"భాగ్యశాలి పిల్లల శ్రేష్ఠ భాగ్యముల లిస్టు "
అమృతవేళ భాగ్యవిధాత బాబాతో మిలనం జరుపుకునేవారు, పరమ శిక్షకుడు జ్ఞాన సాగరుడైన బాబా నుండి చదువు చదువుకునేవారు, కర్మ చేస్తూ కూడా చేయించేవారి స్మృతిలో ఉండేవారు, భాగ్యవిధాత తినిపిస్తున్నారు - ఈ స్మృతిలో ఉండి బ్రహ్మా భోజనము తినేవారు, బాబా స్మృతి ఒడిలో నిదురించేవారు – ఇటువంటి శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలకు శ్రేష్ఠ భాగ్యము యొక్క స్మృతిని ఇప్పిస్తూ భాగ్యవిధాత బాప్దాదా ఇలా ఉచ్ఛరించారు -
ఈరోజు భాగ్యవిధాత బాప్దాదా తమ భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యము ప్రపంచములోని సాధారణ ఆత్మల కంటే అతి శ్రేష్ఠమైనది ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ కోట్లలో కొద్దిమంది మరియు కొద్దిమందిలో కూడా కొద్దిమంది. ఎక్కడ 550 కోట్లమంది ఆత్మలు, ఎక్కడ బ్రాహ్మణుల చిన్ని ప్రపంచము! వారితో పోలిస్తే ఎంత కొద్దిమంది! కనుక అజ్ఞానులు, తెలియని వారితో పోలిస్తే బ్రాహ్మణులందరూ శ్రేష్ఠ భాగ్యవంతులు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి మస్తకముపై తిలకములా భాగ్యరేఖ చాలా స్పష్టంగా మెరుస్తుండటాన్ని బాప్దాదా చూస్తున్నారు. హద్దు జ్యోతిష్కులు హస్తరేఖలను చూస్తారు కానీ ఈ దివ్య ఈశ్వరీయ భాగ్యరేఖ ప్రతి ఒక్కరి మస్తకముపై కనిపిస్తుంది. ఎంత శ్రేష్ఠమైన భాగ్యమో అంతగా భాగ్యవంతులైన పిల్లల మస్తకముపై సదా అలౌకిక ప్రకాశము మెరుస్తుంటుంది. భాగ్యవంతులైన పిల్లలలో మరే ఇతర గుర్తులు కనిపిస్తాయి? ముఖంలో ఎల్లప్పుడు ఈశ్వరీయ ఆత్మిక మందహాసము అనుభవమవుతుంది. భాగ్యవంతుల నయనాలు అనగా దివ్య దృష్టి ఎవ్వరికైనా సదా సంతోషపు అలను ఉత్పన్నము చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. దృష్టి లభించినవారు ఆత్మికతను, ఆత్మిక తండ్రిని, పరమాత్మ స్మృతిని అనుభవము చేస్తారు. భాగ్యవంతులైన ఆత్మల సంపర్కములో ప్రతి ఒక్క ఆత్మకు తేలికతనము అనగా లైట్ యొక్క అనుభూతి కలుగుతుంది. బ్రాహ్మణ ఆత్మలలో కూడా చివరివరకు నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు కానీ లక్షణాలు నంబరువారుగా భాగ్యవంతులైన పిల్లలందరివి ఉంటాయి. భవిష్యత్తులో ఇంకా ప్రత్యక్షమవుతూ ఉంటారు.
ఇప్పుడు సమయాన్ని కాస్త ముందుకు జరగనివ్వండి. కొద్ది సమయంలో అతి మరియు అంతములు రెండూ అనుభవమైనప్పుడు నలువైపుల కల పరిచయము లేని ఆత్మలందరూ హద్దు వైరాగ్య వృత్తిలోకి వస్తారు మరియు భాగ్యశాలి ఆత్మలైన మీరు అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క అనుభవములో ఉంటారు. ఇప్పుడైతే ప్రపంచములోని వారిలో కూడా వైరాగ్యము లేదు. కాస్త రిహార్సల్స్ జరిగినా కూడా ఇవైతే జరుగుతూనే ఉంటాయి అని ఇంకా నిర్లక్ష్యమనే నిద్రలో నిద్రపోతారు. కానీ ఎప్పుడైతే ‘అతి’ మరియు ‘అంతము’ల దృశ్యము ఎదురుగా వస్తుందో అప్పుడు స్వతహాగనే హద్దు వైరాగ్య వృత్తి ఉత్పన్నమవుతుంది మరియు చాలా టెన్షన్ ఉన్న కారణంగా అందరి అటెన్షన్ (ధ్యాస) ఒక్క బాబా వైపుకు పోతుంది. అటువంటి సమయములో అందరి మనసుల నుండి అందరి రచయిత, అందరి తండ్రి ఒక్కరే అన్న మాటలు వెలువడుతాయి మరియు బుద్ధి అనేక వైపుల నుండి తొలగి ఒకే వైపుకు స్వతహాగనే వెళుతుంది. అటువంటి సమయములో భాగ్యశాలి ఆత్మలైన మీ అనంతమైన వైరాగ్య వృత్తితో కూడిన స్థితి స్వతహాగా మరియు నిరంతరంగా అయిపోతుంది మరియు ప్రతి ఒక్కరి మస్తకము నుండి భాగ్యరేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు కూడా శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లల బుద్ధిలో ఏముంటుంది? ‘భగవంతుడు’ మరియు ‘భాగ్యము’.
అమృతవేళనుండి మీకు కల భాగ్యముల లిస్టును తయారుచెయ్యండి. భాగ్యవంతులైన పిల్లలను అమృతవేళ స్వయంగా బాబానే లేపుతారు మరియు ఆహ్వానిస్తారు కూడా. ఎవరైతే అతి స్నేహితులైన పిల్లలుగా ఉంటారో, వారికి నిద్రపోవాలనుకున్నాగానీ, ఎవరో నిద్ర పోనివ్వటం లేదు, ఎవరో లేపుతున్నారు, పిలుస్తున్నారు అన్న అనుభవము కలుగుతుంది. ఇటువంటి అనుభవము ఉంటుంది కదా. అమృతవేళ నుండి మీ భాగ్యములను చూసుకున్నారా! భక్తిలో దేవతలను భగవంతునిగా భావించి భక్తులు గంటలు మ్రోగిస్తూ మేల్కొలుపుతారు, కానీ మిమ్మల్ని స్వయంగా భగవంతుడే మేల్కొలుపుతారు, ఎంతటి భాగ్యము! అమృతవేళ నుండి పిల్లల సేవాధారిగా అయ్యి బాబా సేవ చేస్తారు, ‘రండి, బాబా సమానమైన స్థితిని అనుభవము చేయండి, నాతోటి కూర్చోండి’ అని ఆహ్వానిస్తారు. బాబా ఎక్కడ కూర్చున్నారు? ఉన్నత స్థానంలో మరియు ఉన్నత స్థితిలో. బాబాతోటి కూర్చున్నప్పుడు స్థితి ఎలా ఉంటుంది! ఎందుకు కష్టపడ్తారు? పక్కన కూర్చున్నప్పుడు సాంగత్యపు రంగు స్వతహాగానే పడ్తుంది. స్థానము ప్రమాణంగా స్థితి స్వతహాగానే తయారవుతుంది. మధుబన్ స్థానమునకు వచ్చినప్పుడు స్థితి ఎలా అవుతుంది? యోగమును చెయ్యాల్సి వస్తుందా లేక ఎప్పుడూ యోగమే ఉంటుందా? కనుకనే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండే కోరికను పెట్టుకుంటారు కదా. ఇంకా 15 రోజులు ఉండండి అని అందరికీ చెప్పినట్లయితే సంతోషంలో నాట్యము చేస్తారు కదా. కనుక ఎలా అయితే స్థానము స్థితిపై ప్రభావము చూపుతుందో అలా అమృతవేళ పరంధామములోకిగానీ లేక సూక్ష్మవతనములోకిగానీ వెళ్ళండి, బాబాతోటి కూర్చోండి. అమృతవేళ శక్తిశాలిగా అయినట్లయితే మొత్తము రోజంతా స్వతహాగనే సహాయము లభిస్తుంది. కనుక “ఓహో, నా భాగ్యము” అని మీ భాగ్యమును స్మృతిలో పెట్టుకోండి. దినచర్యనే భగవంతునితో ప్రారంభమవుతుంది.
ఇంకా మీ భాగ్యమును చూడండి - బాబా స్వయంగా శిక్షకునిగా అయ్యి ఎంతో దూరదేశము నుండి మిమ్మల్ని చదివించటానికి వస్తారు! లోకులు భగవంతుని వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తారు, కానీ ఇక్కడ భగవంతుడు స్వయం శిక్షకునిగా అయ్యి చదివించటానికి మీవద్దకు వస్తారు, ఎంతటి భాగ్యము! ఎంత సమయము నుండి సేవ డ్యూటీని చేస్తున్నారు! ఎప్పుడైనా బద్దకిస్తారా? ఈరోజు తలనొప్పిగా ఉంది, రాత్రి నిద్రపోలేదు అని ఎప్పుడైనా సాకులు చెప్తారా? బాబా ఏవిధంగా అలసిపోని సేవాధారిగా అయ్యి సేవ చేస్తారో అలా పిల్లలు కూడా బాబా సమానంగా అలసిపోని సేవాధారులు. మీ దినచర్యను చూడండి, ఎంత పెద్ద భాగ్యము ఉంది? బాబా సదా స్నేహీలు, అతి ప్రియమైన అల్లారు ముద్దు పిల్లలకు ఇలా చెప్తారు - ఏ సేవ అయినా చెయ్యండి, లౌకిక సేవ అయినా, అలౌకిక సేవ అయినా, పరివారములోనైనా లేక సేవాకేంద్రములోనైనా - ఏ పనిని చేసినా, ఏ డ్యూటీని నిర్వహిస్తున్నాగానీ చేసేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తము, చేసేవాని ద్వారా నేను సేవ చేసేందుకు నిమిత్తమై ఉన్నాను, చేసేవారు చేయిస్తున్నారు అన్న అనుభవమును చెయ్యండి. ఇక్కడ కూడా ఒంటరిగా లేరు, బాబా చేయించేవాని రూపములో కర్మ చేసే సమయములో తోడుగా ఉంటారు. మీరు కేవలము నిమిత్తులు. భగవంతుడు విశేషంగా చేయించేవారు. ఒంటరిగా ఎందుకు చేస్తారు? నేను ఒంటరిగా చేస్తాను - అన్న అభిమానము ఉన్నట్లయితే ఈ “నేను అన్న భావము” మాయ వచ్చేందుకు ద్వారము వంటిది. మళ్ళీ మాయ వచ్చింది అని అంటారు. తలుపులు తెరిచి ఉంచినప్పుడు, మాయ అయితే కాచుకొని ఉంది మరియు మీరు మాయ రావటానికి మంచిగా తగిన ఏర్పాటును చేసినప్పుడు అది ఎందుకని రాదు?
మీ ఈ భాగ్యాన్ని గుర్తుంచుకోండి, చేయించే బాబా ప్రతి కర్మనూ చేయిస్తున్నారు. అప్పుడు భారము ఉండదు. భారము యజమానిపై ఉంటుంది, తోడుగా ఉండేవారిపై భారము ఉండదు. యజమానిగా అయినప్పుడు భారము వస్తుంది. నేను బాలకుడను, బాబా మాలికుడు(యజమాని). మాలికుడు బాలకుడినైన నాచేత చేయిస్తున్నారు. పెద్దవారిగా అయినప్పుడు పెద్ద దుఃఖము కలుగుతుంది. బాలకునిగా అయ్యి, మాలికుని డైరెక్షన్ అనుసారంగా చెయ్యండి. ఇది ఎంత పెద్ద భాగ్యము! ప్రతి కర్మలో బాబా బాధ్యులుగా అయ్యి తేలికగా చేసి ఎగరింపజేస్తున్నారు. కానీ జరిగేది ఏంటి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా, ఇప్పుడు నీకే తెలియాలి అని అంటారు, కానీ సమస్య తీరిపోయిన తరువాత నిర్లక్ష్యంగా అయిపోతారు. కానీ అసలు సమస్య వచ్చే విధంగా చెయ్యటం ఎందుకు? చేయించే బాబా యొక్క డైరెక్షన్ అనుసారంగా ప్రతి కర్మనూ చేస్తున్నట్లయితే కర్మ కూడా శ్రేష్ఠంగా అవుతుంది మరియు శ్రేష్ఠ కర్మలకు ఫలంగా - సదా సంతోషము, సదా తేలికతనము, ఫరిశ్తా జీవిత అనుభవమును చేస్తుంటారు. ‘ఫరిశ్తాలు కర్మ సంబంధములోకి వస్తారు కానీ కర్మ బంధనములో బంధింపబడరు’. చేయించేవానిగా బాబా సంబంధము జోడింపబడి ఉంది, కనుక నిమిత్త భావములో ఎప్పుడూ నేను అన్న అభిమానము రాదు. సదా నిమిత్తులుగా అయ్యి నిర్మాణ కార్యమును చేస్తారు. మీది ఎంతటి భాగ్యము!
ఇంకా, బ్రహ్మా భోజనమును తినిపించేది ఎవరు? పేరే బ్రహ్మా భోజనము. బ్రహ్మ భోజనము కాదు, బ్రహ్మా భోజనము. బ్రహ్మా సదా యజ్ఞ రక్షకుడు. ప్రతి ఒక్క యజ్ఞ వత్సునికి లేక బ్రహ్మా వత్సునికి బ్రహ్మా ద్వారా బ్రహ్మా భోజనమైతే లభించాల్సిందే. మాకు భగవంతుడు తినిపిస్తున్నారు అని లోకులు ఏదో అలా ఊరికే అంటారు. అసలు భగవంతుడు ఎవరు అన్నదే వారికి తెలియదు కానీ భగవంతుడు తినిపిస్తున్నారు అని అంటారు. బ్రాహ్మణ పిల్లలకైతే బాబానే తినిపిస్తారు. లౌకిక సంపాదనను కూడా చేసి ధనాన్ని జమ చేస్తారు, దానితో భోజనాన్ని తెప్పించుకుంటారు కూడా కానీ ముందుగా తమ సంపాదనను బాబా భండారీలో వేస్తారు. బాబా భండారీ (హుండీ) భోలానాథుని భండారా(వంటిల్లు)గా అయిపోతుంది. ఎప్పుడు కూడా ఈ విధిని మర్చిపోకూడదు. లేదంటే, మేము స్వయం సంపాదిస్తాము, స్వయం తింటాము అని అనుకుంటారు. మామూలుగా కూడా మీరు ట్రస్టీ(నిమిత్తమాత్రు)లు. ట్రస్టీలకు ఏమీ ఉండదు. మేము మా సంపాదనతో తింటాము అన్న ఈ సంకల్పము కూడా తలెత్తకూడదు. ట్రస్టీలుగా అయినప్పుడు అన్నింటినీ బాబాకు అధీనము చేసారు. అన్నీ నీవైపోయాయి, నావి కావు. ట్రస్టీ అనగా నీది మరియు గృహస్థి అనగా నాది. మీరు ఎవరు? గృహస్థులైతే కారు కదా? భగవంతుడు తినిపిస్తున్నారు, బ్రహ్మా భోజనము లభిస్తుంది - అన్న ఈ నషా బ్రాహ్మణ ఆత్మలకు స్వతహాగనే ఉంటుంది మరియు బాబా ఇచ్చే గ్యారంటీ ఏమిటంటే - 21 జన్మలు బ్రాహ్మణ ఆత్మలు ఎప్పుడూ ఆకలితో ఉండజాలరు, చాలా ప్రేమతో పప్పు-రొట్టె, కూర తినిపిస్తారు. ఈ జన్మలో కూడా ప్రేమతో పప్పు-రొట్టెను తింటారు, కష్టపడరు కనుక అమృతవేళ నుండీ ఏ ఏ భాగ్యాలు ప్రాప్తించాయి అన్న ఈ స్మృతిని పెట్టుకోండి. మొత్తము దినచర్యను ఆలోచించండి.
జోలపాటను పాడుతూ బాబా నిద్రబుచ్చుతారు. బాబా ఒడిలో నిద్రపోయినట్లయితే అలసట, అనారోగ్యము అన్నింటినీ మర్చిపోతారు మరియు మీరు విశ్రాంతిని పొందుతారు. ‘ఆ రామ్’ (రామా, రండి) అని ఆహ్వానించినట్లయితే ఆరామ్(విశ్రాంతి) లభిస్తుంది. ఒంటరిగా నిద్రించినట్లయితే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. బాబాతోటి ‘స్మృతి అనే ఒడి’లో నిద్రపోండి. ‘మధురమైన పిల్లలు’, ‘ప్రియమైన పిల్లలు’ అన్న జోలపాటను వింటూ-వింటూ నిద్రపోండి. అప్పుడు చూడండి, ఎంతటి అలౌకిక అనుభవము ఉంటుందో! కనుక అమృతవేళ నుండి రాత్రి వరకు అన్నింటినీ భగవంతుడు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు, చేయించేవారు చేయిస్తున్నారు - సదా ఈ భాగ్యమును స్మృతిలో పెట్టుకోండి, ఇమర్జ్ చేసుకోండి. ఏదైనా హద్దు నషా కూడా త్రాగనంతవరకూ ఆ నషా ఎక్కదు, కేవలము సీసాలో పెట్టుకుని ఉంటే నషా ఎక్కుతుందా? అలాగే ఇది కూడా బుద్ధిలో అయితే నిండి ఉంది కానీ దానిని ఉపయోగించండి. స్మృతిలోకి తీసుకురావటము అనగా త్రాగటము, ఇమర్జ్ చేసుకోవటము. స్మృతి స్వరూపులుగా అవ్వడం అని దీనిని అంటాము. బుద్ధిలో నింపి పెట్టుకోండి అని అనలేదు. స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఎంత భాగ్యవంతులు! ప్రతిరోజూ మీ భాగ్యాలను స్మృతిలో ఉంచుకుని సమర్థులుగా అవ్వండి మరియు ఎగురుతూ ఉండండి. ఏం చెయ్యాలో అర్థమైందా? డబల్ విదేశీయులు హద్దు నషా విషయంలో అయితే అనుభవీలు, ఇప్పుడు ఈ అనంతమైన నషాను స్మృతిలో పెట్టుకున్నట్లయితే సదా భాగ్యమునకు చెందిన శ్రేష్ఠరేఖ మస్తకముపై మెరుస్తుంటుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొందరిది మర్జ్ అయ్యి కనిపిస్తుంది, కొందరిది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సదా స్మృతిలో ఉన్నట్లయితే మస్తకముపై మెరుస్తుంటుంది, ఇతరులకు కూడా అనుభవము చేయిస్తుంటారు. అచ్ఛా!
సదా భగవంతుడు మరియు భాగ్యము అన్న స్మృతి స్వరూప సమర్థ ఆత్మలకు, సదా ప్రతి కర్మలో చేసేవారిగా అయ్యి కర్మ చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా అమృతవేళ బాబాతోపాటు ఉన్నత స్థానంలో, ఉన్నత స్థితిలో స్థితులై ఉండే భాగ్యశాలి పిల్లలకు, సదా తమ మస్తకము ద్వారా శ్రేష్ఠ భాగ్యరేఖలను ఇతరులకు అనుభవము చేయించే విశేష బ్రాహ్మణులకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వీడ్కోలు సమయంలో దాదీ జానకి సేవ కొరకు ముంబై మరియు కురుక్షేత్రములకు వెళ్ళేందుకు సెలవు తీసుకుంటున్నారు -
మహారథుల పాదాలలో సేవ చక్రాలైతే ఉండనే ఉన్నాయి. ఎక్కడకు వెళ్ళినా అక్కడ సేవ తప్ప మరేదీ ఉండదు. ఏ కారణంతో వెళ్ళినా అందులో సేవ ఇమిడి ఉంటుంది. ప్రతి అడుగులో సేవ తప్ప మరేదీ ఉండనే ఉండదు. నడిచినా కూడా నడుస్తూ కూడా సేవ చేస్తారు. తింటున్నప్పుడు కూడా ఎవరినైనా పిలిచి తినిపిస్తారు, స్నేహముతో స్వీకరిస్తారు - కనుక ఇది కూడా సేవ అయిపోయింది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ సేవయే సేవ. ఇటువంటి సేవాధారులు. సేవ అవకాశము లభించటము కూడా భాగ్యమునకు గుర్తు. పెద్ద చక్రవర్తిగా అవ్వాలంటే సేవ చక్రము కూడా పెద్దదిగా ఉండాలి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
