‘‘త్రిదేవుల రచయిత ద్వారా వరదానాల ప్రాప్తి’’
ఈరోజు త్రిదేవుల రచయిత తమ సాకారీ మరియు ఆకారీ రచనను చూస్తున్నారు. రెండు రచనలు అతి ప్రియమైనవి అందుకే రచయిత, రచనను చూసి హర్షిస్తున్నారు. రచన సదా ‘‘వాహ్ రచయిత’’ అని సంతోషం యొక్క పాటను పాడుతుంది మరియు రచయిత సదా ‘‘వాహ్ నా రచన’’ అనే పాటను పాడుతారు. రచన ప్రియమైనది. ఎవరైతే ప్రియమైనవారు ఉంటారో, వారికి ఎల్లప్పుడూ అన్నీ ఇచ్చి సంపన్నంగా చేస్తారు. కనుక తండ్రి ప్రతి ఒక్క శ్రేష్ఠ రచనను విశేషంగా మూడు సంబంధాలతో ఎంతో సంపన్నంగా చేసారు. తండ్రి సంబంధంతో దాతగా అయి జ్ఞాన ఖజానాలతో సంపన్నంగా చేసారు, శిక్షకుని రూపంలో భాగ్య విధాతగా అయి అనేక జన్మల కోసం భాగ్యవంతులుగా చేసారు, సద్గురువు రూపంలో వరదాతగా అయి వరదానాలతో జోలెని నింపుతారు. ఇది అవినాశీ స్నేహము లేక ప్రేమ. ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో, వారి లోపం మంచిగా అనిపించదు, లోపాన్ని అద్భుతంలోకి పరివర్తన చేస్తారు - ఇదే ప్రేమ యొక్క విశేషత. తండ్రికి పిల్లల లోపాలను అద్భుతంలోకి పరివర్తన చేయాలని సదా శుభ సంకల్పం ఉంటుంది. ప్రేమ కారణంగా తండ్రి పిల్లల శ్రమను చూడలేకపోతారు. ఏదైనా శ్రమ తప్పనిసరి అయితే చేయండి కానీ బ్రాహ్మణ జీవితంలో శ్రమ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దాత, విధాత మరియు వరదాత - మూడు సంబంధాలతో ఎంత సంపన్నంగా అయిపోతారంటే, శ్రమ చేయకుండానే ఆత్మిక ఆనందంలో ఉండగలరు. వారసత్వం కూడా ఉంది, చదువు కూడా ఉంది మరియు వరదానాలు కూడా ఉన్నాయి. ఎవరికైతే మూడు రూపాలతో ప్రాప్తి ఉంటుందో, అటువంటి సర్వ ప్రాప్తులు ఉన్న ఆత్మకు శ్రమ చేయాల్సిన అవసరం ఏముంటుంది! ఒక్కోసారి వారసత్వం రూపంలో లేక తండ్రిని దాత రూపంలో స్మృతి చేయండి, అప్పుడు ఆత్మిక అధికారీతనం యొక్క నషా ఉంటుంది. శిక్షకుని రూపంలో స్మృతి చేసినట్లయితే, గాడ్లీ స్టూడెంట్ అనగా భగవంతుని విద్యార్థిని అన్న భాగ్యం యొక్క నషా ఉంటుంది. సద్గురువు ప్రతి అడుగులో వరదానాలతో నడిపిస్తున్నారు. ప్రతి కర్మలో శ్రేష్ఠ మతం - వరదాత యొక్క వరదానము. ఎవరైతే ప్రతి అడుగు శ్రేష్ఠ మతంపై నడుస్తారో, వారికి ప్రతి అడుగులో కర్మలో సఫలత అనే వరదానం సహజంగా, స్వతహాగా మరియు తప్పకుండా ప్రాప్తిస్తుంది. సద్గురువు ఇచ్చే మతం శ్రేష్ఠమైన గతిని ప్రాప్తి చేయిస్తుంది. గతి-సద్గతిని ప్రాప్తి చేయిస్తుంది. శ్రేష్ఠ మతం మరియు శ్రేష్ఠ గతి. తమ మధురమైన ఇల్లు అనగా గతి, మధురమైన రాజ్యం మనగా సద్గతి. దీనినైతే ప్రాప్తి చేసుకుంటారు. కానీ బ్రాహ్మణాత్మలకు ఇంకా విశేషమైన గతి ప్రాప్తిస్తుంది. అది ఏమిటంటే, ఈ సమయంలో కూడా శ్రేష్ఠ మతం యొక్క శ్రేష్ఠ కర్మలకు సఫలత అనే ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ఈ శ్రేష్ఠ గతి కేవలం సంగమయుగంలోనే బ్రాహ్మణులైన మీకు ప్రాప్తిస్తుంది. అందుకే అంటారు - ఎలాంటి మతమో అలాంటి గతి అని. మరణించిన తర్వాత గతి లభిస్తుంది అని వారు భావిస్తారు. అందుకని అంతమతి సో గతి అని అంటారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీకు ఈ అంతిమ మరజీవా జన్మలో ప్రతి కర్మకు సఫలత అనే ఫలం అనగా ‘గతి’ ప్రాప్తి అయ్యేటువంటి వరదానం లభించి ఉంది. వర్తమానం మరియు భవిష్యత్తులో - సదా గతి-సద్గతి ఉండనే ఉంది. భవిష్యత్తు కోసం వేచి ఉండరు. సంగమయుగపు ప్రాప్తికి ఈ మహత్వం ఉంది. ఇప్పుడిప్పుడే కర్మ చేయండి మరియు ఇప్పుడిప్పుడే ప్రాప్తి యొక్క అధికారాన్ని తీసుకోండి. దీనిని అంటారు - ఒక చేతితో ఇవ్వడము, రెండవ చేతితో తీసుకోవడము. ఎప్పుడైనా లభిస్తుంది లేక భవిష్యత్తులో లభిస్తుంది, అని ఇలా ఓదార్చుకునే వ్యాపారం కాదు. ‘త్వరిత దానం మహాపుణ్యం’, ఇది అటువంటి ప్రాప్తి. దీనిని తక్షణ వ్యాపారం అని అంటాము. భక్తిలో, లభిస్తుంది, లభిస్తుంది... అని ఎదురుచూస్తూ ఉంటారు. భక్తిలో ఎప్పుడో అని ఉంటే, తండ్రి ఇప్పుడే తీసుకోండి అని అంటారు. ఆది స్థాపనలో కూడా మీ ప్రసిద్ధత ఉండేది, ఇక్కడ తక్షణమే సాక్షాత్కారం జరుగుతుంది అని మరియు అలా జరిగేది కూడా. కనుక ఆది నుండి తక్షణం యొక్క వ్యాపారం అయ్యింది. రచయితకు రచన పైన గల సత్యమైన ప్రేమ అని దీనినే అంటాము. మొత్తం కల్పంలో ఇటువంటి ప్రేమ ఇంకేదీ ఉండనే ఉండదు. ఎంత ప్రసిద్ధి చెందిన ప్రేమికులున్నా కానీ ఇదైతే అవినాశీ ప్రేమ మరియు అవినాశీ ప్రాప్తి కనుక ఇటువంటి ప్రేమ ఇంకేదీ ఉండనే ఉండదు. అందుకే తండ్రికి పిల్లల శ్రమ పైన దయ కలుగుతుంది. వరదానులు సదా వారసత్వానికి అధికారులు. ఎప్పుడూ శ్రమ చేయజాలరు. భాగ్య విధాత శిక్షకుడి యొక్క భాగ్యవంతులైన పిల్లలు సదా పాస్ విత్ ఆనర్‌గా అవుతారు. వారు ఫెయిల్ అవ్వరు, వ్యర్థమైన విషయాల కోసం ఫీల్ అవ్వరు.
శ్రమ చేయడానికి కారణాలు రెండే ఉంటాయి - అయితే మాయ విఘ్నాలతో ఫెయిల్ అయిపోతారు లేక సంబంధ-సంపర్కంలో, బ్రాహ్మణులతో కావచ్చు, అజ్ఞానులతో కావచ్చు - రెండు సంబంధాలలోనూ కర్మలలోకి వస్తూ చిన్న విషయాలలో వ్యర్థంగా ఫీల్ అవుతారు. దీనిని మీరు ‘ఫ్లూ’యొక్క వ్యాధి అని అంటారు. ఫ్లూ ఏం చేస్తుంది? ఒకటైతే వణకడం (అలజడి) జరుగుతుంది, అక్కడ శరీరం కదులుతుంది మరియు ఇక్కడ ఆత్మ యొక్క స్థితి కదులుతుంది, మనసు కదులుతుంది మరియు ముఖం చేదుగా అయిపోతుంది. ఇక్కడ కూడా ముఖం ద్వారా చేదు మాటలు మాట్లాడడం మొదలుపెడతారు. ఇంకేం జరుగుతుంది. అప్పుడప్పుడు చలి, అప్పుడప్పుడు వేడి పెరుగుతుంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఫీలింగ్ వస్తుందో, అప్పుడు లోపల ఆవేశం వస్తుంది, వేడి పెరుగుతుంది. వీరు ఇలా ఎందుకు అన్నారు, ఇది ఎందుకు చేసారు? ఇది ఆవేశము. అనుభవీలుగా ఉన్నారు కదా. ఇంకేం జరుగుతుంది? తినడం, తాగడం ఏమీ మంచిగా అనిపించదు. ఇక్కడ కూడా ఎవరైనా మంచి జ్ఞానం యొక్క విషయం వినిపించినా కూడా, అది వారికి మంచిగా అనిపించదు. చివరికి ఫలితం ఏమవుతుంది? బలహీనత వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కొంత సమయం వరకు బలహీనత నడుస్తుంది. అందుకని ఫెయిల్ అవ్వకండి, ఫీల్ అవ్వకండి. బాప్‌దాదా శ్రేష్ఠమైన మతాన్ని ఇస్తారు. శుద్ధమైన ఫీలింగ్‌లో ఉండండి - నేను సర్వ శ్రేష్ఠము అనగా కోటిలో ఒక్కరిగా ఉన్న ఆత్మను, నేను దేవాత్మను, మహాన్ ఆత్మను, బ్రాహ్మణాత్మను, విశేష పాత్ర ధారి ఆత్మను. ఈ ఫీలింగ్‌లో ఉన్నవారికి వ్యర్థ ఫీలింగ్ యొక్క ‘ఫ్లూ’ ఉండదు. ఈ శుద్ధ ఫీలింగ్‌లో ఉండండి. ఎక్కడైతే శుద్ధ ఫీలింగ్ ఉంటుందో, అక్కడ అశుద్ధ ఫీలింగ్ ఉండజాలదు. కనుక ‘ఫ్లూ’ యొక్క వ్యాధి నుండి అనగా శ్రమ నుండి రక్షింపబడతారు. మరియు సదా స్వయాన్ని ఎలా అనుభవం చేస్తారు అంటే, మేము వరదానాలతో పాలింపబడుతున్నాము, వరదానాలతో ముందుకు ఎగురుతున్నాము, వరదానాలతో సేవలో సఫలతను పొందుతున్నాము.
శ్రమ మంచిగా అనిపిస్తుందా లేక శ్రమ చేసే అలవాటు పక్కా అయిపోయిందా? శ్రమ మంచిగా అనిపిస్తుందా లేక ఆనందంలో ఉండడం మంచిగా అనిపిస్తుందా? కొంతమందికి శ్రమతో కూడిన పని తప్ప వేరే ఏ పని మంచిగా అనిపించదు. వారిని కుర్చీలో విశ్రాంతిగా కూర్చోబెట్టినా, మాకు కష్టపడే పని ఇవ్వండి అని అంటారు. ఇక్కడ ఇది ఆత్మ యొక్క శ్రమ. ఆత్మ 63 జన్మలు శ్రమ చేసి అలసిపోయింది. 63 జన్మలు వెతుకుతూనే ఉన్నారు కదా. ఎవరికైనా వెతకడం కష్టమనిపిస్తుంది కదా. కనుక ముందే అలసిపోయి ఉన్నారు. 63 జన్మలు కష్టపడ్డారు. ఇప్పుడీ ఒక్క జన్మ అయినా ఆనందంగా ఉండండి. 21 జన్మలంటే అది భవిష్యత్తు యొక్క విషయము. కానీ ఈ ఒక్క జన్మ విశేషమైనది. శ్రమ మరియు ఆనందము - రెండింటినీ అనుభవం చేయగలరు. భవిష్యత్తులో అయితే ఈ విషయాలన్నీ మర్చిపోతారు. మజా అయితే ఇప్పుడే ఉంది. ఇతరులు శ్రమ చేస్తున్నారు, మీరు ఆనందంలో (మజాగా) ఉన్నారు. అచ్ఛా.
టీచర్లు భక్తి చేసారా? ఎన్ని జన్మలు భక్తి చేసారు? ఈ జన్మలో అయితే చేయలేదు కదా! మీ భక్తి, ముందు జన్మలోనే పూర్తి అయింది. అయితే భక్తి ఎప్పుడు ప్రారంభం చేసారు? ఎవరితో పాటు ప్రారంభించారు? బ్రహ్మా తండ్రితో పాటు మీరు కూడా భక్తి చేసారు. ఏ మందిరంలో చేసారు? మరి భక్తిలో కూడా మీరు ఆది ఆత్మలే, జ్ఞాన మార్గంలో కూడా మీరు ఆది ఆత్మలే. భక్తి ఆదిలో అవ్యభిచారి భక్తి ఉన్న కారణంగా భక్తిలోని ఆనందము, సుఖము ఆ సమయమనుసారంగా తక్కువేమీ అవ్వలేదు. ఆ సుఖము మరియు ఆనందం కూడా తమ స్థానంలో శ్రేష్ఠంగా ఉండేవి.
మీరు భక్త మాలలో ఉన్నారా? భక్తి మీరే మొదలు పెట్టినప్పుడు భక్త మాలలో మీరు లేరా? డబల్ విదేశీయులు భక్త మాలలో ఉన్నారా? భక్తులుగా అయ్యారా లేక భక్త మాలలో ఉన్నారా? మేము ఉన్నామా లేదా, అని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు! విజయమాలలో కూడా ఉన్నారు, భక్త మాలలో కూడా ఉన్నారా? పూజారిగా అయితే అయ్యారు కానీ భక్త మాలలో ఉన్నారా? భక్త మాల వేరు. మీరైతే జ్ఞానుల నుండి భక్తులుగా అయ్యారు. వారైతే ఉన్నదే భక్తులు. కనుక భక్త మాలకు మరియు జ్ఞానుల యొక్క మాలకు తేడా ఉంది. జ్ఞానుల యొక్క మాలనే విజయమాల. మరియు ఎవరైతే కేవలం భక్తుల్లో, అమితమైన భక్తి చేసేవారో, భక్తి తప్ప మరే ఇతర విషయాలను వినాలని కూడా అనుకోరో, అటువంటివారు భక్తినే శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. కనుక భక్తుల మాల వేరు, జ్ఞానుల మాల వేరు. భక్తి తప్పకుండా చేసారు కానీ భక్త మాలలో ఉన్నారని అనరు ఎందుకంటే భక్తి పాత్ర పోషించిన తర్వాత మీ అందరూ జ్ఞానంలోకి వచ్చేది ఉంది. వారు అమితమైన భక్తి కలవారు, మీరు అమితమైన జ్ఞానులు. ఆత్మలో సంస్కారాల యొక్క తేడా ఉంది. భక్తులు అనగా సదా అడిగే సంస్కారం కలవారు. నేను నీచమైనవాడను, తండ్రి ఉన్నతమైనవారు - ఈ సంస్కారాలు ఉంటాయి. వారు రాయల్ బికారులు మరియు ఆత్మలైన మీరు అధికారీతనపు సంస్కారం ఉన్నవారు. అందుకే పరిచయం లభించడంతోనే అధికారిగా అయిపోయారు. అర్థమయిందా? భక్తులకు కూడా ఏదైనా స్థానమివ్వండి కదా. రెండింటిలో మీరే వస్తారా ఏమిటి? వారిది కూడా అర్థకల్పం ఉంది, మీది కూడా అర్థకల్పం ఉంది. వారు కూడా గాయన మాలలో వచ్చేదే ఉంది. వారు కూడా ప్రపంచంలోని వారి కంటే మంచివారు. వేరేవైపు బుద్ధి లేదు, తండ్రి వైపే ఉంటుంది. శుద్ధంగా అయితే ఉంటారు. పవిత్రత వలన - ‘‘గాయనయోగ్యులుగా’’ అయ్యేటువంటి ఫలితం లభిస్తుంది. మీకు పూజ జరుగుతుంది, వారికి పూజ జరగదు. కేవలం గాయనం కోసం విగ్రహాలు తయారుచేసి పెడతారు. మీరాకు ఎప్పుడూ మందిరం అన్నది ఉండదు. దేవతల వలె మీరాకు పూజ జరగదు, కేవలం గాయనం జరుగుతుంది. ఇప్పుడు చివరి జన్మలో ఎవరినైనా పూజించనివ్వండి, ధరణిని కూడా పూజించనివ్వండి, వృక్షాలను కూడా పూజించనివ్వండి కానీ నియమానుసారంగా వారికి కేవలం గాయనం జరుగుతుంది, పూజ కాదు. మీరు పూజ్యులుగా అవుతారు. కనుక మీరు పూజ్యనీయ ఆత్మలు - ఈ నషా సదా స్మృతిలో పెట్టుకోండి. పూజ్యాత్మలను ఎప్పుడూ ఏ అపవిత్ర సంకల్పమూ టచ్ కూడా చేయలేదు. అటువంటి పూజ్యులుగా అయ్యారా! అచ్ఛా.
నలువైపులా ఉన్న వారసత్వానికి అధికారి ఆత్మలకు, సదా చదువులో పాస్ విత్ ఆనర్ అయ్యేవారు, సదా వరదానాల ద్వారా వరదానులుగా అయి ఇతరులను కూడా వరదానులుగా తయారుచేసేవారు - ఇలా తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువుకు ప్రియమైనవారైనటువంటి, సదా ఆత్మిక ఆనందంలో ఉండేటటువంటి శ్రేష్ఠాత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పంజాబ్-రాజస్థాన్ గ్రూప్:- సదా స్వయాన్ని హోలీ హంసలుగా అనుభవం చేస్తున్నారా? హోలీ హంస అనగా సమర్థాన్ని మరియు వ్యర్థాన్ని పరిశీలించేవారు. ఆ హంసలైతే రాళ్ళను మరియు రత్నాలను వేరు చేస్తాయి, ముత్యాలను మరియు రాళ్ళను వేరు చేస్తాయి. కానీ హోలీ హంసలైన మీరు దేనిని పరిశీలించేవారు? సమర్థమేమిటి, వ్యర్థమేమిటి, శుద్ధమేమిటి మరియు అశుద్ధమేమిటి. ఎలాగైతే హంస ఎప్పుడూ రాళ్ళను తీసుకోదో, వేరు చేసి ఉంచేస్తుందో, విడిచిపెట్టేస్తుందో, గ్రహించదో, అలాగే హోలీ హంసలైన మీరు వ్యర్థాన్ని విడిచిపెడతారు మరియు సమర్థ సంకల్పాలను ధారణ చేస్తారు. ఒకవేళ వ్యర్థం వచ్చినా కూడా, ధారణ చేయరు. ఒకవేళ వ్యర్థాన్ని ధారణ చేసినట్లయితే, హోలీ హంసలు అని అనరు. దానినైతే కొంగ ధారణ చేస్తుంది. వ్యర్థమైతే చాలా విన్నారు, మాట్లాడారు, చేసారు. కానీ దాని పరిణామం ఏం జరిగింది? పోగొట్టుకున్నారు, అంతా పోగొట్టుకున్నారు కదా. తనువును కూడా పోగొట్టుకున్నారు. దేవతల తనువును చూడండి మరియు ఇప్పటి తనువును చూడండి ఎలా ఉంది, ఎంత తేడా ఉంది! యువత కన్నా వృద్ధులు మంచిగా ఉన్నారు. కనుక తనువును కూడా పోగొట్టుకున్నారు, మనసు యొక్క సుఖ-శాంతులను కూడా పోగొట్టుకున్నారు, ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు. మీ వద్ద ఎంత ధనం ఉండేది? అపారమైన ధనమంతా ఎక్కడికి వెళ్ళింది? వ్యర్థంగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు జమ చేసుకుంటున్నారా లేక పోగొట్టుకుంటున్నారా? హోలీ హంసలు పోగొట్టుకునేవారు కాదు, జమ చేసుకునేవారు. ఇప్పుడు 21 జన్మలు తనువు కూడా మంచిది లభిస్తుంది మరియు మనసు కూడా సదా సంతోషంగా ఉండేదిగా ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు మట్టి ఉంటుందో, అక్కడ ధనం అలా ఉంటుంది. ఇప్పుడు మట్టి కూడా విలువైనది అయిపోయింది కానీ అక్కడ రత్నాలతో ఆడుకుంటారు, రత్నాలతో ఇంటి యొక్క అలంకరణ ఉంటుంది. కనుక ఎంత జమ చేసుకుంటున్నారు! ఎవరి వద్దనైతే జమ అవుతుందో, వారికి సంతోషం ఉంటుంది. ఒకవేళ జమ లేనట్లయితే మనసు చిన్నది అయిపోతుంది. జమ ఉన్నట్లయితే, మనసు పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద మనసు అయిపోయింది! కనుక ప్రతి అడుగులో జమ యొక్క ఖాతా పెరుగుతూ ఉందా లేక అప్పుడప్పుడు జమ చేస్తున్నారా? తమ చార్టును మంచి రీతిలో చూసుకున్నారా? ఇటువంటి సమయంలో కూడా అప్పుడప్పుడు వ్యర్థం వైపు అయితే వెళ్ళడం లేదు కదా? ఇప్పుడైతే సమయం యొక్క విలువ తెలిసింది కదా. సంగమం యొక్క ఒక క్షణం ఎంత గొప్పది! ఒకటి, రెండు క్షణాలే పోయాయి అని అనడమైతే అంటారు కానీ ఒక్క క్షణం కూడా ఎంత గొప్పది. ఇది గుర్తున్నట్లయితే ఒక్క క్షణాన్ని కూడా పోగొట్టుకోరు. క్షణాన్ని పోగొట్టుకోవడం అనగా సంవత్సరాన్ని పోగొట్టుకోవడము. సంగమంలో ఒక్క క్షణానికి కూడా ఇంత మహత్వం ఉంటుంది! కనుక జమ చేసుకునేవారు, పోగొట్టుకునేవారు కాదు ఎందుకంటే అయితే పోగొట్టుకోవడమైనా జరుగుతుంది లేదా సంపాదించడమైనా జరుగుతుంది. మొత్తం కల్పంలో సంపాదించే సమయం ఇప్పుడే. కనుక హోలీ హంసలు అనగా స్వప్నంలో, సంకల్పంలో కూడా ఎప్పుడూ వ్యర్థంగా పోగొట్టుకోరు.
హోలీ అనగా సదా పవిత్రతా శక్తి ద్వారా అపవిత్రతను ఒక క్షణంలో పారద్రోలేవారు. కేవలం స్వయం కోసమే కాదు, ఇతరుల కొరకు కూడా ఎందుకంటే మొత్తం విశ్వమంతటినీ పరివర్తన చేయాలి కదా. పవిత్రతా శక్తి ఎంత గొప్పది, ఇదైతే తెలుసు కదా. పవిత్రత ఎటువంటి అగ్ని అంటే అది సెకండులో విశ్వములోని మురికినంతా భస్మం చేయగలదు. సంపూర్ణ పవిత్రత ఇటువంటి శ్రేష్ఠమైన శక్తి. అంతిమంలో ఎప్పుడైతే అందరూ సంపూర్ణమైపోతారో, అప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పాల లగ్నమనే అగ్నిలో ఈ చెత్త అంతా భస్మమైపోతుంది. యోగము జ్వాల వలె ఉండాలి. అంతిమంలో ఇలా నెమ్మది-నెమ్మదిగా సేవ జరగదు. ఆలోచించారు మరియు జరిగింది. దీనినే విహంగ మార్గపు సేవ అని అంటాము. ఇప్పుడు స్వయంలో నింపుకుంటున్నారు, తర్వాత కార్యంలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు దేవీల స్మృతిచిహ్నంలో జ్వాలతో అసురులను భస్మం చేసినట్లు చూపిస్తారు. అసురులను కాదు, అసుర శక్తులను సమాప్తం చేసేసారు. ఇది ఏ సమయం యొక్క స్మృతిచిహ్నము? ఇప్పటిదే కదా. కనుక ఇటువంటి జ్వాలా ముఖులుగా అవ్వండి. మీరు అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? కనుక ఇప్పుడు జ్వాలా ముఖులుగా అయి అసుర సంస్కారాలను, అసుర స్వభావాలను అన్నింటినీ భస్మం చేయండి. మీవైతే భస్మం చేసేసారు కదా లేక మీవి కూడా ఇప్పుడు చేస్తున్నారా? అచ్ఛా.
పంజాబ్:- పంజాబ్ వారు నిర్భయులుగా అయిపోయారు. భయపడేవారైతే కాదు కదా? మీరు జ్వాలా ముఖులు, ఇక భయమెందుకు? మీరు మరణించే ఉన్నారు, ఇక ఎవరికి భయపడాలి? రాజస్థాన్ వారు అయితే ‘‘రాజ్య అధికారాన్ని’’ ఎప్పుడూ మర్చిపోకూడదు. రాజ్యాన్ని మర్చిపోయి రాజస్థాన్‌లోని ఇసుక అయితే గుర్తు రాదు కదా. అక్కడ ఇసుక చాలా ఉంటుంది కదా. కనుక సదా కొత్త రాజ్యం యొక్క స్మృతి ఉండాలి. అందరూ నిర్భయంగా జ్వాలా ముఖులుగా అయి ప్రకృతి మరియు ఆత్మలలో ఉన్న తమోగుణాన్ని భస్మం చేసేవారిగా అవ్వండి. ఇది చాలా పెద్ద పని, వేగంగా చేసినప్పుడే పూర్తి అవుతుంది. ఇప్పుడైతే వ్యక్తులకు కూడా ఏ సందేశం చేరుకోలేదు. ఇక ప్రకృతి విషయం తర్వాత. కనుక వేగాన్ని తీవ్రతరం చేయండి. వీధి-వీధిలో సెంటరు ఉండాలి ఎందుకంటే పరిస్థితులు అనుసారంగా ఒక వీధి నుండి మరొక వీధిలోకి కూడా వెళ్ళలేకపోతారు. ఒకరినొకరు చూసుకోను కూడా చూసుకోలేరు. కనుక ఇంటింటిలో, వీధి వీధిలో సెంటరు ఉండాలి కదా. అచ్ఛా.
ఒరిస్సా, గుల్బర్గా, విశాఖపట్నం గ్రూప్ :- మూడు స్థానాల వారూ సదా ఏకరస స్థితిలో స్థితులై ఉంటున్నారా? శరీరాల స్థానాలు వేర్వేరుగా ఉన్నాయి, కానీ ఆత్మల స్థానం ఒక్కటే. ఎక్కడి నుండి వచ్చినా కానీ స్థితి సదా ఏకరసంగా ఉండాలి. ఏకరస స్థితి అంటే ఏమిటి? ఒక్కరి స్మృతిలో ఉండటం అనగా ఏకరస స్థితిలో ఉండటం. ఒక్కరికి బదులుగా వేరే ఎవరైనా గుర్తుకువస్తే ఏకరసానికి బదులుగా బహురస స్థితి అయిపోతుంది. మరి అందరూ ఏకరసంగా ఉండేవారా లేక అప్పుడప్పుడు వేరే రసం లాగుతుందా? ఎప్పుడైనా పిల్లపాపలు ఆకర్షిస్తున్నారా? ‘ఇతర రసమేదైనా ఆకర్షించిన ఆ సమయంలోనే ఒకవేళ మీ అంతిమ సమయం వస్తే రిజల్ట్ ఏమవుతుంది, ఉన్నత పదవిని పొందగలరా?’ అని సదా ఆలోచించండి. కాబట్టి ఒక్క సెకనులో ఏదైనా జరగవచ్చు అని సదా ఇలాగే భావించండి! ప్రతి సెకను అటెన్షన్ ఉంచుకోండి. సదా ‘ఒక్కటి’ అనే పాఠాన్ని పక్కాగా ఉంచుకోండి. ఒక్క తండ్రి, ఒక్కటే సంగమ సమయం, ఏకరస స్థితిలో ఉండాలి మరియు ఒక్క బాబా నుండే సర్వ ప్రాప్తులనూ పొందాలి. ‘ఒక్కటి’ అనే పాఠం చదవడం వచ్చా? అందరూ సత్యయుగంలోనే రావాలి కదా! లేదా త్రేతాయుగంలో రాజుగా మారితే బాగుంటుందా? బ్రాహ్మణ జీవితం అనగా సంపూర్ణ జీవితం. సంపూర్ణ ఆత్మ సత్యయుగంలోకి వస్తుంది. బ్రాహ్మణులుగా మారి ఒక యుగం సుఖాన్ని పొంది, మరొక యుగం సుఖాన్ని పొందకపోతే ఇక ఏమి చేసినట్లు! అందువలన ఉన్నతోన్నతమైన బాబా ద్వారా సదాకాలం కొరకు ఉన్నతోన్నతమైన 21 జన్మల ఆస్తి హక్కును తీసుకునేవారము అనే ఈ విషయాన్ని సదా గుర్తుంచుకోండి. సంపూర్ణంగా మారాలనే లక్ష్యం ఉంచుకున్నప్పుడు లక్షణాలు కూడా అలాగే ధారణ చేయండి. ఒకవేళ లక్ష్యమే బలహీనంగా ఉంటే లక్షణాలు కూడా బలహీనంగానే ఉంటాయి. బాప్‌దాదా పిల్లలందరినీ ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుతున్నారు, నంబర్‌వన్‌గా చేస్తున్నారు తప్ప సెకండ్ నంబర్‌గా చేయట్లేదు. దాత పూర్తి స్థాయిలో ఇస్తున్నప్పుడు తీసుకునేవారు తక్కువగా ఎందుకు తీసుకోవాలి? పూర్తిగా తీసుకోవాలి కదా. అచ్ఛా!
అన్ని స్థానాలూ నిర్విఘ్న స్థానాలేనా లేక విఘ్నాలు వస్తున్నాయా? బాప్‌దాదా వద్దకు అన్ని సమాచారాలూ చేరుతాయి. ఎంతెంతగా శక్తిశాలి ఆత్మలుగా మారతారో అంతగా ఈ విఘ్నాలు సమాప్తమైపోతాయి, విఘ్నాలు రావడానికి ధైర్యం కూడా చేయవు. ప్రస్తుతం రావడానికి ధైర్యం చేస్తున్నాయి; మీరు వాటిని తొలగించినప్పటికీ వస్తున్నాయి కదా! అసలు రావడమే ఎందుకు? స్వయం యొక్క లగ్నము కారణంగా విఘ్నాలు దూరం నుండే కిందకు పడిపోవాలి, మీరు పైన ఉండాలి. ఎందుకంటే విఘ్నాలలో సమయం ఇవ్వాల్సి వస్తుంది కదా. వాతావరణం మారుతుంది కదా. స్వయంగా నిర్విఘ్నంగా ఉన్నప్పటికీ సెంటర్‌పై మాటిమాటికీ విఘ్నాలు వస్తే అందులో కూడా సమయం ఇవ్వాల్సి వస్తుంది, వాతావరణం మారిపోతుంది. మరి విఘ్నాలు సదా బలహీనంగా ఉండేలా, మీరు సర్వశక్తిమంతుడిగా ఉండేలాంటి పవర్ఫుల్ వాతావరణాన్ని ఎందుకు తయారుచేయకూడదు, అలాంటి ధైర్యం ఉందా? చూడండి, తేదీ గుర్తుంచుకోండి. ప్రకృతి శక్తే వాతావరణాన్ని పరివర్తన చేయగలిగినప్పుడు, వేడిని చల్లగా, చల్లనిదానిని వేడిగా మార్చగలిగినప్పుడు మీరు చేయలేనిది ఏముంది? కాబట్టి వాతావరణాన్ని పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దండి. ఎందుకంటే మొదట స్వయాన్ని నిర్విఘ్నంగా తయారుచేసుకోవాలి, ఆ తర్వాత ఇతరులను కూడా నిర్విఘ్నంగా చేయాలి - ఇదే నిజమైన సేవ. సేవలు తీసుకునేవారు కారు, సేవాధారులు. బహుకాలం విఘ్నాల వశమవుతూ ఉంటే అంతిమంలో నిర్విఘ్నంగా ఉండలేరు. అందువలన బహుకాలపు నిర్విఘ్న స్థితి కావాలి. కాబట్టి ఇప్పుడు విఘ్నాలను రానివ్వకండి. బలహీన ఆత్మలకు కూడా బాబా ద్వారా లభించిన శక్తులను అందించి శక్తిశాలురుగా తీర్చిదిద్దండి - ఇదే శ్రేష్ఠమైన సేవ. పరిచయం ఇవ్వడం, కోర్సు చేయించడం పెద్ద విషయం కాదు; కానీ ఆత్మలను శక్తిశాలురుగా తయారుచేయడమే సత్యమైన సేవ. మీరు ధైర్యం వహిస్తే బాబా సహాయం చేస్తారు. అచ్ఛా!
గుజరాత్ గ్రూప్ :- సదా తమను తాము నిశ్చయబుద్ధి కల విజయి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? నిశ్చయానికి గుర్తే విజయం. స్వయంపై లేదా బాబాపై నిశ్చయం ఉంటే నిశ్చయానికి విజయం లభించకపోవడం అనేది అసలు జరగనే జరగదు. ఒకవేళ విజయం సగమే లభించి, పూర్తి స్థాయిలో లభించకపోతే దానికి కారణం నిశ్చయంలో లోపమే. నిశ్చయము మరియు విజయము పరస్పరం పక్కా సహచరులు. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం ఖాయం. ఎందుకంటే బాబా సర్వశక్తిమంతుడు అనే నిశ్చయం ఉంది, మరి సర్వశక్తిమంతుడైన బాబాపై నిశ్చయం ఉన్నప్పుడు విజయం లభించకుండా ఎలా ఉంటుంది! మరియు ‘నేను మాస్టర్ సర్వశక్తిమంతుడిని’ అనే నిశ్చయం స్వయంపై కూడా ఉన్నప్పుడు ఇక విజయం ఎక్కడికి పోతుంది? నిశ్చయబుద్ధి కలవారికి ఎన్నడూ ఓటమి ఉండజాలదు. నిశ్చయబుద్ధి కలవారు ఇతరులను కూడా ఓటమి నుండి విడిపించేవారు, స్వయంగా ఎలా ఓటమి పాలవుతారు? కాబట్టి విజయులుగా మారడానికి పునాది ‘నిశ్చయం’. పునాది పక్కాగా ఉంటే భవనం కదలలేదు, నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ పునాది బలహీనంగా ఉంటే కొద్దిపాటి తుఫాను వచ్చినా, భూమి కొద్దిగా కంపించినా ఈ భవనం కూలిపోతుందేమో లేదా బీటలు వారుతుందేమో అనే భయం ఉంటుంది. అదే పునాది పక్కాగా ఉంటే నిర్భయంగా ఉంటారు. అలాగే నిశ్చయం అనే ఫౌండేషన్ పక్కాగా ఉంటే ఎలాంటి తుఫానూ కదిలించలేదు. మరి ఇలాంటి విజయులేనా లేక అప్పుడప్పుడు కొద్దిగా బీటలు వారుతున్నాయా? లేదా అప్పుడప్పుడు కిటికీలు, తలుపుల అద్దాలు ఊగుతున్నాయా? తుఫాను వచ్చినా లేదా భూమిలో అలజడి చెలరేగినా ఏమవుతుంది? అలజడి అయితే చెలరేగట్లేదు కదా! అలజడిలోనూ అచలంగా ఉండటం - దీనినే నిశ్చయబుద్ధి విజయీ రత్నము అంటారు. కేవలం బాబాపై నిశ్చయం మాత్రమే కాదు, స్వయంపై నిశ్చయము మరియు డ్రామాపై కూడా నిశ్చయం ఉండాలి. వాహ్ డ్రామా వాహ్! డ్రామాపై నిశ్చయం ఉంటే అకళ్యాణకరమైన విషయం కూడా కళ్యాణంగా మారిపోతుంది. నిశ్చయంలో అంతటి శక్తి ఉంది! చూడటానికి అకళ్యాణకరమైన విషయంగా కనిపిస్తుంది, కానీ అందులోనూ కళ్యాణం దాగి ఉంటుంది. మొదట కదిలించడానికి అలాంటి రూపం వస్తుంది కూడా, కానీ మిమ్మల్ని కదిలించలేదు. ఇలా పక్కాగా ఉన్నారా లేక కాస్త అటూఇటూ ఊగుతున్నారా? సంకల్పంలో లేదా స్వప్నంలోనూ కదలట్లేదు కదా? ఎందుకంటే సంకల్పంలో కూడా కొద్దిపాటి బలహీనత వచ్చినా ఆ సంకల్ప ప్రభావం వాణిపై పడుతుంది, వాణి ప్రభావం కర్మపై పడుతుంది. అందుకే బాబా మొదట సంకల్పాన్నే మార్చేశారు; ‘నేను శరీరాన్ని కాను, ఆత్మను’ అని మీరు సంకల్పం చేస్తారు. ఇది శుద్ధ సంకల్పం, ఈ సంకల్పంతో జీవితమే మారిపోయింది. ఒకవేళ సంకల్పాలు బలహీనంగా ఉంటే జీవితం కూడా బలహీనంగా మారిపోతుంది.
కాబట్టి ‘నేను మాస్టర్ సర్వశక్తిమంతుడిని’ అనే నిశ్చయం సదా ఉండాలి. మాయ ఎంతగా కదిలించినా మీరు కదలడం లేదు కదా? ఎవరైనా మాయకు భయపడుతున్నారా ఏంటి? అందరూ ధైర్యవంతులేనా లేక మాయ రాకూడదు అని ఆలోచిస్తున్నారా? అర్థకల్పం మాయకు సహచరులుగా ఉన్నారు, ఇప్పుడైతే రానివ్వట్లేదు. ఎందుకంటే ఇది అన్నింటికంటే పెద్ద శత్రువు అని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంతకుముందు మాయ అంటే ఏమిటో తెలిసేది కాదు. మాయాజీత్గా అవ్వడం అనగా అర్థమే - నిశ్చయబుద్ధి విజయి. కాబట్టి ప్రతి కర్మ చేసే ముందూ నిశ్చయం పక్కాగా ఉండాలి. అయినా చూడండి, ఎవరైనా శక్తివంతులు, ధైర్యవంతులు కాకపోతే ఏదైనా పని చేసేముందు ‘చేయగలమా, చేయలేమా; అవుతుందో, కాదో’ అనే బలహీన సంకల్పం చేస్తారు. శక్తివంతుడికి ఈ సంశయం రాదు. ఈ బరువైన వస్తువును ఎత్తండి అని వారికి చెబితే వెంటనే ఎత్తేస్తారు, అదే బలహీనుడికి చెబితే ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ‘ఈ పని చాలా బాగుంది కానీ అవుతుందో లేదో?’ అనే ఇలాంటి ఆలోచన నడుస్తుందా? మాయ యొక్క అనేక రూపాలను తెలుసుకున్నారు, నాలెడ్జ్‌ఫుల్‌గా మారిపోయారు కదా. మాయ కూడా రకరకాల రూపాలతో వస్తుంది. పది రూపాల ద్వారా వీరు నన్ను గుర్తుపట్టేస్తారు అని దానికి కూడా తెలుసు. అందుకే సరికొత్త రూపాలను ధరిస్తుంది. అప్పుడు ‘నాకు ఈ విషయమే తెలియదు, ఇలా కూడా జరుగుతుందా ఏంటి!’ అని అంటారు. కానీ నాలెడ్జ్‌ఫుల్ ఎన్నడూ ఇలా ఆలోచించరు, అతనికి తెలుసు. కాబట్టి అందరూ నిశ్చయబుద్ధి విజయులే కదా! విజయం జన్మసిద్ధ అధికారం. జన్మసిద్ధ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు. అచ్ఛా!
మాతలు నిశ్చయంలో పక్కాగా ఉన్నారా లేక పాండవులా? ఎవరినైనా ముందుంచితే, ఇతరులను ముందుంచడం అంటే స్వయం ముందు ఉన్నట్లే. పాండవులు మాతలను ముందుంచుతున్నారా? మాతలు రక్షణ కవచం, కవచాన్ని ముందుంచుతారా లేక మేమే ముందున్నాము అనుకుంటున్నారా? అయినా చూడండి, మాతలు పాలన చేస్తారు, పాలనా సంస్కారాలు మాతలలో ఉంటాయి; కాబట్టి మాతలు మాయ నుండి రక్షించే పాలనను చక్కగా చేస్తారు. అలాంటి మాతలేనా లేక స్వయంగా ఓటమి పాలయ్యేవారా? దృఢంగా ఉన్నారు కదా. బాబా మాతల కొరకు ఇంతగా చెప్తున్నారు, ఒకవేళ మాతలే బలహీనమైతే అందరూ బలహీనమైపోతారు. ఎన్నడూ కచ్చా కావద్దు, సదా పక్కాగానే ఉండాలి. అచ్ఛా! చిన్న పిల్లలు కూడా చాలా తెలివిగలవారు. చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులకు గురువులుగా మారిపోతారు. అచ్ఛా!
బాబా, మీరు మరియు డ్రామా - ఈ మూడు నిశ్చయాలూ వెన్నంటే ఉండాలి. సంకల్పంలో కూడా ఎవరూ కదిలించలేకపోవాలి. అంగదుడిలా మారిపోండి. గోరును కూడా కదిలించలేకపోవాలి. కాలు సంగతి పక్కన పెడితే గోరును కూడా మాయ కదిలించలేదు. అలాంటి అంగదుడిలా అయిపోండి. అయినా గుజరాత్ భూమిలో ఏదో ఒక భావన ఉంటూనే ఉంటుంది. ఆ భావనకు ఫలితంగా ‘జ్ఞానం’ లభించింది. మంచిది - తమ సహచరుల పట్ల దయ కలగాలి, జాలి కలగాలి. ఎందుకంటే నిన్న మనం ఎలా ఉండేవాళ్ళమో, నేడు ఎలా మారామో తెలుసు కదా! తమ జీవిత అనుభవాల ద్వారా ఇతరులపై దయ కలుగుతుంది కదా! దయా హృదయులుగా మారి సాధ్యమైనంత ఎక్కువమంది తమ సహచరులను మేల్కొల్పండి. అచ్ఛా! అందరూ సంతుష్టంగా ఉన్నారు కదా! లేక ఎవరితోనైనా కాస్త అసంతుష్టంగా అవుతున్నారా? కొందరితో సంతుష్టంగా, కొందరితో అసంతుష్టంగానా! పరస్పరం ఎన్నడూ అసంతుష్టం కావట్లేదు కదా? ఫలానా వారికి అవకాశం లభిస్తోంది, మాకు లభించట్లేదు - ఇలా అయితే అనుకోవట్లేదు కదా! బాప్‌దాదా వద్దకు అన్ని సమాచారాలూ వస్తాయి. చిన్నచిన్న విషయాలే ఉంటాయి, పెద్దవి కావు. కానీ ఏది జరిగినా సరే సంతుష్టత పోకూడదు. విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి; కానీ ఆ విషయాలతో పాటు సంతుష్టత పోకూడదు. ఎందుకంటే సంతుష్టత పోతే సర్వస్వమూ పోయినట్లే. అచ్ఛా!
*** ఓంశాంతి ***
