"మధురత ద్వారా చేదు ధరణిని కూడా మధురంగా తయారు చేయండి"
(క్రిస్మస్ డే)
ఈరోజు అతి పెద్ద తండ్రి, గ్రాండ్ ఫాదర్ తమ గ్రాండ్ చిల్డ్రెన్, లవ్లీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బ్రహ్మాకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే మహిమ ఉంది. నిరాకారుడైన తండ్రి సాకార సృష్టి యొక్క రచనకు బ్రహ్మాను నిమిత్తంగా చేశారు. మనుష్య సృష్టికి రచయిత అయిన కారణంగా మనుష్య సృష్టి యొక్క స్మృతి చిహ్నాన్ని వృక్షం రూపంలో చూపించారు. బీజము గుప్తంగా ఉంటుంది, మొదట రెండు ఆకులు వస్తాయి, వీటి ద్వారా కాండం వెలువడ్తుంది. వారే వృక్షానికి ఆదిదేవుడు మరియు ఆదిదేవి, మాత-పితల స్వరూపంలో వృక్షమునకు పునాదిగా బ్రహ్మా నిమిత్తంగా అవుతారు. వారి ద్వారా బ్రాహ్మణుల కాండము ప్రకటితమవుతుంది మరియు బ్రాహ్మణుల కాండము నుండి అనేక శాఖలు ఉత్పన్నమవుతాయి, అందువలన బ్రహ్మాకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే గాయనముంది. బ్రహ్మా అవతరణ జరగడం అనగా చెడ్డ రోజులు సమాప్తమై గొప్ప రోజులు ప్రారంభమవ్వడం. రాత్రి సమాప్తమై బ్రహ్మా ముహూర్తము ప్రారంభమవుతుంది. వాస్తవానికి బ్రహ్మా ముహూర్తము కానీ పలికేటప్పుడు బ్రహ్మ ముహూర్తము అని అంటారు, అందువలన బ్రహ్మాను వృద్ధునిగా చూపిస్తారు. గ్రాండ్ ఫాదర్ నిరాకారుడైన తండ్రి, గ్రాండ్ చిల్డ్రన్కు (మనుమలకు) ఎన్ని బహుమతులిస్తారంటే 21 జన్మల వరకు తింటూనే ఉంటారు. వారు దాత మరియు విధాత కూడా. జ్ఞాన రత్నాలతో పళ్ళాలను నింపి నింపి ఇస్తారు. శక్తుల యొక్క బంగారు కానుకను లెక్కలేనన్ని స్వరూపాలలో ఇచ్చేస్తారు. గుణాల ఆభరణాలను పెట్టె నిండుగా వేసి ఇస్తారు. మీ వద్ద ఎన్ని అలంకారాల పెట్టెలు ఉన్నాయి! ప్రతిరోజూ కొత్తగా అలంకరించుకున్నా లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ కానుకలు సదా తోడుగా వస్తాయి. ఆ స్థూల కానుకలు అయితే ఇక్కడే ఉండిపోతాయి. కానీ ఇవి మీకు తోడుగా వస్తాయి. ఇన్ని ఈశ్వరీయ కానుకలతో ఎంత సంపన్నమవుతారంటే, ఇక సంపాదించాల్సిన అవసరమే ఉండదు. కానుకలతోనే తింటూ ఉంటారు. శ్రమ నుండి విడుదల అవుతారు.
అందరూ విశేషంగా క్రిస్మస్ డే జరుపుకునేందుకు వచ్చారు కదా! బాప్దాదా కిస్మిస్ డే అని అంటారు. కిస్మిస్ డే అనగా మధురత యొక్క రోజు. సదా మధురంగా అయ్యే రోజు. తీపినే ఎక్కువగా తింటూ మరియు తినిపిస్తూ ఉంటారు కదా! నోరైతే కొంత సమయం కొరకే తియ్యగా అవుతుంది, కానీ స్వయమే మధురంగా అయినట్లయితే, సదా నోట్లో మధురమైన మాటలు ఉంటాయి. ఎలాగైతే తీపిని తినడం మరియు తినిపించడంలో సంతోషిస్తారు కదా! అలా మధురమైన మాటలు స్వయాన్ని కూడా సంతోషపరుస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. కనుక దీనితో సదా అందరి నోటిని మధురంగా చేస్తూ ఉండండి. సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధరమైన కర్మలు. ఇదే కిస్మిస్ రోజును జరుపుకోవడం. జరుపుకోవడం అనగా తయారుచెయ్యడం. ఎవరికైనా రెండు ఘడియలు మధురమైన దృష్టిని ఇచ్చి, మధురమైన మాటలను మాట్లాడినట్లయితే ఆ ఆత్మను సదా కొరకు నిండుగా చేస్తారు. ఈ రెండు ఘడియల మధురమైన దృష్టి, మాటలు ఆ ఆత్మ యొక్క సృష్టిని మార్చేస్తాయి. ఈ రెండు మధురమైన మాటలు సదా కొరకు పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అవుతాయి. మధురత ఎటువంటి విశేష ధారణ అంటే ఇది చేదు భూమిని కూడా మధురంగా చేస్తుంది. మీ అందరినీ మార్చేందుకు ఆధారము తండ్రి యొక్క రెండు మధురమైన మాటలే కదా! మధురమైన పిల్లలూ, మీరు మధురమైన శుద్ధమైన ఆత్మలు. ఈ రెండు మధురమైన మాటలు మార్చేసాయి కదా! మధురమైన దృష్టి మార్చేసింది. ఇలానే మధురత ద్వారా ఇతరులను కూడా మధురంగా చేయండి. ఈ నోటిని మధురంగా చేయండి. అర్థమయిందా – క్రిస్మస్ డే ను జరుపుకున్నారు కదా! సదా ఈ కానుకలతో మీ ఒడిని నింపుకున్నారా? సదా మధురత అనే కానుకను తోడుగా ఉంచుకోండి. దీని ద్వారా సదా మధురంగా ఉండండి మరియు మధురంగా చెయ్యండి. అచ్ఛా.
సదా జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపి ఒడిని నింపుకునేవారు, సదా సర్వ శక్తులతో శక్తిశాలి ఆత్మలుగా అయి శక్తులతో సదా సంపన్నంగా అయ్యేవారు, సర్వ గుణాలనే ఆభరణాలతో సదా అలంకరింపబడిన శ్రేష్ఠ ఆత్మలకు, సదా మధురతతో నోటిని తీపిగా చేసే మధురమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
కుమారులతో అవ్యక్త బాప్దాదా మిలనము:-
1. కుమారులు అనగా తీవ్రగతితో ముందుకు వెళ్ళేవారు. ఆగడం-నడవడం, ఆగడం-నడవడం కాదు. ఎటువంటి పరిస్థితులైనా స్వయాన్ని సదా శక్తిశాలి ఆత్మగా భావించి ముందుకు వెళుతూ ఉండండి. పరిస్థితి లేక వాయుమండలం యొక్క ప్రభావంలోకి వచ్చేవారు కాదు, కానీ తమ శ్రేష్ఠ ప్రభావాన్ని ఇతరులపై వేసేవారు. శ్రేష్ఠమైన ప్రభావం అనగా ఆత్మిక ప్రభావము. వేరే ప్రభావము కాదు. ఇటువంటి కుమారులే కదా! పరీక్ష వస్తే కదిలేవారైతే కాదు. పరీక్షలో పాస్ అయ్యేవారే కదా! సదా ధైర్యశాలురే కదా! ఎక్కడ ధైర్యముంటుందో అక్కడ తండ్రి సహాయం ఉండనే ఉంటుంది. పిల్లలు ధైర్యము చేస్తే, తండ్రి సహాయము చేస్తారు. ప్రతి కార్యములో స్వయాన్ని ముందు పెట్టి ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తూ ఉండండి.
2. కుమారులంటేనే ఎగిరేకళ వారు. ఎవరైతే సదా నిర్బంధనులుగా ఉంటారో, వారే ఎగిరేకళలో ఉండేవారు. కావున మీరు నిర్బంధన కుమారులు కదా! మానసిక బంధనం కూడా లేదు. కనుక సదా బంధనాలను సమాప్తం చేసి నిర్బంధనులుగా అయి ఎగిరేకళలో ఉండే కుమారులే కదా? కుమారులు తమ శారీరిక శక్తిని, బుద్ధి యొక్క శక్తిని రెండింటినీ సఫలం చేస్తున్నారా? లౌకిక జీవితంలో తమ శారీరిక శక్తిని, బుద్ధి యొక్క శక్తిని వినాశన కార్యములో ఉపయోగిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు శ్రేష్ఠ కార్యములో ఉపయోగించేవారు. అలజడి చేసేవారు కాదు కానీ శాంతి స్థాపన చేసేవారు. ఇటువంటి శ్రేష్ఠ కుమారులే కదా? ఎప్పుడూ లౌకిక జీవితం యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవ్వడం లేదు కదా? అలౌకిక జీవితం వారు అనగా కొత్త జన్మ తీసుకున్నవారు. కనుక కొత్త జన్మలో పాత విషయాలు ఉండవు. మీరందరూ కొత్త జన్మ యొక్క శ్రేష్ఠమైన ఆత్మలు. ఎప్పుడూ స్వయాన్ని సాధారణంగా భావించకుండా శక్తిశాలిగా భావించండి. సంకల్పంలో కూడా అలజడిలోకి రాకూడదు. వ్యర్థ సంకల్పాలు వస్తే ఏం చెయ్యాలి అని అయితే ప్రశ్నించరు కదా? భాగ్యశాలి కుమారులు. 21 జన్మల భాగ్యాన్ని తింటూ ఉంటారు. స్థూల సంపాదన, సూక్ష్మ సంపాదన రెండింటి నుండి ముక్తులవుతారు. అచ్ఛా.
3. కుమార్ అనగా బలహీనతకు సదాకాలం కొరకు విడాకులు ఇచ్చేవారు. అర్థకల్పం కొరకు బలహీనతకు విడాకులు ఇచ్చేసారు కదా. లేక ఇంకా ఇవ్వలేదా? ఎవరైతే సదా సమర్థ ఆత్మలుగా ఉన్నారో వారి ఎదుటకు బలహీనత రాలేదు. సదా సమర్థంగా ఉండటం అనగా బలహీనతను సమాప్తం చేయడం. ఇలాంటి సమర్థ ఆత్మలు తండ్రికి కూడా ప్రియమైనవారు, పరివారానికి కూడా ప్రియమైనవారు. కుమార్ అనగా తమ ప్రతి కర్మ ద్వారా అనేకుల శ్రేష్ఠ కర్మల రేఖను గీసేవారు. స్వయం కర్మలు ఇతరుల కర్మ రేఖను నిర్మించడానికి నిమిత్తమైపోవాలి. ఇంతటి సేవాధారులు మీరు. కాబట్టి ప్రతి కర్మలోనూ ఇది చెక్ చేసుకోండి – ప్రతి కర్మ ఇతరులకు కూడా కర్మ రేఖ స్పష్టంగా కనిపించేంత స్పష్టంగా ఉందా అని. ఇలాంటి శ్రేష్ఠ కర్మల శ్రేష్ఠ ఖాతాను సదా జమ చేసుకునే విశేష ఆత్మలు – వీరినే సత్యమైన సేవాధారులు అంటాము. స్మృతి మరియు సేవ – ఇవే సదా ముందుకు సాగడానికి సాధనాలు. స్మృతి శక్తివంతంగా చేస్తుంది మరియు సేవ ఖజానాలతో సంపన్నంగా చేస్తుంది. స్మృతి మరియు సేవ ద్వారా ముందుకు సాగుతూ ఉండండి మరియు నడిపిస్తూ సాగండి.
టీచర్ అక్కయ్యలతో:-
టీచర్స్ సదా స్వస్థితి ద్వారా స్వయం కూడా ముందుకు సాగేవారు మరియు ఇతరులను కూడా ముందుకు నడిపించేవారు; ముందుకు సాగాలి మరియు నడిపించాలి – ఇదే టీచర్స్ యొక్క విశేష లక్ష్యం మరియు లక్షణం కూడా. సదా తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా మారి ముందుకు సాగుతూ మరియు నడిపిస్తూ సాగండి. త్యాగం ద్వారా భాగ్యాన్ని పొందే శ్రేష్ఠ ఆత్మలు మీరు, సదా త్యాగమే భాగ్యం. శ్రేష్ఠ భాగ్యం, శ్రేష్ఠ కర్మ మరియు శ్రేష్ఠ ఫలం... సదా ఈ ప్రత్యక్ష ఫలంతో స్వయాన్ని మరియు ఇతరులను ఎగురవేస్తూ సాగండి. ప్రతి కర్మలోనూ స్వయాన్ని నిమిత్తంగా భావించడమే శ్రేష్ఠంగా మారడానికి సహజ సాధనం. సేవాధారులుగా మారడం అనేది కూడా సంగమయుగంలో విశేష భాగ్యానికి నిదర్శనం. సేవ చేయడం అనగా జన్మజన్మల కొరకు సంపన్నులుగా మారడం, ఎందుకంటే సేవ ద్వారా జమ అవుతుంది మరియు జమ అయిన దానిని అనేక జన్మలు తింటూ ఉంటారు. సేవలో జమ అవుతుంది అనే ఈ స్మృతి ఉంటే సదా సంతోషంలో ఉంటారు. మరియు సంతోషం కారణంగా ఎన్నడూ అలసిపోరు. సేవ అలసట లేనివారిగా చేసేది, సంతోషపు అనుభవం కలిగించేది.
సేవాధారి అనగా తండ్రి సమానం. కాబట్టి సమానతను చెక్ చేసుకుంటూ తండ్రి సమానంగా మారి ఇతరులను కూడా తండ్రి సమానంగా చేస్తూ సాగండి. సెంటర్ వాతావరణాన్ని శక్తివంతంగా చేయడానికి ఒకటి-రెండు చక్కర్లు కొడుతూ శక్తివంతమైన స్మృతి అనుభూతుల ప్రోగ్రామ్ తయారుచేయండి. శక్తివంతమైన వాతావరణం ఎన్నో విషయాల నుండి స్వతహాగా దూరం చేస్తుంది. ఇప్పుడు స్వయం క్వాలిటీ కలవారిగా మారి క్వాలిటీ కలవారిగా తయారుచేస్తూ సాగండి. అచ్ఛా.
వీడ్కోలు సమయంలో ప్రియస్మృతులు:- దేశ విదేశాల పిల్లలందరి నుండి ఈ విశేషమైన రోజు సందర్భంగా కార్డులు, ఉత్తరాలు, స్మృతి కూడా లభించాయి. బాప్దాదా మధురాతి మధురమైన పిల్లలందరికీ ఈ గొప్ప రోజు సందర్భంగా సదా మధురత ద్వారా శ్రేష్ఠంగా అయి శ్రేష్ఠంగా చెయ్యండి అనే వరదానంతోపాటు స్వయం కూడా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ సేవను కూడా వృద్ధి చేస్తూ ఉండండి. పిల్లలందరికీ అతి పెద్ద తండ్రి యొక్క అతి గొప్ప ప్రియస్మృతులు మరియు స్నేహభరిత శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్. సదా మధురంగా అయ్యేందుకు అభినందనలు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
