Brahma Kumaris
Brahma KumarisMurli
  • Home
  • Murli Search
  • Murli Topics
  • Murli Chintan
  • AI Murli Chintan (ChatGPT)
Languages
  • EEnglish
  • हहिंदी
  • ગગુજરાતી
  • తతెలుగు
Library
  • Overview
    • Favorites
    • Notes & Highlights
    • Collections
    • Tracker
  • Settings
  • BKOne

20 November 1985 | తెలుగు20 November 1985 | తెలుగు · ‘‘సంగమయగ బ్రాహ్మణుల అతీతమైన, ప్రియమైన, శ్రేష్ఠ ప్రపంచము’’

‘‘సంగమయగ బ్రాహ్మణుల అతీతమైన, ప్రియమైన, శ్రేష్ఠ ప్రపంచము’’

ఈరోజు బ్రాహ్మణుల రచయిత అయిన తండ్రి తన చిన్న అలౌకిక సుందరమైన ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ బ్రాహ్మణుల ప్రపంచము, సత్యయుగ ప్రపంచం కంటే అతి అతీతమైనది మరియు అతి ప్రియమైనది. ఈ అలౌకిక ప్రపంచంలోని బ్రాహ్మణ ఆత్మలు ఎంతో శ్రేష్ఠమైనవారు, విశేషమైనవారు. దేవతా రూపం కంటే బ్రాహ్మణ స్వరూపం విశేషమైనది. ఈ ప్రపంచానికి మహిమా ఉంది, అతీతత్వమూ ఉంది. ఈ ప్రపంచంలోని ప్రతి ఆత్మ విశేషమైనది. ప్రతి ఆత్మ స్వరాజ్య అధికారీ రాజు. ప్రతి ఆత్మ స్మృతి అనే తిలకధారులు, అవినాశి తిలకధారులు, స్వరాజ్య తిలకధారులు, పరమాత్మ హృదయ సింహాసనాధికారులు. కావున ఆత్మలందరూ ఈ సుందర ప్రపంచానికి కిరీటము, సింహాసనము మరియు తిలకధారులు. ఇలాంటి ప్రపంచాన్ని మొత్తం కల్పములో ఎప్పుడైనా విన్నారా, చూసారా! ఈ ప్రపంచంలోని ప్రతి బ్రాహ్మణ ఆత్మకు ఒకే తండ్రి, ఒకే పరివారము, ఒకే భాష, ఒకే నాలెడ్జ్ అనగా జ్ఞానము, జీవితంలో శ్రేష్ఠమైన లక్ష్యమూ ఒక్కటే, ఒకే వృత్తి, ఒకే దృష్టి, ఒకే ధర్మము మరియు ఒకే ఈశ్వరీయ కర్మ ఉంది. ఇలాంటి ప్రపంచము ఎంత చిన్నదో అంత ప్రియమైనది. ఇలా బ్రాహ్మణ ఆత్మలందరూ మనసులో మా చిన్న ప్రపంచము అతి అతీతమైనది, అతి ప్రియమైనది అనే పాడ్తున్నారా? ఈ సంగమయుగ ప్రపంచమును చూసి చూసి సంతోషిస్తున్నారా? ఎంత అతీతమైన ప్రపంచము! ఈ ప్రపంచములోని దినచర్యయే అతీతమైనది. తమ రాజ్యము, తమ నియమాలు, తమ సాంప్రదాయము - పద్ధతులు, కాని పద్ధతులు కూడా అతీతమైనవి. ప్రీతి కూడా ప్రియమైనది. మీరు ఇలాంటి ప్రపంచంలో ఉండే బ్రాహ్మణ ఆత్మలు కదా! ఇదే ప్రపంచంలో ఉంటున్నారు కదా? అప్పుడప్పుడు తమ ప్రపంచాన్ని వదిలి పాత ప్రపంచంలోకి అయితే వెళ్లిపోవడం లేదు కదా! అందువలన పాత ప్రపంచంలోని మనుష్యులు చివరకు ఈ బ్రాహ్మణులు అంటే ఎవరో అర్థం చేసుకోలేరు! బ్రహ్మాకుమారీల నడవడిక వారిదే, జ్ఞానము వారిదే అని అంటారు కదా! వారి ప్రపంచమే అతీతము అయినప్పుడు అన్నీ కొత్తవిగా, అతీతంగానే ఉంటాయి కదా! అందరూ తమను తాము చూసుకోండి - కొత్త ప్రపంచము యొక్క కొత్త సంకల్పాలు, కొత్త భాష, కొత్త కర్మలు ఇలా అతీతంగా అయ్యామా? ఏ పాత వ్యవహారమూ మిగిలిపోలేదు కదా! కొంచెం పాతదనం ఉన్నా అది పాత ప్రపంచం వైపు ఆకర్షిస్తుంది అంతేకాక ఉన్నతమైన ప్రపంచము నుండి క్రింది ప్రపంచములోకి వెళ్లిపోతారు. ఉన్నతము అనగా శ్రేష్ఠంగా ఉన్న కారణంగా స్వర్గాన్ని పైన చూపిస్తారు మరియు నరకాన్ని క్రింద చూపిస్తారు. సంగమయుగ స్వర్గము సత్యయుగ స్వర్గము కంటే ఉన్నతమైనది. ఎందుకంటే ఇప్పుడు రెండు ప్రపంచాల జ్ఞానవంతులుగా అయ్యారు. ఇక్కడ ఇప్పుడు చూస్తూనే, తెలుసుకుంటూనే అతీతంగా మరియు ప్రియంగా అయ్యారు. అందువలన మధువనాన్ని స్వర్గంగా అనుభవం చేస్తారు. స్వర్గము చూడాలనుకుంటే ఇప్పుడే చూడండి అని చెప్తారు కదా. అక్కడ స్వర్గాన్ని వర్ణన చెయ్యరు. ఇప్పుడు మేము స్వర్గాన్ని చూసామని నషాతో చెప్తారు. స్వర్గము చూడాలనుకుంటే ఇక్కడకు వచ్చి చూడండి అని ఛాలెంజ్ చేస్తారు. ఇలా వర్ణన చేస్తారు కదా! ఇంతకుముందు స్వర్గములోని దేవకన్యలు చాలా సుందరంగా ఉంటారని వినేవారు, అనుకునేవారు కానీ ఎవ్వరూ చూడలేదు. స్వర్గములో ఫలానా, ఫలానా ఉంటాయని చాలా విన్నారు కానీ ఇప్పుడు స్వయం స్వర్గ ప్రపంచంలోకి చేరుకున్నారు. స్వయం మీరే స్వర్గములోని ఫరిశ్తాలుగా అయ్యారు. నల్లగా ఉన్నవారు తెల్లగా అయ్యారు కదా! రెక్కలు లభించాయి కదా! ఇటువంటి అతీతమైన జ్ఞాన-యోగాల రెక్కలు లభించాయి. ఈ రెక్కలతో మూడు లోకాలను భ్రమణము చెయ్యగలరు. సైన్సు వారి వద్ద కూడా ఇలాంటి తీవ్ర వేగంతో వెళ్లే సాధనము లేదు. అందరికి రెక్కలు లభించాయా? ఎవ్వరూ మిగిలిపోలేదు కదా. ఈ ప్రపంచము గురించిన గాయనమే - బ్రాహ్మణుల ప్రపంచములో అప్రాప్తి వస్తువు లేనే లేదు. అందువలన ఒక్క తండ్రి లభించారు, అన్నీ లభించాయి అని మహిమ ఉంది. ఒక్క ప్రపంచానికే కాదు, మూడు లోకాలకు యజమానులుగా అవుతారు. ఈ ప్రపంచానికి గల మహిమ ఏమంటే - సదా అందరూ ఊయలలో ఊగుతూ ఉంటారు. ఊయలలో ఊగడం భాగ్యానికి గుర్తు అని అంటారు. ఈ ప్రపంచానికి గల విశేషత ఏమిటి? అప్పుడప్పుడు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతారు, అప్పుడప్పుడు సంతోషమనే ఊయలలో ఊగుతారు, అప్పుడప్పుడు శాంతి ఊయలలో, అప్పుడప్పుడు జ్ఞాన ఊయలలో ఊగుతారు. పరమాత్మ ఒడి అనే ఊయలలో ఊగుతారు. పరమాత్మ ఒడి అంటే - స్మృతిలో అనుభవించే లవలీన స్థితిలో ఊగడము. ఎలాగైతే ఒడిలో ఇమిడి పోతారో అలా పరమాత్మ స్మృతిలో ఇమిడిపోతారు, లవలీనమవుతారు. ఈ అలౌకిక ఒడి సెకండులో అనేక జన్మల బాధను, దుఃఖాన్ని మరపింపజేస్తుంది. ఇలా అందరూ ఊయలలో ఊగుతూ ఉన్నారా?

ఇలాంటి ప్రపంచానికి అధికారిగా అవుతామని ఎప్పుడైనా స్వప్నంలో అయినా అనుకున్నారా! బాప్‌దాదా ఈరోజు తన ప్రియమైన ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ ప్రపంచము ఇష్టంగా ఉందా! ప్రియంగా అనిపిస్తుందా? అప్పుడప్పుడు ఒక పాదము ఆ ప్రపంచములో, ఒక పాదము ఈ ప్రపంచములో అయితే ఉంచడం లేదు కదా! 63 జన్మలు ఆ ప్రపంచాన్ని చూసారు, అనుభవం చేసారు, ఏం లభించింది? ఏమైనా లభించిందా లేక పోగొట్టుకున్నారా? శరీరాన్నీ పోగొట్టుకున్నారు, మానసిక సుఖ-శాంతులనూ పోగొట్టుకున్నారు, ధనం కూడా పోగొట్టుకున్నారు, సంబంధాలు కూడా పోగొట్టుకున్నారు. తండ్రి ఇచ్చిన సుందరమైన శరీరాన్ని ఎక్కడ పోగొట్టుకున్నారు? ఒకవేళ ధనాన్ని ప్రోగు చేసినా అది కూడా నల్ల ధనమే. స్వచ్ఛమైన ధనం ఎక్కడకు పోయింది? ఒకవేళ ఉన్నా పనికి రాకుండా ఉంది. చెప్పడానికి కోటీశ్వరులు కానీ చూపించగలరా? అంతా పోగొట్టుకున్నారు. అయినా ఒకవేళ బుద్ధి అటువైపుకు వెళ్తే ఏమంటారు? తెలివిగలవారని అంటారా? అందువలన మీ శ్రేష్ఠ ప్రపంచాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఈ ప్రపంచములోని, ఈ జీవితంలోని విశేషతలను సదా స్మృతిలో ఉంచుకొని సమర్థులుగా అవ్వండి. స్మృతి స్వరూపులుగా అయినట్లయితే స్వతహాగానే నిర్మోహులుగా అవుతారు. పాత ప్రపంచములోని ఏ వస్తువునూ బుద్ధితో స్వీకరించకండి. స్వీకరించడం అనగా మోసపోవడం. మోసపోవడం అనగా దుఃఖపడడం. కావున ఎక్కడ ఉండాలి? శ్రేష్ఠమైన ప్రపంచంలోనా లేక పాత ప్రపంచంలోనా? సదా అది ఏమిటి, ఇది ఏమిటి అనే తేడాను స్పష్టంగా ప్రత్యక్ష రూపంలో ఉంచుకోండి. అచ్ఛా.

ఇటువంటి చిన్నదైన, ప్రియమైన ప్రపంచములో ఉండే విశేష బ్రాహ్మణ ఆత్మలకు, సదా సింహాసనాధికారి ఆత్మలకు, సదా ఊయలలో ఊగే ఆత్మలకు, సదా అతీతంగా మరియు పరమాత్మకు ప్రియంగా ఉన్న పిల్లలకు పరమాత్మ స్మృతి, పరమాత్మ ప్రేమ మరియు నమస్తే.

సేవాధారి సోదరీలతో (టీచర్స్) :- సేవాధారి అనగా త్యాగి, తపస్వి ఆత్మలు. సేవకు ఫలము సదా లభిస్తూనే ఉంటుంది. కానీ త్యాగము మరియు తపస్సుతో సదా ముందుకు వెళ్తూ ఉంటారు. సదా స్వయాన్ని విశేష ఆత్మలుగా భావించి విశేష సేవకు ఋజువును ఇవ్వాలి. లక్ష్యము ఎంత దృఢంగా ఉంటే అంత బిల్డింగ్ కూడా మంచిగా తయారవుతుంది - దీనిని లక్ష్యంగా ఉంచుకోండి. సదా సేవాధారిగా భావించి ముందుకు వెళ్లండి. ఎలాగైతే తండ్రి మిమ్ములను ఎన్నుకున్నారో, అలా మీరు మీ ప్రజలను ఎన్నుకోండి. స్వయం సదా నిర్విఘ్నంగా అయ్యి సేవను కూడా సదా నిర్విఘ్నంగా చేసుకుంటూ వెళ్లండి. సేవ అయితే అందరూ చేస్తారు కానీ నిర్విఘ్న సేవ ఉండాలి. ఇందులోనే నెంబరు లభిస్తుంది. ఎక్కడ ఉన్నా అక్కడ ప్రతి విద్యార్థి నిర్విఘ్నంగా ఉండాలి. విఘ్నాల అల ఉండరాదు. శక్తిశాలి వాతావరణము ఉండాలి. వీరినే నిర్విఘ్న ఆత్మలని అంటారు. ఇదే లక్ష్యము ఉంచుకోండి. ఎలాంటి స్మృతి వాతావరణము ఉండాలంటే ఏ విఘ్నాలు రాకూడదు. కోట ఉంటే శత్రువు రాలేడు. కావున నిర్విఘ్నంగా అయ్యి నిర్విఘ్న సేవాధారులుగా అవ్వండి. అచ్ఛా.

విశ్వంలోని రాజకీయ నాయకుల పట్ల అవ్యక్త బాప్‌దాదా మధుర సందేశము:- విశ్వంలోని ప్రతి రాజకీయ నాయకుడు తన దేశాన్ని లేక దేశవాసులను అభివృద్ధి వైపుకు తీసుకెళ్లాలనే శుభ భావన, శుభ కామనతో తమ తమ కార్యములో నిమగ్నమై ఉన్నారు. భావన చాలా శ్రేష్ఠంగా ఉంది కానీ ప్రత్యక్ష ప్రమాణము ఎంత కోరుకుంటారో అంత రావడం లేదు - ఎందుకు? ఎందుకంటే ఈ రోజులలో మనుష్యులు లేక చాలామంది నాయకుల మనోభావనలు సేవా భావము, ప్రేమ భావానికి బదులు స్వార్థ భావము, ఈర్ష్యా భావములోకి మారిపోయాయి. అందువలన ఈ పునాదిని సమాప్తి చేసేందుకు ప్రాకృతిక శక్తి, వైజ్ఞానిక శక్తి, ప్రాపంచిక జ్ఞాన శక్తి, రాజ్య అథారిటీ శక్తి - వీటి ద్వారా అయితే ప్రయత్నాలు చేసారు. కానీ అందుకు వాస్తవిక సాధనము ఆధ్యాత్మిక శక్తి. దీనితోనే మానసిక భావనలు సహజంగా మారిపోగలవు. అటువైపు అటెన్షన్ తక్కువగా ఉంది. అందువలన మారిపోయిన భావనల బీజము సమాప్తమవ్వడం లేదు. కొంత సమయం వరకు అణచిపెట్టబడ్తుంది, కానీ సమయ ప్రమాణంగా ఇంకా ఉగ్ర రూపంలో ప్రత్యక్షమవుతుంది. అందువలన ఆధ్యాత్మిక తండ్రికి చెందిన ఆధ్యాత్మిక పిల్లలైన ఆత్మల పట్ల సందేశము - సదా స్వయాన్ని శక్తిగా(ఆత్మగా) భావించి, ఆధ్యాత్మిక తండ్రితో సంబంధాన్ని జోడించి, ఆధ్యాత్మిక శక్తిని తీసుకుని మీ మనసుకు నాయకులుగా అవ్వండి. అప్పుడు రాజకీయ నాయకులుగా అయ్యి ఇతరుల మానసిక భావనలను మార్చగలరు. అప్పుడు మానసిక సంకల్పము మరియు జనుల ప్రత్యక్ష కర్మ ఒక్కటిగా అవుతాయి. ఇరువురి సహయోగముతో సఫలతకు ప్రత్యక్ష ప్రమాణము అనుభవం అవుతుంది. ఆత్మిక నియంత్రణ గల అధికారులే సదా యోగ్య రాజకీయ నాయకుల పాలనా అధికారిగా అవ్వగలరు. అంతేకాక స్వరాజ్యము మీ ఆధ్యాత్మిక తండ్రి ఇచ్చిన జన్మ సిద్ధ అధికారము. ఈ జన్మ సిద్ధ అధికార శక్తితో సదా ధార్మిక శక్తిని కూడా అనుభవం చేస్తారు, అంతేకాక సఫలంగా ఉంటారు. అచ్ఛా!

*** ఓంశాంతి ***

Read in Other Languages

EEnglishहहिंदी
18 Nov 1985Prev25 Nov 1985Next
HomeSearchBKOneLibrarySettings