున్నారా లేక కేవలం మీ మహల్ యజమానులుగా మాత్రమే కాబోతున్నారా! ఎవరైతే కేవలం సెంటర్ హద్దులో ఉంటారో వారు కేవలం తమ మహల్ యజమానులుగా మాత్రమే అవుతారు. కానీ అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు, హద్దు వారసత్వాన్ని కాదు. కాబట్టి సర్వుల పట్ల సహయోగపు విశేషతను కార్యంలో పెట్టడాన్ని సహయోగి ఆత్మ అంటాము. ఇదే విధి ప్రకారం శక్తివంతమైన ఆత్మ సర్వ శక్తులను కేవలం స్వయం పట్ల మాత్రమే కాదు, సర్వుల పట్ల సేవలో పెడతారు. ఎవరిలోనైనా సహనశక్తి లేదు, మీ వద్ద ఉంది; ఇతరులకు ఈ శక్తిని ఇవ్వడం - ఇదే శక్తిని సేవలో పెట్టడం. కేవలం ‘నేనైతే సహనశీలంగా ఉంటాను’ అని మాత్రమే ఆలోచించకండి, కానీ మీ సహనశీలత అనే గుణం యొక్క లైట్-మైట్ ఇతరుల వరకు చేరుకోవాలి. లైట్ హౌస్ యొక్క లైట్ కేవలం తన కోసం మాత్రమే ఉండదు, ఇతరులకు వెలుగునివ్వడానికి లేదా దారి చూపించడానికి ఉంటుంది. అలాగే శక్తి రూపం అనగా లైట్ హౌస్, మైట్ హౌస్‌గా మారి ఇతరులకు దాని లాభం యొక్క అనుభవం చేయించండి. వారు బలహీనత అనే అంధకారం నుండి శక్తి అనే వెలుగులోకి వచ్చామని అనుభవం చేసుకోవాలి లేదా ‘ఈ ఆత్మ తన శక్తి ద్వారా నన్ను కూడా శక్తివంతంగా చేయడంలో సహాయకారిగా ఉంది’ అని అర్థం చేసుకోవాలి. తండ్రితో కనెక్షన్ చేయిస్తారు కానీ నిమిత్తంగా ఉండి; అంతేతప్ప సహయోగం ఇచ్చి తమలోనే చిక్కుకునేలా చేయరు. ‘తండ్రి ఇచ్చిన దానినే ఇస్తున్నాము’ అనే ఈ స్మృతి మరియు సమర్థతతో విశేషతలను సేవలో పెడతారు. సత్యమైన సేవాధారి యొక్క నిదర్శనం ఇదే. ప్రతి కర్మలో వారి ద్వారా తండ్రి కనిపించాలి, వారి ప్రతి మాట తండ్రి స్మృతిని కలిగించాలి, ప్రతి విశేషత దాత వైపుకు సంకేతం చేయాలి. సదా తండ్రే కనిపిస్తారు; వారు మిమ్మల్ని చూడకుండా సదా తండ్రినే చూస్తారు. ‘నా సహయోగి’ అనడం సత్యమైన సేవాధారి నిదర్శనం కాదు. ‘నా విశేషత కారణంగా వీరు నాకు చాలా సహయోగులుగా ఉన్నారు, సహయోగికి సహయోగం ఇవ్వడం నా పని’ అని ఎన్నడూ సంకల్ప మాత్రంలో కూడా ఆలోచించకండి. ఒకవేళ మిమ్మల్ని చూసి, తండ్రిని చూడకపోతే అది సేవ అయినట్లు కాదు; అది ద్వాపరయుగపు గురువుల మాదిరిగా విముఖం చేసినట్లు, తండ్రిని మర్చిపోయేలా చేసినట్లు అవుతుంది తప్ప సేవ చేసినట్లు కాదు. ఇది పడగొట్టడం అవుతుంది తప్ప ఎక్కించడం కాదు. ఇది పుణ్యం కాదు, పాపం; ఎందుకంటే తండ్రి లేకపోతే తప్పకుండా పాపమే. కాబట్టి సత్యమైన సేవాధారులు సత్యం వైపుకే సంబంధాన్ని జోడిస్తారు.

బాప్‌దాదాకు అప్పుడప్పుడు పిల్లలను చూసి నవ్వు కూడా వస్తుంది – లక్ష్యం ఏమిటి మరియు లక్షణాలు ఏమిటి! చేర్చాల్సింది తండ్రి వైపుకు, కానీ చేర్చేది తమ వైపుకు! ఇతర డివైన్ ఫాదర్స్ గురించి అంటారు కదా – వారు పై నుండి కిందికి తీసుకువస్తారు తప్ప పైకి తీసుకువెళ్ళరు అని; అలాంటి డివైన్ ఫాదర్స్‌గా మారకండి. బాప్‌దాదా చూస్తూ ఉన్నారు – అక్కడక్కడా పిల్లలు తిన్నని దారికి బదులుగా సందులలో చిక్కుకుపోతున్నారు. దారి మారిపోతుంది. అందుకే నడుస్తూ ఉంటారు కానీ గమ్యానికి సమీపంగా చేరుకోరు. కాబట్టి సత్యమైన సేవాధారి అని ఎవరిని అంటారో అర్థమైందా! ఈ మూడు శక్తులను లేదా విశేషతలను అనంతమైన దృష్టితో, అనంతమైన వృత్తితో సేవలో పెట్టండి. అచ్ఛా.

సదా దాత పిల్లలై దాతగా మారి ప్రతి ఆత్మను నిండుగా చేసేవారు, ప్రతి ఖజానాను సేవలో పెట్టి ప్రతి సమయం వృద్ధిని పొందేవారు, సదా తండ్రి ద్వారా లభించిన ప్రభువు కానుక అని భావించి ఇతరులకు కూడా ప్రభువు ప్రసాదాన్ని ఇచ్చేవారు, సదా ఒక్కరి వైపుకు సంకేతం చేసి ఏకరసంగా తీర్చిదిద్దేవారు – ఇలాంటి సదా మరియు సర్వుల సత్యమైన సేవాధారి పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో:- సదా మీ గుణమూర్తి ద్వారా గుణాల దానం ఇస్తూ ఉండండి. బలహీనులకు శక్తుల, గుణాల, జ్ఞాన దానం ఇస్తే సదా మహాదాని ఆత్మలుగా మారిపోతారు. దాత పిల్లలు ఇచ్చేవారు, తీసుకునేవారు కాదు. ఒకవేళ ‘వీరు ఇలా చేస్తే నేను చేస్తాను’ అని ఆలోచిస్తే తీసుకునేవారిగా అయిపోతారు; ‘నేను చేస్తాను’ అంటే ఇచ్చేవారిగా అవుతారు. కాబట్టి ‘లేవత’ (తీసుకునేవారు) కాదు, ‘దేవత’ (ఇచ్చేవారు) గా మారండి. ఏది లభించిందో అది ఇస్తూ వెళ్ళండి. ఎంత ఇస్తూ వెళ్తారో అంత పెరుగుతూ వెళ్తుంది. సదా దేవి అనగా ఇచ్చేవారు. అచ్ఛా!

*** ఓంశాంతి ***

Read in Other Languages

हहिंदी

Murli Topics

सच्चे सेवाधारी -True Sevadhari