‘‘స్మృతిలో రమణీయతను తీసుకువచ్చేందుకు యుక్తులు’’
తమ శ్రేష్ఠ కర్మల విధితో విధానాన్ని నిర్మాణం చేసేవారు, సదా సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలలో ఉండే పిల్లలకు ఈశ్వరీయ సిద్ధాంతాల మహత్వాన్ని వినిపిస్తూ విధాత అయిన బాప్‌దాదా ఇలా అన్నారు -
ఈరోజు విధాత, వరదాత అయిన బాప్‌దాదా తమ మాస్టర్ విధాత, వరదాత పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ విధాతలుగా కూడా అయ్యారు, వరదాతలుగా కూడా అయ్యారు. అలాగే పిల్లల పదవి ఎంత గొప్పది, ఈ సంగమయుగములోని బ్రాహ్మణ జీవితము ఎంత మహత్వము కలది అన్నదానిని కూడా బాప్‌దాదా చూసారు! బ్రాహ్మణులైన మీరు విధాత, వరదాతతోపాటు విధి-విధాతలు కూడా. మీ ప్రతి విధి సత్యయుగములో ఎలా మారుతుంది అన్నదానిని ముందు వినిపించాము. ఈ సమయములోని ప్రతి కర్మ యొక్క విధి భవిష్యత్తులో తప్పకుండా నడుస్తుంది కానీ ద్వాపరయుగము తర్వాత కూడా భక్తిమార్గములో ఈ సమయములోని శ్రేష్ఠ కర్మల విధి భక్తిమార్గపు విధిగా అవుతుంది, కనుక పూజ్యరూపములో కూడా ఈ సమయములోని విధి జీవితము యొక్క శ్రేష్ఠ విధానము రూపములో నడుస్తుంది మరియు పూజారీ మార్గములో అనగా భక్తిమార్గములో కూడా మీయొక్క ప్రతి విధి నీతి మరియు రీతిలో నడుస్తూ వస్తుంది. కనుక మీరు విధాత, వరదాత మరియు విధి విధాతలు కూడా.
మీ ముఖ్య సిద్ధాంతములు సిద్ధిని ప్రాప్తించేందుకు సాధనంగా అవుతాయి. ఎలా అయితే, ‘‘తండ్రి ఒక్కరు. ధర్మాత్మలు, మహానాత్మలు అనేకము కానీ పరమ ఆత్మ ఒక్కరే’’ అన్నది మీ ముఖ్య సిద్ధాంతము. ఈ ముఖ్య సిద్ధాంతము ద్వారా శ్రేష్ఠ ఆత్మలైన మీకు ఒక్క బాబా ద్వారా ప్రాప్తించిన వారసత్వము అర్థకల్పము సిద్ధి రూపములో ప్రాప్తిస్తుంది. ప్రాలబ్ధము లభించటము అనగా సిద్ధి స్వరూపులుగా అవ్వటము ఎందుకంటే, తండ్రి ఒక్కరు, మిగిలిన మహానాత్మలు, ధర్మాత్మలు తండ్రి కారు, వారు సోదరులు. వారసత్వము తండ్రినుండే లభిస్తుందిగానీ సోదరుని నుండి లభించదు. కనుక ఈ ముఖ్య సిద్ధాంతము ద్వారా అర్థకల్పము మీకు సిద్ధి ప్రాప్తిస్తుంది మరియు భక్తిలో కూడా ‘భగవంతుడు ఒక్కరే’ - ఈ సిద్ధాంతమే సిద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారమవుతుంది. భక్తిలోని ఆది ఆధారము కూడా ఒక్క తండ్రి యొక్క శివలింగ రూపములో ఆరంభమవుతుంది. దీనిని ‘అవ్యభిచారీ భక్తి’ అని అంటారు. కనుక భక్తిమార్గములో కూడా తండ్రి ఒక్కరు అన్న ఈ సిద్ధాంతము ద్వారానే సిద్ధి ప్రాప్తిస్తుంది. అలాగే మీ ముఖ్య సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఒక్కొక్క సిద్ధాంతము ద్వారా సిద్ధి ప్రాప్తిస్తుంటుంది. ఎలా అయితే, ఈ జీవితము యొక్క ముఖ్య సిద్ధాంతము ‘పవిత్రత’. ఈ పవిత్రతా సిద్ధాంతము ద్వారా ఆత్మలైన మీకు భవిష్యత్తులో సిద్ధి స్వరూపము రూపములో ప్రకాశ కిరీటము ఎల్లప్పుడూ ప్రాప్తిస్తుంది, దీని స్మృతిచిహ్న రూపంగా రెండు కిరీటాలను చూపిస్తారు మరియు భక్తిలో కూడా యథార్థంగా మరియు మనస్ఫూర్తిగా భక్తి చేసినట్లయితే పవిత్రతా సిద్ధాంతమును ముఖ్య ఆధారంగా భావిస్తారు మరియు పవిత్రత లేకుండా భక్తి యొక్క సిద్ధి ప్రాప్తించజాలదు అని భావిస్తారు. అల్పకాలము కొరకు చేసినా, ఎంత సమయము భక్తి చేస్తారో, అంత సమయమే పవిత్రతను ఆచరించినా కానీ ‘పవిత్రతయే సిద్ధికి సాధనము’ - ఈ సిద్ధాంతమును తప్పకుండా అనుసరిస్తారు. ఇదేవిధంగా, ప్రతి ఒక్క సిద్ధాంతము సిద్ధికి ఎలా సాధనమవుతుంది అని ప్రతి ఒక్క జ్ఞాన సిద్ధాంతము మరియు ధారణల ముఖ్య సిద్ధాంతములను గురించి మీ బుద్ధితో ఆలోచించండి. దీని గురించి మననము చేసే పనిని ఇస్తున్నాము. ఉదాహరణను వినిపించాము కదా, ఈ విధంగా ఆలోచించండి.
కనుక మీరు విధి విధాతలుగా కూడా అవుతారు, సిద్ధి దాతలుగా కూడా అవుతారు కనుక ఇప్పటివరకు కూడా భక్తులు ఎవరెవరికి ఏ ఏ సిద్ధి కావాలంటే దానిని భిన్న-భిన్న దేవతల ద్వారా భిన్న-భిన్న సిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకై దానికి సంబంధించిన దేవతను పూజిస్తారు. కనుక సిద్ధి దాత అయిన బాబా ద్వారా మీరు కూడా సిద్ధి దాతలుగా అవుతారు - ఇలా స్వయాన్ని భావిస్తున్నారు కదా. స్వయానికి ఎవరికైతే సర్వ సిద్ధులు ప్రాప్తించాయో, వారే ఇతరులకు కూడా సిద్ధిని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తులుగా అవ్వగలరు. సిద్ధి చెడు విషయమేమీ కాదు ఎందుకంటే మీది రిద్ధి-సిద్ధి కాదు. రిద్ధి-సిద్ధి ఏదైతే ఉందో అది అల్పకాలము కొరకు ప్రభావశాలిగా ఉంటుంది. కానీ మీ సిద్ధి యథార్థ విధి ద్వారా పొందిన సిద్ధి. ఈశ్వరీయ విధి ద్వారా సిద్ధి ఏదైతే ప్రాప్తిస్తుందో, ఆ సిద్ధి కూడా ఈశ్వరీయ సిద్ధి. ఎలా అయితే ఈశ్వరుడు అవినాశిగా ఉన్నారో అలాగే ఈశ్వరీయ విధి మరియు సిద్ధి కూడా అవినాశి అయినవి. రిద్ధి-సిద్ధులను చూపించేవారు స్వయము అల్పజ్ఞులు, కనుక వారి సిద్ధి కూడా అల్పకాలమునకు చెందినది. కానీ మీ సిద్ధి, సిద్ధాంతము యొక్క విధి ద్వారా పొందిన సిద్ధి కనుక అర్థకల్పము స్వయమూ సిద్ధి స్వరూపులుగా అవుతారు మరియు అర్థకల్పము మీ సిద్ధాంతము ద్వారా భక్త ఆత్మలు యథా శక్తి తథా ఫలము యొక్క ప్రాప్తిని మరియు సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ వస్తారు ఎందుకంటే భక్తి యొక్క శక్తి కూడా సమయానుసారంగా తక్కువవుతూ వస్తుంది. సతోప్రధాన భక్తి యొక్క శక్తి భక్త ఆత్మలకు సిద్ధి యొక్క అనుభూతిని నేటి భక్తుల కంటే కూడా ఎక్కువగా చేయిస్తుంది. ఈ సమయములోని భక్తి తమోప్రధాన భక్తి అయిన కారణంగా యథార్థ సిద్ధాంతమూ లేదు, సిద్ధీ లేదు.
మరి మేము ఎవరము అని మీకు అంత నషా ఉంటుందా! సదా ఈ శ్రేష్ఠ స్వమానము యొక్క స్థితి అనే సీట్‌పై సెట్ అయి ఉంటున్నారా? ఎంత ఉన్నతమైన సీటు! ఎప్పుడైతే ఈ స్థితి అనే సీటుపై సెట్ (స్థిరంగా) అయ్యి ఉంటారో అప్పుడు పదే-పదే అప్సెట్(అస్థిరంగా) అవ్వరు. ఇది పొజిషన్ కదా. ఎంత పెద్ద పొజిషన్ - విధి విధాత, సిద్ధి దాత! ఈ పొజిషన్లో స్థితులైనప్పుడు మాయ అపోజిషన్ చెయ్యదు(విరోధించదు). ఎప్పుడూ సురక్షితంగా ఉంటారు. అప్సెట్ అయ్యేందుకు కారణము ఏమిటంటే తమ శ్రేష్ఠ స్థితి అనే సీటు నుండి సాధారణ స్థితిలోకి వచ్చేస్తారు. స్మృతిలో ఉండటము మరియు సేవ చెయ్యటము అనేవి ఒక సాధారణ దినచర్యలా అయిపోతుంది. కానీ స్మృతిలో కూర్చున్నప్పుడు ఏదో ఒక శ్రేష్ఠ స్వమానమనే మీ సీటుపై కూర్చోండి. కేవలం యోగం చేసే స్థానంలో, యోగ గదిలో, బాబా గదిలో లేక మంచంపై నుండి లేచి కూర్చోవడము లేక రోజంతా ఎక్కడో ఒక చోట యోగంలో కూర్చోవడము కాదు, ఎలాగైతే శరీరానికి ఒక యోగ్య స్థానమును ఇస్తారో, అలా ముందు బుద్ధికి స్థితి అనే స్థానాన్ని ఇవ్వండి. బుద్ధికి సరైన స్థానాన్ని ఇచ్చానా అని ముందు ఈ విషయాన్ని చెక్ చేసుకోండి. అప్పుడు ఆ సీట్ నుండి స్వతహాగానే ఈశ్వరీయ నషా వస్తుంది. ఈరోజుల్లో కూడా ‘కుర్చీ యొక్క నషా’ అంటారు కదా! మీకైతే శ్రేష్ఠ స్థితి అనే ఆసనము ఉంది. ఒక్కోసారి ‘మాస్టర్ బీజరూపము’ యొక్క స్థితి అనే ఆసనముపై, సీట్‌పై సెట్ అవ్వండి, మరోసారి ‘అవ్యక్త ఫరిశ్తా’ అనే సీటుపై సెట్ అవ్వండి, ఒకసారి ‘విశ్వ కల్యాణకారీ స్థితి’ అనే సీట్‌పై సెట్ అవ్వండి - ఇలా ప్రతిరోజూ రకరకాల స్థితులనే ఆసనముపై లేక సీట్‌పై సెట్ అయ్యి కూర్చోండి.
ఒకవేళ ఎవరికైనా సీటు సెట్ అవ్వకపోతే కదులుతూ ఉంటారు కదా - ఒక్కోసారి ఇటు కదిల్తే, ఒక్కోసారి అటు కదుల్తుంటారు. అలాగే ఈ బుద్ధి కూడా సీట్‌పై సెట్ అవ్వనప్పుడు అలజడిలోకి వస్తుంది. మేము ఇది-ఇది అని అయితే అందరికీ తెలుసు. మీరు ఎవరు అని ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే పెద్ద లిస్టు బాగా తయారవుతుంది. కానీ, దేనినైతే తెలుసుకున్నారో అదే స్వయము అని నమ్మండి. కేవలము తెలుసుకోవటము కాదు, ఒప్పుకోండి ఎందుకంటే తెలుసుకోవటము ద్వారా అవును, నేను ఇటువంటివాడిని అని సూక్ష్మంగా సంతోషమైతే ఉంటుంది. అంగీకరించడం ద్వారా శక్తి లభిస్తుంది, అంగీకరించి దాని అనుసారంగా నడుచుకున్నప్పుడు నషా వస్తుంది. ఏ పొజిషన్ కలవారైనా సీటుపై సెట్ అయ్యి ఉంటే సంతోషము ఉంటుంది కానీ శక్తి ఉండదు. కనుక తెలుసుకున్నారు కానీ దానిని ఒప్పుకొని నడవండి మరియు నేను సీటుపై సెట్ అయ్యానా లేక సాధారణ స్థితిలో కిందకు వచ్చేసానా అని పదే-పదే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, చెక్ చేసుకోండి. ఎవరైతే ఇతరులకు సిద్ధిని ఇచ్చేవారిగా ఉంటారో వారు స్వయం ప్రతి సంకల్పములో, ప్రతి కర్మలో తప్పకుండా సిద్ధి స్వరూపులుగా ఉంటారు, దాతలుగా ఉంటారు. నేను ఎంత పురుషార్థము చేస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో అంతగా సిద్ధి కనిపించటం లేదు లేక స్మృతిలో ఎంత అభ్యాసము చేస్తున్నానో అంత సిద్ధి అనుభవమవ్వటం లేదు అని సిద్ధి దాతలు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించను కూడా ఆలోచించలేరు. సీటుపై సెట్ అయ్యి ఉండే విధి యథార్థంగా లేదు అని దీనిద్వారా నిరూపణ అవుతుంది.
జ్ఞానము రమణీయమైనది. రమణీయమైన అనుభవాలు స్వతహాగానే సోమరితనాన్ని పారద్రోలుతాయి. చాలామంది, మాకు మామూలుగా నిద్ర రాదు కానీ యోగంలో తప్పకుండా నిద్ర వస్తుంది అని అంటుంటారు కదా. ఇలా ఎందుకు అవుతుంది? అలసిపోయారని కాదు కానీ రమణీయమైన రీతితో మరియు సహజమైన రూపంలో బుద్ధిని సీటుపై సెట్ చెయ్యరు. కనుక కేవలము ఒక్క రూపంలో కాకుండా రకరకాల రూపాలలో సెట్ చెయ్యండి. ఒకటే వస్తువును ఒకవేళ వెరైటీ రూపాలలోకి మార్చి ఉపయోగించినట్లయితే మనసు సంతోషపడుతుంది. ఎంత రుచికరమైన వంటకమైనాగానీ ఒకవేళ ఒకేదానిని పదే-పదే తింటుంటే, చూస్తుంటే ఏమవుతుంది? అలాగే, బీజరూపులుగా అవ్వండి కానీ ఒకసారి లైట్-హౌస్ రూపంలో, ఒక్కోసారి మైట్-హౌస్ రూపంలో, ఒకసారి వృక్షము పైన బీజము రూపంలో, ఒకసారి సృష్టిచక్రముపై పూర్తిగా పైన నిలబడి అందరికీ శక్తిని ఇవ్వండి. భిన్న-భిన్న టైటిల్స్ ఏవైతే లభిస్తాయో, వాటిని ప్రతిరోజూ భిన్న-భిన్న టైటిల్స్‌గా అనుభవము చెయ్యండి. ఒకసారి, కంటిపాపగా అయ్యి బాబా నయనాలలో ఇమిడి ఉన్నాను - అన్న ఇటువంటి స్వరూపమును అనుభూతి చెయ్యండి. ఒకసారి, మస్తకమణిగా అయ్యి, ఒకసారి సింహాసనాధికారిగా అయ్యి... ఇలా భిన్న-భిన్న స్వరూపాల అనుభవమును చెయ్యండి. వెరైటీగా చేసినట్లయితే రమణీయత వస్తుంది. బాప్‌దాదా ప్రతిరోజూ మురళిలో రకరకాల టైటిళ్ళను ఇస్తారు, ఎందుకని ఇస్తారు? ఆ సీటుపై సెట్ అయిపోండి మరియు కేవలము మధ్యమధ్యలో పరిశీలించుకోండి. ఈ విషయాన్ని మర్చిపోతుంటారని ముందు కూడా వినిపించి ఉన్నాము. 6 గంటలు, 8 గంటలు గడిచిపోతాయి, తరువాత ఆలోచిస్తారు. సగం రోజైతే గడిచిపోయిందే అని తరువాత బాధపడతారు. సహజంగా అభ్యాసమైపోవాలి, అప్పుడే విధి-విధాతలుగా మరియు సిద్ధి దాతలుగా అయ్యి విశ్వములోని ఆత్మల కల్యాణము చెయ్యగలరు. అచ్ఛా!
ఈరోజు మధువనము వారి రోజు. డబల్ విదేశీయులు తమ సమయము యొక్క అవకాశాన్ని మీకు ఇచ్చారు ఎందుకంటే మధువన నివాసులను చూసి సంతోషిస్తారు. మహిమ చెయ్యద్దు, మహిమను చాలా విన్నాము అని మధువనమువారు అంటారు. మహిమను వినటం వలననే మహానులుగా అవుతున్నారు ఎందుకంటే ఈ మహిమయే ఢాలుగా అవుతుంది. యుద్ధములో ఢాలు రక్షణకు సాధనంగా అవుతుంది కదా. కనుక ఈ మహిమ కూడా మేము ఎంతటి మహానులము అన్న స్మృతిని కలిగిస్తుంది. మధువనము, కేవలము మధువనము కాదు, మధువనము విశ్వ స్టేజ్ (విశ్వ రంగస్థలము). మధువనములో ఉండటము అనగా విశ్వ స్టేజ్‌పై ఉండటము. ఎవరైతే స్టేజ్‌పై ఉంటారో, వారు ఎంత అటెన్షన్‌తో ఉంటారు! సాధారణంగా అయితే ఎవరు ఏ స్థానంలో ఉన్నా అంతగా అటెన్షన్ ఉండదు కానీ స్టేజ్ పైకి వచ్చినప్పుడు మాత్రం ప్రతి సమయము, ప్రతి కర్మపై ఎంతో అటెన్షన్ ఉంటుంది. మరి మధువనము విశ్వ స్టేజ్. నలువైపుల ఉన్నవారి దృష్టి మధువనము పైనే ఉంటుంది. మామూలుగా కూడా అందరి అటెన్షన్ స్టేజ్ పైకే పోతుంది కదా. మధువన నివాసులు సదా విశ్వ స్టేజ్‌పై స్థితులై ఉంటారు.
అలాగే మధువనము ఒక విచిత్రమైన గుమ్మటము వంటిది. గుమ్మటములో వచ్చే శబ్దము దాని లోపలే ఉంటుంది కానీ మధువనము ఎటువంటి విచిత్రమైన గుమ్మటమంటే మధువనములోని చిన్నపాటి శబ్దము కూడా విశ్వమంతా వ్యాపిస్తుంది. కేవలం నామమాత్రంగా ఇప్పుడు మిగిలి ఉన్న పాతకాలపు చాలా స్థానాలు ఎలా ఉన్నాయంటే ఒక గోడను చేతితో తాకినా లేక అక్కడ శబ్దం చేసినా, పది గోడలలో ఆ శబ్దము వస్తున్నట్లుగా, గోడను ఎవరో కదిలిస్తున్నట్లుగా లేక శబ్దం చేస్తున్నట్లుగా వినిపిస్తుంది. మధువనము ఎటువంటి విచిత్రమైన గుమ్మటము అంటే మధువనములోని శబ్దము కేవలము మధువనము వరకే ఉండదు కానీ నలువైపులకు వ్యాపిస్తుంది. ఎలా వ్యాపిస్తుందంటే మధువనములో ఉండేవారికి అది తెలియను కూడా తెలియదు. విచిత్రము కదా, బయటకు చేరుకుంటుంది. కనుక, ఇక్కడ చూసాము లేక ఇక్కడ మాట్లాడాము.... అని ఇలా భావించకండి, కానీ ఈ శబ్దము గాలి వేగంతో విశ్వమంతా వ్యాపిస్తుంది ఎందుకంటే అందరి దృష్టిలో, బుద్ధిలో సదా మధువనము మరియు మధువనములోని బాప్దాదాయే ఉంటారు. కనుక ఎప్పుడైతే మధువనములోని బాబా దృష్టిలో ఉంటారో అప్పుడు మధువనము కూడా వస్తుంది కదా! మధువనపు బాబా కనుక మధువనమైతే వస్తుంది కదా మరియు మధువనములో కేవలము బాబానే లేరు, పిల్లలు కూడా ఉన్నారు. కనుక మధువనవాసులు స్వతహాగానే అందరి దృష్టిలోకి వస్తారు. బ్రాహ్మణులెవరినైనా అడగండి, ఎంత దూరంలో ఉన్నాగానీ స్మృతిలో ఏముంటుంది? ‘మధువనము మరియు మధువన బాబా’! మరి మధువనవాసులకు ఇంతటి మహత్వము ఉంది. అర్థమైందా? అచ్ఛా!
నలువైపుల సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేవారందరూ, సదా ఒక్క బాబా స్నేహములో మునిగిపోయి ఉండేవారు, సదా ప్రతి కర్మలో శ్రేష్ఠ విధి ద్వారా సిద్ధిని అనుభవము చేసేవారు, సదా స్వయమును విశ్వ కళ్యాణకారులుగా అనుభవము చేసి ప్రతి సంకల్పముతో, మాటతో, శ్రేష్ఠ కల్యాణ భావన మరియు శ్రేష్ఠ కామనలతో సేవలో బిజీ ఉండేవారు, ఇటువంటి బాబా సమానమైన సదా అలసిపోని సేవాధారులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మధుబన్ నివాసులతో వరదాన రూపంలో ఉచ్ఛరించబడ్డ మహావాక్యాలు
1. స్వయమును కర్మయోగి శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవము చేస్తారా? కర్మయోగి ఆత్మ సదా కర్మ యొక్క ప్రత్యక్ష ఫలమును స్వతహాగానే అనుభవము చేస్తుంది. ప్రత్యక్ష ఫలము – ‘సంతోషము మరియు శక్తి’. కనుక కర్మయోగి ఆత్మ అనగా ప్రత్యక్షఫలమైన ‘సంతోషము మరియు శక్తుల’ను అనుభవము చేసేవారు. బాబా ఎల్లప్పుడూ పిల్లలకు ప్రత్యక్షఫలమును ప్రాప్తింపచేసేవారు. ఇప్పుడిప్పుడే కర్మ చేసారు, కర్మ చేస్తూ సంతోషము మరియు శక్తుల అనుభవము చేసారు! ఇటువంటి కర్మయోగి ఆత్మను - అన్న ఈ స్మృతితో ముందుకు వెళ్తూ ఉండండి.
2. అనంతమైన సేవ చెయ్యటం వలన అనంతమైన సంతోషము స్వతహాగానే అనుభవమవుతుంది కదా! అనంతమైన తండ్రి అనంతమైన అధికారిగా తయారుచేస్తారు. అనంతమైన సేవకు ఫలంగా అనంతమైన రాజ్య భాగ్యము స్వతహాగానే ప్రాప్తిస్తుంది. అనంతమైన స్థితిలో స్థితులై సేవ చేసినట్లయితే ఏ ఆత్మలకైతే నిమిత్తులుగా అవుతారో, వారి ఆశీర్వాదాలు స్వతహాగానే ఆత్మలో ‘శక్తి’ మరియు ‘సంతోషము’ల అనుభూతిని చేయిస్తాయి. ఒక స్థానములో కూర్చుని కూడా అనంతమైన సేవా ఫలము లభిస్తూ ఉంది - ఈ అనంతమైన నషాతో అనంతమైన ఖాతాను జమ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి.
3. సదా ప్రతి కార్యాన్ని చేస్తూ స్వయాన్ని సాక్షి స్థితిలో స్థితి చేసుకుని కార్యమును చేసే అతీతమైన ఆత్మను – ఇలా అనుభవం చేస్తున్నారా? సాక్షి స్థితి ద్వారా ప్రతి కార్యము సహజంగానే సఫలమవుతుంది. సాక్షి స్థితి ఎంతో ప్రియమైనది! సాక్షిగా అయ్యి కార్యము చేసే ఆత్మ సదా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉంటుంది. ఈ అభ్యాసంతో కర్మను చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతి, అలౌకిక జీవితము, శ్రేష్ఠ జీవతము కలిగిన ఆత్మను – ఈ నషా ఉంటుంది కదా? కర్మ చేస్తూ ఈ అభ్యాసాన్ని పెంచండి. ఈ అభ్యాసమే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేయిస్తుంది. ఈ అభ్యాసాన్ని ముందుకు తీసుకెళ్తూ, కర్మ చేస్తూ అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉండండి. వీరినే శ్రేష్ఠ ఆత్మ అంటాము.
4. సదా శ్రేష్ఠ ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మను – ఈ అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైతే తరగని ఖజానాలతో నిండుగా ఉంటారో వారికి ఆత్మిక నషా ఎంత ఉంటుంది! సదా సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నాను – ఈ ఆత్మిక సంతోషంతో ముందుకు వెళ్తూ ఉండండి. సర్వ ఖజానాలు సర్వ ఆత్మలను మేలుకొలిపి తోడుగా ఉంటాయి. కనుక, నిండుగా మరియు శక్తిశాలి ఆత్మగా అయి ముందుకు వెళ్తూ ఉండండి.
5. చేయించే బాబా చేయిస్తున్నారు, మేము నిమిత్తమాత్రులం అన్న విషయం సదా బుద్ధిలో గుర్తుంటుంది కదా! నిమిత్తంగా అయ్యి చేసేవారు సదా తేలికగా ఉంటారు ఎందుకంటే బాధ్యుడు చేయించే తండ్రి కాబట్టి. ‘నేను చేస్తున్నాను’- ఇలా అనుకుంటే భారీగా అవుతారు, బాబా చేయిస్తున్నారు అనుకుంటే తేలికగా ఉంటారు. నేను నిమిత్తుడిని, చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు – వీరిని నిశ్చింత చక్రవర్తి అంటాము. చేయించేవారు చేయిస్తున్నారు. ఈ విధితో సదా ముందుకు వెళ్తూ ఉండండి.
6. బాబా ఛత్రఛాయలో ఉండే శ్రేష్ఠ ఆత్మను – ఈ అనుభూతే ఉంటుంది కదా! ఎవరైతే ఇప్పుడు ఈ ఛత్రఛాయలో ఉంటారో వారే ఛత్రధారులుగా అవుతారు. ఛత్రఛాయలో ఉండే భాగ్యశాలి ఆత్మను – ఈ సంతోషం ఉంటుంది కదా. ఛత్రఛాయే సురక్షతకు సాధనము. ఈ ఛత్రఛాయ లోపలకు ఎవ్వరూ రాలేరు. బాబా ఛత్రఛాయ లోపల ఉన్నాను – ఈ చిత్రాన్ని సదా మీ ఎదురుగా పెట్టుకోండి.
7. సదా మీ ఆత్మిక ఫరిశ్తా స్వరూపము స్మృతిలో ఉంటుందా? బ్రాహ్మణ్ సో ఫరిశ్తా, ఫరిశ్తా సో దేవత – ఈ పొడుపు కథను పరిష్కరించారు కదా! పొడుపు కథలు పరిష్కరించడం వచ్చు కదా! సెకండులో బ్రాహ్మణ్ సో దేవత, దేవత సో చక్రంలో తిరుగుతూ బ్రాహ్మణ్, తర్వాత దేవత. హమ్ సో, సో హమ్ అనే పొడుపు కథ సదా బుద్ధిలో ఉంటుందా? ఎవరైతే పొడుపు కథను పరిష్కరిస్తారో వారికే బహుమతి లభిస్తుంది. మరి మీకు బహుమానం లభించింది కదా! ఇప్పుడు లభించిన బహుమతి భవిష్యత్తులో కూడా లభించదు! బహుమతిగా ఏమి లభించింది? స్వయంగా భగవంతుడే లభించారు, భగవంతుడికి అయ్యారు. భవిష్య రాజ్యం ముందు ఈ ప్రాప్తి ఎంత ఉన్నతమైనది! సదా బహుమతిని తీసుకునే శ్రేష్ఠ ఆత్మను – ఈ నషా మరియు సంతోషంతో సదా ముందుకు వెళ్తూ ఉండండి. పొడుపు కథ మరియు బహుమానం రెండూ సదా గుర్తుంటే ముందుకు స్వతహాగా వెళ్తూ ఉంటారు.
8. సదా ‘దృఢత్వము సఫలతకు తాళం చెవి’ - ఈ విధితో వృద్ధిని పొందే శ్రేష్ఠ ఆత్మను, ఇలా అనుభవం అవుతుంది కదా. దృఢ సంకల్పము యొక్క విశేషత కార్యంలో సహజంగానే విజయిగా చేసి విశేష ఆత్మగా చేస్తుంది. ఏ కార్యంలో అయినా విశేష ఆత్మగా అయితే అప్పుడు అందరి ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తాయి. స్థూలంగా ఎవ్వరూ ఆశీర్వాదాలు ఇవ్వరు, ఇవి సూక్ష్మమైనవి, వీటితో ఆత్మలో శక్తి నిండుతుంది మరియు స్వ ఉన్నతిలో సహజంగా సఫలత లభిస్తుంది. మరి సదా దృఢత్వము యొక్క గొప్పదనంతో సఫలతను పొందే మరియు సర్వుల ఆశీర్వాదాలను తీసుకునే శ్రేష్ఠ ఆత్మను – ఈ స్మృతితో ముందుకు వెళ్తూ ఉండండి.
9. బాప్‌దాదా యొక్క విశేషమైన అలంకారము కదా! అన్నిటికన్నా శ్రేష్ఠమైన అలంకారము – మస్తకమణి. మణి సదా మస్తకముపై మెరుస్తుంది. మరి ఇటువంటి మస్తకమణిగా అయ్యి సదా బాబా కిరీటంలో మెరిసేవారు ఎంత బాగా అనిపిస్తారో! మణి సదా తన మెరుపు ద్వారా బాబాకు కూడా అలంకారంగా అవుతుంది మరియు ఇతరులకు కూడా ప్రకాశాన్ని ఇస్తుంది. మరి ఇటువంటి మస్తకమణిగా అయ్యి ఇతరులను కూడా ఇలా తయారు చేసే ఆత్మను – ఈ లక్ష్యం సదా ఉంటుందా? సదా శుభ భావన సర్వుల భావనలను పరివర్తన చేస్తుంది.
10. సదా బాబాను ఫాలో చేయడంలో త్వరిత దానము మహాపుణ్యము యొక్క విధితో ముందుకు వెళ్తూ ఉండండి. ఈ విధిని సదా ప్రతి కార్యంలో ఉపయోగిస్తే సదా బాబా సమాన స్థితి స్వతహాగా అనుభవం అవుతుంది. కనుక, ప్రతి కార్యంలో ఫాలో ఫాదర్ చేయడంలో ఆది నుండి అనుభవీలుగా ఉన్నారు, కనుక ఇప్పుడు కూడా ఈ విధితో సమానంగా అవ్వడము అతి సహజము ఎందుకంటే ఇమిడి ఉన్న విశేషతను కార్యంలో వినియోగించండి. బాబా సమానంగా అయ్యే విశేష అలౌకిక అనుభూతులను చేస్తూ ఉంటారు మరియు ఇతరులకు కూడా చేయిస్తూ ఉంటారు. ఈ విశేషత యొక్క వరదానము స్వతహాగా లభించింది. మరి ఈ వరదానాన్ని సదా కార్యంలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి.
11. సదా పరివర్తన శక్తిని యథార్థ రీతిలో కార్యంలో వినియోగించే శ్రేష్ఠ ఆత్మ కదా! ఈ పరివర్తన శక్తితో సర్వుల ఆశీర్వాదాలను పొందేందుకు యోగ్యులుగా అవుతారు. ఎలా అయితే, ఘోరమైన అంధకారము కలిగినప్పుడు వెలుగును చూపిస్తే అంధకారంలో ఉన్నవారి మనసుల నుండి ఆశీర్వాదాలు వెలువడతాయో, అలాగే ఎవరైతే యథార్థమైన పరివర్తన శక్తిని కార్యంలో వినియోగిస్తారో, వారికి అనేక ఆత్మల ద్వారా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి, ఆ ఆశీర్వాదాలు ఆత్మను సహజంగా ముందుకు తీసుకువెళ్తాయి. అలాగే, ఆశీర్వాదాలు తీసుకునే కార్యాన్ని చేసే ఆత్మను – ఇది సదా గుర్తుంటే ఏ కార్యం చేసినా, ఆశీర్వాదాలను తీసుకునేటువంటి కార్యములే చేస్తారు. శ్రేష్ఠ కార్యాలు చేసినప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక సదా ఇది గుర్తుంచుకోండి – అందరినుండి ఆశీర్వాదాలు తీసుకునే ఆత్మను – ఈ స్మృతియే శ్రేష్ఠంగా తయారు చేసే సాధనము, ఈ స్మృతియే అనేకుల కళ్యాణానికి నిమిత్తంగా చేస్తుంది. కనుక గుర్తుంచుకోండి – పరివర్తన శక్తి ద్వారా సర్వుల ఆశీర్వాదాలను తీసుకునే ఆత్మను. అచ్ఛా!
*** ఓంశాంతి ***
