‘‘సత్యము మరియు అసత్యము మధ్య ఉన్న విశేషమైన వ్యత్యాసము’’
ఈరోజు హృదయాభిరాముడైన తండ్రి తమ పిల్లలందరి యొక్క మనసులోని ఆశలను పూర్తి చేయడం కోసం మిలనం జరుపుకునేందుకు వచ్చారు. అవ్యక్త రూపంలోనైతే పిల్లలందరూ సదా మిలనం జరుపుకుంటూ ఉంటారు. అయినా కూడా వ్యక్త శరీరం ద్వారా అవ్యక్త మిలనాన్ని జరుపుకునే శుభమైన ఆశను పెట్టుకుంటారు, అందుకే తండ్రి కూడా అవ్యక్తం నుండి వ్యక్తంలోకి రావాల్సి ఉంటుంది. బాప్‌దాదా ఈ సమయంలో నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లలను చూస్తున్నారు - వారంతా మనసు ద్వారా మధుబన్‌లో ఉన్నారు. మీరు సాకారంలో ఉన్నారు మరియు అనేకమంది పిల్లలు అవ్యక్త రూపంతో మిలనం జరుపుకుంటున్నారు. బాప్‌దాదా కూడా పిల్లలందరి స్నేహానికి రిటర్న్ ఇస్తున్నారు. ఎక్కడ ఉన్నా కానీ స్మృతి ద్వారా తండ్రికి సమీపంగా హృదయంలో ఉన్నారు. అందరి స్నేహము యొక్క రాగాన్ని బాప్‌దాదా వింటున్నారు. పిల్లలకు స్మృతి చేయడానికి ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు మరియు తండ్రికి కూడా పిల్లలు తప్ప మరెవ్వరూ లేరని తండ్రికి తెలుసు. నేను బాబాకు చెందినవాడిని మరియు బాబా నా వారు అనే స్మృతిలోనే సదా ఉంటారు. ఈ స్మృతియే సహజమైనది కూడా మరియు సమర్థంగా తయారుచేసేటువంటిది కూడా. ఇటువంటి స్మృతి స్వరూపులైన స్నేహీ పిల్లలు సాకారంలోనే కాదు, స్వప్నంలో కూడా ఎప్పుడూ అసమర్థులుగా అవ్వలేరు. అసమర్థులుగా అవ్వడము అనగా ‘నా బాబా’ అన్నదానికి బదులుగా ఇంకేదో నాది అన్న భావన వస్తుంది. ఒక్క నా బాబా అన్నదే ఉంటే - అది మిలనం జరుపుకోవడము. ఒకవేళ ‘ఒకరు’ అన్నదానికి బదులుగా ‘రెండవ వారు’ నా వారైతే, అప్పుడు ఏమవుతుంది? అదేమో మిలనము మరియు ఇదేమో గందరగోళము.
చాలా మంది పిల్లలు ఏమని భావిస్తారంటే - బాబా అయితే నా వారే కానీ వేరే ఒకరిద్దరిని నా వారిగా చేసుకోవాల్సే వస్తుంది. వేరే ఏమీ వద్దు కానీ కేవలం ఒక ఆధారము కావాలి. కానీ మీ ప్రతిజ్ఞ ఏమిటి - ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనా లేక ఒక్క తండ్రి మరియు ఇంకొకరు అనా? అమాయకులుగా అవుతారు. ఆ ఇంకొకరిలో అనేకమంది ఇమిడి ఉంటారు, అందుకే గందరగోళం అయిపోతుంది. ఈ పాత ప్రపంచంలో ఎలాంటి ఆటబొమ్మలు లభిస్తాయంటే, అవి బయటకు ఒకటిగా కనిపిస్తాయి కానీ ఒకదాని లోపల ఇంకొకటి ఉంటుంది. ఒకటి తెరిస్తే రెండవది వస్తుంది, రెండవది తెరిస్తే మూడవది వస్తుంది. ఇది కూడా అటువంటి ఆటబొమ్మే. కనిపించడము ఒక్కరే కనిపిస్తారు కానీ లోపల అనేకులు ఇమిడి ఉంటారు. మరి ఎప్పుడైతే గందరగోళంలోకి వెళ్ళిపోతారో, అప్పుడు మిలనం ఎలా జరగగలదు? గందరగోళంలోనే మునిగి ఉంటారా లేక మిలనం జరుపుకుంటారా? కేవలం రెండవవారే కదా అని ఆలోచించకండి. సంకల్పంలోనైనా సరే కేవలం ఒక్క తండ్రిని తప్ప ఏ ఆత్మనైనా లేక ప్రకృతి యొక్క సాధనాలనైనా ‘నా ఆధారము’ అన్నట్లు స్వీకరిస్తే, ఈ ఆటోమేటిక్ ఈశ్వరీయ మిషనరీ చాలా తీవ్ర వేగంతో పనిచేస్తుంది. ఏ క్షణాన అయితే ఇతరులను ఆధారంగా చేసుకున్నారో, అదే క్షణాన మనసు-బుద్ధి తండ్రి నుండి దూరమైపోతాయి. సత్యమైన తండ్రి నుండి దూరమైన కారణంగా బుద్ధి అసత్యాన్ని సత్యముగా, రాంగ్‌ను రైట్‌గా భావించడం మొదలుపెడుతుంది, తప్పుడు తీర్పులు ఇవ్వడం మొదలుపెడుతుంది. ఇది రైట్ కాదు అని ఎవరు ఎంతగా అర్థం చేయించినా కానీ, వారు అసత్యము యొక్క శక్తితో యథార్థాన్ని, సత్యాన్ని అర్థం చేయించేవారిని కూడా రాంగ్ అని నిరూపిస్తారు. ఈరోజుల్లో డ్రామానుసారంగా అసత్యము యొక్క రాజ్యముంది మరియు ఈ అసత్య రాజ్యానికి రాజ్యాధికారి, ప్రెసిడెంట్ రావణుడు అని సదా గుర్తుంచుకోండి. అతనికి ఎన్ని తలలు ఉన్నాయి! అనగా అసత్యము యొక్క శక్తి ఎంత గొప్పది! అతని మంత్రులు, మహామంత్రులు కూడా చాలా గొప్పవారు. అతని జడ్జి మరియు వకీలు కూడా చాలా తెలివైనవారు, అందుకే వ్యతిరేక తీర్పుకు సంబంధించిన పాయింట్లను చాలా వెరైటీగా మరియు బయటికి మధురమైన రూపం కలవిగా ఇస్తారు, అందుకే సత్యాన్ని అసత్యంగా నిరూపించడంలో చాలా తెలివైనవారిగా ఉంటారు.
కానీ అసత్యము మరియు సత్యములో విశేషమైన తేడా ఏమిటి? అసత్యము యొక్క గెలుపు అల్పకాలికంగా ఉంటుంది ఎందుకంటే అసత్య రాజ్యము కూడా అల్పకాలికమైనది. సత్యత యొక్క ఓటమి అల్పకాలికమైనది మరియు గెలుపు సదాకాలికమైనది. అసత్యతతో అల్పకాలికంగా విజయం పొందినవారు ఆ సమయంలో సంతోషంగా ఉంటారు. ఎంతగానైతే ఆ కొద్ది సమయానికి సంతోషపడతారో లేక స్వయాన్ని రైట్ గా నిరూపించుకుంటారో, అంతగానే సమయం వచ్చినప్పుడు, అసత్యము యొక్క అల్పకాలిక సమయం సమాప్తమైనప్పుడు, ఆ అసత్యతకు వశమై ఎంతగా ఆనందించారో అంతగానే సత్యత యొక్క విజయం ప్రత్యక్షమైనప్పుడు అంతకు 100 రెట్లు పశ్చాత్తాపపడాల్సే ఉంటుంది. ఎందుకంటే తండ్రి నుండి దూరమవ్వడమంటే స్థూలంగా దూరమవ్వడం కాదు, స్థూలంగానైతే స్వయాన్ని జ్ఞానులుగా భావిస్తారు కానీ మనసు-బుద్ధి ద్వారా దూరమవుతారు. తండ్రి నుండి దూరమవ్వడం అనగా సదా కాలం యొక్క సర్వ ప్రాప్తుల అధికారంతో సంపన్నంగా అయ్యేందుకు బదులుగా అసంపూర్ణ అధికారం ప్రాప్తించడము. చాలామంది పిల్లలు ఏమని భావిస్తారంటే, అసత్యము యొక్క బలంతో అసత్య రాజ్యంలో విజయం యొక్క సంతోషాన్ని లేక ఆనందాన్ని ఈ సమయంలోనే జరుపుకుందాము, భవిష్యత్తును ఎవరు చూసారు, ఎవరు చూస్తారులే - మేము కూడా మర్చిపోతాము, అందరూ మర్చిపోతారు. కానీ ఇది అసత్య తీర్పు. భవిష్యత్తు వర్తమానానికి నీడ వంటిది. వర్తమానం లేకుండా భవిష్యత్తు తయారవ్వదు. అసత్యానికి వశీభూతమైన ఆత్మ వర్తమాన సమయంలో కూడా అల్పకాలికమైన సుఖమిచ్చే పేరు, గౌరవము, ప్రతిష్ఠలు అనే సుఖాల ఊయలలో ఊగగలరు మరియు ఊగుతారు కూడా, కానీ అతీంద్రియ అవినాశీ సుఖమనే ఊయలలో ఊగలేరు. అల్పకాలికమైన ప్రతిష్ఠ, గౌరవము మరియు పేరు యొక్క ఆనందాన్ని జరుపుకోగలరు కానీ సర్వాత్మల హృదయపూర్వక స్నేహాన్ని, హృదయపూర్వక ఆశీర్వాదాల గౌరవాన్ని ప్రాప్తి చేసుకోలేరు. పైపైకి నామమాత్రంగా గౌరవాన్ని పొందగలరు కానీ హృదయపూర్వక గౌరవాన్ని పొందలేరు. అల్పకాలికమైన ప్రతిష్ఠ లభిస్తుంది కానీ తండ్రి ద్వారా సదా హృదయసింహాసనాధికారి అనే ప్రతిష్ఠను అనుభవం చేయలేరు. అసత్యమైన సహచరుల ద్వారా పేరు ప్రాప్తి చేసుకోగలరు కానీ బాప్‌దాదా హృదయంలో పేరును ప్రాప్తి చేసుకోలేరు ఎందుకంటే బాప్‌దాదాకు దూరంగా ఉన్నారు. భవిష్యత్తు యొక్క విషయం వదిలేయండి, దాని గురించైతే అర్థమవుతుంది. కానీ వర్తమానంలో సత్యత మరియు అసత్యత యొక్క ప్రాప్తులలో ఎంత తేడా ఉంది? వేరొకరిని నా వారిగా చేసుకున్నాను అంటే అసత్యము యొక్క ఆధారాన్ని తీసుకున్నట్లు. అప్పుడు ఎంత గందరగోళం అవుతుంది! చెప్పడము ఏమని చెప్తారంటే - వేరే ఏమీ లేదు, కేవలం అప్పుడప్పుడు కాస్త ఆధారం కావాలి అంతే. కానీ ప్రతిజ్ఞను భంగపర్చడం అనగా గందరగోళంలో పడడము. ఇలా ఏమైనా ప్రతిజ్ఞ చేసారా - ఒక్క నా బాబా మరియు అప్పుడప్పుడు రెండవ వారు అని? రెండవవారికి అనుమతి ఉందా? ఇలా ఏమైనా రాసారా? అల్పకాలికమైన పేరు-గౌరవము-ప్రతిష్ఠల ఆధారం తీసుకున్నా, వ్యక్తుల ఆధారం తీసుకున్నా, వైభవాల ఆధారం తీసుకున్నా, వేరేవారు ఎవరూ లేరు అన్నప్పుడు మరి ఈ వేరేవి అన్నీ ఎక్కడి నుండి వచ్చినట్లు? ఇవన్నీ అసత్య రాజ్యం యొక్క గందరగోళంలో చిక్కుకునేలా చేసే యుక్తులు. నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా నా గురించి నంబరువారుగా తెలుసు అని తండ్రి ఏ విధంగానైతే అంటారో, అలా అసత్య రాజ్యానికి అధికారి అయిన రావణుడిని కూడా అతడు ఎవరో, ఎలా ఉన్నాడో, అలా సదా తెలుసుకోరు. ఒక్కోసారి మర్చిపోతారు, ఒక్కోసారి తెలుసుకుంటారు. అతను రాజ్యాధికారి కావున శక్తి ఏమైనా తక్కువ ఉంటుందా! అసత్యమైనా లేక సత్యమైనా కానీ రాజ్యమైతే ఉంది కదా, కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి, ఇతరులను కాదు.
ఈరోజుల్లో ఇతరులను చెక్ చేయడంలో అందరూ తెలివైనవారిగా అయ్యారు. బాప్‌దాదా అంటారు - స్వయానికి చెకర్‌గా (చెక్ చేసుకునేవారిగా) అవ్వండి మరియు ఇతరులకు మేకర్‌గా (తయారుచేసేవారిగా) అవ్వండి. కానీ చేస్తుంది ఏమిటి? ఇతరులకు చెకర్‌గా అవుతారు మరియు విషయాలను కల్పించడంలో మేకర్‌గా అవుతారు. బాప్‌దాదా ప్రతి రోజూ పిల్లలు ప్రతి ఒక్కరి నుండి ఏ కథలను వింటారు? చాలా పెద్ద కథల పుస్తకం ఉంది. కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇతరులను చెక్ చేయడం మొదలుపెడితే పెద్ద కథలు తయారవుతాయి మరియు స్వయాన్ని చెక్ చేసుకుంటే అన్ని కథలు సమాప్తమయి ఒకే సత్యమైన జీవిత కథ ప్రాక్టికల్‌గా నడుస్తుంది. బాబా మీపై చాలా ప్రేమ ఉంది అని అందరూ అంటారు! కేవలం ప్రేమ ఉంది అని అంటారా లేక ప్రేమిస్తారు కూడానా, ఏమంటారు? ఒక్కోసారి అంటారు, ఒక్కోసారి చేస్తారు. తండ్రికి ఉన్న ప్రేమకు ప్రత్యక్ష ఋజువును తండ్రి ఇచ్చేసారు. మీరు ఎవరైనా, ఎలా ఉన్నా, నా వారే. కానీ ఇప్పుడు పిల్లలు ఋజువునివ్వాలి. ఏ ఋజువు ఇవ్వాలి? మీరు ఎవరైనా, ఎలా ఉన్నా, నా వారే అని తండ్రి అంటారు. మరి మీరేమి అంటారు? ఏదున్నా అంతా మీరే. కొద్ది కొద్దిగా వేరే కూడా ఉంది అన్నట్లు ఉండకూడదు. తండ్రిపై ప్రేమ ఉంది కానీ అప్పుడప్పుడు అసత్య రాజ్యం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. అచ్ఛా!
నలువైపులా ఉన్న - యథార్థ సత్యాన్ని పరిశీలించే సత్యమైన తండ్రి యొక్క సత్యమైన పిల్లలకు, స్నేహంలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా ప్రతిజ్ఞను నిలబెట్టుకునే సమర్థ ఆత్మలందరికీ, యథార్థంగా పరిశీలించే శక్తిశాలి ఆత్మలందరికీ, స్మృతి మరియు సేవలో నిర్విఘ్నంగా ఉండేవారందరికీ, సదా తోడుగా మరియు సమీపంగా ఉండే పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము:- ఎవరు ఎంతగా సేవకు నిమిత్తమవుతారో, అంతగానే సేవతో పాటు హృదయం యొక్క వేయి రెట్ల స్నేహం అనుభవమవుతుంది. అందువలన బాధ్యత, బాధ్యతగా అనిపించదు, ఆటలా అనిపిస్తుంది. ఆట అంటే కొత్తదే చూడటం బాగుంటుంది. పాత ఆటను ఏం చూస్తారు. వృక్షం యొక్క విస్తారము జరిగినప్పుడే సారం (బీజం) ప్రత్యక్షంగా కనిపిస్తుంది. విస్తారము సారాన్ని ప్రత్యక్షం చేస్తుంది. మజా వస్తుంది కదా. విశ్వానికి సింహాసనాధికారి అయ్యే ముందు సేవకు సింహాసనాధికారి అవ్వాల్సి ఉంటుంది. ఎవరు ఎంతగా సేవకు సింహాసనాధికారి అవుతారో, అంతగానే విశ్వానికి సింహాసనాధికారి అవుతారు. అనంతమైన సేవ యొక్క సింహాసనము లభించింది కదా. మంచి మేకప్ (శృంగారము) చేసుకున్నారు. మధుబన్‌లో ఉండటం మంచిది. వీరంతా మధుబన్‌లో ఉండేవారు. మధుబన్ యొక్క సీట్ లభించింది కదా. కాబట్టి మధుబన్ సేవ యొక్క సింహాసనము అంటే అనంతమైన సేవ యొక్క సింహాసనము. మంచి గ్రూప్. సేవ బాగా జరుగుతుంది కదా!
పర్యావరణ అభియాన్ గురించి సందేశం:- ఆత్మలకు అనుభూతిని కలిగించడమే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం - సందేశంతో పాటు అనుభూతిని కలిగించడం. ఇదే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం. సందేశం ఇవ్వడం అంటే ఎప్పుడైనా (భవిష్యత్తులోనైనా) తెలుసుకోవచ్చు, కానీ ‘అనుభూతి’ ప్రత్యక్ష ఫలం. దీని ఆవశ్యకత ఉంది, ఇది మీరు తప్ప మరెవరూ చేయించలేరు. వినిపించేవారు అనేకులు ఉన్నారు, అనుభవం చేయించేవారు కేవలం మీరే. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో పర్సనల్ మిలనము:-
గ్రూప్ నం. 1 :- దుఃఖపు అల నుండి ముక్తులు కావడానికి కర్మయోగిగా అయి కర్మ చేయండి
అందరూ తమను తాము శ్రీమతంపై నడిచే శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? పేరే శ్రీమతం. శ్రీ అనగా శ్రేష్ఠమైనది. కాబట్టి శ్రేష్ఠ మతంపై నడిచేవారు శ్రేష్ఠమైనవారే కదా. ఈ ఆత్మిక నషా, అనంతమైన నషా ఉంటోందా? లేక అప్పుడప్పుడు హద్దు నషా కూడా వచ్చేస్తోందా? అందువలన సదా మిమ్మల్ని మీరు చూసుకోండి - నడుస్తూ తిరుగుతూ ఏ కార్యం చేస్తున్నా అనంతమైన ఆత్మిక నషా ఉంటోందా? కర్మ కూలీ పనే అయినా సరే, సాధారణ కర్మ చేస్తూ తమ శ్రేష్ఠ నషాను మరచిపోవడం లేదు కదా? ఇంట్లో ఉండే, ఇంటి సేవ చేసే సాధారణ మాతలు - ఇది గుర్తుంటోందా లేక నేను జగన్మాతను, జగత్ కల్యాణము చేయడానికి నిమిత్తంగా ఈ కార్యం చేస్తున్నాను - ఇది గుర్తుంటోందా? ఎవరికైతే ఈ ఆత్మిక నషా ఉంటుందో వారి గుర్తు ఏమిటి? వారు సంతోషంలో ఉంటారు, ఏ కర్మ చేసినా కర్మ బంధనంలోకి రారు, అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. కర్మ బంధనంలోకి రావడం అనగా కర్మలో చిక్కుకోవడం, మరి ఎవరైతే అతీతంగా-ప్రియంగా ఉంటారో వారు కర్మ చేస్తూ కూడా కర్మ బంధనంలోకి రారు, కర్మయోగిగా అయి కర్మ చేస్తారు. ఒకవేళ కర్మ బంధనంలోకి వస్తే సంతోషం మాయమైపోతుంది. ఎందుకంటే కర్మ బాగుండదు. కానీ కర్మయోగిగా అయి కర్మ చేయడం ద్వారా దుఃఖపు అల నుండి ముక్తులైపోతారు. సదా అతీతంగా ఉండటం కారణంగా ప్రియంగా ఉంటారు. కాబట్టి, ఎలా ఉండాలో అర్థమైందా? కర్మబంధన ముక్తులుగా ఉండాలి. కర్మ బంధనం లాగకూడదు, యజమానిగా అయి కర్మ చేయించాలి. యజమాని అతీతంగా ఉంటారు కదా. యజమానిగా అయి కర్మ చేయించడాన్ని బంధన ముక్తులు అంటాము. అలాంటి ఆత్మ సదా స్వయం కూడా సంతోషంగా ఉంటుంది మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఇలా ఉంటున్నారా? వినడం అయితే చాలా వింటారు, ఇప్పుడు విన్నదానిని ఆచరణలోకి తీసుకురావాలి. చేస్తే పొందుతారు. ఇప్పుడే చేయడం, ఇప్పుడే పొందడం.
మాతలకు ఎప్పుడైనా దుఃఖపు అల వస్తుందా? ఎప్పుడైనా మనసుతో ఏడుస్తారా? మనసుతో ఏడవడం అనేది ఎవరికైనా రావచ్చు. కాబట్టి శ్రీమతం ఏమిటంటే - సదా సంతోషంగా ఉండండి. అప్పుడప్పుడు ఏడవండి అని శ్రీమతం చెప్పడం లేదు. బహు కాలం మనసుతో లేదా కళ్ళతో ఏడ్చారు, రావణుడు ఏడ్పించాడు కదా. కానీ ఇప్పుడు బాబా పిల్లలుగా అయ్యారు సంతోషంతో నాట్యం చేయడానికి, ఏడవడానికి కాదు. ఏడవడం సమాప్తమైపోయింది. దుఃఖపు అల - ఇది కూడా ఏడవడమే. ఇది మనసుతో ఏడవడం అవుతుంది. సుఖదాత యొక్క పిల్లలు సదా సుఖంలో ఊగుతూ ఉండండి. దుఃఖపు అల రాలేదు. మరచిపోయినప్పుడే అది వస్తుంది. అందువలన అభూల్ (మరపురానివారు)గా అవ్వండి. ఇప్పుడు ఏ బలహీనత ఉన్నా దానిని మహాయజ్ఞంలో స్వాహా చేసి వెళ్ళండి. వెంట తీసుకువెళ్ళకూడదు, ఇక్కడే స్వాహా చేసి వెళ్ళండి. స్వాహా చేయడం వచ్చు కదా. దృఢ సంకల్పం చేయడం అనగా స్వాహా చేయడం. అచ్ఛా! అందరి ఆశ నెరవేరింది. ఇలా కలుస్తూ ఉంటున్నందుకు వీరు కూడా భాగ్యవంతులు. ముందుముందు ఏమవుతుందో... ఈ భాగ్యం ఎంత లభిస్తే అంత తీసుకుంటూ నడవండి. ఎగురుతూ వెళ్ళండి. మహాన్‌గా ఉన్నాము మరియు మహాన్‌గా తయారుచేయాలి అని ఇదే గుర్తుంచుకోండి.
గ్రూప్ నం. 2 :- సర్వ శక్తులను సమయానికి కార్యంలో ఉపయోగించడం అనగా మాస్టర్ సర్వశక్తిమాన్గా అవ్వడం
శక్తుల పూజను చూసి స్మృతిలో ఏమి ఉంటుంది? మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటున్నారా - శక్తులను అష్ట భుజధారులుగా చూపించినట్లుగా మేము కూడా అష్ట శక్తివాన్, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అని గుర్తుంటుందా! ఈ ఎనిమిది కేవలం గుర్తు మాత్రమే, కానీ ఉన్నవి సర్వ శక్తులు. శక్తుల పేరు వింటూ, శక్తుల పూజను చూస్తూ సర్వ శక్తుల స్మృతి వస్తోందా లేక కేవలం చూసి సంతోషపడుతున్నారా? జడ చిత్రాలలో ఎంతటి (కమాల్) విశేషతను నింపేస్తారు! మరి చైతన్యం నుండే కదా జడం తయారవుతుంది. కాబట్టి చైతన్యంలో మనం ఎంత కమాల్గా తయారయ్యాము అనగా శ్రేష్ఠంగా తయారయ్యాము! మరి ఇది మన స్మృతిచిహ్నం అనే సంతోషం కలుగుతోందా లేక దేవీలదా? దేవీలతో పాటు గణేషుని పూజ కూడా జరుగుతుంది కదా. కాబట్టి ప్రాక్టికల్లోకి ఇలా తయారయ్యారు కనుకనే కదా స్మృతిచిహ్నం తయారైంది. సర్వ శక్తులు అనుభవమవుతున్నాయా అని సదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి? బాబా అయితే ఇచ్చారు, కానీ నేను ఎంతవరకు తీసుకున్నాను, ధారణ చేశాను మరియు ధారణ చేసిన తర్వాత సమయానికి ఆ శక్తి పనికి వస్తోందా? ఒకవేళ సమయానికి ఏ వస్తువైనా పనికి రాకపోతే అది ఉన్నా, లేకపోయినా ఒకటే. ఏదైనా వస్తువును ఉంచుకునేదే సమయానికి పనికి రావడానికి. ఒకవేళ సమయానికి పనికి రాకపోతే ఏమంటారు? ఉన్నా లేకపోయినా ఒకటే అయింది కదా. కాబట్టి బాబా ఇచ్చారు, కానీ మనం ఎంత తీసుకున్నాము అనేది చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ప్రాక్టికల్లోకి పనికి వస్తుందో అప్పుడే మాస్టర్ సర్వశక్తిమాన్ అంటాము. శక్తి పనికి రాకుండా, మాస్టర్ సర్వశక్తిమాన్ అని చెప్పుకుంటే అది శోభించదు. ఒక్క శక్తి తక్కువైనా సమయానికి మోసం చేసేస్తుంది. ఏ సమయమైనా ఆ శక్తి గురించిన పేపర్ వస్తే పాస్ అవుతారా లేక ఫెయిల్ అవుతారా? ఒకవేళ లేకపోతే ఫెయిల్ అవుతారు, ఉంటే పాస్ అవుతారు. మాయకు కూడా తెలుసు - వీరి వద్ద ఈ శక్తి లోపం ఉందని. అప్పుడు అదే పేపర్ వస్తుంది. అందువలన ఒక్క శక్తి కూడా తక్కువగా ఉండకూడదు. అర్థమైందా? శక్తులైతే వచ్చేశాయి, ఒకటి తక్కువైతే ఏముందిలే అని అనుకోకూడదు. ఒక్కదానిలోనే నష్టం ఉంది. ఒక్కటే ఫెయిల్ చేసేస్తుంది. సూర్యవంశంలోకి రావాలంటే ఫుల్ పాస్ కావాల్సిందే కదా. ఫుల్ పాస్ అవ్వడము అనగానే మాస్టర్ సర్వశక్తిమాన్గా అవ్వడము.
మాతలలో సహన శక్తి ఉందా? లేక కొద్దికొద్దిగా కోపం వచ్చేస్తోందా? పాండవులకు కోపం లేదా రోషం వస్తుందా? సహన శక్తి లోపం ఉన్నప్పుడే కదా వస్తుంది. సర్వ శక్తులలో సహన శక్తి కూడా ఒక శక్తియే కదా. ఒక్క శక్తి తగ్గినా ఫుల్ పాస్ అవుతారా లేక అసంపూర్ణంగా పాస్ అవుతారా? అందువలన సర్వ శక్తులను చెక్ చేసుకోండి. పర్సంటేజ్ కూడా తక్కువగా ఉండకూడదు. కొద్దిగానే కోపం వచ్చింది, ఎక్కువగా రాలేదు అని అనుకోకూడదు. కొద్దిగా వచ్చినా దానిని ఫెయిల్ అనే అంటాము మరియు కొద్దికొద్దిగా ఫెయిల్ అయ్యే అలవాటు అయితే ఇక ఫుల్ పాస్ ఎలా అవుతారు? అందువలన ఒక్క శక్తి లోపం కూడా ఉండకూడదు. ఒకటి కొద్దిగా తక్కువగా ఉందిలే, పెరిగిపోతుందిలే అని ఇలా అలసత్వంగా ఉండకూడదు. బహు కాలం యొక్క లోపం సమయానికి మోసం చేసేస్తుంది. అందువలన మాస్టర్ సర్వశక్తిమాన్ అనగా సర్వ శక్తులతో సంపన్నంగా అవ్వండి. సర్వ శక్తులను కార్యంలో ఉపయోగిస్తూ నడవండి మరియు ఎగురుతూ వెళ్ళండి. అర్థమైందా?
గ్రూప్ నం. 3 :- నాది అన్నదానిని నీదిగా మార్చడమే బ్రాహ్మణ జీవితం
అందరూ తమను తాము ఒకే బలం ఒకే నమ్మకం - ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అనేది పక్కాగా ఉంది కదా. లేక బాబా కూడా ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్నారు, సంబంధీకులు కూడా ఉన్నారా? పిల్లలు, భర్త, అత్తామామలు - ఇంతమంది ఉన్నప్పుడు ఇక ఒక్కరు ఎలా అయ్యారు? ఎదురుగా ఉన్నారు, చూస్తున్నారు, సేవ చేస్తున్నారు, మరి ఒక్కరు ఎలా అయ్యారు? వీరు నావారు కారు, కానీ బాబా సేవ కొరకు ఇచ్చారు అనే దృష్టి-వృత్తి ఉంచుకోవడం ద్వారా ఒక్కరే గుర్తుంటారు. ఎంతమంది ఉన్నా, ఎవరైనా సరే, అందరూ బాబా పిల్లలే మరియు మాకు సేవ కొరకు ఈ ఆత్మలు లభించాయి. అత్తగారు కాదు, కానీ సేవ కొరకు ఆత్మ అనే వృత్తి ఉంటోందా? పాపను పాపగా భావించకుండా, నా కన్య, నా కన్యకు కల్యాణం చేయండి అని ఇలా అనడం లేదు కదా. బాబా సేవా నిమిత్తంగా చేసారు. ఇంట్లో ఉండటం లేదు, కానీ సేవా స్థానంలో ఉంటున్నారు. నాదంతా నీది అయిపోయింది. నాది ఏదీ లేదు, శరీరం కూడా నాది కాదు. ఇక నాది అనేది లేనప్పుడు బాడీ-కాన్షియస్ ఎలా వస్తుంది. నాది అన్నదానిలోనే ఆకర్షణ ఉంటుంది. నాది అన్నది సమాప్తమైపోయినప్పుడు మనస్సు మరియు బుద్ధిని తమ వైపుకు లాగలేవు. బ్రాహ్మణ జీవితం అనగా నాది అన్నదానిని నీదిగా మార్చడం. కాబట్టి నీది అన్నది, నాదిగా మారిపోలేదు కదా అని పదేపదే చెక్ చేసుకోండి. ఒకవేళ నాది అనే భావం లేకపోతే, నీదే అయితే డబల్ లైట్‌గా ఉంటారు. ఒకవేళ కొద్దిగానైనా బరువు అనుభవమైతే నాది అనే భావం మిక్స్ అయిందని అర్థం చేసుకోండి. భక్తిలో సర్వస్వం నీదే అంటారు. బ్రాహ్మణ జీవితంలో అనడం కాదు, చేసి చూపించాలి. ఇది చేయడం సహజం కదా. భారాన్ని ఇవ్వడం సహజమా లేక తీసుకోవడం సహజమా? నీది అనడం అంటే భారాన్ని ఇవ్వడం మరియు నాది అనడం అంటే భారాన్ని నెత్తిన పెట్టుకోవడం. కాబట్టి ఇప్పుడు ఒకే బలం ఒకే నమ్మకం. అంతే, ఒక్కరే ఒక్కరు. ఒకటి రాయడం సులభం కదా. కాబట్టి ఇది తేరా-తేరా (నీది-నీది) అని చెప్పే గ్రూప్. అచ్ఛా!
గ్రూప్ నం. 4 :- పూజ్యులు అనగా దృష్టి బాబా తప్ప మరెటూ వెళ్ళనివారు
మనం కల్ప-కల్పం యొక్క సర్వశ్రేష్ఠ పూజ్య ఆత్మలుగా అవుతాము అనే నషా సదా ఉంటోందా? మీ పూజ ఎన్నిసార్లు జరిగింది? పూజ్య ఆత్మను - ఈ పూజ్యతనం యొక్క అనుభూతి ఏమిటి? గుర్తు ఏమిటి? నషా ఉంది, సంతోషం ఉంది - అదైతే సరే. కానీ నేనే పూజ్యుడిని అని భావించడానికి ఎలాంటి సంస్కారం ఉంది? పూజ్య ఆత్మల విశేషత ఏమిటి? ఏ విశేషత ఆధారంగా ఎవరైనా పూజ్యులుగా అవుతారు? లౌకికంలో కూడా చూడండి, వీరు పూజ్యులు అని ఎవరిని అంటారు? పూజ్య ఆత్మ యొక్క గుర్తు ఏమిటంటే వారు ఎప్పుడూ ఏ వస్తువు వెనుకో, వ్యక్తి వెనుకో తలవంచరు. అందరూ వారి ఎదుట తలవంచుతారు కానీ వారు తలవంచరు. నమ్రతతో వంగడం వేరే విషయం. కానీ తలవంచడం అనగా ప్రభావితమవ్వడం. పూజ్యుల ఎదుట అందరూ తలవంచుతారు, పూజ్యులు తలవంచరు. కాబట్టి ఎలాంటి వ్యక్తి లేదా వైభవం యొక్క ఆకర్షణ అయినా తలవంచేలా చేస్తే - ఇది పూజ్యుల గుర్తు కాదు. కాబట్టి ఎప్పుడైనా, ఎలాంటి ఆకర్షణలోనైనా మనస్సు మరియు బుద్ధి తలవంచుతోందా, ప్రభావితమవుతున్నారా అని చెక్ చేసుకోండి? ఒక్క బాబా తప్ప మరెటు వైపుకు మనస్సు మరియు బుద్ధి వంగకూడదు. పూజ్యులు అనగా తలవంచేలా చేసేవారు, తలవంచేవారు కారు.
ఎవరైతే కల్ప-కల్పం యొక్క పూజ్యులుగా ఉంటారో వారి గుర్తు ఏమిటి? బాబా తప్ప, మరెక్కడా దృష్టి పోదు. ఇది చాలా బాగుంది, ఇది చాలా మంచి వస్తువు - అలా ఉండదు. పూజ్య ఆత్మల ఎదుట స్వయంగా వ్యక్తులు మరియు వైభవాలు అన్నీ తలవంచుతాయి. ఎవరైతే ఇష్ట దేవతలుగా ఉంటారో, భక్తులు స్వయంగా అత్యుత్తమమైన మంచి వస్తువులను ఇష్ట దేవతల ఎదుట కానుకగా సమర్పిస్తారు. ఇష్ట దేవత ఆ వస్తువులతో ప్రభావితం కారు, కానీ ఆ వస్తువులే స్వయంగా వారి ఎదుట తలవంచుతాయి. కాబట్టి పూజ్యుల గుర్తు ఏమిటంటే - ఒక్క బాబా తప్ప మరెక్కడా మనస్సు-బుద్ధి వంగడం ఉండదు. రిగార్డ్ వేరే విషయం, ప్రేమ వేరే విషయం, నమ్రత వేరే విషయం కానీ ప్రభావితం కావడం వేరే విషయం. కాబట్టి పూజ్య ఆత్మలుగా ఉండేవారు మరియు పదేపదే అవుతారు. ఈ గుర్తును మీలో చెక్ చేసుకోండి. ఎప్పుడైనా ఏ సంస్కారానికైనా వశమై ఆత్మ వశీభూతమైపోతే అది కూడా తలవంచడమే అవుతుంది. ఒకవేళ ఏ బ్రాహ్మణ ఆత్మ అయినా, పూజ్య ఆత్మ అయినా ఈరోజు కోపానికి వశమయ్యాను, లోభానికి వశమయ్యాను, అభిమానానికి వశమయ్యాను అని అంటే - ఇది తలవంచడమా లేక తలవంచేలా చేయడమా? కాబట్టి పూజ్యులు ఎన్నడూ తలవంచరు. పూజ్యుల ఎదుటకు అందరూ ఆకర్షితులై స్వయంగా వస్తారు, పూజ్యులు ఎవరి వెనుకా ఆకర్షితులు కారు. కాబట్టి ఈ గుర్తును చూడండి. ఒకవేళ అప్పుడప్పుడు వంగితే పూజ కూడా అప్పుడప్పుడే జరుగుతుంది, సదా జరగదు. పూజ్యులలో కూడా నంబర్లు ఉంటాయి. వైవిధ్యం ఉంటుంది కదా. కొందరు పూజ్యులు సదా పూజించబడతారు మరియు మరికొందరి పూజ అప్పుడప్పుడు జరుగుతుంది, కొందరికి విధిపూర్వకంగా జరుగుతుంది మరియు కొందరికి నామమాత్రంగా పూజ జరుగుతుంది. మందిరాలలో కూడా తేడా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఎవరైతే విధిపూర్వకంగా శ్రీమతాన్ని పాటించరో, తూతూమంత్రంగా, సరే అమృతవేళ లేవాలి, కూర్చోవాలి, ఎవరూ చూడకూడదు, ఎవరూ అనకూడదు వీరు లేవలేదని, ఆ తర్వాత బాబాతో మిలనం జరుపుకున్నా లేదా నిద్రతో మిలనం జరుపుకున్నా! ఇది తూతూమంత్రం అయిపోయింది కదా. అమృతవేళ లేచారు, కూర్చున్నారు కానీ విధిపూర్వకంగా కాదు. మరి విగ్రహాన్ని కూడా కూర్చోబెడతారు కానీ పూజ విధిపూర్వకంగా జరగదు.
వంగినప్పుడే(ఝుకావ్) మోహము (లగావ్) ఏర్పడుతుంది. మోహము లేకుండా వంగడం ఉండదు. నేటి భక్తులకు కూడా అల్పకాలిక ప్రాప్తి వైపు మోహము ఉన్నప్పుడే వంగడం జరుగుతుంది. ఈ రోజుల్లో పూజ్యులపై మోహము లేదు, అల్పకాలిక ప్రాప్తి వైపు మోహము ఉంది. కానీ ప్రాప్తిని కలిగించేవారు పూజ్య ఆత్మలే, అందువలన వారి వైపే తలవంచుతారు. కాబట్టి అర్థమైందా, పూజ్యుల గుర్తు ఏమిటో? కల్ప-కల్పం యొక్క శ్రేష్ఠ పూజ్య ఆత్మలు సదా తమను తాము సంపన్నంగా అనుభవం చేసుకుంటారు. ఎవరైతే సంపన్నులుగా ఉంటారో వారి దృష్టి ఎవరిపైనా వెళ్ళదు. పూజ్య ఆత్మ సంపన్నంగా ఉన్న కారణంగా సదా తమ ఆత్మిక నషాలోనే ఉంటారు. వారి మనస్సు-బుద్ధి యొక్క మొగ్గుపాటు ఎక్కడా ఉండదు - దేహ సంబంధాలలోనూ ఉండదు, దేహ పదార్థాలలోనూ ఉండదు. అందరితో అతీతంగా మరియు అందరికీ ప్రియంగా ఉంటారు. బ్రాహ్మణ జీవితం యొక్క మజా జీవన్ముక్త స్థితిలోనే ఉంది. అతీతము అనగా ముక్తులు. సంస్కారాల వైపు కూడా వంగడం ఉండదు. ఏమి చేయాలి, ఎలా చేయాలి అని అన్నప్పుడు - ఆ సమయంలో జీవన్ముక్తులు అయ్యారా లేక జీవన బంధీలా? చేయాలని అనుకోలేదు కానీ జరిగిపోయింది - ఇది జీవన బంధీగా అవ్వడం. ఇష్టం లేదు కానీ నచ్చేసింది, శిక్షణ ఇవ్వాలనుకున్నాను కానీ కోపం వచ్చింది - ఇది జీవన బంధ స్థితి. బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు. ఎప్పుడూ ఏ బంధనంలోనూ బంధీ కాలేరు. అచ్ఛా!
గ్రూప్ నం. 5 :- సంగఠనలో ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉండటమే ఫాలో ఫాదర్ చేయడం
ఇది వెరైటీ గ్రూప్. అందరికంటే అత్యుత్తమమైన గ్రూప్ అని ఎవరిని అంటాము, వారి విశేషత ఏమిటి? అత్యుత్తమమైన గ్రూప్ ఏదంటే, గ్రూప్‌లో ఉంటూ కూడా నిర్విఘ్నంగా ఉండేది, సంతుష్టంగా ఉండేది. ఒంటరిగా ఉంటూ నిర్విఘ్నంగా ఉండడం పెద్ద విషయమేమీ కాదు. కానీ పెద్ద సంగఠనలోనూ ఉండాలి మరియు నిర్విఘ్నంగానూ ఉండాలి. మరి మీరందరూ సంగఠనలో ఉంటూ నిర్విఘ్నంగా ఉంటున్నారా? ఎంత గందరగోళం జరిగినా స్వయం అచలంగా ఉన్నారా - అలాంటి గ్రూప్‌కు చెందినవారా? బాబా ఒంటరిగా అయితే లేరు కదా, కుటుంబం ఉన్నవారు. అందరికంటే అతిపెద్ద కుటుంబం బాబాది మరియు ఎంత పెద్ద కుటుంబమో అంతగానే అతీతంగా మరియు అందరికీ ప్రియంగా ఉంటారు. ఎంత సేవయో అంత అతీతంగా ఉంటారు. మరి ఫాలో ఫాదర్ చేసేవారే కదా. అందుకనే మీ అందరి స్మృతిచిహ్నం ఇక్కడ అచల్ఘర్గా తయారై ఉంది. ఎవరెంత కదిలించినా, కదలకూడదు. ఒకవైపు ఒకరు డిస్టర్బ్ చేస్తే, ఇంకోవైపు ఇంకొకరు డిస్టర్బ్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఎలాంటి సాల్వేషన్ లభించకపోతే, అప్పుడు అలజడి వస్తుందా? ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే, అప్పుడు అలజడి వస్తుందా? అచలము అనగా నాలుగు వైపుల నుండి ఎంతమంది కదిలించే ప్రయత్నం చేసినా సంకల్పంలో కూడా అచలంగా ఉండడం.
చూడండి, మంచివారు కాబట్టే బాప్‌దాదా ఇష్టపడి తమవారిగా చేసుకున్నారు. మంచివారు మరియు సదా మంచివారిగానే ఉంటారు. మంచి-మంచి అనుకోవడం ద్వారా మంచివారిగా అయిపోతారు. బాప్‌దాదా ప్రతి ఒక్కరిలోనూ విశేషతనే చూస్తారు. విశేషతను చూస్తూ, వర్ణిస్తూ-వర్ణిస్తూ విశేషమైనవారిగా అయిపోతారు. నిన్న ఉండేవారు, నేడు ఉన్నారు మరియు రేపు మళ్ళీ అవుతారు. ‘నేడు’ మరియు ‘రేపు’లోనే మొత్తం డ్రామా అంతా వచ్చేసింది. ఎంతెంత సంపూర్ణంగా తయారవుతూ ఉంటారో అంతగా ఈ స్మృతి స్పష్టమవుతూ ఉంటుంది. స్మృతి ఎంత స్పష్టమవుతుందో అంతగా నేచురల్ నషా ఉంటుంది. అచ్ఛా! నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలకు డబల్ నషాలో ఉండేందుకు అభినందనలు! ఒకటి స్మృతి యొక్క నషా, ఇంకొకటి సేవ యొక్క నషా - డబల్ నషా ఉంది కదా. మంచిది, పిల్లల ధైర్యము, బాబా యొక్క సహాయం. ఆస్ట్రేలియా పిల్లలు కూడా ఏది అనుకుంటే అది చేయగలరు. కేవలం అప్పుడప్పుడు గుప్తంగా అయిపోతారు, అప్పుడప్పుడు ప్రత్యక్షంగా అయిపోతారు. కానీ ధైర్యం మరియు సహాయానికి కూడా పాత్రులు. అచ్ఛా, అందరికీ ప్రియస్మృతులు.
గ్రూప్ నం.6 – ప్రతి బ్రాహ్మణుడు బ్రహ్మా బాబాకు దర్పణంలా అవ్వాలి – ఇదే బాబాకున్న శ్రేష్ఠమైన ఆశ
(మధుబన్ నివాసులతో అవ్యక్త బాప్‌దాదా మధుర మహావాక్యాలు)
మధుబన్ నివాసులకు ఎన్ని ప్రత్యక్ష ఫలాలు లభిస్తాయి? మరెక్కడా లభించని ఏ విశేషత మధుబన్‌లో లభిస్తుంది? శ్రేష్ఠ కర్మభూమిలో ఉండేవారు సదా ఫాలో ఫాదర్ చేస్తారు. మధుబన్ యొక్క శ్రేష్ఠత ఏమిటంటే - ఇది బ్రహ్మా బాబా యొక్క విశేషమైన కర్మభూమి. కనుక మధుబన్ నివాసులు ఏ కర్మ చేస్తారో, అందులో ఫాలో ఫాదర్ చేస్తారు. కర్మభూమిలోని విశేషత కర్మలది. మరి కర్మలో ఫాలో చేస్తున్నారా? అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు ఏ కర్మ చేసినా గానీ అందులో ఫాలో ఫాదర్ చేస్తున్నారా? మధుబన్ నివాసులకు ఇంకా అదనంగా కర్మభూమి యొక్క స్మృతి బలము ఉంటుంది. అది కర్మలో కనిపిస్తుందా లేక కనిపించాలా, ఏమంటారు? దీనిని మీరు మీలో చూసుకుంటారా? ఒక్కొక్క అడుగును మీ ఎదురుగా తెచ్చుకోండి - లేవడము, కూర్చోవడము, నడవడము, మాట్లాడడము, సంబంధ-సంపర్కంలోకి రావడము, వీటన్నింటిలో బ్రహ్మా బాబా కర్మలను ఫాలో చేస్తున్నారా? కర్మభూమి యొక్క లాభమైతే ఇదే కదా. మరి ఇంత లాభాన్ని తీసుకుంటున్నారా? శక్తులు ఏమని భావిస్తున్నారు? కర్మభూమి యొక్క లాభాన్ని మధుబన్ ఎంతగా తీసుకుంటుందో, అంతగా తీసుకోవడానికి ఇతరులకు రావాల్సి ఉంటుంది మరియు మీకైతే లభించే ఉంది. ఇది వరదాన భూమి, కర్మభూమి. కనుక ప్రతి కర్మ వరదాన యోగ్యంగా ఉందా అనగా ఎవరు చూసినా నోటి నుండి వరదానాలు వెలువడేలా ఉందా? దీనినే వరదాన భూమి యొక్క వరదానం తీసుకోవడమని అంటాము. సాధారణ కర్మను చేస్తున్నా గానీ సాధారణ కర్మలో విశేషత కనిపించాలి. ఇదే మధుబన్ విశేషత కదా.
విశేషంగా బ్రహ్మా బాబాకు తమ కర్మభూమిలో ఉండేవారి పట్ల ఏ విశేషమైన శ్రేష్ఠ ఆశ ఉందంటే – మధుబన్‌లోని ఒక్కొక్క బ్రాహ్మణాత్మ, శ్రేష్ఠ ఆత్మ, ప్రతి కర్మలో బ్రహ్మా బాబా కర్మలకు దర్పణంగా అవ్వాలి. మరి దర్పణంలో ఏం కనిపిస్తుంది? బ్రహ్మా బాబా చేసిన కర్మనే కనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు దర్పణం ముందు నిలబడితే అచ్చంగా మీరే కనిపిస్తారా లేక వేరేవారు కనిపిస్తారా? కనుక బ్రహ్మా బాబా కర్మలు, మీ కర్మలనే దర్పణంలో కనిపించాలి. మీరు భాగ్యవంతులు - ఈ మాట సదా అందరూ అంటారు కూడా మరియు అలా ఉన్నారు కూడా. కానీ ప్రతి కర్మలో బ్రహ్మా బాబా కర్మలు కనిపించాలి. ఈ సర్టిఫికేట్‌ను ఎవరు తీసుకుంటారు మరియు ఎప్పుడు తీసుకుంటారు? తీసుకోవాల్సిందే కదా. లేక తీసేసుకున్నారా? సర్టిఫికేట్ తీసుకున్నవారు - వీరి ప్రతి కర్మలో బ్రహ్మా బాబా కర్మలు కనిపిస్తున్నాయి, వీరి మాటలు బ్రహ్మా బాబా మాటల సమానంగా ఉన్నాయి, కూర్చోవడము-లేవడము, చూడడము, నడవడము అన్నీ సమానంగా ఉన్నాయి అని - ఇలాంటి సర్టిఫికేట్ తీసుకున్నారా? ఎవరైతే తీసుకోవాల్సి ఉందో, వారు చేతులెత్తండి. ఇది కూడా మంచిది. చెప్పే కన్నా ముందు చేసి చూపిస్తారు. కానీ ప్రతి కర్మ తండ్రి సమానంగా ఉండాలనే లక్ష్యము పెట్టుకోండి. బ్రహ్మా బాబాను ఫాలో చేయడము సహజమే కదా. నిరాకారిగా అవ్వడము అనగా సదా నిరాకార స్థితిలో స్థితులవ్వడము. దాని బదులు కర్మలో ఫాలో చేయడము దానికన్నా సహజము. కనుక బ్రహ్మా బాబా మీకు సహజమైన పని ఇస్తున్నారు, కష్టమైనది కాదు. కనుక మధుబన్‌లో ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, బ్రహ్మా బాబా కర్మలే కనిపించాలి అని అందరూ లక్ష్యం పెట్టుకోండి. కర్మలలో బ్రహ్మాను సర్వవ్యాపిగా చేయవచ్చు. ఎక్కడ చూసినా బ్రహ్మా సమానము! ఇలా చేయగలరు కదా!
మధుబన్ మహిమ అనగా మధుబన్ నివాసుల మహిమ. మధుబన్‌లోని గోడల మహిమ కాదు, మధుబన్ నివాసుల మహిమ. మధుబన్ మహిమను నలువైపుల నుండి ప్రతిరోజూ వింటారు కదా. మధుబన్ నివాసుల మహిమ ఏదైతే జరుగుతుందో, అది ఎవరిది? మీ అందరిదే కదా. మేము మధుబన్ నివాసులము అన్న నషా అయితే ఉంటుంది. ఎలాగైతే ఈ నషా ఉంటుందో, అలాగే వీరు బ్రహ్మా బాబా సమానంగా ఫాలో ఫాదర్ చేసేవారు అన్న నషా కూడా ప్రత్యక్షంగా కనిపించాలి. అచ్ఛా! అందరూ సంతుష్టంగా ఉన్నారా? ఏదైనా పరిష్కారం కావాలా? పరిష్కారాల భూమిలో కూర్చున్నారు. ఎంత నిశ్చింతగా కూర్చున్నారు! శారీరక శ్రమ చేస్తారు. మిగిలినవన్నీ రెడీగా లభిస్తాయి. ఎవరైతే శారీరక శ్రమ చేయరో, వారి చేత ఎక్సర్సైజ్ చేసే శ్రమను చేయిస్తారు. మీరైతే అదృష్టవంతులు కదా, మీకు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు-చేతులు ఆడుతూనే ఉంటాయి. ఎవరెంత హార్డ్ వర్క్ (కఠినమైన శ్రమ) చేస్తారో, వారు అంత సురక్షితంగా ఉంటారు - మాయ నుండి కూడా మరియు శారీరక వ్యాధుల నుండి కూడా. బుద్ధి అయితే బిజీగా ఉంటుంది కదా. వేరే అనవసరమైనవి ఏవీ నడవవు. కనుక ఎవరైతే సదా బిజీగా ఉంటారో, వారు చాలా అదృష్టవంతులు, అందుకే స్వయాన్ని ఫ్రీగా ఉంచుకోకండి. చాలా సమయం నుండి చేస్తున్నాము, ఇప్పుడు ఫ్రీ అవుదాము అని అనుకోకండి. బిజీగా ఉండడము అదృష్టవంతుల గుర్తు. మీరు అదృష్టవంతులు కదా. స్వయాన్ని సదా బిజీగా ఉంచుకోండి. అచ్ఛా! మధుబన్ నివాసులకు మొదటి ఛాన్స్ లభించింది. ఇకి కూడా అదృష్టము. ఇప్పుడు బాప్‌దాదాకు చేసి చూపించండి. అర్థమయిందా! అచ్ఛా!
*** ఓంశాంతి ***
