‘‘విశ్వ సేవకు సహజ సాధనము - మనసా సేవ’’
ఈరోజు సర్వ శక్తివంతుడైన తండ్రి తమ శక్తి సేనను, పాండవ సేనను, ఆత్మిక సేనను చూస్తున్నారు. సైన్యములోని మహావీరులు తమ ఆత్మిక శక్తితో ఎంతవరకు విజయులుగా అయ్యారో చూస్తున్నారు. విశేషంగా మూడు శక్తులు చూస్తున్నారు. ప్రతి మహావీర్ ఆత్మ యొక్క మనసాశక్తి ఎంతవరకు స్వ పరివర్తన పట్ల, సేవ పట్ల ధారణ అయ్యింది? అలాగే వాచా శక్తి, కర్మణా శక్తి అనగా శ్రేష్ఠ కర్మల శక్తి ఎంతవరకు జమ చేసుకున్నారు? విజయీ రత్నాలుగా అయ్యేందుకు ఈ మూడు శక్తులు అవసరము. మూడింటిలో ఏ ఒక్క శక్తి తక్కువైనా వర్తమాన ప్రాప్తి మరియు ప్రాలబ్ధము తగ్గిపోతుంది. విజయీ రత్నాలనగా మూడు శక్తులతో సంపన్నమైనవారు. విశ్వ సేవాధారి నుండి విశ్వ రాజ్యధికారులుగా అయ్యేందుకు ఆధారము - ఈ మూడు శక్తుల సంపన్నత. సేవాధారులుగా అవ్వడం, విశ్వ సేవాధారులుగా అవ్వడం, విశ్వ రాజులుగా అవ్వడం, సత్యయుగంలో రాజులుగా అవ్వడం - ఇందులో కూడా వ్యత్యాసముంది. సేవాధారులు అనేకమంది ఉన్నారు, విశ్వ సేవాధారులు కొద్దిమందే ఉన్నారు. సేవాధారులనగా మూడు శక్తులను నంబర్‌వార్ యథాశక్తి ధారణ చేసినవారు. విశ్వ సేవాధారులనగా మూడు శక్తులలో సంపన్నంగా ఉండేవారు. ఈరోజు ప్రతి ఒక్కరి మూడు శక్తులలో పర్సెంటేజ్(శాతము) చూస్తున్నాము.
సర్వ శ్రేష్ఠమైన మనసా శక్తి ద్వారా, ఆత్మ సన్ముఖములో ఉన్నా, సమీపంగా ఉన్నా లేక ఎంత దూరములో ఉన్నా - ఆ ఆత్మకు ఒక సెకండులో ప్రాప్తి యొక్క శక్తిని అనుభూతి చేయించగలరు. మనసాశక్తి ఆత్మల మానసిక ఆందోళనకర స్థితిని కూడా అచలంగా చేయగలదు. మానసిక శక్తి అనగా శుభ భావన, శ్రేష్ఠ కామన. ఈ శ్రేష్ఠ భావన ద్వారా ఏ ఆత్మలనైనా సంశయబుద్ధి గలవారి నుండి భావనాత్మక బుద్ధి గలవారిగా చేయగలరు. ఈ శ్రేష్ఠ భావన ద్వారా ఏ ఆత్మ యొక్క వ్యర్థ భావననైనా పరివర్తన చేసి సమర్థ భావాన్ని తయారు చేస్తుంది. శ్రేష్ఠ భావము ద్వారా ఏ ఆత్మ స్వభావమునైనా మార్చగలరు. శ్రేష్ఠ భావనా శక్తి ద్వారా ఆత్మకు భావనా ఫలాన్ని అనుభూతి చేయించగలరు. శ్రేష్ఠ భావన ద్వారా భగవంతునికి సమీపంగా తీసుకు రాగలరు. శ్రేష్ఠ భావన ఏ ఆత్మ యొక్క భాగ్య రేఖనైనా మార్చగలదు. శ్రేష్ఠ భావన ధైర్యహీన ఆత్మను ధైర్యశాలిగా చేస్తుంది. ఈ శ్రేష్ఠ భావనా విధి ద్వారా మీరు ఏ ఆత్మకైనా మనసా సేవ చేయవచ్చు. వర్తమాన సమయానుసారంగా మనసా సేవ చాలా అవసరము. అయితే ఎవరి మనసు అనగా సంకల్పాలు సదా సర్వల పట్ల శ్రేష్ఠంగా, నిస్వార్థంగా ఉంటాయో, వారే మనసా సేవ చేయగలరు. సదా పరోపకారి భావన ఉండాలి. అపకారిపై కూడా ఉపకార భావన ఉండాలి. సదా దాతృత్వ భావన ఉండాలి. సదా స్వ పరివర్తన ద్వారా, స్వంత శ్రేష్ఠ కర్మల ద్వారా ఇతరులకు శ్రేష్ఠ కర్మలు చేయాలనే ప్రేరణ కలిగించేవారిగా ఉండాలి. వీరు చేస్తే నేను చేస్తాను, వీరు కొన్ని చేస్తే, కొన్ని నేను చేస్తాను లేక వీరు కూడా కొంచెం చేయాలి - ఇటువంటి భావనలకు కూడా అతీతంగా అవ్వాలి. ఎవరైనా చేయలేనప్పుడు దయా భావన, సదా సహయోగమిచ్చే భావన, వారి ధైర్యాన్ని పెంచే భావన కలిగి ఉండాలి. ఇటువంటి వారిని మనసా సేవాధారులని అంటాము. మనసా సేవను ఒక స్థానములో ఉంటున్నా నలువైపులా చేయగలరు. వాచా సేవ, కర్మణా సేవ చేయాలంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. మనసా సేవ అయితే ఎక్కడైనా కూర్చుని చేయవచ్చు,
మనసాసేవ - ఆత్మిక వైర్‌లైస్ సెట్ లాంటిది. దీని ద్వారా దూర సంబంధాలను సమీపంగా చేయగలరు. దూరంగా ఉన్న ఏ ఆత్మలోనైనా తండ్రికి చెందినవారిగా అవ్వాలనే ఉల్లాస - ఉత్సాహాలు జన్మింపజేసే సందేశాన్ని ఇవ్వగలరు. ఆ ఆత్మ, నన్ను ఏదో ఒక మహాశక్తి పిలుస్తూ ఉందని, ఏవో కొన్ని అమూల్యమైన ప్రేరణలు నన్ను ప్రేరేపిస్తున్నాయని అనుభవం చేస్తుంది. ఎలాగైతే ఎవరికైనా సన్ముఖంలో సందేశమిచ్చి ఉల్లాస-ఉత్లాహాలలోకి తీసుకొస్తారో, అలా మనసాశక్తి ద్వారా కూడా ఎవరో సన్ముఖంలో మాట్లాడ్తున్నారని ఆ ఆత్మ అనుభవం చేస్తుంది. దూరంగా ఉంటున్నా సన్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తుంది. విశ్వ సేవాధారులుగా అయ్యేందుకు సహజ సాధనము - మనసా సేవ. సైన్సు వారు ఈ సాకార సృష్టి నుండి, భూమి నుండి పైకి అంతరిక్షయానము ద్వారా తమ కార్యాన్ని శక్తిశాలిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థూలము నుండి సూక్ష్మములోకి వెళ్తున్నారు. ఎందుకు? సూక్ష్మము శక్తిశాలిగా ఉంటుంది. మనసాశక్తి కూడా అంతర్ముఖ యానము. దీని ద్వారా ఎక్కడకు కావాలంటే అక్కడకు, ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా చేరుకోగలరు. ఎలాగైతే సైన్సు ద్వారా భూమ్యాకర్షణకు అతీతంగా వెళ్లేవారు స్వతహాగానే తేలికగా అవుతారో అలా మనసా శక్తిశాలి ఆత్మ స్వతహాగానే డబల్ లైట్ స్వరూపాన్ని సదా అనుభవం చేస్తుంది. ఎలాగైతే అంతరిక్షయానం వారు పైన ఎత్తులో ఉన్న కారణంగా మొత్తం పృథ్విపై ఉన్న ఏ చిత్రము కావాలంటే ఆ చిత్రాన్ని(ఫోటోను) తీయగలరో అలా సైలెన్సు శక్తి ద్వారా, అంతర్ముఖయానం ద్వారా, మనసాశక్తి ద్వారా ఏ ఆత్మకైనా చరిత్రవంతులుగా అయ్యేందుకు, శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యేందుకు ప్రేరణనివ్వగలరు. సైన్సువారైతే ప్రతి వస్తువుపై సమయము మరియు సంపదను బాగా ఖర్చు చేస్తారు. కానీ మీరు ఖర్చు చేయకుండా కొద్ది సమయంలోనే చాలా సేవ చేయగలరు. ఎలాగైతే ఈ రోజుల్లో అక్కడక్కడ ఫ్లయింగ్ సాసర్లు చూస్తున్నారనే సమాచారము వింటున్నారు కదా. అక్కడ కూడా కేవలం లైటు మాత్రమే కనిపిస్తుంది. అలా ముందు ముందు మనసా సేవాధారి ఆత్మలైన మీ ముందుకు వచ్చి ఏదో లైటు బిందువు వచ్చి విచిత్రమైన అనుభవం చేయించి వెళ్లిందని అనుభవం చేస్తారు. వీరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? ఏమిచ్చి వెళ్లారు?- ఈ చర్చ ఎక్కువవుతూ ఉంటుంది. ఎలాగైతే ఆకాశములో నక్షత్రాల వైపు అందరి దృష్టి వెళ్తుందో, అలా భూమిపై ఉన్న నక్షత్రాల దివ్య జ్యోతిని నలువైపులా అనుభవం చేస్తారు. మనసా సేవాధారులకు ఇటువంటి శక్తి ఉంటుంది. అర్థమయ్యిందా? వీరి మహానత ఇంకా చాలా ఉంది. కానీ ఈరోజు ఇంత మాత్రమే వినిపిస్తున్నాము. ఇప్పుడు మససా సేవను తీవ్రము చేయండి. అప్పుడే 9 లక్షల మంది తయారవుతారు. ఇప్పుడు గోల్డెన్ జూబిలీ వరకు ఎంతమంది తయారవుతారు. సత్యయుగం కొరకు డైమండ్ జూబిలీ వరకు సంఖ్య 9 లక్షలైతే కావాలి కదా. లేకుంటే విశ్వానికి రాజు ఎవరి పైన రాజ్యము చేస్తారు? 9 లక్షల నక్షత్రాలని మహిమ చేయబడ్డాయి కదా. నక్షత్ర రూపి ఆత్మను అనుభవం చేసినప్పుడే 9 లక్షల నక్షత్రాలు అని మహిమ చేయబడ్తాయి. అందువలన ఇప్పుడు నక్షత్రాలను అనుభవం చేయించండి. మంచిది. నలువైపుల నుండి వచ్చిన పిల్లలు మధువన నివాసులుగా అయినందుకు అభినందనలు. ఈ అవినాశి అనుభవానికి లభించిన అభినందనలను సదా మీతోనే ఉంచుకోండి. అచ్ఛా.
సదా మహావీరులుగా అయ్యి మనసాశక్తి మహానత ద్వారా శేష్ఠ్రమైన సేవను చేసేవారు, సదా శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామనల విధి ద్వారా అనంతమైన సిద్ధిని పొందేవారు, తమ ఉన్నత స్థితి ద్వారా నలువైపులా ఉన్న ఆత్మలకు శ్రేష్ఠ పేర్రణను ఇచ్చే విశ్వ సేవాధారులు, సదా తమ శుభ భావన ద్వారా ఇతర ఆత్మలకు కూడా భావనా ఫలమును ఇచ్చేవారు - ఇటువంటి విశ్వకళ్యాణకారులు, పరోపకారి విశ్వ సేవాధారి పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వీడ్కోలు సమయంలో, అమృతవేళలో పిల్లలందరికీ ప్రియస్మృతులను ఇచ్చారు
ప్రతి కార్యము మంగళకరంగా జరగాలి. ప్రతి కార్యము సఫలమవ్వాలి. అందుకు పిల్లలందరికీ అభినందనలు. సంగమ యుగములో ప్రతిరోజూ శుభప్రదమైనదే, శ్రేష్ఠమైనదే. ఉల్లాస- ఉత్సాహాలనిప్పించేది. అందువలన ప్రతిరోజుకు దాని మహత్వము దానికి ఉంది. ఈరోజు ప్రతి సంకల్పము మంగళమయంగా ఉండాలి అనగా శుభ చింతక రూపం గలదిగా ఉండాలి. ఎవరి పట్ల అయినా మంగళకామన అనగా శుభకామన చేసే సంకల్పంగా ఉండాలి. ప్రతి సంకల్పము మంగళకరము అనగా సంతోషమునిప్పించేదిగా ఉండాలి. కనుక ఈనాటి ఈ మహత్వము - సంకల్పము, మాట, కర్మ మూడింటిని విశేషంగా స్మృతిలో ఉంచుకోవాలి. ఈ స్మృతి ఉండడమే ప్రతి సెకండు బాప్‌దాదా ప్రియస్మృతులను స్వీకరించడము. కనుక ఇప్పుడు కేవలం ప్రియస్మృతులను ఇవ్వడం లేదు. కానీ ప్రాక్టికల్‌గా చేయడమనగా ప్రియస్మృతులను తీసుకోవడం. ఈ రోజంతా ప్రియస్మృతులను తీసుకోవడమనగా స్మృతిలో ఉండి, ప్రతి సంకల్పము, ప్రతి మాట ద్వారా, ప్రేమ అలలలో తేలియాడుతూ ఉండటము. అందరికీ విశేషమైన స్మృతి మరియు గుడ్ మార్నింగ్.అచ్ఛా!
*** ఓంశాంతి ***
