"వర్తమాన జీవితం భవిష్యత్తుకు దర్పణం"
(మధుబన్ నివాసులతో)
ఈరోజు విశ్వ రచయిత అయిన తండ్రి తమ మాస్టర్ రచయిత పిల్లలను చూస్తున్నారు. మాస్టర్ రచయితలు తమ రచయిత అనే స్మృతిలో ఎంతవరకు స్థితులై ఉంటున్నారు! మీ అందరి రచయిత యొక్క విశేషమైన మొదటి రచన ఈ దేహం. ఈ దేహ రూప రచనకు రచయితలుగా ఎంతవరకు అయ్యారు? దేహ రూప రచన ఎప్పుడైనా తన వైపుకు రచయితను ఆకర్షించి రచయిత అనే భావనను విస్మరించేలా చేయడం లేదు కదా? యజమానిగా మారి ఈ రచనను సేవలో పెడుతూ ఉన్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అది యజమానిగా మారి చేయగలరా? మొట్టమొదట ఈ దేహానికి యజమానిగా ఉండే అభ్యాసమే ప్రకృతి యజమానిగా లేదా విశ్వ యజమానిగా తయారుచేయగలదు! ఒకవేళ దేహ యజమానితనంలో సంపూర్ణ సఫలత లేకపోతే విశ్వ యజమానితనంలో కూడా సంపన్నులుగా మారలేరు. వర్తమాన సమయపు ఈ జీవితం భవిష్యత్తుకు అద్దం. ఇదే అద్దం ద్వారా స్వయం భవిష్యత్తును స్పష్టంగా చూడగలరు. ముందుగా ఈ దేహ సంబంధాలు మరియు సంస్కారాలకు అధికారులుగా అయ్యే ఆధారంతోనే యజమానితనపు సంస్కారాలు ఏర్పడతాయి. సంబంధంలో అతీతంగా మరియు ప్రియంగా ఉండటం అనేది యజమానితనానికి నిదర్శనం. సంస్కారాలలో నిరాడంబరత మరియు నిర్మాణం అనే రెండు విశేషతలు యజమానితనానికి నిదర్శనాలు. కలిసి సర్వ ఆత్మల సంపర్కంలోకి రావడం, స్నేహీలుగా మారడం, హృదయపూర్వక స్నేహపు ఆశీర్వాదం అనగా శుభ భావన సర్వుల అంతరంగం నుండి ఆ ఆత్మ పట్ల వెలువడాలి. తెలిసినా తెలియకపోయినా, దూరపు సంబంధం లేదా సంపర్కం అయినప్పటికీ, ఎవరు చూసినా స్నేహం కారణంగా ‘వీరు మనవారు’ అనే అనుభవమే చేసుకోవాలి; స్నేహపు గుర్తింపుతో ఆత్మీయతను అనుభవం చేసుకోవాలి. సంబంధం దూరమైనది అయినప్పటికీ స్నేహ సంపన్నతను అనుభవం చేయించాలి. విశ్వ యజమాని లేదా దేహ యజమానితనపు అభ్యాసి ఆత్మలకు ఈ విశేషత కూడా అనుభవంలోకి వస్తుంది – వారు ఎవరి సంపర్కంలోకి వచ్చినా ఆ వ్యక్తికి ఆ విశేష ఆత్మ నుండి దాతృత్వపు అనుభూతి కలుగుతుంది. వీరు తీసుకునేవారని ఎవరి సంకల్పంలోకి కూడా రాలేదు. ఆ ఆత్మ నుండి సుఖం, దాతృత్వం లేదా శాంతి, ప్రేమ, ఆనందం, సంతోషం, సహయోగం, ధైర్యం, ఉత్సాహం, ఉల్లాసం – ఏదో ఒక విశేషత యొక్క దాతృత్వపు అనుభూతి కలుగుతుంది. సదా విశాల బుద్ధి మరియు విశాల హృదయం, దీనినే మీరు విశాల హృదయులు అని అంటారు, అలాంటి అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఈ నిదర్శనాలతో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి – ఏమి కాబోతున్నారు అని? అద్దం అయితే అందరి వద్ద ఉంది కదా? మిమ్మల్ని మీరు ఎంతగా తెలుసుకోగలరో అంతగా ఇతరులు తెలుసుకోలేరు. కాబట్టి స్వయాన్ని తెలుసుకోండి. అచ్ఛా.
ఈరోజు అయితే కలవడానికి వచ్చాము. అయినప్పటికీ అందరూ వచ్చారు కాబట్టి బాప్‌దాదా కూడా పిల్లలందరి పట్ల స్నేహంతో పాటు రిగార్డ్ కూడా ఉంచాల్సి ఉంటుంది, అందుకే ఆత్మిక సంభాషణ చేసారు. మధుబన్ వారు తమ అధికారాన్ని వదలరు, అయినా సమీపంలో కూర్చున్నారు. ఎన్నో విషయాల నుండి నిశ్చింతగా కూర్చున్నారు. బయట ఉండేవారు అయినా శ్రమ పడాల్సి వస్తుంది. సంపాదించడం మరియు తినడం అనేది తక్కువ శ్రమ కాదు. మధుబన్‌లో సంపాదించే చింత అయితే లేదు కదా. బాప్‌దాదాకు తెలుసు – ప్రవృత్తిలో ఉండేవారు సహించాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది, హంసలు కొంగల మధ్య ఉండి తమ ఉన్నతిని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ మీరందరూ ఎన్నో విషయాల నుండి స్వతహాగానే అతీతంగా ఉన్నారు. హాయిగా ఉంటున్నారు, హాయిగా తింటున్నారు మరియు విశ్రాంతి తీసుకుంటున్నారు. బయట ఆఫీసులకు వెళ్ళేవారు పగటిపూట విశ్రాంతి తీసుకుంటారా ఏమిటి? ఇక్కడైతే శరీరానికి కూడా విశ్రాంతి మరియు బుద్ధికి కూడా విశ్రాంతి. కాబట్టి మధుబన్ నివాసుల స్థితి అందరికంటే నంబర్‌వన్ అయిపోయింది కదా. ఎందుకంటే ఒకే పని ఉంది. చదువుకున్నా తండ్రే చదివిస్తున్నారు, సేవ చేసినా యజ్ఞ సేవే. అనంతమైన తండ్రి యొక్క అనంతమైన ఇల్లు ఇది. ఒకే మాట, ఒకే లక్ష్యం, ఇంకేమీ లేదు. ‘నా సెంటర్’ అనేది కూడా లేదు. కేవలం ‘నా ఛార్జ్’ అనేది ఉండకూడదు. మధుబన్ నివాసులకు ఎన్నో విషయాలలో సహజ పురుషార్థం మరియు సహజ ప్రాప్తి ఉన్నాయి. అచ్ఛా, మధుబన్ వారందరూ గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ కూడా తయారుచేసారు కదా. ఫంక్షన్ది కాదు, దాని ఫోల్డర్స్ మొదలైనవి అయితే ముద్రించబడ్డాయి. అది విశ్వ సేవకు సంబంధించినది అయింది. స్వయం పట్ల ఏ ప్లాన్ తయారుచేసారు? స్వయం స్టేజీ పైన ఏ పాత్ర పోషిస్తారు? ఆ స్టేజీకి అయితే స్పీకర్స్, ప్రోగ్రామ్ కూడా తయారుచేసుకుంటారు. స్వయం స్టేజీకి ఏ ప్రోగ్రామ్ తయారుచేసారు? ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కాబట్టి మధుబన్ నివాసులే కదా. ఏ ఫంక్షన్ జరిగినా ఏం చేస్తారు? (దీపం వెలిగిస్తారు) మరి గోల్డెన్ జూబ్లీ దీపాన్ని ఎవరు వెలిగిస్తారు? ప్రతి విషయాన్ని ఎవరు ఆరంభిస్తారు? మధుబన్ నివాసులలో ధైర్యం ఉంది, ఉల్లాసం కూడా ఉంది, వాతావరణం కూడా ఉంది, అన్ని సహాయాలు ఉన్నాయి. ఎక్కడైతే సర్వుల సహయోగం ఉంటుందో అక్కడ అన్నీ సహజమే. కేవలం ఒక్క పని చేయాల్సి ఉంటుంది. అది ఏమిటి?
బాప్‌దాదా పిల్లలందరిలో ఇదే శ్రేష్ఠ ఆశను ఉంచుతారు – ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా మారాలని. సంతృప్తిగా ఉండటం మరియు సంతృప్తి పరచడం ఇదే విశేషత. మొదటి ముఖ్య విషయం ఏమిటంటే – స్వయంతో అనగా తమ పురుషార్థంతో, తమ స్వభావ సంస్కారాలతో, తండ్రిని ఎదురుగా ఉంచుకుని సంతృప్తిగా ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. అవును నేను యథాశక్తి ప్రకారం సంతృప్తిగా ఉన్నాను అంటే అది వేరే విషయం. కానీ వాస్తవిక స్వరూపం ప్రకారం స్వయంతో సంతృప్తిగా ఉండటం మరియు ఆ తర్వాత ఇతరులను సంతృప్తి పరచడం – ఈ సంతుష్టతే మహోన్నత. ఇతరులు కూడా ‘వీరు యథార్థ రూపంలో సంతృప్తిగా ఉన్న ఆత్మ’ అని అనుభూతి చెందాలి. సంతుష్టతలో సమస్తం వచ్చేస్తుంది. డిస్టర్బ్ కాకూడదు మరియు డిస్టర్బ్ చేయకూడదు, దీనినే సంతుష్టత అంటాము. డిస్టర్బ్ చేసేవారు చాలామంది ఉంటారు కానీ స్వయం డిస్టర్బ్ కాకూడదు. అగ్ని సెగ నుండి స్వయాన్ని స్వయంగానే దూరం చేసుకుని సురక్షితంగా ఉండాలి. ఇతరులను చూడకూడదు. స్వయాన్ని చూసుకోవాలి – నేను ఏం చేయాలి! నేను నిమిత్తమై ఇతరులకు శుభ భావన మరియు శుభ కామనల సహయోగం ఇవ్వాలి. ఇది విశేష ధారణ, ఇందులో సమస్తం వచ్చేస్తుంది. దీని గోల్డెన్ జూబ్లీ అయితే జరుపుకోవచ్చు కదా! నిమిత్తంగా మధుబన్ వారి కోసం చెబుతున్నాము కానీ ఇది అందరి పట్ల ఉన్నది. మోహజీత్ కథ విన్నారు కదా. అలాంటి సంతుష్టత కథను తయారుచేయండి. ఎవరి వద్దకైనా ఎవరు వెళ్ళినా, ఎంత క్రాస్ ఎగ్జామిన్ చేసినా సరే, అందరి నోటి నుండి, అందరి మనస్సు నుండి సంతుష్టత విశేషత అనుభవమవ్వాలి. ‘వీరు ఇలాంటివారు’ అని కాదు, ‘నేను ఎలా మారి ఇతరులను మార్చాలి’ అని ఆలోచించాలి. అంతే, ఈ చిన్న విషయాన్ని స్టేజీ పైన చూపించండి. అచ్ఛా!
దాదీలతో:-
బాప్‌దాదా వద్దకు మీ అందరి హృదయ సంకల్పాలు చేరుతూనే ఉంటాయి. ఇంతమంది శ్రేష్ఠ ఆత్మల శ్రేష్ఠ సంకల్పాలు ఉన్నాయి కాబట్టి సాకార రూపంలో జరిగి తీరాల్సిందే. ప్లాన్స్ అయితే చాలా బాగా తయారుచేసారు. మరియు ఈ ప్లాన్లే అందరినీ ప్లేన్‌గా (సరళంగా) తయారుచేస్తాయి. సమస్త విశ్వంలో విశేష ఆత్మల శక్తి అయితే ఒక్కటే ఉంది. ఇంకెక్కడా కూడా ఇలాంటి విశేష ఆత్మల సంగఠన లేదు. ఇక్కడ సంగఠన శక్తి విశేషంగా ఉంది. అందుకే ఈ సంగఠన పైన అందరి విశేష దృష్టి ఉంది. అందరూ తడబడుతున్నారు. గద్దెలు కదులుతున్నాయి. మరియు ఇది రాజ్య గద్దెగా తయారవుతోంది. ఇక్కడ గురువు గద్దె లేదు, అందుకే కదలదు. స్వరాజ్యపు లేదా విశ్వ రాజ్యపు గద్దె ఇది. అందరూ కదిలించడానికి ప్రయత్నిస్తారు కూడా, కానీ సంగఠన శక్తి దీనికి విశేష రక్షణ. అక్కడ ఒక్కొక్కరిని వేరు చేసి యూనిటీని డిస్యూనిటీగా మార్చి ఆ తర్వాత కదిలిస్తారు. ఇక్కడ సంగఠన శక్తి కారణంగా కదిలించలేరు. కాబట్టి ఈ సంగఠన శక్తి విశేషతను సదా ఇంకా ముందుకు నడిపిస్తూ సాగండి. ఈ సంగఠనే కోట, అందుకే దాడి చేయలేరు. విజయం అయితే జరిగి ఉంది, కేవలం రిపీట్ చేయాలి. ఎవరైతే రిపీట్ చేయడంలో తెలివైనవారిగా మారతారో వారే విజయులై స్టేజీ పైన ప్రసిద్ధులవుతారు. సంగఠన శక్తే విజయానికి విశేష ఆధార స్వరూపం. ఈ సంగఠనే సేవా వృద్ధిలో సఫలతను పొందేలా చేసింది. పాలనకు ప్రతిఫలాన్ని దాదీలు బాగా ఇచ్చారు. సంగఠన శక్తికి ఆధారం ఏమిటి? కేవలం ఈ పాఠం పక్కాగా అయిపోవాలి – రిగార్డ్ ఇవ్వడమే రిగార్డ్ తీసుకోవడం. ఇవ్వడమే తీసుకోవడం, తీసుకోవడం తీసుకోవడం కాదు. తీసుకోవడం అనగా పోగొట్టుకోవడం. ఇవ్వడం అనగా తీసుకోవడం. ఎవరైనా ఇస్తే ఇద్దాము అనడానికి ఇది వ్యాపారం కాదు. ఇది దాతగా మారే విషయం. దాత తీసుకుని ఆ తర్వాత ఇవ్వరు, వారు ఇస్తూనే వెళ్తారు; అందుకే ఈ సంగఠనకు సఫలత ఉంది. కానీ ప్రస్తుతం కంకణం తయారైంది, మాల తయారవ్వలేదు. వృద్ధి లేకపోతే ఎవరిపై రాజ్యం చేస్తారు! ప్రస్తుతమైతే వృద్ధి లిస్టులో కొరత ఉంది. 9 లక్షల మందే తయారవ్వలేదు. ఏదో ఒక విధితో కలుస్తారు అయితే తప్పకుండా కదా. విధి మారుతూ ఉంటుంది. మొదట సాకారంలో కలిసారు మరియు ఇప్పుడు అవ్యక్తంలో కలుస్తున్నారు. విధి మారింది కదా. ముందుముందు కూడా విధి మారుతూనే ఉంటుంది. వృద్ధికి తగినట్లుగా కలిసే విధి కూడా మారుతూనే ఉంటుంది. అచ్ఛా.
ప్రశ్న:- ఆత్మికతలో తగ్గుదల రావడానికి కారణం ఏమిటి?
జవాబు:- స్వయాన్ని లేదా ఎవరికైతే సేవ చేస్తారో వారిని అమానతుగా భావించరు. అమానతుగా భావించడం వల్ల అనాసక్తంగా ఉంటారు మరియు అనాసక్తంగా మారడం వల్లనే ఆత్మికత వస్తుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
