‘‘బ్రాహ్మణులు అనగా సదా శ్రేష్ఠ భాగ్యానికి అధికారులు’’
ఈరోజు భాగ్యవిధాత అయిన బాప్‌దాదా తమ పిల్లలందరి శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. ఇంతటి శ్రేష్ఠ భాగ్యము మరియు ఇంత సహజంగా ప్రాప్తించడము - ఇటువంటి భాగ్యము మొత్తం కల్పంలో బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ లేదు. కేవలం బ్రాహ్మణాత్మలైన మీరు మాత్రమే ఈ భాగ్యానికి అధికారులు. ఈ బ్రాహ్మణ జన్మ కల్పక్రితము యొక్క భాగ్యమనుసారంగానే లభించింది. జన్మయే శ్రేష్ఠ భాగ్యం ఆధారంగా లభించింది ఎందుకంటే బ్రాహ్మణ జన్మ స్వయం భగవంతుని ద్వారా లభిస్తుంది. అనాది తండ్రి మరియు ఆది బ్రహ్మా ద్వారా ఈ అలౌకిక జన్మ ప్రాప్తించింది. జన్మయే భాగ్యవిధాత ద్వారా లభించిందంటే అది ఎంత భాగ్యశాలి జన్మ! మీ ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుని హర్షితంగా ఉంటున్నారా? ఈ స్మృతి సదా ప్రత్యక్ష రూపంలో ఉండాలి, సదా మనసులో ఇమర్జ్ చేసుకోండి. కేవలం బుద్ధిలో ఇమిడి ఉంది అన్నంత వరకే కాదు. ప్రతి నడవడిక మరియు ముఖంలో స్మృతి స్వరూపము ప్రత్యక్ష రూపంలో స్వయానికి అనుభవమవ్వాలి మరియు ఇతరులకు కూడా - వీరి నడవడికలో, ముఖంలో శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖ స్పష్టంగా కనిపిస్తుంది అని అనుభవమవ్వాలి. ఎన్ని రకాల భాగ్యములు ప్రాప్తించాయి, ఆ లిస్టు సదా మీ మస్తకంలో స్పష్టంగా ఉండాలి. కేవలం డైరీలో లిస్టు ఉండడము కాదు కానీ మస్తకం మధ్యలో భాగ్యరేఖ మెరుస్తూ కనిపించాలి.
మొదటి భాగ్యము - జన్మయే భాగ్యవిధాత ద్వారా లభించింది. రెండవ విషయము - స్వయంగా ఒక్క భగవంతుడే తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా, ఇటువంటి భాగ్యము ఏ ఇతర ఆత్మకు గానీ, ధర్మాత్మకు గానీ, మహాన్ ఆత్మకు గానీ లేదు. మొత్తం కల్పంలో ఇటువంటి వారెవరైనా ఉన్నారా? ఒక్కరి ద్వారానే తండ్రి సంబంధంలో వారసత్వము ప్రాప్తించింది, శిక్షకుని రూపంలో శ్రేష్ఠ చదువు మరియు పదవి యొక్క ప్రాప్తి ఉంది, సద్గురువు రూపంలో మహామంత్రము మరియు వరదానాల ప్రాప్తి ఉంది. సర్వ ఖజానాల అధికారాన్ని వారసత్వముగా ప్రాప్తి చేసుకున్నారు. సర్వ ఖజానాలు ఉన్నాయి కదా? ఏదైనా ఖజానా యొక్క లోటు ఉందా? టీచర్లకు ఏదైనా లోటు ఉందా? ఇల్లు పెద్దదిగా ఉండాలి, మంచి-మంచి జిజ్ఞాసువులు ఉండాలి - ఈ లోటు ఉందా? లేదు. ఎంతగా సేవ నిర్విఘ్నంగా పెరుగుతుందో, అంతగానే సేవతో పాటు సేవా సాధనాలు సహజంగా మరియు స్వతహాగా తప్పకుండా పెరుగుతాయి.
తండ్రి ద్వారా వారసత్వము మరియు శ్రేష్ఠ పాలన లభిస్తూ ఉంది. పరమాత్మ పాలన అనేది ఎంత ఉన్నతమైన విషయము! పరమాత్మ పాలనకర్త అని భక్తిలో పాడుతారు. కానీ భాగ్యశాలి ఆత్మలైన మీరు ప్రతి అడుగు పరమాత్మ పాలన ద్వారానే అనుభవం చేస్తున్నారు. పరమాత్మ శ్రీమతమే పాలన. శ్రీమతము లేకుండా అనగా పరమాత్మ పాలన లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేరు. ఇటువంటి పాలన కేవలం ఇప్పుడు మాత్రమే ప్రాప్తిస్తుంది, సత్యయుగంలో కూడా లభించదు. అక్కడున్నది దేవాత్మల పాలన మరియు ఇప్పుడు పరమాత్మ పాలనలో నడుస్తున్నారు. మా పాలనకర్త స్వయం భగవంతుడు అని ఇప్పుడు మీరు ప్రత్యక్ష అనుభవం ద్వారా చెప్పగలరు. దేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా ప్రతి బ్రాహ్మణాత్మ, మా పాలనకర్త పరమాత్మ అని నషాతో చెప్తారు. ఇంతటి నషా ఉందా! లేక అప్పుడప్పుడు మర్జ్ అయి అప్పుడప్పుడు ఇమర్జ్ అవుతుందా? జన్మిస్తూనే అనంతమైన ఖజానాలతో నిండుగా అయి అవినాశీ వారసత్వం యొక్క అధికారాన్ని తీసుకున్నారు.
దానితో పాటు జన్మిస్తూనే త్రికాలదర్శి అయిన సత్యమైన శిక్షకుడు మూడు కాలాల చదువును ఎంత సహజ విధితో చదివించారు! ఇది ఎంతటి శ్రేష్ఠమైన చదువు మరియు చదివించేవారు కూడా ఎంతటి శ్రేష్ఠమైనవారు! కానీ చదివించింది ఎవరిని? ఎవరి పట్లనైతే ప్రపంచానికి ఆశ లేదో వారిని ఆశావాదులుగా చేసారు. కేవలం చదివించడమే కాదు కానీ చదువు చదువుకునే లక్ష్యమే ఉన్నతోన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకోవడము. పరమాత్మ చదువు ద్వారా ఏ శ్రేష్ఠ పదవినైతే ప్రాప్తి చేసుకుంటున్నారో, ఆ పదవి మొత్తం ప్రపంచంలోని ఉన్నతోన్నతమైన పదవుల ముందు ఎంతటి శ్రేష్ఠమైనది! అనాది సృష్టి చక్రంలో ద్వాపరము నుండి ఇప్పటివరకు ఏయే వినాశీ పదవులు ప్రాప్తించాయో, వాటిలో మొదటి సర్వ శ్రేష్ఠ పదవిగా రాజ్య పదవి మహిమ చేయబడింది. కానీ మీ రాజ్య పదవి ముందు ఆ రాజ్య పదవి ఏ పాటిది? అది శ్రేష్ఠమైనదా? ఈరోజుల్లో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పదవులు - ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. పెద్ద-పెద్ద చదువుల ద్వారా ఫిలాసఫర్‌గా అవుతారు, ఛైర్మన్, డైరెక్టర్ మొదలైనవారిగా అవుతారు, అతి పెద్ద ఆఫీసర్‌గా అవుతారు. కానీ ఈ పదవులన్నీ మీ ముందు ఏ పాటివి! మీకు ఈ ఒక్క జన్మలో జన్మ-జన్మాంతరాలకు శ్రేష్ఠ పదవి ప్రాప్తిస్తుంది అనే పరమాత్మ గ్యారెంటీ ఉంది. కానీ అక్కడ ఒక్క జన్మలోని చదువు ద్వారా ఒక్క జన్మ కూడా పదవి ప్రాప్తిస్తుందనే గ్యారెంటీ లేదు. మీరెంత భాగ్యవంతులు - మీ పదవి కూడా సర్వ శ్రేష్ఠమైనది మరియు ఒక్క జన్మ చదువుతో అనేక జన్మలకు పదవి యొక్క ప్రాప్తి! కావున ఇది భాగ్యమే కదా! మరి ఇది ముఖము ద్వారా కనిపిస్తుందా? నడవడిక ద్వారా కనిపిస్తుందా? ఎందుకంటే నడవడిక ద్వారానే మనుష్యుల స్థితి-గతులు తెలుస్తాయి. ఇంతటి శ్రేష్ఠ భాగ్యం యొక్క స్థితి కనిపించే నడవడిక మీలో ఉందా? లేక ఇప్పుడింకా సాధారణంగా కనిపిస్తున్నారా? ఎలా ఉన్నారు? సాధారణతలో మహానత కనిపించాలి. మీ జడమైన చిత్రాలు ఇప్పటివరకు మహానతను అనుభవం చేయిస్తున్నాయి. ఈరోజుల్లో కూడా ఎటువంటి ఆత్మనైనా లక్ష్మీ-నారాయణులుగా లేక సీతా-రాములుగా లేక దేవీలుగా తయారుచేస్తే, ఆ సాధారణ వ్యక్తిలో కూడా మహానతను అనుభవం చేసి తల వంచుతారు కదా. వాస్తవానికి వీరు నారాయణుడు లేక రాముడు మొదలైనవారు కాదు, అలా తయారుచేసారు అని తెలిసినప్పటికీ ఆ సమయంలో మహానతకు తల వంచుతారు, నమస్కరిస్తారు, పూజిస్తారు. కానీ మీరైతే స్వయంగా చైతన్యమైన దేవీ-దేవతల యొక్క ఆత్మలు. చైతన్య ఆత్మలైన మీ ద్వారా ఎంతటి మహానత అనుభూతి అవ్వాలి! అలా అవుతుందా? మీ శ్రేష్ఠ భాగ్యానికి మనసుతో నమస్కరించాలి. చేతులు లేక తలతో కాదు. కానీ మనసుతో మీ భాగ్యాన్ని అనుభవం చేసి వారు స్వయం కూడా సంతోషంలో నాట్యం చేయాలి.
ఇంతటి శ్రేష్ఠ చదువు ప్రాప్తించడము శ్రేష్ఠ భాగ్యము. మనుష్యులు ఈ జీవితంలో శరీర నిర్వహణార్థము సంపాదించేందుకే చదువు చదువుకుంటారు, దీనిని సంపాదనకు ఆధారము అని అంటారు. మీ చదువు ద్వారా ఎంత సంపాదన లభిస్తుంది? మీరు సుసంపన్నులు కదా. మీ సంపాదన యొక్క లెక్క ఏమిటి? వారి లెక్క లక్షలు, కోట్లలో ఉంటుంది. కానీ మీ లెక్క ఏమిటి? మీ సంపాదన ఎంత? అడుగులో పదమాలు. కావున మొత్తం రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తారు మరియు ఎన్ని పదమాలు జమ చేసుకుంటారు? ఇంతటి సంపాదన ఇంకెవరికైనా ఉందా? మీది ఎంత గొప్ప భాగ్యము! కావున ఈ విధంగా మీ భాగ్యాన్ని ఇమర్జ్ రూపంలో అనుభవం చేయండి. ఎవరినైనా అడిగితే బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలుగా అయితే ఉన్నాము, అలా అయ్యాము అని అంటారు. కానీ బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు అనగా శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖ మస్తకంలో మెరుస్తూ కనిపించాలి. అంతేకానీ బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలుగా అయితే అయ్యాము కనుక లభిస్తుందిలే, ఏదో ఒకటి అవుతాములే, నడుస్తూనే ఉన్నాము, అలా అవ్వడమైతే అయ్యాము కదా... అని కాదు. అలా తయారయ్యారా లేక మీ భాగ్యాన్ని చూస్తూ ఎగురుతూ ఉన్నారా? తయారైపోయాము కదా, తయారవుతూనే ఉన్నాము, నడుస్తూనే ఉన్నాము... ఈ మాటలు ఎవరివి? ఇవి శ్రేష్ఠ భాగ్యవంతుల మాటలేనా? బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు అనగా ఆనందంగా ప్రేమపూర్వక జీవితాన్ని గడిపేవారు. అంతేకానీ అప్పుడప్పుడు శ్రమ, అప్పుడప్పుడు ప్రేమ ఉండడము కాదు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమంటారు? అలా అవ్వాలనుకోలేదు కానీ నిస్సహాయులుగా అయిపోయాము అని అంటారు. భాగ్యవంతులు అనగా నిస్సహాయత సమాప్తము, ప్రేమగా నడిచేవారు. మేమైతే అలా అవ్వాలనుకుంటాము కానీ... ఇటువంటి భాష భాగ్యవంతులైన బ్రాహ్మణాత్మలది కాదు. భాగ్యవాన్ ఆత్మలు ప్రేమ అనే ఊయలలో ఆనందంగా ఎగురుతారు. ఎగిరే కళ యొక్క ఆనందంలో ఉంటారు. నిస్సహాయత వారి ముందుకు రాదు. అర్థమయిందా! మీ శ్రేష్ఠ భాగ్యాన్ని మర్జ్గా (గుప్తంగా) ఉంచుకోకండి, ఇమర్జ్ (ప్రత్యక్షం) చేయండి.
మూడవ విషయము - సద్గురువు ద్వారా ఏ భాగ్యం ప్రాప్తించింది? మొట్టమొదట మహామంత్రం లభించింది. సద్గురువు ద్వారా ఏ మహామంత్రం లభించింది? పవిత్రముగా అవ్వండి, యోగీగా అవ్వండి. జన్మిస్తూనే ఈ మహామంత్రం సద్గురువు ద్వారా ప్రాప్తించింది మరియు ఈ మహామంత్రమే సర్వ ప్రాప్తులకు తాళంచెవి, ఇది పిల్లలందరికీ లభించింది. ‘‘యోగీ జీవితము, పవిత్ర జీవితము’’ - ఇదే సర్వ ప్రాప్తులకు ఆధారము, అందుకే ఇది తాళంచెవి వంటిది. ఒకవేళ పవిత్రత లేదు, యోగీ జీవితము లేదంటే అధికారులుగా ఉంటూ కూడా అధికారం యొక్క అనుభూతిని చేయలేరు, అందుకే ఈ మహామంత్రము సర్వ ఖజానాల అనుభూతికి తాళంచెవి. తాళంచెవి వంటి ఈ మహామంత్రము సద్గురువు ద్వారా అందరికీ శ్రేష్ఠ భాగ్యముగా లభించింది మరియు దీనితో పాటు సద్గురువు ద్వారా వరదానాలు ప్రాప్తించాయి. వరదానాల లిస్టు చాలా పెద్దది కదా! ఎన్ని వరదానాలు లభించాయి? ఎన్ని వరదానాల భాగ్యం ప్రాప్తించిందంటే, ఇక ఆ వరదానాలతోనే మొత్తం బ్రాహ్మణ జీవితమంతా గడుపుతున్నారు మరియు గడపగలరు కూడా. ఎన్ని వరదానాలున్నాయి, వాటి లిస్టు తెలుసా? కావున వారసత్వము కూడా ఉంది, చదువు కూడా ఉంది, మహామంత్రం యొక్క తాళంచెవి మరియు వరదానాల గని కూడా ఉంది. కనుక ఎంత భాగ్యవంతులు! లేదా ఆ భాగ్యాన్ని చివర్లో తెరుద్దాము అని దాచిపెట్టి ఉంచారా? చాలాకాలం నుండి భాగ్యాన్ని అనుభూతి చేసేవారు అంతిమంలో కూడా పదమాపదమ భాగ్యవంతులుగా ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు లేకపోతే అంతిమంలో కూడా ఉండదు. ఇప్పుడు ఉంటే అంతిమంలో కూడా ఉంటుంది. సంపూర్ణంగా అయితే అంతిమంలో అయ్యేది ఉంది అని ఎప్పుడూ అనుకోకండి. సంపూర్ణతా జీవితం యొక్క అనుభవం ఇప్పటి నుండే ప్రారంభమవుతుంది, అప్పుడే అంతిమంలో ప్రత్యక్ష రూపంలోకి వస్తుంది. ఇప్పుడు స్వయానికి అనుభవమవ్వాలి, ఇతరులకు అనుభవమవ్వాలి, ఎవరైతే సమీప-సంపర్కంలోకి వస్తారో వారికి అనుభవమవ్వాలి మరియు అంతిమంలో విశ్వంలో ప్రత్యక్షమవుతుంది. అర్థమయిందా?
బాప్‌దాదా ఈరోజు పిల్లలందరి శ్రేష్ఠ భాగ్యరేఖను చూసారు. తండ్రి ఎంతగా భాగ్యాన్ని చూసారో, పిల్లలు సదా అంతకన్నా తక్కువగా అనుభవం చేస్తున్నారు. భాగ్యం యొక్క గని అందరికీ ప్రాప్తించింది. కానీ కొందరికి కార్యంలో ఉపయోగించడము వచ్చు మరియు కొందరికి కార్యంలో ఉపయోగించడము రాదు. ఎంతగా ఉపయోగించవచ్చో అంతగా ఉపయోగించడం లేదు. లభించడము అందరికీ ఒకేలా లభించింది కానీ ఖజానాలను కార్యంలో ఉపయోగించి తండ్రి ఖజానాను తమ ఖజానాగా అనుభవం చేయడములో నంబరువారుగా ఉన్నారు. తండ్రి నంబరువారుగా ఇవ్వలేదు. అందరికీ నంబర్‌వన్‌గానే ఇచ్చారు. కానీ కార్యంలో ఉపయోగించడంలో మీకు మీరే నంబరు తయారు చేసుకున్నారు. కావున నంబరు ఎందుకు తయారయిందో అర్థమయిందా? ఎంతగా ఉపయోగిస్తారో, కార్యంలో వినియోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటుంది. మర్జ్ చేసి ఉంచుకున్నట్లయితే పెరగదు మరియు స్వయం కూడా అనుభవం చేయరు, ఇతరులకు కూడా అనుభవం చేయించలేరు, అందుకే ముఖము మరియు నడవడికలోకి తీసుకురండి. ఏం చేయాలో అర్థమయిందా? ఏ నంబరు వచ్చినా మంచిదే, సరే, 108లో కాకపోతే 16,000లో లభించినా మంచిదే, ఏదో ఒకటైతే అవుతాము కదా అని అనుకోకండి. 16,000 మాలను సదా జపించరు, అక్కడక్కడ మరియు అప్పుడప్పుడు జపిస్తారు. 108 మాలనైతే సదా జపిస్తూ ఉంటారు. మరిప్పుడు నేను ఎవరు? మీకు మీరే తెలుసుకోండి. ఒకవేళ తండ్రి అయినా లేక ఎవరైనా మీరు 16,000 లోకి వస్తారు అని అంటే మీరేమంటారు? అంగీకరిస్తారా? ప్రశ్నలు మొదలవుతాయి, అందుకే నేను ఎవరు అని మీకు మీరు తెలుసుకోండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు, జన్మతోనే ప్రాప్తించే పరమాత్మ జన్మకు అధికారులైన ఆత్మలందరికీ, తండ్రి ద్వారా శ్రేష్ఠ వారసత్వాన్ని మరియు పరమాత్మ పాలనను తీసుకునేవారందరికీ, సత్యమైన శిక్షకుని ద్వారా శ్రేష్ఠ చదువు యొక్క శ్రేష్ఠ పదవిని పొందే మరియు శ్రేష్ఠ సంపాదనను చేసుకునేవారికి, సద్గురువు ద్వారా మహా మంత్రము మరియు సర్వ వరదానాలను ప్రాప్తి చేసుకునేవారికి - ఇలా పదమాపదమాలను జమ చేసుకునే అతి శ్రేష్ఠమైన ఆత్మలకు, ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం. 1:- యథార్థమైన సేవ లేక యథార్థమైన స్మృతికి గుర్తు - నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా చేయడము
సదా మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క పాట స్వతహాగానే మనసులో మ్రోగుతూ ఉంటుందా? ఇది అనాది, అవినాశీ పాట. దీనిని మ్రోగించాల్సిన అవసరం లేదు, ఇది స్వతహాగానే మ్రోగుతుంది. సదా ఈ పాట మ్రోగడము అనగా సదా మీ సంతోషపు ఖజానాను అనుభవం చేయడము. సదా సంతోషంగా ఉంటారా? సంతోషంగా ఉండడము మరియు సంతోషాన్ని పంచడమే బ్రాహ్మణుల పని. ఈ సేవలోనే సదా బిజీగా ఉంటున్నారా? లేక ఎప్పుడైనా మర్చిపోతున్నారా? మాయ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎంత సమయమైతే మాయ ఉంటుందో అంత సమయం సంతోషం యొక్క పాట ఆగిపోతుంది. తండ్రి సదా తోడుగా ఉంటే మాయ రాలేదు. మాయ తను వచ్చే కన్నా ముందు తండ్రి నుండి వేరు చేసి ఒంటరిగా చేస్తుంది. తర్వాత దాడి చేస్తుంది. ఒకవేళ తండ్రి తోడుగా ఉంటే మాయ నమస్కారం చేస్తుంది, దాడి చేయదు. కనుక ఇది శత్రువు అని మాయ గురించి బాగా తెలిసినప్పుడు ఇక దానిని ఎందుకు రానిస్తున్నారు? తోడును వదిలేస్తారు కదా, అందుకే మాయకు వచ్చేందుకు ద్వారము లభిస్తుంది. ద్వారానికి డబల్ లాక్ వేయండి, సింగిల్ లాక్ కాదు. ఈరోజుల్లో సింగిల్ లాక్ పనిచేయదు. డబల్ లాక్ అంటే - స్మృతి మరియు సేవ. సేవ కూడా నిస్వార్థ సేవగా ఉండాలి. ఇదే తాళము. ఒకవేళ నిస్వార్థ సేవ లేకపోతే ఆ తాళము లూజ్ అవుతుంది, తెరుచుకుపోతుంది. స్మృతి కూడా శక్తిశాలిగా ఉండాలి. సాధారణ స్మృతి ఉన్నా దానిని తాళము అని అనరు. స్మృతి అయితే ఉంది కానీ సాధారణ స్మృతి ఉందా లేక శక్తిశాలి స్మృతి ఉందా? ఇది సదా చెక్ చేసుకోండి. ఇదే విధంగా సేవ చేస్తారు కానీ నిస్వార్థ సేవనా లేక ఏదో ఒక స్వార్థం నిండి ఉందా? సేవ చేస్తున్నప్పటికీ, స్మృతిలో ఉంటున్నప్పటికీ కూడా మాయ వస్తే తప్పకుండా సేవ లేక స్మృతిలో ఏదో లోపం ఉన్నట్లు.
సదా సంతోషం యొక్క పాటలు పాడే శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలము - ఈ స్మృతితో ముందుకు వెళ్ళండి. యథార్థమైన యోగము లేక యథార్థమైన సేవకు గుర్తు - నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా చేయడము. నిర్విఘ్నంగా ఉన్నారా లేక అప్పుడప్పుడు విఘ్నాలు వస్తాయా? అటువంటప్పుడు ఒక్కోసారి పాస్ అవుతారు, ఒక్కోసారి కొద్దిగా ఫెయిల్ అవుతారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు ఒకవేళ అందులో కొద్దిగానైనా ఏ రకమైన ఫీలింగ్ అయినా వస్తే - ఇది ఎందుకు, ఇది ఏమిటి... ఇలా ఫీలింగ్‌లోకి రావడము అనగా విఘ్నము. కనుక సదా వ్యర్థ ఫీలింగ్ నుండి అతీతంగా ఫీలింగ్ ప్రూఫ్ ఆత్మగా అవ్వాలి అని అనుకోండి. అప్పుడు మాయాజీతులుగా అవుతారు. అయినా కూడా చూడండి - తండ్రికి చెందినవారిగా అయ్యారు, తండ్రికి చెందినవారిగా అవ్వడము అనేది ఎంత సంతోషించే విషయము! భగవంతునికి ఇంత సమీప సంబంధంలోకి వస్తామని ఎప్పుడూ స్వప్నంలో కూడా అనుకోలేదు! కానీ సాకారంలో అలా వచ్చారు! మరి ఏం గుర్తుంచుకుంటారు? సదా సంతోషం యొక్క పాటలు పాడేవారము అని గుర్తుంచుకోండి. ఈ సంతోషపు పాటలు ఎప్పుడూ సమాప్తమవ్వలేవు.
టీచర్లంటే అర్థమే తమ ఫీచర్స్ (లక్షణాలు) ద్వారా అందరికీ ఫరిశ్తాల ఫీచర్స్‌ను అనుభవం చేయించేవారు. ఇటువంటి టీచర్లుగా ఉన్నారా? సాధారణ రూపం కనిపించకూడదు, సదా ఫరిశ్తా రూపం కనిపించాలి ఎందుకంటే టీచర్లు నిమిత్తులు కదా. కనుక ఎవరైతే నిమిత్తులుగా అవుతారో, వారు స్వయం ఏదైతే అనుభవం చేస్తారో దానిని ఇతరులకు చేయిస్తారు. నిమిత్తులుగా అవ్వడం కూడా భాగ్యమే. ఇప్పుడు ఇదే భాగ్యాన్ని మీ అనుభవంలోనూ పెంచుకోండి మరియు ఇతరులకు అనుభవం చేయించండి. అన్నింటికన్నా విశేషమైన విషయము - అనుభవీమూర్తులుగా అవ్వండి.
గ్రూప్ నం. 2 :- “నా బాబా” స్మృతిలోకి తేవడం అనగా సర్వ ప్రాప్తుల భాండాగారాలు నిండుగా ఉండడం
సదా సహజంగా మరియు శక్తిశాలిగా ఉండే విధి ఏమిటి, ఏ విధి ద్వారా సహజంగా మరియు సదా నిర్విఘ్నంగా కూడా ఉండగలరు అలాగే ఎగిరే కళ యొక్క అనుభవం కూడా చేసుకోగలరు? అత్యంత సహజమైన విధి ఏమిటంటే - ఇంకేది మరచిపోయినా ఒక విషయాన్ని ఎన్నడూ మరచిపోకూడదు - “నా బాబా.” “నా బాబా” అని హృదయపూర్వకంగా భావించడమే ముందుకు వెళ్ళడానికి అన్నింటికంటే సహజమైన విధి. నాది-నాది అని అనుకునే సంస్కారం బహు కాలం యొక్క అభ్యాసమే. ఆ సంస్కారాన్నే కేవలం పరివర్తన చేయాలి. ‘అనేక’ నాది అన్నదానిని ‘ఒకే’ నా బాబా అనేదానిలో ఇమడ్చాలి. ఒకరిని గుర్తుచేసుకోవడం సహజం కదా మరియు ఒక్కరి నాది అన్నదానిలో సర్వస్వం వచ్చేస్తుంది. కాబట్టి అత్యంత సహజమైన విధి “నా బాబా.” ‘నా’ అనే శబ్దం ఎలాంటిదంటే ఇష్టం లేకపోయినా గుర్తుకొస్తుంది. ‘నాది’ అన్నదానిని గుర్తుచేసుకోవలసిన అవసరం ఉండదు, స్వతహాగానే గుర్తొస్తుంది. మరచిపోవాలని ప్రయత్నించినా ‘నాది’ మరచిపోలేరు. యోగం బలహీనంగా ఉంటే దానికి కారణం ‘నాది’ అనేదే, అలాగే యోగం శక్తిశాలిగా ఉంటే దానికి కారణం కూడా ‘నాది’ అనేదే. “నా బాబా” - అంటే యోగం శక్తిశాలి అయిపోతుంది, నా సంబంధం, నా పదార్థం - ఈ “అనేక నాది” గుర్తుకురావడం అనగా యోగం బలహీనం కావడం. మరి ఎందుకు సహజ విధి ద్వారా పురుషార్థంలో వృద్ధి చేసుకోకూడదు?
విధి ద్వారానే సిద్ధి లభిస్తుంది. రిద్ధి-సిద్ధి అల్పకాలికమైనది, కానీ విధి ద్వారా లభించే సిద్ధి అవినాశి అయినది. ఇక్కడ రిద్ధి-సిద్ధి విషయం కాదు, విధి ద్వారా సిద్ధిని పొందాలి. విధిని అభ్యాసం చేయడం వచ్చా లేక కష్టంగా అనిపిస్తోందా? బలహీనంగా అవ్వడం అనగా కష్టమని అనుభవమవ్వడం. బలహీనత లేకుండా కష్టం అనిపించదు. మరి బలహీనంగా ఉన్నారా? లేక మాయ అప్పుడప్పుడు బలహీనులుగా మార్చేస్తోందా? ఒకవేళ “నా బాబా” గుర్తుకొస్తే, బాబా సర్వశక్తిమాన్ కదా, మరి తండ్రి ఎలాగో పిల్లలు అలాగే ఉంటారు. “నా బాబా” గుర్తుకు రావడంతోనే తమ మాస్టర్ సర్వశక్తిమాన్ స్వరూపం గుర్తుకొస్తుంది. “నా బాబా” అనడంతోనే బాబా ఎవరు అన్నది స్మృతిలోకి వస్తుంది. కాబట్టి మాస్టర్ సర్వశక్తిమాన్గా అవ్వడం ద్వారా బలహీనులుగానూ అవ్వరు, కష్టంగానూ అనుభవం చేసుకోరు. సదా సహజం. ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా సహజాతి సహజంగా అనుభవం చేసుకుంటూ వెళ్తారు. ఒకే విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి - “నా బాబా.” “నా బాబా” స్మృతిలోకి రావడం మరియు సర్వ ప్రాప్తుల భాండాగారాలు అనుభవమవ్వడం. మరి భాండాగారాలు నిండుగా ఉన్నాయి కదా. అన్ని ఖజానాలు నిండుగా ఉన్నాయా? లేక కొన్ని ఉన్నాయి, కొన్ని లేవా? సుఖం అనుభవమవుతుంది కానీ శాంతి అనుభవమవ్వడం లేదు, శక్తి అనుభవమవ్వడం లేదు అని ఇలా ఉండకూడదు. సర్వ ఖజానాల యజమాని యొక్క బాలకులు. బాబా ఖజానాలు నా ఖజానాలు. ఎంతగా నిండుగా ఉంటారో, మరి నిండుగా ఉన్న వస్తువు ఎప్పుడూ అలజడిలోకి రాదు. కొద్దిగా ఖాళీగా ఉన్నా అలజడి ఏర్పడుతుంది. కాబట్టి సదా నిండుగా ఉండడం అనగా సదా అచలంగా ఉండడం. అలజడి ఉండదు. ఎన్నడూ బుద్ధి చంచలం కాలేదు. ఏదైనా వికారానికి వశమవ్వడం అనగా బుద్ధి చంచలమవ్వడం. అచలంగా ఉన్నారు మరియు సదా అచలంగా ఉంటారు. అచ్ఛా!
గ్రూప్ నం. 3:- స్మృతి ద్వారా సర్వ కార్యాలు స్వతహాగానే సఫలమవుతాయి, చెప్పవలసిన లేదా అడగవలసిన ఆవశ్యకత లేదు
సదా మరియు సహజంగా ఎవరు గుర్తుకొస్తారు? (బాబా) బాబా కూడా ఎందుకు గుర్తుకొస్తారు? (ప్రియమైనవారు కనుక) ఎవరైతే ప్రియంగా ఉంటారో వారిని గుర్తుచేసుకోరు, వారి స్మృతి స్వతహాగానే వస్తుంది. ఆయనతో హృదయపూర్వకమైన ప్రేమ ఉంది, నిజమైన ప్రేమ ఉంది, నిస్వార్థమైన ప్రేమ ఉంది. కాబట్టి అందరికంటే ప్రియమైనవారు ఎవరు? తండ్రి. మరి తండ్రిని మరచిపోవడం కష్టమా లేక గుర్తుంచుకోవడం కష్టమా? ఏదైనా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అప్పుడు స్థితి ఎలా ఉంటుంది? అప్పుడు గుర్తుచేసుకోవాల్సి వస్తుందా లేక స్మృతి స్వతహాగానే వస్తుందా, ఏమవుతుంది? పరిస్థితి అనగా పర-స్థితి. స్వ స్థితి కాదు, పర స్థితి. ఇతరుల ద్వారా వచ్చే స్థితిని పర-స్థితి అంటాము. మరి పర-స్థితి శక్తిశాలిగా ఉంటుందా లేక స్వ-స్థితి శక్తిశాలిగా ఉంటుందా? కానీ ఆ సమయంలో ఏమవుతుంది? ఆ సమయంలో పర-స్థితి పవర్ఫుల్ అయిపోతుంది మరియు గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. నా బాబా, ప్రియమైన బాబా - మరి ప్రియమైనవారిని ఎన్నడూ మరచిపోలేరు. నిస్వార్థమైన ప్రేమ బాబా ద్వారా తప్ప మరే ఆత్మ ద్వారా లభించదు. ఆత్మకు తమ పట్ల ఏదో ఒక స్వార్థం ఉంటుంది. కానీ పరమాత్మ నిస్వార్థి, ఎందుకు? ఎందుకంటే పరమాత్మ దాత, ఆత్మ తీసుకుని ఇచ్చేది. ఆత్మ స్వయంగా దాత కాదు, తీసుకుని ఇవ్వగలదు, పరమాత్మ స్వయంగా దాత.
మీరు ఎవరు? మాస్టర్ దాతలు కదా. వాస్తవానికి ఇవ్వడం అనగా పెరగడం. ఎంతగా ఇస్తారో అంతగా పెరుగుతుంది. వినాశి ఖజానా ఇవ్వడం ద్వారా తగ్గుతుంది, అవినాశి ఖజానా ఇవ్వడం ద్వారా పెరుగుతుంది - ఒకటి ఇస్తే, వేయి రెట్లు పొందుతారు. మరి ఇవ్వడం వచ్చా లేక కేవలం తీసుకోవడం మాత్రమే వచ్చా? ఎవరు ఇవ్వగలరు? ఎవరైతే స్వయంగా సంపన్నంగా ఉంటారో వారు. ఒకవేళ తమలోనే లోపం ఉంటే ఇవ్వలేరు. కాబట్టి మాస్టర్ దాత అనగా సదా సంపన్నంగా ఉండేవారు, పరిపూర్ణంగా ఉండేవారు. మరి సహజ స్మృతి ఏమిటి? “ప్రియమైన బాబా.” స్వార్థంతో గుర్తుచేసుకోకండి. స్వార్థంతో గుర్తుచేసుకోవడంలో కష్టం అనిపిస్తుంది, ప్రేమతో గుర్తుచేసుకోవడం సహజం. స్వార్థంతో గుర్తుచేసుకోవడం స్మృతి కాదు, మొరపెట్టుకోవడం అవుతుంది. మరి మొరపెట్టుకుంటున్నారా? అలా చేయండి, ఇలా చేయండి, ఇలా జరగాలి కదా... అని ఇలా అంటున్నారా? స్మృతి ద్వారా సర్వ కార్యాలు స్వతహాగానే సఫలమైపోతాయి, చెప్పవలసిన ఆవశ్యకత లేదు. సఫలత మీ జన్మసిద్ధ అధికారము. అధికారము అడగడం ద్వారా లభించదు, స్వతహాగానే లభిస్తుంది. మరి అధికారినా లేక అడిగేవారా? అధికారులు సదా నషాలో ఉంటారు - నా అధికారము అని. అడగడం ఆగిపోయింది కదా. బాబాతో కూడా అడగకూడదు. ఇది ఇవ్వండి, కాస్త సంతోషం ఇవ్వండి, కాస్త శాంతి ఇవ్వండి... అని ఇలా అడుగుతున్నారా? బాబా ఖజానా నా ఖజానా. నా ఖజానా అయినప్పుడు ఇక అడగవలసిన అవసరం ఏముంది. అధికారి జీవితాన్ని అనుభవం చేసుకునేవారు కదా. అనేక జన్మలు బికారిగా అయ్యారు, ఇప్పుడు అధికారులుగా అయ్యారు. సదా ఈ అధికార నషాలోనే ఉండండి. పరమాత్మ ప్రేమను అనుభవించిన ఆత్మలు. కాబట్టి సదా ఈ అనుభవంతో సహజయోగిగా అయి ఎగురుతూ వెళ్ళండి. అధికారి ఆత్మలు స్వప్నంలో కూడా అడగలేరు. బాలకులే మాలికులు. అచ్ఛా!
గ్రూప్ నం. 4 :- ఏకరస స్థితిని తయారుచేసుకోవడానికి ఒక్కరి స్మృతిలో ఉండండి, ట్రస్టీగా అవ్వండి
సదా ఏకరస స్థితిలో స్థితమై ఉండడానికి సహజ విధి ఏమిటి? ఒక్కరి స్మృతి ఏకరస స్థితిని తయారుచేస్తుంది. ఒక్క బాబా మరెవ్వరూ లేరు. ఎందుకంటే ఒక్కరిలోనే అందరూ ఇమిడి ఉన్నారు. విత్తనంలో అంతా ఇమిడి ఉన్నట్లు కదా. వృక్షంలోని ఒక్కొక్క భాగాన్ని గుర్తుంచుకోవడం కష్టం, కానీ ఒక విత్తనాన్ని గుర్తుంచుకుంటే అంతా సహజం. బాబా కూడా విత్తనం. అందులో సర్వ సంబంధాల, సర్వ ప్రాప్తుల సారం ఇమిడి ఉంది. ఒక్క బాబాను గుర్తుచేసుకోవడం అనగా సార-స్వరూపంగా అవ్వడం. కాబట్టి ఒక్క బాబా మరెవ్వరూ లేరు. ఈ ఒక్కరి స్మృతి ఏకరస స్థితిని తయారుచేస్తుంది. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? లేక ప్రవృత్తిలో ఉంటున్నారు కనుక రెండవవారు, మూడవవారు ఉంటారా? నా బిడ్డ, నా కుటుంబం అని ఇది ఉండటం లేదా? అప్పుడు ఒక్క బాబా అవ్వరు కదా. ‘నా’ కుటుంబమా లేక ‘నీ’ కుటుంబమా? ట్రస్టీగా అయి సంభాళిస్తున్నారా లేక గృహస్థిగా అయి సంభాళిస్తున్నారా? ట్రస్టీ అనగా నీది మరియు గృహస్థి అనగా నాది. మరి మీరు ఎవరు? నాది-నాది అనుకోవడం వల్ల ఏమి లభించింది? నాది ఇది, నాది ఇది... నాది-నాది అనే విస్తారం వల్ల ఏమి లభించింది? ఏదైనా లభించిందా లేక పోగొట్టుకున్నారా? ఎంతగా నాది-నాది అన్నారో, అంతగా నాది అనేవారు ఎవరూ లేకుండా పోయారు. మరి ట్రస్టీ జీవితం ఎంత ప్రియమైనది! సంభాళిస్తూ కూడా ఎటువంటి భారం ఉండదు, సదా తేలికగా ఉంటారు. చూడండి, గృహస్థిగా అయి నడవడం వల్ల భారాన్ని మోస్తూ-మోస్తూ ఏ పరిస్థితి వచ్చింది - తనువును పోగొట్టుకున్నారు, మనస్సునూ అశాంతి చేసుకున్నారు మరియు నిజమైన ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు. తనువును రోగిగా మార్చుకున్నారు, మనస్సును అశాంతంగా చేసుకున్నారు మరియు ధనంలో ఎలాంటి శక్తి మిగల్లేదు. నేటి వేయి రూపాయలు పూర్వపు ఒక్క రూపాయికి సమానం. కాబట్టి ధనం యొక్క శక్తి పోయింది కదా. ఇప్పుడు భారం మోసే అనుభవం కూడా చేసుకున్నారు మరియు తేలికగా ఉండే అనుభవం కూడా చేసుకున్నారు, కాబట్టి అనుభవం ఉన్నవారు ఎన్నడూ మోసపోరు. ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా మాయ వల్ల మోసపోతే మోసపోవడానికి గుర్తు ఏమిటి? దుఃఖపు అల. కొద్దిగానైనా దుఃఖపు అల సంకల్పంలో కూడా వస్తే తప్పకుండా ఎక్కడో మోసపోయారు అని అర్థం. మరి ఏ విషయంలో మోసపోయారు, ఎందుకు దుఃఖపు అల వచ్చింది అని చెక్ చేసుకోండి? సుఖదాత యొక్క పిల్లలు. సుఖదాత పిల్లలకు దుఃఖపు అల ఎలా వస్తుంది? స్వప్నాలు కూడా మారిపోయాయి. సుఖపు స్వప్నాలు రావాలి, సంతోషపు స్వప్నాలు రావాలి, సేవ యొక్క స్వప్నాలు రావాలి, మిలనము జరుపుకునే స్వప్నాలు రావాలి. సంస్కారాలు మారిపోయాయి కనుక స్వప్నాలు కూడా మారిపోయాయి. అచ్ఛా!
గ్రూప్ నం. 5 :- ఎవరెడీ అనగా నష్టోమోహా స్మృతి స్వరూపులు
సదా తమను సర్వ ప్రాప్తి స్వరూప శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే ప్రాప్తి స్వరూపులే ఇతరులకు సర్వ ప్రాప్తులను కలిగించగలరు. ఇవ్వడంలో తీసుకోవడం స్వతహాగానే ఇమిడి ఉంది. ఇప్పుడు తమ సోదరసోదరీలను బికారిగా చూసి దయ అయితే వస్తోంది కదా. పరమాత్మ ప్రాప్తులకు అధికారులుగా అయినప్పుడు పొందేశాము - సదా హృదయంలో ఇదే పాట పాడుతున్నారా? పొందవలసినది పొందేశాము. సంపన్నంగా అయిపోయారు. ఇలా సంపన్నంగా అయిపోయారా లేక వినాశనం వరకు అవుతారా? ఒకవేళ సమయం సంపన్నంగా లేదా సంపూర్ణంగా తయారుచేస్తే అప్పుడు రచన పవర్‌ఫుల్లా లేక రచయితా? సమయం వచ్చినప్పుడు అవ్వడం కాదు, సమయాన్ని సమీపానికి తీసుకురావాలి. సమయం కొరకు వేచి చూసేవారు కారు. పొందేసినప్పుడు ఇక పొందిన సంతోషంలో ఉండేవారు సదా ఎవరెడీగా ఉంటారు. రేపే వినాశనం జరిగినా సిద్ధంగా ఉన్నారా? లేక కాస్త టైమ్ కావాలా? ఎవరెడీ, నష్టోమోహా స్మృతి స్వరూపము - ఇందులో పాస్ అయ్యారా? ఎవరెడీ అనగానే నష్టోమోహా స్మృతి స్వరూపము. లేక ఆ సమయంలో పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో, చిన్న చిన్న మనవలు-మనవరాళ్ల గతి ఏమవుతుందో అని గుర్తుకొస్తుందా? ఇక్కడే వినాశనం జరిగితే వారు గుర్తుకొస్తారా? భర్తకు కూడా కల్యాణం జరగాలి, మనవడికి కూడా కల్యాణం జరగాలి, వారిని కూడా ఇక్కడికి తీసుకువద్దాము... అని గుర్తుకొస్తుందా? బిజినెస్ ఏమవుతుంది, డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? దారులు తెగిపోతే అప్పుడు ఏమి చేస్తాము? చూడండి, అకస్మాత్తుగా పేపర్ వస్తుంది.
సదా అతీతంగా మరియు ప్రియంగా ఉండడమే - బాబా సమానంగా అవ్వడం. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా కానీ అతీతంగా ఉంటారు. ఈ అతీతతనమే బాబా ప్రేమను అనుభవం చేయిస్తుంది. కొద్దిగానైనా తమలో లేదా ఇతరులలో మోహము అతీతంగా అవ్వనివ్వదు. అతీతంగా మరియు ప్రియంగా ఉండే అభ్యాసం నంబర్‌ను ముందుకు తీసుకువెళ్తుంది. దీనికి సహజ పురుషార్థం నిమిత్త భావం. నిమిత్తంగా భావించడం ద్వారా నిమిత్తంగా తయారు చేసినవారు గుర్తుకొస్తారు. నా కుటుంబం, నా పని - కాదు, నేను నిమిత్తం. నిమిత్తంగా భావించడం ద్వారా పేపర్లో పాస్ అయిపోతారు. అచ్ఛా!
గ్రూప్ నం. 6 :- డబల్ లైట్‌గా అవ్వడానికి బాబా మాటలను వినండి, బాబా శ్రేష్ఠ కర్మలను ఫాలో చేయండి
అందరూ సాకారంలోనూ మరియు స్థితిలోనూ సమీపంగా ఉండే ఆత్మలే కదా. ఆబూలో ఉండేవారు అనగా ఆబూ యొక్క బాబా లాంటి స్థితిలో ఉండేవారు. ఆబూ భూమితో ప్రేమ ఉంది కనుకే కదా సమీపంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే బాబాతో కూడా ప్రేమ ఉంది కదా. ప్రేమకు గుర్తు సమానంగా తయారవ్వడమే. అందరూ ప్రేమకు రిటర్న్ ఇచ్చేవారు, ప్రేమ యొక్క గుర్తును చూపించేవారు. డాక్టర్లకు చాలా మంచి ఛాన్స్ లభించింది. అందరూ లైట్‌గా ఉన్నారా? ఉండటంలో, రావడంలో, తినడంలో - అన్నింటిలోనూ లైట్‌గా ఉన్నారా? లేక కొద్దికొద్దిగా భారంగా ఉన్నారా? హృదయపూర్వకంగా తోడుగా ఉండేవారికి తోడు యొక్క సంతోషం సర్వస్వాన్నీ మరిపిస్తుంది. సంతోషంలో భోజనం కూడా చల్లగానూ అనిపించదు, వేడిగానూ అనిపించదు, చాలా ప్రియంగా అనిపిస్తుంది. చాలా సంతోషకరమైన సందర్భం ఉన్నప్పుడు చల్లగా తిన్నామా లేక వేడిగా తిన్నామా అని గుర్తుంటుందా? సంతోషంతోనే కడుపు నిండిపోతుంది! కాబట్టి తోడుగా ఉండేవారు అనగా సంతోషంతో నిండుగా ఉండేవారు. అలాగే ఉన్నారు కదా! మీ అందరికీ గోల్డెన్ ఛాన్స్ లభించడమనేది డ్రామా యొక్క అత్యంత శ్రేష్ఠమైన విధి. వీరు డబల్ విదేశీయులు మరియు మీరు డబల్ సర్వీసబుల్. డబల్ సేవ చేస్తున్నారా లేక కేవలం మందులు మాత్రమే ఇస్తున్నారా? ఒకే సమయంలో డబల్ సేవ చేయడానికి నిమిత్తమై ఉన్నారు. డబల్ సేవాధారులు, డబల్ స్నేహం మరియు సహయోగానికి పాత్రులుగా అవుతారు. మంచిది. సమీపంలో ఉండే ఈ ఛాన్స్ కూడా మంచిగా లభిస్తుంది. సమీపంలో ఉండేవారిని సంతోషంగా ఉన్నారా, బాగున్నారా అని అడగవలసిన అవసరం ఉంటుందా? మధుబన్ నివాసిగా అవ్వడం అనగా సదా సంతోషంలో ఎగరడం. మరి హాస్పిటల్ పని ఎలా నడుస్తోంది? రెక్కలు వచ్చేశాయి కదా. ఉల్లాస-ఉత్సాహాల రెక్కలతో ఎగురుతున్నారు.
డబల్ విదేశీ ఆత్మలది సదా ఎగిరే కళయే కదా? లేక అప్పుడప్పుడు ఎక్కే కళ, అప్పుడప్పుడు నడిచే కళ మరియు అప్పుడప్పుడు ఎగిరే కళ - ఏమంటారు? సదా ఎగిరే కళ. ఎందుకంటే సమయం ఎగిరే కళతో నడుస్తోంది. ఒకవేళ మీరు ఎగిరే కళతో ముందుకు సాగకపోతే రిజల్ట్ ఏమవుతుంది? కాబట్టి సమయానికంటే ముందే తయారయ్యేవారు కదా. సమయం కొరకు ఎదురుచూడకూడదు, సమయమే శ్రేష్ఠ ఆత్మలైన మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. డబల్ విదేశీయులు అని పేరు, నడవడిక డబల్ లైట్. భారాన్ని మోసే అనుభవం 63 జన్మలు చేశారు. ఇప్పుడు డబల్ లైట్‌గా ఉండే అనుభవం కోసం ఈ ఒక్క బ్రాహ్మణ జన్మ లభించింది. కాబట్టి ఇప్పుడు సదా డబల్ లైట్‌గా ఉండండి.
డాక్టర్లు కూడా డబల్ లైట్‌గా ఉన్నారు కదా. లేక ఏదైనా భారం ఉందా? చూడటంలో, వినడంలో ఏదైనా భారం ఉందా? లేక అప్పుడప్పుడు కాస్త భారం అవుతోందా? అందుకే బాప్‌దాదా అంటారు - ఏ విషయంలోనైనా రసం లేకపోతే, సంబంధం లేకపోతే, వింటూ కూడా వినకండి, చూస్తూ కూడా చూడకండి. చూస్తూ, వింటూ కూడా ఆలోచించకండి. ఆలోచిస్తే ఏమి ఆలోచించాలి? బాబా మాటలు. వింటే బాబా మాటలు, చూస్తే బాబా శ్రేష్ఠ కర్మలు మరియు ఫాలో చేసేవారి శ్రేష్ఠ కర్మలను చూడండి. సదా డబల్ లైట్‌గా ఉండడానికి ఇదే విధి. శరీరంలోకి వచ్చే వ్యర్థ విషయాలను అంతం చేయడమే డాక్టర్ల పని. వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థులుగా మార్చడమే డాక్టర్ల విశేషత. ఆత్మికతలో కూడా ఇదే పని, స్థూలంలో కూడా ఇదే పని. ఇకపోతే, సేవ చక్కగా చేస్తున్నారు మరియు రిజల్ట్ బాగుంది, శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా జరిగే ఉంది. ప్రేమతో సేవ చేస్తున్నారు. ప్రేమ అనే మందును ముందుగా ఇస్తారు, తర్వాత వేరే మందులు ఇస్తారు కదా. సగం పని ప్రేమతోనే జరిగిపోతుంది. అచ్ఛా!
ఆబూ నివాసులు కూడా లక్కీ. సమయానికి రావాల్సి ఉండదు, ఇక్కడే ఉన్నారు. డాక్టర్లందరికీ తమ సేవ నచ్చిందా? లేక ఇంకా ఎక్కడికైనా చక్కర్లు కొట్టాలని అనుకుంటున్నారా? పెద్ద నగరాలలో పెద్ద సేవ జరుగుతుంది అని అనుకోవడం లేదా? సంతోషంగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
