"డబల్ విదేశీ బ్రాహ్మణ పిల్లల విశేషతలు "
స్వచ్ఛమైన మనసున్న డబల్ విదేశీ పిల్లలకు దివ్యగుణాల ధారణ గురించిన విధిని చెబుతూ బాప్‌దాదా ఉచ్ఛరించిన మహావాక్యాలు -
ఈరోజు భాగ్యవిధాత అయిన బాప్‌దాదా తమ శ్రేష్ఠమైన, భాగ్యశాలి పిల్లలను చూసి హర్షితులవుతున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యము శ్రేష్ఠంగానే ఉంది కానీ అది నంబరువారీగా ఉంది. ఈరోజు బాప్‌దాదా పిల్లలందరి మనసులోని ఉల్లాస-ఉత్సాహాలతో కూడుకున్న దృఢ సంకల్పాన్ని విన్నారు. అందరూ సంకల్పాల ద్వారా ఏ ఆత్మిక సంభాషణనైతే చేసారో, పిల్లలు సంకల్పము చెయ్యటంతోనే అది బాప్‌దాదా వద్దకు చేరుకుంది. ‘సంకల్పశక్తి’ వాచా శక్తి కన్నా చాలా సూక్ష్మమైనదైన కారణంగా అతి తీవ్రగతితో వెళ్తుంది మరియు చేరుకుంటుంది కూడా. ఆత్మిక సంభాషణ యొక్క భాషయే సంకల్పాల భాష. సైన్స్వారు శబ్దాన్ని క్యాచ్ చేస్తారు (పట్టుకుంటారు) కానీ సంకల్పాలను క్యాచ్ చేసేందుకు సూక్ష్మ సాధనము కావాలి. బాప్‌దాదా పిల్లల ప్రతి ఒక్కరి సంకల్పాల భాషను ఎప్పుడూ వింటారు అనగా సంకల్పాలను క్యాచ్ చేస్తారు. ఇందుకొరకు బుద్ధి అతి సూక్ష్మంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండటము అవసరము, అప్పుడే ఆత్మిక సంభాషణకు బాబా ఇచ్చే జవాబును అర్థం చేసుకోగలరు.
బాప్‌దాదా వద్దకు, సంతుష్టంగా, సదా సంతోషంగా, నిర్విఘ్నంగా ఉండాలన్న, సదా బాబా సమానంగా అవ్వాలన్న అందరి శ్రేష్ఠ సంకల్పము చేరుకుంది. దృఢ సంకల్పము ద్వారా సదా సఫలతను పొందాలన్న పిల్లల సంకల్పానికి బాప్‌దాదా అభినందనలను ఇస్తున్నారు ఎందుకంటే ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయ్యేదాని గుర్తు ఇదే. సదా దృఢత, శ్రేష్ఠత ఉండాలి, సంకల్పాలలో కూడా బలహీనత ఉండకూడదు - దీనినే శ్రేష్ఠత అంటాము. పిల్లల విశాల బుద్ధిని చూసి, పిల్లలకు సదా విశాలమైన మనసు, విశాలమైన బుద్ధి, విశాలమైన సేవ మరియు విశాలమైన సంస్కారము - ఇలా ‘సదా విశాల భవ’ అన్న వరదానమును కూడా వరదాత అయిన తండ్రి ఇస్తున్నారు. విశాలమైన మనసు అనగా అనంతమైన స్మృతి స్వరూపము. ప్రతి విషయములో అనంతము అనగా విశాలము. అనంతము ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి హద్దు తనవైపుకు ఆకర్షితము చెయ్యదు. దీనినే బాబా సమానమైన కర్మాతీత ఫరిశ్తా జీవితము అని అంటాము. కర్మాతీతము అన్నదాని అర్థమే - అన్నిరకాల హద్దు స్వభావ సంస్కారాల నుండి అతీతము అనగా నిర్లిప్తము. బంధనము హద్దు, నిర్బంధనము అనంతము. కనుక ఎల్లప్పుడు ఈ విధితో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండండి. అందరూ స్వయానికి ఏ సంకల్పమునైతే చేసారో అది సదా అమరము, నిశ్చలము, అఖండముగా ఉంది అనగా ఖండితమయ్యేది కాదు. అటువంటి సంకల్పము చేసారు కదా? మధువనము రేఖ వరకే చేసిన సంకల్పమైతే కాదు కదా? ఎల్లప్పుడు తోడుగా ఉంటుంది కదా?
మురళీలనైతే చాలానే విన్నారు. ఏదైతే విన్నారో దానిని ఇప్పుడు చెయ్యాలి ఎందుకంటే ఈ సాకార సృష్టిలో సంకల్పము, మాట, కర్మ - ఈ మూడింటికి మహత్వము ఉంది మరియు మూడింటిలోనూ మహానత ఉండాలి - దీనినే సంపన్న స్థితి అని అంటాము. ఈ సాకార సృష్టిలోనే పూర్తి మార్కులను తీసుకోవటము చాలా అవసరము. నా సంకల్పాలైతే చాలా శ్రేష్ఠంగా ఉంటాయి కానీ కర్మలు మరియు మాటలలో అంతరము కనిపిస్తుంది అని ఎవరైనా అంటే, దానిని ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకంటే సంకల్పాల స్థూల దర్పణము - మాటలు మరియు కర్మలు. శ్రేష్ఠ సంకల్పాలు కలవారి మాటలు కూడా స్వతహాగానే శ్రేష్ఠంగా ఉంటాయి. కనుక మూడింటి విశేషతయే ‘నంబర్‌వన్’గా అవ్వటము.
బాప్‌దాదా డబల్ విదేశీ పిల్లలను చూసి, వారి విశేషతను చూసి ఎల్లప్పుడు హర్షితులవుతారు. ఆ విశేషత ఏమిటి? బ్రహ్మా బాబా శ్రేష్ఠ సంకల్పము ద్వారా లేక శ్రేష్ఠ సంకల్పము యొక్క ఆహ్వానము ద్వారా దివ్య జన్మను ప్రాప్తి చేసుకున్నారు, అలాగే శ్రేష్ఠ సంకల్పము యొక్క విశేష రచన అయిన కారణంగా తమ సంకల్పాలను శ్రేష్ఠంగా చేసుకునే విశేష అటెన్షన్లో ఉంటారు. సంకల్పాలపై అటెన్షన్ ఉన్న కారణంగా మాయ నుండి వచ్చే ఏ విధమైనటువంటి సూక్ష్మ దాడినైనా త్వరగా తెలుసుకుంటారు మరియు దానిని పరివర్తన చేసుకునేందుకు మరియు విజయులుగా అయ్యేందుకు పురుషార్థము చేసి త్వరగా దానిని అంతము చేసే ప్రయత్నము చేస్తారు. సంకల్పశక్తిని సదా శుద్ధంగా తయారుచేసుకునే అటెన్షన్ బాగుంది. స్వయమును పరిశీలించుకునే అభ్యాసము బాగుంది. సూక్ష్మ పరిశీలన కారణంగా చిన్న పొరపాటును కూడా తెలుసుకుని దానిని బాబా ముందు, నిమిత్తంగా అయిన పిల్లల ముందు ఉంచటంలో స్వచ్ఛమైన మనసు కలవారు, కనుక ఈ విధి వలన బుద్ధిలో చెత్త పేరుకోదు. చాలామంది స్వచ్ఛమైన మనసుతో మాట్లాడేందుకు సంకోచించరు, కనుక ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ దైవీ గుణాలు సహజంగా ధారణ అవుతాయి. దివ్య గుణ ధారణకు అనగా ఆహ్వానించేందుకు విధియే ‘స్వచ్ఛత’. భక్తిలోకూడా లక్ష్మీదేవినిగానీ లేక మరో దేవినిగానీ ఆహ్వానించినప్పుడు ఆహ్వానించేందుకు విధిగా స్వచ్ఛతను ఆచరిస్తారు. కనుక స్వచ్ఛతతో కూడిన ఈ శ్రేష్ఠ స్వభావము దైవీ స్వభావమును స్వతహాగానే ఆహ్వానిస్తుంది. మరి ఈ విశేషత ఎక్కువలో ఎక్కువగా డబల్ విదేశీ పిల్లలలో ఉంది కనుక తీవ్రగతితో ముందుకు వెళ్ళే బంగారు అవకాశము డ్రామా అనుసారంగా లభించింది, వీరినే ‘లాస్ట్ సో ఫాస్ట్’ (చివర్లో వచ్చినా వేగంగా వెళ్ళేవారు) అని అంటాము. కనుక వేగంగా వెళ్ళే ఈ విశేషత డ్రామా అనుసారంగా విశేషంగా లభించి ఉంది. ఈ విశేషతను సదా స్మృతిలో ఉంచుకుని లాభాన్ని పొందుతూ నడవండి. సంకల్పాలు వచ్చాయి, స్పష్టం చేసుకున్నారు మరియు అవి వెళ్ళిపోయాయి. పర్వతాన్ని దూదిపింజలా చెయ్యటము అని దీనినే అంటాము. దూది క్షణంలో ఎగిరిపోతుంది కదా. పర్వతానికి ఎంత సమయము పడ్తుంది? స్పష్టం చేసుకున్నారు, బాబా ముందు ఉంచారు మరియు స్వచ్ఛతా విధి ద్వారా ఫరిశ్తాలుగా అయ్యారు, ఎగిరారు, చివర్లో వచ్చినా తీవ్రగతితో ఎగరటము అని దీనిని అంటాము. డ్రామా అనుసారంగా ఈ విశేషత లభించి ఉంది. చాలామంది పిల్లలు పరిశీలించుకుంటారు కూడా మరియు స్వయమును మార్చుకుంటారు కూడా అన్నదానిని బాప్‌దాదా చూసారు కూడా ఎందుకంటే మేము విజయులుగా అవ్వాల్సిందే అన్న లక్ష్యము పిల్లలకు ఉంది. ఎక్కువమందికి ఈ నంబర్‌వన్ లక్ష్యము ఉంది.
రెండవ విశేషత - జన్మ తీసుకోగానే, వారసత్వమును పొందుతూ సేవలో స్వతహాగనే ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. సేవలో మునిగిపోయినట్లయితే ఒకటేమో సేవకు ప్రత్యక్షఫలంగా ‘సంతోషము’ కూడా లభిస్తుంది మరియు సేవ ద్వారా విశేషమైన బలము కూడా లభిస్తుంది, అంతేగాక సేవలో బిజీగా ఉన్న కారణంగా నిర్విఘ్నలుగా అవ్వటంలో కూడా సహయోగము లభిస్తుంది. సేవ చేసేందుకు ఉల్లాస-ఉత్సాహాలు స్వతహాగనే రావటము, సమయమును వెచ్చించటము, తమ తనువు-మనసు-ధనములను సఫలము చెయ్యటము - డ్రామా అనుసారంగా ఈ విశేషతల లిఫ్ట్ లభించి ఉంది. మీ విశేషతల గురించి తెలుసు కదా. ఈ విశేషతల వలన స్వయమును ఎంత ఉన్నతిలోకి తీసుకుపోవాలనుకుంటే అంత ఉన్నతిలోకి తీసుకుపోగలరు. డ్రామా అనుసారంగా, మేము ఆలస్యంగా వచ్చాము, కనుక ముందుకు పోలేకపోతున్నాము అని ఏ ఆత్మకుకూడా ఇటువంటి ఫిర్యాదు ఉండజాలదు. డబల్ విదేశీ పిల్లలకు తమ విశేషతల మూలంగా సువర్ణావకాశము ఉంది. భారతవాసులకు వారి సువర్ణావకాశము ఉంది. కానీ ఈరోజు డబల్ విదేశీ పిల్లలతో కలుస్తున్నారు. డ్రామాలో విశేషంగా నిశ్చితమై ఉన్న కారణంగా చివర్లోని ఏ ఆత్మ యొక్క ఫిర్యాదు నడవజాలదు ఎందుకంటే డ్రామా ఖచ్చితంగా తయారై ఉంది. ఈ విశేషతల ద్వారా సదా తీవ్రగతితో ఎగురుతూ వెళ్ళండి. అర్థమైందా? స్పష్టమైందా లేక ఇప్పుడు కూడా ఏదైనా ఫిర్యాదు ఉందా? బాబాకు దిల్ఖుష్ మిఠాయిని తినిపించారు. ‘దృఢ సంకల్పము’ చేసారు అంటే బాబాకు దిల్ఖుష్ మిఠాయిని తినిపించినట్లు. ఇది అవినాశీ మిఠాయి. ఎల్లప్పుడూ పిల్లల నోరు కూడా తియ్యగా ఉండాలి, బాబా నోరైతే తియ్యగా ఉండనే ఉంటుంది. వేరే ఏ భోగ్నూ పెట్టవద్దు, దిల్ఖుష్ మిఠాయి భోగ్నే పెట్టాలి. స్థూల భోగ్గా అయితే ఏది కావాలంటే దానిని పెట్టుకోవచ్చు కానీ మనసు సంకల్పాల భోగ్గా అయితే ఎల్లప్పుడు దిల్ఖుష్ మిఠాయినే పెడుతుండాలి.
బాప్‌దాదా సదా చెప్తారు - ఉత్తరాన్ని వ్రాసినప్పుడు కేవలము రెండు అక్షరాలతో కూడిన ఉత్తరాన్ని బాబాకు వ్రాయండి. ఆ రెండు అక్షరాలు ఏమిటి? ఓ. కె. (O.K) ఎక్కువ కాగితము, ఎక్కువ సిరా, ఎక్కువ సమయము ఖర్చు అవ్వవు. పొదుపు అయిపోతుంది. ఓ.కె. అంటే బాబా కూడా గుర్తుంటారు మరియు రాజ్యము కూడా గుర్తుంటుంది. ఓ (o) అని వ్రాసినప్పుడు బాబా చిత్రము ఏర్పడుతుంది కదా మరియు కె (K) అనగా కింగ్డమ్ (రాజ్యము). కనుక ఓ. కె. అని వ్రాసినప్పుడు బాబా మరియు వారసత్వము రెండూ గుర్తొస్తాయి. కనుక ఉత్తరాన్ని తప్పకుండా వ్రాయండి కానీ రెండు మాటలలో వ్రాసినట్లయితే ఉత్తరం చేరుకుంటుంది. ఇకపోతే మనసులోని ఉల్లాసము గురించైతే బాప్‌దాదాకు తెలుసు. మనసులోని ప్రియమైన విషయాలు మనోభిరాముడైన బాబా వద్దకు ఎలాగైనా చేరుకుంటాయి. ఇటువంటి ఉత్తరము వ్రాయటమైతే అందరికీ వస్తుంది కదా? భాష తెలియనివారు కూడా వ్రాయవచ్చు. ఇలా వ్రాయటం వలన అందరి భాష కూడా ఒకటైపోతుంది. ఇటువంటి ఉత్తరము వ్రాయటం ఇష్టమే కదా. అచ్ఛా!
ఈరోజు మొదటి గ్రూప్ వారి చివరి రోజు. సమస్యలైతే అన్నీ సమాప్తమైపోయాయి, మిగిలింది టోలీ తినటము మరియు తినిపించటము. ఇంకేమి మిగిలి ఉంది? ఇప్పుడు ఇతరులను అలా తయారుచెయ్యాలి. సేవనైతే చెయ్యాలి కదా. నిర్విఘ్న సేవాధారులుగా అవ్వండి.
సదా బాబా సమానంగా అవ్వాలన్న ఉల్లాస-ఉత్సాహాలలో ఎగిరేవారు, సదా స్వయమును పరిశీలించుకుని, పరివర్తన అయ్యి సంపూర్ణంగా అయ్యేవారు, సదా సంకల్పాలు, మాటలు, కర్మలు - ఈ మూడింటిలో శ్రేష్ఠంగా అయ్యేవారు, సదా స్వచ్ఛత ద్వారా శ్రేష్ఠతను ధారణ చేసేవారు, ఇటువంటి తీవ్రగతితో ఎగిరే విశేష ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఆస్ట్రేలియా గ్రూపులోని చిన్న పిల్లలతో బాప్‌దాదా కలయిక
అందరూ ఈశ్వరీయ విద్యార్థులు కదా! ప్రతిరోజూ చదువుకుంటారా, ఏవిధంగా ఆ చదువును చదువుకుంటారో అలా దీనిని కూడా చదువుకుంటారా? మురళి వినటము మంచిగా అనిపిస్తుందా? మురళి అంటే ఏంటో అర్థం చేసుకున్నారా? బాబాను ప్రతిరోజూ గుర్తు చేస్తారా? ఉదయం లేవగానే గుడ్‌మార్నింగ్ చెప్తారా? ఎప్పుడు కూడా గుడ్‌మార్నింగ్ చెప్పటమును మిస్ చెయ్యవద్దు. గుడ్‌మార్నింగ్ కూడా చెప్పాలి, గుడ్‌నైట్ కూడా చెప్పాలి. తినేటప్పుడు కూడా బాబాను గుర్తు చెయ్యాలి. ఆకలేస్తే బాబాను మర్చిపోవటము కాదు. తినే ముందు తప్పకుండా గుర్తుచెయ్యాలి. బాబాను గుర్తు చేసినట్లయితే చదువులో చాలా మంచి నంబర్‌ను తీసుకుంటారు ఎందుకంటే ఎవరైతే బాబాను గుర్తు చేస్తారో వారు సదా పాస్ అవుతారు, ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేరు. మరి ఎల్లప్పుడు పాస్ అవుతారా? ఒకవేళ పాస్ కాకపోతే అప్పుడు అందరూ శివబాబా పిల్లలు కూడా ఫెయిల్ అవుతారా అని అంటారు. ప్రతిరోజూ మురళిలోని ఒక పాయింట్‌ను మీ తల్లిద్వారా తప్పకుండా వినండి. అచ్ఛా! భాగ్యవిధాత ధరణికి చేరుకున్నారు కనుక చాలా భాగ్యవంతులు. బాబాను కలిసే భాగ్యము లభించింది. ఇది తక్కువ భాగ్యమేమీ కాదు.
పర్సనల్ మిలనములో బాప్‌దాదా ద్వారా ఉచ్ఛరించబడిన వరదాని మహావాక్యాలు
1. బాబా ద్వారా లభించిన సర్వ ఖజానాలను సర్వాత్మల కొరకు వినియోగించి నిండుగా అయ్యి ఇతరులను నిండుగా చేసే ఆత్మలేనా? ఎన్ని ఖజానాలు నిండుగా ఉన్నాయి? ఎవరైతే నిండుగా ఉంటారో వారు ఎల్లప్పుడూ పంచుతారు. అవినాశీ ఖజానా తెరిచి ఉంది. ఎవరు వచ్చినా నిండుగా అయ్యి వెళ్ళాలి, ఎవ్వరూ ఖాళీగా వెళ్ళలేరు. దీనినే అఖండ భండారా అని అంటాము. ఒక్కోసారి మహాదానిగా అయ్యి దానము చెయ్యండి, ఒక్కోసారి జ్ఞానిగా అయ్యి జ్ఞాన అమృతాన్ని త్రాగించండి, ఒక్కోసారి దాతగా అయ్యి, ధనదేవిగా అయ్యి ధనాన్ని ఇవ్వండి - ఇలా అందరి శుభ ఆశలను బాబా ద్వారా పూర్తి చేయించేవారు మీరు. ఖజానాలను ఎంతగా పంచుతూ ఉంటారో అంతగా అవి పెరుగుతూ ఉంటాయి. సదా అతి సంపన్నులు అని వీరిని అంటాము. ఎవ్వరు కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ‘ఓహో, మా భాగ్యము!’ అని అందరి నోటినుండి ఈ ఆశీర్వాదమే వెలువడాలి. ఇటువంటి మహాదాని, వరదానిగా అయ్యి సత్యమైన సేవాధారిగా అవ్వండి.
2. డ్రామా అనుసారంగా సేవ వరదానము కూడా సదా ఉన్నతిలోకి తీసుకువెళ్తుంది. ఒకటేమో యోగ్యత ద్వారా సేవ ప్రాప్తించటము, మరొకటి వరదానము ద్వారా సేవ ప్రాప్తించటము. స్నేహము కూడా సేవా సాధనంగా అవుతుంది. భాష తెలియకపోయినా కూడా స్నేహ భాష అన్ని భాషలకన్నా శ్రేష్ఠమైన భాష కనుక స్నేహీ ఆత్మకు ఎల్లప్పుడు సఫలత లభిస్తుంది. ఎవరికైతే స్నేహ భాష తెలుసో, వారు ఎక్కడకు వెళ్ళినా సఫలతను పొందుతారు. సేవ ఎల్లప్పుడు నిర్విఘ్నంగా నడవాలి - సేవలో సఫలత అని దీనిని అంటాము. స్నేహ విశేషత వలన ఆత్మలు తృప్తి చెందుతాయి. స్నేహ భండారము నిండుగా ఉంది, దీనిని పంచుతూ ఉండండి. బాబానుండి దేనినైతే నింపుకున్నారో దానిని పంచండి. బాబా నుండి తీసుకున్న ఈ స్నేహమే ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది.
3. స్నేహ వరదానము కూడా సేవకు నిమిత్తంగా చేస్తుంది. బాబాపై స్నేహము ఉన్నట్లయితే ఇతరులను కూడా బాబా స్నేహితులుగా తయారుచేసి సమీపంగా తీసుకువస్తారు. బాబా స్నేహమే మిమ్మల్ని బాబావారిగా తయారుచేసింది కనుక అన్నింటినీ మర్చిపోయారు. ఇటువంటి అనుభవీలుగా అయ్యి ఇతరులను కూడా అనుభవీలుగా తయారుచేస్తూ ఉండండి. సదా బాబా స్నేహములో బలిహారమైపోయే ఆత్మను అన్న నషాలో ఉండండి. బాబా మరియు సేవ - ఇటువంటి లగనమే ముందుకు వెళ్ళేందుకు సాధనము. ఎన్ని విషయాలు వచ్చినాగానీ బాబా స్నేహము, సహయోగములను ఇచ్చి ముందుకు తీసుకువెళ్తారు ఎందుకంటే స్నేహితునికి స్నేహమునకు బదులుగా అది పదమాగుణాలుగా లభిస్తుంది. స్నేహము ఎటువంటి శక్తి అంటే ఏ విషయము కూడా కష్టంగా అనిపించదు ఎందుకంటే స్నేహములో మునిగిపోతారు. దీపపు పురుగు దీపముపై బలిహారమైంది అని దీనిని అంటాము. చుట్టూ తిరుగుతుండేవారు కారు, బలిహారమయ్యేవారు. ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించేవారు. కనుక స్నేహము మరియు శక్తి - ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా ఉన్నతి చెందుతూ ఉండండి మరియు ఇతరులను ఉన్నతిలోకి తీసుకువెళ్తూ ఉండండి. బ్యాలెన్స్యే బాబా బ్లెస్సింగ్లను ఇప్పిస్తుంది మరియు ఇప్పిస్తూ ఉంటుంది. పెద్దల ఛత్రచాయ కూడా సదా ముందుకు తీసుకువెళ్తుంటుంది. బాబా ఛత్రఛాయ అయితే ఉండనే ఉంది కానీ పెద్దల ఛత్రఛాయ కూడా గోల్డెన్ ఆఫర్. కనుక ఎల్లప్పుడు అభినందనలను తెలుపుకుంటూ ఉన్నతి చెందుతున్నట్లయితే భవిష్యత్తు స్పష్టమవుతూ ఉంటుంది.
4. ప్రతి అడుగులో బాబా తోడును అనుభవము చేసేవారే కదా. ఏ పిల్లలనైతే బాబా విశేష సేవ కొరకు నిమిత్తులుగా తయారుచేసారో, నిమిత్తంగా చేయడంతో పాటు సేవలోని ప్రతి అడుగులో సహయోగిగా కూడా అవుతారు. పిల్లలు ప్రతి ఒక్కరికీ భాగ్యము యొక్క విశేషతను భాగ్యవిధాత ఇచ్చారు. ఆ విశేషతను కార్యములో వినియోగిస్తూ సదా ఉన్నతి చెందుతూ మరియు ఇతరులను ఉన్నతిలోకి తీసుకువెళుతూ ఉండండి. సేవ అయితే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మల వెనక వెనకే వచ్చేది. సేవ వెనుక మీరు పడరు, ఎక్కడకు పోతే అక్కడకు సేవ మీ వెనుకనే వస్తుంది. ఏవిధంగా ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడకు నీడ కూడా తప్పకుండా వస్తుంది. అలాగే మీరు డబల్ లైట్, కనుక మీ వెనుక సేవ కూడా నీడలా వస్తుంది కనుక సదా నిశ్చింతులుగా అయ్యి బాబా ఛత్రఛాయలో నడుస్తూ ఉండండి.
5. మనసులో ఎల్లప్పుడూ బాబా సమానంగా అవ్వాలన్న ఉల్లాసము ఉంటుంది కదా? సమానంగా అయినప్పుడే సమీపంగా ఉంటారు. సమీపంగా అయితే ఉండాలి కదా! సమీపంగా ఉండేవారి వద్ద సమానంగా అయ్యే ఉల్లాసమైతే ఉండనే ఉంటుంది మరియు సమానంగా అవ్వటము కష్టము కూడా కాదు. కేవలము ఏ కర్మ చేసినా, కర్మ చేసే ముందు, ఈ పనిని బాబా అయితే ఎలా చేస్తారు అన్నది గుర్తు తెచ్చుకోండి. కనుక ఈ స్మృతి స్వతహాగానే బాబా చేసే కర్మలాగా అనుసరింపజేస్తుంది. కూర్చుని ఆలోచించే అవసరం కూడా లేదు. మెట్లు ఎక్కుతూ-దిగుతూ కూడా ఆలోచించుకోగలరు. చాలా సహజ విధి. కనుక కేవలము బాబాతో మిలనము చేస్తూ ఉండండి మరియు తప్పకుండా సమానంగా అవ్వాల్సిందే అన్నదానిని కూడా గుర్తుంచుకున్నట్లయితే ప్రతి కర్మలో సహజంగానే సఫలతను అనుభవము చేస్తుంటారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
