‘‘నంబర్‌వన్‌గా అయ్యేందుకు గుణమూర్తులుగా అయ్యి గుణాలను దానము చేసే మహాదానులుగా అవ్వండి’’
ఈరోజు అనంతమైన మాతా-పిత నలువైపులా ఉన్న విశేషమైన పిల్లలను చూస్తున్నారు. ఏ విశేషతను చూసారు? ఏ పిల్లలు తరగని జ్ఞానీలుగా, స్థిరమైన స్వరాజ్య అధికారులుగా, అఖండ నిర్విఘ్నలుగా, అఖండ యోగీలుగా, అఖండ మహాదానులుగా ఉన్నారు, ఇటువంటి విశేష ఆత్మలుగా కోట్లలో కొద్దిమందే తయారయ్యారు. జ్ఞానీలుగా, యోగీలుగా, మహాదానులుగా అందరూ అయ్యారు కానీ అఖండంగా కొద్దిమందే అయ్యారు. ఎవరైతే తరగనివారిగా, స్థిరమైనవారిగా మరియు అఖండమైనవారిగా ఉన్నారో, వారే విజయమాలలోని విజయమణులు. బాప్‌దాదా సంగమయుగములో పిల్లలందరికీ ‘స్థిరమైనవారిగా-అఖండమైనవారిగా కండి’ అన్న వరదానాన్ని ఇచ్చారు కానీ వరదానాన్ని జీవితములో సదా ధారణ చేయడంలో నంబరువారుగా అయ్యారు. నంబర్‌వన్‌గా అయ్యేందుకు అన్నింటికన్నా సహజమైన విధి - అఖండ మహాదానులుగా అవ్వండి. అఖండ మహాదాని అనగా నిరంతర సహజ సేవాధారి ఎందుకంటే సహజము అన్నదే నిరంతరము అవ్వగలదు. కనుక అఖండ సేవాధారి అనగా అఖండ మహాదాని. మీరు దాత పిల్లలు, సర్వ ఖజానాలతో సంపన్నమైన శ్రేష్ఠ ఆత్మలు. సంపన్నతకు గుర్తు అఖండ మహాదాని. ఒక్క క్షణము కూడా దానము ఇవ్వకుండా ఉండలేరు. ద్వాపరము నుండి అనేక మంది భక్తులు కూడా దానీ ఆత్మలుగా అయ్యారు కానీ ఎంత పెద్ద దానీలైనా కానీ, తరగని ఖజానా యొక్క దానీగా అవ్వలేదు. వినాశీ ఖజానాలు మరియు వస్తువుల యొక్క దానీలుగా అవుతారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు ఇప్పుడు సంగమములో తరగని మరియు అఖండ మహాదానులుగా అవుతారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - అఖండ మాహాదానులమా? లేక సమయమనుసారంగా దానం చేసేవారమా? లేక అవకాశము అనుసారంగా దానం చేసేవారమా?
అఖండ మహాదానులు సదా మూడు రకాలుగా దానము చేయడంలో బిజీగా ఉంటారు. మొదటిది, మనసు ద్వారా శక్తులనిచ్చే దానము, రెండవది, వాణి ద్వారా జ్ఞాన దానము, మూడవది, కర్మల ద్వారా గుణాల దానము. ఈ మూడు రకాలుగా దానాన్ని ఇచ్చేవారు సహజ మహాదానులుగా అవ్వగలరు. రిజల్టులో ఏం చూసారంటే వాణి ద్వారా జ్ఞాన దానాన్ని మెజారిటీ చేస్తూ ఉంటారు. మనసు ద్వారా శక్తుల దానాన్ని యథా శక్తి చేస్తారు మరియు కర్మల ద్వారా గుణ దానాన్ని చేసేవారు చాలా తక్కువమంది ఉంటారు మరియు వర్తమాన సమయములో అజ్ఞానీ ఆత్మలకైనా లేక బ్రాహ్మణ ఆత్మలకైనా, ఇరువురికి గుణ దానము యొక్క అవసరం ఉంది. వర్తమాన సమయములో విశేషంగా స్వయములో మరియు బ్రాహ్మణ పరివారములో ఈ విధిని తీవ్రతరం చేయండి.
ఈ దివ్య గుణాలు అన్నింటికన్నా శ్రేష్ఠమైన ప్రభు ప్రసాదము. ఈ ప్రసాదాన్ని బాగా పంచండి. ఏ విధంగా ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న స్నేహానికి గుర్తుగా స్థూల టోలీని తినిపిస్తారు కదా, అలా పరస్పరములో ఈ గుణాల టోలీని తినిపించండి. ఈ విధి ద్వారా ‘‘ఫరిశ్తా నుండి దేవత’’ అన్న సంగమయుగ లక్ష్యం ఏదైతే ఉందో, అది సహజంగా సర్వులలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దాత సంతానమైన నేను అఖండ మహాదానీ ఆత్మను అన్న ఈ ప్రాక్టీస్‌ను నిరంతరము స్మృతిలో పెట్టుకోండి. ఏ ఆత్మకైనా సరే, వారు అజ్ఞానులైనా లేక బ్రాహ్మణులైనా, మీరు ఇవ్వాల్సిందే. బ్రాహ్మణ ఆత్మలకు జ్ఞానమైతే ముందే ఉంటుంది కానీ రెండు రకాలుగా దాతగా అవ్వగలరు.
1. ఏ ఆత్మకు, ఏ శక్తి అవసరమో ఆ ఆత్మకు మనను ద్వారా అనగా శుద్ధ వృత్తి, వైబ్రేషన్స్ ద్వారా ఆయా శక్తుల దానాన్ని అనగా సహయోగాన్ని ఇవ్వండి.
2. కర్మల ద్వారా సదా స్వయము జీవితములో గుణమూర్తులుగా అయ్యి, ప్రత్యక్ష శ్యాంపుల్‌గా అయ్యి సహజ గుణ ధారణ చేయడంలో ఇతరులకు సహయోగాన్ని ఇవ్వండి. దీనినే గుణ దానము అని అంటాము. దానానికి అర్థము సహయోగము ఇవ్వడము. ఈరోజుల్లో బ్రాహ్మణ ఆత్మలు కూడా వినేందుకు బదులుగా ప్రత్యక్ష ఋజువును చూడాలనుకుంటున్నారు. ఎవరికైనా శక్తిని ధారణ చేసే లేక గుణాలను ధారణ చేసే విషయంలో శిక్షణ ఇవ్వాలనుకుంటే - కొందరు మనసులో అనుకుంటారు, కొందరు మాటలతో అడుగుతారు - అటువంటి ధారణా మూర్తులుగా ఎవరు అయ్యారు అని. అంటే వారు చూడాలనుకుంటారు కానీ వినాలనుకోరు. ఎవరు తయారయ్యారు, అందరినీ చూసాము... అని ఇలా ఒకరితో ఒకరు అనుకుంటారు కదా. ఏదైనా విషయం వచ్చినప్పుడు, ఎవ్వరూ తయారవ్వలేదు, అలా నడుస్తూనే ఉంటుంది అని అంటారు. కానీ ఇవి నిర్లక్ష్యముతో కూడిన మాటలు, యథార్థమైనవి కావు. యథార్థము ఏమిటి? బ్రహ్మా బాబాను ఫాలో చేయండి. ఏ విధంగా బ్రహ్మా బాబా స్వయము, సదా తమను తాము నిమిత్త ఉదాహరణగా తయారు చేసుకున్నారు, సదా ఈ లక్ష్యాన్ని లక్షణములోకి తీసుకువచ్చారు, అదేమిటంటే - ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు అనగా ఎవరైతే స్వయాన్ని నిమిత్త ప్రత్యక్ష ఉదాహరణగా తయారు చేసుకుంటారో వారే అర్జునులుగా అనగా మొదటి నంబరువారిగా అవుతారు. ఒకవేళ ఫాలో ఫాదర్ చేయాలనుకుంటే ఇతరులను చూసి తయారైతే నంబర్‌వన్‌గా తయారవ్వలేరు. నంబరువారుగా అవుతారు.
నంబర్‌వన్ ఆత్మ యొక్క గుర్తు - ప్రతి శ్రేష్ఠ కార్యములో నేను నిమిత్తంగా అయ్యి ఇతరులకు సింపుల్ (సులువు) చేయడానికి శ్యాంపుల్‌గా అవ్వాలి. ఇతరులను చూడడము, వారు పెద్దవారైనా, చిన్నవారైనా, సమానమైనవారైనా కానీ ఇతరులను చూసి - మొదట వీరు-వీరు తయారైతే నేను తయారవుతాను అని అనుకుంటూ తయారైతే, అక్కడ మొట్టమొదట అలా తయారైనవారు నంబర్‌వన్ అవుతారు కదా. అప్పుడిక స్వయం స్వతహాగానే నంబరువారులోకి వస్తారు. అఖండ మహాదాని ఆత్మ సదా స్వయాన్ని ప్రతి క్షణము మూడు మహాదానాలలో ఏదో ఒక దానము చేయడంలో బిజీ పెట్టుకుంటారు. ఎటువంటి సమయమో అటువంటి సేవలో సదా నిమగ్నమై ఉంటారు. వారికి వ్యర్థాన్ని చూసేందుకు, వినేందుకు లేక చేసేందుకు తీరికే ఉండదు. మరి మహాదానులుగా అయ్యారా? ఇప్పుడు అండర్లైన్ చేయండి. అఖండముగా అయ్యారా? ఒకవేళ మధ్యమధ్యలో దాతాతనములో ఖండన ఏర్పడితే ఖండితమైనదానిని సంపూర్ణము అని అనరు. వర్తమాన సమయములో పరస్పరములో విశేషంగా కర్మల ద్వారా గుణదాతగా అయ్యే అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఇలా సంకల్పము చేయండి - నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా తయారుచేసే విశేష కర్తవ్యాన్ని చేయాల్సిందే. కనుక స్వయము యొక్క మరియు సర్వుల యొక్క బలహీనతలను సమాప్తము చేసే ఈ విధిలో ప్రతి ఒక్కరూ స్వయాన్ని నిమిత్తమైన మొదటి నంబరువారిగా భావించి ఉన్నతి చెందుతూ వెళ్ళండి. జ్ఞానమైతే చాలా ఉంది, ఇప్పుడు గుణాలను ఇమర్జ్ చేయండి, సర్వ గుణ సంపన్నులుగా అయ్యే మరియు తయారుచేసే ఉదాహరణగా అవ్వండి. అచ్ఛా!
సర్వ అఖండ యోగ స్వరూప ఆత్మలకు, సర్వ సదా గుణమూర్త ఆత్మలకు, ప్రతి సంకల్పము, ప్రతి క్షణము మహాదానులు మరియు మహా సహయోగులైన సర్వ విశేష ఆత్మలకు, సదా స్వయము శ్రేష్ఠతలో శ్యాంపుల్‌గా అయ్యి సర్వ ఆత్మలకు సులువైన సహజమైన ప్రేరణను ఇచ్చేవారికి, సదా స్వయాన్ని నిమిత్త నంబర్‌వన్‌గా భావిస్తూ ప్రత్యక్ష ఋజువునిచ్చే తండ్రి సమాన ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
జానకి దాదీతో మిలనము:- (ఆస్ట్రేలియా, సింగపూర్ మొదలైన దేశాలు తిరిగి వచ్చి సమాచారాన్ని వినిపించారు మరియు అందరి స్మృతిని ఇచ్చారు) అందరి స్మృతి చేరుకుంది. నలువైపులలో ఉన్న పిల్లలు సదా తండ్రి ఎదురుగా ఉన్నారు, ఇందుకు ప్రత్యక్ష ఋజువు ఏమిటంటే, ఎప్పుడు స్మృతి చేసినా సమీపత మరియు తోడు యొక్క అనుభవం చేస్తారు. మనస్ఫూర్తిగా బాబా అని అన్నారు మరియు మనోభిరాముడు హాజరయ్యారు. అందుకే ప్రభువు హాజరై ఉన్నారు, ప్రభువు నిత్యం హాజరై ఉన్నారు అని అంటారు. ఎక్కడ ఉన్నా సరే, ఎవరి విషయంలోనైనా సరే, ప్రతి స్థానములో ప్రతి ఒక్కరి దగ్గర హాజరవుతారు. అందుకే ప్రభువు నిత్యం హాజరై ఉన్నారని అంటారు. ఈ స్నేహం యొక్క విధి గురించి ఇతరులు తెలుసుకోలేరు. ఇది బ్రాహ్మణ ఆత్మలే తెలుసుకుంటారు. అనుభవజ్ఞులకే ఈ అనుభవము గురించి తెలుసు. విశేష ఆత్మలైన మీరు ఉన్నదే కంబైండ్‌గా కదా. వేరుగా అవ్వనే అవ్వలేరు. ఎక్కడ చూస్తే అక్కడ నీవే నీవు అని ఇతరులు అంటారు మరియు మీరు ఏది చేసినా, ఎక్కడకు వెళ్ళినా బాబా తోడుగానే ఉంటారు అని అంటారు అనగా నీవే నీవు అని అన్నట్లే. ఏ విధంగా కర్తవ్యము తోడుగా ఉంటుందో, అలాగే ప్రతి కర్తవ్యాన్ని చేయించేవారు కూడా సదా తోడుగా ఉంటారు, కనుకనే చేసేవారు-చేయించేవారు అన్న గాయనము ఉంది. కనుక చేసేవారు మరియు చేయించేవారు కంబైండ్ అయ్యారు కదా. మరి మీ అందరి స్థితి ఎలా ఉంది? కంబైండ్‌గా ఉంది కదా. చేసేవారు చేయించేవారు, చేసేవారితోపాటు ఉండనే ఉంటారు, అంతేకానీ చేయించేవారు వేరుగా లేరు. దీనినే కంబైండ్ స్థితి అని అనడం జరుగుతుంది. అందరూ మీ-మీ పాత్రను మంచిగా అభినయిస్తున్నారు. సింపుల్ (సులువు) చేసేందుకు అనేక ఆత్మల ముందు శ్యాంపుల్‌గా ఉన్నారు, అలా అనిపిస్తుంది కదా. కష్టాన్ని సహజం చేయడము, ఇదే ఫాలో ఫాదర్. అలాంటివారిగానే ఉన్నారు కదా. మంచి పాత్రను అభినయించారు కదా. ఎక్కడ ఉన్నా కానీ, విశేష పాత్రధారులు విశేష పాత్రను అభినయించకుండా ఉండలేరు. ఇది డ్రామాలో నిశ్చితము. అచ్ఛా. అన్ని చోట్లకు వెళ్ళి రావడము చాలా మంచిది. అంతటా తిరిగారు, మళ్ళీ స్వీట్ హోమ్‌కు వచ్చేసారు. సేవలో తిరిగి రావడము అనేది అనేక ఆత్మల కొరకు విశేష ఉల్లాస-ఉత్సాహాలతో తిరగడము. అందరూ బాగున్నారు కదా? అంతా బాగానే ఉంది కదా. అంతా మంచే మంచి. డ్రామా విధి తప్పకుండా లాగుతుంది. మీరు ఉండాలనుకున్నా కానీ డ్రామాలో లేకపోతే ఏం చేస్తారు. ఆలోచించినా కానీ వెళ్ళాల్సే వస్తుంది ఎందుకంటే సేవ యొక్క విధి అలా ఉంది కావున ఆ సేవ యొక్క విధి తన కార్యాన్ని చేయిస్తుంది. రావడము మరియు వెళ్ళడము, ఇదే విధి. అచ్ఛా. సంగఠన బాగుంది.
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం. 1
పరమాత్మ ప్రేమను అనుభవము చేసేందుకు దుఃఖపు అల నుండి అతీతులుగా అవ్వండి
బాప్‌దాదా సంగమములో అనేక ఖజానాలను ఇచ్చారు, ఆ అన్ని ఖజానాలలోనూ శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన ఖజానా సదా సంతోషం యొక్క ఖజానా. మరి ఈ సంతోషం యొక్క ఖజానా సదా తోడుగా ఉంటుందా? ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ సంతోషము పోకూడదు. దుఃఖపు అలతో కూడుకున్న పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా ఉంటారా లేక కొద్ది-కొద్దిగా దుఃఖపు అల వస్తుందా? ఎందుకంటే సంగమములో ఉన్నారు కదా. కావున ఒక వైపు దుఃఖధామము ఉంది, మరొక వైపు సుఖధామము ఉంది. కనుక దుఃఖపు అలకు చెందిన అనేక విషయాలు ఎదురుగా వస్తాయి కానీ మీ లోపల ఆ దుఃఖపు అల దుఃఖ పెట్టకూడదు. ఏ విధంగా వేసవి కాలంలో వేడి అయితే ఉంటుంది కదా కానీ స్వయాన్ని రక్షించుకోవడము అనేది స్వయముపై ఆధారపడి ఉంటుంది. అలాగే దుఃఖపు విషయాలు వినిపిస్తాయి కానీ మనసుపై ప్రభావం పడకూడదు. అందుకే అతీతులు మరియు ప్రభు ప్రియులు అని అంటాము. దుఃఖపు అల నుండి అతీతంగా ఉన్నప్పుడే ప్రభువుకు ప్రియమైనవారిగా అవుతారు. ఎంత అతీతమో అంత ప్రియము. నేను ఎంత అతీతంగా అయ్యాను అని మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎంతగా అతీతంగా అవుతూ ఉంటారో అంతగానే సహజంగా పరమాత్మ ప్రేమను అనుభవం చేస్తారు. కనుక ఎంత అతీతంగా ఉన్నాను, ఎంత ప్రియంగా ఉన్నాను అని ప్రతి రోజూ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రేమ పరమాత్మ ప్రేమ, ఇది మరే యుగములోనూ ప్రాప్తించదు. ఎంత ప్రాప్తి చేసుకోవాలనుకుంటే అంత ఇప్పుడే ప్రాప్తి చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోకపోతే మరెప్పుడూ చేసుకోలేరు. అంతేకాక ఈ పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకునే సమయం ఎంత తక్కువగా ఉంటుంది! కావున కొద్ది సమయములో చాలా అనుభవము చేయాలి. మరి చేస్తున్నారా? ప్రపంచములోనివారు సంతోషము కోసం ఎంత సమయాన్ని, సంపదను ఖర్చు చేస్తారు మరియు మీకు సహజంగా అవినాశీ సంతోషపు ఖజానా లభించింది. దీని కోసం ఏమైనా ఖర్చు చేసారా? సంతోషం కొరకు ఖర్చు చేయగలిగే వస్తువు ఏదైనా ఉందా! కనుక పొందాల్సినదేదో పొందేసాను అన్న ఈ సంతోషపు పాటనే పాడుతూ ఉండండి. పొందేసారు కదా. ఏదైనా వస్తువు లభించినప్పుడు సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఇతరులకు కూడా ఈ సంతోషాన్ని పంచుతూ వెళ్ళండి. ఎంతగా పంచుతూ ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే పంచడము అనగా పెరగడము. కనుక మీ సంబంధములోకి ఎవరు వచ్చినా కానీ వారు - వీరికి ఏదో శ్రేష్ఠ ప్రాప్తి కలిగింది, ఆ సంతోషము ఉంది అన్నట్లు అనుభవము చేయాలి ఎందుకంటే ప్రపంచములోనైతే ప్రతి సమయము దుఃఖం ఉంది మరియు మీ వద్ద ప్రతి సమయము సంతోషం ఉంది. కనుక దుఃఖముతో ఉన్నవారికి సంతోషాన్ని ఇవ్వడము, ఇది అన్నింటికన్నా అతి పెద్ద పుణ్యము. మరి అందరూ నిర్విఘ్నులుగా అయ్యి ముందుకు ఎగురుతూ ఉన్నారా లేక చిన్న-చిన్న విఘ్నాలు ఆపుతున్నాయా? విఘ్నాల పని రావడము మరియు మీ పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవడము. విఘ్నాలు తమ పనిని మంచిగా చేస్తున్నప్పుడు మాస్టర్ సర్వ శక్తిమంతులైన మీరు మీ విజయ కార్యములో సదా సఫలులుగా ఉండండి. మేము విఘ్న-వినాశక ఆత్మలము అన్నదానిని సదా గుర్తుంచుకోండి. విఘ్న-వినాశకులకు కల స్మృతిచిహ్నము ఏదైతే ఉందో దానిని ప్రాక్టికల్‌గా అనుభవం చేస్తున్నారు కదా. అచ్ఛా!
గ్రూప్ నం.2
అచల స్థితిని తయారు చేసుకునేందుకు మాస్టర్ సర్వ శక్తిమాన్ అన్న టైటిల్‌ను స్మృతిలో ఉంచుకోండి
స్వయాన్ని సదా సర్వ ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మగా అనగా సంపన్న ఆత్మగా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే ఎవరైతే సంపన్నంగా ఉంటారో, అక్కడ సంపన్నతకు గుర్తు ఏమిటంటే, వారు అచలంగా ఉంటారు, అలజడిలోకి రారు. ఎంత ఖాళీ ఉంటుందో అంత అలజడి ఉంటుంది. కనుక ఏ రకమైన అలజడి అయినా, సంకల్పాల ద్వారానైనా, వాణి ద్వారానైనా, సంబంధ-సంపర్కాల ద్వారానైనా, ఏ రకమైన అలజడి ఉన్నా కానీ ఖజానాలతో సంపన్నంగా లేరు అన్నది నిరూపించబడుతుంది. సంకల్పాలలో కూడా, స్వప్నములో కూడా అచలము. ఎందుకంటే ఎంతెంతగా మాస్టర్ సర్వశక్తిమంతుని స్వరూపం యొక్క స్మృతి ఇమర్జ్ అవుతుందో అంతగా ఈ అలజడి మర్జ్ అవుతూ ఉంటుంది. కనుక మాస్టర్ సర్వశక్తిమాన్ యొక్క స్మృతి ప్రత్యక్ష రూపంలో ఇమర్జ్ అయ్యి ఉండాలి. ఏ విధంగా శరీరం యొక్క వృత్తి ఇమర్జ్ అయ్యి ఉంటుందో, మర్జ్ అయి ఉండదో, అలా ఈ బ్రాహ్మణ జీవితం యొక్క వృత్తి ఇమర్జ్ రూపములో ఉండాలి. కనుక ఇమర్జ్ అయ్యి ఉంటుందా లేక మర్జ్ అయ్యి ఉంటుందా అన్నదానిని చెక్ చేసుకోండి. ఇమర్జ్ అయ్యి ఉంటే దానికి గుర్తు - ప్రతి కర్మలో ఆ నషా ఉంటుంది మరియు ఇతరులకు కూడా వీరు శక్తిశాలి ఆత్మ అన్న అనుభవం కలుగుతుంది. దీనినే అలజడి నుండి దూరంగా అచలముగా ఉండటము అని అంటాము. అచల్‌ఘర్ మీ స్మృతిచిహ్నము. కనుక మేము మాస్టర్ సర్వ శక్తిమంతులము అన్న మీ వృత్తిని సదా గుర్తుంచుకోండి ఎందుకంటే ఈరోజుల్లో సర్వాత్మలు అతి బలహీనంగా ఉన్నారు కావున బలహీన ఆత్మలకు శక్తి కావాలి. శక్తిని ఎవరిస్తారు? ఎవరైతే స్వయం మాస్టర్ సర్వశక్తిమంతులో వారు ఇస్తారు. ఏ ఆత్మలనైనా కలిసినప్పుడు వారు తమకు సంబంధించిన ఏ విషయాలను వినిపిస్తారు? బలహీనతకు చెందిన విషయాలనే వినిపిస్తారు కదా? ఏదైతే చేయాలనుకుంటారో అది చేయలేకపోతారు, దీనిబట్టి బలహీనంగా ఉన్నారని నిరూపించబడుతుంది కానీ మీరు ఏ సంకల్పము చేస్తే దానిని కర్మలోకి తీసుకురాగలరు. కనుక మాస్టర్ సర్వశక్తిమంతుల గుర్తు - సంకల్పము మరియు కర్మ, రెండూ సమానంగా ఉంటాయి. సంకల్పం చాలా శ్రేష్ఠమైనది కానీ కర్మ చేయడంలో ఆ శ్రేష్ఠ సంకల్పాన్ని చేయలేకపోతే, వీరిని మాస్టర్ సర్వశక్తిమంతులు అని అనము. కనుక చెక్ చేసుకోండి, శ్రేష్ఠ సంకల్పాలు ఏవైతే ఉంటాయో, అవి కర్మల వరకు వస్తాయా లేక రాలేకపోతాయా? మాస్టర్ సర్వశక్తిమంతుల గుర్తు ఏమిటంటే, ఏ సమయములో ఏ శక్తి అవసరమో ఆ సమయములో ఆ శక్తి కార్యములోకి రావాలి, మరి ఇలానే ఉంటుందా లేక ఆహ్వానిస్తారు కానీ అది కాస్త ఆలస్యంగా వస్తుందా? ఏదైనా విషయం పూర్తయిపోయిన తర్వాత, ఇలా కాదు, ఇలా చేయాలి అని తరువాత గుర్తుకు వస్తే దానిని సమయానికి ఉపయోగపడలేదు అని అంటారు. స్థూల కర్మేంద్రియాలు ఆర్డరుపై నడుస్తాయి కదా, చేతిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా నడిపించగలరు కదా, అలా ఈ సూక్ష్మ శక్తులు ఎంత కంట్రోల్లో ఉండాలంటే ఏ సమయములో, ఏ శక్తి కావాలో దానిని పనిలో పెట్టగలగాలి. మరి ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? అనుకోలేదు కానీ జరిగిపోయింది అని ఇలా అయితే ఆలోచించరు కదా. కనుక సదా మీ కంట్రోలింగ్ పవర్‌ను చెక్ చేసుకుంటూ శక్తిశాలిగా అవుతూ వెళ్ళండి. అందరూ ఎగిరే కళ కలవారేనా లేక కొందరు ఎక్కే కళ కలవారు, కొందరు ఎగిరే కళ కలవారా? లేక ఒక్కోసారి ఎగిరే, ఒక్కోసారి ఎక్కే, ఒక్కోసారి నడిచే కళ అవుతుందా? మారుతూ ఉంటుందా లేక ఏకరసంగా ముందుకు వెళ్తుంటారా? ఏదైనా విఘ్నము వచ్చినప్పుడు ఎంత సమయములో విజయులుగా అవుతారు? సమయం పడుతుందా? ఎందుకంటే మీరు జ్ఞాన సంపన్నులు కదా. కనుక విఘ్నాల యొక్క జ్ఞానం కూడా ఉంది. జ్ఞాన శక్తి వలన విఘ్నాలు దాడి చేయవు, ఓడిపోతాయి. వీరినే మాస్టర్ సర్వశక్తిమాన్ అని అంటాము. కావున అమృతవేళ నుండి ఈ వృత్తిని ఇమర్జ్ చేసుకోండి మరియు మొత్తము రోజంతా దీనిని చెక్ చేసుకోండి. అచ్ఛా.
గ్రూప్ నం. 3
ప్రతి ఘడియను చివరి ఘడియగా భావిస్తూ ఎవరెడీగా అవ్వండి, మీ భాగ్యం యొక్క పాటను సదా పాడుతూ ఉండండి
అందరూ తమ భాగ్యాన్ని చూసి సదా హర్షితంగా ఉంటున్నారా? హృదయంలో సదా ‘వాహ్ నా శ్రేష్ఠ భాగ్యం’ అనే పాట పాడుకుంటున్నారా లేక ఎప్పుడైనా పాట మోగుతుంది, ఎప్పుడైనా ఆగిపోతుందా? సదా ఏకరసంగా పాట మోగుతోందా లేక ఒకసారి స్లో అవుతుంది, ఒకసారి వేగవంతం అవుతుందా? సదా భాగ్యం యొక్క పాటలను పాడుతూ ఉండండి. ఎందుకంటే ఈ భాగ్యాన్ని ఎవరు తయారుచేశారు? భాగ్య విధాత భాగ్యాన్ని తయారుచేశారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు భాగ్యాన్ని తయారుచేశారు. మరి స్వయంగా ఉన్నతమైనవారు అయినప్పుడు భాగ్యాన్ని కూడా ఉన్నతంగానే తయారుచేస్తారు. కాబట్టి ‘భగవంతుడు శ్రేష్ఠ భాగ్యాన్ని తయారుచేశారు’ అనే నషా మరియు సంతోషం ఉండాలి, మరి ఎన్ని జన్మల భాగ్యాన్ని తయారుచేశారు? జన్మజన్మల కొరకు భాగ్యాన్ని తయారుచేశారు. కేవలం 21 జన్మలే కాదు, మొత్తం కల్పం అంతటిలోనూ భాగ్యవంతులుగా ఉంటారు. 21 జన్మలు పూజ్యులుగా అవుతారు, ఆ తర్వాత ద్వాపరం నుండి పూజారులు మిమ్మల్ని పూజిస్తారు. కాబట్టి ఆ చైతన్య పూజ్య రాజ్య అధికారులుగా అవుతారు మరియు ద్వాపరం నుండి మీ జడ చిత్రాలు పూజింపబడతాయి. కాబట్టి ఇది మొత్తం కల్పం యొక్క భాగ్యం. ఇప్పుడు చివరి జన్మలో కూడా మీ యొక్క స్మృతిచిహ్నము చూస్తున్నారు కదా. ఒకవైపు చైతన్యంలో మీరు ఉన్నారు, మరొకవైపు మీ యొక్క జడ చిత్రాలు ఉన్నాయి, కాబట్టి చిత్రం మరియు చైతన్యం రెండూ ఎదురుగా ఉన్నాయి. చిత్రాన్ని చూసి కూడా సంతోషం కలుగుతుంది కదా, మరి ఇలాంటి పూజ్యులుగా తండ్రి ద్వారా అయ్యారు. మొత్తం కల్పంలో ఎవరైనా తమ చైతన్య రూపంలో తమ జడ చిత్రాన్ని చూడడం అనేది జరగదు. ఒకవేళ చూసినప్పటికీ వేర్వేరు జన్మలు అవ్వడం వలన తెలుసుకోలేరు. కానీ ఇవి మన జడ చిత్రాలే అని మీకు తెలుసు. మాతలారా, తెలుసా? మీ అందరి పూజ జరుగుతుందా? కాబట్టి చిత్రం మరియు చైతన్యం - ఇదే విశేషత. నిన్న ఎలా ఉంటిమి, నేడు ఎలా ఉన్నాము మరియు రేపు ఎలా అవుతాము అనే మూడు కాలాలు ఎదురుగా ఉన్నాయి.
మాతలారా, సదా సంతోషంగా ఉంటున్నారా లేక ఎప్పుడైనా ఉంటున్నారా? బ్రాహ్మణ జీవితం అనగా సదా సంతోషకరమైన జీవితం. బ్రాహ్మణులుగా అయింది దేనికోసం? ఎప్పుడైనా సంతోషంగా ఉండడానికా? సదా సంతోషంగా ఉండడానికా! కాబట్టి ఎప్పుడైనా సంతోషంగా ఉండడం కాదు, సదా సంతోషంగా ఉండాలి. తండ్రి అవినాశి ఖజానాను ఇచ్చారు, ఎప్పుడైనా ఇచ్చేది ఇవ్వలేదు. తండ్రి ఎప్పుడైనా ‘ఎప్పుడైనా సంతోషంగా ఉండండి, ఎప్పుడైనా దుఃఖం వస్తే ఫర్వాలేదు’ అని చెప్పారా? సదా ఖుషీ భవ, సదా శాంతి భవ. ఎప్పుడైనా అనేది వరదానంలో ఉండదు. మరి ఏమి చేయాలి - సదా ఉండాలి కదా లేక ఎప్పుడైనా ఉన్నా ఫర్వాలేదా, నడుస్తుందా? ‘ఎప్పుడైనా’ అనే పదాన్ని సమాప్తం చేసేయండి. ఎప్పుడైనా కాదు, ఇప్పుడు-ఇప్పుడే. ప్రతి ఘడియ ‘ఇప్పుడు సంతోషంగా ఉన్నాము’ అని చెప్పండి. మీ స్లోగన్ కూడా ఏమిటి? ఇప్పటి స్లోగనా లేక ఎప్పుడైనా ఉండేదా? ఇప్పటిదే కదా. కాబట్టి ఏ ఘడియలో ఎవరు చూసినా, ఎవరు కలిసినా ‘ఇప్పుడు-ఇప్పుడే అదృష్టవంతులుగా ఉన్నారు’ అని అనుభవం చేసుకోవాలి. ఎప్పుడైనా సంతోషంగా ఉండేవారిని ఏమంటారు? సూర్యవంశీనా లేక చంద్రవంశీనా? మరి సూర్యవంశీయులా లేక చంద్రవంశీయులా? పక్కా సూర్యవంశీయులా లేక ఇక్కడ సూర్యవంశీ అని చెప్పి, అక్కడికి వెళ్ళాక చంద్రవంశీయులుగా అయిపోతారా? సదా సూర్యవంశీలే కదా. భగవంతునిగా అయి మళ్ళీ చంద్రవంశీయులుగా అయితే ఏమి చేసినట్లు? ‘భగవంతుడు భాగ్యాన్ని పంచినప్పుడు నిద్రపోతున్నారా ఏమిటి?’ అనే గాయనం ఉంది కదా. ఒకవేళ సగం తీసుకుంటే, సగం సమయం నిద్రపోయారు కాబట్టే తీసుకోలేదు. కాబట్టి పూర్తి భాగ్యాన్ని తీసుకునేవారు, సగం కాదు. మరి డబల్ విదేశీయులు ఎవరు? సూర్యవంశీయులు. ఒక్కరు కూడా చంద్రవంశీయులు కారు. పక్కాగా ఆలోచించారా, ఊరికే అనడం లేదు కదా? గర్వంగా చెప్పండి - ‘మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు?’ అని. ఇంకెవరైనా ఉన్నారా ఏమిటి? మీరే కదా. కాబట్టి ‘మేమే ఉంటిమి, మేమే ఉన్నాము మరియు మేమే అవుతాము’ అనే నషా ఉంచుకోండి. మూడు కాలాల కొరకు నిశ్చయం ఉంది.
మరి అందరికంటే తీవ్ర పురుషార్థి ఎవరు? తీవ్ర పురుషార్థులా లేక ఎప్పుడైనా ఢీలా అయి, ఎప్పుడైనా తీవ్రంగా ఉంటారా? సదా తీవ్రంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఘడియ చివరి ఘడియ. ఒకవేళ సాధారణ పురుషార్థిగా ఉండి, చివరి ఘడియ వచ్చేస్తే మోసం జరిగిపోతుంది కదా! అందుకే ప్రతి ఘడియను చివరి ఘడియగా భావిస్తూ ఎవరెడీగా ఉండండి. ఎవరెడీ అనగా తీవ్ర పురుషార్థి. ‘ఇప్పుడు వినాశనం అవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందిలే, ఆ తర్వాత తయారవుదాము’ అని ఆలోచించకండి. చివరి ఘడియను చూడకండి. కానీ మన చివరి ఘడియకు ఎలాంటి నమ్మకం లేదు, అందుకే ఎవరెడీ. మరి డబల్ విదేశీయులు ఎవరెడీగా ఉన్నారా? చేయాల్సింది మాత్రం ఏముంది? ఏదైనా పని మిగిలిపోయి ఉందా ఏమిటి? (మ్యూజియం తయారుచేయాలి) మ్యూజియం తయారుచేయాల్సి వస్తే ఎవరైనా తయారుచేసేస్తారు. మీరు ఎవరెడీయే కదా లేక మ్యూజియం తర్వాత ఎవరెడీ అవుతారా? మీ స్థితి సదా ఉపరామముగా ఉండాలి. ఇప్పుడు ఏది జరిగినా అది మంచిదే. ఇలా రెడీగా ఉన్నారా లేక ‘ఇది చేసేద్దాము, అది చేసేద్దాము’ అని ఆలోచించాలా? లేదు. సదా నిర్మోహి మరియు నిర్వికల్పము, నిర్వ్యర్థము (వ్యర్థ రహితం). వ్యర్థం కూడా ఉండకూడదు. దీనినే ఎవరెడీ అంటాము. మాతలు ఎవరెడీగా ఉన్నారా లేక కొద్దిగా మోహం ఉందా? మనవళ్ళు, మనవరాళ్ళపై మోహం ఉందా? ‘ఇది చేయాలి, ఇది సంభాళించాలి’ అని ఉందా? పాండవులకు మోహం ఉందా? జేబు ఖర్చుపై మోహం ఉందా? ‘సంపాదించాలి, తినాలి, తినిపించాలి’ అని ఆలోచించడం లేదు కదా? అతీతంగా అయిపోయారా లేక కొద్దికొద్దిగా మోహం ఉందా? నష్టోమోహా అనగా అందరి నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉండడం. కాబట్టి సదా ఏమి గుర్తుంచుకుంటారు? ‘మేము అత్యున్నతమైన భాగ్యవంతులము’. సదా మీ భాగ్యం యొక్క నక్షత్రం మెరుస్తూ కనిపించాలి. అచ్ఛా!
గ్రూప్ నం. 4
రాజఋషిగా అవ్వండి అనగా స్వరాజ్యంతో పాటు అనంతమైన వైరాగిగా అవ్వండి
మిమ్మల్ని మీరు రాజఋషిగా భావిస్తున్నారా? రాజు కూడా మరియు ఋషి కూడా. స్వరాజ్యం లభించింది కనుక మీరు రాజు కూడా మరియు దానితో పాటు పాత ప్రపంచం యొక్క జ్ఞానం లభించింది కనుక పాత ప్రపంచం నుండి అనంతమైన వైరాగి, అందుకే ఋషి కూడా. ఒకవైపు రాజ్యం, మరొకవైపు ఋషి అనగా అనంతమైన వైరాగి. మరి రెండూ ఉన్నారా? అనంతమైన వైరాగ్యం ఉందా లేక కొద్దికొద్దిగా ఆకర్షణ ఉందా? ఒకవేళ ఎక్కడైనా, తమలో కావచ్చు, వ్యక్తిలో కావచ్చు, వస్తువులో కావచ్చు, ఎక్కడైనా ఆకర్షణ ఉంటే రాజఋషి కారు. రాజు కాదు, ఋషి కాదు. ఎందుకంటే స్వరాజ్యం ఉంటే మనస్సు-బుద్ధి-సంస్కారాలు అన్నీ తమ వశంలో ఉంటాయి. ఆకర్షణ ఉండనే ఉండదు. ఒకవేళ ఎక్కడైనా సంకల్ప మాత్రమైనా కొద్దిగా ఆకర్షణ ఉంటే రాజఋషి అని అనలేము. ఆకర్షణ ఉంటే రెండు పడవలపై కాళ్ళు ఉంచినట్లే కదా. కొద్దిగా పాత ప్రపంచంలో, కొద్దిగా కొత్త ప్రపంచంలో. అందుకే ‘ఒక్క తండ్రి తప్ప వేరెవరూ లేరు’. ఎందుకంటే రెండు పడవలపై కాళ్ళు ఉంచేవారు ఏమవుతారు? ఇటు కాకుండా, అటు కాకుండా పోతారు. అందుకే రాజఋషి - రాజుగా అవ్వండి మరియు అనంతమైన వైరాగిగా కూడా అవ్వండి. 63 జన్మలు అనుభవం చేసి చూశారు కదా? మరి అనుభవజ్ఞులుగా అయ్యారు, ఇక ఆకర్షణ ఏంటి? అనుభవజ్ఞులు ఎప్పుడూ మోసపోరు. వినేవారు, చెప్పేవారు మోసపోవచ్చు. కానీ అనుభవజ్ఞులు ఎప్పుడూ మోసపోరు. కాబట్టి దుఃఖం యొక్క అనుభవాన్ని బాగా చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు మోసపోకండి. ఈ పాత ప్రపంచం యొక్క ఆకర్షణ బంగారు జింక లాంటిది. ఇది శోకవాటికలోకి తీసుకువెళ్తుంది. మరి ఏమి చేయాలి? కొద్దికొద్దిగా ఆకర్షణ ఉంచుకోవాలా? మంచిగా అనిపించడం లేదు కానీ వదలడం కష్టంగా ఉందా! చెడు వస్తువును వదిలేయడం, మంచి వస్తువును తీసుకోవడం కష్టమా ఏమిటి? ఒకవేళ ఎవరైనా ‘వదలాలి’ అని ఆలోచిస్తే కష్టంగా అనిపిస్తుంది, ‘తీసుకోవాలి’ అని ఆలోచిస్తే సహజంగా అనిపిస్తుంది. కాబట్టి మొదట తీసుకుంటారు, మొదట వదలరు. తీసుకోవడం ముందు ఈ ఇవ్వడం అనేది ఏపాటిది! కాబట్టి ఏమేమి లభించాయి అనే పెద్ద లిస్ట్ ఎదురుగా ఉంచుకోండి. ఏదైతే పొందాలో అది పొందేసాము, ఇక చేయాల్సిన పని ఏముంది అనే పాట పాడుతూ ఉండండి అని చెప్పాము కదా. మరి ఈ పాట పాడడం వచ్చా? నోటితో కాదు, మనస్సుతో. నోటి పాట కొద్దిసేపే నడుస్తుంది. మనస్సు యొక్క పాట సదా నడుస్తుంది. అవినాశి పాట నడుస్తూనే ఉంటుంది. అది ఆటోమేటిక్.
అచ్ఛా, ఇది వెరైటీ గ్రూప్. వెరైటీ పూల తోట బాగుంటుంది కదా! కొందరు ఒకచోట నుండి, కొందరు ఇంకొక చోటు నుండి, కానీ అందరూ ఒక్క తోటమాలికి చెందినవారే. ఒకరివారే మరియు ఒక్కటే. మీరంతా సేవా నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారు, లేకపోతే విశ్వ సేవ ఎలా జరుగుతుంది! అచ్ఛా!
గ్రూప్ నం. 5
సదా ఏకరస స్థితి అనే ఆసనంపై స్థితులై ఉండేవారే తపస్వీలు
అందరూ మిమ్మల్ని మీరు తపస్వి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? తపస్వి అనగా సదా తమ తపస్సులో ఉండేవారు. మరి తపస్సు అంటే ఏమిటి? ‘ఒక్క తండ్రి తప్ప వేరెవరూ లేరు’. ఇలాంటి తపస్వీలేనా లేక రెండవవారు, మూడవవారు కూడా ఉన్నారా? తపస్వి సదా ఆసనధారిగా ఉంటారు, ఏదో ఒక ఆసనంపై తపస్సు చేస్తారు. మరి మీ ఆసనం ఏది? ‘స్థితి’యే మీ ఆసనం. ఎలాగైతే ఏకరస స్థితి - ఇది ఒక ఆసనం అయింది. ఫరిశ్తా స్థితి - ఇది ఒక ఆసనం అయింది. ఆసనంపై స్థితులవుతారు కదా, కూర్చుంటారు అనగా స్థితులైపోతారు. ఈ శ్రేష్ఠ స్థితులలో స్థితులైపోతారు, స్థిరపడతారు, దీనినే ఆసనం అంటాము. స్థూల ఆసనంపై స్థూల శరీరం కూర్చుంటుంది, కానీ ఈ శ్రేష్ఠ స్థితులు అనే ఆసనంపై మనస్సు-బుద్ధిని కూర్చోబెట్టాలి. మనస్సు-బుద్ధి ద్వారా ఈ స్థితులలో స్థితులైపోతారు అనగా కూర్చుంటారు, అలాంటి తపస్వీలేనా? మరి మంచి ఆసనం లభించింది కదా! ఇక్కడ ఉంది ఆసనం, ఆ తర్వాత భవిష్యత్తులో లభిస్తుంది సింహాసనం. కాబట్టి ఎంతగా ఆసనంపై స్థితులై ఉంటారో, అంతగా సింహాసనంపై కూడా స్థితులై ఉండగలరు. ఎంత సమయం కావాలో, ఎప్పుడు కావాలో, అప్పుడు ఆసనం అనే స్థితిలో స్థితులవుతున్నారు కదా! అవుతున్నారా లేక అలజడి జరుగుతోందా? ఏమవుతోంది? చూడండి, ఎలాగైతే శరీరం ఆసనంపై స్థిరంగా ఉండలేకపోతే అలజడి చేస్తుందో, అలాగే మనస్సు అలజడి చేయడం లేదు కదా? అచలముగా ఉందా లేక అలజడి కూడా ఉందా, రెండూ ఉన్నాయా? సదా అచలంగా, స్థిరంగా ఉండాలి, కొద్దిగా కూడా అలజడి ఉండకూడదు. ఒకవేళ ఒకసారి అలజడి, ఒకసారి అచలముగా ఉంటే సింహాసనం కూడా ఒకసారి లభిస్తుంది, ఒకసారి లభించదు. కాబట్టి సదాకాలపు రాజ్యభాగ్యం తీసుకోవాలా లేక ఒకసారి తీసుకోవాలా? మరియు సదా స్థితులవ్వాలా లేక ఒకసారి అవ్వాలా? ఎంతమంది ఎంతగా కదిలించినా మీరు మాత్రం అచలముగా ఉండండి. పరిస్థితి శ్రేష్ఠమైనదా లేక స్వస్థితి శ్రేష్ఠమైనదా? ఒకసారి పరిస్థితి దాడి చేస్తుందా? మరి ఆలోచించండి - ఈ పరిస్థితి పవర్‌ఫుల్లా లేక స్వస్థితి పవర్‌ఫుల్లా? కాబట్టి ఈ స్థితితో బలహీనుల నుండి శక్తిశాలిగా అయిపోతారు. మీ తపస్వి ఆత్మల స్థితి యొక్క స్మృతిచిహ్నాన్ని ఈనాటి తపస్వీలు కాపీ చేశారు, కానీ తప్పుగా చేశారు. మీరు తపస్వి ఏకరస స్థితిలో ఏకాగ్రమవుతారు, మరి ఈనాటివారు ఏమి చేస్తారు? ఒంటి కాలుపై నిలబడతారు. ఎక్కడ ఏకరస స్థితి, ఎక్కడ ఒంటి కాలుపై స్థితులవ్వడం, తేడా ఉంది కదా! మీది ఎంత సహజమైనది! వారిది ఎంత కష్టమైనది! కాబట్టి సహజయోగులు కదా. ఒక్కరిని గుర్తుంచుకోవడం సహజమా లేక అనేకులను గుర్తుంచుకోవడం సహజమా? మరి ద్వాపరం నుండి ఏమి చేశారు? అనేకులను గుర్తుంచుకున్నారు, మరి ఇప్పుడు ఏమి చేస్తున్నారు? ఒక్కరినే గుర్తుంచుకుంటున్నారు కదా. ఒక్కరిని గుర్తుంచుకోవడం సహజమా లేక కష్టమా? మాయ వస్తుందా? అది అంతిమం వరకు వస్తుంది, కానీ రావడం మాయ పని, విజయం సాధించడం మీ పని. మాయ వస్తేనే కదా మాయాజీత్గా అయ్యేది! కాబట్టి మాయ రావడం చెడు విషయం కాదు, కానీ ఓడిపోవడం బలహీనత. మరి మాయాజీతులే కదా? మేము అనేక సార్లు విజయులుగా అయ్యాము మరియు సదా విజయులుగానే ఉంటాము అని సదా గుర్తుంచుకోండి. అచ్ఛా!
గ్రూప్ నం. 6
నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను, కళ్యాణం చేయడం నా కర్తవ్యం అనే స్వమానంలో సదా ఉండండి
ఈ సమయాన్ని అనగా సంగమయుగాన్ని కళ్యాణకారి యుగం అంటాము. ఇది కళ్యాణకారి యుగం మరియు మీరు కళ్యాణకారి ఆత్మలు. మరి, నేను కళ్యాణకారి ఆత్మను అనే స్వమానం సదా గుర్తుంటోందా? సంగమయుగంపై విశేష కర్తవ్యమే కళ్యాణం చేయడం. మొదట స్వయంగా కళ్యాణం మరియు దాంతో పాటు అందరి కళ్యాణం. మరి ఇలా కళ్యాణం చేసే శక్తిని మీలో అనుభవం చేసుకుంటున్నారా? ఎవరి వాతావరణం యొక్క ప్రభావమైనా పడడం లేదు కదా? ప్రపంచం యొక్క వాతావరణం అకళ్యాణం కలిగించేది, మీ వాతావరణం కళ్యాణం చేసేది. మరి అకళ్యాణం యొక్క వాతావరణం శక్తిశాలియా లేక కళ్యాణం యొక్క వాతావరణం శక్తిశాలియా? కాబట్టి మీపై ఇతరుల వాతావరణం ప్రభావం చూపలేదు. అది బలహీనమైనది, మీరు శక్తిశాలి. కాబట్టి శక్తిశాలి బలహీనుడిపై విజయం సాధిస్తాడు కానీ బలహీనుడు శక్తిశాలిపై విజయం సాధించలేడు. ఎలాంటి తమోగుణి వాతావరణం ఉన్నప్పటికీ మీరు సర్వశక్తిమంతుడైన తండ్రి తోడుగా ఉన్నారు. ఎక్కడ భగవంతుడు ఉంటారో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి మీరు వాతావరణాన్ని మార్చేవారు. ‘మేము విశ్వ పరివర్తకులము’ అని ఛాలెంజ్ చేశారు కదా! కాబట్టి కళ్యాణకారి యుగం, కళ్యాణకారి మీరు ఆత్మలు మరియు కళ్యాణకారి తండ్రి. మరి ఎంత శక్తి ఉంది! సమయం యొక్క శక్తి, స్వయం యొక్క శక్తి మరియు తండ్రి యొక్క శక్తి. కాబట్టి , ప్రపంచానికి ఇది అకళ్యాణం యొక్క సమయం, మాకు ఇది కళ్యాణం యొక్క సమయం అన్నది గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఉన్నవారికి కేవలం వినాశనమే కనిపిస్తుంది, మీకు వినాశనంతో పాటు స్థాపన ఎదురుగా ఉంది. కాబట్టి సదా హృదయంలో, స్థాపన జరిగి తీరుతుంది అనే శ్రేష్ఠ సంకల్పాన్ని ఇమర్జ్ చేసుకోండి. మీ భవిష్యత్తు స్పష్టంగా ఉంది కదా! వర్తమానం ఎంత స్పష్టంగా ఉందో, భవిష్యత్తు కూడా అంతే స్పష్టంగా ఉంది. శక్తులకు నషా ఉండాలి - సంగమయుగం విశేష శక్తుల యుగం. సంగమంలోనే తండ్రి శక్తులను ముందుకు ఉంచుతారు. శక్తులు ముందున్నారు కాబట్టి మేము ముందున్నట్లే అని పాండవులకు కూడా సంతోషం కలుగుతుంది కదా. సదా మనస్సులో, అందరి కళ్యాణం జరగాలి అనే శుభభావన ఉంటుంది. మనుష్యాత్మలే కాదు, ప్రకృతిని కూడా కళ్యాణం చేసేవారు. అందుకే ప్రకృతిజీత్, మాయాజీత్ అని పిలువబడతారు. ఎందుకంటే పురుషులు కదా, ఆత్మ పురుషుడు, కాబట్టి ఆత్మ అనే పురుషుడు ప్రకృతిజీత్గా అవుతాడు. ప్రకృతి కూడా సుఖదాయిగా మారిపోతుంది. ఈ సమయంలో చూడండి ప్రకృతి ఎంత దుఃఖాన్ని ఇస్తుందో! చిన్న తుఫాను వచ్చినా, భూమి కొద్దిగా కదిలినా ఎంతోమందికి దుఃఖం కలుగుతుంది. మరి మీ కొరకు ప్రకృతి సుఖదాయి, ఇతరుల కొరకు దుఃఖదాయి. ఏదైనా దుఃఖ సంఘటనను చూసినా, విన్నా దుఃఖపు అల వస్తుందా? ఒకసారి మనవడు, మనవరాలు దుఃఖంలో ఉంటే దుఃఖపు అల వస్తుందా? దుఃఖధామం నుండి అతీతంగా అయిపోయారు. సంగమంలో ఉన్నారా లేక కలియుగంలో ఉన్నారా? మరి దుఃఖధామం నుండి విడివడ్డారా లేక దుఃఖధామంతో కొద్దికొద్దిగా ఆకర్షణ ఉందా? పూర్తిగా అతీతంగా అయ్యారా లేక అవుతున్నారా? కాబట్టి సదా సమయాన్ని మరియు స్వయాన్ని గుర్తుంచుకోండి. స్వయం కూడా కళ్యాణకారి, సమయం కూడా కళ్యాణకారి. కాబట్టి ఈ స్మృతి ద్వారా సదా మాయాజీత్ మరియు ప్రకృతిజీత్గా ఉంటారు. కొద్దిగా కూడా అలజడి ఉండకూడదు. కాబట్టి అచలముగానూ ఉండాలి, నిశ్చలంగానూ ఉండాలి, స్థిరంగానూ ఉండాలి. ఏదీ మిమ్మల్ని ఈ నిశ్చయం నుండి తొలగించలేదు. అచ్ఛా, అందరూ ఎగిరే కళ లో ఉన్నవారే కదా? ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
