‘‘హోలీ జరుపుకోవడము అనగా దృఢ సంకల్పమనే అగ్నిలో బలహీనతలను కాల్చడము మరియు మిలనము యొక్క ఆనందాన్ని జరుపుకోవడము’’
ఈరోజు ఆత్మిక పూలతోటకు యజమాని అయిన బాప్‌దాదా డబల్ పూలతోటను చూస్తున్నారు. (ఈరోజు స్టేజి పైన చాలా సుందరమైన పూలతోట అలంకరించబడి ఉంది). ఒక వైపు ప్రకృతి సౌందర్యము మరియు రెండవ వైపు ఆత్మిక గులాబీల ఆత్మిక పూలతోట యొక్క శోభ ఉంది. డ్రామాలో ఆది కాలమైన సత్యయుగంలో ప్రకృతి యొక్క సతోప్రధానమైన సౌందర్యము మాస్టర్ ఆదిదేవ్, ఆది శ్రేష్ఠ ఆత్మలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో అంతిమ కాలంలో కూడా ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నారు. కానీ ఆది కాలానికి మరియు అంతిమ కాలానికి ఎంత తేడా ఉంది! మీ సత్యయుగీ రాజ్యంలో ప్రకృతి యొక్క స్వరూపము ఎంత శ్రేష్ఠంగా, సతోప్రధానంగా, సుందరంగా ఉంటుంది! అక్కడి పూలతోటకు మరియు ఇక్కడి పూలతోటలకు ఎంత తేడా ఉంది! ఆ వాస్తవిక సుగంధాన్ని అనుభవం చేసారు కదా? అయినా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రకృతి పతులు. ప్రకృతి పతులు, కనుక ప్రకృతి యొక్క ఆటను చూసి హర్షిస్తారు. ప్రకృతి అలజడి చేసినా కానీ, ప్రకృతి సుందరమైన ఆటను చూపించినా కానీ - రెండింటిలోనూ ప్రకృతిపతి ఆత్మలు సాక్షిగా అయి ఆటను చూస్తారు. ఆటలో ఆనందాన్ని పొందుతారు, గాభరాపడరు, అందుకే బాప్‌దాదా తపస్య ద్వారా సాక్షీతనపు స్థితి అనే ఆసనంపై స్థిరంగా, నిశ్చలంగా స్థితులయ్యే విశేషమైన అభ్యాసాన్ని చేయిస్తున్నారు. మరి ఈ స్థితి అనే ఆసనము అందరికీ మంచిగా అనిపిస్తుందా లేక అలజడి చెందే ఆసనము మంచిగా అనిపిస్తుందా? స్థిరమైన ఆసనము మంచిగా అనిపిస్తుంది కదా. ప్రకృతి ద్వారా గానీ, వ్యక్తుల ద్వారా గానీ ఏ విషయం జరిగినా, రెండూ స్థిరమైన స్థితి అనే ఆసనాన్ని కొద్దిగా కూడా కదిలించలేవు. ఇంత పక్కాగా ఉన్నారు కదా లేక ఇప్పుడింకా అవ్వాలా?
ప్రకృతికి కూడా ఐదుగురు ఆటగాళ్ళు ఉన్నారు మరియు మాయకు కూడా ఐదుగురు ఆటగాళ్ళు ఉన్నారు. ఈ పది మంది ఆటగాళ్ళ గురించి బాగా తెలుసు కదా? ఆటగాడు ఆట లేకుండా ఉండగలడా? ఒకసారి ఒక ఆటగాడు ఎదురుగా వస్తాడు, మరోసారి మరొక ఆటగాడు ఎదురుగా వస్తాడు. ఈరోజుల్లో కూడా పాత ప్రపంచంలో ఆటను చూడడానికి చాలా ఆసక్తి ఉంటుంది కదా? ఎంత ప్రేమతో ఆటను చూస్తారు. వారు పాత ప్రపంచానికి చెందినవారు మరియు మీరు సంగమయుగీ బ్రాహ్మణ ఆత్మలు, కనుక ఆటను చూస్తూ ఆనందించాలా లేక గాభరాపడాలా? కొంతమంది పడిపోతారు, కొంతమంది పడదోస్తారు, కానీ ఆట చూసేవారికి పడిపోవడము చూసి కూడా ఆనందమనిపిస్తుంది మరియు విజయం ప్రాప్తించుకోవడము చూసి కూడా ఆనందమనిపిస్తుంది. కనుక ఇది కూడా చాలా పెద్ద ఆట. కేవలం ఆసనాన్ని వదలకండి, అంతే. ఎవరు ఎంతగా కదిలించినా కానీ శక్తిశాలి ఆత్మలైన మీరు కదలరు. కనుక బాప్‌దాదా ఈరోజు ఆత్మిక గులాబీలు ప్రతి ఒక్కరినీ చూస్తున్నారు. ఎప్పుడైతే పూలతోటలోకి పిలిచారో, అప్పుడు పూలతోటలోని ఆకులను చూస్తారా లేక పుష్పాలను చూస్తారా? దీనిని కూడా బాగా అలంకరించారు. శ్రమ చేసినవారి అద్భుతం బాగుంది. కానీ బాప్‌దాదా ఆత్మిక పుష్పాలను చూస్తున్నారు. వెరైటీ అయితే ఉంది కదా. కొందరు చాలా సుందరమైన రంగు, రూపం కలవారు. రంగు కూడా ఉంది, రూపం కూడా ఉంది. మరియు కొందరు రంగు, రూపము మరియు సుగంధం కలవారు, కొందరు కేవలం రంగు, రూపం కలవారు. రంగు మరియు రూపమైతే పిల్లలందరిలో వచ్చేసింది ఎందుకంటే తండ్రి సాంగత్యమనే రంగు అయితే అందరికీ అంటుకుంది. ఏదైనా వ్యవహారానికి చెందిన విషయాలలో, పురుషార్థం యొక్క విషయాలలో సంపూర్ణ సంతుష్టత లేకపోయినా కానీ తండ్రి సాంగత్యమనే రంగు అందరికీ అతి ప్రియంగా అనిపిస్తుంది, అందుకే రంగు అందరిలోనూ వచ్చేసింది మరియు రూపం కూడా పరివర్తన అయిపోయింది ఎందుకంటే బ్రాహ్మణాత్మలుగా అయ్యారు. ఎటువంటి పురుషార్థీ ఆత్మ అయినా కానీ, బ్రాహ్మణాత్మగా అవ్వడముతోనే రూపము తప్పకుండా మారుతుంది. బ్రాహ్మణాత్మలకు ఉండే మెరుపు, సౌందర్యము ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలోనూ వచ్చేస్తుంది, అందుకే రంగు మరియు రూపము అందరిలో కనిపిస్తూ ఉంది. సుగంధము నంబరువారుగా ఉంది. సుగంధము అంటే సంపూర్ణ పవిత్రత. మామూలుగా ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారు బ్రహ్మాకుమారులు-బ్రహ్మాకుమారీలని పిలవబడతారు. కుమార్ మరియు కుమారీగా అవ్వడము అనగా పవిత్రంగా అవ్వడము. పవిత్రత యొక్క పరిభాష అతి సూక్ష్మమైనది. కేవలం బ్రహ్మచర్యం కాదు. తనువు ద్వారా బ్రహ్మచారిగా అవ్వడాన్ని సంపూర్ణ పవిత్రత అని అనము. మనసు ద్వారా కూడా బ్రహ్మచారిగా ఉండాలి అనగా మనసు కూడా తండ్రి ఆకర్షణలోకి తప్ప ఇతర ఏ విధమైన ఆకర్షణలోకి రాకూడదు. తనువు ద్వారా కూడా బ్రహ్మచారి, సంబంధంలో కూడా బ్రహ్మచారి, సంస్కారాలలో కూడా బ్రహ్మచారి. దీని పరిభాష అతి ప్రియమైనది మరియు అతి గుహ్యమైనది. దీని విస్తారాన్ని తర్వాత వినిపిస్తాము. ఈ రోజైతే హోలీ జరుపుకోవాలి కదా, గుహ్యమైన చదువు కాదు, ఈరోజు జరుపుకోవాలి.
హోలీ జరుపుకునేవారు ఎవరు? హోలీ హంసలు. హోలీ హంసలు ఎంత ప్రియమైనవారు! హంసలు సదా నీటిలో ఈదుతూ ఉంటాయి. హోలీ హంసలు కూడా సదా జ్ఞానమనే నీటిలో ఈదేవారు. ఎగిరేవారు మరియు ఈదేవారు. మీ అందరికీ కూడా ఎగరడము మరియు ఈదడము తెలుసు కదా, జ్ఞానాన్ని మననము చేయడము, దీనిని అంటాము జ్ఞానామృతంలో ఈదడము మరియు ఎగరడము అని, అనగా సదా ఉన్నతమైన స్థితిలో ఉండడము. రెండూ తెలుసు కదా? అందరి మనసులో తండ్రిపై ప్రేమ అయితే 100 శాతం కన్నా కూడా ఎక్కువగా ఉంది మరియు తండ్రికి కూడా ప్రతి ఒక్క బిడ్డపై ప్రేమ ఉంది, వారు పడిపోతున్నా కానీ, ఎక్కుతూ ఉన్నా కానీ, ఆడుతూ ఉన్నా కానీ తండ్రికి ప్రేమ ఉంది. ఆటను చూసి వీరు కొంచెం అల్లరి చేసే బిడ్డ అని తండ్రి భావిస్తారు. పిల్లలందరూ ఒకేవిధంగా అయితే ఉండరు కదా. కొంతమంది అల్లరిగా, కొంతమంది గంభీరముగా, కొంతమంది రమణీకముగా ఉంటారు, కొంతమంది చాలా ఫాస్ట్ నేచర్ కలవారిగా ఉంటారు. అయినా కూడా పిల్లలే కదా. పిల్లలు అన్న పదమే అతి ప్రియమైనది. ఎలాగైతే మీ అందరికీ తండ్రి అన్న పదము ప్రియమైనదో, అలాగే తండ్రికి పిల్లలు ప్రియమైనవారు. తండ్రి ఎప్పుడూ ఏ బిడ్డతోనూ నిరాశ చెందరు. సదా శుభమైన ఆశలను పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా పక్కకు తప్పుకున్నా కానీ బాప్‌దాదా వారి పట్ల కూడా ఆశను పెట్టుకుంటారు, ఈరోజు కాకపోతే రేపు వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్తారు? ఎలాగైతే శారీరక లెక్కాచారము వలన కొందరు ఎక్కువ వ్యాధిగ్రస్థులుగా అవుతారు, వారికి నయమవ్వడములో కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఎవరైతే కొద్ది సమయం కోసం వ్యాధిగ్రస్థులుగా అవుతారో, వారికి త్వరగా నయమవుతుంది. కానీ ఇరువురు వ్యాధిగ్రస్థులే. ఎలాంటి వ్యాధిగ్రస్థులు అయినా సరే, స్థూల రీతి అనుసారంగా కూడా వ్యాధిగ్రస్థులు పట్ల ఎప్పుడూ ఆశను వదులుకోవడము జరగదు. ఈరోజు కాకపోతే రేపు నయమవుతారు అని ఎల్లప్పుడూ ఆశను పెట్టుకోవడము జరుగుతుంది. అందుకే బాప్‌దాదా ఏ బిడ్డతోనూ నిరాశ చెందరు. ఈరోజు కొద్దిగా ఢీలాగా ఉన్నారు, రేపు చురుకైనవారిగా అయిపోతారు అని సదా శుభ ఆశలను పెట్టుకుంటారు. గమ్యము ఒక్కటి, తండ్రి ఒక్కరే అయినప్పుడు మరి తండ్రి వద్దకు కాక ఇంకెక్కడికి వెళ్తారు? అయినా కూడా వారసత్వము ప్రతి ఆత్మకు తండ్రి నుండే లభించాలి. తండ్రిని నిందించినా కానీ తండ్రి ముక్తి యొక్క వారసత్వాన్ని అయితే తప్పకుండా ఇస్తారు. మొత్తం విశ్వంలోని సర్వాత్మలకు ముక్తి, జీవన్ముక్తి వారసత్వము తప్పకుండా లభించనున్నది ఎందుకంటే తండ్రి సృష్టిపై అవతరించి ఉండి పిల్లలను వారసత్వము నుండి వంచితులుగా చేయలేరు. తండ్రి వారసత్వం ఇవ్వాల్సిందే. పిల్లలు తీసుకున్నా, తీసుకోకపోయినా తండ్రి ఇవ్వాల్సిందే. మరియు సర్వాత్మలకు తండ్రి ద్వారా వారసత్వం లభించింది, అందుకే తండ్రి అని పిలుస్తారు కదా. తండ్రి అంటేనే వారసత్వాన్ని ఇచ్చేవారు అని అర్థము. ఏ ధర్మంలోకైనా వెళ్ళిపోయి ఉండవచ్చు, అయినా కూడా ఫాదర్ అని అంటూ స్మృతి అయితే చేస్తారు కదా. ఒక్క ఆత్మ కూడా వారసత్వం లేకుండా మిగిలిపోదు. కనుక సాకార సృష్టిపై పాత్రను అభినయిస్తూ పిల్లలకు వారసత్వం ఇవ్వలేదు అంటే వారిని తండ్రి అని ఎలా అంటారు? కానీ మీరు డైరెక్ట్‌గా వారసత్వం తీసుకుంటారు, గుర్తించడము ద్వారా తీసుకుంటారు. మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది. సాకార మాధ్యమము అయిన బ్రహ్మా నిమిత్తంగా అవ్వచ్చు, కానీ బ్రహ్మాతో యోగాన్ని జోడించరు, యోగం తండ్రితో జోడిస్తారు. బ్రహ్మా తండ్రి కూడా తండ్రిని స్మృతి చేయండి అంటారు. నన్ను స్మృతి చేయండి అని అనరు. తండ్రి ద్వారా తప్ప ఇంకే సంబంధం ద్వారా కూడా ఎప్పుడూ పూర్తి వారసత్వం లభించదు. మీరు డైరెక్ట్ తండ్రితో సంబంధాన్ని జోడించి మూడు కాలాలలో వారసత్వం యొక్క అధికారాన్ని ప్రాప్తించుకుంటారు. ఇప్పుడు కూడా వారసత్వం లభిస్తుంది కదా! శక్తులు, గుణాల యొక్క వారసత్వం లభిస్తోంది. లభించిందా? మరియు ముక్తిధామంలో కూడా ఎక్కడ ఉంటారు? సమీపంగా ఉంటారు కదా! కనుక ఇప్పుడు కూడా వారసత్వము ఉంది, ముక్తిధామంలో కూడా ఉంది మరియు తర్వాత 21 జన్మల వారసత్వం కూడా ఉంది. కనుక మూడు కాలాలలో వారసత్వానికి అధికారులుగా అవుతారు. మనుష్యులు మీ అందరితో అంటారు కదా, మీ జీవన్ముక్తి కన్నా మా ముక్తి మంచిది, మీరైతే చక్రంలోకి వస్తారు, మేమైతే చక్రం నుండి విడుదలైపోతాము. మీరు నషాతో చెప్పవచ్చు, ముక్తి యొక్క వారసత్వమైతే మాకు కూడా లభిస్తుంది, కానీ మేము ముక్తి తర్వాత మళ్ళీ జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము. డబల్ లభిస్తుంది! వయా ముక్తిధామం వెళ్తారు కదా, కనుక డైరెక్ట్ కనెక్షన్ ఉన్న కారణంగా వర్తమానములో మరియు మృత్యువు తర్వాత, మళ్ళీ కొత్త శరీరం తీసుకున్న తర్వాత - మూడు కాలాలలోనూ వారసత్వానికి అధికారిగా అవుతారు. ఇంతటి నషా ఉందా?
ఈరోజు హోలీ జరుపుకుంటున్నారు కదా. హోలీలో కాల్చడము కూడా జరుగుతుంది మరియు జరుపుకోవడము కూడా ఉంటుంది. మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. హోలీ జరుపుకోవడము అనగా కొన్నింటిని కాల్చడము, మరి కొన్నింటిని జరుపుకోవడము. కాల్చకుండా జరుపుకోవడము ఉండదు. కనుక దృఢ సంకల్పమనే అగ్ని ద్వారా మొదట తమ బలహీనతలను కాల్చాలి, అప్పుడే జరుపుకోవడము యొక్క ఆనందాన్ని అనుభవం చేయగలరు. ఒకవేళ కాల్చలేదంటే జరుపుకునే ఆనందం యొక్క అనుభవం సదాకాలానికి ఉండదు. హోలీ అన్న పదంలో కాల్చడము కూడా ఉంది, జరుపుకోవడము కూడా ఉంది. రెండు అర్థాలు ఉన్నాయి. హోలీ అన్న పదమైతే పక్కా కదా? కనుక హోలీ అంటే హో లీ అనగా గడిచినదేదో గడిచిపోయింది. ఏ విషయమైతే గడిచిపోయిందో, దానిని హో లీ అని అంటాము. ఏదైతే జరగాలి అని ఉందో, అది జరిగింది. కనుక గతాన్ని గతింపజేయడము అనగా హోలీని కాల్చడము. మరియు ఎప్పుడైతే తండ్రి ఎదురుగా వస్తారో, అప్పుడు అంటారు, నేను తండ్రికి చెందినవానిగా అయిపోయాను. కనుక జరుపుకున్నారు కూడా మరియు హో లీ, అనగా గడిచినదేదో గడిచిపోయింది. గతాన్ని మర్చిపోవడము, ఇదే కాల్చడము. కనుక ఒక్క హోలీ అన్న పదంలోనే కాల్చడము మరియు జరుపుకోవడము ఉన్నాయి. నేనైతే తండ్రికి చెందినవానిగా అయిపోయాను అన్న పాటను పాడుతారు కదా. పక్కా కదా? ఎందుకంటే బాప్‌దాదా అందరి తపస్య యొక్క లెక్కాపత్రాన్ని చూసారు. తపస్య ఒకవేళ ఎప్పుడైనా తగ్గింది అంటే దానికి కారణమేమిటి? గతాన్ని గతింపజేయడములో బిందువు పెట్టేందుకు బదులుగా ప్రశ్నార్థకము పెట్టారు. మరియు చిన్న పొరపాటు చేస్తారు, పొరపాటు చిన్నదే కానీ నష్టం చాలా పెద్దగా ఉంటుంది. పొరపాటు చేస్తారు? దేనినైతే మర్చిపోవాలో దానిని గుర్తు పెట్టుకుంటారు మరియు దేనినైతే గుర్తు చేయాలో దానిని మర్చిపోతారు. కనుక మర్చిపోవడము వస్తుంది కదా? తండ్రిని మర్చిపోవాలనుకోరు, అయినా కూడా మర్చిపోతారు మరియు ఏ సమయాన్ని అయితే మర్చిపోవాలో ఆ సమయంలో ఏమంటారంటే - మర్చిపోవాలనుకుంటాము కానీ మర్చిపోలేకపోతున్నాము, పదే-పదే గుర్తుకొస్తుంది. కనుక గుర్తు చేసుకోవడము మరియు మర్చిపోవడము, రెండు విషయాలూ వస్తాయి. కానీ దేనిని గుర్తు చేసుకోవాలి మరియు దేనిని మర్చిపోవాలి? ఏ సమయాన్ని అయితే మర్చిపోవాలో ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటారు మరియు ఏ సమయాన్ని అయితే గుర్తు చేసుకోవాలో ఆ సమయాన్ని మర్చిపోతారు. చిన్న పొరపాటు కదా? మరి దీనిని హో లీ చేయండి, అనగా కాల్చేయండి. అంశము సహితంగా సమాప్తము చేయండి. మీరు జ్ఞానయుక్త ఆత్మలు కదా? జ్ఞాని అంటేనే తెలివైనవారు అని అర్థము. మరియు మీరైతే మూడు కాలాలు తెలిసిన తెలివైనవారు, అందుకే హోలీని జరుపుకోవడము అనగా ఈ పొరపాటును కాల్చేయడము. దేనినైతే మర్చిపోవాలో దానిని క్షణంలో మర్చిపోవాలి మరియు దేనినైతే గుర్తు చేసుకోవాలో అది క్షణంలో గుర్తుకు రావాలి. కారణం ఏమిటంటే, కేవలం బిందువుకు బదులుగా ప్రశ్నార్థకము పెడుతున్నారు. ఎందుకు అని ఆలోచిస్తారు మరియు క్యూ మొదలవుతుంది. ఇలా, అలా, ఎందుకు, ఏమిటి అన్న పెద్ద క్యూ మొదలవుతుంది. కేవలం ప్రశ్నార్థకము పెట్టడముతో మొదలవుతుంది. మరియు బిందువు పెడితే ఏమవుతుంది? మీరు కూడా బిందువు, తండ్రి కూడా బిందువు మరియు వ్యర్థానికి కూడా బిందువు, ఫుల్స్టాప్. స్టాప్ కూడా కాదు, ఫుల్స్టాప్. దీనినే హోలీ అని అంటాము. మరియు ఈ హోలీ ద్వారా సదా తండ్రి సాంగత్యమనే రంగు యొక్క హోలీని, మిలనము యొక్క హోలీని జరుపుకుంటూ ఉంటారు. అన్నింటికన్నా పక్కా రంగు ఏమిటి? ఈ స్థూలమైన రంగు ఎంత పక్కాగా ఉన్నా కానీ, అన్నింటికన్నా శ్రేష్టమైన మరియు అన్నింటికన్నా పక్కా రంగు తండ్రి సాంగత్యమనే రంగు. కనుక ఈ రంగుతో జరుపుకోండి. గోప గోపికలు హోలీని జరుపుకోవడము అనేది మీ స్మృతిచిహ్నమే. ఆ చిత్రంలో ఏం చూపిస్తారు? తండ్రి మరియు మీరు, ఇరువురూ కలిసి హోలీని ఆడుతారు. ఒక్కొక్క గోపిక మరియు గోపిలతో గోపీ వల్లభుడిని చూపిస్తారు. కనుక ఇది సాంగత్యము అయింది కదా! తోడుగా ఉండడము లేక సాంగత్యములో ఉండడమే అవినాశీ హోలీ, తండ్రి సాంగత్యమనే రంగుకు స్మృతిచిహ్నంగా హోలీ రాస్‌లో తోడుగా ఉన్న రూపాన్ని చూపించారు. కనుక హోలీ జరుపుకోవడము వస్తుంది కదా? ఇలా జరిగిపోయింది, ఏం చేయను, కావాలనుకోలేదు కానీ అలా జరిగిపోతూ ఉంది... నేటి నుండి వీటి హోలీ, కాల్చండి, సమాప్తము చేయండి. మాస్టర్ సర్వశక్తిమంతులు ఎప్పుడూ సంకల్పంలో కూడా ఇలా ఆలోచించరు. అచ్ఛా.
డబల్ విదేశీయులు కూడా సేవ యొక్క వృద్ధిలో బాగా ముందుకు వెళ్తున్నారు. తండ్రితో కూడా ప్రేమ ఉంది, మరి సేవతో కూడా ప్రేమ ఉంది. సేవ అనగా స్వ మరియు సర్వాత్మల సేవ ఒకేసారి జరగాలి. మొదట స్వ సేవ ఎందుకంటే స్వ స్థితి కలిగినవారే ఇతర ఆత్మలను పరిస్థితుల నుండి బయటకు తీసుకురాగలరు. సేవలో సఫలత అంటేనే స్వ మరియు సర్వుల బ్యాలెన్స్ యొక్క స్థితి. సేవలో చాలా బిజీగా ఉన్నాము కదా, అందుకే స్వ స్థితి యొక్క చార్టు ఢీలాగా అయిపోయింది అని ఎప్పుడూ ఇలా అనకండి. ఒకవైపు సంపాదించుకున్నారు, మరొకవైపు పోగొట్టుకున్నారంటే ఇక ఏం మిగిలినట్లు? అందుకే ఎలాగైతే తండ్రి మరియు మీరు కంబైండ్‌గా ఉన్నారో, శరీరము మరియు ఆత్మ కంబైండ్‌గా ఉన్నాయో, మీ భవిష్య విష్ణు స్వరూపము కంబైండ్‌గా ఉందో, అలాగే స్వ-సేవ మరియు సర్వుల సేవ కంబైండ్‌గా ఉండాలి. వీటిని వేరు చేయకండి, లేదంటే శ్రమ ఎక్కువ మరియు సఫలత తక్కువగా లభిస్తుంది. అసంపూర్ణమైపోయింది కదా!
ఈ గ్రూపు యొక్క చార్టులో కూడా సెకెండు నంబరువారు ఎక్కువగా ఉన్నారు. ఫస్ట్ వారు కూడా తక్కువగా ఉన్నారు, అలాగే నాలుగు, ఐదవ నంబరువారు కూడా తక్కువగా ఉన్నారు, సెకెండు నంబరు వరకు వెళ్ళారు అంటే సెకెండుకు ముందు ఏం ఉంటుంది? ఫస్ట్ కదా. సెకెండు వరకు అడుగు వేసేసారు, ఇప్పుడు మిగిలిన ఒక అడుగు ఫస్ట్‌లో పెట్టాలి. దానికి విధి - కంబైండ్ స్వరూపము యొక్క సేవ. పిల్లలు సేవ యొక్క ప్లాన్లు కూడా తయారుచేస్తున్నారు కదా. బాప్‌దాదా అయితే సూచన ఇచ్చేసారు, ఇప్పుడు సమయమనుసారంగా సేవను ఏదైతే చేసారో, అది చాలా బాగా చేసారు. దీని ద్వారా తండ్రిని, స్వయాన్ని ప్రత్యక్షం చేసారు, వాయుమండలము మరియు వైబ్రేషన్ పరివర్తన అయ్యాయి. స్నేహీ మరియు సహయోగీ ఆత్మలు నలువైపులా చాలా సంఖ్యలో సమీపంగా వచ్చారు. ఇప్పుడు ఎటువంటి సేవను చేయండి అంటే ఒక్కరి ద్వారా అనేకుల సేవ జరగాలి. మొత్తం విశ్వానికి సందేశాన్ని ఇవ్వాలి. ఒక్కొక్కరికి సందేశాన్ని ఇస్తూ తద్వారా రాజధానిలోకి వచ్చే ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు తమ భాగ్యాన్ని తయారుచేసుకుని ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడైతే సందేశాన్ని ఇవ్వాల్సిన వారి సంఖ్య, రాజ్యాధికారీ పిల్లల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంది. రాజ్య కుటుంబంలోకి వచ్చేవారు లేక రాజ్య సింహాసనంపై కూర్చునేవారు ఇరువురూ మంచిగా వెలువడ్డారు. రాజ్య అధికారులుగా కూడా మీరే అవుతారు కదా. మీరు అవుతారా లేక ఇతరులను తయారుచేస్తారా? ఇతరులను రాజ్య అధికారులుగా తయారుచేస్తారు మరియు మీరు ఏమవుతారు?
అయితే ఇప్పుడు నాలుగు వైపులా సందేశాన్ని చేర్చడానికి, ఒకరు అనేకమందికి నిమిత్తంగా అయ్యే ఇటువంటి ఆత్మలను సమీపానికి తీసుకురండి. అప్పుడు సందేశాన్ని ఇచ్చే ఫాస్ట్ గతి ఉంటుంది. అందుకే బాప్‌దాదా ఇంతకుముందు కూడా సంకేతం ఇచ్చారు - ఎక్కడైతే ఎక్కువలో ఎక్కువ సంఖ్య ఉందో, అది ఇన్స్టిట్యూషన్ అయినా, ఇండస్ట్రీస్ అయినా, రెండింటిలోనూ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటువంటి ఆత్మలను నిమిత్తంగా చేయండి, వారు మీ సేవా సహచరులుగా అయ్యి ఇతరులను సమీపానికి తీసుకురావాలి. మీరు సందేశం ఇస్తూ ముందుకు సాగుతూ ఉండండి. వారిని సందేశం ఇవ్వడానికి నిమిత్తంగా చేయండి. ఇప్పుడు మీ ఆత్మల స్టేజ్‌కి అనుగుణంగా మీకు తయారైన స్టేజ్ లభిస్తుంది. ఇతరులకు సేవలో తనువు-మనస్సు-ధనం పెట్టే ఛాన్స్ ఇవ్వండి. వారు మనస్సు పెట్టినా, ధనం పెట్టినా, అప్పుడే సత్యయుగీ ప్రజలోకి వస్తారు. వారిని బీజం నాటనివ్వండి, మీరు అయితే బీజం నాటేశారు కదా, ఫలం పొందుతున్నారు. ఇప్పుడు ఇటువంటి గ్రూప్‌ను తయారు చేయండి, ఒక మాసం కోసం, రెండు మాసాల కోసం సేవా గ్రూప్‌లో ఎవరైనా ఒక వైపుకు, ఎవరైనా మరొక వైపుకు సందేశం ఇవ్వడానికి బయలుదేరాలి. ఒకే సమయంలో 7-8 గ్రూపులను తయారు చేసి, మీ ఏరియాలో ఒక్కొక్క గ్రూప్ సేవ కోసం బయలుదేరాలి. చిన్న దేశాలు అయినా, పెద్ద దేశాలు అయినా. ఎవరు ఎవరి దగ్గర దగ్గరగా ఉన్నారో, అక్కడి నుండి గ్రూప్‌ను తయారు చేసి ఆ గ్రూప్‌ను పంపించండి. కానీ ఆ గ్రూప్ కూడా సేవ చేసే విధానం ఇదే బుద్ధిలో ఉంచుకోవాలి - ఇతరులను మేల్కొలిపే ముఖ్యమైన వ్యక్తిని మేల్కొలపాలి. అక్కడి నుంచే తయారు చేస్తూ ముందుకు సాగుతూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడైతే సేవను పెంచాలని కోరుకుంటారో, మొదటి ప్రశ్న వస్తుంది - హ్యాండ్స్ ఎక్కడి నుండి వస్తారు? ప్రతి స్థానం వద్ద ఇటువంటి ఆత్మలను తయారు చేయండి మరియు తరువాత తయారైనవారికి మరియు ఇతర ఆశావాదులైన హ్యాండ్స్‌కు ప్రత్యేక సమయం తీసుకుని ట్రైనింగ్ ఇవ్వండి మరియు తరువాత వారు నడిపిస్తూ ఉండాలి. నిమిత్తంగా ఉన్నవారు చక్కర్లు కొడుతూ ఉండాలి. పాత సెంటర్లు అయితే పక్కా అయిపోయాయి, అయితే కొత్తవారిలో చక్కర్లు కొడుతూ కొత్తవారిని పాతవారిగా తయారు చేయండి. యోగ్యమైన హ్యాండ్స్‌ను తయారు చేసే సాధనం – ఎప్పటికప్పుడు హ్యాండ్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడం. ఎక్కడైతే దగ్గరగా ఉంటారో, 8 మంది అయినా, 10 మంది అయినా, కానీ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ లభించడం చాలా అవసరం. ఇంతకుముందు భారతదేశంలో కూడా ఒకసారి యూత్ గ్రూప్, ఒకసారి ఎడ్యుకేషన్ గ్రూప్, ఒకసారి డాక్టర్స్ గ్రూప్ తయారు చేసినట్లుగా, ఇలాంటి మిగిలి ఉన్న స్థానాలలో గ్రూప్‌ను తయారు చేసి లక్ష్యం పెట్టుకోండి - ఇక్కడి నుంచే ఎవరినైనా నిమిత్తంగా చేయాలి. నిమిత్తంగా చేస్తూ వెళ్లండి, ముందుకు సాగుతూ వెళ్లండి. ఇప్పుడు సంబంధ-సంపర్కం అయితే మీది బాగా ఏర్పడింది. అందరిలో ప్రభావం కూడా బాగుంది. లక్ష్యం పెట్టుకోవడం ద్వారా ఇటువంటి సహయోగి ఆత్మలు కూడా లభిస్తారు. కాన్ఫరెన్స్, యోగ శిబిరం, ప్రసంగం చేసి రావాలి - ఇది కాదు, హ్యాండ్స్‌ను తయారు చేయాలి అనేదే లక్ష్యం కావాలి. గీతా పాఠశాల మాదిరిగా నడిపించినా సరే. నెమ్మదిగా గీతా పాఠశాల నుండి ఉప-సేవాకేంద్రం, ఉప-సేవాకేంద్రం నుండి కేంద్రంగా అయిపోతుంది. కానీ ఏ గ్రూప్ ఎక్కడికి వెళ్లినా కంబైండ్ సేవ లేకుండా సఫలత అసంభవం. సేవ చేయడానికి వెళ్లి తిరిగి వచ్చాక, మాయ వచ్చేసింది, మూడ్ ఆఫ్ అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయాము అని చెప్పడం కాదు. దీనివల్ల నిమిత్త ఆత్మలు సేవకు పంపడానికి కూడా భయపడుతున్నారు. ధైర్యం ఉంచడం లేదు. ఇతరుల సేవ చేస్తూ తాము అయితే బలహీనంగా అయిపోము కదా అని ఆలోచించాల్సి వస్తుంది. అందుకే దీనిని అండర్లైన్ చేయండి. సేవలో సఫలత లేదా సేవలో వృద్ధికి సాధనం - స్వయం మరియు సర్వుల కంబైండ్ సేవ.
డబల్ విదేశీయులు అందరూ అన్ని స్థానాల నుండి ప్రియస్మృతుల ఉత్తరాలు కూడా చాలా తీసుకొచ్చారు. బాప్‌దాదా వద్ద మూడు రకాల ఉత్తరాలు చేరాయి. ఒకటి అయితే అతి స్నేహంతో కూడిన, శుభవార్తల ఉత్తరాలు మరియు రెండవవి పురుషార్థంలో ముందుకు సాగడానికి లక్ష్యాన్ని ఎలా పెట్టుకున్నారో, ఆ వార్తకు సంబంధించిన ఉత్తరాలు మరియు మూడవవి కొంచెం కొంచెం మధ్య మధ్యలో అల్లరిగా ఉండే ఉత్తరాలు. ఒకరు ఒకటి రాశారు, మరొకరు మరొకటి రాశారు. కానీ బాప్‌దాదా ఉత్తరాలు రాసిన పిల్లలందరికీ ఇదే రెస్పాండ్ చేస్తున్నారు - సదా కంబైండ్ సేవ మరియు స్థితి అంటే బాబా మరియు మీరు - ఈ కంబైండ్ స్థితి, కంబైండ్ సేవ మరియు సదా ఫరిశ్తా స్వరూపం యొక్క సంపూర్ణ లక్ష్యాన్ని ముందు ఉంచుకోండి. ఈరోజు పురుషార్థి, రేపు ఫరిశ్తా. సదా ఫరిశ్తా స్వరూపం ఇలా ముందు ఉండాలి, స్వయం యొక్క స్వరూపం సదా స్మృతిలో ఉన్నట్లుగా, తమ స్థూల స్వరూపాన్ని ఎప్పుడూ మరచిపోరు కదా. అయితే మీ స్థూల స్వరూపం సదా గుర్తున్నట్లే, మీ ఫరిశ్తా స్వరూపం కూడా సదా స్పష్టంగా ముందు ఉండాలి. అంతే, ఇప్పుడే తయారైతే తయారైనట్లే. ఫరిశ్తాలుగా ఉండేవారు, ఫరిశ్తాలుగా ఉన్నారు మరియు కల్ప-కల్పం ఫరిశ్తాలుగా మనమే అవ్వాలి. అయితే ధైర్యము, ఉల్లాస-ఉత్సాహాలతో ఎగురుతూ సాగుతూ ఉండండి. స్పష్టమైన హృదయంతో రాయడం చాలా మంచిది, ఇది డబల్ విదేశీయుల విశేషత. స్పష్టంగా ఉంటారు. దాచేవారు కాదు. స్పష్టం అంటే శ్రేష్ఠం. చెక్ చేసుకునే శక్తి డబల్ విదేశీయులలో చాలా బాగుంది. ఇప్పుడు కేవలం ఛేంజ్ చేసే శక్తిని కూడా అంతే పరిమాణంలో ఉంచండి. చెకింగ్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉంది, ఛేంజ్ కొంచెం తక్కువగా ఉంది, అయితే దీనికి కూడా బ్యాలెన్స్ ఉంచండి. స్పష్టము మరియు శ్రేష్ఠము, చెకింగ్ మరియు ఛేంజ్. అర్థమైందా! అందరి ఉత్తరాలు చేరాయి, ప్రియస్మృతులను చాలా హృదయంతో ఇస్తారు మరియు తీసుకుంటారు కూడా. రిటర్న్ అదే సమయంలో లభిస్తుంది. ఎవరైనా నిజమైన హృదయంతో తమ బలహీనతను కూడా రాస్తే, క్షమా సాగరుడైన బాబా అదే సమయంలో రిటర్న్‌లో క్షమించేస్తారు. చాలా ప్రేమతో కూడిన కార్డులు, చాలా ప్రేమతో కూడిన ఉత్తరాలు బాప్‌దాదా చూస్తారు. గిఫ్ట్ ఇచ్చేవారే స్వయంగా బాబా యొక్క గిఫ్ట్. గిఫ్ట్ ఇవ్వడం అంటే లిఫ్ట్ తీసుకోవడం. అయితే కేవలం గిఫ్ట్ ఇవ్వడమే కాదు, కానీ లిఫ్ట్ తీసుకోవడం కూడా ఉంది. అచ్ఛా.
కల్పక్రితపు వారసత్వాన్ని తీసుకునేందుకు కొత్త-కొత్త పిల్లలు కూడా చేరుకున్నారు, వీరిని బాప్‌దాదా వెల్కమ్ చేస్తున్నారు మరియు కొత్త జన్మ యొక్క జన్మదినానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ కంబైండ్ స్థితిలో స్థితులయ్యేవారు, సదా కంబైండ్ సేవలో అలసటలేని సేవ ద్వారా నిమిత్తముగా అయ్యేవారు, సదా గతాన్ని గతింపజేసి తండ్రి సాంగత్యమనే రంగు యొక్క హోలీని జరుపుకునే హోలీ హంసలైన ఆత్మలు, సదా మూడు కాలాల వారసత్వం యొక్క సంతోషంలో ఉండేవారు, సదా సాక్షిగా అయి ప్రకృతి మరియు మాయ యొక్క ఆటను చూసేవారు - ఇటువంటి సదా విజయీ, సదా ఎగిరే కళ కలిగినవారు, సదా ఫరిశ్తా స్వరూపాన్ని ఎదురుగా అనుభవం చేసే, శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా మిలనము
1. శబ్దంలోకి రావడం అత్యంత సహజంగా అనిపించినట్లే, శబ్దానికి అతీతంగా అయిపోవడం కూడా అంతే సహజమా? ఈ బుద్ధి యొక్క ఎక్సర్సైజ్ సదా చేస్తూ ఉండాలి. శరీరం యొక్క ఎక్సర్సైజ్ శరీరాన్ని ఆరోగ్యవంతంగా తయారుచేసినట్లే, ఆత్మ యొక్క ఎక్సర్సైజ్ ఆత్మను శక్తివంతంగా తయారుచేస్తుంది. మరి ఈ ఎక్సర్సైజ్ వచ్చా లేక శబ్దంలోకి వచ్చే ప్రాక్టీస్ ఎక్కువగా ఉందా? ఇప్పటికిప్పుడు శబ్దంలోకి రావడం మరియు ఇప్పటికిప్పుడు శబ్దానికి అతీతంగా అయిపోవడం - అదీ సహజంగా అనిపించినట్లే ఇదీ సహజంగా అనుభవమవ్వాలి. ఎందుకంటే ఆత్మ యజమాని. అందరూ రాజయోగులేనా, ప్రజాయోగులు కారు కదా? రాజు యొక్క పని ఆర్డర్ ఇచ్చి నడిపించడమే. కాబట్టి ఈ నోరు కూడా మీ ఆర్డర్‌పై ఉండాలి - ఎప్పుడు కావాలంటే అప్పుడు నడిపించండి, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు నడిపించకండి. శబ్దానికి అతీతంగా అయిపోండి, కానీ ఈ ఆత్మిక ఎక్సర్సైజ్లో కేవలం నోటి శబ్దానికి అతీతంగా అవ్వడం మాత్రమే కాదు. మనస్సు నుండి కూడా శబ్దంలోకి వచ్చే సంకల్పానికి అతీతంగా కావాలి. నోటితో మౌనంగా ఉండి మనస్సులో మాట్లాడుకుంటూ ఉండటం కాదు. శబ్దానికి అతీతంగా అనగా నోరు మరియు మనస్సు రెండింటి శబ్దానికి అతీతంగా శాంతి సాగరంలో లీనమైపోవడం. ఈ స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతి ఎంత ప్రియమైనది! అనుభవజ్ఞులే కదా. ఒక్క సెకను కూడా శబ్దానికి అతీతమై స్వీట్ సైలెన్స్ స్థితిలో స్థితులైపోండి. అప్పుడు ఎంత ప్రియంగా అనిపిస్తుంది?
సైలెన్స్ ఎందుకు ప్రియంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి, ఒరిజినల్ దేశం కూడా శాంతి ధామమే. అందుకే ఆత్మకు స్వీట్ సైలెన్స్ చాలా ప్రియంగా అనిపిస్తుంది. ఒక్క సెకనులో కూడా విశ్రాంతి లభిస్తుంది. మనస్సుతో, తనువుతో ఎంత అలసిపోయి ఉన్నప్పటికీ, ఒక్క నిమిషం కూడా స్వీట్ సైలెన్స్‌లోకి వెళ్తే తనువుకు, మనస్సుకు ఎంతటి విశ్రాంతి అనుభవమవుతుందంటే - బహు కాలం విశ్రాంతి తీసుకుని లేచినట్లయితే ఎంత ఫ్రెష్‌గా ఉంటారో అంతగా! ఎప్పుడైనా ఏదైనా అలజడి జరిగినప్పుడు, గొడవ లేదా అల్లరి జరిగినప్పుడు ఒకరికొకరు ఏమని చెప్పుకుంటారు? ‘శాంతిగా ఉండండి’ అని. ఎందుకంటే శాంతిలో విశ్రాంతి ఉంది. కాబట్టి మీరు కూడా రోజంతటిలో సమయానుకూలంగా, ఎప్పుడు సమయం లభించినా స్వీట్ సైలెన్స్‌లోకి వెళ్ళిపోండి. అనుభూతిలో లీనమైపోండి - చాలా బాగుంటుంది. అశరీరిగా అయ్యే అభ్యాసం సహజమైపోతుంది. ఎందుకంటే అంతిమంలో అశరీరితనము యొక్క అభ్యాసమే పనికివస్తుంది. సెకనులో అశరీరిగా అయిపోవాలి. తమ పాత్ర ఏదైనా నడుస్తున్నప్పటికీ, అశరీరిగా అయి ఆత్మ సాక్షిగా ఉండి తన శరీరం యొక్క పాత్రను కూడా చూడాలి. ‘నేను ఆత్మను అతీతంగా ఉన్నాను, శరీరంతో ఈ పాత్రను అభినయింపజేస్తున్నాను’. ఈ అతీతమైన అవస్థయే అంతిమంలో విజయి లేదా ‘పాస్ విత్ ఆనర్’ సర్టిఫికేట్‌ను ఇస్తుంది. అందరూ పాస్ విత్ ఆనర్ అయ్యేవారేనా? బలవంతంగా పాస్ అయ్యేవారు కాదు. ఒక్కోసారి టీచర్ కూడా ఒకటో రెండో మార్కులు వేసి పాస్ చేయాల్సి వస్తుంది. అలా పాస్ అయ్యేవారు కారు. చాలా సంతోషంగా తమ శక్తితో పాస్ విత్ ఆనర్ అయ్యేవారు. అలాంటివారే కదా? టైటిల్ కూడా డబల్ విదేశీయులు అని ఉన్నప్పుడు మార్కులు కూడా అందరికంటే డబల్ తీసుకుంటారు కదా! భారత్వాసులకు ఏ నషా ఉంది? భారత్వాసులకు మళ్ళీ తమ నషా ఉంది. భారత్‌లోనే తండ్రి వస్తారు. లండన్‌లో అయితే రారు కదా. (రావచ్చు కదా) ఇప్పటివరకు డ్రామాలో ఆ పాత్ర కనిపించడం లేదు. డ్రామా యొక్క విధిని భగవంతుడు కూడా దాటలేరు. డ్రామాకు అథారిటీ లభించింది. అచ్ఛా!
అందరూ ఆనందాన్ని (మౌజ్) జరుపుకునేవారేనా? మధ్యమధ్యలో కొద్దిగా కంగారుపడేవారైతే (మూంజ్) కారు కదా. ఎక్కడైతే మౌజ్ ఉంటుందో అక్కడ కంగారుపడటం (మూంజ్నా) ఉండదు. యుగమే మౌజ్ చేసుకునేది అయినప్పుడు, ఈ మౌజ్ సమయంలో కూడా ఎవరైనా కంగారుపడుతూ ఉంటే ఇక మౌజ్ ఎప్పుడు జరుపుకుంటారు? ఎన్ని జన్మలు కంగారుపడుతూ ఉన్నారు? తండ్రి సంబంధంలో కూడా ఎంతగానో కంగారుపడ్డారు. కృష్ణుడా, హనుమంతుడా, రాముడా... ఎవరు తండ్రి? కంగారుపడుతూనే ఉన్నారు కదా! తమ భాగ్యం గురించి కూడా కంగారుపడ్డారు. ‘మేము చరణాల ధూళి మాత్రమే’ - ఇలాగే నమ్ముతూ వచ్చారు కదా. తండ్రి పరిచయంలోనూ కంగారుపడ్డారు, వ్యవహారంలోనూ కంగారుపడ్డారు, కుటుంబంలోనూ కంగారుపడ్డారు. కానీ ఇప్పుడు మౌజ్! ఇప్పుడు ఏ విషయంలోనూ కంగారుపడేందుకు మార్జిన్ లేదు. త్రికాలదర్శి ఆత్మ ఏ విషయంలోనూ ఎప్పుడూ కంగారుపడలేదు. మూడు కాలాలూ క్లియర్‌గా ఉన్నాయి. గమ్యము మరియు మార్గము క్లియర్‌గా ఉన్నప్పుడు ఎవరూ కంగారుపడరు. త్రికాలదర్శి ఆత్మలు ఏ విషయంలోనూ మౌజ్ తప్ప వేరే ఏ అనుభూతినీ పొందరు. పరిస్థితి కంగారు పెట్టించేది అయినప్పటికీ, బ్రాహ్మణ ఆత్మ దానిని కూడా మౌజ్గా మార్చుకుంటుంది. అంత శక్తి ఉందా? లేక ‘ఏం చేసేది, నేనైతే కంగారుపడటం లేదు కానీ విషయమే అలాంటిది...’ అని అంటారా? విషయం పవర్‌ఫుల్లా లేక మీరు పవర్‌ఫుల్లా? విషయాన్ని బొమ్మగా భావిస్తే మౌజ్గా ఆడుకుంటారు. ‘పెద్ద విషయం... ఇది ఉందే... అది ఉందే...’ అంటే ఆటగా భావించడం లేదు, కష్టంగా భావిస్తున్నారు. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క పాత్రను ఎన్నిసార్లు పాస్ చేశారు? లెక్కలేనన్ని సార్లు. కాబట్టి కంగారుపడటానికి ఇదేమీ నూతన విషయం కాదు. అందుకే ఏ పని ప్రారంభించినా మొదట ఇది చెక్ చేసుకోండి - ‘ప్రతి కర్మను ఆనందంగా చేస్తున్నానా? కర్మయోగంతో మజా వస్తోందా?’ ఎలాంటి పనైనా సరే, మజాతో (ఆనందంగా) చేయండి. ఎంత హార్డ్ వర్క్ అయినా సరే, ఉద్యోగానికి వెళ్తున్నారు - చాలా హార్డ్‌గా ఉంది కాబట్టే ‘ఇప్పుడు జాబ్ విడిపించేయండి’ అని అంటారు కదా. వదిలేయాలనుకుంటున్నారు కదా? వదిలేయడం కాదు, ప్రతి కర్మను మజాలోకి పరివర్తన చేసుకోవాలి. ‘ఇప్పుడు పని వదిలేసి మధుబన్కు వచ్చేద్దాం’ అని డబల్ విదేశీయులు అనుకుంటారు. కానీ అందరూ మధుబన్‌లో కూర్చుంటే విశ్వ పరివర్తన ఎవరు చేస్తారు? అందుకే విశ్వంలోని మూలమూలలకూ వెళ్లారు. ఏ మూలకు వెళ్లినా ఎవరో ఒక బ్రాహ్మణ ఆత్మ తప్పకుండా ఉంటారు.
అందరూ హోలీ జరుపుకుంటారు కదా. హోలీ జరుపుకోవడం అనగా మౌజ్ జరుపుకోవడం. మీకైతే రోజూ హోలీయే. రోజూ ఉత్సవమే. మంచిది, మీ భాగ్యం యొక్క పాటలను పాడుతూ ఉండండి. ‘వాహ్! నా శ్రేష్ఠ భాగ్యం!’ భగవంతునిగా కావడం - దీనికంటే పెద్ద భాగ్యం ఇంకేముంటుంది! అందుకే సదా పాటలు పాడుతూ ఉండండి మరియు సదా సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉండండి. ఊగడం వచ్చా లేక కళ్ళు తిరుగుతాయా (చక్కర్)? చక్కర్లోకి రావద్దు. మౌజ్గా ఊగుతూ ఉండండి. ప్రతీ సంవత్సరం వచ్చే ఈ గోల్డెన్ ఛాన్స్ డబల్ విదేశీయులకు ఇప్పటివరకు ఉంది. భారత్వాసులకైతే రెండు-మూడు సంవత్సరాలకు టర్న్ లభిస్తుంది. కాబట్టి లక్కీ. అచ్ఛా!
2. సదా సంతోషంగా ఉండటం మరియు సంతోషాన్ని పంచడమే సంగమయుగి బ్రాహ్మణుల కర్తవ్యము లేదా సేవ. అంత సంతోషాన్ని జమ చేసుకున్నారు కదా, మరి ఇతరులకు కూడా పంచుతున్నారా? ఖర్చయిపోయి ఖాళీ అయిపోయేంత కొద్దిపాటి స్టాక్ అయితే జమ చేసుకోలేదు కదా. ‘నాజూకైన సమయం సమీపిస్తున్న కొద్దీ అనేక ఆత్మలు మీ నుండి కొంత సమయం కొరకు సంతోషాన్ని యాచించడానికి వస్తారు’ అని బాప్‌దాదా ముందే వినిపించారు. ఏ ఒక్కరూ ఖాళీ చేతులతో వెళ్లనంతగా సేవ చేయాలి. ఎంత సంతోషాన్ని పంచితే అంత సంతోషం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఇవ్వడం కాదు, తీసుకోవడం. మంచిది, అందరి ముఖాల్లో ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. కానీ ఏ అటెన్షన్ ఉంచాలి? ఇలాంటి ముఖం సదా ఉండాలి. ఇప్పటి ముఖం యొక్క ఫోటో కూడా తీయండి. రోజూ ఈ ఫోటోను చూడండి - ‘ఇలా ఉందా లేక మారిపోయిందా?’ అని. ఈ కెమెరాతో కాదు, దివ్యదృష్టి యొక్క కెమెరాతో మీ ఫోటో మీరు తీసుకోగలరు. ఈ కెమెరా అందరి దగ్గరా ఉంది కదా? మరియు ఇది పోయేది కూడా కాదు. కాబట్టి సదా సంతోషం యొక్క చిహ్నాలే ఉండాలి తప్ప వేరే చిహ్నం ఉండకూడదు. ఎప్పుడూ మూడ్ ఆఫ్ అయ్యే ముఖం ఉండకూడదు. ఎప్పుడూ మాయతో ఓటమి తినడం వల్ల నిరాశ చెందిన ముఖం ఉండకూడదు. మీరందరూ హీరో-హీరోయిన్ యాక్టర్లు, సంతోషంగా ఉండటం మరియు సంతోషాన్ని పంచడమే మీ పాత్ర. అచ్ఛా!
*** ఓంశాంతి ***
