‘‘హృదయ సింహాసనాధికారి మరియు విశ్వ సింహాసనాధికారిగా అవ్వడానికి సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి’’
నేడు విశ్వ యజమాని, తమ బాలకులు సో యజమానులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ ఈ సమయంలోనూ స్వయం యజమానులు మరియు అనేక జన్మలు కూడా విశ్వానికి యజమానులు. పరమాత్మ యొక్క బాలకులు యజమానులుగా మారిపోతారు. బ్రాహ్మణ ఆత్మలు అనగా యజమాని ఆత్మలు. ఈ సమయంలో సర్వ కర్మేంద్రియాలకు యజమానిగా ఉన్నారు, అధీన ఆత్మలు కారు. అధికారులు అనగా యజమానులు. కర్మేంద్రియాలకు వశీభూతులు కారు, అందువలన బాలకులు సో యజమానులుగా ఉన్నారు. బాలకతనం యొక్క ఈశ్వరీయ నషాను అనుభవం చేసుకుంటున్నారు మరియు స్వరాజ్యపు యజమానితనం యొక్క నషాను కూడా అనుభవం చేసుకుంటున్నారు. డబల్ నషా ఉంది. నషాకు గుర్తు అవినాశి ఆత్మిక సంతోషం. సదా తమను తాము ప్రపంచంలో అదృష్టవంతులైన ఆత్మలుగా భావిస్తున్నారా? వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము అనగా శ్రేష్ఠ అదృష్టము! అదృష్టవంతులు కూడా మరియు సదా సంతోషం అనే ఆహారాన్ని తింటున్నారు మరియు తినిపిస్తున్నారు. దాంతోపాటు సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు. ఇతరులకు కూడా సంతోషం అనే మహాదానాన్ని ఇచ్చి అదృష్టవంతులుగా తయారుచేస్తున్నారు. ఇలా అమూల్యమైన వజ్రతుల్య జీవితాన్ని తయారు చేసుకునేవారు. అయ్యారా లేక ఇంకా అవ్వాల్సి ఉందా? బ్రాహ్మణ జీవితం అనగానే - సంతోషంలో ఉండటం, సంతోషం అనే ఆహారాన్ని తినడం మరియు సంతోషపు ఊయలలో ఊగడం. అలాంటి బ్రాహ్మణులే కదా? సంతోషం తప్ప ఇంక జీవితం ఏమిటి! జీవితమే సంతోషం. సంతోషం లేకపోతే బ్రాహ్మణ జీవితమే లేదు. సంతోషంగా ఉండటమే జీవించడం.
నేడు బాప్‌దాదా సర్వ పిల్లల పుణ్య ఖాతాను చూస్తున్నారు. ఎందుకంటే మీరందరూ పుణ్యాత్మలు. అనేక జన్మల కొరకు పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నారు. రోజంతా ఎంత పుణ్యాన్ని జమ చేశారు? దీనిని స్వయంగా కూడా చెక్ చేసుకోగలరు కదా. ఒకటి దానం చేయడం, రెండవది పుణ్యం చేయడం. దానం కంటే కూడా పుణ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. పుణ్య కర్మ నిస్వార్థ సేవాభావంతో కూడిన కర్మ. పుణ్య కర్మ ఆడంబరంతో కూడినది కాదు, హృదయపూర్వకమైనది. దానం ఆడంబరంతోనూ ఉంటుంది, హృదయపూర్వకంగానూ ఉంటుంది. పుణ్య కర్మ అనగా అవసరమైన సమయంలో ఏదైనా ఆత్మకు సహయోగిగా మారడం అనగా ఉపయోగపడటం. పుణ్య కర్మ చేసే ఆత్మకు అనేక ఆత్మల హృదయపూర్వక ఆశీర్వాదాలు లభిస్తాయి. కేవలం నోటితో కృతజ్ఞతలు లేదా థాంక్స్ అని చెప్పడం మాత్రమే కాదు, హృదయపూర్వక ఆశీర్వాదాలనే గుప్త ప్రాప్తి జమ అవుతూ వెళ్తుంది. పరమాత్మ ఆశీర్వాదాలు, ఆత్మల ఆశీర్వాదాలు - ఇలా లభించిన ప్రత్యక్ష ఫలంతో పుణ్యాత్మలు నిండుగా ఉంటారు. పుణ్యాత్మ యొక్క వృత్తి, దృష్టి ఇతరులకు కూడా ఆశీర్వాదాలను అనుభవం చేయిస్తాయి. పుణ్యాత్మ ముఖంపై సదా ప్రసన్నత, సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తుంది. పుణ్యాత్మ సదా లభించిన ఫలం కారణంగా అభిమానము మరియు అవమానాలకు అతీతంగా ఉంటుంది. ఎందుకంటే వారు సంపన్న చక్రవర్తి. అభిమానము మరియు అవమానాల నుండి నిశ్చింత చక్రవర్తి. పుణ్యాత్మ పుణ్య శక్తి ద్వారా తమ ప్రతి సంకల్పాన్ని, ప్రతి సమయపు అలజడిని, ప్రతి కర్మను సఫలం చేసుకునేవారిగా ఉంటారు. పుణ్య ఖాతా జమ అవుతుంది. జమ కావడానికి గుర్తు - వ్యర్థం సమాప్తమవ్వడమే. అలాంటి పుణ్యాత్మ విశ్వ రాజ్య సింహాసనాధికారిగా మారుతుంది. కాబట్టి ఇలాంటి పుణ్యాత్మగా ఎంతవరకు తయారయ్యాము అని తమ ఖాతాను చెక్ చేసుకోండి? అందరూ పుణ్యాత్మలేనా అని అడిగితే అందరూ ‘అవును’ అనే అంటారు కదా. అందరూ పుణ్యాత్మలే. కానీ నంబరువారీగా ఉన్నారా లేక అందరూ నంబర్‌వన్‌గా ఉన్నారా? నంబరువారీగానే ఉన్నారు కదా. సత్యయుగ-త్రేతాయుగాల విశ్వ సింహాసనంపై ఎంతమంది కూర్చుంటారు? అందరూ కలిసే కూర్చుంటారా? కాబట్టి నంబరువారీ కదా. నంబర్లు ఎందుకు వస్తాయి - కారణం? బాప్‌దాదా పిల్లలలో ఒక విశేషమైన విషయాన్ని చెక్ చేశారు. అదే విషయం నంబర్‌వన్‌గా అవ్వడంలో అడ్డంకిని కలిగిస్తుంది.
ఇప్పుడు తపస్యా సంవత్సరంలో అందరి లక్ష్యమూ సంపూర్ణంగా తయారవ్వాలనా లేక నంబరువారీగా అవ్వాలనా? సంపూర్ణంగా అవ్వాలనే కదా. మీరందరూ ఒక స్లోగన్‌ను పలుకుతారు మరియు రాసి కూడా పెడతారు. అదేమిటంటే - సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. ఈ స్లోగన్ పక్కాగా ఉందా? మరి రిజల్ట్‌లో ఏమి కనిపించింది? దుఃఖాన్ని ఇవ్వకండి - దీనిపై అయితే మెజారిటీకి అటెన్షన్ ఉంది. కానీ సగం స్లోగన్ మాత్రమే సరిగ్గా ఉంది. ఇవ్వడానికి ఆలోచిస్తారు, ఇవ్వకూడదు అని. కానీ తీసుకోవడానికి వచ్చేసరికి వారు ఇచ్చారు అందుకే ఇలా జరిగింది అని అంటారు. వీరు ఇలా అన్నారు, వారు అలా అన్నారు, అందుకే ఇలా జరిగింది అని అంటారు. ఇలాంటి జడ్జిమెంట్ ఇస్తారు కదా. తమకు తామే లాయర్‌గా మారి కేసులో ఇదే చెప్తారు. కాబట్టి సగం స్లోగన్‌పై అటెన్షన్ బాగుంది, ఇంకా అండర్లైన్ కావాలి. అయినప్పటికీ సగం స్లోగన్‌పై అటెన్షన్ ఉంది కానీ మిగిలిన సగం స్లోగన్‌పై అటెన్షన్ నామమాత్రంగానే ఉంది. వారు ఇచ్చారు, కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? మిమ్మల్ని తీసుకోమని ఎవరు చెప్పారు? దుఃఖాన్ని తీసుకోండి అని బాబా శ్రీమతం ఇచ్చారా ఏంటి? జోలెను దుఃఖంతో నింపుకోమన్నారా? కాబట్టి దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. అప్పుడే పుణ్యాత్మగా అవుతారు, తపస్విగా అవుతారు. తపస్వి అనగా పరివర్తన, కాబట్టి వారి దుఃఖాన్ని కూడా మీరు సుఖ రూపంలో స్వీకరించండి. పరివర్తన చేయండి, అప్పుడే తపస్వి అంటాము. నిందను ప్రశంసగా భావించండి. అప్పుడే పుణ్యాత్మ అంటాము. దూషించేవారిని లేదా దుఃఖాన్ని ఇచ్చే ఆత్మను కూడా మీ దయా హృదయ స్వరూపంతో, దయా దృష్టితో చూడండి తప్ప నిందా దృష్టితో చూడకండి అని జగదాంబ సరస్వతీ తల్లి సదా పిల్లలందరికీ ఈ పాఠాన్ని పక్కా చేయించారు. వారు దూషించినా మీరు పూలు సమర్పించండి. అప్పుడే పుణ్యాత్మ అంటాము. నిందించేవారిని హృదయపూర్వకంగా హత్తుకోండి. పైపైకి కౌగిలించుకోవడం కాదు, మనస్సుతో. కాబట్టి పుణ్య ఖాతా జమ కావడంలో ఇదే విషయం విఘ్న రూపంగా మారుతుంది. నేను దుఃఖాన్ని తీసుకోను కూడా తీసుకోకూడదు. ఇవ్వడం ఎలాగూ ఇవ్వకూడదు, కానీ తీసుకోనూ కూడదు. మంచి వస్తువు కానప్పుడు ఇక చెత్తను తీసుకుని ఎందుకు జమ చేసుకుంటారు? ఎక్కడైతే దుఃఖాన్ని తీసుకుంటారో అక్కడ చెత్త జమ అవుతుంది, మరి చెత్త నుండి ఏమి పుడతాయి? పాపపు అంశ రూప కీటకాలు (జెర్మ్స్). ప్రస్తుతం స్థూలమైన పాపాలు అయితే చేయట్లేదు కదా. ప్రస్తుతం పాపపు అంశం మిగిలి ఉంది. కానీ ఆ అంశం కూడా ఉండకూడదు. చాలామంది పిల్లలు ఎంతో తియ్యతియ్యటి విషయాలను వినిపిస్తారు. ఆత్మిక సంభాషణ అయితే అందరూ చేస్తారు కదా? ఒక స్లోగన్ అయితే అందరికీ పక్కా అయిపోయింది - “అనుకోలేదు కానీ జరిగిపోయింది...”. మీరు అనుకోనప్పుడు ఇంకెవరు అనుకుంటారు? జరిగిపోయింది అని మీరే అంటున్నారు కదా! ఇంకేదైనా ఆత్మ ఉందా ఏంటి! జరగకూడదు కానీ జరుగుతుంది - అని ఎవరు మాట్లాడుతున్నారు? వేరే ఏదైనా ఆత్మ మాట్లాడుతుందా లేక మీరే మాట్లాడుతున్నారా? కాబట్టి ఈ విషయాల కారణంగా తపస్సును సిద్ధింపజేసుకోలేరు. ఏది జరగకూడదో, ఏది చేయకూడదని అనుకుంటారో అది జరగకపోవడమే, చేయకపోవడమే పుణ్యాత్మ యొక్క గుర్తు. బాప్‌దాదా వద్దకు రోజూ పిల్లల ఇలాంటి అనేక కథలు వస్తాయి. చెప్పేటప్పుడు ఎంతో ఆసక్తికరమైన కథలుగా చేసి చెప్తారు, వింటూనే ఉండాలి. కొందరికి పెద్ద కథలు చెప్పే అలవాటు ఉంటుంది, కొందరు చిన్నవి చెప్తారు. కానీ కథలు చాలా చెప్తారు. నేడు ఈ సంవత్సరపు మిలనంలో ఆఖరి మునక కదా. అందరూ మునక వేయడానికే వచ్చారు కదా. భక్తి మార్గంలో కూడా మునక వేసేటప్పుడు ఏదో ఒక సంకల్పం తప్పక చేసుకుంటారు - ఏదో ఒకటి సమర్పిస్తారు లేదా ఏదో ఒక స్వార్థం ఉంచుకుంటారు. రెండింటితోనూ సంకల్పం చేస్తారు. కాబట్టి తపస్యా సంవత్సరంలో - రోజంతా సంకల్పం ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా పుణ్యాత్మగా అయి పుణ్యమే చేస్తాము అని సంకల్పం చేయండి, మరియు పుణ్యానికి గుర్తుగా - పుణ్యం యొక్క ప్రత్యక్ష ఫలం ప్రతి ఆత్మ యొక్క ఆశీర్వాదాలు అని చెప్పాము. ప్రతి సంకల్పంలోనూ పుణ్యం జమ కావాలి. మాటలలో ఆశీర్వాదాలు జమ కావాలి. సంబంధ-సంపర్కాలలో హృదయం నుండి సహకారపు కృతజ్ఞతలు రావాలి - దీనిని తపస్సు అంటాము. ఇలాంటి తపస్సే విశ్వ పరివర్తనకు ఆధారం అవుతుంది. ఇలాంటి రిజల్ట్‌పై ప్రైజ్ లభిస్తుంది. ఆ తర్వాత అలా జరిగిపోయింది అని కథలు వినిపించకూడదు...! అయినా మొదటి నంబర్ ప్రైజ్ టీచర్లు అందరూ తీసుకోవాలి మరియు వారితో పాటు మధుబన్ నివాసులు తీసుకోవాలి. ఎందుకంటే మధుబన్ అల, నిమిత్త టీచర్ల అల ప్రవృత్తి మార్గంలో ఉండేవారికి, గాడ్లీ స్టూడెంట్స్‌కు సహజంగా చేరుకుంటుంది. కాబట్టి మీరందరూ నంబర్లో ముందుకు ఎలాగూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరెవరి పేర్లు ప్రైజ్‌లో వస్తాయో చూద్దాం? టీచర్లవా లేక మధుబన్ వారివా లేక గాడ్లీ స్టూడెంట్స్వా? డబల్ విదేశీయులు కూడా తీవ్ర పురుషార్థం చేస్తున్నారు. బాప్‌దాదా వద్ద ప్రైజ్‌లు చాలా ఉన్నాయి, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ప్రైజ్‌లకు కొరత లేదు. భాండాగారాలు సంపూర్ణంగా ఉన్నాయి. అచ్ఛా!
అందరూ మేళాకు చేరుకున్నారు. మేళా బాగుందా లేక ఇబ్బంది కలిగిందా? వర్షం కూడా స్వాగతం పలికింది, ప్రకృతికి కూడా మీపై ప్రేమ ఉంది. భయపడలేదు కదా? బ్రహ్మాభోజనం అయితే బాగా లభించింది కదా. 63 జన్మలు ఎదురుదెబ్బలే తిన్నారు. ఇప్పుడైతే చక్కటి స్థానం లభించింది కదా. మూడు అడుగుల నేల అయితే లభించింది కదా. ఇంత పెద్ద హాల్ కట్టారు కాబట్టి హాల్ శోభను కూడా పెంచారు కదా. హాల్‌ను సఫలం చేశారు కదా. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదు కదా. కానీ ఎప్పుడూ ఇలాగే మేళా చేస్తూ ఉండకూడదు. రచనతో పాటు సాధనాలు కూడా వెంటే వస్తాయి. అచ్ఛా!
సర్వ బాలకులు సో యజమానులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా ప్రతి అడుగులోనూ పుణ్య ఖాతాను జమ చేసుకునే పుణ్యాత్మలకు, సదా హృదయ సింహాసనాధికారి మరియు విశ్వ సింహాసనాధికారి అయిన విశేష ఆత్మలకు, సదా సుఖాన్ని ఇచ్చే మరియు సుఖాన్ని తీసుకునే మాస్టర్ సుఖ సాగర ఆత్మలకు, సదా సంతోషంలో ఉండే మరియు సంతోషాన్ని పంచే మాస్టర్ దాతలైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో :- మహారథులందరూ అందరినీ శక్తిశాలిగా తయారుచేసే సేవను హృదయపూర్వకంగా చాలా బాగా చేశారని బాప్‌దాదా చూశారు. దీనికి కృతజ్ఞతలు ఏమి చెప్తాము కానీ ఖాతా చాలా జమ అయింది. చాలా పెద్ద ఖాతా జమ అయింది. బాప్‌దాదా మహావీర్ పిల్లల ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాలను చూసి పదమా రెట్ల కంటే ఎక్కువగా హర్షిస్తున్నారు. ధైర్యము ఉంచారు, సంగఠన సదా స్నేహ సూత్రంలో ఉంది కాబట్టి దీనికి సఫలత లభించింది. సంగఠన బలంగా ఉంది కదా! చిన్న మాల బలంగా ఉంది. కంకణమైతే తయారైంది. మాల కాకపోయినా కంకణమైతే ఉంది కదా. అందువల్ల చిన్న మాల కూడా పూజించబడుతుంది. పెద్ద మాల చాలా బాగా తయారవుతుంది, అది కూడా తయారైపోతుంది, అవ్వాల్సిందే. పెద్ద మాల పూసలు సిద్ధంగా ఉన్నాయి కానీ పూసతో పూస కలవడంలో కొద్దిగా మార్జిన్ ఉంది అని మునుపే వినిపించాము కదా. కానీ చిన్న మాల చక్కగా సిద్ధమైంది. ఈ మాల కారణంగానే సఫలత సహజంగా ఉంది మరియు సఫలత సదా మాలలోని పూసల మెడలో కూర్చబడి ఉంది. విజయపు తిలకం దిద్దబడి ఉంది. బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు, పదమా రెట్ల అభినందనలు. నిమిత్తమైతే మీరే కదా. బాబా చేయించేవారు. చేసేవారు ఎవరు? చేయడానికి నిమిత్తం మీరే, బాబా వెన్నుదన్నుగా ఉన్నారు. అందువల్ల ప్రేమపూర్వక రీతిని చాలా చక్కగా నిభాయించారు మరియు పాలనా రీతిని కూడా చక్కగా నిభాయించారు. అచ్ఛా.
మధుబన్ నివాసి సోదర-సోదరీలతో :- మధుబన్ నివాసులు అనగా రాజఋషి కుమారులు మరియు కుమారీలు. రాజఋషి అనగా రాజ్య అధికారులు మరియు తపస్వులు, ఎందుకంటే మధుబన్ ఉన్నదే తపస్యా భూమి. తపస్యా భూమిలో ఉండేవారే తపస్వులు అవుతారు కదా! కాబట్టి రాజఋషి అనగా రాజ్య అధికారంతో పాటు తపస్సు కూడా. తపస్విగా మారినప్పుడే రాజ్య అధికారులుగా అవుతారు. తపస్వి కాకపోతే రాజ్య అధికారి కాలేరు. మధుబన్ నివాసులది అఖండ తపస్సు కదా, లేక ఒక సంవత్సరపు తపస్సా? అఖండ తపస్వులే కదా? ఇక్కడ సేవ యొక్క అఖండ పాత్ర కూడా నడుస్తుంది కదా. కేవలం సేవా విధి మాత్రమే మారుతుంది. కానీ సేవ యొక్క అఖండ పాత్ర నడుస్తుంది. సేవ ఎలాగైతే అఖండంగా ఉందో, అలాగే మధుబన్ నివాసుల తపస్సు కూడా అఖండమైనది. అఖండ తపస్సు అనగా ఎన్నడూ ఖండించబడనిది మరియు మధుబన్ నివాసుల తపస్సు అత్యంత సహజమైనది. ఎందుకు? ఎందుకంటే మధుబన్ నివాసులు నిశ్చింత చక్రవర్తులు. సేవ కూడా చేస్తారు కానీ సిద్ధంగా ఉన్నదీ లభిస్తుంది మరియు అందరికంటే ఎక్కువగా మధుబన్ నివాసులకు సర్వ బ్రాహ్మణుల ఆశీర్వాదాలు లభిస్తాయి. అందరి నోటి నుండి, హృదయం నుండి ఏమి వస్తుంది? మధుబన్ వారు చాలా మంచివారు అని వస్తుంది. కాబట్టి ఆశీర్వాదాల ఖజానా మధుబన్ నివాసులకు ప్రపంచ ఆత్మల ద్వారా లభిస్తుంది. యోగ శిబిరానికి వి.ఐ.పిలు వచ్చినా, ఐ.పిలు వచ్చినా... అందరి నోటి నుండి మధుబన్ నివాసుల కొరకు ఆశీర్వాదాలే వెలువడతాయి, కాబట్టి గారాల బిడ్డలు (సికిలధే) అయిపోయారు కదా. శ్రమ తప్పక చేస్తున్నారు. కానీ ఆ శ్రమ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని కూడా తింటున్నారు. సేవ యొక్క రికార్డు సదా చక్కగా ఉంది మరియు చక్కగానే ఉంటుంది. సమయానుకూలంగా ఎవరెడీగానూ అయిపోతారు మరియు ఏ విషయాన్నయినా ఎదుర్కొంటారు. పర్వతాన్ని ఎత్తడంలో నిపుణులు. మరి ఇంత పెద్ద మేళాలో అలసిపోలేదు కదా? నిజానికి అందరికంటే ఎక్కువ పని నీటి విభాగం వారిది, భోజనశాల వారికీ తమ పని ఉంటుంది, సాగనంపే వారికీ తమ పని ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ వారికీ తమ పని ఉంటుంది. ఒక్క డిపార్ట్మెంట్ లేకపోయినా నడవదు. సర్వ డిపార్ట్మెంట్లలో నిమిత్తంగా ఉన్నవారందరూ కలిసి అలసిపోకుండా చేస్తారు. అప్పుడే సఫలత లభిస్తుంది. కాబట్టి సేవా సఫలతలో సదా ప్రైజ్ లభిస్తుంది. ఇప్పుడు తపస్సులో ప్రైజ్ తీసుకోండి. అందరూ మంచి సహకారాన్ని అందించారు మరియు రిజల్ట్ కూడా చాలా బాగుంది. పేర్లు ప్రస్తావించడం లేదు కానీ ప్రతి డిపార్ట్మెంట్ చక్కగా చేసింది - కాబట్టి పదమా రెట్ల అభినందనలు. ఈసారి అంతా నిర్విఘ్నంగా గడిచింది. ఇంత పెద్ద సీజన్ నడుస్తున్నా ఎలాంటి కేసూ జరగలేదు. ఎవరైనా శరీరం వదిలితే మధుబన్ నివాసులకు రెండు రోజులు భోజనం దొరకదు. ఈసారి ఏమీ జరగలేదు. విస్తరాకులు తెప్పించినా, టెంట్లు వేసినా, వర్షం వచ్చినా, ఈదురుగాలులు వీచినా కానీ నిర్విఘ్నంగా ఉంది. ఇప్పుడు కేవలం వెళ్ళడమే మిగిలి ఉంది, అంతే కదా. రాకపోకలు, ఆతిథ్యం ఇచ్చేవారందరూ చాలా చక్కగా నిభాయించారు. నిర్విఘ్నంగా గడిచినందుకు మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా. అందరూ అద్భుతము చేశారు. సాగనంపేవారు రాత్రిపూట కూడా మేల్కొని ఉన్నారు. మధుబన్ నివాసుల జాగరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టే ఇతరులు కూడా మేల్కొంటారు. ఏదో ఒక దేవుడు లేదా దేవి రూపంలో మీ జాగరణ జరుగుతుంది. కాబట్టి మంచి మార్కులు వచ్చాయి. అర్థమైందా. ఇప్పుడు నలువైపులా మధుబన్ తపస్సు యొక్క సహకారం లభించేలాంటి తపస్సు చేయండి. విశేష సహకారం లభిస్తోంది అని అందరూ అనుభవం చేసుకోవాలి. అందరి ఆరోగ్యం బాగుంది కదా? అచ్ఛా!
డబల్ విదేశీయులతో :- డబల్ విదేశీయులు సదా డబల్ అనగా కంబైన్డ్‌గా ఉండే అలవాటు కలవారు. కంపెనీని ఇష్టపడతారు కదా. కంపానియన్ను కూడా ఇష్టపడతారు. మరి కంపానియన్ లభించారు మరియు కంపెనీ కూడా లభించింది. రెండూ లభించాయి కదా! మంచిది. రేస్ చాలా బాగా చేస్తున్నారు. విదేశాలలో సేవ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, అందరికంటే ముందుకు వెళ్ళాలనే ఉత్సాహం డబల్ విదేశీయులలో బాగుంది మరియు ధైర్యము కూడా చక్కగా ఉంచుకుంటారు. అందువలన బాప్‌దాదా సహాయం కూడా లభిస్తూనే ఉంటుంది మరియు సహాయం పొందేందుకు సదా అధికారులుగా ఉన్నారు. డబల్ విదేశీయులకు సదా నషా ఉంటుంది కదా. పాత ప్రపంచంలోనైతే భాష సమస్య కూడా ఎదురవుతుంది. మన రాజ్యంలో ఇలాంటి సమస్య ఏదీ ఉండదు. మంచిది. అందరూ తీవ్ర పురుషార్థులే కదా. పురుషార్థులుగా అవ్వకూడదు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
