‘‘కర్మల గుహ్య గతిని తెలుసుకున్న జ్ఞాతలుగా అవ్వండి’’
ఈరోజు సర్వ ఖజానాలను ఇచ్చే తండ్రి పిల్లలందరి జమ ఖాతాను చూస్తున్నారు. ఖజానాలైతే పిల్లలందరికీ తరగనంత లభించాయి మరియు అందరికీ ఒకేలా, ఒకరి ద్వారానే సర్వ ఖజానాలు లభించాయి. ఒక ఖాజానా కాదు, కానీ అనేక ఖజానాలు ప్రాప్తించాయి. అయినా ప్రతి ఒక్కరి జమ ఖాతా వేర్వేరుగా ఉంది. కొందరు సర్వ ఖజానాలను బాగా జమ చేసుకున్నారు మరియు చాలా మంది యథాశక్తి జమ చేసుకున్నారు. ఎంతైతే జమ చేసుకున్నారో, అంతగానే ముఖము మరియు నడవడికలో ఆ ఆత్మిక నషా కనిపిస్తుంది, జమ చేసుకున్న ఆత్మిక నషా అనుభవమవుతుంది. ఆత్మిక నషా యొక్క మొదటి గుర్తు ఏమిటంటే - ఎంతగా నషా ఉంటుందో అంతగా నిశ్చింత చక్రవర్తి యొక్క మెరుపు వారి ప్రతి కర్మలో కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైతే ఆత్మిక నషా ఉంటుందో అక్కడ ఎటువంటి చింత ఉండజాలదు. ఏ విధంగా వెలుగు మరియు అంధకారము కలిసి ఉండలేవో, అలా ఈ నషా మరియు చింత, రెండూ ఒకే సమయంలో ఒకే చోట కలిసి ఉండలేవు.
నిశ్చింత చక్రవర్తి యొక్క విశేషత ఏమిటంటే - వారు సదా ప్రశ్నచిత్తులకు బదులుగా ప్రసన్నచిత్తులుగా ఉంటారు. ప్రతి కర్మలో, స్వయానికి సంబంధించి లేదా సర్వులకు సంబంధించి లేదా ప్రకృతికి సంబంధించి కూడా, ఏ సమయంలోనైనా, ఏ విషయంలోనైనా సంకల్పమాత్రంగా కూడా - ‘ఇది ఇలా ఎందుకు’ లేక ‘ఇదేం జరుగుతుంది’, ‘ఇలా కూడా జరుగుతుందా’? అనే ప్రశ్నార్థకాలు ఉండవు. ప్రసన్నచిత్త ఆత్మకు ప్రతి కర్మ చేస్తూ, చూస్తూ, వింటూ, ఆలోచిస్తూ, సంకల్పంలో ఏముంటుందంటే - ఏదైతే జరుగుతూ ఉందో అది నా కొరకు మంచిది మరియు సదా మంచే జరుగుతుంది. ప్రశ్నచిత్త ఆత్మ ఏమిటి, ఎందుకు, ఇలా, అలా... ఈ చిక్కులలో స్వయాన్ని నిశ్చింత స్థితి నుండి చింతలోకి తీసుకొస్తుంది. మరియు నిశ్చింత ఆత్మ చెడును కూడా మంచిలోకి పరివర్తన చేస్తారు, అందుకే వారు సదా ప్రసన్నంగా ఉంటారు.
ఈరోజుల్లో సైన్స్ సాధనాల ద్వారా కూడా ఏదైతే వ్యర్థమైన మరియు పాడైన సామాగ్రి ఉంటుందో, దానిని పరివర్తన చేసి మంచి వస్తువులను తయారుచేస్తారు. అలాగే ప్రసన్నచిత్త ఆత్మ సైలెన్స్ శక్తి ద్వారా విషయం చెడుగా ఉన్నా, సంబంధాలు చెడుగా అనుభవం అవుతున్నా, ఆ చెడును మంచిలోకి పరివర్తన చేసి స్వయంలో కూడా ధారణ చేస్తారు మరియు ఇతరులకు కూడా తమ శుభభావన యొక్క శ్రేష్ఠ సంకల్పాల ద్వారా చెడును పరివర్తన చేసి మంచిని ధారణ చేసే శక్తిని ఇస్తారు. చాలామంది పిల్లలు ఎలా ఆలోచిస్తారు మరియు మాట్లాడుతారంటే - ‘‘ఆ విషయమే చెడు లేక తప్పు అన్నప్పుడు, తప్పును తప్పు అని అనాల్సే ఉంటుంది కదా! లేదా తప్పును తప్పు అని అర్థం చేసుకోవాల్సే ఉంటుంది కదా!’’ కానీ తప్పును తప్పుగా అర్థం చేసుకోవడమనేది అర్థం చేసుకోవడం పరంగా అర్థం చేసుకున్నారు. ఈ విధంగా రైట్ మరియు రాంగ్ అని అర్థం చేసుకోవడము, తెలుసుకోవడము వేరే విషయము కానీ జ్ఞాన సంపన్న స్వరూపంతో తెలుసుకునేవారు, అర్థం చేసుకున్న తర్వాత స్వయంలో ఏ ఆత్మ యొక్క చెడును, చెడు రూపంలో తమ బుద్ధిలో ధారణ చేయరు. కావున అర్థం చేసుకోవడం వేరే విషయము, అర్థం చేసుకోవడం వరకు రైట్. కానీ స్వయంలో లేక తమ చిత్తములో, తమ బుద్ధిలో, తమ వృత్తిలో, తమ వాణిలో ఇతరుల చెడును చెడు రూపంలో ధారణ చేయకూడదు, ఇముడ్చుకోకూడదు. కావున అర్థం చేసుకోవడము మరియు ధారణ చేయడము - ఇందులో తేడా ఉంది.
స్వయాన్ని రక్షించుకునేందుకు ఏమంటారంటే - ఈ విషయమే తప్పు, తప్పును తప్పు అని చెప్పాల్సి ఉంటుంది కదా. కానీ తెలివైనవారి పని ఏమిటి? తెలివైనవారు ఒకవేళ ఇది చెడు వస్తువు అని అర్థం చేసుకుంటే, మరి చెడు అని అర్థం చేసుకుంటూ కూడా తమ వద్ద జమ చేసుకుంటారా? తమ వద్ద బాగా సంభాళించి పెట్టుకుంటారా? వదిలేస్తారు కదా. లేక జమ చేసుకోవడమే తెలివా? దీనిని తెలివి అని అంటారా? ఆలోచించండి, ఒకవేళ చెడు విషయాన్ని లేక చెడు నడవడికను స్వయంలో ధారణ చేస్తే, తమ బుద్ధి, వృత్తి, వాణి సదా సంపూర్ణ స్వచ్ఛమైనవిగా భావించబడతాయా? ఒకవేళ కొద్దిగానైనా ఏదైనా దోషము లేక మరక ఉండిపోతే, మురికి ఉండిపోతే, ఆ దోషము కలవారు ఎప్పుడూ పర్ఫెక్ట్ అని పిలవబడరు, ప్రసన్నచిత్తులుగా ఉండలేరు. ఒకవేళ ఎవరి చెడు అయినా చిత్తములో ఉన్నట్లయితే, వారి చిత్తము సదా ప్రసన్నచిత్తంగా ఉండలేదు మరియు చిత్తములో ధారణ అయిన విషయాలు వాణిలోకి తప్పకుండా వస్తాయి, అది ఒకరి ముందైనా వర్ణన చేయవచ్చు, లేక అనేకుల ముందైనా వర్ణన చేయవచ్చు.
కానీ కర్మల గతి యొక్క గుహ్య రహస్యాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి. ఒకవేళ ఎవరి చెడునైనా లేక తప్పుడు విషయాన్ని అయినా చిత్తములో ఉంచుకోవడంతో పాటు వర్ణన చేసినట్లయితే, ఆ వ్యర్థ వర్ణన ఎలా ఉంటుందంటే - ఎలాగైతే ఎవరైనా గుమ్మటంలో శబ్దం చేస్తే, వారి శబ్దమే ఇంకా పెద్ద రూపంలోకి మారి వారి వద్దకు వస్తుంది. గుమ్మటంలో శబ్దం చేసి చూసారా? కనుక ఒకవేళ ఎవరి చెడునైనా వర్ణించే మరియు తప్పును తప్పుగా వ్యాపింపజేసే సంస్కారముంటే, దీనిని మీరు అలవాటు అని అంటారు. ఈరోజు మీరు ఎవరినైనా నిందిస్తారు మరియు స్వయాన్ని చాలా తెలివైనవారిగా, తప్పులకు దూరంగా ఉన్నవారిగా భావించి వర్ణిస్తారు, కానీ పక్కా నియమము లేక కర్మల సిద్ధాంతము ఏమిటంటే - ఈరోజు మీరు ఎవరినైనా నిందించారంటే రేపు మరెవరైనా మిమ్మల్ని దానికి రెండింతలు నిందిస్తారు. ఎందుకంటే ఈ తప్పు విషయాలు ఎంత తీవ్ర వేగంతో వ్యాపిస్తాయంటే, ఎలాగైతే ఏదైనా విశేషమైన వ్యాధిని కలిగించే సూక్ష్మ క్రిములు (జీవాణువులు) చాలా త్వరగా వ్యాపిస్తాయి, మరియు అలా వ్యాపిస్తూ ఆ సూక్ష్మ క్రిములనేవి ఎవరినైతే నిందించారో అక్కడ వరకు తప్పకుండా చేరుకుంటాయి. మీరు ఒక నింద వేసి ఉండవచ్చు కానీ వారు మిమ్మల్ని తప్పు అని నిరూపించేందుకు మీపై పది నిందలు వేస్తారు. కనుక రిజల్ట్ ఏమయింది? కర్మల గతి ఏమయింది? తిరిగి ఎక్కడికి వచ్చింది? ఒకవేళ మీకు ఆ ఆత్మను సరిచేయాలనే శుభభావన ఉంటే, ఆ తప్పు విషయాన్ని శుభభావనా స్వరూపంతో విశేషమైన నిమిత్త స్థానానికి చేర్చవచ్చు, వ్యాపింపజేయడం తప్పు. చాలామంది ఏమంటారంటే - నేనైతే ఎవ్వరికీ చెప్పలేదు కానీ వారు చెప్తూ ఉంటే నేను కూడా అవును, అవును అని అన్నాను, వేరే ఏమీ మాట్లాడలేదు. మీ భక్తి మార్గపు శాస్త్రాలలో కూడా ఏమని వర్ణించారంటే చెడు పనిని చూసినా, దానికి తోడు అందించినా, అది కూడా పాపమే. అవును, అవును అని అనడం కూడా కర్మల గుహ్య గతి ప్రమాణంగా పాపంలో భాగస్థులుగా అవ్వడమే.
వర్తమాన సమయంలో కర్మల గతి యొక్క జ్ఞానాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. కానీ ఈ చిన్న-చిన్న సూక్ష్మ పాపాలు శ్రేష్ఠ సంపూర్ణ స్థితిలో విఘ్న రూపంగా అవుతాయి. తేలికగా తీసుకుంటున్నారు అన్నదానికి గుర్తులు ఏమిటి? వారు సదా ఎలా ఆలోచిస్తారు మరియు భావిస్తారంటే - ఇదైతే ఇతరులు కూడా చేస్తారు, ఇదైతే ఈరోజుల్లో నడుస్తూనే ఉంటుంది. లేదా స్వయాన్ని తేలికగా చేసుకునేందుకు ఏమంటారంటే - నేను సరదాగా అన్నాను, నా భావం అలా లేదు, ఊరికే అలా అన్నాను. ఈ విధి సంపూర్ణ సిద్ధి ప్రాప్తించడంలో సూక్ష్మ విఘ్నంగా అవుతుంది. అందుకే జ్ఞానమైతే చాలా లభించింది, రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినడము, వర్ణన చేయడము చాలా స్పష్టమయ్యాయి కానీ కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానము బుద్ధిలో సదా స్పష్టంగా ఉండదు, అందుకే తేలికగా తీసుకుంటారు. చాలామంది పిల్లలకు స్వయం పట్ల కూడా ఫిర్యాదు ఉంటుంది, అదేమిటంటే - తండ్రి ఎలా చెప్తున్నారో, తండ్రి పిల్లల పట్ల ఏ శ్రేష్ఠమైన ఆశలు పెట్టుకుంటారో, ఏం కోరుకుంటారో, ఎంత కోరుకుంటారో అంతగా మేము లేము. దీనికి కారణమేమిటి? ఈ అతి సూక్ష్మమైన వ్యర్థ కర్మలు బుద్ధిని, మనసును ఉన్నతంగా అనుభవం చేయనివ్వవు. యోగం జోడించడానికి కూర్చుంటారు కానీ చాలా సమయం యుద్ధంలో గడిచిపోతుంది, వ్యర్థాన్ని తొలగించి సమర్థంగా అవ్వడంలో సమయం గడిచిపోతుంది, అందుకే ఏం చేయాలి? ఎంత ఉన్నతంగా అవుతారో, ఆ ఉన్నతంలోకి వెళ్ళేటప్పుడు అటెన్షన్ కూడా ఉన్నతంగా పెట్టాల్సి ఉంటుంది.
బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందంలో ఉండాలి. ఆనందంగా ఉండడం అంటే అర్థము - ఏది తోస్తే అది చేయడము, ఆనందంగా ఉండడము అని కాదు. ఈ అల్పకాలికమైన సుఖం యొక్క ఆనందము లేక అల్పకాలికమైన సంబంధ-సంపర్కాల ఆనందము సదాకాలికమైన ప్రసన్నచిత్త స్థితికి భిన్నమైనది. దీనినే ఆనందమని భావించకండి. ఏది తోస్తే అది మాట్లాడుతాము, ఏది తోస్తే అది చేస్తాము, మేమైతే ఆనందంగా ఉంటాము. అల్పకాలికముగా మనసుకు తోచినట్టు వ్యవహరించేవారిగా అవ్వకండి. సదాకాలికమైన ఆత్మిక ఆనందంలో ఉండండి. ఇదే యథార్థమైన బ్రాహ్మణ జీవితము. ఆనందంలో కూడా ఉండండి మరియు కర్మల గతి తెలిసిన జ్ఞాతలుగా కూడా ఉండండి. అప్పుడే ఏది కోరుకుంటారో, ఎలా కోరుకుంటారో అలా అనుభవం చేస్తూ ఉంటారు. అర్థమయిందా? కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానులుగా అవ్వండి. తర్వాత ఖజానాల జమ యొక్క రిజల్ట్‌ను వినిపిస్తాము. అచ్ఛా!
నలువైపులా ఉన్న చింతల నుండి దూరంగా నిశ్చింత చక్రవర్తి ఆత్మలకు, సదా ప్రసన్నచిత్త విశేష ఆత్మలకు, సదా స్వయం పట్ల మరియు సర్వాత్మల పట్ల శ్రేష్ఠ పరివర్తనా శక్తిని కర్మలోకి తీసుకొచ్చే కర్మయోగీ ఆత్మలకు, సదా రచయిత-రచనల జ్ఞానులకు మరియు కర్మ-సిద్ధాంతం యొక్క జ్ఞానులకు కూడా - ఇలాంటి జ్ఞాన స్వరూప ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము
వర్తమాన సమయంలో ఏ విషయం యొక్క అవసరముంది? కర్మల గుహ్య గతి యొక్క జ్ఞానం మర్జ్ అయ్యింది, అందుకే నిర్లక్ష్యము ఉంది. పురుషార్థులుగా కూడా ఉన్నారు కానీ పురుషార్థంలో నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అందుకే ఇప్పుడు దీని అవసరం ఉంది. బాప్‌దాదా అందరి రిజల్ట్‌ను చూస్తారు. ఏదైతే నడుస్తూ ఉందో అది బాగుంది కానీ ఇప్పుడు అత్యంత మంచిగా తయారవ్వాల్సిందే. బిజీగా ఉండాల్సి ఉంటుంది కదా. ఎక్కువ సమయం ఎందులో బిజీగా ఉండాల్సి ఉంటుంది? ఏ విషయంలో ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది? స్వయం యొక్క స్థితి అతీతంగా మరియు ప్రియంగా ఉంది కానీ సమయమైతే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సమయాన్ని పవర్ఫుల్, శక్తిశాలి లైట్ హౌస్, మైట్ హౌస్‌గా అయి వైబ్రేషన్లను వ్యాపింపజేసేందుకు ఉపయోగిస్తే ఏమవుతుంది? సంగఠిత రూపంలో ఇదే వాతావరణం ఉంటే, ఇక వేరే విషయమేదీ లేకపోతే విశ్వానికి లేక ప్రకృతికి ఏ వైబ్రేషన్లు చేరుకుంటాయి? మా రచయితలు మరియు మాస్టర్ రచయితలు ఎప్పుడు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయి మాతో తమ స్వాగతం చేయించుకుంటారు అని ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రకృతి కూడా స్వాగతం చేస్తుంది కదా. కనుక అది సఫలతా మాలతో స్వాగతం చేయాలి, ఆ రోజు రావాల్సిందే. ఎప్పుడైతే సఫలత యొక్క వాయిద్యాలు మోగుతాయో అప్పుడు ప్రత్యక్షతా వాయిద్యాలు మోగుతాయి. మోగడమైతే మోగాల్సిందే కదా. అచ్ఛా!
చంద్రమణి దాదీ సేవ కోసం వెళ్ళేందుకు సెలవు తీసుకుంటున్నారు
ఆల్‌రౌండ్‌గా అవ్వడమే శ్రేష్ఠమైన సేవ. మంచిది, అంతటా తిరుగుతూ ఉండండి. అంతటా తిరిగే పాత్ర పిల్లలదే. తండ్రి అయితే అవ్యక్త రూపంలో అంతటా తిరగగలరు. సాకార రూపంలో కూడా అంతటా తిరిగే పాత్ర తండ్రిది కాదు, పిల్లలదే. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం.1:- విజయమాలలోకి వచ్చేందుకు తీవ్ర పురుషార్థులుగా అవ్వండి
సదా తీవ్ర పురుషార్థీ ఆత్మలమని అనుభవం చేస్తున్నారా? బ్రాహ్మణులుగా అయ్యారు కనుక పురుషార్థులుగా ఉండనే ఉన్నారు. తీవ్ర పురుషార్థులా లేక కేవలం పురుషార్థులా? విని, వినిపించేవారిని పురుషార్థులని అంటారా లేక తీవ్ర పురుషార్థులని అంటారా? వినడము మరియు వినిపించడము, ఆ తర్వాత ఏమవుతుంది? తీవ్ర పురుషార్థులని ఎవరిని అంటారు - వినేవారినా లేక తయారయ్యేవారినా? ఎవరైతే మాలలో 16108 వ నంబరులో ఉంటారో, వారు కూడా తప్పకుండా వింటారు మరియు వినిపిస్తారు. లేకుంటే మాలలోకి ఎలా వస్తారు? కానీ 108 మాలలోకి ఎవరు వస్తారు? 108 మాల యొక్క పేరు విజయీ మాల. 16000 మాల యొక్క పేరు విజయీ మాల కాదు. కనుక వినడము మరియు వినిపించడము - ఇది మెజారిటీ చేస్తారు. కానీ విన్నారు మరియు తయారయ్యారు, ఇటువంటి వారిని తీవ్ర పురుషార్థీ అని అంటాము. తీవ్ర పురుషార్థులు 108 మంది ఉన్నారు మరియు పురుషార్థులు 16108 మంది ఉన్నారు. కనుక తమను తాము చెక్ చేసుకోండి - తీవ్ర పురుషార్థినా లేక పురుషార్థినా? తాము ఎవరు, ఎలా ఉన్నారు అన్నది మెజారిటీ తమకు తాము తెలుసుకోగలరు. ఎవరో కొంతమంది మాత్రము ఎలా ఉన్నారంటే వారికి స్వయం గురించి కూడా తెలియదు, రాంగ్‌ను రైట్ అని భావిస్తూ ఉంటారు. నేను ఎవరు అన్నది మెజారిటీకి తమ మనసులో తమకు సత్యం తెలుసు. కనుక సదా స్వయాన్ని చూసుకోండి, ఇతరులను కాదు.
మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోండి మరియు తీవ్ర పురుషార్థంలోకి ఛేంజ్ చేసుకోండి. లేకుంటే చివరి సమయం వచ్చినప్పుడు ఛేంజ్ చేసుకోలేరు. ఆ సమయంలో చదువుకునే సమయం సమాప్తమై ఉంటుంది. పరీక్షల సమయంలో చదువుకునేందుకు అవకాశం లభించదు. ఒకవేళ ఎవరైనా విద్యార్థికి ఒక ప్రశ్నకు జవాబు రాకపోతే పుస్తకం తెరిచి చదువుకొని సమాధానం రాస్తానని అనుకుంటే అది రైటా లేక రాంగా? కనుక ఆ సమయంలో స్వయాన్ని మార్చుకోలేరు. ఎవరు, ఎలా ఉన్నారో దాని అనుసారంగానే ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కానీ ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడింకా టూ లేట్ బోర్డు పడలేదు, లేట్ యొక్క బోర్డు పడింది. లేట్ అయ్యారు కానీ టూ లేట్ అవ్వలేదు కనుక ఇప్పుడింకా అవకాశముంది. చాలామంది విద్యార్థులు 6 నెలల్లో కూడా పాస్ విత్ ఆనర్‌గా అవుతారు, ఒకవేళ సరైన పురుషార్థం చేసినట్లయితే. కానీ సమయం సమాప్తమైన తర్వాత ఏమీ చేయలేరు. తండ్రి కూడా దయ చూపించాలని అనుకున్నా చూపించలేరు. పోనీలే, వీరు మంచివారు, వీరికి మార్కులు ఇచ్చేద్దాము, తండ్రి ఇలా చేయగలరా? అందుకే ఇప్పటి నుండే చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి.
నిర్లక్ష్యాన్ని వదిలేయండి. బాగున్నాము, నడుస్తున్నాము, చేరుకుంటాము - ఇది నిర్లక్ష్యము. నిర్లక్ష్యముగా ఉన్నవారికి ఈ సమయంలోనైతే ఆనందంగా అనిపిస్తుంది. ఎవరైతే నిర్లక్ష్యముగా ఉంటారో వారికి ఏ చింత ఉండదు, వారు విశ్రాంతినే సర్వస్వము అని భావిస్తారు. కనుక నిర్లక్ష్యాన్ని ఉంచుకోకండి. సదా అలర్ట్! మీరు పాండవ సైన్యము కదా. సైన్యము నిర్లక్ష్యముగా ఉంటుందా లేక అలర్ట్‌గా ఉంటుందా? సైన్యము అనగా అలర్ట్‌గా, సావధానంగా, అప్రమత్తంగా ఉండేవారు. నిర్లక్ష్యముగా ఉండేవారిని సైన్యంలోని సైనికులు అని అనము. కనుక నిర్లక్ష్యము కాదు, అటెన్షన్! కానీ అటెన్షన్ కూడా సహజ విధిగా అవ్వాలి. చాలామంది అటెన్షన్ యొక్క టెన్షన్‌ను కూడా పెట్టుకుంటారు. టెన్షన్‌తో కూడిన జీవితమైతే సదా నడవలేదు. టెన్షన్‌తో కూడిన జీవితం కొంత సమయం నడుస్తుంది, సహజంగా నడవదు. కనుక అటెన్షన్ ఉంచుకోవాలి కానీ ‘న్యాచురల్ అటెన్షన్’ అలవాటుగా అవ్వాలి. ఉదాహరణకు విస్మృతి అనేది అలవాటుగా అయిపోయింది కదా. వద్దనుకున్నా జరిగిపోతుంది. మరి ఇది అలవాటుగా అయింది కదా, సహజము అయింది కదా. ఈ విధంగా స్మృతి స్వరూపంగా ఉండడం అలవాటు అవ్వాలి, అటెన్షన్ యొక్క అలవాటు అవ్వాలి, అందుకే అలవాటుకు మనుష్యాత్మలు వశమవుతారని అంటారు. వద్దనుకున్నా జరిగిపోతుంది, దీనినే వశమవ్వడమని అంటాము. మరి ఇటువంటి తీవ్ర పురుషార్థులుగా అయ్యారా? తీవ్ర పురుషార్థీ అనగా విజయీ. అప్పుడే మాలలోకి రాగలరు.
బహు కాలపు అభ్యాసము కావాలి. సదా అలర్ట్ అనగా సదా ఎవరెడీ! మీకు ఏమని నిశ్చయముంది, వినాశనం యొక్క సమయం వరకు ఉంటారా లేక ముందు కూడా వెళ్లవచ్చా? ముందు కూడా వెళ్లవచ్చు కదా, అందుకే ఎవరెడీ. వినాశనం మీ కోసం ఎదురుచూడాలి, మీరు వినాశనం కోసం ఎదురుచూడకూడదు. అది రచన, మీరు రచయిత. సదా ఎవరెడీ. ఏం అర్థమైంది? అటెన్షన్ పెట్టండి. ఏదైనా లోపముంది అని అర్థమైతే, దానిని చాలా త్వరత్వరగా సమాప్తం చేయండి. సంపన్నంగా అవ్వడం అనగా బలహీనతలను సమాప్తం చేయడము. అంతేకానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడివారిగా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడివారిగా ఉండడం కాదు. అందరూ తీవ్ర పురుషార్థులుగా అయి వెళ్ళండి. అచ్ఛా!
గ్రూప్ నం. 2 :- సదా సేఫ్‌గా ఉండే స్థానం - హృదయాభిరాముడు బాబా హృదయ సింహాసనం
సదా తమను తాము హృదయాభిరాముడు బాబా హృదయంలో ఉండేవారిగా అనుభవం చేసుకుంటున్నారా? హృదయాభిరాముడు యొక్క హృదయమే సింహాసనము కదా. మరి హృదయ సింహాసనాధికారి ఆత్మలము - అని మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? సదా సింహాసనంపై ఉంటున్నారా లేక అప్పుడప్పుడు దిగుతూ, అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటున్నారా? ఎవరికైనా సింహాసనము లభిస్తే సింహాసనాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఇది శ్రేష్ఠ భాగ్యం, భగవంతుని హృదయ సింహాసనాధికారిగా అయ్యే భాగ్యం లభించింది. ఇంతకంటే పెద్ద భాగ్యం ఏదైనా ఉండగలదా? ఇలా లభించిన శ్రేష్ఠ భాగ్యాన్ని మరచిపోవడం లేదు కదా? కాబట్టి సదా సింహాసనాధికారి ఆత్మలము అనే ఈ స్మృతిలో ఉండండి. హృదయంలో ఇమిడిపోయి ఉండేవారిని, పరమాత్మ హృదయంలో ఇమిడిపోయినవారిని మరెవరైనా కదిలించగలరా? హృదయ సింహాసనాధికారి ఆత్మలు సదా సేఫ్‌గా ఉంటారు. మాయ తుఫాను నుండి కూడా మరియు ప్రకృతి తుఫాను నుండి కూడా - రెండింటి తుఫానుల నుండి సేఫ్‌గా ఉంటారు. మాయ అలజడీ కదిలించలేదు మరియు ప్రకృతి అలజడీ కదిలించలేదు. అంతటి అచలంగా ఉన్నారా? లేక అప్పుడప్పుడు అచలంగా, అప్పుడప్పుడు కదులుతూ ఉంటారా? స్మృతిచిహ్నం అచల్‌ఘర్. చంచల్-ఘర్ అని తయారవ్వనే లేదు. అనేకసార్లు అచలంగా అయ్యారు. ఇప్పుడు కూడా అచలంగా ఉన్నారు కదా. అలజడిలో నష్టం జరుగుతుంది మరియు అచలంగా ఉండటంలో లాభం ఉంది. ఏదైనా వస్తువు కదులుతూ ఉంటే విరిగిపోతుంది కదా.
మేము హృదయాభిరాముడి హృదయ సింహాసనాధికారులము అని సదా గుర్తుంచుకోండి. ఈ స్మృతే తిలకం. తిలకం ఉంటే సింహాసనాధికారిగా కూడా ఉంటారు. అందుకే సింహాసనంపై కూర్చునేటప్పుడు మొదట రాజ్య తిలకం పెడతారు. కాబట్టి ఈ స్మృతి అనే తిలకమే రాజ్య తిలకం. మరి తిలకం దిద్దబడి ఉందా లేక అప్పుడప్పుడు చెరిగిపోతోందా? తిలకం అప్పుడప్పుడు సగం మిగిలిపోవడం, అప్పుడప్పుడు చెరిగిపోవడం - ఇలా జరగట్లేదు కదా. ఇది అవినాశి తిలకం, స్థూలమైన తిలకం కాదు. సింహాసనాధికారిగా ఉండేవారికి ఎంత సంతోషం ఉంటుంది, ఎంత నషా ఉంటుంది! నేటి నాయకులకు సింహాసనము లభించదు, కుర్చీ లభిస్తుంది. అయినా మా పార్టీదే రాజ్యం అని ఎంత నషా ఉంటుంది! అదైతే కుర్చీ, మీది సింహాసనము. కాబట్టి స్మృతి నషాను తెప్పిస్తుంది. ఒకవేళ స్మృతి లేకపోతే నషా కూడా ఉండదు. తిలకం ఉంటే సింహాసనం ఉంటుంది. కాబట్టి స్మృతి అనే తిలకం సదా దిద్దబడి ఉందా అనగా సదా స్మృతిస్వరూపులుగా ఉన్నారా అని చెక్ చేసుకోండి?
ఢిల్లీ నివాసులు ఏమి చేస్తున్నారు? రాజధాని కొరకు ఏమి తయారీ చేస్తున్నారు? రాజధాని కొరకు ఎంత తయారీ కావాలి! ప్రకృతి కూడా సిద్ధం కావాలి, రాజ్యం చేసేవారు కూడా సిద్ధం కావాలి. మరి ఏమి తయారీ చేశారు? సగం ఢిల్లీని సిద్ధం చేశారా? ఢిల్లీ జనాభా ఎంత? (85 లక్షలు) మరియు బ్రాహ్మణులు ఎంతమంది? (5 వేలు) ఇది ఏమీ కానట్లే కదా. మరి ఎప్పుడు సిద్ధం చేస్తారు? వినాశనం గంట మోగినప్పుడా? ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్! కాబట్టి ఢిల్లీ వారిని సిద్ధం చేయండి. మొదట ఆది సంఖ్య కూడా 9 లక్షలు ఉంది కదా. అది కూడా సిద్ధం చేయలేదు, ఇప్పుడైతే వేలల్లో ఉంది. మరి ఏమి చేయాల్సి ఉంటుంది? సిద్ధంగా ఉన్న రాజధానిలోకి వస్తారా లేక స్వయం సిద్ధం చేస్తారా? ఎవరు చేస్తే వారు పొందుతారు. సరేలే, రాజధాని సిద్ధమవుతుంది, వచ్చేద్దాం అని అనుకోకండి. కాదు, ఎవరు చేస్తే వారే పొందుతారు అన్నది నియమం. కాబట్టి చేయాల్సిందే కదా. ఇది చాలా స్లో (నెమ్మది) గతి. తీవ్ర గతి ఎప్పుడు వస్తుంది? (5 సంవత్సరాలలో) 5 సంవత్సరాలలో వినాశనం జరిగితే? తయారీ లేకుండా వినాశనం జరిగిపోతే అప్పుడు ఏమి చేస్తారు? (జనాభా పెరుగుతూ పోతుంది) ఇదైతే శుభవార్త. మీ సేవలో కూడా వృద్ధి జరుగుతుంది. సేవాధారులకు సేవ చేసే ఛాన్స్ లభిస్తోంది. కాబట్టి ఢిల్లీ వాసులు తమ పనిని పూర్తి చేయలేదు, ఇంకా చాలా మిగిలి ఉంది. ఇప్పుడు ఫాస్ట్ గతి చేయండి. ఒకరు పదిమందిని తయారుచేయాలి. 12 నెలల్లో పదిమందిని అయితే తయారుచేయగలరు. ఒక నెలలో ఒకరిని - ఇదైతే సహజం. మీరు ‘అవును’ అన్నారు, కాబట్టి ఫోటో తీయబడుతోంది, ఆటోమేటిక్ కెమెరాలో తీయబడుతోంది. దృఢ సంకల్పం యొక్క చేతులెత్తాలి. దృఢ సంకల్పం యొక్క చేయి ఎత్తితే ఇక జరిగే ఉంది. ఢిల్లీ వారందరికీ ఆహ్వానం పంపి పిలవాలి. అలజడి గల ధరణిపై రాజ్యం చేయకూడదు కదా, స్వర్ణ ధరణిపై రాజ్యం చేయాలి. కాబట్టి తయారుచేయాల్సిందే కదా. ఇప్పుడు ఫాస్ట్ గతి చేయండి. వినేవారు దొరకడం లేదు అని ఎన్నడూ అనుకోకండి. వినేవారైతే చాలామంది ఉన్నారు. కాస్త పురుషార్థం చేయండి. తమ స్థితిని ఆత్మిక ఆకర్షణతో నింపండి. అయస్కాంతం తన వైపుకు లాగగలిగినప్పుడు, మీ ఆత్మిక శక్తి ఆత్మలను లాగలేదా? కాబట్టి ఆత్మిక ఆకర్షణను కలిగించే అయస్కాంతంగా అవ్వండి. సూదిని రమ్మని అయస్కాంతం చెప్పనవసరం లేదు. స్వతహాగానే లాక్కుంటుంది. ఆత్మిక ఆకర్షణతో కూడిన స్థితి స్వయంగా ఆకర్షిస్తుంది, శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ కర్మ ‘సేవ’ కదా. మిగిలినవన్నీ కేవలం నిమిత్తమాత్రమే, కానీ బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ కర్మ ‘సేవ’. సేవాధారులు కదా. అచలంగా అవ్వండి మరియు అచలంగా తయారుచేయండి. సదా సంతుష్టంగా ఉండండి. ప్రోగ్రామ్ చేయండి. ఇది చాలా మంచిది. ప్రోగ్రామ్ అనగా ప్రోగ్రెస్.
గ్రూప్ నం. 3 :- సహజయోగానికి ఆధారం - ఒక్కరి స్మృతి
సదా సహజ పురుషార్థం యొక్క విధి ఏమిటి? సహజ పురుషార్థపు అనుభవం ఉందా? సహజంగా అవ్వడానికి ఏ విధిని అనుసరించారు? ‘ఒక్కరిని’ గుర్తుచేసుకోవడం - ఇది సహజ విధి. ఎందుకంటే ‘అనేకులను’ గుర్తుచేసుకోవడం కష్టమవుతుంది. కానీ ఒక్కరిని గుర్తుచేసుకోవడం సహజం. సహజయోగం అనగానే ‘ఒక్కరిని’ గుర్తుచేసుకోవడము. ఒక్క బాబా మరెవ్వరూ లేరు. ఇలా ఉందా? లేక బాబాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు. ‘నా శరీరం’ అన్నప్పుడు గుర్తుకొస్తుంది, కానీ నాది కానే కానప్పుడు గుర్తురాదు. మరి తనువు-మనస్సు-ధనము నీదా లేక నాదా? నాది కానే కానప్పుడు ఇక గుర్తురావడం ఏమిటి? దేహభానంలోకి రావడం, బాడీ-కాన్షియస్లోకి రావడం అనగా నా శరీరం అని భావించడం. కానీ సదా ఇది గుర్తుంచుకోండి - నాది కాదు, బాబాది, సేవార్థం బాబా ట్రస్టీగా చేశారు. లేకపోతే సేవ ఎలా చేస్తారు? శరీరం కావాలి కదా. కానీ నాది కాదు, ట్రస్టీని. నాది అనే భావం ఉంటే గృహస్థి మరియు నీది అనే భావం ఉంటే ట్రస్టీ. ట్రస్టీ అనగా డబల్ లైట్. గృహస్థికి నాది-నాది అనే ఎంత భారం ఉంటుంది - నా ఇల్లు, నా పిల్లలు, నా మనవలు...! పెద్ద జాబితా ఉంటుంది. ఇది భారం.
ట్రస్టీగా అయిపోతే భారం సమాప్తమైపోతుంది. ఇలా అయ్యారా? లేక మారుతూ ఉంటారా? అసలు ఎవరూ లేనప్పుడు, ఒక్క బాబా మరెవ్వరూ లేనప్పుడు ఇక ఏమి గుర్తుకొస్తుంది? సహజ విధి ఏమిటి? ‘ఒక్కరిని’ గుర్తుచేసుకోవడం, ‘ఒక్కరిలోనే’ సర్వస్వాన్నీ అనుభవం చేసుకోవడం. అందుకే బాబాయే సర్వస్వము అని అంటారు కదా. ప్రపంచంలో సర్వస్వం ఉంటుంది కదా. బాబాయే సర్వస్వం అయినప్పుడు ఇక ‘ఒక్కరి’ స్మృతి సహజమైపోయింది కదా. శ్రమ పడే పని అయితే కాదు కదా. అర్థ కల్పం శ్రమ చేశారు. వెతకడం, తిరగడం ఇదే చేశారు కదా. మరి శ్రమ పడాల్సి వచ్చింది కదా. ఇప్పుడు బాప్‌దాదా శ్రమ నుండి విడిపిస్తున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా శ్రమ పడాల్సి వస్తే, దానికి కారణం తమ బలహీనతే. బలహీనుడికి సహజమైన పని కూడా కష్టంగా అనిపిస్తుంది మరియు ధైర్యవంతులకు కష్టమైన పని కూడా సహజంగా అనిపిస్తుంది. బలహీనతే కష్టంగా మారుస్తుంది, ఉన్నది సహజమే. మరి బాబా ఏమి కోరుకుంటున్నారు? సదా సహజయోగిగా అయి నడవండి.
సదా సహజయోగి అనగా సదా సంతోషంగా ఉండేవారు. సహజయోగి జీవితం అనగా బ్రాహ్మణ జీవితం. పక్కా బ్రాహ్మణులే కదా. అందరికంటే భాగ్యవంతులైన ఆత్మలము అనే ఈ సంతోషం ఉంటుందా? మీ అంత సంతోషంగా ప్రపంచంలో మరెవరైనా ఉంటారా? మరి సదా ఏ పాట పాడుకుంటారు? “వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము!” ఈ పాట పాడటం అందరికీ వచ్చు. ఎందుకంటే మనసు యొక్క పాట కదా. కాబట్టి ఎవరైనా పాడగలరు మరియు సదా పాడగలరు. “వాహ్ నా భాగ్యము!” అనడం ద్వారా భాగ్యవిధాత అయిన బాబా స్వతహాగానే గుర్తుకొస్తారు. కాబట్టి భాగ్యము మరియు భాగ్యవిధాత - దీనినే సహజ స్మృతి అంటాము. సహజం-సహజం అనుకుంటూ గమ్యస్థానానికి చేరుకుంటారు.
ఇప్పుడు ఆంధ్ర వారు సంఖ్యను పెంచాలి. మీ తోటివారిని మేల్కొలిపితే ఆశీర్వాదాలు లభిస్తాయి. అటూఇటూ తిరిగే ఆత్మలకు దారి చూపించడం - ఇది ఎంతో పుణ్యకార్యం. ఆంధ్ర యొక్క విశేషత ఏమిటి? ఎడ్యుకేటెడ్ (విద్యావంతులైన) ప్రజలు చాలామంది ఉంటారు. కాబట్టి సేవలో ముందుకు సాగేలాంటి ఎడ్యుకేటెడ్ ప్రజలను తయారుచేయండి. అనేకులను మేల్కొలిపేలాంటి వారిని ఎవరినైనా ఆంధ్రలో నిమిత్తంగా చేయండి.
గ్రూప్ నం. 4 :- పరమాత్మ ప్రేమను పొందాలంటే అతీతంగా అవ్వండి
సదా తమను తాము ఆత్మిక గులాబీలుగా భావిస్తున్నారా? ఆత్మిక గులాబీ అనగా సదా ఆత్మిక సువాసనతో నిండిన ఆత్మ. గులాబీ పువ్వు పని సదా సువాసననివ్వడం, సువాసనను వ్యాపింపజేయడం. గులాబీ పువ్వు ఎంత సువాసన కలిగి ఉంటుందో అన్ని ముళ్ళు కూడా ఉంటాయి, కానీ ముళ్ళ ప్రభావంలోకి రాదు. ముళ్ళ కారణంగా గులాబీ పువ్వు ఎన్నడూ పాడైపోదు, సదా స్థిరంగా ఉంటుంది. ముళ్ళు ఉన్నప్పటికీ ముళ్ళకు అతీతంగా మరియు అందరికీ ప్రియంగా అనిపిస్తుంది. స్వయంగా అతీతంగా ఉంది కనుకే ప్రియంగా అనిపిస్తుంది. స్వయంగా ముళ్ళ ప్రభావంలోకి వచ్చేస్తే ఇక దానిని ఎవరూ ముట్టుకోను కూడా ముట్టుకోరు. కాబట్టి ఆత్మిక గులాబీ విశేషత ఏమిటంటే, ఎలాంటి ముళ్ళు ఉన్నా - చిన్నవైనా, పెద్దవైనా, తేలికపాటివైనా, పదునైనవైనా కానీ సదా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉండాలి. ప్రియంగా అవ్వడానికి ఏమి చేయాలి? అతీతత్వమే ప్రియంగా మారుస్తుంది. ఏ ప్రభావంలోకైనా వచ్చేస్తే బాబాకూ ప్రియంగా ఉండలేరు మరియు బ్రాహ్మణ కుటుంబానికీ ప్రియంగా ఉండలేరు. నిజమైన ప్రేమను పొందాలంటే దాని కొరకు అతీతంగా అవ్వండి - అన్ని హద్దు విషయాల నుండి, తమ దేహం నుండి కూడా అతీతంగా. ఎవరు తమ దేహానికి అతీతంగా కాగలరో వారే అందరికంటే అతీతంగా కాగలరు.
మాకు లభించాల్సినంత ప్రేమ లభించడం లేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు లభించడం లేదు? ఎందుకంటే అతీతంగా లేరు. లేకపోతే పరమాత్మ ప్రేమ అపరిమితమైనది, స్థిరమైనది, అందరికీ లభించగలిగేంతగా ఉంది. కానీ పరమాత్మ ప్రేమను పొందే విధి అతీతంగా అవ్వడమే. విధి రాకపోతే సిద్ధి కూడా లభించదు. బాబాతో మిలనం జరుపుకోవాలని అనుకుంటున్నాము కానీ అనుభవం కావట్లేదు, ఆత్మిక సంభాషణ చేస్తున్నాము కానీ సమాధానం దొరకట్లేదు అని చాలామంది పిల్లలు అంటారు. కారణం ఏమిటి? ప్రేమ లభించేలా మొదట అతీతంగా అయ్యారా? ప్రేమను పొందే ఫౌండేషన్ పక్కాగా ఉంటే ప్రాప్తి అనే గమ్యం లభించకపోవడం అనేది అసంభవం. ఎందుకంటే బాబా గ్యారెంటీ ఉంది. ఒక్క పని మీరు చేయండి, మిగిలినవన్నీ నేను చేస్తాను అని గ్యారెంటీ ఉంది. ఆ ఒక్క విషయం - నన్ను హృదయపూర్వకంగా గుర్తుచేసుకోండి, స్వార్థంతో కాదు. ఏదైనా విఘ్నం వస్తే 4 గంటలు యోగం చేస్తారు మరియు విఘ్నం సమాప్తమవ్వగానే స్మృతి కూడా సమాప్తమైపోయింది. మరి ఇది స్వార్థపు స్మృతి అయింది కదా. కోరిక తీర్చుకోవడానికి స్మృతి చేయడం కాదు, మంచివారిగా అయి స్మృతి చేయాలి. ఈ పని జరిగిపోవాలి, దీని కొరకు గుర్తుచేసుకుంటాను అని ఇలా కాదు. పాత్రులుగా అయి పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకోగలరు.
ఆత్మిక గులాబీ అనగా పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు. పరమాత్మ ప్రేమ ముందు ఆత్మల ప్రేమ ఎంతటిది? ఏమీ లేదు. పరమాత్మ ప్రేమకు అనుభవజ్ఞులుగా అయినప్పుడు హృదయం నుండి ఏమి వస్తుంది? ఏ పాట పాడుకుంటారు? పొందేశాము, ఇంకేమీ మిగల్లేదు. ఇలాంటి ప్రాప్తికి అధికారి ఆత్మగా అవ్వండి. ప్రాప్తి కలగడమే పాత్రతకు గుర్తు. ఒకవేళ ప్రాప్తి కలగకపోతే, తక్కువగా కలిగితే పాత్రత తక్కువగా ఉందని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇచ్చేవారు దాత మరియు అపరిమితమైన ఖజానా ఉంది. మరి ఎందుకు లభించదు? పాత్రత యోగ్యమైనదైతే ప్రాప్తులు కూడా అన్నీ ఉంటాయి. బాబా సదా నావారు అయినప్పుడు ప్రాప్తి కూడా సదా ఉంటుంది కదా. ఎప్పుడూ, ఎలాంటి హద్దు ప్రభావానికైనా సరే అతీతంగా ఉండాల్సిందే, ఎన్నడూ ప్రభావంలోకి రాకూడదు. మళ్ళీ మాటిమాటికి పాత్రులుగా అయ్యే అభ్యాసం అనగా శ్రమ పడాల్సి వస్తుంది. అందువలన హద్దు ప్రభావంలోకి రాకుండా సదా అనంతమైన ప్రాప్తులలో లీనమై ఉండండి. ఆత్మిక గులాబీగా నేను సదా ఆత్మిక సువాసనలో ఉంటున్నానా, అతీతంగా ఉంటున్నానా, ప్రేమకు పాత్రుడిగా అవుతున్నానా అని సదా చెక్ చేసుకోండి? ఎందుకంటే ఆత్మల ద్వారా ప్రాప్తి అయితే 63 జన్మలు చేసుకున్నారు, దాని వల్ల రిజల్ట్ ఏమి వచ్చింది? పోగొట్టుకున్నారు కదా. ఇప్పుడు పొందే సమయం. హద్దు ప్రాప్తులు అనగా పోగొట్టుకోవడం, అనంతమైన ప్రాప్తి అనగా జమ చేసుకోవడం. అచ్ఛా!
గ్రూప్ నం. 5 :- స్వరాజ్య తిలకమే భవిష్య రాజతిలకానికి ఆధారం
అందరూ తమను తాము విజయి రత్నాలుగా అనుభవం చేసుకుంటున్నారా? విజయాన్ని పొందడం సహజంగా అనిపిస్తుందా లేక కష్టంగా అనిపిస్తుందా? కష్టమా లేక కష్టంగా చేసుకుంటున్నారా, ఏమంటారు? ఉన్నది సహజమే కానీ కష్టంగా మార్చేసుకుంటున్నారు. మాయ బలహీనులుగా మార్చినప్పుడు కష్టంగా అనిపిస్తుంది మరియు బాబా తోడు ఉన్నప్పుడు సహజమవుతుంది. ఎందుకంటే కష్టమైన వస్తువైతే సదా కష్టంగానే అనిపించాలి కదా. అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు కష్టంగా ఎందుకు? సదా విజయపు నషా స్మృతిలో ఉండాలి. ఎందుకంటే విజయం మీ బ్రాహ్మణ ఆత్మలందరి జన్మ సిద్ధ అధికారము. మరి జన్మ సిద్ధ అధికారమును పొందడం కష్టమా లేక సహజమా? ఎన్నిసార్లు విజయిగా అయ్యారు! మరి కల్ప-కల్పపు విజయి ఆత్మలకు మళ్ళీ విజయిగా అవ్వడం కష్టమా ఏంటి? అమృతవేళ సదా తమ మస్తకంలో విజయి తిలకం అనగా స్మృతి అనే తిలకం దిద్దుకోండి. భక్తి మార్గంలో తిలకం దిద్దుతారు కదా. భక్తికి గుర్తు కూడా తిలకమే మరియు సౌభాగ్యానికి గుర్తు కూడా తిలకమే. రాజ్యాన్ని పొందే గుర్తు కూడా రాజతిలకమే. ఎప్పుడైనా ఏదైనా శుభ కార్యంలో సఫలతను పొందాలని అనుకున్నప్పుడు వెళ్ళేముందు తిలకం దిద్దుతారు. మరి మీకు రాజ్య ప్రాప్తి యొక్క రాజ్య-తిలకమూ ఉంది మరియు సదా శ్రేష్ఠ కార్యం అలాగే సఫలత ఉన్నాయి, అందువలన కూడా సదా తిలకం ఉంది. సదా బాబా తోడు అనే సౌభాగ్యం ఉంది, అందువలన కూడా తిలకం ఉంది. కాబట్టి అవినాశి తిలకం. ఎప్పుడైనా చెరిగిపోతుందా ఏంటి? అవినాశి తండ్రి లభించినప్పుడు అవినాశి తండ్రి ద్వారా తిలకం కూడా అవినాశిగా లభించింది. ఇప్పుడేమో స్వరాజ్య తిలకం మరియు భవిష్యత్తులో విశ్వరాజ్య తిలకం అని వినిపించాము కదా. స్వరాజ్యం లభించిందా లేక లభించాల్సి ఉందా? ఎప్పుడైనా పోగొట్టుకుంటున్నారా? మేము కల్ప-కల్పానికి అధికారులమే అని సదా ధైర్యంతో చెప్పండి!
ఈ సమయంలో స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారులు అలాగే ద్వాపర-కలియుగాలలో పూజనీయతకు అధికారులుగా అవుతారు, అందువలన పూజ్య అధికారులు. మీ అందరి పూజ జరుగుతుంది. మీ మందిరాలను చూశారా? డబల్ విదేశీయుల మందిరం ఉందా? దిల్వాలా మందిరంలో మీరు కూర్చున్నారా? ఎందుకంటే ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో ఆ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు మరియు దేవతల పూజ జరుగుతుంది. పక్కా బ్రాహ్మణులైతే పక్కాగానే పూజ జరుగుతుంది. కచ్చా బ్రాహ్మణులైతే బహుశా పూజ జరగవచ్చు. డబల్ విదేశీయులు అందరూ పక్కానా? పక్కాగా ఉండేవారు, పక్కాగా ఉన్నారు మరియు పక్కాగానే ఉంటారు, అంతే కదా. అచ్ఛా! అందరూ పక్కానా? అనుభవజ్ఞులుగా అయ్యారు కదా. అనుభవజ్ఞులు ఎన్నడూ మోసపోరు. చూసేవారు, వినేవారు మోసపోవచ్చు కానీ అనుభవం యొక్క అథారిటీ ఉన్నవారు మోసపోలేరు. ప్రతి అడుగులోనూ కొత్త కొత్త అనుభవాలను చేసుకుంటూ ఉంటారు. రోజూ కొత్త అనుభవం. ఉల్లాస-ఉత్సాహాలు కలవారే కదా. ఉల్లాస-ఉత్సాహాలు - ఇవే ఎగిరే కళకు రెక్కలు. ఎప్పుడైనా ఉల్లాస-ఉత్సాహాలు తగ్గాయి అంటే రెక్కలు బలహీనమయ్యాయి అని అర్థం. మంచిది, ఇంతవరకు ఎవరూ చేయనిది చేసి చూపించండి, అప్పుడు నవీనత అంటాము. సెంటర్ తెరవడం, ఫంక్షన్ చేయడం ఇవన్నీ అందరూ చేస్తారు. భ్రమించే ఆత్మలకు ఒక స్థానాన్ని ఇవ్వాలని బాబాకు ఎలాగైతే దయ కలుగుతుందో, పిల్లల మనసులో కూడా ఈ దయ కలగాలి. కాబట్టి ఇప్పుడు ఏదైనా కొత్త సాధనాన్ని కనుగొనండి, తద్వారా అనేక ఆత్మలకు సందేశం లభించాలి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
