"హోలీ ఎలా జరుపుకోవాలి మరియు సదాకాలిక పరివర్తన ఎలా వస్తుంది?"
రెండు రకాల మహారథులైన పిల్లలకు సదాకాలిక పరివర్తన రాకపోవడానికి గల కారణాన్ని మరియు నివారణ కోసం యుక్తులను చెబుతూ హైయెస్ట్ హోలియెస్ట్ శివబాబా ఇలా ఉచ్ఛరించారు -
ఈరోజు సర్వుల భాగ్యవిధాత అయిన బాబా తమ హోలీహంసలతో జ్ఞానరత్నాల హోలీని జరుపుకునేందుకు వచ్చారు. జరుపుకోవటము అనగా మిలనమును జరుపుకోవటము. అతి స్నేహీలు, సహజయోగులు, సదా బాబా కార్యములో సహయోగులు, సదా పావన వృత్తి-పావన దృష్టితో సృష్టిని పరివర్తన చేసే హోలీ పిల్లలందరినీ చూసి బాప్దాదా సదా హర్షితులవుతారు. ప్రసిద్ధులైన నేటి మహాత్ములు కూడా పావనంగా అయితే అవుతారు కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు అత్యంత పావనంగా అవుతారు అనగా సంకల్పమాత్రము, స్వప్నమాత్రము కూడా అపవిత్ర వృత్తి, దృష్టి పావన స్థితి నుండి క్రిందకు తీసుకురాజాలదు. ప్రతి సంకల్పము అనగా స్మృతి పావనంగా ఉన్న కారణంగా వృత్తి, దృష్టి స్వతహాగనే పావనంగా అయిపోతాయి. కేవలము మీరు మాత్రమే పావనంగా అవ్వరు, ప్రకృతిని కూడా పావనంగా తయారుచేస్తారు కనుక పావన ప్రకృతి కారణంగా భవిష్య అనేక జన్మలలో శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. ఇటువంటి హోలీహంసలుగా, సదా పావన సంకల్పధారీ శ్రేష్ఠ ఆత్మలుగా అవుతారు. ఉన్నతోన్నతమైన బాబా ప్రతి విషయములో శ్రేష్ఠ జీవితము కలవారిగా తయారుచేస్తారు. పవిత్రత కూడా ఉన్నతోన్నతమైన పవిత్రత, సాధారణ పవిత్రత కాదు. మీ పవిత్రత అతి శ్రేష్ఠమైనది అని సాధారణ పవిత్ర ఆత్మలు మహా పవిత్ర ఆత్మలైన మీ ముందు మనసుతో నమస్కారము చేస్తారు. ఈరోజుల్లోని గృహస్థులు స్వయమును అపవిత్రులుగా భావించుకున్న కారణంగా ఏ పవిత్ర ఆత్మలనైతే మహానులుగా భావించి వారికి తలవంచి నమస్కారము చేస్తారో, ఆ మహానాత్మలుగా పిలువబడే వారు కూడా శ్రేష్ఠ పావన ఆత్మలైన మీ ముందు మీ పవిత్రత మరియు మా పవిత్రతలో చాలా తేడా ఉంది అని ఒప్పుకుంటారు.
ఈ హోలీ పండుగ పావన ఆత్మలు పావనంగా అయ్యే విధికి స్మృతిచిహ్నము ఎందుకంటే నంబరువారుగా పావన ఆత్మలైన మీరందరూ బాబాపై ఉన్న లగనమనే అగ్ని ద్వారా సదాకాలము కొరకు అపవిత్రతను కాలుస్తారు కనుక ముందు కాల్చే హోలీని జరుపుతారు, తరువాత రంగుల హోలీని, మంగళ మిలనమును జరుపుతారు. కాల్చటము అనగా నామరూపాలను సమాప్తము చేయడము. ఎవరినైనా నామరూపాలతో సమాప్తం చేయాలంటే ఏమి చేస్తారు? కాలుస్తారు, అందుకే రావణుడిని కూడా చంపిన తరువాత కాలుస్తారు. ఇది మీ ఆత్మల స్మృతిచిహ్నము. అపవిత్రతను కాల్చేసారు అనగా పావన ‘హోలీ’గా అయ్యారు. బ్రాహ్మణులు హోలీని జరుపుకోవటము అనగా హోలీ(పావనం)గా చేసుకోవటము అని బాప్దాదా ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటారు. కనుక అపవిత్రతను కేవలము చంపానా లేక కాల్చేసానా అని పరిశీలించుకోండి. చనిపోబోయేవారు మరల బ్రతకవచ్చు, లోపల ఎక్కడో శ్వాస ఉండిపోతుంది. కానీ కాల్చటము అనగా నామరూపాలు అన్నీ సమాప్తమైపోవటము. ఎంతవరకు చేరుకున్నాము అని మిమ్మల్ని పరిశీలించుకోవలసి ఉంటుంది. స్వప్నములో కూడా దాగియున్న అపవిత్రతా శ్వాస మరల జీవించకూడదు. వీరినే శ్రేష్ఠ పావన ఆత్మలు అని అంటాము. సంకల్పాల వలన స్వప్నము కూడా మారిపోతుంది.
ఈరోజు వతనములో బాప్దాదా ఎప్పటికప్పుడు పిల్లలు సంకల్పాల ద్వారా లేక వ్రాతపూర్వకంగా బాబాకు చేసిన ప్రతిజ్ఞలను చూసారు. స్థితిలో మహారథులైనా, సేవలో మహారథులైనా - ఇరువురు ఎప్పటికప్పుడు చాలా మంచి మంచి ప్రతిజ్ఞలను చేసారు. మహారథులు కూడా రెండు రకాల వారున్నారు. ఒకరు, తమ వరదానాలు మరియు వారసత్వపు ప్రాప్తి యొక్క పురుషార్థము ఆధారంతో మహారథులు, రెండవవారు, ఏదో ఒక సేవ విశేషత ఆధారంతో మహారథులు. ఇద్దరూ మహారథులుగానే పిలువబడతారు కానీ మొదటివారి గురించి ఏదైతే వినిపించామో - స్థితి ఆధారం కలవారు, వారు సదా మనసుతో అతీంద్రియ సుఖము యొక్క, సంతుష్టత యొక్క, అందరి మనసులలోని స్నేహము యొక్క ప్రాప్తి స్వరూప ఊయలలో ఊగుతుంటారు. సేవ విశేషత ఆధారము కల రెండవవారు తనువుతో అనగా సేవ విశేషత ఫలస్వరూపంగా బయటకు సంతుష్టంగా కనిపిస్తారు. సేవ విశేషత కారణంగా సేవ ఆధారంతో మనసులో సంతుష్టత ఉంటుంది. సేవ విశేషత కారణంగా అందరి నుండి స్నేహము కూడా లభిస్తుంది కానీ మనస్ఫూర్తిగా లేక హృదయపూర్వకంగా సదా ఉండదు. ఒక్కోసారి బయట నుండి ఉంటే, ఒక్కోసారి మనసు నుండి ఉంటుంది. కానీ సేవ విశేషత మహారథిగా తయారుచేస్తుంది. మహారథుల వరుసలో లెక్కించబడతారు.
మరి ఈరోజు బాప్దాదా మహారథులు మరియు పురుషార్థీలు - ఇరువురి ప్రతిజ్ఞలను చూసారు. ఇప్పుడిప్పుడే సమీపములో చాలా ప్రతిజ్ఞలు చేసారు. ఏమి చూసాము? ప్రతిజ్ఞల లాభమైతే ఉంటుంది ఎందుకంటే దృఢతపై పూర్తి ‘అటెన్షన్’ ఉంటుంది. పదే-పదే ప్రతిజ్ఞలను గుర్తు చేసుకోవటం వలన సమర్ధత వస్తుంది. ఈ కారణంగా కొంత పరివర్తన కూడా ఉంటుంది. కానీ బీజము లోపల అణిచిపెట్టబడి ఉంటుంది కనుక ఏదైనా అటువంటి సమయముగానీ లేక సమస్యగానీ వచ్చినప్పుడు ‘సమస్య’ లేక ‘కారణము’ అనే నీరు లభించటం వలన అణిచిపెట్టబడి ఉన్న బీజము నుండి మరల ఆకులు రావడం ప్రారంభమవుతుంది. సదాకాలమునకు సమాప్తి అవ్వదు. కాల్చే హోలీని ఎవరు జరుపుకున్నారు అని బాప్దాదా చూసారు. బీజాన్ని కాల్చినప్పుడు కాలిపోయిన బీజము ఎప్పుడూ ఫలాన్ని ఇవ్వదు. గతం గతః అనుకుని తమ కొరకుగానీ, ఇతరుల కొరకుగానీ ఏవైతే ఇప్పటివరకు జరిగాయో వాటన్నింటినీ సమాప్తముచేసి పరివర్తన తీసుకువస్తాము అని ప్రతిజ్ఞనైతే చేసారు. అందరూ ఇప్పుడిప్పుడే ప్రతిజ్ఞ చేసారు కదా! ఆత్మిక సంభాషణలో అందరూ ప్రతిజ్ఞ చేస్తారు కదా. బాప్దాదా వద్ద ప్రతి ఒక్కరి రికార్డ్ ఉంటుంది. చాలా బాగా ప్రతిజ్ఞ చేస్తారు. కొందరు పాటలు, కవితల ద్వారా, కొందరు చిత్రాల ద్వారా ప్రతిజ్ఞ చేస్తారు.
ఎంత కోరుకుంటారో అంత పరివర్తన ఎందుకని అవ్వటం లేదు, కారణము ఏంటి? సదాకాలమునకు ఎందుకని సమాప్తమైపోదు అన్నదానిని బాప్దాదా చూస్తుండినారు. మరి ఏమి చూసారు? తమ గురించి మరియు ఇతరుల గురించి ఇలా ఆలోచిస్తారు, ఈ బలహీనతను మరల రానివ్వకూడదు అని తమ గురించి అనుకుంటారు, ఇతరుల గురించి - ఏ ఆత్మతోటైతే లెక్కాచారము సమాప్తమయ్యే కారణంగా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో సంస్కారాల ఘర్షణ జరుగుతుందో దానిని పరివర్తన చేస్తాము అని అనుకుంటారు. కానీ సమయము వచ్చినప్పుడు మరల ఎందుకు రిపీట్ అవుతుంది? దానికి కారణము ఏమిటి? ఇకనుండి ఈ ఆత్మ యొక్క ఈ సంస్కారాన్ని తెలుసుకుని స్వయమును సురక్షితంగా ఉంచుకుని ఆ ఆత్మకు శుభ భావన-శుభ కామనలను ఇస్తాము అని అనుకుంటారు, కానీ ఇతరుల బలహీనతను చూసే, వినే, గ్రహించే అలవాటు సహజంగా మరియు బహుకాలముదిగా అయిపోయింది, ఈ అలవాటును చేసుకోము అని అనుకుంటారు - ఇలా అనుకోవటమైతే చాలా మంచిది, కానీ ఆ స్థానంలో ఏమి చూడాలి, ఆ ఆత్మ నుండి ఏమి గ్రహించాలి! దీనిని పదే-పదే అటెన్షన్లో ఉంచుకోరు. ఇది చెయ్యకూడదు అన్నదైతే గుర్తుంటుంది. కానీ అటువంటి ఆత్మల కొరకు ఏమి చెయ్యాలి, ఏమి ఆలోచించాలి, ఏమి చూడాలి అన్న విషయాలు సహజంగా అటెన్షన్లో ఉండవు. ఏవిధంగానైతే, ఏదైనా ఒక స్థలం ఖాళీగా ఉన్నప్పుడు దానిని మంచిగా ఉపయోగించనట్లయితే ఆ ఖాళీ స్థలంలో చెత్త చెదారం, దోమలు మొదలైనవన్నీ స్వతహాగానే చేరుతుంటాయి ఎందుకంటే వాయుమండలములో దుమ్ము-ధూళి, దోమలు మొదలైనవన్నీ ఎప్పుడూ ఉండనే ఉంటాయి, కనుక అవి మరల అలా అలా వచ్చి పేరుకుపోతాయి ఎందుకంటే స్థలం నిండిపోయి లేదు, కనుక ఆత్మలను ఎప్పుడు కలిసినా, ముందుగా సహజ పరివర్తన చేసుకున్న శ్రేష్ఠ సంకల్ప స్వరూపము స్మృతిలోకి రావాలి ఎందుకంటే మీరు జ్ఞాన సంపన్నులుగా అయితే ఉండనే ఉన్నారు, అందరి గుణాలు, కర్తవ్యాలు, సంస్కారాలు, సేవ, స్వభావ పరివర్తన యొక్క శుభ సంస్కారము లేక స్థానము సదా నిండి ఉంటే అశుద్ధత స్వతహాగానే సమాప్తమైపోతుంది.
ముందు వినిపించి ఉన్నట్లుగా - చాలామంది పిల్లలు స్మృతిలో కూర్చున్నప్పుడు లేక బ్రాహ్మణ జీవితములో నడుస్తూ-తిరుగుతూ స్మృతి అభ్యాసమును చేస్తున్నప్పుడు స్మృతిలో శాంతి అనుభవమునైతే చేస్తారు కానీ సంతోషాన్ని అనుభవము చెయ్యరు. కేవలము శాంతి అనుభూతి మాత్రమే ఉన్నట్లయితే ఒక్కోసారి అది తలను బరువుగా చేస్తుంది, ఒక్కోసారి నిద్ర వైపుకు తీసుకుపోతుంది. శాంతి స్థితితోపాటు సంతోషము ఉండదు. కనుక ఎక్కడైతే సంతోషము ఉండదో, అక్కడ ఉల్లాస-ఉత్సాహాలు ఉండవు. యోగాన్ని చేస్తున్నాకూడా స్వయము సంతుష్టంగా అవ్వరు, అలసిపోయి ఉంటారు. ఎప్పుడూ ఆలోచిస్తున్న మూడ్లో ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు. సంతోషము ఎందుకని కలగదు, దీనికి కూడా కారణము ఉంది ఎందుకంటే నేను ఆత్మను, బిందువును, జ్యోతి స్వరూపాన్ని, బాబా కూడా ఇలానే ఉంటారు అని కేవలము ఇలానే ఆలోచిస్తారు కానీ నేను ఎటువంటి ఆత్మను, నా విశేషత ఏమిటి? నేను పదమాపదమ భాగ్యశాలీ ఆత్మను, నేను ఆది రచన కల ఆత్మను, నేను బాబా హృదయసింహాసనాధికారిగా అయ్యే ఆత్మను - ఇలా సంతోషాన్ని కలిగించే విశేషతల గురించి ఆలోచించరు. నేను బిందువును, జ్యోతిని, శాంత స్వరూపాన్ని... ఇలా కేవలము ఇంతవరకే ఆలోచిస్తారు కనుక శూన్యంలోకి వెళ్ళిపోతారు, కనుక తల భారీగా అవుతుంది. అలాగే స్వయము కొరకు మరియు ఇతరుల కొరకు పరివర్తనకు చెందిన దృఢ సంకల్పమును చేసినప్పుడు మరియు స్వయము కొరకు, ఇతర ఆత్మల కొరకు శుభమైన, శ్రేష్ఠమైన సంకల్పాలను మరియు విశేషతల స్వరూపమును సదా ఇమర్జ్ రూపములో ఉంచుకున్నప్పుడు పరివర్తన జరుగుతుంది.
వీరు ఇలానే ఉంటారు, ఇది ఇలాగే జరుగుతుంది, వీరు ఇలానే చేస్తారు అని ఇలా అనుకునేందుకు బదులుగా వీరు విశేషతల కారణంగా ఇటువంటి విశేషమైనవారు అని అనుకోండి. బలహీనతల గురించి ఏవిధంగానైతే ‘ఇలా’, ‘అలా’ అనేవి వస్తాయో, అలాగే శ్రేష్ఠత మరియు విశేషతల గురించిన ‘ఇలా’, ‘అలా’ అన్నవాటిని ముందుకు తీసుకురండి. స్మృతిని, స్వరూపాన్ని, వృత్తిని, దృష్టిని పరివర్తన చేయండి. ఇలా స్వయాన్ని కూడా చూసుకోండి మరియు ఇతరులను కూడా చూడండి. స్థలాన్ని నింపారు, ఖాళీగా వదలలేదు అని దీనినే అంటాము. ఇటువంటి విధితో కాల్చే హోలీని జరుపుకోండి. వీళ్ళు మారనే మారరు అని నేను ముందే చెప్పాను కదా అని మీ గురించిగానీ లేక ఇతరుల గురించిగానీ ఎప్పుడూ ఇలా ఆలోచించకండి, ఆ సమయంలో, ‘అసలు నేను మారానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. స్వ పరివర్తనయే ఇతరుల పరివర్తనను ముందుకు తీసుకువస్తుంది. ‘మార్పుకు ఉదాహరణగా ముందు నేను అవుతాను’ అని ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దానినే హోలీని కాల్చటము అని అంటాము. కాల్చకుండా హోలీని జరుపుకోరు. ముందు కాల్చటమే ఉంటుంది ఎందుకంటే కాల్చేసినప్పుడే స్వచ్ఛమవుతారు, శ్రేష్ఠ పవిత్రులుగా అవుతారు. కనుక అటువంటి ఆత్మకు స్వతహాగనే బాబా సాంగత్యపు రంగు ఎప్పుడూ అంటుకొని ఉంటుంది. అటువంటి ఆత్మలే ఎల్లప్పుడూ బాబాతో మరియు సర్వాత్మలతో మంగళ మిలనమును అనగా కల్యాణకారీ శ్రేష్ఠ శుభ మిలనమును జరుపుకుంటుంటారు. అర్థమైందా?
ఇటువంటి హోలీని జరుపుకోవాలి కదా! ఎక్కడ ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో, అక్కడ ప్రతి క్షణము ఉత్సవము ఉండనే ఉంటుంది. కనుక సంతోషంగా బాగా జరుపుకోండి. ఆడండి, తినండి, ఆనందించండి కానీ ఎల్లప్పుడు హోలీగా అయ్యి మిలనమును జరుపుకుంటూ ఉండండి. అచ్ఛా!
సదా ప్రతి క్షణము బాబా ద్వారా వరదానమనే అభినందనను తీసుకునేవారికి, సదా ప్రతి బ్రాహ్మణ ఆత్మ ద్వారా శుభ భావనలు అనే అభినందనను తీసుకునేవారికి, సదా అతి శ్రేష్ఠ పావన ఆత్మలకు, సదా సాంగత్యపు రంగులో రంగరింపబడి ఉండేవారికి, సదా బాబాతో మిలనమును జరుపుకునే ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగత మిలనము సమయములో వరదానము రూపములో ఉచ్ఛరించిన మహావాక్యాలు
1. సదా స్వయమును బాబా యొక్క స్మృతి అనే ఛత్రఛాయలో ఉండే శ్రేష్ఠ ఆత్మగా అనుభవము చేస్తారా? ఛత్రఛాయయే రక్షణకు సాధనము. ఈ ఛత్రఛాయ నుండి ఒకవేళ కాలునైనా సరే, బయట పెట్టినట్లయితే ఏమవుతుంది? రావణుడు ఎత్తుకెళ్ళి శోకవాటికలో కూర్చోబెడతాడు. మరి అక్కడకైతే వెళ్ళేది లేదు. సదా బాబా ఛత్రఛాయలో ఉండే బాబా యొక్క స్నేహీ ఆత్మను - ఈ అనుభవములో ఉండండి. ఈ అనుభవముతో సదా శక్తిశాలురుగా అయ్యి ముందుకు వెళ్తుంటారు.
2. సదా స్వయాన్ని బాప్దాదా నయనాలలో ఇమిడిపోయి ఉండే ఆత్మగా అనుభవము చేస్తారా? నయనాలలో ఇమిడి ఉండే ఆత్మ స్వరూపము ఎలా ఉంటుంది? కళ్ళల్లో ఏముంటుంది? బిందువు. చూసే శక్తి మొత్తం బిందువులో ఉంటుంది కదా. కనుక నయనాలలో ఇమడి ఉన్నాను అనగా సదా బిందు స్వరూపములో స్థితి అయ్యి ఉన్నాను - ఇటువంటి అనుభవము ఉంటుంది కదా! వీరినే ప్రకాశ రత్నము అని అంటారు. కనుక సదా ఈ స్మృతి ద్వారా స్వయమును ముందుకు తీసుకువెళుతూ ఉండండి. నేను ప్రకాశ రత్నమైన ఆత్మను అన్న ఈ నషాలో ఎప్పుడూ ఉండండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
